breaking news
Nepal
-
చక్కెర కేజీ రూ.140!
పండుగ సీజన్లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.కాఠ్మాండులోని సిగల్ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్‌లోని గట్టాఘర్లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.25 వేల టన్నుల దిగుమతికి అనుమతిధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్టీసీ, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.అదే సమయంలో భారత్ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2.5 లక్షల టన్నుల అవసరంనేపాల్లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్ సీజన్ ముగిసింది. తదుపరి సీజన్ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.భారత్ సరఫరాపైనే ఆశలుమరోవైపు నేపాల్ పంచదార అవసరాల్లో భారత్ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్ మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్‌కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. భారత్‌పైనా ధరల ఒత్తిడిమరోవైపు భారత్‌లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ భారత్ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్‌లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్‌కు అమెరికా కౌంటర్ -
నేపాల్‌కు మరో షాక్.. 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు!
ముస్తాంగ్: తీవ్ర వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్‌ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ముస్తాంగ్ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పొరుగు జిల్లాలైన మనాంగ్, డోల్పా, మ్యాగ్దీల్లోనూ నమోదయ్యాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం అధికారిక సమాచారం ప్రకారం (భారత కాలమానం ప్రకారం) రాత్రి 9.38 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాయువ్య నేపాల్‌లో 29.022 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83.978 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలానికి 143 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి.భూకంప కేంద్రం లోతుగా ఉండటంతో ఉపరితలంపై ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నిర్మాణ నష్టం నమోదుకాలేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం, రాత్రి 9.53 గంటలకు నమోదైన ఈ భూకంపానికి ముస్తాంగ్‌లోని లోమంథాంగ్ కేంద్రంగా ఉంది. ఇది ఖాట్మండుకు వాయువ్యంగా సుమారు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది.గత నెలలో భోటే కోషి నది ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ విపత్తులో 1,357 మంది మృతి చెందారు. సహాయక, గాలింపు చర్యలు 14వ రోజుకు చేరాయి. రాయిటర్స్ అంచనా ప్రకారం వరదల వల్ల ప్రత్యక్షంగా 256 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లగా, ఆర్థిక ప్రభావం, దీర్ఘకాలిక పునరుద్ధరణ వ్యయం 400 కోట్ల నుంచి 700 కోట్ల డాలర్ల వరకు పెరగవచ్చు. నేపాల్ పోలీసులు 1,366 మంది మృతిచెందినట్లు, 4,077 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఇప్పటివరకు 533 మంది పురుషులు, 339 మంది మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీటిలో 102 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు.సహాయక చర్యల్లో భారత్.. నేపాల్‌కు తోడ్పాటునందిస్తోంది. చిలిమే సొరంగంలో శిథిలాలు, బురదను తొలగించేందుకు భారత, నేపాల్ బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వాలుగా ఉన్న సొరంగంలో రాకపోకల కోసం హెచ్డీపీఈ పైపులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. స్యాఫ్రుబేసి నుంచి సొరంగ ద్వారం వరకు తాత్కాలిక మార్గం ఏర్పాటుకు నియంత్రిత పేలుళ్ల ద్వారా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్ -
Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
-
ఇల్లు పోయి, పిల్లలూ అదృశ్యం.. చిన్నారులు దొరికినా నరకయాతన
కాఠ్మాండు: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో ఇల్లు కోల్పోయి సహాయక శిబిరాల్లో తలదాచుకున్న తల్లులు, శిశువులు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతం. వరదల్లో తల్లి నుంచి బిడ్డలు విడిపోవడం, తిరిగి కలిసిన తర్వాత కూడా వారికి సరైన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులై తాత్కాలిక శిబిరాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేక అవసరాలు అందడం లేదు. శిశువులకు ప్రత్యేక ఆహారం లేక పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది. రద్దీగా ఉన్న శిబిరాల్లో తల్లులు బిడ్డలకు పాలు పట్టించుకోవడానికి కూడా గోప్యత లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు గర్భిణులు ఆసుపత్రులకు చేరుకోవడంలో రహదారులు దెబ్బతినడం, విద్యుత్ అంతరాయం, వైద్య సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలు దొరికినా ఆహారం లేదు నేపాల్‌లో వచ్చిన వరదల్లో షర్మిలా శ్రేష్ఠ (33) అనే మహిళ ఇల్లు కొట్టుకుపోయింది. ఆమె కొన్ని రోజుల పాటు తన కుమార్తె నుంచి దూరమైంది. ఇప్పుడు తన కుమార్తెతో తిరిగి కలిసిన ఆమె.. రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రంలో పెద్దలకు ఇచ్చే ఆహారాన్నే తన చిన్నారికి తినిపిస్తూ నిస్సహాయంగా చూస్తోంది. 14 నెలల వయసున్న ఆమె కుమార్తె, తన వదినకు చెందిన 18 నెలల కుమారుడితో కలిసి వాయవ్య కాఠ్మాండులోని ఓ తరగతి గది నేలపై నిద్రిస్తోంది. ఆ ఇద్దరు చిన్నారులకు ప్రత్యేకమైన శిశు ఆహారం అందడం లేదు.“శిశువులకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం లేదు. ఆ చిన్నారికి కూడా పెద్దలకు ఇచ్చే గట్టి ఆహారాన్నే తినిపించాల్సి వస్తోంది” అని శ్రేష్ఠ చెప్పారు. వరదల కారణంగా తన కుమార్తె నుంచి విడిపోయిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ కొండల మార్గంలో 6 గంటలు నడిచింది. వరదల కారణంగా వారిద్దరూ 2 లేదా 3 రోజుల పాటు విడిపోయారు. “నాకు కావాల్సిందల్లా సురక్షితమైన, సరైన నివాసం. అది ఉంటే కొంత మనశ్శాంతి కలుగుతుంది” అని ఆమె చెప్పింది.గర్భిణులకు ఏదైనా సమస్య వస్తే? ఆగస్టు 26న నేపాల్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు శ్రేష్ఠ వంటి తల్లులకు మరో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి. పెరుగుతున్న వరద నీటిలోనే కాకుండా, రద్దీగా ఉన్న ఆశ్రయ కేంద్రాల్లో, పిల్లలకు ఆహారం ఇచ్చే సమయంలో, తరగతి గదుల నేలపై, ఆసుపత్రులకు వెళ్లే ప్రమాదకరమైన మార్గాల్లో ఈ సంక్షోభం కొనసాగుతోంది. చిన్నారులు ఆకలితో ఉన్నారు. తల్లులు పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ఏదైనా సమస్య వస్తే ఆసుపత్రికి చేరుకోగలమా అనే ఆందోళనలో ఉన్నారు.వందలాది మంది నిరాశ్రయులతో నిండిన ఆశ్రయ కేంద్రాల్లో పిల్లలకు పాలు పట్టించడానికి, వారిని ఓదార్చడానికి అవసరమైన ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశం కూడా లేదు. ట్రిశూలిలో తన నవజాత శిశువుకు 3 నెలలుగా పాలిస్తున్న పరివార్ అనే మహిళ ఆగస్టు 26న వరద నీరు ఉద్ధృతంగా రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది.ఇప్పుడు భోటేకోశి-ట్రిశూలి మార్గంలో ఉన్న ఓ ఆశ్రయ కేంద్రంలో ఆమె తన బిడ్డకు పాలు ఇస్తోంది. అక్కడ డజన్ల కొద్దీ అపరిచితులు ఉన్నారు. సమీపంలో పురుషులు సిగరెట్లు తాగుతున్నారు. మద్యం వాసన కూడా వస్తోంది. “అందరం ఒకే చోట ఉన్నాం. అందుకే చాలా కష్టంగా ఉంది. సిగరెట్ పొగ, మద్యం వాసన ఉన్నాయి. బిడ్డ నిద్రపోలేకపోతోంది” అని తన ఇంటిపేరుతో మాత్రమే గుర్తించాలని కోరిన పరివార్ చెప్పింది.వరదల తర్వాత ఆమెకు రొమ్ము పాలు తగ్గిపోయాయి. ఆమె పాలపొడిని ప్రయత్నించింది. అయితే అది శిశువు కడుపుకు ఇబ్బంది కలిగించినట్లు కనిపించింది. దాంతో పాలు తాగిన తర్వాత శిశువు మరింతగా ఏడుస్తోంది. “సురక్షితమైన ప్రదేశం ఉండి, ఇక్కడే బిడ్డకు టీకాలు వేయగలిగితే బాగుంటుంది. మాకు సమయానికి ఆహారం కూడా అందడం లేదు. తినడానికి సరిపడా ఆహారం లభించడం లేదు” అని పరివార్ చెప్పింది. -
బతికున్నారని.. తిరిగొస్తారని..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడే చేరుకున్నామంటూ సమాచారం ఇచ్చినవారు కొందరు.. ఇందాకే బయలుదేరామంటూ కబురందించినవారు ఇంకొందరు.. ఇంకాసేపట్లో గమ్యం చేరుకుంటామనే మాటచెప్పిన వారు మరికొందరు.. ఆ కొద్దిసేపటికే వారంతా అదృశ్యమయ్యారు. అప్పటి వరకు మాట్లాడిన, సంబంధాలు కలిగి ఉన్నవారు ఆకస్మిక జల ప్రళయంలో నగరానికి చెందిన సుమారు 15 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. గత నెల 26న నేపాల్‌లో హఠాత్ వరదల్లో ఆచూకీ లేకుండాపోయినవారి కుటుంబీకుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇంకా కొన్ని ప్రయత్నాల అనంతరం అదృశ్యమైన వారి స్థితి ఇదంటూ అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం తమవారు బతికున్నారని.. ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ జ్ఞాపకాల్లో కుటుంబాలు.. నగరానికి చెందిన నేపాల్ వరద బాధిత కుటుంబాల్లో ఎవరిని పలకరించినా అదృశ్యమైన వారి జ్ఞాపకాలే వెంటాడుతున్నాయని చెబుతున్నారు. తమవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే రోజులు గడిచిపోతున్నాయని చెబుతున్నారు. విహార/తీర్థ యాత్ర తమకు ఇంతటి విషాదాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని కన్నీంటి పర్యంతమవుతున్నారు. కొందరు కుటుంబీకులు తమ వారి కోసం నేపాల్ వరకు వెళ్లి ఎంతో ఆశతో గాలించి నిరాశతో తిరిగి వచ్చారు. ఆ వరదల్లో తప్పిపోయిన వాళ్లల్లో కొందరు ఇటీవలే వచ్చినట్లు వివిధ రాష్ట్రాల నుంచి వార్తలు వస్తున్నాయని, తమ వాళ్లు కూడా అలానే మృత్యుంజయులు కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆ చిరునవ్వుల కోసం..నాగోలు: నేపాల్ వరదల్లో గల్లంతైన ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసినీ రెడ్డి (44) ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. భారత రాయబార కార్యాలయం అధికారులు ఆమె జాడను కనుగొనాలని తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, ప్రేమలతా రెడ్డి కోరుతున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న భర్త సంజీవరెడ్డి, పెద్ద కుమారుడు భారత్‌కు వచ్చి అనంతరం నేపాల్ వెళ్లారు. భారత రాయబార అధికారులతో మాట్లాడి సుహాసిని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి భారత్‌కు చేరుకున్నారు. సుహాసిని సమాచారం ఇప్పటికీ తెలియకపోవడంతో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’ -
అంతులేని వెతుకులాట
కఠ్మాండు: నేపాల్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తి 11 రోజులు గడిచిపోయాయి. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల గుర్తింపులో అధికారులు ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలిస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య దాదాపు 1,400కు చేరుకుంది. 589 మంది విదేశీయులు సహా 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్ ఆదివారం సహాయక, పునరావాస చర్యలపై చర్చించారు. మరోవైపు బాధిత మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకలితో ఉన్న తమ బిడ్డలకు ఆహారం అందించలేకపోతున్నామని చెబుతున్నారు. తల్లులు పాలివ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సమస్య తలెత్తితే ఆసుపత్రికి ఎలా వెళ్లాలనే దానిపై గర్భిణిలు ఆందోళన చెందుతున్నారు. -
మరో ఇద్దరు మృత్యుంజయులు
కఠ్మాండు: నేపాల్‌లో మరో అద్భుతం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో ఆకస్మిక వరదల వల్ల కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలు చండికా శ్రేష్ట 10 రోజుల తర్వాత సజీవంగా బయటపడింది. సహాయక సిబ్బంది బురద, ఒండ్రు మట్టిని తొలగించి ఆమెను శనివారం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ నెమ్మదిగా స్పృహలోకి రావడం వీడియోలో కనిపిస్తోంది. సహాయక సిబ్బంది ఆమెను దుప్పటి, జాకెట్‌తో కప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలిని చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్లో కఠ్మాండు ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చైనా జాతీయుడు రసువా జిల్లాలో భారీ వరదల ధాటికి ధ్వంసమైన అప్పర్ త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఒక చైనా జాతీయుడిని శనివారం రక్షించారు. అతడిని లూహైటతావోగా గుర్తించారు. వరదల సమయంలో ‘ఆడిట్ టన్నెల్ 4’లో చిక్కుకుపోయాడు. లూహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక సిబ్బందితో కూడిన బృందం కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. సొరంగ మార్గంలో సుమారు 225 మీటర్ల లోపల ఉన్న ఒక ప్రదేశం నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగాల సజీవంగా బయటకు తీసిన కార్మికుల సంఖ్య మొత్తం మూడుకు చేరింది. శుక్రవారం త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్‌లోని ఒక సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు కబిర్ మహర్జన్, సంజయ్ షాను రక్షించిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో పదికిపైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వీరిలో దాదాపు 500 మంది సొరంగాల లోపలే ఉండి ఉంటారని అధికారులు వెల్లడించారు. 1,344కి చేరిన మృతుల సంఖ్య నేపాల్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 1,344కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా బాధితులను రక్షించామని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 758 పెద్దలవి, 85 పిల్లలవి కాగా, 501 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయని తెలిపారు. డీఎన్ఏ సేకరణ సహా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మొత్తం 1,030 మృతదేహాలను ఖననం చేశారు. కేవలం 96 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్
-
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
నేపాల్‌కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉండడంతో హైఅలర్ట్ ప్రకటించారు. దార్చుల్లా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చౌలానీ నదిలోకి మట్టి, రాళ్లు వచ్చిపడి నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో నది దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.చౌలానీని చామెలియా నది అని కూడా పిలుస్తారు. ఇది అపిహిమాల్ ప్రాంతంలో పుట్టి మహాకాళీ నదిలో కలుస్తుంది. మహాకాళీ నది కొంత భాగం నేపాల్–భారత్ సరిహద్దుగా ప్రవహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత కొండచరియలు ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడడం ప్రారంభించాయి. మట్టి, రాళ్లు జారిపడడాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించారు. ఏదో ప్రళయం వచ్చినట్లు ఆ దృశ్యాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అయితే ఈ ప్రభావంతో నది మరింతగా పూడుకుపోయి పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని దార్చుల్లా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అదే జరిగితే నదీ ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి.. ఒక్కసారిగా తెగిపడి దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికనది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో నదికి సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసు, భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించేలా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచారు. Today, a large landslide has partially blocked the Chaulani River in Api Himal Rural Municipality, Darchula District, Sudurpashchim Province, Nepal. Authorities are urging residents downstream to remain alert amid the risk of sudden flooding. pic.twitter.com/7UuxGPsDjg— Weather Monitor (@WeatherMonitors) September 4, 2026పశ్చిమ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖగ్రాజ్ భట్టా కూడా అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించి.. హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తొలగని ముప్పు..అధికారులు చెబుతోంది ఏంటంటే.. చౌలానీ నదిలో ప్రస్తుతం నిన్నటితో పోలిస్తే పర్వాలేదు. నీటి ప్రవాహం సాధారణంగానే ఉంది. అయితే కొండచరియలు ఇంకా విరిగిపడే అవకాశం ఉండటంతో ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు, స్థానికులను అప్రమత్తం చేసేందుకు చామెలియా జలవిద్యుత్ కేంద్ర భద్రతా స్థావరానికి చెందిన సాయుధ పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఇదిలా ఉండగా.. భట్టార్ ప్రాంతంలోని పది కుటుంబాలను ముందు జాగ్రత్తగా బంధువుల ఇళ్లకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారికి టెంట్లు సహా అవసరమైన సామగ్రిని అందించారు. అయితే కొండచరియలు విరిగిపడి.. అక్కడి రహదారులు, ట్రెక్కింగ్ మార్గాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. మరోసారి ప్రకృతి ప్రకోపంఇటీవలే నేపాల్‌లో భారీ ఫ్లాష్‌ఫ్లడ్ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు 1,287 మృతదేహాలను వెలికితీయగా.. మరో 5,083 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ దార్చుల్లాలో తాజా కొండచరియల ఘటన ఆందోళన కలిగిస్తోంది.చౌలానీ నది ప్రవాహానికి కొండచరియలు అడ్డంకిగా మారడంతో.. మరిన్ని కొండచరియలు విరిగిపడి నది పూర్తిగా మూసుకుపోతే ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఫ్లాష్‌ఫ్లడ్ సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: అసలు అక్కడి భూగర్భంలో ఏం జరుగుతోంది? -
9 రోజులు... 216 గంటలు వరదను జయించిన ఆ ఇద్దరు
కఠ్మాండు: సరిగ్గా 9 రోజులు.. 216 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి.. ఆకలేస్తున్నా తినడానికి తిండి లేదు. దాహమేస్తున్నా తాగడానికి మంచినీరు లేదు. అయినా బతుకుతామన్న ఆశను కోల్పోలేదు. శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తూ రేపటి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. అదృష్టం వారిపైపే ఉంది. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. పవిత్ర పర్వదినం కృష్ణాష్టమి రోజే వారికి పునర్జన్మ లభించడం గమనార్హం. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులోని ఒక సొరంగం నుంచి ఇద్దరు వ్యక్తులను అధికారులు శుక్రవారం రక్షించారు. వారిద్దరినీ ఈ ప్రాజెక్టులో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్న కబిర్ మహర్జన్(45), ఫోర్‌మెన్ సంజయ్ షా(30)గా గుర్తించారు. మహర్జన్ను కఠ్మాండులోని నేపాల్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సంజయ్ షా నువాకోట్‌లోని త్రిశూలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సహచరుల ప్రాణాలే ముఖ్యం సెంట్రల్ నేపాల్‌లోని త్రిశూలి నది పరీవాహక ప్రాంతంలో ఆగస్టు 24న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలోకి నీరు చేరింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కబిర్ మహర్జన్, సంజయ్ షా బయటకు రాలేకపోయారు. సొరంగం ముఖద్వారం మట్టితో మూసుకుపోయింది. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది రోజుల అన్వేషణ ద్వారా వారిద్దరూ బయటపడ్డారు. గత తొమ్మిది రోజులుగా సొరంగంలో హరే కృష్ణ మహా మంత్రాన్ని జపిస్తూనే ఉన్నానని సంజయ్ షా భద్రతా సిబ్బందికి చెప్పాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్నానని తెలిపాడు. ‘‘కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్నప్పుడు అందరి ప్రాణాలను కాపాడటమే నా బాధ్యత. ప్రమాదం తర్వాత అందరినీ బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాను. మొదట నా ప్రాణాల కంటే సహచరుల ప్రాణాలే ముఖ్యమని భావించా. వారు బయటకు వెళ్లేదాకా అక్కడే వేచి చూశాను. నేను తప్పించుకోవడానికి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సొరంగం మూసుకుపోవడంతో నుంచి బయటకు రాలేకపోయాను. సొరంగం లోపల నా చట్టుపక్కల ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించా. వారితో మాట్లాడేందుకు ప్రయతి్నంచా. శబ్దాలు చేయడం ద్వారా సంభాíÙంచగలిగాం. పవర్‌హౌస్ పరిసరాలతో సహా సొరంగం లోపలి భాగంలో మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చు. వారు ఏమైపోయారన్నది తెలియదు. ఆ సొరంగం చాలా పొడవైనది. వరద నీటి ఉధృతికి లోపలున్న కారి్మకులు దూరంగా కొట్టుకుపోయి ఉండొచ్చు. అందరూ క్షేమంగా బయటపడే అవకాశమైతే లేదు’’అని సంజయ్ షా చెప్పాడు. మాధేషి ప్రావిన్స్‌లోని సప్తరి జిల్లాకు చెందిన సంజయ్ షా చాలా రోజులుగా ఈ సొరంగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. నా భర్తకు ఇది పునర్జన్మ: మహర్జన్ భార్య కబిర్ మహర్జన్ ప్రాణాలతో తిరిగిరావడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తన భర్తకు పునర్జన్మ లభించిందని మహర్జన్ భార్య హీరా శోభ చెప్పారు. ఆయనను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన రక్షక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రార్థనలు, ఎదురుచూపులు ఫలించాయని, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గడచిన తొమ్మిది రోజులు తనకు, తన కుటుంబానికి అత్యంత బాధాకరమైనవని చెప్పారు. తాము సరిగ్గా తినలేకపోయామని, నిద్ర కూడా పోలేదని అన్నారు. తన భర్త బతికే ఉన్నాడని, కచ్చితంగా తిరిగి వస్తాడని విశ్వసించానని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇతర సొరంగాల్లో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది కార్మికలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియరావడం లేదు. నేపాల్ సైన్యం నేతృత్వంలోని భద్రతా దళాలు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి గాలింపు, సహాయక చర్యలు సాగిస్తున్నాయి. కబిర్ మహర్జన్, సంజయ్ షాలు చిక్కుకుపోయిన సొరంగం లోపలి నుంచి అరుపులు వినిపించడంతో అతికష్టంమీద వారిని రక్షించగలిగామని అధకారులు వెల్లడించారు. 11 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న 600 మందికిపైగా కారి్మకులు వరదల్లో గల్లంతైనట్లు నేపాల్ స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. కబిర్ మహర్జన్, సంజయ్ షాను సజీవంగా టన్నెల్ నుంచి బయటకు తీయడం సహాయక సిబ్బందిలో కొత్త ఆశను రేకెత్తించింది. మరికొందరిని కూడా కాపాడగలమని వారు భావిస్తున్నారు. శాటిలైట్ డేటాతో గుర్తింపు త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రం వద్ద సొరంగంలో ఆచూకీ తెలియకుండా పోయిన 42 మంది కారి్మకుల కోసం డజన్ల కొద్దీ సహాయక సిబ్బంది గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. వారు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టడానికి శాటిలైట్ డేటాను ఉపయోగించారు. ఆ తర్వాత బురద, మట్టిని తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు. చేతులతో జాగ్రత్తగా తవ్వడం కొనసాగించడానికి ముందు దారిని సుగమం చేయడానికి పేలుడు పదార్థాలను ప్రయోగించారు. చివరకు ఇద్దరి ఆచూకీ మాత్రం కనిపెట్టగలిగారు. శుక్రవారం తొలుత సంజయ్ షాను సొరంగం నుంచి బయటకు తీశారు. కొద్దిసేపటికే తర్వాత కబీర్ మహర్జన్ను రక్షించారు. బయటకు వచ్చిన తర్వాత సంజయ్ షా అడిగిన మొదటి ప్రశ్న.. ఈ రోజు తేదీ ఏమిటి? అని. అత్యవసర వైద్య చికిత్స కోసం వారిద్దరినీ విమానంలో రాజధాని కఠ్మాండులోని సైనిక ఆసుపత్రికి తరలించారు. సంజయ్ షా పరిస్థితి నిలకడగా ఉండగా, మహర్జన్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను కాపాడిన సిబ్బంది న్యూఢిల్లీ: నేపాల్–భూటాన్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదల్లో గల్లంతైన ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు భారతీయులను శుక్రవారం నువాల్కోట్ జిల్లా త్రిశూలి బజార్ ప్రాంతంలో సహాయక సిబ్బంది కాపాడారు. వీరిని అభిజిత్ సురేశ్ పవార్, దీపికా అభిజిత్ పవార్, సమర్థ్ అభిజిత్ పవార్‌గా గుర్తించామని విదేశాంగ శాఖ తెలిపింది. కఠ్మాండులోని భారత రాయబారి కార్యాలయం వీరిని విమానంలో స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించింది. దీంతో సురక్షితంగా బయటపడిన భారతీయుల సంఖ్య 166కు చేరుకుంది. మరోవైపు, 275 మంది భారతీయుల జాడ తెలియాల్సి ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు.చైనా నుంచి నేపాల్‌లోకి 1,907 మంది భారతీయులు సురక్షితంగా చేరుకున్నారని పేర్కొన్నారు. టిబెట్‌లో చిక్కుకుపోయిన వారిలో భారతీయులెవరూ లేరని చైనా ప్రభుత్వం తెలిపిందని జైశ్వాల్ వెల్లడించారు. 1,295కి చేరిన మృతుల సంఖ్య నేపాల్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 1,295కి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఎనిమిది వేర్వేరు జిల్లాల్లో ఇప్పటివరకు 1,293 మృతదేహాలను వెలికితీశారు. చిత్వాన్ జిల్లాలో 359, తూర్పు నవల్పరాసిలో 221, పశి్చమ నవల్పరాసిలో 212, నువాకోట్‌లో 186, రసువాలో 140, గోర్ఖాలో 72, ధాడింగ్‌లో 65, తనాహులో 38 మృతదేహాలను వెలికితీశారు. శుక్రవారం కఠ్మాండులో రెండు వేర్వేరు ఆసుపత్రులలో వరద బాధితులు ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,295కు చేరింది. ఇప్పటివరకు 13,093 మందిని రక్షించారు. మరో 5 వేల మందికిపైగా గల్లంతయ్యారు. రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నేపాల్‌లో సహాయక చర్యలకు భారతదేశం మద్దతు ఇస్తోంది. భారత్ నుంచి ఫోరెన్సిక్ కిట్లు, వైద్య సామగ్రితో సహా 21.5 టన్నుల సహాయక సామగ్రితో విమానాలు గురువారం రాత్రి కఠ్మాండుకు చేరుకున్నాయి. -
నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..
-
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
నేపాల్ ఆకస్మిక వరదతో వేలమంది గల్లంతైన వేళ.. అద్భుత ఘటన చోటుచేసుకుంది. శిథిలాలతో పూర్తిగా కూరుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా రక్షించగలిగారు. దీంతో సహాయక బృందాల్లోనే కాకుండా.. గల్లంతైన వారి కుటుంబాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.త్రిశూలి ప్రాంతంలోని త్రిశూలి-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 26న వచ్చిన భారీ వరదల కారణంగా టన్నెల్ ప్రవేశ మార్గం మట్టి, బురద, శిథిలాలతో మూసుకుపోయింది. అప్పటి నుంచి లోపల చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇద్దరు వ్యక్తులు సజీవంగా ఉన్నట్లు గుర్తించి.. వారిని బయటకు తీసుకొచ్చారు.వాళ్ల పేర్లు కబీర్ మహార్జన్ (45), సంజయ్ షా (30)గా నేపాల్ హోంమంత్రి సుదన్ గురుంగ్ వెల్లడించారు. కబీర్ మహార్జన్ త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తుండగా.. సంజయ్ షా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో మెకానికల్ ఫోర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు టన్నెల్లో చిక్కుకున్నప్పటికీ ప్రాణాలతో బయటపడటం వారి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది.TWO MEN RESCUED ALIVE AFTER 9 DAYS IN NEPAL TUNNELSanjay Sah and Kabir Maharjan were rescued alive from the Trishuli 3A hydropower tunnel, nine days after the August 26 flash flood. Rescuers heard voices inside and are continuing the search for others who may remain trapped. pic.twitter.com/ttV3RKbdtd— Subodh Kumar (@kumarsubodh_) September 4, 2026ఓ పొడి గదిలో ఉండడంతో.. వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారని రెస్క్యూ టీం వెల్లడించింది. సంజయ్ షాను బయటకు తీసుకువచ్చే సమయానికి ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరని సమాచారం. వెంటనే అతడిని బట్టార్ ప్రాంతానికి విమానంలో తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కబీర్ మహార్జన్ స్పృహలోనే ఉన్నారని ఆయన భార్య తెలిపారు. ఆయనను ఖాట్మాండులోని ఛావునీ మిలటరీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇద్దరు కార్మికులను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బురదతో పూర్తిగా తడిసిపోయిన ఓ కార్మికుడిని రక్షక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లారు. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన సమయంలో అతడి చేతులు జోడించి ప్రార్థిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తొమ్మిది రోజుల పాటు చీకటి, బురద మధ్య ప్రాణాలతో పోరాడి బయటపడటం నిజంగా అద్భుతమేనని పలువురు పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. నేపాల్‌లోని మరికొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కూడా భారీగా కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు అరడజను టన్నెళ్లలో 150 మందికిపైగా చిక్కుకుని ఉండొచ్చని అంచనా. మొత్తం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 500 మంది టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని గుర్తించి రక్షించేందుకు ఇంజినీర్లు టన్నెళ్లలోకి గాలిని పంపుతున్నారు. ఆగస్టు 26న సంభవించిన ఈ భారీ విపత్తు నేపాల్‌లోని పలు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేసింది. హిమనదం(గ్లేసియర్) కూలిపోవడం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,259 మంది మృతి చెందగా.. 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. టన్నెల్ నుంచి ఇద్దరు సజీవంగా బయటపడటంతో.. ఇంకా ఎక్కడైనా చిక్కుకున్న వారు ఉంటే వారిని కూడా క్షేమంగా రక్షించవచ్చన్న ఆశలు బలపడ్డాయి.ఇదీ చదవండి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న నేపాల్! -
స్నాక్స్ కోసం దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చిన విద్యార్థులు
కాఠ్మాండు: రాసువాలో సంభవించిన తీవ్ర భోటెకోషి వరదల బాధితులను ఆదుకునేందుకు నేపాల్ అంతటా పాఠశాల విద్యార్థులు తమ స్నాక్స్ డబ్బులు, జేబు ఖర్చుల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ సాయం కొనసాగుతున్న వేళ ఈ చిన్నారులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇళ్లు కొట్టుకుపోవడం, కుటుంబాలు విడిపోవడం, పాఠశాలలు దెబ్బతినడం వంటి దృశ్యాలను టెలివిజన్‌లో చూసిన పలువురు పిల్లలు.. విపత్తు ప్రాంతానికి దూరంగా ఉన్నా తమకు చేతనైనంత సాయం చేయాలని ముందుకొచ్చారు.అచ్ఛామ్, కపిలవస్తు నుంచి రౌతహట్, కాఠ్మాండు వరకు విద్యార్థులు నేపాలీస్ రూపీ 5 నుంచి 500 వరకు విరాళాలు ఇచ్చారు. కొందరు ఒక రోజు చిరుతిండి తినకుండా ఆ డబ్బును అందించారు. వారి విరాళాలను ప్రధానమంత్రి సహాయ నిధి, ప్రధానమంత్రి ప్రకృతి విపత్తు సహాయ నిధిలో జమ చేశారు. వరదల కారణంగా దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం చోటుచేసుకున్న సమయంలో ఈ విరాళాలు అందాయి.అచ్ఛామ్లోని మంగల్సేన్ మున్సిపాలిటీ-5లో ఉన్న షోడశ మాధ్యమిక పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి యూనిక్ కీసీ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కాఠ్మాండు పోస్ట్ కథనం ప్రకారం.. సోమవారం సుమారు 1,500 మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించే విద్యార్థుల ఆధ్వర్యంలోని బాల క్లబ్ సభ్యులు పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడి వీడ్కోలు కార్యక్రమంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వరదల వల్ల ప్రభావితమైన పిల్లలకు ఏదైనా చేయాలని యూనిక్ సూచించారు. దీంతో ఇళ్లు, బంధువులు లేదా విద్యను కోల్పోయిన పిల్లల కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.“మా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా ఏదో ఒకటి చేయగలమని అనిపించింది” అని యూనిక్ చెప్పినట్లు కథనం పేర్కొంది. విద్యార్థులు అన్ని తరగతి గదులకు వెళ్లి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోరారని యూనిక్ తెలిపారు. విరాళాలు నేపాలీస్ రూపీ 5 నుంచి నేపాలీస్ రూపీ 500 వరకు వచ్చాయి. “మాలో కొందరికి ఇది సాధారణంగా చిరుతిండి కోసం ఖర్చు చేసే డబ్బును ఉపయోగించి వరదలతో ప్రభావితమైన విద్యార్థులకు సాయం చేయడమనే అర్థం” అని 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ షాహీ చెప్పారు.తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన విద్యార్థులు కూడా విరాళాలు ఇచ్చారు. “తల్లిదండ్రులను కోల్పోయిన మా 7 మంది స్నేహితులు కూడా విరాళం ఇచ్చారు. మా లాంటి విద్యార్థులకు సాయం చేయాలనుకున్నాం” అని షాహీ చెప్పారు.బాల క్లబ్ మొదటి రోజు నేపాలీస్ రూపీ 8,785, రెండో రోజు నేపాలీస్ రూపీ 5,470 సేకరించింది. దీంతో మొత్తం విరాళం నేపాలీస్ రూపీ 14,255కు చేరింది. ఉపాధ్యాయుడు ధన్ కుమార్ కీసీ ఈ మొత్తాన్ని బుధవారం రాష్ట్రీయ వాణిజ్య బ్యాంకు ద్వారా ప్రధానమంత్రి సహాయ నిధిలో జమ చేసినట్లు తెలిపారు. “విరాళం పెద్దదా, చిన్నదా అన్నది ముఖ్యం కాదు” అని కీసీ చెప్పారు. విద్యార్థులే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, “నేను వారికి సహకారం మాత్రమే అందించాను” అని ఆయన తెలిపారు.చాలా ప్రాంతాల నుంచి స్పందన మంగల్సేన్-1లోని ప్రగతిశీల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా ఇదే విధంగా స్పందించారు. ఒక్క రోజు చిరుతిండి కోసం తెచ్చుకున్న డబ్బును వారు విరాళంగా ఇచ్చారు. ఉపాధ్యాయుడు హిమ్మత్ బహదూర్ రావల్ తెలిపిన ప్రకారం వారు నేపాలీస్ రూపీ 585 సేకరించి సహాయ నిధిలో జమ చేశారు.కపిలవస్తులో ధర్మన్పానియాలోని రాష్ట్రీయ జనహిత్ మాధ్యమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల సోమ్య ఉపాధ్యాయ్ బుధవారం చిరుతిండి కోసం సాధారణంగా ఇచ్చే డబ్బు కంటే NPR 20 ఎక్కువగా ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగారు. ఆ రోజు ఆమెకు లభించిన నేపాలీస్ రూపీ 50 మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల రాధిక కోహర్ నేపాలీస్ రూపీ 30 విరాళంగా ఇచ్చారు. ఇద్దరు బాలికలు తమ చిరుతిండి తినకుండా ఆ డబ్బును విరాళపు పెట్టెలో వేశారు.తర్వాత ఉదయం ప్రార్థనా సమావేశం అనంతరం వారి సహచర విద్యార్థులు నేపాలీస్ రూపీ 5 నుంచి నేపాలీస్ రూపీ 100 చొప్పున విరాళాలు ఇచ్చారు. దీంతో నేపాలీస్ రూపీ 10,050 సేకరించారు. ఈ మొత్తాన్ని అనంతరం ప్రధానమంత్రి ప్రకృతి విపత్తు సహాయ నిధిలో జమ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ కోహర్ తెలిపిన ప్రకారం 350 మంది విద్యార్థుల్లో 200 మందికి పైగా విరాళం ఇచ్చారు. “విద్యార్థులే విరాళపు పెట్టెను తయారు చేసుకుని తరగతి గదుల నుంచి తరగతి గదులకు వెళ్లి తమ స్నేహితులను విరాళాలు ఇవ్వాలని కోరారు” అని ఆయన తెలిపారు.కాగా, బుధవారం మధ్యాహ్నం నాటికి ప్రధానమంత్రి సహాయ నిధిలో నేపాలీస్ రూపీ 7.77 బిలియన్లు జమ అయ్యాయి. ప్రభుత్వ డాలర్ ఖాతాలో సుమారు యూఎస్డీ 6 మిలియన్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా పిల్లలు కూడా తమ రోజువారీ ఖర్చుల్లో కొంత భాగాన్ని వదులుకుని ఇళ్లు, కుటుంబాలు, తరగతి గదులను కోల్పోయిన ఇతర పిల్లలకు సాయం చేస్తూ విస్తృత సహాయక చర్యల్లో తమ వంతు భాగస్వామ్యం అందించారు. -
నేపాల్‌కు జపాన్ దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు..
