breaking news
KCR
-
పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు.పార్టీ పట్ల ఆయన అంకితభావం, ప్రజల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్న కేసీఆర్, ఆయన మరణం బీఆర్ఎస్కు తీరని లోటని అన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ గారు కొనియాడారు.హరీష్ సంతాపం..అలాగే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృత్యువును జయించి తిరిగి వస్తారని ఆశించామని, కానీ ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. వ్యక్తిగతంగా ఆత్మీయ సోదరుడిని కోల్పోయానని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ "పెద్దన్నకు జోహార్లు" అని నివాళులర్పించారు.సీఎం సంతాపం.. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.కేటీఆర్ సంతాపం.. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశించామని, కానీ ఆయన ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్న కేటీఆర్.. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. -
హిమాన్షుకు సర్జరీ.. AIG ఆస్పత్రికి కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 6వ తేదీన జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కిందపడటంతో హిమాన్షు ముక్కుకు గాయమైంది. అప్పట్లో వైద్యులు వైద్య సేవలు అందించి పంపినప్పటికీ, భవిష్యత్తులో శ్వాసపరంగా లేదా ఇతరత్రా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సర్జరీ అవసరమని నిపుణులు సూచించారు.వైద్యుల సలహా మేరకు హిమాన్షు తాజాగా ఆసుపత్రిలో చేరగా, వైద్య బృందం నేడు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సర్జరీ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న తన మనవడు హిమాన్షును పరామర్శించారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, సర్జరీ తర్వాతి రికవరీని అక్కడి సీనియర్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడారు. వైద్యుల పర్యవేక్షణలో హిమాన్షు మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, తాను వేగంగా కోలుకుంటున్నానని సోషల్ మీడియాలో తెలిపారు. -
పెద్దిని పరామర్శించిన KCR
-
సుదర్శన్‌రెడ్డికి కేసీఆర్ పరామర్శ
సాక్షి, సికింద్రాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.కేసీఆర్ అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి సికింద్రాబాద్ వచ్చారు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి సుదర్శన్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట పార్టీ నేతలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్, సంజయ్ కుమార్, సంతోష్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. కేసీఆర్ రాకతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిచ్చారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది.చదవండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు -
యశోదా ఆసుపత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ( సోమవారం) యశోదా ఆసుపత్రికి వెళ్లారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వారికి ధైర్యం చెప్పారు.నిన్న హన్మకొండలో ఆదివారం సుదర్శన్ రెడ్డికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆయనను గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యపరిస్థితిపై కేసీఆర్ నిరంతరం ఆరా తీస్తున్నారు. -
మాజీ MLA ఆరోగ్యంపై KTRకు KCR ఆదేశాలు
-
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. అత్యుత్తమ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ అప్రమత్తం చేశారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మీడియాతో రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలడగా ఉందన్నారు. గుండెపోటుతో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. హార్ట్ ఫంక్షనింగ్ ప్రస్తుతం కంట్రోల్ ఉందన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.సుదర్శన్‌రెడ్డి చనిపోయినట్లు మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్ యశోధ ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు కేటీఆర్, హరీశ్ రావు బయలుదేరారు. -
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కేటీఆర్ కుటుంబం.. స్పెషల్ బర్త్‌డే వేడుకలు చూశారా? (చిత్రాలు)
-
కాంగ్రెస్ ఓట్లే లక్ష్యం.. 'సర్'తో బీజేపీ సర్కార్ కుట్ర: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్) పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘సర్’ పేరుకే ప్రక్షాళన అని, కాంగ్రెస్ ఓట్ల తొలగింపే టార్గెట్ అని ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళితులు, గిరిజనుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు కోల్పోతే సంక్షేమ పథకాల లబ్ధి పొందడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ నగరంలో లక్షల ఓట్లు తొలగించారని, ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనను సంక్షేమ శాఖకు బదిలీ చేశారని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న ఎస్ఐఆర్కు ఆద్యుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ ఆవరణలో జరుగుతున్న మరమ్మతు పనులను సీఎం పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ మీడి యా అడ్వైజరీ కమిటీ కార్యాలయంలో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ముందు ఓట్ల తొలగింపు.. తర్వాత సంక్షేమ పథకాలు ‘పేదోడి ఓటు చాలా విలువైంది. ఓటు పోతే వారి జీవితం పోతుంది. అందుకే 3వ తేదీ వరకు మా నేతలకు హైదరాబాద్ రావొద్దని చెప్పా. సర్ ప్రక్రియ ఇప్పటివరకు 70 శాతం పూర్తయ్యింది. ఇంకా 30 శాతం ఉంది.. ఇదే కీలకం. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత కీలక పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలు, దళితులు, గిరిజనుల ఓట్లు పెద్దఎత్తున తొలగిపోయే ప్రమాదం ఉంది. కూలీ పనులకు వెళ్లేవారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పేదలంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వాళ్లే. బీఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో లేకపోతే ఆ ఓట్లు పోయినట్టే. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న ఈ వర్గాల ఓట్లను తొలగించడం ద్వారా పార్టీని బలహీనపరచాలని కుట్ర జరుగుతోంది. ఓటు లేకపోతే ప్రజాస్వామ్య హక్కులు పోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నాకు రెండు ఓట్లు లేవు.. ‘కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. నీట్ పేపర్ లీకేజీ నుంచి ఎస్ఐఆర్ వరకు రెండు పార్టీల వైఖరి అనుమానాలకు తావిస్తోంది. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. నాకు రెండు ఓట్లు ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విచారణ చేసి తప్పు అయితే లోపల వేస్తారు. నేను స్వయంగా ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు పెట్టుకుని ఓటు కొడంగల్‌కు మార్చుకున్నా. కాళేశ్వరం కేసులో సీబీఐ తన పని చేసుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిటీ నివేదికల ఆధారంగానే సీబీఐకి దర్యాప్తుకు అప్పగించాం. తప్పు చేసి ఉంటే తప్పించుకోలేరు. మేడిగడ్డ బరాజ్ గేట్లు తెరిచినా, పంప్‌హౌస్‌లు నడిచేపక్షంలో అవెందుకు కట్టారో చెప్పకుండా హరీశ్‌రావు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్, బరాజ్‌ల నిర్మాణం, గేట్ల నిర్వహణపై నిపుణుల నివేదికలు స్పష్టంగా ఉన్నాయి. ఆ అంశాలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడకుండా కన్నెపల్లి నుంచి నీటిని తరలించాలని కొత్త రాగం అందుకున్నారు. మేడిగడ్డ బరాజ్‌లో 5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే అవకాశం ఉంది. అదే పద్ధతి అన్నారం, సుందిళ్లలో కూడా ఉంది. ఇవన్నీ జరగాలంటే మూడు బరాజ్‌ల గేట్లు మూయాలి. అవి మూస్తే బరాజ్ కూలుతుందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. దేవాదుల ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తున్నాయి..’ అని రేవంత్ వివరించారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఎవరిది? ‘ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో 25 మంది విద్యార్థుల మరణాలకు కారణమైందని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబ్ అరెనా సంస్థ పేరు మార్చుకుని ప్రస్తుతం ’కో ఎంప్ట్’ గా చలామణి అవుతోంది. నీట్ పేపర్ లీకేజీకి స్ఫూర్తి నాటి గ్లోబ్ అరెనా సంస్థ చేసిన ఇంటర్ లీకేజీనే. జన్వాడ ఫామ్‌హౌస్ ఏ రాజు నుంచి వచ్చిందో...ఆ ఫామ్‌హౌస్‌కు, గ్లోబ్ అరెనా సంస్థ ‘రాజు’కు ఉన్న సంబంధమేంటో కేటీఆర్ చెప్పాలి. గ్లోబ్ అరెనా సంస్థ తనది కాదని కేటీఆర్ చెప్పే పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే విజిలెన్స్ ద్వారా గ్లోబ్ అరెనా ఇంటర్ లీకేజీపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఫిర్యాదు చేస్తే సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగుతారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారి విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. జైలుకు వెళ్తే సానుభూతి వచ్చి సీఎంలు అయ్యే పక్షంలో, ఎప్పుడో జైల్లో ఉన్న చార్లెస్ శోభరాజ్, బిల్లా రంగాలు కూడా పీఎంలు ఆయ్యే వాళ్లు..’ అని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఇందిరమ్మ’ అదనపు ఖర్చు లబ్ధిదారులదే ‘పేదల ఇళ్లకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అందుకు అనుగుణంగానే భూమి ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. హైదరాబాద్‌లో ఇచ్చే లక్ష ఇళ్లకు కూడా ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుంది. అదనపు ఖర్చు లబ్ధిదారులే చెల్లించాల్సి ఉంటుంది. సమర్ధవంతంగా హైడ్రా వ్యవస్థ హైడ్రా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులను పునరుద్ధరించి ప్రభుత్వ భూములను కాపాడుతోంది. ఉద్యోగాల భర్తీలో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 55 రోజుల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే నియామకాల జాబితాను పేర్లతో సహా వెల్లడించడానికి సిద్ధం. నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రశ్నపత్రం అమ్ముకోవడం వారి విధానమైతే, నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం మా విధానం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయలేకపోయామని కేటీఆర్ ఒప్పుకున్నాడు. మేము ప్రక్షాళన చేయడమే కాకుండా పదేళ్ల తర్వాత గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
ఫ్లడ్.. బ్లడ్.. పీక్స్‌కు చేరిన కాళేశ్వరం వార్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రక్తదాన శిబిరం నిర్వహించగా.. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇటు తెలంగాణ భవన్, అటు గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో బీఆర్ఎస్వీ.. ‘రేవంత్ రక్తదాహానికి రక్తదానం’ అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు.. ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సేకరించిన రక్తపు ప్యాకెట్లతో.. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి నిరసన తెలుపుతామని బీఆర్ఎస్వీ నేతలు అంటున్నారు. దీంతో తెలంగాణ భవన్ బయట భారీగా పోలీసులు మోహరించారు. ఇక..మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. గాంధీభవన్‌లో ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించింది. ప్రాజెక్టు లోపాలు అంటూ పలు చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.కాళేశ్వరం అంశాన్ని ఇరు పార్టీలు రాజకీయ ఆయుధంగా మార్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. మరోవైపు రాజకీయ కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో కాళేశ్వరం వ్యవహారం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది. -
జానకమ్మ మృతి సినీ సంగీతానికి తీరని లోటు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆస్పత్రిలో వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా జానకి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో "జానకమ్మ"గా చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్. జానకి గాత్రం ఎన్నటికీ చెరిగిపోదని ఆయన అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానంలో వేలాది పాటలకు ప్రాణం పోసి, తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర అనేక భారతీయ భాషల్లో తన అద్భుత గానంతో సంగీత ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత కళాకారిణిగా ఆమెను కొనియాడారు.తండ్రి ఉద్యోగరీత్యా అప్పటి కరీంనగర్ జిల్లాలో నివసించడం, వారి కుటుంబ మూలాలు సిరిసిల్ల ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. జానకమ్మ మరణం ముఖ్యంగా దక్షిణ భారత సినీ సంగీతానికి, భారతీయ గాన ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.జానకమ్మ వంటి మహా గాయనులకు మరణం ఉండదని, వారి గానమాధుర్యం చిరకాలం సంగీతాభిమానుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతా
-
కన్విన్స్ చేస్తే కేసీఆర్‌కు బరాజ్‌లు అప్పగిస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ స్పీకర్‌కు లేఖ రాస్తే ఆయన కోరిన తారీఖున, కోరుకున్నన్ని రోజులు శాసనసభ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దాం. ప్రత్యేక అనుమతితో శాసనసభ, మండలి జాయింట్ సెషన్ పెట్టి కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వాలో కన్విన్స్ చేస్తే మూడు బరాజ్‌లను 100 శాతం వచ్చే మూడేళ్లు అప్పగిస్తాం. ఏం చేస్తడో చేయనీ. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ, ఇతర కాంట్రాక్టర్లను తొలగించి ఈయననే హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్‌గా చేసి అప్పగిద్దాం. తనకు కావాల్సినోళ్లందరినీ పెట్టుకుని ఎలా పునరుద్ధరిస్తడో చేయనీయండి..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విపక్షనేత కేసీఆర్‌కు సవాలు విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అనంతరం రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘సబ్జెక్ట్ నిపుణులు, అడ్వొకేట్ జనరల్‌ను స్పీకర్ అనుమతితో మాట్లాడిద్దాం. ఏమాత్రం మీ(కేసీఆర్) గౌరవానికి, మర్యాదకు భంగం కలగకుండా సజావుగా జరి గే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటారు. మేధావిగా ఆయన సూచన చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది. మీకు ప్రతిపక్ష నేత హోదా లేదా? జీతభత్యాలు తీసుకుంటున్నారు. సభకు వచ్చి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు చేసిన నేరం ఘోరం మీకు తెలుసు. అందుకే ముఖం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేవారిని ఊరిమీద వదిలి మమ్మల్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నరు’అని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే నీళ్లను ఎత్తిపోసి చూపిస్తామని కేటీఆర్ చేసిన సవాలుకు ప్రతిస్పందనగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం పేరు, ఊరు మార్చి... ‘దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.38వేల కోట్ల అంచనాలతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ వచ్చిన ఏడాదిన్నర వరకు రూ.11,670 కోట్ల ఖర్చు చేశాక కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల వసూలుకు ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ ఆలోచనలు మారాయి. ఊరు, పేరు మార్చి, అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని కేసీఆర్ స్కీమ్ వేస్తే ఆయన ఆలోచన తప్పని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015లో స్పష్టంగా చెప్పింది. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మిస్తే ఉండదు, వేమలపల్లి వద్ద నిర్మిస్తే పర్వాలేదు అని చెప్పింది. ఈ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లు, పంపులు, లిఫ్టులు కట్టదలిచినా అని ఆర్డర్ ఇచ్చారు. వాళ్లు నిపుణులు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కాదు. వాళ్లు రాజకీయాల్లో తిమ్మినిబమ్మి చేయడంలో నిపుణులు కావచ్చు. అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ఎలక్షన్ కలెక్షన్లలో నిపుణులు. ఇందులో ముగ్గురికీ ఫస్ట్ ర్యాంక్ పంచాల్సి వస్తుంది. ఊరు, పేరు మార్చి రూ.38వేల కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ.81వేల కోట్లకు పెంచారు. అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరగనుందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఇంత తిన్నా డిజైన్, ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణలో నాణ్యత పాటించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తన మెదడును రంగరించి, 80వేల పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసిన, ఇది నా బ్రెయిన్‌చైల్డ్ అని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. నాటి గవర్నర్ నరసింహన్ అబద్ధాల రావుల మాటలు నమ్మి హరీశ్‌రావుకు కాళేశ్వరం రావు అని బిరుదు ఇచ్చారు’అని సీఎం ఎద్దేవా చేశారు. రెండు మూడేళ్లలో వేల కోట్ల కోసం ... ‘కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ 2019 జూన్ 21న ప్రారంభించాడు. యజ్ఞాలు యాగాలు చేసిండు. ఎన్ని చేసినా చిత్తం శువుడి మీద భక్తి చెప్పులపై ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంత సేపు ఎట్ల కొల్లగొట్టాలనే ఆలోచనతో హడావిడిగా ప్రారంభించాడు. ఏడాది తిరిగే లోపే మేడిగడ్డలో లోపాలన్నీ బయటపడ్డాయి. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమీషన్లు ఇచ్చాం. ఇంకా రిపేర్లు ఎవరు చేసుకుంట కూర్చుంటడు అని ఎల్అండ్టీ పట్టించుకోలేదు. రోజురోజుకి సమస్య పెద్దదై కుప్పకూలే పరిస్థితి వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ సర్వే చేసి బరాజ్‌లు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదని ఆ రోజుల్లోనే నివేదిక ఇచ్చాడు. రెండు మూడేళ్లలో రూ.వేల కోట్లను సంపాదించుకోవాలని కేసీఆర్ హడావుడి చేశారు. భూపరీక్షలు చేయకుండానే ఇసుకలో బరాజ్‌లు కట్టారు. కట్టిన వెంటనే 100 శాతం సామర్థ్యంతో నీళ్లను నిల్వ చేయడంతో బరువు తట్టుకోలేక మేడిగడ్డ కుంగిపోయింది’అని సీఎం పేర్కొన్నారు. రేవంత్ మాటలు ఆయన మాటల్లోనే.. భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది.. ‘నాలుగు పిల్లర్లు పోతే ఏమవుతుందని కేసీఆర్ అంటాడు. వెన్నుపూసలో నాలుగు పూసలు దెబ్బతింటే మంచానికి పరిమితమై ఉండాల్సిందే. గోదావరి ప్రాజెక్టులకు వెన్నుపూస ‘మేడిగడ్డ’దెబ్బతింది. 80వేల పుస్తకాలు చదివిన మేధావి తొమ్మిదిన్నరేళ్లు కష్టపడి మూడేళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమై కుప్పకూలింది. మళ్లీ ఇప్పుడు వారం రోజులు మాకు ఇవ్వండి.. తడాఖా చూపిస్తాం అంటుండు(కేటీఆర్). పోనీ ఆయనైనా(కేసీఆర్) వచ్చి అడిగిండా? ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లందరినీ తోలుతుండు. ప్లానింగ్ డిజైనింగ్ నాణ్యత, నిర్వహణ లోపాలతోనే కుంగిందని ఎన్డీఎస్ఏ కమిటీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. మొత్తం బరాజ్ దెబ్బతిన్నది, నీళ్లు నింపితే కుప్పకూలుతుంది. ఖాళీ చేయమని చెప్పింది. లేకుంటే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయి. యథాతథంగా బరాజ్‌ల గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోయాలని ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ చెప్పలేదు. మేడిగడ్డ తరహా టెక్నాలజీతోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. అక్కడా బుంగలు ఏర్పడ్డాయి. నీళ్లు ఆపితే బరాజ్‌లు కూలి కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. బాంబులతో పేలిస్తే భూమిలోకి పోతదా? బాంబులతో పేలిస్తే బరాజ్ గాల్లోకి లేస్తదా? భూమిలోకి పోతదా? మన మీద వేస్తడేమిటి? మీ నాన్న అవినీతికి బలైపోయింది. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పు అయితే, కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్, రూ.లక్ష కోట్ల ఆస్తులు; కేటీఆర్‌కు జన్వాడ, హరీశ్‌రావుకి మొయినాబాద్‌లో 50 ఎకరాల్లో, కవితకు శంకరపల్లిల్లో 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చాయి? కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎలా అవుతాడు? పత్రికలు, చానళ్లు, వ్యాపారాలు, బెంజీకార్లు ఎలా వస్తాయి? ఆ సూత్రం ఏదో చెప్తే మొత్తం తెలంగాణ బాగుపడ్తది. రూ.లక్ష కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టును నిలబెట్టుకోవాలని తాపత్రయం పడుతున్నం. కరువు వచ్చినప్పుడు పనికి వస్తుందని దూరదృష్టితో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండని ఒకాయన అంటాడు. ఎల్‌నినోతో నీళ్లే లేవు. వరద ఉధృతంగా వచ్చినప్పుడు 90 రోజుల్లో తరలించుకోవడానికి కట్టింది. వర్షాలు రానప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని అల్లుడు (హరీశ్) అంటున్నడు. కనీస పరిజ్ఞానం ఉన్నోడు మాట్లాడే మాటలేనా? వర్షమే లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్..ఆర్థిక ఆగ్రవాదులు తొమ్మిదిన్నేర ఏళ్లు మీకు అప్పగిస్తే రూ.8.21లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.38వేల కోట్ల అంచనాలను రూ.1.47లక్షల కోట్లకు పెంచి, రూ.1.02 లక్షల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించాక కట్టిన రెండేళ్లకే కాళేశ్వరం కూలిపోయి కూలేశ్వరమైంది. దీనిని నిర్వాకం కాదు విధ్వంసం అంటారు. ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఆర్థిక ఉగ్రవాదులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేశారు. అప్పుడే నేరాలన్నీ మాఫీ అయినట్టు వ్యవహరిస్తున్నారు. 15 ఆగస్టు, 26 జనవరికి తీవ్రమైన నేరాలు చేసిన వారికీ మార్పు వచ్చిందని క్షమాభిక్ష పెడుతుంటాం. వీళ్లు మారేటోళ్లు కాదు. తెలంగాణ ఉద్యమంలో ముసుగుతొడుక్కుని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీకే ప్రాధాన్యతనిచ్చారు. అని రేవంత్ పేర్కొన్నారు. ఉరివేయాలంటే నిబంధనలు అడ్డు బరాజ్‌లు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే రాత్రింబవళ్లు కూర్చుని చేపించేవాళ్లం. ఏం చేయలేని నిస్సాహాయస్థితిలో ఉన్నం. బాధ, కోపం ఉన్నాయి. రూ.లక్ష కోట్లుపెట్టింది ఇలా అయింది. నేరగాళ్లను శిక్షించ లేకపోతున్నాం. ప్రజలందరూ వీరిని ఉరితీయాలని కోరుకుంటే నియమనిబంధనలు అడ్డువస్తున్నాయి. కేంద్ర మంత్రి చెప్పినట్టు విచారణను సీబీఐకు అప్పగిస్తూ 2025 సెపె్టంబర్ 1న జీవో ఇస్తే ఇంకా చేపట్టలేదు అని సీఎం మండిపడ్డారు. మీరేందుకు మాట్లాడడం లేదు? ‘మీరేందుకు ధైర్యంగా మాట్లాడం లేదు. ఎందుకు ఘాటుగా తిప్పికొట్టలేకపోతున్నరు. 30 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 15 నెలల్లో 67వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. హామీలన్నీ అమలు చేశాం. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద బీమా అమలు చేయబోతున్నాం’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10న మధిర నియోజకవర్గంలో రైతుభరోసా సభకు అందరూ రావాలని ఆహా్వనించారు. మరో రూ.1000 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. -
హిమాన్షుకు గాయం.. హైదరాబాద్‌కు కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్పగాయమైంది. హిమాన్షుకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కొన్ని రోజుల్లో కోలుకుంటారని కేటీఆర్ ఎక్స్‌లో చెప్పారు. తన కుమారుడి గురించి కాల్స్, మెసేజ్‌లు చేస్తున్న వారికి థ్యాంక్యూ చెప్పారు.తన మనవడు హిమాన్షును చూడడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హిమాన్షుతో కాసేపు మాట్లాడి పరామర్శించారు. కాగా, హిమాన్షు జిమ్ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన ముక్కుకు గాయమైనట్లు సమాచారం. My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern— KTR (@KTRBRS) July 7, 2026 -
రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్‌ను ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలపాలి. నాతో కలిసి నడవండి.. రాహుల్‌ను ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారని, పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘మీ ఊళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు అందించారా? ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి?..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనను రావణుడితో, కాంగ్రెస్ పాలనను రాముడి పాలనతో పోలుస్తూ.. రాముడి పాలన కావాలా.. రావణుడి పాలన కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్‌రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో పర్యటించారు. ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆత్మీయులతో ముచ్చటించారు. ఆ తర్వాత డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్‌రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞత వందన సభలో మాట్లాడారు. ఏం చేశారని మీకు లక్షల కోట్లు వచ్చాయి? ‘పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు, మీ కుటుంబాలకు లక్ష కోట్లు వచ్చాయి. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్‌హౌస్‌లో పండించిన గంజాయి, డ్రగ్స్‌ను రైతు బజార్లలో పెట్టి అమ్ముతారు. మీతో పాటు పాటు దోపిడీ చేసిన ఆఫీసర్లను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే కదా. కేసీఆర్‌కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్‌కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్‌రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాలు, కల్వకుంట్ల కవితకు శంకర్‌పల్లిలో 25 ఎకరాల ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ షడ్డకుడి కొడుకు సంతోష్రావుదైతే లెక్కలు చెప్పనికే లేదు. ఇంత సంపాదన ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఎక్కడ సంపాదించారు. ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది? మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిõÙనా? అసెంబ్లీకి రాడు.. ప్రజాసమస్యలు ప్రస్తావించడుం. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట. పదేళ్లలో రాష్ర్టంలో ఆయన చేసింది ఏమంటే ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరెళ్ల దళితులపైకి లారీలు ఎక్కించుడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టించుడు. ప్రశ్నలు, ప్రశ్నపత్రాలను పల్లీ, బఠానీల మాదిరి అమ్ముకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? ఆ పశుపతి ఫామ్‌హౌస్‌లోనే కుంగికృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్‌ను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటూ సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చేందో తేల్చండి ‘ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ధాన్యం చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లు వేసినందుకా? 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్‌కార్డులు, సన్న బియ్యం ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా? జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదా?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సరాసరి ప్రతి నెలా రూ.5,600 కోట్లు మేం ఖర్చు చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందేందో లెక్కలు తేల్చండి. నా ఆత్మ బంధువులు మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా. 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం..’ అని రేవంత్ అన్నారు. రబ్బానీకి పదవి ఇవ్వాలి.. మిడ్జిల్‌ను దత్తత తీసుకోవాలి ‘2006 జూలై 2 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. ఆనాడు జెడ్పీటీసీగా నా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. అయితే నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జెడ్పీ చైర్మన్ రేసులో నిలిచి జెడ్పీటీసీ అభ్యరి్థగా నాపై ఓడిన రబ్బానీకి ఈ రోజు ఒక మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచిస్తున్నా. నా బాధ్యతను నెరవేర్చేందుకు మిడ్జిల్‌ను దత్తత తీసుకోవాలని భట్టిని కోరుతున్నా. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికు నా ప్రాణమిచ్చినా తక్కువే..’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం కాన్వాయ్‌కు ట్రాఫిక్ చిక్కులు శంషాబాద్ రూరల్: మిడ్జిల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు శనివారం ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో బెంగళూరు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.35 గంటల సమయంలో శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాన్వాయ్ వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్ జాంను క్లియర్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు విన్పించాయి. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం: భట్టి ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపైనే ఆధారపడి పాలన సాగించడం లేదని, ప్రజలకు దగ్గరగా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఓట్లు వేసి జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరు«ద్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాలు చెప్పను
సాక్షి, హైదరాబాద్: ‘అధికారం కోసం అబద్ధాలు చెప్పను. ఏముందో అదే చెబుతా... చెప్పిందే చేస్తా. అబద్ధాల పునాదులపై ప్రభుత్వం నడపను. ఈ ప్రభుత్వం రైతులది, పేదలది, మహిళలది, నిరుద్యోగులది. పదవి శాశ్వతం కాదు... మాట శాశ్వ తం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా రాజకీయ జీవితం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ పెట్టుబడి సాయం విడుదల సందర్భంగా నిర్వహించిన రైతు భరోసా సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మళ్లీ వస్తాడని ఇద్దరు పిల్ల రాక్షసులు చెబుతున్నారని.. ఆయన రావడం వల్ల ఆ కుటుంబానికే ఉపయోగం తప్ప ప్రజలకు ఒనగూరేదేముందని సీఎం ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారని.. అయితే బెంగాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీకి 15 ఏళ్లు పట్టిందని.. ఇక్కడ కూడా అలాగే వేచి ఉండాలని ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్య అంశమని చెప్పారు. రైతుల కోసం ప్రతినెలా రూ. 6 వేల కోట్ల చొప్పున గత 30 నెలల్లో రూ. 1.75 లక్షల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పంటా కాళేశ్వరం నీళ్లతోనే పండుతోందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొనే వాళ్లని.. కానీ మూడేళ్లుగా అక్కడి నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ రైతులు 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యం ఎలా పండించారో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో వరి పండించి క్వింటా రూ. 4,200కు అమ్ముకున్నాయన వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ వస్తాడా... ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో అయిన అప్పు రూ. 69 వేల కోట్లు అయితే, పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రూ. 7 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా విడతలవారీగా ఇచ్చారని.. బడి పిల్లల భోజన బిల్లులు, యూనిఫాం బిల్లులు, స్వయం సహాయక సంఘాల బకాయిలు, సర్పంచుల బిల్లులు... ఇలా ఏ ఒక్కటీ చెల్లించకుండా వెళ్లిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయిందో లేదో అప్పుడే దిగిపోవాలంటున్నారని.. అడగగానే దిగిపోవడానికి తాము గడీల ముందు బానిసలమా? అని సీఎం ప్రశ్నించారు. ‘కేసీఆర్ మళ్లీ వస్తే ప్రజలకు ఏం చేస్తడు. ప్రజలకేం ఇచ్చిండని వస్తడు? మొగుడు పెళ్లాలు మాట్లాడుకునే మాటలు వినడానికా? రైతు బజార్లు తీసుకురావాల్సింది పోయి బెల్టు షాపులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో తాగుడు సంస్కృతిని పెంచారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దళితులకు 3 ఎకరాల చొప్పున భూపంపిణీ ఇవ్వలేదు. రూ. లక్ష చొప్పున రైతులకు రుణమాఫీ చేయలేదు. మేం సంసారాల్లో చిచ్చుపెట్టే తప్పుడు రాజకీయాలు చేయం. ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు మా ప్రభుత్వంలో ఉండవు’అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మోదీ వచ్చి మోరీ తీస్తడా? ‘తెలంగాణలో కూడా మోదీ పాలన వస్తదని బీజేపీ నేతలు అంటున్నారు. అయినా మోదీ వచ్చి మోరీ తీస్తాడా? ప్రతి పేదవాడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ లెక్కన 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎక్కడ ఉన్నాయి ఆ ఉద్యోగాలు? తెలంగాణలో బండి సంజయ్, కిషన్‌రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ ‘ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి అధికారంలోకి వచ్చిన రోజే ఉచిత విద్యుత్‌పై సంతకం చేశారు. రూ. 12 వేల కోట్ల విద్యుత్ బిల్లులను కూడా మాఫీ చేశారు. ఎవరైనా ఉచిత విద్యుత్ ఇచ్చామంటే ఉరికించి కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉచిత విద్యుత్ కోసం గత 30 నెలల్లో రూ. 30 వేల కోట్లు వెచ్చించాం. ప్రతిపక్ష నాయకులు మూసీ అభివృద్ధి వద్దంటారు... మెట్రో వద్దంటారు... రీజనల్ రింగ్ రోడ్ వద్దంటారు... పొర్లు దండాలు పెట్టినా అభివృద్ధి పనులు ఆపం’అని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. పంట మార్పిడి తప్పనిసరి ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున వర్షాలను బట్టి రైతులు పంటలు వేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాం. రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు వేయాలి. పంట మార్పిడి చేయాలని శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు నేను చెబితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పుకుంటూ బతకాలనే శాపం బావబామ్మర్ధులకు ఉన్నట్లుంది. అందుకే పోటీ పడి అబద్ధాలు చెబుతున్నారు. ఎవరేం చెప్పినా 9 రోజుల్లో రైతుభరోసా కింద రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూమి భరోసా కాదు... పంటకు భరోసా: మంత్రి తుమ్మల భవిష్యత్తులో పంట వేసిన వారికే రైతు భరోసా అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఇది భూమి భరోసా కాదని, పంటకు ఇచ్చే భరోసా అని స్పష్టం చేశారు. పంటల మార్పిడి చేయాలని, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు పప్పు దినుసులు పండించాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరితోపాటు రైతు వేదికల నుంచి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు ఆన్లైన్లో పాల్గొన్నారు. -
గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం అధికార పీఠానికి దూరమైన బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించాలని భావిస్తోంది. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్న బీఆర్ఎస్ మరోవైపు సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపైనా దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది పార్టీ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాదయాత్ర ఉంటుందని బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోంది. అదే సమయంలో నాయకత్వలేమి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేష్కిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. చురుగ్గా యువనేతలు...2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఇతర పార్విల్లోకి వలసపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు అటు పార్టీ అధినాయకత్వం, ఇటు కేడర్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరితో పార్వికి చెడ్డపేరు వచ్చిందనే ఆరోపణలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే అభిప్రాయాన్ని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త తరానికి అవకాశమివ్వాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. అదీగాక, గతంలో విద్యార్థి, యువజన విభాగాలతోపాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలే ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా అవకాశం దక్కుతుందనే ఆశావహ దృక్పథం వీరిలో కనిపిస్తోంది. మరోవైపు పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఆశావహులు సందడి చేస్తున్నారు. పార్విలో అనేక మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులతో అరంగేట్రం చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా కేటగిరీలకు చెందిన వారు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్వైపు చూస్తున్నట్లు సమాచారం. నిష్క్రమణలు.. చేరికలు.. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పొసగక తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకుని క్రియాశీలమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఎస్పీ నుంచి పోటీచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరి నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. నిర్మల్‌లో ఓటమి అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా క్రియాశీలంగా పనిచేయడం లేదు. ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ స్థానికంగా బలమైన నాయకుడి కోసం అన్వేష్కిస్తోంది. ⇒ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడిపై కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితయ్యారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. రామగుండంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని పార్విలో ఆయన ప్రత్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నా వారి వయసు, ఆరోగ్య కారణాలతో కొత్త ముఖాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేశ్ బీజేపీ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. స్టేషన్ ఘనపూర్‌లో పార్టీని వీడిన కడియం శ్రీహరి స్థానంలో మాజీ మంత్రి రాజయ్య తిరిగి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ డాక్టర్ వినోద్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో పార్టీ కేడర్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమన్వయం చేస్తున్నారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం (ఎస్టీ) ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సాగుతోంది. కొత్తగూడెంలోనూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్థానంలో వెతుకులాట సాగుతోంది. ⇒ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరడంతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్‌కు చేరువ కావడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ తాండూరు తన కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ⇒ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గతంలో ఎంఐఎంతో దోస్తీ మూలంగా ఏడు చోట్ల స్నేహపూర్వక పోటీకి బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాతబస్తీలోనూ బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు. -
కేసీఆర్ బస్సు యాత్ర అప్పుడే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వాళ్లే ఓడ గొట్టారు. కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ విషయం బయట పెట్టిన బ్లాక్ షిఫ్ ఎవరో తేల్చండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కి పరిమితమవుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యర్థి బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయడం మాకు కలిసొచ్చింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నాకు పంచాయితీలు లేవు. విధానపరమైన నిర్ణయాలపై మాత్రమే పంచాయతీ. రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా చేస్తుంది. రేవంత్ నిర్ణయాలు బీఆర్ఎస్కు మంచిది...అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు మెట్రో రద్దు చేశారు. మెట్రో పూర్తయి ఉంటే ట్రాఫిక్ చిక్కులు తగ్గేవి. హైడ్రాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్నారు. మేము నగరంలో వంద చెరువులు బాగుచేశాం.. కానీ చెప్పుకోలేదు. రెండు చెరువులు బాగు చేసి ఉదరగుడుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది సమయం కేసీఆర్ డిసైడ్ చేస్తారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సర్ సభ్యత్వ నమోదుపై సమావేశాలు నిర్వహించాము. మిగతా 59 నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడు.. ఫ్యూచర్ సిటీ అంతకంటే లేదు. జులై లో డీలిమిటెషన్ బిల్లు చేస్తారని సమాచారం ఉంది. దేశంలో డీలిమిటేషన్ చేయక పోయినా రాష్ట్ర విభజన అంశంలోనే పొందుపరిచారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని ఉంది. డీలిమిటేషన్ తర్వాతనే సీట్లు ఎవరికి అనేది ఆలోచిస్తాం. అమ్మిన భూముల డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు కొత్త పథకాలు అమలు చేయడం లేదు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్: మంత్రి ఉత్తమ్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలలో భాగంగా బోర్ హోల్స్ పనులను పరిశీలించారు.దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీరు అందించడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టామని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వానికి పేరు రావద్దని.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి తీసుకువచ్చారన్నారు. చేవెళ్ల నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్పు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు లక్ష 45 వేల కోట్లు ఖర్చు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సంస్థల చేత బ్యారేజ్ కొంగుబాటుపై దర్యాప్తు జరిపించడం జరిగిందన్నారు. ఆఫ్రి సంస్థ ఆధ్వర్యంలో రీ డిజైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. జూలై మొదటి వారంలోపు పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. -
2028లో మళ్లీ కేసీఆరే సీఎం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధ్వజమెత్తారు. అలాంటి విషనాగులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు నమ్మబోరని పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మలేసియా తెలుగు అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ ఎన్నారై మలేసియా శాఖ కౌలాలంపూర్‌లో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని, వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పోరాటాల వారసత్వాన్ని మోస్తున్న జాతి అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణవాసులమని గర్వపడే స్థాయికి రాష్ట్రం ‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’అని ప్రతి తెలంగాణవాసి గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరిందని కేటీఆర్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకునే ప్రత్యేక జాతి తెలంగాణ జాతి మాత్రమేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితమని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలను ఏకం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు కరువులు, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వంటి రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడు కూడా కేసీఆరేనని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ వంటి రంగాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 25 ఏళ్ల తెలంగాణ కోసం బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. 24 గంటల నాణ్యమైన తాగునీటి సరఫరా, బలోపేతమైన ప్రజారవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన తమ లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని.. అనుభవం, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు. -
పాలమూరు, డిండికి ఏపీ ఒప్పుకుంటేనే..
సాక్షి, హైదరాబాద్: ‘పక్క రాష్ట్రం (ఏపీ)తో చర్చలు జరుగుతున్నాయి. తొందర్లోనే వాటిని (జల వివాదాలను) పరిష్కరించుకుంటాం. మీకు తొందర్లోనే మంచి వార్త వినపించబోతున్నా. ముందు మాకు పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నూటికి నూరు శాతం నికర జలాలను ఇస్తే సముద్రంలో పోయే నీళ్ల గురించి ఏపీతో మాట్లాడతాం. కృష్ణా జలాల పంపిణీ అంశం బచావత్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉంది. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా జలాలు చాలు.. మీరు (ఏపీ) 512 టీఎంసీలు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకాలు చేసి కృష్ణా పరీవాహక ప్రాంతానికి శాశ్వతంగా మరణశాసనం రాసిండు.ఆ మరణశాసనాన్ని తిరగరాయడం చెప్పలేనంత సంక్లిష్టంగా ఉంది. అందుకే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నికర జలాల కేటాయింపులకు అంగీకరిస్తూ ఏపీ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఏపీ ప్రాజెక్టులపై చర్చిస్తాం. లేకపోతే చర్చించే సమస్యే లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ శుక్రవారం కరివేన రిజర్వాయర్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నికర జలాల్లో ఒక చుక్కకూ రాజీపడం...‘గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నికర జలాల్లో ఒక చుక్కకే రాజీపడం. వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతి చుక్క నీటి హక్కునూ కాపాడే బాధ్యత నేను, మంత్రి ఉత్తమ్ తీసుకుంటాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇస్తేనే పోలవరం–బనకచర్ల/నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై మాట్లాడటానికి ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీకి చెప్పించాం. పాలమూరుకు 90 టీఎంసీల కేటాయింపులను సైతం తీసుకొస్తాం.డిసెంబర్‌లోగా చర్చల ద్వారా జిల్లాకు సంబంధించి కృష్ణా జలాల విషయంలో మెజారిటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రాజెక్టులు కట్టుకొని మనం 968 టీఎంసీలను వాడుకున్న తర్వాతే సముద్రంలో పోయే నీళ్ల లెక్క తేలుతుంది. 968 టీఎంసీలను మనం భద్రం చేసుకొని మిగిలిన దాని (వరద జలాలు) గురించి మళ్లీ చర్చ చేస్తాం. గోదావరిలో ఏపీకి ఉన్న 516 టీఎంసీలను వాళ్లు ఎక్కడ వాడుకుంటారో వారిష్టం. అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.కమీషన్ల కోసమే లిఫ్టులు, పంపులు...‘కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్ల ఖర్చు చేసిండు. అందులో అధిక భాగం పంపులు, లిఫ్టులకే ఇచ్చి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసిపోయిండు. వాళ్లలాగా కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పనిచేసే వాడిని కాదు. 20 ఏళ్లలో జెడ్పీటీసీ సభ్యుడి నుంచి సీఎం వరకు జిల్లాలో రూ. వేల కోట్ల పనులు జరిగినా ఒక్క రోజైనా నాపై చిన్న ఆరోపణ అయినా వచ్చిందా?’ అని రేవంత్ ప్రశ్నించారు.పంచె కట్టుకున్నోళ్లంతా రాజశేఖరరెడ్డి కాదు..‘పాలమూరు’ ప్రాజెక్టును కొలిక్కి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తుంటే రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వారు (బీఆర్ఎస్) బయలుదేరారు. ఒకాయన పంచె కట్టుకొని రాజశేఖరరెడ్డి అనుకుంటడు. పంచె కట్టుకున్నోళ్లంతా రాజ శేఖరరెడ్డి అయితే బానే ఉండే. ఇంటి పేరు మార్చుకున్నడు ఇంకొకాయన. ప్రజలు చీదరించుకుంటారనే సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని రేవంత్ విమర్శించారు.జూన్‌కల్లా పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలు..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. ప్రాజెక్టులకు అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. తక్కువ భూసేకరణతో ఎక్కువ నిల్వ చేసుకునే అవకాశం ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటాం. పాలమూరు రిజర్వాయర్లు, ట్రంక్ కాల్వలను జూన్ వరకు పూర్తి చేస్తాం. బ్రాంచి కాల్వలు, మిగతా పనులకు ఆ తర్వాత టెండర్లు. పంపులు, లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్లను 2027 జూన్‌లోగా పూర్తి చేసి ఉదాండాపూర్ వరకు నీళ్లను తరలిస్తాం. లక్ష్మీదేవిపల్లికి నీళ్లు ఎలా తీసుకెళ్లాలి? డిస్ట్రిబ్యూటరీ కాల్వలను ఎలా చేయాలో 6 నెలల తర్వాత సమీక్షిస్తాం’ అని సీఎం తెలిపారు.కర్ణాటక సరిహద్దులో బరాజ్‌లు‘కృష్ణా, భీమా నదులపై కర్ణాటక చిన్న బ్రిడ్జీ కమ్ బరాజ్‌లు కట్టి దాదాపు 100 టీఎంసీలు నిల్వ చేసుకుంటోంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్రిడ్జి కమ్ బరాజ్‌లు కట్టుకుంటే నిల్వతోపాటు భూగర్భ జలాలూ పెరుగుతాయి. కర్ణాటక కాంగ్రెస్ సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చెరి సగం ఖర్చు భరించేలా 60–70 శాతం నీళ్లు మనం వాడుకునేలా కార్యాచరణ తీసుకున్నం’ అని సీఎం రేవంత్ చెప్పారు.మోదీనే దిగిపోమనండి..‘ప్రధాని మోదీ 12 ఏళ్లలో ఏం వెలగబెట్టిండో అర్వింద్, బండి సంజయ్ చెప్పాలి? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కో పేదోడి ఖాతాలో రూ. 15 లక్షలు వేశాడా? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసిండా? అందుకే తక్షణమే మోదీని గద్దెదిగమనండి. రాహుల్ గాంధీని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ నెరవేరేలా చేయిస్తా. పాలమూరు–రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింప చేయిస్తా. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజా కేంద్రంతో కొనిపిస్తా. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చూపిస్తాం’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఆర్నెల్లలో సమస్యలన్నీ పరిష్కారం: మంత్రి ఉత్తమ్ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాసం, పునర్నివాసం సమస్యలతోపాటు పర్యావరణ, అటవీ అనుమతులను వచ్చే 6 నెలల్లో పరిష్కరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్‌తో కలిసి కరివేన రిజర్వాయర్ వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం గూడెందొడ్డి, భూత్పూర్ జలాశయాల సామర్థ్యం పెంచడంతోపాటు భీమా, కృష్ణా నదులపై కొత్తగా బ్రిడ్జి కమ్ బరాజ్‌లను నిర్మించనున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. గత సర్కారు ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రూ. 1.81 లక్షల కోట్ల అప్పులు చేసి ఎలాంటి సాగునీటి ప్రయోజనాలు కల్పించలేకపోయిందని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం కృష్ణా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు. తమ పాలన పూర్తయ్యేలోగా లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తామన్నారు. -
పాలమూరులో నీ జెండా ఎగరనియ్య
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు బిడ్డలకు తట్టపని, మట్టిపనే కాదు... అడ్డమొస్తే పండబెట్టి తొక్కి మట్టి కప్పేది కూడా తెలుసు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నిన్ను ఇక్కడ మొలక కూడా ఎత్తనియ్యం. రాసిపెట్టుకో.. పాలమూరు జిల్లాలో నీ జెండాను ఎగరనియ్యం. గద్దెలు దిగాలె.. దిమ్మెలు కూలాలె. పాలమూరు గడ్డ మీద నీ గుర్తు ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే ఇక గతమే. భవిష్యత్తులో ఒక్కడిని కూడా గెలవనియ్యను. పాలమూరు గడ్డ నుంచి జడ్చర్ల వేదికగా కేసీఆర్‌కు ఇదే నా సవాల్. నీకు చేతనైతే రా చూసుకుందాం. 1994 నుంచి 2004 వరకు టీడీపీ రెండుసార్లు అధికారంలో ఉంది.2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో రోజు శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎవరితోనైనా కొట్లాడుతానని స్పష్టం చేశారు. పాలమూరుతో సంబంధం లేకపోయినా ఇక్కడి నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి కష్టాలు చూడలేదని, కన్నీళ్లు తుడవలేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్‌లో ఉన్న ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏడాదికి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినా పదేళ్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 45 లక్షల కుటుంబాలకు రూ. 500కే సిలిండర్, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఆరీ్టసీలో ఉచిత ప్రయాణానికి రూ. 10 వేల కోట్లు, 67,616 మందికి ఉద్యోగాలు, 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కోసం రూ. 27 వేల కోట్లు, వ్యవసాయం కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చుచేశాం. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి. ఈ విషయంపై చర్చ చేద్దాం. ఓడితే క్షమాపణ చెప్తా. నువ్వు ఓడిపోతే ఫాంహౌస్‌లో పడుకో. బిల్లా, రంగాలను ఊరిపై వదిలిండు. ఒకడు పొద్దున ప్రెస్‌మీట్ పెడితే, మరొకడు సాయంత్రం ట్విట్టర్లో పెడతడు. మీ మధ్యలోనే పొంతన లేదు. మాకు సుద్దులు చెబుతారా?’అని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నీటికి శాశ్వత పరిష్కారం చూపుతాం.. ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కడతాం. బీజేపీ నేతలు తమాషా చేయడం కాదు. మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా దాగుడుమూతలు ఆడి పారిపోతుండు. మర్యాదగా పట్టుకురండి. ఈ ప్రాజెక్టుతో ఎల్లంపల్లికి 100 టీఎంసీల నీళ్లు తీసుకొస్తాం. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణకాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతాం. పగోడైనా, పక్క దేశమైనా చర్చలు లేకుండా పరిష్కారం కావు. ఆలీ, పాలీ పంచాయితీకైనా పెద్ద మనిషి కావాలి. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. డిసెంబర్‌లోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది. మరో రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపడతాం. ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం’అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్‌కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘కిషన్‌రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
బీఆర్ఎస్ భారీ వ్యూహం.. కేసీఆర్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న రాజకీయ పోరుకు మరింత పదును పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనలో అవినీతి, అధికార పార్టీ నేతల అక్రమాలపై ఆరోపణలను ప్రధాన అ్రస్తాలుగా మలుచుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన కార్మికుల మద్దతు కూడగట్టేలా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే కసరత్తు ప్రారంభించింది.అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ వైపు మళ్లకుండా రాజకీయంగా అడ్డుకట్ట వేసే వ్యూహం కూడా అవసరమని భావిస్తోంది. యువతను ఆకర్షించే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో చురుకుదనం పెంచడం, భవిష్యత్‌లో కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రల వంటి భారీ ప్రజా కార్యక్రమాలతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.హామీల అమలుపై నిరంతర ఒత్తిడి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్‌లో రైతు సదస్సు నిర్వహించిన బీఆర్ఎస్ త్వరలో తెలంగాణ భవన్లో యువజన, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుభరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతర రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది.అక్రమాలు, అవినీతి ఆరోపణలను ప్రజల ముందుంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రజల్లో నిరంతరం చర్చ జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావులతోపాటు పార్టీ ముఖ్య నేతలు రేవంత్ ప్రభుత్వంపై రోజుకో ఆరోపణ, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికే అసెంబ్లీతోపాటు ప్రజా వేదికలు, సామాజిక మాధ్యమాలు, జిల్లా స్థాయిలో కార్యక్రమాల ద్వారా ఈ అంశాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతమే ప్రధాన లక్ష్యం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, క్రియాశీల కార్యకర్తల గుర్తింపు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం వంటి అంశాలపై కార్యాచరణ ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచే పార్టీ వ్యవస్థను పటిష్టం చేసే పనులు ప్రారంభమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌పై ఫోకస్.. యువతను చేరుకునే ప్రయత్నం గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కూడా బీఆర్ఎస్ అత్యంత కీలకంగా చూస్తోంది. ‘సర్’పై అవగాహన కార్యక్రమాల పేరిట నగర ఓటర్లతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని పార్టీ యోచిస్తోంది. సర్‌పై కేటీఆర్ గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిజిటల్ యుగంలో కీలకంగా మారుతున్న ‘జెన్ జీ’యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక ముఖాముఖి సమావేశాలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
ఆశల పల్లకీలో రేవంత్...
తెలంగాణకు 2034 వరకూ తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఆయన ధీమాకు నిదర్శనం కావచ్చు కానీ... వాస్తవమవడం మాత్రం చాలా పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో. బలహీనంగా ఉన్న అధిష్టానం తన జోలికి రాదని రేవంత్ అనుకోవచ్చునేమో కానీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. రేవంత్ ప్రకటనలో ఇంకో విశేషం ఉంది. 2034 తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా చెప్పుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ తరచూ తాను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారు. అందరూ తేలికగా తీసుకున్నా ఏపీ విభజనతో ఆయన దశ తిరిగిందని అనుకోవాలి.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోవడం అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కలిసివచ్చింది. కాంగ్రెస్‌లో కీలకమైన పదవులు, పీసీసీ అధ్యక్ష స్థానం సులువుగానే దక్కాయి. ఇదంతా ఆయన తన సొంత స్టైల్లో సాధించారు. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ వెళ్లిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదలివేయక తప్పని స్థితి ఏర్పడడం, రేవంత్‌ను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉండటం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి. దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు, తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులలుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉండగా రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్తోదగ్గరి సంబంధాలు పెట్టుకగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు. ఇవన్నీ రేవంత్ సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయి. అంతవరకు బాగానే ఉన్నా పదేళ్లపాటు తానే సీఎం అని చెప్పడమే కొంత ఆశ్చర్యం. ఇలా చెప్పడం.. కేవలం ప్రజలలో ఒక అభిప్రాయం కలిగించడానికా?లేక కాంగ్రెస్‌లో తనకు పోటీ లేదని చెప్పడానికా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?అంటే ఏమైనా కావచ్చు.రేవంత్ సర్కార్ నిజంగానే ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే ఆయన భావించినట్లు పదేళ్లనే ఏముంది.అంతకుమించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు.అలాగే ఆయనే సీఎంగా కొనసాగవచ్చు. అలాకాకుండా పదేళ్ల తర్వాత జాతీయ రాజకీయాలలోకి వెళ్లి ఏమి చేస్తారో అంటే అప్పుడే చెప్పలేం. అంతవరకు ఈయన కాంగ్రెస్‌లోనే ఉంటారా?అన్నది కొందరి అనుమానం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో రేవంత్ ను ఉద్దేశించి తనతో కలిసి రావాలని నర్మగర్భంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.అది అధికారికంగా సహకారం కోరడం తప్పమరొకటి కాదని రేవంత్ వివరణ ఇచ్చినా ఎవరికి ఉండే డౌట్లు వారికి ఉంటాయి కదా! గతంలో రేవంత్ తన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏబీవీపీ స్కూల్లో చేరి, తర్వాత టీడీపీ కాలేజీలో కొనసాగి ,ప్రస్తుతం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఆయన ఆ మాట చమత్కారంగా చెప్పినా అది ఆలోచించదగిందే. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం టీఆర్ఎస్లో కూడా పనిచేశారు.ఆ తర్వాత స్వతంత్రంగా జెడ్పీటీసీ పోటీచేసి గెలిచారు.తదుపరి శాసనసమండలి ఎన్నికలలో పోటీచేసి అన్ని పార్టీలవారి సహకారం తీసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి మద్దతు పొందడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. రేవంత్ తెలివితేటలను గమనించారో,మరేమో తెలియదు కాని, ఆ తర్వాత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దాంతో టీడీపీలో ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఓటు కు నోటు కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు వెల్లడించకుండా ఆయన మనసు చూరగొన్నారు. ఎలాగైతేనేం రెండున్నరేళ్ల సీఎం పదవికాలం తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్న మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణతోపాటు, కర్ణాటక, హిమచల్ ప్రదేశ్ లలోనే అధికారంలో ఉండడం, కేరళలో పార్టీకి అవసరమైన వనరులు అందించడానికి తన వంతు సాయం చేయడం వంటి కారణాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పాలి. పార్టీలో పట్టు పెంచుకున్నంత తేలికగా ప్రజలలో పట్టు నిలబెట్టుకోవడం అంత తేలికకాదు.స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది.ఆయా అంశాలలో రేవంత్ విధానాలపై ఆ పార్టీ గట్టి పోరాటమే చేస్తోంది.హైడ్రా వ్యవస్థ వల్ల కొంత మంచి పేరు వచ్చినా, నష్టం కూడా గణనీయంగానే కనిపిస్తుంది. అన్నిటికి మించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను అమలు చేయడానికి సతమతమవుతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని,వృద్దాప్య పెన్షన్ నాలుగువేలు చేస్తామని, దళితులకు పది లక్షల ఆర్థిక సాయం తదితర అనేక వాగ్దానాలు ఆకాశమే హద్దుగా ఎన్నికల సమయంలో చేశారు.వాటిని అమలు చేయడం అంత తేలిక కాదని అనుభవం చెబుతోంది. పాలనాపరంగా రేవంత్ ఇంకా బలమైన ముద్ర వేసుకోలేకపోయారు. మరో రెండున్నర ఏళ్ల వ్యవధి ఉంది కనుక ఎంతవరకు ప్రజాదరణ పెంచుకుంటారన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వానికి ఆశించిన రీతిలో మార్కులు ఇచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్క్ వస్తే అది పదివేలు అన్నట్లుగా ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరధ కేసులో కాని, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సందర్భంలో కాని రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కొంత విమర్శలకు గురైందని చెప్పక తప్పదు. దీనివల్లే రేవంత్‌కు బీజేపీ, టీడీపీ వంటి పార్టీలతో అంతర్గత సంబంధాలు ఉన్నాయేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. భగీరధ అరెస్టు అయినప్పటికీ, అది జరిగిన తీరుపై విమర్శలు ఉన్నాయి.సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగినవారికి మరో న్యాయమా అన్న చర్చ జరిగింది. 2028లో జరిగే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆయన చెబుతున్నప్పటికీ, ప్రస్తుత వాతావరణం అంత తేలికగా లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం.అంతేకాక ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అర్థంఅవుతుంది.బెంగాల్ వంటి రాష్ట్రంలో వారు అనుసరించిన పద్దతులు గమనించిన తర్వాత తెలంగాణలో ఏ పరిణామమైనా జరగవచ్చన్న భావన కలుగుతుంది. ఇక జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం అన్న అంశం ఇప్పటికిప్పుడు పెద్ద చర్చీనీయాంశం కాదు.ఆయనకు ఏదో పెద్ద ఊహే ఉండవచ్చు.అది తప్పు కాదు.గతంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో పనిచేశారు.వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ సారధిగా ఉన్న టైమ్ లో ఏపీలో అత్యధిక కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు వచ్చాయి. అయినా ఆయనను అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండేవారు.ఆయన ఇంకా పూర్తిగా బలపడలేదు.ఆ టైమ్ లో నేదురుమల్లి తాను చక్రం తిప్పగలనని అనుకునేవారు. ఏఐసీసీ సదస్సు కూడా తిరుపతిలో నిర్వహించారు. అప్పట్లో తనకు ఉన్న చొరవతో పీవీని ఉద్దేశించి పంతులుకు తాను ఎంతగా సహకరిస్తున్నది అన్న అంశంపై పార్టీ వారి వద్ద వ్యాఖ్యలు చేశారు.ఆ విషయం పీవీకి తెలియడంతో, తనకు సన్నిహితమైన వ్యక్తి అయినా, అవకాశం రాగానే నేదురుమల్లిని సీఎం పదవి నుంచి దించేశారు.మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలక భూమిక పోషించారు. సీఎంగా రెండుసార్లు ఎంపికయ్యారు.అప్పట్లో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడు అన్న భావన ఉండేది.కాని ఆ రెండుసార్లు పూర్తికాలం సీఎం పదవిలో ఉండలేకపోయారు.అప్పటి రాజకీయాలకు ప్రస్తుత ఉన్న రాజకీయాలకు తేడా ఉన్నప్పటికీ జాతీయ పార్టీలలో ఏమైనా జరగవచ్చని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి.ఏది ఏమైనా ముందుగా ప్రజాభిమానం చూరగొనే విధంగా పనిచేసి ఆ తర్వాత ఎంతకాలం ఏ పదవిలో ఉన్నా ఎవరికి అభ్యంతరం ఉండదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సభ్యత్వ నమోదుకు ఇన్చార్జిలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు కోసం బీఆర్ఎస్ చేస్తున్న సన్నాహాల్లో భాగంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులకు జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు సమన్వయ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా నియమితులైన ఇన్చార్జిలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. ఈ మేరకు 119 నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్ గురువారం విడుదల చేశారు. సభ్యత్వ నమోదు ఇన్చార్జిలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణుడికి తెలంగాణ భవన్లో డిజిటల్ పద్ధతిలో నమోదుపై శిక్షణ ఇస్తారు. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న డిజిటల్ యాప్‌కు తుది మెరుగులు పూర్తయిన తర్వాత త్వరలో ఇది అందుబాటులోకి రానున్నది.ఇదిలా ఉంటే తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కోసం నియోజకవర్గాల్లోని బూత్‌ల సంఖ్య ఆధారంగా ఒక్కో పోలింగ్ బూత్‌కు ఇద్దరు చొప్పున స్మార్ట్ ఫోన్ కలిగిన కార్యకర్తలను ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిజిటల్ సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు. తొలి రోజున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొని తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత కమిటీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నారు. -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్‌ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్‌ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లకు బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
6 గంటలు చర్చించిన కేసీఆర్.. కీలక నిర్ణయాలు
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని అనుకుంటుండడంతో రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్ లలో, బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని, ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించిన ఇన్చార్జిల వివరాలుఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శిజగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిజనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శిమెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు- గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శినిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శివికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేమహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రిగద్వాల్,నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాలు— మెట్టు శ్రీనివాస్, కార్యదర్శిమేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్హైదరాబాద్ జిల్లా— తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యేనల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి -
ఈ నెల 12 బీఆర్ఎస్ సమావేశం.. హాజరుకానున్న కేసీఆర్
సాక్షి హైదరాబాద్: ఈ నెల 12వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. . ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, బలోపేతంపై అంతర్గతంగా చర్చించనున్నట్లు పేర్కొంది. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు సైతం జరిగే అవకాశం ఉండడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగం సూపర్ హిట్ అయ్యింది. దీంతో బీర్ఎస్ శ్రేణులు జోరుమీదున్నాయి. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ మరోసారి నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. -
తండ్రిని తిట్టి.. అమ్మ ఎలా అవుతావు?: కవితపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కవిత సింగిల్‌గా పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్‌ను కవిత తిట్టడం బాధగా ఉంది. ఒక ఉద్యమకారుడి బిడ్డ అనే తనకు గుర్తు ఉంది. తండ్రి అంటే కూతురికి ప్రేమ ఉండాలి. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది. తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడంతో తను మర్యాద పోగొట్టుకుంది. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు.మద్యం కుంభకోణంలో తనకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు.. కేసు పూర్తి కాలేదు. టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదం. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం పాన్ షాపు పెట్టినంత సులువు అయిపోయింది. పార్టీ కాదు తను సొంతంగా పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ అధిష్టానం నాకు హామీ ఇచ్చింది.. నాకు పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తా’ అని తెలిపారు. -
అన్ని కమిటీలు రద్దు త్వరలో BRS మెంబర్ మెంబర్షిప్ డ్రైవ్
-
ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి?
సాక్షి, హైదరాబాద్: ‘ఇది ఒక చిల్లర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలేంటి, ఆ కూతలేంటి? రాష్ట్రంలో ఏం జరుగుతోందో నాకు అర్ధం కావడం లేదు. బొందలో పడినట్లు అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి కనీసం ధాన్యం కొనుగోలు కూడా చేతకావడం లేదు. ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ ఉపసంఘం ఏ ర్పాటు అంటూ ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. దళారుల ప్రమేయం లేకుండా వెంటనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతుబంధు పథకాన్ని నిర్వీర్యం చేసి ఒక్కో దఫాలో ఒక్కో ఎకరాకు డబ్బులు ఇస్తూ రైతులను ప్రభుత్వం వంచిస్తోంది..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం కోసం నడుం బిగించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం ఉధృతం చేయాలన్నారు. భారత్ రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహా సుమారు 400 మంది పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి నుంచి వివిధ అంశాలపై కేసీఆర్ సలహాలు, సూచనలు స్వీకరించారు. సుమారు రెండు గంటల పాటు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి ‘బీఆర్ఎస్కే తెలంగాణ పట్ల తడి, ఆర్తి ఉంది. తేజస్వీ సూర్య అనే వెధవ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా నిశ్చలంగా మారారు. వారి ని్రష్కియాపరత్వం స్పష్టంగా కనిపించింది. అదే లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగంగా మారేది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు కనిపించింది. బీజేపీ మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి దేశ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. మహిళలకు చట్ట సభల్లో మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో తీర్మానం చేసి పంపింది. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను అనేక రకాలుగా అవమానాలు, క్షోభను అనుభవించా. హైదరాబాద్ లేని తెలంగాణకు అంగీకరిస్తే వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ అధినేత సోనియా చెప్పినా నేను అంగీకరించలేదు. జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా..’ అని కేసీఆర్ చెప్పారు. ‘సర్’లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై పశ్చిమ బెంగాల్, బిహార్ తరహాలో లక్షలాది మంది ఓట్లు తొలగించిన నేపథ్యంలో బూత్ స్థాయిలో పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సుమారు 15 వేల దొంగ ఓట్లు నమోదు కావడం వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలైనట్లు గుర్తించాం. ‘సర్’లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం మినహా గ్రామ స్థాయి మొదలుకుని అన్నిరకాల కమిటీలు రద్దు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు నియోజకవర్గానికి 200 మంది చొప్పున శిక్షణ ఇచ్చి తెలంగాణకు రక్షణ కవచంలా పని చేసేలా తీర్చిదిద్దుతాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీ టికెట్లు ఇస్తాం. జీవన్‌రెడ్డి సేవలు వినియోగించుకుంటాం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవల పార్టీలో చేరిన టి.జీవన్‌రెడ్డిని కేవలం జగిత్యాలకు పరిమితం చేయకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన సేవలు వినియోగించుకుంటాం. రాజ్యసభ ఎంపీగా ఇటీవల రిటైరైన కేఆర్ సురేశ్‌రెడ్డి బాగా పని చేశారు..’ అంటూ కేసీఆర్ ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అంతకుముందు పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి సోమవారం మధ్యాహ్నం నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఇటీవల పారీ్టలో చేరిన జీవన్‌రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. -
బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... అంతా ఆ తానులోని ముక్కలే... ‘బీఆర్ఎస్కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే. వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా... కేసీఆర్ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్‌చానెల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్‌హౌజ్‌లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్‌లో లేరు. కేసీఆర్‌కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి. కోర్టు ఏం చెప్పింది..? కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై కేసీఆర్, హరీశ్‌రావులు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్ రిలీఫ్ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్ సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్ చేయాలా? ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. ఎలిమినేషన్ జరుగుతోంది రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి. ఆ నాలుగు వేటికవే..! దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్‌సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్‌సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్‌రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్ఎస్ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్‌సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘కేసీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి’
హనుమకొండ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు.తెలంగాణ విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను తాను పార్లమెంట్‌లోనే ఖండించినట్లు కడియం కావ్య గుర్తుచేశారు. ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా అవి అనుచిత వ్యాఖ్యలని నిలదీశానని తెలిపారు. అలాగే పార్లమెంట్ నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పారు.ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ముక్తకంఠంతో ఖండించడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి చేరలేదని, లేదా ఆయన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోలేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కేసీఆర్‌కు కావ్య సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు.తెలంగాణ అభివృద్ధికి సంబంధించి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఉంటే మాజీ సీఎం కేసీఆర్ ఇవ్వాలని కోరుతూ, ప్రజా సమస్యలపై చర్చలు జరపడం ద్వారా రాష్ట్రానికి మేలు చేకూరుతుందని కడియం కావ్య పేర్కొన్నారు. -
కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను: కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘15రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కాదు.. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది,. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు. -
తేజస్వీ సూర్య ఒక వెదవ
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్‌కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్‌ది చిల్లర ప్రభుత్వం’అని ధ్వజమెత్తారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు’అని అన్నారు. -
తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్.. బీఆర్ఆర్ పార్టీ సెక్రటరీ జనరల్ జీవన్‌రెడ్డితో కలిసి లంచ్ చేశారు. అనంతరం జీవన్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకన్నారు కేసీఆర్. తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. -
ఎర్రవెల్లి - హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్
-
BRS ఆవిర్భావ దినోత్సవం.. కవిత కొత్తపార్టీ పై కేసీఆర్..!?
