మంచిర్యాల జిల్లా: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ డబ్బులు పంచి.. ఓటమి తర్వాత తిరిగి ఇవ్వాలంటూ వసూలు చేస్తున్న వీడియో శనివారం వైరల్‌గా మారింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలైంది. శనివారం డివిజన్ పరిధిలోని సీతారాంపల్లిలో ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి.. ‘ఓటు వేసావో లేదో ఒట్టేసి చెప్పు’.. అంటూ చేతిలో చేయి వేయించుకుంది. సదరు వృద్ధు రాలు తమ ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయని, ఒకటి వేశామని, మరొకటి వేయలేదని చేతిలో చేయి వేసి చెప్పింది. అనంతరం రూ.3000 తిరిగి ఇచ్చేసింది. డబ్బులు ఎవరు పంపిణీ చేయమన్నారు?.. ఎందుకు తిరిగి ఇవ్వమంటున్నారని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తోంది.
SWEAR ON GOD THAT YOU VOTED…
OR PAY BACK!
BJP candidate Jadi Tirupati, who lost in Mancherial Municipal Corporation Division 9, in the recently concluded Telangana Municipal polls decided that it is “pay back” time quite literally.
His wife Roopa went to every house and… pic.twitter.com/N3Uqgml75D— Revathi (@revathitweets) February 14, 2026


