Afghanistan: పొద్దున్నే భూకంపం.. 3.8 తీవ్రత నమోదు | Afghanistan Earthquake Magnitude 38 | Sakshi
Sakshi News home page

Afghanistan: పొద్దున్నే భూకంపం.. 3.8 తీవ్రత నమోదు

Nov 28 2026 7:30 AM | Updated on Nov 28 2026 7:30 AM

Afghanistan Earthquake Magnitude 38

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. ఉదయం 6:25 గంటల సమయంలో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంప కేంద్రం భూమికి 117 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడైంది. భూకంప కేంద్రం 34.522 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70.636 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు నివేదికలు వెలువడలేదు.

భూకంపాలు ఎందుకు వస్తాయి?
భూమి పైపొర అనేక పెద్ద, చిన్న టెక్టానిక్ పలకలతో ఏర్పడింది. ఈ పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఒకదానితో మరొకటి ఢీకొన్నప్పుడు లేదా రాపిడికి గురైనప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. ఈ ప్రకంపనలనే భూకంపాలుగా పిలుస్తారు.

రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎలా ఉంటుంది?
భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. సాధారణంగా 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు భవనాలు, ఇళ్లకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. 2 లేదా అంతకంటే తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలను సూక్ష్మ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటిని చాలామంది గుర్తించలేకపోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఇదీ చదవండి: భీకర తుపానులు.. 7 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement