నేపాల్‌లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు | Telugu Pilgrims Safe in Nepal, Stranded Due to Damaged Roads During Manasarovar Yatra | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు

Aug 27 2026 9:30 AM | Updated on Aug 27 2026 12:35 PM

Telugu Pilgrims Safe in Nepal, Stranded Due to Damaged Roads During Manasarovar Yatra

టిబెట్‌: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్‌ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్‌లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్‌ నుంచి నేపాల్‌ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.

అయితే, నేపాల్‌ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్‌మాండ్‌కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్‌మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement