తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు | Maha Shivaratri 2026: Ys Jagan Maha Shivaratri Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు

Feb 15 2026 7:12 AM | Updated on Feb 15 2026 7:12 AM

Maha Shivaratri 2026: Ys Jagan Maha Shivaratri Wishes To Telugu People

సాక్షి, అమరావతి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలు­గు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement