breaking news
Kalyani Priyadarshan
-
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్ 1 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది.కలలో కూడా అనుకోలేఅయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్‌కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫోన్ చేయడంతో..కానీ, సడన్‌గా ఒకసారి నాగార్జున ఫోన్ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. సినిమా తప్ప..ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్‌కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్ పవన్ -
రణవీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ప్రియదర్శి..
-
చీరలో అనసూయ ఇలా.. పెళ్లిలో ధనశ్రీ అలా
చీరలో కుందనపు బొమ్మలా యాంకర్ అనసూయఫ్రెండ్ పెళ్లిలో మెరిసిపోతున్న ధన శ్రీ వర్మటైట్ ఫిట్ డ్రస్‌లో కేథరిన్ గ్లామరస్ ధమాకాఆరెంజ్ కలర్ చీరలో అతుల్య అదిరిపోయేలాబ్లాక్ ఔట్ ఫిట్‌లో కృతి శెట్టి క్లోజప్ పోజులుబ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో కల్యాణి ప్రియదర్శన్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) View this post on Instagram A post shared by Teju ashwini (@teju_ashwini) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు స్నేహ.. ఫిబ్రవరిలో సమంత ఇలా!
ప్రీ వెడ్డింగ్ పార్టీ కోసం అందంగా అల్లు స్నేహఫిబ్రవరి జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్న సమంతమెరుపుల చీరలో రచ్చ లేపుతున్న ధనశ్రీ వర్మకాటన్ చీరలో మరింత అందంగా హెబ్బా పటేల్వెబ్ సిరీస్ జ్ఞాపకాలతో 'రాజాసాబ్' బ్యూటీ రిద్ధిహాలీవుడ్ బొమ్మలా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Sapthaami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
మండపంలో విరోష్ ఆనందభాష్పాలు.. కల్యాణి పోస్ట్
గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.ఇది నా అదృష్టంవారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.ఆనంద భాష్పాలుఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్‌కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.చదవండి: విరోష్ పెళ్లి.. ఇద్దరూ ఎంత చదువుకున్నారంటే? -
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
కలర్‌ఫుల్ డ్రెస్‌లో నిహారిక.. జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ రమ్య..!
కొత్త లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లేటేస్ట్ లుక్..కలర్‌ఫుల్ డ్రెస్‌లో టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల..వైట్ డ్రెస్‌లో వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా..జిమ్‌లో చెమట్చోడుస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ రమ్య మోక్ష..శారీలో నటి నిక్కీ గల్రానీ అందాలు.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Ramya moksha kancharla (@ramya_moksha) View this post on Instagram A post shared by Archana Singh Rajput (@rajput_archanasingh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
కొత్త లోకా బ్యూటీ ఢిల్లీ టూర్.. కృతి శెట్టి గ్లామరస్ లుక్..!
కొత్త లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ఢిల్లీ టూర్..స్టైలిష్ డ్రెస్‌లో శ్వేతా మీనన్ గ్లామరస్ లుక్స్..బాలీవుడ్ భామ కుబ్రా సైత్ డిఫరెంట్ లుక్..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గ్లామరస్ పోజులు..కలర్‌ఫుల్ డ్రెస్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్.. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) View this post on Instagram A post shared by Shwetha Menon (@shwetha_menon) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
భాషతో సంబంధం లేదు.. నచ్చితే ఓకే చెప్తా: కల్యాణి ప్రియదర్శన్
ఇటీవల 'లోకా: ఛాప్టర్ 1 - చంద్ర' చిత్రంతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న నటి 'కల్యాణి ప్రియదర్శన్'. అందులో సూపర్ హీరో పాత్రలో నటించి మలయాళంతో పాటు, తమిళం తెలుగు, ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా మాతృభాషతో పాటూ తెలుగు, తమిళం భాషల్లో కథానాయికిగా నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ లోకా చిత్రం తరువాత తనకు పలు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే మంచి పాత్ర అని అనిపిస్తే నటించడానికి సిద్ధమని పేర్కొన్నారు. మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలను తాను ఎప్పుడు వేర్వేరుగా చూడనన్నారు. కథ చెప్పడం అన్నది ప్రపంచ భావోద్వేగం అన్నారు. ఒక మంచి కథలో నటించే అవకాశం వస్తే పూర్తి సమయాన్ని కేటాయించి, మనసుపెట్టి నటించడానికి తాను ఎప్పుడు సిద్ధమే అన్నారు. కాగా ఈమె రవి మోహన్ సరసన నటించిన జీనీ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం కార్తీ కి జంటగా మార్షల్ చిత్రంలో నటిస్తున్నారు. మరిన్ని చిత్రాలు తన కోసం ఎదురుచూస్తున్నట్లు తను∙స్వయంగా చెప్పారు. అదేవిధంగా తనకు సూపర్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన లోకా చిత్రానికి పార్ట్ –2 కూడా ఉంది. ఇందులో కూడా ఆమె నాయకగా నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ధురంధర్ హీరో సరసన..ధురంధర్ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ప్రళయ్' (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కల్యాణి యాక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.అన్నీ నాకే కావాలి!మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.ప్రళయ్ సినిమా!ప్రళయ్ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్ హిందీ సినిమా ప్రళయ్ అవుతుంది.చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్ నిర్మాత భావోద్వేగం -
కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్‌కు 'లోక' ఆఫర్!
మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం లోక. కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ ఉమెన్ చిత్రం లోక. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొత్త లోక: చాప్టర్ 1 పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. 2025 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కల్యాణి ప్రియదర్శన్ కంటే ముందు పార్వతి తిరువోతును సంప్రదించినట్లు ఓ రూమర్ ఉంది.హీరోయిన్ అసహనంతాజాగా ఈ రూమర్‌పై పార్వతి సీరియస్ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతమదృష్ట్య కుట్టకర్. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్ వచ్చిందా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికామె స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం. మీరు ఇలాంటివి చాలా వింటుంటారు. మీకు నచ్చింది వినుకోండి అని బదులిచ్చింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలిస్తా: నటికి బంపరాఫర్ -
నాజూగ్గా కల్యాణి ప్రియదర్శన్.. లంగా ఓణీలో శ్రీదేవి!
లంగా ఓణీలో మరింత అందంగా 'కోర్ట్' శ్రీదేవినాజూగ్గా మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్మోడ్రన్ డ్రస్‌లో నభా నటేశ్ హొయలుకొంటె చూపులతో మాయ చేస్తున్న అనసూయఏడాది జ్ఞాపకాల్ని వీడియోగా పోస్ట్ చేసిన కాయదు View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
సమంతలో కొత్త పెళ్లికూతురి కళ.. కల్యాణి గ్లామర్!
సమంత ఫేస్‌లో కొత్త పెళ్లికూతురి కళగ్రీన్ డ్రస్‌లో మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్డ్యాన్స్ చేస్తూ మాయ చేస్తున్న 'ఫౌజీ' ఇమాన్వీ'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ వీకెండ్ ట్రిప్జిగేలుమనేలా దడపుట్టించేస్తున్న సంయుక్తబ్యాంకాక్ ట్రిప్‌లో సీరియల్ బ్యూటీ నవ్వస్వామి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
ఈ ఏడాది క్రేజీ స్టార్స్.. టాప్ టెన్‌లో రష్మిక, రుక్మిణి.. ఫుల్ లిస్ట్ ఇదే!
త్వరలోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. చూస్తుండగానే రోజులు అలా గడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అందరూ కొత్త ఏడాది స్వాగతం పలకడానికి సమయం ఆసన్నమైంది. మరి సినీ ఇండస్ట్రీలో 2025లో కలిసొచ్చిందా? ఎంతమందికి స్టార్స్ హోదాను దక్కించుకున్నారు. ఇండియా సినీ చరిత్రలో ఈ ఏడాది అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న నటీమణులు, హీరోలు ఎవరు? 2025లో ఎంట్రీ స్టార్‌డమ్‌ను దక్కించుకున్న యంగ్ హీరోయిన్స్, హీరోలు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2025లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న స్టార్స్ లిస్ట్‌ను ప్రముఖ సినీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన హీరోయిన్స్, హీరోల జాబితాను వెల్లడించింది. ఈ సారి అత్యధికంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది తారలు సైతం సత్తా చాటారు. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్-2025 లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రుక్మిణి వసంత్, కల్యాణి ప్రియదర్శన్ నిలిచారు. కాగా.. 2025లో ఆమె ఛావా, సికందర్, థామా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి చిత్రాలతో మెప్పించింది. రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్-1తో ఆడియన్స్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కల్యాణి ప్రియదర్శన్ కొత్తలోక: చాప్టర్- 1 మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది.బాలీవుడ్ మూవీ సయారాతో సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క సినిమాతోనే వీరిద్దరు టాప్‌లో నిలవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మోహిత్ సూరి డైరెక్టర్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన సయారా బాక్సాఫీస్ వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఐఎండీబీ- 2025 లిస్ట్..టాప్-10 సినీ స్టార్స్ వీళ్లే...అహాన్ పాండే (సయారా)అనీత్ పడ్డా (సయారా)ఆమిర్ ఖాన్ (సితారే జమీన్ పర్)ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్)లక్ష్య (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)రష్మిక మందన్నా (ఛావా, సికిందర్, థామా, కుబేర)కల్యాణి ప్రియదర్శన్ ( కొత్త లోకా చాప్టర్1)త్రిప్తి డిమ్రి (ధడక్2)రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్1)రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్1) టాప్-10 ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లే..మోహిత్ సూరి (సయారా)ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)లోకేశ్ కనగరాజ్ (కూలీ)అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్)పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్2: ఎంపురాన్)ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్)అనురాగ్ బసు (మోట్రో ఇన్ దినో)డోమినిక్ అరుణ్ (కొత్త లోకా చాప్టర్1)లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)నీరజ్ ఘేవాన్ (హోమ్ బౌండ్) -
కవర్ సాంగ్‌లో కల్యాణి.. రకుల్ ఓ రేంజ్ గ్లామర్!
హిందీ కవర్ సాంగ్ కోసం గ్లామరస్‌గా కల్యాణిపెళ్లి తర్వాత కూడా రకుల్ అందాల విందువింటేజ్ కెమెరాతో యాంకర్ రష్మీ పోజులుకెన్యా టూర్ వీడియో పోస్ట్ చేసిన అనసూయసొట్టబుగ్గతో అందంగా 'రాంబాయి' తేజస్వీటామ్ బాయ్‌లా మారిపోయిన షాలినీ పాండే View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Esther (@_estheranil) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Tejaswi. (@tej_aswiii) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
కల్కి సీక్వెల్లో హీరోయిన్గా ఛాన్స్! కల్యాణి ఏమందంటే?
గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie) ఒకటి. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.దీపికా స్థానంలో కల్యాణి?ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికా(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్ మెంబర్స్‌కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.అంతకన్నా సంతోషం ఇంకేముంది?ఈ రూమర్‌పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.చదవండి: పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్ -
శివ కార్తికేయన్- వెంకట్ సినిమా.. ట్రెండింగ్ హీరోయిన్‌కు ఛాన్స్
కోలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్(Sivakarthikeyan ). అంతేకాకుండా ఇటీవల అయిలాన్, మావిరన్,అమరన్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ ప్రతినాయకుడుగాను అధర్వ ముఖ్యపాత్రలోనూ నటిస్తుండగా, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026 జనవరిలో పొంగల్ రేస్‌కు సిద్ధమవుతోంది. దీంతో శివకార్తికేయన్ తర్వాత చిత్రానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో నటించిన ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రంలో శివ కార్తికేయన్ గౌరవ పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో రూపొందనున్న చిత్రం టైమ్ ట్రావెల్ కథాంశంతో సాగుతుందని సమాచారం. శివ కార్తికేయన్ చివరి చిత్రం మదరాసి అనుకున్నంత రేంజ్లో మెప్పించలేదు. అదే విధంగా వెంకట్ ప్రభు చిత్రం గోట్ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో భారీ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) నటించనున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల మలయాళంలో నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం 'కొత్త లోక' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కల్యాణి ప్రియదర్శన్ ఇంతకుముందే హీరో అనే చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ జంట మళ్లీ రిపీట్ కానున్నదన్నమాట. -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సూపర్ హీరోల సినిమాలు సరిగ్గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. హాలీవుడ్లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా తీస్తుంటారు. మన దేశంలో మాత్రం ఆడపాదడపా మాత్రమే ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ జానర్ అనగానే చాలామంది హీరోలతోనే తీస్తుంటారు. కానీ ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లోక'. మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 28న మలయాళంలో, 29న తెలుగులో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్ పెట్టగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. లెక్క ప్రకారం ఓటీటీలోకి ఎప్పుడో వచ్చేయాలి. కానీ థియేటర్లలో బాగా ఆడేసరికి కాస్త ఆలస్యం చేశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా)ఈ నెల 31 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌లో 'లోక' అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈ సినిమా బాగా నచ్చేయగా.. మరికొందరికి మాత్రం ఓకే ఓకే అనిపించింది. మరి ఓటీటీలోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. దీని గురించి కొందరికే తెలుసు. కొన్ని కారణాల వల్ల చంద్ర.. బెంగళూరు వచ్చేస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతూ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు. చంద్రని చూసి తొలిచూపులోనే సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. అసలు ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)The world of Lokah unfolds exclusively on JioHotstar, streaming from October 31st.@JioHotstarMal#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @jakes_bejoy @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/dAklmsFR1M— Wayfarer Films (@DQsWayfarerFilm) October 24, 2025 -
సస్పెన్స్‌కు తెర.. రూ.300 కోట్ల సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్!
కల్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'లోకా'. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించినట్లు ఇటీవలే పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఆగస్టు 28న రిలీజైంది. ఆ తర్వాత తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఫర్వాలేదనిపించింది.అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ రిలీజై 50 రోజులు కావొస్తోంది. పెద్ద పెద్ద సినిమాలే కేవలం నాలుగైదు వారాల్లోనే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఓటీటీకి రానుందని వార్తలొచ్చినా అలాంటిదేం జరగలేదు. రూమర్స్ రావడంతో దుల్కర్ సైతం ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు.తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను రివీల్ చేశారు. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ తేదీని రివీల్ చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. దీంతో కొత్త లోక మూవీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్‌లో సస్పెన్స్‌కు తెరపడింది. (ఇది చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)కొత్త లోక కథేంటంటే..'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్‌లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The beginning of a new universe.Lokah Chapter 1: Chandra — coming soon on JioHotstar.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#Lokah #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun #KalyaniPriyadarshan #Naslen #SuperheroFantasy… pic.twitter.com/BMlsbEJM0q— JioHotstar Malayalam (@JioHotstarMal) October 14, 2025 -
అటు కళ్యాణి.. ఇటు కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్ అదరగొట్టారుగా..!
-
అప్పటిరోజులు గుర్తుచేసిన కాజల్.. స్టైలిష్‌గా కల్యాణి
ఒకప్పటిలా అందంగా కనిపించిన కాజల్ అగర్వాల్స్టైలిష్ మోడ్రన్ లుక్‌లో కల్యాణి ప్రియదర్శన్సాయంతాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్న వైష్ణవిచీరకట్టులో నాభి అందాలతో నభా నటేశ్కలర్ఫుల్ డ్రస్సులో అమలాపాల్ వయ్యారాలుటంగ్ ట్విస్టర్తో నవ్వించిన రుక్మిణి వసంత్ View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
స్టార్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్
రీసెంట్గా 'లోక' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్, అలానే 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. రవి మోహన్ (జయం రవి) హీరోగా చేస్తున్న లేటెస్ట్ తమిళ సినిమా 'జీనీ'. దీని నుంచి అబ్దీ అబ్దీ అంటూ సాగే వీడియో సాంగ్‌ని తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కల్యాణి-కృతి స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.(ఇదీ చదవండి: రీతూ దొంగ తెలివితేటలు.. మిగతా వాళ్లందరూ బలి)ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటలో హీరో రవి మోహన్ కూడా ఉన్నప్పటికీ కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో తెగ హైలెట్ అయిపోతున్నారు. గతంలో ఇలాంటి పాట ఎక్కడో చూశామే అన్నట్లు అనిపిస్తుంది కానీ చూస్తున్నంతసేపు డ్యాన్ మాత్రం భలే చేశారు కదా అనిపిస్తుంది. 'జీనీ' అర్జునన్ చిత్రానికి అర్జునన్ దర్శకుడు కాగా.. ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురానున్నారు.(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్) -
లగ్జరీ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్.. ఎన్ని లక్షలంటే?
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డుకెక్కింది. ఇప్పటివరకు రూ.294 కోట్లు అందుకున్న ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరనుంది. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా నిమిష్ రవి (Nimish Ravi) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు.చేతి గడియారంతాజాగా నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ వాచ్‌ను ధరించిన రవి.. ఈమేరకు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి లోక సినిమాయే నిదర్శనం. వాచ్ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్ వర్క్‌కు ఇదొక బహుమానం అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Nimish Ravi (@nimishravi) చదవండి: బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో -
'కొత్తలోక' సీక్వెల్.. వీడియోతో ప్రకటన
మలయాళంలో తెరకెక్కిన ‘కొత్తలోక: చాప్టర్1’ కాసుల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒక వీడియోను పంచుకున్నారు. రూ. 30 కోట్లతో చిన్న సినిమాగా విడుదలైన కొత్తలోక ఏకంగా రూ. 267 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగా నిలిచింది. దేశంలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు.కొత్తలోక చాప్టర్1లో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే, సీక్వెల్లో వీరి పాత్ర కీలకం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పార్ట్2 వీడియోలో వారిద్దర మధ్య జరిగిన సంభాషణను చూపించారు. సీక్వెల్‌ను కూడా డామినిక్ అరుణ్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రత్యేక ప్రోమో అభిమానులను మెప్పిస్తుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విడుదల తేదీ, నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. -
ఆ మాట నేనెప్పుడు అనలేదు: హీరోయిన్
సినిమా తారలపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. వాళ్ల సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై కూడా నెట్టింట గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే చాలా మంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. అవసరం అయితే తప్ప స్పందించరు. అయితే ఆ అబద్దం నిజమని నమ్మినట్లుగా తెలిస్తే మాత్రం వెంటనే ఖండిస్తారు. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan ) అదే పని చేశారు. తనపై మీడియాలో వచ్చిన ఓ పుకారుని తీవ్రంగా ఖండించారు.తనను, తన సోదరుడిని తల్లిదండ్రులు వియత్నాంలోని అనాథశ్రమంలో వారం రోజుల పాటు వదిలి వెళ్లారని.. జీవితం అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశ్వంతో అలా చేశారని కల్యాణి చెప్పినట్లుగా ఓ సినీ వెబ్సైట్ వార్తలను రాసుకొచ్చింది. ఈ విషయం కళ్యాణి దృష్టికి వెళ్లడంతో..ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మాటలను నేనెప్పుడు అనలేదని..దయచేసి ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురే ఈ కల్యాణి.‘హలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’తో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘కొత్త లోక’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆగస్ట్ 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 270పైగా వసూళ్లను సాధించింది.. మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రగా నిలిచింది. -
ఓటీటీలోకి 'లోక'.. దుల్కర్ ట్వీట్‌తో క్లారిటీ
రీసెంట్ టైంలో రెండు సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. తెలుగులో వచ్చిన 'మిరాయ్' హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికి రూ.120 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. మరోవైపు గత నెల చివర్లో 'లోక' అనే మలయాళ ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఒకటి వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై నిర్మాత దుల్కర్ సల్మాన్ ఓ క్లారిటీ ఇచ్చాడు.కల్యాణి ప్రియదర్శన్ 'లోక' సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ పర్లేదనే టాక్ వచ్చింది గానీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. కానీ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మాత్రం అద్భుతమైన కలెక్షన్ వచ్చాయి. ప్రస్తుతం రూ.250 కోట్లకు పైనే వచ్చాయని, తద్వారా మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ మూవీని ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం లేదని నిర్మాత దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశాడు. రూమర్స్‌ను నమ్మొద్దు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడండి అని విజ్ఞప్తి చేశాడు.(ఇదీ చదవండి: రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్)ఈ శుక్రవారం నుంచే 'లోక' స్ట్రీమింగ్ ఉండనుందనే రూమర్స్ వచ్చేసరికి చాలామంది నెటిజన్లు సంతోషపడ్డారు. కానీ ఈ చిత్ర నిర్మాత దుల్కర్ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పటికీ థియేటర్లలో ఇంకా ఒరిజినల్ వెర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాబట్టి ఓటీటీ డేట్ అనుకున్న టైం కంటే కాస్త లేటుగా తీసుకురానున్నారు. అంటే అక్టోబరు రెండో వారం వస్తుందేమో చూడాలి?'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు. ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్‌లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఐఫోన్‌తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ)Lokah isn't coming to OTT anytime soon. Ignore the fake news and stay tuned for official announcements! #Lokah #WhatstheHurry— Dulquer Salmaan (@dulQuer) September 21, 2025 -
దీపికా పదుకొణె స్థానంలో స్టార్ హీరోయిన్.. రేసులో ఇద్దరు
'కల్కి 2898 ఏడీ' సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను తప్పించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తి చేసేది ఎవరు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. ఈ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఈ ఏడాది చివరిలో సీక్వెల్ షూటింగ్ ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు సడెన్‌గా దీపికను తప్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కల్కిలో దీపికా పదుకొణె పర్ఫార్మెన్స్ చాలా బాగుందని, తన క్యారెక్టర్లో ఆమె లీనమై నటించారని టాక్ ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే ఏకైక హీరోయిన్ అనుష్క మాత్రమేనని సోషల్‌మీడియాలో చాలామంది తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.దీపిక పదుకొణెను రీప్లేస్ చేసే హీరోయిన్ కోసం కల్కి యూనిట్ ఇప్పటికే వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభాస్-అనుష్క కలిసి మరోసారి సినిమా చేస్తే చూడాలని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా కోరుతున్నారు. బాహుబలి తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. అందువల్ల దీపిక స్థానాన్ని అనుష్కతో భర్తీ చేస్తే సినిమాకు మరింత జోష్ రావడం ఖాయం అంటున్నారు.బాహుబలిలో గర్భవతిగా అనుష్క కనిపించిన విషయం తెలిసిందే. కల్కిలో కూడా దీపిక గర్భవతిగానే కనిపిస్తుంది. దీంతో ఎక్కువ మంది ఇదే కంటిన్యూటీని కోరుకుంటున్నారు.'కొత్త లోక' సినిమాతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న 'కళ్యాణి ప్రియదర్శన్'ను కల్కి కోసం ఎంపిక చేసినా బాగుంటుందని కొందరు చెబుతున్నారు. కొత్త లోక సినిమాలో ఆమె సూపర్ యోధగా నటించి అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో నయనతార, అలియా భట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
మలయాళ స్టార్ జంట కూతురు.. చిన్నప్పుడు అనాథాశ్రమంలో..