ఖాట్మండు: నేపాల్‌లోని రసువా, నువాకోట్ తదితర ప్రాంతాల్లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సర్వస్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం జపాన్ ప్రభుత్వం, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ముందుకొచ్చాయి. దాదాపు 9.3 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని ఆ దేశానికి అందజేశాయి. ఈ విపత్తు సహాయక సామగ్రిలో దుప్పట్లు, ప్లాస్టిక్ షీట్లు, స్లీపింగ్ ప్యాడ్లు, టెంట్లు, మంచినీటి నిల్వకు ఉపయోగపడే పోర్టబుల్ జెర్రీ క్యాన్లు ఉన్నాయి.ఈ సామగ్రి బుధవారం నేపాల్ చేరుకోగా, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ‘హ్యుమానిటేరియన్ స్టేజింగ్ ఏరియా’లో లాంఛనంగా అప్పగించారు. నేపాల్‌లో జపాన్ రాయబారి మయేదా తోరు.. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ మంత్రి మహాబీర్ పున్కు ఈ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో పాటు జైకా నేపాల్ అధికారులు పాల్గొన్నారు. జైకా నేపాల్ చీఫ్ రిప్రజెంటేటివ్ మత్సుజాకి మిజుకి, మంత్రి మహాబీర్ పున్ సంబంధిత పత్రాలను (లెటర్ ఆఫ్ డెలివరీ అండ్ యాక్సెప్టెన్స్) పరస్పరం మార్చుకున్నారు.విపత్తు వేళ తక్షణ సాయం అందించినందుకు గాను జపాన్, జైకా సంస్థలకు మంత్రి పున్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సామగ్రిని బాధితులకు సకాలంలో, సక్రమంగా పంపిణీ చేసేందుకు సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకోవాలని నేపాల్ ప్రభుత్వాన్ని జైకా కోరింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జపాన్-నేపాల్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి టెలిఫోన్ చర్చల అనంతరం ఈ సాయం ఖరారైంది. ఆ చర్చల్లో జపాన్ ప్రభుత్వం వరద మృతులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, నేపాల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ అత్యవసర సామగ్రి బాధితుల కష్టాలను తగ్గించి, పునరుద్ధరణ, పునర్నిర్మాణ చర్యలకు దోహదపడుతుందని, ప్రజలు వీలైనంత త్వరగా సాధారణ జీవితం గడపడానికి తోడ్పడుతుందని జపాన్ ఆశాభావం వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: ‘సీజేపీ’ మహిళా కార్యకర్తకు ‘బిగ్‌బాస్’లో చాన్స్ -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్!
హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది. వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్ఏటీ (VSAT) కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.పాత వ్యవస్థ ఏమైంది?ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్‌లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది.మొబైల్ నెట్వర్క్ పోయినా..కొత్త వ్యవస్థలో వీఎస్ఏటీని కీలకంగా ఉపయోగించనున్నారు. భారీ విపత్తుల సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోయినా.. ఉపగ్రహం ద్వారా పర్యవేక్షణ కేంద్రాలు అధికారులతో అనుసంధానంలో ఉండేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేసి, ప్రజలకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపేలా వ్యవస్థను రూపొందించనున్నారు.ఇంకా 4 వేల మంది మిస్సింగ్ఆగస్టు 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదకు నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. రెండు దేశాల్లో కలిపి కనీసం 1,114 మంది మరణించగా.. దాదాపు 4 వేల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధిక మరణాలు నేపాల్‌లోనే నమోదయ్యాయి.41 నిమిషాల ఆలస్యం.. ప్రాణాల మీదకుఈ విపత్తులో హెచ్చరిక వ్యవస్థ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఒక అంశం స్పష్టం చేస్తోంది. వరదకు దారితీసిన మంచు, రాళ్ల విరిగిపాటు ఉదయం సంభవించినప్పటికీ.. అధికారిక హెచ్చరిక ప్రజలకు చేరేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచిపోయాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో 10–15 నిమిషాల ముందస్తు సమాచారం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా మారుతుంది.చైనాతో మరింత డేటా షేరింగ్ఇకపై చైనాతోనూ విపత్తు సమాచారాన్ని మరింత వేగంగా పంచుకునే దిశగా నేపాల్ అడుగులు వేస్తోంది. హిమనదుల కదలికలు, నీటి మట్టాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులపై రియల్‌టైమ్ సమాచారాన్ని పొందేందుకు సహకారం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా ఉపగ్రహ చిత్రాలు, నీటి మట్టం–ప్రవాహ సమాచారం, ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రమాదాలపై వివరాలను పంచుకున్నట్లు సమాచారం.కొన్ని నిమిషాలైనా.. ప్రాణాలు కాపాడొచ్చు!కొత్త వ్యవస్థ వల్ల భారీ విపత్తును పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రమాదాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి హెచ్చరికలు పంపగలిగితే.. ప్రజలను, సరిహద్దు సిబ్బందిని, సహాయక బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి జరిగిన ఘోర వైఫల్యం తర్వాత నేపాల్ హడావుడిగా పాత వ్యవస్థ స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మాత్రం మరో విపత్తు వచ్చినప్పుడు హెచ్చరించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: నేపాల్ వరదలే కాదు.. భూకంపాలకూ కారణం ఇదే! -
దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
-
నేపాల్ నెత్తిన మరో జలఖడ్గం
కఠ్మాండు: మెరుపు వరద బురదతో జలమయమైన నేపాల్ దిగువ ప్రాంతాలపై మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు స్థానికుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కనీవినీ ఎరుగని జల ప్రళయం దాటికి ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో జనజీవనం కకావికలంకాగా మరోసారి అపార జలరాశి వరదరూపంలో వచ్చి పడే ఆస్కారముందని నేపాల్ వాతావరణ శాఖలోని వరద అంచనాల విభాగం బుధవారం హెచ్చరికలు జారీచేసింది. సింధూరి జిల్లాలో సున్ కోశి నది, గూర్ఖా జిల్లాలో బుధి గండకీ నది, దదేల్ధురా జిల్లాలో మహాకాళీ నది, లామ్జుంగ్ జిలాల్లో మార్షా్యంగ్డి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్లు వరద అంచనాల విభాగం ప్రకటించింది. దిగువ ప్రాంతాల ప్రజలు జనావాసాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలుచేసింది. భుకుందేబేసీ వాటర్ లెవల్ మానిటరింగ్ కేంద్రంలో మంగళవారం రాత్రి 11.15 గంటలకే నది డేంజర్ మార్క్‌ను దాటేసింది. మార్షా్యంగ్డి నదిలో నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే వినాశనం సృష్టించిన వరద విలయంలో మృత్యువాత పడిన వారి సంఖ్య బుధవారానికి 1243కు పెరిగింది. మరో 4,216 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షం, బురద మధ్యే భవన శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని ఆశతో అన్వేషణ బృందాలు కాలంతో పోటీపడుతూ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. 1,113 మృతదేహాల గుర్తింపు, చట్టపర ప్రక్రియ పూర్తయిందని, 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. 21,314 మంది సైనికులు, పోలీసులు, వలంటీర్లు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే రాసువా, నువాకోట్‌లో కురుస్తున్న భారీ వర్షం సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తోంది. వర్షపు నీరు చేరుతుండటంతో జలవిద్యుత్కేంద్ర సొరంగంలో అన్వేషణ ఆగిపోయిందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల సొరంగాల్లో అన్వేషణకు భారత్, చైనా, ద.కొరియా నిపుణుల బృందాలు కృషిచేస్తున్నాయి. వాతావరణ మార్పులతోనే దారుణం: ప్రధాని సంపన్న దేశాలు వాతావరణంలోకి భారీగా విడుదలచేస్తున్న కర్భన ఉద్గారాలు, వాతావరణ మార్పుల కారణంగానే హిమానీనదాలు అమిత వేగంగా కరిగిపోతూ కొత్త ఉత్పాతాలను తీసుకొస్తున్నాయని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆరోపించారు. బుధవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆయన మాట్లాడారు. ‘‘భోటె కోశీలో వరద రావడానికి ప్రత్యక్షంగా వాతావరణమార్పులు(క్లైమేట్ చేంజ్) కారణమని నిపుణులు తేల్చేశారు. అంతర్జాతీయ సమాజానికి మేం చెప్పేదొక్కటే. మేం అనుభవిస్తున్న ఈ బాధలకు వాతావరణ మార్పులే కారణం.ప్రపంచ దేశాలతో పోలిస్తే నేపాల్ గ్రీన్హౌస్ వాయువులను అత్యల్పంగా విడుదలచేస్తుంది. కానీ ఇతర దేశాలు చేసిన పాపాలకు మేం బలవుతున్నాం’అని అన్నారు. ఆపన్న హస్తం అందిస్తున్న భారత్‌కు ప్రధాని బాలేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. కాఠ్మండులో సోనూ సూద్ సాయం కోవిడ్ సంక్షోభం వేళ భారీ సంఖ్యలో కరోనా బాధితులను ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటారు. కాఠ్మండుకు పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని తీసుకెళ్లి వరద బాధితులకు అందజేశారు. ‘‘ఇక్కడి వాళ్లకు సరిపడా సరకులు, ఆహారం, దుప్పట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వరదతో సర్వం కోల్పోయిన వాళ్లకు మళ్లీ పాత జీవితాలను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు. -
శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు
హిమాలయాలు ఒకదాని తర్వాత ఒకటిగా హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాయి. ఆకస్మిక వరదలు, హిమ పాతాలు, హిమానీనద సరస్సులకు గండి పడటంతో ముంచెత్తుతున్న వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రంగా భూమి కుంగిపోవడం వంటివి వాటి కోవలోకి వస్తాయి. కేదార్నాథ్, ధౌళిగంగ, జోషీమఠ్, సిక్కిం, ఇపుడు నేపాల్‌లోకి సరిహద్దులు దాటి వచ్చిన వరదలు అలాంటివే. అటువంటి ప్రతి ఉత్పాతంలోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపారమైన విధ్వంసం కనుల ఎదుట నిలుస్తోంది. హిమాలయాలలో సంభవిస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే యంత్రాంగాలను తయారు చేసుకోవడం, ప్రజా చైతన్యం తీసుకు రావడం, సమాజాలను కూడా ఈ కృషిలో భాగస్వాములుగా చేయడం వంటివి చేపట్టక తప్పదు. నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలువాతావరణ మార్పుపై ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ప్యానెల్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ నివేదికలను ప్రచురించింది. గ్లేసియర్లు, పర్వత ప్రాంతాలలోని జీవావరణ వ్యవస్థల గురించి వివిధ దేశాలు వాటి పరిశోధనల్లో కనుగొన్న అంశాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చింది. మన దేశంలోనూ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిమోట్ సెన్సింగ్ ఇమేజరీని ఉపయోగించి (మొత్తం 28,000లలో) 7,500లకు పైగా గ్లేసియల్ సరస్సుల మ్యాప్‌ను రూపొందించింది. హై–రిస్క్ గ్లేసియల్ సరస్సులకు సంబంధించి అది వరద ముప్పుల మ్యాప్‌ను కూడా తయారు చేసింది. ఐసు గడ్డలు, బండరాళ్ళు కట్టలుగా ఉన్న సరస్సులు ఒక్కసారి తెగిపడితే రాగల వరదలు, వాటివల్ల దిగువ పరీవాహక ప్రాంతాల్లోనున్న జనావాసాలకు వాటిల్లగల నష్టాల గురించి కూడా అది తెలియజేసింది. కాఠ్మాండూకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రే టెడ్ మౌంటైన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) మొన్నీమధ్య అంటే 2026 మార్చిలో కూడా రెండు గణనీయమైన నివేదికలను ప్రచురించింది. వాటిలో ఒకటి హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో 1990 నుంచి 2020ల వరకు మారుతున్న గ్లేసియర్ల గతిశీలతలను వివరించింది. మరోటి 2026 నాటికి ఉన్న హిందూ కుష్ హిమాలయ గ్లేసి యర్ల స్థూల స్వరూప స్వభావాలను వెల్లడించింది. ఈ నివేదికలు వెల్లడిస్తున్న అంశాలు ఆందోళన రేపేవిగా ఉన్నాయి. మొదటి నివేదిక 55 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ కుష్ ప్రాంతమంతటానున్న 63,761 గ్లేసియర్ల డేటాను ఆధారం చేసుకుని రూపొందింది. వాటిలో 5,700 క్యూబిక్ కిలోమీటర్ల మేర ఐసు నిల్వలున్నాయి. నలుచెరగులా ఉన్న ఈ గ్లేసి యర్లు 1990ల ఆరంభం నుంచి స్థిరంగా కరిగిపోతూ వస్తున్నా యని ఆ విశ్లేషణ తెలిపింది. మొత్తం గ్లేసియర్ ప్రాంతంలో 12 శాతం తరిగిపోయింది. అంచనా వేసిన హిమ నిల్వలలో 9 శాతం క్షీణత కనిపించింది. గ్లేసియర్లు అలా కుంచించుకుపోవడం 2010 నుంచి 2020 మధ్య కాలంలో మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. సింధు నదీ పరీవాహక ప్రాంతం 6 శాతం గ్లేసియర్ ప్రాంతాన్ని కోల్పోయింది. గంగా నది 21 శాతం, బ్రహ్మపుత్ర 16 శాతం తరుగుదలను నమోదు చేశాయి. హిమం గడ్డకట్టిన ప్రాంతాలు కుంచించుకు పోవడం వల్ల వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో నీటి లభ్యత తగ్గి పోతోంది. రెండవ నివేదిక 38 గ్లేసియర్ల సన్నిహిత పరిశీలనతో తయారైంది. హిమాలయాల్లో హిమం గడ్డకట్టిన భూభాగాల్లో కొన్ని పాతరూపును పూర్తిగా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నా యని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘ఇది ఎక్కడో సుదూరంలో ఉన్న సమస్య కాదు. నేటి కాలంలో ఆవిష్కృతమవుతున్న సంక్షోభం. ప్రతి వేసవిలోను, వర్షాకాలంలోను కొత్త ఉపద్రవాలను చూస్తున్నాం. హిమాన్ని కోల్పోతున్న రేట్లు ఈ శతాబ్దంలో రెండింతలైన వాస్తవ మైనా కనీసం మన కళ్లు తెరిపించాలి’’ అని ఐసీఐఎంఓడీ డైరెక్టర్ జనరల్ పెమా గ్యాంషో అన్నారు. నేపాల్‌లో ఇటీవల చూసిన వరదలు గ్యాంషో హెచ్చరికలోని వాస్తవాన్ని ఎత్తి చూపాయి. ఇది గ్లేసియర్ గతిశీలతల సైన్స్, ఉపగ్రహాల విశ్లేషణ, 1974 నుంచి క్షేత్ర స్థాయిలో సేకరిస్తూ వస్తున్న డేటాను ఆధారం చేసుకుని చేసిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. రుణాలు ఎలా ఇస్తున్నారు?డేటాను విశ్లేషించడం ద్వారా, నిష్క్రియాపరత్వం వల్ల కలిగే ప్రమాదకర పర్యవసానాలను తెలుపడం ద్వారా సైంటిస్టులు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, విధాన నిర్ణేతల స్పందనే మంద కొడిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా, వివిధ దేశాల ప్యానెళ్ళ నివేదికలపై స్పందన లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా, పుడమి తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను తగ్గించు కోవాల్సిన అంశంపై వాటి కార్యాచరణ పేలవంగా ఉంది. దాని ప్రత్యక్ష ఫలితం హిమా లయాలపై పడుతోంది. ప్రాంతీయ స్థాయిలో హిమాలయ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం బొత్తిగా లేదనే చెప్పాలి. ప్రాంతాల మధ్య రాజకీయ సరిహద్దులను ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం గుర్తించవు కనుక ఈ ప్రాంతంలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుని తీరాలి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర, మెకాంగ్ వంటి పెద్ద నదులన్నీ హిమాల యాలలోనే పుడుతున్నాయి. వివిధ దేశాలను దాటి ప్రవహిస్తు న్నాయి. కనుక, ఒక దేశంలో ఆ నదిలోకి కొండ చరియలు విరిగి పడితే, అది మరో దేశంలో వినాశకర వరదలకు కారణంగా పరిణ మించవచ్చు. లిహెండే ఖోలా నదిలో గత ఏడాది జూలైలో సంభవించిన విపత్తు అదే రసూవా, నువాకోట్ ప్రాంతంలోని కనీసం అర డజను జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు నష్టం కలిగించింది. ఇపుడు వార్తలకెక్కిన ప్రాంతం అప్పుడూ ఇంచుమించుగా ఇవే కారణాలపై వార్తలకెక్కింది. త్రిశూలి పరీవాహక ప్రాంతంలో దాదాపు 36 జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బహుళ జాతీయ రుణ సంస్థలు కూడా ఆయా అంశాలు వేటినీ లెక్కలోకి తీసుకోకుండా రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఆనకట్టలు, నదులు, ప్రజానీకంపై అధ్యయనం చేసిన సౌత్ ఏషియా నెట్వర్క్ విశ్లేషణలో ఆ అంశాలు వెలుగు చూశాయి. భారతదేశంలో కూడా ప్రకృతి ఉత్పాతాలు, హిమ పాతాలు సంభవించే, శిథిల ప్రవాహాలుసాగే ప్రాంతాల్లో జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. రెండూ సాగవు!హిమాలయాల్లో జీవావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. అవి భారత్, చైనా, నేపాల్ సరిహద్దుల గుండా వ్యాపించి ఉన్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా మౌలిక వసతులను పెద్దయెత్తున అభివృద్ధి చేస్తున్నాయి. పైగా, సామూహిక యాత్రలను, వాణిజ్యపరమైన పర్వత ప్రాంత టూరిజాన్ని అవి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, పర్యావరణపరంగా పెళుసైన ప్రాంతాల్లో నిర్నిరోధ అభి వృద్ధి, కమర్షియల్ టూరిజం చెట్టపట్టాలేసుకుని సాగలేవని గ్రహించాలి. శాస్త్రీయ ఆధారాలు, విధాన నిర్ణయాల మధ్య అగాథాన్ని భర్తీ చేయడం ద్వారా పర్వత ప్రాంతాల్లో సంభవించగల విపత్తుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అమ్మా, నాన్న క్షేమమే కదా..! నీట్ పీజీ విద్యార్థి భావోద్వేగం
నేపాల్‌లో సంభవించిన జలప్రళయం వేలాది కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందులో గల్లంతైన వారి ఆచూకి కోసం కొండంత ఆశతో చూస్తూన్న ఘోష మాటలకందనిది. ఈ నేపథ్యంలో ఓ కంటెంట్ క్రియేటర్ నీట్ పీజీ వైద్య విద్యార్థి తన్వి షేర్ సోషల్ మీడియా వేదకగా షేర్ చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె పేరెంట్స్ కూడా నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ కానరాలేదు. అయినా సరే తన అమ్మనాన్న ఎక్కడోఒక చోట క్షేమంగా ఉంటారని కొండంత ఆశతో చూస్తున్నా అటూ కన్నీటి పర్యంతమైందామె వీడియోలో. తన్వి తల్లిదండ్రలు 67 మంది సభ్యుల బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు పేర్కొంది. ఆ బృందం చివగా ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఫ్రెండ్షిప్బ్రిడ్జ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండు ప్రదేశాలు ఇప్పడు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ తన తల్లిదండ్రులు అక్కడున్న ఏదో ఒక పునరాసవ కేంద్రానికి చేరుకుని సురక్షితంగా ఉంటారేమోనని ఆశిస్తోందామె. ఆ బృందంలోని ఎవ్వర్నీ సంప్రదించలేకపోవడంతో ఆమె తల్లిదండ్రలు ఆచూకీ మరింత క్లిష్టంగా మారింది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోలో వివరిస్తూ..కన్నీళ్లు పెట్టుకుంది. తాను భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల శాక, నేపాల్, చైనా అధికారులను సైతం సంప్రదించామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. తాను నీట్ పీజీ పరీక్ష రాస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నానని, కన్నీళ్లు వచ్చేయడంతో కొన్ని ప్రశ్నలు చదవలేకపోయానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. తన తండ్రి ఈ పరీక్ష రాయాలని కోరుకున్నారు, అందువల్ల కచ్చితంగా ఈ పరీక్ష రాసి తీరాల్సి వచ్చింది. అంతకంటే బాధకరం ఏంటంటే..పరీక్షకు వెళ్లేమందు అమ్మ పెరుగు చక్కెర కలిపి తినిపించి ఆల్‌ది బెస్ట్ చెప్పి దీవించేవారు. అది మరింత గుర్తు వచ్చి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఆవేదనగా చెప్పింది. ఎలాగైన వాళ్లు తిరిగి రావాలి, కచ్చితంగా తిరిగి రావాలంటే ఉబికివస్తున్న కన్నీళ్లతో చెబుతూ తన సంభాషణను ముగించింది. కాగా, నేపాల్ విపత్తులో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 939కి చేరగా, గల్లంతైన వారి సంఖ్య నాలుగువేలకు చేరుకుందని అధికారులు తెలిపారు. సుమారు 158 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. View this post on Instagram A post shared by Tanvi (@tanvimakesvideos) (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..) -
భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేపాల్ ప్రధాని
ఖాట్మండు: దేశం అత్యంత కష్ట సమయంలో ఉండగా సహకరించినందుకు భారత్‌కు నేపాల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. వరద సహాయక, రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేసినందుకు నేపాల్ భారత్, చైనాలకు ధన్యవాదాలన్నారు. ఈ రోజు బుధవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ, రెండు పొరుగు దేశాలు సకాలంలో సహాయక సామగ్రి, సాంకేతిక బృందాలతో పాటు అత్యవసర సహాయాన్ని నేపాల్‌కు అందించాయని తెలిపారు. కాగా ఇటీవల నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగుదేశమైన భారత్ వెనువెంటనే నేపాల్‌కు ఆపన్న హస్తం అందించింది. భారతదేశం ఐదవ విడత సహాయ సామాగ్రిని పంపింది. భారత బృందాలు సొరంగాలలో గాలింపు చర్యలలో సహాయం చేస్తూ మృతదేహాలను గుర్తించడంలో సహకరిస్తున్నాయి. నేపాల్ వరదల కారణంగా ఇప్పటివరకు 1,127 మంది ప్రాణాలు కోల్పోగా, 4,800 మందికి పైగా గల్లంతయ్యారు. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులలోని కార్మికులు సైతం గల్లంతయ్యారు. మరికొంతమంది సొరంగాలలో చిక్కుకుని ఉండవచ్చని భయపడుతున్నారు. ఈ విపత్కర సమయంలో భారత్ నేపాల్‌కు అపన్నహస్తం అందించింది. సహాయక చర్యల నిమిత్తం పలు కీలక సామాగ్రిని నేపాల్ పంపింది.నేపాల్‌కు అండగా నిలిచిన భారత్మొదటి C-130J విమానం దుప్పట్లు, టార్పాలిన్లు, పరిశుభ్రతా కిట్లు మరియు నిత్యావసర వస్తువులతో సహా సుమారు 10 టన్నుల సహాయ సామాగ్రిని అందించింది.ఆగస్టు 27 – ఒక సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానం సహాయక సామాగ్రి, మందులు మరియు ఆహార ప్యాకెట్లతో సహా 37.5 టన్నుల సహాయాన్ని అందించింది.ఆగస్టు 28 – మూడవ విడతలో సుమారు 10 టన్నుల సహాయక సామగ్రి, 11 మంది సభ్యుల వైద్య మరియు సొరంగ-రెస్క్యూ నిపుణుల బృందాన్ని నేపాల్‌కు పంపింది. ఆగస్టు 30 – నాల్గవ విమానం 11 టన్నుల సహాయ సామాగ్రితో పాటు, DNA ఫోరెన్సిక్ నిపుణులు మరియు సొరంగం రెస్క్యూ పరికరాలను అందించింది.సెప్టెంబర్ 2 – 11 మంది సభ్యుల ప్రత్యేక సహాయక బృందం, అదనపు సాంకేతిక సహాయంతో కూడిన ఐదవ విమానాన్ని నేపాల్‌కు పంపారు. మృతదేహాలను గుర్తించడంలో సహాయపడటానికి భారత్ డీఎన్ఏ పరీక్ష నిపుణుల బృందాన్ని సైతం నేపాల్‌కు పంపింది. -
Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!
-
నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో
-
నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు
-
‘బతికించమని అడుక్కోవాలా?’.. నేపాల్‌లో రెస్క్యూ తీరిదీ!
నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించి వారం రోజులు దాటుతున్నా.. వేల మంది జాడ లేకుండా పోయింది. నేపాల్ సైన్యంతో పాటు భారత్, చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అన్వేషణలో సాయం చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, నదులు పొంగిపొర్లుతుండడం.. ఇప్పటికే బురద దట్టంగా పేరుకుపోయి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ తరుణంలో సొరంగాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. నేపాల్ ఆకస్మిక వరదల్లో 4 వేల మంది జాడ తెలియరావడం లేదు. ఇందులో సుమారు 1000 మంది సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. దీంతో ఆ టన్నెళ్లకు రంధ్రాలు చేసి.. పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు. అయితే బోర్‌హోల్ కెమెరాలతో సొరంగాల పరిశీలనలో కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో వాళ్లంతా కొట్టుకుపోయి ఉంటారా? లేదంటే వాటిల్లోనే సమాధి అయ్యారా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు సహాయక చర్యలు నత్తనడకన సాగుతుండడంపై బాధిత కుటుంబాలు నేపాల్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రసువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ కేంద్రంలో సుమారు 40 మంది నెపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ‘ఆరు రోజులుగా ఎదురుచూస్తున్నాం.. అసలు రెస్క్యూ ఎప్పుడు?’ అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓ ఇంజినీర్ భార్య. తన భర్తతో పాటు 40 మంది ఉద్యోగులు త్రిశూలీ-3ఏ ప్రాజెక్టులో చిక్కుకున్నారని ఆమె తెలిపారు. ఈ జలవిద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటని చెప్పడంతో.. లోపలున్న వారంతా క్షేమంగానే ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోందన్నారు. సమాచారం కోసం ఆర్మీ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. కొందరు టన్నెల్ వద్దకు కూడా వెళ్లారు. ఎవరి నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు అని వాపోయారామె.ప్రకటనలకే పరిమితమా?చైనా, భారత్ నుంచి రెస్క్యూ బృందాలు వెళ్లాయని మీడియాలో వార్తలు వస్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆమె ఆరోపించారు. ‘చైనా, భారత్ బృందాలు వెళ్లాయని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క జేసీబీ కూడా అక్కడికి చేరలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తీవ్రత, మట్టి, శిథిలాల పరిస్థితి తెలిసి ఆరు రోజులైనా.. సొరంగాల్లోకి వెళ్లేందుకు అవసరమైన భారీ యంత్రాలు, టన్నెల్ కట్టర్లు ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. రోజుకో రెస్క్యూ బృందం వచ్చిందంటూ ప్రకటనలు చేయడం తప్ప.. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదన్నారు.‘ఈ రోజు.. రేపు అంటూ ఆరు రోజులు’రెస్క్యూ బృందాలు వస్తున్నాయని, మంత్రులు ఘటనాస్థలికి వెళ్తున్నారని, చైనాతో సమన్వయం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలు కూడా ‘ఈరోజు కాకపోతే రేపైనా మా వాళ్లు బయటకు వస్తారు’ అని ఆశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ‘ఇలా ఆశ పెట్టుకుని ఆరు రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి గంటా, ప్రతి క్షణం భారంగా మారింది’ అని కన్నీటి పర్యంతమయ్యారు.‘వాళ్ల ప్రాణాలతో ఆటలు ఆడాలా?’రెస్క్యూ చర్యల పురోగతిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పది మీటర్లు వెళ్లాం.. 20 మీటర్లు వెళ్లాం అని చెబుతున్నారు. ఇది ఏంటి? మనం వాళ్ల ప్రాణాలు కాపాడుతున్నామా? లేక ఆటలు ఆడుతున్నామా?’ అని ప్రశ్నించారు. ‘ఇది ఒక్కరి విషయం కాదు. 40 కుటుంబాల ప్రాణాల సమస్య. వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ప్రభుత్వానికి తెలుసా?’ అని నిలదీశారు.తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితిలో పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రుల పాలయ్యారని తెలిపారు. ‘ఆయన వ్యక్తిగత పని కోసం అక్కడికి వెళ్లలేదు. దేశం కోసం పని చేయడానికి వెళ్లారు. మరి ఆయనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ప్రాణాలు కాపాడమని మేము మీడియా ముందు వేడుకోవాలా?’ అని ఆమె ప్రశ్నించారు.వందలాది మంది ఉద్యోగులు గల్లంతునేపాల్లో వరదల కారణంగా మరికొన్ని హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. అప్పర్ త్రిశూలీ-1 ప్రాజెక్టు వద్ద 550 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (ఐపీపీఏఎన్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్కడ 254 మందిని సురక్షితంగా రక్షించినప్పటికీ.. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.అప్పర్ త్రిశూలీ-3బీ ప్రాజెక్టులో 122 మంది, లాంగ్టాంగ్ ఖోలా ప్రాజెక్టులో 41 మంది, చిలిమే హైడ్రోపవర్ ప్రాజెక్టులో ఎనిమిది మంది, మెయిలంగ్ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. రసువాగఢి హైడ్రోపవర్ ప్రాజెక్టులోనూ 93 మంది ఆచూకీ తెలియడం లేదు. చైనా, దక్షిణ కొరియా, భారత్‌కు చెందిన బృందాలు నేపాల్ సైన్యంతో కలిసి పలు ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబాల ఆందోళన మరింత పెరుగుతోంది.అధికారులు ఏం చెబుతున్నారు?మరోవైపు.. సహాయక చర్యల్లో తామేమీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని అక్కడి అధికారులు అంటున్నారు. సొరంగాల్లోకి చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారిందని చెబుతున్నారు. భారీ బురద, నీరు, రాళ్లు, శిథిలాలు మార్గాన్ని పూర్తిగా మూసేశాయని.. కొన్ని ప్రాంతాల్లో డ్రిల్లింగ్, భారీ యంత్రాల సాయంతో మార్గాన్ని క్లియర్ చేస్తున్నామని వెల్లడించారు. చైనా, భారత్ తదితర దేశాల నిపుణుల సహకారంతో పరిస్థితిని అంచనా వేసి రెస్క్యూ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: భారత్ మాకు పరిహారం చెల్లించాల్సిందే.. నేపాల్ డిమాండ్ -
Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..
-
నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!
-
శివుడి త్రిశూలం నుంచి పుట్టిన దేశం, నేపాల్ అసలు కథ ఇదే!
-
నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)
-
నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధిత ఫ్యామిలీ ఆవేదన
-
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఆకస్మిక వరదలతో అతలాకుతలం అయిన నేపాల్ సరికొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. భారత్ సహా పలు దేశాలు పాలు పంచుకుంటున్నాయి. అయితే తమకు సాయంతో పాటు న్యాయం కూడా జరగాలని నేపాల్ వాదిస్తోంది. చేయని తప్పులకు శిక్ష తామెందుకు అనుభవించాలని.. భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ చెబుతోంది.హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. తాము తక్కువ స్థాయిలోనే కార్బన్ ఉద్గారాలు చేస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని శిశిర్ అంటున్నారు. తమ దేశం సృష్టించని సంక్షోభానికి తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘ఇది పర్వత సునామీ’చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. హిమనదీ ప్రాంతంలో మంచు, శిలలు కూలిపోవడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో వెయ్యి మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సాధారణ వర్షపాతం లేకుండానే ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల ప్రజలకు తగినంత ముందస్తు హెచ్చరిక అందలేదు. దీంతో ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాని ప్రభావంతో హిమనదులు, పర్వత వాలులు ఆందోళనకరంగా మారుతున్నాయన్న నిపుణుల హెచ్చరికలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా తప్పు లేకుండా మూల్యం చెల్లిస్తున్నాం’వాతావరణంలోకి నేపాల్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు వాస్తవంగా చాలా తక్కువ. అయినప్పటికీ మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం చెల్లిస్తున్నాం’’ మంత్రి ఖనాల్ అంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదలతో నేపాల్‌లో కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగం దెబ్బతిందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారాయన.‘సాయం కాదు.. న్యాయం’ఇది నాగరికత మనుగడకు సంబంధించిన విషయం. ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో మా దౌత్య విధానాన్ని ‘సాయం’గా కాకుండా.. ‘న్యాయం, పరిహారం’ వైపు మళ్లిస్తాం. ఇది దాతృత్వం కాదు.. చట్టపరమైన, నైతిక బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించి అంతర్జాతీయ భాగస్వాములకు నేపాల్ క్లెయిమ్ పంపిందని మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు.కాలుష్యంలో ఎవరి వాటా ఎంత?వాతావరణ మార్పులపై నేపాల్ చేస్తున్న వాదనలో ప్రధానంగా కార్బన్ ఉద్గారాల అసమానతను ప్రస్తావిస్తోంది. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ (Global Carbon Budget 2025) గణాంకాల ప్రకారం.. కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల్లో చైనా వాటా సుమారు 32 శాతం. అమెరికా వాటా 13 శాతం, భారత్ వాటా 8 శాతం. అంటే ఈ మూడు దేశాలే కలిపి ప్రపంచ ఫాసిల్ కార్బన్ ఉద్గారాల్లో దాదాపు 53 శాతం రిలీజ్ చేశాయన్నమాట. అయితే.. అయితే నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2024 గణాంకాల ప్రకారం ఆ దేశం నుంచి రిలీజ్ అయిన కర్బన ఉద్గారాలు సుమారు 1.59 కోట్ల టన్నులు మాత్రమే. అంటే ప్రపంచ దేశాల్లో ఆ వాటా 0.04 శాతం మాత్రమే. అలాగే యావరేజ్‌గా ఒక దేశం 0.5 టన్నులు రిలీజ్ చేస్తుంటే.. నేపాల్ అంతకంటే తక్కువగా ఉందన్నమాట. అలాగని..చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు నేపాల్‌కు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలనే రూల్‌గానీ, చట్టంగానీ లేదు. ఇది కేవలం నేపాల్ తెర మీదకు తెచ్చిన ‘క్లైమేట్ జస్టిస్–లాస్ అండ్ డ్యామేజ్’ వాదన మాత్రమే. అయితే తక్కువ ఉద్గారాలు చేసే దేశాలే వాతావరణ విపత్తులతో ఎక్కువగా నష్టపోతున్న నేపథ్యంలో.. ఎక్కువ కార్బన్‌ను రిలీజ్ చేస్తున్న చేసిన దేశాలు ఆర్థిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: కాల్చరు.. పూడుస్తారు! ఎందుకో తెలుసా? -
నేపాల్: టన్నెళ్లలో భారత రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు
కఠ్మాండు: వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లోని చిలిమె, లాంగ్టాంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద భారత ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం సహాయక చర్యల్లో ముందడుగు వేసింది. ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నేపాలీ సైన్యంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసింది.చిలిమె ప్రాజెక్టు టన్నెల్లోకి బృందం విజయవంతంగా ప్రవేశించి లోపల భద్రతా తాళ్లను ఏర్పాటు చేసిందని, లాంగ్టాంగ్ వద్ద టన్నెల్లో దాదాపు 185 మీటర్ల మేర లోపలికి వెళ్లి గాలింపు చేపట్టిందని నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సాంకేతిక బృందాలతో సోమవారం సమావేశమైన ఆయన, అక్కడ జరుగుతున్న పురోగతిని సమీక్షించారు. Indian and Nepali rescue teams work side by side inside the Chilime tunnel in Nepal's Rasuwa district, searching for people who may still be trapped after the devastating floods pic.twitter.com/4zNZYwi8xC— WION (@WIONews) September 1, 2026ఆగస్టు 26న నేపాల్‌లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. వరదల అనంతరం వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఆచూకీ లేకుండా పోయిన సిబ్బంది, కార్మికులను గుర్తించేందుకు భారత్, చైనా నిపుణుల బృందాలు నేపాల్‌కు సహకారం అందిస్తున్నాయి.రసువా ప్రాంతంలో సహాయక చర్యలకు కేంద్రంగా ఉన్న నువాకోట్‌లోని బిదూర్ వద్ద గల నేపాలీ సైనిక స్థావరాన్ని రాయబారి సందర్శించారు. అనంతరం నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్, ఇంధన-జలవనరుల శాఖ మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠలతో సమావేశమై భారత్ తరఫున అందిస్తున్న సహాయ సహకారాలపై చర్చించారు. మరోవైపు, నేపాల్ పోలీసుల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీతో కలిసి భారత ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం ఖాట్మండులో విధులు నిర్వహిస్తూ వివిధ పద్ధతులు, డాక్యుమెంటేషన్ ప్రక్రియల సమన్వయంలో తోడ్పడుతోందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది.ఇది కూడా చదవండి: ఎన్ఆర్సీ? లేదా జనగణన?.. మణిపూర్‌లో కొత్త రచ్చ! -
నేపాల్ వరదల్లో వేయి దాటిన మ*రణాలు
కఠ్మాండు: నేపాల్ దిగువ ప్రాంతాలపై జలఖడ్గంతో దండయాత్ర చేసిన వరద విలయం ధాటికి జల సమాధి అయిన అమాయకుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నేపాల్‌ను ముంచెత్తిన మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 1,050కి పెరిగింది. భోటె కోశీ, త్రిశూలి నదీ ప్రవాహాల వెంట ఉన్న 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 12,000 మందిని కాపాడినప్పటికీ అన్వేషణ, సహాయక చర్యల్లో ఇంకా గుట్టలకొద్దీ మృతదేహాలు బురద మట్టిలో బయటపడుతున్నాయి. భద్రపరిచేందుకు సరిపడా ఫ్రీజర్లు లేక, బురదకొట్టుకుపోయిన దారుల్లో తరలించే ఆస్కారం లేక కొన్ని మృతదేహాలను సమీప కొండల్లోనే బుల్డోజర్లతో గోతులు తీసి కప్పేస్తున్నారు.మరోవైపు ఆస్పత్రుల వద్ద మృతదేహాలు తమ వారివేనంటూ ఒకరికి మించి ఎక్కువ మంది బంధువులు రావడంతో అధికారులు మృతదేహాలతోపాటు అందరి డీఎన్ఏ శాంపిళ్లను తీసుకుంటున్నారు. దీంతో మృతదేహాల అప్పగింత సైతం ప్రహసనంగా మారింది. అంతెత్తున్న దూసుకొచి్చన బురద వరదలో గల్లంతైన వారి సంఖ్య మంగళవారానికి 4,400 దాటింది. వీరిలో 600 మందిదాకా విదేశీయులు, 83 మంది పోలీసులు, సైనికులు, సాయుధ సిబ్బంది ఉన్నారు. 5 జిల్లాల్లో 16 లక్షల మంది మెరుపు వరదలకు తీవ్రంగా ప్రభావితులయ్యారు.బురద మట్టిని తొలగిస్తూ భారత సొరంగ నిపుణుల బృందం ఎట్టకేలకు ఛిలిమి సొరంగం, లాంగ్‌టాంక్ సొరంగంలో 185 మీటర్ల మేర లోపలికి వెళ్లేందుకు దారి సిద్ధంచేయగల్గిందని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో 163 మంది భారతీయులను కాపాడి తరలించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ తెలిపారు. వేర్వేరు చోట్ల నదుల ప్రవాహ ఉధృతిని ప్రత్యక్షంగా చూసేందుకు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను అధికారులు బిగించారు. తాజా పరిస్థితిపై నేపాల్ ఇందన శాఖ మంత్రి విరాజ్ భక్త శ్రేష్ట సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్వేషణ, సహాయక చర్యల్లో 21,300 మంది నిమగ్నమయ్యారు. -
కెప్టెన్ ఆన్ డ్యూటీ...
కనుచూపుమేర భీకర దృశ్యాలు... బాధితుల ఆర్తనాదాలు... బురద ప్రవాహంలో కొట్టుకుపోతున్న గ్రామాలు... భయంకరంగా విరిగి పడుతున్న కొండచరియలు... ఎటు చూసినా కల్లోలమే! ఇటువంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తనప్రాణాలను సైతం పణంగా పెట్టి సహాయక చర్యలు చేపట్టారు నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 100 రెస్క్యూ మిషన్లు పూర్తి చేసి, వందలాది మంది బాధితులను సురక్షితప్రాంతాలకు చేర్చి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ రెస్క్యూ మిషన్‌లో తన అనుభవాల గురించి ఆమె మాటల్లోనే...2015లో నేపాల్‌లో వచ్చిన భూకంపం కంటే భయంకరమైనది ఈ విపత్తు. నేను గగనతలం నుంచి చూసిన దృశ్యాలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కలవరపరిచాయి. జలవిద్యుత్ప్రాజెక్టులు, ఇళ్లు, రోడ్లు.. ఒక్కటేమిటి సమస్తం కొట్టుకు పోయాయి. 2015లో వచ్చిన భారీ భూకంపం కంటే కూడా ఈ వరదల తీవ్రత చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ విపత్తులో రసువా జిల్లాలోని తిమురే అనే గ్రామం పూర్తిగా దెబ్బతింది. అక్కడి నుంచి బాధితులను సురక్షితప్రాంతాలకు తరలించడం మాకు అతిపెద్ద సవాలుగా మారింది.ఆపని ఇంజిన్లుఈ రెస్క్యూలో రాత్రింబవళ్లు సుమారుగా 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఒకే ల్యాండింగ్ పాయింట్‌కు ఒకేసారి అనేక హెలికాప్టర్లు రావడం వల్ల ఆపరేషన్ నిర్వహణ మాకు అత్యంత కష్టంగా మారింది. అలా ఇబ్బంది వచ్చినపుడు మేము వైర్లెస్ సాధనాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాము. మరోవైపు నేలపై మోకాలు లోతున ఉన్న చిక్కటి బురద కారణంగా హెలికాప్టర్లను నిలపడం మాకు కష్టంగా మారింది. దాంతో ఇంజిన్లను ఆపకుండానే క్షణాల వ్యవధిలో బాధితులను ఎక్కించుకుని సురక్షితప్రాంతాలకు చేర్చాము. ఆర్మీ ఆగస్టా హెలికాప్టర్లతో కలిపి తిమురే గ్రామం నుంచే మొదటి రెండు రోజుల్లో 200 మందికి పైగా బాధితులను రక్షించాం. ఇప్పటికీ అక్కడ చాలామంది ఆచూకీ తెలియడం లేదు. అలసట మాయంనాకు సుదీర్ఘ కాలంగా పర్వతప్రాంతాలలో విమానాలు నడిపిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఈ భీకర విపత్తు తీవ్రత నాకు సవాల్‌గా నిలిచింది. వరుసగా విమానాలు నడపడం వల్ల మేమంతా తీవ్ర అలసటకు గురయ్యాము, కానీ నేలపై ఆశగా చేతులు ఊపుతున్న బాధితులను చూసినప్పుడు ఆ అలసట అంతా మాయమయ్యేది. వారిని రక్షించడమే మానసికంగా నాకెంతో బలం చేకూర్చింది. వరదల్లో చిక్కుకుని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ తనవారిగా భావించి రక్షించిన ప్రియా అధికారి సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎయిర్ హోస్టెస్ టు ఎవరెస్ట్ పైలట్40 ఏళ్ల ప్రియా అధికారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పట్టా పొందిన ఆమె, మొదట్లో ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్ప్రారంభించారు. కానీ విమాన యానంపై కలిగిన ఆసక్తితో ఫిలిప్పీన్ ్స వెళ్లి పైలట్ శిక్షణలో చేరారు. 2017 నాటికి ఆమె పూర్తిస్థాయి కెప్టెన్ గా మారారు. ఆ తరువాత హిమాలయాలలోని ఎతై ్తనప్రాంతాలలో సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లలో శిక్షణ పొందారు. ఎవరెస్ట్ పర్వతంపై దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి గాయపడిన పర్వతారోహకులను రక్షించిన ఘనత ఆమె సొంతం. -
మృతదేహాల గుర్తింపు కోసం నేపాల్ కీలక నిర్ణయం
ఖాట్మండు: నేపాల్ ఆకస్మికంగా వచ్చిన వరదలు తీవ్రస్థాయిలో ప్రాణ, ధన నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ జలప్రళయం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటివరకూ 1,066కు చేరుకుంది. మరో వేల సంఖ్యలో ప్రజల జాడ తెలియలేదు. మృతదేహాలను గుర్తించడం సైతం ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనైనా మృతదేహాల గుర్తింపు సులభతరమయ్యేలా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నేపాల్‌లో వరదల కారణంగా మృతిచెందిన వారి వందలాది మృతదేహాలు దహనం చేయడానికి బదులుగా ఖననం చేయాలని అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మృతదేహాల అవశేషాలు సురక్షితంగా ఉంటాయని తద్వారా భవిష్యత్తులో DNA ను కుటుంబ సభ్యులకు గుర్తించి అప్పగించవచ్చని భావిస్తున్నారు.ఇప్పటికే బురద, వరద నీరు తదితర కారణాలతో మృతదేహాల పరిస్థితి క్షీణించింది. అనేక మృతదేహాలు నీటిలో వాపు మరియు వేగంగా కుళ్ళిపోతున్నాయి. దీంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. మరోవైపు, మార్చురీ, తాత్కాలిక కేంద్రాలు సైతం మృతదేహాలతో నిండి పోయాయి. ఈ పరిస్థితిలో, పరిపాలన చాలా కాలం పాటు శరీరాలను సురక్షితంగా ఉంచడం సాధ్యం కాదని అందుకే గుర్తు తెలియని మృతదేహాలు సామూహిక సమాధుల్లో ఖననం చేయబడుతున్నట్లు అధికారులు తెలిపారు. .కాగా ఆగస్టు 26న సంభవించిన వరదల కారణంగా ఇప్పటివరకూ 1066 మంది మృతిచెందారు, వారిలో 1050 మంది నేపాల్, టిబెట్‌లో 16 మంది మరణించారు. అదే విధంగా దాదాపు 4,400 మందికి పైగా ప్రజలు ఆచూకీ గల్లంతైంది. -
ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు
-
వరదల్లో బ్యాంకు లాకర్లు.. కోట్ల నగదు, బంగారం?
ఖాట్మండు:నేపాల్ వరదలు సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు తీవ్రమైన ప్రాణనష్టం కలిగించడంతో పాటు పెద్దఎత్తున ఆస్తినష్టం కలిగించాయి. మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేపాల్ పోలీసులకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. భారీస్థాయిలో వచ్చిన వరదలకు పెద్దఎత్తున లాకర్లు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోవడంతో వాటి కోసం ఇప్పుడు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నారు. వరద ప్రవాహంలో దాదాపు 20 బ్యాంకులకు చెందిన లాకర్లు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం, అవి దుండగుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం పోలీసులకు మరో పెద్ద బాధ్యతగా మారిందని తెలిపారు. ఈ వాల్ట్‌లలో కొన్ని భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ వివరాలపై డీఐజీ అబి నారాయణ్ కాఫ్లే మాట్లాడుతూ, వరదల అనంతరం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసుల ప్రధాన ప్రాధాన్యత గల్లంతైన వ్యక్తుల కోసం గాలించడం, వారిని రక్షించడమేనని తెలిపారు. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు.“రసువా, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లోని పలు బ్యాంకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉన్న వాటిలో చాలా వాల్ట్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మరికొన్ని భారీగా పేరుకుపోయిన బురద కింద కూరుకుపోయాయి. మా సిబ్బంది ప్రస్తుతం ఆ వాల్ట్లను గుర్తించి, సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొట్టుకుపోయిన వాల్ట్లను కొందరు వ్యక్తులు పగులగొట్టి నగదును దొంగిలించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి” అని కాఫ్లే తెలిపారు.ఈ పరిణామాల మధ్య ధాదింగ్ జిల్లాలో పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ఎగువ రసువా ప్రాంతంలో వరదల్లో కొట్టుకుపోయిన ఓ బ్యాంకు వాల్ట్ నుంచి NPR 92 లక్షలు (నేపాలీ రూపాయలు) దొంగిలించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన వివరాల ప్రకారం, ఆ వాల్ట్‌లో NPR 1.5 కోట్లు నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో NPR 50 కోట్ల విలువైన బంగారం సైతం ఉన్నట్లు తెలిపారు.ఇదే సమయంలో మరో ఘటనలో ‘కృషి వికాస్ బ్యాంక్’కు చెందిన నువాకోట్ వాల్ట్‌ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసిన నేపాల్ పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక, రక్షణ చర్యల్లో ప్రస్తుతం 7,894 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు.గల్లంతైన వారి కోసం గాలింపు, బాధితులను రక్షించడం, వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు వాల్ట్లను గుర్తించి వాటిలోని నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా కాపాడటం ఇప్పుడు నేపాల్ పోలీసులకు మరో కీలక సవాల్‌గా మారింది. -
నేపాల్ లో అదృశ్యమైన హైదరాబాద్ వాసి..
-
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపగ్రహాల్లో ఒకటైన నాసా–ఇస్రో సంయుక్త నిసార్ ఇప్పుడు ఏం చేస్తోంది?. నేపాల్ విపత్తు విషయంలో అది ఏదైనా సమాచారం సేకరించిందా? లేదంటే నిద్ర పోతోందా?. ఆకస్మిక వరదలు, మంచు, నీరు, రాళ్లు, బురద కదలికలతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈ విపత్తుకు సంబంధించి నిసార్ ఏం గుర్తించింది? దాని డేటా ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.సుమారు 1.3 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన నిసార్(NISAR)ను భూమిపై జరిగే మార్పులను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో గుర్తించేలా ఇస్రో-నాసాలు దీనిని అభివృద్ధి చేశాయి. హిమనదులను(గ్లేసియర్ల) పర్యవేక్షించడం, భూభాగ కదలికలను గుర్తించడం, కొండచరియలను అధ్యయనం చేయడం, భూకంపాలను పరిశీలించడం, విపత్తుల నిర్వహణకు కీలక సమాచారం అందించడం దీని లక్ష్యాలు. ముఖ్యంగా హిమనదులు, క్రియాశీల టెక్టానిక్ ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రమాదకరంగా మారుతున్న హిమాలయాలు.. నిసార్ పరిశీలనకు కీలక ప్రాంతాల్లో ఒకటి.మరి నిసార్ ఎక్కడ?నేపాల్ రసువా జిల్లాలో గ్లేసియర్ కూలిపోవడం, మంచు, నీరు, రాళ్లు, బురద భారీగా పొటెత్తడంతో విపత్తు తలెత్తింది. నిసార్ రూపొందించిన ప్రధాన లక్ష్యాల్లోనే ఇలాంటి హిమనదులు, కొండచరియలు, భూభాగ మార్పులను పరిశీలించడం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విపత్తుకు సంబంధించి నిసార్ కనీస అంచనా, హెచ్చరిక సమాచారం లేదంటే కీలక శాస్త్రీయ విశ్లేషణ అనేవి ఏవీ కూడా పబ్లిక్ డొమైన్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. నిసార్ ప్రస్తుతం కక్ష్యలో ఉండి క్రమం తప్పకుండా డేటా సేకరిస్తుంటే.. నేపాల్ విపత్తుకు సంబంధించి అదసలు ఏం గుర్తించిందన్నది ఆసక్తికరంగా మారింది.నాసా-ఇస్రో చెప్పేది ఇదే..నాసా ప్రకారం.. నిసార్ విపత్తులను ట్రాక్ చేయడం, పర్యావరణ వ్యవస్థలను పర్యవేక్షించడం, హిమనదులు, మంచు ప్రాంతాలను అధ్యయనం చేయడం, భూమి ఉపరితలం ఎలా మారుతోందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రాణాలను రక్షించేందుకు, ప్రకృతి వనరుల నిర్వహణకు అవసరమైన సమాచారం అందుతుందని నాసా పేర్కొంది. ఇస్రో కూడా నిసార్ ప్రతి 12 రోజులకు ప్రపంచంలోని భూభాగం, మంచుతో కప్పబడిన ప్రాంతాలను చిత్రీకరిస్తుందని తెలిపింది. ‘కదలికలు గుర్తించగలం’నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన నిసార్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త పాల్ రోజెన్ ఇంతకు ముందు నిసార్ సామర్థ్యాలను వివరించారు. భూమి, మంచు కదలికలను త్రీడీ రూపంలో అధ్యయనం చేయగలమని, భూకంపాలకు ముందు.. భూకంపాల సమయంలో.. ఆ తర్వాత భూమి కదలికలను మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కొలవచ్చని తెలిపారు. అంతేకాదు.. కొండచరియలు విరిగిపడటానికి ముందు చోటుచేసుకునే కదలికలను గుర్తించగలమని, హిమనదుల కదలికలను పర్యవేక్షించడం ద్వారా గ్లేషియల్ లేక్ ఔట్బర్స్ట్ ఫ్లడ్ (GLOF) ముప్పులను అంచనా వేయడంలో సహాయపడుతుందని వివరించారు.ఏడాది క్రితమే ఆపరేషన్స్ ప్రారంభంనిసార్ కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఆగస్టు 4న బెంగళూరులో నాసా, ఇస్రో సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఉపగ్రహం సాధించిన పురోగతి, శాస్త్రీయ ఫలితాలు, డేటా పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ కరెన్ ఎం. సెయింట్ జర్మెయిన్.. భూమి వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి నిసార్ అందిస్తున్న భారీ స్థాయి డేటా ప్రాధాన్యాన్ని వివరించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అటవీ బయోమాస్, నేల తేమ, పంటలు, సముద్ర ఉపరితల గాలులు, మడ అడవులు, అటవీ మార్పులు, భూభాగ మార్పులు వంటి అంశాల్లో నిసార్ అప్లికేషన్లను వివరించారు.వెనెజువెలా భూకంప టైంలో..నిసార్ ఇప్పటికే విపత్తుల విశ్లేషణలో ఉపయోగపడిందనడానికి ఉదాహరణగా నిలిచాయి. జూన్ 24న వెనెజువెలాలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని రోజులకే నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ నిసార్ డేటాతో రూపొందించిన మ్యాప్‌ను విడుదల చేసింది. భూకంపాల కారణంగా భూభాగం ఎంత మేరకు కదిలిందో ఆ మ్యాప్ చూపించింది. అత్యవసర నిర్వహణ అధికారులు, శాస్త్రవేత్తలకు ఇది ఉపయోగకరమైన సమాచారాన్ని అందించిందని నాసా తెలిపింది.అయితే నేపాల్ విషయంలో ఎందుకు?నేపాల్ విపత్తుపై మాత్రం నిసార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ విశ్లేషణ వెలువడలేదు. దీంతో కొన్ని కీలక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. విపత్తుకు ముందు ప్రాంతంలో భూభాగ కదలికలను నిసార్ గుర్తించిందా? గ్లేసియర్లలో ఏవైనా అసాధారణ మార్పులను నమోదు చేసిందా? విపత్తుకు దారితీసిన ప్రక్రియలకు సంబంధించి నిసార్ డేటాలో ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ జరిగిందా? జరిగితే ఆ వివరాలను ఎందుకు బయటపెట్టలేదు? అనేదే ఆ ప్రశ్నలు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నిసార్ ప్రతి వరద, కొండచరియలు, హిమనదులు కుప్పకూలిపోవడం, భూకంపాన్ని ముందుగానే హెచ్చరించే పూర్తిస్థాయి ఆపరేషనల్ వార్నింగ్ ఉపగ్రహం కాదు. దీని ప్రధాన లక్ష్యం భూమి, మంచు ప్రాంతాల్లో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో పరిశీలించడం, ఆ డేటాను శాస్త్రీయ విశ్లేషణకు అందించడం. అలాగే నిసార్‌లో సాంకేతిక వైఫల్యం జరిగిందన్న ఆధారాలు కూడా ఇప్పటివరకు లేవు.‘డేటా తీస్తుంది.. విశ్లేషించేది మనుషులే’అయితే నేపాల్ విపత్తు తర్వాత ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ రోజెన్ కీలక విషయాన్ని వెల్లడించారు. నిసార్ డేటాను సేకరిస్తుంది కానీ దాన్ని విశ్లేషించేది శాస్త్రవేత్తలేనని చెప్పారు. ఇలాంటి ముందస్తు సంకేతాలను గుర్తించేందుకు అవసరమైన దీర్ఘకాలిక డేటా సిరీస్‌ను నిసార్ ఇప్పుడిప్పుడే సేకరిస్తోందన్నారు. అలాగే హిమాలయ ప్రాంతమంతటా సాధారణ, అసాధారణ కదలికలను గుర్తించేందుకు ఆటోమేటెడ్ టూల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందని.. అలాంటి వ్యవస్థలు సిద్ధమైన తర్వాతే ప్రమాదాలను అంచనా వేసే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. నిసార్ ఈ తరహాలో పనిచేసే తొలి ఉపగ్రహం కావడంతో దాని డేటా, సామర్థ్యాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.డేటా మాత్రం అందుబాటులోకి రావాల్సిందేనిసార్ నుంచి సేకరించే డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత పబ్లిక్ ఆర్కైవ్‌లో అందుబాటులో ఉంచేందుకు నాసా, ఇస్రో అంగీకరించాయి. అందువల్ల నేపాల్ విషాదం నేపథ్యంలో నిసార్ డేటాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిసార్ కక్ష్యలో ఉంది.. డేటాను సేకరిస్తోంది. అయితే ఈ ఉపగ్రహం నేపాల్ విపత్తు విషయంలో ఏం చూసింది? ఏం గుర్తించింది? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.బహుశా శాస్త్రీయ విశ్లేషణలు జరుగుతుండొచ్చు.. డేటాను ధ్రువీకరించేందుకు సమయం పడుతుండొచ్చు. అలాగే హిమాలయాల్లోనే ఇంతటి విపత్తు చోటుచేసుకున్న నేపథ్యంలో.. నిసార్ సేకరించిన డేటా ఇప్పుడు అత్యంత కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. విపత్తుకు ముందు అక్కడ ఏం జరిగింది? హిమనదులు, భూభాగ కదలికల్లో ఏవైనా అసాధారణ మార్పులు నమోదయ్యాయా?.. నిసార్ డేటా సమాధానం చెబుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కార్లు మాట్లాడుకుంటే.. యాక్సిడెంట్లే జరగవట! -
నేపాల్ లో హృదయ విదారకం.. తవ్వేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
-
Nepal: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఖాయం..
-
నేపాల్‌లో నగర వాసి మిస్సింగ్!
హైదరాబాద్: ఆయన శివుడికి పరమ భక్తుడు. వీపు, భుజం, చేతులపై శివుడి గుర్తులతో పచ్చ బొట్లు వేయించుకున్నారు. అదే ఆధ్యాత్మిక భావనతో మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. కానీ, ఆకస్మిక వరదలతో ఆచూకీ దొరకడం లేదు. ఇదంతా మణికొండ వాసి రాళ్లగూడెం ధన్‌పాల్‌రెడ్డి గురించి. డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఈయన ఆగస్టు 23న హిల్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో పుణె నుంచి 66 మందితో కలిసి వెళ్లారు. వీరిలో ఎక్కువమంది పుణె వారు కాగా, కొందరు హైదరాబాదీలూ ఉన్నారు. గత నెల 26న ఉదయం 8.30కు టిబెట్‌లోని ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్నామని, అది పూర్తికాగానే ముందుకెళ్తామని సమాచారం ఇచ్చారు. ఆ రోజే ఆకస్మిక వరద సంభవించింది. తర్వాత ధనపాల్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్ వస్తోందని తండ్రి నర్సింహారెడ్డి తెలిపారు. అక్కడి ఎంబసీ వారు కుటుంబసభ్యుల డీఎన్ఏ పంపిస్తే మీవారి వివరాలను పరిశీలిస్తామనే సమాధానం ఇచ్చారని అన్నారు. ధనపాల్రెడ్డికి భార్య, 8వ తరగతి చదువుతున్న కుమారుడు, 7వ తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఆగస్టు 16న అలకాపూర్ టౌన్షిప్లో దుస్తుల దుకాణం ప్రారంభించారు. చదవండి: 26 విపత్తుల తేదీ! -
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
నేపాల్‌ను వణికించిన ఆకస్మిక వరదల విషాదం.. రోజురోజుకూ మరింత భయానక పరిస్థితుల్ని వెలుగులోకి వస్తోంది గతవారం సంభవించిన ఫ్లాష్ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య 1000కి చేరువైంది. గల్లంతైన వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో అన్వేషణ కొనసాగుతోంది. భారీ వర్షాలు, బురద, దెబ్బతిన్న రహదారులు, మూసుకుపోయిన సొరంగాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి.ఆగస్టు 26న నేపాల్–టిబెట్ సరిహద్దులో మంచు, రాళ్ల భారీ ప్రవాహం ఒక్కసారిగా విరుచుకుపడటంతో భోటేకోషి–త్రిశూలీ నదీ వ్యవస్థలో వరదలు పోటెత్తాయి. ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తిన ఈ వరదల్లో ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి నేపాల్ సహాయక బృందాలు, వివిధ దేశాల రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి గాలింపు కొనసాగిస్తున్నాయి.తాజాగా.. నువాకోట్ జిల్లాలోని బెత్రావతిలో ఈ ఉదయం ఓ ఇంట్లో 23 మృతదేహాలు బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. వరదల తర్వాత గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా ఈ మృతదేహాలను గుర్తించారు. అవి ఒకే కుటుంబానికి చెందినవా? చుట్టుపక్కల వాళ్లు తలదాచుకునేందుకు వచ్చి మరణించారా? లేదంటే కొట్టుకు వచ్చిన మృతదేహాలా? అని పరిశీలిస్తున్నారు. మరోవైపు నేపాల్ నుంచి కొట్టుకొచ్చినట్లు భావిస్తున్న 13 మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ సమీపంలోని గండక్ నదిలో లభించాయి. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను నేపాల్‌కు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సొరంగాల్లో 900 మందికి పైగా?నేపాల్ ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికుల జాడ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని పలు సొరంగాల్లో కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40–42 మంది ఇంజినీర్ల ఆచూకీ ఇంకా లభించలేదు. త్రిశూలీ 3బీ ప్రాజెక్టులో 118 మంది కార్మికులు గల్లంతయ్యారు. బురద, నీటితో సొరంగాలు పూర్తిగా మూసుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ సిబ్బంది నియంత్రిత పేలుళ్లు, ఎక్సకవేటర్లు, సెర్చ్లైట్లను ఉపయోగించి మార్గాలను క్లియర్ చేస్తున్నారు. అయితే కెమెరాల్లోనూ లోపల నిశబ్ధ వాతావరణం కనిపిస్తుండడంతో.. వాళ్లంతా కొట్టుకునిపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సామూహిక ఖననాలే దిక్కు!వరదల్లో గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతదేహాల గుర్తింపు అధికారులకు మరో పెద్ద సవాల్‌గా మారింది. పోఖారా ఆస్పత్రికి గోర్ఖా, తనహున్, ధాదింగ్, నావల్పరాసీ ఈస్ట్ ప్రాంతాల నుంచి 102 మృతదేహాలను తరలించారు. వీరిలో 16 మందిని గుర్తించి కుటుంబాలకు అప్పగించారు. అయితే చాలా మృతదేహాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఫొటోలు, దుస్తులు, నగలు, టాటూల ఆధారంగా బాధితులను గుర్తించాల్సి వస్తోంది. అవసరమైన చోట డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌కు చెందిన 18 మంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా గుర్తింపు ప్రక్రియలో సహకరిస్తున్నారు.అలాగే వదరలు సంభవించిన రీజియన్‌లో మార్చురీల సంఖ్య.. సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. బాడీ మేనేజ్మెంట్ సెంటర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో సామూహిక ఖననాలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.వేలాది మంది గల్లంతు.. విదేశీయులూరసువాలోని ఉత్తర్గయా గ్రామానికి చెందిన సుమారు 350 మంది విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10 వేల మందికిపైగా ప్రజలను రక్షించారు. వీరిలో 323 మంది విదేశీయులు ఉన్నారు. మరోవైపు 39 దేశాలకు చెందిన సుమారు 590 మంది విదేశీయులు ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది.65 వేల మందికి అత్యవసర సాయంవరదల తీవ్రతను ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళనకరంగా అభివర్ణించింది. ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 65 వేల మందికి తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అత్యవసర సాయం అవసరమని తెలిపింది. 22 వేల మందికిపైగా చిన్నారులకు రక్షణ సేవలు అవసరమవుతున్నాయి. పాఠశాలలు కూడా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 19 పాఠశాలలు దెబ్బతినగా, తొమ్మిది పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఎనిమిది పాఠశాలలను ప్రస్తుతం బాధితులకు ఆశ్రయ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వరదల్లో దెబ్బతిన్న రహదారులు, వంతెనల కారణంగా సహాయక సామగ్రిని బాధిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. ఫ్రీజర్లు, డీఎన్ఏ కిట్లు, డ్రోన్లు, లిడార్ పరికరాలు, వంతెన నిర్మాణ సామగ్రి వంటి ప్రత్యేక పరికరాలను నేపాల్ కోరింది. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా తదితర దేశాలు సహాయక చర్యలకు మద్దతు అందిస్తున్నాయి. మరోవైపు టిబెట్‌లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఏర్పడిన సరస్సులు, హిమనదుల(గ్లేసియర్) కూలిపోయే ప్రమాదంపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇదీ చదవండి: నేలమట్టమైన వందల ఏళ్ల నాటి హిందూ దేవాలయం -
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో అంశం గుండెకోత మిగుల్చుతోంది. నేపాల్ వరదల్లో మృతుల గుర్తింపు చాలా క్లిష్టంగా మారింది. ముఖ్యంగా వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు చాలా దూరంలోని ప్రాంతాల్లో లభిస్తుండటంతో, ఒకే మృతదేహాన్ని వేర్వేరు కుటుంబాలు తమ బంధువుదిగా గుర్తిస్తున్న పరిస్థితి కనపడుతోంది. నేపాల్ వరదల్లో మృతదేహాలు దూర ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో, తమవారిని గుర్తించేందుకు కుటుంబాలు ఫొటోలు, దుస్తులు, నగలు, పచ్చబొట్లను ఆశ్రయిస్తుండగా.. వివాదాస్పద కేసుల్లో డీఎన్ఏ పరీక్షలే తుది ఆధారంగా మారుతున్నాయి.ఆగస్టు 26న నేపాల్‌లో వచ్చిన భారీ వరదల తర్వాత వందలాది మంది మృతి చెందగా, వేలాది మంది గల్లంతయ్యారు. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు చాలా దూరంలోని ప్రాంతాల్లో లభిస్తుండటంతో వాటిని గుర్తించడం కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది.పోఖరాలోని ఆసుపత్రిలో ఉన్న బాడీ నంబర్ 1003ను తొలుత 3 కుటుంబాలు తమ బంధువుదిగా గుర్తించాయి. ప్రస్తుతం 2 కుటుంబాలు ఆ మృతదేహం తమ బంధువుదేనని చెబుతున్నాయి. ఎవరి బంధువో నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలు రావడానికి 1 నుంచి 1.5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.కుటుంబాలు మృతదేహాలను ఫొటోలు, ముఖం, పళ్లు, చెవులు, శరీర ఆకృతి, పచ్చబొట్లు, నగలు, దుస్తులు వంటి గుర్తుల ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ 5 ఏళ్ల బాలుడిని అతడు ధరించిన స్కూల్ టై, గొలుసు, చెవి ఆభరణం ఆధారంగా గుర్తించారు. మరో వ్యక్తిని భుజంపై ఉన్న పచ్చబొట్టు ద్వారా గుర్తించారు.మొత్తంగా ఈ కథనం చెప్పేది: నేపాల్ వరదల్లో గల్లంతైన తమ కుటుంబ సభ్యుల కోసం బంధువులు ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే మృతదేహాల పరిస్థితి, అవి దూర ప్రాంతాలకు కొట్టుకుపోవడం, ఒకే మృతదేహంపై పలువురు కుటుంబాలు హక్కు చెప్పడం వల్ల గుర్తింపు ప్రక్రియ చాలా కష్టంగా మారింది. చివరకు డీఎన్ఏ పరీక్షలే సరైన గుర్తింపునకు ఆధారంగా మారుతున్నాయి. -
Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!
-
టన్నెల్లో 93 మంది మిస్సింగ్.. డ్రోన్ల గాలింపులోనూ ఫలితం లేదు!
నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరదల తాకిడికి రసువా జిల్లాలోని 111 మెగావాట్ల రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 93 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. అయితే వారు టన్నెల్లో చిక్కుకుపోయారనే అనుమానంతో టన్నెల్లో డ్రోన్లతో ప్రత్యేక గాలింపులు చేపడుతున్నారు. వారి ఆచూకీ లభించలేదు. దీంతో వారి క్షేమ సమాచారంపై ఆందోళన నెలకొంది.అసలు ఏం జరిగింది?భోటే కోషి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రసువాగఢి ప్రాంతంలోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వరదల సమయంలో జలవిద్యుత్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న పలువురు కార్మికులు బయటకు రాలేకపోయి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. ప్రత్యేకంగా టన్నెల్‌లోని చివరి భాగంలో కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చన్న సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.అయితే జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెల్లు సాధారణంగా కొండల లోపలికి చాలా దూరం వెళ్తాయి. వరద నీరు, బురద, రాళ్లు, మట్టి, దెబ్బతిన్న నిర్మాణాలు, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఉంటే మనుషులను నేరుగా లోపలికి పంపడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. దీంతో డ్రోన్లతో ప్రత్యేక గాలింపులు చేపట్టారు.కార్మికులంతా టన్నెల్లో చిక్కుకుపోయి ఉండవచ్చన్న అనుమానంతో నేపాల్ సైన్యం, ఇంజినీర్లు, డ్రోన్ నిపుణులతో కూడిన బృందం టన్నెల్లోకి వెళ్లి విస్తృతంగా గాలింపు చేపట్టింది.అయితే టన్నెల్‌లోని అత్యంత లోపలి ప్రాంతం, చివరి భాగం వరకు చేరుకున్న రెస్క్యూ బృందానికి అక్కడ ఎవరూ ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. థర్మల్ డ్రోన్లతో కూడా లోపల పరిశీలన జరిపారు. అయినప్పటికీ మనుషుల ఉనికిని సూచించే ఆధారాలు దొరకలేదు. దీంతో ఈ దశలో టన్నెల్లో గాలింపు చర్యలు నిలిపివేశారు. థర్మల్ కెమెరాలు సాధారణ కెమెరాల మాదిరిగా కేవలం మనుషుల ఆకారాన్ని మాత్రమే చూడవు. శరీరం నుంచి వెలువడే వేడిని గుర్తించగలవు. చీకటి లేదా తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో కూడా వేడి ఆధారంగా జీవి ఉన్న అవకాశాన్ని గుర్తించడంలో అవి సహాయపడతాయి.ఈ ఘటనలో రెస్క్యూ బృందం నేరుగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా డ్రోన్లను ముందుకు పంపింది.టన్నెల్ చివరి భాగం వరకు డ్రోన్లు వెళ్లి పరిశీలించాయి. అయితే అక్కడ మనిషి ఉనికిని సూచించే సంకేతాలు కనిపించలేదు.అయితే థర్మల్ డ్రోన్ మనిషి శరీర ఉష్ణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. కానీ భారీ బురద, రాళ్లు, నీరు, కాంక్రీట్ లేదా ఇతర పదార్థాల వెనుక ఎవరైనా పూర్తిగా కప్పబడి ఉంటే గుర్తింపు కష్టమవుతుంది. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయినా లేదా వ్యక్తి డ్రోన్ సెన్సర్‌కు కనిపించని ప్రదేశంలో ఉన్నా సంకేతం దొరకకపోవచ్చు. దీంతో కార్మికుల ఆచూకీ కనుక్కోవడం ఇప్పుడు ఎంతో కష్టతరంగా మారింది. -
Viral : నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు సొమ్ము! ఎం చేసారంటే
-
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం ఆ పసివాడు..
నేపాల్ జలప్రళయం అంతులేని విషాదాన్ని మిగల్చడమే కాదు ఎందరో చిన్నారులను అభాగ్యులగా మార్చేసింది. ఆ విషాదం గడిచి నాలుగురోజులైన దాని తాలుకు బాధకర దృశ్యాలు ఇంకా వెన్నాడుతూనే ఉండటం బాధకరం. అందుకు సంబంధించిన ఓ హృదయ విదారక వీడియో అందర్నీ కంటతడిపెట్టిస్తోంది. నేపాల్ భారీ వరదల తాలుకా ఓ వీడియో అందరీ హృదయాలను కదిలిస్తోంది. ప్రస్తుతం అక్కడంతా తమ వాళ్ల ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్న ఘోషే కనిపిస్తుంది. ఎటు చూసినా శవాల దిబ్బ, బురదతో కలిసి శోక సంద్రాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు పసివాళ్లు కనిపిస్తున్న తీరు చూస్తే గుండెతరక్కుపోతుంది. వరద ప్రభావిత ప్రాంతాల గుండా ఆ బాలుడు తన చెల్లిని వీపుపై మోస్తూ నీరసంగా నడుస్తూ కనిపిస్తాడు. అతడు ఆమెను ఓదార్చేలా దగ్గరకు పట్టుకున్నట్లుగా ఆ పరిసర ప్రాంతాల్లో కలయతిరగడం చూస్తే..ప్రకృతి విపత్తు మిగిల్చే విషాదం ఇంత భయానకంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేపాల్ వరదలతో అతలాకుతలమైన తరుణంలో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకృతి విపత్తు ఇద్దరు చిన్నారులకు ఎలాంటి కష్టాలను మిగిల్చిందనే దానిపై అందరి దృష్టికి తీసుకొచ్చింది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి నిజంగానే పేరెంట్స్ ఆచూకీ కోసమే తిరుగుతున్నాడా లేక ఇంకేదైనా కారణమా అన్నది నిర్థారణ కావాల్సి ఉంది. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే సాయం చేయడం మానేసి వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు..తోబుట్టువుల అనుబంధాన్ని చాటిచెప్పడమే కాదు ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయి. వారి కళ్లను చూస్తుంటేనే బాధంతా అర్థమైపోతోంది అంటూ పోస్టులు పెట్టారు. Heartbreaking Visual from Nepal 💔Little boy caring his younger sister 🥹 and finding their parents 😭.Look at the pain and scratches on their faces. 💔💔💔 pic.twitter.com/oREDLzii6g— Jeet (@JeetN25) August 30, 2026(చదవండి: ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..) -
ఆ చీరే మా ప్రాణాలను రక్షించింది..! నేపాల్ జలప్రళయంలో ఓ అద్భుతం..
నేపాల్‌లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన జలప్రళయం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చి..శోకసద్రంలోకి నెట్టేసింది. ప్రస్తుతం అక్కడ బురదతో..తమ వాళ్ల ఆచూకీ కోసం ఆత్రంగా ఎదురు చూసే అశ్రుధారతో మిన్నంటే ఘోష కనిపిస్తోంది. ఇలాంటి విషాదకరఘటనలో కొన్ని అద్భుత సంఘటనలు మనకు మానవత్వంపై ఆశ, దేవుడిపై నమ్మకాన్ని రేకెత్తించేలా చోటు చేసుకుంటాయి. అలాంటి అపురూప ఘటనే మానసరోవర యాత్ర కోసం వచ్చిన యాత్రికులకు ఎదురైంది.అసలేం జరిగిందంటే..నేపాల్ మానస సరోవర్యాత్ర కోసం వచ్చిన తమినాడు యాత్రికులు నేపాల్‌లో ఆకస్మికంగా సంభవించిన వరద బీభత్సంలో చిక్కుకున్నారు. అయితే ఈవిషాదం నుంచి బయటపడ్డ 21 మంది యాత్రికులు చెన్నై చేరుకున్నాక..తామెలా బయటపడ్డామో తమ ప్రాణాలను ఎలా రక్షించుకున్నామో కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అది అద్భుతం లేక అదృష్టం అనాలో అర్థకావడం లేదు ఇంకా మా కళ్లముందు ఆ మృత్యు ఘోష కనబడుతూనే ఉందని ఆవేదనగా నాటి ఘటన గురించి ఆ బృందంలోని ఒక యాత్రికురాలు ఇలా చెప్పుకొచ్చింది. నేపాల్-చైనా సరిహద్దు వైపు రసువా జిల్లా గుండా మొత్తం మూడు బస్సుల్లో ప్రయాణిస్తున్న 57 మంది సభ్యుల బృందంలో ప్రాణాలతో బయటపడ్డ 21 మంది ఉన్నట్లు తెలిపారామె. కుంభకోణానికి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన కైలాశ్ మానసరోవర్ యాత్రలో తాము భాగమైనట్లు వెల్లడించారు. అయితే ఆగస్టు 26న, తమ బృందం శ్యాబ్రుబేసి నుంచి చైనా ఇమ్మిగ్రేషన్ పాయింట్ వైపు ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పరిసరాలు మారిపోయాయని, దుమ్ము మేఘాన్ని చూశామని నాటి విషాదాన్ని గుర్తు చేసుకుందామె. ఆ తర్వాత ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది అచ్చం బాంబు పేలుడు లాంటి శబ్దమని, ఆ తర్వాత కొద్దిసేపటికే తమ వాహనం చుట్టూ రాళ్లు పడటం ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే నేపాలీ డ్రైవర్ మమల్ని అప్రమత్తం చేసి తక్షణమే బస్సు దిగి వెళ్లిపోవాల్సిందిగా సూచించడంతో తాము పక్కనే ఉన్న పర్వతంపైకి ఎక్కే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చింది ఆ యాత్రికురాలు. అయితే తమ బృందంలోని మగవాళ్లంతా పర్వత శిఖరం పైకి సులభంగా వెళ్లిపోగలిగారు గానీ, మహిళలు మాత్రం అస్సలు పర్వతం ఎక్కలేకపోయారని చెప్పుకొచ్చింది. ఎందుకంటే బురద, ఆ శిఖరం వాలు అత్యంత భయానకంగా ఉండటంతో ఎక్కడం కష్టమై జారిపోయామని తెలిపింది. అయితే తమ బృందంలోని ఒక మహిళ చీరవిప్పేసి, ఒక కేబుల్ వైర్‌కి అనుసంధానించి వదలడంతో..దాని సాయంతో తాము బయటపడ్డామని కన్నీటి పర్యంతమైందామె. ఆ మహిళ స్వెటర్ ధరించి చీర విప్పేసి తమకోసం ఇచ్చినట్లు తెలిపింది. నిజానికి ఆ మహిళ ఆ ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని గద్గద స్వరంతో చెప్పుకొచ్చిందామె. అంతేగాదు ఆ భయానక పరిస్థితుల్లో ఆ చీర తమకు ప్రాణదాతగా మారిందంటూ నాటి విషాద పరిస్థితిని వివరించారామె. కాగా, మొత్తం 57 మంది యాత్రికుల్లో కేవలం 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగతా 36 మంది ఆచూకీ కానరాలేదు. అలాగే ఈ విపత్తు సమయంలో సరిహద్దు చైనా వైపున ఉన్న గిరోంగ్ పోర్ట్ ప్రాంతంలో చెన్నైకి చెందిన మరో 49 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియరాలేదని సమాచారం. View this post on Instagram A post shared by BBC News Hindi (@bbchindi) (చదవండి: 65 ఏళ్ల వయసులో టిఫిన్ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5 కోట్లు..) -
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్‌ను వెంటాడుతోందా?
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులు ఓవైపు తరచూ తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు మరోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో పశుపతి నేల నేపాల్ సతమతమవుతోంది. తాజా జల విలయం కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితులు తమకు బాగా అలవాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని నేపాల్ చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనక ప్రచారంలో ఉన్న ఓ గాథ తాజాగా తెరపైకి వచ్చింది. ‘సతి లే సరాపేకో దేశ్’.. సతి శాపానికి గురైన దేశం. నేపాల్ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. రాజరికం అంతరించి పోయిన సమయంలో.. అలాగే వరుసగా ప్రభుత్వాలు కూలినప్పుడల్లా ఈ పదం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ఇది కేవలం ఇందుకే పరిమితం కాలేదు.. ప్రకృతి ప్రకోపం చూపించినప్పుడు కూడా అక్కడి జనాలు దీనిని గుర్తు చేసుకుంటారు. అసలు నేపాల్ శపించిన ఆ మహిళ ఎవరు? ఆమె విషాద గాథ ఏంటి? సతీసహగమన సమయంలో ఆమె పెట్టిన కన్నీరే నేపాల్ దుస్థితికి కారణమా?.. నాలుగు వందల ఏళ్ల కిందట జరిగింది ఏంటి?.. నేపాల్‌లో 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజులు పరిపాలించేవారు. అధికారం, ఆధిపత్య పోరులతో రాజదర్బాలు కుట్రలకు, కుతంత్రాలుగా నిలయంగా కనిపించేవి. ఆ వంశంలో రాజు లక్ష్మీ నరసింహ మల్లా కొలువులో కాజీ భీమ్ మల్లా అనే సేనాపతి ఉండేవాడు. సైనిక వ్యవహారాల్లోనే కాకుండా పరిపాలన, టిబెట్‌తో వాణిజ్య సంబంధాల్లోనూ ఆయన రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజు వద్ద ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యం.. సాధారణంగానే సామంత రాజుల్లో అసూయను పెంచింది.చాడీలు విని.. భీమ్ మల్లాపై కుట్రలు పన్నిన ప్రత్యర్థులు.. రాజు లక్ష్మీ నరసింహుడికి లేనిపోని వన్నీ నూరిపోశారు. దాంతో తన సింహాసనానికి భీమ్ ముప్పుగా మారుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నారాయన. అలా రాజద్రోహం ఆరోపణలతో ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన్ని చెరసాలలో బంధించి.. మరణశిక్ష అమలు చేశారు. అది చూసి.. ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలేలా రోదించింది. రాజ్యం సైతం కన్నీరు పెట్టింది.చితిపై నుంచే శాపం?నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని లక్ష్మీ నరసింహుడు అకారణంగా, కుట్రలకు తలొగ్గి చంపడాన్ని భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్‌లో సతి ఆచారం ఉండేది. భర్త మరణించిన తర్వాత భార్య కూడా అతడి చితిపై ఆత్మాహుతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. భువనలక్ష్మి కూడా భర్త భీమ్ మల్లా చితిపై ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే అంతకు ముందు తన భర్తకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అన్యాయంగా చంపిన ఈ నేల, ఈ రాజ్యాన్ని మనశ్శాంతిగా ఉండబోవని, సర్వనాశనం అవుతాయని శపించారు. ఆ తర్వాత రాజు లక్ష్మీ నరసింహుడు సైతం తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని చెబుతుంటారు. అలా ఆమె శాపం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాథ నుంచే ‘సతి లే సరాపేకో దేశ్’(Sati le Sarape ko Desh) అనే పదబంధం పుట్టిందని చెబుతారు.అయితే కాలక్రమంలో ఈ గాథ భువనలక్ష్మి అనే మహిళ కన్నీటి కథకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్‌లో తరచూ తలెత్తిన రాజకీయ అస్థిరత, అధికార పోరాటాలు, పాలనా సంక్షోభాలు.. అదనంగా ముంచెత్తున్న ప్రకృతి విపత్తులను ప్రస్తావించేటప్పుడు ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా, ఆవేదన పూరితంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు ఆకస్మిక వరదల వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది. View this post on Instagram A post shared by 𝒩 (@nishantchillma)ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త.. మనుషుల్ని మోసం చేస్తున్న ఏఐ! -
నేపాల్ వరదల్లో 25 మంది తెలంగాణ NRIలు గల్లంతు..!
-
శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు!
ఖాట్మండు: నేపాల్‌లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన వరద బీభత్సం వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొట్టుకుపోయిన, శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం బంధువులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆస్పత్రులు, శవాగారాలు, సహాయక శిబిరాల చుట్టూ కన్నీటితో తిరుగుతున్నారు.చేతిలో ఆప్తుల ఫొటోలు పట్టుకుని మార్చురీల్లోని గుర్తుతెలియని మృతదేహాలను పరిశీలిస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. రసువాలోని అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 20 ఏళ్ల ప్రవీణ్ వరద ఉధృతికి గల్లంతయ్యాడు. అతని సోదరుడు రామ్ బుధా ఖాట్మండు నుంచి హకుబేసికి చేరుకుని, ప్రాజెక్టు సొరంగంలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఛాతీ లోతు వరకు బురద పేరుకుపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జుమ్లాలోని తమ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తోచక రామ్ కన్నీటిపర్యంతమయ్యాడు.నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నాటికి 788 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 2,502 మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో జలవిద్యుత్ ప్రాజెక్టుల కార్మికులు, ఇంజనీర్లు 933 మంది ఉండగా, 592 మంది విదేశీయులు, వారితో ఉన్న 127 మంది నేపాలీలు ఉన్నారు. రక్షణ దళాలకు చెందిన 45 మంది సైనికులు, 25 మంది నేపాల్ పోలీసులు, 12 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా జాడలేకుండా పోయారు.రసువా సరిహద్దు ప్రాంతమైన తిమురేలో పనిచేస్తున్న భర్త సునీల్ ఆచూకీ కోసం దాంగ్ ప్రాంతానికి చెందిన సరితా చౌదరి పోఖ్రా చేరుకుంది. వరద వచ్చే ముందు రోజు ఫోన్ చేసి, దసరా పండుగకు ఇంటికి వస్తానని చెప్పాడని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె రోదిస్తూ తెలిపింది. పోఖ్రా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో భద్రపరిచిన 102 గుర్తుతెలియని మృతదేహాల ఫొటోలను పరిశీలించేందుకు రోజుకు వెయ్యి మందికి పైగా బంధువులు వస్తున్నట్లు కాస్కీ పోలీసులు తెలిపారు.రౌతహత్‌కు చెందిన 60 ఏళ్ల బిర్సిమాయ భరత్‌పూర్‌లోని శవాగారాల్లో తన కుమారుడు షేర్ బహదూర్ కోసం వెతుకుతోంది. నువాకోట్, గైండాకోట్, పోఖరా నగరాల్లోని ఆస్పత్రులను గాలించినా తన సోదరుడు రామేశ్వర్ జాడ దొరకలేదని నవరాజ్ లామా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కనీసం ఆచూకీ లేదా మృతదేహం దొరికే వరకు మా ఆశ చావదు’ అని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అప్పులు చేసి మరీ ఇక్కడికి తరలివచ్చి, వెతుకులాట కొనసాగిస్తున్న బాధితులు.. ప్రభుత్వం స్పందించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియను ఒకే చోట సులభతరం చేయాలని, గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య -
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
నేపాల్ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.నేపాల్‌లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అసలు కారణం ఇదే.. ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్‌గా మారిన ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్‌లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.Good News,Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal FloodsThe family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL— Woke Eminent (@WokePandemic) August 28, 2026ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.ఇంటి ఆకారం కూడా ప్లస్ పాయింట్ఇంటి కాంపాక్ట్ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్‌లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.‘ఇంజినీర్ ఎవరు?’ అనే ప్రశ్నకు..సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్ ఎవరు? అనే విషయాన్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం! -
నదులన్నీ విషతుల్యం.. చేపల వేటపై నిషేధం!
నవల్పూర్ (నేపాల్): రసువాలో సంభవించిన వరదల దృష్ట్యా ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పుపై నవల్పూర్ ప్రావిన్షియల్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ ఏడు సూత్రాల మార్గదర్శకాలను (అడ్వైజరీ) జారీ చేసింది. వరద ప్రవాహంలో మృతదేహాలు, పశువులు, ఇతర జంతువుల కళేబరాలు కొట్టుకురావడంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.కాలుష్యపూరితమైన నదులు, వాగుల నుంచి చేపలు లేదా ఇతర జలచరాలను పట్టి ఆహారంగా తీసుకోవద్దని ప్రజారోగ్య కార్యాలయం సూచించింది. కలుషిత నీటిలో ఈత కొట్టకూడదని, తాగునీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకున్న తర్వాతే ఉపయోగించాలని తెలియజేసింది. కలుషిత నీటి వినియోగం వల్ల కలరా, టైఫాయిడ్, డయేరియా (విరేచనాలు), డిసెంట్రీ, హెపటైటిస్ ఎ,ఇ వంటి తీవ్ర వ్యాధులు ప్రబలే ముప్పు ఉందని హెచ్చరించింది. పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే భుజించాలని, పచ్చి పదార్థాలను, వండిన వంటకాలను వేర్వేరుగా ఉంచాలని సూచించింది. వరద నీటిలో మునిగిన, కలుషితమైన, కుళ్ళిన లేదా దుర్వాసన వచ్చే ఆహారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదని స్పష్టం చేసింది.వరదల అనంతర పరిస్థితుల్లో డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు పాముకాటు ప్రమాదాలు పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని, రాత్రివేళ నడిచేటప్పుడు టార్చ్ లైట్ ఉపయోగించాలని సూచించారు. పడుకునే ముందు పరుపులను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల తర్వాత మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు పేర్కొన్నారు. నదీ తీరాల్లో లేదా వాగుల పరివాహక ప్రాంతాల్లో మానవ శరీర భాగాలు లేదా జంతు కళేబరాలు కనిపిస్తే వెంటనే స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి లేదా నేపాల్ పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం -
నేపాల్: 1.6 లక్షల మహిళల పరిస్థితి దయనీయం
ఖాట్మండు: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 1.6 లక్షల మంది (1,57,050 మంది) మహిళలు, బాలికలు ఈ విపత్తు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావానికి గురైనట్లు ‘యూఎన్ విమెన్’ విభాగం తన మొదటి జెండర్ అలర్ట్ నివేదికలో వెల్లడించింది. వరదల కారణంగా వీరు హింస, దోపిడీ తదితర ముప్పులను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపింది.ఈ విపత్తు తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉందని పేర్కొంటూ, వరదల ధాటికి 500 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మంది గల్లంతయ్యారని, సుమారు 10,000 ఇళ్లు కొట్టుకుపోయాయని సంస్థ తెలిపింది. బతికి బయటపడిన వారు ఆహారం, తాగునీరు, వైద్యం, రక్షణ సేవల కొరతతో అల్లాడుతున్నారని వివరించింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ జిల్లాల్లోని మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరక్షరాస్యులుగా ఉన్నారని, దీనివల్ల సహాయ చర్యల వివరాలు తెలుసుకోవడం, నమోదు చేసుకోవడం, సహాయం పొందడంలో వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయని నివేదిక వెల్లడించింది.అంతేకాకుండా బాగమతి ప్రావిన్స్‌లోని కుటుంబాల్లో మూడింట ఒక వంతు కుటుంబాలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని, అందులో మూడో వంతు కుటుంబాలు విదేశీ ఆదాయం (రెమిటెన్స్)పైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొంది. విపత్తుల వేళ మహిళలు, బాలికలు ఎదుర్కొనే ముప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతాయని యూఎన్ విమెన్ ప్రతినిధి ప్యాట్రిసియా ఫెర్నాండెజ్-పచెకో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ ఆహార సాయం, జీవనోపాధి కల్పించేందుకు మహిళల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కిచెన్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. విపత్తు బారిన పడిన మహిళలు, బాలికల రక్షణ, పునరావాసం కోసం అత్యవసరంగా 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.7 కోట్లు) నిధులు సమకూర్చాలని యూఎన్ విమెన్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.ఇది కూడా చదవండి: నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా.. -
నేపాల్: శవాల గుర్తింపు ఎలా? కుటుంబ సభ్యులకు చూపిస్తారిలా..
నేపాల్‌లో సంభవించిన జలప్రళయం ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. వరదలు, కొండచరియల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎటుచూసినా మృతదేహాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే 700కు పైగా మృతదేహాలు బయటపడటంతో మార్చురీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతవడంతో రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో గుర్తించని మృతదేహాలను భద్రపరచడం, ఖననం చేయడం నేపాల్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.నిండిపోయిన మార్చురీలు.. పెరుగుతున్న మృతదేహాలునేపాల్లో బుధవారం విరుచుకుపడిన వరద బీభత్సానికి ఇప్పటివరకు 734 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరో 2,498 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సహాయక బృందాలు ఇప్పటివరకు 4,500 మందికి పైగా ప్రజలను రక్షించినప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. శవాగారాల్లో స్థలం లేకపోవడంతో గుర్తించని శవాల అంత్యక్రియలను నిర్వహించడం ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది.ప్రధాని కీలక నిర్ణయం: శాస్త్రీయంగా ఖననంపౌరుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని నేపాల్ ప్రధాని బలేంద్ర షా స్పష్టం చేశారు. గుర్తుతెలియని మృతదేహాలను ఎయిర్‌టైట్ (గాలి చొరబడని) బ్యాగుల్లో ఉంచి భూమిలో ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు తమవారిని గుర్తించేందుకు వీలుగా ప్రతి మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలను వైద్యులు ముందుగానే సేకరిస్తున్నారు.శరీర గుర్తులు, లొకేషన్ వివరాల నమోదుడీఎన్ఏ ప్రొఫైలింగ్‌తో పాటు మృతదేహాలపై ఉన్న ప్రత్యేక గుర్తులు, పుట్టుమచ్చలు, టాటూలు లేదా గాయాలను అధికారులు క్షుణ్ణంగా రికార్డు చేస్తున్నారు. ఆ మృతదేహం ఏ అవయవంపై లభ్యమైందనే వివరాలను కూడా భద్రపరుస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి 100కు పైగా మృతదేహాల డీఎన్ఏ ప్రక్రియను పూర్తి చేసి, ఖననం చేశారు. ఇది భవిష్యత్తులో కుటుంబసభ్యులు వారిని గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.భవిష్యత్తులో వెలికితీసేలా ప్రత్యేక ఏర్పాట్లుఎయిర్టైట్ బ్యాగుల్లో ఉంచిన మృతదేహాలను భూమిలో 1.5 మీటర్ల లోతులో ఖననం చేస్తున్నారు. అవసరమైనప్పుడు వీటిని సులభంగా వెలికితీసేందుకు వీలుగా రెండు మృతదేహాల మధ్య సరిగ్గా 40 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తున్నారు. అంతేకాకుండా, మృతదేహాలను పాతిపెట్టిన ప్రదేశంలో ప్రత్యేక సంఖ్యలతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఫోటోలు, వీడియోల రూపంలో డిజిటల్‌గా భద్రపరుస్తున్నారు.కుళ్లిపోతున్న శవాలు.. వైద్యులకు పెను సవాలువరద బురద, శిథిలాల కింద లభ్యమవుతున్న శవాలు త్వరగా కుళ్లిపోతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని భద్రపరిచి డీఎన్ఏ సేకరించేందుకు వైద్యులకు సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఇప్పటివరకు 135 మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 233 శవాలు లభించగా, కేవలం ఆరింటిని మాత్రమే కుటుంబ సభ్యులు గుర్తించగలిగారు. శవాలు పాడవకుండా ఉండేందుకు కొన్ని నివాస గృహాలను తాత్కాలిక కోల్డ్ సెంటర్లుగా మార్చారు.మళ్లీ పెరుగుతున్న నదీ ప్రవాహం.. పెను ముప్పురెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతుండగానే భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, చైనా భూభాగంలో ఏర్పడిన తాత్కాలిక సరస్సు మరింత పెద్దదవుతోందని, ఒకవేళ అది గనక తెగితే నేపాల్‌లో ఇంతకుముందు కంటే భారీ వరద ముప్పు తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇది కూడా చదవండి: హిమాలయాల్లో 188 సరస్సుల విస్పోటనం? -
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
నేపాల్‌ను కుదిపేసిన వరద బీభత్సం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు చైనా ముందస్తు సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఆరోపించగా.. చైనా ఆ వాదనను కొట్టిపారేసింది. అయితే ఈ ప్రవాహం వేగం ఊహకందని రీతిలో ఉందని దూసుకొచ్చిందని.. అందుకే ముందస్తు హెచ్చరిక ఇవ్వడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అత్యంత కష్టంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఓ విపత్తు రావొచ్చని పది రోజుల కిందటే నేపాల్‌ను చైనా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 26న ఆకస్మిక వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేశాయి. ఈ విలయంలో 800 మంది మృతదేహాలను వెలికి తీయగా.. మరో 2,500 వేల మంది ఆచూకీ గల్లతైంది. అయితే దాదాపు 12 రోజుల ముందే టిబెట్ ప్రాంతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా నేపాల్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాటితో పాటు కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ చైనాకు చెందిన ప్రపంచ వాతావరణ కేంద్రం నేపాల్‌కు ఓ మెయిల్ పంపింది. అలాగే హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలపై దృష్టిసారించాలని సూచించినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.జస్ట్.. 26 నిమిషాల్లో?ఆగస్టు 26న ఉదయం సుమారు 8.32 గంటలకు టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద బీభత్సం మొదలైంది. కేవలం 26 నిమిషాల తర్వాత నేపాల్ అధికారులకు సమాచారం అందింది. అయితే వరద ధాటికి పలు పర్యవేక్షణ కేంద్రాలు ధ్వంసం కావడంతో డేటా ప్రసారం నిలిచిపోయింది. స్థానిక అధికారుల నుంచి నిర్ధారణ పొందిన తర్వాత నేపాల్ అధికారులు ఉదయం 9.13 గంటలకు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపారు. అప్పటికే వరద ట్రిషూలీ నది వెంట దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్తోంది.అయితే నేపాల్ వాదన మరోలా ఉంది. చైనా ఆ హెచ్చరికలను 14-19 తేదీల మధ్యే అని ప్రస్తావించిందని అంటోంది. అలాగే తమకు కేవలం భారీ వర్షాల హెచ్చరికలు మాత్రమే జారీ చేసిందని, దానికి తాము ‘‘కేవలం వర్షపాతం సమాచారం మాత్రమే కాదని, హిమనదాల కదలికలు, సరస్సుల్లో నీటి మట్టాలు, కొండచరియల ప్రమాదంపై ముందస్తు సమాచారం’’ కూడా కోరామని అంటోంది. వరద స్పీడు.. మరీ అంతనా?ఇదిలా ఉండగా.. తాజా అంచనాలు ఈ విపత్తు తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. నీరు, బురద, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చినట్లు నేపాల్ హిమాలయ గ్లేసియర్, పర్వత పరిశోధకుడు ధనంజయ్ రెగ్మి తెలిపారు. ఇంతటి వేగంతో వచ్చిన ప్రవాహం మార్గంలో కనిపించిన ప్రతిదానినీ ఊడ్చుకెళ్లింది.పర్వతారోహకుడు సంజిత్ సింగ్ బాల్ అంచనా ప్రకారం.. సుమారు ఒక కిలోమీటరు పరిమాణంలో ఉన్న హిమనదం భాగం దాదాపు 5,000 మీటర్ల ఎత్తు నుంచి విరిగిపడి కిందికి దూసుకొచ్చి ఉండొచ్చు. మార్గమధ్యంలో నీరు, మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను తనతో కలుపుకోవడంతో ప్రవాహం మరింత శక్తిమంతంగా మారింది.అంత పెద్ద.. హిమనదం కూలిందిమొదట మూడు హిమ సరస్సుల్లో ఏదో ఒకటి తెగిపోవడం వల్లే ఈ వరద సంభవించిందని భావించారు. కానీ ఉపగ్రహ చిత్రాల పరిశీలనలో అసలు కారణం మరోటి అని తేలింది. సుమారు 7,000 మీటర్ల ఎత్తున్న లాంగ్టాంగ్ లెరుంగ్ శిఖరంలోని ఉత్తర హిమనదం(గ్లేసియర్)లో దాదాపు రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతం కూలిపోయినట్లు గుర్తించారు. హిమనదం భారీ భాగం లోయలోకి పడటంతో నీరు, మంచు, రాళ్లు, మట్టి కలిసి అత్యంత వేగంతో దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.మూడు సరస్సులు.. మరో ముప్పు?తాజా విపత్తు తర్వాత.. ఆ రీజియన్‌లో మూడు సరస్సులు సహజంగా ఏర్పడడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. వీటిలో ఏదైనా ఒకదానిపై కొత్తగా కొండచరియలు లేదంటే భారీ రాళ్లు పడితే.. దాని ప్రభావం వరుసగా మిగిలిన సరస్సులపైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు ప్రస్తుతం చైనా–నేపాల్ సరిహద్దు వద్ద ఏర్పడిన బ్యారియర్ సరస్సులోని నీరు సహజంగా బయటకు వెళ్లి దాదాపు పూర్తిగా ఖాళీ కావడంతో.. ఒక్కసారిగా సరస్సు తెగిపోయి భారీ వరద వచ్చే ముప్పు గణనీయంగా తగ్గింది. అలాగని.. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అటు చైనా, ఇటు నేపాల్ అధికారులు అంటున్నారు. నేపాల్‌లోని భోటేకోషి నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నదీ ప్రవాహంలో ఆకస్మిక మార్పులు, కొండచరియలు లేదంటే కొత్తగా ఏర్పడే నీటి నిల్వలపై నిఘా కొనసాగుతోంది. అందుకే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోనే ఉండాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.800 మంది మృతి.. మిస్సింగ్ లెక్క వేరే!ఈ వరదలో నేపాల్, చైనాలో కలిపి దాదాపు 800 మంది మరణించగా.. 2,500-3,000 మందికిపైగా గల్లంతైనట్లు తాజా సమాచారం. వరద ధాటికి భారీ బండరాళ్లు, బురదతో భవనాలు కొట్టుకుపోయాయి. మొత్తంగా 19 వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతానికిపైగా ప్రభావితమైనట్లు అంచనా. సరిహద్దు నుంచి సుమారు 168 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. దాదాపు 5.74 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ఈ ప్రవాహంలో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది.చైనాతో మరింత సమాచార భాగస్వామ్యంనేపాల్ ఆరోపణలు-చైనా కౌంటర్లతో ముందస్తు వార్నింగ్‌లపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విపత్తు నేపథ్యంలో హిమనదాలు, హిమ సరస్సులు, నదుల ప్రవాహంపై చైనాతో మరింత సమగ్ర సమాచార భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ భావిస్తోంది. ప్రతి 10 నిమిషాలకోసారి వర్షపాతం, నదుల నీటిమట్టం, హిమనదాల కదలికలపై సమాచారం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పులతో హిమనదాల కరుగుదల వేగం పెరుగుతున్న నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో వరదలు, కొండచరియలు, హిమ సరస్సుల ఉప్పెనల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా విపత్తు నుంచి నేపాల్ ఇంకా కోలుకోకముందే మూడు కొత్త సరస్సులు మరో ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత కొనసాగుతోంది.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ప్రాణాలు కాపాడిన ఛాయ్! -
ఆగని కన్నీటి వరద
కఠ్మాండు: నేపాల్‌లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది. ఇంకా 2,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకస్మిక వరదల ధాటికి గల్లంతైన వారి కోసం వరుసగా ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగించారు. సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతూ ముమ్మరంగా పని చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 794 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు.ఆగస్ట్ 26వ తేదీన నేపాల్–టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను తుడిచిపెట్టేశాయి. కీలకమైన మౌలిక సదుపాయాలను దారుణంగా దెబ్బతిన్నాయి. జలవిద్యుత్ కేంద్రాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో 2,502 మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మూడు జిల్లాల్లో 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారని నేపాల్ విద్యాశాఖ ప్రకటించింది. గల్లంతైన వారిలో 320 మంది విదేశీయులు ఉన్నారు. అదృశ్యమైన తమ బంధువుల కోసం ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో 17 మాత్రమే గుర్తించగలిగారని పోలీసులు తెలిపారు. అనేక మృతదేహాలు చాలావరకు కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు 96 మృతదేహాలను ఖననం చేశారు. సహాయక శిబిరాల్లో సమస్యలు తీవ్రం నేపాల్‌లో అత్యవసర పరిస్థితి ఇంకా ముగియలేదు. బాధితులు తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. రసువాలో 3, నువాకోట్‌లో 15 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన సుమారు 3,500 మందికి పాఠశాలలు, ప్రభుత్వ, సామాజిక భవనాలలో తాత్కాలిక వసతి కల్పించారు. గర్భిణులు, బాలింతలు, వైద్య సంరక్షణ అవసరమైన వారితో సహా వృద్ధులు, చిన్నారులకు ఈ శిబిరాల్లో ఆశ్రయం కలి్పస్తున్నారు. అయితే ఈ శిబిరాల్లో తాగునీరు, పారిశుధ్య సదుపాయాల కొరత వేధిస్తోంది. ఇక్కడ జనం కిక్కిరిసిపోయి ఉండడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మత సంస్థలు బాధితులకు సేవలందిస్తున్నాయి. సొరంగంలో కా ర్మీకుల కోసం గాలింపు వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కా ర్మీకులు, ఉద్యోగుల ఆచూకీ తెలియకుండా పోయింది. త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం వీటిలో ఒకటి. ఈ సొరంగంలో 42 మంది చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా భూగర్భ పవర్‌హౌస్ మరమ్మతు పనుల్లో ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తించింది. వారిని కాపాడేందుకు ప్రభుత్వం 90 మంది సభ్యుల సహాయక బృందాన్ని రంగంలోకి దించింది. సమయస్ఫూర్తి ప్రదర్శించి, పిల్లల ప్రాణాలు కాపాడిన రాజేంద్ర దవాడీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. భయపెడుతున్న భోటే కోశీ నది త్రిశూలి నదిలో కొత్తగా వచ్చిన వరద ధాటికి ఆదివారం మరో వంతెన ఆదివారం ఉదయం కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోవడంతో గండకి గ్రామీణ మున్సిపాలిటీ ప్రజలు పృథ్వీ హైవేకి వెళ్లే మార్గం తెగిపోయింది. దీంతోపాటే భోటే కోశీ నదిలో నీటిమట్టం పెరుగుతోందని అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు, సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటివరకు ఆహార పదార్థాలతో కూడిన 37 ట్రక్కులు, ఆహారం, ఇతర సామగ్రితో నిండిన ఏడు హెలికాప్టర్లను పంపించారు. భారత ప్రభుత్వం 68.5 టన్నుల సహాయక సామగ్రిని అందజేసింది. గాలింపు, సహాయక చర్యల్లో సహకరించేందుకు సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులను పంపించింది. 11 టన్నుల సహాయక సామగ్రితో విమానం ఆదివారం భారత్ నుంచి నేపాల్‌కు చేరుకుంది. 1,643 మంది విద్యార్థుల్ని కాపాడిన టీచర్నేపాల్లోని వరద ప్రభావిత త్రిశూలి వ్యాలీలో ఓ ఉపాధ్యాయుడి అప్రమత్తత కారణంగా ఏకంగా 1,643 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఇక్కడి త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం 9.20 గంటల సమయంలో ఆయనకు ఓ స్నేహితుడి నుంచి వరద హెచ్చరిక అందింది. నది పక్కనే ఉన్న ఈ మూడంతస్థుల పాఠశాల భవనంలో 1,643 మంది విద్యార్థులున్నారు. హెచ్చరిక అందగానే రాజేంద్ర దవాడీ అప్రమత్తమయ్యాడు. వెంటనే బడిగంట కొట్టి విద్యార్థులందరినీ బయటకు తీసుకురావాలని మిగతా టీచర్లకు హెచ్చరికలు జారీచేశాడు. స్కూల్ బస్సు డ్రైవర్లను అప్రమత్తంచేశాడు. బస్సుల్లో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే స్కూల్ వరద బురదలో మునిగింది.శిథిలాల కింద మృత్యువుతో 3 రోజుల పోరాటంప్రాణాలతో బయటపడిన ఆరేళ్ల చిన్నారి ఆరేళ్ల బాలిక శిథిలాల కింద మూడు రోజులపాటు మృత్యువుతో పోరాటం చేని ప్రాణాలతో బయటపడింది. వరదలవల్ల అతలాకుతలమైన నేపాల్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. రసువా జిల్లాలోని టిమురే ప్రాంతంలో బుధవారం వరదతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, శుక్రవారం ఓ చిన్నారి రోదన వినిపించింది. శిథిలాలను తొలగించి ఆ బాలికను వెంటనే బయటకు తీశారు. తీవ్రంగా గాయాల పాలైనప్పటికీ సజీవంగా ఉండడంతో శుక్రవారమే హెలికాప్టర్లో కఠ్మాండులోని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయతి్నంచగా ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. శనివారం ఆసుపత్రికి తరలించగలిగారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. -
నేపాల్‌లోని తెలంగాణవాసుల కోసం ముమ్మర యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: నేపాల్‌ను అతలాకుతలం చేసిన వరద విపత్తులో చిక్కుకున్న తెలంగాణవాసుల భద్రత, గల్లంతైన వారి అన్వేషణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, ఆగస్టు 29న టిబెట్ నుంచి 449 మంది భారతీయులు నేపాల్‌లోకి ప్రవేశించారు.వారిలో 397 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేపాల్ నుంచి వచి్చన బాధితుల జాబితాను పరిశీలించగా, తెలంగాణకు చెందిన అల్లి అయిలేష్ వివరాలు తెలంగాణ భవన్ రికార్డులతో సరిపోలాయి. ఆయన ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో సంప్రదింపుల్లో ఉన్నారని, క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల ఛాయాచిత్రాలు, ప్రాథమిక వివరాలను నేపాల్ ప్రభుత్వం తమ డిజాస్టర్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసీ (తూర్పు, పశ్చిమ), కఠ్మాండు జిల్లాల్లో భద్రపరిచిన పారి్థవదేహాలను గుర్తించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు నేరుగా చూసి పోల్చుకోగలిగితే డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని, బంధుత్వ ఆధారాలను బట్టి మృతదేహాలను అప్పగిస్తారని నేపాల్ పోలీసులు తెలిపారని చెప్పారు. భౌతికంగా గుర్తించలేని పక్షంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల డీఎన్ఏ ప్రొఫైల్‌ను సేకరించిన నమూనాలతో సరిపోలుస్తారని తెలిపారు. డీఎన్ఏ నివేదికల కోసం బంధువులు ఎవరూ శ్రమపడి నేపాల్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేదని, స్వస్థలంలోనే తీసుకున్న డీఎన్ఏ ప్రొఫైళ్లను ఈ–మెయిల్ ద్వారా స్వీకరించే విధానాన్ని నేపాల్ పోలీసులు రూపొందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. పారి్థవదేహాల తరలింపు విధివిధానాలు పూర్తిగా ఖరారయ్యే వరకు కుటుంబ సభ్యులు నేపాల్ ప్రయాణాలు చేయవద్దని, ముందుగా తెలంగాణ భవన్ లేదా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక నిర్ధారణ పూర్తయిన తర్వాతే తదుపరి సమాచారాన్ని వెల్లడిస్తామన్నారు. -
10 నిమిషాలు ఆగారు.. అంతలోనే మహా విధ్వంసం
నేపాల్‌లో వరదలు సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు.. దాని తాలుకూ విషాద ఘటనలు ఒక్కక్కొటిగా వెలుగుచూస్తున్నాయి. కొన్ని ఘటనలేమో క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం అయితే మరికొన్ని ఘటనలు క్షణాల వ్యవధిలో ప్రాణాలు రక్షించుకోవడం... తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బృందం కేవలం టీ తాగడం కోసం ఆగడంతోనే.. తమ ప్రాణాలు దక్కాయని ఆ నిర్ణయంతో ఈ రోజు బ్రతికే ఉన్నామని భావోద్వేగంతో ఈ రోజటి విషాద స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. రాయ్‌పూర్‌లోని మానా క్యాంప్ ప్రాంతానికి చెందిన నారాయణ్ సేన్, దినేశ్ ఓజా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేశ్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు సభ్యుల బృందం ఆగస్టు 21న నేపాల్ పర్యటనకు బయలుదేరారు. ఆగస్టు 22న నేపాల్‌కు చేరుకున్న వీరు ఓ కారును అద్దెకు తీసుకుని పశుపతినాథ్ ఆలయం, మనకామనా ఆలయం సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించారు.ఆగస్టు 26న ఉదయం సుమారు 10 గంటల సమయంలో వారు నేపాల్‌లోని ధాదింగ్ జిల్లాలోని ఓ హోటల్ వద్ద టీ తాగేందుకు ఆగారు. అంతలోనే అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముందున్న వంతెన వరదలో కొట్టుకుపోయిందని హోటల్లో వారికి తెలిసింది. ఆ విషాద ఘటనపై వారి మాటల్లో. “ఆగస్టు 26న ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు మేము టీ కోసం ఆగడం మా అదృష్టం. మేము 10–15 నిమిషాల ముందే అక్కడి నుంచి బయలుదేరి ఉంటే, వరదలో చిక్కుకుపోయేవాళ్లం. మేం అక్కడ ఆగకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించలేం” అని తెలిపారు.“హోటల్లో టీ తాగుతున్న సమయంలో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురవడం గమనించాం. ఆ తర్వాత వరద సృష్టించిన విధ్వంసం గురించి తెలుసుకున్నాం. మొత్తం గ్రామాలు, భవనాలు, కార్యాలయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయని విన్నాం.మేం అక్కడ చూసిన దృశ్యాలను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. మేము నిరంతరం భగవాన్ శివుడి నామస్మరణ చేస్తూనే ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలే మమ్మల్ని కాపాడాయని భావిస్తున్నాం” అని తెలిపారు. తర్వాత త్రిశూలి నది ఒడ్డుకు వెళ్లి వరదల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. వరదల కారణంగా విద్యుత్, నీరు లేకపోయినా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో వారు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడగలిగామని పేర్కొన్నారు. అయితే ఈ విషాదంలో వారికి ఓ హృదయాన్ని హత్తుకునే అనుభవం ఎదురైందని అక్కడే విధుల్లో ఉన్న మహిళా భద్రతా సిబ్బంది మా చేతులకు ఆ రాఖీలు కట్టారు. అది మాకు ఎంతో ఓదార్పునిచ్చిన క్షణం అని ఆ విషయాలు మీడియాతో పంచుకున్నారు. అయితే గత బుధవారం నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రోజు ఆదివారం ఉదయం నాటికి నేపాల్‌లో అధికారికంగా 734 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. -
నేపాల్‌లో అద్భుతం: శిథిలాల కింద సజీవంగా ఆరేళ్ల బాలిక..
రసువా: వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లోని రసువా జిల్లాలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. భారీ వరద శిథిలాలు, బురద కింద మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఆరేళ్ల బాలికను సహాయక బృందాలు సజీవంగా వెలికితీశాయి. రసువా జిల్లాలోని తిమురే గ్రామంలో పొంగిపొర్లిన భోటే కోషి నది తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపడుతున్న ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్) సిబ్బందికి నేల అడుగున నుంచి ఏడుపు శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వేగంగా మట్టిని తవ్వి, బాలికను సురక్షితంగా బయటకు తీశారు.తొలుత తిమురేలోని ఏపీఎఫ్ అవుట్‌పోస్టులో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం రాత్రే ఖాట్మండుకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం ఆలస్యమైంది. శనివారం మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో ఆమెను ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స పొందుతోంది. ఆ చిన్నారిని మనీషా మగర్‌గా గుర్తించారు. ఈ చిన్నారి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.ఈ వరద విధ్వంసంపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. పునర్నిర్మాణ పనులకు బిలియన్ల కొద్దీ డాలర్లు అవసరమవుతాయని, అంతర్జాతీయ సమాజం సహాయం అందించాలని కోరారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, 2,400 మందికి పైగా జనం గల్లంతయ్యారు.ఇది కూడా చదవండి: డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం: ‘మన్ కీ బాత్’లో మోదీ -
నేపాల్ వరదలు: 784కు చేరిన మృతుల సంఖ్య
ఖాట్మండు: నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం సాయంత్రానికి 784కు చేరినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ఇంకా 589 మంది విదేశీయులతో సహా మొత్తం 2,500 మందికి పైగా ఆచూకీ గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వరద మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఎయిర్‌టైట్ బ్యాగుల్లో భద్రపరిచి ఖననం చేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, భవిష్యత్తులో వారి గుర్తింపు నిర్ధారణ కోసం ముందస్తుగా డీఎన్ఏ నమూనాలను, ఇతర ఆధారాలను సేకరించి భద్రపరుస్తున్నట్లు ప్రధానమంత్రి బాలేంద్ర షా తెలిపారు.రసువా ప్రాంతంలోని భోటేకోశి నదిలో వరద ఉధృతి మరింత పెరిగిందని నేపాల్ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ప్రకటించింది. రసువా, నువాకోట్, ధాడింగ్, చిత్వాన్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను, సహాయక సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సహాయక చర్యల్లో 5,000 మందికి పైగా సైనికులతో సహా 11,000 మందికి పైగా భద్రతా సిబ్బంది నిమగ్నమయ్యారు. విదేశీ రక్షణ బృందాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన నేపాల్, బాధితుల దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల సహాయక బృందాలకు అనుమతినిచ్చింది. భారత్ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, వైద్య సామగ్రిని పంపించి అండగా నిలిచింది. సంక్షోభ సమయంలో ఆదుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే ప్రశంసించారు.ఇది కూడా చదవండి: Delhi: మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం -
700 మంది మృతి.. 2400 మంది జాడే లేదు..!
-
నేపాల్: సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు సమాధి?
ఖాట్మండు: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి రసువా, నువాకోట్ జిల్లాల్లోని 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే-భోటే కోశి-త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది. 11 ప్రాజెక్టు ప్రాంతాల పరిధిలో తొలుత 934 మంది కార్మికులు గల్లంతైనట్లు నేపాల్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించగా, వారిలో 361 మందిని సురక్షితంగా రక్షించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నమోదుకాని కార్మికులు కూడా ఉండటంతో గల్లంతైన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.చిక్కుకుపోయిన వారిలో భారతీయులతో పాటు నేపాల్, దక్షిణ కొరియా, చైనా, జర్మనీ దేశాల పౌరులు ఉన్నారు. ప్రధానంగా నాలుగు ప్రాజెక్టుల్లోనే అత్యధిక మంది కార్మికులు చిక్కుకున్నారు. అప్పర్ త్రిశూలి-1 (322 మంది), అప్పర్ త్రిశూలి-3బి (122 మంది), అప్పర్ త్రిశూలి-3ఎ (43 మంది), రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు (44 మంది) వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొంది. సొరంగాల వద్ద 10 నుంచి 12 అడుగుల మేర బురద, శిథిలాలు పేరుకుపోయి మార్గాలు మూసుకుపోయాయి.సహాయక చర్యల నిమిత్తం నేపాల్ ఆర్మీ 15 హెలికాప్టర్లు, వందలాది మంది రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది. మరోవైపు భారత్ కూడా సాంకేతిక, వైద్య, టన్నెల్ నిపుణులతో కూడిన బృందాలను పంపించింది. సీ-130జే హెర్క్యులస్ విమానం ద్వారా సైనిక టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఫోరెన్సిక్ విభాగాలను తరలిస్తోంది. ఈ వరద విపత్తులో ఇప్పటివరకు 675 మంది మృతి చెందగా, నేపాల్, టిబెట్ వ్యాప్తంగా దాదాపు 3,000 మంది ఆచూకీ గల్లంతైంది.ఇది కూడా చదవండి: ఏమిటీ రూ.89 కోట్ల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం? -
అన్నీ కొట్టుకుపోతుంటే.. కూలుతుంటే..
కఠ్మాండు: ప్రశాంత వాతావరణంపై ప్రకృతి పగబట్టి జలఖడ్గం విసిరిన వేళ దిగువ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగెత్తిన దృశ్యాలు ఇంకా వాళ్ల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తిమూర్‌లో కస్టమ్స్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాజు బుద్ధాథోకీ బుధవారం ఉదయం ఎప్పట్లాగే తన గదిలో ఉండగా ఒక్కసారిగా వరదనీరు దూసుకొచ్చింది. ‘‘భూకంపం వచ్చినట్లుగా చుట్టుపక్కల ప్రాంతమంది కదిలింది. వెంటనే భయంతో బయటికొచ్చి చూస్తే అప్పటికే పోలీసులు పారిపోతున్నారు. అర్థంకాక వెనక్కి తిరిగిచూస్తే వరద నీరు అంతెత్తున దూసుకొస్తోంది. వెంటనే పరుగెత్తబోతే ఎదురుగా ఉన్న ముళ్లకంచెకు తగిలి గాయపడ్డా. పరుగెడుతుంటే భీకర వరద నీరు తిమూర్ మార్కెట్లో ఒక్కో దుకాణాన్ని మింగేస్తూ ముందుకు దూసుకొచ్చింది. ప్రాణభయంతో ఎగువ ప్రాంతానికి పరుగెత్తా’’ అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. ‘‘వరద ఉధృతిని చూసి వెంటనే ఎగువ అడవిలోకి పరుగెత్తా. ఎడమ బొటనవేలుకు పెద్దగాయమై రక్తంకారుతున్నా పరుగు ఆపలేదు. క్షణాల్లో మార్కెట్ ప్రాంతం జలమయమైంది. పారిపోలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ల మృతదేహాలు కొట్టుకుపోవడం చూశా. అడవిలో హెలికాప్టర్ నుంచి ఆర్మీ పడేసి నూడుల్స్ ప్యాకెట్లను తిన్నాం’’ అని మరో కస్టమ్స్ ఏజెంట్ గౌతమ్ తెలిపారు. ‘‘కొట్టుకొచ్చిన బుదర అదృష్టవశాత్తు నన్ను ఒడ్డు వైపు విసిరికొట్టింది. దీంతో బతికిపోయా. లేదంటే అప్పుడే చచ్చిపోయేవాడిని’’ అని తులసీ బహదూర్ బంఢారీ చెప్పారు. ‘‘రసువాలో బంగారం వ్యాపారం చేసే మామ రాజ్‌కమార్ దియాలీ ఇంటికి భార్య, నాలుగేళ్ల కుమారుడితో వచ్చా. పని మీద ఇంటి నుంచి బయటికెళ్లా. వరద వార్త తెలిసి తిరిగొచ్చేసరికి అందరూ వరదలో కొట్టుకుపోయారు’’ అని 38 ఏళ్ల సచిన్ ఖాతి వాపోయారు. ‘‘నిద్రలో ఉండగానే వరద నన్ను ముంచెత్తింది. కాలు, తలకు గాయాలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చి స్పృహతప్పి పడిపోయా. ఆర్మీ వాళ్లు నన్ను చూసి కాపాడారు’’ అని 21 ఏళ్ల కార్మికుడు సుజల్ థాపా తెలిపారు.చనిపోవడం ఖాయమనుకున్నా..సింధుపాల్‌చౌక్ జిల్లావాసి దీపక్ తమాంగ్ తనకు ఇవే చివరి క్షణాలను భావించానని భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘ఇంటి నుంచి బయటికొచ్చి చూస్తే అంతెత్తున వరదనీరు దూసుకొస్తోంది. తప్పించుకునే దారే లేదు. అన్ని వైపుల నుంచి వరద ఉధృతి ఎదురొచ్చింది. బతకాలంటే కొండ ఎక్కడం ఒకటే దారి. కొండ వాలుపై మొత్తం ముళ్ల చెట్లే ఉన్నాయి. చేతులకు గుచ్చుకుంటున్నాసరే ముళ్లచెట్లను పట్టుకొని పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా పట్టు చిక్కలేదు. ఎట్టకేలకు పట్టు దొరకడంతో ఎక్కేశా. చావుకు, బతుక్కు మధ్య సన్నగీతను చూశా. అడవిలో రాత్రంగా ఎడతెరపి వర్షం కురుస్తుంటే అక్కడే దుంగల్ని నిల్వచేసే పాత గోడౌన్లో తలదాచుకున్నా. 24 గంటల తర్వాత నన్ను ఆర్మీ కాపాడింది’ అని చెప్పారు. -
వరద బురదలో విల విల!
కఠ్మాండు: మెరుపులా వచ్చి పడిన వరద బురద విలయంలో పారిపోయేందుకు క్షణమైనా సమయంలేక జల సమాధి అయిన అభాగ్యుల సంఖ్య అమాంతం పెరిగింది. నేపాల్–టిబెట్ సరిహద్దు మంచుకొండల నుంచి ముంచుకొచ్చిన జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య శనివారానికి ఏకంగా 675 దాటింది. 320 మంది విదేశీయులుసహా 2,426 మందికిపైగా జనం జాడ తెలీడంలేదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 183 మంది భారతీయులున్నారు. టిబెట్ వైపు ఏడుగురు చనిపోగా 554 మంది జాడ తెలీడంలేదని చైనా పేర్కొంది. భోటె కోశీ నదీపరీవాహక ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదిలో అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టాలు మళ్లీ స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వర్షం, బురద, చీకటిని సైతం లెక్కచేయకుండా బాధితులను కాపాడాలనే ఏకైక సంకల్పంతో 15 వేల మందికిపైగా సైనికులు అవిశ్రాంతంగా అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తుండటంతో వందలాది మందిని భవన శిథిలాలు, బురద మేటల నుంచి కాపాడగలిగారు. అడవుల్లో తలదాచుకున్న వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందించారు. కాపాడిన వాళ్లను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లోని ఛోచెన్ నది, పురెఫు నదుల సంగమం వద్ద ఏర్పడిన వరద సరస్సులో నీటిమట్టాలు ప్రమాదకరస్థాయిలో కొనసాగడంతో మరోమారు జలఖడ్గం దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దిగువ నేపాల్వాసుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. సరస్సులో నీటి రంగు మారుతోందని, ఈ లెక్కన ఏ క్షణంలోనైనా కట్ట తెంచుకుని భారీస్థాయిలో నీరు కిందకు ఉగ్రరూపంలో ప్రవహించవచ్చని నేపాల్ ప్రభుత్వాన్ని చైనా అప్రమత్తంచేసింది. సరస్సు కట్టుతెంచుకుంటే సెకన్‌కు 500 ఘనపు మీటర్ల నీరు మెరుపువేగంతో కిందకు దూసుకొచ్చి ప్రళయం సృష్టిస్తుందని అధికారులు హెచ్చరించారు. దిగువ ప్రాంతాల వాళ్లు తాత్కాలికంగా ఎగువ అడవిలోకి వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. తమ వారిని కోల్పోయి ఇల్లు, వాహనాలు, సామగ్రి కొట్టుకుపోవడంతో పలువురు జీవచ్ఛవాలుగా మారిపోయిన హృదయవిదారక దృశ్యాలు పలు చోట్ల దర్శనమిచ్చాయి. వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఇప్పటిదాకా 2,465 మందిని రక్షించారు. వీరిలో 113 మంది భారతీయులు సహా మొత్తంగా 163 మంది విదేశీయులు ఉన్నారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ కౌంటీలో 1,000 మందిని కాపాడారు. 8జిల్లాల్లో ఇప్పటిదాకా 669 మృతదేహాలు లభ్యమయ్యాయి. రంగంలోకి భారత సొరంగ బృందం రాసువాలోని త్రిశూలి 3ఏ జలవిద్యుత్ కేంద్రాన్ని బురదమట్టి సగానికిపైగా కప్పేయడంతో లోపల చిక్కుకున్న దాదాపు 100 మంది సిబ్బందిని కాపాడేందుకు, రంధ్రం పెట్టేందుకు డ్రిల్లింగ్ యంత్రాలతో భారతీయ నిపుణులు రంగంలోకి దూకారు. భారత్‌లో సొరంగ సంబంధ సమస్యల్ని పరిష్కరించే 14 మందితో కూడిన నిపుణుల బృందాన్ని రప్పించారు. ఉత్తరాఖండ్‌లో మూడేళ్ల క్రితం సిల్క్యారా–బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో 17 రోజుల తర్వాత 41 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిన టన్నెల్ రెసూ్క, మెడికల్ టీమ్ శనివారం ఘటనాస్థలికి చేరుకుంది. అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డెక్స్తోనూ నేపాల్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్షా సమావేశం జరిపారు. నేపాల్ ఆర్మీ, పోలీసులు, సాయుధ బలగాలతో కూడిన 82 మంది బృందం శుక్రవారం రాత్రి నుంచి బురదను తొలగిస్తూ లోపలికి సొరంగం లోపలికి వెళ్లేందుకు శతథా కృషిచేస్తోంది. ఇప్పటిదాకా త్రిశూలి, రసువాసహా పలు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నుంచి 191 మంది సిబ్బందిని కాపాడారు. మరోవైపు రాజధాని కఠ్మాండును దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే మగ్లింగ్–కఠ్మాండు జాతీయరహదారిని శనివారం పునరుద్దరించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారం, ఔషధాలు, వైద్య ఉపకరణాలుసహా పలు రకాల సామగ్రిని భారత్ శనివారం సైతం తరలించింది. దీంతో ఇప్పటిదాకా భారత్ నుంచి నేపాల్‌కు 57.6 టన్నుల మేర వరదసాయం అందింది. మిత్రదేశంపై చూపిస్తున్న మమకారానికి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌదెల్, ఆర్థికమంత్రి స్వరి్ణం వాగ్లే భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎడతెగని వాన.. కష్టంగా రెస్క్యూ ఆపరేషన్ అత్యంత ప్రభావితప్రాంతాల్లో సహా యక చర్యలకు కుండపోత వర్షాలు అడ్డంకిగా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని శనివారం నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కోశీ, భాగమతి, గండకీ, లుంబినా, సుందర్పశ్చిమ్ ప్రావిన్స్‌ల్లో, కర్నాలీ కొండ ప్రాంతాల్లో అతి వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారి హరిప్రసాద్ దహాల్ చెప్పారు. బురదమయంగా మారిన ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడితే కష్టమని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. దాతృత్వ సంస్థల నుంచి వెల్లువెత్తిన విరాళాలు వరదలో నాశనమైన రోడ్లు, వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మౌలిక సదుపాయాల పునరుద్దరణకు ఏకంగా రూ.48,000 కోట్లు అవసరం అవుతాయని నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో తీవ్ర దుఖంలో మునిగిపోయిన బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, సహాయక, అన్వేషణ కార్యక్రమాలకు తమ వంతు సాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా దాతలు ముందుకొస్తున్నారు. భారత్, బ్రిటన్, ఆ్రస్టేలియా, అమెరికా, చైనా, ద.కొరియా. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయానికి నడుంబిగించాయి. -
అమ్మప్రేమ ఆయువు పోసింది
వాడు చెట్టు దిగలేదు. కింద రాకాసి వరద. వాడు కొమ్మ వదల్లేదు. రాత్రయ్యింది. చీకటి. వాడు ధైర్యాన్ని చొక్కా పైజేబులో ఉంచి గట్టిగా పట్టుకున్నాడు. ఎనిమిదేళ్ల పిల్లవాడు. నేపాల్ వరద సునామీకి దడవకుండా వాళ్లమ్మ కోసం ప్రాణం ఉగ్గపట్టుకున్నాడు. పర్వతం కూడా వాడికి తలఒంచింది. నేపాల్‌లో ఈ త్రివిక్రమ బాలుడు అందరినీ సంతోషంలో ముంచెత్తాడు.ఆగస్టు ఇరవై ఆరు, బుధవారం... ఉత్తర నేపాల్‌లోని రసువా. ఎనిమిదేళ్ల జోయల్ ఘాలే ఉదయం ఎప్పటిలాగే తన తమ్ముడితో కలిసి స్కూలు వ్యాన్ ఎక్కి బడికి వెళ్లాడు. తల్లి మాయా తమంగ్ (28) పిల్లల్ని బడికి పంపించి రోజూలాగే ఇంట్లో కూర్చుని మగ్గం నేస్తూ ఉంది. మరికాసేపటికి భూమి అదిరింది.భారీ చప్పుడు. ఏంటది? తల్లి ఉలిక్కిపడింది.జరిగిందేమిటో అర్థం కావడానికి తల్లికే కాదు ఊరికీ చాలాసేపు పట్టింది. ల్యాంగ్టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం దగ్గరి ఐస్ గ్లేసియర్ ఒక్కసారిగా కుప్పకూలి ఒక రాకాసిలా మారి కిందకు దూకింది. మంచు, రాళ్లతో కలిసి బురదరూపం దాల్చి ఉప్పెనలాగా లోయలోకి దూసుకొచ్చింది. దాని దెబ్బకి భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. సూర్యుడి వెలుతురుకు అడ్డం పడుతూ భారీగా ఊరి మీద విరుచుకు పడ్డాయి. ఆ సమయానికి జోయల్ క్లాస్‌లో ఉన్నాడు. వాడికి చురుకు జాస్తి. ఏదో కొంప ముంచుకు వచ్చిందని ఒక్కసారిగా చుట్టుముట్టిన కారుచీకటిని చూడగానే అర్థమైంది. స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే జోయల్ తన ఫ్రెండ్‌తో కలిసి ప్రాణభయంతో అడవిలోకి పరుగెత్తాడు. దూసుకొస్తున్న బురద నీటికి దొరకకుండా ఉండటానికి చలిలో వణుకుతూ చెట్ల పైకి ఎక్కి కూర్చున్నాడు. పది నిమిషాలకు కుదుట పడ్డాడు. ఫ్రెండు ఏమయ్యాడో తెలియదు. చెట్టు దిగితే తన గతి అదేనని వాడికి తెలుసు. ఏమైనా సరే చెట్టు దిగకూడదు. అమ్మ వచ్చే దాకా దిగనే దిగడు.తల్లి వెతుకులాటప్రమాదం జరిగిన వెంటనే తల్లి మాయా తమంగ్ పిచ్చిదానిలా పిల్లలు ఉన్న స్కూలు వైపు పరుగెత్తింది. సాధారణంగా కారులో వెళ్తే పదిహేను నిమిషాలు పట్టే ఆ దారి హఠాత్ ప్రళయం వల్ల బురదకుప్పలా మారిపోయింది. స్కూలు ఎక్కడుందో కూడా అర్థం కాలేదు. అక్కడ ఎటు చూసినా ఉధృతంగా ప్రవహించే నీరు, పెద్ద పెద్ద రాళ్లు, మోకాళ్ల లోతు బురద మాత్రమే కనిపించాయి’ అని ఆ తల్లి రాయిటర్స్ ప్రతినిధులతో అంది. తన కళ్ల ముందే సర్వస్వం కొట్టుకుపోతుంటే, తన ఇద్దరు బిడ్డలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని ఆమె గుండె పగిలేలా ఏడ్చింది.ఒక ఫోన్ కాల్‌తో తిరిగొచ్చిన ప్రాణం!మరోవైపు మాయా తమంగ్ తన బిడ్డల కోసం ఒక సహాయక శిబిరం నుండి మరో శిబిరానికి తిరుగుతోంది. నాలుగు శిబిరాల్లో కూడా పిల్లల పేర్లు లేకపోవడంతో, వాళ్లు చనిపోయారని ఆశ వదులుకుంది. ‘ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఆమె చెప్పింది. ఆ సమయంలో ఎవరో ఇచ్చిన సమాచారంతో ప్రతినిధి సహానాకు ఫోన్ చేసింది.‘నీ పెద్ద కొడుకు జోయల్ బతికే ఉన్నాడు, చికిత్స కోసం ఖట్మాండూ ఆసుపత్రికి తరలించారు’ అని వినగానే నమ్మలేకపోయింది. అప్పటికే ఆమె చిన్న కొడుకు కూడా సురక్షితంగా దొరికాడు. శుక్రవారం నాడు బెడ్‌పై ఉన్న జోయల్‌ని చూడగానే ఆ తల్లి సంతోషానికి పగ్గాల్లేవు. నవ్వూ... ఏడుపూ.... ‘నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్టు అయింది’ అంది కనునవ్వుతో.నేపాల్ కొండ వరదల వల్ల రసువా జిల్లాలో వందలాది మంది మరణించగా, వేలాది మంది అదృశ్యమయ్యారు. కానీ, మాయా తమంగ్‌కు ప్రకృతి ఆమె ఇద్దరు బిడ్డల్ని దోసిలిలో ఉంచి తిరిగి అప్పజెప్పింది. జపాన్ లో కన్స్ట్రక్షన్ పనిలో ఉన్న జోయల్ తండ్రి కూడా కొడుకును చూడటానికి నేపాల్‌కు బయలుదేరాడు. ఆసుపత్రి బెడ్‌పై కాలు విరిగి ఉన్నా, నవ్వుతూ ఉన్న కొడుకును చూసి.. ‘వీడు ఎప్పుడూ ఇంతే, భయం అంటే తెలీదు, వీడికి ఎముకలు విరగడం ఇది మొదటిసారి కాదు’ అని ఆ తల్లి నవ్వుతూ అన్న మాటలు విపత్తును గెలిచిన మాతృత్వానికి, ఆ పసివాడి అజేయమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. చిచ్చరపిడుగుసాయంత్రమైపోయింది. చీకటి పడింది. చెట్టు మీద ఉన్న జోయల్ చెట్టు దిగలేదు. భయపడలేదు. పట్టుజారి నీటిలో పడలేదు. అమ్మను చేరాలి వాడు. అంతే. ఎలాగైనా చేరతాడు కూడా. మరుసటి రోజు గురువారం ఉదయం నిఘా దళాలు అడవిలో ఉన్న జోయల్‌ను చూశాయి. ‘ఒరేయ్... మీ అమ్మ పిలుస్తోంది రా’ అన్నాయి. అపనమ్మకం కొద్ది, వాళ్ల వెంట వెళ్లడానికి కూడా వాడు రెడీ కాలేదు. వాణ్ణి ఒప్పించడానికి పోలీసులు వాడి చేతిలో రెండు పది రూపాయల నోట్లు పెట్టారు. హెలికాప్టర్ ద్వారా నువాకోట్ జిల్లాలోని చిన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికి వాడి కుడి కాలు విరిగిపోయింది, ముఖంపై గాయాలు ఉన్నాయి. అయినా సరే జోయల్ ఆ ఇరవై రూపాయలను తన ఎడమ చేతితో గట్టిగా పట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై తల్లి కోసం చూస్తున్నాడు. కాని తల్లి ఎక్కడ ఉందో... అసలు ఉందో లేదో తెలియదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక న్యూస్రిపోర్టర్ సహానా బజ్రాచార్య, జోయల్‌ని చూసి చలించిపోయింది. వాడి వీడియో తీసి వాళ్లమ్మకు చేరేలా చూడండి అని సోషల్ మీడియాలో పెట్టింది. -
నేపాల్ వరదలు.. భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: నేపాల్ వరదల్లో గల్లంతైన భారతీయులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆకస్మిక వరదల్లో మెుత్తంగా 287 మంది భారతీయులు గల్లంతు కాగా వారిలో 88 మంది సురక్షితంగా బయిటపడినట్లు తెలిపింది. గల్లంతైన వారిలో 128 మంది ఎన్నారైలు ఉన్నట్లు పేర్కొంది. గల్లంతైన వారి కోసం భారత సహాయక బృందాలు గాలింపులు చేపడుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.120 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ చేరుకున్నట్లు తెలిపింది. అదే విధంగా మృతుల డీఎన్ఏ పరీక్షల వివరాల కోసం ఆరు ఫోరెన్సిక్ టీములను కేంద్ర ప్రభుత్వం నేపాల్ పంపినట్లు పేర్కొంది. హైడ్రో పవర్ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. నేపాల్–టిబెట్ వరదలు: ప్రస్తుత వివరాలు1. మొత్తం పరిస్థితి • నేపాల్–టిబెట్ మానవతా సంక్షోభం విపత్కరం. • 633 మరణాలు, 2,980 మంది మిస్సింగ్ • నేపాల్: 626 మరణాలు, 2,426 తప్పిపోయినవారు (517 విదేశీయులు, 300+ భారతీయులు). • 3,700+ మంది రక్షణ, 2,400+ మందిని 14 సైనిక హెలికాప్టర్లు గాలివెంటన్. • 11,000+ భద్రతా సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ. • రోడ్లు/వంతెనలు నాశనం, బురద, కొండచరియలు, వర్షం, కఠిన భూభాగం యాక్సెస్‌ను పరిమితం చేస్తున్నాయి. • నేపాల్ అంతర్జాతీయ సహాయం స్వీకరిస్తోంది. భారత్, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయి. 2. ఆంధ్రప్రదేశ్ – 13 మంది జాడ తెలియదు • 13 మంది AP సంబంధితులు జాడ తెలియదు (7 AP నివాసులు + 6 AP మూలం NRIలు/విదేశీయులు). • 6 మంది NRIలలో 4 మంది ఇషా ఫౌండేషన్ గ్రూప్‌కు సంబంధించినవారు. AP నివాసులు – 7: 1 అన్నండేవర వెంకట్రామ్ — 9663722477 | కాకినాడ/బెంగళూరు 2 అన్నండేవర అనఘ — 9663766711 | కాకినాడ/బెంగళూరు 3 చొప్పరాపు రమేష్ బాబు — 8861299006 | కృష్ణా/కనూరు | గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్, చైనా 4 సంతోష్ సాహు — 447860430921 | పార్వతీపురం | NRT–లండన్ 5 స్పందన్ సాహు — 447587741850 6 పాధ్య సురభి మన్మథ్ — కాంటాక్ట్ అందుబాటులో లేదు 7 సైనా కుమారి సాహు — కాంటాక్ట్ అందుబాటులో లేదు AP మూలం NRIలు/విదేశీయులు – 6: 8. వి.ఎల్. బాల సుబ్రమణ్యం — 7416410673 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్9. అట్లూరి శశి కుమార్ — +1-6095778200 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్10. నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి — 7416083300 | గైరాంగ్ | ఇషా ఫౌండేషన్11. కె. గోవింద్ — 6367167312 | ఇషా ఫౌండేషన్12. సుహాసిని రెడ్డి కండిమల్ల — కాంటాక్ట్/లొకేషన్ అందుబాటులో లేదు13. రంగనాథ్ — 8790040944 | ధుంచే/స్యాబ్రుబేసి | న్యూజిలాండ్ పౌరుడు (AP సంబంధం) 3. భాస్కర్ శాస్త్రి & కుటుంబం – ఆదోని, కర్నూలు • భాస్కర్ శాస్త్రి, మణి శారద, రఘునాద శాస్త్రి, హంశిక సురక్షితంగా ఉన్నారు. • రఘునాద శాస్త్రికి తీవ్ర పల్మనరీ ఎడిమా వచ్చి ఆక్సిజన్ అవసరం. • 28 ఆగస్టు: సాగా చేరి హోటల్లో ఆక్సిజన్ ఏర్పాటు. • 29 ఆగస్టు: న్యాలామ్ కౌంటీ చేరారు (కొడారి సరిహద్దుకు సుమారు 50 కి.మీ.). • కొడారి → కాఠ్మండు వైపు కదలనున్నారు (సరిహద్దు, వాతావరణం, రోడ్ పరిస్థితులపై ఆధారపడి). • కీలక అవసరం: కొడారి–కాఠ్మండు ప్రయాణానికి పోర్టబుల్ ఆక్సిజన్/ఆక్సిజన్ ఉన్న వాహనం ఏర్పాటు చేయాలి. • 30/31 ఆగస్టు కాఠ్మండు చేరే అవకాశం. 1 సెప్టెంబర్ 2026 కాఠ్మండు–ముంబై–హైదరాబాద్ ఫ్లైట్ ధృవీకరించబడింది.కాంటాక్ట్స్:భాస్కర్ శాస్త్రి: 94401 96543 | హంశిక: 9036536111 | గ్రూప్ కోఆర్డినేటర్: +977 9843057721 | మూన్ హిమాలయ అడ్వెంచర్: +977 9860455963 / +977 1-5924890 -
వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. లక్షల కొద్దీ డబ్బు
కాఠ్మాండు: నేపాల్‌లోని పలు ప్రాంతాలను భీకర వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ వరద నీటిలో.. బ్యాంకులో నగదు, విలువైన వస్తువులు భద్రపరిచే పెద్ద ఇనుప పెట్టె (సేఫ్) కొన్ని కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. సేఫ్‌ను పగులగొట్టి అందులోని డబ్బును తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రసువాలోని భోటెకోషి ప్రాంతంలో వరదలకు బ్యాంకు సేఫ్ కొట్టుకుపోయినట్లు తెలిసింది. తర్వాత ధాదింగ్‌లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4లోని బెల్ఖుఖోలా సమీపంలో త్రిశూలీ నది ఒడ్డున అది కనిపించింది. స్థానికులు సేఫ్‌ను పగులగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు తమకు సమాచారం అందిందని ధాదింగ్ పోలీసులు తెలిపారు.రూ.57 లక్షలు స్వాధీనం వెంటనే పోలీసు బృందాన్ని ఘటనాస్థలానికి పంపించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక తనిఖీల్లో 29 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 92,68,505 నేపాలీ రూపాయలను అంటే సుమారు రూ.57 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది గల్చీ-4లోని మస్తార్ నివాసితులు. కొందరు గల్చీ-6లోని ఆదమ్ఘాట్, సిద్ధలేఖ్-7లోని ఆదమ్తార్కు చెందినవారు. మరికొందరు చిత్వన్, పర్సా ప్రాంతాలకు చెందినవారు. ప్రస్తుతం ధాదింగ్లో నివసిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వయసు 19 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంది. స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మరికొందరు అనుమానితులు ఉన్నారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.మరో దిగ్భ్రాంతికర ఘటనలో, నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బాధితురాలి మృతదేహం నుంచి బంగారు చెవిపోగులు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిపోగుల్లా కనిపిస్తున్న వాటిని ఆ వ్యక్తులు తొలగిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి.భీకర వరదలకు సంబంధించి నేపాల్ విపత్తు సంస్థ శనివారం తన గణాంకాలను గణనీయంగా సవరించింది. ప్రస్తుతం 2,426 మంది గల్లంతైనట్లు తెలిపింది. నిర్ధారించిన మరణాల సంఖ్య 626కి పెరిగినట్లు పేర్కొంది. తాజా వివరాల ప్రకారం గల్లంతైన నేపాలీల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి 1,924 మంది గల్లంతైనట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. గల్లంతైన విదేశీయుల సంఖ్య 517గానే ఉందని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ తెలిపింది. -
నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే
-
సునామీలా వరద.. ఆ పరమశివుడే కాపాడాడేమో!
కొండలపై నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద.. క్షణాల్లోనే అంతా తుడిచిపెట్టేసింది. చుట్టూ బురద, రాళ్లు, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువే కనిపించింది. ఇంత విషాదంలో కొందరి ప్రాణాలు మాత్రం అద్భుతంగా దక్కాయి. తాము చూసిన భయానక దృశ్యాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ వారు చెప్పిన మాటలు ఆ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన తమిళనాడు యాత్రికులకు నేపాల్‌లో ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆగస్టు 26న రసువాగఢి ప్రాంతంలో ఒక్కసారిగా కొండలపై నుంచి నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయి. క్షణాల్లోనే రహదారులు, భవనాలు కొట్టుకుపోవడంతో 21 మంది యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చివరకు సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు.తమ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదీ తీరంలో భారీగా పొగలాంటిది కనిపించిందని యాత్రికులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత ఏదైనా పేలుడు జరిగిందని భావించామని.. అంతలోనే కొండపై నుంచి నీరు, మట్టి, ఇసుక, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం దూసుకొచ్చిందని చెప్పారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ తమ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.వరద ప్రవాహం బస్సులకు చేరువవుతుండటంతో డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చి సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొందరు మహిళలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడటంతో.. చీర సాయంతో ఒకరినొకరు పైకి లాగుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు నానా అవస్థలు పడి చివరకు ఓ రెస్క్యూ కేంద్రానికి చేరుకున్నారు.ఆ పరమశివుడి ప్రతిరూపం..తమను స్వయంగా ఆ శివుడే కాపాడాడని కొందరు యాత్రికులు నమ్ముతున్నారు. వరద ప్రవాహం తమవైపు దూసుకొస్తున్న సమయంలో సమీపంలోని కొండపై మట్టి, బురదతో శివుడి ముఖం ఆకారంలో ఓ రూపం కనిపించిందని వారు భావోద్వేగంగా చెబుతున్నారు. కైలాసానికి వెళ్లి శివుడి ఆశీస్సులు పొందాలనుకున్న తమను.. ఈ విపత్తు నుంచి కూడా ఆయనే కాపాడాడని చెప్పారు. నేపాల్ సైన్యానికి కృతజ్ఞతలువిపత్తులో చిక్కుకున్న యాత్రికులను నేపాల్ సైన్యం, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారిని ఖాట్మాండుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి న్యూఢిల్లీ మీదుగా చెన్నైకి తరలించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యాత్రికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా వందలాది మంది ఆచూకీ లేదుఇదిలా ఉండగా.. నేపాల్, టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 700కు దగ్గర్లో చేరగా.. 2,426 మంది గల్లంతైనట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్‌కు ఆహారం, మందులు, దుప్పట్లు, సోలార్ ల్యాంపులు తదితర సహాయక సామగ్రిని కూడా భారత్ పంపుతోంది.“We saw Lord Shiva’s face on the mountain as the water came hurtling towards us.”A group of 60 pilgrims from Tamil Nadu were travelling in three buses on the Kailash Mansarovar pilgrimage. The whereabouts of around 40 travelling in two of those buses remain unknown.The 21… pic.twitter.com/qmnWUhcF0Z— Rahul Kanwal (@rahulkanwal) August 28, 2026ఇదీ చదవండి: యుగాంతం వచ్చేసిందా? అన్నట్లు.. -
నేపాల్ జల ప్రళయం వెనుక చైనా.!
-
రెండున్నర లక్షల శవాల సమాధి.. చైనా దాచిన జలప్రళయం
-
నేపాల్ వరదలు: 18 నెలల పసికందు ఎదురుచూపులు..
ఊనా: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజినీర్ సుఖ్విందర్ ఆచూకీ గల్లంతైంది. రసువా, నువాకోట్ జిల్లాల పరిధిలోని త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టులో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల సెలవు అనంతరం ఆగస్టు 15నే ఆయన తిరిగి నేపాల్ వెళ్లారు. బుధవారం నేపాల్‌లో వరదలు ముంచెత్తినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆయనతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.సుఖ్విందర్ను క్షేమంగా రక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎంపీ అనురాగ్ ఠాకూర్‌ను ఆశ్రయించారు. సుఖ్విందర్ గతంలో భూటాన్‌లో పనిచేశారని, అనంతరం సంస్థ ఆయన్ను నేపాల్‌కు బదిలీ చేసిందని తండ్రి హుసన్ లాల్ తెలిపారు. ఖాట్మండులో ఉంటున్న తమ బంధువు కూడా సుఖ్విందర్ కోసం ఆరా తీస్తున్నా ఎలాంటి సమాచారం దొరకలేదని, దుబాయ్‌లో ఉండే పెద్ద కుమారుడు కూడా సోదరుడిని వెతికేందుకు ఖాట్మండు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుఖ్విందర్కు వివాహమై, 18 నెలల కుమారుడు ఉన్నాడు.సుఖ్విందర్ గల్లంతుపై ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు ఊనా ఎస్డీఎం అభిషేక్ మిత్తల్ తెలిపారు. కాగా, చంబా జిల్లాకు చెందిన సల్మాన్ ఖాన్ అనే మరో యువకుడు తాను నేపాల్‌లో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబానికి తెలిపాడు. ఆయన పనిచేస్తున్న ప్రాంతం వరద ప్రభావిత ప్రాంతానికి వేరొక వైపు ఉండటం, ఆ సమయంలో సొరంగంలో ఉండటంతో ప్రమాదం తప్పింది.విపత్తులో చిక్కుకున్న పౌరులకు సహాయం అందించి, వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. బాధిత కుటుంబాల సహాయార్థం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.ఇది కూడా చదవండి: కష్టాల ఊబిలోంచి.. దర్జీ కూతురి ‘సీఎస్’ విజయం -
హిమాలయాల్లో మృత్యుఘోష
-
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గల్లంతు!
-
నేపాల్ ప్రమాదానికి కారణం ఆ ఒక్క మంచు గడ్డనే..! టూరిస్ట్ సంచలన నిజాలు
-
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్‌ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
కళ్ల ముందే విషాదం.. నోట మాట రావడం లేదు
ఖమ్మం జిల్లా: ‘టీ తాగేందుకు పది నిమిషాలు ఆగడం వల్లే ప్రాణాలు దక్కించుకున్నాం.. కళ్ల ముందే జరిగిన పెను విషాదంతో నోట మాట రావడం లేదు..’అని మానస సరోవర యాత్రకు వెళ్తూ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన ఖమ్మం జిల్లా వాసి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన దాసరి శ్రీలక్ష్మిరెడ్డి శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి ఫోన్లో మాట్లాడగా వివరాలు వెల్లడించారు. సరోవర్ యాత్రకు అనుమతి ఆలస్యం కావడంతో కఠ్మాండులో బస చేసి ఈనెల 21న నేపాల్ నుంచి మరికొందరితో బయలుదేరినట్లు లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అలసటగా ఉందంటూ బృందంలోని ఓ సభ్యురాలు అనడంతో అంతా టీ తాగేందుకు ఆగినట్లు చెప్పారు. ఆ తర్వాత నిమిషాల్లోనే భారీ వరద ముంచెత్తడం...తమ ముందు వెళ్లిన వాహనాలు భారీ బురద, నీటి ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాయని తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారని వెల్లడించారు. అయితే ముందుగా వెళ్లిన వాహనాల్లో తమ ట్రావెల్ బ్యాగులు, బట్టలు, ఇతర సామగ్రి మొత్తం కొట్టుకుపోయాయని చెప్పారు. సామగ్రి కోల్పోయినా బృందంలోని అందరం క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉందని తెలిపారు. పరిసర గ్రామాల్లో పరిస్థితి భయానకంగా ఉందని, వరదతో ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ చూసినా హృదయ విదారకరమైన దృశ్యాలే కనిపించాయని చెప్పారు. శ్రీలక్ష్మిరెడ్డి భర్త దాసరి జయపాల్‌రెడ్డి హైకోర్టు న్యాయవాది కాగా, వీరి పెద్దకుమార్తె దాసరి రోహిణి సింధూరి కర్ణాటక కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి, చిన్న కూతురు ప్రియాంకరెడ్డి బెంగళూరులో ప్రముఖ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. కాగా, శ్రీలక్ష్మిరెడ్డి బృందం శుక్రవారం రాత్రి సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్! -
నేపాల్‌ను ముంచిన బురద సునామీ!
పిల్లలూ... ఆగస్టు 26 ఉదయం నేపాల్ సరిహద్దుల్లో ఒక భయంకరమైన ప్రకృతి వింత జరిగింది. హిమాలయ పర్వతాల పైన ఉండే భారీ ఐస్ గ్లేసియర్ (మంచు కొండ) ముక్కలై కింద పడింది! భూమి వేడెక్కడం వల్ల ‘లాంగ్తాంగ్ లిరుంగ్’ అనే ఎత్తైన కొండ దగ్గర ఉన్న మంచు పర్వతం బలహీనపడి, ఒక్కసారిగా విరిగిపోయి వందల మీటర్ల కింద ఉన్న లెండే ఖోలా నదిలోకి కూలిపోయింది.అంత పెద్ద మంచు కొండ కింద పడేసరికి వచ్చిన ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత ఉన్న భూకంపం లాగా రికార్డయ్యాయి. దాంతో ప్రజలంతా భూకంపం వచ్చిందేమో అనుకుని ఇళ్లలోనే ఉండిపోయారు, కానీ పైనుంచి ప్రమాదం వస్తోందని ఊహించలేకపోయారు.వేల అడుగుల ఎత్తు నుంచి అంత పెద్ద మంచు కొండ కింద పడటంతో పుట్టిన ఘర్షణ వేడికి ఆ మంచు ముక్కలన్నీ క్షణాల్లో కరిగిపోయి నీళ్లలా మారాయి. ఆ నీరు పర్వతం మీది నుంచి కిందికి వస్తున్నప్పుడు దారిలో ఉన్న మట్టి, ఇసుక, పెద్ద పెద్ద బండరాళ్లను కూడా తనతో పాటు లాక్కొచ్చేసింది. దాంతో నదిలోని నీళ్లు మనం ఇళ్లు కట్టేటప్పుడు సిమెంట్, ఇసుక కలిపిన ‘లిక్విడ్ కాంక్రీట్‘ లాంటి భయంకరమైన బురద ప్రవాహంగా మారిపోయాయి.ఈ బురద ప్రవాహం చాలా బరువైంది, వేగమైంది. ఇది నదిలోకి దూసుకొచ్చిన కేవలం 30 నిమిషాల్లోనే నది నీటి మట్టం 30 అడుగుల పైకి లేచింది. పైగా ఇలాంటి మంచు కొండలు ఎప్పుడు విరిగిపడతాయో ముందుగా ఊహించడం శాస్త్రవేత్తలకు కూడా చాలా కష్టం. దాంతో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం, బురద విపరీతమైన వేగంతో రావడం వల్ల జనం ప్రాణాలు కాపాడుకునే సమయం లేకుండా పోయింది. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ’మంచు సునామీ’ మనకు నేర్పుతోంది!ఇవీ చదవండి: నేపాల్‌లో ఆగని మృత్యుఘోష -
Video: భయానక దృశ్యం.. క్షణాల్లో కొట్టుకుపోయిన గ్రామం
నేపాల్‌ను వరదలు వణికిస్తున్నాయి.. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన వరద.. ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భారీగా వచ్చిన బురదతో కూడిన వరదనీళ్ల ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.భోటేకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. నదులు పొంగిపొర్లడంతో నీరు, బురద జనావాసాల్లోకి దూసుకెళ్లాయి. చూస్తుండగానే ఓ నదీ తీర ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. ఆ తర్వాత వరద ప్రవాహం దిగువ ప్రాంతాల వైపు కొనసాగింది. ఈ భారీ విపత్తులో 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతవ్వగా.. 392 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ వరదల తాకిడికి వందల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. హిమానీనదం నుంచి మంచు విరిగిపడటం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించి ఉండొచ్చని అంచనా. ఒక దశలో త్రిశూలి నదిలో నీటి మట్టం కేవలం అరగంటలోనే 9 మీటర్ల వరకు పెరిగినట్లు ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ నిపుణులు తెలిపారు.Bright daylight, clear skies, and then suddenly a tsunami like wave crashes into a village. These scenes from Nepal today are beyond horrific. Everything feels like a doomsday scene.95+ people reported killed and 500+ still missing. Prayers for everyone #Nepal 🙏 https://t.co/0aIccVPsd8 pic.twitter.com/zSOXpiA0nK— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్‌లో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది. ఆచూకీ తెలియని వారిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు, త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.ఇదీ చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్! -
యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!
భారీ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే నేపాల్‌ను మరో జలప్రళయం ముంచెత్తుందన్న హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరదల ధాటికి ఏర్పడిన సహజ సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా హెచ్చరించింది. సరస్సులోని నీటి రంగు మరింత ముదురుతోందని.. ఇది కట్ట తెగే ప్రమాదానికి సంకేతం కావొచ్చని పేర్కొంది. ఎప్పుడైనా సరస్సు కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో సహాయక చర్యలకు, గల్లంతైన వాళ్ల కోసం కొనసాగుతున్న అన్వేషణకు తాజా వార్నింగ్ ఆటంకాలు కలిగిస్తోంది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు ఘోర నష్టాన్ని కలిగించాయి. అయితే ఆ సమయంలో ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. దీంతో నదీ ప్రవాహానికి అడ్డుగా సహజ కట్ట ఏర్పడి.. దాని వెనుక బారియర్ సరస్సు ఏర్పడింది. చైనా జలవనరుల శాఖ ప్రకారం.. శుక్రవారం నాటికి అందులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సరస్సు చైనాలోని చోచెన్ నది, నేపాల్‌లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది.కట్ట తెగితే.. 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహంఈ సరస్సు ఏ క్షణాన అయినా కట్టలు తెంచుకోవచ్చని చైనా నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టిబెట్ ప్రాంతంలో సహాయక చర్యలను సైతం నిలిపివేసింది. సరస్సు కట్టలో కొంత భాగం తెగితే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల నీరు నదిలోకి చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇది మొన్న సంభవించిన వరద ఉధృతితో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఉండే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహించడం ప్రారంభమైందని వెల్లడించింది. దీంతో డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నేపాల్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మైక్‌లలో చేస్తున్న హెచ్చరికలతో.. ఎత్తైన ప్రాంతాలకు తరలి పోతున్నారు.600కు చేరువలో మృతుల సంఖ్యఆకస్మిక వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. రసువాతోపాటు మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో 600 మంది దాకా మృతి చెందారు. 1,500 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు.. భారత సరిహద్దు వైపునకు కూడా కొన్ని మృతదేహాలు, బ్యాగులు కొట్టుకువస్తున్నాయి. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్ అంచనా వేసింది.2,000 people now missing in Nepal as death toll from floods hits 579.Nepali authorities say they’re monitoring two lakes upstream from the main flood zone, one of which has begun overflowing. pic.twitter.com/4cyByjJ1Yx— 𓂀 𝕋𝔼𝔸ℍ 𓂀 (@TeahCartel) August 28, 2026అటు టిబెట్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పలువురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కైలాస్–మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయుల ఆచూకీపై ఆందోళన కొనసాగుతోంది.టన్నెళ్లలో వందలమంది?భారీ వరదలకు నేపాల్‌లోని 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 933 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కొందరు టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క అప్పర్ త్రిశూలి–1 ప్రాజెక్టులోనే 576 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం.. మొబైల్, టెలిఫోన్ నెట్‌వర్క్‌లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు మూడు డజన్లకుపైగా వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.భారత్ నుంచి భారీ సాయంవిపత్తు నేపథ్యంలో ఇతర దేశాల సాయం వద్దన్న నేపాల్.. కొద్దిగంటల్లోనే మనసు మార్చుకుంది. ధ్వంసమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు 42 బెయిలీ వంతెనలు(తాత్కాలిక) నిర్మించేందుకు భారత్, చైనా సాయాన్ని నేపాల్ కోరింది. ఇటు భారత్ ఇప్పటికే నేపాల్‌కు సహాయక సామగ్రిని పంపింది. వైద్య సిబ్బంది, టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపేందుకు కూడా ముందుకొచ్చింది. ప్రస్తుతం వేలాది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా.. మరోవైపు సహజ సరస్సు ఎప్పుడైనా కట్టలు తెంచుకునే అవకాశం ఉందన్న చైనా హెచ్చరిక నేపాల్‌లో కొత్త ఆందోళనకు కారణమైంది. దీంతో బోటెకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.ఇదీ చదవండి: చైనా బార్డర్ వల్లే నేపాల్ సంచలన నిర్ణయం? -
అమ్మ ఎక్కడ...! కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం
-
చైనా సరిహద్దు! నేపాల్ సంచలన నిర్ణయం.. భారత్ కీలక ప్రకటన!
భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల సాయం తమకేం అక్కర్లేదని తేల్చేసింది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపినట్లు ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. తమ భద్రతా బలగాలే సమర్థంగా పని చేస్తున్నాయని.. అలాంటప్పుడు వేరే దేశాల అవసరం తమకు ఉండకపోవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ అంటోంది. దీనికి స్పందించిన భారత్.. ఓ కీలక ప్రకటన చేసింది.నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం ఆకస్మిక వరద పోటెత్తింది. ఎగువన ఉన్న గ్లేసియర్ కరిగిపోవడంతో.. బండరాళ్లు, బురదతో కూడిన వరద క్షణాల్లో ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 600 మృతదేహాలను వెలికి తీశారు. మరో 1,400 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేపాల్‌లోని రసువా జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు వరద కారణంగా ఏర్పడిన మరో సరస్సు కట్టలు తెంచుకునే ప్రమాదం చైనా ఇప్పటికే నేపాల్‌ను హెచ్చరించింది. దీంతో మరోసారి జల ప్రళయం(మునుపటి కంటే ఐదు రెట్లు తీవ్రతతో..) రావొచ్చని ఆందోళనల నడుమ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.భారత్ రియాక్షన్ ఇదే..నేపాల్ విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని ప్రకటించినప్పటికీ.. భారత్ మాత్రం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నేపాల్ అభ్యర్థన మేరకు.. అదనపు మానవతా సాయం, వైద్య బృందాలు, ఇంజినీరింగ్ సిబ్బంది, అవసరమైన పరికరాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో విమానం కూడా త్వరలో బయలుదేరనుంది. టన్నెల్ రెస్క్యూ టీమ్‌ను పంపేందుకు ముందుగా రెకీ బృందాన్ని పంపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరమైన పరికరాలను గుర్తించనున్నారు. అదేవిధంగా వైద్య బృందాన్ని పంపడంతోపాటు.. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు బెయిలీ(పోర్టబుల్) వంతెనలు, సాంకేతిక బృందాలను అందించేందుకు భారత్ ముందుకొచ్చింది.బృందాలనూ పంపుతాంసహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైన పరికరాలను పంపేందుకు భారత్ ప్రత్యేకంగా నేపాల్‌కు ప్రతిపాదన చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.పలు దేశాల నుంచి సాయం ఆఫర్నేపాల్ వరదల్లో తమ దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన నేపథ్యంలో పలు దేశాలు సహాయక బృందాలను పంపేందుకు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి తెలిపారు. తమ భద్రతా సంస్థలు ఇప్పటికే శోధన, రక్షణ చర్యలను చేపట్టాయని.. అవి సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు.చైనా సరిహద్దు ప్రాంతం కావడం వల్లేనా?విదేశీ రెస్క్యూ బృందాలను అనుమతించకపోవడం వెనుక రసువా ప్రాంత భౌగోళిక ప్రాధాన్యత కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోని టిబెట్‌కు సమీపంలో ఉండటంతో.. విదేశీ బృందాల రాక సున్నితమైన అంశంగా మారి ఉండొచ్చని నేపాల్ మాజీ దౌత్యవేత్త దినేశ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. అయితే నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.‘సాయం పూర్తిగా వద్దనడం కాదు’నేపాల్ అంతర్జాతీయ సాయాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదని ఛేత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఏదైనా ప్రత్యేక నైపుణ్యం లేదంటే సాంకేతిక సహాయం అవసరమైతే ఆయా దేశాలను తామే సంప్రదిస్తామని చెప్పారు.వరదల్లో దక్షిణ కొరియాకు చెందిన పలువురు జలవిద్యుత్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాలను అంగీకరించే పరిస్థితిలో లేదని తమకు సమాచారం అందినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అయినప్పటికీ నేపాల్‌తో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది. మానవతా సాయం కింద 10 లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది.ఆ వెంటనే యూటర్న్.. విదేశీ బృందాలకు ఓకే!విదేశీ రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, పెద్ద సంఖ్యలో విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో పరిమిత స్థాయిలో విదేశీ నిపుణులను అనుమతించింది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు టన్నెల్ రెస్క్యూ, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ గుర్తింపు ప్రక్రియల్లో సహకరించనున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే వైద్య, టన్నెల్ రెస్క్యూ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫరక్కా డెడ్‌లైన్.. మరో జల యుద్ధం తప్పదా? -
నేపాల్ లో భారీ ప్రకృతి విపత్తుకు కారణమేంటి ?
-
నేపాల్‌లో ఆగని మృత్యుఘోష.... 579కి చేరిన మరణాల సంఖ్య... భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
-
బురద వరదకు బెదరక.. చెదరక!
కఠ్మాండు: నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున విధ్వంసం, భారీగా ప్రాణనష్టం సంభవించడం తెల్సిందే. ఒక్కసారిగా వచ్చి పడిన మెరుపు వరద అన్నిటినీ చుట్టేస్తూ నాశనం చేసుకుంటూ వెళ్తుండగా నేపాల్–భూటాన్ సరిహద్దులోని ఓ నివాసం మాత్రం చెక్కుచెదరలేదు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది. పెను వేగంతో దూసుకొచ్చిన వరద ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని ముంచెత్తుతూ అక్కడున్న నిర్మాణాలన్నిటినీ నాశనం చేసేసింది. చుట్టుపక్కల భవనాలు కొట్టుకుపోగా ఆ ఇల్లు మాత్రం తట్టుకుని నిలబడగలిగింది. ఆ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. అందులోని ఆ ముగ్గురికీ ఏమైందంటూ చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఓ నెటిజన్ మాత్రం వారు సురక్షితంగానే ఉన్నారని ధ్రువీకరించారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేయడంతో అందరూ స్థిమితపడ్డారు. ఆ ఇల్లు అంత పటిష్టంగా ఉండటంపైనా ఆన్లైన్లో చర్చ జరిగింది. చుట్టూ ఉన్న భవనాలు, వ్యర్థాలు ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ, ఆ నిర్మాణం ఎలా తట్టుకుని నిలబడిందంటూ నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నించారు. ఒక యూజర్ అయితే.. ఆ ఇంటిని కట్టిన వ్యక్తికి నేపాల్ రత్న మాన్ పదవి పురస్కారం ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. ఆ ఇంటి అసాధారణమైన నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించారు. -
నేడు నేపాల్... రేపు ఇండియా?
హిమాలయాలు కోట్లాది ప్రజలకు జీవనాధారమైన నదులకు పుట్టినిల్లు. భారత ఉపఖండ వాతావరణం, వ్యవసాయం, జీవ వైవిధ్యం, ఆధ్యాత్మికతతో వాటికి విడదీయరాని సంబంధం ఉంది. కానీ నేడు మనిషి హిమాలయాలను ప్రకృతి వరంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, రహదారి కారిడార్‌గా, విద్యుత్ ప్రాజెక్టుల ప్రాంతంగా, నిర్మాణాలకు అనువైన భూమిగా చూడటం మొదలు పెట్టాడు. మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగు తోంది. ఫలితంగా నేపాల్–టిబెట్ సరిహద్దు హిమాలయప్రాంతంలో ఆగస్టు 26 లాంటి ఘోరవిపత్తులు సంభవిస్తున్నాయి. అభివృద్ధి కావాలి. కానీ హిమాలయాల మూల్యంతో కాదు. దేశ భద్రతకు రహదారులు అవసరం. స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి పర్యాటకం అవసరం. కానీ హిమాలయాలను మైదాన ప్రాంతాల మాదిరిగా చూస్తూ అభివృద్ధి చేయడం ప్రమాదకరం. కొండను తొలిచి రోడ్డు వేస్తాం. తవ్విన మట్టి, రాళ్లను పక్కనే వేస్తాం. నదీ తీరంలో హోటల్ కడతాం. పార్కింగ్ కోసం నదినే పూడ్చివేస్తాం. వాగులపై నిర్మాణాలు చేపడతాం. సహజ డ్రైనేజీలను మూసేస్తాం. ఆ తర్వాత భారీ వర్షం వస్తే మాత్రం దాన్ని ‘అనూహ్య ప్రకృతి విపత్తు’గా పేర్కొంటాం. ప్రకృతి అనూహ్యంగా ప్రవర్తించిందా? లేక ప్రకృతి హెచ్చరికలను మనమే పట్టించుకోలేదా?హిమాలయంలో రహదారి నిర్మాణం అంటే కేవలం కొండను తవ్వడం కాదు. కొండ స్థిరత్వం, నీటి సహజ ప్రవాహం, వర్షపు నీటి డ్రైనేజీ, దిగువ ప్రాంతాల భద్రత అన్నింటిపైనా ప్రభావంఉంటుంది. అందుకే ‘ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మించాం?’ అన్నదే కాకుండా ‘ఎంత భూభాగం అస్థిరమైంది?’ అని కూడా ప్రశ్నించాలి. రోడ్డు ‘ఆల్ వెదర్’ కావచ్చు... హిమాలయం మాత్రం ‘ఆల్ వెదర్’ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.కేదార్నాథ్ నుంచి జోషిమఠ్ వరకు...2013 కేదార్నాథ్ విషాదం హిమాలయాల సున్నితత్వాన్ని దేశా నికి స్పష్టంగా చూపించింది. నదీ లోయలు, వరద మైదానాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో నిర్మాణాలపై హెచ్చరికలు వచ్చాయి. 2023లో జోషిమఠ్ భూమి కుంగుబాటు మరోసారి హెచ్చరించింది.హిమాలయాల్లో మరో పెద్ద సమస్య నదీ తీరాలు, వరద మైదానాల్లో పెరుగుతున్న నిర్మాణాలు. సహజ నదీ ప్రవాహప్రాంతం క్రమంగా కుంచించుకు పోతోంది. సాధారణ రోజుల్లో నది ప్రశాంతంగా ఉంటుంది. కానీ అసాధారణ వర్షం వచ్చినప్పుడు దాని పాత ప్రవాహ మార్గాలు తిరిగి జీవం పొందుతాయి. నది తన దారిని తిరిగి వెతుక్కుంటుంది. అందుకే నదీ గర్భం, వరద మైదా నాల్లో నిర్మాణాలకు కఠినమైన జోనింగ్ నిబంధనలు అవసరం.హిమాలయాలను రక్షించాలంటే అభివృద్ధిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అభివృద్ధి విధానాన్ని మార్చాలి. ప్రతి ప్రధాన తీర్థ, పర్యాటక ప్రాంతానికి శాస్త్రీయ క్యారీయింగ్ కెపాసిటీని నిర్ణయించాలి. నదుల వెంట, సహజ డ్రైనేజీలలో నిర్మాణాలను కఠినంగా నియంత్రించాలి. భారీ రోడ్డు, టన్నెల్, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యా వరణ ముప్పు మదింపును తప్పనిసరి చేయాలి. కొండ తవ్వకాల వ్యర్థం నదుల్లోకి చేరకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలి. స్థానిక ప్రజల అనుభవం, సంప్రదాయ జ్ఞానాన్ని విపత్తు నిర్వహణలో భాగం చేయాలి.హిమాలయాలను జయించలేం, గౌరవించాలి. ఎంత పెద్ద రోడ్డు వేసినా, ఎన్ని టన్నెళ్లు తవ్వినా, ఎన్ని హోటళ్లు కట్టినా, ఒక విరిగిన భారీ కొండచరియ ముందు మనిషి ఎంత చిన్నవాడోప్రకృతి నిరూపిస్తూనే ఉంటుంది. హిమాలయాలను మన అవసరా లకు తగ్గట్టు మార్చడం కాదు. మన అవసరాలను హిమాలయాల పరిమితులకు తగ్గట్టు మార్చుకోవాలి. అదే నిజమైన అభివృద్ధి.– శ్రీకాంత్ బందు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
నేపాల్‌లో ఆగని మృత్యుఘోష
కఠ్మాండు/బీజింగ్: సుందర హిమాలయ దేశం నేపాల్‌లో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఆకస్మిక వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 579కు చేరింది. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. భోటెకోశి నదీ ప్రాంతంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం ఆకస్మిక వరద సంభవించిన చోటే బురదతో కూడిన నీటి మట్టం పెరిగిందని, ఇక్కడ మళ్లీ వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భోటెకోశి, త్రిశూలి ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం ఎదురైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రసువా, సెంట్రల్ నేపాల్‌లోని ఇతర ప్రాంతాలను బుధవారం ముంచెత్తిన భారీ ఆకస్మిక వరదల కారణంగా వందల మంది మరణించడంతో పాటు భారీగా నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 579 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరావడం లేదు. నవల్పరాసి ఈస్ట్‌లో 154, చిత్వాన్‌లో 233, గోర్ఖాలో 46, నువాకోట్‌లో 37 మృతదేహాలను వెలికితీశారు. అలాగే ధాడింగ్‌లో 40, తానాహులో 30, నవల్పరాసి వెస్ట్‌లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు. టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని గిరోంగ్ కౌంటీలో ఐదుగురు మరణించారు. వరదలు సంభవించినప్పటి నుంచి 86 మంది భద్రతా సిబ్బంది, 517 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది నేపాలీ ప్రయాణికులతో సహా కనీసం 1,924 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు వివిధ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,451 మందిని రక్షించారు. వీరిలో 85 మంది భారతీయులతో సహా మొత్తం 129 మంది విదేశీయులు, అలాగే వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 191 మంది ఉన్నారు. గాయపడిన 101 మంది రాజధాని కఠ్మాండులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఆసుపత్రుల్లో వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించాం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 85 మంది భారతీయులు, 9 మంది దక్షిణ కొరియన్లు, 16 మంది చైనా పౌరులతో సహా మొత్తం 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్లు నేపాల్ పర్యాటక బోర్డు ప్రకటించింది. గాలింపు, సహాయక చర్యలు మూడో రోజు మరింత ముమ్మరంగా కొనసాగాయని, ఇందులో 2,391 మంది నేపాల్ సైనిక సిబ్బందితో సహా మొత్తం 7,451 మంది భద్రతా సిబ్బంది భాగస్వాములయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగించగా, భూతల బృందాలు నదీ తీరాల్లో, దిగువన ఉన్న నివాస ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగినంత స్థలం లేకపోవడం సమస్యగా మారింది. విపత్తు సహాయ నిధికి తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా, ఆయన మంత్రివర్గ సభ్యులు నిర్ణయించారు. ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన పౌరులు, వ్యాపార సంస్థల కోసం సహాయం, రాయితీతో కూడిన పునరావాస ప్యాకేజీని రూపొందించాలని మంత్రివర్గం ఆర్థిక శాఖను ఆదేశించింది. గిరోంగ్ కౌంటీ నుంచి వెయ్యి మంది తరలింపు టిబెట్–నేపాల్ సరిహద్దు సమీపంలోని గిరోంగ్ కౌంటీ నుంచి 555 మంది పర్యాటకులతో సహా 1,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం అక్కడ పర్యాటకులెవరూ లేరని చెప్పారు. చైనా వైపున ఉన్న ఓడరేవుకు వెళ్లే రహదారులు ఆకస్మిక వరదల వల్ల తెగిపోయాయి. దీనివల్ల సమాచార వ్యవస్థలు, విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. మరో 10 టన్నుల సహాయక సామగ్రి వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మూడో విడత కింద 10 టన్నుల సహాయక సామగ్రిని, 11 మంది సభ్యులతో కూడిన వైద్యులు, పారామెడిక్స్ బృందాన్ని, అలాగే సొరంగంలో సహాయక చర్యలను అంచనా వేసే బృందాన్ని భారత్ శుక్రవారం పంపించింది. ఇందులో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక, రక్షణ చర్యలకు భారత్ మద్దతును కొనసాగిస్తోందని పేర్కొన్నారు. బుధవారం 10 టన్నుల మానవతా సహాయం, విపత్తు సహాయక సామగ్రిని, గురువారం మరో 37.5 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు భారత్ పంపింది. నేపాల్‌కు అన్ని విధాలా సహాయం అందిస్తామని భారత ప్రధాని మోదీ ఇప్పటికే భరోసా ఇచ్చారు. 320 మంది భారతీయులు మిస్సింగ్ నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా కనీసం 320 మంది భారతీయులు గల్లంతయ్యారని, మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారని, వారంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్ సాధ్యమైనంత సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్‌కు చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 21 మంది తమిళనాడు వాసులను ఢిల్లీకి చేర్చినట్లు చెప్పారు. వీరికి ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వాగతం పలికారు. ఈ 21 మంది కైలాస మానసరోవర్ యాత్ర వెళ్లి వరదల్లో చిక్కుకోగా నేపాల్ సైన్యం రక్షించింది. ఎస్.జైశంకర్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నేపాల్‌లో గల్లంతైన భారతీయుల ఆచూకీ సాధ్యమైనంత త్వరగా గుర్తించాలని ఆదేశించారు. -
63 మంది భారతీయులను రక్షించిన నేపాల్ సైన్యం
-
Viral Video: బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న నేపాల్ ప్రజలు.. భయానక దృశ్యాలు
-
నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని లాగి.. చెవిదుద్దులు చోరీ
కాఠ్మాండు: చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వేళ బాధితులకు సాయం చేయాల్సిందిపోయి చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.వరదలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకునిలాగిన ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిదుద్దులను తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి. నేపాల్ పోలీసులు ఆ 41 సెకన్ల వీడియోను తమ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు చెక్క పలకలు, మహిళ జుట్టు ఉపయోగించి నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు లాగడం కనిపించింది. తర్వాత ఆమె రెండు చెవుల నుంచి చెవిదుద్దులను తీసి పక్కన పెట్టారు. ఈ ఘటన జరుగుతుండగా పలువురు చుట్టూ నిలబడి వీడియోలు చిత్రీకరించారు.తర్వాత చిత్వన్ పోలీసులు దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన మృతదేహం భారీ వరద కారణంగా నారాయణి నదిలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వీడియో ఆధారంగా పోలీసులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీని గుర్తించారు. నేపాల్ మీడియా సంస్థ ఖబర్‌హబ్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భరత్పూర్ మహానగరపాలక సంస్థ-1లోని పోఖరా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడటం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరుకాగా, నేపాల్‌లో గత కొన్నేళ్లలో సంభవించిన అత్యంత ప్రాణాంతక వరద విపత్తుల్లో ఈ ఘటన ఒకటి. నేపాల్-టిబెట్ సరిహద్దును ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కొన్ని వందల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సరిహద్దు మార్గానికి వెళ్లే రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపనలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని కూడా అది తెలిపింది.मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026 -
నేపాల్ జల ప్రళయం.. గల్లంతైనవారి జాబితా విడుదల
నేపాల్ వరదల్లో గల్లంతైనవారి జాబితా విడుదలైంది. 33 దేశాల పర్యాటకులు గల్లంతయ్యారు. విదేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా-65, ఉక్రెయిన్-53, మలేషియా-51, ఆస్ట్రేలియా-35, బ్రిటన్-33, కెనడా-25, సింగపూర్‌కు చెందిన 9 మంది గల్లంతయ్యారు.నేపాల్ జల విలయంలో మృతుల సంఖ్య 550 దాటింది. 1000 మందికిపైగా గల్లంతవ్వగా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 85 మంది భారతీయులు సహా 117 మంది పర్యాటకులను నేపాల్ ఆర్మీ రక్షించింది.ఉత్తరప్రదేశ్‌లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్‌ను దాటాక వరద ప్రవాహం భారత్‌లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్‌లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్‌కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారుఇదీ చదవండి: నేపాల్‌లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పుకాగా, మానస సరోవరం యాత్ర నుంచి విశాఖ వాసులు క్షేమంగా తిరిగొచ్చారు. విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు 10 మంది పర్యాటకులు వెళ్లారు. ఆగస్టు 11వ తేదీన విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లారు. 23వ తేదీన తిమోర్ చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్‌కు యాత్రికులు వెళ్లగా.. 26న వరద బీభత్సంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్ కొట్టుకుపోయింది. వరద ప్రమాదానికి ఒకరోజు ముందే ఖాట్మండు ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నం పర్యాటకులు ఢిల్లీ చేరుకున్నారు. ఇతర బృందాల్లో పలువురు వరదల్లో గల్లంతయ్యారు. ఇషా ఫౌండేషన్‌కు చెందిన కొందరు బృందం సైతం గల్లంతయ్యారు. -
ప్రళయం తర్వాత నేపాల్ ఎలా ఉందంటే..
-
బాలసుబ్రహ్మణ్యం సురక్షితమేనా? ఇంకా దొరకని ఆచూకీ
-
మా కారు ముందే కొండచరియలు విరిగిపడ్డాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సంచలన నిజాలు
-
సరస్సు బ్లాస్ట్ నేపాల్ కు మరో ముప్పు
-
సాక్షి కార్టూన్: 28-08-2026
సాక్షి కార్టూన్: 28-08-2026 -
LIVE: నేపాల్ లో హైఅలర్ట్ దూసుకొస్తున్న మరో మహా ప్రళయం
-
చైనా-నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. దూసుకొస్తున్న మహా ప్రళయం
-
Nepal: దూసుకొస్తున్న మరో భారీ జల ప్రళయం
-
చైనా చాలా డేంజర్..బయటపడ్డ సంచలన విషయాలు
-
చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్
బీజింగ్: వరుస ప్రకృతి విలయాలు ఆసియా దేశాలను వణికిస్తున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో జలవిలయం మరువక ముందే.. చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో చైనా నేపాల్‌ను అప్రమత్తం చేసింది. నేపాల్-టిబెట్ సరిహద్దులో మరో భారీ వరద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. తాజా పరిణామం మరింత వణుకు పుట్టిస్తోంది.సిచువాన్ ప్రావిన్స్ లాంగ్చాంగ్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ (CENC) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. లాంగ్చాంగ్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.గత రాత్రి నేపాల్, టిబెట్లు కూడా భూకంపంతో వణికిపోయాయి. ఆకస్మిక వరదల తర్వాత మరోసారి ఏ ముప్పు ముంచుకొస్తుందేమోనని వణికిపోయిన ప్రజలు రాత్రంతా నడి రోడ్లపైనే గడిపారు. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం గ్లేసియర్ కూలిపోవడంతోనే సిచువాన్ ప్రావిన్స్ భూకంపం సంభవించిందని.. బారియర్ సర్సు తెగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటు భూకంపం నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఏ క్షణంలోనైనా వరద విరుచుకుపడొచ్చని నేపాల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఇక టిబెట్ సరిహద్దులో వరద సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిచింది. మరో వరద ముంచుకొస్తున్న నేపథ్యంలోనే రెస్క్యూ నిలిపివేసినట్లు వెల్లడించింది. గైరాంగ్ పోర్ట్ వద్ద వరద ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మరో జల ప్రళయం ముప్పు నేపథ్యంలో నేపాల్ కూడా అప్రమత్తమైంది. రుసువా, నువాకోట్‌లకు తీవ్ర ముప్పు పొంచి ఉండడంతో.. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికాసేపట్లో భారీ వరద దూసుకొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మొన్నటి వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద ముంచెత్తుతుందన్న పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోతున్నారు.ఇదీ చదవండి: యుగాంతాన్ని తలపించేలా నేపాల్‌కు మరో ముప్పు! -
నేపాల్‌లో రెడ్ అలర్ట్.. మరో భారీ జల ప్రళయం ముప్పు
మరో వరద ముప్పు పొంచి ఉండడంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. కాసేపట్లో.. మొన్న సంభవించిన ఆకస్మిక వరద కంటే ఐదు రెట్ల తీవ్రతతో ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో ఆ వరద నేపాల్‌ను ముంచెత్తబోతుందనే సమాచారం అందుతోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ప్రాణభయంతో నదీ తీర ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. నేపాల్‌కు మరో భారీ జల ప్రళయ ముప్పు పొంచి ఉంది. గ్లేసియర్లు బద్ధలు కావడం.. చైనా సరిహద్దులో బారియర్ సరస్సు తెగిపోవడంతో వరద ఉధృతంగా దూసుకొస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలను నిలిపివేసిన అధికారులు.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని చెబుతున్నారు. ఇటు వరద ముప్పు నేపథ్యంలో ఇటు చైనా కూడా టిబెట్‌లో సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. గైరాంగ్ పోర్టు వద్ద ప్రవాహాన్ని అధికారులు గమనిస్తున్నారు.టిబెట్‌లోని గైరాంగ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోవడంతో నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నేపాల్ భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. దీంతో గంటన్నర పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. టిబెట్‌లోనూ వరద ప్రమాదం కారణంగా చైనా రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసి, సిబ్బందిని కిలోమీటరు మేర వెనక్కి రప్పించింది. రెండు రోజుల క్రితం మట్టి, శిథిలాల ప్రవాహంతో ఏర్పడిన ఈ బారియర్ సరస్సు పొంగిపొర్లుతుండటంతో మరిన్ని వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.ఏ క్షణమైనా నేపాల్‌ను వరదలు ముంచెత్తనున్నాయని పోలీసుల హెచ్చరికలతో నేపాల్ ప్రజలు పరుగులు తీస్తున్నారు. క్షణక్షణానికి పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. బారియర్ సరస్సు వరద విరుచుకుపడితే.. రుసువా, నువాకోట్‌కు తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.Alert !! pic.twitter.com/grYxhc5N7Q— Nepal Police (@NepalPoliceHQ) August 28, 2026బిహార్ సరిహద్దు గ్రామాల్లో హైఅలర్ట్నేపాల్ వరద హెచ్చరికల నేపథ్యంలో ఇటు సరిహద్దు గ్రామాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. భారత్‌లోని బిహార్‌లో గండకీ నది బ్యారేజ్‌కు వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్-బిహార్ బోర్డర్లో గ్రామాలను స్థానికులు ఖాళీ చేస్తున్నారు. అక్కడ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఇదీ చదవండి: చైనాలో భారీ భూకంపం.. నేపాల్‌లో హైఅలర్ట్బుధవారం ఉదయం ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడడంతో నేపాల్ అతలాకుతలం అయ్యింది. ఇప్పటిదాకా 500 మృతదేహాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సుమారు 1500 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. ఈసారి ఐదు రెట్ల వరద వస్తుందన్న హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
జుట్టు పట్టుకుని లాగి.. చెవిపోగులు చోరీ!
