
కఠ్మాండు: నేపాల్ అటార్నీ జనరల్‌గా మొట్టమొదటిసారిగా మహిళ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ న్యాయవాది సబితా భండారీ నేపాల్ ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా నియమి తులయ్యారు.
ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధానమంత్రి సుశీలా కర్కి సిఫారసు మేరకు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆదివారం సబితను నియ మించారు. అంతకుముందు అటార్నీ జనరల్ పదవికి రమేశ్ బాదల్ చేసిన రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. సబితా భండారీ గతంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చీఫ్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.