
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ ముందు మరోసారి హాజరు కానున్నారు. మళ్లీ విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సిద్ధమయ్యారు. అయితే..
విచారణకు ముందు హరీష్‌రావు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే ఆయన బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. గత విచారణలో.. ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..
గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
మాజీ ENC అనిల్ కుమార్ హాజరు..
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్‌సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కమిషన్‌కు తెలియకుండా బ్యారేజీల్లో గ్రౌంటింగ్ చేయడంతో అనిల్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది.
కేబినెట్ మినిట్స్ పరిశీలన
క్యాబినెట్ రాటిఫికేషన్స్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రొసీజర్ పై ఇరిగేషన్, ఫైనాన్స్ ఉన్నతాధికారులను అడిగిన కమిషన్.. కేబినేట్ నిర్ణయాల ప్రొజిజర్ ఎలా ఉంటుందనే వివరాలను GAD అధికారులను అడిగి తెలుసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 28 ప్యాకేజీల్లో కేబినెట్ ముందుకు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అడిగిన జస్టిస్ పీసీ ఘోష.. ప్రాజెక్టు లొకేషన్లు, డిజైన్ల మార్పుకు సంబంధించిన ఫైల్స్ కేబినేట్ ముందుకు వచ్చాయా? విషయంపై కమిషన్ ఆరా తీశౠరు. అలాగే.. నిధుల మంజూరులో పారదర్శకత ఉందా లేదా అనే విషయం పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.