మలయాళ స్టార్ నటుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) రికార్డులు తిరగరాస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ మోహన్‌లాల్ 'ఎల్2: ఎంపురాన్' కలెక్షన్లను దాటేసి ఏకంగా రూ.266 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా రికార్డులోకెక్కింది. మంచి సలహాసూపర్ హీరోగా నటించిన కల్యాణికి సౌత్ నుంచి నార్త్ వరకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోవద్దని జాగ్రత్తలు చెప్పాడు. అలాగే పరాజయాన్ని మనసుకు తీసుకోవద్దని మంచి మాట చెప్పాడు. కల్యాణి కూడా ఎప్పుడూ స్టార్ హీరో కూతుర్ని అని ఎప్పుడూ బిల్డప్ కొట్టలేదు. పైగా తండ్రి మాటను తు.చ తప్పకుండా పాటిస్తుంది.అనాథాశ్రమంలో..అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు కొద్దిరోజులపాటు అనాథాశ్రమంలో ఉంది. కల్యాణియే కాదు, ఆమె సోదరుడు సిద్దార్థ్ కూడా అనాథాశ్రమంలో ఉన్నారు. మలయాళ స్టార్ జంట ప్రియదర్శన్- లిస్సీ జంటే తమ పిల్లల్ని వియత్నాంలోని ఓ ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఇందుకో బలమైన కారణం ఉంది. పేరు, సంపాదన, లగ్జరీని పక్కనపెట్టి జీవితం విలువ నేర్పడానికే వాళ్లు ఈ పని చేశారు. కల్యాణి, సిద్దార్థ్ కూడా అనాథలతో కలిసి తినేవారు, ఆడుకునేవారు, వాళ్లతోనే కలిసి నిద్రించేవారు. అలా చిన్నప్పటినుంచే వారికి మానవత్వం, మంచితనం వంటి విలువలను నేర్పించారు.చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం -
ఓటీటీలో ఫహాద్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శన్ సినిమా
మలయాళ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), రేవతి పిళై నటించిన రొమాంటిక్ చిత్రం ‘ఓడుం కుతిర చాదుం కుతిర’. మలయాళంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా విజయం సాధించింది. ఈ సినిమాను దర్శకుడు అల్తాఫ్ సలీం తెరకెక్కించగా.. ఆషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీ వివరాలను పంచుకున్నారు.‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26న ఓటీటీలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం నవ్వులు పూయిస్తూనే.. ఒక జోడీ మధ్య చిలిపి సరదాలతో ప్రేమకథ కనిపిస్తుంది.అభి (ఫహాద్ ఫాజిల్), నిధి (కల్యాణి ప్రియదర్శన్) పెళ్లి తంతుతో కథ ప్రారంభం అవుతుంది. అయితే, ఎంగేజ్మెంట్ నాడు తమ ఇంటికి గుర్రంపై రాజులా రావాలని అభికి నిధి కండీషన్ పెడుతుంది. దీంతో అభి కూడా గుర్రంపై ఆమె ఇంటికి బయలుదేరుతాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా గుర్రం నుంచి కిందపడుతాడు. ఆ సమయంలో కోమాలోకి వెళతాడు. దీంతో వారి పెళ్లి ఆగిపోతుంది. నిధి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె మరొకరిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. అయితే, సడెన్‌గా అభి పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తాడు. నిధి గురించి తెలుసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని బెంగళూరు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. అక్కడ ఒక అమ్మాయి అభి జీవితంలోకి వచ్చేస్తుంది. ఫైనల్‌గా అభి జీవితం ఏమౌతుంది..? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది చాలా ఫన్నీగా అందరినీ నవ్వించేలా సినిమా ఉంటుంది. -
మాలీవుడ్ కొత్త ఇండస్ట్రీ హిట్ గా కొత్త లోక
-
చిన్న సినిమా.. బిగ్ హిట్.. ఏకంగా మోహన్‌లాల్ మూవీ రికార్డ్ బ్రేక్!
కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మలయాళ చిత్రం లోకా చాప్టర్-1 చంద్ర. ఈ మూవీని తెలుగులో కొత్త లోకా పేరుతో రిలీజ్ చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ వసూళ్లపరంగా అదరగొట్టేసింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా లోకా చాప్టర్-1 చంద్ర నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ సినిమాను అధిగమించింది. కాగా.. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఈ మూవీ రిలీజైన 23 రోజుల్లో ఇండియాలో రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.266 కోట్లు కలెక్ట్ చేసింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్2 ఎంపురాన్ మనదేశంలో రూ.105 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.265.5 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో కొత్త లోకా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో మొదటి స్థానం దక్కించుకుంది. -
'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇదే నా సలహా: తండ్రి మెసేజ్ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటనేది ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.సినిమాతన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్, నస్లీన్ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) చదవండి: అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో -
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది: దుల్కర్ సల్మాన్
‘‘కల్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లిలాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం. చంద్ర పాత్ర కోసం తను తప్ప మా మైండ్లోకి వేరే ఎవరి పేరు రాలేదు. నన్ను ఎలాగైతే మీవాడిగా భావించారో అలాగే నేను నిర్మించిన ‘కొత్త లోక’ చిత్రాన్ని కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. కల్యాణీ ప్రియదర్శన్ లీడ్ రోల్లో, నస్లెన్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1: చంద్ర’. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.బడ్జెట్ గురించి ఆలోచించలేడొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ఆగస్టు 29న నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవానికి దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ గురించి ఆలోచించలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు’’ అని చెప్పారు. రూ.30 కోట్లు ఎక్కువనాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళంలో రూ.30 కోట్లు అనేది చాలా ఎక్కువ. నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్‌ని అభినందించాలి’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నాగవంశీ. కల్యాణీ ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఉంది’’ అన్నారు డొమినిక్ అరుణ్. తండ్రి రియాక్షన్ ఇదే!ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా నటించనున్నట్లు తండ్రి ప్రియదర్శన్‌కు చెప్పగా నువ్వా.. యాక్షన్ హీరో పాత్రలోనా! అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత చెయ్యి, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు.చదవండి: కమెడియన్‌కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం -
'కొత్త లోక' మూవీ సక్సెస్‌మీట్‌లో కల్యాణి ప్రియదర్శన్, దుల్కర్ (ఫోటోలు)
-
కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు: 'కొత్త లోక' నిర్మాతలు
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన తాజా సినిమా ‘కొత్త లోక’ (Kotha Lokah) టాలీవుడ్లో కూడా విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సూపర్ యోధగా నటించి మెప్పించింది. ఫాంటసీ థ్రిల్లర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కన్నడ ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు చెప్పారు.'లోక చాప్టర్1: చంద్ర' చిత్రంలో ఒక సంభాషణ కన్నడ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. 'ఈ సినిమాలో ఒక పాత్ర చెప్పిన సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మాకు సమాచారం వచ్చింది. దీనికి మేము చింతిస్తున్నాము. పొరపాటున జరిగినప్పటికీ మేము బాధ్యత వహిస్తున్నాం. ఈ సంభాషణను వీలైనంత త్వరగా తొలగిస్తాం లేదా సవరిస్తాం. మా వల్ల జరిగిన తప్పుకి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాం' అని తెలిపారు. -
'కొత్త లోక' సరికొత్త రికార్డ్.. దీనిదే అగ్రస్థానం
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే చాలామంది ప్రేక్షకులకు చిన్నచూపు. హా ఏముందిలే అని అనుకుంటారు. కానీ అప్పట్లోనే విజయశాంతి లాంటి హీరోయిన్స్.. 'కర్తవ్యం' లాంటి సినిమాలు చేశారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో హీరోలు, కమర్షియల్ చిత్రాల హవా పెరిగేసరికి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం దక్షిణాదిలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి.గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అనుష్క గుర్తొస్తుంది. 'అరుంధతి'తో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత రుద్రమదేవి, భాగమతి తదతరత చిత్రాలతో తన సకెస్స్‌ని కొనసాగించింది. తర్వాత కాలంలో పలువురు సౌత్ హీరోయిన్లు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీసినప్పటికీ అనుష్క దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. కానీ 'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ ఆ ఫీట్ సాధించింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)2018లో 'మహానటి' రాగా ఆ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు 'కొత్త లోక' సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం.. రిలీజైన 7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. సాధారణంగా చూస్తే ఇదేమంత ఎక్కువ మొత్తంలా అనిపించకపోవచ్చు. కానీ మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్‌ని లీడ్ రోల్లో పెట్టి తీసిన సూపర్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే కచ్చితంగా విశేషమే.ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన 'కొత్త లోక'.. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. తద్వారా మహానటి, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఇది ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్) -
'కొత్త లోక'.. ఏకంగా ఐదు పార్ట్స్
గత వీకెండ్లో మూడు నాలుగు తెలుగు సినిమాలు రిలీజైతే వాటిలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరోవైపు మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక'కి తెలుగులో ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. మెట్రో సిటీల్లో ఆదివారం వరకు మంచి ఆక్యుపెన్సీ చూపించింది. తొలి నుంచి ఇది సూపర్ హీరో తరహా యూనివర్స్ అని చెప్పిన టీమ్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాల్ని రివీల్ చేసింది.మనం పురాణాల్లో విన్న యక్షిణి పాత్రని తీసుకుని, దానికి సూపర్ పవర్స్ జోడించి 'కొత్త లోక' సినిమాని తీశారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. బడ్జెట్ కూడా రూ.35-40 కోట్ల మధ్యనే అని టాక్. అయితే ఇంత తక్కువ బడ్జెట్ పెట్టి ఈ రేంజు ఔట్ పుట్ చూపించడంపై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు రూ.60-70 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే లాభాల్లోకి ఎంటరైనట్లే.(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)తాజాగా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన దర్శకుడు డొమినిక్ అరుణ్.. ఈ మూవీ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు పార్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలానే 'కొత్త లోక' సినిమా ప్రారంభంలోనే మెయిన్ విలన్ ఎవరనేది హింట్ ఇచ్చామని పేర్కొన్నాడు. ఐదు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా షూటింగ్ మొదలవకముందే పూర్తి చేశామని క్లారిటీ ఇచ్చాడు.ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న టొవినో థామస్.. రెండో పార్ట్‌లో లీడ్ రోల్ చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే 'కొత్త లోక' తొలి పార్ట్ చివరలో దుల్కర్ సల్మాన్ కూడా కనిపించాడు. రాబోయే పార్ట్స్‌లో ఏదో ఒకదానిలో దుల్కర్ కూడా కచ్చితంగా ఉండటం గ్యారంటీ. ఇప్పటివరకు కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణి.. ఈ సినిమాతో మరింతగా క్రేజ్ సంపాదిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: 'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్) -
సూపర్‌స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?
గతవారం వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ వచ్చింది. కానీ స్టార్ హీరోలు, మిడ్ హీరోల చిత్రాలేవి థియేటర్లలోకి రాలేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ తదితర చిన్న మూవీస్ వచ్చాయి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు స్క్రీనింగ్ సమస్యలు ఎదుర్కొని, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన 'కొత్త లోక' అనే డబ్బింగ్ సినిమా.. మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఓవరాల్‌గా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత?మలయాళ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు సూపర్ హీరో యూనివర్స్ సృష్టించారు. అందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. దీన్ని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. పురాణగాథల్లో ఉన్న యక్షిణి పాత్రని తీసుకుని, సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది.(ఇదీ చదవండి: 'కొత్త లోక' రివ్యూ)మలయాళంలో ఆగస్టు 28న రిలీజ్ కాగా.. ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఇప్పటివరకు నాలుగు రోజులు పూర్తి కాగా దాదాపు రూ.40-45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే రూ.3.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది.మలయాళంలో దీనితో పాటు సూపర్‌స్టార్ మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా కూడా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ దీనికి రూ.11-15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 'కొత్త లోక'నే ముందంజలో ఉంది. అయితే ఈ సినిమాని కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్‌తోనే తీశారట. అంటే లాంగ్ రన్లో ఈ సినిమాకు మంచి లాభాలు రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్ప్రైజ్) -
హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ
మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్.. అఖిల్ 'హలో' మూవీతో హీరోయిన్ అయింది. 'చిత్రలహరి' అనే మరో తెలుగు సినిమా కూడా చేసింది. తర్వాత పూర్తిగా సొంత భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఈమె.. ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అదే 'కొత్త లోక: ఛాప్టర్ 1 చంద్ర'. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ.. ఆగస్టు 28న మలయాళంలో రిలీజ్ కాగా, ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఓ సందర్భంలో బెంగళూరు వస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తుంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో 'హనుమాన్' పేరుతో తెలుగులోనూ ఓ మూవీ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జానర్లో ఏకంగా ఓ యూనివర్స్ సృష్టించారు. ఇందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. తెలుగులో దీన్ని 'కొత్త లోక' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. అందుకు తగ్గట్లే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇచ్చింది.చంద్ర ఓ పవర్ ఫుల్ ఫైట్ చేయడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం.. ఇలా పాత్రలు, పరిస్థితుల్ని చూపిస్తూ వెళ్లారు. ఓ సాధారణ అమ్మాయిలా బతుకుదాం అని వచ్చిన చంద్ర.. ఒకడిని కొట్టడంతో ఈమె లైఫ్‌లోకి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది. చివరకు ఏమైందనేదే తెలియాలంటే సినిమా చూడాలి.ఈ సినిమా ఫస్టాప్ అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది. హీరోయిన్‌కి ఉన్న సూపర్ పవర్స్, అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్ లు ఎంటర్టైన్ చేస్తాయి. సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరకొచ్చేసరికి రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు అనగానే సింపతీనే చూపిస్తుంటారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలిగా చంద్ర పాత్రని ప్రెజెంట్ చేశారు.యక్షిణి పాత్ర గురించి మనం పురాణాల్లో విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకుని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చడం.. బ్యాట్ మ్యాన్ టైపులో చూపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తి చేయలేదేంటి అనే సందేహం వస్తుంది. అవును అదే నిజం. కేవలం చంద్ర పాత్ర తాలూకు బలాలు, బలహీనతలు చూపించారు. తర్వాత రాబోయే పార్ట్-2 చిత్రానికి లీడ్ వదిలారు. ఇందులో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంది. అది కొన్నిచోట్ల వర్కౌట్ అయింది.ఎవరెలా చేశారు?కల్యాణి ప్రియదర్శిని ఇప్పటివరకు కమర్షియల్ పాత్రలు ఎక్కువగా చేసింది. ఇందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫైట్స్ ఇరగదీసింది. చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా నస్లేన్ బాగా చేశాడు. అతడి ఫ్రెండ్స్‌గా చేసిన ఇద్దరు కుర్రాళ్లు కామెడీ బాగానే చేశారు. నాచియప్ప అనే విలన్ తరహా పాత్ర చేసిన శాండీ.. స్వతహాగా కొరియోగ్రాఫర్. కానీ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. మిగిలిన వాళ్లు ఆకట్టుకున్నారు. ఇందులోనే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్, హీరోలు టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో అలా మెరిశారు.టెక్నికల్ అంశాలకొస్తే.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్. రెడ్-బ్లూ కలర్స్‌ని ఉపయోగించిన విధానం బాగుంది. తెలుగు డబ్బింగ్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి తగ్గట్లు ఉంది. డొమినిక్ అరుణ్.. దర్శకుడిగా కంటే రైటర్‌గా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసినా సరే ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. కథలో మైథాలజీ ఉంది. కొత్త పాయింట్ ఉంది. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాదు ఏదైనా కొత్తగా చూద్దామనుకుంటే మాత్రం ఇది డోంట్ మిస్.- చందు డొంకాన -
ఆసక్తికరంగా 'లోక' ట్రైలర్.. సూపర్ హీరో కాన్సెప్ట్
తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్.. ఇప్పుడు పూర్తిగా మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైంది. అక్కడే స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో, 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ మరో కీ రోల్ చేసిన చిత్రం 'లోక'. తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ఇది నా ఊరు సర్'.. ఫుల్ యాక్షన్‌తో 'మదరాశి' ట్రైలర్)పూర్తిగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీసిన మూవీ అని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటివి హీరోలు చేస్తుంటారు. కానీ యంగ్ హీరోయిన్‌తో ఈ జానర్ సినిమా చేయడం విశేషం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దీన్ని నిర్మించాడు. డొమినిక్ అరుణ్ దర్శకుడు.తెలుగులో ఈ సినిమా 'కొత్త లోక' పేరుతో ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే.. సూపర్ హీరో లక్షణాలుండే లోక(కల్యాణి ప్రియదర్శన్) అనుకోని పరిస్థితుల్లో ఓ ఊరికి వెళ్తుంది. అక్కడే లో-ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ బతుకుతుంటుంది. అలాంటి ఊరిలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని లోక ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 100వ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకుంటా: దర్శకుడు ప్రియదర్శన్) -
సూపర్ హీరోగా కల్యాణి.. అలరించేలా 'లోకా' టీజర్
ఇప్పటివరకు పలు భాషల్లో సూపర్ హీరో తరహా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ని లీడ్ రోల్లో పెట్టి ఇలాంటి మూవీని మలయాళంలో తీశారు. అదే 'లోకా'. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)'హలో', 'చిత్రలహరి' లాంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన కల్యాణి ప్రియదర్శన్.. తర్వాత పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది. మిడ్ రేంజ్ మూవీస్‌లో నటిస్తూ కెరీర్ పరంగా బాగానే ఉంది. అయితే ఈమెని పెట్టి సూపర్ హీరో జానర్ మూవీ తీయడం విశేషం. 'లోకా'ని తెలుగులోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కల్యాణికి జోడిగా 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Kalyani Priyadarshan) లేకపోయుంటే తాను ఏమైపోయేదాన్నో అంటోంది హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. తనకు ఏ అవసరమొచ్చినా, ఎటువంటి సలహా కావాలన్నా ఎప్పుడూ అతడు అందుబాటులో ఉంటాడని చెప్తోంది. నేడు (జూలై 28) దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణి సోషల్ మీడియాలో వేదికగా హీరోకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ప్రియమైన D(దుల్కర్), ప్రతి ఏడాది నీకు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఓ పెద్ద మెసేజ్ పంపుతాను.నేనెప్పుడూ ఒంటరిదాన్ని కానుకానీ ఈ సారి మన కలల ప్రపంచానికి సంబంధించిన (మూవీ) గ్లింప్స్ అందరితో షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్.. నిజ జీవితంలో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న ప్రతి కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఐదేళ్లుగా నాకు ఏ సలహా కావాలన్నా ఫస్ట్ ఫోన్ నీకే చేస్తాను. అంతలా నాకు సపోర్ట్‌గా నిలబడ్డందుకు థాంక్యూ. నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అప్పటినుంచే స్నేహందుల్కర్, కల్యాణి.. 2020లో వచ్చిన మలయాళ చిత్రం 'వరణే అవశ్యముంద్'లో జంటగా నటించారు. అప్పుడే వీరు క్లోజ్ ఫ్రెండ్సయ్యారు. అప్పటినుంచి వీరి స్నేహం అలాగే కొనసాగుతూనే ఉంది. నేడు దుల్కర్ బర్త్‌డే సందర్భంగా.. అతడు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోక, చాప్టర్ 1: చంద్ర సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది. -
ఈ గుండుపాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టారా?
స్టార్ హీరోయిన్లు వరస సినిమాలతో బిజీగా ఉంటారు. అదే టైంలో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. ఫన్నీ కామెంట్స్‌కి కూడా తమదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది కూడా తన ఫ్రెండ్, యంగ్ హీరోకి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే విషెస్ కంటే తన గుండు గురించే ఎక్కువగా అడుగుతున్నారని తెగ బాధపడిపోతోంది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కల్యాణి ప్రియదర్శన్. అదేనండి తెలుగులో అఖిల్ రెండో సినిమా 'హలో'లో హీరోయిన్గా చేసింది. చిత్రలహరి మూవీలోనూ నటించిందిగా. ఆమెనే ఈమె. ఈ రెండు చిత్రాల తర్వాత తెలుగుకి పూర్తిగా దూరమైపోయింది. మాతృభాష మలయాళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాంటిది తన ఫ్రెండ్, మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇప్పుడు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కల్యాణిని చూసి భలే ముద్దుగా ఉందే అని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?)కల్యాణి వ్యక్తిగత విషయానికొస్తే.. మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిసీల సంతానం ఈ బ్యూటీ. ఈమెకు సిద్ధార్థ్ అని సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం కల్యాణికి 30 ఏళ్లు దాటిపోయాయి. ఇప్పుడు ఎవరి గురించి అయితే పోస్ట్ పెట్టిందో.. అతడితోనే ఈమె రిలేషన్లో ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే ప్రణవ్-కల్యాణి స్నేహితులు మాత్రమేనని కొన్నిరోజుల క్రితం స్వయంగా ప్రణవ్ తల్లినే చెప్పుకొచ్చింది.హీరోయిన్గా తెలుగు చిత్రాలతోనే కెరీర్ ప్రారంభించినప్పటికీ.. కల్యాణి ఎందుకో తర్వాత పూర్తిగా మలయాళ, తమిళ చిత్రాలపైనే పూర్తిగా ఫోకస్ చేసింది. మరి అవకాశాలు రాకపోవడమా లేదంటే కావాలనే ఇలా చేసిందా అనేది తెలియదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్) -
హలో మూవీ కళ్యాణి ప్రియదర్శిని బ్యూటీ సీక్రెట్ ఇదే..!
‘ఫ్యాషన్ అంటే హంగులు కాదు, ఫ్యాషన్ అంటే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది.’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ ఎంతోమంది మనసులు దోచుకున్న అమ్మాయి నటి కళ్యాణి ప్రియదర్శిని. ఆమె శైలి, సౌందర్య రహస్యాలే ఇప్పుడు మీ ముందుంది.నటి కళ్యాణి ప్రియదర్శిని ధరించిన డ్రెస్ బ్రాండ్: పింక్‌సిటీ బై సారిక ధర: రూ. 38,500 కాగా, జ్యూలరీ బ్రాండ్: కళ్యాణ్ జ్యూవెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. తేనె, నెయ్యి కలిపిన ప్యాక్, పసుపు ఫేస్ మాస్క్, తగినంత నిద్ర, జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్ – అంతే! ఇవే నా బ్యూటీ సీక్రెట్. అయితే, ప్రతి అమ్మాయిలోనూ ఒక అందం ఉంటుంది. అది వెలుగులోకి రావాలంటే, సరైన శ్రద్ధ అవసరం. అప్పుడు మీరు సహజంగా మెరుస్తారు. ఇలా సహజమైన చిట్కాలను పాటిస్తూనే అందాన్ని వెలికితీయొచ్చు అని చెబుతోంది కళ్యాణి ప్రియదర్శినినెత్తికెక్కిన అందంమెడలో కాదు, చెవుల్లో కాదు, ఈ ఆభరణం దక్కించుకున్న స్థానం తలమీదే! అన్నింటి కంటే పైస్థాయి అంటే ఇదే. నెత్తిమీదకు ఎక్కిందంటే అది అహంకారం వల్ల కాదు, ఆత్మవిశ్వాసంతో. చూశారంటే సింపుల్‌గా ఉంటుంది, ‘ఇది ఎలాంటి జ్యూలరీ?’ అనిపిస్తుంది. కాని, వేసుకుంటే చూసే వారి చూపులను ఆకట్టుకోగల సత్తా ఉంది ఈ అభరణానికి. ఈ మినిమలిస్ట్ హెడ్ బ్యాండ్ ఒకవైపు ఆధునికత, మరోవైపు సంప్రదాయాల కలబోత. ఇప్పటి ఫ్యాషన్ భాషలో దీన్ని ‘హెడ్ బ్యాండ్ జ్యూలరీ’ అంటారు. కాని, మన పూర్వీకులు దీనిని ‘తలమిన్న’, ‘శిరోభూషణం’ అని పిలిచేవారు. పేర్లు పాతవైనా స్టయిల్ మాత్రం పక్కా ట్రెండీ! ఇది తలపై ధరించిన వెంటనే మీ లుక్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మామూలు చీర, కుర్తా, లెహంగా ఏదైనా సరే దీన్ని జత చేస్తే మీరు కేవలం రెడీ అవ్వరు రాయల్‌గా రెడీ అయిపోతారు. మేకప్ లేకపోయినా, ఈ తలమిన్న ఒక్కటే ముఖాన్ని గ్లో మోడ్‌లోకి మార్చేస్తుంది. లైట్ మేకప్, వదిలేసిన జుట్టు దీని స్టయిలింగ్‌కు బెస్ట్ కాంబో. ఇంత తక్కువ బరువుతో, ఇంత ఎక్కువ ఫ్యాషన్ ఎఫెక్ట్ ఇచ్చే జ్యూలరీ ఇంకా ఏదీ దొరకదు! (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
అనసూయ ఒయ్యారాలు.. హల్దీ వేడుకల్లో 'బిగ్‌బాస్' శుభశ్రీ
ఒంపుసొంపులతో గ్లామర్ బెండ్ తీస్తున్న అనసూయహల్దీ వేడుక వీడియోని షేర్ చేసిన బిగ్‌బాస్ శుభశ్రీకొరియాలోని సియోల్‌లో కల్యాణి ప్రియదర్శినిమాళవిక మోహనన్ మత్తెక్కించే బాత్రూమ్ పోజులువయ్యారంగా చూస్తూ కిక్ ఇస్తున్న కోమలి ప్రసాద్నల్లంచు తెల్లచీరలో అరియానా ఫుల్ ఎంజాయ్హాట్ హాట్‌గా కనిపించేస్తున్న హీరోయిన్ నేహాశర్మ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
శివకార్తికేయన్‌తో ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్..
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan).. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి, అదే విధంగా సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలే. వీటిలో పరాశక్తి చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని సమాచారం. రవిమోహన్ ప్రతి నాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయక కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. శివకార్తికేయన్ తాజాగా మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ఈయన వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇంతకుముందే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు క్రేజీ నటి కాయాదు లోహర్ కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్ అని సమాచారం. కాగా కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఇంతకుముందే శివకార్తికేయన్‌కు జంటగా హీరో (శక్తి) చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆమె తెలుగులో 'చిత్రలహరి, హలో' వంటి సినిమాలతో మెప్పించారు. మరోవైపు కాయాదు లోహర్(Kayadu Lohar) పేరు డ్రాగన్ సినిమాతో తెలుగు, తమిళ్లో బాగా పాపులర్ అయిపోయిన విషయం తెలిసిందే. కాగా శివకార్తికేయన్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న చిత్రం అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
చాప్టర్ వన్... చంద్ర
హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ నటించనున్న కొత్త సినిమాకు ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. డొమినిక్ అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ సినిమాపోస్టర్ను విడుదల చేసి, ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఈ సూపర్ హీరో ఫ్యాంటసీ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. కాగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ గెస్ట్ రోల్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
మలయాళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. కొన్నిరోజుల క్రితం 'ఎల్ 2:ఎంపురాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన గురించి పక్కనబెడితే కొడుకు ప్రణవ్(Pranav Mohanlal) గురించి ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోహన్ లాల్ కొడుకు కూడా హీరోనే. కాకపోతే చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. అతడి పేరు ప్రణవ్ మోహన్ లాల్. తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి నచ్చిన మలయాళ మూవీ 'హృదయం'లో హీరో ఇతడే. అయితే ఇదే చిత్రంలో నటించిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శినితో(Kalyani Priyadarshan) ఇతడు ప్రేమలో ఉన్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వినిపించేవి. కానీ అవి నిజం కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మలయాళ డైరెక్టర్ అల్లెప్పీ అష్రఫ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రణవ్ ఓ జర్మన్ అమ్మాయితో డేటింగ్(Pranav Girlfriend)లో ఉన్నాడు. కల్యాణితో కాదు. కల్యాణి ప్రియదర్శన్ తల్లి లిసీతో నేను మాట్లాడాను. ప్రణవ్-కల్యాణి అన్నాచెల్లి లాంటి వారని ఆమె చెప్పింది అని అన్నాడు.హీరోగా కంటే ప్రకృతి ప్రేమికుడిగా ప్రణవ్ ఫేమస్. ఎందుకంటే ఎప్పుడు దేశాలు తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయా ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం స్పెయిన్ టూర్ కి వెళ్లినప్పుడు అక్కడే ఓ పశువుల సాలలోనూ పనిచేశాడు. అయితే సదరు జర్మన్ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం) -
హీరోయిన్ కాదు బాక్సర్.. సీనియర్ బ్యూటీ అందం
బాక్సర్ లా రెచ్చిపోతున్న కల్యాణి ప్రియదర్శన్లేటు వయసులోనూ చిత్రాంగద హాట్ గ్లామర్చీరలో నడుము అందాలతో సిమ్రన్ చౌదరిషూటింగ్ అనుభవాలతో ప్రియా ప్రకాశ్ వారియర్పెట్ డాగ్స్ తో సరదాగా గడుపుతున్న రెబా మోనికాకలర్ పుల్ మట్టిగాజులతో యాంకర్ శ్రీముఖిబుట్టబొమ్మలా తెలుగమ్మాయి రూప కడువర్ పోజులు View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) -
కీర్తి సురేశ్ పెళ్లికి ఇంతమంది హీరోహీరోయిన్లు వెళ్లారా? (ఫొటోలు)
-
'దృశ్యం' పాప గ్లామర్.. రకుల్ ప్రీత్ వయ్యారాలు!
చీరలో ఓరకంట కల్యాణి ప్రియదర్శన్ వయ్యారాలుహనీమూన్ కోసం ఫిన్లాండ్ వెళ్లిన నటుడు కాళిదాస్ఒకప్పటి హీరోయిన్ విమలా రామన్ చీరలో సోయగాలుఆస్ట్రేలియాలో చిల్ అవుతున్న బిగ్‌బాస్ శుభశ్రీకేరళలోని రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న 'దృశ్యం' పాపమోడ్రన్ డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల విందుఆసనాలతో అదరహో అనిపిస్తున్న మలైకా అరోరా View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeeprajfilms) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Madhumitha H (@madhumitha.h_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Vaishali Raj (@vaishaliraj_official) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) -
కల్యాణి ప్రియదర్శన్‌కు పెళ్లి అయ్యిందా?
తమిళసినిమా: సామాజిక మాధ్యమాల హవా పెరిగిన తరువాత ప్రచార విధానంలో పెనుమార్పులు సంతరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా వార్త అయిపోతోంది. ముఖ్యంగా సినీ తారల విషయంలో ప్రతి విషయం ఆసక్తికరంగా మారిపోతోంది. దీన్ని సినిమా వాళ్లు, తారలు కూడా బాగా ఉపయోగించుకుంటున్నారనే చెప్పాలి. దీంతో ఏ వార్తలో నిజమెంత అన్నది అధికారికంగా వెల్లడించే వరకూ తెలియని పరిస్థితి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వారి గురించి చాలా గ్యాసిప్స్ సామాజిక మాధ్యమాల్లో దొర్లుతుంటాయి. పలాన వ్యక్తితో ప్రేమాయణం అని, వారి మధ్య విభేదాలు అని వదంతులు వైరల్ అవుతుంటాయి. కొందరు అలాంటి వార్తలను ఎంజాయ్ చేస్తే, మరి కొందరు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. అలా ఇటీవల నటి తమన్నా ఒక చిత్రంలో పాత్ర కోసం భక్తురాలి గెటప్‌లో కనిపిస్తే, దానికి ఆమె ఆధ్యాత్మిక మార్గం పట్టారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్ పెళ్లి చేసుకున్నారనే వార్త ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. కల్యాణి ప్రియదర్శన్ తెలుగు చిత్రం హలో ద్వారా కథానాయకిగా 2017లో తెరంగేట్రం చేశారు. అదే విధంగా తమిళంలో హీరో చిత్రం ద్వారా 2019లో పరిచయం అయ్యారు. ఇక్కడ శింబుకు జంటగా మానాడు వంటి హిట్ చిత్రంలో నటించినా ఎందుకనో పెద్దగా స్టార్ ఇమేజ్ను తెచ్చుకోలేకపోయారు. అయితే వాణిజ్య ప్రకటనల్లో బాగానే నటిస్తున్నారు. ప్రస్తుతం జయంరవికు జంటగా జీనీ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనితో పాటు మలయాళంలో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కల్యాణి ప్రియదర్శన్ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలతో సహా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గురి అవుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటనకు చెందిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో కల్యాణి ప్రియదర్శన్‌కు పెళ్లి అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిసింది. ఏదేమైనా ఈ 31 ఏళ్ల పరువాల సుందరికి ఇంకా కల్యాణ గడియలు రాలేదన్నమాట. -
ఎంత ప్రేమించానో తెలుసా?: హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పుట్టెడు దుఃఖంలో ఉంది. పెంపుడు శునకం చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడలేకపోతోంది. పెట్ డాగ్‌తో ఆడుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. 'థియో.. ఈ వారమే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. తన మరణవార్త నా గుండెను ముక్కలు చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నా దానికి ఎంతో ఎనర్జీ ఉండేది. తన ఇంట్లోనే మేమున్నాం..మేము దాన్ని ఇంటి యజమాని అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఇది తనిల్లు.. తన ఇంట్లోనే మేము నివసిస్తున్నాం. అదొక సిల్లీ వాచ్డాగ్ కూడా! స్టూడియో బయట కూర్చోవడం దానికెంతో ఇష్టం. ప్రతి వేసవిలో దానికి హెయిర్ కట్ చేసేవాళ్లం. దానితో చివరిసారి ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ప్రేమగా ముద్దుపెట్టుకోవాల్సింది. దానిపై ప్రేమ కురిపించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.ఎంతో ప్రేమించా..అలాగే అది లేదన్న నిజం తట్టుకోలేక డీలా పడిపోయిన నన్ను ఓదార్చి ధైర్యంచెప్పినవారికి కూడా థాంక్స్. థియో.. గత కొన్నేళ్లుగా నీతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. కానీ నువ్వు చాలా మంచి అబ్బాయివి. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించానో అర్థం చేసుకో.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు థియోతో కలిసున్న ఫోటోలు జత చేసింది.కాగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Kalyani Priya darshan : తెల్ల చీరలో కల్యాణి ప్రియదర్శన్ సోయగాలు..!
-
Kalyani Priyadarshan Unseen Photos: క్యూట్‌గా కవ్వించే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా...! (ఫోటోలు)
-
'హలో' మూవీ భామ చీర ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!
దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్గా రాణిస్తోంది. నటిగా గుర్తింపులో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు.. ఆమె అభినయం తోడవుతుంటే.. హీరోయిన్గా రాణించడానికి మాత్రం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ అండ్ స్టయిలే హెల్ప్ అవుతున్నాయి. అలా హెల్ప్ అవుతున్న బ్రాండ్స్‌లో కొన్నిటి గురించి.. దీప్తి.. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రాయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్ ను బట్టే ధరలు ఉంటాయి.. వేల నుంచి లక్షల్లో! ఆన్ లైన్ లోనూ లభ్యం. కళ్యాణ్ జ్యూలర్స్.. టాప్–100 విలాసవంతమైన బ్రాండ్స్‌లో కల్యాణ్ జ్యూలర్స్ ఒకటి. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్‌లున్నాయి. సరికొత్త డిజైన్సే దీని బ్రాండ్ వాల్యూ అయితే కొనుగోలుదారుల నమ్మకం ఈ బ్రాండ్‌కి యాడెడ్ వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: కల్యాణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర డిజైనర్: దీప్తి (రూ.52,800) కంఫర్ట్ జోన్లో గ్రోత్ ఉండదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ ఉండదు. నేను ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే అప్పుడప్పుడు.. ఎంచుకునే పాత్రల్లో, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేస్తుంటా! – కల్యాణీ ప్రియదర్శన్. ఇవి చదవండి: హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్! -
స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్.. తల్లి హీరోయిన్, తండ్రి డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్‌తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా. ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) Transformation!!👌🔥 pic.twitter.com/4sjmKINI6V — Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2024 View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
Kalyani Priyadarshan Latest Photos: సాంప్రదాయ దుస్తులలో ఊరిస్తున్న కోలీవుడ్ బ్యూటీ.. (ఫోటోలు)
-
ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నా: యంగ్ హీరోయిన్
ఇటీవలే ఆంటోనీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని కిక్ బాక్సర్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నింటిలో తనదైన నటనతో ఆకట్టుకుంది. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోజు జార్జ్ హీరోగా నటించారు. దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా తాను నటించిన ఆంటోనీ చిత్రం గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలిపింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం కల్యాణి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'కంఫర్ట్ జోన్లో గ్రోత్ లేదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ లేదు. నేను ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నా. కానీ ఆ పంచ్‌లు, కిక్‌లు, గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులు మాత్రమే నిజమయ్యాయి. కానీ ఆ రక్తం మాత్రం నిజం కాదు. మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కేరింతలకు ధన్యవాదాలు. అన్నింటికంటే మించి నాపై, నా సినిమాపై ప్రేమ చూపినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో గాయపడినట్లు కల్యాణి తెలిపింది. మూడు వారాలపాటు ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటలు కిక్ బాక్సింగ్ శిక్షణ ఉండేదని వివరించింది. అందుకోసం చాలా శిక్షణ కష్టపడ్డానని.. గాయాల కారణంగా రెండు రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది. అందుకే ఇతర నటీనటులకు కూడా డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని కల్యాణి తెలిపింది. కాగా.. ఆంటోనీ చిత్రంల నైల ఉష, చెంబన్ వినోద్, ఆశా శరత్, విజయరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం కల్యాణి ఫాతిమా ఆన్ మైక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
రూ. 100 కోట్ల బడ్జెట్.. 18 భాషల్లో విడుదల..కృతి శెట్టికి లక్కీ ఛాన్స్
కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. ఈయన చిత్రాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి కొత్తదనం ఉన్న చిత్రాలను చేస్తుంటారు. పొన్నియిన్ సెల్వన్ వంటి చరిత్రాత్మక కథా చిత్రంలో నటించి, ఆ తరహా కథా పాత్రల్లోనూ సత్తా చాటారు. ఆ చిత్రం మంచి విజయం సాధించినా ఆ తర్వాత వచ్చిన ఇరైవన్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి జీనీ. ఇందులో జయం రవి సరసన కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, వామిక కబీ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. దర్శకుడు అర్జునన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరీ గణేష్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దీనిని రూ.100 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా చిత్రాన్ని 18 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని పక్కన పెడితే జయం రవి నటిస్తున్న రూ.100 కోట్ల బడ్జెట్ చిత్రం ఇదే అవుతుంది. ఇది ఐసరి గణేష్ నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో జీవీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు సైరన్, బ్రదర్ తదితర చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా తనీ ఒరువన్, ఎం.కుమరన్ సన్ఆఫ్ మహాలక్ష్మి చిత్రాల సీక్వెల్స్‌లో నటించేందుకు జయం రవి సిద్ధమవుతున్నారు. -
ఓనం స్పెషల్.. చీరకట్టులో మలయాళ బ్యూటీస్!
కేరళలో 'ఓనం' పండగ సెలబ్రేషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది మలయాళ హీరోయిన్లు.. చీరకట్టులో కనువిందు చేశారు. కల్యాణి ప్రియదర్శన్, హనీరోజ్, మమతా మోహన్ దాస్, అనికా సురేంద్రన్, గౌరి కిషన్, మిర్నా మేనన్ ఇలా అందరూ సోషల్ మీడియాలో పద్ధతిగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఆ ఫొటోలని మీరు ఓసారి చూసేయండి. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) Wishing everyone a vibrant, joyful, and absolutely magical #Onam ❤️ May your homes be filled with love, laughter, and the mouthwatering aroma of a grand Sadya!#HappyOnam #OnamAshamsakal pic.twitter.com/TGlrBqPdso — Parvati (@paro_nair) August 29, 2023 Happy Onam 🤗♥️🤓 pic.twitter.com/wdHoH4ZX7q — Varsha Bollamma (@VarshaBollamma) August 29, 2023 View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
దుల్కర్‌తో వన్స్‌మోర్ అంటున్న హీరోయిన్!
మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. తక్కువకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. మాతృభాష మలయాళంలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి, హే అనామికా వంటి కొత్త తరహా కథా చిత్రాల్లో నటించి అలరించాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు కోలి అనే టైటిల్‌ను నిర్ణయించారు. అట్లీ శిష్యుడు కార్తీకేయన్ వేలప్పన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లు తెలిసింది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని జీ.స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా మానాడు చిత్రంలో శింబు సరసన నటించిన కల్యాణి ప్రియదర్శన్ తాజాగా కోలీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దుల్కర్, కల్యాణి ఇద్దరూ గతంలో వరనే అవశ్యముంద్(తెలుగులో పరిణయం) సినిమాలో నటించారు. చదవండి: ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు -
హిట్ కోసం నిరీక్షణ.. ఈసారైనా అమ్మడి కల నెరవేరేనా?
సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నటీమణుల్లో కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల వారసురాలైన ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. అయితే ఇప్పటికీ కెరియర్లో సరైన హిట్టు పడలేదు అన్నది వాస్తవం. తరువాత తెలుగులో హలో అంటూ పలకరించిన కల్యాణి ప్రియదర్శన్ ఇక్కడ వరుసగా మూడు చిత్రాలు చేశారు. తొలి చిత్రం హలో నిరాశ పరిచినా, చిత్ర లహరి సినిమా విజయం సాధించింది. అయితే అది నటుడు సాయి ధరమ్ తేజ్ ఖాతాలోనే పడింది. ఇక మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ.. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. తమిళం విషయానికి వస్తే హీరో చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత పుత్రం పొందు కాళై, మానాడు తదితర చిత్రాల్లో నటించారు. శింబు సరసన నటించిన మానాడు చిత్రం విజయం సాధించినప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్కి పెద్దగా క్రేజీ తీసుకు రాలేదు. అలాంటిది తాజాగా జయం రవి సరసన జీనీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి, వామిక గబ్బీ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని కల్యాణి ప్రియదర్శిన్ వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందని పేర్కొన్నారు. ఇది తన కెరీర్లో చాలా విలువైన చిత్రంగా మిగిలిపోతుందని నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కథతో రూపొందుతున్న చిత్రమని చెప్పారు. ఇందులో తనది నటించడానికి అవకాశం ఉన్న పాత్ర అని, జీని మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. చదవండి: ప్రెగ్నెన్సీతో పోకిరి భామ.. ఎట్టకేలకు ప్రియుడిని చూపించింది -
చీరలో అరియానా.. 'స్పై' బ్యూటీ స్పైసీ లుక్!
చీరలో అరియానా.. హాట్ పోజులు ఎదురుచూస్తున్న ఈషా రెబ్బా రెడ్ డ్రస్‌లో హాట్‌గా 'స్పై' బ్యూటీ ఉల్లిపొర లాంటి చీరలో కల్యాణి ప్రియదర్శన్ షూటింగ్ లో రాశీఖన్నా బిజీ.. ఓర కంటితో చూస్తూ రోజువారీ లైఫ్.. ఒక్క ఇన్‌స్టా పోస్టుతో చెప్పేసిన మృణాల్ కలర్ కలర్ డ్రస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Kalyani Priyadarshan Photos: కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న కల్యాణి ప్రియదర్శన్ (ఫోటోలు)
-
ముగ్గురు హీరోయిన్స్‌తో జయంరవి రొమాన్స్.. స్టార్స్‌తో డ్యూయెట్లు
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాజు అరుణ్ మొళి వర్మగా ప్రేక్షకుల మన్ననలను పొందిన జయం రవి ఇప్పుడు మళ్లీ రొమాంటిక్ హీరోగా మారబోతున్నారు. ప్రస్తుతం ఈయన సైరన్ చిత్రంలో కీర్తి సురేష్ తోనూ, ఇరైవన్ చిత్రంలో నయనతారతోనూ డ్యూయెట్లు పాడుతున్నారు. కాగా జయం రవి కథానాయకుడిగా వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత రూ.100 కోట్ల బడ్జెట్లో భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటింన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా భువనేశ్ అర్జునన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు మిష్కిన్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో జయం రవికి జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా నటి కృతి శెట్టి ఒక హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ను ఇందులో మరో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మూడో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చిత్రం జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
సోయగంతో కవ్విస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ (ఫోటోలు)
-
నా చీర కట్టు నాకు ఇష్టం
దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురుగా సినీరంగలోకి అడుగుపెట్టిన కళ్యాణీ ప్రియదర్శన్.. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే అయినా తన ప్రత్యేకతతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ ప్రత్యేకతే ఆమెను ఫ్యాషన్ ఐకాన్‌గానూ నిలబెడుతోంది ఇలా.. నా చీర కట్టు అంటే నాకు చాలా ఇష్టం. చీర కట్టుకున్న ప్రతిసారీ నన్ను నేను కౌగిలించుకున్నట్లు అనుభూతి చెందుతాను. – కళ్యాణీ ప్రియదర్శన్. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా బ్రైడల్ కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్. తమలోని ఫ్యాషన్ స్పృహ, భారతీయ హస్తకళల పట్ల తమకున్న మక్కువ, గౌరవాలకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. భారతీయ సంప్రదాయ నేతకళకు ఆధునిక ఆకృతులు, రంగులు, హంగులు అద్దుతున్నారు. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా బ్రాండ్.. పేరుకు దేశీయమైనా ఫ్యాషన్ రంగంలో అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంటోంది. ధరలనూ అంతే స్థాయిలో అంచనా వేసుకోవచ్చు. ఆన్లైన్లో లభ్యం. కళ్యాణ్ జ్యూయెల్స్ దేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ బ్రాండ్స్‌లో ఒకటి ఈ కళ్యాణ్ జ్యూయెల్స్. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్‌లున్నాయి. సరికొత్త డిజైన్సే కాదు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. నాణ్యత, డిజైన్ బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: కళ్యాణ్ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర బ్రాండ్: జేడ్ బై మోనికా అండ్ కరిష్మా ధర:రూ. 96,500 -
హీరోయిన్ ఇంట పెళ్లి సందడి.. ఫోటో షేర్ చేసిన కల్యాణి
ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమారుడు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తమ్ముడు సిద్దార్థ్ వివాహం ఘనంగా జరిగింది. అమెరికన్ పౌరురాలు మెర్లిన్తో అతడు ఏడడుగులు నడిచాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన వీరి పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోదరుడి పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను కల్యాణి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. కాగా ప్రియదర్శన్ రచయితగా, దర్శకుడిగా అనేక సినిమాలు చేశారు. మలయాళంలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేశారు. హీరా ఫేరి, హంగామా, హల్చల్, గరం మసాలా, భాగమ్ భాగ్, చుప్ చుప్కే, డె దనాదన్, భూల్ భులాయా వంటి హిట్ సినిమాలతో బీటౌన్‌లో గుర్తింపు పొందారు. 1990లో మలయాళ నటి లిజిని పెళ్లి చేసుకున్న ఆయన 2016లో ఆమెకు విడాకులిచ్చారు. వీరికి కల్యాణి, సిద్దార్థ్ సంతానం. హలో సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం మలయాళ మూవీస్‌తో బిజీగా ఉంది. Last evening we celebrated my brother’s marriage in the most special and intimate ceremony at home with just family. Im so excited to have Melanie be the sister I’ve always wanted ♥️. Hope we all have your blessings 🙏🏻 pic.twitter.com/6fhIDYFqJ1 — Kalyani Priyadarshan (@kalyanipriyan) February 4, 2023 Film Maker @priyadarshandir & actress Lissy's son Siddharth Priyadarshan got married. The bride is Marilyn, an American citizen and visual effects producer. Actress @kalyanipriyan is Siddharth's sister.#KalyaniPriyadarshan pic.twitter.com/v4KEhfbAB2 — Mollywood Exclusive (@Mollywoodfilms) February 3, 2023 చదవండి: స్టార్ డైరెక్టర్‌కు ప్రమాదం.. నెల రోజులదాకా కష్టమే! ఎన్నోసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చాను: విజయశాంతి -
క్రేజీ ఆఫర్ కొట్టేసిన కల్యాణి ప్రియదర్శన్..!
ఏ రంగంలోనైనా వారసత్వం అన్నది ఎంట్రీ కార్డు మాత్రమే. ఆ తరువాత ప్రతిభ, అదృష్టంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక సినీ హీరోయిన్ల విషయానికి వస్తే దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో నటి శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, కీర్తి సురేశ్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు సెలబ్రిటీల వారసురాళ్లే. ప్రతిభకు అదృష్టం తోడవడంతో ప్రముఖ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. నటి కల్యాణి ప్రియదర్శన్ విషయానికి వస్తే దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ (వీరు చాలా కాలం క్రితమే విడిపోయారు) దంపతుల వారసురాలు అన్న విషయం తెలిసిందే. కథానాయకిగా రంగప్రవేశం చేసి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. తెలుగులో అఖిల్ అక్కినేనికి జంటగా హలో చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. ఆ తరువాత మలయాళం, తమిళం భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో శింబుతో మానాడు చిత్రంలో నటించి హిట్‌ను అందుకుంది. ఇటీవల ఈమె మలయాళంలో నటించిన హృదయం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోందని సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవడు, నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ కొడుకు యువరాజ్ కుమార్ హీరోగా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆయనకు జంటగా కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లు తాజా సమాచారం. దీంతో దక్షిణాదిలో ఈ బ్యూటీ ఒక రౌండ్ కొట్టేసినట్లే అవుతుంది. చదవండి: స్విట్జర్లాండ్‌కు మహేశ్‌బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వైరల్ -
ఈతరం రీయూనియన్.. ఒకే ఫ్రేములో హీరోయిన్స్ సందడి
తమిళసినిమా: 1980 తరానికి చెందిన దక్షిణాది స్టార్ హీరోహీరోయిన్లు ఏటా రీయూనియన్ పేరుతో సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబైలో రీయునియన్ కార్యక్రమం జరిగింది. కాగా తాజాగా ఈ తరం తారలు రీయూనియన్ వేడుకను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ కూడా ఈతరం హీరోయిన్స్‌తో రీయూనియన్ నిర్వహించింది. నటి కీర్తి సురేష్ తమిళం, తెలుగు, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జయం రవి సరసన నటిస్తున్న సైరన్ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది అదేవిధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటిస్తున్న భోళాశంకర్ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్‌కు అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో 1.39 కోట్ల పాలోవర్స్ ఉన్నారు. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఇంట్లో ఈ తరం తారల రీయూనియన్ కార్యక్రమం జరిగింది. నటి కీర్తిసురేష్‌తో పాటు కళ్యాణి ప్రియదర్శన్, పార్వతి తిరువొత్తు, రీమా కళింగళ్, అతిథి బాలన్, ప్రియ మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నటి కీర్తి సురేష్ తల్లి మేనక ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, లిజీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోలను కీర్తి సురేష్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ నూతన ఆరంభం అని పేర్కొన్నారు. అత్యుత్తమ మనుషులతో మధురమైన రేయి అని పొందుపరిచింది. -
'ఓనమ్' స్పెషల్.. హీరోయిన్ల చీరకట్టు అదిరిందిగా
పండగలప్పుడు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం కామన్. అయితే ఈసారి ఓనమ్ పండగకి మలయాళంలో పెద్ద చిత్రాలేవీ విడుదల కాలేదు. ఆ రకంగా వెండితెర పండగ మిస్సయింది. అయితే లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటూ.. మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ తదితరులు తమ చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కు ‘ఓనమ్’ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కొందరు కథానాయికలు గురువారం ‘అంగన్నె ఓనమ్ వన్ను’ (అలా ఓనమ్ వచ్చింది) అంటూ ఓనమ్ స్పెషల్ శారీ కట్టుకుని, ట్రెడిషనల్ జ్యువెలరీ పెట్టుకుని ఫొటోలు షేర్ చేశారు. బంగారు రంగు చారలున్న ఐవరీ కలర్ చీర, మల్లెపువ్వులు, ముత్యాల నెక్లెస్‌కి బంగారు లాకెట్, చెవి దుద్దులతో అందంగా ముస్తాబయ్యారు అనుపమా పరమేశ్వరన్. ‘ఓనమ్ చిరునవ్వు ఇదిగో’ అంటూ ఆ ఫొటోలు షేర్ చేశారు. మరో మలయాళ కుట్టి కల్యాణీ ప్రియదర్శన్ కూడా జరీ అంచు ఉన్న తెలుపు రంగు చీర, గ్రాండ్‌గా ఉన్న చెవి దుద్దులు, చేతినిండా గాజులు, జడకు మల్లెపువ్వులు పెట్టుకుని తళతళలాడారు. ‘అందరికీ హ్యాపీ ఓనమ్’ చెప్పి, ఫొటో షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ఇంకో మలయాళ భామ రమ్యా నంబీసన్ కూడా తెలుపు రంగు చీర, చక్కని నగలతో పాటు నుదుట బొట్టుతో కళకళలాడారు. ‘అంగన్నె ఓనమ్ వన్ను’ అంటూ ఫొటో షేర్ చేశారు రమ్య. ఇక పండగ సందర్భంగా మంజు వారియర్ కూడా ప్రత్యేకంగా రెడీ అయ్యారు. ‘హ్యాపీ ఓనమ్’ అంటూ ఫొటో షేర్ చేశారు. ఇంకా ప్రియమణి, సంయుక్తా మీనన్, భావన తదితర తారలు తళుకులీనారు. ఇలా మలయాళ పరిశ్రమలో ఓనమ్ సందడి బాగా కనిపించింది. -
Fashion: అప్పుడప్పుడైనా ప్రయోగాలు చేయాలి: కళ్యాణి
కళ్యాణీ ప్రియదర్శన్.. లిజీ, ప్రియదర్శన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించినా నిలబడింది మాత్రం తన కళతోనే. అభినయ కౌశలం, గ్లామర్ మెరుపు.. దేన్నయినా పోషిస్తున్న పాత్రకనుగుణంగా తెర మీద సాక్షాత్కరింప చేస్తుంది. సినిమా స్క్రీన్కు అతీతంగా ఆమెను అందంగా చూపిస్తున్న.. అంతే క్యాజువల్‌గా, సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ఫాబియానా తూర్పు (ఇండియా), పశ్చిమ (యూరప్)ల ఫ్యాషన్ కలయిక ఈ బ్రాండ్. పెళ్లిళ్లు, పండగలు వంటి వేడుకలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. దీని సృష్టికర్త, డిజైనర్ కరిష్మా. నిజానికి ఈ బ్రాండ్ ఆవిష్కరణకు ఆద్యురాలు కరిష్మా వాళ్లమ్మ కుసుమ్. యురోపియన్ ఫ్యాబ్రిక్స్, రాజస్థాన్ సంప్రదాయపు అద్దకం బాంధనీ ప్రింట్, లక్నో సంప్రదాయపు ఎంబ్రాయిడరీ చికన్కారీల సమ్మేళనమే ఈ బ్రాండ్ ప్రత్యేకత... ఈ బ్రాండ్‌కు వాల్యూ కూడా. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చదివిన కరిష్మా ఈ మధ్యే పురుషుల కోసమూ డిజైనర్ వేర్‌ను మొదలుపెట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ అయిన ఈ బ్రాండ్.. నచ్చిన ఫ్యాబ్రిక్ మీద, నచ్చిన తీరులో డిజైన్ చేయించుకునే సౌలభ్యాన్నీ కల్పిస్తుంది. ధరలూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అయితే తన బ్రాండ్‌ను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు ఆర్గంజా, హ్యాండ్ ప్రింట్స్‌తో డిజైన్ చేసిన దుస్తులను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది కరిష్మా. రాధికా అగ్రవాల్ స్టూడియో ఆధునిక మహిళకు భారతీయ కళల భూషణం ఈ బ్రాండ్. చిత్రలేఖనం, సంగీతం, ఇక్కడి ప్రజలు, ప్రాంతాలు .. అన్నిటినీ చూసి, విని, పర్యటించి స్ఫూర్తి పొంది .. సృష్టించిన బ్రాండే ఇది. సృష్టికర్త రాధికా అగ్రవాల్. దేశంలోని విభిన్నత, వైవిధ్యాలను ఓ కళగా ఆస్వాదిస్తూ.. ఆభరణాలుగా తీర్చిదిద్దుతూ భారతీయ మహిళల జ్యూయెలరీ బాక్స్‌కు రిచ్‌నెస్‌ను ఇస్తోంది. ఇదే ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. కొనుగోలుదారుల అభిరుచి, సృజనకూ విలువనిస్తూ వాళ్లు కోరుకున్నవిధంగా నగలను తయారుచేసి ఇస్తోంది. ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలి అప్పుడప్పుడైనా ఫ్యాషన్‌తో ప్రయోగాలు చేయాలి. లేకపోతే ఒత్తయిన జుట్టూ, మేకప్ కిట్టూ ఉండి ఏం లాభం? – కళ్యాణీ ప్రియదర్శిని జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ బ్రాండ్: రాధిక అగ్రవాల్ స్టూడియో ధర: రూ. 7,725 చీర పోల్కా డాట్ బ్లష్ పింక్ శారీ బ్రాండ్: ఫాబియానా ధర: రూ. 45,000 -∙దీపిక కొండి చదవండి: గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్ -
ఆ బడా నిర్మాతకు మలయాళం రొమాంటిక్ మూవీ రైట్స్..
Karan Johar Acquire Malayalam Movie Hridayam Rights: ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఓ మలయాళం బ్లాక్ బ్లస్టర్ హిట్ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ సినిమా ఏంటంటే.. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హృదయం' చిత్రం. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్, దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సోషల్ మీడియాతోపాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ మనసు గెలుచుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుుకన్నారు. సోషల్ మీడియా వేదికగా 'నేను మీతో ఈ వార్తను పంచుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్డూడియోస్ మలయాళం న్యూ ఏజ్ ప్రేమకథా చిత్రం హృదయం సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల హక్కులను పొందాయి.' అని కరణ్ జోహార్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రస్తుతం రణ్వీర్ సింగ్, అలియా భట్లు హీరోహీరోయిన్లుగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో జయా బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా నటించున్నారని సమాచారం. I am so delighted and honoured to share this news with you. Dharma Productions & Fox Star Studios have acquired the rights to a beautiful, coming-of-age love story, #Hridayam in Hindi, Tamil & Telugu – all the way from the south, the world of Malayalam cinema. pic.twitter.com/NPjIqwhz8l — Karan Johar (@karanjohar) March 25, 2022 -
ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా: శింబు
సాక్షి, చెన్నై(తమిళనాడు): నటుడు శింబు మానాడు చిత్ర ఆడియో వేదికలో కంటతడి పెట్టారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించారు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శింబు మాట్లాడుతూ ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని, అభిమానులు మాత్రం తన వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
ఐదు భాషల్లో శింబు ‘రివైండ్’
‘‘శింబు హీరోగా నటిస్తున్న సినిమా టీజర్‌ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అన్నారు హీరో రవితేజ. శింబు, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రివైండ్’. హిందీ–తమిళ్– తెలుగు–కన్నడ–మలయాళ భాషల్లో సురేష్ కామాచి నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మానాడు’, తెలుగులో ‘రివైండ్’ టైటిల్‌తో రూపొందుతోంది. బుధవారం శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ని రవితేజ రిలీజ్ చేశారు. ‘మానాడు’ హిందీ టీజర్‌ని దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ టీజర్‌ని సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, కన్నడ టీజర్‌ని హీరో సుదీప్ విడుదల చేశారు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో శింబు ముస్లిమ్ పాత్ర చేస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దర్శకులు భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, ఎస్.జె. సూర్య, కరుణాకరన్ నటిస్తుండడం విశేషం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. -
ప్రణవ్, కల్యాణి లవ్‌లో ఉన్నారా?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఆప్త మిత్రులు. ఒకరి కెరీర్ కి ఒకరు ఎంతగానో సహాయపడ్డారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శన్ కూతురు కల్యాణీ ప్రియదర్శన్ తెలుగు సినిమా ‘హలో’ ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ప్రణవ్, కల్యాణి మలయాళంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. ఆ మధ్య ప్రణవ్, కల్యాణి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అయింది. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు మలయాళం ఇండస్ట్రీ లో వార్తలు మొదలయ్యాయి. ‘‘ప్రణవ్, కల్యాణి లవ్ లో ఉన్నారా? అనే ప్రశ్న మోహన్ లాల్ వరకూ వెళ్లింది. ఈ విషయం గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ – ‘ప్రణవ్, కల్యాణి బెస్ట్ ఫ్రెండ్స్. నేను, ప్రియదర్శన్ ఎలానో వాళ్లిద్దరూ అలా. ఒక్క సెల్ఫీ వల్ల ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని ఎలా ఊహించుకుంటారు? అనవసరమైన వార్తలు ప్రచారం చెయ్యొద్దు. నమ్మొద్దు’’ అని ఈ వార్తలను కొట్టిపారేశారు. మోహన్ లాల్ నటించిన ‘అరబికడలింటే సింహం: మరాక్కర్’లో ప్రణవ్, కల్యాణి కూడా నటించారు. అలానే ‘హదయమ్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. -
సామాజిక బాధ్యతతో శక్తి
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్‌మేన్’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్‌మేన్’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్‌గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
విద్యా వ్యవస్థపై పోరాటం
శివ కార్తికేయన్ హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ‘శక్తి’ పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోంది. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి. జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ మాన్, స్పైడర్ మాన్, శక్తి మాన్.. అంటే పిల్లలకే కాదు అన్ని వయసుల వారిలో ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్ల స్ఫూర్తితో సాహసాలు చేస్తుంటారు కొంతమంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాంటివాడే. సూపర్ హీరోలా మారి విద్యా వ్యవస్థలోని విషయాలపై ఎలా పోరాడాడు? అన్నదే కథాశం. వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఏదైనా విభిన్న నేపథ్యం లేకపోతే శివ కార్తికేయన్ సినిమా చేయరు. ‘శక్తి’ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తూ హార్ట్‌ని టచ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే’’ అన్నారు కోటపాడి. జె. రాజేష్. -
‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు’
మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’. దర్శకుడు ప్రియదర్శన్‌కు ఈ చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ చిత్రాన్ని మోహన్‌లాల్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటొని పెరుంబవూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 26న విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ల్ లుక్ పోస్టర్స్ అదిరిపోగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగులో ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఇక తమిళ ట్రైలర్‌ను సూర్య, కన్నడ ట్రైలర్‌ను యశ్, హిందీ ట్రైలర్‌ను అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్సందన వస్తోంది. భారీ తారాగణంతో కనుల విందుగా ఉన్న ట్రైలర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యువ హీరోలతో పోటీపడుతూ వైవిధ్యభరిత పాత్రలను, కథలను ఎంచుకుంటున్న మోహన్‌లాల్‌కు సలాం కొడుతున్నారు. అంతేకాకుండా ‘ఇది మలయాల బాహుబలి’అని, బాహుబలి రేంజ్లో మరక్కార్ సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శన్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.‘బాహుబలి’కి పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. దాదాపు వందకోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తొలి మలయాళ చిత్రం ‘మరక్కార్’కావడం విశేషం. రోనీ రాఫెల్ సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: సినీ నిర్మాత నట్టి కుమార్‌కు ఏడాది జైలుశిక్ష గుడ్‌న్యూస్ చెబుతారా? -
‘ప్రేమ వివాహమే చేసుకుంటా’
చెన్నై : ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటోంది నటి కల్యాణి ప్రియదర్శన్. ఈ చిన్నది ప్రముఖ సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు అన్న విషయం తెలిసిందే. అమెరికాలో చదువుకున్న కల్యాణి ప్రియదర్శన్ తన తల్లిదండ్రుల మాదిరిగానే జీవిత పయనాన్ని సినీరంగంలోనే సాగించడానికి సిద్ధమయ్యింది. అలా తొలి సారిగా తెలుగులో ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత మాతృభాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో శివకార్తీకేయన్‌కు జంటగా హీరో చిత్రంతో దిగుమతి అయ్యింది. తాజాగా శింబుకు జంటగా మానాడు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. అంతే కాదు ఇటీవల తన తల్లితో కలిసి ఒక యాడ్‌లో నటించింది. ఈ అనుభవాలను ఒక భేటీలో పంచుకుంది. ప్ర: మీరు కోరుకున్నట్లుగానే నటిగా విజయ బాటలో నడుస్తున్నారని భావిస్తున్నారా? జ: నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఎక్కువగా ఆశలు పెట్టుకోను. మలయాళంలో ఒక మంచి చిత్రంలో నటించాలని ఆశించాను. అలా సురేశ్‌గోపి, నటి శోభన వంటి ప్రముఖ నటీనటులతో నటించే అద్భుతమైన అవకాశం లభించింది. అందులో నేను నటించిన సన్నివేశాలు మొదట చెన్నైలోనే చిత్రీకరించారు. నేను నటి శోభనను ఆంటీ అనే పిలుస్తాను. అంత సీనియర్ నటితో కలిసి నటించేటప్పుడు ఎలా పిలవాలని సంకోశించాను. ఆమె నాతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటిస్తున్నాను. ఆయనే నిర్మాత. దుల్కర్‌తో నటించడానికి ముందు భయపడ్డాను. నా పరిస్థితిని గ్రహించి చాలా ధైర్యాన్నిచ్చారు. ప్ర: మీ తండ్రి దర్శకత్వంలో కంజాలి మరైక్కాయర్ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఆ అనుభవం గురించి? జ: ఆ చిత్రంలో నేను గెస్ట్ పాత్రలోనే నటించాను. మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్‌తో కలిసి ఒక పాటలో కనిపించాను. తనూ నేను చిన్న వయసు నుంచే గొడవ పడేవాళ్లం. అందువల్ల ప్రణవ్‌లో నటించేటప్పుడు నవ్వు వస్తుందేమోనని భయపడ్డాను. అలాంటిదేమీ జరగలేదు. నాన్న దర్శకత్వంలో నటించడం మాత్రం భయం అనిపించింది. మరో చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే నా ప్రాణం పోయినట్టే. పలు భాషల్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన నా తండ్రి నన్ను డైరెక్ట్ చేస్తున్నప్పుడు టెన్సన్ పడటం నేను గమనించాను. నాన్న టెన్సన్ గురించి సినిమా వారందరికీ తెలిసిందే. ప్ర: మీ అమ్మతో కలిసి వాణిజ్య ప్రకటనలో నటించిన అనుభం ఎలా ఉంది? జ: ఆ ప్రకటనలో నటించే ముందు నాది పెళ్లి కూతురు వేషం అని చెప్పారు. అమ్మ పాత్రలో మరొకరు నటిస్తారు అని అన్నారు. కాగా షూటింగ్‌కు ముందు రోజు అమ్మ నీతో నటించేది ఎవరో తెలుసా? అని అడిగింది. అందుకు నేను తెలియదు అని చెప్పాను. అప్పుడు ఆ పాత్రలో నటించేది నేనే అని ఆనందంతో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా అమ్మ కెమెరా ముందుకు వచ్చి చాలా కాలం అయ్యింది. అనవసరంగా ఒక ఫొటోకు కూడా పోజు ఇవ్వరు. అలాంటిది ఎలా వాణిజ్య ప్రకటనలో నటించడానికి సమ్మతించారన్నదే నా ఆశ్చర్యానికి కారణం. నాతో కలిసినటించాలని ఆశతోనే అమ్మ ఆ వాణిజ్య ప్రకటనలో నటించడానికి అంగీకరించారని తెలిసింది. ఆ ప్రకటనలో నన్ను పెళ్లి కూతురు రూపంలో చూసి అమ్మ ఆనంద భాష్పాలు రాల్చే క్లోజప్ సన్నివేశం ఉంటుంది. అందులో నటించడానికి అమ్మ గ్లిజరిన్ వాడారు. అలా నేను పెళ్లి కూతురు రూపంలో నడిచి వస్తుంటే అమ్మ కళ్లు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. అప్పుడు నువ్వు ఈ గెటప్‌లో ముందుగానే వచ్చి ఉంటే నాకు గ్లిజరిన్‌తో పని ఉండేదే కాదు అని అమ్మ నిజంగానే ఆనంద భాష్పాలు కార్చారు. ప్ర: సరే మీరు కూడా పెళ్లికి వరుడి కావాలి అని ప్రకటన ఇస్తారా? జ: నాకు అలాంటి ప్రకటన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ విషయంలో నేను సినిమా ఫక్కీని కోరుకుంటున్నాను. నాకు కాబోయే జీవిత భాగస్వామి ఎదురైనప్పుడు నా హృదయం తీయని మంటల్లో విహరిస్తుందని నమ్ముతున్నానని కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. -
సూపర్ హీరో శక్తి
తమిళ నటుడు శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘హీరో’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోటపాడి రాజేష్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్‌గా నటించారు. ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ‘‘శక్తిమాన్ సీరియల్ చూస్తూ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు హీరో. మరి సూపర్‌హీరో అయ్యాడా? సమాజంలో అతను తెచ్చిన మార్పు ఏంటి? అనే కథతో తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా స్వరకర్త. -
అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి
తమిళనాట మంచి మాస్ హీరోగా ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ కథానాయకుడిగా ‘ఇరుంబుదురై (అభిమన్యుడు)’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘హీరో’. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. గతేడాది డిసెంబర్ 20న తమిళంలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే అభిమన్యుడు చిత్రంతో డైరెక్టర్ మిత్రన్, కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హీరో చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శక్తి పేరిట విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ తొలి సారి దక్షిణాదిచిత్రంలో కనిపించాడు. ఇక అభిమన్యుడు చిత్రంతో పీఎస్ మిత్రన్ తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగు డబ్బింగ్ మొదలు పెట్టిన చిత్ర బృందం ఈ సినిమాను నెలాఖరులో విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతమందించిన ఈ చిత్రానికి జార్జి.సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక అఖిల్ అక్కినేని హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంతో అఖిల్, హీరో(శక్తి) చిత్రంతో మిత్రన్ బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది. -
ఆర్చ... అదరహా
మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్ మలయాళ మూవీ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్‌లాల్ యంగ్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్. ఆమె క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్ ఆదరహా అంటోంది మాలీవుడ్. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. మరి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో కనిపించాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? అని హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్‌ని అడిగితే– ‘‘ఇప్పటి వరకూ నేను చేసింది కేవలం మూడు నాలుగు సినిమాలే. ప్రస్తుతం నటిగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నన్ను నమ్మి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఎవరైనా దర్శకులు వస్తే చేస్తానేమో? కానీ, నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా ఎక్కువ మందిని ప్రభావితం చేయలేకపోవచ్చని నా భావన. దీపికా పదుకోన్‌లాంటి పెద్ద హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఆ ప్రభావం వేరు.. ఆ సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ దగ్గరకు వెళ్తుంది. కానీ, నేనింకా ఆ స్థాయికి వెళ్లలేదు. మా నాన్నగారు (మలయాళ దర్శకుడు ప్రియదర్శన్) స్టార్స్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా కథలు రాసేవారు.. పాత్రల్ని డిజైన్ చేసేవారు. ఆ విధంగా ఎవరో ఒక రచయిత లేదా దర్శకుడు ఒక పాత్రకు కేవలం నన్ను మాత్రమే ఊహించుకొని కథ రాసే స్థాయి స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. నటిగా నా లక్ష్యం అదే’’ అన్నారు. -
ఆయన దర్శకత్వంలో నటించాలనుంది!
