మహావిపత్తు.. ఆ 213 మంది చ‌నిపోయిన‌ట్టే! | Nepal floods: process begins to declare 213 missing Indians dead | Sakshi
Sakshi News home page

గల్లంతైన భారతీయులు మరణించినట్లే

Nov 27 2026 6:11 PM | Updated on Nov 27 2026 6:11 PM

Nepal floods: process begins to declare 213 missing Indians dead

213 మంది జాబితా విడుదల 

సవరణల తరువాత ప్రకటన

ఖాట్మండూ: నేపాల్‌ ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయులను మరణించినట్టుగా ప్రకటించే ప్రక్రియ మొదలైంది. ఈ ఏడాది ఆగస్టులో త్రిశూలి–భోటే కోశి నదికి ఆకస్మికంగా వరదలు వచ్చి దాదాపు 1,500 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మహావిపత్తులో మొత్తం 3,915 మంది గల్లంతయ్యారని నేపాలీలు 3,292 మంది, 19 దేశాలకు చెందిన 623 మంది ఉన్నారని నేషనల్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రకటించింది. 213 మంది భారతీయులుసహా అందరి వివరాలతో జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకూ వీరి ఆచూకీ తెలియని కారణంగా అందరూ మరణించినట్టుగా భావించి గాలింపు చర్యలను నిలిపివేయనున్నారు.

నేపాల్‌ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన జాబితాలోని వివరాలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా eoikathmandufloodsupport @gmail.com మెయిల్‌ చేయవచ్చునని లేదా +9779851316807 నెంబరు ద్వారా సంప్రదింవచ్చునని నేపాల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. తుది గడువు డిసెంబర్‌ 2వ తేదీ అని సూచించింది. 

పెను విధ్వంసం 
ఈ ఏడాది ఆగస్టు 26న నేపాల్‌లోని టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ మ‌హావిప‌త్తులో 1,453 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 5 వేల‌ మంది గల్లంతయ్యారు. భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో పలు గ్రామాలు నామ‌రూపాలు లేకుండా పోయాయి. హైడ్రో పవర్ ప్రాజెక్టు స‌హా ప‌లు భారీ నిర్మాణాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. 

ఇదీ చ‌దవండి: 2028 వరకు ఆగని యుద్ధం.. జ్యోతిష్యుల హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement