breaking news
Nepal flash floods
-
నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం: కొట్టుకుపోయిన 35 ఇళ్లు
గోర్ఖా: నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. చుమ్నుబ్రీ పరిధిలోని బుఢీగండకీ నది ఉధృతికి పైయూ, బగర్ గ్రామాల్లోని దాదాపు 35 ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నదిపై రాకపోకలకు ఆధారమైన మోటారు వంతెనలతో పాటు పలు వేలాడే (సస్పెన్షన్) వంతెనలు కూడా వరద తాకిడికి కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.చుమ్కే ఖోలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహం ఆగిపోవడం, ఆపై ఒక్కసారిగా భారీగా నీరు పోటెత్తడంతో ఈ ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించినట్లు అధికారులు గుర్తించారు. దోభాన్, ఘట్టేఖోలా, జగత్, సల్లేరీ గ్రామాల్లోనూ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపారు. VIDEO | A debris-laden flash flood in a river has swept away more than 35 houses and bridges in Nepal’s Gorkha district on Sunday, authorities said, urging people living along the stream to move to higher ground. The flood in the Budhi Gandaki River swept away houses in Salleri, Paiyuka and the riverbed at Jagat, as well as a suspension bridge connecting the ward, Ram Kumar Gurung, ward chair of Chumnubri Rural Municipality-3, was quoted as saying by the Kathmandu Post. (Source: Third Party) (Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)— Press Trust of India (@PTI_News) October 11, 2026బాధిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. జగత్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో సైనిక హెలికాప్టర్ ద్వారా ఆరుగురిని సురక్షితంగా ఎయిర్‌లిఫ్ట్ చేశారు. బాధితులకు తక్షణ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య అత్యవసర కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సహాయం కోసం 1115 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
పితృపక్ష వేళ.. నేపాల్ మృతులకు నటుడు పిండప్రదానం
బోధ్‌గయ: బాలీవుడ్ నటుడు రాజేశ్ కుమార్ పితృపక్ష మేళా సందర్భంగా బిహార్‌లోని గయా చేరుకున్నారు. బోధ్‌గయలోని ధర్మారణ్య వేదిక వద్ద తన పూర్వీకులకు పిండప్రదానం, తర్పణం నిర్వహించారు. నేపాల్‌లో ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం కూడా ప్రార్థనలు చేశారు. గయ జిల్లాలోని గురువా ప్రాంతానికి చెందిన రాజేశ్ కుమార్ శనివారం ధర్మారణ్య వేదిక వద్ద పూర్వీకులను స్మరించుకున్నారు. అనంతరం సీతాకుండ్లో దర్శనం, పూజలు చేశారు. తన జీవితంలో తొలిసారి పితృపక్ష మేళాలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.పితృపక్షం కేవలం మతపరమైన ఆచారాలకు మాత్రమే పరిమితం కాదని, పూర్వీకులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపే సమయమని రాజేశ్ కుమార్ పేర్కొన్నారు. గయకు తరచూ వస్తున్నప్పటికీ ఇంతకుముందు పితృపక్ష మేళాకు రాలేకపోయానని చెప్పారు. ఫల్గు నదిలో నీటి ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. తన పూర్వీకులతో పాటు నేపాల్‌లో ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం కూడా రాజేశ్ కుమార్ పిండప్రదానం, తర్పణం నిర్వహించారు. వారికి మోక్షం కలగాలని ప్రార్థించారు.పితృపక్షం తొలి రోజున ఫల్గు నది ఘాట్ల వద్ద భారీగా భక్తులు తరలివచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ పిండప్రదానం కోసం తీర్థయాత్రికులు పెద్ద సంఖ్యలో కనిపించారు. జొన్నలు, బియ్యం, పాలతో తయారు చేసిన ఖీర్‌తో పిండాలను తయారు చేసి, సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. శనివారం భక్తుల సంఖ్య 65 వేలకుపైగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. పితృపక్షం రెండో రోజైన ఆదివారం ప్రేతశిల, బ్రహ్మకుండ్, రామకుండ్, రామశిల తదితర వేదికల వద్ద పిండప్రదానం నిర్వహించనున్నారు. ప్రేతశిల వద్ద పిండప్రదానం చేస్తే ప్రేతయోని నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పూజల అనంతరం భక్తులు విష్ణుపాద ఆలయంలో శ్రీ విష్ణుచరణాలను దర్శించుకున్నారు.ఇదీ చదవండి: యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి -
నేపాల్ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది!
కాఠ్మాండు: నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన బోటేకోషి వరదల సమయంలో పలు ప్రాజెక్టులలో చిక్కుకున్న 800 మంది ఆచూకీ నేటికీ లభ్యంకాలేదు. వారు భూగర్భ నిర్మాణాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని, వరదల్లో కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. వారి కోసం గాలింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఇంధన మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠ పార్లమెంట్‌కు తెలిపారు. వరదల్లో గల్లంతైన వారిని గుర్తించే అవకాశం ఉన్నంతకాలం సహాయక చర్యలు కొనసాగిస్తామని మంత్రి చెప్పారు. గల్లంతైన వారిలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన 47 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.216 మెగావాట్ల అప్పర్ త్రిశూలి-1 ప్రాజెక్టులో వరదలకు ముందు 1,433 మంది పనిచేస్తున్నారు. వారిలో 955 మంది ప్రమాదం నుంచి బయపడ్డారు. 439 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. వరదల 12వ రోజున ఓ చైనా పౌరుడిని సజీవంగా రక్షించారు. ప్రాజెక్టు సొరంగం నుంచి ఇప్పటివరకు 39 మృతదేహాలను వెలికితీశారు. అప్పర్ త్రిశూలి-3ఏలో 39 మంది, అప్పర్ త్రిశూలి-3బీలో 178 మంది, రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టులో 93 మంది, మెయిలుంగ్ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు, రసువా-బోటేకోషి ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతయ్యారు. లాంగ్టాంగ్ ఖోలా ప్రాజెక్టులో 39 మంది ఆచూకీ లభించలేదు. అక్కడ 19 మందిని రక్షించగా, రెండు మృతదేహాలు లభించాయి.చిలిమే జలవిద్యుత్ కేంద్రంలోని పవర్‌హౌస్‌లో సహాయక చర్యల సమయంలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన ఐదుగురు ఉద్యోగులు మృతిచెందినట్లు గుర్తించారు. మరో ఉద్యోగి ఆచూకీ తెలియాల్సి ఉంది. మధ్య త్రిశూలి గంగా ప్రాజెక్టులో ఇద్దరు, త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో ముగ్గురు గల్లంతయ్యారు.నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానిక అధికారులు, భూగర్భ సొరంగ నిపుణులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బంది, బాధితుల కుటుంబాలు కలిసి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రత్యేక హెలికాప్టర్, వాహనాలను ఏర్పాటు చేసింది. గల్లంతైన నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఆ ఉద్యోగుల జీతంలో 50 శాతాన్ని ఆరు నెలల పాటు కుటుంబాలకు చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.ఇదీ చదవండి: ట్రక్‌ను ఢీకొన్న కారు.. మంత్రి కుమార్తెతో సహా నలుగురు మృతి! -
నేపాల్ వరదలు.. 40 పిరమిడ్లు కట్టేంత శిథిలాలు
కాఠ్మాండూ: ఈజిప్టులోని ప్రపంచ ప్రసిద్ధ గిజా పిరమిడ్ల వంటి 40 భారీ పిరమిడ్లను నిర్మించడానికి ఎంత మొత్తంలో రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రి అవసరమో... సరిగ్గా అంతే పరిమాణంలో కొండచరియలు, మంచు విరిగిపడి నేపాల్‌లో పెను విధ్వంసం సృష్టించాయి. ఆగస్టు 26న లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం నుంచి జారిన ఈ అపార శిథిల ప్రవాహం (డెబ్రిస్ ఫ్లో) ధాటికి ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఆచూకీ గల్లంతైంది.శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు జరిపిన తాజా విశ్లేషణల ప్రకారం, పర్వత ఉత్తర భాగంలో సుమారు 5,150 మీటర్ల ఎత్తున ఉన్న 2.2 చదరపు కిలోమీటర్ల భారీ రాతి పలక అకస్మాత్తుగా విరిగిపడింది. కొండచరియలు, గడ్డకట్టిన మంచు కలిసి దాదాపు 11 కోట్ల ఘనపు మీటర్ల పరిమాణంలో కిందికి దూసుకొచ్చాయి. ఈ ఘనపరిమాణం గిజాలోని 40 పిరమిడ్లతో సమానమని భూగర్భ శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. గంటకు 160 నుంచి 190 కిలోమీటర్లకు పైగా పెను వేగంతో లోయలోకి దూసుకొచ్చిన ఈ ప్రవాహం, మార్గమధ్యంలోని పదుల సంఖ్యలో గ్రామాలు, ఆవాసాలను ఆనవాలు లేకుండా తుడిచిపెట్టేసింది.శతాబ్దాలుగా రాళ్లను, మట్టిని గట్టిగా బంధించి ఉంచిన శాశ్వత మంచు (పెర్మాఫ్రాస్ట్) గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కరిగిపోవడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని నిపుణులు నిర్ధారించారు. 2015 నాటి గోర్ఖా భూకంపం వల్ల ఇప్పటికే బలహీనపడిన ఈ ప్రాంతంలో, ప్రపంచ సగటు కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రమాదానికి ముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 10 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో మంచు వేగంగా కరిగి, రాళ్ల పగుళ్లలోకి చేరి వాటిని మరింత వదులు చేసింది. పైనుంచి పడే క్రమంలో రాళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని పొడిగా మారి, కరిగిన నీటితో కలిసి ప్రమాదకర ద్రవ రూప ప్రవాహంగా రూపాంతరం చెందాయి. భవిష్యత్తులో హిమాలయ ప్రాంతానికీ ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: -
సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలతో జలవిద్యుత్ మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో.. ఆ దేశానికి రోజుకు 18 గంటల చొప్పున విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ విద్యుత్ సరఫరా కొనసాగనుంది. గరిష్ఠంగా 654 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్‌కు అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.ఇటీవలి వరదల కారణంగా నేపాల్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. సుమారు 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లు అంచనా. దీంతో దేశీయ విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పాటు, భారత్‌కు నేపాల్ నుంచి జరిగే విద్యుత్ ఎగుమతులు కూడా సుమారు 400 మెగావాట్ల మేర తగ్గాయి.ఈ పరిస్థితుల్లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి విద్యుత్ దిగుమతి చేసుకోవాలని నేపాల్ కోరింది. ఆ అభ్యర్థనను భారత్ ఆమోదించింది. రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందులో గరిష్ఠంగా 600 మెగావాట్ల విద్యుత్‌ను ముజఫర్‌పూర్-ఢల్కేబర్ 400 కేవీ ప్రసార మార్గం ద్వారా, మరో 54 మెగావాట్లను టనక్పూర్-మహేంద్రనగర్ 132 కేవీ మార్గం ద్వారా అందించనున్నారు.ఈ సరఫరా సమయం ప్రధానంగా పగటి వేళల్లో ఉండేలా నిర్ణయించారు. భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండే సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రెండు దేశాల విద్యుత్ వ్యవస్థలకు ప్రయోజనం కలిగేలా ఈ ఏర్పాటును రూపొందించారు. నేపాల్‌లో జలవిద్యుత్ రంగం దేశ విద్యుత్ అవసరాల్లో అత్యంత కీలకమైనది కావడంతో వరదల ప్రభావం అక్కడి విద్యుత్ వ్యవస్థపై తీవ్రంగా పడింది.డిసెంబర్లో ఈ ఏర్పాటును మరోసారి సమీక్షించనున్నారు. అవసరాన్ని బట్టి 2027 జనవరిలో కూడా సరఫరాను కొనసాగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, భారత్-నేపాల్ మధ్య ఇంధన రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. -
కోట్లాది మందికి నేపాల్ వరదల తరహా ముప్పు
హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే మరింత వేగంగా కరుగుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ ప్రాంతం కీలకమైన మలుపు దిశగా వెళ్తోందని, శతాబ్దం మధ్య నాటికి గరిష్ఠ నీటి ప్రవాహ దశకు చేరుకున్న తర్వాత నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీనివల్ల కోట్లాది మంది ప్రజల తాగునీరు, వ్యవసాయం, జీవనోపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.అధ్యయనం ప్రకారం హిందూకుష్-హిమాలయ ప్రాంతంలో ఇటీవలి దశాబ్దాల్లో హిమనీనదాల ద్రవ్యరాశి వేగంగా తగ్గుతోంది. ఈ విస్తారమైన పర్వత వ్యవస్థ అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకు 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 40,000 హిమనదాలు ఉన్నప్పటికీ భూమిపై కేవలం 21 హిమనదాలనే పర్యవేక్షిస్తున్నారని అధ్యయనం తెలిపింది.భారత్‌లో దాదాపు 200 హిమనీనద సరస్సులను అధిక ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వాటిలో 56 అత్యంత అధిక ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. హిమనీనదాలు వెనక్కి తగ్గడంతో వాటి వెనుక అస్థిరమైన సరస్సులు ఏర్పడుతున్నాయని, అవి ఎప్పుడైనా విరిగి దిగువ ప్రాంతాల్లో భారీ వరదలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆగస్టు చివరలో నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమనీనదం అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల లోయల్లో వరుసగా కొండచరియలు, వరదలు సంభవించిన ఘటనను అధ్యయనం ప్రస్తావించింది. నేపాల్, చైనా-టిబెట్ ప్రాంతాల్లో ఈ ఘటనలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు, 5,300 మందికి పైగా గల్లంతైనట్లు పేర్కొంది.హిమాలయ ప్రాంతం భారత భూభాగంలో సుమారు 18 శాతం ఉన్నప్పటికీ, ప్రకృతి విపత్తుల్లో దాని వాటా దాదాపు 35 శాతంగా ఉందని అధ్యయనం తెలిపింది. హిమనీనదాల కరుగుదలతో వరదలు, కొండచరియలు, కరువులు పెరిగే అవకాశం ఉందని, వ్యవసాయం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, రోజువారీ నీటి అవసరాలు ప్రభావితమవుతాయని పేర్కొంది.హిమనదాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రమాదకర సరస్సులను పరిశీలించడం, స్థానిక ప్రజలను విపత్తులకు సిద్ధం చేయడం కీలకంగా మారనుంది. -
కోలుకునేందుకు రూ.45 వేల కోట్లు అవసరం
కఠ్మాండు: ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో వాటిల్లిన నష్టాల నుంచి కోలుకునేందుకు, పునరి్నర్మాణ పనుల కోసం సుమారు రూ.45 వేల కోట్లు (సుమారు 4.78 బిలియన్ డాలర్లు) అవసరమవుతాయని నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది. ఆగస్ట్ 26న వచ్చిన విధ్వంసకర వరదల్లో రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, వేలాదిగా గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మౌలిక వసతుల పునరుద్ధరణతో పాటు భవిష్యత్తులో వచ్చే విపత్తులను తట్టుకునేలా పునర్నిర్మాణ చర్యలు చేపట్టడానికి ఈ నిధులు అవసరమని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక పేర్కొంది. ది ర్యాపిడ్ డ్యామేజ్ అండ్ నీడ్స్ అసెస్మెంట్(ఆర్డీఎన్ఏ) ఫర్ ది రసువా–భోటెకోషి ఫ్లడ్–2026 పేరుతో ఆదివారం ఈ నివేదికను విడుదల చేసింది. వరదలతో మొత్తం నష్టం సుమారు రూ.25 వేల కోట్లు కాగా, ఇందులో భౌతిక నష్టం రూ.17 వేల కోట్లు, ఆర్థిక నష్టాలు సుమారు రూ.8 వేల కోట్లని పేర్కొంది. ఈ పునరుద్ధరణ అంచనా కేవలం దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడానికి అయ్యే వ్యయం మాత్రమే కాదు. విపత్తు ప్రమాదాలను తగ్గించేందుకు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునే రక్షణ చర్యలు కూడా కలిసి ఉన్నాయని వివరించింది. ఇలా ఉండగా, నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో చనిపోయిన వారి సంఖ్య 1,388కు చేరుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మాత్రమే గుర్తించి, సంబం«దీకులకు అందజేశామన్నారు. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 5,130గా ఉందని చెప్పారు. -
చీకటి సొరంగంలో, మరణం అంచున 10 రోజులు భయానక పోరాటం
చీకటి సొరంగంలో బిక్కుబిక్కుమంటూ గడిచిన క్షణాలు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన వేళ ప్రాణాలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా ఎక్కడో ఒక చోట సహాయక బృందాలు తమను చేరుకుంటాయన్న నమ్మకంతో సంజయ్ సాహ్, కబీర్ మహర్జన్ అనే ఇద్దరు కార్మికులు ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రార్థనలతో మనసును నిలబెట్టుకుంటూ.. చివరకు ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు.నేపాల్‌లో వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు పది రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. త్రిశూలీ 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యాంత్రిక విభాగం ఫోర్‌మ్యాన్ సంజయ్ సాహ్, యాంత్రిక పర్యవేక్షకుడు కబీర్ మహర్జన్ను సెప్టెంబర్ 4న సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. ఆపదలో చిక్కుకున్న తర్వాత చీకటి సొరంగంలో తొమ్మిది రోజులు గడిపిన సంజయ్.. ప్రార్థనలు చేస్తూ ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు.ఆగస్టు 26న వరదలు ప్రాజెక్టును ముంచెత్తిన సమయంలో సంజయ్ నియంత్రణ గదిలో విధుల్లో ఉన్నారు. సాధారణంగా అక్కడ ఐదారు మంది మాత్రమే ఉండేవారని, ఆ రోజు 40 నుంచి 45 మంది ఉన్నారని ఆయన చెప్పారు. వరదనీరు భూగర్భ ప్రాంతంలోకి ప్రవేశించడంతో కార్మికులను బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఇతరులను రక్షించే క్రమంలో తనకు బయటపడే అవకాశం లేకుండా పోయిందని సంజయ్ వివరించారు.హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ.. “వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ అందరినీ పరుగెత్తించాను. దాంతో నాకు సమయం లేకుండా పోయింది. చివరికి నేను బయటకు రాలేకపోయాను” అని సంజయ్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నానని చెప్పారు. ఆ ప్రార్థన తనకు మనోధైర్యాన్ని ఇచ్చిందని వివరించారు.మరో కార్మికుడు కబీర్ మహర్జన్ కాఠ్మాండుకు చెందినవారు. సాధారణ నిర్వహణ పనుల కోసం కులేఖానీ జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి త్రిశూలీ 3ఏకు వెళ్లారు. ఆయన భార్య హీరా శోభా చివరిసారిగా ఆగస్టు 26 ఉదయం 7.30 గంటల సమయంలో భర్తతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పనిచేయలేదు. తొమ్మిది రోజుల పాటు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.“అతను మరో జీవితం పొంది తిరిగి వచ్చాడు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం” అని హీరా శోభా తెలిపారు. రక్షణ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తన భర్తను కాపాడాయని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌లో పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఇంకా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలీ-3ఏలో ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం, సొరంగాల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించవచ్చన్న ఆశలను పెంచింది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు -
మూత్రం పోసి నేపాల్ ని ముంచేశారు!
-
నేపాల్‌కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల పునర్నిర్మాణానికి 4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ల డాలర్ల మధ్య ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.38,000 కోట్ల నుంచి రూ.47,550 కోట్ల మధ్య అవుతుంది.ఈ భారీ మొత్తాన్ని నేపాల్ ప్రభుత్వం ఒక్కటే భరించడం కష్టం కావడంతో.. దేశీయ నిధులు, రుణాలు, బీమా, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇతర దేశాల సాయం, వాతావరణ నిధులు వంటి మార్గాల ద్వారా డబ్బును సమీకరించాల్సి ఉంటుంది.నేపాల్‌లో భోటేకోషి, త్రిశూలీ లోయల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ విపత్తులో 1,357 మంది మరణించగా, 5,326 మంది గల్లంతయ్యారు. ఆస్తులు, ఇళ్లు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం $2.56 బిలియన్లుగా అంచనా వేశారు. అయితే పూర్తిస్థాయి పునర్నిర్మాణానికి $4 బిలియన్ నుంచి $5 బిలియన్ల వరకు అవసరమవుతుందని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు.నేపాల్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఒత్తిడిలో ఉండటంతో మొత్తం ఖర్చును దేశీయంగా సమకూర్చడం సాధ్యం కాదు. ప్రభుత్వం బడ్జెట్‌ను మార్చి కేటాయించడం, రుణాలు తీసుకోవడం, బీమా పరిహారం, ప్రైవేట్ పెట్టుబడులను ఉపయోగించవచ్చు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు, గ్రాంట్లు పొందడం కీలకం కానుంది.బ్రిటన్, దక్షిణ కొరియా, అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే సాయం అందించాయి. వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టాలకు అందించే అంతర్జాతీయ ‘నష్టం-నష్టపరిహార నిధి’ నుంచి కూడా నేపాల్ సాయం కోరుతోంది. అయితే $4–$5 బిలియన్ల పునర్నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఈ నిధులు చాలా తక్కువగా ఉండటంతో, పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సాయం అవసరం కానుంది. -
Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
-
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
కాఠ్మాండు: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో ఇల్లు కోల్పోయి సహాయక శిబిరాల్లో తలదాచుకున్న తల్లులు, శిశువులు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతం. వరదల్లో తల్లి నుంచి బిడ్డలు విడిపోవడం, తిరిగి కలిసిన తర్వాత కూడా వారికి సరైన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులై తాత్కాలిక శిబిరాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేక అవసరాలు అందడం లేదు. శిశువులకు ప్రత్యేక ఆహారం లేక పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది. రద్దీగా ఉన్న శిబిరాల్లో తల్లులు బిడ్డలకు పాలు పట్టించుకోవడానికి కూడా గోప్యత లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గర్భిణులు ఆసుపత్రులకు చేరుకోవడంలో రహదారులు దెబ్బతినడం, విద్యుత్ అంతరాయం, వైద్య సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు దొరికినా ఆహారం లేదు నేపాల్‌లో వచ్చిన వరదల్లో షర్మిలా శ్రేష్ఠ (33) అనే మహిళ ఇల్లు కొట్టుకుపోయింది. ఆమె కొన్ని రోజుల పాటు తన కుమార్తె నుంచి దూరమైంది. ఇప్పుడు తన కుమార్తెతో తిరిగి కలిసిన ఆమె.. రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రంలో పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తన చిన్నారికి తినిపిస్తూ నిస్సహాయంగా చూస్తోంది. 14 నెలల వయసున్న ఆమె కుమార్తె, తన వదినకు చెందిన 18 నెలల కుమారుడితో కలిసి వాయవ్య కాఠ్మాండులోని ఓ తరగతి గది నేలపై నిద్రిస్తోంది. ఆ ఇద్దరు చిన్నారులకు ప్రత్యేకమైన శిశు ఆహారం అందడం లేదు.“శిశువులకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం లేదు. ఆ చిన్నారికి కూడా పెద్దలకు ఇచ్చే గట్టి ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది” అని శ్రేష్ఠ చెప్పారు. వరదల కారణంగా తన కుమార్తె నుంచి విడిపోయిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ కొండల మార్గంలో 6 గంటలు నడిచింది. వరదల కారణంగా వారిద్దరూ 2 లేదా 3 రోజుల పాటు విడిపోయారు. “నాకు కావాల్సిందల్లా సురక్షితమైన, సరైన నివాసం. అది ఉంటే కొంత మనశ్శాంతి కలుగుతుంది” అని ఆమె చెప్పింది.గర్భిణులకు ఏదైనా సమస్య వస్తే? ఆగస్టు 26న నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు శ్రేష్ఠ వంటి తల్లులకు మరో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. పెరుగుతున్న వరద నీటిలోనే కాకుండా, రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రాల్లో, పిల్లలకు ఆహారం ఇచ్చే సమయంలో, తరగతి గదుల నేలపై, ఆసుపత్రులకు వెళ్లే ప్రమాదకరమైన మార్గాల్లో ఈ సంక్షోభం కొనసాగుతోంది. చిన్నారులు ఆకలితో ఉన్నారు. తల్లులు పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి చేరుకోగలమా అనే ఆందోళనలో ఉన్నారు.వందలాది మంది నిరాశ్రయులతో నిండిన ఆశ్రయ కేంద్రాల్లో పిల్లలకు పాలు పట్టించడానికి, వారిని ఓదార్చడానికి అవసరమైన ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశం కూడా లేదు. ట్రిశూలిలో తన నవజాత శిశువుకు 3 నెలలుగా పాలిస్తున్న పరివార్ అనే మహిళ ఆగస్టు 26న వరద నీరు ఉద్ధృతంగా రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది.ఇప్పుడు భోటేకోశి-ట్రిశూలి మార్గంలో ఉన్న ఓ ఆశ్రయ కేంద్రంలో ఆమె తన బిడ్డకు పాలు ఇస్తోంది. అక్కడ డజన్ల కొద్దీ అపరిచితులు ఉన్నారు. సమీపంలో పురుషులు సిగరెట్లు తాగుతున్నారు. మద్యం వాసన కూడా వస్తోంది. “అందరం ఒకే చోట ఉన్నాం. అందుకే చాలా కష్టంగా ఉంది. సిగరెట్ పొగ, మద్యం వాసన ఉన్నాయి. బిడ్డ నిద్రపోలేకపోతోంది” అని తన ఇంటిపేరుతో మాత్రమే గుర్తించాలని కోరిన పరివార్ చెప్పింది.వరదల తర్వాత ఆమెకు రొమ్ము పాలు తగ్గిపోయాయి. ఆమె పాలపొడిని ప్రయత్నించింది. అయితే అది శిశువు కడుపుకు ఇబ్బంది కలిగించినట్లు కనిపించింది. దాంతో పాలు తాగిన తర్వాత శిశువు మరింతగా ఏడుస్తోంది. “సురక్షితమైన ప్రదేశం ఉండి, ఇక్కడే బిడ్డకు టీకాలు వేయగలిగితే బాగుంటుంది. మాకు సమయానికి ఆహారం కూడా అందడం లేదు. తినడానికి సరిపడా ఆహారం లభించడం లేదు” అని పరివార్ చెప్పింది. -
నేపాల్: జాతీయ జెండా అవనతం.. మృతులకు నివాళులు
కాఠ్మాండు: నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలకు సోమవారానికి 13 రోజులు పూర్తయ్యాయి. ఆగస్టు 26న సంభవించిన ఈ భీకర వరదల్లో ఇప్పటివరకు 1,340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరావడం లేదు. శిథిలాలు, సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సోమవారం నేపాల్ వ్యాప్తంగా జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నారు. మృతులకు నివాళిగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేశారు. వరదల కారణంగా వేలాది కుటుంబాల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.విపత్తు జరిగిన ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద, సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం నేపాల్ సైనిక సిబ్బంది సహా వివిధ బృందాలు శోధిస్తున్నాయి. తమ ఆత్మీయుల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.ఆగస్టు 26న వచ్చిన ఆకస్మిక వరదలు భారీ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,340కిపైగా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు సుమారు 5,000 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం శోధన కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ వివిధ వర్గాల ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mexico: వేడుకల్లో పేలుడు.. 10 మంది మృతి -
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
హిమాలయాల్లో ప్రకృతి విలయం సృష్టించిన ప్రతిసారీ అక్కడి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నేపాల్-చైనా సరిహద్దులో సంభవించిన భారీ వరద కూడా అలాంటి ప్రశ్నలనే ముందుకు తెచ్చింది. ఆగస్టు 26న హిమనదం కూలిపోవడంతో వచ్చిన వరదల్లో నేపాల్‌లోని రసువా ప్రాంతంతోపాటు చైనా వైపున్న గ్యిరాంగ్ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ సరిహద్దు వాణిజ్య కేంద్రం.. ఇప్పుడు బురద, శిథిలాల కుప్పగా మారింది.ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన గ్యిరాంగ్.. చైనా-నేపాల్ ప్రతిపాదిత రైల్వే మార్గంలో కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచే రైల్వే నేపాల్‌లోకి ప్రవేశించి, రసువా మీదుగా కాఠ్మాండూకు చేరేలా ప్రణాళిక ఉంది. చైనా ప్రతిపాదించిన ఈ రైల్వేను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి నేపాల్‌కు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలకు ఇది కీలకమైన మార్గంగా మారుతుందని అంచనా.అంత ఈజీనా?ఖాట్మాండు-గ్యిరాంగ్ రైల్వే ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదు. నేపాల్ పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ పర్వత ప్రాంతం కావడంతో ఇందులో దాదాపు 98.5 శాతం మార్గం సొరంగాలు లేదంటే వంతెనల మీదుగానే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తేల్చింది. అంటే.. రైల్వే పట్టాలు వేయడం కంటే ముందుగా కొండలను తొలిచి సొరంగాలు నిర్మించాలి. లోతైన లోయలపై భారీ వంతెనలు వేయాలి. ఎత్తుల్లో భారీ తేడాలను అధిగమించాలి. దీనికితోడు ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, మట్టి జారిపోవడం వంటి ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం.ప్రాజెక్టుపై 2018లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్ సవాళ్లు ఈ రైల్వేకు అతిపెద్ద అడ్డంకులని పేర్కొంది. అప్పట్లో సుమారు 2.75 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.ఏళ్లుగా సాగుతున్న అధ్యయనాలుచైనా-నేపాల్ రైల్వే ఆలోచన కొత్తదేమీ కాదు. 2016లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో బీఆర్ఐలో భాగమైంది. 2019లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2022లో పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనం మొదలైంది. మార్గం, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లు, నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై చైనా సాంకేతిక బృందం పరిశీలనలు చేసింది. తుది నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా? అనేది తేలనుంది.ఇంతలోనే భారీ విపత్తుఇలాంటి సమయంలోనే ఆగస్టు 26న హిమనదం(గ్లేసియర్) కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి దిగువకు దూసుకొచ్చాయి. నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఆ వరద చైనా వైపు గ్యిరాంగ్ వరకు చేరింది. కీలకమైన సరిహద్దు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఐదు అంతస్తుల కస్టమ్స్ భవనం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో 1,300 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. చైనా వైపు గ్యిరాంగ్లో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఈ విధ్వంసం ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుపై కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. ఒక భారీ వరదతోనే రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులు ఇలా ధ్వంసమైతే.. ఇదే భూభాగంలో నిర్మించబోయే రైల్వే సొరంగాలు, వంతెనలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎలా తట్టుకుంటాయి? అనేదే అసలు ప్రశ్న.రైల్వే కంటే ముందు..తాజా విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టు మార్గాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హిమనదాల కదలికలు, వరదల ప్రవాహ మార్గాలు, భూకంప ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు వంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనాలు అవసరం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవిస్తే రైల్వేకు నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మరోవైపు గ్యిరాంగ్ ప్రాంతం చైనా-నేపాల్ వాణిజ్యానికి కీలకమైన మార్గం. తాజా విపత్తుతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే నిర్మాణానికి ముందే అక్కడి మౌలిక వసతులను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.బీఆర్ఐ అటకెక్కినట్లేనా?అయితే తాజా వరదలతో చైనా బీఆర్ఐ మొత్తం ఆగిపోయిందని చెప్పలేం. కానీ చైనా-నేపాల్ అనుసంధానానికి కీలకంగా భావిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు మాత్రం ప్రకృతి పెద్ద పరీక్ష పెట్టింది. నిర్మాణం ఇంకా మొదలుకాకపోవడం ఒక రకంగా ప్రాజెక్టుకు అవకాశం కూడా. ఇప్పుడు ఎదురైన విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మార్గం, డిజైన్, భద్రతా ప్రమాణాలను మార్చుకునే అవకాశం చైనాకు ఉంది.హిమాలయాల్లో బీఆర్ఐ రైల్వేను ముందుకు తీసుకెళ్లడం అనుకున్నంత సులభం కాదని తాజా ప్రకృతి విపత్తు గట్టిగా చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందా? మార్గంలో మార్పులు వస్తాయా? లేదంటే ప్రకృతి సవాళ్లను అధిగమించేలా భారీ ఇంజినీరింగ్ పరిష్కారాలతో చైనా ముందుకెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: యుద్దం ఎఫెక్ట్.. బూతు కంటెంట్‌తో మరీ ఇంత దిగజారాలా? -
బతికున్నారని.. తిరిగొస్తారని..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడే చేరుకున్నామంటూ సమాచారం ఇచ్చినవారు కొందరు.. ఇందాకే బయలుదేరామంటూ కబురందించినవారు ఇంకొందరు.. ఇంకాసేపట్లో గమ్యం చేరుకుంటామనే మాటచెప్పిన వారు మరికొందరు.. ఆ కొద్దిసేపటికే వారంతా అదృశ్యమయ్యారు. అప్పటి వరకు మాట్లాడిన, సంబంధాలు కలిగి ఉన్నవారు ఆకస్మిక జల ప్రళయంలో నగరానికి చెందిన సుమారు 15 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. గత నెల 26న నేపాల్‌లో హఠాత్ వరదల్లో ఆచూకీ లేకుండాపోయినవారి కుటుంబీకుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇంకా కొన్ని ప్రయత్నాల అనంతరం అదృశ్యమైన వారి స్థితి ఇదంటూ అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం తమవారు బతికున్నారని.. ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ జ్ఞాపకాల్లో కుటుంబాలు.. నగరానికి చెందిన నేపాల్ వరద బాధిత కుటుంబాల్లో ఎవరిని పలకరించినా అదృశ్యమైన వారి జ్ఞాపకాలే వెంటాడుతున్నాయని చెబుతున్నారు. తమవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే రోజులు గడిచిపోతున్నాయని చెబుతున్నారు. విహార/తీర్థ యాత్ర తమకు ఇంతటి విషాదాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని కన్నీంటి పర్యంతమవుతున్నారు. కొందరు కుటుంబీకులు తమ వారి కోసం నేపాల్ వరకు వెళ్లి ఎంతో ఆశతో గాలించి నిరాశతో తిరిగి వచ్చారు. ఆ వరదల్లో తప్పిపోయిన వాళ్లల్లో కొందరు ఇటీవలే వచ్చినట్లు వివిధ రాష్ట్రాల నుంచి వార్తలు వస్తున్నాయని, తమ వాళ్లు కూడా అలానే మృత్యుంజయులు కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆ చిరునవ్వుల కోసం..నాగోలు: నేపాల్ వరదల్లో గల్లంతైన ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసినీ రెడ్డి (44) ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. భారత రాయబార కార్యాలయం అధికారులు ఆమె జాడను కనుగొనాలని తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, ప్రేమలతా రెడ్డి కోరుతున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న భర్త సంజీవరెడ్డి, పెద్ద కుమారుడు భారత్‌కు వచ్చి అనంతరం నేపాల్ వెళ్లారు. భారత రాయబార అధికారులతో మాట్లాడి సుహాసిని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి భారత్‌కు చేరుకున్నారు. సుహాసిని సమాచారం ఇప్పటికీ తెలియకపోవడంతో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’ -
అంతులేని వెతుకులాట
కఠ్మాండు: నేపాల్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తి 11 రోజులు గడిచిపోయాయి. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల గుర్తింపులో అధికారులు ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య దాదాపు 1,400కు చేరుకుంది. 589 మంది విదేశీయులు సహా 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్ ఆదివారం సహాయక, పునరావాస చర్యలపై చర్చించారు. మరోవైపు బాధిత మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకలితో ఉన్న తమ బిడ్డలకు ఆహారం అందించలేకపోతున్నామని చెబుతున్నారు. తల్లులు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సమస్య తలెత్తితే ఆసుపత్రికి ఎలా వెళ్లాలనే దానిపై గర్భిణిలు ఆందోళన చెందుతున్నారు. -
10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!
-
మరో ఇద్దరు మృత్యుంజయులు
కఠ్మాండు: నేపాల్‌లో మరో అద్భుతం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో ఆకస్మిక వరదల వల్ల కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలు చండికా శ్రేష్ట 10 రోజుల తర్వాత సజీవంగా బయటపడింది. సహాయక సిబ్బంది బురద, ఒండ్రు మట్టిని తొలగించి ఆమెను శనివారం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ నెమ్మదిగా స్పృహలోకి రావడం వీడియోలో కనిపిస్తోంది. సహాయక సిబ్బంది ఆమెను దుప్పటి, జాకెట్‌తో కప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలిని చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్లో కఠ్మాండు ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చైనా జాతీయుడు రసువా జిల్లాలో భారీ వరదల ధాటికి ధ్వంసమైన అప్పర్ త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఒక చైనా జాతీయుడిని శనివారం రక్షించారు. అతడిని లూహైటతావోగా గుర్తించారు. వరదల సమయంలో ‘ఆడిట్ టన్నెల్ 4’లో చిక్కుకుపోయాడు. లూహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక సిబ్బందితో కూడిన బృందం కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. సొరంగ మార్గంలో సుమారు 225 మీటర్ల లోపల ఉన్న ఒక ప్రదేశం నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగాల సజీవంగా బయటకు తీసిన కార్మికుల సంఖ్య మొత్తం మూడుకు చేరింది. శుక్రవారం త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్‌లోని ఒక సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు కబిర్ మహర్జన్, సంజయ్ షాను రక్షించిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో పదికిపైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వీరిలో దాదాపు 500 మంది సొరంగాల లోపలే ఉండి ఉంటారని అధికారులు వెల్లడించారు. 1,344కి చేరిన మృతుల సంఖ్య నేపాల్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 1,344కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా బాధితులను రక్షించామని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 758 పెద్దలవి, 85 పిల్లలవి కాగా, 501 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయని తెలిపారు. డీఎన్ఏ సేకరణ సహా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మొత్తం 1,030 మృతదేహాలను ఖననం చేశారు. కేవలం 96 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్
-
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
నేపాల్‌కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉండడంతో హైఅలర్ట్ ప్రకటించారు. దార్చుల్లా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చౌలానీ నదిలోకి మట్టి, రాళ్లు వచ్చిపడి నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో నది దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.చౌలానీని చామెలియా నది అని కూడా పిలుస్తారు. ఇది అపిహిమాల్ ప్రాంతంలో పుట్టి మహాకాళీ నదిలో కలుస్తుంది. మహాకాళీ నది కొంత భాగం నేపాల్–భారత్ సరిహద్దుగా ప్రవహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత కొండచరియలు ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడడం ప్రారంభించాయి. మట్టి, రాళ్లు జారిపడడాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఏదో ప్రళయం వచ్చినట్లు ఆ దృశ్యాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అయితే ఈ ప్రభావంతో నది మరింతగా పూడుకుపోయి పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని దార్చుల్లా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అదే జరిగితే నదీ ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి.. ఒక్కసారిగా తెగిపడి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికనది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో నదికి సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసు, భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించేలా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచారు. Today, a large landslide has partially blocked the Chaulani River in Api Himal Rural Municipality, Darchula District, Sudurpashchim Province, Nepal. Authorities are urging residents downstream to remain alert amid the risk of sudden flooding. pic.twitter.com/7UuxGPsDjg— Weather Monitor (@WeatherMonitors) September 4, 2026పశ్చిమ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖగ్రాజ్ భట్టా కూడా అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించి.. హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తొలగని ముప్పు..అధికారులు చెబుతోంది ఏంటంటే.. చౌలానీ నదిలో ప్రస్తుతం నిన్నటితో పోలిస్తే పర్వాలేదు. నీటి ప్రవాహం సాధారణంగానే ఉంది. అయితే కొండచరియలు ఇంకా విరిగిపడే అవకాశం ఉండటంతో ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు, స్థానికులను అప్రమత్తం చేసేందుకు చామెలియా జలవిద్యుత్ కేంద్ర భద్రతా స్థావరానికి చెందిన సాయుధ పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఇదిలా ఉండగా.. భట్టార్ ప్రాంతంలోని పది కుటుంబాలను ముందు జాగ్రత్తగా బంధువుల ఇళ్లకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారికి టెంట్లు సహా అవసరమైన సామగ్రిని అందించారు. అయితే కొండచరియలు విరిగిపడి.. అక్కడి రహదారులు, ట్రెక్కింగ్ మార్గాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. మరోసారి ప్రకృతి ప్రకోపంఇటీవలే నేపాల్‌లో భారీ ఫ్లాష్‌ఫ్లడ్ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు 1,287 మృతదేహాలను వెలికితీయగా.. మరో 5,083 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ దార్చుల్లాలో తాజా కొండచరియల ఘటన ఆందోళన కలిగిస్తోంది.చౌలానీ నది ప్రవాహానికి కొండచరియలు అడ్డంకిగా మారడంతో.. మరిన్ని కొండచరియలు విరిగిపడి నది పూర్తిగా మూసుకుపోతే ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఫ్లాష్‌ఫ్లడ్ సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: అసలు అక్కడి భూగర్భంలో ఏం జరుగుతోంది? -
ప్రమాదంలో సిక్కిం
నేపాల్‌ను ముంచేసిన మెరుపు వరదలు ఈశాన్య భారత రాష్ట్రం సిక్కింకు మేలుకొలుపుగా మారింది. హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న హిమనీనదం (గ్లేషియర్) అకస్మాత్తుగా కుప్పకూలి 1200 అడుగుల దిగువకు జారిపడటంతో నేపాల్‌లోని త్రిశూలీ నదికి ఆకస్మిక వరద వచ్చిన విషయం తెలిసిందే. సిక్కింలోనూ హిమనీనదాల కారణంగా ఏర్పడ్డ సరస్సులు చాలా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నేపాల్ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుక చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. రాష్ట్రంలోని కనీసం నలభై హిమనదీ సరస్సులు (గ్లేషియల్ లేక్స్)ల పరిస్థితి ఏమంత బాగాలేదని, 16 సరస్సులు నేపాల్‌లో మాదిరిగా కుప్పకూలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఉపగ్రహల ద్వారా వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేందుకు, ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 26న నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో హిమనీనదం కుప్పకూలడంతో వచ్చిన మెరుపు వరదల్లో 1,200 మంది కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇది హిమనదీ సరస్సు కారణంగా ఏర్పడ్డది కాదు. కాకపోతే హిమాలయ పర్వతశ్రేణి మొత్తమ్మీద ఇలాంటి ప్రమాదాలు జరిగేందుకు అవకాశముందని ప్రపంచానికి తెలియజేసింది. భూతాపోన్నతి కారణంగా హిమనీనదాలు కుంచించుకుపోతున్నాయన్న ఆందోళన చాలాకాలంగా వ్యక్తమవుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల వీటి విస్తీర్ణం తగ్గిపోతూండటం, రాత్రి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా కరిగినంత స్థాయిలో నీరు మళ్లీ మంచుగా మారకపోవడాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే.. హిమనీ నదాలు కుంచించుకుపోయినప్పుడు కొత్త కొత్త సరస్సులు ఏర్పడేందుకు, లేదా ఉన్న సరస్సుల్లో మరింత నీరు చేరేందుకూ అవకాశం ఉంటుంది. హిమనీనదాల పరిసరాల్లో లోతట్టుప్రాంతాల్లో ఇలా జరుగుతూంటుంది. దీనివల్ల ప్రమాదం ఏమిటంటే.. దిగువన ఉన్న మట్టి, రాళ్లు వదులుగా ఉంటే ఆ సరస్సు ఎప్పుడైనా ఆకస్మికంగా బద్ధలయ్యే అవకాశం ఉండటం. అంతేకాదు.. చిన్నపాటి భూకంపం కారణంగా ఈ సరస్సుల అడుగున కదలికలు వచ్చినా అంతే సంగతులు. సరస్సుల్లో అప్పటివరకూ చేరిన భారీ మొత్తం నీరు ఒక్కసారిగా కొండల నుంచి కిందకు జారితే జనావాసాల్లో మృత్యుఘంటికలు మోగడం తథ్యం. ముప్పు నీడన లక్షల మంది హిమాలయ పర్వత శ్రేణిలోనే ఉన్న సిక్కింలో కనీసం 40 హిమనదీ సరస్సులతో ముప్పు పొంచి ఉండగా.. పదహారింటి విషయంలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే వీటిని కేటగిరీ–ఏగా వర్గీకరించారు. ముప్పు కొంచెం తక్కువగా ఉన్న కేటగిరీ–బీ సరస్సులు రెండు ఉంటే, తొమ్మిది కేటగిరీ–సీలో ఉన్నాయి. మిగిలిన 14 హిమనదీ సరస్సులను వర్గీకరించలేదు. ఈ సరస్సుల పరిధిలో సుమారు 16 లక్షల మంది నివాసం ఉంటున్నట్లు అంచనా. 2023లో మంగన్, గాంగ్టక్, పక్యాంగ్, నామ్చీ జిల్లాల్లో 2023లో హిమనదీ సరస్సు బద్దలైన కారణంగా కనీసం అరవై మంది ప్రాణాలు కోల్పోగా, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం సంభవించింది. అంతేకాకుండా ఛుంగ్థాంగ్ డ్యామ్ దెబ్బతినడంతో భారీ జలవిద్యుత్తు ప్రా జెక్టు కూడా సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీల సాయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సందీప్ తాంబే చెబుతున్నారు. దీంతోపాటు ప్రమాదాన్ని అంచనా వేసేందుకు, నివారించేందుకు రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నా లజీ విభాగాన్ని నోడల్ కేంద్రంగా మార్చారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
9 రోజులు... 216 గంటలు వరదను జయించిన ఆ ఇద్దరు
కఠ్మాండు: సరిగ్గా 9 రోజులు.. 216 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి.. ఆకలేస్తున్నా తినడానికి తిండి లేదు. దాహమేస్తున్నా తాగడానికి మంచినీరు లేదు. అయినా బతుకుతామన్న ఆశను కోల్పోలేదు. శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తూ రేపటి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. అదృష్టం వారిపైపే ఉంది. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. పవిత్ర పర్వదినం కృష్ణాష్టమి రోజే వారికి పునర్జన్మ లభించడం గమనార్హం. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులోని ఒక సొరంగం నుంచి ఇద్దరు వ్యక్తులను అధికారులు శుక్రవారం రక్షించారు. వారిద్దరినీ ఈ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్న కబిర్ మహర్జన్(45), ఫోర్‌మెన్ సంజయ్ షా(30)గా గుర్తించారు. మహర్జన్ను కఠ్మాండులోని నేపాల్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సంజయ్ షా నువాకోట్‌లోని త్రిశూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సహచరుల ప్రాణాలే ముఖ్యం సెంట్రల్ నేపాల్‌లోని త్రిశూలి నది పరీవాహక ప్రాంతంలో ఆగస్టు 24న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలోకి నీరు చేరింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కబిర్ మహర్జన్, సంజయ్ షా బయటకు రాలేకపోయారు. సొరంగం ముఖద్వారం మట్టితో మూసుకుపోయింది. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది రోజుల అన్వేషణ ద్వారా వారిద్దరూ బయటపడ్డారు. గత తొమ్మిది రోజులుగా సొరంగంలో హరే కృష్ణ మహా మంత్రాన్ని జపిస్తూనే ఉన్నానని సంజయ్ షా భద్రతా సిబ్బందికి చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్నానని తెలిపాడు. ‘‘కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్నప్పుడు అందరి ప్రాణాలను కాపాడటమే నా బాధ్యత. ప్రమాదం తర్వాత అందరినీ బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాను. మొదట నా ప్రాణాల కంటే సహచరుల ప్రాణాలే ముఖ్యమని భావించా. వారు బయటకు వెళ్లేదాకా అక్కడే వేచి చూశాను. నేను తప్పించుకోవడానికి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సొరంగం మూసుకుపోవడంతో నుంచి బయటకు రాలేకపోయాను. సొరంగం లోపల నా చట్టుపక్కల ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించా. వారితో మాట్లాడేందుకు ప్రయతి్నంచా. శబ్దాలు చేయడం ద్వారా సంభాíÙంచగలిగాం. పవర్‌హౌస్ పరిసరాలతో సహా సొరంగం లోపలి భాగంలో మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చు. వారు ఏమైపోయారన్నది తెలియదు. ఆ సొరంగం చాలా పొడవైనది. వరద నీటి ఉధృతికి లోపలున్న కారి్మకులు దూరంగా కొట్టుకుపోయి ఉండొచ్చు. అందరూ క్షేమంగా బయటపడే అవకాశమైతే లేదు’’అని సంజయ్ షా చెప్పాడు. మాధేషి ప్రావిన్స్‌లోని సప్తరి జిల్లాకు చెందిన సంజయ్ షా చాలా రోజులుగా ఈ సొరంగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. నా భర్తకు ఇది పునర్జన్మ: మహర్జన్ భార్య కబిర్ మహర్జన్ ప్రాణాలతో తిరిగిరావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తన భర్తకు పునర్జన్మ లభించిందని మహర్జన్ భార్య హీరా శోభ చెప్పారు. ఆయనను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన రక్షక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రార్థనలు, ఎదురుచూపులు ఫలించాయని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గడచిన తొమ్మిది రోజులు తనకు, తన కుటుంబానికి అత్యంత బాధాకరమైనవని చెప్పారు. తాము సరిగ్గా తినలేకపోయామని, నిద్ర కూడా పోలేదని అన్నారు. తన భర్త బతికే ఉన్నాడని, కచ్చితంగా తిరిగి వస్తాడని విశ్వసించానని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇతర సొరంగాల్లో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది కార్మికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియరావడం లేదు. నేపాల్ సైన్యం నేతృత్వంలోని భద్రతా దళాలు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి గాలింపు, సహాయక చర్యలు సాగిస్తున్నాయి. కబిర్ మహర్జన్, సంజయ్ షాలు చిక్కుకుపోయిన సొరంగం లోపలి నుంచి అరుపులు వినిపించడంతో అతికష్టంమీద వారిని రక్షించగలిగామని అధకారులు వెల్లడించారు. 11 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న 600 మందికిపైగా కారి్మకులు వరదల్లో గల్లంతైనట్లు నేపాల్ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. కబిర్ మహర్జన్, సంజయ్ షాను సజీవంగా టన్నెల్ నుంచి బయటకు తీయడం సహాయక సిబ్బందిలో కొత్త ఆశను రేకెత్తించింది. మరికొందరిని కూడా కాపాడగలమని వారు భావిస్తున్నారు. శాటిలైట్ డేటాతో గుర్తింపు త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రం వద్ద సొరంగంలో ఆచూకీ తెలియకుండా పోయిన 42 మంది కారి్మకుల కోసం డజన్ల కొద్దీ సహాయక సిబ్బంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. వారు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడానికి శాటిలైట్ డేటాను ఉపయోగించారు. ఆ తర్వాత బురద, మట్టిని తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. చేతులతో జాగ్రత్తగా తవ్వడం కొనసాగించడానికి ముందు దారిని సుగమం చేయడానికి పేలుడు పదార్థాలను ప్రయోగించారు. చివరకు ఇద్దరి ఆచూకీ మాత్రం కనిపెట్టగలిగారు. శుక్రవారం తొలుత సంజయ్ షాను సొరంగం నుంచి బయటకు తీశారు. కొద్దిసేపటికే తర్వాత కబీర్ మహర్జన్ను రక్షించారు. బయటకు వచ్చిన తర్వాత సంజయ్ షా అడిగిన మొదటి ప్రశ్న.. ఈ రోజు తేదీ ఏమిటి? అని. అత్యవసర వైద్య చికిత్స కోసం వారిద్దరినీ విమానంలో రాజధాని కఠ్మాండులోని సైనిక ఆసుపత్రికి తరలించారు. సంజయ్ షా పరిస్థితి నిలకడగా ఉండగా, మహర్జన్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను కాపాడిన సిబ్బంది న్యూఢిల్లీ: నేపాల్–భూటాన్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదల్లో గల్లంతైన ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను శుక్రవారం నువాల్కోట్ జిల్లా త్రిశూలి బజార్ ప్రాంతంలో సహాయక సిబ్బంది కాపాడారు. వీరిని అభిజిత్ సురేశ్ పవార్, దీపికా అభిజిత్ పవార్, సమర్థ్ అభిజిత్ పవార్‌గా గుర్తించామని విదేశాంగ శాఖ తెలిపింది. కఠ్మాండులోని భారత రాయబారి కార్యాలయం వీరిని విమానంలో స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించింది. దీంతో సురక్షితంగా బయటపడిన భారతీయుల సంఖ్య 166కు చేరుకుంది. మరోవైపు, 275 మంది భారతీయుల జాడ తెలియాల్సి ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు.చైనా నుంచి నేపాల్‌లోకి 1,907 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారని పేర్కొన్నారు. టిబెట్‌లో చిక్కుకుపోయిన వారిలో భారతీయులెవరూ లేరని చైనా ప్రభుత్వం తెలిపిందని జైశ్వాల్ వెల్లడించారు. 1,295కి చేరిన మృతుల సంఖ్య నేపాల్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 1,295కి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఎనిమిది వేర్వేరు జిల్లాల్లో ఇప్పటివరకు 1,293 మృతదేహాలను వెలికితీశారు. చిత్వాన్ జిల్లాలో 359, తూర్పు నవల్పరాసిలో 221, పశి్చమ నవల్పరాసిలో 212, నువాకోట్‌లో 186, రసువాలో 140, గోర్ఖాలో 72, ధాడింగ్‌లో 65, తనాహులో 38 మృతదేహాలను వెలికితీశారు. శుక్రవారం కఠ్మాండులో రెండు వేర్వేరు ఆసుపత్రులలో వరద బాధితులు ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,295కు చేరింది. ఇప్పటివరకు 13,093 మందిని రక్షించారు. మరో 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నేపాల్‌లో సహాయక చర్యలకు భారతదేశం మద్దతు ఇస్తోంది. భారత్ నుంచి ఫోరెన్సిక్ కిట్లు, వైద్య సామగ్రితో సహా 21.5 టన్నుల సహాయక సామగ్రితో విమానాలు గురువారం రాత్రి కఠ్మాండుకు చేరుకున్నాయి. -
‘ఆ మంత్రమే నన్ను బతికించింది’.. నేపాల్ టన్నెల్ రెస్క్యూలో అద్భుతం!
ఖాట్మండ్: హిమాలయాలను ముంచెత్తిన జలప్రళయం నేపాల్‌ను తీవ్ర అల్లకల్లోలానికి గురిచేసింది. ఈ విలయం మధ్య త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్లో సాగిన మృత్యుపోరాటం ప్రతీ ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది. ఊపిరాడని ఆ మృత్యుకూపంలో, తిండి నీరు లేక 9 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడిన ఇద్దరు కార్మికులు అద్భుత రీతిలో సురక్షితంగా బయటపడ్డారు. ఆ చీకటి నరకంలో నిరంతరం జపించిన ఆ పవిత్ర మంత్రమే తనను బతికించిందంటూ బాధితుడు కన్నీటిపర్యంతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆగస్టు 26 నేపాల్-టిబెట్ సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన తీవ్రమైన కొండచరియలు, మంచుచరియలు విరిగిపడటంతో ఉత్తర, మధ్య నేపాల్ తీవ్రమైన ఆకస్మిక వరదల్లో చిక్కుకుంది. లంగ్టాంగ్ జాతీయ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ ప్రవాహం త్రిశూలి నది నుంచి దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించి దారంతా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.రసువా, నువాకోట్, దాడింగ్, గోర్ఖా, తనాహున్, చిత్వాన్ జిల్లాలు ఈ వరద ధాటికి సర్వనాశనమయ్యాయి. గైరోంగ్-కేరుంగ్ సరిహద్దు పోర్ట్, రోడ్లు, వంతెనలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్స్ కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలు బురద, శిథిలాల కింద పూడుకుపోయాయి. అయితే, టన్నెల్లో విధి నిర్వహణలో ఉండి చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక ఊహించని అద్భుతం జరిగింది! మృత్యుకూపంగా మారిన త్రిశూలి 3ఏ ప్రాజెక్ట్ టన్నెల్ శిథిలాల నడుమ నుంచి ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్తుపోయేలా చేసింది.రెస్క్యూ టీమ్స్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బురద తొలగించి, టన్నెల్ సందు గుండా 30 ఏళ్ల మెకానికల్ ఫోర్మన్ సంజయ్ షా, 45 ఏళ్ల మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్ లను బయటకు తీశాయి. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో భయటపడడంపై సంజయ్ షా స్పందించారు. రెస్క్యూ సిబ్బంది ‘నన్ను కాపాడినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ అని భావోద్వేగానికి గురయ్యాడు. కబీర్ మహర్జన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లో ఖాట్మండ్ సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ సందర్భంగా సంజయ్ షా తనకు ఎదురైన భయానక క్షణాలను వివరిస్తూ..‘నేను కంట్రోల్ రూమ్‌లో ఉన్నప్పుడు వరద నీరు ఒక్కసారిగా టన్నెల్లోకి దూసుకొచ్చింది. నా బాధ్యత ఇతరుల ప్రాణాలు కాపాడటం. అందుకే అందరినీ వెంటనే బయటకు పరిగెత్తమని కేకలు వేశాను. అందరూ సురక్షితంగా బయటకు వెళ్లేలా చూసే క్రమంలో నేను వెనకబడిపోయాను. అప్పటికే టన్నెల్ ద్వారాలన్నీ నీరు, బురదతో పూర్తిగా మూసుకుపోయాయి.చీకటి, తాగునీరు, ఆహారం లేని ఆ 9 రోజులూ నన్ను బతికించింది కేవలం దైవచింతనే. నిరంతరం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నాను’ అని అన్నారు. విశేషమేమిటంటే వారు సురక్షితంగా బయటపడిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి కావడం విశేషం.తనకు సమీపంలో మరో 3-4 మంది కార్మికుల శబ్దాలు వినబడ్డాయని, అయితే టన్నెల్ చాలా పొడవుగా ఉండటంతో పవర్‌హౌస్ వైపు మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని సంజయ్ చెప్పాడు. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, సశస్త్ర సీమా బల్, భారత టన్నెల్ నిపుణుల బృందాలు సంయుక్తంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో టన్నెల్లోకి ప్రవేశించి మిగిలిన వారి కోసం సహాయక చర్యలను మరింత వేగవంతం చేశాయి. -
నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..
-
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
నేపాల్ ఆకస్మిక వరదతో వేలమంది గల్లంతైన వేళ.. అద్భుత ఘటన చోటుచేసుకుంది. శిథిలాలతో పూర్తిగా కూరుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా రక్షించగలిగారు. దీంతో సహాయక బృందాల్లోనే కాకుండా.. గల్లంతైన వారి కుటుంబాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.త్రిశూలి ప్రాంతంలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల కారణంగా టన్నెల్ ప్రవేశ మార్గం మట్టి, బురద, శిథిలాలతో మూసుకుపోయింది. అప్పటి నుంచి లోపల చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇద్దరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు గుర్తించి.. వారిని బయటకు తీసుకొచ్చారు.వాళ్ల పేర్లు కబీర్ మహార్జన్ (45), సంజయ్ షా (30)గా నేపాల్ హోంమంత్రి సుదన్ గురుంగ్ వెల్లడించారు. కబీర్ మహార్జన్ త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తుండగా.. సంజయ్ షా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో మెకానికల్ ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు టన్నెల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడటం వారి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది.TWO MEN RESCUED ALIVE AFTER 9 DAYS IN NEPAL TUNNELSanjay Sah and Kabir Maharjan were rescued alive from the Trishuli 3A hydropower tunnel, nine days after the August 26 flash flood. Rescuers heard voices inside and are continuing the search for others who may remain trapped. pic.twitter.com/ttV3RKbdtd— Subodh Kumar (@kumarsubodh_) September 4, 2026ఓ పొడి గదిలో ఉండడంతో.. వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారని రెస్క్యూ టీం వెల్లడించింది. సంజయ్ షాను బయటకు తీసుకువచ్చే సమయానికి ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరని సమాచారం. వెంటనే అతడిని బట్టార్ ప్రాంతానికి విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కబీర్ మహార్జన్ స్పృహలోనే ఉన్నారని ఆయన భార్య తెలిపారు. ఆయనను ఖాట్మాండులోని ఛావునీ మిలటరీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇద్దరు కార్మికులను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బురదతో పూర్తిగా తడిసిపోయిన ఓ కార్మికుడిని రక్షక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లారు. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన సమయంలో అతడి చేతులు జోడించి ప్రార్థిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తొమ్మిది రోజుల పాటు చీకటి, బురద మధ్య ప్రాణాలతో పోరాడి బయటపడటం నిజంగా అద్భుతమేనని పలువురు పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. నేపాల్‌లోని మరికొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కూడా భారీగా కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు అరడజను టన్నెళ్లలో 150 మందికిపైగా చిక్కుకుని ఉండొచ్చని అంచనా. మొత్తం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 500 మంది టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని గుర్తించి రక్షించేందుకు ఇంజినీర్లు టన్నెళ్లలోకి గాలిని పంపుతున్నారు. ఆగస్టు 26న సంభవించిన ఈ భారీ విపత్తు నేపాల్‌లోని పలు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేసింది. హిమనదం(గ్లేసియర్) కూలిపోవడం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,259 మంది మృతి చెందగా.. 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. టన్నెల్ నుంచి ఇద్దరు సజీవంగా బయటపడటంతో.. ఇంకా ఎక్కడైనా చిక్కుకున్న వారు ఉంటే వారిని కూడా క్షేమంగా రక్షించవచ్చన్న ఆశలు బలపడ్డాయి.ఇదీ చదవండి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న నేపాల్! -
నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు
-
స్నాక్స్ కోసం దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చిన విద్యార్థులు
కాఠ్మాండు: రాసువాలో సంభవించిన తీవ్ర భోటెకోషి వరదల బాధితులను ఆదుకునేందుకు నేపాల్ అంతటా పాఠశాల విద్యార్థులు తమ స్నాక్స్ డబ్బులు, జేబు ఖర్చుల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ సాయం కొనసాగుతున్న వేళ ఈ చిన్నారులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇళ్లు కొట్టుకుపోవడం, కుటుంబాలు విడిపోవడం, పాఠశాలలు దెబ్బతినడం వంటి దృశ్యాలను టెలివిజన్‌లో చూసిన పలువురు పిల్లలు.. విపత్తు ప్రాంతానికి దూరంగా ఉన్నా తమకు చేతనైనంత సాయం చేయాలని ముందుకొచ్చారు.అచ్ఛామ్, కపిలవస్తు నుంచి రౌతహట్, కాఠ్మాండు వరకు విద్యార్థులు నేపాలీస్ రూపీ 5 నుంచి 500 వరకు విరాళాలు ఇచ్చారు. కొందరు ఒక రోజు చిరుతిండి తినకుండా ఆ డబ్బును అందించారు. వారి విరాళాలను ప్రధానమంత్రి సహాయ నిధి, ప్రధానమంత్రి ప్రకృతి విపత్తు సహాయ నిధిలో జమ చేశారు. వరదల కారణంగా దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం చోటుచేసుకున్న సమయంలో ఈ విరాళాలు అందాయి.అచ్ఛామ్లోని మంగల్సేన్ మున్సిపాలిటీ-5లో ఉన్న షోడశ మాధ్యమిక పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి యూనిక్ కీసీ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కాఠ్మాండు పోస్ట్ కథనం ప్రకారం.. సోమవారం సుమారు 1,500 మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించే విద్యార్థుల ఆధ్వర్యంలోని బాల క్లబ్ సభ్యులు పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడి వీడ్కోలు కార్యక్రమంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వరదల వల్ల ప్రభావితమైన పిల్లలకు ఏదైనా చేయాలని యూనిక్ సూచించారు. దీంతో ఇళ్లు, బంధువులు లేదా విద్యను కోల్పోయిన పిల్లల కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.“మా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా ఏదో ఒకటి చేయగలమని అనిపించింది” అని యూనిక్ చెప్పినట్లు కథనం పేర్కొంది. విద్యార్థులు అన్ని తరగతి గదులకు వెళ్లి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరారని యూనిక్ తెలిపారు. విరాళాలు నేపాలీస్ రూపీ 5 నుంచి నేపాలీస్ రూపీ 500 వరకు వచ్చాయి. “మాలో కొందరికి ఇది సాధారణంగా చిరుతిండి కోసం ఖర్చు చేసే డబ్బును ఉపయోగించి వరదలతో ప్రభావితమైన విద్యార్థులకు సాయం చేయడమనే అర్థం” అని 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ షాహీ చెప్పారు.తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన విద్యార్థులు కూడా విరాళాలు ఇచ్చారు. “తల్లిదండ్రులను కోల్పోయిన మా 7 మంది స్నేహితులు కూడా విరాళం ఇచ్చారు. మా లాంటి విద్యార్థులకు సాయం చేయాలనుకున్నాం” అని షాహీ చెప్పారు.బాల క్లబ్ మొదటి రోజు నేపాలీస్ రూపీ 8,785, రెండో రోజు నేపాలీస్ రూపీ 5,470 సేకరించింది. దీంతో మొత్తం విరాళం నేపాలీస్ రూపీ 14,255కు చేరింది. ఉపాధ్యాయుడు ధన్ కుమార్ కీసీ ఈ మొత్తాన్ని బుధవారం రాష్ట్రీయ వాణిజ్య బ్యాంకు ద్వారా ప్రధానమంత్రి సహాయ నిధిలో జమ చేసినట్లు తెలిపారు. “విరాళం పెద్దదా, చిన్నదా అన్నది ముఖ్యం కాదు” అని కీసీ చెప్పారు. విద్యార్థులే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, “నేను వారికి సహకారం మాత్రమే అందించాను” అని ఆయన తెలిపారు.చాలా ప్రాంతాల నుంచి స్పందన మంగల్సేన్-1లోని ప్రగతిశీల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా ఇదే విధంగా స్పందించారు. ఒక్క రోజు చిరుతిండి కోసం తెచ్చుకున్న డబ్బును వారు విరాళంగా ఇచ్చారు. ఉపాధ్యాయుడు హిమ్మత్ బహదూర్ రావల్ తెలిపిన ప్రకారం వారు నేపాలీస్ రూపీ 585 సేకరించి సహాయ నిధిలో జమ చేశారు.కపిలవస్తులో ధర్మన్పానియాలోని రాష్ట్రీయ జనహిత్ మాధ్యమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల సోమ్య ఉపాధ్యాయ్ బుధవారం చిరుతిండి కోసం సాధారణంగా ఇచ్చే డబ్బు కంటే NPR 20 ఎక్కువగా ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగారు. ఆ రోజు ఆమెకు లభించిన నేపాలీస్ రూపీ 50 మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల రాధిక కోహర్ నేపాలీస్ రూపీ 30 విరాళంగా ఇచ్చారు. ఇద్దరు బాలికలు తమ చిరుతిండి తినకుండా ఆ డబ్బును విరాళపు పెట్టెలో వేశారు.తర్వాత ఉదయం ప్రార్థనా సమావేశం అనంతరం వారి సహచర విద్యార్థులు నేపాలీస్ రూపీ 5 నుంచి నేపాలీస్ రూపీ 100 చొప్పున విరాళాలు ఇచ్చారు. దీంతో నేపాలీస్ రూపీ 10,050 సేకరించారు. ఈ మొత్తాన్ని అనంతరం ప్రధానమంత్రి ప్రకృతి విపత్తు సహాయ నిధిలో జమ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ కోహర్ తెలిపిన ప్రకారం 350 మంది విద్యార్థుల్లో 200 మందికి పైగా విరాళం ఇచ్చారు. “విద్యార్థులే విరాళపు పెట్టెను తయారు చేసుకుని తరగతి గదుల నుంచి తరగతి గదులకు వెళ్లి తమ స్నేహితులను విరాళాలు ఇవ్వాలని కోరారు” అని ఆయన తెలిపారు.కాగా, బుధవారం మధ్యాహ్నం నాటికి ప్రధానమంత్రి సహాయ నిధిలో నేపాలీస్ రూపీ 7.77 బిలియన్లు జమ అయ్యాయి. ప్రభుత్వ డాలర్ ఖాతాలో సుమారు యూఎస్డీ 6 మిలియన్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా పిల్లలు కూడా తమ రోజువారీ ఖర్చుల్లో కొంత భాగాన్ని వదులుకుని ఇళ్లు, కుటుంబాలు, తరగతి గదులను కోల్పోయిన ఇతర పిల్లలకు సాయం చేస్తూ విస్తృత సహాయక చర్యల్లో తమ వంతు భాగస్వామ్యం అందించారు. -
ది వారియర్: 97 ఏళ్ల వయసులో ప్రాణం మీద ఆశే బతికించింది!
nepal flash flood నేపాల్‌లో ఆగస్టు 26వ తేదీ సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ కొన్ని వందల మందిని రక్షించినప్పటికీ భయంకరమైన వరదల్లో ఇప్పటివరకు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా బురదలో చిక్కుకున్న 97 ఏళ్ల వృద్ధురాలి గుణా మాయా బొహారా (Guna Maya Bohara) బయ JCB ఎక్స్కవేటర్ బకెట్లో సురక్షితంగా బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.అత్యంత తెగువతో ఈ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడి ధైర్యానికి గొప్ప సంకేతంగా నిలిచారు.నువాకోట్‌లోని దేవీఘాట్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆశ్రమంలోని ఏడుగురు వృద్ధులు మరణించగా, ప్రాణాలతో బయటపడిన బొహారా సహా మిగిలిన వృద్ధులను ఖాట్మండులోని తాత్కాలిక పునరావాస కేంద్రానికి విమానంలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెకు తీవ్రమైన ఒత్తిడి రుగ్మత (acute stress disorder) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ‘‘ఆ నీళ్ళు నన్నేఎందుకు ముంచెత్తాయి?" అనే ప్రశ్నను బొహారా అమాయకంగా, తీవ్రమైన ఆవేదనతో పదే పదే అడుగుతూనే ఉన్నారని ఆమె సమీప బంధువు దీపక్ చెప్పారు.ఇదీ చదవండి: స్త్రీవాద దిగ్గజం, రచయిత్రి కన్నుమూతనాలుగు గంటలపాటు.. తల ఎత్తివరద వచ్చిన సమయంలో బొహారా తన గదిలోనే ఉన్నారు. ఆమెకు ముందు నుంచే కాళ్లు పనిచేయవు. దీనికి తోడు ఉధృతమైన నీటి ప్రవాహం వల్ల ఆమె చేతికి గాయమైంది, కానీ బ్రతకాలన్న సంకల్పమే ఆమెను ముందుకు నడిపించింది. ధైర్యపడకుండా గది కిటికీ తెరిచి, నీటిమట్టానికంటే ఎత్తుగా తన తలను ఉంచుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక వాలంటీర్లు 4 గంటల తర్వాత వచ్చి ఆమెను బురద నుంచి రక్షించారు. మరోవైపు రాబోయే ప్రళయం గురించి తమను ఎవరూ సకాలంలో హెచ్చరించలేదని మరో వృద్ధుడు వాపోయారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలుబోహరాకు బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉన్న రోజుల్లో ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. వయసు తన భర్త కంటే 81 సంవత్సరాలు ఎక్కువ జీవించారు. ఆమెకు పిల్లలు లేరు.పెళ్ళైన ఎనిమిదేళ్ళకు తన భర్తను, ఆ తర్వాత నాలుగేళ్ళకు తన తల్లిదండ్రులిద్దరినీ; మరికొంత కాలానికి తన ఏకైక సోదరుడిని ఇలా ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి, తన రక్త సంబంధీకులలో దాదాపు అందరినీ ఆమె కోల్పోయింది. ఆమె భర్త కుటుంబం, అతని ముగ్గురు సోదరులు, వారి భార్యలు, కాలక్రమేణా వారి పిల్లలు మాత్రమే మిగిలారు. ఆమె పదమూడు మంది మేనల్లుళ్ళను, పన్నెండు మంది మేనకోడళ్ళను సొంత పిల్లల్లా పెంచింది. ఆ కుటుంబంలో ఆ తరంలో మిగిలి ఉన్న చివరి వ్యక్తి బోహారా. ఇదీ చదవండి: రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్కాగా నేపాల్ వరదల్లో ఇప్పటివరకు 1,252 మంది మరణించగా, 4,216 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ, సహాయక బృందాలు జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. -
వరదల్లో అదృశ్యమై.. వారం తర్వాత వచ్చాడు!
