హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షుడు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తనను దూషించడం, అవమానించడమేనని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిందన్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో తేలేదన్నారు కేసీఆర్.
‘గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదు. ఉన్న పథకాలు కూడా ఆపేశారు. రియల్ ఎస్టేట్ కోసమే ఈ ప్రభుత్వ పాలసీ. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో రైతుల ఇంటికే యూరియా వచ్చేది’ అని తెలిపారు కేసీఆర్.