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె చెవులకు ఉన్న బంగారు పోగులను చోరీ చేశారు. దీనికి సంబంధించిన 41 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. నరాయణి నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహాన్ని 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరి గుర్తించారు. చెక్క దుంగల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు లాగిన వారు.. జుట్టు పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె రెండు చెవులకు ఉన్న పోగులను తొలగించి పక్కన పెట్టుకున్నారు. చుట్టూ ఉన్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు.ఈ వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన చిత్వాన్ పోలీసులు నిందితులను గుర్తించారు. గురువారం భరత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని పోఖరా బస్పార్క్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల దోపిడీకి పాల్పడటం, అమానవీయంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దులో వరదలు, కొండచరియలు బీభత్సం తీవ్ర విషాదం మిగిల్చాయి . ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 500 మంది మృతి చెందగా.. 1,400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. భారీ బురద, కొండచరియల కారణంగా పలు గ్రామాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్-కిమ్ భేటీ ఇప్పుడు ఎంతో అవసరం! -
నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు
-
నేపాల్-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
వరదలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని మరో ప్రకృతి ముప్పు వణికించింది. రెండు చోట్లా గురువారం రాత్రి భూకంపం సంభవించింది. నేపాల్‌లో రిక్టర్‌స్కేల్‌పై 3.2 తీవ్రతతో.. టిబెట్‌లో 5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో నమోదు అయ్యింది. అదే సమయంలో బారియర్ సరస్సు కట్టలు తెంచుకుని విరుచుకుపడొచ్చని చైనా హెచ్చరికలు నేపాల్‌ను మరింత వణికిస్తున్నాయి.నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ప్రకృతి విలయంలో ప్రాణనష్టం 500కి చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నేపాల్, టిబెట్ రెండు చోట్లా కలిపి 1500 మంది గల్లంతయ్యారు. ఇందులో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉండగా.. అత్యధికంగా భారతీయులే 300 మంది ఉన్నట్లు సమాచారం. వాళ్లలో అత్యధికంగా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. టెలికాం వ్యవస్థలు నాశనం కావడంతో చాలామంది జాడ తెలియక ఆందోళన నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. తెగిపోయిన రహదారులు, కొట్టుకుపోయిన వంతెనలు, భారీగా పేరుకుపోయిన బురద, శిథిలాల కారణంగా సహాయక బృందాలకు బాధిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. తాజా విషాదానికి కారణం భూకంపం కాదని.. హిమనదం కూలిపోవడంతో భారీ మంచు–రాళ్ల ప్రవాహం ఏర్పడి ఆకస్మిక వరదలకు(ప్లాష్ఫ్లడ్స్) దారితీసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తేల్చిచెప్పింది. మరో వరద ముప్పునేపాల్ ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్తగా ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకరంగా మారింది. భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో ఏర్పడిన ఈ సరస్సులో నీటి మట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు. సహజంగా ఏర్పడిన అడ్డంకి తెగిపోతే భారీగా నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లే ప్రమాదం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో భోటే కోషి, త్రిశూలీ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి.భారతీయుల ఆచూకీ లేదుఈ విపత్తుతో భారత్‌లోనూ ఆందోళన నెలకొంది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 30 మంది ఉన్నారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు భారతీయుల్లో 84 మందిని రక్షించినట్లు సమాచారం. మరోవైపు టిబెట్ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు సమాచారం. వీరిలో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు. విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు.ఎటు చూసినా బురద.. వరదల ధాటికి సెకన్ల వ్యవధిలో రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, టెలికాం వ్యవస్థలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులకూ భారీ నష్టం వాటిల్లింది. నేపాల్ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాలతో గాలింపు చేపడుతున్నాయి. నదీ తీరాలు, బురదలో కూరుకుపోయిన ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.తొలుత ఈ విపత్తుకు భూకంపమే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమైనా.. తాజా భౌగోళిక విశ్లేషణలు మరో విషయాన్ని వెల్లడించాయి. హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి కిందికి జారిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, మట్టి, శిథిలాలు దిగువకు దూసుకెళ్లి ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉండటంతో విపత్తు ఇంకా ముగియలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. This is apocalyptic 👀What really caused these Nepal floods? Could it have been prevented from happening? pic.twitter.com/UPPDcutom5— Dr. Chika (@chikaehiemere) August 27, 2026ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కళ్ల ముందే సర్వనాశనం! -
కళ్లముందే సర్వనాశనం
కఠ్మాండు: కళ్ల ముందే కుటుంబం మొత్తాన్నీ వరదనీరు కబళించిన దృశ్యాలు ఇంకా తన కళ్లలో అలాగే నిలిచిపోయాయని కంటతడి పెడుతూ 38 ఏళ్ల గిరిలాల్ చెప్పారు. ఆప్తులు, కుటుంబసభ్యులు, ఇల్లు కోల్పోయి ఏకాకిలా మిగిలిన ఎంతో మంది ఇంకా ఆ భయానక ఘటనలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కార్యాలయంలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసే గిరి లాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాసువా జిల్లాలోని సరిహద్దు పట్టణం తిమూర్‌లో గిరిలాల్ కుటుంబం ఉంటోంది. మెరుపు వరదల్లో గిరిలాల్ భార్య, నలుగురు సంతానం కొట్టుకుపోయారు. ‘‘కళ్లముందే జీవితం చెదిరిపోయింది. కాళ్ల కింద భూకంపం వచ్చినట్లయింది. నా వాళ్లంతా పోయారు’’అని గిరి గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ఉదయం 8.40 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. హఠాత్తుగా దిగువన ఉన్న దుకాణ సముదాయాన్ని అమాంతం ముంచేస్తూ వరదనీరు, బురద, మట్టి కొట్టుకొచ్చాయి. మా కళ్ల ముందే అంతా వరదనీటిలో కలిసిపోయాయి’’అని మరో ప్రత్యక్షసాక్షి చెప్పారు. ‘‘నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలు విని్పంచాయి. అవేంటో అర్థంచేసుకునేలోపే భీకరంగా వరదనీరు విరుచుకుపడింది. పారిపోయేలోపే దిగువన ఉన్న జనాన్ని మింగేస్తూ వరదనీరు పోటెత్తి అందర్నీ తనలో కలిపేసుకుంది. క్షణాల్లో రోడ్డు, ఇళ్లు మటుమాయమై అంతటా భారీస్థాయిలో బురద పరుచుకుంది’’అని మరో ప్రత్యక్షసాక్షి వివరించారు. ‘‘భోటె కోశి నది సమీప డ్యామ్ కూలిపోయి నీరంతా దిగువకు కొట్టుకొస్తోందని ఎగువకు పారిపొండి అని అధికారులు చెప్పారు. అర్థం చేసుకుని అంతా పారిపోయేలోపే నీరు ముంచెత్తింది. నా 18 ఏళ్ల కుమారుడు, భార్య సైతం కని్పంచకుండా పోయారు’’అని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పారిపోయే సమయం కూడా ఇవ్వకుండా వరదనీరు సర్వనాశనం చేసిందని నువాకోట్‌లోని త్రిశూలి మార్కెట్లో వస్త్రదుకాణ వ్యాపారి వాపోయాడు. ‘‘తిమూర్ బజార్‌పై ఏకంగా 100 మీటర్ల ఎత్తులో వరద అలలుగా వచ్చినట్లుంది. అందుకే తిమూర్ బజార్ రెప్పపాటులో కన్పించకుండా పోయింది’’అని రాసువాలో చీఫ్ కస్టమ్స్ అధికారి, ప్రత్యక్ష సాక్షి రాజేంద్ర ధుంగానా చెప్పారు. కస్టమ్స్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న 300 వాహనాలు, ట్రక్కులు వరదలో కొట్టుకుపోయాయని మరో వ్యక్తి తెలిపారు. -
నేపాల్‌లో వరద బీభత్సం 25 మంది తెలుగువారు మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: నేపాల్‌లో భారీ వరదల కారణంగా 25 మంది తెలుగు రాష్ట్రాల యాత్రికుల ఆచూకీ తెలియక పోవడంపై ఆందోళన నెలకొంది. అక్కడ చిక్కుకుపోయిన మిగతా వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేశాయి. ఢిల్లీలోని సంబంధిత రాష్ట్రాల భవన్ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న వారి యోగక్షేమాలను వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నిరంతరం నేపాల్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర ప్రజల వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక నంబర్లు 011–23384016, 011–23387089తోపాటు వాట్సాప్–9059824101ను అందుబాటులో ఉంచారు. నేపాల్, చైనా సరిహద్దుల్లో బుధవారం సంభవించిన వరదల కారణంగా చిక్కుకుపోయిన ఏపీ యాత్రికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్ఆర్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సహా హైదరాబాద్‌లోని సచివాలయంలో హెల్ప్‌లైన్ ప్రారంభించిన నాటి నుంచి కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి సమాచారం, సహాయం కోరుతూ సుమారు 80 నుంచి 100 కాల్స్ అందాయి. 22 మంది ఆచూకీ కోసం అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగుతోందని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. బాధితులకు తక్షణ సాయం అందించండి: వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి నేపాల్ విపత్తుకు ప్రభావితమైన ఏపీకి చెందిన వారికి తక్షణ సాయం అందించడంతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం విదేశాంగ మంత్రితో పాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాశారు. ఏపీకి చెందిన పలువురు గాయపడ్డారని, కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణ వైద్యసాయం అందించడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.ఏపీకి చెందిన నలుగురు సురక్షితంఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు యాత్రికుల సమాచారం హెల్ప్‌లైన్‌కు అందింది. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్‌శాస్త్రి సహా నలుగురు కైలాస మానస సరోవర్ యాత్రికులు క్షేమంగా ఉన్నప్పటికీ వరద తీవ్రత వల్ల అక్కడ చిక్కుకుపోయారు. కుప్పానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ (ఎస్–త్రీ) సభ్యులైన శశికుమార్, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ జాడ ఇంకా దొరకలేదని, వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ భవన్ అధికారులు పేర్కొన్నారు.కృష్ణా జిల్లాకు చెందిన చొప్పరపు రమేష్ బాబు, అట్లూరి శశి, నిమ్మగడ్డ రాజ్యక్ష్మితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, ప్రకాశం జిల్లాకు చెందిన కందిమళ్ల సుహాసినిరెడ్డి, వెన్నెలగంటి బాలసుబ్రహ్మణ్యం వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, నేపాల్ వరదల్లో చిక్కుకున్న డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు క్షేమంగా ఉన్నట్లు మీడియాకు తెలిపారు. కర్నూలుకు చెందిన డాక్టర్ కె.నవంతిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఈమె ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్, యూరాలజిస్టు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సతీమణి. మూడు రోజుల కిందట ఈషా ఫౌండేషన్ తరఫున మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఏపీకి చెందిన 41 మంది నేపాల్‌లో చిక్కుకున్నారు నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన 41 మంది చిక్కుకున్నారని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉండగా.. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందని (సాయంత్రానికి వీరిలో నలుగురి ఆచూకీ తెలిసింది) సీఎం చంద్రబాబు తెలిపారు. నేపాల్‌లో భారీ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసుల పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మానస సరోవర్ యాత్ర వెళ్లిన ఏపీ యాత్రీకులు యోగక్షేమాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్‌లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు. తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండులో సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. నేపాల్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. కానరాని 83 మంది తమిళుల జాడ సాక్షి, చెన్నై: నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 103 మంది ఉన్నారు. వీరిలో 20మంది సమాచారం మాత్రమే తెలిసింది. మిగిలిన 83 మంది వివరాలు లభించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. వారి జాడ కోసం అన్వేషణ మొదలెట్టారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భక్తుల విషయమై మంత్రులు, అధికారులతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆశిష్ కుమార్ నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల బృందాన్ని నేపాల్‌కు పంపించారు. తమిళనాడు మంత్రులు ఆదవ్ అర్జున, రాజ్‌మోహన్, తెన్నరసు, వినోద్, విదేశీ తమిళుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సతీష్ లను ఢిల్లీకి పంపించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయించేందుకు, రక్షణ చర్యలు పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. నేపాల్ వెళ్లిన ఈషా గ్రూపునకు చెందిన 80 మంది సభ్యులు అదృశ్యమయ్యారని సద్గురు జగ్గీ వాసుదేవ్ కన్నీటి పర్యంతమయ్యారు. టిబెట్ నుండి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఈ విషాదకర ఘటన వివరాలను ఆయన పంచుకున్నారు. ప్రభావిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించడానికి తాను ఉదయాన్నే బయలుదేరడానికి ప్రయత్నించినప్పటికీ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో అక్కడికి చేరుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. -
వాతావరణ మార్పుల ప్రభావమే!
→ జూన్, 2013... కేదార్నాథ్ క్లౌడ్‌బరస్ట్. ఆరువేల మంది మృతి → ఫిబ్రవరి 2021... రిషిగంగ నందాదేవీ వద్ద మంచు అవపాతం... 200 మంది మరణం. రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు ధ్వంసం. → ఆగస్టు 2025... ఉత్తరకాశీలోని ధరాలి వద్ద ఖీర్ గంగాపై క్లౌడ్‌బరస్ట్... మెరుపు వరదలతో నలుగురి మరణం. యాభైమంది గల్లంతు. → తాజాగా... నేపాల్‌లో హిమనదం కుప్పకూలి మెరుపు వరదలు.. → వందలాది మంది మృతి.. ఆస్తినష్టం!హిమాలయ పర్వత ప్రాంతంలో సంభవించిన పై నాలుగు భారీ ప్రకృతి విపత్తులకు కారణం ఏమిటి? వాతావరణ మార్పులే అంటున్నారు హిమనీనదాల నిపుణుడైన మనీశ్ మెహతా. కేదార్నాథ్, రిషిగంగ, ధరాలి ప్రమాదాలపై దీర్ఘకాలం అధ్యయనం చేసిన ఈయన హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులను, ప్రమాద ఘటనలను వేర్వేరుగా చూడలేమని స్పష్టం చేస్తున్నారు. భూతాపోన్నతి ఫలితంగా ఈ ప్రాంతంలోని చాలా హిమనీనదాల కుంచించుకుపోతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనివల్ల ఒక ప్రమాదముంది. మంచు, నీటితో కూడిన ప్రాంతం తగ్గిపోవడం వల్ల అడుగున వదులుగా ఉండే మట్టి, రాళ్లు, శిథిలాలు అలాగే ఉండిపోతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో నేల స్థిరంగా ఉండదు. ఎప్పుడైనా ఆకస్మాత్తుగా భారీ వర్షాలు పడినా, పెద్ద మొత్తంలో మంచు కరిగినా ఈ మట్టి, రాళ్లు చాలా సులువుగా వాలు ఉన్నవైపు వెళ్లిపోతాయి. అతితక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురిస్తే వదులుగా ఉన్న మట్టి, రాతిప్రాంతం త్వరగా నీటితో నిండిపోయి అకస్మాత్తుగా కిందివైపుకు కదులుతాయని, ఇది కాస్తా కొండచెరియలు విరిగిపడేందుకు లేదా రాతి శిథిలాలు దొర్లేందుకు కారణమవుతాయని ఆయన వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎత్తైన పర్వతప్రాంతాల్లో గడ్డకట్టిన మంచు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాయని, దీనివల్ల అక్కడ తాత్కాలికంగా ఒక డ్యామ్ లాంటి నిర్మాణం ఏర్పడుతుందని చెప్పారు. ఈ తాత్కాలిక అడ్డుగోడ పగిలిపోతే అప్పటివరకూ అక్కడకు చేరిన నీరు, మంచు ఒక్కసారిగా చాలా వేగంగా దిగువ ప్రాంతాలవైపు ప్రయాణిస్తాయని తెలిపారు. కేదార్నాథ్సహా మిగిలిన చోట్ల వచ్చిన విపత్తుల్లోనూ నీటితోపాటు భారీ బండరాళ్లు కూడా దొర్లుకుంటూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీరు మాత్రమే ప్రవహిస్తే పుట్టే శక్తికంటే ఇలా రాళ్లతో కూడిన ప్రవాహపు శక్తి చాలా ఎక్కువని... మార్గమధ్యంలో ఉండే రహదారులు, వంతెనలు, భవనాలు ఏవీ తట్టుకోలేవని తెలిపారు. వాస్తవానికి హిమాలయ పర్వత ప్రాంతంలో కొండచెరియలు విరిగి పడటం కొత్తేమీ కాదని, కానీ వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి ఘటనలతో రాగల ప్రమాదాల గురించి పనరాలోచన చేయాల్సి ఉందని ఆయన హెచ్చరించారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలతోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడం గమనించదగ్గ మార్పని మెహతా చెబుతున్నారు. గతంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉండేదని, ఫలితంగా రాత్రిపూట మంచు కరిగే వేగం తగ్గేదని ఆయన వివరించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూండటంతో హిమనీనదాలు పగలు, రాత్రి కరుగుతున్నాయని వివరించారు. భూతాపోన్నతితోపాటు హిమనీ నదాలు కుంచించుకుపోవడం, వర్ష, హిమపాతాల్లో వచ్చిన తేడాలు, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, వదులు మట్టితో కూడిన హిమనీ నదీ గర్భాలు, లోతైన పర్వత సానువులు వంటిని అన్నీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మనీశ్ మెహతా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్ మూలాలున్న ఇద్దరు మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్/నాగోలు/మునుగోడు: నేపాల్ వరదల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన కందిమళ్ల మహేందర్‌రెడ్డి–ప్రేమలతా రెడ్డిల కూతురు సుహాసినిరెడ్డి (44) గల్లంతయ్యా రు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తికి చెందిన మహేందర్‌రెడ్డి పెద్ద కుమార్తె సుహాసినిరెడ్డిని మునుగోడు మండలం గుడాపూర్కు చెందిన నన్నూరి సంజీవరెడ్డికి ఇచ్చి 2004లో వివా హం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. ఉద్యోగరీత్యా న్యూజిలాండ్ వెళ్లి పౌరసత్వం పొందారు. సుహాసిని ప్రస్తుతం ఆ్రస్టేలియాలో పనిచేస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 23న మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఈమె వెంట వెళ్లాల్సిన హబ్సిగూడ డాక్టర్ శిరీష చివరి నిమిషంలో ఆగిపోయా రు. దీంతో ఆ్రస్టేలియాలో ఉండే స్నేహితురాలిని కలుపుకొని సుహాసిని టూర్‌కు వెళ్లారు. ఖాట్మండ్ నుంచి కళ్యాణ్ కైలాష్ జర్నీస్ టూర్స్–ట్రావెల్స్ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయల్దేరారు. చివరగా నేపాల్‌లోని «ధుంచే–స్యాబ్రుబెసి ప్రాంతంలో టిబెట్ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి సుహాసిని ఫోన్ కలవలేదు. తర్వాత వరదలు వచ్చాయని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ భవనం వద్ద ఆఖరిసారిగా... నాచారం నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన లక్ష్మీనాథ్ గోపిశెట్టి 8 మందితో కలిసి కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు ఆఖరిసారిగా కుటుంబ సభ్యులను సంప్రదించారు. ఆ సమయంలో నేపాల్‌లోని ‘రసువా కస్టమ్స్ ఆఫీస్’వద్ద ఉన్నారు. తర్వాత ఆకస్మిక వరదలతో ఆ కార్యాలయం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటినుంచి ఆయనతో సంబంధాలు తెగిపోయాయని ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీనాథ్ బంధువు డి.రామచంద్ర తెలిపారు. లక్ష్మీనాథ్ బృందం నేపాల్‌కు చెందిన క్లాసిక్ వెకేషన్స్ ఏజెన్సీ ద్వారా వెళ్లారని, ముంబైలోని ఆ సంస్థ బ్రాంచ్‌ను సంప్రదించగా నిర్వాహకులు తమ బాధ్యత లేదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా సంప్రదించారు. సురక్షితంగా ఉన్నాం: సతీశ్‌రెడ్డి నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డితో కూడిన బృందం గురువారం ఒక వీడియో సందేశంలో తెలిపింది. విపత్తు సంభవించే సమయానికి తామంతా అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన నలుగురు క్షేమంఆంధ్రప్రదేశ్కు చెందిన ఏడుగురు యాత్రి కుల సమాచారం హెల్ప్‌లైన్‌కు అందింది. అయితే.. వారిలో నలుగురు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
భారత్‌కు మెడోగ్ ముప్పు?
నేపాల్‌లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు... వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టమూ తీవ్రంగానే ఉంది. అయితే నేపాల్ కాదు కానీ... భారత్ ఇలాంటి మరో ముప్పు ముంగిట్లో ఉందా? అవునంటున్నారు నిపుణులు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఇందుకు కారణమంటున్నారు వారు. మెడోగ్ పవర్ స్టేషన్‌గా పిలుస్తున్న ఈ భారీ డ్యామ్‌ను 2033లోగా పూర్తి చేసేందుకు చైనా పరుగులు పెడుతోంది. యార్లుంగ్ సాంగ్పో నదిపై 16,700 కోట్ల డాలర్ల ఖర్చుతో అరవైవేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ యార్లుంగ్ సాంగ్పో నదే అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ నదిగా ఆ తరువాత అసోంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. మెడోగ్ పవర్‌స్టేషన్ నిర్మాణం ఒక రకంగా మన నెత్తిన వాటర్ బాంబు లాంటిది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండటం ఒక కారణమైతే... ఇది భూకంపాలు జరిగే ప్రాంతంలో కడుతూండటం ఇంకో కారణం. చైనా భూగర్భ శాస్త్రవేత్తలు నెల రోజుల క్రితమే ఇక్కడ ఒక అధ్యయనం జరిపి.. మెడోగ్ పవర్‌స్టేషన్ పైజెన్ ఫాల్ట్పైనే ఉందని తేల్చారు. చిన్నపాటి భూకంపం వచ్చినా దాని ప్రభావం దిగువన ఉన్న మనపై పడుతుంది. యార్లుంగ్ సాంగ్పోపై పెత్తనం చైనాదే కావడం... దిగువన మనం ఉండటం భారత్ ఆందోళనకు మరో కారణం. ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలలో ఏ చిన్న మార్పు వచ్చినా మనకు వరద ముప్పు తప్పదన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు నమోదైతే అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు అసోం, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశముంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల తగ్గి వ్యవసాయానికి సమస్యలొస్తాయి. అయితే... మెడోగ్ వపర్ స్టేషన్‌తో వచ్చే సమస్యలకు పరిష్కారంగా భారత్ సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ బహుళార్థక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాకపోతే ఇదొక్కటే త్రీగార్జెస్ డ్యామ్ కంటే పెద్దదైన మెడోగ్ బలాన్ని తట్టుకోగలదా అన్నది ప్రశ్న!!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేపాల్‌కు మరో వరద ప్రమాదం?
మెరుపు వరద విధ్వంసం నుంచి కోలుకోకముందే నేపాల్ మరో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భూటేకోషి నది ఎగువభాగంలోని హిమనీ నదం అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు, రాళ్లు, బురద దూసుకువచ్చి వందల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. అయితే అంతటితో గండం గడవలేదు. అదే రోజు చైనావైపున కూడా బురదమట్టి జారిపడింది. జిజాంగ్ ప్రాంతంలోని నేపాల్ సరిహద్దు వద్ద కొన్ని అడుగుల ఎత్తులో బురద మట్టి చేరిందని చైనాకు చెందిన సీసీటీవీ తెలిపింది. చైనా వైపు జరిగిన ప్రమాదం ఫలితంగా చోచెన్ ఖోలా, పెరుపు త్సాంగ్పో నదులు కలిసే చోట ఒక తాత్కాలిక సరస్సు ఏర్పడిందని చైనా జల వనరుల శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఆ సరస్సులో సుమారు 20 లక్షల ఘనపు మీటర్ల నీరు నిల్వ ఉంది. పొంగి ప్రవహిస్తోంది కూడా. రానున్న మూడు రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 లక్షల ఘనపు మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశముందని తెలుస్తోంది. ఒక క్యూబిక్ మీటర్ నీరు వెయ్యి లీటర్లకు సమానం. అంటే ఇప్పటికే అక్కడ రెండు వేల కోట్ల లీటర్ల నీరు ఉంటే.. ఇంకో మూడు రోజుల్లో మరో మూడు వేల కోట్ల లీటర్ల నీళ్లు వచ్చి చేరనున్నాయి. ఇంత భారీ మొత్తం నీటిని జారిపడ్డ బురదమట్టి ఎంత సేపు పట్టి ఉంచుకోగలదన్నది ప్రశ్న. కట్ట తెగితే నేపాల్ మరో బురద వరదలో మునగడం తప్పదనిపిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతులేని విషాదం.. 392 దాటిన మరణాలు
కఠ్మాండు/న్యూఢిల్లీ/బీజింగ్: హిమాలయాల దేశం నేపాల్‌లో మెరుపు వేగంతో దూసుకొచ్చిన భారీ వరద, బురద నీటితో జలసమాధి అయిన అమాయకుల సంఖ్య అమాంతం పెరిగింది. లెండే నది, భోటెకోశీ నదీ పరీవాహక ప్రాంతాలను అమాంతం ముంచేస్తూ దిగువ గ్రామాలు, పట్టణాలను మరుభూములుగా మార్చేస్తూ కొనసాగిన జలవిధ్వంసంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 392 దాటింది. ప్రకృతి అందాలను చూసేందుకు దేశవిదేశాల నుంచి వచ్చిన దాదాపు 1,500 మంది పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. వీరిలో 290 మంది భారతీయులు సైతం ఉన్నారు. ఎటుచూసినా ఐదు అడుగుల ఎత్తులో మేటవేసిన బురదలో ఇల్లు, రోడ్డు నామరూపాల్లేకుండా పోయాయి. డజను జలవిద్యుత్ కేంద్రాలు పూర్తిగా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఉగ్రరూపం దాల్చిన నది కాస్తంత ఉపశమించడంతో ప్రవాహంలో మరికొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో తమ వారిని విగతజీవులుగా చూసిన ఆప్తులు, బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించడంతో ఆ ప్రాంతంలో శ్మశాన వాతావరణం అలుముకుంది. వేలాదిగా చెట్లు కూలాయి. పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వంతెనలు కాగితం పడవల్లా వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మరోవైపు కాలంతో పోటీపడుతూ నేపాల్ సైనికులు, పోలీసులు, వలంటీర్లు, స్థానికులు యుద్ధ ప్రాతిపదికన అన్వేషణ, సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. శిథిలాల కుప్పలుగా మారిన దుకాణసముదాయాలు, ఇళ్ల నుంచి మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగిస్తున్నారు. జలం కంటే రెండింతలు శక్తివంతమైన ద్రవరూప సిమెంట్ తరహాలో భీకర వరద అలలు పోటెత్తడంతో విధ్వంసం ఊహించనంతగా జరిగిందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. వంతెనలు, రహదారులు నాశనంకావడంతో భూతల మార్గంలో రెస్క్యూ ఆపరేషన్లు క్లిష్టంగా మారాయి. దీంతో గత్యంతరంలేక హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపడుతున్నారు. బాధితుల జాడ కోసం డ్రోన్ల దండును రంగంలోకి దింపారు. 800 మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గల్లంతైన తమ వారి జాడ కోసం ఆప్తులు ఆస్పత్రుల వద్ద కళ్లు కాయలు కాచేలా వెతుకుతున్నారు. రక్షించే పనిలో మోదీ సర్కార్ టిబెట్‌లోని మానససరోవర్తోపాటు ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్ర యాత్రల కోసం నేపాల్‌కు విచ్చేసిన వందలాది మంది భారతీయులను రక్షించి ఎలాగైనా స్వదేశానికి తరలించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. నేపాల్ ఆర్మీకి తోడుగా భారత్‌నుంచి జాతీయ విపత్తుస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) బృందాలను పంపిస్తోంది. నేపాల్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం, టూర్ ఆపరేటర్లతో కాఠ్మాండులోని భారత ఎంబసీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, గల్లంతైన వారి జాడ కోసం అహరి్నశలు శ్రమిస్తోంది. గురువారం నాటికి త్రిశూలి–1 జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 84 మంది భారతీయులను కాపాడినట్లు భారతవిదేశాంగశాఖ తెలిపింది. తమిళనాడుకు చెందిన 21 మందిని సైతం రక్షించారు. రసువాలో 11 మంది భారతీయులు సహా 27 మంది విదేశీ పర్యాటకులును గురువారం కాపాడారు. గాయపడిన విదేశీయులను ఆర్మీ సాయంతో కఠ్మాండుకు హెలికాప్టర్లలో తరలించి ఆస్పత్రుల్లో చేరి్పంచారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన యాత్రికులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. టిబె ట్లో చిక్కుకుపోయిన 200 మంది భారతీయులను తీసుకొస్తామని ఆయ హామీ ఇచ్చారు.కొనసాగుతున్న భారత సాయం జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో దిగువ ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. మౌలిక వసతులు సైతం దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజల కోసం భారత్ మానవతా సాయం కింద 10 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. ఆహారం, ఔషధాలు, జనరేటర్లు, దుప్పట్లు ఇలా మరో 37.5 టన్నుల సామగ్రినీ తరలించారు. మరోవైపు 28, 29వ తేదీల్లో ‘భారత్–నేపాల్ మైత్రి బస్ సేవా’ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్, భారత్, ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనా,పలు దేశాలు, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంఘం, దాతృత్వ సంస్థలు ధన, వస్తు, ఔషధ, వలంటీర్ల రూపంలో సాయం అందిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో షా పర్యటన యువ ప్రధాని బాలేంద్ర షా గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయం చేస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నువాకోట్ జిల్లాలోని బిదూర్ మున్సిపాలిటీలో సహాయక చర్యలను ప్రధాని స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు టిబెట్‌లోనూ ఇదే వరద విలయం సృష్టించడంతో చైనా ప్రధాని లీ క్వియాంగ్ సైతం గురువారం గిరోంగ్ టౌన్షిప్లో పర్యటించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.భారత్‌కు కొట్టుకొచ్చిన మృతదేహాలు!! ఉత్తరప్రదేశ్‌లోని గండక్ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. నేపాల్‌ను దాటాక వరద ప్రవాహం భారత్‌లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. గండక్ నదీప్రవాహంలో వీటిని కనుగొన్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళ సభ్యుడు, కానిస్టేబుల్ బ్రిజ్మోహన్ తెలిపారు. రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్‌లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్‌కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ఈ విలయం ఎవరి పాపం?
హిమవత్పర్వత శ్రేణి రాళ్లూ రప్పల సమూహం కాదు... అది ప్రకృతి చెక్కిన ఒక అద్భుత దృశ్యకావ్యం. ఈ సౌందర్యం కాస్తా రెప్పపాటులో మృత్యుగీతం ఆలపిస్తుంది. జనావాసాలను క్షణంలో శ్మశాన వాటికలుగా మారుస్తుంది. బుధవారం నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో అతి పెద్ద మంచుఖండం విరిగి భోటే కోశీ నదిలో పడటంతో మెరుపు వరదలు సంభవించి 350 మంది వరకూ మరణించారని అంటున్నారు. 30కిపైగా దేశాలకు చెందిన 1,300 మంది గల్లంతయ్యారు. వారిలో 290 మంది భారతీయులు. నది దిగువనవున్న అనేక జనావాసాలు, డజను జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదార్లు కొట్టుకు పోయాయి. హిమాలయాల్లో ఇలాంటి ఉదంతాలు రివాజుగా మారినా, ఈసారి ఉత్పాతం అతి పెద్దదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ దారుణానికి కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించటంవల్లే ఇలా జరిగిందని తొలుత వార్తలొచ్చాయి. అయితే దాన్ని నిర్ధారించే ఉపగ్రహ చిత్రాలేమీ లేకపోవటంతో తీవ్ర వాతావరణ స్థితిగతులవల్లే మంచుఖండం కరిగి విరిగిపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగటంవల్ల భూమి నానాటికీ వేడెక్కుతోంది. కాలుష్యకారక దేశాల్లో తొలి స్థానం అమెరికాది. అటు తర్వాత స్థానం చైనాది కాగా, మూడో స్థానం మనది. నాలుగో స్థానం యూరోప్ దేశాలది. కర్బన ఉద్గారాల విడుదలలో నేపాల్ స్థానం 95. అంటే ప్రపంచాన విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో ఒక శాతంలో పదో వంతు వాటా మాత్రమే నేపాల్‌ది. వాతావరణ మార్పుల తాకిడికి నష్టపోయే దేశాల్లో మాత్రం ఆ దేశానిది ఆరో స్థానం. అతి తక్కువ కాలుష్యానికి కారణమవుతూ అతి ఎక్కువ మూల్యం చెల్లిస్తున్న దేశంగా నేపాల్‌ను చెబుతారు. ఇప్పుడంటే సూపర్ ఎల్‌నినో వచ్చిపడిందిగానీ... గత దశాబ్దకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వేధిస్తూనే ఉన్నాయి. వాటిని ముందుగా పసిగట్టే సాంకేతికతలు అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోయినా, గతంతో పోలిస్తే ఎంతో మెరుగైన ఉపకరణాలు అమెరికా, చైనాలవద్ద ఉన్నాయి. తమ కారణంగా యేటా భారీ నష్టాన్ని చవిచూస్తున్న నేపాల్‌కు ఆ సాంకేతికతల్ని ఉచితంగా ఇచ్చి ఆదుకోవటం తమ నైతిక ధర్మమని అవి రెండూ అనుకోవు. ఫలితంగా చెప్పాపెట్టకుండా మెరుపు వరదలు విరుచుకుపడటం నేపాల్‌లో మామూలు విషయంగా మారింది. భోటే కోశి నది టిబెట్‌లో మొదలవుతుంది. కొడారి దగ్గర ఒక పాయ, రసువా దగ్గర మరో పాయ నేపాల్‌లోకి ప్రవేశిస్తాయి. నిరుడు సైతం ఆ నదికి ఇలాగే వరదలొచ్చాయి. గత నెల 8న రసువా దగ్గరొచ్చిన వరదల్లో 18 మంది చనిపోగా, అనేక జలవిద్యుత్ ప్రాజె క్టులు, వంతెనలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వర్షపాతం, వరదనీటి ప్రవాహాల గురించిన డేటా చైనా ఎప్పటికప్పుడు అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించే వీలుంటుంది. దేశంలోకి వరద నీరు ప్రవేశించటం మొదలయ్యాకే పౌరుల్ని హెచ్చరించే స్థితి ఉండటం నేపాల్‌కి విషాదం మిగులుస్తోంది. కొన్నిసార్లు మంచుపలకలు విరిగి భోటే కోశి ప్రవాహ మార్గాన్ని కప్పేస్తాయి. అప్పుడు దిగువన నేపాల్‌లో నది నిండుకుంటుంది. దాన్నొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటారు. ఇలాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం తప్పదు. నిరుడు బేత్రావతి–రసువాగడి కారిడార్‌ను వరదలు ముంచెత్తి భారీ నష్టం జరిగింది.అతి కష్టంపై వాటన్నిటినీ పునర్నిర్మించారు. అవన్నీ తాజా వరదల్లో మళ్లీ కొట్టుకు పోయాయి. పదిపదిహేనేళ్ల డేటా అందుబాటులో ఉండి అధ్యయనం చేయగలిగితే నది నడత అంచనాకు, దానికి అనుగుణంగా కనిష్ఠ స్థాయి నష్టం మాత్రమే ఉండేలా నిర్మాణాలు చేపట్టడానికి కొంతవరకూ వీలవుతుంది. భారీ జననష్టం, ఆస్తినష్టం కలగజేసే వైపరీత్య సమాచారం సైతం సరిహద్దుల ఆవలే నిలిచిపోతే మానవాళి సాధించిన అభివృద్ధికి అర్థం ఉండదు. దానికన్నా ముందు సంపన్న దేశాలు తమ అభివృద్ధి నమూనాలను మార్చుకోవాలి. వైపరీత్యం వచ్చిపడ్డాక సాయం చేయటానికి ముందుకు రావటం మెచ్చదగిందే అయినా, దాని నివారణకు తమ వంతు చేయాల్సిందేమిటో అవి గుర్తెరగాలి. బాధ్యతారహిత ప్రవర్తన ఏదో ఒకరోజు తమను కూడా ధ్వంసించగలదని తెలుసుకోవాలి. -
కైలాష్ యాత్రలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న సద్గురు
కైలాష్ మానస సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన బృందం విషాదంలో చిక్కుకుంది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ వరద రావడంతో తమ బృందంలోని 80 మంది ఆచూకీ తెలియడం లేదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్ఘీ వాసుదేవ్ తెలిపారు. టిబెట్‌లోని సాగాలో ఈ ఘటన గురించి అనుచరులకు వివరిస్తూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.వరదకు ముందు చివరి సందేశంసద్గురు తెలిపిన వివరాల ప్రకారం.. యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న S3 బృందం గైరాంగ్లోని ఇమ్మిగ్రేషన్ భవనానికి చేరుకుంది. ఉదయం 9:05 గంటలకు బృంద నాయకుడు తాము ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నామని చివరిసారిగా సందేశం పంపారు. ఆ తర్వాత కేవలం తొమ్మిది నిమిషాలకు, అంటే 9:14 గంటల సమయంలో భారీ వరద సంభవించినట్లు సద్గురు చెప్పారు. ఈ బృందంలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారు. వీరంతా వివిధ దేశాలకు చెందిన వారు అని తెలిపారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ముగ్గురు వాలంటీర్లు, ఒక వైద్యుడి ఆచూకీ కూడా తెలియడం లేదని సద్గురు పేర్కొన్నారు.BIG BREAKING 🚨 Sadhguru broke down in tears while talking about Nepal floods 🥹Emotional Moment !!He says "I want to go to Gyirong to help flood victims.Kindly allow us (myself and a few volunteers) to be at Gyirong.We will in no way hamper rescue efforts.Our only… pic.twitter.com/KhAZG8Dyyc— News Algebra (@NewsAlgebraIND) August 27, 2026గల్లంతైన వారి సంఖ్యపై ఆందోళననేపాల్ వైపు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయని సద్గురు పేర్కొన్నారు. భారతీయ మీడియా కథనాలను ఉటంకిస్తూ నేపాల్ వైపు 484 మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్ వైపు మాత్రం పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. మొత్తం గల్లంతైన వారి సంఖ్య 1,500కు పైగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఖ్య ఎంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.సహాయక చర్యలకు సవాళ్లువరద ప్రభావిత ప్రాంతంలో రహదారులు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడికి చేరుకోవడం కష్టంగా మారిందని సద్గురు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత, చైనా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నామని, అమెరికా రాయబార కార్యాలయం కూడా సహకరిస్తోందని చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు తమవారి సమాచారం కోసం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. -
నేపాల్ వరదలు.. కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కోడలు మిస్సింగ్
కోల్‌కతా: టిబెట్ సరిహద్దు సమీపంలోని నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తిన వేళ గల్లంతైన వారిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శుభ్రాంశు రాయ్ బిజ్పూర్ భార్య కూడా ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో నివసించే శర్మిష్ఠ భౌమిక్ రాయ్‌కు ఆగస్టు 25 రాత్రి నుంచి తన భర్తతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోయింది. రాయ్ బిజ్పూర్ తృణమూల్ మాజీ ఎమ్మెల్యే. ఆయన మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కుమారుడు. శుభ్రాంశు రాయ్ భార్య ఒక ప్రయాణ సంస్థ ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా ఆగస్టు 21న నేపాల్‌కు వెళ్లారు. ఆమె ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. కోల్‌కతా నుంచి కైలాస పర్వతం, మానస సరోవరం వైపు వెళ్లిన 32 మంది బృందం కూడా గల్లంతైన వారిలో ఉంది. ఈ బృందంలో 30 మంది పర్యాటకులు, ఇద్దరు యాత్ర నిర్వాహకులు ఉన్నారు. ఆగస్టు 21న కోల్‌కతా నుంచి బయలుదేరిన బృందం మరుసటి రోజు నేపాల్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువాగఢికి బృందం చేరుకుంది. ఉదయం 8.30 గంటల సమయంలో సభ్యులు ఓ కార్యాలయంలో ఉన్నారు.వరదల మధ్య నేపాల్‌లోని నివాస ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది మృతి చెందినట్లు సమాచారం. 750 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారు. వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. బుధవారం ఉదయం 8.37 గంటలకు టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. మూడు నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు వచ్చినట్లు సమాచారం అందిందని చెప్పారు.ఈ ప్రకంపనలు హిమనదం అకస్మాత్తుగా కరిగి భారీగా నీరు విడుదల కావడానికి కారణమై ఉండవచ్చని నేపాల్ అధికారులు తెలిపారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో పాటు సమాచార వ్యవస్థలు స్తంభించిపోవడంతో తీవ్రంగా ప్రభావితమైన కొన్ని ప్రాంతాలకు చేరుకోవడంలో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
నేపాల్ జల ప్రళయం వెనుక అసలు కారణాలేంటి?
