సద్గురు హెల్త్‌కేర్‌ ఖాతాల్లో రూ.487 కోట్లు | Rs 487 crore found in Sadhguru Healthcare accounts: Malkajgiri Commissioner | Sakshi
Sakshi News home page

సద్గురు హెల్త్‌కేర్‌ ఖాతాల్లో రూ.487 కోట్లు

Nov 29 2026 12:52 AM | Updated on Nov 29 2026 12:52 AM

Rs 487 crore found in Sadhguru Healthcare accounts: Malkajgiri Commissioner

భారీగా అక్రమ అండాల దందా లావాదేవీలు 

నెలకు కోట్లలో ఆదాయం

మల్కాజ్‌గిరి కమిషనర్‌ సుమతి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా విస్తరించిన అక్రమ అండాల సేకరణ, విక్రయం కేసులో ఒయాసిస్‌ ఫెర్టిలిటీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బంజారాహిల్స్‌ కేంద్రంగా ఏర్పాటైన సద్గురు హెల్త్‌కేర్‌ సర్విసెస్‌ అనే మాతృ సంస్థ ఒయాసిస్‌ ఫెర్టిలిటీ పేరుతో ఏఆర్టీ సెంటర్లను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు చెందిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాలలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో ఏకంగా రూ.487.82 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని మల్కాజ్‌గిరి కమిషనర్‌ బీ సుమతి శనివారం మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 43 క్లినిక్స్‌ నిర్వహిస్తున్న సద్గురు హెల్త్‌కేర్‌ నెలకు సుమారు 700 అండాల సేకరిస్తుంది.

 ఇందులో 600 దంపతులు సొంత అండాలు కాగా.. 100 అండాలను అక్రమ పద్ధతుల్లో సేకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయా కేంద్రాల ద్వారా నెలకు రూ.27–28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సద్గురు హెల్త్‌కేర్‌ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను ప్రతీక్‌ అనిల్‌ గగ్లానీ, డా. రాజర్షి దేబ్‌లను ఎల్బీనగర్‌ ఏసీపీ బీ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ప్రమాదకర హార్మోన్‌ ఇంజెక్షన్లు: ముంబైకు చెందిన ప్రతీక్‌ ఏడాదిగా సద్గురు హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఓఓగా పనిచేస్తున్నారు. సద్గురు హెల్త్‌కేర్‌ కార్యకలాపాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ అగర్వాల్‌ ద్వారా నిధుల సమన్వయం చూసుకునేవారు. ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కార్పొరేట్‌ కార్యాలయంలో మెడికల్‌ అడ్మిని్రస్టేటర్‌గా డా. రాజర్షి దేబ్‌ పనిచేస్తున్నారు. యాజమాన్యం విధించిన షరతులకు అంగీకరించిన వైద్యులను మాత్రమే నియమించడం, ఆపరేషన్‌ థియేటర్ల సన్నద్ధతను పర్యవేక్షించడం డా. రాజర్షి దేబ్‌ చేసేవారు. సద్గురు హెల్త్‌కేర్‌ హైదరాబాద్‌లో బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లలో 10 ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాలను నిర్వహిస్తోంది.

సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ డా. గేదెల దుర్గారావు సూచనల మేరకు.. మియాపూర్‌లోని సద్గురు ఏఆర్టీ బ్యాంక్‌ ఇ¯న్‌ చార్జ్‌ సునీల్‌ రాయ్‌ ఏజెంట్ల ద్వారా యూపీ, బిహార్, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను నగరానికి రప్పించేవారు. వీరికి అండాల ఉత్పత్తిని ప్రేరేపించేందుకు హ్యూమో–జీ, ఫోలి సర్జ్, మెటర్నా, ట్రెగార్‌ వంటి ప్రమాదకర ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అనంతరం ఒయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రాలకు తరలించి అండాలను సేకరించేవారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు మల్కాజిగిరి కమిషనర్‌ సుమతి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement