త్వరలోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. చూస్తుండగానే రోజులు అలా గడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అందరూ కొత్త ఏడాది స్వాగతం పలకడానికి సమయం ఆసన్నమైంది. మరి సినీ ఇండస్ట్రీలో 2025లో కలిసొచ్చిందా? ఎంతమందికి స్టార్స్ హోదాను దక్కించుకున్నారు. ఇండియా సినీ చరిత్రలో ఈ ఏడాది అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న నటీమణులు, హీరోలు ఎవరు? 2025లో ఎంట్రీ స్టార్డమ్ను దక్కించుకున్న యంగ్ హీరోయిన్స్, హీరోలు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
2025లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న స్టార్స్ లిస్ట్ను ప్రముఖ సినీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన హీరోయిన్స్, హీరోల జాబితాను వెల్లడించింది. ఈ సారి అత్యధికంగా బాలీవుడ్తో పాటు దక్షిణాది తారలు సైతం సత్తా చాటారు. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రుక్మిణి వసంత్, కల్యాణి ప్రియదర్శన్ నిలిచారు. కాగా.. 2025లో ఆమె ఛావా, సికందర్, థామా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి చిత్రాలతో మెప్పించింది. రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్-1తో ఆడియన్స్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. కల్యాణి ప్రియదర్శన్ కొత్తలోక: చాప్టర్- 1 మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది.
బాలీవుడ్ మూవీ సయారాతో సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క సినిమాతోనే వీరిద్దరు టాప్లో నిలవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మోహిత్ సూరి డైరెక్టర్ల లిస్ట్లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన సయారా బాక్సాఫీస్ వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఐఎండీబీ- 2025 లిస్ట్..
టాప్-10 సినీ స్టార్స్ వీళ్లే...
అహాన్ పాండే (సయారా)
అనీత్ పడ్డా (సయారా)
ఆమిర్ ఖాన్ (సితారే జమీన్ పర్)
ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్)
లక్ష్య (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
రష్మిక మందన్నా (ఛావా, సికిందర్, థామా, కుబేర)
కల్యాణి ప్రియదర్శన్ ( కొత్త లోకా చాప్టర్1)
త్రిప్తి డిమ్రి (ధడక్2)
రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్1)
రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్1)
టాప్-10 ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లే..
మోహిత్ సూరి (సయారా)
ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
లోకేశ్ కనగరాజ్ (కూలీ)
అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్)
పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్2: ఎంపురాన్)
ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్)
అనురాగ్ బసు (మోట్రో ఇన్ దినో)
డోమినిక్ అరుణ్ (కొత్త లోకా చాప్టర్1)
లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)
నీరజ్ ఘేవాన్ (హోమ్ బౌండ్)