-
BRS Party: కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆవిర్భావ వేడుకల దృష్ట్యా ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11గం.కు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఎగరేయనున్నారు. మధ్యాహ్నాం అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా నిశబ్దంగా ఉండిపోయిన ఆయన.. మొన్నటి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉరిమారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే కొత్త సవాళ్లపై ఆయన స్పందిస్తారా?.. పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో? అనే కుతూహలం ఇప్పుడు నెలకొంది.తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట కొత్త పార్టీ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే తాను టీఆర్ఎస్ పెట్టి యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారామె. అదే సమయంలో ఆమె నేరుగా ‘తెలంగాణ తొలి సీఎం విఫలం’, ‘సారు మారిపోయారు’.. ‘ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్’ అంటూ నేరుగా తండ్రిపైనే విమర్శలు గుప్పించారు. కవిత పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా సెటైర్లు వేసింది. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఆమె ఆరోపణలపై స్పందించింది లేదు. ఈ తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు సైతం ‘‘సారు ఏం మాట్లాడతారో..? కవిత విమర్శలకు స్పందిస్తారా? లేదంటే కేవలం కాంగ్రెస్ సర్కార్‌పైనే ధ్వజమెత్తుతారా?? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
రాజకీయ కవితావేశం!
అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్ జరిగిన వంగ (బెంగాల్) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్‌లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్‌లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్‌గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్‌పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్‌ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్‌లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్‌కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్‌తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్‌తో నడిపించే ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి కేసీఆర్ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్ఎస్ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.. బీఆర్ఎస్ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్ కాదు.. మారిన కేసీఆర్. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. మన కేసీఆర్ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.ఇదీ చదవండి: అందుకే మన పార్టీ పేరు టీఆర్ఎస్సీఎం రేవంత్‌పై.. ఇప్పుడు ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు గుప్పించారు. బీజేపీపై.. బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. మెడ మీద తలలేని ఓ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాక్‌తో పోల్చాడు. బీజేపీ బానిస ఎంపీలు ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చూడండి అంటూ సవాల్ విసిరారామె. -
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులపై 2011లో మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 2011, మార్చి 10న ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ జరిగింది.కాగా, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సహా సుమారు 50 మంది తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమ వద్ద కెమెరా, మైకులు లాక్కుని దాడి చేశారని, వీడియో కెమెరాను ట్యాంక్ బండ్లోకి విసిరేశారని జర్నలిస్టులు రాజు, ప్రసాద్, సూర్యప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ట్రయల్‌కోర్టు వీరిపై విచారణ చేపట్టి.. ఇతర నిందితులంతా నిర్దోషులని 2013లో తీర్పునిచి్చంది. అయితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను మాత్రం ’పరారీలో ఉన్న నిందితులుగా’ పేర్కొంది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం విచారణ చేపట్టి.. కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్ గతేడాది జూన్ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్ ఘోష్ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీ¯న్ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. కమిషన్ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం.. కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం కాదు. నిర్లక్ష్యమే కారణమన్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు. కమిషన్ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు ‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్‌కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు. సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. సెక్షన్ 8బీ కమిషన్‌పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్ పార్టెమ్’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది. సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
కుట్రలు కూలిపోయాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, భూమిపై గోదావరి నది పారినంత కాలం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అభాండాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, రాహుల్‌గాందీని మేడిగడ్డకు తెచ్చి సీఎం రేవంత్ గోబెల్స్‌ను మించి చిల్లర ప్రచారం చేసినా రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌పై చేసిన కుట్రలు, కుతంత్రాలు కోర్టు తీర్పుతో కూలిపోయాయన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యాన్ని కనిపించకుండా చేయాలనే కుట్రలు వీగిపోయాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడిన వారి గూబ గుయ్యిమంది. నిజం బయట పడింది. ఘోష్ కమిషన్ ట్రాష్ (చెత్త) కమిషన్ అని తేలిపోయింది. మేము గతం నుంచీ చెప్తున్నట్లుగానే ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది. కోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకుని చిల్లర ప్రచారం ఆపి మేడిగడ్డ బరాజ్‌కి మరమ్మతులు చేయాలి. నటించడం మానుకుని నీటిని ఎత్తిపోయాలి. మేడిగడ్డ పేల్చివేతపై విచారణ జరపాలి మేడిగడ్డ బరాజ్ పేల్చివేతపై నెలకొన్న అనుమానాల విషయంలో బీజేపీ స్వతంత్ర విచారణ జరపాలి. నిక్షేపంగా ఉన్న బరాజ్ పిల్లర్లు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలా కూలిపోయాయో తేలాల్సి ఉంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఆగమేఘాల మీద స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ).. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం ఘటన, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం, చెక్‌డ్యామ్‌ల పేల్చివేతపై స్పందించకుండా ఎక్కడ చచ్చింది? కేసీఆర్ మీద కక్షతో రెండున్నరేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతు చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు. ఇప్పటికైనా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో కారుకూతలు, బూతులకు స్వస్తి చెప్పి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి. రేవంత్ ఇకనైనా గాసిప్స్ మీద కాకుండా గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ హితవు పలికారు. ఘోష్ కమిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు వృథా చేసిందని, సుప్రీంకోర్టులో ఏదో చేస్తామని ప్రభుత్వం అనుకోవడం వృథా ప్రయాస అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ ‘పగలు కాంగ్రెస్‌తో ఉంటూ రాత్రి బీజేపీతో అంటకాగుతున్న రేవంత్‌రెడ్డి ఒక హైబ్రిడ్ సీఎం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. చీకటి, దొంగ ఒకటి అయినట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఒక్కసారి కూడా రేవంత్‌ను విమర్శించడం లేదు. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రం నుంచి మూటలు వెళ్తుంటే, సంజయ్ స్పందించకుండా కరీంనగర్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి అక్రమాలకు రక్షణ గోడలా నిలుస్తున్నాడు. అమృత్ స్కీమ్, సింగరేణి కుంభకోణాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు విచారణ జరపడం లేదు? రేవంత్‌ను ఎవరు కాపాడుతున్నారు? కెమెరాలకు చిక్కిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌లా రేవంత్ కూడా ఓటుకు నోటు కేసులో కెమెరాలకు చిక్కాడు. అయినా ఆయనను ఎవరు కాపాడుతున్నారో బీజేపీ నేతలు చెప్పాలి. రేవంత్ భవిష్యత్తులో కాంగ్రెస్‌ను బొందపెట్టి బీజేపీలో చేరడం ఖాయం..’అని కేటీఆర్ అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
kaleshwaram: లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న ప్రభుత్వం
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని లీగల్ టీమ్ చెబుతోంది. మొదటిది సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. కోర్టు తీర్పుపై రేపు కేబినెట్లో చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌కు అడ్వకెట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. రేపటి సమావేశానికి అడ్వకేట్ జనరల్ హాజరుకానున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. కాగా, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొంది. -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట
-
చర్యలు వద్దు.. కేసీఆర్, హరీష్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో కమిషన్ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాగా, ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.కరీంనగర్‌లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అమృత్- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు..ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకొనితింటున్నారు. కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుంది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది.తేజస్వీ సూర్య కామెంట్స్‌పై.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే.. అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు చేశారు. -
BRSలో చేరిన తొలి స్పీచ్ ఆ ఘనత కేసీఆర్ దే..
-
సీఎం సీఎం అంటూ దద్దరిల్లిన జగిత్యాల
-
లాగులు పగిలే దాకా... బాబుకు వార్నింగ్ ఇచ్చా దెబ్బకు..
-
హెలికాప్టర్ దిగగానే జీవన్ రెడ్డిని కేసీఆర్ చూడగానే..
-
యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)
-
యజ్ఞం ప్రారంభిస్తున్నా
జగిత్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ చావాలా..? నువ్వు వేయి జన్మలెత్తినా చావను.. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా..? ఈ వెధవలు చావాలని అనుకుంటే చస్తానా? మీ ఆశీర్వాదాలు ఉంటే అన్ని వర్గాల ప్రజలు గర్వంగా, సంతోషంగా ఉండేలా, అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా. చివరి శ్వాస దాకా 50 ఏండ్ల వారిలా నేనూ, జీవన్‌రెడ్డి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతాం. రాష్ట్రం ఎందుకు బాగుపడదో చూస్తాం‘ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన కేసీఆర్ గంట పాటు ప్రసంగించారు. ‘తెచ్చిన తెలంగాణలో మంచి, చెడు చూసే బాధ్యత నాకు అప్పగిస్తే కొత్త కుండలో ఈగ చొచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక స్థితిపై అవగాహన లేకున్నా నిపుణుల సహాయంతో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేశాం. కానీ కేసీఆర్‌కు పాలన చేతకావడం లేదు... మాకు పాలనలో అనుభవం ఉంది. ఆరు చందమామలు, ఏడు సూర్యులను పెడతామని అధికారంలోకి వచ్చి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. అందువల్ల ప్రజలు సంఘటితమై తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మొదలు పెట్టాలి. గ్రహచారం బాగాలేదని కూర్చుంటే దెబ్బతింటాం. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ శక్తులను పునరేకీకరణ చేస్తూ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభిస్తున్నా.. ముందుకెళ్లి విజయం సాధిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మూడో కిస్తీ కోసం మరో సభ పెట్టాలా... ‘ఉత్తి మాటలు.. గప్పాలు కొట్టుడు కాదు.. మిషన్ భగీరథ ఐదేండ్లలో పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని నిండు అసెంబ్లీలో చెప్పిన సీఎంను ఎవరైనా చూశారా? మరిప్పడు ఏం రోగం వచ్చింది. పని చేయని వారిని లాగులు పగిలేదాకా సంపాలి. పొదరిల్లు లాంటి తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని ఏడు వేల మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు పెంచి క్షణం కూడా కరెంటు పోకుండా చేశాం. మరిప్పుడు ఏం బీమారి వచ్చింది. రైతుబంధు కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి. జగిత్యాలలో సభ పెడితే రైతుబంధు రెండో కిస్తీ ఇస్తున్నారు. మూడో కిస్తీ కోసం కేసీఆర్ మరో సభ పెట్టాలా. రైతుబంధు వేసేందుకు కాటారంలో సభ పెట్టారు. రెండు నెలలకోమారు ఎకరానికి ఆరు వేలు వేసి సిపాయిల్లా డప్పు కొట్టుకుంటున్నరు’ అని కేసీఆర్ అన్నారు. ..అందుకే బయటకు రాలేదు ‘బీఆర్ఎస్ పాలనలో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేస్తారో లేదో కూడా చెప్పడం లేదు. ఉద్యోగులకు 72శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇస్తే ఈ ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల బకాయిలతోపాటు కనీసం ఏడు శాతం జీతం కూడా పెంచలేదు. ఉచిత బస్సుతో ఆటో కార్మీకులు ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ తిరగేస్తే సింగరేణి, పౌరసరఫరాలు సహా అనేక కుంభకోణాలు, భూ కబ్జాలు జరుగుతున్న తీరు చూస్తే బాధ కలుగుతోంది. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, అరెస్టుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకున్నా నేను ఒకటి రెండుమార్లు తప్ప బయటకు రాలేదు. ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చారు. మంచి జరగాలని కోరుకున్నా.. కానీ ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం, గొప్ప స్కీమ్ లేదు. అందుకే జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు ‘‘కాంగ్రెస్ పోవాలే.. బీఆర్ఎస్ రావాలే అంటున్నడు’’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి సంతకంతోనే హైడ్రా రద్దు ‘మేము మూడున్నర లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే హైడ్రాతో పిల్లలు పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు చేస్తున్నరు. హైడ్రాను జిల్లాల్లో కూడా తెస్తామని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం’ అని కేసీఆర్ మండిపడ్డారు. జీవన్‌రెడ్డి.. నేను దగ్గరి మిత్రులం‘జీవన్‌రెడ్డి గురించి ఎక్కువ చెప్తే మాది మేము డబ్బా కొట్టుకున్నట్లు అయితది. 45 ఏండ్ల నుంచి దగ్గరి మిత్రులం అయినా భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశాం. కానీ మంచి చెడ్డలు, కష్టసుఖాలు, అభిప్రాయాలు కలిసి పంచుకునే వాళ్లం. జగిత్యాల ప్రాంతం గురించి ప్రాణం పెట్టి పనిచేసిన నాయకుడు జీవన్‌రెడ్డి. నేను సీఎం అయిన తరువాత కరీంనగర్లో సభ పెడితే అక్కడికి వచ్చి బోర్నపల్లి బ్రిడ్జి అవసరం అని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడిగారు. వెంటనే రూ. 80 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించిన. ఇటీవల కొన్ని సర్వేలు జరిగితే బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరిక ఆటంబాంబుగా పేలడంతోపాటు జగిత్యాలతోపాటు పొరుగు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందని తేలింది. నేనూ, జీవన్‌రెడ్డి అన్నదమ్ముల్లా, పారీ్టకి పిల్లర్లుగా పనిచేస్తాం. ఆయన జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లాలకే పరిమితం కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలన్నీ చూసుకోవాలి. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచే అపాయింట్ చేస్తున్నా. ఆరు నూరైనా.. వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇది నామాట. జగిత్యాల యుద్ధం కార్యకర్తల వంతు. తెలంగాణ యుద్ధం మా వంతు’ అని కేసీఆర్ ప్రకటించారు. అలిశెట్టి కవితతో ప్రారంభం జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ కవితతో కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. ’చీకట్లో దడుసుకుంటే.. ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై బయపెడుతది.. గుండెంటూ ఉంటే ... అదే నీకు సైన్యం అయి నిలుస్తది’ అన్నారు. ఈ సభకు వచ్చిన మీరు, రోడ్ల మీద అశేషంగా నిలిచిన జీవన్‌రెడ్డి అభిమానుల ఆశీర్వాదంతో నాకు గుండె ధైర్యం వచ్చింది. జీవన్‌రెడ్డి అన్నకు, ఆయన వెంట వచ్చిన వారికి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా స్వాగతం’ అంటూ కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ⇒ ’బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం. మూసీ ప్రాజెక్టుతో వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం సహా ప్రాజెక్టులను పండబెట్టి అబద్దాలు ఆడుతున్నారు’ ⇒ ‘కాంగ్రెస్ మాటలు కోటలు దాటాయి. కాకికి పెడదామంటే కుష్కడు లేవు... పిట్టకు పెడదామంటే పిడికెడు లేవు అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దోపిడీతో ఎవరూ సంతృప్తిగా లేరు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు’ ⇒ ‘దరిద్రులకు రాజ్యం అప్పజెప్తే రైతుల పొలాలు ఎండుతున్నాయి. తెలంగాణ రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య. రైతు బంధుకు రాం..రాం.. దళితబంధుకు జై భీమ్ అంటరని, మోసపోతే గోస పడతామని ఎన్నికకు ముందు చెప్తే నా మాటను కొందరు వినలేదు’ -
కేసీఆర్ కాస్కో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్లైన్లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి ‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది. దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం.. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు. జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది.. ఫామ్‌హౌస్‌లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్‌లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్‌లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు తావు లేదు.. ‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్‌కుమార్‌గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్‌ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్‌ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం అనుకుంటున్నావో’ : కేసీఆర్
సాక్షి,జగిత్యాల: మీరు చావాలనుకుంటే నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తానని’ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటుంటున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగదు మీరు చావాలనుకుంటే నేను చావను. మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. వడ్డించిన విస్తరిలా మీకు తెలంగాణను అప్పగించాం. అన్నీ రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపి మీకిచ్చాం. మా హయాంలో తెలంగాణ ఎలా ఉంది. మీ హయాంలో తెలంగాణ ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఇప్పుడు అవినీతి, స్కాం, భూకబ్జాలు తప్ప అభివృద్ధి లేదు. సివిల్ సప్లై, సింగరేణిలో దోచుకుంటున్నారు. ఏ రైతును పలకరించినా తప్పు జరిగిందని బాధపడుతున్నారు. రాష్ట్రమంతా ఖాళీ, అంతా దోచుకున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడడ్రాను తొలగిస్తాం. మొదటి సంతకంతోనే హైడ్రాను తొలగిస్తాం. పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంటి? ఇది మూసీ సుందరీకరణ కోసం కాదు,రియల్ ఎస్టేట్ కోసం. ప్రజల కోసం ఒక్క స్కీం తీసుకురాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసేస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
మొదటి సంతకంతోనే హైడ్రాను అవతల పారేస్తా: కేసీఆర్
జగిత్యాల: మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుండె ధైర్యమున్న నేత అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపారేస్తామన్నారు. గరీబోళ్లను ఏడిపిస్తూ మూసీ వెంట పడ్డారని తెలిపారు. మూసీ సుందరీకరణ ఓ రియల్ ఎస్టేట్ దందా అని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టారని వ్యాఖ్యానించారు.40 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీల్లో పనిచేశామని చెప్పారు. జగిత్యాల ప్రాంతం కోసం జీవన్‌రెడ్డి ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు. ఎమ్మెల్యేగా మంత్రిగా చిత్తశద్ధితో పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. తన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్‌రెడ్డి ఏదైనా చేస్తారని తెలిపారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా..‘ఇవాళ తెలంగాణ అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ అనొద్దని నాడు దాడి చేసిన్రు. చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా. తెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించా. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను.రోషయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణ వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా. చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు. వచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం. బిహార్ లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం. మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం. మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప..?’ అని వ్యాఖ్యానించారు. 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది..చీకట్లో దడుసుకుంటే చెట్టే నీ చుట్టూరా భయపెడతదంటూ జగిత్యాల దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్‌ను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ‘జీవన్ రెడ్డి జగిత్యాలకు మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. నేను ముఖ్యమంత్రి అయ్యాక కరీంనగర్ లో నన్ను బోర్నపల్లి గురించి అడిగిండు. తన నియోజకవర్గం పట్ల జీవన్ రెడ్డి కన్సర్న్ ఏంటో అందరికీ తెలిసిందే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే మంచి ప్రభావం ఉంటుందని సర్వేల్లో కూడా చాలా మంది చెప్పారు. నేను, జీవన్ రెడ్డి ఇకపై ఒక కుటుంబంలా, అన్నదమ్ముల్లా పని చేయనున్నాం. నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. జీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారు. ఈ కాంగ్రెసోళ్లు రాగానే కరెంట్ కాకెత్తుకుపోయింది. అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి. రైతులు చనిపోతున్రు. గుండెల్లో తడి లేని దుర్మార్గులు గెలిస్తే రైతుబంధుకు రాం రాం పాడిన్రు. లోన్స్ మాఫీ అన్నాడు ఐనయా? అడ్డమైన హామీలతో ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. 1.7 శాతంతో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. వచ్చినోళ్లు మంచిగా పని చేయాలిగా..? చిల్లర మాటలు తప్ప ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక పథకం చేపట్టిందా? బంగారుమయమైన తెలంగాణను రెండున్నర ఏళ్లల్లో ఆగం చేసిన్రు. దుకాణాల్లో లేని బస్తాలు యాప్ లో వస్తయా? కాంగ్రెస్ వస్తే చెప్పులతో క్యూలు తప్పుతలేవు. ఇది అసమర్థమైన ప్రభుత్వం.తెలంగాణా ఆగమాగమైపోయింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి అన్నివర్గాల ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని తెలిపారు. -
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’
సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం జీవన్ రెడ్డి గుండె ధైర్యమున్నోడు40ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డి,నేను స్నేహితులం భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాంతెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేశారుజగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారుఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారుతన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్ రెడ్డి ఏదైనా చేస్తారుజీవన్ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శంపదవులు జీవన్‌రెడ్డికి కొత్తకాదుబీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి నియామకంసభలో ప్రకటించిన కేసీఆర్ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డికి చెప్పామేం అధికారంలోకి రాగానే జీవన్‌రెడ్డికి మంచి పదవి కల్పిస్తాకరీంనగర్ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డి పని చేయాలితెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేదిఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్ ఛార్జీలు పెంచారుఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారుపక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడిందితెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని ముందుకు సాగాంఐదేళ్లలో మిషన్ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాంపదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసుమా హాయంలో మిషన్ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదునూటి నూరుశాతం మళ్లీ బీఆర్ఎస్సే వస్తుందిజీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారుజీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందివినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రుచంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశాతెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించాబషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించానురోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడుఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరాచిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారువచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయంబిహార్లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్‌ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాంమిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాంమిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్. 40 మంది అనుచరులతో పాటు బీఆర్ఎస్లో చేరారు జీవన్‌రెడ్డి. ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి జీవన్‌రెడ్డి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌పై అసంతృప్తిలో బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు జీవన్‌రెడ్డి. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్లో చేరికతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ కొనియాడారు. కేసీఆర్ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. -
కేసీఆర్ భారీ బహిరంగ సభ జగిత్యాల గులాబీమయం
-
నేడు జగిత్యాలలో గులాబీ గర్జన
సాక్షి, హైదరాబాద్ /జగిత్యాల: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి సోమవారం జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభను పార్టీ శ్రేణులు జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తున్నాయి. 2023లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి జగిత్యాల సభతో పూర్వ వైభవం సాధిస్తుందనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత... 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కేసీఆర్ అడపాదడపా మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక శస్త్ర చికిత్సతో కొద్దినెలలు ఎర్రవల్లి నివాసానికి పరిమితమయ్యారు. కొద్దిగా కోలుకున్న కేసీఆర్ 2024 ఫిబ్రవరి 13న ‘చలో నల్గొండ’పేరిట సభ నిర్వహించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఈ సభలో మండిపడ్డారు. 2024 ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రోడ్‌షోలు, బస్సుయాత్రలో కేసీఆర్ పాల్గొన్నారు. గత ఏడాది వరంగల్‌లో ‘రజతోత్సవం’ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద ‘రజతోత్సవ సభ’నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ భేటీలో కేసీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటంతో జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్‌రెడ్డి చేరికతో కొత్త ఉత్సాహం నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా పేరొందిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతుండటంతో పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి పార్టీకి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. జీవన్‌రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణలో పార్టీకి కొత్త ఊపునిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. జగిత్యాల సభ వేదికగా బీఆర్ఎస్ ప్రస్థానం, పదేళ్ల పాలన, కాంగ్రెస్ పాలనావైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్ ప్రసంగించే అవకాశముంది. పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల సభ బీఆర్ఎస్ ప్రస్థానంలో మైలు రాయిగా నిలవడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో ‘గేమ్ ఛేంజర్’గా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. లక్ష మందికి పైగా సభకు వచ్చేలా... జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు లక్షకు పైగానే జనాన్ని తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేలా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల సభలో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.45కు ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్లో కేసీఆర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరంసాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి బహిరంగ సభ ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుంటారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మినీస్టేడియం పట్టణం నడి»ొడ్డున ఉండటంతో అత్యధికంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు పర్యటించి ప్రజల కోసం 3 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. -
తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి...సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్లో చేరిక ఆ పార్టీకి మోరల్ బూస్ట్, కాంగ్రెస్‌కు పరీక్షగా మారనుంది. ఒక్కటవుతున్న ప్రత్యర్థులుతెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా.ఆసక్తికరంగా సీఎం పర్యటనఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్ఎస్పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. -
ప్లీనరీ కాదు.. ప్రతినిధుల సభ!
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని భారీ ప్లీనరీతో కాకుండా కేవలం ప్రతినిధుల సభతోనే సరిపెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ 25 సంవత్సరాల నేపథ్యంలో గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీంతో ఈసారి ప్లీనరీ కాకుండా ముఖ్య నాయకులతోనే రెండురోజుల ప్రతినిధుల సభను పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ముందు ఈ నెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోనే మరో సభ నిర్వహించడంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతినిధుల సభకే పరిమితం కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మె ల్యేలు, పార్టీ కార్యవర్గం, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు తదితరులను కలుపుకొని మొత్తంగా సుమారు 450 మంది ముఖ్య నేతలు ప్రతినిధుల సభకు హాజరవుతారు. అయితే పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ ప్రతినిధుల సభకు హజరవుతారా? లేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షత వహిస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం! గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ స్వర్ణోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా పార్టీ సభలు, సమావేశాలకు హాజరు కాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టి.జీవన్‌రెడ్డి ఈ నెల 20న జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై స్పందిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నేడు జగిత్యాలకు కేటీఆర్, హరీశ్ జగిత్యాల సభకు సుమారు 2 లక్షల మందిని సమీకరించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. సభ ఏర్పాట్ల బాధ్యతలను ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జగిత్యాలతో పాటు మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటీఆర్ పార్టీ ఇన్చార్జిలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీశ్‌రావు సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం జగిత్యాలకు వెళ్తున్నారు. నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 20న మేడిగడ్డ బరాజ్ పరిశీలనకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ సహా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు శనివారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
కేసీఆర్‌కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీనియర్ నేత జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్‌కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్‌రెడ్డి చెప్పారు. -
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
-
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె. ‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్‌దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్‌ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
కాంగ్రెస్ లో TDP నేతలు.. జీవన్ రెడ్డికి పొగ బెట్టారా?
-
అన్నా.. దేవుడే పంపిండు!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. అన్నా.. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది..’ అని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో అన్నారు. బీఆర్ఎస్లో చేరుతున్నట్టు గురువారం ప్రకటించిన జీవన్‌రెడ్డి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు.తొలుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి జీవన్‌రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డా.కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. జీవన్‌రెడ్డి వెంట ఆయన కుమారులు రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, చంద్రకృష్ణారెడ్డితో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేశ్ కూడా ఎర్రవల్లికి వచ్చారు.కాగా జీవన్‌రెడ్డిని ఆత్మియ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి తన నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సమయంలోనే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతల సమక్షంలో ఇష్టాగోష్టి అనంతరం జీవన్‌రెడ్డి బృందానికి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కేసీఆర్, జీవన్‌రెడ్డి నడుమ సుదీర్ఘ చర్చ జరిగింది. బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికకు తేదీ ఖరారైంది. రాజకీయ పరిస్థితులపై చర్చ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జీవన్‌రెడ్డి చర్చించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకోవడంతో పాటు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం, పదేళ్ల బీఆర్ఎస్ పాలన వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనా తీరు తదితరాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం తిరోగమన దిశలో ఉందనే కోణంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యంతో తెలంగాణకు నష్టం జరుగుతోందని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జగిత్యాలలో 2 లక్షల మందితో సభ జీవన్‌రెడ్డి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో జరిగే బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు ఆదేశాలు అందాయి. సభ నిర్వహణ బాధ్యతను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక నేతలకు అప్పగించినట్లు సమాచారం. సభ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని శనివారం బీఆర్ఎస్ నేతలు సందర్శించి ఖరారు చేయనున్నారు. సుమారు 2 లక్షల మందితో సభ నిర్వహించేలా మైదానం ఎంపిక చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జీవన్‌రెడ్డికి సెక్రటరీ జనరల్ హోదా జీవన్‌రెడ్డికి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు ఈ పదవిలో కొనసాగారు. కాగా జీవన్‌రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ముఖాముఖి సమావేశం సందర్భంగా పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జీవన్‌రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది ⇒ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ⇒ మీడియాతో జీవన్‌రెడ్డి సాక్షి, సిద్దిపేట: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం పట్టు కోల్పోయిందని మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే తన విషయంలో పీసీసీ తప్పు చేసింది కానీ ఏఐసీసీని నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందన్నారు. శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒకప్పుడు పీసీసీ ఏది చెబితే ముఖ్యమంత్రులు అది చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కడే ఏకపక్షంగా, రూలర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అనేది కేవలం సీఎం అదేశాలను అమలు చేసే ఒక విభాగంగా మారిపోయింది.మరోవైపు రేవంత్‌రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ విషయంలో ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నా..’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. తనకు 14 సార్లు బీ ఫామ్ ఇచ్చారంటే కంటెంట్ ఉన్న నాయకుడినే కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన అన్నారు. కాగా జీవన్‌రెడ్డి ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణలు మీడియాకు తెలిపారు. -
బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్
సిద్ధిపేట: ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరనున్నారు. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలోనే జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 10వ తేదీ) సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలో సుమారు ఐదు గంటల పాటు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికపై స్పష్టత నిచ్చారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తుంది. నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది. మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. -
KCRతో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్
-
ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ (ఫొటోలు)
-
గులాబీ దళపతి కేసీఆర్‌తో భేటీ
-
కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
-
కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కాళేశ్వరం కమిషన్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వాయిదా పడింది. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్ మాజీ అధికారి ఎస్.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మార్చి 12న తీర్పు వాయిదా వేసింది. ఇవాళ తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే.. ఇవాళ విచారణ జరగ్గా తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వేసినట్లు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. -
గజ్వేల్‌లో టెన్షన్ టెన్షన్ KCR క్యాంప్ కార్యాలయంపై దాడి
-
CM Revanth : కేసీఆర్ లేకపోతే నేను లేను
-
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్‌రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. -
రేషన్‌కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్‌కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్‌చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్‌ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్‌జోన్‌లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్‌హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్‌కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్‌కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్‌రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్‌టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్‌రావు చెబుతుండడం తప్పు. చక్రధర్‌గౌడ్ పంజగుట్ట పీఎస్‌లో తనను హరీశ్‌రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్‌రావు బెదిరించినట్టు చక్రధర్‌గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్‌ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్‌రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్‌కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్‌లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్‌రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
స్కామ్ కథ కంచికేనా?
కథలన్నీ కంచికి చేరతాయో లేదోగానీ... రాజకీయ ప్రయోజనాలనాశించి పెట్టే కేసులన్నీ, సీబీఐ, ఈడీల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఆ వరసలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తాజా ఉదాహరణ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతోపాటు 23 మందిపై అవినీతి, కుంభకోణం ఆరోపణలు చేస్తూ 2022లో సీబీఐ దాఖలు చేసిన కేసులో అందరూ నిర్దోషులని ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సీబీఐకి చెంపపెట్టు. పనిలో పనిగాతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవితను కూడా నిందితురాలిగా చేర్చారు. ఆమె సైతం ఇప్పుడు నిర్దోషిగా తేలారు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూరేలా మద్యం విధానం తీసుకొచ్చిందంటూ ఈ కేసు అల్లారు. అధికారంలో కొచ్చిన ఏ రాజకీయ పక్షమైనా అమల్లో ఉన్నవాటిని కాదని, తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతుంది. అవన్నీ సరైనవి కాకపోవచ్చు. వాటి వెనక స్వీయ ప్రయోజనాలుండొచ్చు. ఆ నిర్ణయాల పర్యవసానంగా ఖజానా నష్టపోతే, ప్రజల ప్రయో జనాలు దెబ్బతింటే చర్యలు తీసుకోవాల్సిందే. వాటినెవరూ ప్రశ్నించరు. కానీ అందుకు తగిన మౌలిక ఆధారాలు, ప్రాతిపదిక ఉండాలి. విధానం మార్చడం దానికదే ఒక కుంభ కోణంగా చిత్రించటం, ఆ పేరిట కేసులు, అరెస్టులతో వేధించటం, ఏళ్ల తరబడి దర్యాప్తు, చివరకు నిరూపించలేక న్యాయస్థానాలతో చీవాట్లు తినడం ఏం మర్యాద? ఇందువల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత దెబ్బతినడం లేదా? తాత్కాలికంగా మీడియాలో భారీ యెత్తున ప్రచారం జరగొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదని జనం అభిప్రాయపడేలా చేయొచ్చు. ఎన్ని చేసినా ఆరోపణల్ని రుజువు చేయటం అంతిమంగా దర్యాప్తు సంస్థ బాధ్యత. పత్రికల్లో రోజుల తరబడి పతాక శీర్షికలు ఆక్రమించి, టీవీ చానెళ్లలో గంటల తరబడి చర్చలకు కారణమైన కేసులు చివరకు దూదిపింజెల్లా తేలిపోవటం, గాలి పోగేయటం తప్ప ఇందులో ఆవగింజంతైనా వాస్తవం లేదని తేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ కేసుల్ని ఆధారం చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు ఇష్టానుసారం వ్యాఖ్యా నాలు చేయటం, అవమానించేలా శీర్షికలు పెట్టడం మరో ప్రహసనం. ఎవరికీ తెలియని ‘సౌత్ గ్రూప్’ను సృష్టించి, దానికి లబ్ధి కలిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చిందని, ఇందులో రూ. 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. 2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియానూ, 2024 మార్చిలో కవితనూ, కేజ్రీవాల్‌నూ అరెస్టు చేశారు.అన్ని కేసుల్లో మాదిరే ఇక్కడ కూడా మనీశ్ సన్నిహితుడు దినేశ్ అరోరా, ఏపీకిచెందిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వంటివారిని అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఈ ముగ్గురూ పూసగుచ్చినట్టు చెప్పారంటూ లీకులిచ్చారు. కానీ అలా అంటే సరిపోదు... వాటిని ధ్రువపరిచే సాక్ష్యాలుండాలి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తే కాదు... అంత మొత్తం ఎలా ప్రయాణించిందో, ఏయే ఖాతాలకు మళ్లిందో చూపాలి. అడుగడుగునా ఆధారాలుండాలి. ఫలానా అంశాలు రాబట్టామని ఏకరువు పెట్టినంత మాత్రాన కుదరదు. వాటిమధ్య పరస్పర సంబంధాన్ని సందేహాతీతంగా రుజువు పరచాలి. ఆ సంగతలా ఉంచి కనీసం అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 7, 13 కింద ఆరోపించిన లంచం ఆరోపణల్ని కూడా సీబీఐ ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. అందుకే కాబోలు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యకు కోర్టు ఆదేశించింది.అయితే ఈ కేసులో సీబీఐ అప్పీలుకెళ్లింది. అంటే ఈడీ దర్యాప్తు ఇంకా సాగుతూనేఉంటుందనుకోవాలి. కాకపోతే ఇందులో అవినీతిపరుడిగా ముద్రపడిన కేజ్రీవాల్నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. నిందితులంతా కారాగారవాసంతో సహా మూడున్నరేళ్లపాటు నానా కష్టాలు పడ్డారు. బహుశా వారిని ఆర్థికంగా కూడాకుంగదీసి ఉండొచ్చు. కానీ దర్యాప్తు పేరిట ప్రజాధనం, న్యాయస్థానాల విలువైన సమయం వృథా కావటం మాటేమిటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణులు కొనసాగనీయటం అవాంఛనీయం, ప్రమాదకరం. -
కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయి: కేటీఆర్
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,. ఢిల్లీ లిక్కర్ కేసు సాకుతో కేజ్రీవాల్ సర్కారు కూల్చారని, ఆ కేసు వల్ల బీఆర్ఎస్ నష్టపోయిందన్నారు కేటీఆర్. ఈ కేసులో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయమన్నారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసు అని తేలిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫామ్‌హౌజ్‌కు కేటీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో..కేటీఆర్ భేటీ కానున్నారు.తాజా పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌తో పాటు కవితకు క్లీన్చిట్ అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇవి కూడా చదవండి:లిక్కర్ కేసులో క్లీన్చిట్.. కవిత స్పందన ఇదేలిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్, మాజీ సీఎం భావోద్వేగం -
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తుంటే..బావ, బావమరిది హరీశ్‌రావు, కేటీఆర్ తెలంగాణ సమాజంపైన, ప్రభుత్వంపైన విషం కక్కుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు సూచించారు.గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, మాధవరెడ్డితో కలసి ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, 2023 జూలై 15న వెలుగుమట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇళ్లను కూలగొట్టించిందని చెబుతూ అప్పటి కూల్చివేత సంఘటనల ఫొటోలను మీడియాకు చూపారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా, మంత్రి పొంగులేటి పైవిధంగా స్పందించారు.హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇళ్లను తొలగించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్యాయం చేశారని ఆరోపించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ గాలికి వదిలేసిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని, పేదలే ఇందిరమ్మ ప్రభుత్వానికి పేటెంట్ అని మంత్రి వ్యాఖ్యానించారు. వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయే ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామన్నారు. ‘వెలుగుమట్లలో అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తాం. ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చూస్తాం’అన్నారు. పేదల కష్టాలు తీర్చేందుకు జలయజ్ఞం ప్రారంభించారు తన పాదయాత్రలో భాగంగా పేదల కష్టాలను నేరుగా తెలుసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి..వారి కష్టాలు తీరాలంటే గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణంతో రైతన్నకు సమృద్ధిగా సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. జలయజ్ఞంతో ప్రాణహిత–చేవెళ్ల సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బావ బావమరుదులు హరీశ్‌రావు, కేటీఆర్ వచ్చి మాట్లాడాలి. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఉండకుండా సాకులతో బయటకు పోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని..కానీ తాము కచ్చితంగా అవకాశం ఇస్తామని, సభకు వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని పొంగులేటి కోరారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించారు. ⇒ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినందువల్లే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా మారిందని విమర్శించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. -
కమిషన్ ఏర్పాటు కుట్రపూరితం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదిక చెల్లదని, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదించారు. ప్రతిపక్ష నేతలను ఇరికించాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ప్రభుత్వం కమిషన్‌ను నియమించిందన్నారు. అనంతరం కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. రెండున్నర గంటల వాదనల తర్వాత తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలొద్దంటూ గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వా నికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మా సనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, పి.శ్రీరామ్, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. బాధ్యులెవరో తేల్చాలని కమిషన్ ఎలా వేస్తారు? సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ప్రభు త్వం ముందే ఓ నిర్ణయానికి వచ్చి ంది. దానికి బాధ్యులెవరో తేల్చాలని కోరుతూ 2024, మార్చి 14న జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియ మిస్తూ జీవో 6 జారీచేసింది. ఇది ఒక రకంగా తాము చెప్పిన విధంగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరడమే. ఇలా కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం నోటీసులు జారీ చేయలేదు. సాక్షిగా పిలిచి దోషిగా చూపే ప్రయత్నం చేయడం అభ్యంతరకరం.నివేదిక పేరిట తీర్పు చెప్పే అధికారం కమిషన్‌కు లేదు. 2025, జూలై 31న సర్కార్‌కు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సమ ర్పించింది. అంతకుముందే నివేదికలోని అంశాలు బహిర్గతం చేశారు. సీఎం, మంత్రులు.. హరీశ్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. పవర్ పాయి ంట్ ప్రజెంటేషన్ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించడం, నిరాధార ఆరోపణలు చేయడం పరువుకు భంగం కలిగించడమే. ఏకపక్షంగా నివేదికలోని వివరాలను 60 పేజీలకు కుదించి మీడియాకు విడుదల చేశారు. చట్టప్రకారం, కేబినెట్ అనుమతితోనే అన్ని చర్యలు చేపట్టినందున సీబీఐ విచారణకు ఆదేశించినా ఎదుర్కొంనేందుకూ సిద్ధం’అని చెప్పారు.రాజకీయ కక్షలో భాగంగానే.. ‘కేంద్ర ప్రభుత్వ అధీనంలోని వ్యాప్కో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించింది. హరీశ్‌పై సాక్షులెవరూ తప్పుడు ఆరోపణలు చేయలేదు. గత జూన్ 9న హాజరై కమిషన్ అడిగిన సమాచారం, కేబినెట్ తీర్మాన కాపీలన్నీ అందజేశారు. అయినా, సహేతుకమైన అవకాశం ఇవ్వకుండా ఆరోపణలు చేయడం చెల్లదు’అని సుందరం చెప్పారు. దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్‌ను దోషిగా చూపించాలని ఉద్దేశంతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏకపక్షంగా జీవో జారీ చేశారు’ అని చెప్పారు. అనంతరం కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. -
KCRకు YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు
-
కేసీఆర్‌కు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్
సాక్షి,తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest birthday greetings to former CM Telangana, Shri K. Chandrashekar Rao Garu. Praying for your health, peace, and long life. pic.twitter.com/KLHCpcZEGx— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2026 -
‘కేసీఆర్ కాదు..తెలంగాణకు అసలైన జాతిపితను నేనే’
సాక్షి,నల్గొండ: తెలంగాణ జాతిపిత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాదని, తానే అసలైన జాతిపిత అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ జాతిపిత కాదు.జాతిపిట్ట. అసలైన జాతిపితను నేనే. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశా. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న జీతం వెంటనే వెనక్కి ఇవ్వాలి’అని డిమాండ్ చేశారు. -
‘ప్రాణహిత – చేవెళ్ల’ను పునరుద్ధరిస్తాం
వికారాబాద్: దివంగత సీఎం వైఎస్సార్ డిజైన్ చేసి, శిలాఫలకం వేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పిన సబితమ్మ కేసీఆర్‌తో ప్రాణహిత– చేవెళ్లను ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణ్‌పూర్ శివారులో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాకు 300 టీఎంసీల నీరు ఇవ్వటానికి చేతకాలేదా..? ప్రాజెక్టు డిజైన్ మార్చి ఉమ్మడి జిల్లా పొలాలను ఎండబెడుతుంటే సబితమ్మ ఏం చేశారని ఎద్దేవా చేశారు.పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే భూసేకరణ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓ పక్క బీజేపీ, బీఆర్ఎస్లపై ఘాటైన విమర్శలు చేస్తూనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి జిల్లాకు నీరందించేందుకు దివంగత నేత వైఎస్సార్ ప్రాజెక్టులు మంజూరు చేస్తే.. కేసీఆర్ రద్దు చేశాడని విమర్శించారు. గోదావరి జలాలను తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతగిరిలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఓ సంస్థతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వికారాబాద్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా మీదుగా ట్రిపుల్ఆర్ నిర్మించటంతోపాటు ఓఆర్ఆర్ టు జిల్లా వరకు రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వారివి చీకటి ఒప్పందాలు ‘బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఎవరికి తెలియనివి? బీజేపీ వాళ్ల బీ ఫారంలు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు. ఇది తాండూరులో రుజువైంది’అని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..కల్వకుంట్ల కిషన్‌రావు అని రాసుకుంటే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్ అన్ని వర్గాలను వంచించారని, ఆయన ఎస్సీలను సీఎం చేస్తానని వంచిస్తే, మేము ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్ చేశాం.. ఆ సామాజిక వర్గాలకు మంత్రి పదవులిచ్చామని సీఎం స్పష్టం చేశారు. చెరిగిపోని నీచ చరిత్ర కేసీఆర్‌ది..కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు, కేటీఆర్ తనను విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘కేసీఆర్‌ది దొంగనోట్లు, పాస్‌పోర్టు బ్రోకర్ల చరిత్ర .. ఆ చరిత్ర నేను చెరిపేస్తే పోయేదా? కేసీఆర్‌పై దొంగనోట్ల కేసు నమోదైందని మీ పక్కన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమారే చెప్పిండు. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిపినా చెరిగిపోదు.. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. కావాలంటే ఆ చరిత్రను మావాళ్లకి చెప్పి గోడలపై రాయించి భద్రపరుస్తా’అని సీఎం ఎద్దేవా చేశారు. రంజిత్‌రెడ్డిని మున్సిపల్ మంత్రిని చేస్తా..చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రంజిత్‌రెడ్డిని గెలిపించి ఉంటే ఢిల్లీలో మన బలం పెరిగి ఉండేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయినా, రంజిత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి మీకు అండగా నిలబడతారని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఇస్తామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిని చేసి ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదం అనుమానాస్పదం: కిషన్ రెడ్డి
సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. -
వారిదే ఫెవికాల్,ఫెవిక్విక్ బంధం
సాక్షి.హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఫెవికాల్, ఫెవిక్విక్ బంధం ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైందని, నేటికీ కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో ‘ఓటుకు కోట్లు’కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడితే, నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్‌లు కూలినపుడు కేవలం వాటి పైనే జస్టిస్ ఘోష్ కమిషన్‌ను వేసి రేవంత్ చేతులు దులుపుకున్నారని, అయితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందని చెప్పారు.శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జిలు అశోక్ పర్మాణి, రేఖాశర్మ, మాజీ ఎంపీ పి.రాములు, పార్టీ నేతలు డా.ఎన్.గౌతమ్‌రావు, ఎన్వీ సుభాషలతో కలిసి.. ‘వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం’పేరిట మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. కమీషన్ల సర్కార్ నడిపిస్తున్నారు.. ‘ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ విజయం తథ్యమని తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ అంటున్నారు. జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో చిట్టా మా వద్ద ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ఏ జిల్లాకు ఎంత నిధులు ఇచ్చారో రేవంత్ చెప్పగలరా? ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటూ కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారు..’అని రాంచందర్‌రావు విమర్శించారు. కేంద్రంలో మా సర్కార్ ఉందని మరిచిపోవద్దు ‘మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు అనవసర కేసులు, దాడులు, బెదిరింపుల వంటి అరాచకాలకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉందని పోలీసులు మరిచిపోవద్దు. జాతీయ మానవహక్కుల కమిషన్ వద్దకు లాక్కెళ్లి నిలబెడతాం. శనివారం మంచిర్యాలలో ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తుంటే.. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులను కొట్టి, బెదిరించి ఉపసంహరింపజేసిన ఉదంతాలను సీరియస్‌గా తీసుకుంటాం. కర్ణాటకలో మాదిరిగా హేట్‌స్పీచ్ యాక్ట్ (విద్వేషపూరిత వ్యాఖ్యల చట్టాన్ని)ను బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తెలంగాణలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని తీసుకొస్తే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిపై మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టినందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది..’అని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ ప్రధాన హామీలివే.. ⇒ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు ⇒ ఆన్లైన్, సింగిల్ విండో సిస్టం ద్వారా వారం రోజుల్లో ఇంటి అనుమతులు ⇒ ప్రతి వార్డు/డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు ⇒ అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం ⇒ మున్సిపాలిటీ/కార్పొరేషన్లను గ్రీన్ టౌన్/క్లీన్ సిటీలుగా తీర్చిదిద్దుతాం ⇒ అన్ని చోట్లా 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం ⇒ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ⇒ ఏఐ సాంకేతికత సహకారంతో అవినీతి రహితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ⇒ 100% ఇంటింటి చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణతో చెత్త రహిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు -
రేవంతుద్దీన్ అంటే నాకు సంతోషమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నన్ను రేవంతుద్దీన్ అని ముస్లిం పేరుతో పిలిచారు. ఈ పిలుపును నేను సంతోషంగా స్వీకరిస్తా. అయితే రాంచందర్‌రావు పక్కన కూర్చున్న కిషన్‌రెడ్డి మాత్రం కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్‌ను జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. కేసీఆర్‌కు కేటీఆర్ అనే దొంగ పుత్రుడు ఉండగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావు దత్తపుత్రుడిగా మారాడు.ఈ దత్తపుత్రుడు కేసీఆర్, హరీశ్‌రావులను కాపాడుతున్నాడు. గతంలో మోదీ రాష్ట్రానికి వచి్చనప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఆరు నెలల్లో జైలుకు పంపుతామని చెప్పిన కిషన్‌రెడ్డి ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నాడు?..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కోరుతున్నా అని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేశాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారు? ‘కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారని కిషన్‌రెడ్డి, ఎంపీ అరి్వంద్లను ప్రశి్నస్తున్నా. కేసీఆర్, హరీశ్‌రావులను జైల్లో పెట్టి చిప్ప కూడు తినిపించాలని «ఎంపీ ధర్మపురి అరి్వంద్ అంటుంటారు. మేం కాళేశ్వరం విషయమై శాసనసభలో చర్చ పెట్టి కేసును సీబీఐకి ఇచ్చాం. ఇప్పటివరకు సీబీఐ పట్టించుకోలేదు. కేసీఆర్, హరీశ్‌రావులను చర్లపల్లి జైలులో పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? దీనిపై ధర్మపురి అరి్వంద్ ఎందుకు మాట్లాడరు?..’అని సీఎం ప్రశ్నించారు. అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తా.. ‘బ్రిటిష్ హయాం తర్వాత 100 ఏళ్ల వరకు బీసీ కులగణన జరగలేదు. ఇప్పుడు కులగణన చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ నన్ను గతంలో రేవంత్‌గౌడ్ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడంతో మంత్రి దామోదర రాజనర్సింహ రేవంత్ మాదిగ అన్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వాకిటి శ్రీహరిని మంత్రిని చేస్తే ముదిరాజ్ వర్గం నన్ను రేవంత్ ముదిరాజ్ అని వ్యాఖ్యానించింది. అనిల్‌కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపిస్తే రేవంత్ యాదవ్ అని పిలిచారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తానన్నందుకు సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని పిలిచారు.ఇవన్నీ నాకు సంతోషం కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఆ వర్గానికి అనేక పదవులు ఇచి్చంది. షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో గెలవకపోయినా పదవి ఇచ్చాం. ఎమ్మెల్యేగా ఓడిపోయినా అజహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నాం. 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. కాబట్టి రాంచందర్‌రావు నన్ను రేవంతుద్దీన్ అని పిలిచినా సంతోషంగా తీసుకుంటా. నాకు ఎలాంటి సమస్య లేదు. అన్ని కులాలు, మతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తా. తెలంగాణను నంబర్ వన్‌గా తయారు చేస్తా..’అని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లది వీణావాణి బంధం ‘కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్ ఇస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అమలు చేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా మూసీలో వేసినట్లే. ఈ రెండు పార్టీలది వీణావాణి బంధం.. ఫెవికాల్ బంధం..’అని సీఎం విమర్శించారు. నేను, మహేశ్‌గౌడ్ జోడెద్దుల్లా పనిచేస్తున్నాం.. ‘నేను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జోడెద్దుల్లాగా కలిసి పని చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ సారథ్యంలో 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేశ్‌గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాం. 2028లోనూ నేను సీఎంగా, మహేశ్‌గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్‌షిట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జ్‌షిట్ దాఖలు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ సైతం పూర్తి కావడంతో అభియోగపత్రాల తయారీ ప్రారంభించారు. మరోవైపు ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మార్చి 10న మరోసారి విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆలోగా తుది చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. తుది చార్జ్షిట్లో కొన్ని సెక్షన్లతోపాటు నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక అరెస్టులు ఉండవని.. నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం. అలా నమోదై... ఇలా మారి... ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆపై 2023 మార్చి 13న ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో రిమాండ్ కేసు డైరీని సమర్పించారు.అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్‌ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్‌లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది. అందరి వేళ్లూ ఆ అధికారుల వైపే... ట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు.మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్ని ప్రశ్నించిన సిట్ ట్యాపింగ్‌తో పాటు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుల ఎక్స్‌టెన్ వివరాలు ఆరా తీశారు. అవన్నీ పోలీసు విభాగం నిర్ణయాలని పేర్కొన్నారు. ఇలా అన్ని వేళ్లూ అప్పట్లో పని చేసిన ఉన్నతాధికారుల వైపే వెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు వారి విచారణపై సిట్ నిర్ణయం తీసుకోలేదు. వారిని ప్రశ్నించకుంటే కోర్టు విచారణలో కేసుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేసీఆర్ సిట్ విచారణ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ నోటీసులు, విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉద్యమకారుడిని అవమానిస్తారా? అని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఉద్యమాలు నడపలేదా?. ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు?. గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా?. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.రాష్ట్రంలో పదవులన్నీ తీసుకున్నారు. భూములు పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకుని.. చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పు చేస్తే విచారణ తప్పదు.. విచారణ చేయొద్దని ఎక్కడా లేదు. ఇప్పుడు చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్ విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాయాలని బీజేపీ SIRను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెప్పుకొచ్చారు. -
ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మళ్లీ నిన్న మాకు గుర్తొచ్చింది: కేటీఆర్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నిరసిస్తూ 7 వేల గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని, మమ్మల్ని తట్టిలేపిన సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదు. మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది.మంత్రి వాహనంపై దాడి జరగడం, మొదటిసారి. నిన్న కేసీఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదు. చట్టం అంటే కేసీఆర్‌కు గౌరవం. అందుకే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న మా ఇంటి చుట్టు వెయ్యి మంది పోలీసులను పెట్టారు. లా అండ్ ఆర్డర్ పై పోలీసులు దృష్టి పెడితే బావుంటుంది. సుల్తాన్ బజార్లో పట్టపగలే ATM దగ్గర చోరి జరిగింది.నల్లమల సాగర్ తో నీళ్ల దోపిడి జరుగుతుందిఅపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి , సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళాడు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలి. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలి. సృజన్ రెడ్డి కాల్ డాటా బయట పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయి.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రౌడిలను వేసుకొని తిరుగుతున్నాడు. కేసు పెట్టిన సీఐ హాబీబుల్లా ఖాన్‌ను అందుకే ట్రాన్సఫర్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు. హరీష్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందిఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ఇంతటితో ముగించాలి.సజ్జనార్ అయిన, ఇంకో అధికారి అయిన ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్ళాలి కదా?, సజ్జనార్ జడ్జి కాదు , పోలీస్ అధికారి మాత్రమే. మరి ఈ మధ్య కాలంలో సజ్జనార్ జడ్జి అయ్యాడేమో నాకు అయితే తెలియదు. బిజెపి జాతీయ అధ్యక్షుడుకి పరిచయ కార్యక్రమం ఉంటే రాష్ట్రానికి రావొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుంది. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో... పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి’ అని విమర్శించారు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ -
KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం
-
నాలుగున్నర గంటలు.. కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్ బృందం వెళ్లింది. అక్కడి రెండో అంతస్తులోని ఓ గదిలో నగర సంయుక్త సీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి, ఐపీఎస్ అధికారి నారాయణరెడ్డి, నాన్ కేడర్ ఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ కేఎస్ రావు, ఏసీపీ సీహెచ్ శ్రీధర్‌లు కేసీఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఫైళ్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, వీటితోపాటు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల పత్రాలను రెండు ట్రంక్ పెట్టెల్లో తీసుకెళ్లారు. విచారణ ముగించుకొని రాత్రి తిరిగి వెళుతున్న సమయంలో సిట్ బృందం వీటిని తమ వెంట తీసుకెళ్లింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీకి వెళ్లిన అధికారులు సిట్ చీఫ్‌గా ఉన్న నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ విచారణ తీరుతెన్నుల్ని ఆయనకు వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలోపోలీసులు నందినగర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు గత వారంలో సిట్ అధికారులు కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసు తర్వాత కేసీఆర్ సమయం కోరుతూ ఎర్రవల్లికి రావాలంటూ లేఖ రాశారు. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్ మరో నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లో విచారణకు సిద్ధమంటూ ఆయన శనివారం ప్రకటించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సిట్ అధికారులు అప్పటికప్పుడు ప్రశ్నావళిని సిద్ధం చేయడానికి ఉపక్రమించారు. దీంతో రాత్రంతా కూర్చున్న సిట్ బృందం కేసీఆర్‌ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు నియామకాలు, వీరి ఉద్యోగ విరమణ తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వడం తదితరాలపై ప్రశ్నించింది. అప్పట్లో రాధాకిషన్‌రావు, భుజంగరావు పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లిరావడం, ట్యాపింగ్‌కు ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లు, కొందరు బీఆర్ఎస్ నేతల ఫోన్లూ ట్యాప్ కావడం, వ్యాపారుల ఫోన్లపై నిఘా, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రావడం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగింది. సిట్ సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో కలిపి నాలుగున్నర గంటల విచారణ సాగింది. అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో సిట్ అధికారులు ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాదులకూ అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు కేసీఆర్ ఒక్కరినే ఉంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు కేసీఆర్ వాంగ్మూలాన్నీ నమోదు చేసుకొని వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని నివాసం నుంచి ఎర్రవల్లికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉద్విగ్నం.. ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఉద్విగ్న వాతావరణం నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు కేసీఆర్ వస్తారో లేదోననే ఉత్కంఠకు తెరదించుతూ ఎర్రవల్లి నివాసం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌లోని నందినగర్‌కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. ఎర్రవల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్ వెంట వందకు పైగా వాహనాలు అనుసరించాయి. రహదారుల వెంట బారులు తీరిన పార్టీ శ్రేణులు కేసీఆర్ వాహనంపై పూల వర్షం కురిపించారు. తనను చూసేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత.... ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు చేరుకోవడానికి కేసీఆర్ కాన్వాయ్‌కు సుమారు 3 గంటలు పట్టింది. కేసీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికి నివాసంలోకి తోడ్కొని వెళ్లారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోశ్‌తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ ఉదయం నుంచే నందినగర్ నివాసంలో వేచి ఉండటంతోపాటు సిట్ విచారణకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిట్ బృందం వేచి చూస్తున్న గదిలోకి కేసీఆర్ తన న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, రామచంద్రరావుతో కలిసి వెళ్లారు. పోలీసు దిగ్బంధంలో బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంతోపాటు తెలంగాణ భవన్ వద్ద ఆదివారం భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కేన్సర్ ఆస్పత్రి చౌరస్తా, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏ ర్పాటు చేశారు. మొత్తంగా 750 మంది పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మొత్తం 52 పికెట్లు, నలుగురు డీసీపీ లు, ఆరుగురు ఏసీపీలు, 30 మంది సీఐలు, 60 మంది ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుళ్లతోపాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తిన నందినగర్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన నివాసానికి చేరుకోకముందే పలుచోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసుల కళ్లుగప్పి కొంతమంది యువకులు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేసీఆర్ ఇంటి వైపు పరుగులు తీస్తుండగా, అప్పటికే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. పార్టీ కేడర్, నేతలకు కేసీఆర్ అభివాదం సుమారు నాలుగున్నర గంటల సిట్ విచారణ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిసింది. సిట్ అధికారులు ని్రష్కమణ తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వేచి ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలివారు. బయట భారీ సంఖ్యలో వేచి ఉన్న కేడర్‌కు కేసీఆర్, కేటీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నివాసం ఎదుట గుమికూడిన పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశాయి. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ ఆదివారం రాత్రి తిరిగి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. -
బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’నోటీసులు జారీ చేయడానికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాయి. 12 వేలకు పైగా గ్రామాలు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేశా రు. నల్ల జెండాలతో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నా లు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాల నేప థ్యంలో పలుచోట్ల పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల నడుమ వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను పోలీసులు పలుచోట్ల అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నందినగర్‌కే రావాలని పట్టుబట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. రేవంత్ దిష్టిబొమ్మకు ఉరి తెలంగాణ భవన్‌కు ర్యాలీగా చేరుకున్న పార్టీ నేతలు మన్నె క్రిశాంక్, కిశోర్‌గౌడ్ తదితరులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం వ్యతిరేక నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టి»ొమ్మకు ఉరి వేసి తెలంగాణ భవన్‌కు వేలాడదీశారు. సచివాలయం వద్ద పార్టీ శ్రేణులు సీఎం దిష్టి»ొమ్మను దహనం చేశారు. తెలంగాణ భవన్లో గాయకులు మిట్టపల్లి సురేందర్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. మంత్రుల నివాస సముదాయం ముట్టడి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు నే తృత్వంలో మంత్రుల నివాస సముదాయాన్ని ము ట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆగ్రహం తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను విచారణ పేరిట రేవంత్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ తదితరులు వేర్వేరుగా మీడియా సమావేశా లు నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీఎం ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు బీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: హత్యానేరం కన్నా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతున్న వేళ.. మరోవైపు సీఎల్పీ మీడియా హాల్లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారుఅన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్ఎస్లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లోనే లేడు. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్ అన్నారు. -
కేసీఆర్ ఒక్కరికే అనుమతి! సిట్ విచారణ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు.. ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు.. ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్ స్టేట్మెంట్ను వీడియో రికార్డింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందినగర్ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలను గంటల తరబడి సిట్ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
సిట్ విచారణకు కేసీఆర్.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)
-
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ.. అప్డేట్స్కాసేపట్లో ఎర్రవెల్లి తన నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ బయల్దేరాక మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్,హరీష్ రావుబీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభివాదంవిచారణ అనంతరం బయటకొచ్చి బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసిన కేసీఆర్కేసీఆర్ నందినగర్ వివాసానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులునందినగర్కు బీఆర్ఎస్ నేతలుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను నందినగర్‌కు పిలిచిన కేటీఆర్తెలంగాణ భవన్ నుంచి నందినగర్‌కు బీఆర్ఎస్ నేతలుపార్టీ నేతలతో కేసీఆర్ సమావేశంసిట్ విచారణ పరిణామాలను పార్టీ నేతలతో వివరించనున్న కేసీఆర్ నంది నగర్లో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణనాలుగు గంటల 50 నిమిషాల పాటు జరిగిన విచారణఆధారాలను ముందు పెట్టి కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్ బృందంగతంలో విచారణకు హాజరైన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించిన అధికారులుకేసీఆర్ స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసిన సిట్ బృందంకేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంనందినగర్ కేసీఆర్ ఇంట్లో కొనసాగుతున్న సిట్ విచారణ మూడుగంటలకు పైగా కేసీఆర్‌ను విచారిస్తున్న సిట్ సభ్యులు కేసీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్ బృందంతెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తతప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన తెలంగాణ భవన్‌కు భారీగా తరలి వచ్చిన శ్రేణులునందినగర్కు అనుమతి లేదన్న పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులురోడ్డుపై బైటాయించిన బీఆర్ఎస్ శ్రేణులునందినగర్ కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు యత్నంకేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణంతెలంగాణ భవన్ నుంచి నందినగర్ వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలుఅనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులుపోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటతోపులాటలో క్రింద పడిపోయిన మహిళసీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలునందినగర్ కేసీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తతఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నంబీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైటాయించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసనపలువురు బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టునందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ బృందంసిట్ బృందంలో రీతిరాజ్, విజయ్‌కుమార్, అరవింద్‌కుమార్, నారాయణరెడ్డి, కేఎస్ రావు హరీష్‌రావుతో పాటు అందరినీ బయటకు పంపించేసిన అధికారులుకేసీఆర్ న్యాయవాదులకు అనుమతి నిరాకరణనంది నగర్ కేసీఆర్ నివాసం పై డ్రోన్ కలకలంకొనసాగుతున్న కేసీఆర్ సిట్ విచారణనందినగర్ నివాసం పై డ్రోన్ కలకలంఅప్రమత్తమైన పోలీసులు నంది నగర్ కేసీఆర్ నివాసంలో ప్రారంభమైన సిట్ విచారణ.రెండో అంతస్తులో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్న నలుగురు అధికారుల బృందం.మొత్తం విచారణలో పాల్గొన్న 15 మంది అధికారులు.కేసీఆర్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న సిట్ బృందంసిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావున్యాయ సహాయం కోసం అందుబాటులో రామచంద్రరావుకుటుంబ సభ్యుడిగా ఇంట్లోనే మరో ఫ్లోర్ లో ఉండనున్న కేటీఆర్విచారణ తర్వాత నందినగర్ నివాసంలో పార్టీ ముఖ్యనేతలను కేసీఆర్ కలిసే అవకాశంవిచారణ ముగిశాక నందినగర్ కు తరలివెళ్ళనున్న బీఆర్ఎస్ క్యాడర్బాల్కానీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అబివాదం చేసే అవకాశం?ట్రంక్ పెట్టెలు,డాక్యుమెంట్స్ కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ బృందంసిట్ బృందంలో నారాయణ రెడ్డి, రవీందర్.సిట్ అధికారులతో పాటు మరో ఐదుగురు సీఐ స్థాయి అధికారులు.రెండు ట్రంక్ పెట్టెలు, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన సిట్ బృందంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభంకేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు కేసీఆర్ ఇంటిలోని రెండో అంతస్తు గదిలో విచారణ విచారణ గదిని పరిశీలించిన అడిషనల్ డీఎస్పీ కేఎస్ రావువిచారణ దృష్ట్యా కేసీఆర్ నందినగర్ నివాసంలో మూడంచెల భద్రతవిచారణ గదిలోకి లాయర్ల అనుమతి నిరాకరించిన సిట్ బృందం కేసీఆర్ ఒక్కరినే విచారణ చేయనున్న అధికారులు డీఐజీ విజయ్ కుమార్ ఆధ్వరంలో నలుగురు అధికారులు బృందం విజయ్ కుమార్, వేంకటగిరి,కేఎస్ రావు, శ్రీధర్ అధికారుల బృందం మూడు గంటలకు ప్రారంభం కానున్న విచారణ కేసీఆర్ వెంట డాక్యుమెంట్స్..నందినగర్ నివాసం వద్ద కేసీఆర్‌ని రిసీవ్ చేసుకున్న కేటీఆర్.ఫామ్ హౌస్ నుంచి ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్స్ తెచ్చిన కేసీఆర్.సిట్ అడిగే ప్రశ్నలను నోట్ చేసుకోనున్న కేసీఆర్.నంది నగర్ ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.కేసీఆర్ నివాసానికి చేరుకున్న విచారణ యంత్ర సామాగ్రి.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్.మధ్యాహ్నం మూడు గంటలకు సిట్ విచారణ ప్రారంభం.కేసీఆర్‌ను ప్రశ్నించే సిట్ టీం ఇదేఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్మధ్యాహ్నాం 3గం. ప్రారంభం కానున్న విచారణనందినగర్లోని నివాసం వద్ద భారీ బందోబస్తునాలుగు అంచెల పోలీస్ వ్యవస్థ.. వందల మంది పోలీసుల కాపలాఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ఇంతకు ముందు విచారణలో క్రియాశీలకంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి.. ఇవాళ్టి విచారణకు మాత్రం దూరం!కేసీఆర్‌ను విచారించే టీంలో.. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్‌కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావులువిచారణ గదిని క్షుణ్ణంగా పరిశీలించిన అదనపు ఎస్పీ కేఎస్ రావుఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతల విచారణబీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యల విచారణకల్వకుంట్ల కుటుంబ సభ్యులు.. బీఆర్ఎస్ కీలక నేతలు.. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావుల విచారణఇప్పుడు కేసీఆర్ విచారణనందినగర్ చేరుకున్న కేసీఆర్..కేసీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు.మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను విచారించనున్న సిట్. విచారణను వీడియో తీయనున్న పోలీసులు. కేసీఆర్ ఇంటికి సిట్.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ బృందం, పోలీసులు. నందినగర్ కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో విచారించనున్న సిట్.కేసీఆర్ ఇంట్లో విచారణ గదిని పరిశీలిస్తున్న పోలీసులు.కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం.నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరణ.కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్, సంతోష్‌కు మాత్రమే అనుమతి.విచారణను వీడియో రికార్డు చేయనున్న అధికారులు.ఎలక్ట్రానిక్ పరికరాలతో నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ బృందం.పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు. భారీగా ట్రాఫిక్ జామ్.. రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్.గజ్వేల్ నుండి వంటి మామిడి వరకు భారీ ట్రాఫిక్.వంటి మామిడి దగ్గర కేసీఆర్ కాన్వాయ్‌కు మాత్రమే అనుమతి.మిగతా వాహనాలను నిలిపివేసిన పోలీసులు.తుర్కపల్లి దాటిన కేసీఆర్ కాన్వాయ్.కాసేపట్లో నందినగర్ చేరుకోనున్న కేసీఆర్పోలీసుల ఆధీనంలో నందినగర్ పరిసర ప్రాంతాలు.కేసీఆర్ నివాసానికి వెళ్లే వీధులన్నీ మూసివేసిన పోలీసులు.నందినగర్ వద్ద నాలుగు అంచెల పోలీసు భద్రత. నందినగర్ నివాసంలో ఉన్న హరీష్ రావు. రోడ్లన్నీ గులాబీమయం..ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌కు బయలు దేరిన కేసీఆర్.కేసీఆర్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీఆర్ఎస్ అభిమానులు. రోడ్డు మార్గంలో అభిమానులకు అభివాదం చేసిన కేసీఆర్.వందలాది వాహనాల్లో కేసీఆర్ వెంట నందినగర్‌కు వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు..ఖమ్మం జిల్లా..మాజీ సీఎం కేసీఆర్‌కు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై నిరసనలు.ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..అజయ్ కుమార్ కామెంట్స్...ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధండైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేసీఆర్‌కు నోటీసులు..ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్‌కి ఏం సంబంధం?గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టి ఏం చేశారు?.ఇది మరొక ఫేక్ కేసు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు..ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్. కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పుకాస్త ఆలస్యంగా నందినగర్ నివాసానికి కేసీఆర్మరికాసేపట్లో బయల్దేరనున్న బీఆర్ఎస్ అధినేత12.30కి నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశంబీఆర్ఎస్ నేతల భేటీ వాయిదా పడే చాన్స్?నేరుగా సిట్ విచారణకే హాజరు కానున్న గులాబీ బీస్??తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కేసీఆర్ సిట్ విచారణ వేళ.. తెలంగాణ పోలీస్ శాఖ హైఅలర్ట్కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్‌లు పంపిన ఇంటెలిజెన్స్బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాలుముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారుల ఆదేశాలువిచారణ పూర్తయ్యే దాకా అప్రమత్తంగా ఉండాలని సూచనఎక్కడికక్కడే అప్రమత్తమైన పోలీసులురాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎక్కడికక్కడే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుఇప్పటికే విచారణ జరిగే నందినగర్ నివాస ప్రాంతంలో 1,000 మంది దాకా పోలీసుల మోహరింపుతెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ నేతలను ఎక్కడిక్కడే హౌజ్ అరెస్ట్ చేసే అవకాశంఎర్రవల్లి గ్రామస్తుల వెరైటీ నిరసనఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్ద వినూత్న నిరసనసీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలుకేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆగ్రహంకేసీఆర్ ఫొటోకు దిష్టి తీసిన ఎర్రవల్లి గ్రామస్తులుఫాంహౌజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులురాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే కొనసాగుతున్న బీఆర్ఎస్ నిరసనలుతెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలుకేసీఆర్కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నిరసనలుబైక్ ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేస్తున్న కేడర్ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులుకేసీఆర్ సిట్ విచారణ టైంలో.. తెలంగాణ భవన్‌లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలంతాతెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ వేళ.. నగరంలో ఉద్రిక్త వాతావరణంతెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులుతెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ ఆంక్షలుభవన్ వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు11 గంటల నుంచి తెలంగాణ భవన్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలునందినగర్లో.. 800 మంది పోలీసులునందినగర్ ఏరియాలో భారీగా పోలీసుల ఆంక్షలుకేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాస పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ట్రాఫిక్ మళ్లింపునందినగర్ బస్టాప్, బసవతారకం, స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ మార్గాల్లో డైవర్షన్లు.. భారీగా మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ శ్రేణుల కంట్రోల్‌కు బారికేడ్లు సైతం ఏర్పాటుమరికాసేపట్లో నందినగర్ నివాసానికి రానున్న కేసీఆర్నందినగర్ నివాస పరిసరాల్లో.. ఐదు అంచల భద్రతసుమారు 800 మంది పోలీసుల మోహరింపుమధ్యాహ్నాం విచారణకు రానున్న సిట్ అధికారులుHeavy police deployment was seen near KCR’s residence in Nandi Nagar as the former chief minister prepares to appear before the SIT. The state police have been placed on high alert as a precautionary measure.#KCR #NandiNagar #Telangana #TelanganaPolitics #SITInquiry… pic.twitter.com/3lQzn6fr1g— Hyderabad Mail (@Hyderabad_Mail) February 1, 2026మరికాసేపట్లో నందినగర్ నివాసానికి కేసీఆర్ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్‌కు నివాసానికి పాముల పర్తి, గౌరారం, ములుగు, వంటి మామిడి, షామీర్ పేట, జేబీఎస్ మీదుగా చేరుకోనున్న బీఆర్ఎస్ అధినేత ఫామ్‌హౌజ్‌లో విచారించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సిట్నగర పరిధిలోనే విచారణ సాధ్యమని పేర్కొంటూ.. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ఆధారంగా నందినగర్ నివాసానికి నోటీసులునందినగర్ నివాసంలో కీలక భేటీ నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీసిట్ విచారణ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యతమరికాసేపట్లో నివాసానికి చేరుకోనున్న కేసీఆర్రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్న హరీష్ రావుకేటీఆర్తో పాటు మరికొందరు కీలక నేలలతో కాసేపు చర్చించనున్న కేసీఆర్ఇటు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో పాటు నగర శివారు ముఖ్య నేతలకు గులాబీ బాస్ ఆదేశంకేసీఆర్ విచారణకు నిరసనగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన ర్యాలీలు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ నేపథ్యంలో నిర్ణయంఎక్కడిక్కకడ శాంతియుత నిరసనలు చేయాలని కీలక నేతల పిలుపు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధానికి బీఆర్ఎస్ శ్రేణుల ప్రయత్నాలుఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామంఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణఇప్పటిదాకా పోలీస్ అధికారులు, కేసీఆర్ పేషీ అధికారులు, బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించిన సిట్వాళ్ల నుంచి వాంగ్మూలాల సేకరణఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేశామన్న పోలీస్ ఉన్నతాధికారులువాళ్ల వాంగ్మూలాలను ముందుంచి కేసీఆర్‌ను విచారించే అవకాశంట్యాపింగ్ కేసులో సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కేసీఆర్‌కు నోటీసులుసాక్షిగానే కేసీఆర్‌ను విచారించనున్న సిట్ మధ్యాహ్నాం 3గం.ల నుంచి కేసీఆర్‌ను విచారించనున్న సిట్ అధికారులుకేసీఆర్ను ప్రశ్నించనున్న జూబ్లీహిల్స్ పీఎస్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం -
నోటీసు చట్టబద్దంగా లేదు.. 'అయినా విచారణకు రెడీ'
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసుల తీరుపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని ఇంటి గోడపై అంటించిన నోటీసు చట్టబద్ధంగా లేదన్నారు. తనకు నోటీసు జారీ చేసే అధికారం సిట్‌కు లేదన్నారు. తన వాంగ్మూలాన్ని ఎర్రవల్లి నివాసంలోనే నమోదు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత సిట్‌పై ఉందన్నారు. అయినా మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ వెంకటగిరికి శనివారం కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. సుప్రీం తీర్పుల ఉల్లంఘన కిందకే.. ‘సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ల వయసు దాటిన నా వాంగ్మూలాన్ని నేను నివసిస్తున్న చోటే నమోదు చేయాలి. నేను కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోనే నివసిస్తున్నా. భవిష్యత్తులో నాకు పంపే నోటీసులు ఎర్రవల్లి చిరునామాకే పంపాలని జనవరి 29న మీకు లేఖ రాశాను. నా లేఖకు ప్రతిస్పందనగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మీ సంతకంతో ఉన్నట్లుగా పేర్కొంటున్న లేఖను జనవరి 30న హైదరాబాద్ నందినగర్‌లోని ఇంటి గోడకు అంటించారు. మీ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపితే దానిపై నేను తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాను. ఈ విధమైన చర్యలు రాజ్యాంగం, చట్టం పట్ల మీకు గౌరవం లేదనే భావనను కలిగిస్తున్నాయి. వాట్సాప్ లేదా గోడపై నోటీసులు అంటించడం వంటి పద్ధతులు చెల్లవని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచి్చంది’అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. నోటీసు జారీ చేసే అధికారం మీకు లేదు ‘చట్టవిరుద్దంగా ఇచ్చిన నోటీసును నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నేను మీ పోలీస్ స్టేషన్ లేదా అనుబంధ స్టేషన్ల పరిధిలో నివసించడం లేదు. కాబట్టి నాకు నోటీసు జారీ చేసే మీకు అధికారం లేదు. నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న చిరునామా ఆధారంగా ఎర్రవల్లి నివాసంలో విచారణకు అంగీకరించడం లేదని జనవరి 30న నాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చే సమయంలో వ్యక్తి వాస్తవంగా నివసిస్తున్న స్థలానికే ప్రాధాన్యత ఉంటుంది. నేను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలోనే ఉంటున్నందున నా నివాసంలోనే విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. నేడు నందినగర్‌కు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో క్రైమ్ నెం.243/2024 దర్యాప్తునకు సంబంధించి సిట్ ఎదుట హాజరు కావాల్సిందిగా జూబ్లీహిల్స్ ఏసీపీ ఈనెల 29న కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో రోజున హాజరవుతానని కేసీఆర్ అదేరోజు ఏసీపీకి లేఖ రాశారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తాను ఉంటున్న ఎర్రవల్లి నివాసంలోనే విచారణ జరపాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కేసీఆర్‌కు ఏసీపీ మరో నోటీసు జారీ చేస్తూ ఎర్రవల్లిలో విచారణ కుదరదని, నందినగర్ నివాసానికి రావాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ ఆదివారం ఏసీపీకి మరో లేఖ రాశారు. చట్టపరమైన అంశాలను పక్కన పెట్టి నందినగర్ నివాసంలో వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్ ఆదివారం ఉదయం నందినగర్‌కు చేరుకోనున్నారు. -
రేపు సిట్ విచారణకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్.. విచారణకు హాజరుకావాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ రానున్నారు.సిట్‌కు కేసీఆర్.. ఆరుపేజీల లేఖ రాశారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు(ఫిబ్రవరి 1, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానన్న కేసీఆర్.. తన స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చన్నారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాను. కానీ హైదరాబాద్ పరిధిలోనే విచారణ జరపాలని మీరు పేర్కొన్నారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదు...హరీష్‌రావు ఆఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్ అడ్రస్‌గా నందినగర్ పెట్టుకున్నా. గత రెండేళ్లుగా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పరిధులు అవసరం లేదు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్ సహకరిస్తా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాను. పోలీసుల చర్యలు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. -
KTR: రాత్రి పూట వచ్చి నోటీసులు అంటిస్తారా?
-
కేసీఆర్ ఇంటి గోడకు నోటీసు..!
-
రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ను సిట్ విచారణను పిలవడంపై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. రేపు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. బైక్ ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించాక విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు.కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. -
సిట్ విచారణకు కేసీఆర్.. నందినగర్ కు రానున్న మాజీ సీఎం
-
‘రేవంత్ కక్ష సాధింపు.. తెలంగాణ తేవడమే కేసీఆర్ నేరమా?’
సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్ఎస్పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది.ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. -
కేసీఆర్‌పై దుర్మార్గ వైఖరి.. అర్థరాత్రి గేటుకు నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదా?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. రేపు(ఫిబ్రవరి 1న) మధ్యాహ్నాం 3గం. టైంలో నందినగర్ నివాసంలో విచారణకు తమకు అందుబాటులో ఉండాలని ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో విచారణ జరపాలన్న ఆయన విజ్ఞప్తిని టెక్నికల్ రీజన్ చూపిస్తూ తిరస్కరించింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉందని.. అందుకే ఆ ఇంటికి నోటీసులు అంటించామని సిట్ చెబుతోంది. అయితే గోడకు అంటించే నిబంధన ఏదీ లేదని.. పైగా ఇలా అంటించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లీగల్ టీం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అంతేకాదు.. హరీష్‌రావు అఫిడవిట్లో సిద్ధిపేట అడ్రస్ ఉందని.. అయినప్పటికీ హైదరాబాద్ అడ్రస్‌కే సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేసు విచారణకు సంబంధించి నోటీసులు పంపడం కోసం రిజిస్టర్డ్ పోస్టు, కోర్టు తదితర ప్రక్రియల ద్వారా సర్వ్ చేయడం మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. గోడకు అతికించడం సరైన నోటీసు సర్వ్ చేసినట్లుగా పరిగణించబడదని.. ఈ లెక్కన కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవని అంటోంది. అయితే.. దీనిపై న్యాయ నిపుణుల మాట మరోలా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024 డిసెంబర్ 17న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో.. (రాజేంద్ర కుమార్ వర్సెస్ యూపీ అవాస్ ఎవమ్ వికాస్ పరిషత్ సివిల్ అప్పీల్ నెం. 14604 of 2024 ప్రకారం).. ఇంటి గోడలపై నోటీసులు, ప్రకటనలు అతికించడం వంటి చర్యలు చట్టబద్ధం కాదు. ఇది ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కిందకే వస్తుంది. దీనికిగానూ జరిమానా, శిక్షలు విధించవచ్చు. కానీ, కేసీఆర్‌కు సిట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం జారీ చేసింది. దర్యాప్తు జరుగుతున్న కేసులో సాక్షిగా లేదంటే విచారణ కోసం ఓ వ్యక్తిని పిలిచే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది సాధారణంగా అఫిక్స్డ్ నోటీసు (Affixed Notice) అనే ప్రక్రియలో భాగమేనని అంటున్నారు. ఒక వ్యక్తి నోటీసు స్వీకరించనప్పుడు లేదంటే ఆ నోటీసుల స్వీకరణకు గనుక అందుబాటులో లేకపోతే కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థలు ఇలా ఇంటి గోడలకు నోటీసులు అతికించడం ద్వారా సర్వ్ చేసినట్లుగా పరిగణిస్తాయి. కాబట్టి.. ఈ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడం తప్ప బీఆర్ఎస్కు మరొ మార్గం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026 -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపే విచారిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అతికించారు. ఎర్రవల్లి నివాసంలో విచారించాలని కేసీఆర్ కోరగా.. ఆ విజ్ఞప్తిని తిరస్కరించి నందినగర్‌లోనే విచారిస్తామని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. సీఆర్పిసీ సెక్షన్ 160 కింద వీటిని జారీ చేశారు. తొలిసారిగా గురువారం ఇచి్చన నోటీసులకు స్పందించిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సిట్‌కు లేఖ రాయడం విదితమే. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన సిట్ అధికారులు తాజా నోటీసులు ఇచ్చారు. ఓ వ్యక్తి నుంచి ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు ఇస్తారు. సుదీర్ఘంగా చర్చించి.. కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో..గురువారం ఇచి్చన నోటీసుల్లో సిట్ అధికారులు ఓ వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. లేదంటే హైదరాబాద్‌లో మీరు చెప్పిన చోటుకే మేము వస్తామని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, విచారణకు మరో తేదీ ఎంచుకోవాలని కేసీఆర్ కోరారు. విచారణ కోసం ఎర్రవల్లికి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సిట్ శుక్రవారం న్యాయ నిపుణులతో భేటీ అయింది.సుదీర్ఘ మంతనాల తర్వాత కేసీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల అఫిడవిట్లు, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల్లో ఉన్న నివాస చిరునామా ప్రకారం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ‘మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, అలాగే సీఆర్పీసీ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం, అధికారిక రికార్డుల్లో ఉన్న మీ నివాస చిరునామాలోనే విచారణ నిర్వహించేందుకు దర్యాప్తు అధికారి నిర్ణయించారు..’అని వెల్లడించారు మీరు కోరినట్లుగా ఎర్రవల్లిలో విచారించడం కుదరదని చెప్తూ.. అధికారిక రికార్డుల్లో ఉన్న నివాసాన్నే (నందినగర్‌లోని ఇల్లు) విచారణ స్థలంగా నిర్ణయించిన విషయం మరొకసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.అదే సమయంలో..‘విచారణ సందర్భంగా అనేక సున్నిత ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డుల పరిశీలన అవసరం. వాటిని ఎర్రవల్లికి తరలించడం కష్టం కాబట్టి మీరు తప్పనిసరిగా హైదరాబాద్ నివాసం (నందినగర్)లో విచారణకు అందుబాటులో ఉండగలరు..’అని సిట్ స్పష్టం చేసింది. కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ సీఆర్పిసీలోని సెక్షన్ 160 ప్రకారం జరిగే ఈ విచారణకు సంబంధించి చట్టంలో కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. 15 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడి పురుషులు, మహిళలతో పాటు దివ్యాంగులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ కేటగిరీలకు చెందిన వాళ్లు ఫలానా ప్రాంతానికి వచ్చి తమ వాంగ్మూలం నమోదు చేసుకోవాలని కోరే అవకాశం ఉంది. దీంతో ఈ రెండో నోటీసుపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. -
Phone Tapping Case: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని కోరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్‌ను విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ
-
కేసీఆర్‌తో కేటీఆర్, జగదీష్‌రెడ్డి భేటీ
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన తనయుడు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిలు భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, జగదీష్‌రెడ్డిలు సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశాం ఉంది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు శుక్రవారం(జనవరి 30వ తేదీ) హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొనగా, అందుకు కేసీఆర్ తనకు సమయం కావాలని అడిగారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, అందుచేత కొంత సమయం కావాలని సిట్‌ను కోరారు. అదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్‌కు కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. -
కేసీఆర్ అడిగిన చోటే.. సిట్ విచారణ
-
కేసీఆర్‌కు సిట్ సెకండ్ నోటీసు!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసు ఇవ్వనుంది. ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని సిట్ పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళే రెండో నోటీసులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్‌కు సిట్ గురువారం నోటీసులు ఇచ్చింది. వయసురిత్యా(65 ఏళ్లు పైబడడంతో) పీఎస్కే రావాల్సిన అవసరం లేదని.. నగర పరిధిలోనే ఎక్కడైనా తామే వచ్చి విచారణ జరుపుతామని మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు నోటీసులను నందినగర్‌లోని నివాసానికి వెళ్లి కేసీఆర్ సిబ్బందికి సిట్ అధికారులు అందజేశారు. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడి నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు తాను హాజరు కాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ఓ లేఖ ద్వారా సిట్‌కు బదులిచ్చారు. విచారణకు తాను సహకరిస్తానని.. కానీ ఫాంహౌజ్‌లోనే తనను విచారణ జరపాలని సిట్‌ను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం భావిస్తోంది. వీలైతే ఇవాళ సెకండ్ నోటీసులు ఇచ్చి.. రేపే విచారణ జరపొచ్చని తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
కేసీఆర్‌కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సాక్షిగా పరిగణిస్తూ సీఆరీ్పసీలోని సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి తెలిసిన సమాచారం ఇవ్వాలని ఆయన్ను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటివరకు కొందరు ప్రభుత్వ అత్యున్నత అధికారులు మినహా అందర్నీ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ రెండో అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలోనే విచారించారు. అయితే కేసీఆర్ వయస్సు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో సిట్ అధికారులు చట్ట ప్రకారం ఆయనకు ఓ వెసులుబాటు ఇచ్చారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని.. అలా కాకుంటే మీరు కోరిన చోటుకే తాము వస్తామంటూ పేర్కొన్నారు. నందినగర్ నివాసానికి వెళ్లి.. నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఈ మేరకు నోటీసులు అందజేశారు. 2024 మార్చి 10న పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఐపీసీ, ఐటీ యాక్ట్‌తో పాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తొలుత ఇందులో కేవలం ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు మాత్రమే నిందితుడిగా ఉన్నారు. దీని దర్యాప్తు కోసం తొలుత అనధికారిక సిట్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు ఈ కేసులో టెలిగ్రాఫిక్ యాక్ట్‌ను జోడిస్తూ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారింది. సిట్ బృందం ప్రణీత్‌రావుతో పాటు మాజీ అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావులను అరెస్టు చేసింది.మరో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు కాగా.. కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత ఏడాది వరకు సిట్ అధికారులు కేవలం కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, బాధితులతో పాటు ఇతరుల్నీ విచారించారు. కాగా గత నెలలో ఈ కేసు దర్యాప్తు కోసం డీజీపీ బి.శివధర్‌రెడ్డి అధికారిక సిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్‌ను దీనికి చీఫ్‌గా నియమించారు.ఆ తర్వాత దూకుడు పెంచిన సిట్ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకు నోటీసులు జారీ చేయడం మొదలెట్టింది. ఈ నెల 19న మాజీ మంత్రి హరీశ్‌రావు, 22న మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 27న మాజీ ఎంపీ సంతో‹Ùరావులకు నోటీసులు జారీ చేసి సిట్ కార్యాలయంలో విచారించింది. వివిధ కోణాల్లో ప్రశ్నించడంతో పాటు వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎర్రవల్లి నివాసంలో కుదరదు..! విచారణ జరిగే ప్రాంతానికి కేసు దర్యాప్తు అధికారితో పాటు మరికొందరు కూడా రావాల్సి ఉంటుందని కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ వివరించింది. ఎర్రవల్లి నివాసంలో విచారణ కుదరదని పరోక్షంగా స్పష్టం చేస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రాంతాన్ని చెప్పాలని కోరింది. ఎక్కడకు వచ్చి విచారించాలనే సమాచారాన్ని కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి తెలపాలని సూచించింది. బందోబస్తుపై పోలీసుల దృష్టి.. కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తుపై దృష్టి పెట్టారు. ఆయన జూబ్లీహిల్స్ ఠాణాకు వచి్చనా.. అధికారుల బృందం నందినగర్‌లోని ఇంటికి వెళ్లాల్సి వచి్చనా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. గురువారం మధ్యాహ్నం ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఆయా మార్గాలతో పాటు పరిసరాలనూ గమనించారు. ఎక్కడెక్కడ పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి? ఎక్కడ నుంచి ట్రాఫిక్ మళ్లింపులు విధించాలి? అనే అంశాలను పరిశీలించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహంబంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజ రుకావాలంటూ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గురువారం బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలతో పా టు ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప డింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మరిచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. -
విచారణకు రండి.. 'రెడీ'.. కానీ మరో రోజు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్‌కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా.. ‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే.. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే.. – హరీశ్‌రావుతో సమావేశంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది ‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
కేసీఆర్ లేఖపై సిట్ స్పందన
హైదరాబాద్: తాను రేపు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) విచారణకు హాజరు కాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీపై రేపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, తాను సిట్ విచారణకు రేపు(శుక్రవారం, జనవరి 30) రాలేనని కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్ స్పందించింది. -
రేపు సిట్ విచారణకు రాలేను: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రేపు(శుక్రవారం, జనవరి 30) సిట్ విచారణకు రాలేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సిట్ నోటీసులపై స్పందిస్తూ.. సిట్ ఐవోకు ఆయన లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని.. రేపు కాకుండా విచారణకు మరో తేదీ తెలపాలన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని.. మున్సిపల్ అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు.ఇవాళ.. కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే.. వయసు రీత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
SIT విచారణకు గడువు కోరే యోచనలో KCR
-
రేవంత్ కుట్ర రాజకీయాలు!! హరీష్ రావు ఫైర్
-
సిట్ నోటీసులపై కేసీఆర్ ఏమన్నారంటే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోందిసిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ముఖ్యనేతలు, లీగల్సెల్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్‌కు బయల్దేరారుఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు. -
‘కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ కుట్రలు’
హైదరాబాద్: తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుతంత్రాలను కొనసాగిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనన్నారు హఱీస్. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు హరీష్ ట్వీట్ చేశారు. ‘కేసీఆర్‌పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమే. పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ గారు అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు… అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ గారి వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు’ అని ట్వీట్లో మండిపడ్డారు.తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్దకాలం…— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2026 -
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ
-
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేసింది. తొలుత.. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ వెళ్లి స్వయంగా ఆయనకే నోటీసులు అందిస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం మధ్యాహ్నాం నందినగర్‌లోని నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన పీఏకు నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం సిట్ నోటీసులు అందించింది. రేపు(శుక్రవారం, జనవరి 30న) కేసీఆర్‌ను సిట్ ప్రశ్నించనుంది. మధ్యాహ్నాం 3గం. విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటిదాకా నోటీసులు అందుకున్నవాళ్లు.. దర్యాప్తు కార్యాలయం జూబ్లీహిల్స్ పీఎస్‌లో అధికారుల ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. వయసురిత్యా కేసీఆర్ విచారణలో వెసులుబాటు కల్పించింది. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కే రావాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ నగర పరిధిలో ఆయన కోరుకున్న చోటే విచారణ జరుపుతామని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేసీఆర్ పీఏతోనూ సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రేపటి విచారణకు మాత్రం సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ ప్రస్తావించడం గమనార్హం.ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి దశలో బీఆర్ఎస్ హయాంలో పని చేసిన పోలీస్ అధికారులను, కేసీఆర్ పేషీలో పని చేసిన ఉన్నతాధికారులను సిట్ ప్రశ్నించింది. వీళ్లిచ్చిన స్టేట్మెంట్లతో రెండో దఫా విచారణలో.. వరుసగా రాజకీయ నేతలను సిట్ విచారణ జరుపుతోంది. బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్‌రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది.అయితే ఇదొక లొట్ట పీసు కేసు అని, పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నోటీసుల అంశంపై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
అవసరమైతే న్యాయ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శనివారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీలో ‘సిట్’విచారణ తీరు తెన్నులను ఇద్దరు నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. పార్టీ ముఖ్య నేతల పర్యటనలు, మంత్రులుగా తీసుకున్న నిర్ణయాలు, పలువురు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారితో సంబంధాలు, పరిచయాల గురించి పోలీసులు తమను ప్రశ్నించారని వివరించారు. పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చిన సంస్థల వివరాలపై ఆరా తీసినట్లుగా కేసీఆర్‌కు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విచారణతో సంబంధం లేని అంశాలను సిట్ అధికారులు అడిగిన వైనాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలోనే సంబంధం లేని విషయాల్లో విచారణల పేరిట ప్రభుత్వం హడావుడి చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిట్ విచారణకు సహకరిస్తూనే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం కూడా చేయాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ సూచనలు మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి చేరికలు వంటి అంశాలపై ఇద్దరు నేతలు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జిలను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు మున్సిపాలిటీల వారీగా పర్యవేక్షక బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ఇన్చార్జిలు పర్యవేక్షించడంతో పాటు నాయకులు, కేడర్ నడుమ క్షేత్ర స్థాయిల్లో సమన్వయం కోసం పనిచేస్తారు. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలో భేటీ అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్‌లో కేటీఆర్, హరీశ్‌రావు కొందరు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల వారీగా నియమించాల్సిన ఇన్చార్జిల జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. భేటీ అనంతరం ఈ జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు
-
కాసేపట్లో ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్.. కేసీఆర్‌తో భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠను రేపింది. మరోవైపు.. కాసేపట్లో ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ వద్దకు కేటీఆర్, హారీష్ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్ విచారణపై చర్చించే అవకాశం ఉంది.ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్, మెదక్‌లో హరీష్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో వీరిద్దరూ ఎర్రవల్లి చేరుకుంటారు. అయితే, సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ చర్చించే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సైతం సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. రేపు సిట్ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్ సిద్దమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రేపు తెలంగాణభవన్‌కు రావాలని బీఆర్ఎస్ సూచించింది. -
పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? : సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ప్రజా సమస్యలు, ప్రాజెక్టులపై శాసనసభ వేదికగా చర్చించాలని సవాల్ విసిరా. రోజంతా చర్చ పెట్టినా ప్రతిపక్ష నాయకుడు రాకుండా పారిపోయారు. నిజంగా వారు తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి ఉంటే.. సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తే ఎందుకు పారిపోయారు? చర్చకు రాకుండా పారిపోయి మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం మహ బూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పునరుద్ధరణ, బలోపేతం వంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎలా పాలించాలో మాకు తెలుసు ‘నేను సీఎం అయి రెండేళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ ఏమైనా మీ జాగీరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తినా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. పాలన ఎలా చేయాలో.. సమస్యలు ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు. ఇంకా పదేళ్లు మేమే ఉంటాం. నచ్చితే ఆశీర్వదించు. నచ్చకపోతే నీ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకో. శుక్రాచార్యులు, మారీచులు, సుబాహులు, రాక్షసులను కట్టడిచేసే సత్తా పాలమూరు బిడ్డకు ఉంది. గొప్పలు చెబుతున్న ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నవారు మేము విజయాలు సాధించామని గొప్పలు చెబుతున్నారు. కానీ తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాకు ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా మంజూరు చేసిండా? లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయింది. డిండి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి పాలమూరు ఎంపీ విఠల్‌రావు పాలమూరు పథకం గురించి నాటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన అకాల మరణం తర్వాత దీంతో పాటు జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ పథకానికి రూ.25 వేల కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి, ఉద్ధండాపూర్ నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? కల్వకుర్తి ప్రాజెక్టు భూసేకరణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? బీమా–1లో భాగంగా సంగంబండ రిజర్వాయర్ కాల్వకు అడ్డుగా బండ ఉంటే.. దాన్ని తొలగించేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు. నేను సీఎం అయిన తర్వాత వీటికి నిధులు మంజూరు చేశా. జూరాల వద్ద నూతన బ్రిడ్జి కావాలని అడిగితే రూ.123 కోట్లు మంజూరు చేశాం. కేసీఆర్ ఈ పనులు ఎందుకు చేయలేదు?..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష? ‘మక్తల్–నారాయణపేట–కొడంగల్ పథకం ఆషామాషీగా రాలేదు. అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి.. అప్పటి సీఎం వైఎస్సార్‌తో మాట్లాడి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతలు అవసరమని, బీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. కానీ వారి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నేను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంటపడటంతో రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి జీఓ 69 జారీ చేశారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష చూపించారు? గత ప్రభుత్వంలో సీఎంను కలిసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడిగేందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ధైర్యం చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చి.. మేము పనులు చేస్తుంటే తప్పు పడుతుండడం మీ చేతగానితనం..’ అని రేవంత్ అన్నారు. రూ.20 లక్షల కోట్ల లెక్కలేవి? ‘కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఖర్చు చేసిన రూ.20 లక్షల కోట్ల వివరాలు చెప్పలేదు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఈ రూ.20 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారనేది ఎందుకు చెప్పడం లేదు? పాలమూరులో ఐఐఎం! రేవంత్‌రెడ్డి పదేపదే ప్రధాని మోదీని కలుస్తున్నారని నేనంటే గిట్టనివాళ్లు కొందరు అంటున్నారు. తెలంగాణకు నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలిస్తే తప్పేంటి. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు మొదటి సీఎం కాగా.. 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు రెండోసారి రాష్ట్రానికి సీఎంగా అయ్యే అవకాశం దక్కింది. ఇక్కడి ఎంపీ డీకే అరుణతో కలిసి మోదీని కలుస్తాం. తెలంగాణకు ఐఐఎం ఇవ్వమని అడుగుతా. దీన్ని పాలమూరులో ప్రారంభించుకుందాం. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు. ఉచితంగా ఏమి ఇచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. విజ్ఞానం ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థాయికి చేరతాం. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో పైకి రావాలి..’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. -
కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు.సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి...దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
దటీజ్ కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా.. మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్‌గా మారింది. మాజీ ముఖ్య మంత్రివర్యులు కేసీఆర్ గారిని మేడారం మహా జాతరకు ఆహ్వానించిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు,శ్రీమతి సీతక్క గారు..@seethakkaMLA @iamkondasurekha #prajapalana#medaramjatara#sammakkasarakka#tribalfestival pic.twitter.com/F8pwvacqlP— Telangana Congress (@INCTelangana) January 8, 2026కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ‘‘దటీజ్ కేసీఆర్ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేశాయి. -
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు
-
మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం.. ఎర్రవల్లికి సురేఖ, సీతక్క
సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.ఆహ్వానం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్‌కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.బాగున్నరా.. అమ్మ !కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపుఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారంగురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది… pic.twitter.com/8NPsnWB5jX— Telugu Scribe (@TeluguScribe) January 8, 2026అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు. -
ఇదే బీఆర్ఎస్ రాసిన మొదటి మరణ శాసనం: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్‌ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది...బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది...ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్‌లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు...21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్‌లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది. రేపటి నుంచి శాసనసభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఇక, ఈరోజు అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్‌కాయ్ చేశారు. అనంతరం, బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద స్పీకర్ వైఖరిపై నిరసన తెలియజేస్తున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం. అసెంబ్లీని ఏకపక్షంగా నడిపారు. ప్రజాస్వామ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ కొనసాగించారు. బీఏఎసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు వేరు. బీఏసీ మీటింగ్ ఎజెండాను మార్చేసి, సభను తప్పుదోవ పట్టించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడారు. అసెంబ్లీని ముఖ్యమంత్రి బూతుల మయం చేశారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శంచవద్దని ఎలా చెబుతారు?. పార్లమెంట్లో రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని విమర్శించడం లేదా?. మేము మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువ. మూసీ కంటే ముందు.. ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలి. మూసీకి మేము వ్యతిరేకంగా కాదు.. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక స్ట్రీట్ రౌడీవా?. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన మొదలు పెట్టిందే బీఆర్ఎస్. బాడీ షేమింగ్ సరికాదు. ముఖ్యమంత్రి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే సభను వాకౌట్ చేసాం. స్పీకర్ వ్యాఖ్యలు సరికాదు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అవినీతికి రేవంత్ అడ్డాగా మారాడు. భవనానికి పర్మిషన్ కావాలంటే ఆర్ఆర్ టాక్స్ పెట్టాడు. రేవంత్ మాట్లాడే రైట్ లేదు.. అన్నింటికి రేవంత్ ఒక రేటు పెట్టాడు. ప్రజాస్వామ్య విలువలు సభలో లేవు అని మండిపడ్డారు. -
కవిత కన్ఫ్యూజన్.. కోమటిరెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే... ఊరూరా తిరుగుతున్నావ్’’ అంటూ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. కేటీఆర్, హరీష్‌రావులను ఉరితిసినా తప్పు లేదా? సమాధానం చెప్పాలన్నారు.బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత విమర్శిస్తుంది. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుంది. కవిత బీఆర్ఎస్లో ఉన్నదా అనే అనుమానం ఉందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్‌ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదు. కవిత కన్ఫ్యూజన్లో ఉంది. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకుంది. సంతోషం. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.‘‘నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసా.. నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం, ఆయనను ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తా. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదు. నాకు, మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవు. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కవితకు సలహా మాత్రమే ఇచ్చా’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. -
‘కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా.. మనం మనవాటా వాడుకోలేని స్థితి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరైన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టు మార్పు చేశారని.. తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్ట్ అంటూ దుయ్యబట్టారు.కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణకు నీళ్ల వాటా తగ్గిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్న రేవంత్.. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. పంపులు పెరిగితే కమీషన్లు ఎక్కువ వస్తాయనేది బీఆర్ఎస్ ప్లాన్. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను కేసీఆర్ వినిపించలేదు’’ అంటూ సీఎం విమర్శించారు.‘‘ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు చేపట్టారు. ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ కూడా తయారు చేయలేదు. రూ.32వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచారు’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలికి సంబంధించి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ల నియామకం చేపట్టింది. శాసనసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లుగా హరీష్‌రావు,. సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లన నియమించగా, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలను బీఆర్ఎస్ నియమించింది. ఇక మండలిలో బీఆర్ఎస్ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం మేరకే వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్‌రెడ్డి
సాక్షి, వికారాబాద్: రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారనే అనుమానం కలుగుతుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదు? గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము దైర్యం ఉందా?. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయాయి?. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా?. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి సమయం లేదా?. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, పాలన గాలికి వదిలేశారు’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. -
ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య
-
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్-రేవంత్ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు. ‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్ అన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు. -
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్


