Kalyani Priyadarshan: హీరోయిన్ ఇంట మోగిన పెళ్లి బాజాలు, ఫోటో వైరల్

ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమారుడు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తమ్ముడు సిద్దార్థ్ వివాహం ఘనంగా జరిగింది. అమెరికన్ పౌరురాలు మెర్లిన్‌తో అతడు ఏడడుగులు నడిచాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన వీరి పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోదరుడి పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను కల్యాణి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
కాగా ప్రియదర్శన్ రచయితగా, దర్శకుడిగా అనేక సినిమాలు చేశారు. మలయాళంలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేశారు. హీరా ఫేరి, హంగామా, హల్‌చల్, గరం మసాలా, భాగమ్ భాగ్, చుప్ చుప్‌కే, డె దనాదన్, భూల్ భులాయా వంటి హిట్ సినిమాలతో బీటౌన్‌లో గుర్తింపు పొందారు. 1990లో మలయాళ నటి లిజిని పెళ్లి చేసుకున్న ఆయన 2016లో ఆమెకు విడాకులిచ్చారు. వీరికి కల్యాణి, సిద్దార్థ్ సంతానం. హలో సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం మలయాళ మూవీస్‌తో బిజీగా ఉంది.
Last evening we celebrated my brother’s marriage in the most special and intimate ceremony at home with just family. Im so excited to have Melanie be the sister I’ve always wanted ♥️. Hope we all have your blessings 🙏🏻 pic.twitter.com/6fhIDYFqJ1
— Kalyani Priyadarshan (@kalyanipriyan) February 4, 2023
Film Maker @priyadarshandir &
actress Lissy's son Siddharth Priyadarshan got married. The bride is Marilyn, an American citizen and visual effects producer. Actress @kalyanipriyan is Siddharth's sister.#KalyaniPriyadarshan pic.twitter.com/v4KEhfbAB2— Mollywood Exclusive (@Mollywoodfilms) February 3, 2023
చదవండి: స్టార్ డైరెక్టర్‌కు ప్రమాదం.. నెల రోజులదాకా కష్టమే!
ఎన్నోసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చాను: విజయశాంతి
మరిన్ని వార్తలు