బుట్వాల్: నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన పెను వరదల నుంచి పల్పా జిల్లాకు చెందిన బోమ్ బహదూర్ సోమ్ ప్రాణాలతో బయటపడ్డారు. 10వ తేదీ ఉదయం రసువాలో అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రవాహం క్షణాల వ్యవధిలోనే ప్రజలను, భవనాలను ముంచెత్తింది. సోమ్ పనిచేస్తున్న ఆర్వీ డిపార్ట్మెంట్ స్టోర్ భవనంతో పాటు అందులోని వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. కొండలపైకి పారిపోవడం ద్వారా తాను ప్రాణాలు దక్కించుకున్నానని, ఆపై పునరావాస కేంద్రంలో ఉండిపోవడంతో మొబైల్ నెట్వర్క్ లేక కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయానని ఆయన తెలిపారు.మొబైల్ ద్వారా సమాచారం లభించకపోవడంతో పల్పాలోని ఆయన కుటుంబంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆచూకీ గల్లంతైన 11 మంది జాబితాలో సోమ్ పేరును చేర్చి, పల్పా జిల్లా యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. వరదలు వచ్చిన ఐదు రోజుల తర్వాత ఆయన ఎట్టకేలకు కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగారు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన ఆయన, మూడేళ్ల క్రితం ఆ ఉద్యోగం వదిలి ఆర్వీ స్టోర్‌లో స్టోర్‌కీపర్‌గా చేరారు. మార్కెట్ మొత్తం కొట్టుకుపోవడంతో అక్కడ చేయడానికి పని కూడా లేకుండా పోయింది.కుటుంబానికి సమాచారం ఇచ్చినప్పటికీ తిరుగు ప్రయాణం సులువుగా సాగలేదు. ఎన్నో ఇబ్బందుల నడుమ ఖాట్మాండు చేరుకోగా, కృష్ణభీర్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. అనంతరం కొందరు యువకులతో కలిసి బస్సులో హెటౌడా మీదుగా పల్పా చేరుకున్నారు. వరద సంభవించిన ఏడు రోజుల తర్వాత ఆయన స్వగ్రామానికి చేరుకుని మిత్రులను కలుసుకున్నారు. ‘అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడి ఇంటికి వచ్చాను; బతికుండటమే గొప్ప విషయం’ అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పల్పా జిల్లా యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 11 మంది జాబితా నుంచి ఇద్దరి పేర్లను తొలగించగా, మరో తొమ్మిది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వరదల్లో గల్లంతైన పల్పా నివాసి, నేపాల్ పోలీసు ఏఎస్సై దీపేంద్ర బిష్త్ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇది కూడా చదవండి: శవాలు దొరక్క.. గడ్డి బొమ్మలకు దహన సంస్కారాలు -
శవాలు దొరక్క.. గడ్డి బొమ్మలకు దహన సంస్కారాలు
గోర్ఖా (పాలుంగ్తార్): నేపాల్‌లోని భోటేకోశీ వరదల్లో గల్లంతైన వారి మృతదేహాలు లభించకపోవడంతో బంధువులు దర్భలతో (కుశ గడ్డి) ప్రతీకాత్మక మానవ ఆకారాలను తయారుచేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గోర్ఖా జిల్లా పాలుంగ్తార్లోని చేపే, మర్శ్యాంగ్దీ నదుల సంగమ తీరంలో ఈ విషాదకర దృశ్యాలు కనిపించాయి. ఆగస్టు 10న నౌఖోర్ నుంచి గోసాయింకుండ పుణ్యక్షేత్రానికి 31 మంది యాత్రికులతో వెళ్తున్న వాహనం నువాకోట్‌లోని భైంసే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఐదుగురు వాహనం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకోగా, మిగిలిన 26 మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు నౌఖోర్ గ్రామానికి చెందినవారే.ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో, స్థానిక పురోహితుల సూచన మేరకు గడ్డితో బొమ్మలు తయారు చేసి, వాటికి బార్లీ పిండిని పూసి శవాలుగా భావించి వేదమంత్రాల మధ్య దహన సంస్కారాలు జరుపుతున్నారు. బుధవారం నాటికి ఆరుగురికి దహన సంస్కారాలు పూర్తికాగా, శుక్రవారానికల్లా మిగిలిన వారందరికీ క్రతువులు ముగించేలా గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని 20 కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ప్రయాణికులను కాపాడేందుకు చివరి వరకు స్టీరింగ్‌ను నియంత్రించేందుకు యత్నించి గల్లంతైన డ్రైవర్ సాగర్ దేవ్కోటాకు ఆయన ఐఏళ్ల కుమార్తె దహన సంస్కారాల్లో నిప్పు పెట్టింది. కడసారి చూపునకైనా తమవారి భౌతికకాయాలు దక్కలేదని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్‌కు జపాన్ దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు.. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్!
హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది. వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్ఏటీ (VSAT) కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.పాత వ్యవస్థ ఏమైంది?ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్‌లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది.మొబైల్ నెట్వర్క్ పోయినా..కొత్త వ్యవస్థలో వీఎస్ఏటీని కీలకంగా ఉపయోగించనున్నారు. భారీ విపత్తుల సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోయినా.. ఉపగ్రహం ద్వారా పర్యవేక్షణ కేంద్రాలు అధికారులతో అనుసంధానంలో ఉండేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేసి, ప్రజలకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపేలా వ్యవస్థను రూపొందించనున్నారు.ఇంకా 4 వేల మంది మిస్సింగ్ఆగస్టు 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదకు నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. రెండు దేశాల్లో కలిపి కనీసం 1,114 మంది మరణించగా.. దాదాపు 4 వేల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధిక మరణాలు నేపాల్‌లోనే నమోదయ్యాయి.41 నిమిషాల ఆలస్యం.. ప్రాణాల మీదకుఈ విపత్తులో హెచ్చరిక వ్యవస్థ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఒక అంశం స్పష్టం చేస్తోంది. వరదకు దారితీసిన మంచు, రాళ్ల విరిగిపాటు ఉదయం సంభవించినప్పటికీ.. అధికారిక హెచ్చరిక ప్రజలకు చేరేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచిపోయాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో 10–15 నిమిషాల ముందస్తు సమాచారం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా మారుతుంది.చైనాతో మరింత డేటా షేరింగ్ఇకపై చైనాతోనూ విపత్తు సమాచారాన్ని మరింత వేగంగా పంచుకునే దిశగా నేపాల్ అడుగులు వేస్తోంది. హిమనదుల కదలికలు, నీటి మట్టాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులపై రియల్‌టైమ్ సమాచారాన్ని పొందేందుకు సహకారం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా ఉపగ్రహ చిత్రాలు, నీటి మట్టం–ప్రవాహ సమాచారం, ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రమాదాలపై వివరాలను పంచుకున్నట్లు సమాచారం.కొన్ని నిమిషాలైనా.. ప్రాణాలు కాపాడొచ్చు!కొత్త వ్యవస్థ వల్ల భారీ విపత్తును పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రమాదాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి హెచ్చరికలు పంపగలిగితే.. ప్రజలను, సరిహద్దు సిబ్బందిని, సహాయక బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి జరిగిన ఘోర వైఫల్యం తర్వాత నేపాల్ హడావుడిగా పాత వ్యవస్థ స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మాత్రం మరో విపత్తు వచ్చినప్పుడు హెచ్చరించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: నేపాల్ వరదలే కాదు.. భూకంపాలకూ కారణం ఇదే! -
దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
-
నేపాల్ నెత్తిన మరో జలఖడ్గం
కఠ్మాండు: మెరుపు వరద బురదతో జలమయమైన నేపాల్ దిగువ ప్రాంతాలపై మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు స్థానికుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం దాటికి ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో జనజీవనం కకావికలంకాగా మరోసారి అపార జలరాశి వరదరూపంలో వచ్చి పడే ఆస్కారముందని నేపాల్ వాతావరణ శాఖలోని వరద అంచనాల విభాగం బుధవారం హెచ్చరికలు జారీచేసింది. సింధూరి జిల్లాలో సున్ కోశి నది, గూర్ఖా జిల్లాలో బుధి గండకీ నది, దదేల్ధురా జిల్లాలో మహాకాళీ నది, లామ్జుంగ్ జిలాల్లో మార్షా్యంగ్డి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు వరద అంచనాల విభాగం ప్రకటించింది. దిగువ ప్రాంతాల ప్రజలు జనావాసాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలుచేసింది. భుకుందేబేసీ వాటర్ లెవల్ మానిటరింగ్ కేంద్రంలో మంగళవారం రాత్రి 11.15 గంటలకే నది డేంజర్ మార్క్‌ను దాటేసింది. మార్షా్యంగ్డి నదిలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే వినాశనం సృష్టించిన వరద విలయంలో మృత్యువాత పడిన వారి సంఖ్య బుధవారానికి 1243కు పెరిగింది. మరో 4,216 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షం, బురద మధ్యే భవన శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆశతో అన్వేషణ బృందాలు కాలంతో పోటీపడుతూ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. 1,113 మృతదేహాల గుర్తింపు, చట్టపర ప్రక్రియ పూర్తయిందని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. 21,314 మంది సైనికులు, పోలీసులు, వలంటీర్లు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే రాసువా, నువాకోట్‌లో కురుస్తున్న భారీ వర్షం సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తోంది. వర్షపు నీరు చేరుతుండటంతో జలవిద్యుత్కేంద్ర సొరంగంలో అన్వేషణ ఆగిపోయిందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల సొరంగాల్లో అన్వేషణకు భారత్, చైనా, ద.కొరియా నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయి. వాతావరణ మార్పులతోనే దారుణం: ప్రధాని సంపన్న దేశాలు వాతావరణంలోకి భారీగా విడుదలచేస్తున్న కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పుల కారణంగానే హిమానీనదాలు అమిత వేగంగా కరిగిపోతూ కొత్త ఉత్పాతాలను తీసుకొస్తున్నాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆరోపించారు. బుధవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆయన మాట్లాడారు. ‘‘భోటె కోశీలో వరద రావడానికి ప్రత్యక్షంగా వాతావరణమార్పులు(క్లైమేట్ చేంజ్) కారణమని నిపుణులు తేల్చేశారు. అంతర్జాతీయ సమాజానికి మేం చెప్పేదొక్కటే. మేం అనుభవిస్తున్న ఈ బాధలకు వాతావరణ మార్పులే కారణం.ప్రపంచ దేశాలతో పోలిస్తే నేపాల్ గ్రీన్హౌస్ వాయువులను అత్యల్పంగా విడుదలచేస్తుంది. కానీ ఇతర దేశాలు చేసిన పాపాలకు మేం బలవుతున్నాం’అని అన్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్‌కు ప్రధాని బాలేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కాఠ్మండులో సోనూ సూద్ సాయం కోవిడ్ సంక్షోభం వేళ భారీ సంఖ్యలో కరోనా బాధితులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటారు. కాఠ్మండుకు పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ‘‘ఇక్కడి వాళ్లకు సరిపడా సరకులు, ఆహారం, దుప్పట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరదతో సర్వం కోల్పోయిన వాళ్లకు మళ్లీ పాత జీవితాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు. -
Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!
-
నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో
-
నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు
-
‘బతికించమని అడుక్కోవాలా?’.. నేపాల్‌లో రెస్క్యూ తీరిదీ!
నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటుతున్నా.. వేల మంది జాడ లేకుండా పోయింది. నేపాల్ సైన్యంతో పాటు భారత్, చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అన్వేషణలో సాయం చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లుతుండడం.. ఇప్పటికే బురద దట్టంగా పేరుకుపోయి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తరుణంలో సొరంగాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. నేపాల్ ఆకస్మిక వరదల్లో 4 వేల మంది జాడ తెలియరావడం లేదు. ఇందులో సుమారు 1000 మంది సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. దీంతో ఆ టన్నెళ్లకు రంధ్రాలు చేసి.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. అయితే బోర్‌హోల్ కెమెరాలతో సొరంగాల పరిశీలనలో కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వాళ్లంతా కొట్టుకుపోయి ఉంటారా? లేదంటే వాటిల్లోనే సమాధి అయ్యారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సహాయక చర్యలు నత్తనడకన సాగుతుండడంపై బాధిత కుటుంబాలు నేపాల్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రసువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ కేంద్రంలో సుమారు 40 మంది నెపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ‘ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నాం.. అసలు రెస్క్యూ ఎప్పుడు?’ అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓ ఇంజినీర్ భార్య. తన భర్తతో పాటు 40 మంది ఉద్యోగులు త్రిశూలీ-3ఏ ప్రాజెక్టులో చిక్కుకున్నారని ఆమె తెలిపారు. ఈ జలవిద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటని చెప్పడంతో.. లోపలున్న వారంతా క్షేమంగానే ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోందన్నారు. సమాచారం కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. కొందరు టన్నెల్ వద్దకు కూడా వెళ్లారు. ఎవరి నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు అని వాపోయారామె.ప్రకటనలకే పరిమితమా?చైనా, భారత్ నుంచి రెస్క్యూ బృందాలు వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆమె ఆరోపించారు. ‘చైనా, భారత్ బృందాలు వెళ్లాయని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క జేసీబీ కూడా అక్కడికి చేరలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తీవ్రత, మట్టి, శిథిలాల పరిస్థితి తెలిసి ఆరు రోజులైనా.. సొరంగాల్లోకి వెళ్లేందుకు అవసరమైన భారీ యంత్రాలు, టన్నెల్ కట్టర్లు ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. రోజుకో రెస్క్యూ బృందం వచ్చిందంటూ ప్రకటనలు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదన్నారు.‘ఈ రోజు.. రేపు అంటూ ఆరు రోజులు’రెస్క్యూ బృందాలు వస్తున్నాయని, మంత్రులు ఘటనాస్థలికి వెళ్తున్నారని, చైనాతో సమన్వయం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలు కూడా ‘ఈరోజు కాకపోతే రేపైనా మా వాళ్లు బయటకు వస్తారు’ అని ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘ఇలా ఆశ పెట్టుకుని ఆరు రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి గంటా, ప్రతి క్షణం భారంగా మారింది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.‘వాళ్ల ప్రాణాలతో ఆటలు ఆడాలా?’రెస్క్యూ చర్యల పురోగతిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పది మీటర్లు వెళ్లాం.. 20 మీటర్లు వెళ్లాం అని చెబుతున్నారు. ఇది ఏంటి? మనం వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నామా? లేక ఆటలు ఆడుతున్నామా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ఒక్కరి విషయం కాదు. 40 కుటుంబాల ప్రాణాల సమస్య. వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ప్రభుత్వానికి తెలుసా?’ అని నిలదీశారు.తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రుల పాలయ్యారని తెలిపారు. ‘ఆయన వ్యక్తిగత పని కోసం అక్కడికి వెళ్లలేదు. దేశం కోసం పని చేయడానికి వెళ్లారు. మరి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ప్రాణాలు కాపాడమని మేము మీడియా ముందు వేడుకోవాలా?’ అని ఆమె ప్రశ్నించారు.వందలాది మంది ఉద్యోగులు గల్లంతునేపాల్లో వరదల కారణంగా మరికొన్ని హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. అప్పర్ త్రిశూలీ-1 ప్రాజెక్టు వద్ద 550 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (ఐపీపీఏఎన్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్కడ 254 మందిని సురక్షితంగా రక్షించినప్పటికీ.. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.అప్పర్ త్రిశూలీ-3బీ ప్రాజెక్టులో 122 మంది, లాంగ్టాంగ్ ఖోలా ప్రాజెక్టులో 41 మంది, చిలిమే హైడ్రోపవర్ ప్రాజెక్టులో ఎనిమిది మంది, మెయిలంగ్ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. రసువాగఢి హైడ్రోపవర్ ప్రాజెక్టులోనూ 93 మంది ఆచూకీ తెలియడం లేదు. చైనా, దక్షిణ కొరియా, భారత్‌కు చెందిన బృందాలు నేపాల్ సైన్యంతో కలిసి పలు ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబాల ఆందోళన మరింత పెరుగుతోంది.అధికారులు ఏం చెబుతున్నారు?మరోవైపు.. సహాయక చర్యల్లో తామేమీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని అక్కడి అధికారులు అంటున్నారు. సొరంగాల్లోకి చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు. భారీ బురద, నీరు, రాళ్లు, శిథిలాలు మార్గాన్ని పూర్తిగా మూసేశాయని.. కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్, భారీ యంత్రాల సాయంతో మార్గాన్ని క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. చైనా, భారత్ తదితర దేశాల నిపుణుల సహకారంతో పరిస్థితిని అంచనా వేసి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: భారత్ మాకు పరిహారం చెల్లించాల్సిందే.. నేపాల్ డిమాండ్ -
Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..
-
నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!
-
నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)
-
నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధిత ఫ్యామిలీ ఆవేదన
-
‘ఒక్క పెయింటింగ్ కొని.. వరద బాధితులను ఆదుకోండి’
కఠ్మాండు: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు కఠ్మాండులోని పలు ఆర్ట్ గ్యాలరీలు వినూత్న రీతిలో ముందుకొచ్చాయి. కళాకారుల పెయింటింగ్‌లను విక్రయించి, ఆ నిధులతో బాధితులకు ఆహారం, తాగునీరు, ఆశ్రయం కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.ఆగస్టు 26న భోటేకోశి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు రసువా, నువాకోట్, దాదింగ్ జిల్లాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా, ఇళ్లు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితుల సహాయార్థం దర్బార్ మార్గ్‌లోని ‘గ్యాలరీ 108’ సంస్థ ‘ఆర్ట్ కెన్ డూ మోర్’ పేరుతో పెయింటింగ్ విక్రయాలను చేపట్టింది. కళాకారులు విరాళంగా అందజేసిన దాదాపు 20 చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. రూ.6,000 నుంచి రూ.50,000 వరకు ధర గల ఈ కళాఖండాల ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల నిధులు సమకూరినట్లు సంస్థ వ్యవస్థాపకుడు సుగత్ రత్న శాక్య తెలిపారు.చిత్రాలు అమ్ముడుపోగానే ఆ మొత్తాన్ని నేరుగా ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి జమ చేస్తున్నారు. కఠ్మాండులో లేనివారు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చని, అమ్ముడుపోని కళాఖండాలను నవంబరు 30 వరకు ప్రదర్శనలో ఉంచి అనంతరం కళాకారులకు తిరిగి అందజేస్తామని వివరించారు. అలాగే థామెల్లోని ‘ది కలా సెలూన్’ గ్యాలరీ సైతం ఈ తరహా సహాయ కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీలంక కళాకారుడు డాక్టర్ మనోరంజన హేరత్ బండార, స్థానిక కళాకారిణి జెన్నీ డాంగోల్ అందజేసిన చిత్రాల విక్రయం ద్వారా ఆగస్టు 31 నుంచి ఇప్పటివరకు రూ.20,000 సేకరించినట్లు వ్యవస్థాపక డైరెక్టర్ సోఫియా ఎల్ పాండే వెల్లడించారు.బాధితుల సహాయార్థం ప్రతి విక్రయానికి సంబంధించిన బ్యాంక్ బదిలీ రసీదును కొనుగోలుదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. కళాఖండాలను కొనుగోలు చేయలేని వారు ఆహారం, దుస్తులు, సౌర ఫలకాలు, టార్పాలిన్ల వంటి వస్తు రూపేణా సహాయం అందించవచ్చని గ్యాలరీ నిర్వాహకులు సూచించారు. నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వ్యక్తిగత ఖాతాలకు నగదు పంపకుండా, గుర్తింపు పొందిన సహాయ సంస్థలకే అందించాలని దాతలకు సూచించారు. ఆసక్తి గల దాతలు సోషల్ మీడియా, ఫోన్ ద్వారా తమను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: గణేశ్ ఉత్సవాలకు కళ్లు చెదిరే ఏర్పాట్లు -
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్ సరికొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. తాము తక్కువ స్థాయిలోనే కార్బన్ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘ఇది పర్వత సునామీ’చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’వాతావరణంలోకి నేపాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్‌లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.‘సాయం కాదు.. న్యాయం’ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?వాతావరణ మార్పులపై నేపాల్ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్ కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్ చేశాయన్నమాట. అయితే.. అయితే నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్‌గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్ చేస్తుంటే.. నేపాల్ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్‌కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్‌గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్ జస్టిస్–లాస్ అండ్ డ్యామేజ్’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా? -
నేపాల్ వరదల్లో వేయి దాటిన మ*రణాలు
కఠ్మాండు: నేపాల్ దిగువ ప్రాంతాలపై జలఖడ్గంతో దండయాత్ర చేసిన వరద విలయం ధాటికి జల సమాధి అయిన అమాయకుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 1,050కి పెరిగింది. భోటె కోశీ, త్రిశూలి నదీ ప్రవాహాల వెంట ఉన్న 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 12,000 మందిని కాపాడినప్పటికీ అన్వేషణ, సహాయక చర్యల్లో ఇంకా గుట్టలకొద్దీ మృతదేహాలు బురద మట్టిలో బయటపడుతున్నాయి. భద్రపరిచేందుకు సరిపడా ఫ్రీజర్లు లేక, బురదకొట్టుకుపోయిన దారుల్లో తరలించే ఆస్కారం లేక కొన్ని మృతదేహాలను సమీప కొండల్లోనే బుల్డోజర్లతో గోతులు తీసి కప్పేస్తున్నారు.మరోవైపు ఆస్పత్రుల వద్ద మృతదేహాలు తమ వారివేనంటూ ఒకరికి మించి ఎక్కువ మంది బంధువులు రావడంతో అధికారులు మృతదేహాలతోపాటు అందరి డీఎన్ఏ శాంపిళ్లను తీసుకుంటున్నారు. దీంతో మృతదేహాల అప్పగింత సైతం ప్రహసనంగా మారింది. అంతెత్తున్న దూసుకొచి్చన బురద వరదలో గల్లంతైన వారి సంఖ్య మంగళవారానికి 4,400 దాటింది. వీరిలో 600 మందిదాకా విదేశీయులు, 83 మంది పోలీసులు, సైనికులు, సాయుధ సిబ్బంది ఉన్నారు. 5 జిల్లాల్లో 16 లక్షల మంది మెరుపు వరదలకు తీవ్రంగా ప్రభావితులయ్యారు.బురద మట్టిని తొలగిస్తూ భారత సొరంగ నిపుణుల బృందం ఎట్టకేలకు ఛిలిమి సొరంగం, లాంగ్‌టాంక్ సొరంగంలో 185 మీటర్ల మేర లోపలికి వెళ్లేందుకు దారి సిద్ధంచేయగల్గిందని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో 163 మంది భారతీయులను కాపాడి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ తెలిపారు. వేర్వేరు చోట్ల నదుల ప్రవాహ ఉధృతిని ప్రత్యక్షంగా చూసేందుకు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అధికారులు బిగించారు. తాజా పరిస్థితిపై నేపాల్ ఇందన శాఖ మంత్రి విరాజ్ భక్త శ్రేష్ట సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్వేషణ, సహాయక చర్యల్లో 21,300 మంది నిమగ్నమయ్యారు. -
కెప్టెన్ ఆన్ డ్యూటీ...
కనుచూపుమేర భీకర దృశ్యాలు... బాధితుల ఆర్తనాదాలు... బురద ప్రవాహంలో కొట్టుకుపోతున్న గ్రామాలు... భయంకరంగా విరిగి పడుతున్న కొండచరియలు... ఎటు చూసినా కల్లోలమే! ఇటువంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తనప్రాణాలను సైతం పణంగా పెట్టి సహాయక చర్యలు చేపట్టారు నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 100 రెస్క్యూ మిషన్లు పూర్తి చేసి, వందలాది మంది బాధితులను సురక్షితప్రాంతాలకు చేర్చి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెస్క్యూ మిషన్‌లో తన అనుభవాల గురించి ఆమె మాటల్లోనే...2015లో నేపాల్‌లో వచ్చిన భూకంపం కంటే భయంకరమైనది ఈ విపత్తు. నేను గగనతలం నుంచి చూసిన దృశ్యాలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కలవరపరిచాయి. జలవిద్యుత్ప్రాజెక్టులు, ఇళ్లు, రోడ్లు.. ఒక్కటేమిటి సమస్తం కొట్టుకు పోయాయి. 2015లో వచ్చిన భారీ భూకంపం కంటే కూడా ఈ వరదల తీవ్రత చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ విపత్తులో రసువా జిల్లాలోని తిమురే అనే గ్రామం పూర్తిగా దెబ్బతింది. అక్కడి నుంచి బాధితులను సురక్షితప్రాంతాలకు తరలించడం మాకు అతిపెద్ద సవాలుగా మారింది.ఆపని ఇంజిన్లుఈ రెస్క్యూలో రాత్రింబవళ్లు సుమారుగా 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఒకే ల్యాండింగ్ పాయింట్‌కు ఒకేసారి అనేక హెలికాప్టర్లు రావడం వల్ల ఆపరేషన్ నిర్వహణ మాకు అత్యంత కష్టంగా మారింది. అలా ఇబ్బంది వచ్చినపుడు మేము వైర్లెస్ సాధనాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాము. మరోవైపు నేలపై మోకాలు లోతున ఉన్న చిక్కటి బురద కారణంగా హెలికాప్టర్లను నిలపడం మాకు కష్టంగా మారింది. దాంతో ఇంజిన్లను ఆపకుండానే క్షణాల వ్యవధిలో బాధితులను ఎక్కించుకుని సురక్షితప్రాంతాలకు చేర్చాము. ఆర్మీ ఆగస్టా హెలికాప్టర్లతో కలిపి తిమురే గ్రామం నుంచే మొదటి రెండు రోజుల్లో 200 మందికి పైగా బాధితులను రక్షించాం. ఇప్పటికీ అక్కడ చాలామంది ఆచూకీ తెలియడం లేదు. అలసట మాయంనాకు సుదీర్ఘ కాలంగా పర్వతప్రాంతాలలో విమానాలు నడిపిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఈ భీకర విపత్తు తీవ్రత నాకు సవాల్‌గా నిలిచింది. వరుసగా విమానాలు నడపడం వల్ల మేమంతా తీవ్ర అలసటకు గురయ్యాము, కానీ నేలపై ఆశగా చేతులు ఊపుతున్న బాధితులను చూసినప్పుడు ఆ అలసట అంతా మాయమయ్యేది. వారిని రక్షించడమే మానసికంగా నాకెంతో బలం చేకూర్చింది. వరదల్లో చిక్కుకుని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించి రక్షించిన ప్రియా అధికారి సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎయిర్ హోస్టెస్ టు ఎవరెస్ట్ పైలట్40 ఏళ్ల ప్రియా అధికారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పట్టా పొందిన ఆమె, మొదట్లో ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్ప్రారంభించారు. కానీ విమాన యానంపై కలిగిన ఆసక్తితో ఫిలిప్పీన్ ్స వెళ్లి పైలట్ శిక్షణలో చేరారు. 2017 నాటికి ఆమె పూర్తిస్థాయి కెప్టెన్ గా మారారు. ఆ తరువాత హిమాలయాలలోని ఎతై ్తనప్రాంతాలలో సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో శిక్షణ పొందారు. ఎవరెస్ట్ పర్వతంపై దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి గాయపడిన పర్వతారోహకులను రక్షించిన ఘనత ఆమె సొంతం. -
నేపాల్ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం
ఆపదలోఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు సోనూ సూద్. తాజాగా నేపల్ విలయం సమయంలో కూడా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందడుగు వేశారు. కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు సాయం అందించేందుకు రానున్న కాలంలో కూడా పనిచేస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నేపాల్ వరద బాధితులకు సహాయం అందించేందుకు సోనూ సూద్ ఖాఠ్మండు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను కలిసి, వారికి సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి ఇక్కడి వచ్చామన్నారు. వారు తిరిగి సామాన్య జీవితాన్ని గడిపేలా తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద మొత్తంలో దుప్పట్లు, ఆహారాన్ని బాధితులకు అందించేందుకు తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే నెలల్లో కూడా నేపాల్‌కు సహాయం అందేలా చూసేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం విశేషం.Nepal, you are not alone. We are coming with food, shelter and the strength to help you rebuild. 🇳🇵❤️— sonu sood (@SonuSood) August 26, 2026నేపాల్‌లో ప్రకృతి విపత్తు గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేసిన సోనూ సూద్ సాయం చేస్తానని అప్పుడే మాట ఇచ్చారు. "నేపాల్, నీవు ఒంటరివి కావు.. మీకు అండగా నిలిచి, తిరిగి కోలుకోవడంలో సహాయపడేందుకు ఆహారం, ఆశ్రయం మరియు ధైర్యంతో వస్తున్నాం అంటూ ట్విట్ చేయడం గమనార్హం. #WATCH | Bollywood actor Sonu Sood arrives in Kathmandu to distribute relief to Nepali flood victimsHe says, "We are here to meet flood victims and to distribute relief material to them. We will try to build their lives again. We have brought a lot of blankets and food… pic.twitter.com/6rONSZfxjD— ANI (@ANI) September 1, 2026 > ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? కాగా భారతదేశంలో కోవిడ్ మహమ్మారి పంజా విసిరిన సమయంలో సోనూసూద్ ఎంతోమందికి అండగా నిలబడ్డారు. లాక్డౌన్ కాలంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కృషి చేశారు. ఇదే కాలంలో స్మార్ట్‌ఫోన్ లేక ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేని పేద విద్యార్థులకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అర్థించిన ఎంతోమందికి సాయం చేసిన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి : 6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి? -
నేపాల్ వరద బీభత్సం : మృత్యువుని చూసి వచ్చాం!
Nepal Flash Floods నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన అస్సాంకు చెందిన ఎనిమిది మంది కార్మికులు క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదే రాష్ట్రానికి చెందిన మరో ఎనిమిది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ సందర్భంగా ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు తమకెదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీరంతా నేపాల్‌లోని 'అప్పర్ త్రిశూలి-1' హైడ్రోపవర్ ప్రాజెక్టు' (Upper Trishuli-1 Hydropower Project) లో పనిచేస్తున్నారు. నేపాల్ అధికారులు , అస్సాం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల ద్వారా సురక్షితంగా ప్రాణాలతో బయటపడి ఆదివారం రాత్రి అస్సాం చేరుకున్నారు. సురక్షితంగా తిరిగొచ్చినవారుపంకజ్ బర్మన్, గోపాల్ చాంద్ దేబ్నాథ్, గౌతమ్ దాస్, సమర్ బెజ్బారువా, సర్విషన్ మరక్, సనేశ్వర్ నర్జారీ, సిల్వా మరక్ , ఎలిప్సన్ సంగ్మా ఆదివారం రాత్రి అస్సాం చేరుకున్నారు.ఇదీ చదవండి : 6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?భయానక అనుభవంవరద నీరు, శిథిలాలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ కార్మికుల కష్టాలు మొదలయ్యాయి. పెద్ద శబ్దం వినపడటంతో కార్మికులు కొండలపైకి పరుగులు తీశారు. దాదాపు రెండు రోజుల పాటు ఆహారం, తాగునీరు లేకుండా అక్కడే గడిపారు. చివరకు నేపాల్ సైనిక హెలికాప్టర్లు కొండపై ఉన్న వీరిని గుర్తించి వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు అందించాయి. ఆ తర్వాత వారిని ఖాట్మండుకు తరలించి, అక్కడి నుండి అస్సాం ప్రభుత్వం సహాయంతో భారతదేశానికి రప్పించారు.నల్బారీకి చెందిన పంకజ్ బర్మన్ మాట్లాడుతూ,పెద్ద శబ్దం వినడంతో ఏదో తీవ్రమైన ప్రమాదం జరిగిందని గ్రహించి తమ బృందం కొండల వైపు పరుగెత్తిందని, కొండ పైభాగానికి చేరి, ఆ తర్వాత కనీస అవసరాలు కూడా లేకుండా అక్కడే గడపాల్సి వచ్చిందని చెప్పారు హోజాయ్‌కి చెందిన గౌతమ్ దాస్ మాట్లాడుతూ ఈ భయంకరమైన అనుభవాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. మృత్యువును చాలా దగ్గరగా చూశాను, ఏదోలా ప్రాణాలతో బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?మరో 8 మంది గల్లంతువిపత్తు సమయంలో అస్సాంకు చెందిన 16 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఎనిమిది మంది క్షేమంగా తిరిగొచ్చినప్పటికీ, మిగిలిన ఎనిమిది మంది సమాచారం ఇంకా తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధితుల కుటుంబాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. గల్లంతైన వారికోసం నేపాల్ అధికారులతో కలిసి శోధన చర్యలు కొనసాగుతున్నాయి. -
ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు
-
6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?
Priya Adhikari నేపాల్ దేశంలోనే తొలి మహిళా రెస్క్యూ హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి (40) నేపాల్ విలయంలో ఎంతోమంది పాలిట ఆపద్బాంధవురాలిగా నిలిచారు. దేశంలోనే ఏకైక మహిళా రెస్క్యూ హెలికాప్టర్ పైలట్‌గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె, నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యల్లో సమయస్ఫూర్తితో వందలాదిమందికి ప్రాణ భిక్ష పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ప్రియా అధికారి పేరు ఇపుటు నెట్టింట మారు మోగిపోతోంది.హిమాలయాలలో గాలింపు, సహాయక చర్యల్లో రోజుల తరబడి తలమునక లవుతూ తన నిబద్ధతను చాటుకున్నారు. వారం రోజుల్లో ప్రియా అధికారి దాదాపు 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించి వందలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీవ్ర అలసట ఉన్నప్పటికీ తామున్నది దీని కోసమే అంటూ ప్రమాదకర పరిస్థితులను కూడా లెక్క చేయకుండా బాధితుల కోసం ముందుకు సాగడం విశేషం.భయంకర పరిస్థితులు: రెస్క్యూ ఆపరేషన్లు2015లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం కంటే ఈ వరదల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రియా తెలిపారు. ఐదు జలవిద్యుత్ ప్రాజెక్టులు, అనేక గ్రామాలు కొట్టుకుపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రసువా జిల్లాలోని తిమురే (Timure) గ్రామంలో బురద ఎక్కువగా ఉండటంతో ఇంజిన్ ఆపకుండానే (రన్నింగ్ పవర్‌పై) హెలికాప్టర్లను ల్యాండ్ చేస్తూ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె బాధితులను రక్షించారు. ఈ విపత్తు తీవ్రత తన ఎత్తైన ప్రదేశాలలో సహాయక చర్యల అనుభవాన్ని సైతం పరీక్షించిందని ఆమె ఒక మీడియా ఇంటర్వ్యూలో పేర్కొనడం ఈ వరద ముప్పు తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు.🇳🇵🚁 Nepal’s first female helicopter captain Priya Adhikari has flown 100+ flood rescue missions. 🫡❤️In the face of danger, she continues to fly toward those who need help most - showing extraordinary courage, strength, and dedication.Her story is not just inspiring; it is a…— Ananda Nepali (@anandanepali99) September 1, 2026ఇదీ చదవండి: కుమార్తెల చదువు కోసం ఓ తల్లి తెగింపు...చెప్పుల్లేకుండానే! ఎవరీ ప్రియా అధికారి?ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివి, ఐదేళ్లపాటు క్యాబిన్ క్రూగా పనిచేసిన ఆమె ఫిలిప్పీన్స్‌లో శిక్షణ పొంది 2017లో ఫుల్-టైమ్ పైలట్‌గా మారారు. హిమాలయాలలో, మౌంట్ ఎవరెస్ట్‌పై గాయపడిన పర్వతారోహకులను రక్షించడంతో సహా అనేక సహాయక మిషన్లలో పాల్గొన్నారు.దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది. మహిళలు హెలికాప్టర్ కెప్టెన్ కాలేరనే అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ నేపాల్ మొదటి మహిళా హెలికాప్టర్ కెప్టెన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. హెలికాప్టర్లో ఆనందకరమైన ప్రయాణం చేసే అవకాశం లభించిందని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ టేకాఫ్ సమయంలో తాను పొందిన ఉత్సాహమే, దీన్ని వృత్తిగా ఎంచుకోవడానికి తనను ప్రోత్సహించిందని కూడా తెలిపారు. ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? -
నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..
-
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఒకటైన నాసా–ఇస్రో సంయుక్త నిసార్ ఇప్పుడు ఏం చేస్తోంది?. నేపాల్ విపత్తు విషయంలో అది ఏదైనా సమాచారం సేకరించిందా? లేదంటే నిద్ర పోతోందా?. ఆకస్మిక వరదలు, మంచు, నీరు, రాళ్లు, బురద కదలికలతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ విపత్తుకు సంబంధించి నిసార్ ఏం గుర్తించింది? దాని డేటా ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.సుమారు 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన నిసార్(NISAR)ను భూమిపై జరిగే మార్పులను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో గుర్తించేలా ఇస్రో-నాసాలు దీనిని అభివృద్ధి చేశాయి. హిమనదులను(గ్లేసియర్ల) పర్యవేక్షించడం, భూభాగ కదలికలను గుర్తించడం, కొండచరియలను అధ్యయనం చేయడం, భూకంపాలను పరిశీలించడం, విపత్తుల నిర్వహణకు కీలక సమాచారం అందించడం దీని లక్ష్యాలు. ముఖ్యంగా హిమనదులు, క్రియాశీల టెక్టానిక్ ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రమాదకరంగా మారుతున్న హిమాలయాలు.. నిసార్ పరిశీలనకు కీలక ప్రాంతాల్లో ఒకటి.మరి నిసార్ ఎక్కడ?నేపాల్ రసువా జిల్లాలో గ్లేసియర్ కూలిపోవడం, మంచు, నీరు, రాళ్లు, బురద భారీగా పొటెత్తడంతో విపత్తు తలెత్తింది. నిసార్ రూపొందించిన ప్రధాన లక్ష్యాల్లోనే ఇలాంటి హిమనదులు, కొండచరియలు, భూభాగ మార్పులను పరిశీలించడం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విపత్తుకు సంబంధించి నిసార్ కనీస అంచనా, హెచ్చరిక సమాచారం లేదంటే కీలక శాస్త్రీయ విశ్లేషణ అనేవి ఏవీ కూడా పబ్లిక్ డొమైన్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. నిసార్ ప్రస్తుతం కక్ష్యలో ఉండి క్రమం తప్పకుండా డేటా సేకరిస్తుంటే.. నేపాల్ విపత్తుకు సంబంధించి అదసలు ఏం గుర్తించిందన్నది ఆసక్తికరంగా మారింది.నాసా-ఇస్రో చెప్పేది ఇదే..నాసా ప్రకారం.. నిసార్ విపత్తులను ట్రాక్ చేయడం, పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం, హిమనదులు, మంచు ప్రాంతాలను అధ్యయనం చేయడం, భూమి ఉపరితలం ఎలా మారుతోందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రాణాలను రక్షించేందుకు, ప్రకృతి వనరుల నిర్వహణకు అవసరమైన సమాచారం అందుతుందని నాసా పేర్కొంది. ఇస్రో కూడా నిసార్ ప్రతి 12 రోజులకు ప్రపంచంలోని భూభాగం, మంచుతో కప్పబడిన ప్రాంతాలను చిత్రీకరిస్తుందని తెలిపింది. ‘కదలికలు గుర్తించగలం’నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన నిసార్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త పాల్ రోజెన్ ఇంతకు ముందు నిసార్ సామర్థ్యాలను వివరించారు. భూమి, మంచు కదలికలను త్రీడీ రూపంలో అధ్యయనం చేయగలమని, భూకంపాలకు ముందు.. భూకంపాల సమయంలో.. ఆ తర్వాత భూమి కదలికలను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కొలవచ్చని తెలిపారు. అంతేకాదు.. కొండచరియలు విరిగిపడటానికి ముందు చోటుచేసుకునే కదలికలను గుర్తించగలమని, హిమనదుల కదలికలను పర్యవేక్షించడం ద్వారా గ్లేషియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (GLOF) ముప్పులను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరించారు.ఏడాది క్రితమే ఆపరేషన్స్ ప్రారంభంనిసార్ కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఆగస్టు 4న బెంగళూరులో నాసా, ఇస్రో సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఉపగ్రహం సాధించిన పురోగతి, శాస్త్రీయ ఫలితాలు, డేటా పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ కరెన్ ఎం. సెయింట్ జర్మెయిన్.. భూమి వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి నిసార్ అందిస్తున్న భారీ స్థాయి డేటా ప్రాధాన్యాన్ని వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అటవీ బయోమాస్, నేల తేమ, పంటలు, సముద్ర ఉపరితల గాలులు, మడ అడవులు, అటవీ మార్పులు, భూభాగ మార్పులు వంటి అంశాల్లో నిసార్ అప్లికేషన్లను వివరించారు.వెనెజువెలా భూకంప టైంలో..నిసార్ ఇప్పటికే విపత్తుల విశ్లేషణలో ఉపయోగపడిందనడానికి ఉదాహరణగా నిలిచాయి. జూన్ 24న వెనెజువెలాలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని రోజులకే నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిసార్ డేటాతో రూపొందించిన మ్యాప్‌ను విడుదల చేసింది. భూకంపాల కారణంగా భూభాగం ఎంత మేరకు కదిలిందో ఆ మ్యాప్ చూపించింది. అత్యవసర నిర్వహణ అధికారులు, శాస్త్రవేత్తలకు ఇది ఉపయోగకరమైన సమాచారాన్ని అందించిందని నాసా తెలిపింది.అయితే నేపాల్ విషయంలో ఎందుకు?నేపాల్ విపత్తుపై మాత్రం నిసార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ విశ్లేషణ వెలువడలేదు. దీంతో కొన్ని కీలక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. విపత్తుకు ముందు ప్రాంతంలో భూభాగ కదలికలను నిసార్ గుర్తించిందా? గ్లేసియర్లలో ఏవైనా అసాధారణ మార్పులను నమోదు చేసిందా? విపత్తుకు దారితీసిన ప్రక్రియలకు సంబంధించి నిసార్ డేటాలో ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ జరిగిందా? జరిగితే ఆ వివరాలను ఎందుకు బయటపెట్టలేదు? అనేదే ఆ ప్రశ్నలు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నిసార్ ప్రతి వరద, కొండచరియలు, హిమనదులు కుప్పకూలిపోవడం, భూకంపాన్ని ముందుగానే హెచ్చరించే పూర్తిస్థాయి ఆపరేషనల్ వార్నింగ్ ఉపగ్రహం కాదు. దీని ప్రధాన లక్ష్యం భూమి, మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించడం, ఆ డేటాను శాస్త్రీయ విశ్లేషణకు అందించడం. అలాగే నిసార్‌లో సాంకేతిక వైఫల్యం జరిగిందన్న ఆధారాలు కూడా ఇప్పటివరకు లేవు.‘డేటా తీస్తుంది.. విశ్లేషించేది మనుషులే’అయితే నేపాల్ విపత్తు తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ రోజెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. నిసార్ డేటాను సేకరిస్తుంది కానీ దాన్ని విశ్లేషించేది శాస్త్రవేత్తలేనని చెప్పారు. ఇలాంటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు అవసరమైన దీర్ఘకాలిక డేటా సిరీస్‌ను నిసార్ ఇప్పుడిప్పుడే సేకరిస్తోందన్నారు. అలాగే హిమాలయ ప్రాంతమంతటా సాధారణ, అసాధారణ కదలికలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ టూల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని.. అలాంటి వ్యవస్థలు సిద్ధమైన తర్వాతే ప్రమాదాలను అంచనా వేసే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. నిసార్ ఈ తరహాలో పనిచేసే తొలి ఉపగ్రహం కావడంతో దాని డేటా, సామర్థ్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.డేటా మాత్రం అందుబాటులోకి రావాల్సిందేనిసార్ నుంచి సేకరించే డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిక్ ఆర్కైవ్‌లో అందుబాటులో ఉంచేందుకు నాసా, ఇస్రో అంగీకరించాయి. అందువల్ల నేపాల్ విషాదం నేపథ్యంలో నిసార్ డేటాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిసార్ కక్ష్యలో ఉంది.. డేటాను సేకరిస్తోంది. అయితే ఈ ఉపగ్రహం నేపాల్ విపత్తు విషయంలో ఏం చూసింది? ఏం గుర్తించింది? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.బహుశా శాస్త్రీయ విశ్లేషణలు జరుగుతుండొచ్చు.. డేటాను ధ్రువీకరించేందుకు సమయం పడుతుండొచ్చు. అలాగే హిమాలయాల్లోనే ఇంతటి విపత్తు చోటుచేసుకున్న నేపథ్యంలో.. నిసార్ సేకరించిన డేటా ఇప్పుడు అత్యంత కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. విపత్తుకు ముందు అక్కడ ఏం జరిగింది? హిమనదులు, భూభాగ కదలికల్లో ఏవైనా అసాధారణ మార్పులు నమోదయ్యాయా?.. నిసార్ డేటా సమాధానం చెబుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కార్లు మాట్లాడుకుంటే.. యాక్సిడెంట్లే జరగవట! -
ఇది సాధారణ ఘటన కాదు: ప్రధాని బాలేంద్ర షా
కఠ్మాండు: నేపాల్‌లోని భోటేకోషి-త్రిశూలి నదుల్లో వరదలు వచ్చి నేటికి ఏడు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాసం, మృతదేహాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి బాలేంద్ర షా మీడియాకు వివరించారు. టిబెట్ సరిహద్దులో బుధవారం సంభవించిన భీకర వరద సాధారణ సంఘటన కాదని, ఇది పూర్తిగా వాతావరణ మార్పుల వల్ల సంభవించినదని ఆయన పేర్కొన్నారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్‌లో ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిమాలయ ప్రాంతంలో మంచు, హిమపాతం కారణంగా సంభవించిన అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల్లో ఇది ఒకటని ఆయన అభివర్ణించారు.ప్రాజెక్టుల సొరంగాల్లో వందలాది కార్మికులుకాగా జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో వందలాది మంది కార్మికులు చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారని ప్రధాని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో కొందరు విదేశీ నిపుణులు కూడా భాగస్వాములవుతున్నారన్నారు. వరదల కారణంగా నేపాల్‌లో ఇప్పటివరకు 900 మందికి పైగా మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. సుమారు 4,000 మంది ఆచూకీ గల్లంతైంది. రసువాలో ఏర్పడిన ఒక హిమ సరస్సు పరిమాణం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తి దృష్టి సారించిందని ప్రధాన వెల్లడించారు.987కి చేరిన మృతుల సంఖ్యనేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ మంగళవారం ఉదయం అందించిన సమాచారం ప్రకారం, భోటేకోషి వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 987కి చేరింది. ఇంకా 3,916 మంది ఆచూకీ గల్లంతైనట్లు ప్రవక్త శాంతి మహత్ తెలిపారు. సోమవారం ఉదయం వరకు 2,500 మందికి పైగా గల్లంతయినట్లు చూపిన గణాంకాలు, మధ్యాహ్నానికి అకస్మాత్తుగా 4,200 దాటాయి. క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందడంలో ఆలస్యం కావడం వల్లే ఈ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. మృతదేహాలు దొరికినప్పటికీ చాలా వరకు ఇంకా గుర్తింపు (సనాఖత్) కాలేదని, దీనివల్ల మృతులు మరియు గల్లంతైన వారి సంఖ్యలో కొన్నిసార్లు పునరావృతం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ డేటాను మరింత శాస్త్రీయంగా నిర్వహించడానికి జిల్లాలన్నింటినీ అనుసంధానిస్తూ కొత్త యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.గ్యాస్ ట్యాంకర్లు వెళ్లేందుకు మార్గం లేక..పృథ్వీ హైవేలోని కృష్ణభీర్ వద్ద రహదారి కుంగిపోవడంతో కాట్మండు లోయ వెలుపలి ప్రాంతాలలో ఎల్పీ గ్యాస్ సిలిండర్లను నింపే ఏర్పాట్లు చేశారు. గ్యాస్ ట్యాంకర్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో, లోయ, పొరుగు జిల్లాల్లోని 16 గ్యాస్ పరిశ్రమలు.. బారా, పార్సా, చిత్వన్, మక్వాన్పూర్, నవల్పరాసి జిల్లాల పరిశ్రమలతో సమన్వయం చేసుకుని అక్కడే సిలిండర్లు నింపి చిన్న వాహనాల ద్వారా రవాణా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాయి. కాట్మండు లోయలో మొత్తం వినియోగంలో 40 శాతానికి పైగా గ్యాస్ అవసరమని నేపాల్ ఎల్పీ గ్యాస్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు దేవాన్ చంద్ తెలిపారు.ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలుభోటేకోషి, త్రిశూలి వరదల్లో మరణించిన వారి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు రసువా నుండి నవల్పరాసి పశ్చిమం వరకు ఎనిమిది జిల్లాలలో మృతదేహాలు వెలుగుచూశాయి. నేపాల్ పోలీసుల వెబ్సైట్ ప్రకారం, సోమవారం నాటికి మృతుల సంఖ్య 951కి చేరింది. కాగా, అత్యధికంగా చిత్వన్ జిల్లాలోనే 282 మృతదేహాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసులు మొదటి రోజు నుంచే సహాయక చర్యలు, రోడ్లపై అడ్డంకులను తొలగించడం, జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.నేడు అఖిలపక్ష సమావేశంభోటేకోషి, త్రిశూలి నదుల వరదల వల్ల జరిగిన నష్టం, గల్లంతైన వారి అన్వేషణ, సహాయక చర్యలు, పునరావాస అంశాలపై చర్చించేందుకు నేడు(మంగళవారం) అఖిలపక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2:00 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.ఇది కూడా చదవండి: దీక్ష విరమణ వెనుక.. నిజాలు వెల్లడించిన వాంగ్‌చుక్! -
నేపాల్ లో హృదయ విదారకం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
-
Nepal: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఖాయం..
-
నేపాల్‌లో నగర వాసి మిస్సింగ్!
హైదరాబాద్: ఆయన శివుడికి పరమ భక్తుడు. వీపు, భుజం, చేతులపై శివుడి గుర్తులతో పచ్చ బొట్లు వేయించుకున్నారు. అదే ఆధ్యాత్మిక భావనతో మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. కానీ, ఆకస్మిక వరదలతో ఆచూకీ దొరకడం లేదు. ఇదంతా మణికొండ వాసి రాళ్లగూడెం ధన్‌పాల్‌రెడ్డి గురించి. డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఈయన ఆగస్టు 23న హిల్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో పుణె నుంచి 66 మందితో కలిసి వెళ్లారు. వీరిలో ఎక్కువమంది పుణె వారు కాగా, కొందరు హైదరాబాదీలూ ఉన్నారు. గత నెల 26న ఉదయం 8.30కు టిబెట్‌లోని ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్నామని, అది పూర్తికాగానే ముందుకెళ్తామని సమాచారం ఇచ్చారు. ఆ రోజే ఆకస్మిక వరద సంభవించింది. తర్వాత ధనపాల్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్ వస్తోందని తండ్రి నర్సింహారెడ్డి తెలిపారు. అక్కడి ఎంబసీ వారు కుటుంబసభ్యుల డీఎన్ఏ పంపిస్తే మీవారి వివరాలను పరిశీలిస్తామనే సమాధానం ఇచ్చారని అన్నారు. ధనపాల్రెడ్డికి భార్య, 8వ తరగతి చదువుతున్న కుమారుడు, 7వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఆగస్టు 16న అలకాపూర్ టౌన్షిప్లో దుస్తుల దుకాణం ప్రారంభించారు. చదవండి: 26 విపత్తుల తేదీ! -
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
నేపాల్‌ను వణికించిన ఆకస్మిక వరదల విషాదం.. రోజురోజుకూ మరింత భయానక పరిస్థితుల్ని వెలుగులోకి వస్తోంది గతవారం సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య 1000కి చేరువైంది. గల్లంతైన వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో అన్వేషణ కొనసాగుతోంది. భారీ వర్షాలు, బురద, దెబ్బతిన్న రహదారులు, మూసుకుపోయిన సొరంగాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.ఆగస్టు 26న నేపాల్–టిబెట్ సరిహద్దులో మంచు, రాళ్ల భారీ ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో భోటేకోషి–త్రిశూలీ నదీ వ్యవస్థలో వరదలు పోటెత్తాయి. ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తిన ఈ వరదల్లో ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నేపాల్ సహాయక బృందాలు, వివిధ దేశాల రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గాలింపు కొనసాగిస్తున్నాయి.తాజాగా.. నువాకోట్ జిల్లాలోని బెత్రావతిలో ఈ ఉదయం ఓ ఇంట్లో 23 మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. వరదల తర్వాత గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా ఈ మృతదేహాలను గుర్తించారు. అవి ఒకే కుటుంబానికి చెందినవా? చుట్టుపక్కల వాళ్లు తలదాచుకునేందుకు వచ్చి మరణించారా? లేదంటే కొట్టుకు వచ్చిన మృతదేహాలా? అని పరిశీలిస్తున్నారు. మరోవైపు నేపాల్ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ సమీపంలోని గండక్ నదిలో లభించాయి. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను నేపాల్‌కు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సొరంగాల్లో 900 మందికి పైగా?నేపాల్ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల జాడ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని పలు సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40–42 మంది ఇంజినీర్ల ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలీ 3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికులు గల్లంతయ్యారు. బురద, నీటితో సొరంగాలు పూర్తిగా మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది నియంత్రిత పేలుళ్లు, ఎక్సకవేటర్లు, సెర్చ్లైట్లను ఉపయోగించి మార్గాలను క్లియర్ చేస్తున్నారు. అయితే కెమెరాల్లోనూ లోపల నిశబ్ధ వాతావరణం కనిపిస్తుండడంతో.. వాళ్లంతా కొట్టుకునిపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సామూహిక ఖననాలే దిక్కు!వరదల్లో గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతదేహాల గుర్తింపు అధికారులకు మరో పెద్ద సవాల్‌గా మారింది. పోఖారా ఆస్పత్రికి గోర్ఖా, తనహున్, ధాదింగ్, నావల్పరాసీ ఈస్ట్ ప్రాంతాల నుంచి 102 మృతదేహాలను తరలించారు. వీరిలో 16 మందిని గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. అయితే చాలా మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఫొటోలు, దుస్తులు, నగలు, టాటూల ఆధారంగా బాధితులను గుర్తించాల్సి వస్తోంది. అవసరమైన చోట డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌కు చెందిన 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా గుర్తింపు ప్రక్రియలో సహకరిస్తున్నారు.అలాగే వదరలు సంభవించిన రీజియన్‌లో మార్చురీల సంఖ్య.. సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. బాడీ మేనేజ్మెంట్ సెంటర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో సామూహిక ఖననాలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.వేలాది మంది గల్లంతు.. విదేశీయులూరసువాలోని ఉత్తర్గయా గ్రామానికి చెందిన సుమారు 350 మంది విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 వేల మందికిపైగా ప్రజలను రక్షించారు. వీరిలో 323 మంది విదేశీయులు ఉన్నారు. మరోవైపు 39 దేశాలకు చెందిన సుమారు 590 మంది విదేశీయులు ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది.65 వేల మందికి అత్యవసర సాయంవరదల తీవ్రతను ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళనకరంగా అభివర్ణించింది. ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 65 వేల మందికి తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అత్యవసర సాయం అవసరమని తెలిపింది. 22 వేల మందికిపైగా చిన్నారులకు రక్షణ సేవలు అవసరమవుతున్నాయి. పాఠశాలలు కూడా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 19 పాఠశాలలు దెబ్బతినగా, తొమ్మిది పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఎనిమిది పాఠశాలలను ప్రస్తుతం బాధితులకు ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వరదల్లో దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక సామగ్రిని బాధిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. ఫ్రీజర్లు, డీఎన్ఏ కిట్లు, డ్రోన్లు, లిడార్ పరికరాలు, వంతెన నిర్మాణ సామగ్రి వంటి ప్రత్యేక పరికరాలను నేపాల్ కోరింది. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా తదితర దేశాలు సహాయక చర్యలకు మద్దతు అందిస్తున్నాయి. మరోవైపు టిబెట్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఏర్పడిన సరస్సులు, హిమనదుల(గ్లేసియర్) కూలిపోయే ప్రమాదంపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇదీ చదవండి: నేలమట్టమైన వందల ఏళ్ల నాటి హిందూ దేవాలయం -
నేపాల్: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన
ఖాట్మండు: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 939కి పెరిగింది. త్రిశూలి నది పరివాహక ప్రాంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 900 మందికి పైగా కార్మికులను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో బాధితులు బతికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కొండ ప్రాంతాన్ని పేలుడు పదార్థాలతో పేల్చి, త్రిశూలి-3A సైట్‌లోని సొరంగాల్లోకి గాలిని పంపింగ్ చేస్తున్నాయి. నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం లెక్కల ప్రకారం, 592 మంది విదేశీయులతో సహా మొత్తం 3,925 మంది గల్లంతయ్యారు. చైనా, నేపాల్ సైనిక దళాలతో పాటు భారత్, కొరియా, ఆస్ట్రేలియా నిపుణులు ఈ సంయుక్త సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.సుమారు 11 జలవిద్యుత్ ప్రాజెక్టులు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పర్ త్రిశూలి ప్రాజెక్టు నుంచి గత వారాంతంలో 250 మందిని రక్షించగా, మరో 42 మంది కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు చిత్వాన్‌లో గుర్తుతెలియని మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు సరిపోక తాత్కాలిక ఖననాలు చేపట్టారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు పూర్తయిన తర్వాతే అవశేషాలను బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఇటు టిబెట్ పరిధిలో 16 మంది మరణించగా, 546 మంది గల్లంతైనట్లు చైనా అధికారికంగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: కార్ల మధ్య రహస్య సంభాషణతో రోడ్డు ప్రమాదాలకు చెక్ -
26 విపత్తుల తేదీ!
ఏడాదిలో ఉండే 365 రోజుల్లో ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఏర్పడవచ్చు.... ఒకట్రెండు ఒకే తేదీలో వస్తే.. కాకతాళీయం, యాదృచి్ఛకం అనుకుంటాం... ఇలా కాకుండా బోలెడన్ని ప్రకృతి విపత్తులు.. 26వ తేదీనే వస్తే...? ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా నేపాల్‌ను వరద ముంచేసింది కానీ... గతంలో ఇదే 26వ తేదీ ఎన్ని విపత్తులు వచ్చాయో తెలుసా?సుమారు 96 ఏళ్లు అవుతోంది.. 26వ తేదీ ప్రకృతి విపత్తులు సంభవించడమనే ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకోవడం. 1930లో టర్కీని కుదిపేసి 32,700 మంది ప్రాణాలు తీసిన భూకంపం సంభవించింది నవంబరు 26. ఆ తరువాత కూడా అనేకసార్లు నెలలు మారినా విపత్తులు మాత్రం 26వ తేదీనే జరగడం యాదృచి్ఛకం అని కొట్టిపారేయలేమేమో. ప్రకృతి వైపరీత్యాల మాట అలా ఉంటే మానవ తప్పిదాల కారణంగా చోటు చేసుకున్న భారీ దుర్ఘటనల్లో కొన్ని కూడా 26వ తేదీనే చోటు చేసుకున్నాయి. మచ్చుకు కొన్నింటిని చూద్దాం. ఆగస్టు 26, 2026: నేపాల్‌ను ముంచేసిన మెరుపు వరదలు: హిమాలయ పర్వత శిఖరాల్లో ఓ హిమానీనదం అకస్మాత్తుగా విరిగి కిందకు పడటంతో నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోశి నదికి మెరుపు వరద వచ్చింది. దీంతో గ్రామాలు మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఆగస్టు 31 నాటికి 900 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 4,500 మంది గల్లంతయ్యారు. అక్టోబర్ 26, 2015: హిందూకుష్ భూకంపం: హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారతదేశంసహా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 400 మంది మరణించారు. మే 26, 2006: యోగ్యకర్త భూకంపం, ఇండోనేíసియా: ఇండోనేíÙయాలోని జావా ద్వీపంలో యోగ్యకర్త సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. వేల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 5,700 మందికి పైగా మృతి చెందారు. జూలై 26, 2005: మహారాష్ట్ర వరదలు: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాజధాని ముంబైలో ఒకే ఒక్కరోజులో 944 మి.మీ. వర్షం నమోదైంది. రోడ్లు, ఇళ్లు, రైల్వే లైన్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రం మొత్తమ్మీద 1,094 మంది మృతి చెందారు. డిసెంబర్ 26, 2004: సునామీ ప్రళయం... సుమత్రా తీరం సమీపంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీగా మారి హిందూ మహాసముద్ర తీర దేశాలపై విరుచుకుపడింది. ఇండోనేసియా, శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 2,28,000 మంది మరణించగా మరెందరో గల్లంతయ్యారు. చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తుల్లో ఒకటిగా ఇది నమోదైంది. డిసెంబర్ 26, 2003: బామ్ భూకంపం, ఇరాన్: ఇరాన్లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం చారిత్రక నగరం బామ్, చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేసింది. వేల భవనాలు మట్టిదిబ్బలుగా మారాయి. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 31,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 25–26, 2002: వరుస భూకంపాలతో అఫ్గానిస్తాన్ అతలాకుతలం: ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని బఘ్లాన్ ప్రాంతంలో రాత్రిపూట వరుస భూకంపాలు సంభవించి 1800 మంది ప్రాణాలు బలితీసుకున్నాయి. మట్టి ఇళ్లు కూలిపోగా వేల మంది నిరాశ్రయులయ్యారు. జనవరి 26, 2001: గుజరాత్ భూకంపం: 2001 జనవరి 26న గుజరాత్లో భయంకర భూకంపం సంభవించింది. ఫలితంగా కచ్ ప్రాంతం ధ్వంసమైంది. సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోగా... 1,66,000 మందికి పైగా గాయపడ్డారు. జూలై 26, 1963: స్కోప్జే భూకంపం: అప్పటి యుగోస్లేవియాలోని స్కోప్జే నగరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరం ధ్వంసమైంది. 2,00,000 మంది నిరాశ్రయులయ్యారు. 1,070 మంది మృతి చెందారు. నవంబర్ 26, 1943: లాడిక్ భూకంపం, టర్కీ: టర్కీలోని లాడిక్–సామ్సన్–హవ్జా ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. టర్కీ ఉత్తర ప్రాంతంలో విస్తృత నష్టం జరిగింది. 4,020 మంది మృతి చెందారు. డిసెంబర్ 26–27, 1939: ఎర్జింకాన్ భూకంపం, టర్కీ: టరీ్కలోని ఎర్జింకాన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 32,700 మంది ప్రాణాలు బలితీసుకుంది. అపారమైన ఆస్తినష్టం నమోదైంది. మానవ తప్పిదాలు తెచ్చిన విపత్తులు... → సెప్టెంబర్ 26, 2023: ఖరాఖోష్ వెడ్డింగ్ హాల్ అగ్నిప్రమాదం... ఇరాక్‌లోని మోసుల్ సమీపంలోని ఖరాఖోష్లోని వెడ్డింగ్ హాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం లోపలే పటాకులు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. పైరోటెక్నిక్స్ మండే పదార్థాలను తగలబెట్టాయి. నిండిన హాల్లో నిప్పు వేగంగా వ్యాపించింది. 100 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. → ఆగస్టు 26, 2021: కాబూల్ ఎయిర్పోర్ట్ బాంబు పేలుడు అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మా హుతి దాడిలో 183 మంది మృతి చెందారు. వీరిలో 170 మంది ఆఫ్గాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.→ నవంబర్ 26, 2008: ముంబై ఉగ్రదాడులు దేశాన్ని కుదిపేసిన అత్యంత భారీ ఉగ్రవాద దాడి ఇది. 2008 నవంబర్ 26 రాత్రి ముంబైలోకి ప్రవేశించిన పది మంది లష్కర్–ఎ–తొయిబా ఉగ్రవాదులు ఏకకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెరి్మనస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ వంటి ప్రాంతాల్లో కాల్పులకు దిగారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉగ్రదాడిలో భద్రతాదళాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 166 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు.→ మే 26, 1991: లాడా ఎయిర్ ఫ్లైట్ 004 ప్రమాదం బ్యాంకాక్ నుంచి వియన్నాకు వెళ్తున్న లాడా ఎయిర్ బోయింగ్ 767 విమానం థాయిలాండ్‌లో కూలిపోయింది. ఇంజన్ థ్రస్ట్ రివర్సర్ అనూహ్యంగా విచ్చుకోవడంతో విమానం నియంత్రణ కోల్పోయి ముక్కలైపోయి కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 223 మంది మృతి చెందారు. – న్యూఢిల్లీ -
హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలి
కఠ్మాండు: హిమాలయ ప్రాంతాల్లో విపత్తులను ఎదుర్కోవడానికి ఐదు సరిహద్దు దేశాలతో కలిపి హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆధ్మాతి్మక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ డిమాండ్‌చేశారు. సున్నితమైన ఈ పర్వత ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్లతో కూడిన సరిహద్దు సహకారం అవసరమన్నారు. ఆదివారం కఠ్మాండులో ఏర్పాటు చేసిన ‘నేపాల్‌కు సంఘీభావం’కార్యక్రమంలో ప్రసంగించారు. తక్షణ సహాయానికి మించి, హిమాలయాలపై విస్తృతస్థాయిలో సామూహిక బాధ్యత అవసరమని సద్గురు పిలుపునిచ్చారు. ఆ పర్వతాలు దేశాల మధ్య గీసిన సరిహద్దులకు అతీతమైనవని, వాటి భవిష్యత్తు వాటిపై ఆధారపడిన వారందరికీ సంబంధించినదని గుర్తించాలని ఆయన అన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయాలు తెలియదు. మీరు మాట్లాడే అర్థంలేని మాటలు లేదా భాష పర్వతాలకు తెలియదు. హిమాలయ ప్రాంతం భూమిపై అద్భుతమైన, సున్నితమైన ప్రాంతం. అటువంటి పర్వతాల రక్షణ కోసం అవి విస్తరించి ఉన్న దేశాలన్నింటితో కూడిన ఒక సంస్థ ఏర్పాటు తక్షణ అవసరం. ఈ విపత్తు తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీని పరిణామాలను నేపాల్ లాంటి చిన్నదేశం ఒంటరిగా ఎదుర్కోలేదు. మనం దీనిపై దృష్టి పెట్టాలి’అని ఆయన అన్నారు. కోటి రూపాయల విరాళం.. నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కోటి రూపాయల విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని ఇషా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనా–నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల తర్వాత ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. నేపాల్ వైపున ఉన్న ముగ్గురు ఇషా వలంటీర్ల ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఇషా ఫౌండేషన్ ప్రతి సీజన్లో కైలాస్ మానసరోవర్ యాత్రలను నిర్వహిస్తోంది. యాత్రలో భాగంగా కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ బృందాలు కఠ్మాండు నుంచి నేపాల్ మీదుగా టిబెట్‌కు వెళ్తాయి. -
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో అంశం గుండెకోత మిగుల్చుతోంది. నేపాల్ వరదల్లో మృతుల గుర్తింపు చాలా క్లిష్టంగా మారింది. ముఖ్యంగా వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు చాలా దూరంలోని ప్రాంతాల్లో లభిస్తుండటంతో, ఒకే మృతదేహాన్ని వేర్వేరు కుటుంబాలు తమ బంధువుదిగా గుర్తిస్తున్న పరిస్థితి కనపడుతోంది. నేపాల్ వరదల్లో మృతదేహాలు దూర ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో, తమవారిని గుర్తించేందుకు కుటుంబాలు ఫొటోలు, దుస్తులు, నగలు, పచ్చబొట్లను ఆశ్రయిస్తుండగా.. వివాదాస్పద కేసుల్లో డీఎన్ఏ పరీక్షలే తుది ఆధారంగా మారుతున్నాయి.ఆగస్టు 26న నేపాల్‌లో వచ్చిన భారీ వరదల తర్వాత వందలాది మంది మృతి చెందగా, వేలాది మంది గల్లంతయ్యారు. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు చాలా దూరంలోని ప్రాంతాల్లో లభిస్తుండటంతో వాటిని గుర్తించడం కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది.పోఖరాలోని ఆసుపత్రిలో ఉన్న బాడీ నంబర్ 1003ను తొలుత 3 కుటుంబాలు తమ బంధువుదిగా గుర్తించాయి. ప్రస్తుతం 2 కుటుంబాలు ఆ మృతదేహం తమ బంధువుదేనని చెబుతున్నాయి. ఎవరి బంధువో నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు రావడానికి 1 నుంచి 1.5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.కుటుంబాలు మృతదేహాలను ఫొటోలు, ముఖం, పళ్లు, చెవులు, శరీర ఆకృతి, పచ్చబొట్లు, నగలు, దుస్తులు వంటి గుర్తుల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ 5 ఏళ్ల బాలుడిని అతడు ధరించిన స్కూల్ టై, గొలుసు, చెవి ఆభరణం ఆధారంగా గుర్తించారు. మరో వ్యక్తిని భుజంపై ఉన్న పచ్చబొట్టు ద్వారా గుర్తించారు.మొత్తంగా ఈ కథనం చెప్పేది: నేపాల్ వరదల్లో గల్లంతైన తమ కుటుంబ సభ్యుల కోసం బంధువులు ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే మృతదేహాల పరిస్థితి, అవి దూర ప్రాంతాలకు కొట్టుకుపోవడం, ఒకే మృతదేహంపై పలువురు కుటుంబాలు హక్కు చెప్పడం వల్ల గుర్తింపు ప్రక్రియ చాలా కష్టంగా మారింది. చివరకు డీఎన్ఏ పరీక్షలే సరైన గుర్తింపునకు ఆధారంగా మారుతున్నాయి. -
Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!