సినిమా: నటుడు శివకార్తికేయన్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నట్లు నటి కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదనుకుంటా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురే ఈ బ్యూటీ. హలో చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన భామ ఇప్పుడు కోలీవుడ్‌లో హీరో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో కోటప్పాటి జే.రాజేశ్ తన కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్గా నటించిన నటి కల్యాణి తన అనుభవాలను పంచుకుంటూ హీరో చిత్రంలో తాను మీరా అనే పాత్రలో నటించానని చెప్పింది. మీరా చాలా పరిణితి చెందిన యువతి అని పేర్కొంది. ఏం మాట్లాడినా ఏ పని చేసినా పలుమార్లు ఆలోచించి చేసే యువతి మీరా అని చెప్పింది. ఈ పాత్ర తన నిజజీవితానికి పూర్తిగా భిన్నమైందని చెప్పింది. తాను ఏదైనా అనుకుంటే మరో ఆలోచన లేకుండా చేసేస్తానని పేర్కొంది. హీరో చిత్రం ప్రధానంగా విద్యపై చర్చించే ఇతివృత్తంతో కూడిందని చెప్పింది. తాను ఇండియాలోనూ, విదేశాల్లోనూ చదివిన అమ్మాయినని,ఆ విధంగా ఈ రెండు విధానాల విద్య గురించి తెలిసిన యువతినని అంది. ఈ చిత్రంలో మన దేశంలో విద్య గురించేదిగా ఉంటుందని చెప్పింది. అంతే కాకుండా మన దేశంలో విద్యావిధానం గురించి విద్యార్థులు చర్చించుకునే విధంగా ఈ చిత్ర కత ఉంటుందని తెలిపింది. దర్శకుడు పీఎస్.మిత్రన్ తెరపై మాయాజాలం చూపడంలో దిట్ట అని పేర్కొంది. చిత్రంలోని ప్రతి చిన్న పాత్రను కూడా సరిగ్గా చూపించారని అంది. నటుడు శివకార్తికేయన్ చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పింది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభిమానంగా చూసుకుంటారని చెప్పింది. ఆయన మంచి నటుడే కాదని, మంచి దర్శకుడు శివకార్తికేయన్‌లో ఉన్నారని అంది. ఏదో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఈ చిత్రం వెనుక ఉన్న సూపర్‌హీరోల గురించి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంంలోనే చెప్పానని, జిల్లనిపించే యువన్‌శంకర్‌రాజా సంగీతం, ఛాయగ్రాహకుడు జార్జ్ సీ.విలియస్ వంటి సాధికులతో కలసి పని చేశానన్నది ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని అంది. తనపై నమ్మకంతో ఇందులో కథానాయకిగా నటించడానికి తనను ఎంపిక చేసిన చిత్ర నిర్మాత రాజేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నటి కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. -
14 ఏళ్ల తర్వాత
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు మలయాళ నటుడు సురేశ్ గోపీ, శోభన. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపీ. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో చివరిసారి కలసి నటించారు. లేటెస్ట్గా అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఈ జంట నటిస్తోంది. తొలిరోజు షూటింగ్లో తీసిన ఫొటో ఇది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. -
అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్
సాక్షి, చెన్నై : నటుడి కొడుకు ప్రేమలో... నటి కూతురు అనగానే ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ‘తప్పు’లో కాలేసినట్లే. ప్రేమ అన్నది ఎవరికి? ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. ఎక్కడో? ఏదో సందర్భంలో? అనుకోకుండా కలిగేదే ప్రేమ. అయితే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల మధ్య కూడా ప్రేమ కలగవచ్చు. అలాంటిదే నటి కల్యాణి ప్రేమ కూడా అనే ప్రచారం ఇప్పుడు సినీ పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. సంచలన సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు కల్యాణి అన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. ఇటీవలే చిత్రలహరి సినిమాతో మంచి హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా కల్యాణి ఇప్పుడు ప్రేమలో మునిగిపోయిందన్న ప్రచారం హోరెత్తుతోంది. ఈ బ్యూటీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్‌తో ప్రేమలో పడిందట. మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ కళాశాల రోజుల నుంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 43 చిత్రాలు వచ్చాయి. ఇది ఒక రికార్డు. అంతే కాదు మోహన్‌లాల్, ప్రియదర్శన్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్, ప్రియదర్శన్ కూతురు కల్యాణిల మధ్య బాల్యం నుంచే స్నేహం కొనసాగుతూ వచ్చింది. అది ఇప్పుడు ప్రేమగా మారిందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ప్రస్తుతం ప్రణవ్, కల్యాణి తమ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నకు నటి కల్యాణి స్పందిస్తూ చాలా తెలివిగా బదులిచ్చింది. ‘నేను ఒకరిని ప్రేమిస్తున్న మాట నిజం. భవిష్యత్‌లో అతన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరిని ప్రేమిస్తున్నానన్న విషయం నా కుటుంబసభ్యులకు తెలుసు. మా ప్రేమకు ఎలాంటి సమస్య లేదు. నేను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు, వివరాలను ప్రస్తుతానికి చెప్పను’ అని కల్యాణి పేర్కొంది. -
ఒక జానర్‌కి ఫిక్స్ అవ్వను
‘‘ఒక జానర్‌కి, ఒక స్టైల్‌కి ఫిక్స్ అవడానికి ఇష్టపడను. సినిమా సినిమాకు జానర్స్ మార్చుకుంటూ వెళ్లడానికి ఇష్టపడతాను. ప్రతి స్క్రిప్ట్ విభిన్నంగా ఉండాలి. ఎప్పుడూ ఒకటే చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్‌కు బోర్ కొట్టేస్తాం’’ అన్నారు శర్వానంద్. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా, కల్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగ ర్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గత గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్ బావుంది. రిలీజ్ రోజు ఉదయం డివైడ్ టాక్ వచ్చింది. తర్వాత యావరేజ్ అన్నారు. ఇప్పుడు ఎబౌ యావరేజ్ అంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ కూడా బాగాలేదు అనడం లేదు. ‘చాలా బావుంటుంది’ అంటారనుకున్నాం. ఈ రిజల్ట్ ఊహించలేదు. రివ్యూలు ఒకలా ఉన్నాయి. ప్రేక్షకులు చెబుతున్నది ఒకలా ఉంది. ఏం జరిగిందో అని విశ్లేషించుకుంటున్నాను. ఒక విధంగా హ్యాపీగా ఉంది. ఇంకో విధంగా చిన్న అసంతృప్తి. కలెక్షన్స్ పరంగా సూపర్ హ్యాపీ. రివ్యూలు కూడా ఇంకొంచెం బావుంటే కలెక్షన్స్ ఇంకా బావుండేవేమో? అని చిన్న ఆశ (నవ్వుతూ). ► విమర్శ అనేది ప్రతి ఆర్టిస్ట్‌కు అవసరం. అది విలువైనది అయితే దాన్ని తీసుకొని మనల్ని మనం మెరుగుపరచుకోవాలి. ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలు చేశాను. జానర్ మార్చుదామని ఈ సినిమా చేశాను. సుధీర్, నేను ఓ స్టైలిష్, యాక్షన్ సినిమా చేయాలనుకున్నాం. సినిమాలో స్క్రీన్‌ప్లే నాకు బాగా నచ్చింది. రెండుషేడ్స్ ఉన్న పాత్రలు ఉన్నాయి. యాక్టర్‌గా చాలెంజింగ్‌గా ఉంటుందనిపించింది. ‘ప్రస్థానం. రన్ రాజా రన్’ సినిమాల తర్వాత ‘ప్రతి ఫ్రేమ్‌లో బావున్నాను’ అని ఈ సినిమాకు అనిపించింది. ► సినిమాలో ఓల్డ్ లుక్‌కి కష్టపడలేదు. ఆ గెటప్ వేయగానే హుందాతనం వచ్చింది. యంగ్ లుక్‌లో నేను చిరంజీవి ఫ్యాన్‌లా నటించాను. ‘ఘరానా మొగుడు, అల్లుడా మజాకా’ సినిమాల్లో మేనరిజమ్స్‌ని నా స్టైల్లో ఇమిటే ట్ చేశాను. ► ‘మాకు మంచి సినిమా తీసి ఇవ్వండి’ అన్నారు నిర్మాత చినబాబు గారు. సినిమా కోసం నాగవంశీ కూడా చాలా కష్టపడ్డాడు. ఈ బ్యానర్ నుంచి మంచి సినిమాలే వస్తాయి. కుదిరితే ఈ బ్యానర్లో మళ్లీ చేస్తా. ► నెక్ట్స్ ‘96, శ్రీకారం’ సినిమాలు చేస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ‘96’ షూటింగ్ సగం వరకూ వచ్చింది. ► ‘రణరంగం’కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సురేఖ ఆంటీ (చిరంజీవి సతీమణి) ఫోన్ చేసి ‘చాలా అందంగా ఉన్నావు. ఎంత బావున్నావో. 80స్ లుక్ భలే కుదిరింది’ అన్నారు. నాక్కూడా పర్సనల్‌గా సినిమాలో ఆ లుక్ చాలా ఇష్టం. ► ప్రేక్షకుడికి కొత్త కథను ఇవ్వాలంతే. కచ్చితంగా చూస్తారు. కథను ఎంత చక్కగా చెప్పగలం అన్నదే ముఖ్యం. ఈ ప్రాసెస్‌లో మేం (యాక్టర్స్) కూడా చాలా నేర్చుకుంటున్నాం. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. కొన్ని అవ్వవు. మా సినిమా చూడలేదంటే అది వాళ్ల తప్పు కాదు. మన తప్పు ఉంది. మంచి కథలు ఎంచుకుంటూ వాళ్లను ఎంటర్టైన్ చేయాలి. మంచి కథలు చెబుతూ, ‘యాక్టర్‌గా అన్నీ చేయగలడు’ అనిపించుకోవాలనుకుంటున్నాను. -
నాకు నేను నచ్చాను
‘‘రణరంగం’ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వినిపిస్తోందన్నారు. మ్యాట్నీ షోకి యావరేజ్ అన్నారు. సెకండ్ షో పడేసరికి ఎబౌ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా∙చేరువ అవుతుందని నమ్ముతున్నాను’’ అని శర్వానంద్ అన్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత గురువారం విడుదలైంది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్న చిత్రబృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ అండ్ ప్రాపర్ యాక్షన్ సినిమా ఇవ్వాలని ‘రణరంగం’ సినిమా చేశాను. ఈ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన మంచి క్వాలిటీ æఫిల్మ్‌గా ‘రణరంగం’ పేరును చెబుతుంటే హ్యాపీగా ఉంది. నా కెరీర్లో ఇలాంటి మాస్ పాత్ర చేయలేదు. నాకు నేను నచ్చాను. స్క్రీన్‌ప్లే బేస్డ్ పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది. క్లైమాక్స్ అలా ఉండకపోతే రెగ్యులర్ సినిమాలా ఉండేది. సినిమాలో కల్యాణీకి, నాకు మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. మా ఇద్దరి లవ్‌ట్రాక్ నా కెరీర్లోనే బెస్ట్. చిన్న పాత్ర అయినా చేసినందుకు కాజల్‌కి థ్యాంక్స్. కలెక్షన్స్ గురించి మాట్లాడను. ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. రణరంగం నిర్మాతలకు థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘విడుదలకు ముందే ఇది శర్వానంద్ సినిమా అని చెప్పా. మంచి ఓపెనింగ్స్ రావడానికి శర్వానే కారణం. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకాడలేదు. ఓపెనింగ్ ట్రెండ్ ఇలానే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అన్నారు సుధీర్ వర్మ. ‘‘రాంగ్ ఫిగర్లు (వసూళ్లు) చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమాకు తెలుగురాష్ట్రాల్లో తొలి రోజు ఏడున్నర కోట్ల గ్రాస్ వచ్చింది. దాదాపు నాలుగున్నర కోట్ల షేర్ వచ్చింది. ఇలానే ప్రేక్షకాదరణ కొనసాగితే భవిష్యత్ కలెక్షన్స్ బాగుంటాయనుకుంటున్నాం. ఫ్యామిలీ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు’’ అని పీడీవీ ప్రసాద్ అన్నారు. ‘‘విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు దివాకర్ మణి. ‘‘జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రాజా. -
‘రణరంగం’ మూవీ రివ్యూ
టైటిల్ : రణరంగం జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : శర్వానంద్, కళ్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ తదితరులు సంగీతం : ప్రశాంత్ పిళ్లై నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : సుధీర్ వర్మ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే శర్వానంద్.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. ‘రణరంగం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్ మంచి విజయాన్ని అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం. కథ విశాఖపట్నంలో తన స్నేహితులతో కలిసి బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే దేవా (శర్వానంద్).. లిక్కర్ మాఫియాకు కింగ్‌లా మారుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదం అయిన సమయంలో దేవా లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ.. ఎవరికి అందనంత ఎత్తుకు చేరుతాడు. ఈ క్రమంలో లోకల్ ఎమ్మెల్యే సింహాచలం(మురళీ శర్మ)-దేవాల మధ్య శత్రుత్వం పెరుగతుంది. అదే సమయంలో గీత(కళ్యాణీ ప్రియదర్శిణి)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా.. ఓ పాప పుట్టిన తరువాత గొడవలన్నింటిని వదిలేసి స్పెయిన్‌కు వెళ్తాడు. దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది? గీత ఏమైంది? డాన్‌గా మారిన దేవాకు అసలు శత్రువు ఎవరు? అనేది మిగతా కథ నటీనటులు తన వయసుకు కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలను, ఎక్కువ ఇంటెన్సెటీ ఉన్న పాత్రలను చేయడంలో శర్వానంద్ దిట్ట అని అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఈ చిత్రంలో యంగ్ లుక్, ఓల్డ్ లుక్‌తో పాటు నటనతో నూ మెప్పించాడు. కళ్యాణీ ప్రియదర్శన్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ కట్టిపడేస్తాయి. తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో.. కాజల్ ఆటలో అరిటిపండులా అయిపోయింది. ఇక మురళీ శర్మ, దేవా స్నేహితుల పాత్రలో నటించిన వారు తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ మాఫియా డాన్ లాంటి నేపథ్యం ఉన్న సినిమాలను తెరపై ఇప్పటివరకు ఎన్నో చూశాం. అయితే అన్నిసార్లు ఈ కథలు ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు. ఒక్కోసారి కథా లోపం కావచ్చు.. ఆ కథను చెప్పడానికి ఎంచుకున్న కథనం కావచ్చు ఇలా మాఫియా నేపథ్యంలో వచ్చిన కథలు బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. రణరంగం విషయానికొస్తే.. కథ పాతదే అయినా దానికి మద్యపాన నిషేదం అంటూ లోకల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో కథ కాస్త ముందుకు వెళ్తుంది మళ్లీ వెనక్కు వస్తుంది. ఇలా ముందుకు వెళ్తూ వెనుకకు రావడంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగగా.. సెకండాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. అయితే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌ను అందంగా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ పాతదే కావడం, ఎంచుకున్న స్క్రీన్‌ప్లే సరిగా లేకపోడంతో రణరంగం అస్తవ్యస్తంగా మారింది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగున్నా.. కథనాన్ని మాత్రం ముందే పసిగట్టేస్తాడు ప్రేక్షకుడు. ఆడియెన్స్ ఊహకు అందేలా కథనం సాగడం మైనస్ కాగా.. సంగీతం, నేపథ్యం సంగీతం ప్రధాన బలం. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు సంగీత దర్శకుడు. 1990 బ్యాక్ డ్రాప్‌ను అందంగా తెరకెక్కించేందుకు కెమెరామెన్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెడితే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ శర్వానంద్ సంగీతం సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ కథాకథనాలు ఎంటర్టైన్మెంట్ లోపించడం ఊహకందేలా సాగే కథనం -
వారికి శర్వానంద్ ఆదర్శం
‘‘ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా శర్వానంద్ ఈ స్థాయిలో ఉండటం నిజంగా గొప్ప విషయం. ఎంతోమంది యువ హీరోలకు శర్వానంద్ ఆదర్శం’’ అని హీరో నితిన్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియ దర్శన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రి–రిలీజ్ వేడుకలో అతి«థిగా పాల్గొన్న నితిన్ మాట్లాడుతూ– ‘‘ ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో 45 ఏళ్ల వ్యక్తిగా ఎలా కనిపిస్తాడా? అనుకున్నా. కానీ పోస్టర్స్, ప్రోమోస్ చూస్తుంటే కరెక్ట్‌గా సెట్ అయ్యాడనిపిస్తోంది. డైరెక్టర్ సు«ధీర్ వర్మ మంచి టెక్నీషియన్’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మ టేకింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. నేను హ్యాపీగా ఉన్నానని వంశీ చెప్పడం ఇంకా హ్యాపీ. ‘రణరంగం’ చూసిన యూనిట్ అంతా సినిమా బాగుందంటున్నారు. ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయం చెబుతారనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్. ‘‘ఇందులో హీరో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. శర్వా బాగా నటించారు’’ అన్నారు సుధీర్‌వర్మ. ‘‘శర్వానంద్ దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నా. అనుకున్న కథను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు సుధీర్వర్మగారు. నిర్మాతల సహకారం మరవ లేనిది’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. -
‘రణరంగం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఎవరి సలహాలూ వినొద్దన్నారు
‘‘1980–90ల కాలంలో వచ్చిన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ రోజుల్లో పుట్టి ఉంటే ఎంత బాగుండేది? అని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇప్పుడు ‘రణరంగం’లో అలాంటి పాత్ర చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్యపాత్రల్లో సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణి చెప్పిన విశేషాలు... ► ‘రణరంగం’ కథను సుధీర్ వర్మ బాగా చెప్పారు. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్, ప్రస్తుతం... రెండూ సమానంగా నడుస్తుంటాయి. ంలో కచ్చితంగా భాగమవ్వాలనుకున్నా ► శర్వానంద్ పాత్ర జీవితంలో ఓ ఇరవై ఏళ్ల కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నాం. సాధారణ వ్యక్తి డాన్‌గా ఎలా ఎదిగారు? అన్నది కథాంశం. సినిమా మొత్తం తను చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉంటారు. తనలో లవ్ యాంగిల్ ఉన్నా, ఎప్పుడైనా నవ్వినా అది నా పాత్ర (గీత) వల్లే. కథ 1990ల కాలంలో నడుస్తుంది. ఆ లుక్‌లో కనిపించడానికి మా అమ్మ (నటి లిజీ) సినిమాలో లుక్‌ను ప్రేరణగా తీసుకున్నాను. అమ్మ, శోభనగారి సినిమాలు చూశాను. ► నాకు గన్ పట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ‘రణరంగం’ లో నేను గన్ పేల్చే సీన్ కూడా ఉంది. ► నేను తెలుగు సినిమాలు చేస్తున్నానని అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ లంగా వోణి వేసుకున్నా. ఆ డ్రెస్ నాకు బావుంటుందని నాన్నగారు (మలయాళ దర్శకుడు ప్రియదర్శన్) చాలా సార్లు అనేవారు. ► ఐదు సినిమాల అనుభవం వచ్చే వరకు నాన్నగారి దర్శకత్వంలో నటించకూడదనుకున్నాను. కానీ మోహన్‌లాల్‌తో నాన్న చేస్తున్న ‘అరేంబికడలంటే సింహం’లో అతిథి పాత్ర చేశాను. తొలుత నటన సరిగ్గా లేదన్నారు.. ఎడిటింగ్‌లో చూసి బావుందన్నారు. నాన్న దర్శకత్వంలో మళ్లీ చేయకూడదనుకుంటున్నాను (నవ్వుతూ). ► సినిమాలు చేయాలనుకున్నప్పుడు అది చేయి.. ఇది చేయి అని అమ్మన్నాన్నలు సలహాలు ఇవ్వలేదు. ‘ఎవరు పడితే వాళ్లు సలహాలు ఇస్తుంటారు. దాన్ని మాత్రం తీసుకోకు’ అని చెప్పారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ సినిమాలో నటిస్తున్నాను. సినిమా దర్శకత్వం చేయాలనే ఆలోచనలున్నాయి. కొన్ని ఐడియాలు ఉన్నాయి. ► స్క్రిప్ట్ బాగుంటే పాత్ర నిడివి ఎంత? ఫిమేల్ ఓరియంటెడ్ సినిమానా? కమర్షియల్ సినిమానా? అనే పట్టింపు లేదు. రెండు నిమిషాల పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. ‘మహానటి’కి కీర్తీ సురేశ్‌కు, కాçస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి పట్నాయక్‌కి నేషనల్ అవార్డ్ రావడం సంతోషంగా అనిపించింది.. వాళ్లిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. ► నాకు, మా దర్శకుడు సుధీర్ వర్మకు హాలీవుడ్ దర్శకుడు క్వంటిన్ టరాంటినో అంటే బాగా ఇష్టం. ఆయన తీసిన ‘కిల్ బిల్’ నా ఫేవరెట్ సినిమా. సుధీర్, నేను సెట్లో కలసిపోవడానికి ఈ కామన్ ఇంట్రెస్ట్ ఉపయోగపడింది. ఈ నెల 15న క్వంటిన్ కొత్త సినిమా ‘వన్స్ అఫాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’, మా ‘రణరంగం’ ఒకేసారి రిలీజ్ అవుతుండటం విశేషం. ఆరోజు మేం రెండు సినిమాలు చూడాలి (నవ్వుతూ). -
కో అంటే కోటి గుర్తుకొచ్చింది
‘‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూశా. శర్వానంద్‌ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే ఉంది. తనకు కరెక్ట్‌గా సరిపోయింది’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సినిమా సౌండ్ కట్ ట్రైలర్‌ని రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘శర్వాలో కష్టపడేతత్వం ఉంది. అదే మాకు నచ్చింది. అతని చిత్రాల్లో ‘కో అంటే కోటి’ నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాణ్ణి. సౌండ్ కట్ ట్రైలర్ చూసిన తర్వాత ‘రణరంగం’ అలాంటి చిత్రం అనిపించింది. ఈ సినిమాతో సుధీరవర్మ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నారనిపించింది. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ప్రశాంత్ పిళ్ళై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది’’ అన్నారు. శర్వానంద్, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. -
అందుకే చిన్న పాత్ర అయినా చేశా!
‘‘ఏ సినిమాకైనా చాలా కష్టపడి పనిచేస్తా. నా పాత్రకి 100శాతం న్యాయం చేస్తా. కానీ, ఫలితం అనేది మన చేతుల్లో ఉండదు. అది ప్రేక్షకులు నిర్ణయించాలి. ఇటీవల వచ్చిన ‘సీత’ సినిమా సరిగ్గా ఆడలేదంటే ఎన్నో కారణాలుండొచ్చు. అయితే ఆ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా.. ఎటువంటి అసంతృప్తి లేదు’’ అన్నారు కాజల్ అగర్వాల్. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► ‘రణరంగం’ సినిమాలో డాక్టర్‌గా చేశా. ఈ చిత్రంలో నాది పెద్ద పాత్ర కాదు కానీ, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథ గ్రిప్పింగ్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర నాది.. అందుకే చిన్నదైనా చేశా. ‘సీత’ సినిమాకి మెంటల్‌గా, ఫిజికల్‌గా బాగా కష్టపడ్డా. ‘రణరంగం’ చాలా ఉపశమనం ఇచ్చింది. శర్వానంద్ మంచి సహనటుడు. సుధీర్ వర్మ చక్కని ప్రతిభ ఉన్న దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి మంచి బ్యానర్లో ‘రణరంగం’ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. ► సాయంత్రం 6 గంటలకు షూటింగ్‌కి ప్యాకప్ చెప్పాక షూటింగ్స్, సినిమా విషయాల గురించి మాట్లాడను. పుస్తకాలు చదువుతాను.. యోగా, వ్యాయామాలు చేస్తా. ‘అ’ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నేను నటించనున్న సినిమాని నేను నిర్మించడం లేదు. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. ► హిందీ ‘క్వీన్’ సినిమాని దక్షిణాదిలో రీమేక్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళంలో ఎటువంటి సెన్సార్ కట్స్ లేవు. కానీ, తమిళ్లో మాత్రం అభ్యంతరాలు చెప్పారు. దీనిపై యూనిట్ సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ► నేను ఇండస్రీకి వచ్చి 12ఏళ్లయింది. ఇప్పటికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాలు చేశా. ఈ మైలురాయిని త్వరగా చేరుకున్నాననిపిస్తోంది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బబ్లీగా ఉండే పాత్రలు చేశా. కానీ, ఇప్పుడు బాధ్యతగా భావిస్తున్నా. ఆ మధ్య మేకప్‌లేని ఫొటోలు పోస్ట్ చేశాను. అయితే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేకప్ అవసరమే. కానీ, వ్యక్తిగత జీవితంలో మేకప్ అవసరం లేదు.. మహిళలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని, తాము ఎలా ఉన్నా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ► చిరంజీవి సార్‌తో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న చిత్రం కోసం నన్నెవరూ సంప్రదించలేదు. మళ్లీ చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తా. తేజగారి దర్శకత్వంలో 3 సినిమాలు చేశా. మళ్లీ అవకాశమొచ్చినా నటిస్తా. ‘భారతీయుడు 2’లో నాది పవర్ఫుల్ పాత్ర. -
డబ్బుతో కొనలేనిది డబ్బొక్కటే
‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడంటే డబ్బులు ఎక్కువై అనుకున్నా.. కొంతమంది కోసం కట్టొచ్చు.. ఖర్చు పెట్టొచ్చు, పవర్ ఉంటే సరిపోదు.. అది ఎవరిమీద ఉపయోగించాలో కూడా తెలుసుకో, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే అది డబ్బొక్కటే, మూడో ప్రపంచ యుద్ధం నీళ్ల కోసమే అంటే నమ్మలేదు.. ఇప్పుడు నమ్మక తప్పట్లేదు’... అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగులు ‘రణరంగం’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘సుధీర్ వర్మ ‘రణరంగం’ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. శర్వానంద్ ఇందులో పోషించిన గ్యాంగ్‌స్టర్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా, ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మంచి భావోద్వేగాలుంటాయి. హీరో జీవితంలో 1990, ప్రస్తుతకాలంలోని సంఘటనల సమాహారమే మా ‘రణరంగం’. కాకినాడలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాజల్ అగర్వాల్, కల్యాణీల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ పిళ్లై, కెమెరా: దివాకర్ మణి. -
అదే ఈ సినిమా మొదటి విజయం
‘‘సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు మళ్లీ చూడాలని చాలా కొద్ది సార్లే అనిపిస్తుంది. ‘రణరంగం’ ట్రైలర్ చూడగానే అలా అనిపించింది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానా యికలు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. కాకినాడలో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను. ఆ ఉద్యోగం రాకూడదని అప్పట్లో ప్రార్థనలు కూడా చేశా. మళ్లీ కాకినాడకు రావడం ఇదే. నాకు ఏ ఊరితో అయినా సినిమాలతో కూడిన జ్ఞాపకాలే గుర్తుంటాయి. తొలిసారి కాకినాడకు వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా చూశాను. శ్రీనాథ్‌అనే వ్యక్తి ద్వారా శర్వానంద్ ఎప్పట్నుంచో తెలుసు. ‘ప్రస్థానం’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. ‘రణరంగం’ సినిమాలో 40ఏళ్ల కుర్రాడిలా శర్వా బాగా నటించాడు. లేట్ ట్వంటీస్‌లో ఉన్న కుర్రాడు మిడ్ 40 ఏజ్ ఉన్న పాత్రను బాగా చేయడమే ఈ సినిమా మొదటి విజయంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో 1980లో జరిగే కథ కొంత, ఇప్పటి కాలానికి చెందిన కథ కొంత ఉంటుందన్నారు. చాలా కేర్ తీసుకుని బ్యాలెన్డ్స్‌గా తీశారనిపిస్తోంది. కల్యాణి చెప్పినట్లు సుధీర్ లవ్‌స్టోరీస్ కూడా తీయొచ్చు. సినిమా విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ను లాంచ్ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. నేను సినిమాల్లోకి రావడానికి క్యారెక్టర్ల కోసం ప్రయత్నించే సమయంలో త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాణ్ణి. అప్పుడు ఆయన దర్శకుడు కాలేదు. పెద్ద రైటర్. ఓ సందర్భంలో ఆయన, నేను కలిసి కారులో వెళ్తున్నప్పుడు ‘ఏదైనా సినిమాల్లో క్యారెక్టర్ ఇవ్వండి సార్’ అన్నాను. ‘నీతో చేస్తే కచ్చితంగా హీరోగానే చేస్తా. క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఇవ్వను’ అన్నారు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో... ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా ట్రైలర్ ఆడియన్స్‌కు నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఫస్ట్ డే ఎంత ఎనర్జీతో ఉన్నాడో లాస్ట్ డే కూడా అంతే ఎనర్జీతో వర్క్ చేశాడు శర్వా. ఏం మాట్లాడాలనుకుంటున్నానో ట్రైలర్‌తో చెప్పాం. ఏం చూపించాలనుకుంటున్నామో సినిమాలో చూపిస్తాం. మాకు సహకరించిన టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సుధీర్ వర్మ. ‘‘కాకినాడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. త్రివిక్రమ్‌గారికి నేను అభిమానిని. శర్వా మంచి కో స్టార్. సుధీర్‌గారి గత సినిమాలు గమనిస్తే గన్స్, బ్లడ్‌లతో కొన్ని వయలెన్స్ అంశాలు ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత క్యూట్ లవ్ స్టోరీస్ కూడా ఆయన తీయగలరని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. నాకు గన్ పట్టుకోవడం నేర్పించారు. కెమెరామెన్ దివాకర్ అందమైన విజువల్స్ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, నటులు అజయ్, రాజా, సంగీత దర్శకుడు కార్తీక్, రచయితలు కృష్ణచైతన్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
పిక్చర్ పర్ఫెక్ట్
ఫ్రెండ్సంతా బీచ్ సైడ్ పార్టీకు వెళ్లారు. అక్కడ మూడ్‌కి తగ్గట్టు షాంపైన్ పొంగించారు. బీట్స్‌కి తగ్గట్టు పాటను అందుకోవాలి. వెంటనే కాజల్ ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్..’ అంటూ సాంగ్ అందుకున్నారు. దానికి తగ్గట్టు హుషారుగా నాలుగు స్టెప్పులు కూడా వేశారు. కాజల్ హుషారుని కామ్‌గా దూరం నుంచి చూస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు శర్వానంద్. ఇదంతా ‘రణరంగం’ సినిమాలో మూడో సాంగ్ ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్..’ సందర్భం. కృష్ణ చైతన్య రచించిన ఈ పాటకు సన్నీ ఎం.ఆర్ స్వరాలు అందించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. ఆగస్ట్ 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నట్లు.. ఈ పాటలోని కాజల్ స్టిల్ చూస్తే ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అనుకుండా ఉండలేం కదూ. -
హీరోకు టైమ్ ఫిక్స్
‘హీరో’కు టైమ్ ఫిక్స్ చేశారు. నటుడు శివకార్తికేయన్‌కు అర్జెంట్‌గా ఒక హిట్ అవసరం. ఆయన ఇటీవల నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలను అందుకోలేదు. ముఖ్యంగా ఇటీవల నయనతారతో కలిసి నటించిన మిస్టర్ లోకల్ చాలా నిరాశ పరిచింది. ఎంత స్టార్ వ్యాల్యూ ఉన్నా కథలో విషయం లేకపోతే ప్రేక్షకులు తిరష్కరిస్తారనడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. అయితే శివకార్తికేయన్ నిర్మాతగా హ్యాపీగానే ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో హీరో ఒకటి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం విశాల్ కథానాయకుడిగా ఇరుంబుతిరై వంటి సంచలన విజయాన్ని సాధించిన చిత్ర దర్శకుడు మిత్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం హీరో. నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి కల్యాణి ప్రియదర్శన్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా తరువాత దుల్కర్‌సల్మాన్‌తో వాన్, శింబు సరసన మానాడు చిత్రాల్లో నటించడానికి ఓకె చెప్పారు కల్యాణీ. కాగా హీరో చిత్రంలో మరో నాయకిగా ఇవనా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, రోబోశంకర్, ప్రేమ్‌కుమార్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్ని కేజీఆర్ స్టూడియోస్ కోట్టపాటి జే.రాజేశ్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా చిత్రకరణ దశలో ఉంది. తాజాగా చిత్ర నిర్మాతలు హీరో చిత్ర విడుదల తేదీని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. హీరో చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపారు. దీంతో నటుడు శివకార్తికేయన్ హీరో చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దీని తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో అనుఇమాన్యుల్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
హీరోకి విలన్ దొరికాడు
‘2.ఓ’ సినిమాలో అక్షయ్‌కుమార్, ‘పేట’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తమిళంలో ‘హీరో’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారు అభయ్ డియోల్. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తు్తన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
గ్యాంగ్‌స్టర్ గాయకుడాయెనే
నచ్చిన అమ్మాయి ఓర చూపు విసిరితే.. గాలికి తిరిగేవాడైనా గన్స్ చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ అయినా ఒకటే. గాల్లో తేలిపోవడమే. అదే కన్ను కొట్టి చూస్తే? ఇంకా రాకెట్లో ఆకాశాన్ని అంటేస్తారు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ అయిన శర్వా కూడా గాయకుడిగా మారిపోయి ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి...’ అంటూ పాడుకున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లు. కామన్ మ్యాన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో రెండోపాట ‘‘కన్ను కొట్టి చూసెనంట సుందరి... మనసు మీటి వెళ్లెనంట మనోహరి..’ను రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య రచించిన ఈ పాటను సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రిగ్రూజ్ ఆలపించారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని పీడీవి ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
బీచ్ బేబి
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో శర్వానంద్ డ్యూయెల్ రోల్ చేశారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. బుధవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘రణరంగం’ చిత్రంలోని ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బీచ్ ఒడ్డున కాజల్ ఆనందంగా సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘మను చరిత్ర’ సినిమాకు కాజల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
చలో మలేషియా
దాదాపు ఇరవై రోజులకు సరిపడ సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నారు హీరో శింబు. ఇంతకీ ఎక్కడికెళుతున్నారనేగా మీ సందేహం. ఆయన మలేషియాకు వెళ్లబోతున్నారు. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మనాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు బరువు తగ్గడమే కాకుండా, మార్షల్ ఆర్ట్స్‌లో ఫారిన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు ఉంటుందట. మలేషియాలో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
రణచదరంగం
ఓ ఫ్యాక్టరీలో పని చేసే సాధారణ వ్యక్తి ఓ వ్యవస్థలా మారాడు. తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. మరి ఈ చదరంగంలో ఎలాంటి రణం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఆగస్ట్ 2 వరకూ వేచి చూడాల్సిందే. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రణరంగం’ అనే టైటిల్ ఖరారు చేస్తూ శర్వానంద్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్‌లో మధ్య వయసులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌లా ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ పొగను వదులుతున్నారు శర్వానంద్. ఈ చిత్రాన్ని నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్ మణి. -
‘రణరంగం’.. సిద్ధం!
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా రణరంగం. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుధీర్ వర్మ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కానుంది. -
గ్యాంగ్‌స్టర్ ఈజ్ కమింగ్
గ్యాంగ్‌స్టర్ ఎక్కడైనా చెప్పాపెట్టకుండా అటాక్ చేస్తాడు. కానీ ఈ గ్యాంగ్‌స్టర్ డేట్ చెప్పి మరీ వస్తున్నాను అంటున్నాడు. జూలై 6న థియేటర్స్‌లో రఫ్ ఆడిస్తానని చెబుతున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. యంగ్ లుక్‌లో ఒకటి, గ్యాంగ్‌స్టర్‌గా ఓల్డ్ లుక్ మరోటి. ఈ సినిమాను జూలై 6న రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు శర్వా‘96’ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. -
37 రోజులు...13 కిలోలు
చెప్పినంత ఈజీ కాదు సాధించడం. కానీ యాక్టర్ శింబు సాధించాడు. 37 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గుతానని సవాల్ చేశాడు. అన్నట్లుగానే తగ్గాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా సురేశ్ నిర్మాణంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం లండన్‌లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు శింబు. అలాగే లుక్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి సరైన డైట్‌తో కూడిన వర్కౌట్‌తో బరువు తగ్గాడు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు ఓ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాడు శింబు. ఇందులో గౌతమ్ కార్తీక్ మరో హీరో. -
ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు
‘‘చిత్రలహరి’ సినిమాతో తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా సంతోషంగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘చిత్రలహరి’. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. హైదారాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. సింపుల్ క్యారెక్టర్స్‌ను హీరోలకు అడాప్ట్ చేస్తూ కిశోర్ సినిమాలు చేస్తుంటారు. తన స్టామినాకు తగ్గ సక్సెస్ ఇంకా రాలేదనే భావిస్తున్నారు. ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్‌బస్టర్స్ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ చిన్న స్పీడ్ బ్రేకర్ దాటి మళ్లీ సక్సెస్‌బాట పట్టింది. సునీల్ తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు. ‘‘కలెక్షన్స్ బాగా వచ్చాయి. సినిమా సక్సెస్ అంటున్నారు. కానీ సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే నా దృష్టిలో సక్సెస్. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. కిశోర్ నా స్నేహితుడే. పోసానిగారు లవ్లీ పర్సన్. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను’’ అన్నారు సాయిధరమ్‌తేజ్. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. హీరో సాయి, దర్శకుడు కిశోర్, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కిశోర్. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సునీల్. ‘‘ఇప్పటివరకు 35 స్ఫూర్తి పాటలు రాశాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి పాట రాశాను. ఈ విజయోత్సవ సభలో అందర్నీ చూడటం సంతోషంగా ఉంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. -
వాళ్లలా నొప్పించి సంపాదించడం లేదు
‘‘గెలుపు, ఓటమి అనేది దేవుడు సృష్టించింది కాదు. మనం పెట్టుకున్న గేమ్ అది. ఇందులో ఫస్ట్ వస్తే సక్సెస్. అది త్వరగా సాధిస్తే సక్సెస్. ఇలా అన్నీ మనం ఆడుకుంటున్న ఆటలు. ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్లు పరిగెడుతున్నాం. గెలిచిన వాడిని అభినందించకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినవాడిని తక్కువ చేయడానికి ప్రయత్నించకుండా ఉండాలి’’ అని సునీల్ అన్నారు. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియ దర్శన్, నివేథా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించిన సునీల్ పంచుకున్న విశేషాలు... ► మనోజ్, విష్ణులతో సినిమాలు చేసే సమయం నుంచి తేజు నాకు తెలుసు. మాతో చాలా బాగా కలసిపోయేవాడు. అప్పట్లో తేజుని హీరోగా పెట్టి నేను ఓ సినిమా దర్శకత్వం చేద్దామనుకున్నాను. ఇప్పటికి కలసి యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. ► నా గ్లాస్‌మేట్స్ చాలా మంది ఉన్నారు. చెబితే లిస్ట్ సరిపోదు. ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో త్రివిక్రమ్ ఒకరు. ఆనందం అయినా, బాధ అయినా తనతో పంచుకోవాలనుకుంటాను. కష్టం దాటగలిగే కాన్ఫిడెన్స్ మాలో నింపేవాడు త్రివిక్రమ్. ► ఇప్పుడు టెక్నాలజీని(ఫేస్బుక్, ట్వీటర్) ఉపయోగాల కంటే అనవసరమైన వాటికే వాడుతున్నాం. ఇటీవల ఏదో యూట్యూబ్ వీడియోలో నేను చనిపోయాను అని ఓ వీడియో పోస్ట్ చేసేశారు. అంటే వ్యూస్ కోసం వేరే వాళ్లను హర్ట్ చేసేస్తారా? లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్లు సారీ చెప్పేశారు. వాళ్లను మళ్లీ ఇబ్బంది పెడితే నాకేం వస్తుంది? అని వదిలేశాను. వాళ్లలా ఎదుటి వ్యక్తిని నొప్పించి నేను సంపాదించడం లేదు. అందర్నీ నవ్వించి సంపాదిస్తున్నాను. ► సోషల్ మీడియా రావడం వల్ల ప్రతిదీ వార్త అయిపోయింది. ఆ వార్త చదువుతూ మీ టైమ్‌ను వేస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకో మంచి ఆలోచన చేయొచ్చు కదా? ► కమెడియన్ నుంచి హీరోగా మారినప్పుడు యాక్షన్ కామెడీ చేద్దాం అనుకున్నాను. హాలీవుడ్ సినిమాల్లో హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు కూడా ఫిట్‌గా సిక్స్ ప్యాక్స్తోనే కనిపిస్తారు. యాక్షన్ కామెడీ హీరోగా చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశా. హీరోగా సినిమాలు చేస్తున్నానని కామెడీ పాత్రలు చేయమని అడగడం తగ్గించారు దర్శక–నిర్మాతలు. హీరోగా నాకు నచ్చినవి కొన్ని ఉంటే నిర్మాతల వల్ల ఒప్పుకున్న సినిమాలు మరికొన్ని. అప్పుడు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా నాతో చాలా మంది నిలబడ్డారు. నాకు ఇండస్ట్రీలో ఎవరితో గొడవలు లేవు. అందరితో బావుంటాను. నా అదృష్టం అదే. ► మన సినిమాలు ఎక్కువ శాతం హాలీవుడ్ కాపీయే. మనవి వాళ్ల దగ్గరకు వెళ్లడం ఉండదు. ► హీరోగా కాకుండా కమెడియన్‌గా కొనసాగాలనుకుంటున్నాను. అప్పుడు నెలకు 2సార్లు తప్పకుండా ప్రేక్షకులను పలకరించవచ్చు. హీరోగా సంపాదిస్తున్న దానికంటే తక్కువ వస్తుంది కదా? అని మీరు అడిగితే ఒకేసారి పది రూపాయిలు తీసుకున్నా, పదిసార్లు రూపాయి తీసుకున్నా అంతే కదా అంటాను. ► కామెడీ సినిమాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. మనం కథ రాయకుండా కామెడీ సినిమాలు లేవు అనడం కరెక్ట్ కాదు. ‘మొన్న’ ఎఫ్ 2’ సక్సెసే ఇందుకు నిదర్శనం. ► ప్రస్తుతం అల్లు అర్జున్– త్రివిక్రమ్, రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో చేస్తున్నాను. నా అభిమాన హీరోతో ఓ పెద్ద సినిమాలో చేస్తున్నాను (చిరంజీవి–కొరటాల శివ సినిమాను ఉద్దేశిస్తూ). -
చాలారోజులకు సక్సెస్ మీట్లో పాల్గొన్నా
‘‘నిన్నటివరకు వేడి వేడిగా ఎలక్షన్లు జరిగాయి. ఈ రోజు అందరూ సేద తీరటానికా అన్నట్లు మా సినిమా విడుదలైంది. అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా ఉంది’’ అని నవీన్ ఎర్నేని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ సివీయం∙నిర్మించిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ‘చిత్రలహరి’ విడుదలైంది. ఈ చిత్రం తాము ఊహించినట్లుగా విజయం సాధించడం ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి ‘సినిమా చాలా బావుంది, మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమైంది’ అని చెప్పటం, మార్నింగ్ షో నుండి మంచి మౌత్ పబ్లిసిటీతో సినిమాకు మంచి రెస్పాన్స్ ఉండటంతో మ్యాట్నీ కలెక్షన్స్ పెరిగాయి. ఏది ఏమైనా మొదటి మూడు రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రంకల్లా మా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ అవుతారని మా నమ్మకం’’ అన్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఏ సక్సెస్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశానో అది ఈ రోజు నెరవేరింది. ప్రేక్షకులు అన్ని మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి ‘సార్.. ఇది నా పర్సనల్ స్టోరీలా ఉంది’ అన్నారు. ఐ యామ్ సో హ్యాపీ’’ అన్నారు. చిత్రకథానాయకుడు సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా జెన్యున్‌గా ఫీలై మా సినిమాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. నన్ను బోయ్ నెక్ట్స్ డోర్ (పక్కింటి కుర్రోడు)లా ఉన్నావని అంటున్నారు. ‘మా ఫాదర్‌తో రిలేషన్ సినిమాలో మీకు, మీ ఫాదర్‌కి ఉన్న రిలేషన్ లాగానే ఉంది సార్’ అని చాలా మంది కుర్రాళ్లు ట్వీటర్ వేదికగా చెబుతుంటే ఆనందంగా ఉంది. అవి రీ ట్వీట్లు చేసుకొంటూ, వాళ్లకి సమాధానం చెప్పటంతోనే ఈ రోజంతా సరిపోయింది. కలెక్షన్లు చాలా బావున్నాయి. చాలా రోజుల తర్వాత సక్సెస్‌మీట్‌లో పాల్గొంటున్నాను. ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అవ్వటంతో మంచి ఫలితం వచ్చింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు, టీమ్ సక్సెస్. మెగాఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను ముందు నుంచి అనుకున్నట్లుగానే మంచి విజయం సాధించాం’’ అన్నారు. -
‘చిత్రలహరి’ మూవీ రివ్యూ
టైటిల్ : చిత్రలహరి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : సాయి ధరమ్ తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : కిషోర్ తిరుమల నిర్మాత : రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తాజాగా చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని తన పేరును కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రలహరి సాయి ధరమ్‌కు హిట్ ఇచ్చిందా..? పేరు మార్చుకోవటం కలిసొచ్చిందా..? కథ : విజయ్ కృష్ణ (సాయి ధరమ్ తేజ్) జీవితంలో సక్సెస్ అంటే తెలియని కుర్రాడు. ఈ పోటీ ప్రపంచంలో తాను గెలవలేకపోతున్నా అని విజయ్ నిరుత్సాహపడినా.. తండ్రి (పోసాని కృష్ణమురళి) మాత్రం తన కొడుకు ఎప్పటికైన సక్సెస్ అవుతాడన్న నమ్మకంతో ఉంటాడు. యాక్సిడెంట్లో సరైన సమయానికి సహాయం అందక చనిపోతున్న వారిని కాపాడేందుకు విజయ్ ఓ డివైజ్‌ను తయారు చేస్తాడు. దాని స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్) పరిచయం అవుతుంది. తన అలవాట్లు, ఉద్యోగం గురించి అబద్దాలు చెప్పి లహరిని ప్రేమిస్తాడు విజయ్. కానీ ఓ రోజు లహరికి నిజం తెలిసిపోతుంది. విజయ్‌ని వదిలేసి దూరంగా వెళ్లిపోతుంది. తనకు ప్రేమలోనూ సక్సెస్ దక్కలేదని మరింత కుంగిపోతాడు విజయ్. అలాంటి విజయ్ తిరిగి ఎలా సక్సెస్ సాధించాడు..?ఈ కథలో స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) పాత్ర ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి తాను గతంలో చేయని ఓ కొత్త తరహా పాత్రను ఎంచుకున్నాడు. నేటి యూత్ ను ప్రతిబింభించే చేసే క్యారెక్టర్లో తనవంతుగా బాగానే నటించాడు. తన రేంజ్లో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, డాన్స్‌లు చేసే సాయికి చాన్స్ దక్కలేదు. కానీ మెచ్యుర్డ్ పర్ఫామెన్స్తో విజయ్ కృష్ణ పాత్రలో జీవించాడు. హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ పరవాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపించినా తరువాత ఓకె అనిపించేలా ఉంది. మరో హీరోయిన్గా నటించిన నివేదా పేతురాజ్‌కు పెద్దగా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కలేదు. కార్పోరేట్ ఉమెన్‌గా నివేదా లుక్ ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, సునీల్, వెన్నెల కిశోర్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సెన్సిబుల్ పాయింట్స్‌తో సినిమాలను తెరకెక్కించే కిషోర్ తిరుమల చిత్రలహరి కోసం మరో ఇంట్రస్టింగ్ లైన్ తీసుకున్నాడు. నేటి యూత్ సక్సెస్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారు. సక్సెస్ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారు అన్న విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో కిషోర్ పూర్తి స్థాయిలో అలరించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కథా కథనాలు నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. కథలోని పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే స్థాయి సీన్స్ లేకపోవటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకుడిగా తడబడినా రచయితగా మాత్రం సక్సెస్ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ గుర్తిండి పోయేలా ఉన్నాయి. ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాతో పరవాలేదనిపించాడు. రెండు పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సాయి ధరమ్ తేజ్ కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ క్యారెక్టరైజేషన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నచ్చలేదని చెప్పే చొరవ వచ్చింది
‘‘ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నాకు చాన్సులు వస్తున్నాయని నేను నమ్మడం లేదు. కుటుంబ నేపథ్యం వల్ల ఒకటో రెండో వస్తాయి. ఆ తర్వాత పట్టించుకోరు. వరుసగా నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్ముతున్నాను. ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై నాకు జడ్జిమెంట్ రాలేదు. అది వస్తే అన్నీ నేర్చుకున్నట్లే. యాక్టర్‌గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► నా స్క్రీన్ నేమ్‌ని సాయితేజ్‌గా మార్చుకోవడం వెనక పెద ్దకారణాలేవీ లేవు. ధరమ్‌ని కొంతకాలం పక్కన పెట్టానంతే. ఈ చిత్రంలో జీవితంలో సక్సెస్ తెలియని విజయ్కృష్ణగా నటించాను. ఒకరి జీవితాన్ని ఓ ఐదు పాత్రలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే కథ. విజయ్ క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్నప్పుడే మంచి సినిమా అవుతుంది, వదులుకోకూడదనుకున్నాను. ► పదకొండేళ్లుగా కిషోర్ తిరుమల తెలిసినప్పటికీ సినిమా చేయడం కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంశాలను కిషోర్ బాగా చూపిస్తారు. నా ఆరు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ నన్ను నమ్మి చాన్స్ ఇచ్చారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఇండస్ట్రీలో ఇలాంటి నిర్మాతలు ఉండాలి. దేవి అన్న మ్యూజిక్ చాలా ఇష్టం. ‘దేవి మ్యూజిక్‌లో నువ్వు డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది’ అని మా అమ్మ అనేవారు. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీ. అలాగే సునీల్ అన్నతో వర్క్ చేయడం అనేది నాకున్న కలలో ఒకటి. అది కూడా నెరవేరినందుకు హ్యాపీ. ► నా గత ఆరు సినిమాలు ఆడలేదు. స్క్రిప్ట్‌ను ఎంచుకునే విధానంలో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పే ధైర్యం వచ్చింది. ఏౖమైనా అంటే.. ‘చూశారు కదండీ.. నా ఆరు సినిమాల రిజల్ట్’ అని చెప్పొచ్చు. కథ పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నాను. భవిష్యత్‌లోనూ ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రిప్ట్ విని, డౌట్స్ ఉంటే చెబుతా. అంతే కానీ ఈ మార్పు కావాలి. ఫలానా డైలాగ్స్ మార్చాలి. నా బాడీకి ఇది సూట్ అవ్వవు అన్న అభ్యంతరాలు చెప్పను. కానీ సినిమా ఫెయిల్ అయితే అది నా బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే హీరోగా నేను ‘యస్’ అన్నప్పుడే సినిమా ముందుకు వెళ్తుంది. ► మాటిచ్చాను కాబట్టి కొన్ని సినిమాలు చేశాను. మాట ఇస్తే ఎలాగైనా నిలబడాలి. స్టార్టింగ్ స్టేజ్‌లో కథ విన్నప్పుడు నచ్చి, ఆ తర్వాత కొంతదూరం ట్రావెల్ చేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్లిపోతుందని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాయిస్ లేదు. అప్పుడు సినిమా పూర్తి చేయాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడకపోతే ఆడియన్స్ రెస్పాన్స్, విమర్శకుల అభిప్రాయాలను విశ్లేషించుకుని నన్ను నేను మెరుగుపరచుకోవడానికి మరింత కష్టపడతాను. ► కథలో కంటెంట్ బాగుంటే సక్సెస్ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఫెయిల్యుర్ వల్ల ఆగిపోతారనే ఫీలింగ్ ఎప్పుడూ నాకు లేదు. ప్రతి యాక్టర్‌కి ప్రతి శుక్రవారం తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక చాన్స్. దాన్ని నేను నమ్ముతాను. సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ గుంపు ఉంటుంది. సక్సెస్ దూరమైనప్పుడు ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఈ ఇద్దరు ముగ్గురు మనం ఏ స్టేజ్‌లో ఉన్నా ఉంటారు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేస్తాను. హిందీ చిత్రం ‘గల్లీభాయ్’ తెలుగు రీమేక్‌లో నేను నటిస్తానన్న వార్తల్లో నిజం లేదు. ► నా బ్రదర్ వైష్ణవ్ తేజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో నా ప్రమేయం లేదు. దర్శకులు బుచ్చిబాబు ప్రొడ్యూసర్స్‌ని కలిసి ముందుకు వెళ్లారు. హెయిర్ సర్జరీ కోసం, లైపోసక్షన్ కోసమే నేను యూఎస్ ట్రిప్ వెళ్లాననే ప్రచారం జరిగింది. అది నిజం కాదు. ‘విన్నర్’ సినిమా సమయంలో హార్స్‌రైడింగ్ వల్ల బాగా గాయపడ్డాను. ఆ గాయాలను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా టైమ్‌కి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్న టైమ్‌కి ఆ గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. యూఎస్‌లోని స్పోర్ట్స్ ఫిజియో దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్లాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాను. -
‘చిత్రలహరి’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
మా అమ్మగారి ఆశ నెరవేరింది
‘‘కొరటాల శివ, సుకుమార్‌గారికి థాంక్స్. మా సినిమాకు ప్రారంభంలో ఎంతో బూస్ట్ ఇచ్చారు. మైత్రీ మూవీస్ నాకు స్పెషల్. ఎందుకంటే ఆరు సినిమాల ఫ్లాప్ తర్వాత నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి థ్యాంక్స్’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘చిత్రలహరి’. నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లు. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చిత్రం ట్రైలర్‌ను కొరటాల శివ, సుకుమార్ విడుదల చేశారు. సుకుమార్ మాట్లాడుతూ – ‘‘కిషోర్ సెన్సిటివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఈ సినిమా ఒక ఉగాది పచ్చడిలాంటిది. సినిమా కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకునే హీరోలు తమిళంలో ఉంటారు. అలాంటి హీరోల్లా సాయి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. మంచి పాటలు కుదిరాయి ’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఇంత మంది దర్శకులకు అవకాశం ఇస్తున్నారంటే సంస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అధినేతల తపన. రైటర్‌గా మా దగ్గర పని చేసిన కిషోర్‌లో చాలా టాలెంట్ ఉంది. తన నుండి చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి. నాకీ కథ చెప్పారు. తేజు హానెస్ట్ పర్సన్. తను తప్ప ఎవరూ ఈ కథకు న్యాయం చేయలేరనిపించింది’’ అన్నారు. ‘‘కిషోర్ ఎప్పటి నుండో పరిచయం. దేవిశ్రీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని మా అమ్మగారు కోరుకున్నారు. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఎన్ని ఫ్లాపులొచ్చినా, హిట్స్ వచ్చినా ఈ స్టేజ్‌పై ఉన్నానంటే కారణం మా మావయ్యలు.. మెగాభిమానులు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘నవీన్ ఎర్నేనిగారి వల్లే ఈ సినిమాకు ‘చిత్రలహరి’ అనే టైటిల్ పెట్టాను. అలాగే యలమంచిలి రవి, మోహ¯Œ గారికి థ్యాంక్స్. నా మూడు సినిమాలకు దేవీగారి మ్యూజిక్ పెద్ద ఎసెట్‌గా నిలుస్తూ వచ్చింది. కార్తీక్ కెమెరామేన్‌గానే కాదు.. కథలో నాతో పాటు ట్రావెల్ అవుతూ వచ్చారు. నేను రైటర్‌గా ఉన్నప్పటి నుండి తేజుతో పరిచయం ఉంది. తప్పకుండా అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు కిషోర్ తిరుమల. ‘‘ఇందులో లహరి అనే పాత్ర చేశాను. సొంత వాయిస్‌తో డబ్బింగ్ కూడా చెప్పాను’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్ . ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నివేదా పేతురాజ్. ఈ వేడుకలో సునీల్, బ్రహ్మాజీ, దర్శకులు సంతోష్ శ్రీనివాస్, వెంకీ కుడుముల, మారుతి, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు. -
చీకటికి చిరునామా నేను.. చిత్రలహరి
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. సక్సెస్ కోసం సెంటిమెంట్లను కూడా ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాలో తన పేరును సాయి తేజ్ అని వేసుకుంటున్నాడు ఈ మెగా హీరో. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. కెరీర్లో సక్సెస్అన్నదే లేని ఓ యువకుడి కథ చిత్రలహరి. సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో సునీల్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
‘చిత్రలహరి’ ప్రీ రిలీజ్ వేడుక
-
రాజకీయం చేస్తారా?
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ! -
రాజకీయం చేస్తారా?
టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. తెలుగులో సాయిధరమ్‌తేజ్ (చిత్రలహరి), శర్వానంద్ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘వాన్’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్ స్క్రిప్ట్. ‘మానాడు’ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్ అండ్ సీ! -
శింబుతో సెట్ అవుతుందా?
