ద్రౌపది-2 సాంగ్.. చిన్మయికి డైరెక్టర్‌ స్ట్రాంగ్ కౌంటర్..! | Draupathi 2 Movie Song Director Mohan Responds On Chinmayi tweet | Sakshi
Sakshi News home page

Draupathi 2 Movie Song: ద్రౌపది-2 సాంగ్.. చిన్మయికి డైరెక్టర్‌ స్ట్రాంగ్ కౌంటర్..!

Dec 3 2025 9:50 PM | Updated on Dec 3 2025 9:50 PM

Draupathi 2 Movie Song Director Mohan Responds On Chinmayi tweet

రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మూవీ నుంచి నెలరాజెఅంటూ సాగే పాటను విడుదల చేశారు.

అయితే పాటను తమిళంలో ఏం కోనే అంటూ సాగే పాటను చిన్మయి ఆలపించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ పాటను పాడినందుకు క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు. పాట రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేప‌థ్యం గురించి తనకు తెలియకపోవ‌టం వ‌ల్ల పాడానని తెలిపింది. ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుంచే నేను ఇందులో భాగం అయ్యేదాన్ని కాద‌ని వెల్లడించారు. దీనికి కారణం డైరెక్టర్ మోహన్ అంటూ పోస్ట్ చేసింది.

డైరెక్టర్ రియాక్షన్..

చిన్మ‌యి క్ష‌మాప‌ణ చెబుతూ ట్వీట్ చేయడంపై చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్‌ జి స్పందించారు. ఈ పాట‌ను పాడ‌టానికి తాను ప‌ర్స‌న‌ల్‌గా చిన్మ‌యి అయితేనే బాగుంటుందని పాడించాన‌ని పేర్నొన్నారు. రికార్డింగ్ స‌మ‌యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్‌ అందుబాటులో లేక‌పోవ‌టంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విష‌యాల‌ను మాత్ర‌మే వివ‌రించాన‌ని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. త‌న‌తో కానీ, సంగీత ద‌ర్శ‌కుడితో కానీ మాట్లాడ‌కుండా, ఎలాంటి వివ‌ర‌ణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిద‌న్నారు. దీనిపై చిన్న‌యి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదంటే ట్వీట్‌ను తొల‌గించాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేయాల‌నుకుంటే చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను కాకుండా త‌న‌ను విమ‌ర్శించాల‌ని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా మేకింగ్‌లో భాగ‌మైన ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌టం పిరికిత‌నమ‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ పేర్కొన్నారు. చిన్మ‌యి త‌న మెసేజ్‌లో పేర్కొన్న వ్య‌తిరేక భావ‌జాలం గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ చిన్మ‌యి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియ‌జేస్తోందన్నారు. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయ‌న వెల్లడించారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement