తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీ ఇడుపు కాయితం. ఇందులో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది.
వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మించారు.
తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఉల్లిపూల అంటూ సాగే పాటను విడుదల చేశారు.
ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది.


