breaking news
car
-
షాకింగ్ వీడియో.. కారుపై విమానం క్రాష్ ల్యాండ్
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీ కొడితే ఎలా ఉంటుంది?.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు రోడ్డు మీద ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.Unbelievable scene on I-95, Florida:A landing aircraft clipped a car on the highway.FHP confirms the driver is safe with only minor injuries.pic.twitter.com/gDmWcmxUou— TRIDENT (@TridentxIN) December 10, 2025 -
కారులో పట్టుబడ్డ 20 కోట్ల నగదు ఎవరిది?
సాక్షి, పుట్టపర్తి: ఓ కారు.. ఇద్దరు వ్యక్తులు.. రూ.కోట్ల నగదు.. పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి స్వా«దీనం చేసుకున్నారు. కానీ విషయం బయటకు చెప్పలేదు. ఎలాగోలా బయటకు వచ్చి హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సోమవారం పెనుకొండ సీఐ రాఘవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పెనుకొండ సమీపంలోని ఓ ప్రాంతంలో ధ్వంసమైన కారులో నుంచి రూ.1.20 కోట్ల నగదు స్వా«దీనం చేసుకున్నామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ డబ్బు ఎవరిదన్నది మాత్రం తెలపలేదు. అన్నీ అనుమానాలే..పోలీసులు స్వా«దీనం చేసుకున్న డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు. రూ.20 కోట్ల వరకు కారులో ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీనిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది అనుమానాలకు తావిస్తోంది. డబ్బు బడా వ్యాపారవేత్తలదా? రాజకీయ నాయకులదా అన్నది వారం రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు. కనీసం తమ అదుపులో ఉన్న వారెవరన్న విషయాన్నీ మీడియాకు వెల్లడించలేదు. గోరంట్ల పోలీసులకు సమాచారం.. ‘కియా’ స్టేషన్లో కేసు పెనుకొండ శివారులోని జాతీయ రహదారిపై ద్వంసమైన కారులో నగదు పట్టుబడినట్లు సోమవారం పెనుకొండ సర్కిల్ కార్యాలయంలో సీఐ రాఘవన్ మీడియాకు తెలిపారు. తొలుత పెనుకొండ సమీపంలో ధ్వంసమైన ఓ కారులో డబ్బు ఉందంటూ గోరంట్ల పోలీసులకు సమాచారం అందిందని, అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని డబ్బు స్వా«దీనం చేసుకున్నారని, అయితే అది కియా పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో ఇక్కడ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఇదంతా నిజమే అయితే ఆ డబ్బు ఎవరిది? పోలీసుల అదుపులో ఉన్న ఆ ఇద్దరు ఎవరన్నది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక కారులోని వ్యక్తులే సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగైతే కియా స్టేషన్ పోలీసులకు లేదా పెనుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా గోరంట్ల పోలీసులకు ఎందుకిచ్చారు? ఈ అంశంలో గోరంట్ల పోలీసుల ప్రమేయం ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. హవాలా డబ్బేనా? పెనుకొండ పరిధిలో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపకాల్లో తేడా కారణంగా హవాలా మనీ గురించి తరలిస్తున్న వారే బయట పెట్టారా? లేక దారిదోపిడీదారులు వెంబడించి ఎత్తుకెళ్లారా? అనేది సస్పెన్స్‌గా మారింది. విచారణ చేస్తున్నాం ఈ నెల 5న సూరత్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారును స్వా«దీనం చేసుకుని..ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కియా పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ చేపట్టాం. డబ్బు ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోతుగా విచారణ చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. కారులో డబ్బు తీసుకెళ్తుండగా.. కొందరు దుండగులు దారి కాచి దోపిడీ చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గోరంట్ల పోలీసులను ఆశ్రయించగా.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారుతో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు విచారణ చేయగా.. డబ్బు తమదేనని చెబుతున్నారు. అయితే అంత డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నాం.’ – రాఘవన్, పెనుకొండ సీఐ -
Penukonda: కారులో మూడు కోట్ల నగదు తరలిస్తున్న దుండగులు
-
Peddapalli District: రైలు పట్టాలపై కారు తెరుచుకోని గేటు..
-
పుతిన్ కారు ప్రత్యేకతలివే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్లైన్లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్ మోడల్‌ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్-110 లిమోజీన్‌ను పోలి ఉండే రెట్రో డిజైన్‌తో దీన్ని రూపొందించారు.ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలుఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మర్‌ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్‌గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు -
భౌ భౌ...!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోకి కారులో కుక్కను తీసుకొచ్చి కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బుధవారం మీడియాకు మరింత పని పెట్టారు. తనపై సభలో హక్కుల తీర్మానం పెట్టాలని పాలక బీజేపీ ఎంపీలు యోచిస్తున్నారన్న వార్తలపై మీడియా ఆమెను ప్రశ్నించగా ‘భౌ భౌ...!’అంటూ విచిత్రంగా స్పందించారు. ‘‘ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు నన్ను?’’ అంటూ మీడియాకే ఎదురు ప్రశ్న కూడా వేశారు. ‘‘తీర్మానం పెట్టినప్పుడు చూసుకుందాం. అదేమన్నా పెద్ద సమస్యా? అదే జరిగితే సరైన సమాధానం సభలోనే ఇస్తా’’ అని చెప్పుకొచ్చారు. అనంతరం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో కూడా ఈ ఉదంతంపై మారి్మక వ్యాఖ్యలు చేశారు. రేణుక ‘భౌ భౌ’ ఉదంతంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ఒకరు పాపులర్ సాంగ్ ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ ను ఎంపీ కామెంట్స్ తో రీమిక్స్ చేసి అలరించగా మరొకరు ‘ప్రాణికోటికి మన ఎంపీలు భలే సేవ చేస్తున్నారు’ అని రాసుకొచ్చారు. రాజకీయ రచ్చ సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు సందర్భంగా రేణుక ఒక కుక్కను భవన ప్రాంగణంలోకి తేవడం కలకలం రేపింది. అయితే, ‘దారిలో తారసపడ్డ ఒక వీధి కుక్కను తాను కాపాడి కార్లో తీసుకొచ్చా. దాన్ని వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని అనంతరం ఆమె చెప్పారు. పైగా, ‘కరిచేది (సభ) లోపల కూచున్నవాళ్లే. బయటుండే ఇలాంటి శునకాలు కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఈ శునకోదంతం రాజకీయ రచ్చకు కూడా దారి తీసింది. కుక్కలను పార్లమెంటు ఆవరణలోకి అనుమతించడం లేదు గానీ లోనికి (సభ వైపు చూపుతూ) మాత్రం రానిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై పలువులు బీజేపీ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. -
కాలి బూడిదైన కారు..
-
ఓఆర్ఆర్పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
శామీర్‌పేట్: ఓఆర్ఆర్ రోడ్డుపై పక్కన ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (34) వృత్తి రీత్యా ఓ టీవీ చానెల్ నడుపుతున్నారు. పని నిమిత్తం ఆదివారం రాత్రి టీఎస్ 03 ఎఫ్డీ 7688 నంబరు గల ఇకో స్పోర్ట్స్ కారులో నగరానికి వచ్చారు.రాత్రి మియాపూర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉండి ఉదయం 4:30 నిమిషాలకు ఓఆర్ఆర్ మీదుగా తన స్వగృహానికి బయల్దేరాడు. ఈ క్రమంలో శామీర్‌పేట పరిధిలోకి రాగానే కారును రోడ్డు పక్కన ఆపగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారులో పూర్తిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న అగి్నమాపక, పోలీసుశాఖ అధికారులు మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారారని, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఆగి ఉన్నపుడే మంటలు వ్యాపించినట్లు గుర్తించామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ వెల్లడించారు. -
ORRపై ఘోర ప్రమాదం.. కారులోనే డ్రైవర్ సజీవ దహనం..
-
కారు దగ్ధానికి ఏసీ కారణమా? నిపుణులేమంటున్నారు?
ఇటీవలి కాలంలో రోడ్లపై పలు కార్లు ఉన్నట్టుండి దగ్ఢం కావడాన్ని చూస్తున్నాం. దీనికి కారణాలు అనేకం ఉన్నా కారులోని ఏసీనే మంటలకు కారణమనే వాదన వినిపిస్తుంటుంది. అయితే ఇది ఎంతవరకూ నిజం? నిపుణులేమంటున్నారు? కారులోని ఏసీ వ్యవస్థ నేరుగా మంటలను సృష్టించకపోయినా, దానిలోని విద్యుత్, యాంత్రిక భాగాలు అధిక వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా మంటలు చెలరేగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.ప్రధాన కారణం ఇదే..కారులో మంటలు చెలరేగడానికి విద్యుత్ లోపాలు ప్రధాన కారణం. అలాగే కారు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ)వ్యవస్థలో ఏర్పడే సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఏసీ కంప్రెషర్, బ్లోవర్ మోటార్ లేదా దాని కంట్రోల్ యూనిట్‌కు విద్యుత్ సరఫరా చేసే వైర్లు అరిగిపోవడం, కోసుకుపోవడం లేదా నాణ్యత లేని మరమ్మతుల కారణంగా షార్ట్ సర్క్యూట్లు ఏర్పడతాయి. ఫలితంగా సర్క్యూట్లో విద్యుత్ నిరోధకత హఠాత్తుగా తగ్గిపోయి, కరెంటు ప్రవాహం (Amperage) విపరీతంగా పెరుగుతుంది. ఈ అనూహ్యమైన విద్యుత్ పెరుగుదల వల్ల వైర్లు తీవ్రంగా వేడెక్కి (ఓవర్‌హీట్), వాటి ప్లాస్టిక్ ఇన్సులేషన్ మండుతుంది. దీంతో మంటలు క్షణాల్లో ఇంజిన్ కంపార్ట్మెంట్లోకి లేదా డ్యాష్‌బోర్డ్ లోపలికి వ్యాపిస్తాయి.కంప్రెషర్ జామ్ అయినప్పుడు..మంటలకు కారణమయ్యే మరో అంశం ఏసీ వ్యవస్థలోని విద్యుత్ భాగాలపై పడే ఓవర్‌లోడ్. ఉదాహరణకు బ్లోవర్ మోటార్ బేరింగ్లు పాతబడి లేదా మురికి వల్ల జామ్ అయినప్పుడు, అది మోటార్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తూ సాధారణం కంటే ఎక్కువ కరెంటును వినియోగిస్తుంది. ఈ అధిక వినియోగం (ఓవర్లోడింగ్) వల్ల మోటార్ వైండింగ్లు, దాని ఫ్యూజ్ లేదా రిలే బాక్స్‌లోని కనెక్షన్లు తీవ్రంగా వేడెక్కుతాయి. అలాగే ఏసీ కంప్రెషర్ యాంత్రికంగా జామ్ అయినప్పుడు, దాని ఎలక్ట్రో-మ్యాగ్నెటిక్ క్లచ్‌పై అధిక ఒత్తిడి పడి, అది కూడా ఓవర్‌హీట్ అయ్యి మంటలకు దారితీయవచ్చు. ఇటువంటి సందర్భాల్లో సరైన సామర్థ్యం (Amperage) లేని ఫ్యూజులను వాడినా లేదా ఫ్యూజ్లను తీగలతో బైపాస్ చేసినా, విద్యుత్ లోపాన్ని అరికట్టే రక్షణ వ్యవస్థ పనిచేయక, మంటలు తక్షణమే చెలరేగే అవకాశం ఉంటుంది.ముందస్తు సంకేతాలుకారులోని ఏసీ వ్యవస్థ మంటల్లో చిక్కుకునే ముందు హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.. ప్లాస్టిక్ లేదా రబ్బరు కాలిపోయి తీవ్రమైన వాసన రావడం, ఏసీని ఆన్ చేసినప్పుడు ఫ్యూజులు పదేపదే కాలిపోవడం, డ్యాష్‌బోర్డ్ లేదా హుడ్ కింద నుండి పొగ రావడం జరుగుతుంటుంది. ఈ సంకేతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఇటువంటి ప్రమాదాల నివారణకు కారు ఏసీ వ్యవస్థ వైరింగ్‌ను, ముఖ్యంగా కంప్రెషర్, బ్లోవర్ మోటార్ కనెక్షన్లను, అరిగిపోకుండా లేదా వదులు కాకుండా ఎప్పటికప్పుడు మెకానిక్‌తో తనిఖీ చేయించుకోవాలి. అధిక నాణ్యత గల విడి భాగాలను మాత్రమే ఉపయోగించాలి.తక్షణం ఏం చేయాలి?కారులో మంటలు లేదా పొగను గమనించిన వెంటనే సురక్షితమైన ప్రదేశంలో కారును ఆపి, ఇంజిన్‌ను వెంటనే ఆపివేయాలి, తద్వారా ఇంధనం, విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. కారులోని వారందరూ తక్షణమే కిందకు దిగి, కారు నుండి కనీసం 50 నుండి 100 అడుగుల దూరంలోకి వెళ్లిపోవాలి. వెంటనే అగ్నిమాపక విభాగానికి కాల్ చేసి సమాచారం అందించాలి. అయితే మంటలు చాలా చిన్నగా ఉన్నట్లయితే , మీ వద్ద సరైన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉన్నప్పుడు, హుడ్ను పూర్తిగా తెరవకుండా కొద్దిగా పైకి లేపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ విలువైన వస్తువుల కోసం కారులోకి తిరిగి వెళ్లకూడదు. అలాగే విద్యుత్ లేదా ఇంధనం నుంచి వస్తున్న మంటలపై నీరు చల్లకూడదు. అగ్నిమాపక విభాగం వచ్చే వరకూ వేచి చూడాలి. ఇది కూడా చదవండి: అమెరికా హెచ్చరికలు.. వెనిజులాకు పలు దేశాల షాక్! -
కొనకుండానే.. షి‘ కారు’!
ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్‌లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్. మరి కారు కొనాలంటే...? బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం... – సాక్షి, వెల్త్ డెస్క్ లీజుపై ఆసక్తి ఎందుకంటే...→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్ పేమెంటూ కావాలి. → లీజుకు తీసుకుంటే డౌన్‌పేమెంట్ అక్కర్లేదు. → అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. → పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. → కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు. లీజింగ్ అనుకూలమేనా? అనుకూలమనే చెప్పాలి. ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.వీరికి కొనుక్కుంటేనే బెటర్...కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి. అసలు ఏంటీ లీజింగ్?→ లీజింగ్ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.లీజు కంపెనీల్లో తేడాలేంటి?→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి. → ఒరిక్స్కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలందిస్తోంది. లాకిన్ పీరియడ్ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది. → మైల్స్ లాకిన్ పీరియడ్ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్ వద్దనుకునే వారికిది అనుకూలం. → రెవ్ సంస్థ నెలరోజుల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్‌తో ఈఎంఐ లీజింగ్నూ అందిస్తోంది. హ్యుందాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.→ కారు లీజింగ్ → కారు కొనడంఏకమొత్తం చెల్లింపు→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్ → 15–20 శాతం డౌన్‌పేమెంట్‌తో పాటు బీమా, ఆన్‌రోడ్ చార్జీలు.నెలవారీ ఎంత?→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి) → ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.ఓనర్షిప్→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి. → రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్ చేయొచ్చు.పన్ను ప్రయోజనాలు→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే. → నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే.. → కార్పొరేట్ లీజింగ్→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్ ట్యాక్స్, బ్రేక్‌డౌన్ సపోర్ట్ అన్నీ లీజింగ్ కంపెనీయే చూసుకుంటుంది. → ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్‌కు → సానుకూలాంశాలు: డౌన్‌పేమెంట్ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు. → ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్ పీరియడ్. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.→ లీజ్ టు ఓన్ → లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది. → ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి. → కార్ సబ్స్క్రిప్షన్ → దీన్లోనూ డౌన్‌పేమెంట్ ఉండదు. బీమా, సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్‌తో మైల్స్, రెవ్, క్విక్లిజ్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఈ విధానంలో క్రెటా వంటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు నెలకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. → నెలవారీ రెంటల్స్... → తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్‌కి కనుక తామే డ్రైవ్ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్‌కార్, రెవ్, మైల్స్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్ పీరియడ్ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.→ కార్ల కంపెనీల సబ్స్క్రిప్షన్... → మారుతి, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు. → స్విఫ్ట్ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్ సపోర్ట్‌తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్‌టాప్‌లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్స్కిప్షన్ ఫోన్లు, కో–లివింగ్ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు.డౌన్పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్‌తో దీర్ఘకాల కమిట్మెంట్లు ఉండవు. సబ్స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్‌లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్‌గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్. – ఎడిటర్ -
ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
మలయాళ బ్యూటీ పార్వతి ఆర్ కృష్ణ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ లగ్జరీ కారు స్కోడాను సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్తతో పాటు ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కారును ఇంటి తీసుకొచ్చింది.కాగా.. పార్వతి ఆర్ కృష్ణ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. సెలబ్రిటీ కపుల్ గేమ్ షో సూపర్ జోడిలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. మలయాళ ఇండస్ట్రీలో యాంకర్‌గా, నటిగా, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో 'వర్షంగల్కు శేషం' చిత్రంలో చిన్న పాత్రతో ఫేమస్ అయింది. ఆ తర్వాత ఆమె 'ఏంజెల్స్', 'మాలిక్', 'కడిన కదోరమీ అందకదహం' వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా కుంచకో బోబన్ నటించిన గర్ర్ అనే మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by PARVATHY KRISHNA (@parvathy_r_krishna) -
హరిహర వీరమల్లు బ్యూటీ బర్త్ డే.. భర్త సర్ప్రైజ్ గిఫ్ట్!
బాలీవుడ్ భామ, హరిహర వీరమల్లు నటి నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఖరీదైన బహుమతిని అందుకుంది. ఆమె గతనెలలో 46వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ ముద్దుగుమ్మ బర్త్ డేను పురస్కరించుకుని ఆమె భర్త టోనీ బీగ్ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ రోల్స్ రాయిస్ కారు విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఉంది. ఈ విషయాన్ని దాదాపు నెల రోజుల తర్వాత పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.ఈ బాలీవుడ్ భామ పలు హిందీ చిత్రాల్లో నటించింది. హిందీలో హౌస్‌ఫుల్-5, హౌస్‌ఫుల్-3, మేయిన్ తేరా హీరో, రాక్‌స్టార్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు మూవీలో కనిపించింది ముద్దుగుమ్మ. తాజాగా మస్తీ-4 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. ఈ సినిమా ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది.సినిమాలతో బిజీగా ఉండగానే టోనీని ఫిబ్రవరి 2025లో వివాహం చేసుకుంది. ఆమె భర్త టోనీ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాగా.. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ హోటల్స్‌లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి ముందు మూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. View this post on Instagram A post shared by Nargis Fkhri (@nargisfakhri) -
ఖరీదైన కారు కొన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా మాజీ భార్య, డ్యాన్సర్ నటాషా స్టాంకోవిచ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను సొంతం చేసుకుంది. ఈ కారు విలువు దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. నటాషా స్టాంకోవిచ్ గతంలో క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకుంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత జూలై 2024లో అతనితో విడిపోయింది. ఈ మాజీ జంటకు అగస్త్య అనే కుమారుడు ఉన్నారు. విడిపోయినప్పటికీ బాబుకు తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ ప్రస్తుతం మోడల్ మహీకా శర్మతో డేటింగ్లో ఉన్నారు.అయితే విడాకుల తర్వాత నటాసా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది. తాను మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవలే ప్రకటించింది. భవిష్యత్తులో తనకు నచ్చినవాడు దొరికితే రెండో పెళ్లికి సిద్ధమేనని పరోక్షంగా హింట్ ఇచ్చింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగింది
‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అనే సామెత గురించి మనందరికి తెలుసు. ఆకారాన్ని, ఆహార్యాన్ని చూసి ఎవర్నీ తక్కువ చేసి చూడకూడదు. అవమానించకూడదు.ఇది అక్షర సత్యమని మన జీవితాల్లో చాలాసార్లు రుజువైంది కూడా. అలా తనను అవమానించిన సేల్స్మ్యాన్కు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పాడో సామాన్య రైతు.2022లో కర్ణాటకలోని రామన్పాల్య గ్రామానికి చెందిన కెంపెగౌడ ఆర్.ఎల్. అనే రైతు కారు కొందామని షోరూంకు కెళ్లాడు. తన స్నేహితులతో తుమకూరులోని మహీంద్రా కార్ షోరూమ్‌కు వెళ్ళాడు. కొత్త బొలెరో పికప్ కొనాలనేది అతని ప్లాన్.కానీ రైతును చూసి మర్యాదగా, స్నేహపూర్వకంగా పలకరించడానికి బదులుగా సేల్స్‌మేన్ అమర్యాదగా ప్రవర్తించాడు. కెంపెగౌడ సాధారణ దుస్తులను చూసి, పనికొచ్చే కస్టమర్ కాదనుకుని ఊహించేసుకున్నాడు. జేబులో పది రూపాయలు కూడా లేవంటూ అవమానించాడు. దీనిపై కెంపెగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రూపాన్ని బట్టి ఎలా తీర్పు ఇచ్చేస్తావంటూ అతని స్నేహితులు కూడా మండిపడ్డారు. అంతేకాదు కెంపెగౌడ సేల్స్మ్యాన్కు ఛాలెంజ్ చేశారు. గంటలో డబ్బుతో వస్తాం.. కానీ ఇదే రోజు కారు డెలివరీ చేయాలంటా సవాల్ విసిరారు.ఇదీ చదవండి: లోగో గుర్తుపట్టలేదని ఉద్యోగమివ్వలేదు, కట్ చేస్తే రూ. 400 కోట్ల కంపెనీకానీ కెంపెగౌడను తక్కువ అంచనా వేసిన సేల్స్‌మ్యాన్, హా.. ఇదంతా ఉత్తిత్తి బెదిరింపు అనుకొని సై అన్నాడు. బ్యాంకు నుండి ఇప్పటికిపుడు అంత డబ్బు తీసుకోవడం అసాధ్యం అనుకున్నాడు. కట్ చేస్తే సరిగ్గా అరగంటకు కెంపెగౌడ , అతని స్నేహితులు సూట్‌కేస్‌తో వచ్చారు. అక్షరాలా రూ. 10 లక్షల నగదును టేబుల్‌పై ఉంచారు. దీంతో సేల్స్మ్యాన్కి నోట మాటరాలేదు. అప్పుడు తాను సరిదిద్దుకోలేని తప్పు చేశానని అర్థమైంది. కానీ ఏం లాభం. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. వాహనాన్ని డెలివరీ చేయడం షోరూం వల్ల కాలేదు. పైగా ఆ తరువాత రెండు రోజులు సెలవులు. ఏం చేయాలో అర్థంకాక షో రూం సిబ్బందికి చెమటలు పట్టాయి. మరోవైపు కెంపెగౌడ తనకిపుడు వాహనం కావాలని పట్టుబట్టాడు. వాదన పెరిగింది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. సేల్స్‌మ్యాన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే కెంపెగౌడ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక జన్మలో ఆ కారు కొనకూడదని నిర్ణయించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. కెంపెగౌడ పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు క్షమాపణలు చెబుతూ , అధికారిక ప్రకటన విడుదల చేసింది కంపెనీ. తమ కంపెనీ వాహనాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ వాహనం అందేలా చేసి మహీంద్రా కుటుంబంలోకి అధికారికంగా స్వాగతించారు. -
పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి
బెట్టియా: బీహార్‌లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తున్న అతిథులు రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, అటుగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి వారిని ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ లౌరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా, చికిత్స పొందుతూ ఒక యువకుడు మృతి చెందాడు. బాధితుల్లో చాలా మందిని గుర్తించడం కష్టతరంగా మారిందని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన మొత్తం 16 మందికి తొలుత ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెట్టియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నార్కటియాగంజ్‌లోని మాల్దహియా పోఖారియా నుండి బిషున్‌పూర్వాకు ఈ వివాహ అతిథుల బృందం వచ్చినట్లు సమాచారం. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత, పలువురు అతిథులు రోడ్డు పక్కన గుమిగూడి ఉండగా, అదుపు తప్పిన ఒక కారు వారిపైకి దూసుకెళ్లడం ఈ విషాదానికి కారణంగా నిలిచింది. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Pakistan: మళ్లీ ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ టార్గెట్.. రైలు వెళ్లగానే పేలుడు -
కాచిగూడా రైల్వే ట్రాక్‌పై కారు కలకలం
సాక్షి,హైదరాబాద్: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కారు కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని అగంతకులు రైల్వే ట్రాక్‌పై కారును వదిలేశారు. అప్రమత్తమైన పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా బాంబ్,డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. -
సంచలనం.. దేశ వ్యాప్తంగా 32 కార్లతో దాడులకు కుట్ర?
ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ ఆరున ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తేలింది. ఆరు దశల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు 32 కార్లను సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం రెడ్‌పోర్టు సమీపంలో హ్యుందయ్ ఐ20లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన హ్యూందయ్ ఐ20తో పాటు మారుతి సూజికీ బ్రీజా, స్విఫ్ట్ డిజైర్,ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి కార్లు ఈ కుట్రలో భాగంగా ఉన్నట్లు తేలింది అందుకు ఎర్రకోట పేలుళ్లలో మరణించిన కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని మేవాట్‌కు చెందిన అల్–ఫలాహ్ యూనివర్సిటీలో లభ్యం కావడంతో ముష్కరుల ప్లాన్ బెడిసి కొట్టింది. ఎర్రకోట పేలుళ్లు, కారులో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ లభ్యం కావడం, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్ కారు ప్రత్యక్షమవ్వడంతో దర్యాప్తు సంస్థలు ఈ యూనివర్సిటీనే ఉగ్రవాదలు తమ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో జాతీయ భద్రతా సంస్థలు పేలుళ్ల కేసును ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా.. 32 కార్లతో దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడేందుకు కుట్ర జరిపిన ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుమానిత కార్లను గుర్తించేందుకు పోలీసులు,కేంద్ర భద్రతా బలగాలు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఫరీదాబాద్‌లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.ఐఈడీల తయారీ! మౌల్వీ సాయంతో ఉగ్రమూకలు 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్‌సహా దేశంలోని కీలక ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్‌తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించడంతో దేశ వ్యాప్తంగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు. -
పుల్వామా మాస్టర్‌మైండ్‌తో షహీన్‌కు లింకులు?
ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్‌పై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుల్వామా దాడుల మాస్టర్ మైండ్ ఉమర్ ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా జైషే-మహమ్మద్ చీఫ్ మసూద్ చెల్లెలితోనూ తను సంప్రదింపులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పుల్వామా అటాక్ ఈపదం వింటే చాలు భారతావని గుండె బరువెక్కుతోంది. 2019లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కాన్వాయ్ పై జైషే-మహమ్మద్ అనే ఉగ్రసంస్థ జరిపిన ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడుల వ్యూహకర్తగా ఉమర్ ఫారుక్ భావిస్తారు. తాజాగా ఫరీదాబాద్‌లో అరెస్టయిన డా.షహీన్ సయీద్‌కి ఫారుక్ భార్య అపీరా బీబీతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఇటీవలే ఏర్పాటైన జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్-ఉల్-మెమినాత్ లో అపీరా బీబీది ప్రధానపాత్రని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. డా. షహీన్ కేవలం అపీరాతోనే కాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెల్లెలితోనూ సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది.ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణా కేసులో డాక్టర్ షహీన్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. విచారణలో జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని ఇండియాలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ఎన్ఐఏ మరింత లోతుగా విచారణ జరుపుతుంది. -
Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడులో 13 మంది మృతి చెందారు. 20 మందికిపైగా జనం గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బయటపడిన సీసీటీవీ ఫుటేజ్‌లో రద్దీ సమయంలో హ్యుందాయ్ ఐ20 కారు పేలిన ఖచ్చితమైన క్షణాన్ని చూపించింది.ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలోని ట్రాఫిక్ కెమెరా నుంచి లభ్యమైన ఫుటేజ్‌లో.. ట్రాఫిక్ రద్దీలో నెమ్మదిగా కదులుతున్న తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు, దాని చుట్టూ ఈ-రిక్షాలు, ఆటోలు, ఇతర వాహనాలు కనిపిస్తున్నాయి. తరువాత పేలుడు దృశ్యం కనిపించింది. సోమవారం సాయంత్రం సరిగ్గా 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడు.. జనసాంద్రత అధికంగా ఉన్న పాత ఢిల్లీ ప్రాంతంలో సంభవించింది. అక్కడికి సమీపంలోని వాహనాలు, భవనాలు పేలుడు తీవ్రతకు దెబ్బతిన్నాయి. #WATCH | Delhi 10/11 Blast: Latest CCTV footage captures the moment of blast#DelhiBlast pic.twitter.com/MjC9fzjqR1— NDTV (@ndtv) November 12, 2025కేంద్రం దీనిని హేయమైన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ వీడియోలో ఐ20 హ్యుందాయ్ కారు భారీ ట్రాఫిక్ గుండా ముందుకు కదలడం తరువాత ఆకస్మిక పేలుడుతో మంటల్లో చిక్కుకోవడం కనిపిస్తుంది. అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకోలోగానే, కారు పూర్తిగా దగ్ధమైపోయింది. దర్యాప్తు అధికారులు ఆ వాహనం HR 26CE7674 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగినదిగా గుర్తించారు. దీనిని పాకిస్తాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న అనుమానిత సభ్యుడు డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ ఉమర్ నబీ అక్టోబర్ 29న ఫరీదాబాద్‌కు చెందిన సోను అనే కార్ డీలర్ నుండి ఐ20ని కొనుగోలు చేశాడు. తరువాతి సీసీటీవీ ఫుటేజ్‌లో నబీ ఆ కారును రాయల్ కార్ జోన్ సమీపంలోని కాలుష్య నియంత్రణ (పీయూసీ) బూత్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం నబీ ఆ కారును అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడని, అక్కడ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ యాజమాన్యంలోని స్విఫ్ట్ డిజైర్ పక్కన పార్క్ చేశాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. కాగా అతని నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ షకీల్ వాహనం లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ పేరుతో రిజిస్టర్ అయివుంది. ఆయనను కూడా ఉగ్రవాద సంబంధాల ఆరోపణలతో అరెస్టు చేశారు.ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో.. -
Delhi blast: చెదిరిన టాటూలు, చిరిగిన టీ-షర్టులు..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడులో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు తునాతునకలయ్యాయి. దీంతో మృతుల కుటుంబీకులు తమ వారిని గుర్తు పట్టేందుకు ఎంతో కష్టపడ్డారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులను గుర్తుపటేందుకు వారు ధరించిన టీ- షర్టులు, శరీరంపై గల టాటూలు సాయపడ్డాయని ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. సమీపంలోని భవనాలు కంపించాయి. ఈ ఘటనలో చాందినీ చౌక్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త అమర్ కటారియా(34) శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అయితే అతని చేతులపై ఉన్న టాటూలను చూసిన అతని తల్లిదండ్రులు అది అమర్ కటారియా మృతదేహంగా గుర్తించారు. అతని చేతులపై ‘అమ్మ నా తొలి ప్రేమ..నాన్న నా బలం’ అనే టాటూ ఉంది. దీనిని చూసినవారంతా కంట తడిపెట్టుకుంటున్నారు. #WATCH | Delhi | Father of one of the deceased, Amar Kataria, who lost his life in Red Fort Car blast, Jagdish Kataria says, "... We don't yet know if it was a terror attack. He had a shop in Bhagirath Palace and had left at around 6:45 PM. He might have been waiting for a… pic.twitter.com/fuPbg5Cdqp— ANI (@ANI) November 12, 2025ఇదే ఘటనలో జుమ్మన్ మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహం కోసం 20 గంటల పాటు ఆస్పత్రిలో వెదికారు. ఎట్టకేలకు ఒక టీ- షర్ట్ ఆధారంతో బాధిత కుటుంబం జుమ్మన్ మృతదేహాన్ని గుర్తించింది. కాళ్లు లేని స్థితిలో జుమ్మన్ మృతదేహం వారికి కనిపించింది. టీ- షర్ట్ చూసి మృతదేహాన్ని గుర్తుపట్టామని జుమ్మన్ మామ మొహమ్మద్ ఇద్రిస్ మీడియాకు తెలిపారు. ఇప్పుడు అతని దివ్యాంగ భార్య పిల్లలు అనాథలుగా మిగిలారు.సోమవారం సాయంత్రం ఎర్రకోటకు సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సమీపంలోని అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని, వారిని కోర్టు ముందు నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం -
‘కారు సైడ్ మిర్రర్లో పాము!.. బుసలు కొడుతూ బయటకొచ్చింది’
సాక్షిచెన్నై: ఓ ఫ్లైఓవర్‌పై కారు వేగంగా దూసుకెళ్తోంది. అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే... ఆ కారు సైడ్ మిర్రర్ వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వస్తోంది! ఆ పామును చూసిన డ్రైవర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి, తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కారు యజమానులు మన కారులో ఇలాంటి పాములు దాగి ఉన్నాయేమో అన్న భయంతో తమ వాహనాలను పరికించి పరికించి పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే?ఇటీవల తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డులో ఓ డ్రైవర్ కారుకు ఊహించని అనుభవం ఎదురైంది. కారు నడుపుతుండగా సైడ్ మిర్రర్ నుండి ఒక పాము బయటకు వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తొలుత కారు అద్దంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించాడు. అయినా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా..అగస్మాత్తుగా ఓ పాము బుసలకొడుతూ బయటకు రావడాన్ని గమనించాడు. వాహనదారులకు జాగ్రత్తలు చెప్పేందుకు వీడియో తీశాడు.అనంతరం, కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారును ఆపాడు. ఊపిరి ఆడక కారు అద్దం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్న పాము రక్షించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కారు అద్దంలో ఇరుక్కున్న పామును పట్టుకున్నారు. స్థానిక అటవీ ప్రాంతానికి తరలించారు. ⚠️ Safety Alert for Drivers!Shocking Incident on Namakkal–Salem Road: Snake Discovered Inside Car’s Side Mirror While DrivingAs the cold and rainy season sets in, motorists are urged to be extra cautious before hitting the road. Always inspect your vehicle thoroughly… pic.twitter.com/AOGzVdArxi— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025 -
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳— Allu Arjun (@alluarjun) November 11, 2025 -
పాక్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ (నవంబర్ 11, మంగళవారం) జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు జరిగింది. అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ఈ బాంబు దాడి మధ్యాహ్నం 12.39 గంటలకు జరిగిందని తెలిపారు.కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా? ఆత్మాహుతి దాడా? పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను నా కారు పార్క్ చేసి కాంప్లెక్స్‌లోకి వెళ్తుండగా.. గేటు సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని.. అక్కడ రెండు మృతదేహాలు పడి ఉన్నాయని న్యాయవాది రుస్తుమ్ మాలిక్ ఏఎఫ్‌పీ మీడియా తెలిపారు. కాగా, ఈ పేలుడు సంభవించిన కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు దాడికి యత్నించగా.. అడ్డుకున్న భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.ఇటీవల పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అక్టోబర్ 9న కాబూల్‌లో జరిగిన డ్రోన్ దాడులకు ఇస్లామాబాద్ బాధ్యత వహించిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఆ దాడిలో పలువురు మరణించగా, ప్రతీకార చర్యలు చేపడతామని కాబూల్ హెచ్చరించింది. అనంతరం జరిగిన సరిహద్దు ఘర్షణల్లో పలు సంఖ్యల్లో సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు. అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. -
Red Fort: ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ జారీ చేసిన కేంద్రం
-
Delhi 10/11 Blast: కీలక ఆధారం వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు.. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు పట్టుకున్న టెర్రర్ మాడ్యూల్‌కు మధ్య ఉన్న లింక్ బయటపడింది. పేలుడు జరిగిన కారు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడిదని, అతను మాడ్యూల్లో భాగమని మంగళవారం తెల్లవారుజామున ఉన్నత వర్గాలు ధృవీకరించాయని ‘ఎన్డీటీవీ’ వెల్లడించింది. ఈ పేలుడును ప్రాథమికంగా ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని 16,18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికితోడు హత్య, హత్యాయత్నం అభియోగాలతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 3, 4 సెక్షన్లను కూడా జోడించారు.గత కొన్ని రోజులుగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్లను దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్ భయాందోళనకు గురై ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమయ్యాడని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎర్రకోట నుంచి కారు నగర ముఖ్య కేంద్రం వైపు వెళుతున్నట్లు కనిపిస్తుండటంతో లక్ష్యం మధ్య ఢిల్లీలో ఎక్కడైనా ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.ఎర్రకోట ఉగ్రదాడిలో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించారని పోలీసులు, నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు ఫరీదాబాద్‌లోని రెండు ఇళ్ల నుండి వేల కిలోల అనుమానిత పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ రెండు ఇళ్లను డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అద్దెకు తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా విలేకరులతో మాట్లాడుతూ.. నెమ్మదిగా కదులుతున్న వాహనం రెడ్ లైట్ వద్ద ఆగిపోయిందని, ఆ వాహనంలో పేలుడు సంభవించిందన్నారు. పేలుడు కారణంగా సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.ఢిల్లీ పోలీసులు, జమ్ముకశ్మీర్ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్టీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, యుపీ ఎటీఎస్, హర్యానా పోలీసులు, గుజరాత్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాల సంయుక్త నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పుల్వామాలో తారిక్ అనే వ్యక్తిని జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో దాడిలో ఉపయోగించిన వాహనం అనేకసార్లు చేతులు మారిందని తెలుస్తోంది. కారును తొలుత అమీర్ అనే వ్యక్తికి విక్రయించారు. తరువాత తారిక్కు, చివరకు ఉమర్‌కు అప్పగించారు. విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ఢిల్లీ ఘటన: కారులో ‘ముసుగు మనిషి’ -
ఢిల్లీ ఘటన: కారులో ‘ముసుగు మనిషి’
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ నేపధ్యంలో పలు ఆధారాలు బయటపడుతున్నాయి. పేలుడు సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు ముసుగు ధరించిన ఒక వ్యక్తి హ్యుందాయ్ ఐ 20 కారును నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పార్కింగ్ స్థలం దగ్గరి దృశ్యాలలో ఇది ఒకటి. నల్లటి ముసుగు ధరించిన వ్యక్తి HR26CE7674 నంబర్ ప్లేట్ కలిగిన హ్యుందాయ్ ఐ20 కారును నడుపుతున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది.సోమవారం సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి కారు పార్కింగ్ స్థలంలోనికి ప్రవేశించడం, బయటకు వెళ్లడం చూపించే సీసీటీవీ ఫుటేజ్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ సమయంలో నిందితుడు ఒంటరిగా ఉన్నాడని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆ వాహనం కదలికలను నిర్ధారించడానికి అక్కడికి సమీపంలోని టోల్ ప్లాజాల ఫుటేజ్‌లతో సహా 100 కి పైగా సీసీటీవీ క్లిప్‌లను అధికారులు పరిశీలిస్తున్నారని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.అధిక తీవ్రత కలిగిన పేలుడుకు ముందు హ్యుందాయ్ కారు ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి సీసీటీవీ క్లిప్ దర్యాప్తు అధికారులకు సహాయపడింది. ఈ వాహనం దర్యాగంజ్ మార్కెట్ ప్రాంతం గుండా సునేహ్రీ మసీదు సమీపంలోనికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, పేలుడుకు దాదాపు మూడు గంటల ముందు చేరుకుంది. వాహనం యూ టర్న్ తీసుకొని లోయర్ సుబాష్ మార్గ్ వైపు వెళుతుండగా, కారు సిగ్నల్ వద్దకు వస్తోందని, పేలుడు సంభవించినప్పుడు వేగం తగ్గిందని సీసీటీవీ ఫుటేజ్‌లో తెలుస్తున్నదని ఒక అధికారి పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం నేతాజీ సుబాష్ మార్గ్‌లో లాల్ కిలా మెట్రో స్టేషన్‌కు సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన పేలుడు హ్యుందాయ్ ఐ20 కారును ఛిన్నాభిన్నం చేసింది.ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించగా 20 మందికి పైగా జనం గాయాలపాలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా భయాందోళనలకు దారితీసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), పేలుడు పదార్థాల చట్టం తదితర కఠినమైన చట్టాల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పేలుడుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం మంగళవారం తెల్లవారుజామున పేలుడు జరిగిన ప్రదేశం నుండి నమూనాలను సేకరించిందని ‘హిందుస్తాన్ టైమ్స్’ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఢిల్లీ ఘటన: ‘అమెరికా’ హెచ్చరిక -
ఆడి క్యూ3, క్యూ5 లిమిటెడ్ ఎడిషన్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. క్యూ3, క్యూ5 సిగ్నేచర్ లైన్ కార్లు ఆవిష్కరించింది. అయిదు ఎక్స్టీరియర్ రంగుల్లో లభ్యమయ్యే ఈ రెండు మోడళ్లు పరిమితంగా లభించనున్నాయి. డ్రమటిక్ వెల్కం ప్రొజెక్షన్ కోసం ఆడి రింగ్స్ ఎంట్రీ ఎల్ఈడీ ల్యాంపులు అమర్చారు. బ్రాండ్ గుర్తింపు పెంచేలా విలక్షణమైన ఆడి రింగ్స్ డెకాల్స్, డైనమిక్ వీల్ హబ్ క్యాప్‌లు, బెస్పోక్ క్యాబిన్ వాతావరణం కోసం ఫ్రాగ్రన్స్ డిస్పెన్సర్ జోడించారు.మెటాలిక్ కీ కవర్ ప్రీమియం టచ్ అనుభూతినిస్తుంది. స్పోర్టీ ఇంటీరియర్ యాక్సెంట్‌ను అందించే స్టెయిన్లెస్ స్టీల్ పెడల్ కవర్లు ఉన్నాయి. ఆడి క్యూ3 ధర రూ.52.31 లక్షలు, ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధర రూ.53.55 లక్షలు, ఆడి క్యూ5 ధర రూ.69.86 లక్షలుగా నిర్ణయించారు. ‘‘భారత్‌లో ఆడి క్యూ3, ఆడి క్యూ5 మోడళ్లు ఆడి ‘క్యూ’ పోర్ట్‌ఫోలియోకు మూలస్తంభాలు ఉన్నాయి. ఈ సిగ్నేచర్ లైన్‌తో రిఫైన్డ్ పనితీరు, అధునాతన ఫీచర్లను అందిస్తున్నాము’’ అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాస్ తెలిపారు.ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా.. -
ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)
-
ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి
భారీ పేలుడుతో దేశరాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఓ కారు పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పేలుడు ఘటనపై ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ఆరాపోలీసు అధికారులు, ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులతో రేఖాగుప్తా సమావేశంబాధితులను పరామర్శించిన సీఎం రేఖాగుప్తా ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హైఅలర్ట్ పలు నగరాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ అధికారులుఢిల్లీలో పేలుడు దృష్ట్యా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో హై అలర్ట్హైదరాబాద్లోనూ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారుఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన, మృతి చెందినవారుహర్షుల్ S/O సంజీవ్ సేథిశివ జైస్వాల్ S/O తెలియదుమిస్టర్ సమీర్ S/O తెలియదు, మండవాలి ఢిల్లీజోగిందర్ S/O తెలియదు, దిల్షాద్ గార్డెన్, ఢిల్లీభవాని సంకర్ సహ్మ్రా S/O తెలియదుగీత డి/ఓ శివ ప్రసాద్, ఢిల్లీవినయ్ పాఠక్ S/O రమా కాంత్ పాఠక్, ఢిల్లీపప్పు S/O దుధ్వి రామ్,మిస్టర్ వినోద్ S/O విశాల్ సింగ్శివమ్ ఝా , ఢిల్లీమహ్మద్ సాన్వాజ్, ఢిల్లీఅంకుష్ శర్మ , ఢిల్లీమహ్మద్ ఫరూఖ్, ఢిల్లీతిలక్ రాజ్ఐ20 కారు యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులుహరియాణాకు చెందిన నదీమ్‌ఖాన్ పేరుతో ఉన్న పేలుడు జరిగిన కారు హుండాయ్ ఐ20 కారును తొలుత మహ్మద్ సల్మాన్ కొన్నాడుఅనంతరం అది నదీమ్‌ఖాన్ అనే వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారుపేలుడు జరిగిన ఐ20 కారు నంబరు HR267674 గా గుర్తింపుఆత్మాహుతి దాడి?ఐ20 కారు లోపల ముగురు కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. కారు వెనుక వైపు నుండి పేలుడు సంభవించినట్టు సమాచారం. ఇది ఆత్మాహుతి దాడిగా పలువురు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉందని విశ్లేషకుల అంచనాబ్లాస్ట్ ఆందోళనకరం అంటున్న విశ్లేషకులు70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయంసోమవారం కావడంతో ఆలయ సందర్శనకు పెద్ద ఎత్తున వచ్చిన జనం100 నుంచి 150 మీటర్ల వరకు పేలుడు ధాటి పరిధి.ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పేలుళ్లుచాందినీ చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాదచాయలు2011 లో ఢిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్లు, అంటే దాదాపు 14 సంవత్సరాల తరవాత ఢిల్లీలో పేలుళ్లు జరగడం ఇదేభద్రతా సిబ్బంది ఊహిస్తున్నట్లు సీఎన్జీ పేలుడు కారణం కాదేమో అన్న అంచనాలుటెర్రరిస్టుల పనే అయి ఉంటుందని అనుమానాలుభీభత్సంగా మారిన సంఘటనా స్థలంఅమిత్ షా తో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషణ. సంఘటన జరిగిన తీరుపై ఆరా.దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేతమెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుళ్లుపేలుళ్ల దెబ్బకు 6 కార్లకు వ్యాపించిన మంటలు. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు దగ్ధం.ఆసుపత్రికి తరలించేలోపే 9 మంది మృతి.30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 10 మంది పరిస్థితి విషమం.సంఘటనా స్థలానికి అంబులెన్స్, 15 ఫైర్ టెండర్ల తరలింపు.పేలుడు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లు.సంఘటనా స్థలానికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బంది.పెద్ద ఎత్తున మోహరింపు, పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు.మీడియాతో సహా ఎవరినీ పేలుడు జరిగిన స్థలానికి అనుమతించని పోలీసులు.స్పాట్ కు చేరుకుంటున్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్.సంఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు.సంఘటనా స్థలం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న నిపుణులు.రెడ్ ఫోర్ట్ దగ్గరకు చేరుకుంటున్న సీనియర్ కాప్స్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్, డీజీపీ.చాందినీ చౌక్ మూసివేత. వ్యాపారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.షాప్ కీపర్స్ ను పేలుడు జరిగిన ప్రాంతం నుంచి పంపించి వేసిన భద్రతా బలగాలు.హై అలెర్ట్ లో కొత్త ఢిల్లీఢిల్లీ పేలుళ్లతో అప్రమత్తమైన ఉత్తర ప్రదేశ్, వాణిజ్య రాజధాని ముంబై మహానగరం.అయోధ్య రాం మందిర్ దగ్గర భద్రత కట్టుదిట్టం.దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు.గత కొంతకాలంగా దేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు ఢిల్లీలో పాగా వేసిన ఉగ్రవాద మూకలు.స్లీపర్ సెల్స్ కదలికలు. నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను గుర్తించిన పోలీసులు.ఢిల్లీ శివారు ప్రాంతం ఫరీదాబాదులో పెద్ద ఎత్తున అంటే దాదాపు 2560 కిలో గ్రాముల అమ్మోనియం నైట్రేట్, 350 కేజీల ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు.ఢిల్లీ నుంచి గుజరాత్ కు భారీ స్థాయిలో రవాణా అవుతున్న పేలుడు పదార్థాలను పట్టుకున్న పోలీసులు.నదీమ్‌ఖాన్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తుకేంద్ర భద్రతా సంస్థల దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు నదీమ్‌ఖాన్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్హెచ్ఆర్26తో రిజిస్టర్ అయిన పేలుడు జరిగిన కారుఘటనాస్థలికి కేంద్ర హోం మంత్రి(LNJP) ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్న బాదితులను పరామర్షించిన అమిత్ షాఢిల్లీ ఘటనా స్థలికి చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాఢిల్లీ ఘటనాస్థలాన్ని కేంద్ర హోం అమిత్ షా పరిశీలించారుఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పేలుడు స్థలం పరిశీలనఅధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రిఅమిత్ షా ఏమన్నారంటే..ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందనసాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగిందిహుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించిందిపేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయిసమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారుపేలుడుపై విచారణ జరుగుతోందిఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తు చేస్తున్నాయిసీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారుఅన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందిత్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను ప్రధాని మోదీ ఆరాఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా అమిత్‌షాతో మాట్లాడిన ప్రధాని మోదీ ఘటన గురించి అడిగి వివరాలు తీసుకున్న ప్రధాని ఘటనపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశంఐబీ చీఫ్,ఢిల్లీ సీపీకి అమిత్‌షా ఫోన్పేలుడు ఘటన గురించి ఆరా త్వరగతిన దర్యాప్తునకు ఆదేశంఎన్ఎస్జీ, ఎన్ఐఏతో పాటు దర్యాప్తు జరపనున్న ఢిల్లీ స్పెషల్ సెల్పోలీసుల అదుపులో అనుమానితుడుఢిల్లీ పోలీసుల అదుపులో అనుమానితుడువిచారిస్తున్న పోలీసులుముంబై పోలీసుల అప్రమత్తంముంబైలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలురైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలుకదులుతున్న కారులో పేలుడు?పేలింది పార్కింగ్ కారు కాదని ప్రకటించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చాఎర్రకోట వద్ద ‘రెడ్‌సిగ్నల్ దగ్గర ఆగిన కారులు ఆ సమయంలో నెమ్మదిగా వచ్చిన కారు ఒకసారిగా సంభవించిన పేలుడు ఆ సమయంలో కారులో ప్రయాణికులు సాయంత్రం 6.52 గంటలకు పేలుడు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటనహైదరాబాద్లో హైఅలర్ట్ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హైఅలర్ట్రద్దీ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీలుపాతబస్తీలో విస్తృతంగా కొనసాగుతున్న సోదాలుఅనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలి: సీపీ సజ్జనార్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు పేలింది. ఆ తర్వాత మంటలు పక్కన్న వాహనాలకు అంటుకున్నాయి. ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. గాయపడిన వాళ్లను లోక్‌నాయక్ జయ్ ప్రకాష్ ఆస్పత్రి (LNJP) ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి ఎనిమిది వాహనాలు ధ్వంసం అయినట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతోంది. పేలుడుతో ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది.సాయంత్రం 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ కాల్ వచ్చింది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఘటన నేపథ్యంలో కేంద్రం ఢిల్లీతో పాటు దేశంలో పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. రాజధాని, చుట్టుపక్కల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) బృందాలు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. ఢిల్లీ పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం తప్పింది. BREAKING: Explosion near Red Fort area in Old Delhi. Explosion near metro station. Blasts on a day when there has been a major crackdown on terror modules plotting a strike on Delhi. Details awaited. pic.twitter.com/tELxBP9bBh— Rahul Shivshankar (@RShivshankar) November 10, 2025 -
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, చిత్తూరు జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళ కాలిపై నుంచి పవన్ కల్యాణ్ కారు దూసుకెళ్లింది. కనీస మానవత్వం మరిచిన.. పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బాధితురాలు హేమలతను స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తీరుపై పలమనేరు వాసులు మండిపడుతున్నారు.ఆదివారం.. పలమనేరులో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకీ క్యాంపును పరిశీలించారు. అయితే, కుంకీల ఆపరేషన్ సర్కస్ ఫీట్లకే పరిమితమైంది. ఇంకా శిక్షణ, ట్రయల్ రన్‌తోనే సాగుతోంది. ఒకపక్క ఏనుగులు భీకర దాడులు చేస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు సర్వనాశనమవుతున్నా.. మనుషులను తొక్కి ప్రాణాలు తీస్తున్నా చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన కుంకీల క్యాప్చరింగ్ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. -
రాంగ్ రూట్ లో వచ్చిన కారుకు బుద్ది చెప్పిన బస్సు డ్రైవర్
-
కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లి.. ప్రాణం తీసిన టీచర్
గాంధీనగర్: ఓ టీచర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. బైక్‌ను ఢీకొట్టి, దానిపై ఉన్న వారిని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ఆపై ప్రాణం తీశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మోడస లునావాడ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్ అతడి సోదరుడు పూటుగా మద్యం సేవించారు. కన్ను మిన్ను కానరాకుండా రెచ్చిపోయి మరీ డ్రైవింగ్ చేశారు. మద్యం తాగి ఒళ్లు తెలియని మైకంలో కారు నడుపుతోన్న టీచర్ ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఆపై బైక్‌ను ఢీకొట్టిన విషయాన్ని గుర్తించడకుండా బానెట్‌పై పడిన వ్యక్తిని అలాగే 1.5 కి.మీ మేర ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత మితిమీరిన వేగం దాటికి బానెట్‌పై ఉన్న బాధితుడు కిందపడ్డాడు. ఈ హిట్ అండ్ రన్ కేసు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొంతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి సంబంధించిన సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఆధారంగా ఈ దుర్ఘటన మహిసాగర్ జిల్లాలోని మోడాసా-లునావాడ నేషల్ హైవే 48లో జరిగినట్లు గుర్తించారు. హిట్ అండ్ రన్ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మనీశ్ పటేల్, మెహుల్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఇక గాయపడిన ఇద్దరు బాధితులను లునావాడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #Mahisagar: મોડાસા લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના આવી સામે, કાર ચાલકે બાઈક ચાલકને અકસ્માત સર્જી બચાવવાની જગ્યાએ ૩-૪ કિલોમીટર સુધી કાર ઉપર ઢસડીને લઈ ગયો.. અન્ય કારચાલકો દ્વારા કારચાલકને રોકી પોલીસના હવાલે કર્યો..#Gujarat #ViralVideo pic.twitter.com/7H5HUQYlFW— 🇮🇳Parth Amin (@Imparth_amin) October 29, 2025 -
ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ హీరో.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు మూడు కోట్లకు పైగా విలువైన మెర్సిడెజ్ బెంజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలో తన కొత్త కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫర్హాన్ తన భార్య శిబానీ దండేకర్‌తో కలిసి కనిపించారు. ఈ లగ్జరీ కారును ఇతర బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, కృతి సనన్ గతంలోనే కొన్నారుఇక సినిమాల విషయానికొస్తే ఫర్హాన్ అక్తర్ 120 బహదూర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని రెజాంగ్ లా యుద్ధం (1962) నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత మేజర్ షైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి రజనీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం వహించారు. అమిత్ చంద్రతో కలిసి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లగ్జరీ కారు కొన్న కమెడియన్.. దివాళీ గిఫ్ట్ అంటూ పోస్ట్
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి 30 లక్షల విలువైన టయోటా కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఈ దిపావళికి సరికొత్త బహుమతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త కారుతో దిగిన ఫోటోలను తన తల్లిదండ్రులతో కలిసి ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా ఇదే కారును కొనుగోలు చేశారు. పలువురు బాలీవుడ్ అగ్రతారలు సైతం ఈ ఖరీదైన కారును కొన్నారు.అయితే ఈ ఏడాది ప్రారంభంలో సమయ్ రైనా తన యూట్యూబ్ షోలో ఇండియాస్ గాట్ లాటెంట్పై వివాదం మొదలైంది. ఈ వివాదం తర్వాత అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్లను తన యూట్యూబ్ నుంచి తొలగించారు. వివాదం జరిగిన కొన్ని నెలల తర్వాత సమయ్ రైనా భారత్‌లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టు 15న బెంగళూరులో మొదలైన ప్రదర్శన ముంబయి, కోల్‌కతా, చెన్నై, పూణే, ఢిల్లీ లాంటి నగరాల్లో తన షోలు నిర్వహించాడు. -
కోటిన్నర విలువైన కారు కొన్న ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. తాజాగా మెర్సిడెస్-బెంజ్‌ను తన సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ. 1.50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ కారు కొనడంతో తన డబ్బు అంతా అయిపోయిందని.. ఇప్పుడు ఈఎంఐ మాత్రమే అందుబాటులో ఉందని నియా శర్మ ఫన్నీగా పోస్ట్ చేసింది.కాగా.. ఢిల్లీకి చెందిన నియా శర్మ పదేళ్లకు పైగా బుల్లితెర నటిగా రాణిస్తోంది. 2010లో కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై షో సీరియల్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్- 4, సుహాగన్ చుడైల్ లాంటి షోలలో కనిపించింది. ఆమె చివరిసారిగా రియాలిటీ షో లాఫర్ చెఫ్స్ సీజన్- 2లో మెరిసింది. అయితే నియా బిగ్ బాస్‌లో పాల్గొంటుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని సోషల్ మీడియా ద్వారా నియా స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం ఎలాంటి సీరియల్‌ను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
కారుపై బాబు బొమ్మ అడ్డుకునేది ఎవరమ్మా!
తిరుపతి జిల్లా: తిరుమలలో సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన ఓ కారు మంగళవారం హల్చల్ చేసింది. తిరుమలకు పార్టీ రంగులు, నాయకుల ఫొటోలతో కూడిన వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే. మంగళవారం ఏపీ 39 ఆర్ఎం 3999 నంబర్‌గల కారు..వెనుక వైపు సీఎం చంద్రబాబు ఫొటో కనిపించింది. దీంతో పలువురు భక్తులు అధికార పార్టీ నాయకుల బొమ్మలు వాహనాలపై ఉంటే తిరుమలకు అనుమతిస్తారా? అంటూప్రశ్నించారు. ఇప్పటికైనా అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీలను క్షుణ్ణంగా నిర్వహించాలని భక్తులు కోరారు. -
ఎస్యూవీ మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
నిస్సాన్ మోటార్ ఇండియా సీ-సెగ్మెంట్ ఎస్యూవీ (SUV) మార్కెట్లో కొత్త మోడల్‌ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిస్సాన్ టెక్టాన్(Nissan Tecton) పేరుతో త్వరలో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్ పేరు వెల్లడించడంతోపాటు దీని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ డిజైన్ టీజర్‌ను విడుదల చేసింది. డీలర్లకు ఇప్పటికే దీని వివరాలు వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది. 2026 రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో ఈ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.నిస్సాన్ టెక్టాన్ డిజైనింగ్ పరంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎస్యూవీ ఇంజిన్ పైభాగం బానెట్ వెడల్పుగా ఉండడంతోపాటు ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL) సిగ్నేచర్ మధ్యలో నిస్సాన్ లోగోతో ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ క్లస్టర్లు, ఫ్రంట్ బంపర్ డిజైన్‌తో కలిసి దీని ఎస్యూవీ ఆకర్షణను పెంచుతుందని తెలిపారు.వెనుక భాగంలో టెక్టాన్ ఇటీవలి నిస్సాన్ గ్లోబల్ మోడళ్ల మాదిరిగానే కనెక్ట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ బార్, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్స్‌ను కలిగి ఉంటుందని చెప్పింది. టెక్టాన్ అల్లాయ్ వీల్స్ దీనికి డైనమిక్, ప్రీమియం లుక్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇంటీరియర్‌లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయని తెలిపింది. లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్, లార్జ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు, అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థల (ADAS)సూట్‌ను అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే దీన్ని ఏ ప్రైస్ రేంజ్లో మార్కెట్లో తీసుకొస్తారని అంశాలను వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
Erramanzil: పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన కారులో మంటలు
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
-
కారులో టచ్ స్క్రీన్.. కాకూడదు పరేషాన్!
బ్రాండ్, కారు పనితీరు, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మాత్రమే కాదు.. కారు లోపల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా కారు కొనుగోలు సమయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త మోడళ్లు హైటెక్, ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ తో వస్తున్నాయి. ఖుషీఖుషీగా కారులో ప్రయాణిస్తూ.. ఈ టచ్ స్క్రీన్ల వాడకంలో కొందరు బిజీ అయిపోతున్నారు. అదిగో, అదే మంచిది కాదు, అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ‘టచ్‌స్క్రీన్’ చర్చనీయాంశంగా మారింది.ఫోన్ కాల్స్, ఏసీ, నావిగేషన్, సంగీతం, 360 డిగ్రీ వ్యూ.. ఇలా ఎన్నో ఫీచర్లను డ్రైవర్ ముందున్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ నియంత్రిస్తోంది. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ లేనప్పటికీ కొందరు తమ కార్లలో వీడియోలు ప్లే అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడటం ప్రమాదకరం. అలాగే, కారులో కూడా టచ్ స్క్రీన్ వాడకం.. డ్రైవింగ్ మీద దృష్టిని మరల్చే పెద్ద సమస్యగా పరిణమిస్తోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సులభమేమీ కాదుసాధారణంగా డ్రైవర్లు.. దృష్టి మరల్చకుండానే స్టీరింగ్‌కు, డ్రైవింగ్ సీటుకు సమీపంలో ఉన్న బటన్లను సులభంగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో ముఖ్యమైన బటన్లను కంపెనీలు స్టీరింగ్ వీల్‌పై అమర్చుతున్నాయి. కానీ, టచ్‌స్క్రీన్ ఉపయోగించడం అంత సులభం కాదు. ఒక నిర్దిష్ట సెట్టింగ్‌ను కనుక్కోవాలంటే ఒక విండో నుంచి మరొక విండోకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ ఫీచర్‌ను వినియోగించాలన్నా సమయం తీసుకుంటుంది. ‘వీ బుల్గరీ’ అధ్యయనంలో..2022లో స్వీడిష్ మోటరింగ్ మ్యాగజైన్ ‘వీ బుల్గరీ’ ఓ అధ్యయనం చేపట్టింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియో స్టేషన్ మార్చడం, ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేయడం వంటి పనులకు డ్రైవర్లకు ఎంత సమయం పట్టిందో పరిశీలించారు. ఇందులో వినియోగించిన 12 కార్లలో 11 కార్లకు టచ్‌స్క్రీన్స్ ఉన్నాయి. బటన్లతో కూడిన ఒకే ఒక పాత కారు ఉపయోగించారు. పాత కారులో డ్రైవర్లు నిర్దేశించిన పనులను 10 సెకన్లలోపు చేయగలిగారు. కానీ ఆధునిక మోడళ్లలో అవే పనులకు సుమారు 45 సెకన్లు పట్టింది. డ్రైవర్ల దృష్టిని టచ్స్క్రీన్లు ఎంతలా మరల్చుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో రెండు అధ్యయనాల్లో..ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌పై వేర్వేరు పనులు చేస్తున్నప్పుడు డ్రైవర్లు ఎంతసేపు పరధ్యానంగా ఉన్నారో తెలుసుకోవడానికి నార్వేకు చెందిన కాంట్రాక్ట్ పరిశోధన సంస్థ ‘సింటెఫ్’ 2024లో ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం కంటి చూపును పసిగట్టే ట్రాకింగ్ కెమెరాలను ఉపయోగించారు. రోడ్డు వైపు చూడకుండా ఉష్ణోగ్రతను మార్చడానికి డ్రైవర్లకు సగటున మూడున్నర సెకన్లు పట్టింది. రేడియో స్టేషన్ మార్చడానికి 11 సెకన్లు, నావిగేషన్ టూల్లో కొత్త చిరునామాను చేర్చడానికి 16 సెకన్ల సమయం తీసుకున్నారు. 2020లో బ్రిటిష్ సంస్థ ‘ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం.. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించి నడిపే డ్రైవర్లలో డ్రైవింగ్ కంటే టచ్ స్క్రీన్లే రియాక్షన్ టైమ్‌ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. దేనికైనా స్పందించే రేటు.. డ్రైవింగ్ వల్ల కంటే టచ్‌స్క్రీన్ ఆపరేట్ చేయడం వల్లే తక్కువగా ఉంటోందన్నమాట.స్విచ్‌ల ద్వారా..‘యూరో ఎన్ సీఏపీ’,, యూరప్‌లో కార్లకు భద్రతా రేటింగ్స్ ఇచ్చే సంస్థ. నిజానికి ఇది చట్టబద్ధమైన సంస్థ కాదుగానీ, ఇది ఇచ్చే రేటింగ్స్‌ని కార్ల కంపెనీల ప్రామాణికంగా భావిస్తాయి. వచ్చే జనవరి నుండి విక్రయించే కార్లకు ఈ సంస్థ కొత్త నియమాలు నిర్దేశించింది. దీని ప్రకారం విండ్‌స్క్రీన్ వైపర్ల వంటి ముఖ్యమైన ఫంక్షన్లు టచ్స్క్రీన్ల ద్వారా కాకుండా ఫిజికల్ స్విచ్‌ల ద్వారా నియంత్రించేలా ఏర్పాటు చేయకపోతే ఏ కారుకూ ఫైవ్ స్టార్ స్కోర్ ఇవ్వరు. మన దేశంలో కార్లను విక్రయించే కంపెనీలు స్టీరింగ్‌పై అనువుగా కొన్ని బటన్స్‌ను పొందుపరుస్తున్నాయి. ఎందుకంటే.. టచ్స్క్రీన్లతో పోలిస్తే ఫిజికల్ బటన్లు వాడటమే డ్రైవర్లకు సులభంగా ఉంటుంది. అయితే ఈ బటన్లు కూడా వాడటం కష్టమనుకునే వారికోసం చాలా వాహన తయారీ సంస్థలు వాయిస్ కంట్రోల్‌తో పనిచేసేలా ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎంత గొప్ప కారు అయినా.. ముందు భద్రత ప్రధానం.. తరవాతే ఎన్ని హంగులైనా!ఇలా చేయండి..» డ్రైవ్ చేసే ముందు లేదా సురక్షితమైన స్థలంలో వాహనం ఆపి రేడియో, జీపీఎస్, ఏసీ వంటి సర్దుబాట్లు చేసుకోండి.» ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దృష్టి మరలుతుంది. కాబట్టి మీ ఫోన్ ను వాహనం బ్లూటూత్‌కు అనుసంధానించవద్దు.» వాహనంలో ప్రత్యామ్నాయ బటన్లు ఉంటే వాటిని ఉపయోగించండి.» మీ పక్క సీటులో ఎవరైనా ఉంటే.. వారికి టచ్‌స్క్రీన్ బాధ్యతలు అప్పగించండి.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
సన్‌రూఫ్ సరదా.. ఆస్పత్రిపాలు
కర్ణాటక రాష్ట్రం: కారు సన్‌రూఫ్ నుంచి నిలబడి షికార్లు చేయడం కొందరు గొప్పగా భావిస్తారు. కానీ అందులో ప్రమాదం ఉందని ఊహించలేరు. అదే మాదిరిగా ఓ బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. నగరంలో విద్యారణ్యపురలో శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జికెవికె రోడ్డులో కారు సన్‌రూఫ్ నుంచి ఓ బాలుడు నిలబడి ప్రయాణిస్తున్నాడు. భారీ వాహనాలను నియంత్రించడానికి వేసిన హైట్ రిస్ట్రిక్షన్ రాడ్ అతని తలకు తగిలింది. దీంతో కేకలు వేస్తూ కారులోకి కూలబడ్డాడు. బలమైన గాయాలు కావటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు వెనుక వస్తున్న ఎవరో దీనిని వీడియో తీయడంతో వైరల్ అయ్యింది. ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బెంగళూరు ఉత్తర విభాగం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కారును గుర్తించిన ఆర్టీనగర పోలీసులు యజమానిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఇలాంటి సన్‌రూఫ్ జాలీ రైడ్ ప్రమాదాలు నగరంలో తరచూ జరుగుతున్నాయి. May the child heal soon..Also Sunroof is an European Concept to let the sunlight come inside car. We take it as a style statement Most useless feature https://t.co/dgvU5imFWS— Phoenix (@oasis97277547) September 7, 2025 -
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ వాహనాన్ని కియా కారు ఢీకొట్టింది. లంగర్ హౌస్ దర్గా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో యువతి కశ్వి(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. కారులో మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
కారు నెమ్మదిగా నడపమన్నందుకు ఇంటిపై దాడి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కారు నెమ్మదిగా నడపమని చెప్పినందుకు ఇంటిపై దాడిచేసిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రం ఇందిరానగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్ ప్రాంతంలో రోడ్డుపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అధే కాలనీకి చెందిన ఒక యువకుడు కారును వేగంగా నడుపుతూ మండపాన్ని ఢీకొట్టాడు. అక్కడున్న వారు నెమ్మదిగా కారు నడపాలని చిన్న పిల్లలు రోడ్డుపై తిరుగుతుంటారని అతడిపై మండిపడ్డారు. కోపోద్రుక్తుడైన సదరు యువకుడు మరో 20 మంది యువకులను వెంట తీసుకువచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందర చేయడమే కాకుండా అడ్డువచ్చిన మహిళలపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలసుకున్న ఎస్సై ఉపేంద్ర చారి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. తప్పు చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఖరీదైన కారు కొన్న సీనియర్ నటి.. ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి, హేమ మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారుకు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లగ్జరీ కారు విలువు దాదాపు రూ.75 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు.బాలీవుడ్లో డ్రీమ్ గర్ల్‌పై పేరున్న హేమ మాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పలువురు అగ్ర హీరోల సరసన మెప్పించారు. 1970-80 సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు. ఆమె చివరిసారిగా 2020లో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ద్వైపాక్షిక భేటీకి ఒక కారులో ప్రధాని మోదీ, పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చైనాలోని తియాంజిన్‌లో జరగబోయే ద్వైపాక్షిక సమావేశానికి చేరేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది ఇరువురి నేతల సాన్నిహిత్యాన్ని లోకానికి చాటిందని నిపుణులు అంటున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు ఒకే కారులో ప్రయాణించారు. After the proceedings at the SCO Summit venue, President Putin and I travelled together to the venue of our bilateral meeting. Conversations with him are always insightful. pic.twitter.com/oYZVGDLxtc— Narendra Modi (@narendramodi) September 1, 2025పుతిన్‌తో తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం తర్వాత, అధ్యక్షుడు పుతిన్, నేను మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు కలిసి ప్రయాణించాం. ఆయనతో సంభాషణలు లోతుగా ఉంటాయి’ అని రాశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ‘అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఆనందంగా ఉంది’ అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. -
కారు - బైక్ రేసింగ్.. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి ముడుపులు
-
హవేలి ఘన్‌పూర్‌లో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన కారు
సాక్షి, మెదక్: జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలి ఘన్పూర్ మండలం నక్కవాగులో ఘటన జరిగింది. భారీ వర్షాలు కారణంగా నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వద్దని స్థానికులు వారించినా పట్టించుకోని కారు డ్రైవర్.. అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్‌సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భంధంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్‌పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన విదాముయార్చి బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ మూవీలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా నటించింది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే అజిత్ కుమార్‌కు కార్ రేసింగ్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఎక్కడ రేసింగ్ జరిగినా తన టీమ్‌తో సహా వాలిపోతుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు కార్ రేసింగుల్లో టైటిల్స్ సాధించారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఏకంగా కారుతో రియల్ స్టంట్స్ కూడా చేశారు. డూప్ లేకుండానే చాలాసార్లు కారుతో స్టంట్స్ చేశారు.తాజాగా అజిత్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కారును ఏకంగా 232 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుపుతూ కనిపించారు. ఎవరికైనా వంద స్పీడ్కే గుండెల్లో గుబులు మొదలవుతుంది. అలాంటి ఏకంగా 232 కిలోమీటర్లు స్పీడ్‌తో దూసుకెళ్లడమంటే మామూలు విషయం కాదు. కార్ రేసింగ్ల్లో దూసుకెళ్లే అజిత్‌కు ఈ స్పీడ్ ఒక లెక్కేనా అని అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ అంతవేగంతో వెళ్లాలంటే కాస్తా గుండె ధైర్యం కూడా ఉండాలి. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. పాతదా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇది చూసిన తలా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.Ajith Kumar FULL SPEED RACING VIDEO!😎🔥Is this possible-aa!? 😯🔥#AjithKumar #AK64 #GoodBadUgly pic.twitter.com/NrKM9nQ2Cr— nallurwood (@nallurwood) August 22, 2025 -
ఆ కారు ట్రాఫిక్‌లో బైక్‌గా మారిపోయి.. కాకినాడ కుర్రోడి వినూత్న ఆవిష్కరణ
కాకినాడ: ఉన్నత ఆశయం, పట్టుదల, చురుకుదనం మొదలైనవి వినూత్న ఆలోచనలకు దారితీస్తాయని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన రాయవరపు సుధీర్ అన్వేష్ కుమార్ నిరూపించారు. ఎటువంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా లేని సుధీర్.. పరిస్థితులకు అనుగుణంగా ఆకారాన్ని మార్చుకునే టూ ఇన్ వన్ వాహనాన్ని రూపొందించాడు. ఈ వాహనం అటు బ్యాటరీతోను, ఇటు హైడ్రాలిక్ వ్యవస్థతోనూ పనిచేయడం మరో విశేషం.ఈ నూతన వాహనం రూపకల్పనకు సుధీర్ నాలుగు సీట్ల జీప్ మోడల్‌ను ఎంచుకున్నాడు. అది వెడల్పుకు కుదించుకుని, బైక్ మాదిరిగానూ మారిపోతుంది. తద్వారా అది భారీ ట్రాఫిక్‌లో సులభంగా ముందుకు కదులుతుంది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నిరంతరం రద్దీగా ఉండే నగరాల్లోట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సుధీర్ దీనిని తీర్చిదిద్దాడు.సుధీర్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నాడు. తన దగ్గర ఇంకా చాలా వినూత్న ఆలోచనలు ఉన్నాయని తెలిపాడు. విజయవాడకు చెందిన సుధీర్ కుటుంబం కొన్నేళ్ల క్రితం కాకినాడకు వచ్చి స్థిరపడింది. ఇంజినీరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, తొలుత తండ్రి అనారోగ్యం, ఆ తర్వాత అతని మరణం కారణంగా సుధీర్ ఇంజినీరింగ్ చేయలేకపోయాడు. అయితే దీనికి బదులుగా, 2014 లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు... హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు సుధీర్ తరచూ భారీ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ నేపధ్యంలోనే ట్రాఫిక్ రద్దీని సులభంగా దాటగలిగే ప్రత్యామ్నాయ రవాణా వాహనాన్ని రూపొందించాలని అనుకున్నాడు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు కార్లు కదలడం కష్టమవుతుందని, అదే బైక్ విషయంలో అలా జరగదని గమనించిన సుధీర్ కారు- బైక్ మోడ్ మధ్య స్థ వాహనాన్ని రూపొందించడంలో విజయం సాధించాడు. ఈ వాహనాన్ని సుధీర్ ఏడు అడుగుల పొడవు, 2.11 అడుగుల వెడల్పుతో ఉండేలా, కాంపాక్ట్‌గా ఉన్నప్పుడు 4.2 అడుగుల వెడల్పుకు విస్తరించేలా రూపొందించాడు. ఈ వాహనం బ్యాటరీతో శక్తితోనూ, హైడ్రాలిక్ వ్యవస్థతో కూడా నడిచేలా తీర్చిదిద్దాడు. ఈ వాహనానికి సుధీర్ ఎంజెడ్(మెల్చి జెడాక్) అనే పేరు పెట్టాడు. రూ. 50 కోట్ల నుంచి 75 కోట్ల వరకూ ఖర్చయ్యే ఈ తరహా వాహనాల ప్రాజెక్ట్ కోసం యూఎఈకి చెందిన ఒక కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు సుధీర్ వెల్లడించారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) -
సాగర్ ఎడమ కాలువలో బోల్తాపడ్డ కారు
సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నెరేడుచర్ల మండలం కల్లూరులో ప్రమాదం తప్పింది. అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలో కారు బోల్తా పడింది. నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఆ సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఆపై కారును రెస్క్కూ టీమ్ సహాయంతో బయటకు తీశారు. -
లగ్జరీ సూపర్ కారు కొన్న అజిత్ కుమార్.. ధర కోట్ల పైమాటే!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. అటు సినిమాలు.. ఇటు రేసింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమంటే కూడా ప్రాణం. ఇప్పటికే ఆయన గ్యారేజ్‌లో ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో హై ఎండ్ లగ్జరీ కారును తన గ్యారేజీకి జతచేశారు. ప్రముఖ షెవర్లే కంపెనీకి చెందిన కార్వెట్ సీ8-జడ్06ని కారును ఆయన కొనుగోలు చేశారు. అయితే ఈ ఆధునాతన సౌకర్యాలు కలిగిన కారు ధర దాదాపు రూ.1.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా... ఈ సూపర్‌కారును దుబాయ్‌లోని షోరూమ్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ కుమార్ ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ తర్వాత వేకేషన్‌కు వెళ్లారు. తన భార్యతో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. కొత్త ఏడాదిలో విదాముయార్చి మూవీతో అభిమానులను అలరించిన అజిత్.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. View this post on Instagram A post shared by Ajith Kumar (@ajithkumar.0fficial) -
కారు ఇస్తే కానిస్టేబుల్‌కు కుదువ పెట్టాడు!
కడప రూరల్ : స్నేహితుడే కదా అని కారు ఇచ్చాను...అతను తన కారును ఒక కానిస్టేబుల్‌కు కుదువ పెట్టుకున్నాడని బద్వేలు నియోజకవర్గం గోపవరానికి చెందిన సిద్దయ్య తెలిపారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన బతుకుతెరువు కోసం 2023లో టయోటా కారును కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నట్లు తెలిపాడు. కొన్ని నెలల క్రితం బద్వేల్‌కు చెందిన తన మిత్రుడు వచ్చి ఒక వారం కారు కావాలని అడిగితే ఇచ్చానని పేర్కొన్నాడు. వారం దాటినా అతను తన కారును ఇవ్వకపోవడంతో విచారించగా తన మిత్రుడు కారును ఒక కానిస్టేబుల్‌కు కుదువ పెట్టినట్లు తెలిసిందన్నాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, బద్వేల్ పోలీస్ స్టేషన్‌కు రెఫర్ చేశారని తెలిపాడు. అయినా కూడా తనకు న్యాయం జరగలేదని ఆరోపించాడు. అధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. -
By election Campaign: వైఎస్ఆర్ జిల్లా పులివెందులతో టీడీపీ మూకల బరితెగింపు
-
కాలువలో పడిన కారు.. 11 మంది మృతి
గోండా: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్‌లోని పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో కృష్ణ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్ సహా 15 మంది ఉన్నారన్నారు. గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్లో మేవాలాల్ మాధ్యమిక పాఠశాల మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రహ్లాద్ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతిఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్ ఉన్నారు. ప్రహ్లాద్ పొరుగింట్లో ఉండే రామలలన్ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్ కుమారుడు సత్యం, రామ్ లలన్ వర్మ, వాహనం డ్రైవర్ సీతారామన్ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
USA: విషాదాన్ని మిగిల్చిన ఎన్ఆర్ఐ వృద్ధుల ‘అదృశ్య ఘటన’
అమెరికాలో న్యూయార్క్‌కు చెందిన నలుగురు భారత సంతతి వృద్ధులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరు కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, చివరికి ఈ అదృశ్య ఘటన విషాదాన్ని మిగిల్చింది.వెస్ట్ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని.. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మార్షల్ కౌంటీ పోలీసులు తెలిపారు. మరణించినవారు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్(85), కిశోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)లుగా పోలీసులు గుర్తించారు. న్యూయార్క్‌లోని బఫెలో నుంచి వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డులో వీరి వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు.జులై 29న అదృశ్యం కాగా, వీరి వాహనం ప్రమాదానికి గురైనట్లు నిన్న (ఆగస్టు 2) పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు ద్రువీకరించారు. చివరిసారిగా జులై 29న వీరు పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డును కూడా చివరిసారి అక్కడే వాడినట్లు తెలిసింది. నలుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. చివరికి వారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. -
Hyderabad: LB నగర్ లో కార్లతో యువకుల హంగామా
-
వరలక్ష్మీ శరత్‌కుమార్ భర్త సర్ప్రైజ్.. కోట్ల విలువైన కారు గిఫ్ట్..! (ఫోటోలు)
-
హీరోగా గాలి జనార్ధన్ తనయుడు.. షూట్లో కారు రియల్ స్టంట్ చూశారా?
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా కనిపించగా.. జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూలై 18న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.ఈ నేపథ్యంలోనే హీరో కిరిటీ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్‌కు సంబంధించిన ఒరిజినల్ షూట్ వీడియోను పంచుకున్నారు. కారుపై నుంచి కిరిటీ జంప్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించాడో ఈ వీడియోలో చూపించారు. ఈ షూటింగ్ స్టంట్ కోసం కష్టపడిన పీటర్ హెయిన్ మాస్టర్‌తో పాటు సిబ్బందికి హీరో ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్‌గా రిజల్ట్ ఇలా వచ్చిందంటూ వీడియోలో మూవీ సీన్ చూపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Behind the making of my stunt in #Junior Thanks to Peter Hein Master and all the stunt crew for ensuring my safety. pic.twitter.com/ua7eDQ08Eh— Kireeti (@KireetiOfficial) July 22, 2025 -
టాలీవుడ్ నటి పెళ్లిరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతంటే?
పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటివి వస్తే సెలబ్రిటీలు ఇంట్లో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. కుదిరితే విదేశాలకు వెళ్లిపోతుంటారు. లేదంటే ఖరీదైన బహుమతులతో ఒకరిని ఒకరు సర్ప్రైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు కూడా తన భర్త కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చాడు. ఈ కారు రేటు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఇంతకీ ఏంటి సంగతి?ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. తండ్రిలానే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా చేసింది గానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్‌గా మారిపోయింది. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగులోనూ గత కొన్నేళ్లలో నాంది, క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. విలనీ తరహా పాత్రలతో మెప్పిస్తోంది.(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్)వ్యక్తిగత జీవితానికొస్తే కొన్నేళ్ల ముందు వరకు హీరో విశాల్‌తో ఈమె డేటింగ్ అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని ఎవరికి వాళ్లు క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఇక పెళ్లి చేసుకుంటాదా లేదా అని అందరూ అనుకున్నారు. అయితే అందరికీ షాకిస్తూ గతేడాది ఈమె పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందిన గ్యాలరీస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో కొత్త జీవితం ప్రారంభించింది.తాజాగా ఈ జంట తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వరలక్ష్మీ చెన్నైలో ఉండగా, నికోలాయ్ ముంబైలో ఉన్నాడు. పెళ్లయి ఏడాది పూర్తయిన తర్వాత ఈమెకు నికోలాయ్.. ఖరీదైన పోర్సే కారుని బహుమతిగా ఇచ్చాడు. పోర్సే 718 బాక్స్టర్ మోడల్ గులాబీ రంగు కారులో వరలక్ష్మి డ్రైవింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మన దేశంలో ఈ కారు ధర ఏకంగా రూ.1.60 కోట్లు వరకు ఉంది. దీంతో కోటిన్నర విలువైన కారు గిఫ్టా అని అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) View this post on Instagram A post shared by CERAMIC PRO® INDIA - SABOO (@sabooceramicproindia) -
ఇదేం డ్రైవింగ్ రా బాబోయ్
-
ఇరుకు దారులకు చురుకైన కారు..!
ఇరుకు దారుల్లో ద్విచక్ర వాహనాలు ఎలాగోలా ప్రయాణించగలవు గాని, కార్లు ముందుకెళ్లడం అంత సులువు కాదు. ఈ సమస్యను అధిగమించాలనే ఆలోచనతోనే ఇటాలియన్ మెకానిక్ ఆండ్రియా మరాజీ ప్రపంచంలోనే అతి సన్నని కారును రూపొందించాడు. అలాగని అతడేమీ కొత్తగా కారును తయారు చేయలేదు. తన షెడ్డులో మూలపడిన 1993 మోడల్ ‘ఫియట్ పాండా’ కారు రూపురేఖలను తాను కోరుకున్న రీతిలో మార్పులు చేసి, ఇలా అతి సన్నని కారుగా మార్చేశాడు. దీనికోసం ఆండ్రియా ఏకంగా పన్నెండు నెలలు శ్రమించాడు. రోడ్ల మీద పరుగులు పెట్టేలా దీనిని తీర్చిదిద్దడానికి పూర్తిగా ఫియట్ కంపెనీకి చెందిన ఒరిజినల్ విడి భాగాలనే ఉపయోగించాడు. కారుకు ఉన్న పాత పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించి, ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను ఏర్పాటు చేసి, బ్యాటరీని అమర్చాడు. బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే, పాతిక కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారు ఎత్తు 140 సెం.మీ., పొడవు 340 సెం.మీ., వెడల్పు 50 సెం.మీ. మాత్రమే! ఈ కారులోనే చక్కర్లు కొడుతూ ఆండ్రియా యూట్యూబ్ సంచలనంగా మారాడు.(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!) -
ఎవరు ఈ మహానటి..? తెరవెనుక..
-
ఫ్యాన్సీ నంబర్ 9999 @ రూ.11లక్షలు..
ఖిలా వరంగల్: వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి అధిక మొత్తంలో చెల్లించి ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నట్లు వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్‌బాబు శుక్రవారం తెలిపారు. కారు నంబర్ ప్లేట్‌పై తనకు నచ్చిన లక్కీ నంబర్ ఉండాలనే ఆశతో 9999 ఫ్యాన్సీ నంబర్‌ను ఆన్లైన్ ద్వారా రూ.11,09,999 చెల్లించి హర్ష కన్స్ట్రక్షన్స్ పేరు మీద దక్కించుకున్నట్లు వివరించారు. ఇంత మొత్తం ఖర్చు చేసి నంబర్ దక్కించుకోవడంపై ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఫ్యాన్సీ నంబర్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఈసారి అధిక మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు చెప్పారు. -
కారుతో స్టంట్స్.. 300 అడుగుల లోయలో పడి..
ముంబై: ‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే ఏ విషయంలోను అతిగా ఉండకుడదు అని అర్ధం. అందుకే అతి చేయడం కన్నా మితంగా ఉండడం మంచిది అంటారు పెద్దలు. లేదంటే ఇదిగో ఇలా ప్రాణాల్ని రిస్కులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అసలేం జరిగిందంటే?మహారాష్ట్రలోని పటన్–సదవఘాపూర్ రోడ్ టేబుల్ పాయింట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం. చుట్టూ లోయలు ఉండే సమతల భూమి, వర్షాకాలంలో నీరు పైకి ఎగిరేలా కనిపించే వాటర్ ఫాల్ ప్రత్యేక ఆకర్షణతో ప్రకృతి ప్రేమికుల్ని పరవశించేలా చేస్తోంది. వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకలు నిత్యం తరలివస్తుంటారు. అలా బుధవారం సాయంత్రం రౌండ్ టేబుల్ పాయింట్ చూసేందుకు వచ్చిన పర్యాటకుల్లో పూణే గుజారావాడి ప్రాంతానికి చెందిన సాహిల్ అనిల్ జాధవ్ ఉన్నాడు. సాహిల్ తన స్నేహితులతో కలిసి కారులో ఆ ప్రాంతానికి వచ్చాడు. కారులో ఆ ప్రాంతం మొత్తం కలియ తిరిగాడు. ఆ సమయంలో ఎటు చూసినా జనం ఉండడంతో సాహిల్ అతి చేశాడు. ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. లోయ ప్రాంతం కావడంతో కారుతో స్టంట్లు వేశాడు. సరిగ్గా అదే సమయంలో కారుపై పట్టుకోల్పోయాడు. తన కారుతో పాటు 300 అడుగల లోయలో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక లోయలో పడిన సాహిల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రదేశం నిత్యం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను అలరిస్తున్నప్పటికీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్థానికులు టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. महाराष्ट्र के कराड का वीडियो है..स्टंटबाजी के चक्कर में 300 फीट नीचे गिरे, गंभीर रूप से घायल है ड्राइवर जी..#Maharashtra pic.twitter.com/CUKABEzorN— Vivek Gupta (@imvivekgupta) July 11, 2025 -
బర్త్ డే గిఫ్ట్.. లగ్జరీ కారు కొన్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జూలై 6న రణ్వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ -3లో నటించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే తాజాగా మన స్టార్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం సాధారణమే అయినప్పటికీ దీని విలువ దాదాపు రూ.4.57 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. సరికొత్త హై ఎండ్ ఈవీని రణ్వీర్ సింగ్ తన గ్యారేజీకి మరో కారును తీసుకొచ్చారు. ఈ విలాసవంతమైన కారును తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తకారులో తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
Land Cruiser: రూ.3కోట్ల కారు.. ఊడిపోయిన టైరు
కోరుట్ల: ఆ కారు ఖరీదు ఇంచుమించు రూ.3 కోట్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు పేరున్న కారు. ఏదైనా ప్రమాదం జరిగి.. కారు పల్టీలు కొట్టినా పది ఏయిర్ బ్యాగులు తెరుచుకుని భద్రత విషయంలో ఏ మాత్రం బెదిరిపోవాసిన అవసరం లేదన్న ప్రచారం ఉంది. దీనికితోడు బులెట్ ప్రూఫ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఖరీదైన కారు టైరు చిన్నపాటి ప్రమాదంలో ఎలా ఊడిపోయిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. కారులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదు. అదే సమయంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కారు భద్రతపై మాత్రం లెక్కలేని సందేహాలు వస్తున్నాయి.అసలేం జరిగింది..?శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మంత్రి అడ్లూరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోరుట్ల వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో మెట్పల్లి నుంచి తిరిగి ధర్మపురి వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. 15 నిమిషాల్లో కారు మెట్పల్లిదాటి మారుతీనగర్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో దెబ్బతిన్న ఓ కారును కోరుట్లలోని మెకానిక్ షెడ్ నుంచి నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి తీసుకువెళ్తున్న టోచన్ వాహనం ఎదురుగా వచ్చింది. రెండు వాహనాలు ఎదురెదురుగా చిన్నగా తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అకస్మాత్తుగా మంత్రి కారు టైర్ ఊడిపోయింది. కారు టైర్ ఊడిపోవడం మినహా మంత్రి కారుకు ఎక్కడా ఎలాంటి గీత పడకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో మంత్రి అడ్లూరి క్షేమంగా బయటపడగా.. టోచన్ వాహనంతో కారును తెస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే మెట్పల్లి పోలీసులు వచ్చి రెండు వాహనాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు. భద్రత సంగతి దేవుడెరుగు..మంత్రి కారులో ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఏ పరికరంలోనైనా విడిభాగాలను బిగించే చిన్న చిన్న నట్లు, స్క్రూలు, ఇతరత్రా పరికరాల్లో కొంచెం తేడా వచ్చినా.. లూజు అయినట్లు ఉన్నా ప్రమాద సూచికలు ఇస్తుందని సమాచారం. శనివారం రాత్రి జరిగిన చిన్నపాటి ప్రమాదానికే ఫోర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం ఉన్న మంత్రి కారు టైరు ఎలా ఊడిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ కారు టైర్ ముందుగానే కాస్త లూజ్ అయి ఉంటే దానికి సంబంధించిన ప్రమాద సూచికలు ఎందుకు రాలేదన్న సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ప్రమాద సంకేతాలు వచ్చినా డ్రైవర్ సరిగా దృష్టి పెట్టలేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా ప్రమాదాన్ని నివారించే టెక్నాలజీ వ్యవస్థ సైతం ఈ కారులో ఉంది. అంతే కాకుండా ఈ వాహనం భద్రతా రేటింగ్ 5 స్టార్ కావడం గమనార్హం.అవే కార్లు...గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రుల కోసం ఇదే రకం 22 కార్లను కొనుగోలు చేసిన విషయం తెలి సిందే. కొత్త ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా లో టు ఉన్నా ఇంత లగ్జరీ కార్లు ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అవే కార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు కేటాయిస్తున్నారు. శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటా యించిన కారు కూడా అదే కావడం గమనార్హం. -
రైల్వే ట్రాక్‌పై 7 కిలో మీటర్లు కారు నడిపి.. ఇంతకీ ఎవరీ యువతి?