నేపాల్-చైనా సరిహద్దులో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం.. అంతా ఇంతా కాదు. నేపాల్‌ను జల ప్రళయం కకావికలం చేస్తున్న వేళ.. ఆధునిక నిర్మాణ రంగం ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎంతవరకు తట్టుకోగలదనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ భీకర జల ప్రళయం నేర్పిన పాఠాలు ఏంటి? వీటన్నిటిని తట్టుకునేలా పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో భవిష్యత్ నగరాల భవన డిజైన్లు అసలు ఎలా ఉండాలనే దానిపై చర్చ నడుస్తోంది.ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించి అధునాతన మోడలింగ్ సాంకేతిక ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించవచ్చో ప్రముఖ ఆర్కిటెక్చర్ నిపుణులు డాక్టర్ ప్రదీప్‌కుమార్ విశ్లేషించారు. నేపాల్‌లో జల విలయానికి అసలు కారణాలు ఏంటి?. ఏం జరిగింది? భవిష్యత్‌లో ఏం జరగబోతుంది? పలు షాకింగ్ విషయాలను సాక్షి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వివరాలు కోసం కింది వీడియోను చూడండి. -
హైదరాబాద్ నుంచి వెళ్లిన 35 మంది సేఫ్.. నాకు వాళ్లు ఫోన్ చేసి చెప్పింది ఇదే
-
నేపాల్ లో జరిగిన విధ్వంసంపై కళ్లనీళ్లు పెట్టుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్
-
కళ్ల నీళ్లు తెప్పిస్తున్న నేపాల్ డ్రోన్ విజువల్స్
-
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన సద్గురు.. చేతులూ వణికాయ్..
న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల్లో తమ సంస్థకు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని భావోద్వేగంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రకటించడంతో టిబెట్‌లోని ఈశా ఫౌండేషన్ శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టిబెట్‌లోని సాగాలో ఉన్న శిబిరంలో వాతావరణం విషాదభరితంగా మారింది.కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ, సద్గురు చేతులు వణుకుతుండగా భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేశారు. భారీ విధ్వంసం జరిగిన టిబెట్‌లోని గ్యిరోంగ్‌కు వెళ్లి సహాయక చర్యలు, యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని భారత, చైనా రాయబార కార్యాలయాలను కోరారు.సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆధ్యాత్మిక గురువు ప్రస్తుతం సాగాలో ఉన్నారు. కైలాస యాత్ర నుంచి తిరిగి వస్తున్న 80 మంది సభ్యుల బృందానికి జరిగిన విషాదాన్ని వివరిస్తూ ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. “విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇది భయంకరమైన, అసాధారణమైన ఘటన” అని సద్గురు అన్నారు.తన అనుచరులను ఉద్దేశించి సద్గురు మాట్లాడుతూ.. గురువారం ఉదయం తాను స్వయంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే విపత్తు కారణంగా అక్కడికి వెళ్లే దాదాపు అన్ని మార్గాలు తెగిపోయాయని తెలిపారు. “ఇప్పటివరకు మాకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు... కానీ విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి ఏమాత్రం బాగున్నట్లు కనిపించడం లేదు” అని ఆయన అన్నారు.సందేశం వచ్చిన 9 నిమిషాల్లోనే సంబంధాలు కట్బృందం గ్యిరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో మొత్తం భవనం కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు తెలిపారు. వరద నీరు భవనాన్ని తాకిన క్షణాన్ని చూపించే భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితమే తాను అదే ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నానని సద్గురు గుర్తుచేసుకున్నారు. “వారం రోజుల క్రితం మేము ఇమ్మిగ్రేషన్ కోసం ఉన్న అదే భవనం... ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది” అని ఆయన అన్నారు.ఉదయం 9.05 గంటలకు బృందం నాయకుడు ఇషంగా ప్రవీణ్ నుంచి ఫౌండేషన్‌కు సందేశం వచ్చిందని సద్గురు తెలిపారు. “వారు ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్నారని ఆయన సందేశం పంపారు. ఆ తర్వాత 9.14 గంటలకు ఇది జరిగింది” అని సద్గురు చెప్పారు.మరోసారి భావోద్వేగంప్రవీణ్ 20 ఏళ్లకు పైగా ఈశా ఫౌండేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పేటప్పుడు సద్గురు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రవీణ్ నేపాల్ ఫోన్ నంబర్ ఆ రోజు పనిచేయడం ప్రారంభించలేదని తమ బృందం గుర్తించిందని సద్గురు తెలిపారు. “అతను సరిహద్దు దాటి ఉంటే, అతని నేపాల్ ఫోన్ పనిచేయాలి. కానీ అది పనిచేయలేదు” అని సద్గురు అన్నారు.మంచు చరియలు విరిగిపడటం వల్ల ఈ విషాదం సంభవించి ఉండొచ్చని, విపత్తు తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సద్గురు హెచ్చరించారు. ప్రభావితమైన వారి సంఖ్య 1,500 లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు.అయితే సద్గురు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఫౌండేషన్‌కు బృందం నుంచి చివరిసారిగా సమాచారం వచ్చి దాదాపు 12 గంటలు గడిచాయని ఆయన తెలిపారు. దీని ఆధారంగా అన్ని ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని మాత్రం ఆయన చెప్పలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌లో ప్రభావిత ప్రాంతానికి సద్గురు, చిన్న బృందం వెళ్లేందుకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలకు మద్దతు ఇవ్వాలని సద్గురు కోరుతున్నారు.“ఈ విషయంలో భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంతమంది వ్యక్తులతో కలిసి నేను అక్కడికి వెళ్లి మనం ఏం చేయగలమో చూసేందుకు అనుమతిస్తారేమో చూస్తున్నాం” అని ఆయన అన్నారు. సద్గురు తన ప్రసంగాన్ని ముగించినా ఈశా శిబిరంలో విషాద వాతావరణం అలాగే కొనసాగింది. నేపథ్యంలో వినిపించిన రోదనలు ఆగలేదు.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులుటిబెట్కు సరిహద్దుగా ఉన్న నేపాల్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో సుమారు 300 మంది మరణించగా, 1,500 మంది గల్లంతయ్యారు. వరద నీరు వల్ల ఇళ్లు, వాహనాలు, వంతెనలను కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది భారతీయులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త స్పందననేపాల్లో వరద పరిస్థితుల కారణంగా ఈశా ఫౌండేషన్ ‘సేక్రెడ్ వాక్స్’ (కైలాస మానస సరోవర్ యాత్ర)కు వెళ్లిన పలువురు యాత్రికులు, స్వచ్ఛంద సేవకులు గల్లంతు కావడం/చిక్కుకుపోవడంపై ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త మా గంభీరి స్పందించారు “ఊహించని పరిస్థితి ఎదురైంది. బృందం కాఠ్మాండూకు తిరిగి వస్తుండగా చైనా ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉంది. ఉదయం 9.05 గంటలకు వారితో చివరిసారిగా మాట్లాడినప్పుడు, బృందం నాయకుడు ప్రవీణ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి ఇప్పుడే చేరుకున్నామని, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నామని చెప్పారు. 10 నిమిషాల్లోనే మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులుఆ 10 నిమిషాల్లోనే ఈ మొత్తం విషాదం జరిగింది. మొత్తం సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో బృందంలోని అందరితో సంబంధాలు తెగిపోయాయి. మేము సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. నేపాల్ వైపు అన్ని సమాచార వ్యవస్థలు పనిచేయలేదు. సమాచారం తెలుసుకునేందుకు కొన్ని హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను. నేపాల్ వైపు మా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు ఉన్న పట్టణం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 80 మంది ఈ ఘటనతో ప్రభావితమయ్యారు. చైనా అధికారులు త్వరలో, ఆశాజనకంగా రేపు ఉదయం నాటికి ఏదైనా సమాచారం ఇస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం. మంచి వార్త వింటామనే ఆశతో ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 77 మంది యాత్రికుల గురించి ఆమె మాట్లాడుతూ.. “వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌లోని వివిధ దేశాలు, బ్రిటన్ నుంచి వచ్చారు. కొన్ని ఆసియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 19 దేశాల నుంచి పాల్గొన్నవారు ఉన్నారు. వారిలో చాలామంది భారతీయ మూలాలు ఉన్నవారు. భారత్, నేపాల్‌లోని మొత్తం 19 రాయబార కార్యాలయాలను సంప్రదించాం. వారితో మేము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం. మాకు ఎలా సహాయం చేయాలి, ఏదైనా సమాచారం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను వారు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషాదం చాలా మారుమూల ప్రాంతంలో, భారీ స్థాయిలో చోటుచేసుకోవడంతో సమాచారం అందడానికి చాలా ఆలస్యం అవుతోంది” అని తెలిపారు. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) -
నేపాల్ వరదల్లో చిక్కుకున్న సుహాసిని రెడ్డి పేరెంట్స్ ఆవేదన
-
చైనా హెచ్చరిక.. పొంచి ఉన్న మరో ప్రమాదం!
మరో సరస్సుతోనూ ప్రమాదం పొంచి ఉందంటూ చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. టిబెట్–నేపాల్ సరిహద్దులోని బ్యారియర్ సరస్సు 72 గంటల్లో పొంగిపొర్లే ప్రమాదం ఉందని చెబుతోంది. భారీ కొండచరియలు విరిగిపడటంతో టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 558 మంది వరకు గల్లంతైనట్లు చైనా మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని బీజింగ్ అధికారులు మరో హెచ్చరికను జారీ చేశారు.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ సమీపంలో ల్హెండే నదిలోకి భారీగా మట్టి, రాళ్లు కొట్టుకురావడంతో ముగ్గురు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో దిగువ ప్రాంతాల్లో ఈ వరదల కారణంగా 177 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. టిబెట్ వైపు ప్రమాద ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇద్దరు గ్రామస్థులను రక్షించారు.ఇదిలా ఉండగా.. మరో ప్రమాదాన్ని చైనా మీడియా గుర్తించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘా పెంచింది. ఈ సరస్సు విపత్తు ప్రాంతానికి ఈశాన్య దిశలో, చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఉంది. గురువారం నాటికి ఈ బ్యారియర్ సరస్సులో సుమారు 20 లక్షల ఘన మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల ఘన మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.ఇదిలా ఉండగా.. సహాయక చర్యల కోసం చైనా బీజింగ్, చెంగ్డూ నుంచి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను పంపించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గ్యిరోంగ్ పట్టణంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించారు. అయితే పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు ఇంకా నిలిచిపోయినట్లు సీసీటీవీ తెలిపింది.ఇదీ చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్ -
750 మంది భారతీయులు ఎక్కడ..? కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు
-
DRDO మాజీ ఛైర్మన్ అసలు అక్కడ ఏం జరుగుతుందో లైవ్ లో చెప్పిన సతీష్ రెడ్డి
-
నేపాల్ వరదలకు కారణం ఇదే ఉస్మానియా ప్రొఫెసర్ చెప్పిన సంచలన విషయాలు..
-
నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతుపై కేంద్రం ప్రకటన
నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 332కి పెరిగింది. వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రకటించింది. తమిళనాడు-37, కేరళ 33, బెంగాల్‌కు చెందిన 32 మంది, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్ అయ్యారు. త్రిశూలీ-1 ప్రాజెక్ట్ సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 సభ్యులు వరదల్లో గల్లంతయినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది.గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 టన్నుల సహాయ సామాగ్రిని నేపాల్‌కు భారత్ ప్రభుత్వం పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు: 011-23089718, వాట్సాప్ నెంబర్ : 9968291988. ఇప్పటివరకు 21 మంది భారతీయులను రక్షించామని కేంద్రం పేర్కొంది.కాగా, నేపాల్‌లో ఇషా ఫౌండేషన్ సేక్రెడ్ వాక్స్ పేరుతో కైలాస్ మానస సరోవర్ యాత్ర చేపట్టగా.. వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, వాలంటీర్లు కనిపించకుండా పోయారు. దీంతో ఇషా ఫౌండేషన్‌లో విషాదం నెలకొంది. ‘‘మా బృందం ఖాట్మండుకు తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్లో ఉన్నారు. ఉదయం 9:05కి గ్రూప్ లీడర్ ప్రవీణ్‌తో చివరిగా మాట్లాడాం. ఇమ్మిగ్రేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. 10 నిమిషాల్లోనే సంప్రదింపులు తెగిపోయాయి. 10 నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ డౌన్ అయ్యింది. నేపాల్ వైపు కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. నేపాల్ వైపు మా వాలంటీర్లు ఉన్న పట్టణం పూర్తిగా కొట్టుకుపోయింది.’’ అని ఇషా ఫౌండేషన్ తెలిపింది.‘‘చైనా అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం… రేపు ఉదయం వరకు ఆశిస్తున్నాం. 77 మంది భక్తులు చిక్కుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్, యూకే, ఆసియా దేశాలవారు ఉన్నారు.19 ఎంబసీలతో సహాయం, సమాచారం కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రిమోట్ ప్రాంతం, భారీ విపత్తు కారణంగా సమాచారం నెమ్మదిగా వస్తోంది’’ ఇషా ఫౌండేషన్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? -
చిన్న మంచు ముక్కకే నేపాల్ మునిగితే... హిమాలయాలు కరిగితే...? నేపాల్ వరదల వెనుక రహస్యం?
-
సైన్స్‌కు అర్థం కాని కైలాస రహస్యం..
-
నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు!
-
చైనాకు తెలిసిన నేపాల్‌ను హెచ్చరించలేదా? చైనా పాపమే .. నేపాల్ కి శాపమా?
-
నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?
-
మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు
-
నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు
-
‘నేపాల్ విపత్తు ఒక డ్రామా’.. థరూర్‌ను ఏకిపారేస్తున్న జనం!
న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ పోస్టులో ఆయన ఉపయోగించిన ఒక పదంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించినప్పటికీ, ఈ పెను ప్రకృతి విపత్తును ‘డ్రామా’ అని సంబోధించడం చాలామందిని తీవ్రంగా కలచివేసింది. కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘భారీ వినాశనాన్ని సృష్టించిన కొండ ప్రాంతాల్లోని ఆ డ్రామా గురించి ఏమాత్రం తెలియకుండానే నిన్న ఖాట్మండుకు విమానంలో ప్రయాణించాను’ అని రాసుకొచ్చారు. ఇంతటి తీవ్ర విషాదాన్ని వర్ణించేందుకు థరూర్ ‘డ్రామా’ అనే పదాన్ని వాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గొప్ప పదసంపద కలిగిన వ్యక్తి ఇంతటి సున్నితత్వ లేని పదాన్ని ఎలా ఉపయోగిస్తారని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.నిఘంటువులోని క్లిష్టమైన పదాలు తెలిసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటని, సమయోచితంగా ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రకటనలోని సానుభూతే ఒక నాటకంలా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఆంగ్ల భాషా నైపుణ్యానికి పెట్టింది పేరైన శశిథరూర్ నుంచి ఇలాంటి పదజాలాన్ని ఊహించలేమని వ్యాఖ్యానిస్తూ, వెంటనే ఆ పోస్టును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీషు భాషా సంస్కృతిలో డ్రామా అనే పదాన్ని తీవ్ర ఉత్కంఠ కలిగించే సంఘటనల విషయంలో కూడా వాడుతుంటారు. అయితే దీనిని ‘నాటకీయం’గా పలువురు భావించడంతో సమస్య తలెత్తింది. ఫలితంగా శశిధరూర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Took off for Katmandu yesterday, blissfully unaware of the drama that had taken place in the hills and caused such catastrophic damage. A severe, sudden flash flood struck northern Nepal’s Rasuwa district near the Tibet border, causing widespread destruction along the Bhote… pic.twitter.com/qxcDJgEK8C— Shashi Tharoor (@ShashiTharoor) August 27, 2026 -
నేపాల్ వరదలు.. AIలో చూడండి!
-
మా వాళ్లు ఎలా ఉన్నారో?
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరద నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. వృత్తి, వ్యాపార, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్ర కోసం వెళ్లిన తమవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికి ఏ హానీ కలగకుండా తిరిగి రావాలంటూ మొక్కుకుంటున్నారు. నగరం నుంచి నేపాల్ వెళ్లినవారు 150 మందిపైనే ఉంటారని తెలుస్తోంది. నేపాల్‌కు వీసా లేకుండా అధికారిక గుర్తింపు కార్డులు చూపించి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భారతీయులు పర్యాటకంతో పాటు వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు.అనేక కారణాల వల్ల నగరం నుంచి నేపాల్ ఉత్తర ప్రాంతానికి వెళ్లేవారి సంఖ్య నిత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీరిలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళ్తుంటారు. ఇలాంటివారితో పాటు సఫారీలు, ట్రెక్కింగ్స్ కోసం వెళ్లే వారి సంఖ్య గణనీయమే. వర్షాకాలం నేపథ్యంలో ట్రెక్కింగ్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గినా, మిగిలిన పనులపై వెళ్లేవారు పదులు, వందల్లోనే ఉంటారు.ఆకస్మిక వరదల వార్త దావానలంలా వ్యాపించడంతో వీరందరి కుటుంబాల్లో ఉత్కంఠ, ఆత్రుత నెలకొంది. నేపాల్ యాత్రకు వెళ్లినవారిని సంప్రదించడానికి ప్రయత్నించగా అనేకమంది ఫోన్లు బుధవారం అర్ధరాత్రి వరకు పని చేయలేదు. కొందరి ఫోన్లు రింగ్ అవుతున్నా సమాధానం ఉండట్లేదు. ఈ పరిణామాలు నగరంలోని వారి కుటుంబీకుల్లో ఆందోళన మరింత పెంచుతోంది. చాలామంది తమవారిని తీసుకెళ్లిన, పంపిన ట్రావెల్ ఏజెన్సీలు, వ్యక్తుల వద్దకు పరుగులు పెట్టారు. 31 మంది క్షేమం చిక్కడపల్లి: నగరం నుంచి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి ఖాట్మాండుకు చేరుకుని, అక్కడినుంచి భారత్‌లోకి రానున్నారు. ఈ విషయాన్ని యాత్రకు వెళ్లిన ఎమ్మెస్ రామారావు ట్రస్టు చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ స్వామి ఫోన్ ద్వారా వెల్లడించారు. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు నగరం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లినవారిపై తీవ్ర ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో నగరవాసులు చనిపోగా, ఇంకొందరు గల్లంతయ్యారు. 2014లో హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలోని బియాస్ నది వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా రిజర్వాయర్ గేట్లను తెరవడంతో నగరం నుంచి విహార యాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేపాల్ ఆకస్మిక వరదల వార్త విన్న నగరవాసులు పై రెండు ఉదంతాలను గుర్తు చేసుకుంటున్నారు. నాటి బీభత్సాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ మూడు దుర్ఘటనలూ హిల్ స్టేషన్లలో జరిగినవే కావడంతో మరింత కంగారు పడుతున్నారు. చదవండి: నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో.. -
నేపాల్ భీకర వరదలు.. ఏరియల్ వ్యూలో..
ఖాట్మండు: నేపాల్‌లో మంచు, బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు సృష్టించిన భయానక విధ్వంసం ఏరియల్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గల్లంతయ్యారు. పైనుంచి చూసిన దృశ్యాల ప్రకారం చైనా-నేపాల్ సరిహద్దుల్లోని రసువా జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, రహదారులు ధ్వంసమై మానవ నివాసాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. టిబెట్‌లో పుట్టిన భోటే కోశి నది పెను ఉధృతితో ముంచుకొచ్చి ఈ భారీ నష్టాన్ని మిగిల్చింది. రసువాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్‌లో నది తన మార్గాన్ని మార్చుకోవడంతో నివాస ప్రాంతాలన్నీ బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు ఏరియల్ వీక్షణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. VIDEO | Nuwakot, Nepal: Aerial views reveal the extent of devastation after Nepal flash floods.#NepalFloodNews #NepalTragedy(Source: AFP/Only for use in India)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/XlPVqQEdet— Press Trust of India (@PTI_News) August 27, 2026 -
నేపాల్ ఎఫెక్ట్.. చైనాలోనూ జలప్రళయం.. క్షణాల్లో కొట్టుకుపోయిన భవనాలు
-
ముందే తెలిసినా చెప్పలేదా?.. చైనా అసలేం చేసింది?
నేపాల్‌లోని రసువాలో బుధవారం ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. అయితే ఇంతటి విపత్తు సంభవించే అవకాశం గురించి నేపాల్, చైనా ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం ఎందుకు అందలేదు? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో వాతావరణ, జలవనరుల సమాచారాన్ని పరస్పరం పంచుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ.. తాజా విపత్తుపై ఎలాంటి ముందస్తు హెచ్చరిక అందలేదని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ శాఖ వెల్లడించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.రసువాలో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర వరదలు రావడంతోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్పటికే వరద ఉధృతి భారీగా పెరిగి నదీ పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదైంది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి.BIG ALLEGATION ON CHINA | Nepal FloodsQuestions are being raised over whether Nepal received timely information about the flood situation from China.Nepali media reports, citing Chinese media, claim that flooding hit Tibet’s Kerung County around 10:30 AM local time, more than… pic.twitter.com/BywSpR5CtK— The Bharat Post (@TheBharatPost__) August 27, 2026అసలు వరదలకు కారణమేంటి?టిబెట్‌లో ఏదైనా హిమానీనదం, హిమనద సరస్సు లేదా నదీ వ్యవస్థలో ఆకస్మిక మార్పు జరిగితే.. దాని ప్రభావం నేపాల్‌పై పడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ముందుగానే సమాచారం అందితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. కానీ తాజా ఘటనలో అలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో నష్టం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, నేపాల్ మధ్య వాతావరణ సంబంధిత సమాచారాన్ని పంచుకునేందుకు ఒక యంత్రాంగం ఉంది. కానీ ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ తాజా వరదలపై ముందస్తు సమాచారం రాలేదని నేపాల్ అధికారులు చెబుతున్నారు.ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య సమాచార మార్పిడిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. టిబెట్‌లో విపత్తుకు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించినా.. అవి నేపాల్‌కు చేరలేదా? లేక అక్కడ అలాంటి సమాచారం అందుబాటులో లేదా? అన్నది తేలాల్సి ఉంది. విపత్తు తర్వాత సమాచారం అందడం వల్ల ప్రయోజనం పరిమితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు.🔴 Les images en provenance du #Népal sont terrifiantes. Le séisme d’une magnitude de 4,4 qui s’est produit la nuit dernière au Tibet a déclenché des #avalanches de glace et des #glissements de terrain. Ils ont formé des embâcles sur les rivières de la région qui ont fini par… pic.twitter.com/XIdlQ76gii— Guillaume Woznica (@GWoznica) August 26, 2026ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి..భోటేకోశి నది వరదల అనంతరం రూపొందించిన నివేదికలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. చైనా-నేపాల్ సరిహద్దుల్లో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అంతర్గత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. హిమానీనదాలు, హిమనద సరస్సులు, నదుల్లో ఆకస్మిక మార్పులను ముందుగానే గుర్తించి సమాచారం అందించే వ్యవస్థ ఉంటే.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.చైనాతో అధికారిక ఒప్పందం అవసరమా?విపత్తు నిర్వహణ రంగ నిపుణులు చైనా, నేపాల్ ప్రభుత్వాలు ఈ అంశంపై అధికారికంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వరదలు, హిమానీనదాల విస్ఫోటనాలు, ఇతర ప్రకృతి విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పరస్పరం పంచుకునేలా ప్రత్యేక అవగాహన ఒప్పందం (MOU) చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి. అవసరమైతే ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. టిబెట్ వైపు జరిగే పరిణామాలను నిరంతరం గమనించాలని నిపుణులు అంటున్నారు. టిబెట్‌లో జరిగే ఏ చిన్న మార్పు అయినా నేపాల్‌లోని నదులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు సమాచారం అత్యంత కీలకమని చెబుతున్నారు.చదవండి: నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్చైనా అధ్యక్షుడు, ప్రధాని స్పందననేపాల్ విపత్తు జరిగిన కొన్ని గంటలకే చైనా ప్రభుత్వం కూడా స్పందించింది. టిబెట్‌లో పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపట్టాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆదేశించినట్లు ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. అలాగే వరద నియంత్రణ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అన్ని విభాగాలు, సంబంధిత సంస్థలు హై అలర్ట్‌లో ఉండాలని, ప్రమాదాలను గుర్తించి వాటిని పరిష్కరించే చర్యలను వేగవంతం చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.ఆలస్యమైన సమాచారం.. పెరిగిన నష్టం?నేపాల్ నిపుణుల ప్రధాన ఆందోళన ఇదే. విపత్తు జరిగిన తర్వాత సమాచారం అందడం కాదు.. విపత్తు రాకముందే సమాచారం అందాలి. ముఖ్యంగా చైనా-నేపాల్ సరిహద్దుల్లోని హిమానీనదాలు, నదులు, హిమనద సరస్సులు అత్యంత ప్రమాదకర ప్రాంతాలు కావడంతో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. అందుకే తాజా వరదలు కేవలం ప్రకృతి విపత్తుగానే కాకుండా.. చైనా-నేపాల్ మధ్య సరిహద్దు సమాచార మార్పిడి వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టిన ఘటనగా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా రెండు దేశాలు ఎంత త్వరగా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
హిమాలయాల్లో జలప్రళయం.. 160 మందికి పైగా మృతి
-
నేపాల్ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్
హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు మెడోగ్ డ్యామ్‌పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.నేపాల్ వరదలతో పెరిగిన ఆందోళనఇటీవల నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.చైనా మెగా డ్యామ్ ఇదే..చైనా టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్‌ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.భూకంప జోన్లో భారీ నిర్మాణంమెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కే ఎందుకు ముప్పు?యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్‌లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.భారత్ వ్యూహం సిద్ధంచైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్ భావిస్తోంది.భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భవిష్యత్తు ఎలా?ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్-టిబెట్ ప్లాష్ఫ్లడ్లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్.. భారత్‌కు ‘వాటర్ బాంబ్’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్ వరదలపై అమెరికా సంచలన ప్రకటన -
నేపాల్ వరదలు: సరిహద్దుల్లో స్తంభించిన వ్యాపారం
నౌతన్వా (మహారాజ్‌గంజ్): నేపాల్‌లో సంభవించిన భారీ వరదల ప్రభావం భారత్-నేపాల్ సరిహద్దుల్లోని వాణిజ్యంపై తీవ్రంగా పడింది. వరదల కారణంగా ప్రధాన రవాణా మార్గాలు దెబ్బతినడంతో సోనౌలీ, భగవాన్‌పుర్, ఠూఠీబారీ వంటి సరిహద్దు పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్లు నేపాల్ నుంచి వచ్చే వినియోగదారులు లేక బోసిపోయాయి.సోనౌలీ మార్కెట్ వ్యాపారం భారత్, నేపాల్ రెండు దేశాల కస్టమర్లపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. నేపాల్‌లో వరద పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రజలు భారత సరిహద్దు వైపు రావడం తగ్గిపోయింది. దీంతో దుకాణాల వద్ద సందడి కనిపించక, వ్యాపారులు వినియోగదారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భగవాన్‌పుర్, ఠూఠీబారీ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేపాల్ నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో దుస్తులు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని రకాల విక్రయాలు భారీగా పడిపోయాయి.సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించడం వల్ల చిన్న, పెద్ద వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. సరిహద్దు దకాణాలకు నేపాల్ వినియోగదారులే కీలకమని, రాకపోకలు దెబ్బతిన్నప్పుడు వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని స్థానిక వర్తకులు తెలిపారు. నేపాల్‌లో పరిస్థితులు త్వరగా చక్కబడి, రాకపోకలు పునరుద్ధరణ జరకపోతే రానున్న రోజుల్లో మరింత భారీ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్ -
కైలాస యాత్రికులపై ప్రకృతి పగ.. భారతీయ యాత్రికుల జాడెక్కడ ?
-
Shocking Video: ప్రాణాల కోసం పరుగులు.. నేపాల్ లో భయానక దృశ్యాలు..
-
నేపాల్‌లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు
టిబెట్: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.అయితే, నేపాల్ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్మాండ్కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. -
నేపాల్‌కు 10 టన్నుల అత్యవసర సాయం పంపిన భారత్
న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ బాసటగా నిలిచింది. 10 టన్నుల మానవతా సాయం, అత్యవసర ఔషధాలతో కూడిన మొదటి విడత సహాయక సామగ్రిని భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో నేపాల్‌కు తరలించింది. ఈ విపత్తులో 95 మంది మరణించగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పరిస్థితి తీవ్రతపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఇరు దేశాల బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్ తరఫున 10 టన్నుల విపత్తు సహాయక సామగ్రి, మందులను పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.Dispatched 10 tonnes of HADR assistance and essential medicines to support Nepal’s response to the devastating floods.Our thoughts are with the bereaved families and all those affected. In face of this challenge, India stands with Nepal and its people. pic.twitter.com/FUJdkJzi1o— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 26, 2026ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్ నుంచి రాత్రి సుమారు 8:35 గంటలకు బయల్దేరిన ఐఏఎఫ్ ‘సి-130జె’ (C-130J) విమానం ఖాట్మండుకు చేరుకుంది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ దీపాలు, అత్యవసర మందులు ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సహాయక చర్యల కోసం సి-17, సి-130 రవాణా విమానాలతో పాటు రెస్క్యూ ఆపరేషన్లకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు భారత వైమానిక దళం తెలియజేసింది.ఇది కూడా చదవండి: ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం.. -
ఉపగ్రహ చిత్రాల్లో నేపాల్ జల ప్రళయం..
రసువా: నేపాల్‌లోని రసువా తదితర జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదల విధ్వంస తీవ్రతను ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. ఆగస్టు 23, 25 నాటి సాధారణ స్థితికి, వరదల అనంతరం ఆగస్టు 26న తీసిన చిత్రాలకు మధ్య ఉన్న వ్యత్యాసం అక్కడి విపత్తు తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. మనకామన, ఖడ్గ భంజ్యాంగ్ వంటి గ్రామాలు, నేపాల్-చైనా సరిహద్దు లోయలు, భోటేకోశీ నది పరివాహక ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటివరకు 98 మంది మృతి చెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన సుమారు 400 మందిలో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. హిమనీనదం పేలడం లేదా మంచు చరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్లే ఒక్కసారిగా ఈ భారీ వరద ఉప్పొంగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.వరద ప్రవాహం గండక్ నది ద్వారా దిగువకు వచ్చే అవకాశం ఉండటంతో భారత్‌లోని బిహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.ఇది కూడా చదవండి: 1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు.. -
1934 భూకంపం నుంచి 2026 వరదల వరకు..
హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒదిగివున్న నేపాల్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి నిలువునా వణికిపోయింది. తాజాగా సంభవించిన ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో గ్రామాలు క్షణాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు దాదాపు 95 నుండి 100కు పైగా మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రకృతి విలయాలకు నేపాల్ గురికావడం ఇదే మొదటిసారి కాదు.. 1934 నాటి భీకర భూకంపం నుండి నేటి వరదల వరకు ఈ హిమాలయ దేశం మృత్యు చరిత్రను మోస్తూనే ఉంది.1934 నాటి పెను విషాదం: నేపాల్-బీహార్ మహా భూకంపంనేపాల్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన విపత్తుగా 1934 జనవరి 15న వచ్చిన భూకంపం నిలిచింది. రిక్టర్ స్కేలుపై 8.0 తీవ్రతతో మధ్యాహ్నం 2:13 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనల కేంద్రం మౌంట్ ఎవరెస్ట్‌కు దక్షిణాన 9.5 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర బీహార్, నేపాల్ సరిహద్దులను కుదిపేసిన ఈ ఘోర విపత్తులో దాదాపు 10,700 నుండి 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు భూస్థాపితమై చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి.1988 భూకంపం.. 1993 వరదల తాండవం1988 ఆగస్టు 20న ఉదయ్‌పూర్ జిల్లా కేంద్రంగా 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్, బీహార్ సరిహద్దుల్లో 1,003 మందిని బలితీసుకుంది. ఆ తర్వాత, 1993 జూలై 19-20 తేదీల్లో కురిసిన కుండపోత వర్షాలు వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని జలప్రళయాన్ని సృష్టించాయి. ఈ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బాగ్మతి బ్యారేజీతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 700 మందికి పైగా జనం జలసమాధి అయ్యారు.2014-2015 ప్రకృతి ప్రకోపం: గూర్ఖా భూకంప విధ్వంసం2014 ఏప్రిల్‌లో ఖుంబు ఐస్‌ఫాల్ వద్ద సంభవించిన హిమపాతంలో 16 మంది షెర్పా గైడ్లు మరణించగా, అదే ఏడాది ఆగస్టులో సున్కోషి నదికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోయారు. ఇక 2015 ఏప్రిల్ 25న వచ్చిన గూర్ఖా భూకంపం రాజధాని ఖాట్మండును చావుకేకలతో నింపింది. ఈ భయంకర విపత్తు నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్‌లలో కలిపి 8,962 మంది ప్రాణాలను హరించగా, దాదాపు 22 వేల మంది క్షతగాత్రులయ్యారు.2017 నుంచి 2024 వరకు ఎడతెగని విలయం2017 వర్షాకాలంలో నేపాల్ దక్షిణాన ఉన్న తెరాయ్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 140 మందికి పైగా మరణించారు. 2023 నవంబర్ 3న జాజర్కోట్ జిల్లాలో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 153 మందిని బలితీసుకుంది. అలాగే, 2024 సెప్టెంబరులో ఖాట్మండు లోయ, బాగ్మతి ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో సంభవించిన వరదలు, కొండచరియల విలయానికి 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుత జల విలయంతాజాగా 2026 ఆగస్టులో విరుచుకుపడిన వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నేలమట్టమయ్యాయి. నదులు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటివరకు 95 మందికి పైగా శవాలు లభ్యమయ్యాయి. ఇంకా 133 మంది భారతీయులతో సహా పలువురి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు పదేపదే విధ్వంసం?వాతావరణ మార్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల జాబితాలో నేపాల్ 4వ స్థానంలో ఉంది. భౌగోళికంగా సున్నితమైన హిమాలయ ప్రాంతం కావడంతో కొండచరియలు విరిగిపడటం, మెరుపు వరదలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. ఇంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ, దేశంలో ఆధునిక వాతావరణ హెచ్చరిక వ్యవస్థలు సరిగా లేకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టాలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: మథురలో అరుదైన రాఖీ సంప్రదాయం! -
నేపాల్ వరదలు: బాధితుల కోసం తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్లు
కఠ్మాండూ: దేవభూమి నేపాల్‌లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్, మొబైల్, నేపాల్‌లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.


