మనం విజయం సాధించాలంటే మనమీద మనకి నమ్మకం ఉండాలి. మన పనిమీద అసరామైన నమ్మకం, కొండంత ప్రేమ ఉండాలి. ఎంతటి కష్టమైనా దూది పింజలా తేలిపోతుంది. విజయం వంగా సలాం చేస్తుంది. రాజస్థాన్‌లోని కురి అనే చిన్న గ్రామానికి చెందిన 30 ఏళ్ల కౌశల్య చౌదరి సక్సెస్ జర్నీ ఇలాగే మొదలైంది. తనకసలే పరిచయం లేని విషయాలపై అవగాహన పెంచుకుంది. విజయం సాధించింది. పట్టుదల, స్వయం కృషితో ఎదిగిన కౌశల్య ఏం చేసింది. తెలుసుకుందాం.
ఒక మూరుమూల గ్రామం. ఆడవాళ్లు గుమ్మం దాటి కాలు బయలుపెడితేపాపం అనుకునే రోజులు. అలాంటి సమయంలో తాను సృష్టించబోయే విప్లవాన్ని స్వప్నించింది. AI టూల్స్, రింగ్ లైట్, ఖరీదైన కెమెరా , అంతరాయాలు లేని ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఒక చిన్న వీడియో రికార్డు చేయాలంటే నానా కష్టాలు పడతాం. కానీ కేవలం సాధారణ స్మార్ట్‌ఫోన్, అస్తవ్యస్తమైన సిగ్నల్స్ మధ్య వంటకాల వీడియోతో పాపులర్ అయ్యిందామె. ఇక్కడే ఆమె నిబద్దతను, కృషిని అర్థం చేసుకోవవచ్చు.
కౌశల్యకు వంటలంటే చాలా ఇష్టం. అలా తన వంటల్ని అందరికీ పరిచయం చేయాలనుకుంది. వంటపై అపారమైన ప్రేమతో, కౌశల్య తన గ్రామంలోని వంటగదిలో ఒక తాత్కాలిక స్టూడియోను ఏర్పాటు చేసుకుంది, చేతితో రాసుకున్న నోట్స్ ద్వారా వీడియో ఎడిటింగ్ నేర్చుకుంది. రాత్రంతా కష్టపడి, డాబాపై అష్టకష్టాలుపడి ఎ ట్టకేలకు ఒక యూట్యూబ్ వీడియోను అప్‌లోడ్ చేసింది.
కేవలం స్వయంకృషితో ప్రియమైన డిజిటల్ క్రియేటర్ మాత్రమే కాదు. సాంప్రదాయరాజస్థానీ మసాలా దినుసులు,కోల్డ్-ప్రెస్డ్ నూనెలను అందించే 'సిద్ధి మార్వాడీ' అనే స్వచ్ఛమైన ఆహార బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా కూడా ఎదిగింది. తన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.
బాల్యం: ఒక సామాన్య రైతు కుటుంబంలోపెరిగిన కౌశల్య జీవితం గ్రామీణ భారతదేశంలోని చాలామంది అమ్మాయిల జీవితంలాగే ఉండేది. ఉదయం పాఠశాల, సాయంత్రం ఇంటి పనులు. పొలానికి వెళ్ళేది, గొడ్డూ గొదా చూసుకునేది. నలుగురు తోబుట్టువులలో పెద్దది , పైగా తల్లి పొలం పనుతో బిజీగా ఉండేది.. అందుకే వంటగదికి అంకితమైపోయేది. ముఖ్యంగా తన తల్లి పొలంలో పనిలో ఉన్నప్పుడు ఆమె ప్రేమగా వండి పెట్టేది. అదితిన్నపుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందమే వంటపై ఆమెకు ప్రేమను పెంచింది.
డాక్టర్ కావాలనే కలలు: డాక్టర్ కావాలనే కలలతోనే 12వ తరగతిలో సైన్స్ చదివింది. ఎలాగైనా కష్టపడి డాక్టర్‌ని కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అనీ అనుకున్నట్టే జరగవు కదా. ఇంటర్ పరీక్షలు అయ్యాయో లేదో పెళ్లి చేసేశారు పెద్దలు. తన తల్లి, ఇతర ఆడాళ్లలాగానే పొలం పనులు, ఇంటిపనులు. ఇంతోటి దానికి తాను ఇంటర్ దాకా ఎందుకు చదువుకున్నట్టు అని తనను తాను ప్రశ్నించుకుంది. ఏదో చేయాలనే ఆలోచన మొదలైంది.
కానీ తన గ్రామంలో ఉద్యోగావకాలు తక్కువ. పైగా ఆడాళ్లకి సామాజిక కట్టుబాట్లు ఉండనే ఉన్నాయి. దీనికి తోడు బైటికిపోతే, ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇంటికి వచ్చే అతిథులను ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ, అత్తగారిమాటలు. బోనులో చిక్కుకున్నట్లు ఫీలింగ్ కలిగేది ఆ ఇంటికి ఏకైక కోడలైన కౌసల్యకు. చిన్నప్పటి నుంచే కౌసల్య వంటగదిలోనే గడిపింది. ఈ అనుభవంతోనే నాలుగు గోడల మధ్యలోనే అయినా సరే ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది.
యూట్యూబ్ వరంలా దొరికింది
ఐదేళ్ల చిన్నారి యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నట్టు తెలుసుకుంది. అంతేక ఆలోచన తళుక్కున మెరిసింది. ఎంతో ఆశతో భర్త వీరేంద్ర కుమార్‌ను యూట్యూబ్ అంటే ఏమిటని అడిగింది. కొద్దిగా వివరాలు తెలుసుకుంది. ఆ సమయంలో ఆమె దగ్గర స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. కౌసల్య మరో అడుగు ముందుకేసి మామగారిని ఫోన్ కొనివ్వమని అడిగింది. రూ 3 వేల విలువైన బటన్ ఫోన్ ఇంటికి తెచ్చి, ఇంతకంటే ఎక్కువ కొనలేనని చెప్పారట. తాను పొదుపు చేసుకున్న మూడు వేల, అమ్మ దగ్గర మూడు తీసుకుని రూ. 7500 పెట్టి శాంసంగ్ జె2ఎస్ ఫోన్ కొనుక్కుంది. 2017లో తన వంటగది నుండి వంటకాల వీడియోలను చిత్రీకరించడం ప్రారంభించింది. ట్యూటోరియల్స్ చూసి ఎడిటింగ్ నేర్చుకుంది. నేర్చుకున్నపాయింట్లను మర్చిపోకుండా ఉండేందుకు పాయింట్లు రాసుకునేది. ఇలా అన్ని అడ్డకుంలనూ అధిగమించి కౌసల్య తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. బేసన్ బర్ఫీ,హల్దీ కీ సబ్జీ. తొలి వీడియో సంచలనం క్రియేట్ చేసింది. అష్టకష్టాలుపడి, నాణ్యమైన వంటకాల వీడియోలను పోస్ట్ చేయగలిగింది. ప్రస్తుతం ఆమె సిద్ధి మార్వాడి కిచెన్( Sidhi Marwadi Kitchen) అనే ఛానల్‌కు 10 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉండటం విశేషం.

తన సబ్‌స్క్రైబర్‌ల కోసం కంటెంట్‌ను అందిస్తూ పాపులర్ అయింది. మొదటి రోజులు చాలా కష్టంగా ఉండేవి. ట్రైపాడ్ లేదు, కేవలం అల్యూమినియం తీగలను వంచి తాత్కాలిక స్టాండ్‌గా ఉపయోగించేది. స్టూడియో లైట్లు లేవు, వంటగది చుట్టూ బల్బులు వేలాడ దీసేది. నెట్‌వర్క్ లేక వీడియోలు అప్‌లోడ్ చేయడానికి గంటల తరబడి వేచి ఉండేది. మొత్తానికి ఏడాదిన్నర తరువాత యూట్యూబ్ నుండి వచ్చిన తొలి సంపాదన రూ. 7,500. ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసింది లేదు.
అంతేకాదు ఈమెపాపులారీటీ మాస్టర్ చెఫ్ ఇండియాదాకా చేరింది. 2023లో మాస్టర్ చెఫ్ ఇండియా పాల్గొని, రాజస్థాన్ నుండి 40,000 మంది పాల్గొనేవారిలో టాప్ 12లో చేరిన ఏకైక పోటీదారుగా నిలిచింది. తన YouTube ద్వారా వచ్చిన సంపాదన రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టి "సిధి మార్వారీ" అనే క్లీన్-లేబుల్ ఫుడ్ స్టార్టప్‌ను ప్రారంభించింది. స్వచ్ఛమైన మసాలాలు, కోల్డ్-ప్రెస్ ఆయిల్స్‌తో 2024లో సిద్ధి మార్వాడి( Sidhi Marwari) బ్రాండ్‌ను స్థాపించింది. తన గ్రామంలో 35మందికి పైమహిళలకు ఉపాధినిస్తోంది. ఈ స్టేజికి రావడం అంత సులభంగా జరిగిపోలేదు. ఈ పని ఆపేయమనికుటుంబ సభ్యులు చాలా ఒత్తిడి చేశారు. ఇలా వీడియోలు తీయడం, నలుగురికీ కనిపించడం మంచిది కాదని వాదించారు, భయపడ్డారు. కానీ భార్య సంపాదనతో జీవిస్తోందన్న విమర్శలు ఎదుర్కొన్న భర్త వీరేంద్ర ఆమెకు సపోర్ట్‌గా నిలవడం విశేషం. ఇపుడు ఎంతోమంది గ్రామస్తులకు ఆమె స్ఫూర్తి.