సాక్షి, హైదరాబాద్: పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి అంటూ రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని వోమిక సోనీగా గుర్తించారు. చేవెళ్లలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6.20 నిమిషాల నుంచి 7:40 వరకు ట్రాక్ పైనే వోమిక సోనీ కారును నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారును శంకర్పల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు.కారును సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. అందులో డాగ్ బిస్కెట్లు, అగ్గిపెట్టె, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నాన్ చాక్‌తో స్థానికులపై వోమిక సోనీ దురుసుగా ప్రవర్తించింది. ఆమె మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మతిస్థిమితం, డ్రగ్స్ తీసుకున్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.🚨 Shocking in Shankarpalli, Vikarabad A woman was spotted driving her car on a railway track towards Hyderabad! Railway staff halted trains, including one from Bengaluru to Hyderabad. Despite efforts to stop her, the woman kept driving on the tracks. Authorities are… pic.twitter.com/BK1MfZDHb8— Sowmith Yakkati (@YakkatiSowmith) June 26, 2025కాగా, వోమిక సోనీ.. గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. కారు నుంచి బయటికి రాకపోవడంతో కారు డోర్స్ బ్రేక్ చేసి మరి.. స్థానికులు, అధికారులు బయటికి దింపారు. స్థానికులు, అధికారులపైకి నాన్ చాక్‌తో దాడికి దిగింది. -
వీడియో వైరల్: రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. నిలిచిపోయిన రైళ్లు
సాక్షి, వికారాబాద్: రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది.ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే, వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లు తెలిసింది. ఆ యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకం కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. -
Uttarakhand: పొంగిపొర్లుతున్న కాలువలోకి కారు.. నలుగురు దుర్మరణం
హల్ద్వానీ: భారీ వర్షాల నడుమ ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న కారు రోడ్డు పక్కన పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో నాలుగు రోజుల శిశువుతో సహా నలుగురు మృతిచెందారని స్థానిక పోలీసులు తెలిపారు. VIDEO | Haldwani: Tragedy strikes as a car carrying seven people, including a newborn, plunges into an overflowing canal amid heavy rainfall. Four dead including a four-day-old infant, two women, and a man, while three others were injured.Rescue teams pulled the car from under… pic.twitter.com/r2fgGtM5Nh— Press Trust of India (@PTI_News) June 25, 2025ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కారు కాలువలో పడగానే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కారును కల్వర్టు కింద నుండి బయటకు తీశారు. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే ట్రెక్ మార్గంలో కొండచరియలు విరిగిపడి, ఇద్దరు యాత్రికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిద్దరి మృతదేహాలను శిథిలాల నుండి బయటకు తీశారు. ఇదేవిధంగా మహారాష్ట్రకు చెందిన ఒక యాత్రికుడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: అభినందన్‌ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి -
తిరుపతి: కారులో చెలరేగిన మంటలు.. దంపతులు మృతి
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి రోడ్డు ప్రమాదంలో ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సిద్దయ్య కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి చిత్తూరుకు వెళుతుండగా కారు చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద డివైడర్‌ను వేగంగా డీకొంది.ఈ ఘటనలో సిద్దయ్య (40), ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తకారు కొన్న ఫహద్ ఫాసిల్.. ధర ఎంతో తెలుసా?
మలయాళ నటుడు, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కొత్త కారును కొనుగోలు చేశాడు. వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTIని కొనుగోలు చేశాడు. తన కార్ల గ్యారేజ్‌లో కొత్త వెహికల్ వచ్చిన విషయాన్ని ఫోక్స్ వ్యాగన్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. వోక్స్వ్యాగన్ GTI భారత మార్కెట్ కోసం కేటాయించిన 150 యూనిట్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన వోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTI కారు గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 53 లక్షలు (ఎక్స్-షోరూమ్). పవర్-ప్యాక్డ్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు గరిష్టంగా 265 హార్స్పవర్, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో 0 -100 కి.మీ./గం.కు చేరుకుంటుందిఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ GTIతో పాటు, ఫహద్ ఫాసిల్ తన గ్యారేజీలో అనేక ఇతర అన్యదేశ కార్లను కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో మినీ కంట్రీమ్యాన్, లంబోర్గిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉన్నాయి. కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన బ్లాక్బస్టర్మూవీ పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2: ది రూల్‌లో భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాసిల్ విలనిజాన్ని పండించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్ వీడియో View this post on Instagram A post shared by Volkswagen Kayamkulam (@volkswagen_kayamkulam) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్‌గా ఘనత!
ప్రముఖ బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన లంబోర్గిని ఎస్ఈని తన సొంతం చేసుకున్నారు. ఈ ప్రత్యేక మోడల్‌ను కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. తన భార్య గౌతమి కపూర్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.5.21 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.ఈ లంబోర్గిని ఉరుస్ ఎస్ఈ మోడల్ కారును 2024లో అధికారికంగా భారతదేశంలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ నటుడు ఈ కారును కొనలేదు. దీంతో మొదట ఈ లగ్జరీ కారు కొన్న నటుడిగా రామ్ కపూర్ నిలిచారు. రామ్ తన బ్రాండ్ న్యూ లంబోర్గిని కారుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అతని వద్ద రామ్ పోర్స్చే , పోర్సే, ఫెరారీ , రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ కపూర్ ప్రస్తుతం వెబ్ సిరీస్ మిస్త్రీలో కనిపిస్తాడు. ఇది అమెరికన్ సిరీస్ ఆధారంగా తెరెకెక్కించారు. ఇందులో అతను డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 27 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా గతేడాది యుధ్రా మూవీలోనూ మెరిశారు. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
సొంతూరు వెళ్లొస్తానని.. కారులో శవమై..
జి.కొండూరు(ఎన్టీఆర్): సొంతూరు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కారులో శవమై కనిపించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి వెలగలేరు వద్ద ఓ హోటల్ ఎదురుగా శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రెడ్డిగూడెం మండల పరిధి మొద్దులపర్వ నివాసి అన్నెబోయిన నాగరాజు(38). జి.కొండూరు మండల పరిధి వెలగలేరు గ్రామానికి చెందిన అక్క కూతురు శివపార్వతితో అతనికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు గిరికుమార్, కూతురు రేష్మ ఉన్నారు. నాగరాజు వెలగలేరులోనే నివసిస్తూ జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. మొద్దులపర్వ వెళ్తున్నానని చెప్పి.. ఈ క్రమంలో గురువారం విజయవాడ వెళ్లి కారును అద్దెకు తీసుకున్న నాగరాజు, ఇంటికొచ్చి సొంత గ్రామం మొద్దులపర్వ వెళ్తున్నానని భార్యకు చెప్పి సాయంత్రం వేళ వెళ్లాడు. మరుసటిరోజు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భార్య శివపార్వతికి నాగరాజు ఫోన్ చేశాడు. మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం అమ్ముతున్నట్లు, ఇక అప్పులు అన్నీ తీరిపోతాయని, చార్జింగ్ లేదని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు అతని భార్య చెబుతున్నారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి వెలగలేరు వద్ద ఓ హోటల్ ఎదురుగా కారు ఆగి ఉండడాన్ని స్థానికులు గమనించారు. దానిలో శవం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారుని పరిశీలించగా కారులో నాగరాజు శవమై కనిపించాడు. మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్ఐ సతీష్ కుమార్‌లు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. స్థలం రిజిస్ట్రేషన్ చేయాలంటూ బెదిరింపు!కారులో శవమై కనిపించిన నాగరాజు భార్య శివపార్వతితో ‘సాక్షి’ నేరుగా మాట్లాడింది. ఈ క్రమంలో శివపార్వతి.. వెలగలేరులో ఇంటి నిర్మాణం నిమిత్తం విస్సన్నపేటకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద తన భర్త నాగరాజు మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 15రోజుల క్రితం సదరు వడ్డీ వ్యాపారి కుటుంబ సభ్యులతో వెలగలేరు వచ్చి అప్పు వెంటనే చెల్లించడం లేదా మొద్దులపర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాన్ని జూన్ నెల 13వ తేదీ లోపు తన పేరుతో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలని కోరారని చెప్పింది. చెప్పినట్లు చేయకపోతే తడాఖా చూపిస్తానంటూ సదరు వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు ‘సాక్షి’కి వివరించారు. ఇంతలోనే భర్త శవమై కనిపించడంపై శివపార్వతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో ఒక్కడే వచ్చాడా? కారులో శవమై కనిపించిన నాగరాజు శుక్రవారం ఉదయం ఒక్కడే కారులో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11గంటల సమయంలో వెలగలేరు వద్ద హోటల్ ఎదురుగా కారు ఆపిన నాగరాజు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు వద్ద కిందకు దిగి తూలుతూ ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న నాగరాజు బడ్డీ కొట్టు వద్ద పడుకోబోతున్న క్రమంలో అతని నుంచి విపరీతమైన వాసన వస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లాలని ఆ పక్కనే నివసిస్తున్నవారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి సాయంతో నాగరాజు కారులో ఎక్కి కూర్చున్నట్లు సమాచారం. కొద్ది గంటలు గడిచాక నాగరాజు కారులో నుంచి దిగకపోవడంతో స్థానికులకు ఆనుమానం వచ్చి డోరు తెరిచి చూడగా నాగరాజు శవమై కనిపించాడు. అతను తూలుతూ కనిపించడంతో పాటు గొంతు వద్ద కాలినట్లు తోలు లేచిపోయి ఉండటంతో నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగరాజుది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేల్చేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. కారు ఆగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు సైతం నాగరాజు ఒక్కడే కారులో వచ్చినట్లు గుర్తించారని తెలుస్తుంది. అయితే అతనికి కారులో ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
నెలలో 22,315 యూనిట్లు సరఫరా
భారత ఆటోమోటివ్ మార్కెట్లో కియా ఇండియా తన ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. మే 2025లో దేశీయంగా డీలర్లకు పంపించిన కార్ల సరఫరాలో సంవత్సరం ప్రాతిపదికన 14% వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2023లో 19,500 యూనిట్లతో పోలిస్తే మే 2025లో కంపెనీ 22,315 యూనిట్లను సరఫరా చేసినట్లు బిల్లులు దాఖలు చేసింది. ఈ పెరుగుదల కియా పోర్ట్‌ఫోలియోకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్‌తో కొరడాకారెన్స్ క్లావిస్కియా లైనప్‌లో ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ మోడల్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ మోడల్ స్టైల్, ఫంక్షనాలిటీ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగదారులకు ఆకర్షిస్తుందని తెలిపారు. కాంపాక్ట్ ఎస్‌యూవీల నుంచి ప్రీమియం ఎంపీవీల వరకు వివిధ రకాల వాహనాలను అందించడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొన్నారు. -
గ్రేటర్లో వాహనాలు 85,22,284
గ్రేటర్లో ద్విచక్ర వాహనాలు టాప్‌గేర్‌లో పరుగులు తీస్తున్నాయి. ఏటా లక్షలాది వాహనాలు కొత్తగా వచి్చచేరుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల్లో ఉద్యోగ, ఉపాధి పనులు, వ్యాపార కార్యకలాపాల్లో టూవీలర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఆ తరువాత రెండోస్థానంలో వ్యక్తిగత కార్లే రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. రవాణాశాఖ తాజా గణాంకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్ని రకాల వాహనాల సంఖ్య 85,22,286కు చేరింది. ఇందులో ద్విచక్రవాహనాలు 62,85,582 ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇంచుమించు మూడొంతులు ఇవే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎక్కువగా వినియోగించే కార్లు 15,72,795కు చేరుకున్నాయి.మహానగర విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు విస్తరించకపోవడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం అనివార్యంగా మారింది. ఇదే సమయంలో సిటీబస్సుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాలుగేళ్ల క్రితం 3,580 బస్సులు అందుబాటులో ఉంటే ఇప్పుడు 2,500 మాత్రమే ఉన్నాయి. నిజానికి రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల మేరకు సుమారు 6,000 బస్సులు అందుబాటులోకి రావలసి ఉండగా అందుకు భిన్నంగా వాటి సంఖ్య తగ్గింది. మరోవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రోరైళ్లు పెరగలేదు. కోవిడ్ నుంచి ఎంఎంటీఎస్‌ల వినియోగం కూడా తగ్గింది. – సాక్షి, హైదరాబాద్హైస్పీడ్లో బైక్ఏటా 3 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ప్రతి మనిíÙకి ఒక మొబైల్ ఫోన్ తప్పనిసరి అయినట్లుగానే బైక్ కూడా తప్పనిసరిగా మారింది. 18 ఏళ్లు దాటిన యువత మొదలుకొని 65 ఏళ్లు దాటిన వయోధికుల వరకు ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు, ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడంతో డెలివరీ వర్కర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. బైక్‌ట్యాక్సీ సేవలూ పెరిగాయి. కార్ల విషయానికొస్తే.. ఏటా లక్షకు పైగా కొత్తవి రోడ్డెక్కుతున్నాయి. ఇంటిల్లిపాది కలిసి వెళ్లేందుకు కారు సౌకర్యవంతంగా ఉండటంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి.త్వరలో కోటి బండ్లువ్యక్తిగత వాహనాల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న దృష్ట్యా మరో రెండు, మూడేళ్లలో గ్రేటర్లో వాహనాల సంఖ్య కోటికి చేరుకొనే అవకాశం ఉంది. ఏటా 5 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. కాగా, రహదారుల విస్తరణ లేకపోవడం వల్ల రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరిగి గ్రిడ్లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.సొంత బండి ఆదాయమార్గమైందిప్రజారవాణా సదుపాయాలను బాగా పెంచి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనం కేవలం ప్రయాణ సాధనమే కాకుండా ఒక ఆదాయమార్గంగా మారింది. బండి ఉంటే చాలు ఏదో ఒక ఉపాధి లభిస్తుందనే భరోసా ఏర్పడింది. జీవితంలోని అన్ని రంగాల్లోకి ఆన్లైన్ మార్కెట్ విస్తరించింది. ఇది ఒక అనివార్యమైన పరిస్థితి. అందుకే మిగతా కేటగిరీలకు చెందిన వాటి కంటే బైక్‌లే ఏటా ఎక్కువగా నమోదవుతున్నాయి. – సి.రమేశ్, జేటీసీ, హైదరాబాద్ -
కుటుంబాన్ని చిదిమేసిన రూ 20 కోట్ల అప్పు
పంచకుల: హర్యానాలోని పంచకుల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్(Dehradun)కు చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడయ్యింది. కుటుంబ యజమాని ప్రవీణ్ మిట్టల్‌పై దాదాపు రూ. 20 కోట్ల అప్పుల భారం ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ రాసిన సూసైడ్ లేఖలో తమ బంధువు సందీప్ అగర్వాల్ ద్వారా తమ అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.ప్రవీణ్ మిట్టల్ స్వస్థలం హిసార్‌లోని బార్వాలా. అయితే గత రెండేళ్లుగా ఆయన పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో నివసిస్తూ, టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మిట్టల్ హిమాచల్ ప్రదేశ్‌లోని స్క్రాప్ ఫ్యాక్టరీని నిర్వహించారు. అప్పులు పెరగడంతో బ్యాంకు ఆ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. తాజాగా మిట్టల్ కుటుంబ సభ్యులంతా బాగేశ్వర్ ధామ్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ వారు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన కారు వెనుక ఉత్తరాఖండ్ నంబర్ ప్లేట్(Uttarakhand number plate) ఉన్న కారు నిలిపి ఉండటాన్ని గమనించి, లోనికి చూడగా, ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ సమయంలో కారులో నుంచి దుర్వాసన వస్తోంది. అప్పుడు ఆ వ్యక్తి కారులోని ప్రవీణ్ మిట్టల్‌తో ఏం జరిగిందని అడిగాడు. దీనికి మిట్లల్ సమాధానమిస్తూ తమ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని, ఐదు నిమిషాల్లో తాను కూడా చనిపోతానని, తాము భారీగా అప్పుల్లో కూరుకుపోయామని చెప్పాడని ఆ వ్యక్తి మీడియాకు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారంతా మృతిచెందారని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే ప్రవీణ్ మిట్టల్‌ను రక్షించి ఉండేవాడినని కారును గమనించిన వ్యక్తి తెలిపాడు.అనుమానాస్పద స్థితిలో..పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి వెలుపల రోడ్డుపై ఆపి నిలిపివుంచిన కారులో ఏడుగురి మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా కుటుంబంలోని ఏడుగురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటిపెద్ద, డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42), అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడు మృతదేహాలను పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ (శాంతిభద్రతలు) అమిత్ దహియా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, మరింత విశ్లేషణ కోసం ఆధారాలను సేకరించింది. పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ తమ ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని, మృతదేహాలు లభ్యమైన కారును పూర్తిగా స్కాన్ చేస్తున్నామని అన్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. -
లారీ–కారు ఢీ: ఆరుగురు దుర్మరణం
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు. గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్ఐ రామ్‌గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
రాంగ్ రూట్ కేసు.. విచారణకు హాజరైన బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనపై కేసు నమోదు కావడంతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు వచ్చారు. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కారు నడపడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అవసరమైతే మరోసారి కోర్టు విచారణకు రావాలని ఆయనకు పోలీసులు సూచించారు. ఇప్పటికే హీరో కారును సీజ్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు.(ఇది చదవండి: దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!)అసలేం జరిగిందంటే..జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్న బెల్లకొండ శ్రీనివాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం భైరవం మూవీలో నటిస్తున్నారు. -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
కటిహార్: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రాక్టర్ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు. -
కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు
తిరుపతి రూరల్/పాకాల/అమరావతి: కారు అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొట్టి దాని దిగువన చిక్కుకుపోగా.. గుర్తించని కంటైనర్ డ్రైవర్ కారును ఈడ్చుకుని పోయిన ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం కోనపరెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు కారులో శనివారం తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.సోమవారం వీరంతా ఒకే కారులో తిరిగి వెళుతుండగా.. పాకాల మండలం కోనపరెడ్డిపల్లి వద్ద కారు అదుపుతప్పి ముందు వెళుతున్న కంటైనర్‌ను వెనుకనుంచి ఢీకొట్టి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించని కంటైనర్ డ్రైవర్, కంటైనర్‌తోపాటు కారునూ వంద మీటర్ల దూరం వరకూ లాక్కుని వెళ్లడంతో కారు మొత్తం నుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కర్ణాటకలోని బెంగుళూరు గౌడన్పాళ్యకు చెందిన విజయలక్ష్మి (50), సహాన (34), ఎస్ఆర్ రజని (27), ఆర్.లేఖన్ గౌడ (11), తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన ఎస్.త్యాగరాజన్ (42) అక్కడికక్కడే మృతి చెందారు.కర్ణాటకలోని సబ్బనహళ్లికి చెందిన గీతమ్మ, తమిళనాడులోని హోసూరుకు చెందిన టి.క్రిస్విన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి పరుగు పరుగున అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఘటనా స్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి కంటైనర్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సీఎం చంద్రబాబు విచారం ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక, తమిళనాడు వాసుల కుటుంబీకులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు. ఘటనపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. -
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
సాధారణంగా సినిమాలు హిట్ అయినప్పుడు, కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినప్పుడు ఆనందం కొద్దీ నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు లగ్జరీ బహుమతులు ఇస్తుంటారు. ఒకవేళ ఇస్తే దాన్ని చాలామంది చెప్పుకొంటారు. కానీ నాని మాత్రం దీని గురించి ఏ మాత్రం బయటపెట్టలేదట.హీరోగా వరస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్న నాని.. మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు. గత నెలలో థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'కోర్ట్' నిర్మించింది నానినే. అయితే ఈ సినిమా కోసం రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై ఎఫెక్ట్!) అయితే ఈ సినిమా అద్భుతమైన హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయిన నాని.. 'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయాన్ని సదరు డైరెక్టర్ రామ్ జగదీశ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాని చేతుల మీదుగా కారు బహుమతిగా అందుకోవడం ఒక అచీవ్ మెంట్ అని రామ్ జగదీష్ చెప్పుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చినట్లు బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని.. అందుకే ఎవరికీ చెప్పలేదని, లేదంటే గట్టిగా అరిచి తనకు కారు కొనిచ్చాడని చెప్పేవాడినని అన్నాడు.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటి.. ధర ఎంతంటే?
సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సైత్. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ మూవీ దేవాలో కీలక పాత్రలో కనిపించింది. పూజా హేగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో కుబ్రా ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఈవీ కారు ధర దాదాపు రూ.31 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను పెట్రోల్ బంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది కుబ్రా సైత్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలీవుడ్ భామకు అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) -
అమ్మా..ఊపిరాడలేదు!
తిరుమల : ‘అమ్మా.. ఊపిరాడలేదు..!’ అన్నట్టు కారులో చిక్కుకుపోయిన ఆ చిన్నారుల ఆర్తనాదాలు అక్కడి వారిని కదిలించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన గురువారం తిరుమలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా, బద్వేలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుమలత దంపతులకు భాను (7), నీల (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటసుబ్బారెడ్డి విదేశాల్లో ఉన్నారు.సుమలత పిల్లలు, వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య అతని భార్య, అల్లుడితో కలిసి గురువారం తిరుమలకు బయలుదేరారు. తిరుపతి అలిపిరికి వచ్చిన అనంతరం సుమలత, గంగయ్య సతీమణి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. కారులో గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు తిరుమలకు చేరుకుని కారును స్థానిక వరాహస్వామి అతిథిగృహం–1 పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశారు. కారులో లాక్ అయ్యారు! ఆ సమయంలో గంగయ్య పిల్లలు ఇద్దరినీ కారులో ఉంచి కారు డోర్లు లాక్ చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. కొంతసేపటికి కారులో ఉన్న పిల్లలకు ఊపిరాడక ఏడుస్తున్నట్లు సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్లు గుర్తించి తిరుముల ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్ల సహాయంతో కారు అద్దాన్ని పగులకొట్టి తాళం ఓపెన్ చేసి కారులో ఉన్న ఇద్దరు చిన్నారులను బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. అనంతరం ట్రాఫిక్ హోంగార్డు జయచంద్ర, పీఎసీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో చిన్నారులను వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత ధన్యవాదాలు తెలిపారు. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు స్పందించారు. పోలీసుల సమయస్ఫూర్తిని అభినందించారు. -
జస్ట్ 9999 నెంబర్ కోసం ఏకంగా రూ. 12 లక్షలు పైనే..!
మణికొండ: తమ వాహనాలకు లక్కీ నెంబర్లు ఉండాలని కోరుకునే వారు వాటిని దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ బిడ్డింగ్‌లో లక్కీ నెంబర్ల ధరలు లక్షల రూపాయల్లో పలికాయి. మంగళవారం జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.52,69,216 ఆదాయం సమకూరినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. అందులో టీజీ 07ఆర్ 9999 నెంబర్ ఏకంగా రూ. 12,49,999లకు కాం్రగ్యూంట్ డెవలపర్స్ వారు దక్కించుకున్నారు. టీజీ 07ఎఎ 0009 నెంబర్‌ను రుద్ర ఇన్ఫాస్ట్రక్షర్స్ రూ.8.50లకు, టీజీ 07ఎఎ 0001నెంబర్‌ను 4.77 లక్షలకు ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థలు దక్కించుకున్నాయని అధికారులు తెలిపారు. -
Ranga Reddy: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్
రంగారెడ్డి జిల్లా: మేనమామ పెళ్లి వేడుకలకోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాతపడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య, అనసూయల కుమారుడు రాంబాబు వివాహం ఈనెల 30న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా రాంబాబు అక్కాచెల్లెళ్లైన సీతారాంపూర్‌కు చెందిన ఉమారాణి, పామెన గ్రామానికి చెందిన జ్యోతి తమ పిల్లలను తీసుకుని రెండు రోజుల క్రితం దామరగిద్దకు వచ్చారు. ఇంటికి రంగులు వేసే పనులు కొనసాగుతుండటంతో పిల్లలంతా కలసి బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఉమారాణి చిన్న కూతురు అభినయశ్రీ (4), జ్యోతి చిన్న కూతురు తన్మయశ్రీ(5) ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు డోర్లు వేసుకోవడంతో అవి లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పిల్లలందరూ ఒకే చోట ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారివారి పనుల్లో మునిగిపోయారు. సుమారు రెండు గంటలు గడిచిన తర్వాత అభినయశ్రీ, తన్మయశ్రీ కనిపించకపోవడంతో అంతా వారికోసం వెతుకుతుండగా కారు డోర్లు తీసి చూశారు. ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు పిల్లలు మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతి ఘటన దామరగిద్దతోపాటు సీతారాంపూర్, పామెన గ్రామాల్లో విషాదం నింపింది. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కలచి వేశాయి. -
కారు కొన్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు..చివరికి...
చిత్తూరు: ఉపాధ్యాయ దంపతులు నూతన కారు కొనుగోలు చేశారు.. అదే సమయంలో కుమారై ఇంటర్లో అధిక మార్కులు సాధించడంతో సంతోషంగా తీర్థ యాత్రలకు వెళ్లి తిరిగీ ఇంటికి వెళ్లే సమయంలో తీర్థయాత్ర అంతిమ యాత్రగా మారింది. ఓ లారీ మృత్యువు రూపంలో వచ్చి ఆ సంతోషాన్ని క్షణాల్లో చిదిమేయడంతో తల్లి మృతి చెందగా భర్త , కుమారై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. దీంతో మూడు జిల్లాల్లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉన్న వెంకటరమణ (48) , శారద (45) ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారై కీర్తన (17) , కుమారుడు శ్రీకర్ (12) ఉన్నారు. ఇలా ఉండగా వెంకటరమణ నూతనంగా కారు కొనుగోలు చేశారు. కుమారై ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 976 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కుమారుడు శ్రీకర్ గుడివాడలో 7వ తరగతి చదువుతున్నాడు. అంతా సంతోషంగా పున్నమి రోజున శనివారం తమిళనాడులోని తిరువణ్నామలైలో గిరి ప్రదక్షిణానికి వెళ్లారు. స్వామి వారిని భక్తితో పూజించుకుని , మొక్కులు చెల్లించుకుని ఆదివారం ఉదయం అక్కడి నుంచి కదిరికి బయలు దేరారు. మార్గ మధ్యలో పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్దకు కారు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి అతివేగంగా వచ్చిన ఐషర్ లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో శారద అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరమణ, కుమారై కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేపట్టారు. మూడు జిల్లాల్లో విషాదం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శారద, వెంకట రమణ కుటుంబం పుట్టపర్తి జిల్లా కదిరిలో నివాసం ఉన్నారు. శారద అదే మండలం బాలప్పగారిపల్లెలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అలాగే వెంకటరమణ అన్నమయ్య జిల్లా సోంపల్లెలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కాగా వెంకటరమణ స్వగ్రామం కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లె కావడంతో అంత్యక్రియలు అక్కడ నిర్వహించనున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మూడు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, బంధుమిత్రుల రోదనలు పలువురిని కలచివేసింది. -
నా కారును దొంగిలించారు...
మణికొండ: నటుడు మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ నెల 1వ తేదీన రాజస్తాన్‌కు వెళ్లగా జల్పల్లిలోని ఫామ్‌హౌస్‌లోకి 150 మంది చొరబడి విధ్వంసం చేశారన్నారు. తన విల్లా ముందు నిలిపిన మహీంద్రా మరాజో కారును అర్ధరాత్రి దొంగిలించారని చెప్పారు. వెంటనే తన డ్రైవర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందన్నారు. దుండగులు తన విల్లా గోడలు దూకి వచ్చి ఇంట్లోని విలువైన వస్తువులను పగులగొట్టారని మనోజ్ ఆరోపించారు.దర్యాప్తు చేస్తున్నాం..మంచు మనోజ్‌కు చెందిన కారును ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దొంగిలించినట్టు అతని డ్రైవర్ సాంబశివరావు ఫిర్యాదు చేశాడని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. 2వ తేదీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, గుర్తు తెలియని వ్యక్తులు కారును దొంగిలించినట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కారును దొంగిలించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
నేను డీఎస్పీని..పదండి పోలీస్‌స్టేషన్‌కు..
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని కారుకు పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్‌రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డి, ఓ తెలుగు ఛానల్లో కాస్ట్యూమర్‌గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్‌రెడ్డి గదికి వచ్చారు. తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పదండి అంటూ కిషోర్, సందీప్‌లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. టీవీ నటి ఇంద్రాణికి కిషోర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్‌లను కిడ్నాప్ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyd: భారీ వర్షానికి కారుపై విరిగి పడిన చెట్టు
హైదరాబాద్: నగరంతో తెలంగాణలోని పలు చోట్ల అకాల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో కొన్ని చోట్ల కుండ పోత వర్షం కురవగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి జన జీవనం స్తంభించింది. వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు అవస్తలు తప్పలేదు.మరొకవైపు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. దాంతో అప్రమత్తం కావడంతో వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారుపై చెట్టు పడిన వెంటనే రెస్య్కూ ఆపరేషన్ లో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించారు. కారులో ఉన్న ముగ్గుర్ని ముందుగా బయటకు తీసేశారు. కారుపై పడ్డ చెట్టును అక్కడ నుంచి తొలగించే పనిలో ఉన్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు -
డీజిల్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం
నార్కట్‌పల్లి: రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్ ముగ్గురు స్నేహితులు కలిసి గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. చెర్వుగట్టు సమీపంలోకి రాగానే కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడాన్ని గుర్తించిన వారు కారును రోడ్డు పక్కన నిలిపి బయటకు వచ్చారు. వెంటనే అగి్నమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.A #Lamborghini, a fat bank account, and ZERO Humanity This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025 -
పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుని భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం పుతిన్‌కు చెందిన ఈ అత్యంత ఖరీదైన కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుండి మంటలు ప్రారంభమై, వాహనం లోనికి వ్యాపించాయి. JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU— BRICS News (@BRICSinfo) March 29, 2025అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతిడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ‘ది సన్’ పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కారు తగలబడిన ఘటన నేపధ్యంలో ఆయన మరణాన్ని జెలెన్స్కీ ముందే ఊహించారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కైవ్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యూరోవిజన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ త్వరలో చనిపోతారని, ఇరు దేశాల యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు.ఇది కూడా చదవండి: Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే.. -
TG: కారులోమహిళ డెడ్ బాడీతో పారిపోయేందుకు యత్నం!
నిజామాబాద్: కారులో డెడ్ బాడీని తీసుకెళ్తున్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. అది కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ పోలీసులను దాటేసిందా కారు. అయితే అసలు కారును ఆపకుండా వెళ్లిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ కారును ఛేజ్ చేశారు. కారును వెంబడించి దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ పద్ద పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అనుమానించి ఆరా తీశారు. ఎంతకీ పెదవి విప్పకపోవడంతో కారు డిక్కీని ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని రాజేష్ గా గుర్తించిన పోలీసులు.. మృతురాలు కమలగా గుర్తించారు. -
ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముంబయిలో ఆమె కారును ఓ బస్సు ఢీకొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఐశ్వర్య బాడీ గార్డ్స్ వెంటనే కారులో నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.ఐశ్వర్యరాయ్ కారును బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కారుకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.అక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని జుహుకి చెందిన ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆమె క్షేమం గురించి పలువురు ఆరా తీశారు.కాగా.. ఐశ్వర్యరాయ్ చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 2లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఆమె ఉత్తమ నటిగా ప్రధాన పాత్ర (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం 2023లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) -
కార్లకు నిప్పు పెట్టి పారిపోయిన దుండగుడు
-
Hyderabad: కదులుతున్న కారులో మంటలు
హైదరాబాద్: హబ్సిగూడ(Habsiguda) ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారులో(Fire In Car Due) అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్నవారు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన మేరకు.. వారాసిగూడకు చెందిన నాగరాజు జనగామ నుంచి బస్సులో వచ్చిన తన భార్యా పిల్లలను ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మారుతి స్విఫ్ట్ కారులో ఎక్కించుకుని (ఏపీ 09 బీజే 2366) ఉప్పల్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాడు. వీరి కారు హబ్సిగూడ రోడ్డు నెంబర్ 6 వద్దకు రాగానే ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ నాగరాజు వెంటనే కారును రోడ్డు పక్కన నిలిపాడు. స్థానికులు, పోలీసుల సహాయంతో కారు వెనక డోర్లు ఓపెన్ చేసి భార్యా పిల్లలను కూడా బయటకు దింపారు. సమాచారం అందుకున్న మౌలాలి ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు మూడు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.ఈద్ పండుగ కోసం షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా చాప్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చ వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.మరో ఘటనలో వడోదర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శుక్రవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని వడోదర నగరంలో 20 ఏళ్ల లా విద్యార్థి నడుపుతున్న కారు వారి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల కథనం ప్రకారం నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్ రౌండ్’ అంటూ..
వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి, పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన కరోలీబాగ్లోని ఆమ్రపాలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ రోడ్డు ప్రమాదం జరిగిన దరిమిలా జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్(Traffic jam) అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటాన్ని స్ణానికులు గుమనించారు. అతను గట్టిగా అరుస్తూ కారు నడిపాడని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం కారు దిగిన ఆ యువకుడు ‘అనెదర్ రౌండ్’ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీసీపీ పన్నా మోయాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందిందని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనిని వారణాసికి చెందిన రవీష్ చౌరాసియాగా గుర్తించామన్నారు. రవీష్ లా చదువుకుంటున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితులకు కూడా అతనితో పాటు ఉన్నారని, ఆ తరువాత పరారయ్యారన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు(Police teams) గాలిస్తున్నాయన్నారు. కారు ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కార్గిల్‌లో భూకంపం -
Hyderabad: నిద్ర మాత్రలు వేసుకుని కారు డ్రైవింగ్
సుభాష్ నగర్ : మొతాదుకు మించి నిద్ర మాత్రలు వేసుకున్న ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో కారు నడుపుతూ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ గురువారం రాత్రి అతివేగంగా కారు నడుపుతూ జగద్గిరిగుట్ట పోలీస్ అవుట్ పోస్ట్ రోడ్డులో ప్రయాణికులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆపకుండా అతను షాపూర్‌నగర్ లోని డీసీపీ కార్యాలయం ఎదుట మరి కొందరిని ఢీకొట్టాడు. దీంతో స్థానికులు కారును వెంబడించి ఆపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనిని గుర్తించిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై సందీప్ అతడిని వెంబడించి సూరారంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు వ్యక్తి మత్తులో ఉండి తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉండటంతో అతడిని సూరారం పోలీసులకు అప్పగించారు. వివరాలు సేకరించిన పోలీసులు అతడిని గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ గుర్తించి అతడి భార్య డాక్టర్ సువర్ణకు సమాచారం అందించారు. తన భర్త వ్యాపార పని నిమిత్తం వివేకానంద నగర్‌కు వెళ్లాడని, అప్పుడప్పుడు మోతాదుకు మించి స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకోవడంతో తను ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉంటాడని తెలిపింది. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. -
కరీంనగర్: పెళ్లి బరాత్‌లో విషాదం
కరీంనగర్: పెళ్లి బరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. పెండ్లి కొడుకు, కూతురు కూర్చున్న కారు బరాత్‌లో డ్యాన్స్ చేసేవారిపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో గురువారం రాత్రి పెళ్లి బరాత్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉదయం మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభాకర్ కూతురు వివాహం జరిగింది. రాత్రి అప్పగింతలు పూర్తయ్యాక గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుంది. నూతన వధువు, వరుడు కారులో కూర్చోగా బంధువులు సుమార్ 30 మంది వరకు బరాత్‌లో పాల్గొన్నారు. పెళ్లి కుమారుడు, కూతురు ఉన్న కారు డ్రైవర్ ఎక్సలేటర్ తొక్కడంతో బరాత్‌లో కారు ముందు ఉన్న వారిపైనుంచి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకు గురైన డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిని ప్రైవేట్ వాహనాల్లో హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురికి ఖరీదైన బహుమతులిచ్చా.. కానీ షారూఖ్ మాత్రం: సింగర్ మికా సింగ్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ బీటౌన్‌లో దాదాపు పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతేకాదు మన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని కూడా. బాలీవుడ్లో ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మికా సింగ్ ఇటీవల ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన అభిమాన హీరో షారూఖ్ ఖాన్‌కు రూ. 50 లక్షల విలువైన డైమండ్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఆ రింగ్‌ను షారూఖ్ నాకు తిరిగి ఇచ్చారని వెల్లడించారు. అంతే కాదు షారూఖ్ తన లగ్జరీ కారును మూడు నెలల పాటు వాడుకున్నారని మికా సింగ్ తెలిపారు.ఇంటర్వ్యూలో మికా మాట్లాడుతూ.. ' బాలీవుడ్ ఉత్తమ నటులలో షారూఖ్ ఒకరు. అంతేకాదు పెద్ద మనిషి కూడా. ఆయన నాకు తిరిగిచ్చిన ఉంగరాన్ని ఎల్లప్పుడూ ధరిస్తా. ఎందుకంటే దీని విలువ దాదాపు రూ.50 లక్షలు. ఇలాంటి రింగ్స్ నేను అమితాబ్ బచ్చన్, గురుదాస్ మాన్లకు కూడా బహుమతిగా ఇచ్చాను. అయితే దీన్ని మొదటిసారి బహుమతిగా షారూఖ్ ఖాన్‌కే ఇచ్చా. ఎందుకంటే ఈ ముగ్గురి కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా. అయితే మరుసటి రోజు షారూఖ్ కాల్ చేసి.. దయచేసి ఈ ఉంగరాన్ని వెనక్కి తీసుకోండి.. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది అని నాతో అన్నారు. అయితే ఒకసారి ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదే సమయంలో నా కారు ఇచ్చి ఆయనను ఇంటికి పంపించా. ఆ తర్వాత నా కారు షారూఖ్‌కు నచ్చడంతో దాదాపు మూడు నెలలపాటు తన వద్దే ఉంచుకుని వాడుకున్నారని' మికా పంచుకున్నారు.ఇటీవల హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీలో తాను షారుఖ్ ఖాన్‌తో సరదాగా గడిపామని మికా సింగ్ వెల్లడించారు. ఈ పార్టీకి హీరో రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యాడని చెప్పాడు. పార్టీ అయిపోయిన తర్వాత అంతా కలిసి ఓకే కారులో వెళ్లామని వివరించారు. షారూఖ్ వినియాగించిన కారు తన వద్దే ఉంచుకున్నానని మికా తెలిపారు. -
Narsingi : అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ : నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.పోలీసుల వివరాల మేరకు నార్సింగిలోని స్థానికంగా పాషా నగర్ కాలనీలోని జీ ప్లస్ టూ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు వ్యాపించాయి. కారులో వేడి తీవ్రత కారణంగా మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.అగ్ని ప్రమాదంతో భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలు కిందకి దూకారు. మంటల దాటికి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు జమీలా, సహానా,నాలుగేళ్ల చిన్నారి షీర్జా మరణించారు.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
సౌరశక్తితో నడిచే భారత మొదటి ఎలక్ట్రిక్ వాహనం (ఫొటోలు)
-
గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..
రోజువారీ ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్నారా..? ఇకపై మీ సమస్యకు చెక్ పెట్టేలా గాల్లో ఎగిరే కార్లు వస్తున్నాయి. అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ సినిమాల్లో మాదిరి గాల్లో ఎగిరే కారును తయారు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ స్టార్టప్ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ‘మోడల్ ఏ’ను విజయవంతంగా ప్రదర్శించింది. ఈ వినూత్న వాహనాన్ని రోడ్లపై కూడా డ్రైవ్ చేసేలా తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇది గాల్లో నిలువుగా టేకాఫ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.సాధారణంగా ఎగిరే కార్లంటే డ్రోన్ల మాదిరి బయటకు కనిపించేలా బారీ ప్రొపెల్లర్లును కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ‘మోడల్ ఏ’ కారు ఇన్‌బిల్ట్‌గా ఉన్న రోటర్ బ్లేడ్లతో సాంప్రదాయ ఆటోమోటివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఆ డిజైన్‌తోనే నేలపై నుంచి ఎగిరే సామర్థ్యం దీని సొంతం. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఒకసారి ఛార్జ్ చేస్తే రోడ్లపై 320 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని, గాల్లో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.Flying Cars Are Here!Back to the Future predicted them for 2015. It didn't happen. But now we're getting closer.The dream of flying above traffic is becoming real. Alef Aeronautics is making this happen with their Model A. pic.twitter.com/NeKgH4lREf— Alex / AI Experiments (@byalexai) February 24, 2025ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!అలెఫ్ ఏరోనాటిక్స్ ఫ్లైయింగ్ కారుతో ట్రాఫిక్ రద్దీ సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాహనం నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాలు కలిగి ఉండడంతో రన్‌వేల అవసరం ఉండదు. ఇది పట్టణ వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు. కంపెనీ ‘మోడల్ ఏ’ కోసం 3,300 కంటే ఎక్కువ ప్రీఆర్డర్లను అందుకున్నట్లు పేర్కొంది. ఇది సుమారు 3,00,000 డాలర్ల (రూ.2.5 కోట్లు) ధర ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరిలో దీన్ని మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ చెప్పింది. -
కారులో మంటలు
-
Hyderabad: మార్చి.. ఏమార్చి..
ఒకప్పుడు ఓ మామూలు కారు కొంటే, ఉంటే గొప్ప.. ఇప్పుడు ఖరీదైన కారు కొంటే.. అది అందరికన్నా భిన్నంగా ఉంటేనే గొప్ప.. రూ.లక్షలు, కోట్లు పెట్టి కారు కొనడం మాత్రమే కాదు దానిని మరింత స్టైల్‌గా చూపించాలనే తాపత్రయంతో కొందరు రకరకాలుగా అలంకరణలు చేస్తున్నారు. బైకర్స్ సైతం అంతే.. ఖరీదైన బైక్స్ కొనడంతో పాటు ‘మోడిఫైడ్’ మోజులో పోలీసు కేసుల బారిన పడుతున్నారు. గత నెల 11న మితిమీరిన వేగంతో కారు నడుపుతున్నందుకు ఓ మెర్సిడీస్ బెంజ్ కారుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కారు యజమాని అంతటితో సరిపుచ్చలేదు. ఒరిజినల్ రంగు అయిన పోలార్ వైట్ కలర్ నుంచి మెర్సిడీస్ను మల్టీకలర్ వాహనంగా మార్చినందుకు మరో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ కారు యజమానితో పాటు మోడిఫికేషన్ చేసిన సదరు వర్క్‌షాపుపై కూడా మోటారు వాహన చట్టం సెక్షన్ 182–ఎ(1) కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇక బైకర్స్ పైన ఇలాంటి కేసులకు కొదవే లేదు. తప్పు మాత్రమే కాదు ముప్పు కూడా.. ‘అనేక మంది వాహనదారులు చట్టాన్ని పాటించడం లేదు. ఇష్టానుసారం వాహనాల ఫీచర్లను మార్చుకుంటున్నారు. అలాంటి మార్పు చేర్పులు తప్పు మాత్రమే కాదు, ముప్పు కూడా’ అని నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కమల్ అంటున్నారు. వాహన తయారీదారులు నిర్దిష్ట మోడల్‌ను ఉత్పత్తి చేయడానికి అధికారుల నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకుంటారు. అలా తయారైన మోడల్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల వాహనం దాని ఒరిజినల్ కొలతలు, ఏరోడైనమిక్లను కోల్పోవచ్చు. తద్వారా అది నడిపేవారితో పాటు ఇతరులకూ ప్రమాదకరంగా మారవచ్చు’ అని నిపుణులు అంటున్నారు. ‘వాహనం రంగు మార్చడానికి చట్టపరమైన అనుమతి పొంది, రిజి్రస్టేషన్ సరి్టఫికెట్లో కొత్త రంగు ప్రతిబింబించాలి. బైకర్స్ తమ సైలెన్సర్లు, టెయిల్ ల్యాంపులను మారుస్తారు, ఈ మార్పులు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి’ అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ముఖ్య కార్యకర్త వినోద్ చెబుతున్నారు. ఏదైనా వాహనం ఇంటీరియర్స్ లేదా ఎక్స్టీరియర్స్ సవరించడం చట్టవిరుద్ధం. తస్మాత్ జాగ్రత్త.. వాహన మార్పుల వల్ల వాహనానికి ఏదైనా నష్టం జరిగితే తయారీదారు వారంటీ చెల్లదు. కార్ల యజమానులు తరచూ చేసే మార్పుల్లో లేతరంగు విండోస్ ఒకటి. దీని వల్ల విండోస్ 25% కంటే తక్కువ లైట్ ట్రాన్స్మిషన్ స్థాయిని కలిగి ఉండటం వల్ల ఇతర వాహనాలను గమనించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. మార్పుల వల్ల కొన్ని వాహనాల పనితీరు మందగిస్తుంది. కొందరు యజమానులు తమ వాహనాన్ని వీలైనంత మేర మోడిఫై చేస్తుంటారు. దీనివల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. సస్పెన్షన్ అప్గ్రేడ్లు, టర్బోచార్జ్ జోడించడం, స్పోర్ట్స్ సీట్లను ఇన్స్టాల్ చేయడం వంటి మార్పులు చేస్తుంటారు. ఇవి వాహన పనితీరును దెబ్బతీస్తాయి.మనం కొన్న కారే కానీ.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే ఎంత డబ్బు ఉంటే అంత కారు కొనుక్కోవచ్చు తప్పులేదు. కానీ.. ఎంత ఖర్చు పెట్టి కొన్న కారైనా, బైక్ అయినా మన ఇష్టం వచ్చినట్టు మార్పులు, చేర్పులు చేసుకుంటామంటే చట్టం ఒప్పుకోదు. వాహనం రంగు కావచ్చు, రూపంలో కావచ్చు.. ఏవైనా మార్పు చేర్పులను చేయాలంటే ప్రాంతీయ రవాణా కార్యాలయం వాటిని ఆమోదించాలి. సరైన విధంగా డాక్యుమెంట్ చేయాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. చట్టం ఏం చెబుతోంది..? వాహనంలో అనధికారిక మార్పులు చేసినట్లు తేలితే.. ఒక సంవత్సరం వరకూ జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకూ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఆర్టీఏ నుంచి అనుమతి లేకుండా మార్పులు చేసిన వాహనాలను సీజ్ చేసే అధికారం ఉందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాహనాల రూపాన్ని, పనితీరును మెరుగుపరచడానికి కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉంటాయి. దాని లోబడి అలాంటి మార్పులు చేసుకోవచ్చు. కార్లు లేదా మోటార్ సైకిళ్లకు అదనపు పరికరాలను అమర్చడం లేదా ధ్వనులను మార్పు చేయడం వంటివి మోటారు ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు.ఎలాంటి మార్పులూ చేయకూడదు.. ఓ వాహనాన్ని తయారీ దారుడు మార్కెట్లోకి పంపేముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుంటాడు. భద్రతతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వాహనం బరువు, రూపం, తదితరాలను ఖరారు చేస్తారు. అలా వచి్చన వాహనానికి ఎలాంటి మార్పులూ చేయకూడదు. దీంతో పాటు నెంబర్ ప్లేట్స్, సైలెన్సర్స్ మార్చడం వంటివి చేయకూడదు. విండ్ షీల్డ్స్, విండో గ్లాసులకు బ్లాక్ ఫిల్మ్స్ తగిలించకూడదు. వీటిలో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడినా మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. తీవ్రతను బట్టి జరిమానా, కేసు, ఛార్జిషిట్ వంటి చర్యలు ఉంటాయి. – జి.శంకర్రాజు, ఏసీపీ, నార్త్ జోన్ ట్రాఫిక్ విభాగం -
హైదరాబాద్ లో BMW కారు బీభత్సం
-
తమన్‌కి ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన బాలయ్య.. ధర ఎంతంటే?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి హీరో బాలకృష్ణ(Balakrishna) ఖరీదైన కారుని బహుమతి ఇచ్చాడు. న్యూ బ్రాండెండ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు . దీని విలువ మార్కెట్లో కోటిన్నర వరకు ఉంటుంది. ప్రీమియంది అయితే దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందట. ఓ సంగీత దర్శకుడికి బాలయ్య ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం ఇదే మొదటి సారి. కొత్త కారుతో బాలయ్య, తమన్ దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.తమన్ రెచ్చిపోతాడుబాలయ్య సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే చాలు తమన్(Thaman) రెచ్చిపోతాడు. ఎంతలా అంటే ఆయన ఇచ్చే బీజీఎంకి థియేటర్స్‌లో బాక్సులు బద్దలైపోయేలా. అఖండ సినిమా భారీ విజయం సాధించడంలో తమనే కీలక పాత్ర పోషించాడు. అదిరిపోయే పాటలతో పాటు అద్భుతమైన బీజీఎం అందించాడు. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరీ చిత్రాలకు కూడా అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. వీరసింహారెడ్డి బీజీఎం ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరేట్. సోషల్ మీడియాలో బాలయ్య ఎలివేషన్ వీడియోలన్నింటికి ఈ మూవీ బీజీఎంనే వాడుతారు. ఇక ఇటీవల రిలీజైన డాకు మహారాజ్‌కు కూడా తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. అందుకే బాలయ్యకు తమన్ అంటే విపరీతమైన ప్రేమ. ముద్దుగా తమ్ముడు అని పిలుచుకుంటాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘అఖండ 2’ చిత్రం తెరకెక్కుతుంది. -
హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!
టోక్యో: వ్యాపార ఏకీకరణపై చర్చలను ముగించినట్లు వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థలు హోండా, నిస్సాన్, మిత్సుబిషి గురువారం తెలిపాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, అటానమస్ డ్రైవింగ్ వంటి స్మార్ట్ కార్ల అభివృద్ధిపై కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఈ మూడు సంస్థలు వెల్లడించాయి. ‘చర్చలు జాయింట్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్న అంశంపై జరగాలి. కానీ హోండా అనుబంధ సంస్థగా నిస్సాన్‌ను మార్చాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ పోటీలో గెలవడానికి కంపెనీలను కలపాలి. కానీ నిస్సాన్ సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. కాబట్టి నేను వారి ప్రతిపాదనను అంగీకరించలేను. హోండా లేకుండా నిస్సాన్ ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోబోతోంది’ అని నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మకొటొ ఉషీడా మీడియాకు వెల్లడించారు.నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేయడానికి హోండా స్టాక్ స్వాప్‌ను సూచించిందని హోండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మీబ్ అన్నారు. ‘నేను నిజంగా నిరాశ చెందాను. వ్యాపార అవకాశం గొప్పదని భావించాను. కానీ అది కార్యరూపం దాల్చాలంటే బాధ కలిగించే చర్యలు అవసరమని కూడా నాకు తెలుసు’ అని వివరించారు. నిస్సాన్‌లో ఫాక్స్‌కాన్‌కు వాటా?హోండా మోటార్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ సంయుక్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడానికి చర్చలు జరపబోతున్నట్లు 2024 డిసెంబర్లో ప్రకటించాయి. ఆ గ్రూప్‌లో చేరడాన్ని పరిశీలిస్తున్నట్లు మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ వెల్లడించింది. 2025 జూన్ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేసి.. ఆగస్టు కల్లా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు హోండా, నిస్సాన్ మొదట్లో తెలిపాయి. ఇదిలావుంటే హోండా, నిస్సాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయని జపాన్ మీడియా ఇటీవలి కాలంలో కథనాలు ప్రచురించింది. హోండాతో భాగస్వామ్యంలో ఒక చిన్న భాగస్వామిగా మారడానికి నిస్సాన్ నిరాకరించిందన్నది వార్తా కథనాల సారాంశం. నిస్సాన్‌లో వాటా తీసుకోవడాన్ని తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ పరిశీలిస్తోందన్న మీడియా ఊహాగానాల గురించి తనకు తెలియదని మీబ్ అన్నారు.ఇదీ చదవండి: స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు ఆర్థికంగా మెరుగ్గా హోండా..హోండా ఆర్థికంగా చాలా మెరుగ్గా ఉంది. అలాగే ఉమ్మడి కార్యనిర్వాహక బృందంలో ముందంజలో ఉంది. 2024 ఏప్రిల్–డిసెంబర్ లాభాలు 7 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు హోండా నివేదించింది. మరోవైపు వాహన అమ్మకాలు పడిపోవడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో నిస్సాన్ నష్టాలను ప్రకటించింది. దీని ఫలితంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉషీడా తన వేతనంలో 50 శాతం కోత విధించుకున్నారు. -
‘అమ్మా బంగారు తల్లీ.. కారులో అలా చేయొద్దమ్మా!’
వైరల్: కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో.. అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్‌ట్యాప్‌లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్‌లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్‌ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్‌లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు."work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025 -
ఈ లంబోర్ఘిని కార్లకు ఏమైంది? రేమండ్ ఎండీ ఆందోళన
ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘినికి (Lamborghini) చెందిన కార్ల భద్రతా ప్రమాణాల గురించి రేమండ్ (Raymond) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) ఆందోళన వ్యక్తం చేశారు. లంబోర్ఘిని కారు మంటల్లో చిక్కుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఓ పోస్ట్‌కు ఆయన స్పందించారు. లగ్జరీ ఆటోమేకర్ విశ్వసనీయత, పారదర్శకతను ప్రశ్నించిన సింఘానియా జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచించారు."లంబోర్ఘిని కి ఏమైంది? వారు ఏం చేయలేకతున్నారా? ఎందుకు ఇన్ని కార్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి? కంపెనీ నుండి ఎందుకు వివరణ లేదు? కొనుగోలుదారులు జాగ్రత్త!" అంటూ సింఘానియా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో రాశారు. లంబోర్ఘిని కార్లు మంటల్లో చిక్కుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో సింఘానియా ఈ విధంగా స్పందించారు. గతేడాది డిసెంబర్లో ముంబైలోని కోస్టల్ రోడ్లో కదులుతున్న లంబోర్ఘిని లోపల మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 45 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. "ఇలాంటి సంఘటనలు లంబోర్ఘిని విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. ధర, ఖ్యాతి దృష్ట్యా, రాజీపడని నాణ్యతను ఆశించవచ్చు. సంభావ్య ప్రమాదాలను కాదు" అని ఆయన అప్పుడు ట్వీట్ చేశారు.ఇక 2024 అక్టోబర్‌లో న్యూయార్క్‌లోని ఒక హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లంబోర్ఘిని రెవెల్టో మంటల్లో చిక్కుకుంది. ఎవరూ గాయపడనప్పటికీ, బ్రాండ్-న్యూ హైబ్రిడ్ సూపర్‌కార్ పూర్తిగా దగ్ధమైంది. 2023 మార్చిలో లాంచ్ అయిన లంబోర్ఘిని రెవెల్టో 1,001 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 6.5-లీటర్ V12 హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో విశేష దృష్టిని ఆకర్షించింది. -
రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్‌లోని దుడు రీజియన్లజజైపూర్-అజ్మీర్ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.బస్సు ముందు టైర్ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్ చేయడానికి యత్నించిన డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
కారులో షార్ట్ సర్క్యూట్: Uppal
-
డివైడర్‌ను ఢీకొట్టిన కారు : Punjagutta Circle
-
చెన్నై కారు ఛేజింగ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
చెన్నయ్: చెన్నైలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో కారు ఛేజింగ్ ఘటనలో మరో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఏడుగురు నిందితుల్లో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. చంద్రు అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు అనంతరం సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీలను పరిశీలించి ఫిబ్రవరి 1న చంద్రును అరెస్టు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్తికేయన్ (పల్లికరనై) తెలిపారు. మరో ఇద్దరు నిందితులను కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. శనివారం అరెస్టైన చంద్రుపై ఇప్పటికే కిడ్నాప్ సహా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ నేరం సమయంలో ఉపయోగించిన రెండు ఎస్‌యూవీలను ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం కారులో ఉన్న కొందరు మహిళలను డీఎంకే జెండా ఉన్న ఎస్‌యూవీలో వచ్చిన వ్యక్తులు వెంబడించి బెదిరిస్తున్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో 2025 జనవరి 25 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు ఆధారంగా తొలుత సీఎస్ఆర్ (కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్) నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం బీఎన్ఎస్, తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్గా మార్చారు. అయితే ఘటన పట్ల ప్రభుత్వ తీరుపై అన్నాడీఎంకే, బీజేపీ సహా విపక్షాలు మండిపడ్డాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే రాజకీయ సంబంధాలను పోలీసులు తోసిపుచ్చారు. టోల్ ప్లాజాల వద్ద రుసుము వసూలు చేయడానికి నిందితులు పార్టీ జెండాను ఉపయోగించారని చెప్పారు. -
వీడియో: అమ్మాయిల కారును ఛేజ్ చేసి మరీ..
తిరువొత్తియూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయిలను కారులో ఛేజ్ చేసి మరీ వేధించారు కొందరు ఆకతాయిలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.చైన్నె సమీపంలోని ముట్టుకాడు ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో గత 25వ తేదీన యువతులు కారులో వెళుతున్నారు. ఆ సమయంలో 2 కార్లలో వచ్చిన 8 మంది యువకులు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి మహిళల కారును అడ్డగించారు. తరువాత వారిని వెంబడించి బెదిరించారు. యువతులను కారుతో ఢీ కొని బెదిరించిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు కానత్తూరు పోలీసులు 5 కేసు లు నమోదు చేసి, మహిళలపై అత్యాచారం సహా 5 సెక్షన్లుగా విచారణ చేపట్టారు. ఈస్ట్‌కోస్ట్ రోడ్డు లోని నిఘా కెమెరాలు తనిఖీ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. ఒక కారు చంద్రు (26)కి చెందినది. పొత్తే రి నుంచి వచ్చిన కార్లను స్వాధీనం చేసుకుని కానత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే యువతులను బెదిరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో కొందరు కాలేజీ విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వారు ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో స్నేహితులతో కలిసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చంద్రుపై చాలా కేసులు ఉన్నట్లు విచారణలో వెలుగు చూసింది. అరెస్టు చేసినవారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. యువతులను బెదిరించిన వారి పూర్తి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.இசிஆர் சாலையில் காரில் கை குழந்தையுடன் பயணித்த குடும்பத்தினரை விரட்டி விரட்டி பின் தொடர்ந்துகாரை வழிமறித்த திமுக கொடியுடன் காரில் வந்த காம அரக்கன்கள் அராஜகம் போலீஸ் வருகிறார்கள் என்ற கூறியும் வீடு வரை பின்தொடர்ந்த ரவுடிக்கும்பல்..#Women #carchasing #Ecr #Muttukadu #DMDKITWING pic.twitter.com/mlFPKIqEZo— Senthil kumar, EXMLA ,(DMDK IT WING secretary) (@SSivan73049) January 29, 2025 -
వదిలేసిన కారులో రూ. కోటి నగదు
యశవంతపుర (కర్ణాటక): ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్‌గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
Mahakumbh: కారులో మంటలు.. అగ్నిమాపక దళం అప్రమత్తం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. తాజాగా కుంభమేళా ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ పార్క్ చేసిన ఒక కారు నుంచి మంటలు వెలువడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు సగం మేరకు దగ్ధమైపోయింది.ఈ సంఘటన గురించి అగ్నిమాపక అధికారి విశాల్ యాదవ్ మాట్లాడుతూ ‘అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి నుండి మాకు కాల్ వచ్చింది. ఒక కారు మంటల్లో చిక్కుకుందని ఆయన తెలిపారు. వెంటనే వెళ్లి మంటలను అదుపులోనికి తెచ్చాం. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు’ అని తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇదే కుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాటి సంఘటనలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గీతా ప్రెస్‌కు నష్టం వాటిల్లింది. ఈ ఘటన దరిమిలా ఎల్పీజీ భద్రతపై అధికారులు ఒక ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎల్పీజీ లీకేజీ వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కాగా మహా కుంభమేళా ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, దానిని ఎదుర్కొనేందుకు రెస్క్యూ టీమ్ 24 గంటలూ అందుబాటులో ఉంది. ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
తాగి రోడ్లపై రచ్చ
-
చింటూగాడి రివెంజ్
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుందా? అనే అనుమానాలు.. తరచూ జరిగే కొన్ని సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు కలగకమానదు. అయితే ఇక్కడో చింటూగాడి స్వీట్ రివెంట్ ఏకంగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జనవరి 17వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన కారులో బయల్దేరాడు. గల్లీ చివర అనుకోకుండా ఓ వీధి కుక్కను డ్యాష్ ఇచ్చాడు. దానికి పెద్దగా గాయాలు కాకపోయినా.. అరుస్తూ ఆ కారును కాస్త దూరం వెంబడించిందది. తిరిగి.. అర్ధరాత్రి టైంలో ప్రహ్లాద్ ఇంటికి చేరుకున్నాడు. కారును ఇంటి బయట పార్క్ చేసి ఆయన కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసేసరికి కారు మీద గీతలు పడి ఉన్నాయి. చిన్నపిల్లల పనేమో అనుకుని సీసీటీవీ ఫుటేజీ తీసి చూశాడాయన. అయితే అందులో ఓ కుక్క కారుపై కసాబిసా తన ప్రతీకారం తీర్చుకోవడం కనిపించింది. ఆ కుక్క పొద్దున ఆయన కారుతో ఢీ కొట్టిందే. ఉదయం తన కారువెంట మొరుగుతూ పరిగెట్టిన కుక్కను చూసి నవ్వుకున్న ఆయన.. అదే శునకంగారి స్వీట్ రివెంజ్‌కు, జరిగిన డ్యామేజ్‌కు ఇప్పుడు తలపట్టుకుని కూర్చుకున్నారు. ఈ వీడియోతో పాటు ఆ టైంలో తన మొబైల్‌తో ఓ వ్యక్తి తీసిన వీడియో కూడా ఇప్పుడు అక్కడ వైరల్ అవుతోంది. Sagar: फिल्मी स्टाइल में कुत्ते ने लिया अपना बदला, टक्कर मारने वाली कार को ढूंढकर मारे स्क्रैच#sagar #dog #madhyapradesh #MPNews #filmystyle #cars pic.twitter.com/rhEWZ8lyHf— Bansal News (@BansalNewsMPCG) January 21, 2025 సాధారణంగా కుక్కలకు చింటూ అని పేరు పెట్టి.. తెలుగు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ చేస్తాయో తెలిసిందే కదా. అలా ఈ చింటూగాడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
కారు ప్రమాదంలో దంపతుల మృతి: Tirupati
-
వింటేజ్ క్రేజ్ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్ స్టోరీ!
నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane) ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్‌తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్. -
అజిత్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో మరో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్‌కు రిలీజ్ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 -
చింటూని వదలొద్దు! నేను లిఖిత చచ్చిపోతున్నాం
ఘట్కేసర్: ప్రేమ విషయం ఇంట్లో చెబుతానని ఓ వ్యక్తి వేధించడంతో ప్రేమ జంట బలైంది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశురాం, బంధువులు తెలిపిన వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరామ్ (25) బతుకుదెరువు నిమిత్తం 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జమీలాపేటకు వెళ్లి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ దుకాణం నడుపుతున్నాడు. చౌదరిగూడకు చెందిన ఇంటర్ చదివే ఓ మైనర్ బాలికను శ్రీరామ్ ప్రేమించాడు. బ్లాక్మెయిల్ చేసిన దగ్గరి బంధువు... శ్రీరామ్‌తో ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బాలిక దగ్గరి బంధువు, అన్న వరుసైన చింటు (22) బ్లాక్మెయిల్ చేసి వీరివద్ద రూ. 1,35,000 తీసుకున్నాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని కాలేజ్ దగ్గరికి వెళ్లి బాలికను వేధించడమే కాకుండా, బంగారు ఉంగరం ఇవ్వాలని కోరాడు. చింటు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని, చివరికి ప్రియుడికి విషయం తెలిపింది. అదే విధంగా కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని, ప్రేమ ఓడిపోవద్దని వారం కిందటే వారిద్దరు మరణించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం షాపింగ్ వెళ్లాలని శ్రీరామ్ తన స్నేహితుడి దగ్గర ఎర్టిగా కారును తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం ప్రేమ వ్యవహారం, బ్లాక్మెయిల్ విషయాన్ని వివరిస్తూ బాలిక తండ్రికి ‘అంకుల్’ అని సంబోధిస్తూ సూసైడ్ నోట్ రాసి, తన అన్న కుమారుడికి వాట్సాప్ ద్వారా పంపించాడు. అనంతరం ఎర్టిగా వాహనంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ ఘనాపూర్ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద కారులోనే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంటలకు తాళలేక శ్రీరామ్ కారు డోరు తెరుచుకొని సర్వీస్ రోడ్డు ఫుట్‌పాత్‌పై పడి మృతిచెందాడు. బాలిక కారు ముందు సీటులో కూర్చొని గుర్తు పట్టలేని మాంసం ముద్దలా కాలి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పారు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో ఇద్దరి సజీవ దహనం ఘటనలో ట్విస్ట్ !
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో సోమవారం(జనవరి6) సాయంత్రం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమైన కేసు కొత్త మలుపు తిరిగింది. కారులో ఉన్నది ప్రేమికులైన యువతీ యువకులని తెలుస్తోంది. కొందరు యువకుల వేధింపులు భరించలేక వారు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కారులో మంటలు చెలరేగి కాలిపోయారని సమాచారం.తొలుత ఇది ప్రమాదమే అనుకున్నప్పటికీ ఘటనపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పివేసింది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం -
కాస్ట్లీ కారు లాగుతున్న ఎద్దులు
-
కారుకు డ్రైవర్లుగా మారిన ఎద్దులు
-
ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..
మార్కెట్లో ఎలాంటి కార్లు ఉన్నాయి.. బడ్జెట్ వివరాలతోపాటు మనకు కావాల్సిన ఫీచర్లు ఏ మోడళ్లలో ఉన్నాయి. ఒక ధరల శ్రేణిలో లభిస్తున్న మోడళ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి.. ఇలాంటి అంశాలన్నీ ఆన్లైన్లో తెలుసుకుంటున్నప్పటికీ అత్యధికులు షోరూంకు వెళ్లే కారు స్టీరింగ్ పడుతున్నారట. ప్రత్యక్షంగా ఔట్‌లెట్‌కు వెళ్లి పరిశీలించిన తర్వాతే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారని అర్బన్ సైన్స్ సర్వేలో తేలింది. భారత్‌తోపాటు యూఎస్, జర్మనీ, యూకే, చైనా, మెక్సికో నుంచి 9,000 పైచిలుకు మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. భారత్‌లో 10 మంది కార్ల కొనుగోలుదార్లలో దాదాపు 9 మంది షోరూంను సందర్శించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.నమ్మదగిన విధానం..ఇలా ఔట్‌లెట్‌కు వెళ్లడాన్ని ఒక ప్రధాన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి నమ్మదగిన విధానంగా కస్టమర్లు భావిస్తున్నారు. కారును కొనుగోలు చేయడంలో కుటుంబ పాత్ర ఉంటుంది. షోరూంలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నేరుగా వెళ్లడం వల్ల కార్లను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇటువంటి అనుభవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఇవ్వలేవు. డీలర్‌షిప్‌లు నమ్మకాన్ని పెంపొందిస్తాయి, వ్యక్తిగతీకరించిన డీల్స్ ఉంటాయి. సంబంధాలు పెంపొందించబడతాయి. అమ్మకాల తర్వాత మద్దతు కూడా ఉంటుందన్నది కస్టమర్ల భావన. ఇందుకు అనుగుణంగా కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తయారీ సంస్థలు నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి. ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్లాన్ఆన్లైన్లో బ్రౌజింగ్..సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రస్తుతం భారతదేశ ఆటోమోటివ్ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిజిటల్ వేవ్ క్రమంగా ఊపందుకుంటోంది. యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు షోరూమ్‌లోకి అడుగుపెట్టే ముందు ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నారు. డీలర్‌షిప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రెండూ భవిష్యత్తులో కొనసాగుతాయి. సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రత్యేకంగా అందించే నమ్మకాన్ని, వ్యక్తిగత సంబంధాలను కాపాడుకుంటూ.. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి సరైన సమతూకం సాధించడం చాలా అవసరం’ అని సర్వేలో వెల్లడైంది. -
ఉసురు తీసిన కంటైనర్ లారీ
ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దుల్లో పుట్టి పెరిగి, బెంగళూరుకు వచ్చారు. ఓ ఐటీ కంపెనీ నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. వీకెండ్, క్రిస్మస్ను సొంతూరిలో సంతోషంగా చేసుకుందామని కుటుంబంతో పయనమయ్యారు. కానీ అదే చివరి ప్రయాణమైంది. గంట దాటిందో లేదో.. మృత్యుఘంటికలు మోగాయి. కంటైనర్ లారీ యమ శకటంలా వచ్చి ఆ కారు మీద పడింది. అంతే.. కుటుంబ యజమానితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. రోడ్ టెర్రర్ విషాదానికి ఇది తాజా ఉదాహరణ.దొడ్డబళ్లాపురం: రాజధాని సమీపంలో తుమకూరు– బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కంటైనర్ లారీ.. కారు మీదకు పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), సతీమణి గౌరాబాయి(42), పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు. కొంత సేపటికే.. వివరాలు.. విజయపుర– మహారాష్ట్ర సరిహద్దులకు చెందిన చంద్రం యోగప్ప బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటూ ఓ చిన్నస్థాయి ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీకెండ్‌తో పాటు క్రిస్మస్ పండుగకని సొంత ఓల్వో కారులో ఊరికి బయల్దేరారు. గత అక్టోబరులో కొత్త ఓల్వో కారును కొన్నట్లు తెలిసింది. శనివారం ఉదయం సుమారు 9:30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరినట్లు తెలిసింది. 60 కిలోమీటర్లు ప్రయాణించారో లేదో... ఈ దారుణ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో చంద్రం కారును నడుపుతున్నారు. కంటైనర్ అతివేగం.. ⇒ బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ⇒ బెంగళూరు వైపు నుంచి అనేక వాహనాలు తుమకూరు వైపు వెళ్తున్నాయి. వీకెండ్ కావడంతో హైవే రద్దీగా ఉంది. ⇒ కంటైనర్ లారీ, పక్క లేన్‌లో చంద్రం కుటుంబం ఓల్వో కారు వెళ్తోంది. కంటైనర్ ముందు వెళ్తున్న నందిని పాల వ్యాన్, కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి లేన్ దాటి వెళ్లింది, అలా చంద్రం ఓల్వో కారు మీద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ⇒ ఈ రభసకు కారు పూర్తిగా తుక్కయింది. కారులోని వారికి ఏం జరిగిందో తెలిసేలోగా నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కంటైనర్‌తో పాటు పాల వ్యాన్ బోల్తా పడగా, ఆ డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల చొరవ వెంటనే స్థానిక యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కంటైనర్ కింద నుంచి కారును బయటకు తీయడానికి శ్రమించారు. క్రేన్లను తెప్పించి కంటైనర్‌ను పక్కకు జరిపించారు. ఇంతలో స్థానిక పోలీసులు చేరుకున్నారు. అతి కష్టం మీద కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ఉదయం 11 గంటలకు దుర్ఘటన జరిగితే మధ్యాహ్నం 1 గంట వరకు కారును బయటకు లాగే పని కొనసాగింది. ఈ ప్రమాదంలో హైవేలో అటు ఇటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం నెలకొంది. వాట్సాప్ గ్రూప్‌లలో ఈ సమాచారం వేగంగా వ్యాపించింది. తమ యజమాని కుటుంబం దుర్మరణం పాలైందని తెలిసి హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ కంపెనీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీలో 100మందిపైగా పని చేస్తున్నారు. కొందరు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. మరికొందరు లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. విజయపుర వద్ద మొరబగి గ్రామంలో ఉండే యోగప్ప తల్లితండ్రులయిన ఈరగొండ, జక్కవ్వలకు ప్రమాదం విషయం ఇంకా చెప్పలేదని తెలిసింది.అలా జరిగిపోయింది కంటైనర్ డ్రైవర్దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఈ ఘోరం జరిగిందని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ చెప్పాడు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో ఢీకొనకుండా తప్పించబోయి స్టీరింగ్ తిప్పడంతో వాహనం పక్కకి దూసుకుపోయిందన్నాడు. ఇంత ఘోరం జరిగినట్టు తనకు తెలీదని, విషయం తెలిసి చాలా భాధగా ఉందని ఆరిఫ్ అన్నారు. మరోవైపు ప్రమాదంపై నెలమంగల డీఎస్పీ జగదీష్ సమగ్ర విచారణ చేయనున్నారు. -
జర్మనీలో కారు బీభత్సం.. ప్రమాదంలో 68మందికి గాయాలు
బెర్లిన్ : జర్మనీలో ఓ డాక్టర్ బీభత్సం సృష్టించారు. మాగ్డేబర్గ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్లోకి తన బీఎండబ్ల్యూ కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 68 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి కారణమైన డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు జర్మన్ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ (ముఖ్యమంత్రి)ప్యూర్ హాసెలాఫ్ తెలిపారు. సౌదీ అరేబియాకు చెందిన 50ఏళ్ల డాక్టర్ 2006నుంచి జర్మనీలో నివాసం ఉంటున్నారు. డాక్టర్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.ప్రమాదంపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి మథియాస్ షుప్పె మాట్లాడుతూ నిందితుడు ఉద్దేశపూర్వకంగా తన కారుతో మార్కెట్లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా శుక్రవారం సాయంత్రం 7గంటల సమయంలో నిందితుడు తన కారుతో ఎటునుంచి వచ్చాడో తెలియదు. మార్కెట్లోకి అత్యంత వేగంతో వచ్చాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే కావాలనే చేసినట్లు అనిపిస్తుంది.ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 2016లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. దీంతో తాజా ప్రమాదంపై సంఘ విద్రోహ చర్య అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.🚨 2 Dead, 60 Injured in German Christmas Market Attack 🚨A car plowed into a bustling Christmas market in Magdeburg, Germany, killing two people, including a toddler, and injuring over 60 others in what authorities are calling a deliberate act, potentially linked to terrorism.… pic.twitter.com/8o6zVv62Vu— CanAm Network (@Canam_Network) December 21, 2024 2016లో ఇదే తరహా దాడిఎనిమిదేళ్ల క్రితం జర్మన్ రాజధాని బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి జరిగింది. డిసెంబర్ 19, 2016న రద్దీగా క్రిస్మస్ మార్కెట్లో తన కారుతో ఓ ఇస్లామిక్ తీవ్రవాది ట్రక్కుతో దూసుకొచ్చాడు. ఈ దుర్ఘటనలో 13మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు రోజుల తర్వాత నిందితుణ్ని జర్మనీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. Police arresting the Attacker 50-year-old Saudi doctor in Magdeburg, Germany#Terroristattack #Germany #Magdeburg #Weihnachtsmarkt #MagdeburgAttack #MagdeburgerWeihnachtsmarkt #festundflauschig pic.twitter.com/JO1nuTLal5— Chembiyan (@ChembiyanM) December 20, 2024 -
వింటేజ్ కారు ధర రూ.3,675!
మీరు చదివిన శీర్షిక నిజమే. కానీ అది 2024లో కాదండోయ్.. 1936లో సంగతి. అప్పట్లో చేవ్రొలెట్ కంపెనీ ఇచ్చిన వార్తాపత్రిక ప్రకటనను ఇటీవల కార్‌బ్లాగ్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం చేవ్రొలెట్ కంపెనీ 1936 సంవత్సరంలో 5 సీటింగ్ కెపాసిటీ ఉన్న వింటేజ్ కారును రూ.3,675కే ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. అలెన్ బెర్రీ అండ్ కో.లిమిటెడ్ అనే ఏజెన్సీ కలకత్తా, ఢిల్లీ, లఖ్‌నవూ, దిబ్రూఘర్ ప్రాంతాల్లో దీన్ని ఆ రేటుకు అందిస్తున్నట్లు పేర్కొంది. 1936లో రూ.3,675 విలువ 2024లో రూ.3,67,50,000గా ఉందని అంచనా.మరో ప్రకటనలో ఓపెన్‌టాప్ చేవ్రొలెట్ మోడల్ కార్ ధర రూ.2,700 అన్నట్లు ప్రకటనలో ఉంది. దీన్ని లఖ్‌నవూలోని ఎడుల్జీ అండ్ కో మోటార్ ఇంజినీర్స్ అండ్ కోచ్ బిల్డర్స్ కంపెనీ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 5 సీటర్ బడ్జెట్ కార్లు రూ.లక్షల్లో ఉన్నాయి. ఏళ్లు గడుస్తుంటే డబ్బు విలువ పడిపోయి లక్షలకు విలువ లేకుండా పోతుంది. దాంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. View this post on Instagram A post shared by Car Blog India (@carblogindia)ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..ఈ రెండు ప్రకటనలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేనూ ధనవంతుడినే కానీ, వేరే శతాబ్దంలో ఉన్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘ఆ రోజుల్లో అది చాలా ఖరీదు’అని రిప్లై ఇచ్చారు. -
నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.నీతా అంబానీ పవర్ లుక్!ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్లుక్లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా పింక్ హ్యాండ్బ్యాగ్ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన పింక్ హ్యాండ్‌బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. -
Konaseema: ఏపీలో ఘోర ప్రమాదం
-
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
ఐదుగురు యువకులు జలసమాధి
భూదాన్ పోచంపల్లి: వారంతా 25 ఏళ్లలోపు యువకులు.. కలసి తిరిగే స్నేహితులు.. సరదాగా షికారుకు బయలుదేరారు.. మధ్యలో మద్యం తాగారు.. ఆపై కల్లుతాగాలనే కోరిక పుట్టింది.. దానికోసం వెళుతుంటే, పొగమంచులో దారి సరిగా కనిపించక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. మృతులంతా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారే. ఆరుగురు కలసి వెళ్లి.. ఎల్బీ నగర్ ప్రాంతంలోని సిరినగర్ కాలనీకి చెందిన తీగుళ్ల వంశీగౌడ్ (23), ఇంద్రపల్లి హర్షవర్ధన్ (22), వీరమల్ల విఘ్నేశ్వర్(20), ఆర్టీసీ కాలనీకి చెందిన కలకోటి అక్షయ్‌కుమార్ అలియాస్ బల్లు (19), వాస్తుకాలనీకి చెందిన జెల్ల వినయ్ (21), బోడుప్పల్ జ్యోతినగర్ కాలనీకి చెందిన మేడబోయిన మణికంఠయాదవ్ (21) స్నేహితులు. శుక్రవారం రాత్రి వీరంతా ఎల్బీ నగర్లో కలసి పార్టీ చేసుకొందామని అనుకున్నారు. తీగుళ్ల వంశీగౌడ్ తన ఇంటి వద్ద ఓ స్నేహితుడు పెట్టివెళ్లిన కారు ఉండటంతో.. దానిని తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయలుదేరారు.మార్గమధ్యలో అంబర్‌పేట వద్ద మద్యం తాగారు. అక్కడే రెండు గంటల పాటు గడిపారు. ఆ సమయంలో వారికి ఈతకల్లు తాగాలని కోరిక పుట్టింది. దీనితో సుమారు 3.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లికి వచ్చారు. ఇంకా చీకటిగానే ఉండటంతో అక్కడే టీ తాగారు. టిఫిన్ చేసి వద్దామనుకుని కొత్తగూడెం ఎక్స్ రోడ్డు వద్దకు వెళ్లారు. టిఫిన్ సెంటర్లు తెరవకపోవడంతో తిరిగి పోచంపల్లికి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న వంశీ కారు నడుపుతున్నాడు. అయితే మధ్యలో అటవీ ప్రాంతం కావడం, తెల్లవారుజాము సమయం కావడంతో పొగమంచు దట్టంగా కప్పుకొంది. దానితో రోడ్డు సరిగా కనిపించక వంశీ ఒక్కసారిగా కారు హ్యాండ్ బ్రేక్ వేశాడు. వేగంగా ఉన్న కారు దీనితో అదుపుతప్పి పక్కనే ఉన్న జలాల్పురం చెరువులోకి బోల్తా కొట్టింది. ఈత రాక, బయటపడలేక.. కారులో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న మణికంఠ కారు సైడ్ అద్దం కొద్దిగా తెరిచి ఉంటడంతో దానిని కాలుతో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారు నడుపుతున్న వంశీ, వెనుక సీట్లో కూర్చున్న అక్షయ్, వినయ్, హర్షవర్ధన్, విఘ్నేశ్వర్ నీట మునిగి ప్రాణాలు వదిలారు. ఒడ్డుకు చేరిన మణికంఠ రోడ్డుపై వెళ్తున్న పాల వ్యాపారిని ఆపి ప్రమాదం గురించి చెప్పాడు. ఆ వ్యాపారి 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై భాస్కర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. నీట మునిగిన కారును జేసీబీతో వెలికితీయించి.. అందులోని మృతదేహాలను బయటికి తీశారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతా పేద కుటుంబాల వారే జల సమాధి అయిన ఐదుగురు యువకులు కూడా పేద కుటుంబాలకు చెందినవారే. ఇందులో వంశీగౌడ్ ఇంటర్ పూర్తి చేసి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతడి తండ్రి శంకర్ ఆటోడ్రైవర్కాగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ఇక అక్షయ్‌కుమార్ ఇంటర్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి తండ్రి నర్సింహాచారి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. జెల్ల వినయ్ ఇంటర్ చదివాడు. అతడి తండ్రి జగన్నాథం చేనేత కారి్మకుడు. హర్షవర్ధన్ డిగ్రీ పూర్తి చేశాడు. ర్యాపిడో బైక్ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరమల్ల విఘ్నేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. అతడి తండ్రి సత్యనారాయణ ఆర్టీసీ కండక్టర్ అని తెలిసింది. అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చాను పార్టీ చేసుకొందామని ఫ్రెండ్స్ చెబితే రాత్రి ఎల్బీ నగర్‌కు వచ్చాం. వంశీ కారు తీసుకొచ్చాడు. ఆరుగురం కలసి రాత్రి 12 గంటలకు బయలుదేరాం. రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద ఏదో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామైతే గంటపైగా అక్కడే ఉన్నాం. కల్లు దొరుకుతుందని రాత్రి 3.30 గంటలకు పోచంపల్లికి వచ్చాం. ఇంకా తెల్లరకపోయేసరికి టిఫిన్ చేయడానికి కొత్తగూడెం ఎక్స్‌రోడ్డుకు వచ్చి తిరిగి పోచంపల్లికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనబడక సడన్‌గా హ్యాండ్ బ్రేక్ వేసిండు. కారు పల్టీ కొట్టి చెరువులో బోల్తా పడింది. డోర్లు తెరుచుకోలేదు. ముందు సీట్లో ఉన్న నేను కారు సైడ్ అద్దాన్ని కాలితో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాను. డోర్లు తెరుచుకుని ఉంటే అంతా ఎలాగోలా బయటపడేవారు. – మణికంఠ యాదవ్, (ప్రాణాలతో బయటపడిన యువకుడు) రాత్రి 11 గంటల దాకా ఇంటివద్దే ›ఉన్నాడు మేం ముగ్గురం అన్నదమ్ములం. వంశీ రెండోవాడు. పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. రాత్రి 11 గంటల వరకు అంతా ఇంటి వద్దే ఉన్నారు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లారు. ఉదయం నేను జిమ్‌కు వెళ్తుంటే తెలిసినవారు మీ తమ్ముడు చనిపోయాడని, స్నాప్‌చాట్‌లో ఫొటోలు వచ్చాయని చెప్పడంతో చూసి షాక్ అయ్యాం. – తిగుళ్ల ఉదయ్‌కుమార్ (మృతుడు వంశీ సోదరుడు) -
పార్కింగ్ గొడవ: 600 కిలోమీటర్లు తీసుకెళ్లి కారుకు నిప్పెట్టాడు
ఢిల్లీ : పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఓ వ్యక్తి తన పొరిగింటికి చెందిన ఓ కారుకు నిప్పంటించాడు. దహనం చేసేందుకు ఆ కారును సుమారు 600 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లడం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో రాహుల్ భాసిన్, రంజీత్ చౌహాన్లు నివాసం ఉంటున్నారు. అయితే వారిద్దరి మధ్య పార్కింగ్ విషయంలో నిరంతరం గొడవ జరుగుతుండేది. తాజాగా గత వారం రాహుల్‌కు రంజిత్‌కు పార్కింగ్ విషయంలో మరోసారి గొడవపడ్డారు.దీంతో కోపోద్రికుడైన రాహుల్..రంజీత్ మీద ప్రతీకారం తీసుకోవాలని అనుకున్నారు.ఇందుకోసం రంజీత్ కారును అపహరించాడు. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ వైపు సుమారు 600 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అనంతరం, రంజిత్ కారుకు నిప్పుపెట్టాడు.ఆ మరుసటి రోజు ఉదయం తన కారు కనిపించడం లేదంటూ రంజిత్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.చివరకు టెక్నాలజీ సాయంతో రంజిత్ కారును ఉత్తరప్రదేశ్ అమేథీ సమీపంలో దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో కారును గుర్తించారు. సీసీటీవీ పుటేజీల్లో రాహుల్, అతని స్నేహితులు కలిసి రంజిత్ కారును దగ్ధం చేసినట్లు నిర్ధారించారు.ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్‌కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్ రోల్స్ రాయిస్ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..లేటెస్ట్ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్ సింగ్‌కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్‌ను చూస్తే ఇది తెలుస్తుంది. ఇంకా తన కార్ల కలెక్షన్లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.ఆనంద్ మహీంద్రా నుంచి..విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్‌కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్‌ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్‌లో ఈ క్రూయిజర్ మోటార్‌బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్‌పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్‌లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా. -
వాహనం చిన్నదే.. ప్రయోజనాలు ఎన్నో: దీని రేటెంతో తెలుసా?
-
THAR కార్ ని బొంద పెట్టిన శాడిస్ట్..
-
భోగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,విజయనగరంజిల్లా: భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం(నవంబర్30) ఘోర ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు అదుపుతప్పింది.దీంతో కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్డుపైకి దూసుకెళ్లింది.అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. -
రూ.12 కోట్ల విలువైన కారు కొన్న 'వినయ విధేయ రామ' నటుడు
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్రాండ్ కారును సొంతం చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి లగ్జరీ కారు డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.వివేక్ తన తల్లిదండ్రులు సురేశ్, యశోధర, భార్య ప్రియాంకతో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. సిల్వర్ గ్రే కలర్ ఉన్న రోల్స్ రాయిస్ కుల్లినన్ కారు ధర మనదేశంలో దాదాపు రూ.12.25 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ ఒబెరాయ్ చివరిసారిగా 2019లో పీఎం నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్స్ బయోపిక్‌లో నటించారు.అంతేకాకుండా మలయాళం, కన్నడతో పాటు తెలుగు చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామలోనూ కీలక పాత్ర పోషించారు. సినిమాలతో పాటు ఇన్సైడ్ ఎడ్జ్, ధారవి బ్యాంక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
పోలీసులకు మహిళ బెదిరింపులు
లింగోజిగూడ: తన భర్త వద్ద ఉన్న కారు బంగారు, నగదును ఇప్పించాలని పోలీసులను కోరిన మహిళ అందుకు వారు నిరాకరించడంతో పోలీసులపైనే బెదిరింపుకు పాల్పడిన సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్, మునగనూర్‌లో నివాసం ఉంటున్న కాటమోని పావని తన మొదటి భర్త గోపీతో విడాకులు తీసుకుని ఐదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన గోరుకంటి శ్రీకాంత్‌ను రెండో వివాహం చేసుకుంది. శ్రీకాంత్ స్థానికంగా పురోహితం చేస్తుండగా, పావని జూనియర్ లాయర్‌గా పని చేసేది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెలలో శ్రీకాంత్ ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పావనీ మీర్‌పేట పోలీస్టేషన్లో తన భర్త తన నుంచి దూరంగా వెళ్లిపోయాడని అతడి తల్లి పద్మ పేరున ఉన్న కారుతో పాటు బంగారం, నగదు తనకు ఇప్పించాలని ఫిర్యాదు చేసింది. సివిల్ కేసు కావడంతో తమ పరిధిలోకి రాదని పోలీసులు తేల్చి చెప్పారు.దీంతో ఆమె గత నెల 16న తన భర్త కనిపించడం లేదంటూ హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కర్నూలులో ఉన్నట్లు గుర్తించి అతడిని పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. అతను పావనీతో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో వదిలేశారు. దీంతో ఆమె అతడి వద్ద ఉన్న కారు, బంగారం, నగదు ఇప్పించాలని కోరడంతో వారు కారు, కొంత నగదును ఇప్పించారు. అయినా సంతృప్తి చెందని పావని బంగారం మరింత నగదు కోసం డిమాండ్ చేయడంతో అది తమ పని కాదని సివిల్ తగదాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 23న హయత్‌నగర్ పోలీస్టేషన్లో తన భర్త శ్రీకాంత్, అతని సోదరుడు దుర్గప్రసాద్‌తో కలిసి వేధింపులకు గురి చేస్తున్నారని, దుర్గప్రసాద్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై ఆరోపణలు పావనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ సైదులు కేసు వివరాలు తెలుసుకునేందుకు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో పాటు సీపీకి ఫిర్యాదు చేసినట్లు సామాజిక మధ్యమాల్లో వార్త సంచలనమైంది. మా పరిధి కాదన్నందుకే.. సివిల్ తగదాలు తాము పరిష్కరించమని, కోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతోనే పావనీ ఎస్ఐ సైదులుతో పాటు తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని హయత్‌నగర్ సీఐ నాగరాజ్‌గౌడ్ అన్నారు. పావని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. -
అంబులెన్స్‌కు దారివ్వని కారు.. షాకిచ్చిన పోలీసులు!
రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.దీంతో ఆ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్‌కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024 -
అంబులెన్స్ కు దారి ఇవ్వని కారు డ్రైవర్
-
కారు ఓనర్‌కి పోలీసుల షాక్.. అంబులెన్స్‌కి దారి ఇవ్వలేదని..
తిరువనంతపురం: కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.2.5 లక్షల జరిమానా విధించడంతో అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు కారు యాజమాని దారి ఇవ్వలేదు. పేషెంట్‌ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతీ సియాజ్ కారు నడుపుతున్న ఓ వ్యక్తి మాత్రం దారి ఇవ్వలేదు. అయితే, కారు యజమాని ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని స్పష్టమవుతోంది.అయితే, అంబులెన్స్ ముందు కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో రికార్డ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వెంటనే స్పందిస్తూ.. నేరుగా ఆ కారు యాజమాని ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లారు. రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వీడియో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేవు.A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn— MDApp (@MDAppMDApp) November 17, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన అమరన్ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by ShyaM Mohan M (@shyammeyyy) -
జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలోని జుహాయి నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని స్పోర్ట్స్ సెంటర్ బయట గుమిగూడి ఉన్న జనంపైకి అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది.ఈ ప్రమాద ఘటనలో 35 మంది మరణించగా 43 మంది దాకా గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇదీ చదవండి: కెనడా ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు -
పెళ్లి ఇంట విషాదం
జగిత్యాల: ఆర్టీసీ బస్సు కారు ను ఢీకొన్న సంఘటనలో నవవధువు సోదరుడు, ఆమె స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన వలిపిరెడ్డి రాజమల్లు, లక్ష్మి కూతురు సంఘవి పెళ్లి ఈనెల 8న జనగామకు చెందిన ఓ యువకుడితో హన్మకొండలో జరిగింది.శనివారం రాత్రి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న సంఘవి సోదరుడు సంకీర్తన్ (30), హైదరా బాద్‌లో సంఘవితో కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన సాధు మునిరాజీ (25)తోపాటు తల్లి లక్ష్మి, తండ్రి రాజమల్లు కారులో జగిత్యాలకు వస్తున్నారు. ధరూర్ సమీపంలోకి రాగానే జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వీరి కారును ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సంకీర్తన్తోపాటు మునిరాజీ అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మి, రాజమల్లు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.రూరల్ సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంకీర్తన్ మేనమామ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. పెళ్లైన రెండురోజులకే సోదరుడితో పాటు స్నేహితురాలు మృతి చెందడంతో సంఘవి తీవ్రంగా రోదించింది. గాయాలతోనే ఉన్న తండ్రి రాజమల్లు సంకీర్తన్ చితికి నిప్పంటించడం స్థానికులను కలచివేసింది.


