అజయ్ ధీషన్, ధనుషా హీరో హీరోయిన్లుగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ తమిళంలో విడుదలైంది. తెలుగులో ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.