నటుడు శింబుతో నటి కల్యాణి ప్రియదర్శన్‌కు సెట్ అవుతుందా? ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిగా మారిన విషయం ఇదే. శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేరాఫ్ ఈ పేరు. జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే ఈయన చిత్రాలంటేనే సంచలనం అవుతాయి. అలాంటి శింబు తాజాగా మానాడు అనే చిత్రంలో నటించబోతున్నారు. దీన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన చేసి చాలా కాలమైంది. అంతేకాదు ఆ తరువాత మానాడు ఆగిపోయిందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులని చిత్ర వర్గాలు ఖండించారనుకోండి. మానాడు చిత్రం నిర్మాణం అవుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం. 2013లోనే ప్రొడక్షన్స్ డిజైనర్ శాఖలో చేరిన ఈ బ్యూటీ ఆ తరువాత ఇరుముగన్ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేసింది. ఆ తరువాత తెలుగులో హలో చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తరువాత మలయాళంలో, ఇటీవల తమిళంలోనూ పరిచయమైంది. అయితే మలయాళం, తెలుగులో నటించిన తొలి చిత్రాలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్‌లో మాత్రం వాన్ అనే చిత్రం నిర్మాణంలో ఉంది. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా హీరో చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు కోలీవుడ్‌లో శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇతర నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఒక్క చిత్రం కూడా విడుదల కాకుండానే మూడు చిత్రాలను దక్కించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఏ మాత్రం నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలోనే మానాడు చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని నిర్మాత సురేశ్‌కామాక్షి తెలిపారు. -
యమా స్పీడు
కెరీర్లో కూల్‌గా, కామ్‌గా దూసుకెళ్తున్నారు మలయాళ బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్. దుల్కర్ సల్మాన్‌తో ‘వాన్’, శివ కార్తీకేయన్ సరసన ఓ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్ చాన్స్‌ను కొట్టేశారీ మలయాళ కుట్టి. తాజాగా శింబుకు జోడీగా నటించేందుకు ఒప్పుకున్నారట కల్యాణి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా కల్యాణి నటించనున్నారని తెలిసింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా రాశీ ఖన్నా పేరు వినిపించింది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లకు ఇటీవల ఫుల్స్టాప్ పెట్టారు నిర్మాత ఎస్ఆర్. ప్రభు. ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నామని వెల్లడించారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... శర్వానంద్ హీరోగా రూపొందిన ఓ సినిమాలో, సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో కథానాయికగా నటించారు కల్యాణి. అలాగే మలయాళంలో ‘మరక్కార్: ది అరేబియన్ కడలింటే సింహం’ చిత్రంలోనూ కల్యాణి ఓ కీలక పాత్ర చేశారు. ఇలా తమిళ, తెలుగు, మలయాళం ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తూ కల్యాణి యమా స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు. -
‘హీరో’గా మారుతున్న శివకార్తికేయన్
హీరోగా మారుతున్న శివకార్తికేయన్ అనగానే ఆశ్చర్యపడుతున్నారా? ఆయన ఎప్పుడో స్టార్ హీరోగా అయితే ఇప్పుడు హీరో అవ్వడం ఏమిటి? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అసలు విషయం ఏమిటంటే శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రానికి హీరో అనే టైటిల్‌ను నిర్ణయించా రు. ఇందులో నటుడు అర్జున్ ప్రధాన పాత్రను పోషించనుండడం విశేషం. నటి కల్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. కేజేఆర్ ఫిలింస్ పతాకంపై కోటపాటి జే.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇరుంబుదురై ఫేం మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హీరో చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటపాటి జే. రాజేశ్ మాట్లాడుతూ కేజేఆర్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన యూనిట్‌తో చిత్రం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. నటుడు శివకార్తికేయన్ కమర్షియల్ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం వల్లే ఆయన నటుడిగా ఈ స్థాయికి చేరారన్నారు. అదే విధంగా ఈ హీరో చిత్రం కూడా అలాంటి కమర్శియల్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌తో చిత్రం చేయాలన్నది తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇక నటి కల్యాణి ప్రియదర్శన్ వంటి ప్రతిభావంతులైన యువ నటీనటులు ఈ చిత్రానికి అదనపు మైలేజ్‌ను ఇస్తారని అన్నారు. దర్శకుడు మిత్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన తొలి చిత్రంతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఆయన కథ చెప్పడానికి వచ్చినప్పుడు గత చిత్ర కథా ఛాయలేమైనా ఉంటాయేమోనని అనుకున్నానని, అలాంటి ఛాయలే లేకుండా పూర్తిగా భిన్నంగా చాలా కొత్త కోణంలో కథను చెప్పారని అన్నారు. ఈ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే శివకార్తికేయన్ నయనతారతో కలిసి రాజేశ్.ఎం దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం మేడే రోజున విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం తన 14వ చిత్రంగా రవికుమార్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తి అయిన తరువాత హీరో చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. -
తేజ్‌కు మళ్లీ సుప్రీమ్ డేస్ వస్తాయి
సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్ నిర్మించారు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ – ‘‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కిషోర్ ఈ టైటిల్ చెప్పగానే బాగా నచ్చింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సాయి ధరమ్ తేజ్‌కు మళ్లీ ‘సుప్రీమ్’ డేస్ వస్తాయి అనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘మంచి పాత్ర కోసం చూస్తున్న తరుణంలో కిషోర్‌గారు ఈ పాత్రను ఇచ్చారు. ప్రేక్షకుడు నవ్వుతూనే ఇంటికి వెళ్తాడు’’ అన్నారు సునీల్.‘‘కిషోర్‌గారు కథ ఎంత బాగా చెప్పారో అంతే బాగా తీశారు. సునీల్ అన్న కామెడీని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు సాయిధరమ్. ‘‘కిషోర్‌గారు నా పాత్రను బ్యూటి ఫుల్‌గా డిజైన్ చేశారు. సాయిధరమ్, కల్యాణితో వర్క్ చేయడం హ్యాపీ’’ అన్నారు నివేదా. -
నాలుగు విభిన్న పాత్రల కథ ‘చిత్రలహరి’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల స్వభావాలను టీజర్లోనే చెప్పేశారు. ఆపాత్ర మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా కథ అంటూ హింట్ ఇచ్చేశారు. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
‘చిత్రలహరి’లోని పాత్రలు మిమ్మల్ని కలుస్తారు!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రలహరి టీం, ఈ బుధవారం టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ‘‘చిత్రలహరి’లోని పాత్రలో 13వ తారీఖున 9 గంటలకు మిమ్మల్ని కలుస్తారు’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు. -
గ్యాంగ్ తిరిగొచ్చింది
అవును.. శర్వానంద్ అండ్ గ్యాంగ్ తిరిగొచ్చారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా స్పెయిన్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. గత బుధవారంతో అక్కడ షెడ్యూల్ ముగిసింది. శర్వానంద్ అండ్ గ్యాంగ్ హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ షెడ్యూల్‌తో ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఇందులో యువకుడిగా, మధ్య వయస్కుడైన గ్యాంగ్‌స్టర్‌గా శర్వా నంద్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. స్పెయిన్‌లో జరిగిన షూట్లో శర్వా, కాజల్‌లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను కూడా తెరకెక్కించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ హిట్ ‘96’ తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుందట. ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిసింది. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన సి. ప్రేమ్‌కుమార్‌నే తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దిల్’ రాజు నిర్మాత. -
బిజీ బిజీ
‘హలో’తో తెలుగు చిత్రపరిశ్రమకు హాయ్ చెప్పారు కల్యాణీ ప్రియదర్శన్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ ఏడాది కల్యాణి రెండుభాషల్లో నటించిన రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె శర్వానంద్ సరసన సుధీర్ వర్మ సినిమాలో, సాయిధరమ్ తేజ్‌తో ‘చిత్రలహరి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో దుల్కర్ సల్మాన్‌తో ‘వాన్’ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమా అంగీకరించి జోరు పెంచారు కల్యాణీ ప్రియదర్శన్. ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) చిత్రాన్ని రూపొందించిన పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నంది. ఇందులో హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ నటించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించారు. తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలతో పాటు మలయాళంలో ఆమె తండ్రి ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ‘మరక్కార్’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో మోహన్‌లాల్ హీరో. కాగా, కళ్యాణి క్యారెక్టర్ షూట్ పూర్తయింది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది. -
శర్వానంద్ న్యూ లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరోల్లోని అతికొద్ది మంది నటుల్లో శర్వానంద్ ఒకరు. చేసే ప్రతీ సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంటాడు. రీసెంట్గా హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ ఆంతగా ఆకట్టుకోలేకపోయినా.. మరో చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి కొన్ని పోస్టర్స్ లీక్ అయ్యాయి. పూర్తి గడ్డంతో ఉన్న శర్వానంద్ లుక్ అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శర్వానంద్ రెండు డిఫరెంట్ గెటప్‌లో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ ఈ చిత్రం తరువాత తమిళ హిట్ మూవీ ‘96’ రీమేక్‌లో నటించనున్నాడు. -
శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ
తమిళసినిమా: నటుడు శివకార్తీకేయన్‌తో ప్రముఖ దర్శకుడి వారసురాలు జత కట్టే అవకాశాన్ని దక్కించుకుందా? దీనికి అలాంటి అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. నటుడు శివకార్తీకేయన్ వరుస విజయాలతోనే కాదు, చేతి నిండా చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. ఇది ఆయన 13వ చిత్రం. కాగా 14వ చిత్రంగా ఇండ్రు నేట్రు నాలై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో నటి రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటించనుంది. దీని తరువాత ఇరుంబుతిరై చిత్రం ఫేమ్ పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇది శివకార్తీకేయన్‌కు 15 చిత్రం అవుతుంది. ఇందులో వర్థమాన నటి కల్యాణికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఈమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురన్నది గమనార్హం. ఇప్పటికే తెలుగులో అఖిల్ సరసన హలో అనే చిత్రంలో నటించిన ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో శర్వానంద్‌తో నటిస్తోంది. అదే విధంగా మలయాళంలో రెండు చిత్రాలు, తమిళంలో వాన్ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఇంకా ఈ బ్యూటీ నటించిన ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. -
వారియర్
మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, ప్రభుదేవా, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణీ ప్రియదర్శన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. మోహన్‌లాల్, సునీల్ శెట్టి, ప్రభుదేవాలపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని సునీల్ శెట్టి లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఓ హాలీవుడ్ సినిమాలోని వార్ ఫిల్మ్ ఆధారంగా ఆయన లుక్‌ను డిజైన్ చేశారట. ఈ చిత్రంలో వారియర్‌గా (యోధుడు) సునీల్‌శెట్టి నటిస్తున్నారు. -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -
లవ్ యు అచ్చా
అచ్చా.. అంటే హిందీలో బాగుంది అని అర్థం. మరి లవ్ యు అచ్చా అంటే.. లయ్ యు నాన్నా అని అర్థం. అచ్చా అంటే నాన్న. పూర్తిగా చెప్పాలంటే ‘అచ్చన్’. మనం నాన్న అని పిలిచినట్లు మలయాళంలో ‘అచ్చన్’ అని పిలుస్తారు. గారాబం ఎక్కువైతే ‘అచ్చా’ అని పిలుస్తారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ని ‘లవ్ యు అచ్చా’ అన్నారు. ఎందుకంటే తండ్రి డైరెక్షన్లో వర్క్ చేసినందుకు ఆమె∙ఫుల్ ఖుషీ అవుతున్నారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 16వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్జున్, ప్రణవ్ మోహన్‌లాల్, కీర్తీ సురేష్, కల్యాణీ ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ‘‘నాన్నగారితో వర్క్ చేస్తానని రెండేళ్ల క్రితం ఊహించలేదు. కానీ నిజమైంది. ‘అమ్మూ... నువ్వు సరిగా చేయడం లేదని ఈ సినిమా ఫస్ట్ డే షూట్లో నాన్నగారు సెట్లో నాపై అరిచినప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యా. ఆ తర్వాత సూపర్బ్.. బాగా చేశావ్’ అన్నప్పుడు నాకు అమితానందం కలిగింది. లవ్ యు అచ్చా. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్ పేర్కొన్నారు. ‘‘మా అమ్మాయిని నేను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. అయితే తనతో సినిమా చేశాను. చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియదర్శన్ అన్నారు. ఇందులో యంగ్ మోహన్‌లాల్ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ కనిపిస్తారు. వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజవుతుంది. లొకేషన్లో తండ్రి ప్రియదర్శన్‌తో కల్యాణి -
వయసైన వ్యక్తిగా శర్వా..!
కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న శర్వానంద్ త్వరలో మరో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నాడు. ఇటీవల పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరిచిన శర్వా, తదుపరి చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. వీటిలో ఒకటి యువకుడి పాత్ర కాగా మరో పాత్రలో వయసైన వ్యక్తిగా కనిపించనున్నాడట. ఈ లుక్ కోసం ప్రోస్తటిక్ మేకప్‌తో లుక్ టెస్ట్ కూడా చేసిన చిత్రయూనిట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మిస్ శ్వేత
ఇటీవల అజిత్ పూర్తి చేసిన ‘విశ్వాసం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హిట్ ‘పింక్’ తమిళ రీమేక్‌లో ఆయన లాయర్‌గా నటించనున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నజ్రియా, కల్యాణీ ప్రియదర్శన్, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో శ్వేత అనే పాత్రను నజ్రియా చేయబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం. బోనీకపూర్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుందని టాక్. ఈ సినిమాకు ‘ఖాకి’ ఫేమ్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారు. -
న్యాయాన్ని గెలిపిస్తారు
ముగ్గురు ఆకతాయిల వల్ల లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముగ్గురు అమ్మాయిలు న్యాయం కోసం పోరాడతారు. వీరికి ఓ లాయర్ అండగా నిలబడతాడు. న్యాయం గెలిచేట్టుగా కలసి పోరాడతారు. ఈ కథాంశంతో బాలీవుడ్లో రూపొందిన చిత్రం ‘పింక్’. అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్ర పోషించారు. లైంగిక వేధింపుల బాధితురాలుగా తాప్సీ నటించారు. ‘పింక్’ చిత్రం సూపర్ హిట్. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాత బోనీ కపూర్. అమితాబ్ పోషించిన పాత్రను అజిత్ చేయనున్నారు. ఇందులో ముగ్గురు అమ్మాయిల్లో మలయాళ నటి నజ్రియా నజీమ్, ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్, కన్నడ భామ శ్రద్ధా శ్రీనాద్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. నటుడు ఫాహద్ ఫాజిల్‌తో వివాహం అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నారు నజ్రియా. ఈ చిత్రంతో మళ్లీ తమిళ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నారు. అలాగే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తాప్సీ పాత్రను ఎవరు పోషిస్తారనే సంగతి తెలియాలి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ‘ఖాకీ’ ఫేమ్ హెచ్. వినోద్ డైరెక్టర్. మే 1 అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
చిత్రా.. లహరి..
ఈ రోజు గురువారం సాయంత్రం కచ్చితంగా ‘చిత్రలహరి’ చూడాలి. ఇలా ప్రతి గురువారం కోసం ఎదురుచూసే రోజులవి. 1990వ దశకంలో ప్రతి గురువారం దూరదర్శన్‌లో వచ్చే ఆ ఆరు పాటల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసేవారు. ఇప్పుడు అదే పేరు ‘చిత్రలహరి’తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్ నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చక్కటి ఫ్యామిలీ కథలను అందించే దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. నవంబర్లోనే ప్రారంభమైన ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న ఇద్దరి పేర్లు ‘చిత్రా’, ‘లహరి’ అని సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయనున్నారట చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. -
ప్రయాణం మొదలైంది
భారీ నౌక ప్రయాణానికి సిద్ధమయ్యారు కల్యాణి ప్రియదర్శన్. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది కూడా. మరి ఈ ప్రయాణం విశేషాలేంటో తెలుసుకోవాలంటే ‘కుంజలీ మరక్కార్’ చిత్రం చూడాల్సిందే. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. మోహన్‌లాల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్, కీర్తీ సురేశ్, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ టైమ్ తండ్రి దర్శకత్వంలో నటిస్తున్నారు కల్యాణి ప్రియదర్శన్. అందుకే ఈ సినిమా తనకు స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ షూట్లో శనివారం జాయిన్ అయ్యారు కల్యాణి. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
ఫుల్ జోష్!
తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే కొత్త సినిమాకు పచ్చజెండా ఊపేస్తున్నారు కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ శర్వానంద్‌తో ఓ సినిమా చేశారు. ఇది రిలీజ్‌కి రెడీ అవుతోంది. అలాగే మాలీవుడ్‌లో ‘మరార్కర్: అరబికడలింటే సింగమ్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న తమిళ సినిమా ‘వాన్’లో నటించడానికి ఊ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారీ భామ. ఈ సినిమాతో రా కార్తీక్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. అలాగే ఈ సినిమాలో కృతి కర్భందా మరో కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ‘‘ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్. కథ పరంగా కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. ఫ్రెష్ ఫేస్ కోసం కల్యాణిని తీసుకున్నాం. తమిళనాడుతో పాటు ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరపాలనుకుంటున్నాం. ప్రచారంలో ఉన్నట్లు ఇది బైలింగ్వల్ సినిమా కాదు. కేవలం తమిళంలోనే తెరకెక్కిస్తాం’’ అని దర్శకుడు కార్తీక్ పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో కథానాయిక పాత్ర కూడా ఉందని, ఆ పాత్రకు నివేథా పేతురాజ్‌ని ఎంపిక చేయాలని టీమ్ ఆలోచిస్తోందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. -
చిత్రలహరి ఆరంభం
సాయిధరమ్ తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. కాగా, రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో షురూ అయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమల సినిమా అంటేనే క్యూట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌తో ‘చిత్రలహరి’ తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్‌ను సరికొత్త యాంగిల్లో చూపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, లైన్ ప్రొడ్యూసర్: కె.వి.వి. బాలసుబ్రమణ్యం, సహ నిర్మాత: ఎం.ప్రవీణ్. -
జాగ్రత్త.. షూట్ చేస్తా!
గీత... పేరు చాలా సన్నితంగా ఉంది. కానీ అనుకున్నంత సాఫ్ట్ కాదు ఈ అమ్మాయి. తేడా వస్తే రప్ఫాడిస్తుంది. గన్‌తో పేల్చి పడేస్తుంది. ఇంతకీ ఈ గీత క్యారెక్టర్ చేసినది ఎవరో కాదు ‘హలో’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తన వంతు షూట్‌ను కంప్లీట్ చేశారు కల్యాణి. ‘‘శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నా వంతు షూటింగ్‌ను కంప్లీట్ చేశాను. టీమ్‌తో కలిసి సెట్లో బాగా ఎంజాయ్ చేశాను. అలాగే గన్‌తో షూట్ చేయడం నేర్పించిన సుధీర్ వర్మకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం మోహన్‌లాల్ మలయాళ చిత్రం ‘మరాక్కర్’లో ఓ కీలక పాత్ర చేయనున్న కల్యాణి తెలుగులో సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. -
సరికొత్త యాంగిల్
‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’ సినిమా రూపొందుతోంది. ‘హలో’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చిత్రలహరి’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇవ్వగా, సాయిధరమ్ తేజ్ తల్లి విజయ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) మాట్లాడుతూ– ‘‘రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్‌తో మా బ్యానర్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. హార్ట్ టచిం గ్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను చక్కగా తెరకెక్కించడంలో కిషోర్ బెస్ట్. అన్ని అంశాలతో తేజ్‌ను సరికొత్త యాంగిల్లో చూపించనున్నాం. నవంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, లైన్‌ప్రొడ్యూసర్: కె.వి.వి.బాల సుబ్రమణ్యం. -
ధరమ్‌తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
-
ప్రయాణానికి సిద్ధం
కుంజాలి మరాక్కర్ షిప్లో ప్రయాణించడానికి ఒక్కొక్కరుగా రెడీ అవుతున్నారు. హీరో మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ ఈ షిప్ జర్నీకి శ్రీకారం చూట్టారు. ఇటీవలే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ షిఫ్ జర్నీకి ఓకే చెప్పారు. ఇప్పుడు ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ కూడా వీరితో జాయిన్ అవుతాను అంటున్నారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరాక్కర్: అరబికడలింటే సింహమ్’ అనే సినిమా రూపొందనుంది. 16వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. అప్పటి నేవల్ అధికారి కుంజలి మరాక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో యంగ్ మోహన్‌లాల్‌గా ఆయన కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ నటిస్తారు. ఇందులోనే కల్యాణీ ప్రియదర్శన్ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి.. ఇద్దరూ తమ ఫాదర్స్‌తో ఒకే మూవీలో వర్క్ చేయబోతుండటం విశేషం. అంతేకాదండోయ్.. ఈ సినిమాలోని ఓ స్పెషల్ రోల్‌కి కీర్తీ సురేశ్ కూడా ఓకే చెప్పారట. క్యారెక్టర్ ప్రకారం ఆమె చియాంగ్ జువాన్ అనే చైనీస్ వ్యక్తిని లవ్ చేస్తారట. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 1న స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తెలుగులో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే -
కొరియా వెళ్లనున్న గ్యాంగ్‌స్టర్
ఫోన్, బట్టలు, పాస్ పోర్ట్స్.. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అవసరమయ్యే అన్ని వస్తువులను జాగ్రత్తగా లిస్ట్ వేసి మరీ సర్దుకుంటున్నారు శర్వానంద్ అండ్ టీమ్. ‘స్వామి రారా, కేశవ’ చిత్రాల ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్, ‘హలో!’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటిస్తున్నారు. గ్యాంగ్స్టర్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో శర్వానంద్ డబుల్ రోల్ చేస్తున్నారట.ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను కొరియాలో ప్లాన్ చేశారు చిత్రబృందం. సుమారు 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అవుతుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సంగతి ఇలా ఉంచితే... హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ సినిమాలోనూ శర్వానంద్ నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఈ రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు శర్వానంద్. -
2018లో రెండోసారి
ఈ ఏడాది జనవరిలో ‘ఆది’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు మలయాళ నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్. ఈ సినిమాలో ప్రణవ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ప్రణవ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇరుపతియొన్నామ్ నూటాన్డు’. రీసెంట్గా ‘రామాలీలా’ సినిమాతో మాలీవుడ్‌కు దర్శకునిగా పరిచయం అయిన అరుణ్గోపీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం మొదలైంది. ఇందులో కల్యాణీ ప్రియదర్శని కథానాయికగా నటించనున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ స్పీడ్‌గా జరిపి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని టాక్. సో.. ఈ ఏడాది రెండోసారి ప్రణవ్ కనిపిస్తారన్న మాట. ఈ సినిమా కాకుండా తండ్రి మోహన్‌లాల్ హీరోగా నటించనున్న ‘మరార్కర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రణవ్. -
రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో శర్వా సినిమా
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న శర్వానంద్ ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్న శర్వానంద్.. తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్వామి రారా, కేశవ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ.. శర్వానంద్‌తోనూ ప్రయోగాత్మక చిత్రం చేయనున్నాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ హీరోల్లో ఇంత వరకు ఇలాంటి నేపథ్యంతో ఎవరూ సినిమా చేయకపోవటంతో సుధీర్,శర్వాల సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
హలో గురు
వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు రితికా సింగ్. రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన ఈ ముంబై బ్యూటీ రీల్ లైఫ్‌లోనూ బాక్సర్‌గా అలరించారు. లారెన్స్ హీరోగా వచ్చిన ‘శివలింగా’ చిత్రంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్న రితికా తాజాగా ఓ తమిళ చిత్రంతో పాటు తెలుగు సినిమా చేస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా హరినా«ద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నీవెవరో’ చిత్రంలో రితికా ఓ కథానాయిక. తాజాగా ఆమె సాయిధరమ్ తేజ్ సరసన నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్‌ని ఓ హీరోయిన్గా ఎంచుకున్నారు. రెండో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ తీసుకున్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఆ అవకాశం రితికా సింగ్‌కి దక్కినట్లు భోగట్టా. ఆ పాత్రకు రితికా అయితే సరిగ్గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట మరి.. ఈ ముంబై బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
సాయి ధరమ్ - అనుపమ... మరో సినిమా?
సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం కరుణాకరన్ డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కరుణాకరన్ ఫార్మట్‌లో ఉండే లవ్ అండ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ‘తేజ్ ఐ లవ్ యూ’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తేజ్ ,అనుపమ జోడికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కిషోర్ తిరుమల.. సాయి ధరమ్ తేజ్‌తో చేయబోయే తరువాతి సినిమాకు కూడా అనుపమానే హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. సో.. ఈ జోడి వరుసగా రెండు సినిమాల్లో వెండితెరపై సందడిచేయబోతోందన్నమాట. ఈ సినిమాలో అనుపమాతో పాటు, హలో ఫేం కళ్యాణీ ప్రియదర్శిన్ కూడా మరో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జూన్‌లో జాయినింగ్
జూన్ స్టార్టింగ్‌లో స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. కొత్త స్టూడెంట్స్ అందరూ స్కూల్లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటారు. కాజల్ అగర్వాల్ కూడా కొత్త స్టూడెంట్‌లాగానే కొత్త సినిమా సెట్లోకి జాయిన్ అవుతారు. సుధీర్ వర్మ డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. శర్వానంద్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్గా ‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ యాక్ట్ చేస్తున్నారు. మరో హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. జూన్ 15 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు కాజల్. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రంలో నటిస్తున్నారు కాజల్.