-
Viral : నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు సొమ్ము! ఎం చేసారంటే
-
నేపాల్ జలప్రళయంలో అద్భుతం.. చెక్కుచెదరని వండర్ హౌస్..
-
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్‌ను వెంటాడుతోందా?
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులు ఓవైపు తరచూ తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు మరోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో పశుపతి నేల నేపాల్ సతమతమవుతోంది. తాజా జల విలయం కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితులు తమకు బాగా అలవాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని నేపాల్ చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనక ప్రచారంలో ఉన్న ఓ గాథ తాజాగా తెరపైకి వచ్చింది. ‘సతి లే సరాపేకో దేశ్’.. సతి శాపానికి గురైన దేశం. నేపాల్ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. రాజరికం అంతరించి పోయిన సమయంలో.. అలాగే వరుసగా ప్రభుత్వాలు కూలినప్పుడల్లా ఈ పదం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ఇది కేవలం ఇందుకే పరిమితం కాలేదు.. ప్రకృతి ప్రకోపం చూపించినప్పుడు కూడా అక్కడి జనాలు దీనిని గుర్తు చేసుకుంటారు. అసలు నేపాల్ శపించిన ఆ మహిళ ఎవరు? ఆమె విషాద గాథ ఏంటి? సతీసహగమన సమయంలో ఆమె పెట్టిన కన్నీరే నేపాల్ దుస్థితికి కారణమా?.. నాలుగు వందల ఏళ్ల కిందట జరిగింది ఏంటి?.. నేపాల్‌లో 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజులు పరిపాలించేవారు. అధికారం, ఆధిపత్య పోరులతో రాజదర్బాలు కుట్రలకు, కుతంత్రాలుగా నిలయంగా కనిపించేవి. ఆ వంశంలో రాజు లక్ష్మీ నరసింహ మల్లా కొలువులో కాజీ భీమ్ మల్లా అనే సేనాపతి ఉండేవాడు. సైనిక వ్యవహారాల్లోనే కాకుండా పరిపాలన, టిబెట్‌తో వాణిజ్య సంబంధాల్లోనూ ఆయన రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజు వద్ద ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యం.. సాధారణంగానే సామంత రాజుల్లో అసూయను పెంచింది.చాడీలు విని.. భీమ్ మల్లాపై కుట్రలు పన్నిన ప్రత్యర్థులు.. రాజు లక్ష్మీ నరసింహుడికి లేనిపోని వన్నీ నూరిపోశారు. దాంతో తన సింహాసనానికి భీమ్ ముప్పుగా మారుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నారాయన. అలా రాజద్రోహం ఆరోపణలతో ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన్ని చెరసాలలో బంధించి.. మరణశిక్ష అమలు చేశారు. అది చూసి.. ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలేలా రోదించింది. రాజ్యం సైతం కన్నీరు పెట్టింది.చితిపై నుంచే శాపం?నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని లక్ష్మీ నరసింహుడు అకారణంగా, కుట్రలకు తలొగ్గి చంపడాన్ని భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్‌లో సతి ఆచారం ఉండేది. భర్త మరణించిన తర్వాత భార్య కూడా అతడి చితిపై ఆత్మాహుతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. భువనలక్ష్మి కూడా భర్త భీమ్ మల్లా చితిపై ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే అంతకు ముందు తన భర్తకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అన్యాయంగా చంపిన ఈ నేల, ఈ రాజ్యాన్ని మనశ్శాంతిగా ఉండబోవని, సర్వనాశనం అవుతాయని శపించారు. ఆ తర్వాత రాజు లక్ష్మీ నరసింహుడు సైతం తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని చెబుతుంటారు. అలా ఆమె శాపం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాథ నుంచే ‘సతి లే సరాపేకో దేశ్’(Sati le Sarape ko Desh) అనే పదబంధం పుట్టిందని చెబుతారు.అయితే కాలక్రమంలో ఈ గాథ భువనలక్ష్మి అనే మహిళ కన్నీటి కథకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్‌లో తరచూ తలెత్తిన రాజకీయ అస్థిరత, అధికార పోరాటాలు, పాలనా సంక్షోభాలు.. అదనంగా ముంచెత్తున్న ప్రకృతి విపత్తులను ప్రస్తావించేటప్పుడు ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా, ఆవేదన పూరితంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు ఆకస్మిక వరదల వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది. View this post on Instagram A post shared by 𝒩 (@nishantchillma)ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త.. మనుషుల్ని మోసం చేస్తున్న ఏఐ! -
నేపాల్ వరదల్లో 25 మంది తెలంగాణ NRIలు గల్లంతు..!
-
‘ఖాళీ చేసిన నాలుగు గంటలకే హోటల్ కొట్టుకుపోయిది’
ముంబై: కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన మహారాష్ట్రలోని విరార్ వాసి ప్రదీప్ టెండూల్కర్ నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నుంచి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఆయన బస చేసిన హోటల్‌ను ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఖాళీ చేయడం వల్ల ప్రాణాలు దక్కాయి. ఆగస్టు 22న విరార్ నుంచి యాత్ర ప్రారంభించిన ప్రదీప్ టెండూల్కర్ నేపాల్ మీదుగా ప్రయాణిస్తూ ఒక హోటల్లో బస చేశారు.అయితే ఆ హోటల్ నుంచి ఆయన బయలుదేరిన నాలుగు గంటల వ్యవధిలోనే అక్కడ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. నీటి ఉద్ధృతికి ఆ హోటల్ పేకమేడలా కొట్టుకుపోయింది. కొద్ది గంటల వ్యత్యాసమే ఆయన ప్రాణాలను కాపాడింది. ప్రదీప్ ప్రస్తుతం దాదాపు 18,500 అడుగుల ఎత్తులోని డోల్మా లా పాస్‌కు సురక్షితంగా చేరుకుని, యాత్రను కొనసాగిస్తున్నారు. తాను విశ్రాంతి తీసుకున్న ప్రాంతం పూర్తిగా శిథిలమైపోయిన వార్త తెలుసుకుని ప్రదీప్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. తమ ప్రాణాలు దక్కినప్పటికీ, ఈ విపత్తు వల్ల ప్రజలకు జరిగిన నష్టం తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విపత్తు కారణంగా ప్రధాన రహదారులు ధ్వంసమై మానససరోవర యాత్రకు వెళ్తున్న ఇతర యాత్రికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు భారత్, నేపాల్, చైనా సహాయక బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో వసాయ్-విరార్ నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవగా, నగరానికి చెందిన పౌరులెవరూ ఈ ప్రమాదంలో చిక్కుకోలేదని మేయర్ అజీవ్ పాటిల్ తెలిపారు.ఇది కూడా చదవండి: వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో.. -
వరద మిగిల్చిన బురద.. కుదుటపడేదెన్నడో..
ధాదింగ్: నేపాల్‌లోని ధాదింగ్‌లోని బైరేని మార్కెట్ నుంచి వరద నీటి ఆనవాళ్లు ఇంకా చెరిగిపోలేదు. రోడ్డు పక్కన, ప్రాంగణాల్లో, దుకాణాల లోపల పేరుకుపోయిన బురద కొద్దిరోజుల క్రితం నాటి విషాదాన్ని గుర్తుచేస్తోంది. కొందరు బురదను తొలగిస్తుండగా, మరికొందరు వరద నీటిలో కొట్టుకుపోకుండా మిగిలిన వస్తువులను వేరు చేస్తున్నారు. రసువా నుంచి త్రిశూలి నది గుండా వచ్చిన వరద నీరు బైరేనిని కూడా వదిలిపెట్టలేదు. నీటితో పాటు వచ్చిన బురద, ఒండ్రుమట్టి మార్కెట్లోని ఇళ్లు, దుకాణాలను ముంచెత్తింది. కొన్ని ఇళ్లు వరదకు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్ల నిర్మాణాలు ఏ క్షణంలోనైనా కూలిపోయేంత బలహీనంగా మారాయి.బ్యాగులను తరగతి గదిలోనే వదిలేసి..వరద వచ్చిన సమయంలో శ్రీ బాఘేశ్వరి సెకండరీ స్కూల్ విద్యార్థులు పాఠశాలలోనే ఉన్నారు. ప్రాన్షా మాంగ్రాతి, భూమిక రంతేల్లకు ఆ క్షణం ఇప్పటికీ గుర్తుంది. విద్యార్థులు పాఠశాల అసెంబ్లీలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు వెంటనే వారికి వరద ముప్పు గురించి సమాచారం అందించారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని చెప్పారు. ‘అప్పుడు మేము అసెంబ్లీలో కూర్చున్నాం. మేము మా బ్యాగులను తరగతి గదిలోనే వదిలేసి సరిహద్దు గోడ వైపు పై అంతస్తుకు వెళ్లాము’ అని ప్రాన్షా గుర్తుచేసుకుంది. ఆ సమయంలో వారికి తమ బ్యాగులు, పుస్తకాలు, ఇతర వస్తువుల కంటే ప్రాణాలను కాపాడుకోవడమే మరింత ముఖ్యంగా మారింది. తరగతి గదిలో వదిలిపెట్టిన వస్తువులు తమకు మళ్లీ దొరుకుతాయో లేదో వారికి తెలియదు.వస్తువుల కోసం వెతుకుతున్న విద్యార్థివరద ముప్పు తగ్గిన తర్వాత ప్రాన్షా, భూమిక పాఠశాలకు తిరిగి వచ్చారు. వారి ఉద్దేశ్యం ఒక్కటే.. తమ బ్యాగులు, వస్తువులను కనుగొనడం. కానీ వారు వెతుకుతున్న వస్తువులన్నీ వారికి దొరకలేదు. వారి వస్తువులలో కొన్ని పోయాయి. ఇతర స్నేహితుల బ్యాగులు దొరికాయి. వరద పాఠశాల నిర్మాణాలను మాత్రమే కాకుండా విద్యార్థుల పుస్తకాలు, నోట్బుక్లు, బ్యాగులు, వ్యక్తిగత వస్తువులను కూడా ధ్వంసం చేసింది. పాఠశాల ప్రాంగణంలో లభించిన వస్తువులను వేరు చేసి, సంబంధిత విద్యార్థులకు తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యార్థుల తరగతి గదుల్లో పేరుకుపోయిన బురదను తొలగించడానికి నేపాలీ సైన్యానికి చెందిన సైనికులను కూడా మోహరించారు. వారు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరుస్తూ బురద, శిథిలాలను తొలగిస్తున్నారు.మార్కెట్ అంతా బురదమయంపాఠశాల నుండి బయటకు వచ్చిన తర్వాత, బైరేని మార్కెట్లో వరద నీరు మిగిల్చిన మరో దృశ్యం కనిపిస్తుంది.ఇళ్లు, దుకాణాల్లోకి చేరిన బురదను తొలగించేందుకు స్థానికులు రోజంతా శ్రమిస్తున్నారు. కొందరు పారలతో బురదను ఎత్తిపోస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు నిత్యం సందడిగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు శుభ్రం చేసే పనులతో, నష్టాన్ని అంచనా వేయడంలో బిజీగా మారింది. వరద కారణంగా కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. కొన్ని నిర్మాణాలు ఇంకా నివాసయోగ్యంగా ఉన్నాయా లేదా అనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఇంటి లోపల మిగిలి ఉన్న వస్తువులను వెలికితీసి సురక్షిత ప్రాంతానికి తరలించడం ఇప్పుడు పలు కుటుంబాలకు ప్రత్యేక పనిగా మారింది.ఆస్పత్రి తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలుబైరేని ఆస్పత్రి కూడా వరద ప్రభావాన్ని ఎదుర్కొంది. నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు సంయుక్తంగా ఆస్పత్రి ప్రాంగణంలో పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని శుభ్రపరిచేందుకు ఆరోగ్య కార్యకర్తలతో పాటు పోలీస్, సాయుధ బలగాల భద్రతా సిబ్బందిని మోహరించారు.ఇది కూడా చదవండి: లాలూ పెద్ద కుమారుడి రెండో పెళ్లి బాజాలు? -
పెను విషాదంలోనూ చెల్లెలి కోసం ఓ అన్న పోరాటం
-
టన్నెళ్లలో కుళ్లిన మృతదేహాలు.. నేపాల్ వరదల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలు..
-
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
నేపాల్ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.నేపాల్‌లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అసలు కారణం ఇదే.. ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్‌గా మారిన ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్‌లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.Good News,Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal FloodsThe family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL— Woke Eminent (@WokePandemic) August 28, 2026ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.ఇంటి ఆకారం కూడా ప్లస్ పాయింట్ఇంటి కాంపాక్ట్ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్‌లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.‘ఇంజినీర్ ఎవరు?’ అనే ప్రశ్నకు..సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్ ఎవరు? అనే విషయాన్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం! -
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
నేపాల్‌ను కుదిపేసిన వరద బీభత్సం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఆరోపించగా.. చైనా ఆ వాదనను కొట్టిపారేసింది. అయితే ఈ ప్రవాహం వేగం ఊహకందని రీతిలో ఉందని దూసుకొచ్చిందని.. అందుకే ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కష్టంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఓ విపత్తు రావొచ్చని పది రోజుల కిందటే నేపాల్‌ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ విలయంలో 800 మంది మృతదేహాలను వెలికి తీయగా.. మరో 2,500 వేల మంది ఆచూకీ గల్లతైంది. అయితే దాదాపు 12 రోజుల ముందే టిబెట్ ప్రాంతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా నేపాల్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాటితో పాటు కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ చైనాకు చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం నేపాల్‌కు ఓ మెయిల్ పంపింది. అలాగే హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలపై దృష్టిసారించాలని సూచించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.జస్ట్.. 26 నిమిషాల్లో?ఆగస్టు 26న ఉదయం సుమారు 8.32 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం మొదలైంది. కేవలం 26 నిమిషాల తర్వాత నేపాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే వరద ధాటికి పలు పర్యవేక్షణ కేంద్రాలు ధ్వంసం కావడంతో డేటా ప్రసారం నిలిచిపోయింది. స్థానిక అధికారుల నుంచి నిర్ధారణ పొందిన తర్వాత నేపాల్ అధికారులు ఉదయం 9.13 గంటలకు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపారు. అప్పటికే వరద ట్రిషూలీ నది వెంట దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్తోంది.అయితే నేపాల్ వాదన మరోలా ఉంది. చైనా ఆ హెచ్చరికలను 14-19 తేదీల మధ్యే అని ప్రస్తావించిందని అంటోంది. అలాగే తమకు కేవలం భారీ వర్షాల హెచ్చరికలు మాత్రమే జారీ చేసిందని, దానికి తాము ‘‘కేవలం వర్షపాతం సమాచారం మాత్రమే కాదని, హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలు, కొండచరియల ప్రమాదంపై ముందస్తు సమాచారం’’ కూడా కోరామని అంటోంది. వరద స్పీడు.. మరీ అంతనా?ఇదిలా ఉండగా.. తాజా అంచనాలు ఈ విపత్తు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు నేపాల్ హిమాలయ గ్లేసియర్, పర్వత పరిశోధకుడు ధనంజయ్ రెగ్మి తెలిపారు. ఇంతటి వేగంతో వచ్చిన ప్రవాహం మార్గంలో కనిపించిన ప్రతిదానినీ ఊడ్చుకెళ్లింది.పర్వతారోహకుడు సంజిత్ సింగ్ బాల్ అంచనా ప్రకారం.. సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలో ఉన్న హిమనదం భాగం దాదాపు 5,000 మీటర్ల ఎత్తు నుంచి విరిగిపడి కిందికి దూసుకొచ్చి ఉండొచ్చు. మార్గమధ్యంలో నీరు, మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను తనతో కలుపుకోవడంతో ప్రవాహం మరింత శక్తిమంతంగా మారింది.అంత పెద్ద.. హిమనదం కూలిందిమొదట మూడు హిమ సరస్సుల్లో ఏదో ఒకటి తెగిపోవడం వల్లే ఈ వరద సంభవించిందని భావించారు. కానీ ఉపగ్రహ చిత్రాల పరిశీలనలో అసలు కారణం మరోటి అని తేలింది. సుమారు 7,000 మీటర్ల ఎత్తున్న లాంగ్టాంగ్ లెరుంగ్ శిఖరంలోని ఉత్తర హిమనదం(గ్లేసియర్)లో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం కూలిపోయినట్లు గుర్తించారు. హిమనదం భారీ భాగం లోయలోకి పడటంతో నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి అత్యంత వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.మూడు సరస్సులు.. మరో ముప్పు?తాజా విపత్తు తర్వాత.. ఆ రీజియన్‌లో మూడు సరస్సులు సహజంగా ఏర్పడడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వీటిలో ఏదైనా ఒకదానిపై కొత్తగా కొండచరియలు లేదంటే భారీ రాళ్లు పడితే.. దాని ప్రభావం వరుసగా మిగిలిన సరస్సులపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు ప్రస్తుతం చైనా–నేపాల్ సరిహద్దు వద్ద ఏర్పడిన బ్యారియర్ సరస్సులోని నీరు సహజంగా బయటకు వెళ్లి దాదాపు పూర్తిగా ఖాళీ కావడంతో.. ఒక్కసారిగా సరస్సు తెగిపోయి భారీ వరద వచ్చే ముప్పు గణనీయంగా తగ్గింది. అలాగని.. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అటు చైనా, ఇటు నేపాల్ అధికారులు అంటున్నారు. నేపాల్‌లోని భోటేకోషి నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నదీ ప్రవాహంలో ఆకస్మిక మార్పులు, కొండచరియలు లేదంటే కొత్తగా ఏర్పడే నీటి నిల్వలపై నిఘా కొనసాగుతోంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే ఉండాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.800 మంది మృతి.. మిస్సింగ్ లెక్క వేరే!ఈ వరదలో నేపాల్, చైనాలో కలిపి దాదాపు 800 మంది మరణించగా.. 2,500-3,000 మందికిపైగా గల్లంతైనట్లు తాజా సమాచారం. వరద ధాటికి భారీ బండరాళ్లు, బురదతో భవనాలు కొట్టుకుపోయాయి. మొత్తంగా 19 వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా ప్రభావితమైనట్లు అంచనా. సరిహద్దు నుంచి సుమారు 168 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. దాదాపు 5.74 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్రవాహంలో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.చైనాతో మరింత సమాచార భాగస్వామ్యంనేపాల్ ఆరోపణలు-చైనా కౌంటర్లతో ముందస్తు వార్నింగ్‌లపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విపత్తు నేపథ్యంలో హిమనదాలు, హిమ సరస్సులు, నదుల ప్రవాహంపై చైనాతో మరింత సమగ్ర సమాచార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ భావిస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి వర్షపాతం, నదుల నీటిమట్టం, హిమనదాల కదలికలపై సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పులతో హిమనదాల కరుగుదల వేగం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు, హిమ సరస్సుల ఉప్పెనల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మూడు కొత్త సరస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ప్రాణాలు కాపాడిన ఛాయ్! -
ఇతను అసలైన రియల్ హీరో
-
ఆగని కన్నీటి వరద
కఠ్మాండు: నేపాల్‌లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది. ఇంకా 2,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకస్మిక వరదల ధాటికి గల్లంతైన వారి కోసం వరుసగా ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగించారు. సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతూ ముమ్మరంగా పని చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 794 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు.ఆగస్ట్ 26వ తేదీన నేపాల్–టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను తుడిచిపెట్టేశాయి. కీలకమైన మౌలిక సదుపాయాలను దారుణంగా దెబ్బతిన్నాయి. జలవిద్యుత్ కేంద్రాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో 2,502 మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మూడు జిల్లాల్లో 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారని నేపాల్ విద్యాశాఖ ప్రకటించింది. గల్లంతైన వారిలో 320 మంది విదేశీయులు ఉన్నారు. అదృశ్యమైన తమ బంధువుల కోసం ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో 17 మాత్రమే గుర్తించగలిగారని పోలీసులు తెలిపారు. అనేక మృతదేహాలు చాలావరకు కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు 96 మృతదేహాలను ఖననం చేశారు. సహాయక శిబిరాల్లో సమస్యలు తీవ్రం నేపాల్‌లో అత్యవసర పరిస్థితి ఇంకా ముగియలేదు. బాధితులు తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. రసువాలో 3, నువాకోట్‌లో 15 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన సుమారు 3,500 మందికి పాఠశాలలు, ప్రభుత్వ, సామాజిక భవనాలలో తాత్కాలిక వసతి కల్పించారు. గర్భిణులు, బాలింతలు, వైద్య సంరక్షణ అవసరమైన వారితో సహా వృద్ధులు, చిన్నారులకు ఈ శిబిరాల్లో ఆశ్రయం కలి్పస్తున్నారు. అయితే ఈ శిబిరాల్లో తాగునీరు, పారిశుధ్య సదుపాయాల కొరత వేధిస్తోంది. ఇక్కడ జనం కిక్కిరిసిపోయి ఉండడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మత సంస్థలు బాధితులకు సేవలందిస్తున్నాయి. సొరంగంలో కా ర్మీకుల కోసం గాలింపు వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కా ర్మీకులు, ఉద్యోగుల ఆచూకీ తెలియకుండా పోయింది. త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం వీటిలో ఒకటి. ఈ సొరంగంలో 42 మంది చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా భూగర్భ పవర్‌హౌస్ మరమ్మతు పనుల్లో ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తించింది. వారిని కాపాడేందుకు ప్రభుత్వం 90 మంది సభ్యుల సహాయక బృందాన్ని రంగంలోకి దించింది. సమయస్ఫూర్తి ప్రదర్శించి, పిల్లల ప్రాణాలు కాపాడిన రాజేంద్ర దవాడీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. భయపెడుతున్న భోటే కోశీ నది త్రిశూలి నదిలో కొత్తగా వచ్చిన వరద ధాటికి ఆదివారం మరో వంతెన ఆదివారం ఉదయం కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో గండకి గ్రామీణ మున్సిపాలిటీ ప్రజలు పృథ్వీ హైవేకి వెళ్లే మార్గం తెగిపోయింది. దీంతోపాటే భోటే కోశీ నదిలో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటివరకు ఆహార పదార్థాలతో కూడిన 37 ట్రక్కులు, ఆహారం, ఇతర సామగ్రితో నిండిన ఏడు హెలికాప్టర్లను పంపించారు. భారత ప్రభుత్వం 68.5 టన్నుల సహాయక సామగ్రిని అందజేసింది. గాలింపు, సహాయక చర్యల్లో సహకరించేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులను పంపించింది. 11 టన్నుల సహాయక సామగ్రితో విమానం ఆదివారం భారత్ నుంచి నేపాల్‌కు చేరుకుంది. 1,643 మంది విద్యార్థుల్ని కాపాడిన టీచర్నేపాల్లోని వరద ప్రభావిత త్రిశూలి వ్యాలీలో ఓ ఉపాధ్యాయుడి అప్రమత్తత కారణంగా ఏకంగా 1,643 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడి త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.20 గంటల సమయంలో ఆయనకు ఓ స్నేహితుడి నుంచి వరద హెచ్చరిక అందింది. నది పక్కనే ఉన్న ఈ మూడంతస్థుల పాఠశాల భవనంలో 1,643 మంది విద్యార్థులున్నారు. హెచ్చరిక అందగానే రాజేంద్ర దవాడీ అప్రమత్తమయ్యాడు. వెంటనే బడిగంట కొట్టి విద్యార్థులందరినీ బయటకు తీసుకురావాలని మిగతా టీచర్లకు హెచ్చరికలు జారీచేశాడు. స్కూల్ బస్సు డ్రైవర్లను అప్రమత్తంచేశాడు. బస్సుల్లో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్కూల్ వరద బురదలో మునిగింది.శిథిలాల కింద మృత్యువుతో 3 రోజుల పోరాటంప్రాణాలతో బయటపడిన ఆరేళ్ల చిన్నారి ఆరేళ్ల బాలిక శిథిలాల కింద మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేని ప్రాణాలతో బయటపడింది. వరదలవల్ల అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో బుధవారం వరదతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, శుక్రవారం ఓ చిన్నారి రోదన వినిపించింది. శిథిలాలను తొలగించి ఆ బాలికను వెంటనే బయటకు తీశారు. తీవ్రంగా గాయాల పాలైనప్పటికీ సజీవంగా ఉండడంతో శుక్రవారమే హెలికాప్టర్లో కఠ్మాండులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయతి్నంచగా ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. శనివారం ఆసుపత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. -
నేపాల్‌లోని తెలంగాణవాసుల కోసం ముమ్మర యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరద విపత్తులో చిక్కుకున్న తెలంగాణవాసుల భద్రత, గల్లంతైన వారి అన్వేషణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, ఆగస్టు 29న టిబెట్ నుంచి 449 మంది భారతీయులు నేపాల్‌లోకి ప్రవేశించారు.వారిలో 397 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేపాల్ నుంచి వచి్చన బాధితుల జాబితాను పరిశీలించగా, తెలంగాణకు చెందిన అల్లి అయిలేష్ వివరాలు తెలంగాణ భవన్ రికార్డులతో సరిపోలాయి. ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో సంప్రదింపుల్లో ఉన్నారని, క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఛాయాచిత్రాలు, ప్రాథమిక వివరాలను నేపాల్ ప్రభుత్వం తమ డిజాస్టర్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసీ (తూర్పు, పశ్చిమ), కఠ్మాండు జిల్లాల్లో భద్రపరిచిన పారి్థవదేహాలను గుర్తించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు నేరుగా చూసి పోల్చుకోగలిగితే డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని, బంధుత్వ ఆధారాలను బట్టి మృతదేహాలను అప్పగిస్తారని నేపాల్ పోలీసులు తెలిపారని చెప్పారు. భౌతికంగా గుర్తించలేని పక్షంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల డీఎన్ఏ ప్రొఫైల్‌ను సేకరించిన నమూనాలతో సరిపోలుస్తారని తెలిపారు. డీఎన్ఏ నివేదికల కోసం బంధువులు ఎవరూ శ్రమపడి నేపాల్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేదని, స్వస్థలంలోనే తీసుకున్న డీఎన్ఏ ప్రొఫైళ్లను ఈ–మెయిల్ ద్వారా స్వీకరించే విధానాన్ని నేపాల్ పోలీసులు రూపొందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. పారి్థవదేహాల తరలింపు విధివిధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు కుటుంబ సభ్యులు నేపాల్ ప్రయాణాలు చేయవద్దని, ముందుగా తెలంగాణ భవన్ లేదా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక నిర్ధారణ పూర్తయిన తర్వాతే తదుపరి సమాచారాన్ని వెల్లడిస్తామన్నారు. -
యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు
-
నేపాల్ వరదలు : 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు !
Nepal flash Floods నేపాల్ వరద బీభత్సం పెను విషాదాన్ని మిగిల్చింది. వందలాదిమందిని పొట్టన బెట్టుకుంది. అయితే ఇంతటి భారీ విపత్తులో అక్కడక్కడా వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు నెట్టింట ప్రశంసలందుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడు రానున్న విపత్తును ఊహించి, త్వరితగతిన స్పందించి, వందలమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి ప్రాణాలను కాపాడిన ఘటన భారీ ఊరటనిస్తోంది. బుధవారం ఉదయం 9:20 గంటలకు, నేపాల్‌లోని నువాకోట్‌కు చెందిన త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ (47), ఆకస్మికంగా వచ్చిన భయంకరమైన వరదల నుంచి తన సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు.గ్రామం వరదల్లో కొట్టుకుపోయిందని స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో పాటు, ఒక విద్యార్థి తండ్రి వరద నీరు వేగంగా పెరుగుతోందని హెచ్చరించాడు. దీనితో వెంటనే అప్రమత్తమైన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు , ప్రిన్సిపాల్ కూడా అయిన దవాడీ, పాఠశాల గంట మోగించి తరగతి గదులను ఖాళీ చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల భవనాలు వరద నీటిలో కొట్టుకుపోకముందే, దవాడీ 1,643 మంది పిల్లలను కాలినడకన కొండపై ఉన్న ఒక రావి చెట్టు (Bodhi tree) కిందకు సురక్షితంగా తీసుకెళ్లారు.విషాదం అయితే విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఇద్దరు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అంతులేని విచారాన్ని మిగిల్చింది. సంతోష్ పరియార్ (32), సోషల్ హిస్టరీ టీచర్, నది ఒడ్డున ఉన్న తన గదికి తిరిగి వెళ్లిన సమయంలో వరదలో కొట్టుకుపోయారు. అలాగే పాఠశాల తలుపులు మూసివేయడానికి వెనుకకు వెళ్లిన పాఠశాల జానిటర్ సుల్తాన్ లామా కూడా వరదలో ప్రాణాలు కోల్పోయారు.కాగా లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం నుండి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు మరియు రాళ్ల ఉపరితలం 1,200 మీటర్ల ఎత్తు నుండి లెండే ఖోలా నదిలో పడిపోయింది. దీనివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేశాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 734 మంది మరణించగా, దాదాపు 2,500 మంది గల్లంతయ్యారు. టిబెట్‌లోనూ భారీ నష్టం వాటిల్లింది. -
అన్నీ కొట్టుకుపోతుంటే.. కూలుతుంటే..
కఠ్మాండు: ప్రశాంత వాతావరణంపై ప్రకృతి పగబట్టి జలఖడ్గం విసిరిన వేళ దిగువ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగెత్తిన దృశ్యాలు ఇంకా వాళ్ల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తిమూర్‌లో కస్టమ్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాజు బుద్ధాథోకీ బుధవారం ఉదయం ఎప్పట్లాగే తన గదిలో ఉండగా ఒక్కసారిగా వరదనీరు దూసుకొచ్చింది. ‘‘భూకంపం వచ్చినట్లుగా చుట్టుపక్కల ప్రాంతమంది కదిలింది. వెంటనే భయంతో బయటికొచ్చి చూస్తే అప్పటికే పోలీసులు పారిపోతున్నారు. అర్థంకాక వెనక్కి తిరిగిచూస్తే వరద నీరు అంతెత్తున దూసుకొస్తోంది. వెంటనే పరుగెత్తబోతే ఎదురుగా ఉన్న ముళ్లకంచెకు తగిలి గాయపడ్డా. పరుగెడుతుంటే భీకర వరద నీరు తిమూర్ మార్కెట్లో ఒక్కో దుకాణాన్ని మింగేస్తూ ముందుకు దూసుకొచ్చింది. ప్రాణభయంతో ఎగువ ప్రాంతానికి పరుగెత్తా’’ అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. ‘‘వరద ఉధృతిని చూసి వెంటనే ఎగువ అడవిలోకి పరుగెత్తా. ఎడమ బొటనవేలుకు పెద్దగాయమై రక్తంకారుతున్నా పరుగు ఆపలేదు. క్షణాల్లో మార్కెట్ ప్రాంతం జలమయమైంది. పారిపోలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ల మృతదేహాలు కొట్టుకుపోవడం చూశా. అడవిలో హెలికాప్టర్ నుంచి ఆర్మీ పడేసి నూడుల్స్ ప్యాకెట్లను తిన్నాం’’ అని మరో కస్టమ్స్ ఏజెంట్ గౌతమ్ తెలిపారు. ‘‘కొట్టుకొచ్చిన బుదర అదృష్టవశాత్తు నన్ను ఒడ్డు వైపు విసిరికొట్టింది. దీంతో బతికిపోయా. లేదంటే అప్పుడే చచ్చిపోయేవాడిని’’ అని తులసీ బహదూర్ బంఢారీ చెప్పారు. ‘‘రసువాలో బంగారం వ్యాపారం చేసే మామ రాజ్‌కమార్ దియాలీ ఇంటికి భార్య, నాలుగేళ్ల కుమారుడితో వచ్చా. పని మీద ఇంటి నుంచి బయటికెళ్లా. వరద వార్త తెలిసి తిరిగొచ్చేసరికి అందరూ వరదలో కొట్టుకుపోయారు’’ అని 38 ఏళ్ల సచిన్ ఖాతి వాపోయారు. ‘‘నిద్రలో ఉండగానే వరద నన్ను ముంచెత్తింది. కాలు, తలకు గాయాలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చి స్పృహతప్పి పడిపోయా. ఆర్మీ వాళ్లు నన్ను చూసి కాపాడారు’’ అని 21 ఏళ్ల కార్మికుడు సుజల్ థాపా తెలిపారు.చనిపోవడం ఖాయమనుకున్నా..సింధుపాల్‌చౌక్ జిల్లావాసి దీపక్ తమాంగ్ తనకు ఇవే చివరి క్షణాలను భావించానని భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘ఇంటి నుంచి బయటికొచ్చి చూస్తే అంతెత్తున వరదనీరు దూసుకొస్తోంది. తప్పించుకునే దారే లేదు. అన్ని వైపుల నుంచి వరద ఉధృతి ఎదురొచ్చింది. బతకాలంటే కొండ ఎక్కడం ఒకటే దారి. కొండ వాలుపై మొత్తం ముళ్ల చెట్లే ఉన్నాయి. చేతులకు గుచ్చుకుంటున్నాసరే ముళ్లచెట్లను పట్టుకొని పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా పట్టు చిక్కలేదు. ఎట్టకేలకు పట్టు దొరకడంతో ఎక్కేశా. చావుకు, బతుక్కు మధ్య సన్నగీతను చూశా. అడవిలో రాత్రంగా ఎడతెరపి వర్షం కురుస్తుంటే అక్కడే దుంగల్ని నిల్వచేసే పాత గోడౌన్లో తలదాచుకున్నా. 24 గంటల తర్వాత నన్ను ఆర్మీ కాపాడింది’ అని చెప్పారు. -
వరద బురదలో విల విల!
