కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి.. | road incident Kushaiguda | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి..

Feb 15 2026 8:01 AM | Updated on Feb 15 2026 8:01 AM

road incident Kushaiguda

     అరకిలోమీటర్‌ వరకు లాక్కెళ్లిన నిందితులు  

 

హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ  పోలీసులు తెలిపిన  మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్‌లో  నివాసముంటున్న సతీష్‌(45), విజయ్‌కుమార్, రాజులు ఈ నెల 9న  కారులో వెళుతుండగా మల్లాపూర్‌ ఎలిఫెంట్‌ సర్కిల్‌ వద్ద  వెనుక నుంచి అతి వేగంగా  దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.

 దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు.  సతీష్‌ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్‌ను ఢీకొట్టడంతో అతను బానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్‌ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్‌ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని  అందులో ఉన్న  మహేష్‌ తరుణ్‌లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు  ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement