
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి 30 లక్షల విలువైన టయోటా కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఈ దిపావళికి సరికొత్త బహుమతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త కారుతో దిగిన ఫోటోలను తన తల్లిదండ్రులతో కలిసి ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా ఇదే కారును కొనుగోలు చేశారు. పలువురు బాలీవుడ్ అగ్రతారలు సైతం ఈ ఖరీదైన కారును కొన్నారు.
అయితే ఈ ఏడాది ప్రారంభంలో సమయ్ రైనా తన యూట్యూబ్ షోలో ఇండియాస్ గాట్ లాటెంట్‌పై వివాదం మొదలైంది. ఈ వివాదం తర్వాత అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్‌లను తన యూట్యూబ్ నుంచి తొలగించారు. వివాదం జరిగిన కొన్ని నెలల తర్వాత సమయ్ రైనా భారత్‌లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టు 15న బెంగళూరులో మొదలైన ప్రదర్శన ముంబయి, కోల్‌కతా, చెన్నై, పూణే, ఢిల్లీ లాంటి నగరాల్లో తన షోలు నిర్వహించాడు.