కఠ్మాండు: మెరుపులా వచ్చి పడిన వరద బురద విలయంలో పారిపోయేందుకు క్షణమైనా సమయంలేక జల సమాధి అయిన అభాగ్యుల సంఖ్య అమాంతం పెరిగింది. నేపాల్–టిబెట్ సరిహద్దు మంచుకొండల నుంచి ముంచుకొచ్చిన జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య శనివారానికి ఏకంగా 675 దాటింది. 320 మంది విదేశీయులుసహా 2,426 మందికిపైగా జనం జాడ తెలీడంలేదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 183 మంది భారతీయులున్నారు. టిబెట్ వైపు ఏడుగురు చనిపోగా 554 మంది జాడ తెలీడంలేదని చైనా పేర్కొంది. భోటె కోశీ నదీపరీవాహక ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదిలో అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టాలు మళ్లీ స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వర్షం, బురద, చీకటిని సైతం లెక్కచేయకుండా బాధితులను కాపాడాలనే ఏకైక సంకల్పంతో 15 వేల మందికిపైగా సైనికులు అవిశ్రాంతంగా అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తుండటంతో వందలాది మందిని భవన శిథిలాలు, బురద మేటల నుంచి కాపాడగలిగారు. అడవుల్లో తలదాచుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందించారు. కాపాడిన వాళ్లను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లోని ఛోచెన్ నది, పురెఫు నదుల సంగమం వద్ద ఏర్పడిన వరద సరస్సులో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిలో కొనసాగడంతో మరోమారు జలఖడ్గం దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దిగువ నేపాల్వాసుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. సరస్సులో నీటి రంగు మారుతోందని, ఈ లెక్కన ఏ క్షణంలోనైనా కట్ట తెంచుకుని భారీస్థాయిలో నీరు కిందకు ఉగ్రరూపంలో ప్రవహించవచ్చని నేపాల్ ప్రభుత్వాన్ని చైనా అప్రమత్తంచేసింది. సరస్సు కట్టుతెంచుకుంటే సెకన్‌కు 500 ఘనపు మీటర్ల నీరు మెరుపువేగంతో కిందకు దూసుకొచ్చి ప్రళయం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు. దిగువ ప్రాంతాల వాళ్లు తాత్కాలికంగా ఎగువ అడవిలోకి వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తమ వారిని కోల్పోయి ఇల్లు, వాహనాలు, సామగ్రి కొట్టుకుపోవడంతో పలువురు జీవచ్ఛవాలుగా మారిపోయిన హృదయవిదారక దృశ్యాలు పలు చోట్ల దర్శనమిచ్చాయి. వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 2,465 మందిని రక్షించారు. వీరిలో 113 మంది భారతీయులు సహా మొత్తంగా 163 మంది విదేశీయులు ఉన్నారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ కౌంటీలో 1,000 మందిని కాపాడారు. 8జిల్లాల్లో ఇప్పటిదాకా 669 మృతదేహాలు లభ్యమయ్యాయి. రంగంలోకి భారత సొరంగ బృందం రాసువాలోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రాన్ని బురదమట్టి సగానికిపైగా కప్పేయడంతో లోపల చిక్కుకున్న దాదాపు 100 మంది సిబ్బందిని కాపాడేందుకు, రంధ్రం పెట్టేందుకు డ్రిల్లింగ్ యంత్రాలతో భారతీయ నిపుణులు రంగంలోకి దూకారు. భారత్‌లో సొరంగ సంబంధ సమస్యల్ని పరిష్కరించే 14 మందితో కూడిన నిపుణుల బృందాన్ని రప్పించారు. ఉత్తరాఖండ్‌లో మూడేళ్ల క్రితం సిల్క్యారా–బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో 17 రోజుల తర్వాత 41 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిన టన్నెల్ రెసూ్క, మెడికల్ టీమ్ శనివారం ఘటనాస్థలికి చేరుకుంది. అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డెక్స్తోనూ నేపాల్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్షా సమావేశం జరిపారు. నేపాల్ ఆర్మీ, పోలీసులు, సాయుధ బలగాలతో కూడిన 82 మంది బృందం శుక్రవారం రాత్రి నుంచి బురదను తొలగిస్తూ లోపలికి సొరంగం లోపలికి వెళ్లేందుకు శతథా కృషిచేస్తోంది. ఇప్పటిదాకా త్రిశూలి, రసువాసహా పలు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నుంచి 191 మంది సిబ్బందిని కాపాడారు. మరోవైపు రాజధాని కఠ్మాండును దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మగ్లింగ్–కఠ్మాండు జాతీయరహదారిని శనివారం పునరుద్దరించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారం, ఔషధాలు, వైద్య ఉపకరణాలుసహా పలు రకాల సామగ్రిని భారత్ శనివారం సైతం తరలించింది. దీంతో ఇప్పటిదాకా భారత్ నుంచి నేపాల్‌కు 57.6 టన్నుల మేర వరదసాయం అందింది. మిత్రదేశంపై చూపిస్తున్న మమకారానికి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్థికమంత్రి స్వరి్ణం వాగ్లే భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎడతెగని వాన.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్ అత్యంత ప్రభావితప్రాంతాల్లో సహా యక చర్యలకు కుండపోత వర్షాలు అడ్డంకిగా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని శనివారం నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కోశీ, భాగమతి, గండకీ, లుంబినా, సుందర్పశ్చిమ్ ప్రావిన్స్‌ల్లో, కర్నాలీ కొండ ప్రాంతాల్లో అతి వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారి హరిప్రసాద్ దహాల్ చెప్పారు. బురదమయంగా మారిన ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడితే కష్టమని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. దాతృత్వ సంస్థల నుంచి వెల్లువెత్తిన విరాళాలు వరదలో నాశనమైన రోడ్లు, వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మౌలిక సదుపాయాల పునరుద్దరణకు ఏకంగా రూ.48,000 కోట్లు అవసరం అవుతాయని నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో తీవ్ర దుఖంలో మునిగిపోయిన బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, సహాయక, అన్వేషణ కార్యక్రమాలకు తమ వంతు సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. భారత్, బ్రిటన్, ఆ్రస్టేలియా, అమెరికా, చైనా, ద.కొరియా. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయానికి నడుంబిగించాయి. -
క్షేమంగా ఇంటికి చేరుకున్న 28 మంది యాత్రికులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతి విలయానికి అతలాకుతలమైన నేపాల్‌లో చిక్కుకున్న మొత్తం 68 మంది ఏపీ వాసుల్లో ఇప్పటివరకు 28 మంది సురక్షితంగా స్వస్థలాలకు చేరారు. ఇంకా 13 మంది జాడ తెలీకపోవడంతో.. వారి ఆచూకీ కోసం అక్కడి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా మానస సరోవర్ యాత్ర, ట్రెక్కింగ్ కోసం వెళ్లిన వారే కావడం గమనార్హం. ఇందులో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో మిగిలిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.‘సైన్ ఇన్ ట్రావెల్స్’ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 28 మంది అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. భారీగా వరదలు వ్యాపించడంతో వీరి కళ్ళెదుటే ఎంతోమంది మృత్యువాతపడ్డారు. అయితే, వీరందరూ శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నానికి పలు గ్రూపులుగా హైదరాబాద్, విజయవాడ చేరుకున్నారు. కళ్లేదుటే ఘోరం జరిగినా ఎవరినీ రక్షించలేని, ఎవరికీ సహాయపడలేని స్థితిలో ఉన్నామంటూ వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఆచూకీ లభించని 13 మంది అన్నమదేవర వెంకట్రామ్, అన్నమదేవర అనఘ, చొప్పరపు రమేశ్‌బాబు, సంతోష్ సాహు, స్పందన్ సాహు, పాధ్య సురభి మన్మథ, సైనా కుమారి సాహు, వీఎల్ బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్య లక్షి్మ, కె. గోవింద్, సుహాసిని రెడ్డి కందిమల్ల, రంగనాథ్లుగా గుర్తించారు. భాస్కర్ శాస్త్రి కుటుంబం క్షేమం.. మరోవైపు.. అక్కడ చిక్కుకున్న వారిలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్‌శాస్త్రి, మణి శారద, రఘునాథ శాస్త్రి, హన్షిక కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రఘునాథ శాస్త్రికి తీవ్రమైన పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం) ఏర్పడడంతో ఆ కుటుంబం శుక్రవారం సాగా చేరుకుని హోటల్లో బసచేసింది. అక్కడ ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటుచేశారు. శనివారం వారు న్యాలమ్ కౌంటీకి చేరుకున్నారు. సరిహద్దు, వాతావరణం, రహదారి పరిస్థితులను బట్టి కోడారి మీదుగా కాఠ్మాండు చేరేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. వీరి కుటుంబం ఆది లేదా సోమవారం కాఠ్మాండు చేరుకునే అవకాశముంది. సెప్టెంబర్ 1న కాఠ్మాండు–ముంబై–హైదరాబాద్ విమాన ప్రయా ణం ఖరారైనట్లు అధికారులు తెలిపారు. -
అమ్మప్రేమ ఆయువు పోసింది
వాడు చెట్టు దిగలేదు. కింద రాకాసి వరద. వాడు కొమ్మ వదల్లేదు. రాత్రయ్యింది. చీకటి. వాడు ధైర్యాన్ని చొక్కా పైజేబులో ఉంచి గట్టిగా పట్టుకున్నాడు. ఎనిమిదేళ్ల పిల్లవాడు. నేపాల్ వరద సునామీకి దడవకుండా వాళ్లమ్మ కోసం ప్రాణం ఉగ్గపట్టుకున్నాడు. పర్వతం కూడా వాడికి తలఒంచింది. నేపాల్‌లో ఈ త్రివిక్రమ బాలుడు అందరినీ సంతోషంలో ముంచెత్తాడు.ఆగస్టు ఇరవై ఆరు, బుధవారం... ఉత్తర నేపాల్‌లోని రసువా. ఎనిమిదేళ్ల జోయల్ ఘాలే ఉదయం ఎప్పటిలాగే తన తమ్ముడితో కలిసి స్కూలు వ్యాన్ ఎక్కి బడికి వెళ్లాడు. తల్లి మాయా తమంగ్ (28) పిల్లల్ని బడికి పంపించి రోజూలాగే ఇంట్లో కూర్చుని మగ్గం నేస్తూ ఉంది. మరికాసేపటికి భూమి అదిరింది.భారీ చప్పుడు. ఏంటది? తల్లి ఉలిక్కిపడింది.జరిగిందేమిటో అర్థం కావడానికి తల్లికే కాదు ఊరికీ చాలాసేపు పట్టింది. ల్యాంగ్టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం దగ్గరి ఐస్ గ్లేసియర్ ఒక్కసారిగా కుప్పకూలి ఒక రాకాసిలా మారి కిందకు దూకింది. మంచు, రాళ్లతో కలిసి బురదరూపం దాల్చి ఉప్పెనలాగా లోయలోకి దూసుకొచ్చింది. దాని దెబ్బకి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. సూర్యుడి వెలుతురుకు అడ్డం పడుతూ భారీగా ఊరి మీద విరుచుకు పడ్డాయి. ఆ సమయానికి జోయల్ క్లాస్‌లో ఉన్నాడు. వాడికి చురుకు జాస్తి. ఏదో కొంప ముంచుకు వచ్చిందని ఒక్కసారిగా చుట్టుముట్టిన కారుచీకటిని చూడగానే అర్థమైంది. స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే జోయల్ తన ఫ్రెండ్‌తో కలిసి ప్రాణభయంతో అడవిలోకి పరుగెత్తాడు. దూసుకొస్తున్న బురద నీటికి దొరకకుండా ఉండటానికి చలిలో వణుకుతూ చెట్ల పైకి ఎక్కి కూర్చున్నాడు. పది నిమిషాలకు కుదుట పడ్డాడు. ఫ్రెండు ఏమయ్యాడో తెలియదు. చెట్టు దిగితే తన గతి అదేనని వాడికి తెలుసు. ఏమైనా సరే చెట్టు దిగకూడదు. అమ్మ వచ్చే దాకా దిగనే దిగడు.తల్లి వెతుకులాటప్రమాదం జరిగిన వెంటనే తల్లి మాయా తమంగ్ పిచ్చిదానిలా పిల్లలు ఉన్న స్కూలు వైపు పరుగెత్తింది. సాధారణంగా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు పట్టే ఆ దారి హఠాత్ ప్రళయం వల్ల బురదకుప్పలా మారిపోయింది. స్కూలు ఎక్కడుందో కూడా అర్థం కాలేదు. అక్కడ ఎటు చూసినా ఉధృతంగా ప్రవహించే నీరు, పెద్ద పెద్ద రాళ్లు, మోకాళ్ల లోతు బురద మాత్రమే కనిపించాయి’ అని ఆ తల్లి రాయిటర్స్ ప్రతినిధులతో అంది. తన కళ్ల ముందే సర్వస్వం కొట్టుకుపోతుంటే, తన ఇద్దరు బిడ్డలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని ఆమె గుండె పగిలేలా ఏడ్చింది.ఒక ఫోన్ కాల్‌తో తిరిగొచ్చిన ప్రాణం!మరోవైపు మాయా తమంగ్ తన బిడ్డల కోసం ఒక సహాయక శిబిరం నుండి మరో శిబిరానికి తిరుగుతోంది. నాలుగు శిబిరాల్లో కూడా పిల్లల పేర్లు లేకపోవడంతో, వాళ్లు చనిపోయారని ఆశ వదులుకుంది. ‘ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఆమె చెప్పింది. ఆ సమయంలో ఎవరో ఇచ్చిన సమాచారంతో ప్రతినిధి సహానాకు ఫోన్ చేసింది.‘నీ పెద్ద కొడుకు జోయల్ బతికే ఉన్నాడు, చికిత్స కోసం ఖట్మాండూ ఆసుపత్రికి తరలించారు’ అని వినగానే నమ్మలేకపోయింది. అప్పటికే ఆమె చిన్న కొడుకు కూడా సురక్షితంగా దొరికాడు. శుక్రవారం నాడు బెడ్‌పై ఉన్న జోయల్‌ని చూడగానే ఆ తల్లి సంతోషానికి పగ్గాల్లేవు. నవ్వూ... ఏడుపూ.... ‘నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్టు అయింది’ అంది కనునవ్వుతో.నేపాల్ కొండ వరదల వల్ల రసువా జిల్లాలో వందలాది మంది మరణించగా, వేలాది మంది అదృశ్యమయ్యారు. కానీ, మాయా తమంగ్‌కు ప్రకృతి ఆమె ఇద్దరు బిడ్డల్ని దోసిలిలో ఉంచి తిరిగి అప్పజెప్పింది. జపాన్ లో కన్స్ట్రక్షన్ పనిలో ఉన్న జోయల్ తండ్రి కూడా కొడుకును చూడటానికి నేపాల్‌కు బయలుదేరాడు. ఆసుపత్రి బెడ్‌పై కాలు విరిగి ఉన్నా, నవ్వుతూ ఉన్న కొడుకును చూసి.. ‘వీడు ఎప్పుడూ ఇంతే, భయం అంటే తెలీదు, వీడికి ఎముకలు విరగడం ఇది మొదటిసారి కాదు’ అని ఆ తల్లి నవ్వుతూ అన్న మాటలు విపత్తును గెలిచిన మాతృత్వానికి, ఆ పసివాడి అజేయమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. చిచ్చరపిడుగుసాయంత్రమైపోయింది. చీకటి పడింది. చెట్టు మీద ఉన్న జోయల్ చెట్టు దిగలేదు. భయపడలేదు. పట్టుజారి నీటిలో పడలేదు. అమ్మను చేరాలి వాడు. అంతే. ఎలాగైనా చేరతాడు కూడా. మరుసటి రోజు గురువారం ఉదయం నిఘా దళాలు అడవిలో ఉన్న జోయల్‌ను చూశాయి. ‘ఒరేయ్... మీ అమ్మ పిలుస్తోంది రా’ అన్నాయి. అపనమ్మకం కొద్ది, వాళ్ల వెంట వెళ్లడానికి కూడా వాడు రెడీ కాలేదు. వాణ్ణి ఒప్పించడానికి పోలీసులు వాడి చేతిలో రెండు పది రూపాయల నోట్లు పెట్టారు. హెలికాప్టర్ ద్వారా నువాకోట్ జిల్లాలోని చిన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికి వాడి కుడి కాలు విరిగిపోయింది, ముఖంపై గాయాలు ఉన్నాయి. అయినా సరే జోయల్ ఆ ఇరవై రూపాయలను తన ఎడమ చేతితో గట్టిగా పట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై తల్లి కోసం చూస్తున్నాడు. కాని తల్లి ఎక్కడ ఉందో... అసలు ఉందో లేదో తెలియదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక న్యూస్రిపోర్టర్ సహానా బజ్రాచార్య, జోయల్‌ని చూసి చలించిపోయింది. వాడి వీడియో తీసి వాళ్లమ్మకు చేరేలా చూడండి అని సోషల్ మీడియాలో పెట్టింది. -
బస్సులో నుంచి దూకి.. 500 మెట్లు ఎక్కి.. ప్రాణాలతో బయటపడి
కాఠ్మాండు: నేపాల్‌లో సంభవించిన భయంకరమైన వరదల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికా దంపతులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాపాయాన్ని గుర్తించిన వెంటనే బస్సు నుంచి దూకి, కేవలం కొన్ని సెకన్లలో 500 మెట్లు ఎక్కి ఎత్తైన ప్రాంతానికి చేరుకుని వారు ప్రాణాలు కాపాడుకున్నారు.అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతానికి చెందిన అంజనా రాజా, పట్టాభిరామన్ వెంకటేశన్ తొలిసారి టిబెట్ తీర్థయాత్రకు వెళ్లారు. నేపాల్‌లోని రసువా జిల్లాలో చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే గ్రామం వద్ద వారి టూర్ బస్సు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా కొండల నుంచి భారీగా నీరు, మట్టి, రాళ్లు దూసుకొచ్చాయి. బస్సు డ్రైవర్, కండక్టర్, ఇద్దరు సహాయకులు వెంటనే బస్సు నుంచి దూకడంతో ప్రమాదాన్ని గుర్తించిన దంపతులు కూడా బయటకు దూకారు. అంజనా తన భాగస్వామి వెంకటేశన్‌ను పట్టుకుని పరుగెత్తాలని చెప్పి, ఇద్దరూ ఎత్తైన ప్రాంతం వైపు పరుగులు తీశారు. మార్గంలో ఇళ్లు కూలిపోవడం, వరదలో ప్రజలు కొట్టుకుపోవడం చూసినా ఆగకుండా ముందుకు సాగారు. గైడ్ సహాయంతో కేవలం కొన్ని సెకన్లలో 500 మెట్లు ఎక్కి కొండపై సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి స్థానికులతో కలిసి మేకల కొట్టంలో గడిపిన తర్వాత మరుసటి రోజు హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమ ప్రాణాలతో బయటపడటం అద్భుతం కంటే తక్కువ కాదని వెంకటేశన్ చెప్పారు. వారి బస్సులో ఉన్న వారంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. -
వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. లక్షల కొద్దీ డబ్బు
కాఠ్మాండు: నేపాల్‌లోని పలు ప్రాంతాలను భీకర వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ వరద నీటిలో.. బ్యాంకులో నగదు, విలువైన వస్తువులు భద్రపరిచే పెద్ద ఇనుప పెట్టె (సేఫ్) కొన్ని కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. సేఫ్‌ను పగులగొట్టి అందులోని డబ్బును తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రసువాలోని భోటెకోషి ప్రాంతంలో వరదలకు బ్యాంకు సేఫ్ కొట్టుకుపోయినట్లు తెలిసింది. తర్వాత ధాదింగ్‌లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4లోని బెల్ఖుఖోలా సమీపంలో త్రిశూలీ నది ఒడ్డున అది కనిపించింది. స్థానికులు సేఫ్‌ను పగులగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు తమకు సమాచారం అందిందని ధాదింగ్ పోలీసులు తెలిపారు.రూ.57 లక్షలు స్వాధీనం వెంటనే పోలీసు బృందాన్ని ఘటనాస్థలానికి పంపించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక తనిఖీల్లో 29 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 92,68,505 నేపాలీ రూపాయలను అంటే సుమారు రూ.57 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది గల్చీ-4లోని మస్తార్ నివాసితులు. కొందరు గల్చీ-6లోని ఆదమ్ఘాట్, సిద్ధలేఖ్-7లోని ఆదమ్తార్కు చెందినవారు. మరికొందరు చిత్వన్, పర్సా ప్రాంతాలకు చెందినవారు. ప్రస్తుతం ధాదింగ్లో నివసిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వయసు 19 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంది. స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరికొందరు అనుమానితులు ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.మరో దిగ్భ్రాంతికర ఘటనలో, నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బాధితురాలి మృతదేహం నుంచి బంగారు చెవిపోగులు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిపోగుల్లా కనిపిస్తున్న వాటిని ఆ వ్యక్తులు తొలగిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి.భీకర వరదలకు సంబంధించి నేపాల్ విపత్తు సంస్థ శనివారం తన గణాంకాలను గణనీయంగా సవరించింది. ప్రస్తుతం 2,426 మంది గల్లంతైనట్లు తెలిపింది. నిర్ధారించిన మరణాల సంఖ్య 626కి పెరిగినట్లు పేర్కొంది. తాజా వివరాల ప్రకారం గల్లంతైన నేపాలీల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి 1,924 మంది గల్లంతైనట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. గల్లంతైన విదేశీయుల సంఖ్య 517గానే ఉందని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. -
నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే
-
సునామీలా వరద.. ఆ పరమశివుడే కాపాడాడేమో!
కొండలపై నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద.. క్షణాల్లోనే అంతా తుడిచిపెట్టేసింది. చుట్టూ బురద, రాళ్లు, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువే కనిపించింది. ఇంత విషాదంలో కొందరి ప్రాణాలు మాత్రం అద్భుతంగా దక్కాయి. తాము చూసిన భయానక దృశ్యాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ వారు చెప్పిన మాటలు ఆ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన తమిళనాడు యాత్రికులకు నేపాల్‌లో ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆగస్టు 26న రసువాగఢి ప్రాంతంలో ఒక్కసారిగా కొండలపై నుంచి నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయి. క్షణాల్లోనే రహదారులు, భవనాలు కొట్టుకుపోవడంతో 21 మంది యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చివరకు సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు.తమ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదీ తీరంలో భారీగా పొగలాంటిది కనిపించిందని యాత్రికులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత ఏదైనా పేలుడు జరిగిందని భావించామని.. అంతలోనే కొండపై నుంచి నీరు, మట్టి, ఇసుక, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం దూసుకొచ్చిందని చెప్పారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ తమ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.వరద ప్రవాహం బస్సులకు చేరువవుతుండటంతో డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చి సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొందరు మహిళలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడటంతో.. చీర సాయంతో ఒకరినొకరు పైకి లాగుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు నానా అవస్థలు పడి చివరకు ఓ రెస్క్యూ కేంద్రానికి చేరుకున్నారు.ఆ పరమశివుడి ప్రతిరూపం..తమను స్వయంగా ఆ శివుడే కాపాడాడని కొందరు యాత్రికులు నమ్ముతున్నారు. వరద ప్రవాహం తమవైపు దూసుకొస్తున్న సమయంలో సమీపంలోని కొండపై మట్టి, బురదతో శివుడి ముఖం ఆకారంలో ఓ రూపం కనిపించిందని వారు భావోద్వేగంగా చెబుతున్నారు. కైలాసానికి వెళ్లి శివుడి ఆశీస్సులు పొందాలనుకున్న తమను.. ఈ విపత్తు నుంచి కూడా ఆయనే కాపాడాడని చెప్పారు. నేపాల్ సైన్యానికి కృతజ్ఞతలువిపత్తులో చిక్కుకున్న యాత్రికులను నేపాల్ సైన్యం, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారిని ఖాట్మాండుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి న్యూఢిల్లీ మీదుగా చెన్నైకి తరలించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యాత్రికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా వందలాది మంది ఆచూకీ లేదుఇదిలా ఉండగా.. నేపాల్, టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 700కు దగ్గర్లో చేరగా.. 2,426 మంది గల్లంతైనట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్‌కు ఆహారం, మందులు, దుప్పట్లు, సోలార్ ల్యాంపులు తదితర సహాయక సామగ్రిని కూడా భారత్ పంపుతోంది.“We saw Lord Shiva’s face on the mountain as the water came hurtling towards us.”A group of 60 pilgrims from Tamil Nadu were travelling in three buses on the Kailash Mansarovar pilgrimage. The whereabouts of around 40 travelling in two of those buses remain unknown.The 21… pic.twitter.com/qmnWUhcF0Z— Rahul Kanwal (@rahulkanwal) August 28, 2026ఇదీ చదవండి: యుగాంతం వచ్చేసిందా? అన్నట్లు.. -
రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం
-
హిమాలయాల్లో మృత్యుఘోష
-
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గల్లంతు!
-
నేపాల్ వరద బీభత్సం.. 700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 700 దాటింది. 2,426 మంది గల్లంతయ్యారు. 5,851 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8,791 మంది పోలీసు సిబ్బంది సేవలందిస్తున్నారు. జిల్లాల వారీగా మృతుల జాబితాను నేపాల్ ప్రభుత్వం విడుదల చేసింది.రసువా-13, ధాదింగ్-45, గోర్కా-48, నవల్పూర్ (తూర్పు)-158, నువాకోట్- 49, చిత్వన్-233, తనహు-31, నవల్పూర్ (పశ్చిమ) -40 మంది మృతి చెందారు. రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అధిక సంఖ్యలో గాయపడినట్లు నేపాల్ పోలీసుల వెల్లడించారు. ఖాట్మండు లోయలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారిలో 140 మంది డిశ్చార్జ్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.త్రిశూలి నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేపాల్ వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. త్రిశూలిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా హెలికాప్టర్, సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు. నది నీటిమట్టం పెరుగుతూనే ఉండటంతో ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. నేపాల్‌కు మరింత వరద సహాయం పంపించాలని విజ్ఞప్తి చేశారు. వరదల్లో చిక్కుకున్న 320 మంది భారతీయులను రక్షించేందుకు తగ్గిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదీ చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్! -
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్‌ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
నేపాల్ వరదలు.. ప్రకృతి ఉగ్రరూపానికి పరాకాష్ఠ
ఇటీవల నేపాల్‌లో కురిసిన అసాధారణ భారీ వర్షాలు, దాని ఫలితంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం ఆ దేశంలో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. హిమాలయ ప్రాంతాల సున్నితమైన పర్యావరణం, అసంఘటిత పట్టణీకరణ, వాతావరణ మార్పుల తీవ్రత కలిసి నేపాల్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వంతెనలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమై ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ విపత్తు కేవలం నేపాల్‌కే కాకుండా నదీ పరివాహక ప్రాంతాలైన దక్షిణాసియా దేశాలన్నింటికీ ఒక తీవ్ర హెచ్చరిక.సాంకేతిక ఆధారిత ముందస్తు జాగ్రత్తలుఇలాంటి ప్రాణాంతక పరిణామాల తీవ్రతను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సాటిలైట్ ఇమేజరీ, డోప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా మేఘాల స్థితిని, వర్షపాత తీవ్రతను నిమిషాల వ్యవధిలో అంచనా వేయవచ్చు. నదుల ఎగువ ప్రాంతాల్లో ఐఓటీ సెన్సార్లను అమర్చడం ద్వారా నీటి మట్టం పెరిగిన వెంటనే దిగువ ప్రాంత ప్రజలకు ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ అలర్ట్‌లు పంపవచ్చు. హిమాలయాల్లోని మంచు సరస్సులు బద్దలయ్యే ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థలు అత్యంత కీలకం.వర్తమాన దేశాల వినియోగం - ఆర్థిక సవాళ్లుఅభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, అమెరికా వంటివి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ (ఈడబ్ల్యూఎస్), మల్టీ-లేయర్డ్ మైక్రో-క్యాచ్మెంట్ మేనేజ్మెంట్ తరహా సూక్ష్మ జలపాత నియంత్రణ సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత్ కూడా కల్పకం, కేంద్రీయ జల సంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో అధునాతన అంచనా వ్యవస్థలను అమలు చేస్తోంది. అయితే నేపాల్, భూటాన్ వంటి పరిమిత ఆర్థిక వనరులున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సాంకేతికతను అందుకోవడం సవాలుగా మారింది.అధిక వ్యయంఆధునిక డోప్లర్ రాడార్లు, రియల్-టైమ్ సమాచార నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు బిలియన్ డాలర్ల మూలధనం అవసరం. భౌగోళికంగా క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో సాంకేతిక పరికరాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. సరిహద్దు దాటి ప్రవహించే నదుల విషయంలో పొరుగు దేశాల మధ్య తగినంత సమాచార మార్పిడి లేకపోవడం మరిన్ని నష్టాలకు దారితీస్తోంది.పరిష్కార మార్గంవాతావరణ వైపరీత్యాలు సరిహద్దులుండవు. కాబట్టి సార్క్ లేదా బిమ్స్టెక్ వంటి ప్రాంతీయ కూటమిల ద్వారా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కలిపి నిధులు సమకూర్చుకోవాలి. గ్లోబల్ క్లైమేట్ ఫండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు నేపాల్ వంటి సున్నితమైన ప్రాంతాలకు ఉచిత సాంకేతిక బదిలీ, ఆర్థిక సహాయం అందించాలి. ప్రాణనష్టాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతపై పెట్టే పెట్టుబడి, విపత్తు తదుపరి పునరావాసానికి అయ్యే వ్యయం కంటే చాలా తక్కువ అని ప్రపంచ దేశాలు గ్రహించాలి.ఇదీ చదవండి: యూట్యూబ్‌తో అమెజాన్ చేతులు -
యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!
భారీ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే నేపాల్‌ను మరో జలప్రళయం ముంచెత్తుందన్న హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరదల ధాటికి ఏర్పడిన సహజ సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా హెచ్చరించింది. సరస్సులోని నీటి రంగు మరింత ముదురుతోందని.. ఇది కట్ట తెగే ప్రమాదానికి సంకేతం కావొచ్చని పేర్కొంది. ఎప్పుడైనా సరస్సు కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో సహాయక చర్యలకు, గల్లంతైన వాళ్ల కోసం కొనసాగుతున్న అన్వేషణకు తాజా వార్నింగ్ ఆటంకాలు కలిగిస్తోంది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు ఘోర నష్టాన్ని కలిగించాయి. అయితే ఆ సమయంలో ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. దీంతో నదీ ప్రవాహానికి అడ్డుగా సహజ కట్ట ఏర్పడి.. దాని వెనుక బారియర్ సరస్సు ఏర్పడింది. చైనా జలవనరుల శాఖ ప్రకారం.. శుక్రవారం నాటికి అందులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సరస్సు చైనాలోని చోచెన్ నది, నేపాల్‌లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది.కట్ట తెగితే.. 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహంఈ సరస్సు ఏ క్షణాన అయినా కట్టలు తెంచుకోవచ్చని చైనా నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టిబెట్ ప్రాంతంలో సహాయక చర్యలను సైతం నిలిపివేసింది. సరస్సు కట్టలో కొంత భాగం తెగితే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల నీరు నదిలోకి చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇది మొన్న సంభవించిన వరద ఉధృతితో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఉండే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహించడం ప్రారంభమైందని వెల్లడించింది. దీంతో డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నేపాల్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మైక్‌లలో చేస్తున్న హెచ్చరికలతో.. ఎత్తైన ప్రాంతాలకు తరలి పోతున్నారు.600కు చేరువలో మృతుల సంఖ్యఆకస్మిక వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. రసువాతోపాటు మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో 600 మంది దాకా మృతి చెందారు. 1,500 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు.. భారత సరిహద్దు వైపునకు కూడా కొన్ని మృతదేహాలు, బ్యాగులు కొట్టుకువస్తున్నాయి. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్ అంచనా వేసింది.2,000 people now missing in Nepal as death toll from floods hits 579.Nepali authorities say they’re monitoring two lakes upstream from the main flood zone, one of which has begun overflowing. pic.twitter.com/4cyByjJ1Yx— 𓂀 𝕋𝔼𝔸ℍ 𓂀 (@TeahCartel) August 28, 2026అటు టిబెట్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పలువురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కైలాస్–మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయుల ఆచూకీపై ఆందోళన కొనసాగుతోంది.టన్నెళ్లలో వందలమంది?భారీ వరదలకు నేపాల్‌లోని 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 933 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కొందరు టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క అప్పర్ త్రిశూలి–1 ప్రాజెక్టులోనే 576 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం.. మొబైల్, టెలిఫోన్ నెట్‌వర్క్‌లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు మూడు డజన్లకుపైగా వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.భారత్ నుంచి భారీ సాయంవిపత్తు నేపథ్యంలో ఇతర దేశాల సాయం వద్దన్న నేపాల్.. కొద్దిగంటల్లోనే మనసు మార్చుకుంది. ధ్వంసమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు 42 బెయిలీ వంతెనలు(తాత్కాలిక) నిర్మించేందుకు భారత్, చైనా సాయాన్ని నేపాల్ కోరింది. ఇటు భారత్ ఇప్పటికే నేపాల్‌కు సహాయక సామగ్రిని పంపింది. వైద్య సిబ్బంది, టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపేందుకు కూడా ముందుకొచ్చింది. ప్రస్తుతం వేలాది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా.. మరోవైపు సహజ సరస్సు ఎప్పుడైనా కట్టలు తెంచుకునే అవకాశం ఉందన్న చైనా హెచ్చరిక నేపాల్‌లో కొత్త ఆందోళనకు కారణమైంది. దీంతో బోటెకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.ఇదీ చదవండి: చైనా బార్డర్ వల్లే నేపాల్ సంచలన నిర్ణయం? -
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ
నేపాల్‌లో సంభవించిన వరదలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ (ఐపీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లక్ష్మీనాథ్ గోపిశెట్టి(లక్ష్ గోపిశెట్టి) ఈ వరదల ధాటికి ఆచూకీ లేకుండా పోయారు. ఆయనతో సంప్రదింపులు తెగిపోవడంతో ప్రస్తుతం ఆయన జాడ కనిపించకుండా పోయిందని ఇన్ఫోసిస్ అధికారికంగా ధ్రువీకరించింది.గోపిశెట్టి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ ప్రాంతానికి వెళ్లినట్లు సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఆయనను గుర్తించి సంప్రదించేందుకు స్థానిక యంత్రాంగం, సంబంధిత దౌత్య వర్గాలతో కలిసి శ్రమిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయన భద్రత, క్షేమానికే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్న ఇన్ఫోసిస్, గోపిశెట్టి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నట్లు తెలిపింది.అమెరికా, కెనడాల్లోని పబ్లిక్ సెక్టార్ రంగానికి ఐటీ మౌలిక వసతులు, డిజిటల్ సొల్యూషన్స్ అందించే ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ విభాగానికి గోపిశెట్టి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన యాక్సెంచర్, ఐబీఎమ్, హెచ్‌సీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పదవులు నిర్వహించారు.ఇదీ చదవండి: యూట్యూబ్‌తో అమెజాన్ చేతులు -
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల సాయం తమకేం అక్కర్లేదని తేల్చేసింది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపినట్లు ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. తమ భద్రతా బలగాలే సమర్థంగా పని చేస్తున్నాయని.. అలాంటప్పుడు వేరే దేశాల అవసరం తమకు ఉండకపోవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ అంటోంది. దీనికి స్పందించిన భారత్.. ఓ కీలక ప్రకటన చేసింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం ఆకస్మిక వరద పోటెత్తింది. ఎగువన ఉన్న గ్లేసియర్ కరిగిపోవడంతో.. బండరాళ్లు, బురదతో కూడిన వరద క్షణాల్లో ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 600 మృతదేహాలను వెలికి తీశారు. మరో 1,400 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేపాల్‌లోని రసువా జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు వరద కారణంగా ఏర్పడిన మరో సరస్సు కట్టలు తెంచుకునే ప్రమాదం చైనా ఇప్పటికే నేపాల్‌ను హెచ్చరించింది. దీంతో మరోసారి జల ప్రళయం(మునుపటి కంటే ఐదు రెట్లు తీవ్రతతో..) రావొచ్చని ఆందోళనల నడుమ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.భారత్ రియాక్షన్ ఇదే..నేపాల్ విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని ప్రకటించినప్పటికీ.. భారత్ మాత్రం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నేపాల్ అభ్యర్థన మేరకు.. అదనపు మానవతా సాయం, వైద్య బృందాలు, ఇంజినీరింగ్ సిబ్బంది, అవసరమైన పరికరాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో విమానం కూడా త్వరలో బయలుదేరనుంది. టన్నెల్ రెస్క్యూ టీమ్‌ను పంపేందుకు ముందుగా రెకీ బృందాన్ని పంపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరమైన పరికరాలను గుర్తించనున్నారు. అదేవిధంగా వైద్య బృందాన్ని పంపడంతోపాటు.. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు బెయిలీ(పోర్టబుల్) వంతెనలు, సాంకేతిక బృందాలను అందించేందుకు భారత్ ముందుకొచ్చింది.బృందాలనూ పంపుతాంసహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైన పరికరాలను పంపేందుకు భారత్ ప్రత్యేకంగా నేపాల్‌కు ప్రతిపాదన చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.పలు దేశాల నుంచి సాయం ఆఫర్నేపాల్ వరదల్లో తమ దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన నేపథ్యంలో పలు దేశాలు సహాయక బృందాలను పంపేందుకు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి తెలిపారు. తమ భద్రతా సంస్థలు ఇప్పటికే శోధన, రక్షణ చర్యలను చేపట్టాయని.. అవి సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు.చైనా సరిహద్దు ప్రాంతం కావడం వల్లేనా?విదేశీ రెస్క్యూ బృందాలను అనుమతించకపోవడం వెనుక రసువా ప్రాంత భౌగోళిక ప్రాధాన్యత కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోని టిబెట్‌కు సమీపంలో ఉండటంతో.. విదేశీ బృందాల రాక సున్నితమైన అంశంగా మారి ఉండొచ్చని నేపాల్ మాజీ దౌత్యవేత్త దినేశ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. అయితే నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.‘సాయం పూర్తిగా వద్దనడం కాదు’నేపాల్ అంతర్జాతీయ సాయాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదని ఛేత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఏదైనా ప్రత్యేక నైపుణ్యం లేదంటే సాంకేతిక సహాయం అవసరమైతే ఆయా దేశాలను తామే సంప్రదిస్తామని చెప్పారు.వరదల్లో దక్షిణ కొరియాకు చెందిన పలువురు జలవిద్యుత్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాలను అంగీకరించే పరిస్థితిలో లేదని తమకు సమాచారం అందినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అయినప్పటికీ నేపాల్‌తో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది. మానవతా సాయం కింద 10 లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది.ఆ వెంటనే యూటర్న్.. విదేశీ బృందాలకు ఓకే!విదేశీ రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, పెద్ద సంఖ్యలో విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో పరిమిత స్థాయిలో విదేశీ నిపుణులను అనుమతించింది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు టన్నెల్ రెస్క్యూ, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ గుర్తింపు ప్రక్రియల్లో సహకరించనున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే వైద్య, టన్నెల్ రెస్క్యూ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫరక్కా డెడ్‌లైన్.. మరో జల యుద్ధం తప్పదా? -
63 మంది భారతీయులను రక్షించిన నేపాల్ సైన్యం
-
Viral Video: బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నేపాల్ ప్రజలు.. భయానక దృశ్యాలు
-
నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని లాగి.. చెవిదుద్దులు చోరీ
కాఠ్మాండు: చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వేళ బాధితులకు సాయం చేయాల్సిందిపోయి చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.వరదలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకునిలాగిన ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిదుద్దులను తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి. నేపాల్ పోలీసులు ఆ 41 సెకన్ల వీడియోను తమ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు చెక్క పలకలు, మహిళ జుట్టు ఉపయోగించి నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు లాగడం కనిపించింది. తర్వాత ఆమె రెండు చెవుల నుంచి చెవిదుద్దులను తీసి పక్కన పెట్టారు. ఈ ఘటన జరుగుతుండగా పలువురు చుట్టూ నిలబడి వీడియోలు చిత్రీకరించారు.తర్వాత చిత్వన్ పోలీసులు దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన మృతదేహం భారీ వరద కారణంగా నారాయణి నదిలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వీడియో ఆధారంగా పోలీసులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీని గుర్తించారు. నేపాల్ మీడియా సంస్థ ఖబర్‌హబ్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భరత్పూర్ మహానగరపాలక సంస్థ-1లోని పోఖరా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడటం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరుకాగా, నేపాల్‌లో గత కొన్నేళ్లలో సంభవించిన అత్యంత ప్రాణాంతక వరద విపత్తుల్లో ఈ ఘటన ఒకటి. నేపాల్-టిబెట్ సరిహద్దును ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కొన్ని వందల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సరిహద్దు మార్గానికి వెళ్లే రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపనలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని కూడా అది తెలిపింది.मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026 -
ప్రళయం తర్వాత నేపాల్ ఎలా ఉందంటే..
-
నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన 7 మృతదేహాలు భారత్‌లో గుర్తింపు
లక్నో: నేపాల్ నుంచి ప్రవహించే నదుల్లో ఏడు మృతదేహాలను భారత అధికారులు వెలికితీశారు. ఇవి మెరుపు వరదల్లో మృతి చెందినవారి మృతదేహాలు అయి ఉండొచ్చని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన ఘోర వరద విపత్తు తీవ్రతను తెలియజేస్తోంది.నేపాల్ దక్షిణ ప్రాంతంలోని వరద ప్రభావిత చిత్వన్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో నదుల్లో ఈ మృతదేహాలు కొట్టుకొస్తూ కనిపించాయి.“గుర్తుతెలియని నాలుగు మృతదేహాలను గురువారం జిల్లాలో వెలికితీశాం. అక్కడ సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత అవి నేపాల్ నుంచి కొట్టుకొచ్చి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నాం” అని ” అని మహారాజ్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ ఏఎఫ్పీకి తెలిపారు. సరిహద్దు నుంచి నదీ ప్రవాహ దిశలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుషీనగర్ జిల్లాలో మరో మూడు మృతదేహాలను వెలికితీశామని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.కాగా, నేపాల్ వరదల్లో 538 మంది మృతి చెందారు. ఇందులో నేపాల్‌లో వెలికితీసిన 469, చైనాలో 3 మృతదేహాలు ఉన్నాయి. దాదాపు 1,400 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్‌లో వెలికితీసిన ఏడు మృతదేహాలను ఈ మృతుల సంఖ్యలో చేర్చలేదు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరు -
బాలసుబ్రహ్మణ్యం సురక్షితమేనా? ఇంకా దొరకని ఆచూకీ
-
మా కారు ముందే కొండచరియలు విరిగిపడ్డాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సంచలన నిజాలు
-
నేపాల్ వరదల ప్రభావం భారత్‌పై.. త్వరలోనే!
-
సరస్సు బ్లాస్ట్ నేపాల్ కు మరో ముప్పు
-
నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?
హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.బుధవారం నేపాల్‌లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్ సరిహద్దులోని చైనా రీజియన్‌లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్‌లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్‌లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్‌లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.చైనా చరిత్రలో మాయని మచ్చనేపాల్ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్ ప్రావిన్స్‌లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్‌ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్ డ్యామ్’గా పేరుపొందింది.కానీ 1975 ఆగస్టులో టైఫూన్ నినా కారణంగా హెనాన్‌లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్‌లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.ఒక రాత్రిలో 62 డ్యామ్‌లు!1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్ డ్యామ్ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్‌లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్‌లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 2 లక్షల మందికిపైనే..ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్టన్, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్‌ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ప్రస్తుతం నేపాల్–టిబెట్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.ఇదీ చదవండి: ఇరాన్ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా? -
LIVE: నేపాల్ లో హైఅలర్ట్ దూసుకొస్తున్న మరో మహా ప్రళయం
-
చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. దూసుకొస్తున్న మహా ప్రళయం
-
Nepal: దూసుకొస్తున్న మరో భారీ జల ప్రళయం
-
చైనా చాలా డేంజర్..బయటపడ్డ సంచలన విషయాలు
-
చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్
బీజింగ్: వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో జలవిలయం మరువక ముందే.. చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో చైనా నేపాల్‌ను అప్రమత్తం చేసింది. నేపాల్-టిబెట్ సరిహద్దులో మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. తాజా పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది.సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.గత రాత్రి నేపాల్, టిబెట్లు కూడా భూకంపంతో వణికిపోయాయి. ఆకస్మిక వరదల తర్వాత మరోసారి ఏ ముప్పు ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం గ్లేసియర్ కూలిపోవడంతోనే సిచువాన్ ప్రావిన్స్ భూకంపం సంభవించిందని.. బారియర్ సర్సు తెగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటు భూకంపం నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఏ క్షణంలోనైనా వరద విరుచుకుపడొచ్చని నేపాల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఇక టిబెట్ సరిహద్దులో వరద సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. మరో వరద ముంచుకొస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ నిలిపివేసినట్లు వెల్లడించింది. గైరాంగ్ పోర్ట్ వద్ద వరద ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మరో జల ప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్ కూడా అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్‌లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో.. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికాసేపట్లో భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోతున్నారు.ఇదీ చదవండి: యుగాంతాన్ని తలపించేలా నేపాల్‌కు మరో ముప్పు! -
నేపాల్‌లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పు
మరో వరద ముప్పు పొంచి ఉండడంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. కాసేపట్లో.. మొన్న సంభవించిన ఆకస్మిక వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో ఆ వరద నేపాల్‌ను ముంచెత్తబోతుందనే సమాచారం అందుతోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రాణభయంతో నదీ తీర ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. నేపాల్‌కు మరో భారీ జల ప్రళయ ముప్పు పొంచి ఉంది. గ్లేసియర్లు బద్ధలు కావడం.. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోవడంతో వరద ఉధృతంగా దూసుకొస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని చెబుతున్నారు. ఇటు వరద ముప్పు నేపథ్యంలో ఇటు చైనా కూడా టిబెట్‌లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.టిబెట్‌లోని గైరాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోవడంతో నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నేపాల్ భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. దీంతో గంటన్నర పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. టిబెట్‌లోనూ వరద ప్రమాదం కారణంగా చైనా రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని కిలోమీటరు మేర వెనక్కి రప్పించింది. రెండు రోజుల క్రితం మట్టి, శిథిలాల ప్రవాహంతో ఏర్పడిన ఈ బారియర్ సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.ఏ క్షణమైనా నేపాల్‌ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్షణక్షణానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. బారియర్ సరస్సు వరద విరుచుకుపడితే.. రుసువా, నువాకోట్‌కు తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.Alert !! pic.twitter.com/grYxhc5N7Q— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026బిహార్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్నేపాల్ వరద హెచ్చరికల నేపథ్యంలో ఇటు సరిహద్దు గ్రామాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారత్‌లోని బిహార్‌లో గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇదీ చదవండి: చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్బుధవారం ఉదయం ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడడంతో నేపాల్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 500 మృతదేహాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సుమారు 1500 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. ఈసారి ఐదు రెట్ల వరద వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
నేపాల్ లో మంటగలిసిన మానవత్వం.. శవాలపై నగల కోసం ఎగబడుతున్న జనం
-
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
మినిట్ టు మినిట్ అసలు నేపాల్ లో ఏం జరిగింది
-
నేపాల్-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
వరదలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని మరో ప్రకృతి ముప్పు వణికించింది. రెండు చోట్లా గురువారం రాత్రి భూకంపం సంభవించింది. నేపాల్‌లో రిక్టర్‌స్కేల్‌పై 3.2 తీవ్రతతో.. టిబెట్‌లో 5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో నమోదు అయ్యింది. అదే సమయంలో బారియర్ సరస్సు కట్టలు తెంచుకుని విరుచుకుపడొచ్చని చైనా హెచ్చరికలు నేపాల్‌ను మరింత వణికిస్తున్నాయి.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ప్రకృతి విలయంలో ప్రాణనష్టం 500కి చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నేపాల్, టిబెట్ రెండు చోట్లా కలిపి 1500 మంది గల్లంతయ్యారు. ఇందులో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉండగా.. అత్యధికంగా భారతీయులే 300 మంది ఉన్నట్లు సమాచారం. వాళ్లలో అత్యధికంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. టెలికాం వ్యవస్థలు నాశనం కావడంతో చాలామంది జాడ తెలియక ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తెగిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక బృందాలకు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా విషాదానికి కారణం భూకంపం కాదని.. హిమనదం కూలిపోవడంతో భారీ మంచు–రాళ్ల ప్రవాహం ఏర్పడి ఆకస్మిక వరదలకు(ప్లాష్ఫ్లడ్స్) దారితీసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తేల్చిచెప్పింది. మరో వరద ముప్పునేపాల్ ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్తగా ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకరంగా మారింది. భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. సహజంగా ఏర్పడిన అడ్డంకి తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి.భారతీయుల ఆచూకీ లేదుఈ విపత్తుతో భారత్‌లోనూ ఆందోళన నెలకొంది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భారతీయుల్లో 84 మందిని రక్షించినట్లు సమాచారం. మరోవైపు టిబెట్ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు సమాచారం. వీరిలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు. విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు.ఎటు చూసినా బురద.. వరదల ధాటికి సెకన్ల వ్యవధిలో రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికాం వ్యవస్థలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులకూ భారీ నష్టం వాటిల్లింది. నేపాల్ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. నదీ తీరాలు, బురదలో కూరుకుపోయిన ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమైనా.. తాజా భౌగోళిక విశ్లేషణలు మరో విషయాన్ని వెల్లడించాయి. హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి జారిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, మట్టి, శిథిలాలు దిగువకు దూసుకెళ్లి ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉండటంతో విపత్తు ఇంకా ముగియలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. This is apocalyptic 👀What really caused these Nepal floods? Could it have been prevented from happening? pic.twitter.com/UPPDcutom5— Dr. Chika (@chikaehiemere) August 27, 2026ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కళ్ల ముందే సర్వనాశనం! -
కళ్లముందే సర్వనాశనం
కఠ్మాండు: కళ్ల ముందే కుటుంబం మొత్తాన్నీ వరదనీరు కబళించిన దృశ్యాలు ఇంకా తన కళ్లలో అలాగే నిలిచిపోయాయని కంటతడి పెడుతూ 38 ఏళ్ల గిరిలాల్ చెప్పారు. ఆప్తులు, కుటుంబసభ్యులు, ఇల్లు కోల్పోయి ఏకాకిలా మిగిలిన ఎంతో మంది ఇంకా ఆ భయానక ఘటనలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కార్యాలయంలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసే గిరి లాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాసువా జిల్లాలోని సరిహద్దు పట్టణం తిమూర్‌లో గిరిలాల్ కుటుంబం ఉంటోంది. మెరుపు వరదల్లో గిరిలాల్ భార్య, నలుగురు సంతానం కొట్టుకుపోయారు. ‘‘కళ్లముందే జీవితం చెదిరిపోయింది. కాళ్ల కింద భూకంపం వచ్చినట్లయింది. నా వాళ్లంతా పోయారు’’అని గిరి గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ఉదయం 8.40 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. హఠాత్తుగా దిగువన ఉన్న దుకాణ సముదాయాన్ని అమాంతం ముంచేస్తూ వరదనీరు, బురద, మట్టి కొట్టుకొచ్చాయి. మా కళ్ల ముందే అంతా వరదనీటిలో కలిసిపోయాయి’’అని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. ‘‘నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలు విని్పంచాయి. అవేంటో అర్థంచేసుకునేలోపే భీకరంగా వరదనీరు విరుచుకుపడింది. పారిపోయేలోపే దిగువన ఉన్న జనాన్ని మింగేస్తూ వరదనీరు పోటెత్తి అందర్నీ తనలో కలిపేసుకుంది. క్షణాల్లో రోడ్డు, ఇళ్లు మటుమాయమై అంతటా భారీస్థాయిలో బురద పరుచుకుంది’’అని మరో ప్రత్యక్షసాక్షి వివరించారు. ‘‘భోటె కోశి నది సమీప డ్యామ్ కూలిపోయి నీరంతా దిగువకు కొట్టుకొస్తోందని ఎగువకు పారిపొండి అని అధికారులు చెప్పారు. అర్థం చేసుకుని అంతా పారిపోయేలోపే నీరు ముంచెత్తింది. నా 18 ఏళ్ల కుమారుడు, భార్య సైతం కని్పంచకుండా పోయారు’’అని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పారిపోయే సమయం కూడా ఇవ్వకుండా వరదనీరు సర్వనాశనం చేసిందని నువాకోట్‌లోని త్రిశూలి మార్కెట్లో వస్త్రదుకాణ వ్యాపారి వాపోయాడు. ‘‘తిమూర్ బజార్‌పై ఏకంగా 100 మీటర్ల ఎత్తులో వరద అలలుగా వచ్చినట్లుంది. అందుకే తిమూర్ బజార్ రెప్పపాటులో కన్పించకుండా పోయింది’’అని రాసువాలో చీఫ్ కస్టమ్స్ అధికారి, ప్రత్యక్ష సాక్షి రాజేంద్ర ధుంగానా చెప్పారు. కస్టమ్స్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న 300 వాహనాలు, ట్రక్కులు వరదలో కొట్టుకుపోయాయని మరో వ్యక్తి తెలిపారు. -
కైలాష్ యాత్రలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న సద్గురు
కైలాష్ మానస సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన బృందం విషాదంలో చిక్కుకుంది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వరద రావడంతో తమ బృందంలోని 80 మంది ఆచూకీ తెలియడం లేదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్ఘీ వాసుదేవ్ తెలిపారు. టిబెట్‌లోని సాగాలో ఈ ఘటన గురించి అనుచరులకు వివరిస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.వరదకు ముందు చివరి సందేశంసద్గురు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న S3 బృందం గైరాంగ్లోని ఇమ్మిగ్రేషన్ భవనానికి చేరుకుంది. ఉదయం 9:05 గంటలకు బృంద నాయకుడు తాము ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నామని చివరిసారిగా సందేశం పంపారు. ఆ తర్వాత కేవలం తొమ్మిది నిమిషాలకు, అంటే 9:14 గంటల సమయంలో భారీ వరద సంభవించినట్లు సద్గురు చెప్పారు. ఈ బృందంలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారు. వీరంతా వివిధ దేశాలకు చెందిన వారు అని తెలిపారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడి ఆచూకీ కూడా తెలియడం లేదని సద్గురు పేర్కొన్నారు.BIG BREAKING 🚨 Sadhguru broke down in tears while talking about Nepal floods 🥹Emotional Moment !!He says "I want to go to Gyirong to help flood victims.Kindly allow us (myself and a few volunteers) to be at Gyirong.We will in no way hamper rescue efforts.Our only… pic.twitter.com/KhAZG8Dyyc— News Algebra (@NewsAlgebraIND) August 27, 2026గల్లంతైన వారి సంఖ్యపై ఆందోళననేపాల్ వైపు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయని సద్గురు పేర్కొన్నారు. భారతీయ మీడియా కథనాలను ఉటంకిస్తూ నేపాల్ వైపు 484 మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్ వైపు మాత్రం పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. మొత్తం గల్లంతైన వారి సంఖ్య 1,500కు పైగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఖ్య ఎంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.సహాయక చర్యలకు సవాళ్లువరద ప్రభావిత ప్రాంతంలో రహదారులు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని సద్గురు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత, చైనా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నామని, అమెరికా రాయబార కార్యాలయం కూడా సహకరిస్తోందని చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు తమవారి సమాచారం కోసం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. -
నేపాల్ వరదలు.. కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కోడలు మిస్సింగ్
కోల్‌కతా: టిబెట్ సరిహద్దు సమీపంలోని నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తిన వేళ గల్లంతైన వారిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శుభ్రాంశు రాయ్ బిజ్పూర్ భార్య కూడా ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో నివసించే శర్మిష్ఠ భౌమిక్ రాయ్‌కు ఆగస్టు 25 రాత్రి నుంచి తన భర్తతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోయింది. రాయ్ బిజ్పూర్ తృణమూల్ మాజీ ఎమ్మెల్యే. ఆయన మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కుమారుడు. శుభ్రాంశు రాయ్ భార్య ఒక ప్రయాణ సంస్థ ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా ఆగస్టు 21న నేపాల్‌కు వెళ్లారు. ఆమె ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. కోల్‌కతా నుంచి కైలాస పర్వతం, మానస సరోవరం వైపు వెళ్లిన 32 మంది బృందం కూడా గల్లంతైన వారిలో ఉంది. ఈ బృందంలో 30 మంది పర్యాటకులు, ఇద్దరు యాత్ర నిర్వాహకులు ఉన్నారు. ఆగస్టు 21న కోల్‌కతా నుంచి బయలుదేరిన బృందం మరుసటి రోజు నేపాల్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువాగఢికి బృందం చేరుకుంది. ఉదయం 8.30 గంటల సమయంలో సభ్యులు ఓ కార్యాలయంలో ఉన్నారు.వరదల మధ్య నేపాల్‌లోని నివాస ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది మృతి చెందినట్లు సమాచారం. 750 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారు. వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. బుధవారం ఉదయం 8.37 గంటలకు టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. మూడు నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు వచ్చినట్లు సమాచారం అందిందని చెప్పారు.ఈ ప్రకంపనలు హిమనదం అకస్మాత్తుగా కరిగి భారీగా నీరు విడుదల కావడానికి కారణమై ఉండవచ్చని నేపాల్ అధికారులు తెలిపారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో పాటు సమాచార వ్యవస్థలు స్తంభించిపోవడంతో తీవ్రంగా ప్రభావితమైన కొన్ని ప్రాంతాలకు చేరుకోవడంలో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
హైదరాబాద్ నుంచి వెళ్లిన 35 మంది సేఫ్.. నాకు వాళ్లు ఫోన్ చేసి చెప్పింది ఇదే
-
నేపాల్ లో జరిగిన విధ్వంసంపై కళ్లనీళ్లు పెట్టుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
-
కళ్ల నీళ్లు తెప్పిస్తున్న నేపాల్ డ్రోన్ విజువల్స్
-
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సద్గురు.. చేతులూ వణికాయ్..
న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల్లో తమ సంస్థకు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని భావోద్వేగంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రకటించడంతో టిబెట్‌లోని ఈశా ఫౌండేషన్ శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టిబెట్‌లోని సాగాలో ఉన్న శిబిరంలో వాతావరణం విషాదభరితంగా మారింది.కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ, సద్గురు చేతులు వణుకుతుండగా భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేశారు. భారీ విధ్వంసం జరిగిన టిబెట్‌లోని గ్యిరోంగ్‌కు వెళ్లి సహాయక చర్యలు, యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని భారత, చైనా రాయబార కార్యాలయాలను కోరారు.సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆధ్యాత్మిక గురువు ప్రస్తుతం సాగాలో ఉన్నారు. కైలాస యాత్ర నుంచి తిరిగి వస్తున్న 80 మంది సభ్యుల బృందానికి జరిగిన విషాదాన్ని వివరిస్తూ ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. “విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇది భయంకరమైన, అసాధారణమైన ఘటన” అని సద్గురు అన్నారు.తన అనుచరులను ఉద్దేశించి సద్గురు మాట్లాడుతూ.. గురువారం ఉదయం తాను స్వయంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే విపత్తు కారణంగా అక్కడికి వెళ్లే దాదాపు అన్ని మార్గాలు తెగిపోయాయని తెలిపారు. “ఇప్పటివరకు మాకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు... కానీ విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి ఏమాత్రం బాగున్నట్లు కనిపించడం లేదు” అని ఆయన అన్నారు.సందేశం వచ్చిన 9 నిమిషాల్లోనే సంబంధాలు కట్బృందం గ్యిరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో మొత్తం భవనం కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు తెలిపారు. వరద నీరు భవనాన్ని తాకిన క్షణాన్ని చూపించే భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితమే తాను అదే ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నానని సద్గురు గుర్తుచేసుకున్నారు. “వారం రోజుల క్రితం మేము ఇమ్మిగ్రేషన్ కోసం ఉన్న అదే భవనం... ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది” అని ఆయన అన్నారు.ఉదయం 9.05 గంటలకు బృందం నాయకుడు ఇషంగా ప్రవీణ్ నుంచి ఫౌండేషన్‌కు సందేశం వచ్చిందని సద్గురు తెలిపారు. “వారు ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్నారని ఆయన సందేశం పంపారు. ఆ తర్వాత 9.14 గంటలకు ఇది జరిగింది” అని సద్గురు చెప్పారు.మరోసారి భావోద్వేగంప్రవీణ్ 20 ఏళ్లకు పైగా ఈశా ఫౌండేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పేటప్పుడు సద్గురు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రవీణ్ నేపాల్ ఫోన్ నంబర్ ఆ రోజు పనిచేయడం ప్రారంభించలేదని తమ బృందం గుర్తించిందని సద్గురు తెలిపారు. “అతను సరిహద్దు దాటి ఉంటే, అతని నేపాల్ ఫోన్ పనిచేయాలి. కానీ అది పనిచేయలేదు” అని సద్గురు అన్నారు.మంచు చరియలు విరిగిపడటం వల్ల ఈ విషాదం సంభవించి ఉండొచ్చని, విపత్తు తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సద్గురు హెచ్చరించారు. ప్రభావితమైన వారి సంఖ్య 1,500 లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు.అయితే సద్గురు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఫౌండేషన్‌కు బృందం నుంచి చివరిసారిగా సమాచారం వచ్చి దాదాపు 12 గంటలు గడిచాయని ఆయన తెలిపారు. దీని ఆధారంగా అన్ని ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని మాత్రం ఆయన చెప్పలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌లో ప్రభావిత ప్రాంతానికి సద్గురు, చిన్న బృందం వెళ్లేందుకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలకు మద్దతు ఇవ్వాలని సద్గురు కోరుతున్నారు.“ఈ విషయంలో భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంతమంది వ్యక్తులతో కలిసి నేను అక్కడికి వెళ్లి మనం ఏం చేయగలమో చూసేందుకు అనుమతిస్తారేమో చూస్తున్నాం” అని ఆయన అన్నారు. సద్గురు తన ప్రసంగాన్ని ముగించినా ఈశా శిబిరంలో విషాద వాతావరణం అలాగే కొనసాగింది. నేపథ్యంలో వినిపించిన రోదనలు ఆగలేదు.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులుటిబెట్కు సరిహద్దుగా ఉన్న నేపాల్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో సుమారు 300 మంది మరణించగా, 1,500 మంది గల్లంతయ్యారు. వరద నీరు వల్ల ఇళ్లు, వాహనాలు, వంతెనలను కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది భారతీయులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త స్పందననేపాల్లో వరద పరిస్థితుల కారణంగా ఈశా ఫౌండేషన్ ‘సేక్రెడ్ వాక్స్’ (కైలాస మానస సరోవర్ యాత్ర)కు వెళ్లిన పలువురు యాత్రికులు, స్వచ్ఛంద సేవకులు గల్లంతు కావడం/చిక్కుకుపోవడంపై ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త మా గంభీరి స్పందించారు “ఊహించని పరిస్థితి ఎదురైంది. బృందం కాఠ్మాండూకు తిరిగి వస్తుండగా చైనా ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉంది. ఉదయం 9.05 గంటలకు వారితో చివరిసారిగా మాట్లాడినప్పుడు, బృందం నాయకుడు ప్రవీణ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి ఇప్పుడే చేరుకున్నామని, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నామని చెప్పారు. 10 నిమిషాల్లోనే మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులుఆ 10 నిమిషాల్లోనే ఈ మొత్తం విషాదం జరిగింది. మొత్తం సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో బృందంలోని అందరితో సంబంధాలు తెగిపోయాయి. మేము సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. నేపాల్ వైపు అన్ని సమాచార వ్యవస్థలు పనిచేయలేదు. సమాచారం తెలుసుకునేందుకు కొన్ని హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను. నేపాల్ వైపు మా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు ఉన్న పట్టణం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 80 మంది ఈ ఘటనతో ప్రభావితమయ్యారు. చైనా అధికారులు త్వరలో, ఆశాజనకంగా రేపు ఉదయం నాటికి ఏదైనా సమాచారం ఇస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం. మంచి వార్త వింటామనే ఆశతో ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 77 మంది యాత్రికుల గురించి ఆమె మాట్లాడుతూ.. “వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌లోని వివిధ దేశాలు, బ్రిటన్ నుంచి వచ్చారు. కొన్ని ఆసియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 19 దేశాల నుంచి పాల్గొన్నవారు ఉన్నారు. వారిలో చాలామంది భారతీయ మూలాలు ఉన్నవారు. భారత్, నేపాల్‌లోని మొత్తం 19 రాయబార కార్యాలయాలను సంప్రదించాం. వారితో మేము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం. మాకు ఎలా సహాయం చేయాలి, ఏదైనా సమాచారం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను వారు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషాదం చాలా మారుమూల ప్రాంతంలో, భారీ స్థాయిలో చోటుచేసుకోవడంతో సమాచారం అందడానికి చాలా ఆలస్యం అవుతోంది” అని తెలిపారు. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) -
నేపాల్ వరదల్లో చిక్కుకున్న సుహాసిని రెడ్డి పేరెంట్స్ ఆవేదన
-
750 మంది భారతీయులు ఎక్కడ..? కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
-
BIG ALERT: హిమాలయాల నుండి ముంచుకొస్తున్న మహా ప్రళయం
-
DRDO మాజీ ఛైర్మన్ అసలు అక్కడ ఏం జరుగుతుందో లైవ్ లో చెప్పిన సతీష్ రెడ్డి
-
నేపాల్ వరదలకు కారణం ఇదే ఉస్మానియా ప్రొఫెసర్ చెప్పిన సంచలన విషయాలు..
-
చిన్న మంచు ముక్కకే నేపాల్ మునిగితే... హిమాలయాలు కరిగితే...? నేపాల్ వరదల వెనుక రహస్యం?
-
సైన్స్‌కు అర్థం కాని కైలాస రహస్యం..
-
నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు!
-
ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?
నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతానికి వెళ్లిన భారతీయ యాత్రికుల్లోనూ పలువురి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అయితే..ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా పేరొందిన కైలాస్ మానస సరోవర్ యాత్రకు భారత్‌తో పాటు నేపాల్, చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ యాత్రపై భక్తుల్లో ఉన్న విశ్వాసం అసాధారణం.శివుని నివాసంగా..హిందూ సంప్రదాయం ప్రకారం కైలాస్ పర్వతం పరమశివుడి నివాసంగా భావిస్తారు. మంచుతో కప్పుకున్న ఈ పర్వతాన్ని భక్తులు కేవలం ఓ పర్వతంగా కాకుండా.. దైవ స్వరూపంగా దర్శిస్తారు. శివుడు, పార్వతీదేవి ఇక్కడ నివసిస్తారని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. కైలాస్ పర్వతం పక్కనే ఉన్న మానస సరోవర్ సరస్సు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.ప్రపంచంలోనే ప్రత్యేకమైన సరస్సుసముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు, నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయి. ఉదయం సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుందని యాత్రికులు చెబుతారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలిసే అరుదైన ప్రదేశంగా మానస సరోవర్కు గుర్తింపు ఉంది.ఎందుకు ఈ సమయంలోనే యాత్ర?కైలాస్ మానస సరోవర్ యాత్రకు కూడా ఓ ప్రత్యేకమైన కాలం ఉంటుంది. సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రకు అనుకూల సమయంగా భావిస్తారు. శీతాకాలంలో మంచు తీవ్రత పెరిగి పర్వత మార్గాలు మూసుకుపోవడంతో యాత్ర దాదాపు అసాధ్యంగా మారుతుంది. వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం ముగిసే వరకు మంచు కరుగుతుంది.. మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నిర్మలమైన వాతావరణంలో కైలాస్ పర్వత దర్శనం, మానస సరోవర్ అందాలను ఆస్వాదించేందుకు వేలాది మంది భక్తులు ఈ కాలంలోనే యాత్రకు బయల్దేరుతారు. అయితే హిమాలయ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అనుకూలమైన సీజన్లోనూ ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి సవాళ్లు యాత్రికులకు పరీక్షగా మారుతున్నాయి.కఠినమైన ప్రయాణం.. అయినా తగ్గని భక్తిమానస సరోవర్ యాత్ర సాధారణ ప్రయాణం కాదు. అత్యంత ఎత్తైన పర్వత మార్గాలు, తక్కువ ఆక్సిజన్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు యాత్రికులకు సవాళ్లుగా నిలుస్తాయి. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నవారే ఈ యాత్రను పూర్తి చేయగలరు. భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గాల ద్వారా ఈ యాత్రను నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ మార్గం, నేపాల్ మార్గాల ద్వారా యాత్రికులు టిబెట్‌లోని కైలాస్ ప్రాంతానికి చేరుకుంటారు.అనేక మతాలకు పవిత్ర స్థలంకైలాస్ పర్వతం కేవలం హిందువులకే కాదు.. జైనులు, బౌద్ధులు, టిబెటన్ సంప్రదాయాలను అనుసరించే వారికి కూడా పవిత్రమైన ప్రాంతం. జైన సంప్రదాయం ప్రకారం తొలి తీర్థంకరుడు రిషభదేవుడు ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారని విశ్వసిస్తారు. బౌద్ధులు కూడా కైలాస్‌ను పవిత్ర పర్వతంగా గౌరవిస్తారు.ప్రకృతి సవాళ్లు.. పెరుగుతున్న ఆందోళనలుఇటీవల కాలంలో హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది. ఆకస్మిక వర్షాలు, మంచు కరుగుదల, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు యాత్రికులకు ప్రమాదంగా మారుతున్నాయి. అయినప్పటికీ.. జీవితంలో ఒక్కసారైనా కైలాస్ మానస సరోవర్‌ను దర్శించాలనే ఆకాంక్షతో భక్తులు ఈ సాహస యాత్రను కొనసాగిస్తున్నారు.కైలాస్ మానస సరోవర్ యాత్ర కేవలం ఓ ప్రయాణం కాదు.. అది భక్తి, నమ్మకం, ప్రకృతి మధ్య జరిగే ఓ ఆధ్యాత్మిక అనుభవం. అందుకే ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ యాత్రకు ప్రత్యేక స్థానం కొనసాగుతోంది. -
చైనాకు తెలిసిన నేపాల్‌ను హెచ్చరించలేదా? చైనా పాపమే .. నేపాల్ కి శాపమా?
-
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?
-
నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు
-
నేపాల్ వరదలు.. DRDO మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితం
టిబెట్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు,మంచుచరియల విరిగిపడిన ఘటనలో డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు.హైదరాబాద్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస సరోవర్ యాత్రకోసం సతీష్ రెడ్డి బృందం వెళ్లిన కొన్నిగంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ‘మేం 31 మంది యాత్రకు వెళ్లాం. భారీ మంచుకొండ చరియ విరిగిపడి వరదలు ముంచెత్తాయి. అయితే, మేము ఆ ప్రాంతాన్ని సకాలంలో దాటడంతో ప్రాణాపాయం తప్పింది. అందరం సురక్షితంగా ఉన్నాం. ప్రస్తుతం టిబెట్‌లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే భారత్‌కు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం’ అని ఆయన తెలిపారు. -
నేపాల్ ఫ్లాష్‌ఫ్లడ్స్.. ఆ ఆరోపణల్ని ఖండించిన చైనా
ఫ్లాష్ఫ్లడ్స్పై ఉద్దేశపూర్వకంగానే తమ దేశం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్న నేపాల్ అధికారుల ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర సహకారం మాత్రమే అవసరమని అభిప్రాయపడింది. అలాగే.. నేపాల్ జలవిలయంపై జరుగుతున్న ఓ ఫేక్ ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలపై నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం స్పందిచింది. తమ దేశం ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రస్తుత పరిస్థితుల్లో సహకారంతోనే ప్రాణాలను కాపాడగలమని పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర ఆరోపణల కంటే సహాయక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి’’ అని పేర్కొంది.అలాగే చైనా వైపు ఉన్న ఓ డ్యామ్ కూలిపోయి.. నేపాల్‌లో ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ‘ఫేక్ న్యూస్’ అని ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.భూకంపం.. హిమపాతమే కారణం: చైనాఆగస్టు 26 ఉదయం భూకంపమో, భూకంపం మాదిరిగా మంచు ఫలకాలు కూలిపోవడం వల్లనో.. భారీగా మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించడంతో ఫ్లాష్‌ఫ్లడ్స్ విపత్తు చోటుచేసుకుందని పేర్కొంది. రసువాగఢి-కెరుంగ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల వైపునా ఈ ప్రభావం కనిపించిందని చైనా వెల్లడించింది.175 మంది మృతి.. వందలాది మంది గల్లంతుహిమాలయ ప్రాంతంలో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నీరు, మట్టి, రాళ్లు, మంచు కలిసి వచ్చిన భారీ ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు 175 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 1,300 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.నేపాల్ వైపు భిన్న వాదనలువర్షం లేకున్నా.. మెరుపు వరదలు ముంచెత్తడంపై రకరకాల థియరీలు తెరపైకి వచ్చాయి. తొలుత భూకంపమే కారణమని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) తాజా విశ్లేషణలో అది భూకంపం కాదని, గ్లేసియర్ కూలిపోవడం వల్లే భారీ ప్రకంపనలు, ఫ్లాష్‌ఫ్లడ్స్ సంభవించాయని వెల్లడించింది. భారత్‌కు చెందిన ఇస్రో మాత్రం తన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణతో.. వరదలకు ముందు సంభవించిన భూకంపం.. గ్లేసియర్ కూలిపోవడానికి ట్రిగ్గర్‌గా మారి ఉండొచ్చని అంచనా వేస్తోంది.మరోవైపు నేపాల్‌లో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరదలు టిబెట్ సరిహద్దు నుంచి నేపాల్ జిల్లాలకు చేరేందుకు రెండుగంటల సమయం పట్టిందని.. ఆ గ్యాప్‌లో చైనా నుంచి ముందస్తు హెచ్చరిక అందలేదని, దీనివల్ల నష్టం మరింత పెరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే చైనా ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఇరు దేశాల మధ్య విపత్తులపై సహకార వ్యవస్థ ఉన్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, హిమపాతం వంటి ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చే ప్రత్యేక ద్వైపాక్షిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మాత్రం లేదని తెలుస్తోంది.Deeply saddened by the devastating natural disaster in the Gyirong–Rasuwagadhi border region, which has caused significant casualties and losses on both the Chinese and Nepali sides.My deepest condolences to those who lost their lives, and my sincere sympathies to their…— Ambassador Zhang Maoming (@PRCAmbNepal) August 27, 2026రంగంలోకి దిగిన చైనానేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనపై చైనా త్వరగతిన స్పందించింది. ఈ విపత్తులో తమ వైపు కూడా నష్టం జరిగిందని పేర్కొంటూ.. సహాయక చర్యలను వేగవంతం చేసింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగించాలని ఆదేశించారు. చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించింది. టెంట్లు, దుప్పట్లు, ఇతర సహాయక సామగ్రిని తరలించడంతో పాటు అత్యవసర నిధులను కూడా కేటాయించింది.ఇదీ చదవండి: చైనా బ్రహ్మరాక్షసితో భారత్‌కే పెనుముప్పు? -
మా వాళ్లు ఎలా ఉన్నారో?
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్‌కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది. నేపాల్ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు. 31 మంది క్షేమం చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్‌లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ స్వామి ఫోన్ ద్వారా వెల్లడించారు. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు. 2014లో హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలోని బియాస్ నది వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్ స్టేషన్లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు. చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో..
ఖాట్మండు: నేపాల్‌లో మంచు, బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు సృష్టించిన భయానక విధ్వంసం ఏరియల్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గల్లంతయ్యారు. పైనుంచి చూసిన దృశ్యాల ప్రకారం చైనా-నేపాల్ సరిహద్దుల్లోని రసువా జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, రహదారులు ధ్వంసమై మానవ నివాసాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. టిబెట్‌లో పుట్టిన భోటే కోశి నది పెను ఉధృతితో ముంచుకొచ్చి ఈ భారీ నష్టాన్ని మిగిల్చింది. రసువాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్‌లో నది తన మార్గాన్ని మార్చుకోవడంతో నివాస ప్రాంతాలన్నీ బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు ఏరియల్ వీక్షణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. VIDEO | Nuwakot, Nepal: Aerial views reveal the extent of devastation after Nepal flash floods.#NepalFloodNews #NepalTragedy(Source: AFP/Only for use in India)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/XlPVqQEdet— Press Trust of India (@PTI_News) August 27, 2026 -
ముందే తెలిసినా చెప్పలేదా?.. చైనా అసలేం చేసింది?
నేపాల్‌లోని రసువాలో బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే ఇంతటి విపత్తు సంభవించే అవకాశం గురించి నేపాల్, చైనా ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం ఎందుకు అందలేదు? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణ, జలవనరుల సమాచారాన్ని పరస్పరం పంచుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ.. తాజా విపత్తుపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక అందలేదని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.రసువాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర వరదలు రావడంతోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్పటికే వరద ఉధృతి భారీగా పెరిగి నదీ పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి.BIG ALLEGATION ON CHINA | Nepal FloodsQuestions are being raised over whether Nepal received timely information about the flood situation from China.Nepali media reports, citing Chinese media, claim that flooding hit Tibet’s Kerung County around 10:30 AM local time, more than… pic.twitter.com/BywSpR5CtK— The Bharat Post (@TheBharatPost__) August 27, 2026అసలు వరదలకు కారణమేంటి?టిబెట్‌లో ఏదైనా హిమానీనదం, హిమనద సరస్సు లేదా నదీ వ్యవస్థలో ఆకస్మిక మార్పు జరిగితే.. దాని ప్రభావం నేపాల్‌పై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే సమాచారం అందితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కానీ తాజా ఘటనలో అలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో నష్టం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, నేపాల్ మధ్య వాతావరణ సంబంధిత సమాచారాన్ని పంచుకునేందుకు ఒక యంత్రాంగం ఉంది. కానీ ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ తాజా వరదలపై ముందస్తు సమాచారం రాలేదని నేపాల్ అధికారులు చెబుతున్నారు.ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య సమాచార మార్పిడిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. టిబెట్‌లో విపత్తుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించినా.. అవి నేపాల్‌కు చేరలేదా? లేక అక్కడ అలాంటి సమాచారం అందుబాటులో లేదా? అన్నది తేలాల్సి ఉంది. విపత్తు తర్వాత సమాచారం అందడం వల్ల ప్రయోజనం పరిమితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.🔴 Les images en provenance du #Népal sont terrifiantes. Le séisme d’une magnitude de 4,4 qui s’est produit la nuit dernière au Tibet a déclenché des #avalanches de glace et des #glissements de terrain. Ils ont formé des embâcles sur les rivières de la région qui ont fini par… pic.twitter.com/XIdlQ76gii— Guillaume Woznica (@GWoznica) August 26, 2026ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి..భోటేకోశి నది వరదల అనంతరం రూపొందించిన నివేదికలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చైనా-నేపాల్ సరిహద్దుల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అంతర్గత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హిమానీనదాలు, హిమనద సరస్సులు, నదుల్లో ఆకస్మిక మార్పులను ముందుగానే గుర్తించి సమాచారం అందించే వ్యవస్థ ఉంటే.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.చైనాతో అధికారిక ఒప్పందం అవసరమా?విపత్తు నిర్వహణ రంగ నిపుణులు చైనా, నేపాల్ ప్రభుత్వాలు ఈ అంశంపై అధికారికంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదలు, హిమానీనదాల విస్ఫోటనాలు, ఇతర ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పరస్పరం పంచుకునేలా ప్రత్యేక అవగాహన ఒప్పందం (MOU) చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. టిబెట్ వైపు జరిగే పరిణామాలను నిరంతరం గమనించాలని నిపుణులు అంటున్నారు. టిబెట్‌లో జరిగే ఏ చిన్న మార్పు అయినా నేపాల్‌లోని నదులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు సమాచారం అత్యంత కీలకమని చెబుతున్నారు.చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్చైనా అధ్యక్షుడు, ప్రధాని స్పందననేపాల్ విపత్తు జరిగిన కొన్ని గంటలకే చైనా ప్రభుత్వం కూడా స్పందించింది. టిబెట్‌లో పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆదేశించినట్లు ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. అలాగే వరద నియంత్రణ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని విభాగాలు, సంబంధిత సంస్థలు హై అలర్ట్‌లో ఉండాలని, ప్రమాదాలను గుర్తించి వాటిని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.ఆలస్యమైన సమాచారం.. పెరిగిన నష్టం?నేపాల్ నిపుణుల ప్రధాన ఆందోళన ఇదే. విపత్తు జరిగిన తర్వాత సమాచారం అందడం కాదు.. విపత్తు రాకముందే సమాచారం అందాలి. ముఖ్యంగా చైనా-నేపాల్ సరిహద్దుల్లోని హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులు అత్యంత ప్రమాదకర ప్రాంతాలు కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. అందుకే తాజా వరదలు కేవలం ప్రకృతి విపత్తుగానే కాకుండా.. చైనా-నేపాల్ మధ్య సరిహద్దు సమాచార మార్పిడి వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన ఘటనగా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా రెండు దేశాలు ఎంత త్వరగా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు మెడోగ్ డ్యామ్‌పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.నేపాల్ వరదలతో పెరిగిన ఆందోళనఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.చైనా మెగా డ్యామ్ ఇదే..చైనా టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.భూకంప జోన్లో భారీ నిర్మాణంమెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కే ఎందుకు ముప్పు?యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్‌లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.భారత్ వ్యూహం సిద్ధంచైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ భావిస్తోంది.భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భవిష్యత్తు ఎలా?ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్-టిబెట్ ప్లాష్ఫ్లడ్లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్.. భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్ వరదలపై అమెరికా సంచలన ప్రకటన -
నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
నౌతన్వా (మహారాజ్‌గంజ్): నేపాల్‌లో సంభవించిన భారీ వరదల ప్రభావం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని వాణిజ్యంపై తీవ్రంగా పడింది. వరదల కారణంగా ప్రధాన రవాణా మార్గాలు దెబ్బతినడంతో సోనౌలీ, భగవాన్‌పుర్, ఠూఠీబారీ వంటి సరిహద్దు పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నేపాల్ నుంచి వచ్చే వినియోగదారులు లేక బోసిపోయాయి.సోనౌలీ మార్కెట్ వ్యాపారం భారత్, నేపాల్ రెండు దేశాల కస్టమర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నేపాల్‌లో వరద పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు భారత సరిహద్దు వైపు రావడం తగ్గిపోయింది. దీంతో దుకాణాల వద్ద సందడి కనిపించక, వ్యాపారులు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భగవాన్‌పుర్, ఠూఠీబారీ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేపాల్ నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో దుస్తులు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రకాల విక్రయాలు భారీగా పడిపోయాయి.సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించడం వల్ల చిన్న, పెద్ద వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. సరిహద్దు దకాణాలకు నేపాల్ వినియోగదారులే కీలకమని, రాకపోకలు దెబ్బతిన్నప్పుడు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని స్థానిక వర్తకులు తెలిపారు. నేపాల్‌లో పరిస్థితులు త్వరగా చక్కబడి, రాకపోకలు పునరుద్ధరణ జరకపోతే రానున్న రోజుల్లో మరింత భారీ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్ -
నేపాల్‌లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు
టిబెట్: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.అయితే, నేపాల్ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్మాండ్కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. -
నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్
న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ బాసటగా నిలిచింది. 10 టన్నుల మానవతా సాయం, అత్యవసర ఔషధాలతో కూడిన మొదటి విడత సహాయక సామగ్రిని భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో నేపాల్‌కు తరలించింది. ఈ విపత్తులో 95 మంది మరణించగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పరిస్థితి తీవ్రతపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఇరు దేశాల బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్ తరఫున 10 టన్నుల విపత్తు సహాయక సామగ్రి, మందులను పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.Dispatched 10 tonnes of HADR assistance and essential medicines to support Nepal’s response to the devastating floods.Our thoughts are with the bereaved families and all those affected. In face of this challenge, India stands with Nepal and its people. pic.twitter.com/FUJdkJzi1o— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 26, 2026ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్ నుంచి రాత్రి సుమారు 8:35 గంటలకు బయల్దేరిన ఐఏఎఫ్ ‘సి-130జె’ (C-130J) విమానం ఖాట్మండుకు చేరుకుంది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు, అత్యవసర మందులు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సహాయక చర్యల కోసం సి-17, సి-130 రవాణా విమానాలతో పాటు రెస్క్యూ ఆపరేషన్లకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు భారత వైమానిక దళం తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం.. -
ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం..
రసువా: నేపాల్‌లోని రసువా తదితర జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదల విధ్వంస తీవ్రతను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. ఆగస్టు 23, 25 నాటి సాధారణ స్థితికి, వరదల అనంతరం ఆగస్టు 26న తీసిన చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి విపత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. మనకామన, ఖడ్గ భంజ్యాంగ్ వంటి గ్రామాలు, నేపాల్-చైనా సరిహద్దు లోయలు, భోటేకోశీ నది పరివాహక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటివరకు 98 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన సుమారు 400 మందిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. హిమనీనదం పేలడం లేదా మంచు చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్లే ఒక్కసారిగా ఈ భారీ వరద ఉప్పొంగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.వరద ప్రవాహం గండక్ నది ద్వారా దిగువకు వచ్చే అవకాశం ఉండటంతో భారత్‌లోని బిహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు.. -
1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగివున్న నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు దాదాపు 95 నుండి 100కు పైగా మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురికావడం ఇదే మొదటిసారి కాదు.. 1934 నాటి భీకర భూకంపం నుండి నేటి వరదల వరకు ఈ హిమాలయ దేశం మృత్యు చరిత్రను మోస్తూనే ఉంది.1934 నాటి పెను విషాదం: నేపాల్-బీహార్ మహా భూకంపంనేపాల్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విపత్తుగా 1934 జనవరి 15న వచ్చిన భూకంపం నిలిచింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో మధ్యాహ్నం 2:13 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం మౌంట్ ఎవరెస్ట్‌కు దక్షిణాన 9.5 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర బీహార్, నేపాల్ సరిహద్దులను కుదిపేసిన ఈ ఘోర విపత్తులో దాదాపు 10,700 నుండి 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు భూస్థాపితమై చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి.1988 భూకంపం.. 1993 వరదల తాండవం1988 ఆగస్టు 20న ఉదయ్‌పూర్ జిల్లా కేంద్రంగా 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్, బీహార్ సరిహద్దుల్లో 1,003 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత, 1993 జూలై 19-20 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలు వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బాగ్మతి బ్యారేజీతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700 మందికి పైగా జనం జలసమాధి అయ్యారు.2014-2015 ప్రకృతి ప్రకోపం: గూర్ఖా భూకంప విధ్వంసం2014 ఏప్రిల్‌లో ఖుంబు ఐస్‌ఫాల్ వద్ద సంభవించిన హిమపాతంలో 16 మంది షెర్పా గైడ్లు మరణించగా, అదే ఏడాది ఆగస్టులో సున్కోషి నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 ఏప్రిల్ 25న వచ్చిన గూర్ఖా భూకంపం రాజధాని ఖాట్మండును చావుకేకలతో నింపింది. ఈ భయంకర విపత్తు నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్‌లలో కలిపి 8,962 మంది ప్రాణాలను హరించగా, దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు.2017 నుంచి 2024 వరకు ఎడతెగని విలయం2017 వర్షాకాలంలో నేపాల్ దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 140 మందికి పైగా మరణించారు. 2023 నవంబర్ 3న జాజర్కోట్ జిల్లాలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 153 మందిని బలితీసుకుంది. అలాగే, 2024 సెప్టెంబరులో ఖాట్మండు లోయ, బాగ్మతి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో సంభవించిన వరదలు, కొండచరియల విలయానికి 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుత జల విలయంతాజాగా 2026 ఆగస్టులో విరుచుకుపడిన వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నేలమట్టమయ్యాయి. నదులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 95 మందికి పైగా శవాలు లభ్యమయ్యాయి. ఇంకా 133 మంది భారతీయులతో సహా పలువురి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు పదేపదే విధ్వంసం?వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో నేపాల్ 4వ స్థానంలో ఉంది. భౌగోళికంగా సున్నితమైన హిమాలయ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. ఇంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దేశంలో ఆధునిక వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు సరిగా లేకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం! -
నేపాల్ వరదలు: బాధితుల కోసం తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్లు
కఠ్మాండూ: దేవభూమి నేపాల్‌లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్, మొబైల్, నేపాల్‌లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. -
Nepal Flash Floods: అప్పుడే అయిపోలేదు.. మరోసారి డేంజర్ బెల్
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించింది. రాసువా జిల్లాలో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో 162 మంది మృతి చెందారు(ఇప్పటిదాకా). వందలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అందులో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం.భోట్ కోషి, త్రిశూలి నదీ వ్యవస్థల్లో ఒక్కసారిగా వచ్చిన వరదలు భారీగా మట్టి, రాళ్లు, బండరాళ్లను కొట్టుకొచ్చాయి. ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి వచ్చిన భారీ నీటి ప్రవాహం నేపాల్‌లోని రాసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనేక గ్రామాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి నేపాల్‌లో రవాణా, విద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం 19 వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రాసువాగఢి సరిహద్దు మార్గం కూడా ధ్వంసమైంది. ఎనిమిది జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇందులో రాసువాగఢి, సంజెన్ ఖోలా, అప్పర్ త్రిశూలి-3ఏ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.Ground level footage shows people running for their lives as a sudden flash flood tears through the Nepal–Tibet region pic.twitter.com/kTY1bg2HJJ— Surajit (@surajit_ghosh2) August 26, 2026మరో వరద ముప్పు.. ఐసీఎంఓడీ హెచ్చరికహిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ (ICIMOD) కీలక హెచ్చరిక జారీ చేసింది. వరదకు కారణమైన ప్రాంతంలో ఇంకా ఓ భారీ నీటి అడ్డంకి కొనసాగుతోందని, అది తెగిపోతే మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.ఐసీఎంఓడీ వాతావరణ, పర్యావరణ ప్రమాదాల వింగ్ చీఫ్ కియాంగ్గాంగ్ జాంగ్ మాట్లాడుతూ.. గతేడాది వరదలు సంభవించిన ప్రాంతమే మళ్లీ ప్రమాదంలో ఉందన్నారు. లెండే ఖోలా ప్రాంతంలో మంచు-రాళ్ల కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ విపత్తు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే కారణం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని తెలిపారు.గతేడాది కూడా ఇదే లెండే ఖోలా ప్రాంతం భారీ వరదలకు గురైంది. 2025 జూలైలో టిబెట్ సరిహద్దు సమీపంలో గ్లేసియర్ సరస్సు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా భారీగా నీరు, బురద, రాళ్లు దిగువకు ప్రవహించాయి. ఈ వరద భోటే కోషి నదిలో కలసి రాసువా ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ వరదల్లో 15 మంది దాకా మరణించారు. రాసువాగఢి సరిహద్దు వంతెన, రహదారులు, పలు మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన నుంచి కోలుకోకముందే ఇప్పుడు అదే ప్రాంతంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.నిమిషాల్లోనే పెరిగిన నదీ ప్రవాహంఅయితే తాజా ఫ్లాష్ఫ్లడ్స్కు తీవ్రతకు నదుల్లో నీటి మట్టాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. త్రిశూలి నదిలోని గల్చి ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల మేర పెరిగింది. మాలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత వేగంగా నీటి మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన నీరు, మట్టి, మంచు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.భూకంపం కాదు.. కొండచరియల కదలికగా గుర్తింపుతొలుత ఈ విపత్తుకు కారణం భూకంపం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమైనా.. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) విశ్లేషణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 5.2 తీవ్రతతో నమోదైన సీస్మిక్ సంకేతాలు వాస్తవానికి భూకంపం వల్ల కాకుండా భారీ కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడినవిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు కదలడంతో భూకంప తరంగాల్లాంటి సంకేతాలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.మంచు కొండ కూలి.. లోయలోకి దూసుకొచ్చిన విపత్తుశాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చేస్తున్న ప్రాథమిక అంచనాల ప్రకారం.. హిమనదంలోని దిగువ భాగం విరిగిపడి వందల మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మంచు-రాళ్ల భారీ దిబ్బ లెండే ఖోలా నదిలో పడటంతో ఒక్కసారిగా నీరు, బురద, భారీ బండరాళ్లతో కూడిన వరద ప్రవాహం దిగువకు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.Glacier Lake Bursts in Tibet, Sending a Massive Flood Toward Nepal! 🤯A sudden glacier lake outburst in Tibet unleashed a powerful surge of water and debris, triggering severe flooding downstream in Nepal’s Koshi River system. The sheer force of nature is terrifying…— Horizon Wire (@HorizonWireHW) August 27, 2026చైనా వైపునా విధ్వంసం.. గ్యిరోంగ్ పోర్టుకు భారీ నష్టంవరద ప్రభావం నేపాల్‌కే పరిమితం కాలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్ ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. మట్టి, రాళ్ల ప్రవాహంతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి. చైనా అధికారులు గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలకు చేరుకోవడం కష్టంగా మారింది.భారతీయ యాత్రికుల కోసం ఆందోళనవరదల్లో గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉన్నారు. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం 400 మందికి పైగా పర్యాటకుల ఆచూకీ కొంతకాలం తెలియలేదు. ఇందులో 133 మంది భారతీయ కైలాస్ మానస సరోవర్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 57 మంది ఎన్నారైలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ రక్షణ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బురదలో కూరుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.నేపాల్‌కు భారత్ సాయంవిపత్తు నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించింది. సహాయక సామగ్రి, వైద్య పరికరాలతో కూడిన విమానాన్ని భారత వైమానిక దళం నేపాల్‌కు పంపించింది. 10 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్లు సమాచారం. భారత ప్రదాని నరేంద్ర మోదీ జలప్రళయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ప్రజలు ఎదుర్కొంటున్న నష్టం ఎంతో బాధాకరం. ప్రభుత్వం తన పూర్తి వనరులతో సహాయక చర్యలు చేపడుతోంది’’ అని తెలిపారు.తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతువరద ప్రభావిత ప్రాంతాల్లో విదేశీయులు కూడా చిక్కుకున్నారు. నేపాల్‌లోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది దక్షిణ కొరియా కార్మికులు గల్లంతైనట్లు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో పది మంది వరద ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు తెలిపింది. వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తోంది.కైలాస్ యాత్రకు తీవ్ర అంతరాయంనేపాల్-టిబెట్ సరిహద్దు మార్గం మూసుకుపోవడంతో కైలాస్ మానస సరోవర్ యాత్రపై తీవ్ర ప్రభావం పడింది. రాసువాగఢి-కెరుంగ్ మార్గం పూర్తిగా దెబ్బతింది. వంతెనలు కొట్టుకుపోవడం, రహదారులు ధ్వంసం కావడంతో యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రైవేటు మార్గాల్లో వెళ్లిన వందలాది మంది యాత్రికుల కాంటాక్ట్ తెగిపోవడంతో ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులపై ఆందోళనకైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది సభ్యులు టిబెట్‌లోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో వరదలు సంభవించాయని ఆ సంస్థ తెలిపింది. వారి పరిస్థితి, ఆచూకీపై అధికారిక సమాచారం అందలేదని సంస్థ వ్యవస్థాపకుడు సద్గురు తెలిపారు. తమ బృందాలు అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు.భారత్‌లోనూ అప్రమత్తత.. బిహార్, యూపీకి వరద అలర్ట్నేపాల్ నుంచి వచ్చే వరద నీటితో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బిహార్‌లో గండక్ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ పెంచారు. వాల్మీకినగర్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లోనూ అలర్ట్ జారీ చేశారు.ప్రస్తుత వరదతో ప్రమాదం ముగిసిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెండే ఖోలా ప్రాంతం ఎగువన ఇంకా నీటి అడ్డంకి కొనసాగుతున్నట్లయితే అది ఎప్పుడైనా తెగిపోయి మరో భారీ వరదకు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: విమానంలో వచ్చి.. మనిషిని చంపిన దోమ!! -
నేపాల్‌లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి!
కఠ్మాండు/బీజింగ్/న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం ధాటికి నేపాల్ చివురుటాకులా వణికిపోయింది. రాజధాని కఠ్మాండు సమీపంలోని రాసువా, దాడింగ్ జిల్లాల ఎగువ ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత పెను ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. ఉదయం 8.37 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొడారీ అనే చోట భూమికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయ పర్వతప్రాంతంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండల మీది గ్లేసియర్(హిమానీనదాలు)లోని భారీ స్థాయిలో మంచు ఒక్కసారిగా దిగువన ఉన్న భోటె కోశీ నదిలో పడింది. దీంతో మంచు కరిగి అనూహ్య రీతిలో నదీ ప్రవాహం, నీటి మట్టం పెరిగాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న రాసువా, ధాడింగ్ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, దుకాణ సముదాయాలను సర్వనాశనం చేసింది. 42 కి.మీ.ల పొడవైన కీలక బేద్రావతి–రసువాగఢి రోడ్డు కొట్టుకుపోయింది. నేపాల్ పర్వతప్రాంత రమణీయతను చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఈ మెరుపు వరదల్లో జలసమాధి అయ్యారు. 157 మందికిపైగా చనిపోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 750 మందికిపైగా పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు టూరిస్ట్ కంపెనీలు, స్థానిక యంత్రాంగం గణాంకాలను బట్టి తెలుస్తోంది. నువాకోట్, ఛిటావన్ జిల్లాల్లోనూ మెరుపు వరదల భీభత్సం ఎక్కువగాఉంది. వరద ఉధృతికి సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కూలాయి. కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అసలేం జరుగుతుందో తెలిసేలోపే అమాంతం వరద ముంచెత్తి జనం జలసమాధి అయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నేపాల్–చైనా సరిహద్దులోని రసువాగఢి చెక్‌పోస్ట్‌లో రెండంతస్తుల భవంతిని వరదనీరు రెప్పపాటులో సర్వనాశనం చేసిన వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వరదధాటికి ఇక్కడ నేపాల్–చైనా భూతల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి నామరూపాలు కోల్పోయి, బురదలో కూరుకుపోయి ఆ ప్రాంతాలన్నీ భీతావహంగా మారాయి. ఎటు చూసినా అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, సాయం కోసం అరి్థస్తున్న జనం హాహాకారాలతో ఆ ప్రాంతాల్లో విషాద వాతావరణం రాజ్యమేలుతోంది. భోటె కోశీ నదీజలాలు తర్వాత తిబూరే ప్రాంతంలో త్రిశూలి నదిలోకి రావడంతో దాని కారణంగానూ ఒకింత విధ్వంసం పెరిగింది. బుధవారం రాత్రినాటికి ఏడు జిల్లాల్లో 95 మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నారు. బిహార్, యూపీలో అలర్ట్ నేపాల్ వరద నీటితో గండక్ నదిలో నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉండటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్‌లో స్థానికయంత్రాంగాలు నదీపరీవాహక ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తంచేశాయి. దిగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తగు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. గండక్ నదిపై ఒక బరాజ్‌లో 36 గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదిలేస్తున్నారు. వరదనీటి ముప్పు ఉండే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సహాయక బృందాలకు యూపీ సీఎం యోగి సూచించారు. చైనా ఆపన్న హస్తంతమ అధీనంలోని టిబెట్‌లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ వరద విలయం ఎక్కువగా ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విస్తృతస్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు.మానస సరోవర్ యాత్రికులు సైతంఅమెరికా, మలేసియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, దక్షిణకొరియా పర్యాటకుల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ తెలిపింది. టిబెట్‌లోని కైలాస్ మానస సరోవర్‌ను దర్శించుకునేందుకు యాత్రకు వచ్చిన 77 మంది భారతీయుల జాడ సైతం తెలీడంలేదని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో భారతీయుల జాడ కనిపెట్టి ఎలాగైనా క్షేమంతా స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. 341 మంది పర్యాటకులు, 291 మంది విదేశీయులు, 62 మంది నేపాలీల జాడ తెలీడంలేదని నేపాల్ టూరిజం బోర్డ్ ప్రకటించింది. 24న నేపాల్ పర్యటనకు వెళ్లిన పశ్చిమబెంగాల్లోని ఆరామ్బాగ్కు చెందిన 65 మంది పర్యాటకులు సైతం వరద ప్రాంతంలో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.పూర్తి సాయం చేస్తాం: ప్రధాని మోదీ వరద విలయం వార్త తెలియగానే నేపాల్ ప్రధాని బాలేంద్రకు భారత ప్రధాని మోదీ ఫోన్‌చేసి మాట్లాడారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఆయనతో మోదీ చెప్పారు. మిత్రదేశమైన నేపాల్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సదాసిద్ధంగా ఉన్నట్లు మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే భారత వాయుసేన విమానాల్లో అత్యవసర ఉపకరణాలు, ఔషధాలు, ఆహారం, ఇతర సామగ్రిని నేపాల్‌కు తరలిస్తున్నారు. కష్టకాలంలో నేపాలీ సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని తర్వాత మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు సైతం నేపాల్‌కు తరలివెళ్లే ఆస్కారముంది. అదనపు సాయం కోసం సీ–17 గ్లోబ్‌మాస్టర్, లాక్‌హీడ్ సీ–130 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భారీ సంఖ్యలో భారతీయులు నేపాల్‌లో గల్లంతుకావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీ సర్కార్‌కు విపక్ష కాంగ్రెస్ సూచించింది.రంగంలోకి నేపాల్ ఆర్మీ... విషయం తెల్సి నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ బలగాలు, నేపాల్ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్లు మెరుపు వేగంతో రంగంలోకి దిగి బాధితులను కాపాడేందుకు అన్వేషణ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. వీళ్లను కాపాడే క్రమంలో ఇప్పటికే 80 మంది భద్రతా బలగాలు, 44 నేపాల్ సైనికులు సైతం గల్లంతైనట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారు. త్రిశూలి ప్రాంతంలో 80 మందిని ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. ఇప్పటిదాకా 300 మందిని కాపాడినట్లు ప్రధాని బాలేంద్ర తెలిపారు. గాయపడిన వారిని సమీప ఎగువ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు పర్వతసానువుల వద్ద ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. రాసువా ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదని మంత్రి శిశిర్ స్పష్టంచేశారు. పరిస్థితిని దేశ ప్రధాని బాలేంద్ర షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
నేపాల్‌లో మెరుపు వరద బీభత్సం.. బిహార్ హై అలర్ట్
నేపాల్‌లోని ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అత్యవసరం సమావేశం నిర్వహించారు. నేపాల్ నుంచి వరద నీరు వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బిహార్‌లోని డ్యామ్‌లు, కరకట్టలపై 24 గంటల నిఘా ఉంచాలని అధికారులను అప్రమత్తం చేశారు.ఈ వరదల కారణంగా గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాట్నాలోని సంకల్ప్ ఆడిటోరియంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గండక్ నదికి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, సారణ్, ముజఫర్‌పూర్, వైశాలి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.నేపాల్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 16 మంది మృతి చెందగా.. 36 మంది గాయపడ్డారు. 400 మందికి పైగా టూరిస్టులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకుల్లో దాదాపు 100 మందికి పైగా భారతీయులు ఉన్నారు. భూకంపంతో మంచు చరియలు విరిగిపడి బోటే కోసి నదిలో వరద ప్రవాహం పెరిగింది. టిబెట్ నుంచి నేపాల్ వైపు సరిహద్దుల గుండా వరద పరుగులు ప్రవహించింది. వరద ప్రవాహం పొంగి పట్టణాలు, గ్రామాలను నది ముంచెత్తింది. సెకండ్ల వ్యవధిలో దూసుకొచ్చిన వరద ప్రవాహంతో జనం కొట్టుకుపోయారు. వరదలకు టిబెట్-నేపాల్ సరిహద్దు రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది.ఇదీ చదవండి: విమానంలో వచ్చి మనిషిని చంపిన దోమ -
నేపాల్‌లో జల ప్రళయం.. 500 మంది గల్లంతు
కాట్మాండు: నేపాల్ జల ప్రయళం సృష్టించింది. మెరపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా వందలాది మంది స్థానికులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు వరదల్లో గల్లంతైనట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్ పర్యాటక బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పర్యాటకుల ఆచూకీ కోసం ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ట్రావెల్ కంపెనీల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు పర్యాటక శాఖ గుర్తించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, 93 మంది నేపాల్ జాతీయులు ఉన్నారు. గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక నివేదిక ప్రకారం.. నేపాల్ మెరుపు వరదలు సృష్టించిన బీభత్సంలో మొత్తం 100కి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక నేపాల్ వరదలతో బిహార్,ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్ త్రిసూలీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశాయి. స్థానికుల్ని సురక్షిత ప్రాంతాల వైపు తరలిస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుపోగా, 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.రసువా పర్వత జిల్లా పరిధిలోని శ్యాప్రు బేసి, తిమురే ప్రాంతాలు వరద ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భోటే కోశి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, నష్టం తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా అధికారి నరేంద్ర పరియార్ పేర్కొన్నారు.ఈ విపత్తుపై ప్రధాని బాలేంద్ర షా స్పందిస్తూ.. సహాయక చర్యల్లో పోలీస్, సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, గల్లంతైన 28 మంది భద్రతా సిబ్బందిలో 19 మంది నేపాల్ పోలీస్ విభాగానికి, తొమ్మిది మంది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్)కు చెందినవారు ఉన్నారు. రసువాగఢీ పోలీస్ పోస్టులోని 22 మందిలో 13 మంది ఆచూకీ లభించలేదు. శ్యాబ్రూబేసి ప్రాంతంలో ఆరుగురు పోలీసులు, తిమురే సరిహద్దు అవుట్‌పోస్ట్‌లోని 9 మంది ఏపీఎఫ్ జవాన్లు ఇంకా సంప్రదింపులకు అందలేదు. టిబెట్ నుంచి ఉద్భవించే భోటే కోశి నది నేపాల్‌లోని త్రిశూలి నదిలో కలిసి, అనంతరం భారత్‌లోకి గండక్ నదిగా ప్రవహిస్తుంది. సరిహద్దుల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.ఇది కూడా చదవండి: ‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్‌పై పూనావాలా ఆగ్రహం


