నేపాల్‌ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం | Nepal Floods Disrupt Border Trade in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

నేపాల్‌ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం

Aug 27 2026 10:38 AM | Updated on Aug 27 2026 11:29 AM

Nepal Floods Disrupt Border Trade in Uttar Pradesh

నౌతన్వా (మహారాజ్‌గంజ్): నేపాల్‌లో సంభవించిన భారీ వరదల ప్రభావం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని వాణిజ్యంపై తీవ్రంగా పడింది. వరదల కారణంగా ప్రధాన రవాణా మార్గాలు దెబ్బతినడంతో సోనౌలీ, భగవాన్‌పుర్, ఠూఠీబారీ వంటి సరిహద్దు పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నేపాల్ నుంచి వచ్చే వినియోగదారులు లేక బోసిపోయాయి.

సోనౌలీ మార్కెట్‌ వ్యాపారం భారత్, నేపాల్ రెండు దేశాల కస్టమర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నేపాల్‌లో వరద పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు భారత సరిహద్దు వైపు రావడం తగ్గిపోయింది. దీంతో దుకాణాల వద్ద సందడి కనిపించక, వ్యాపారులు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భగవాన్‌పుర్, ఠూఠీబారీ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేపాల్ నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో దుస్తులు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రకాల విక్రయాలు భారీగా పడిపోయాయి.

సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించడం వల్ల చిన్న, పెద్ద వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. సరిహద్దు దకాణాలకు నేపాల్ వినియోగదారులే కీలకమని, రాకపోకలు దెబ్బతిన్నప్పుడు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని స్థానిక వర్తకులు తెలిపారు. నేపాల్‌లో పరిస్థితులు త్వరగా చక్కబడి, రాకపోకలు పునరుద్ధరణ జరకపోతే రానున్న రోజుల్లో మరింత భారీ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement