breaking news
Success Story
-
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
డ్యాన్సర్‌గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్‌గా ఎలా అవతరించింది ఆ సక్సెస్ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మాయే బ్రెజిల్‌కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.బ్రెజిల్లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది. ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్‌లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. 2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది. అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్‌గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్‌లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.Kalshi raised $1B at an $11B valuation.A decade ago, only a few thousand people knew what a prediction market was.Eighteen months ago, most prediction markets were banned - until we overcame the government to set them free.Over the past seven years, our community has opened… pic.twitter.com/hGDkYxkSlh— Tarek Mansour (@mansourtarek_) December 2, 2025 (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం) -
అనుకోకుండా మోడల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు తేజం
-
ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్‌కు..!
కుటుంబ పోషణార్థం టెన్త్‌కే చదువుకి స్వస్తి పలికాడు. ఏదో సాధించేద్దాం అనుకుంటూ ముంబై మహానగరంలో అడుగుపెట్టాడు. అది కూడా జేబులో కేవలం రూ. 200లతో కుటుంబ సభ్యులకు చెప్పపెట్టకుండా వచ్చేశాడు. అక్కడ బాంద్రాస్టేషన్లో పరిచయమైన స్నేహితుడి చేతిలో మోసానికి గురయ్యా..రోడ్డుపై నిలబడిపోయాడు. కట్‌చేస్తే..ఏంలేదు అన్న పరిస్థితిని నుంచి ఏకంగా 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. స్వయంకృషితో పైకొచ్చిన మరో సాంబయ్య అతడు..అతడే దోసప్లాజ్ వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి. తల్లిదండ్రులు ఏడుగురు తోబుట్టువులతో కడు పేదరికంలో ఉన్న కుటుంబాన్ని పేదరికం నుంచి బయపటపడేయాలన్న ఆరాటంతో ముంబైకి ఒంటరిగా వచ్చేశాడు. అది కూడా కేవలం రూ. 200 రూపాయాలతో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బాంద్రా స్టేషన్లో పరిచయమైన స్నేహితుడే తోడు అనుకుంటే..తనదగ్గరున్న ఆ కాస్త డబ్బుని తీసుకుని పరారయ్యాడు. తోపుడు బండితో మొదలైన వ్యాపారం..తొలిసారిగా నమ్మకంతో చెలగాట మాడిన స్నేహితుడిని ఎదుర్కొని తల్లడిల్లిపోయాడు. ఏం చేయాలి..ఆకలిని ఎలా ఓర్చుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో కూడా ఆశను వెతుక్కుంటూ ఓ బేకరీలో ప్లేట్లు కడిగే పనికి కుదిరాడు. అలా నెలకు 150 రూపాయలు సంపాదించేవాడు. పడుకోవడానికి కటికి నేలపై స్థలం ఏర్పరుచుకున్నాడు. అలా ప్రతి నెల సంపాదించిన డబ్బుని ఆదాచేసి ఒక హ్యాండ్ బండిని అద్దెకు తీసుకున్నాడు. పాత్రలు స్టవ్ కోసం దాదాపు రూ. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అలా వాషి రైల్వే స్టేషన్ ఎదురగా ఉన్న వీధిలో ఇడ్లీలు, దోసెలు అమ్మడం ప్రారంభించాడు. అది చూడటానికి కేవలం ఒక బండి, కానీ కస్టమర్లకు చాలా పరిశుభ్రంగా అందించే ఆహార ప్రదేశంగా వారి మనసులను గెలుచుకున్నాడు. తన సోదరులను ఈ పనిలో చేర్చుకుని..అందమైన బట్టలు, టోపీలతో కస్టమర్లను ఆకర్షించేలా వ్యాపారం చేశాడు. అతడి భోజనంలోని రుచి త్వరలో వేలాది మంది ప్రజలకు చేరువై నెలకు దాదాపు రూ. 20 వేలు టర్నోవర్‌ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. వారంతా ఒకే అద్దె గదిలో ఉండేవారు. నిరంతరం జీవనాధారమైన తమ తోపుడు బండి, వంటగది కమ్ బెడ్రూం తమనుంచి లాగేసుకుంటారనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలా ఐదేళ్ల తర్వాత 1997లో చిన్న స్థలంలో ప్రేమ్ సాగర్ దోస ప్లాజా హోటల్ని పెట్టుకునే రేంజ్‌కి వచ్చాడు. అలా పుట్టింది షెజ్వాన్ దోస..అక్కడకు వచ్చిన విద్యార్థులు, స్నేహితులై ఇంటర్నెట్‌ని పరిచయం చేశారు. దాని సాయంతో ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల వంటకాలపై అవగాహన ఏర్పరుచుకున్నాడు. అలా పలు ప్రయోగాలు చేస్తూ ఉండగా..షెజ్వాన్ దోస అనే రెసిపీని కనుగొన్నాడు. అక్కడ నుంచి వెనుదిరగకుండా ఏకంగా 105 రకాల దోసెలను సృష్టించాడు. ఆ తర్వాత మాల్లో తన వ్యాపారానికి కాస్త చోటు ఇవ్వమని అడగగా బ్రాండ్ కాదంటూ పోమ్మన్నారు మాల్ నిర్వాహకులు. మరో సెంటర్ వన్మాల్ నిర్వాహకులకు అతడి చేతి ఆహారం రుచి గురించి తెలుసు. దాంతో వాళ్లు వ్యాపారం పెట్టుకునేందుకు స్థలాన్ని అందించారు. అక్కడ నుంచి మరిన్ని దుకాణాలు పెట్టమంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఆ సింగిల్ తోపుడు బండి నుంచి భారతదేశం నుంచి దుబాయ్, ఆస్ట్రేలియా వరకు విస్తేరించేలా 70కి పైగా దుకాణాలు వెలిసాయి. ఆ రోజు మోసగింపబడిని రూ. 200లతో మొదలైన ప్రస్థానం ఇప్పుడూ ఏడాదికి రూ. 50 కోట్ల టర్నోవర్ అందుకునే వ్యాపారాన్ని నిర్మించే రేంజ్‌కి చేరాడు. చివరగా ప్రేమ్ గణమపతి మాట్లాడుతూ..ఇదంతా అకస్మాత్తుగా వచ్చిన ఐడియా కాదని, రెండు చేతులు ఖాళీగా ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడూ మోసానికి గురైన రైల్వేస్టేషన్‌ని దురదృష్టకరమైన ప్రదేశం చూడలేదని అంటాడు. ఇదే ప్రదేశం తనకు ఏదో మార్గాన్ని చూపిస్తుందని వెతుక్కుంటూ వెళ్లాను అలా దొరికిన ప్లేట్లు కడిగే పనే తన పాలిట దైవంగా నమ్మా..అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటాడు ప్రేమ్ గణపతి.దొరికిన చిన్న పనిని చూసి నిరాశ పడకుండా..ఒక్కో మెట్టుని చేసుకుంటూ..అభ్యున్నతికి మార్గం వేసుకుని యువతకు ప్రేరణగా నిలవడమే గాక, మోసపోవడం అంటే దురదృష్టం కాదు..స్ట్రాంగ్ నిలబడేందుకు పునాది అని ప్రేమ్ గణపతి కథ చెప్పకనే చెబుతోంది. అంతేగాదు "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషలవుతారు అన్న నానుడికి సరైన అర్థం మన ప్రేమ్ గణపతి" కదూ..! -
ఐఎన్ఐ సెట్లో సత్తా చాటిన మహిళా డాక్టర్..!
పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో ఆలిండియా 7వ ర్యాంకు పొంది వార్తల్లో నిలిచింది డాక్టర్ సాయి త్రిషారెడ్డి. కిందటి నెలలో విడుదలైన ఈ ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే దక్షిణాదిలో మొదటి ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని బీరంగూడలో ఉంటున్న సాయి త్రిషారెడ్డి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ హౌస్ సర్జన్‌గా చేస్తోంది. ‘కత్తిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసినట్టే యువతకు ఆన్‌లైన్‌ను ఉపయోగించడం కూడా అంతే స్మార్ట్‌గా తెలిసి ఉండాలి’ అంటూ తన ప్రిపరేషన్ వర్క్ గురించి తెలిపింది..‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా గురజాల. అమ్మా నాన్నలు బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అనంత లక్ష్మీ నా చిన్నతనంలోనే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న బిజినెస్ రంగంలో ఉండగా, అమ్మ స్కూల్ టీచర్. కుటుంబ నేపథ్యంలో ఎవరూ డాక్టర్లు లేరు. నాన్న స్నేహితుల్లో డాక్టర్లు ఉండటం చూసి, నేనూ వైద్యవృత్తిపై ఆసక్తి పెంచుకున్నాను. ఇండియాలోనే పేరొందిన ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయాలనే ప్రయత్నం ఫలించాక, నా లక్ష్య సాధనలో సరైన దిశగా ఉన్నాను అనిపించింది. 2020 నీట్ ఫలితాల్లో 14వ ర్యాంకు, మహిళల విభాగంలో 6 వ ర్యాంకు వచ్చింది. ఈ యేడాది ఐఎన్ఐ–సెట్లో ఆల్ ఇండియా 7వ ర్యాంకు, దక్షిణాదిన నేనొక్కదాన్నే నిలవడం మరింత సంతోషాన్నిచ్చింది. సోషల్ మీడియాకు దూరంన్యూ ఢిల్లీ ఎయిమ్స్‌లో హౌస్‌సర్జన్‌గా వర్క్ చేస్తూనే పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఏదీ ఎవరికీ సులువుగా రాదు, దానికి తగిన క్రమశిక్షణతో ప్లానింగ్ చేసుకోవడమే మన ముందున్న మార్గం. ప్రిపరేషన్‌కి రోజూ ఒకే టైమ్ దొరికేది కాదు. వర్క్ షిఫ్టులు మారుతూ ఉండేవి. ఆరు గంటలు వర్క్, మిగతా టైమ్‌లో ప్రిపరేషన్ ప్లానింగ్‌కి కేటాయించుకున్నాను. ఆన్లైన్లో ఇంటర్వ్యూలు, కొన్నియాప్స్ గైడ్‌లైన్స్ తీసుకున్నాను. సోషల్‌మీడియాకు మాత్రం పూర్తి దూరంగా ఉన్నాను. ఒత్తిడిగా అనిపించినప్పుడు మాత్రం వాకింగ్, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మానాన్నలతో మాట్లాడటం మాత్రమే చేశాను. దాదాపు 9 నెలల ప్రిపరేషన్ నన్ను నా లక్ష్య సాధనకు చేరువచేసింది. దాదాపు ఈ ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మందికి పైగా హాజరయ్యారు. ఎంత పెద్ద పరీక్ష, ఎంత మంది పాల్గొంటున్నారు.. అనే భయం ఏ విషయంలోనూ ఎప్పుడూ సరైనది కాదు. నాలో ఉన్న శక్తి ఎంత... అనేదానిపైనే దృష్టి పెట్టాను. అదే ఈ రోజు నన్ను అగ్రస్థానంలో ఉంచింది’ అని తెలినారు ఈ యువ వైద్యురాలు. ఐఎన్ఐ సెట్లో దక్షిణ భారత దేశం నుండి పాల్గొన్న అభ్యర్థులలో ఏకైక మహిళా డాక్టర్‌గా తన ప్రతిభను చాటుకొని తెలుగు వారికి గర్వ కారణమయ్యింది. ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో వైద్య విద్యార్థి గానే కాకుండా అందరిలోనూ ఉత్తమ ఫలితాలను సాధించి భవిష్యత్ డాక్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వైకల్యాన్ని జయించిన సంకల్పం.. ఆ వైద్యుడి తదుపరి కల ఇదే!
విధి వెక్కిరించినా, సమాజం వెక్కిరించినా, తన కలను వదులకోలేదు. పట్టుదలగా తను అనుకున్నదిసాధించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే భారతదేశానికి చెందిన 3 అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య. తన కల సాకారం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన మూడు అడుగుల గణేష్ ( 25) తాను పోరాడి సాధించిన MBBS కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య అధికారిగా నియమితుడయ్యారు. వికలాంగులకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి సివిల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పేరు దేశ మంతా మారిమోగిపోతోంది. గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా పుట్టుకనుంచి గణేష్ ఎదుగుదల సమస్య వచ్చింది. అందుకే ఆయన ఎత్తు మూడు అడుగులకే పరిమితం అయింది. మరుగుజ్జుత్వం కారణంగా 72శాతం లోకోమోటర్ వైకల్యంతో జన్మించిన గణేష్ బరయ్య కేవలం మూడు అడుగుల పొడవు , 20 కిలోల బరువు మాత్రమే. శారీరకంగా ఉన్న సమస్య కారణంగా చిన్నతనంనుంచే ఎన్నో అవమానాలు, అవహేళలను తప్పలేదు. 2018లో నీట్ యుజి పరీక్ష రాసిన సందర్భంగా అతనిలోని వైకల్యం కారణంగా భారత వైద్య మండలి ఆయన్ను తిరస్కరించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS కోర్సుకు అడ్మిషన్ తిరస్కరించడంతో గుజరాత్ హైకోర్టులో కేసు వేశారు. అక్కడా ఫలితం దక్కలేదు. అక్కడితో ఆగిపోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 2019లో మీకు సీటు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వైకల్యం కారణంగా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని గణేష్ బరయ్యకు హామీ ఇచ్చింది. చట్టపరమైన ఖర్చులను భరించడంలో సహాయపడిన గణేష్ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్‌భాయ్ కటారియా మద్దతుతో, బరయ్య సంకల్పం ఫలించింది.ఇదీ చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!రోగులు మొదట్లో చికిత్సను నిరాకరించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తను అలాంటి వాటి గురించి పట్టించుకోనని, దానికి బదులుగా తనతో సానుకూలంగా ఉన్న చాలా మంది రోగులపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. వైద్య అధికారిగా తనతదుపరి లక్ష్యం తన కుటుంబంకోసం ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది. భావ్‌నగర్ జిల్లాలోని గోర్ఖి గ్రామంలోని కచ్చా ఇంట్లోనే నివసిస్తోంది. వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇటుక ఇల్లు నిర్మించడం అనేది తన డ్రీమ్ అని చెప్పారు. #WATCH | Bhavnagar, Gujarat: Dr Ganesh Baraiya overcomes legal hurdles being differently abled and works as a medical officer in a civil hospital. He says, "... My primary education was from my village... I took the NEET UG exam in 2018 but at that time, the Medical Council of… pic.twitter.com/K2Ai2VeJ8c— ANI (@ANI) December 2, 2025 -
డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతున్న దినసరి కూలీ..!
ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్‌తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్ ఫోన్ లైఫ్‌నే టర్న్ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్ మీడియా స్టార్‌గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్‌కి వెళ్లిపోయాడు. అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్ రాందాస్ తమ్నార్. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్ ఫోన్ కొనుకున్నాడు. ఇంత చిన్న వయసులోనూ ఫోన్‌తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్ మీడియా గురించి, ప్రమోషన్లు, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు. అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్‌కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్లైన్ మార్కెటింగ్‌లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు. అతని అంకితభావానికి డిజిటల్ స్కిల్ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్‌గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్ రాందాస్నే ఉదాహరణ. (చదవండి: ఆ అమ్మకు SIR సర్ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..) -
పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభ
యువ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్... వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో కోడ్ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు. వైబ్ కోడింగ్‌కు సంబంధించి ఏఐ టూల్ ‘కర్సర్’ను రూ పొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమన్ సాంగర్ పాతికేళ్ల వయసులోనే బిలియనీర్ అయ్యాడు...కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతోమంది కాలేజీ కోడర్లలో అమన్ సాంగర్ ఒకరు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్‌కు సంబంధించి ప్రపంచ ప్రసిధ్ధ యువకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.జనరేటివ్ ఏఐ ప్రపంచంలో ‘అమన్ సాంగర్’ అనేది సుపరిచిత పేరుగా మారింది. ‘ఎనీస్పీయర్’ సహ–వ్యవస్థాపకులలో 25 సంవత్సరాల అమన్ ఒకరు. ఫాస్ట్–రైజింగ్ ఏఐ టూల్‌గా పేరు తెచ్చుకున్న ‘కర్సర్’ అనేది ఎనీస్పీయర్ కంపెనీ సృష్టి. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తనకు పరిచయం అయిన మైఖేల్ ట్రుయేల్, సుయాలే, ఆర్విడ్ మార్క్‌లతో కలిసి ‘ఎనీస్పీయర్’ ్ర΄ారంభించాడు అమన్. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టీమ్‌గా ‘ఎనీస్పీయర్’ పేరు తెచ్చుకుంది. అమన్, మైఖేల్ ట్రుయెల్లు ‘నియో స్కాలర్స్’గా ఎంపికయ్యారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతరాన్ని సిలికాన్ వ్యాలీలోని ఫౌండర్స్, ఇన్వెస్టర్లకు పరిచయం చేసే కార్యక్రమమే...నియో స్కాలర్స్.ఈ పరిచయాల వల్ల కంపెనీ ఫస్ట్ రౌండ్ ఫండింగ్ సాఫీగా సాగింది. మొదట్లో ‘ఎనీస్పీయర్’ బృందం కంప్యూటర్–ఎయిడెడ్ డిజైన్‌కు సంబంధించి ఏఐ టూల్‌ను రూపొందించింది. ఆ తరువాత దారి మార్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసింది. ఇది తాము కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన డొమైన్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు రావాలని తీసుకున్న నిర్ణయమే ‘కర్సర్’ను రూపొందించడానికి కారణం అయింది. ఈ ఏఐ–పవర్డ్ కోడ్ ఎడిటర్ తక్కువ కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘వైబ్ కోడింగ్’ అనే ఐడియాను పరిచయం చేసింది కర్సర్.వైబ్ కోడింగ్ ద్వారా డెవలపర్స్ నేచురల్ లాంగ్వేజ్ మోడల్స్‌ని ఉపయోగించి కోడ్‌కు సంబంధించి రైట్, ఎడిట్, డీబగ్ చేయవచ్చు. కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘వైబ్ కోడింగ్’ ఎంపికైంది. తక్కువ టైమ్‌లోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ‘ఎనీస్పీయర్’ వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ కో–ఫౌండర్స్ బిలియనీర్లుగా మారారు. పద్నాలుగేళ్ల వయసులోనే కోడింగ్ మొదలుపెట్టాడు అమన్. ్ర΄ోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు.ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు‘నా భవిష్యత్ చిత్రపటం’ ఇలా ఉండాలని అమన్ ఎప్పుడూప్లాన్ చేసుకోలేదు.అయితే సాంకేతిక అంశాలపై తనలోని ఆసక్తే ఎన్నో దారులలోకి తీసుకువెళ్లింది. చిన్న వయసులోనే సాంకేతికరంగంలో ప్రపంచ ప్రముఖుడిని చేసింది. మొదట్లో కంపెనీ పరిస్థితి ఎలా ఉన్నా, ఆ తరువాత మాత్రం పోటీ ఎదురవుతుంది. ΄ోటీని ఎలా తీసుకుంటారు?’ అనే ప్రశ్నకు అమన్ ఇచ్చిన జవాబు... పోటీ గురించి నిరంతరం పట్టించుకుంటాం. వారి పనితీరు కూడా పరిశీలిస్తాం. పనితీరు, ఆవిష్కరణలు నచ్చితే వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. మాకే అన్నీ తెలుసు అనుకోము. ఎందుకంటే మేము చేయలేనివి కూడా వారు చేసి ఉండవచ్చు.’ఒక బాటసారి మనలో ఒక అంశంపై ఆసక్తి ఉంటే అది ఒకేచోట ఆగి΄ోదు. నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో దారులలో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి ఒక బాటసారి అమన్ సాంగర్. వీడియో గేమ్స్ కంటే ఎక్కువగా కోడింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం అతడిని ఎంతో దూరం నడిపించింది. సిలికాన్ వ్యాలీ వరకు తీసుకువెళ్లి సాంకేతిక దిగ్గజాలను పరిచయం చేసింది. పోటీలో మన ముందు ఉన్న వ్యక్తిని చూసి భయపడవద్దు. వెనక్కి తగ్గవద్దు. మన కంటే అతడికి ఎక్కువ తెలిసి ఉంటే అతడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ΄ోటీతో మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవచ్చు’ అంటున్నాడు అమన్ సాంగర్. -
రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
రోజుకు రూ.20 సంపాదన నుండి రూ.300 కోట్లకు పైగా విలువైన బ్రాండ్‌ను నిర్మించగలమైనా ఎవరైనా కలగంటారా? కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గొప్ప వ్యాపారవేత్తగా నిలిచింది. చిన్న చినుకులా మొదలై, ప్రభంజనం సృష్టించిన ‘చిను కలా’ స్టోరీ వింటే... ఆత్మవిశ్వాసం, పట్టుదల , కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది.ఆమె ఏ బిజినెస్ కోర్సూ చదవలేదు. ఆమె జీవితమనే విశ్వవిద్యాలయంలోనే ప్రతీదీ నేర్చుకున్నారు. నో కార్పొరేట్ సపోర్ట్. నో గాడ్‌ఫాదర్ నో ప్లాన్ బి . ఎలాగైనా సాధించాలనే తపన, ఆశ, కల, నమ్మకం. కేవలం 36 చదరపు అడుగులు. ఒకే నగల ట్రే. కట్ చేస్తే.. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్‌తో ఒక లగ్జరీ బ్రాండ్‌తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే అన్నట్టుగా ఎన్నో భయంకరమైన అనుభవాలనుంచి ఎదగి ఉన్నత శిఖరాలకు చేరింది. తన బ్రాండ్ చిను కళాను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్‌గా నిలిపింది. అక్టోబర్ 10, 1981న ముంబైలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది చిను. ఏడాది వయసున్నప్పుడే ఆమెను తల్లి విడిచిపెట్టి సౌదీకి వెళ్లిపోయింది. తండ్రి, రెండో పెళ్లి చేసుకొని సవతి తల్లిని తీసుకొచ్చాడు. కష్టాలు మొదలయ్యాయి. చినుతోవాగ్వాదం సందర్భంగా నీ యిష్టం వచ్చినట్టు నువ్వు బతకాలనుకుంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు.అంతే 15 ఏళ్ల చిను జేబులో కేవలం రూ. 300 మరియు కొన్ని బట్టలతో ఇంటి నుండి బయలుదేరింది. ఆమె టికెట్ లేకుండా నానాసుపారా నుండి సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ పడుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె పడుకోలేకపోయింది. మరుసటి రోజు తాను ఎక్కడికి వెళ్లాలో, ఏమి తినాలో అర్థంకాక రాత్రంతా ఏడ్చింది, ఉదయం, ఒక మహిళ ఆమె కథ విని, కమిషన్ సంపాదన కోసం ఇంటింటికీ తిరిగి అమ్మే పనిని ఒకదాన్ని అప్పగించింది. ఏదో ఒకపనిచేసుకని, కడుపునింపుకుంటూ గౌరవంగా బతుకుతూ పైకి ఎదగాలని విజయం సాధించాలని అప్పుడే దృఢంగా నిశ్చయించుకుంది.డోర్-టు-డోర్ సేల్ ద్వారా సేల్స్‌గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. అలా రోజుకు 25 రూపాయలు వసూలు చేసే వసతి గృహంలో నివసించింది. ఆమె మొదటి అమ్మకాల ప్రయత్నంలో, ఒక మహిళ ఆమె ముఖం మీద తలుపు వేసేసింది. అలా గంటల తరబడి గుండెలు పగిలేలా ఏడ్చింది కానీ వదులుకోలేదు. వెయిట్రెస్, రిసెప్షనిస్ట్ మొదలైన వివిధ ఉద్యోగాలను చేపట్టింది. కీలక మలుపు 2002లో ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం సంపాదించడంతో చిను జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇక్కడ ఆమె తన కాబోయే భర్త అమిత్ కళను కలుసుకుంది, అతను MBA హోల్డర్, ఆమె వ్యవస్థాపక ప్రయాణంలో కీలకమైన మద్దతుదారుగా మారారు. వారు 2004లో వివాహం చేసుకుని బెంగళూరుకు వెళ్లారు, అక్కడ చినుకు మోడలింగ్ పట్ల ఉన్న ప్రేమ ఆమెను 2008 గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా పోటీలో పోటీ పడేలా చేసింది, అక్కడ ఆమె టాప్ 10లో నిలిచింది. ఈ సమయంలో చిను ఉపకరణాలు , ఆభరణాల గురించి నేర్చుకుంది.తన మోడలింగ్ అనుభవాల నుండి ప్రేరణ పొందిన చిను, కార్పొరేట్ మర్చండైజ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఫోంటే కార్పొరేట్ సొల్యూషన్స్‌ను స్థాపించింది. ఆ కంపెనీ త్వరగా ఆదరణ పొందింది, సోనీ, ESPN, ఎయిర్టెల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు వస్తువులను ఉత్పత్తి చేసింది. 2014లో, స్టైలిష్ మరియు బ్రాండెడ్ ఉపకరణాల కోసం భారతీయ ఆభరణాల మార్కెట్లో అంతరాన్ని గుర్తించి, ఆమె రూబన్స్ యాక్సెసరీస్న రూ. 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. రూబన్స్ యాక్సెసరీస్ బెంగళూరులోని ఫీనిక్స్ మాల్లో 36 చదరపు అడుగుల చిన్న స్థలంలో ప్రారంభమైంది. అది కాస్తా బెంగళూరులోని చాలా ప్రసిద్ధ మాల్ ఫోరం మాల్లో తన రెండవ స్టోర్‌ను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. అలా మొదలై చిను ప్రయాణం వినియోగదారుల ఆదరణతో కొత్త పుంతలు తొక్కింది. వినియోగదారుల అవసరాలపై విస్తృతమైన పరిశోధనల చేసిన 80 శాతం ప్రత్యేకమైన, స్పెషల్ డిజైన్లు రూపొందించింది. అలా పాశ్చాత్య , జాతి అభిరుచులకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది. ఈ వ్యూహంతో వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. 2014 నాటికి, రూబన్స్ యాక్సెసరీస్ రూ. 56 లక్షల ఆదాయాన్ని సాధించింది. 2022 నాటికి రూ. 35 కోట్లకు పెరిగింది. ఈ బ్రాండ్ ఐదు ఆఫ్‌లైన్ స్టోర్లకు విస్తరించింది,ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పాపులర్ అయింది. అమ్మకాలలో 75శాతం ఆన్లైన్లో నడిచాయి. ఒక దశలో మింత్రాలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.2023లో, రూబన్స్ యాక్సెసరీస్ వార్షిక ఆదాయంలో రూ. 65 కోట్లకు చేరుకుంది. ప్రముఖ టీవీ షో "షార్క్ ట్యాంక్ ఇండియా" సీజన్ 2 నుండి ఆమె రూ. 1.5 కోట్ల నిధులను పొందింది. IIM అహ్మదాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రసంగాలు చేసింది. పాఠశాల విద్య పూర్తి చేయకపోయినా, చిను నికర విలువ ఇప్పుడు రూ. 40 కోట్లుగా ఉంది.ఆమె బ్రాండ్ 40 లక్షలకు పైగా కస్టమర్లకు సేవలందించింది నమ్మశక్యం కాని రూ.310 కోట్లను దాటింది. ఇంతటితో ఆమె ప్రయాణం ఆగిపోడం లేదు. తన బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రియమైన ఆభరణాల బ్రాండ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇటీవల ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అనంత క్యాపిటల్, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ మాతృ సంస్థ ఫోంటే ఫ్యాషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. -
ఇంజనీర్‌గా సూపర్ సక్సెస్ అయినా కూడా..
ఇంజీనీరింగ్, వైద్య విద్య రెండు చాలా భిన్నమైన కోర్సులు. రెండింటిని చదవాలనుకోవడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టినట్లుగా.. దేనిలోనూ మంచి స్కిల్‌ని సాధించలేం, రాణించలేం. కానీ అమ్మాయి రెండింటిలోనూ సత్తా చాటి అందర్నీ విస్మయపర్చింది. ఇక్కడ ఈ మహిళ ఇంజనీరింగ్ కెరీర్‌ని ఎంచుకుని..మంచిగా జాబ్‌లో సెటిల్ అయ్యాక స్టెతస్కోప్ పట్టుకునెందుకు రెడీ అవ్వడం విశేషం. అలాంటి నిర్ణయం వినడానికి కాస్త హాస్యాస్పదంగా అనిపించినా..ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే అని చూపించి ప్రేరణగా నిలిచింది.ఆ అమ్మాయే ఆకృతి గోయెల్. 2015లో ఇంజనీర్ గ్రాడ్యుయేట్‌గా బయటకు అడుగుపెట్టి మంచి కెరీర్‌ని నిర్మించుకుంది. వేగవంతమైన స్టార్టప్‌ల ప్రపంచంలో విజయవంతమైన ఇంజనీర్ అనిపించుకుంది. కార్పోరేట్ ప్రపంచంలోకి దూసుకుపోయి..అందివచ్చిన నిచ్చెనలన్నీ ఎక్కేసింది. టీమ్ లీడర్‌గా అందరూ అసూయపడే రేంజ్లో వేతనం అందుకుంది. తనకు ఎదురేలేదు అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతున్న ఆమెకు సడెన్‌గా ఇక చాలు ఇందులో ఈదింది అనిపించింది. ఎంతో అలసిపోతున్నట్లుగా, అసంతృప్తిగా సాగుతోంది లైఫ్ అనిపించిందామెకు. రోజురోజుకి ఇది వద్దు అనిపిస్తోందామెకు. ఏదో తెలియని ఒత్తిడితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా లాక్డౌన్ టైంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయం ధైర్యంగా తీసుకుంది. ఆ తర్వాత తగిన విరామం తీసుకుని, ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చేవరకు వేచి ఉంది. తదుపరి యోగా టీచర్‌గా, న్యాయవాదిగా లేదా హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా మారాలని అని ఆలోచిస్తూ ఉండేది. సరిగ్గా అప్పుడే తన చిన్ననాటి కల గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు డాక్టర్‌గా వైద్య విద్యను అభ్యసించడమే ఫన్నీనా అనుకుంది. వయోపరిమితి లేదు కదా అని సరదాగా నవ్వుకుంది. ఇంతలో సుప్రీంకోర్టు వైద్య ప్రవేశ పరీక్షలకు ఉన్నత వయో పరిమితిని తొలగించింది. అంటే ఈ రంగంలోకి పయనించు అనేందుకు ఇది గ్రీన్ సిగ్నల్ కాబోలు అనుకుని..ఎలాంటి ఆలోచన లేకుండా మళ్లీ కెరీర్‌ని మొదటి నుంచి ప్రారంభించింది. అలా క్లాస్‌రూమ్‌లో బయాలజీ పాఠాలపై మనసులగ్నం చేసింది. బహుళ మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను నిర్వహించిన ఆ మహిళ పెన్నుతో తడబడింది. ఉపాధ్యాయులను అడగడానికి ఇబ్బంది పడే ప్రశ్నలను సైతం అడిగేందుకు భయపడలేదు. పదేళ్ల తర్వాత తరగతికి రావడం అంత సులభం కాలేదామెకు. అయినా అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ చదవుకోసాగింది. మరోవైపు స్నేహితులు, బంధువులు టైం వేస్ట్ చేసుకుంటుందంటూ విమర్శించడం ప్రారంభించారు. కానీ ఆకృతి ఇంజీరింగ్ కెరీర్లో సక్సెస్ అందుకున్నా.. ఇందులో కూడా గెలుపు నా సొంతం అవ్వాలన్న కసి మరింత పెంచుకుంది. అవిశ్రాంతంగా చదివింది. దాదాపు వంద మాక్‌టెస్ట్‌లకు పైగా రాసింది. ఆందోళనకు గురైనప్పుడల్లా..కుటుంబ మద్దతు తీసుకుని మళ్లీ రీఛార్జ్ అవుతుండేది. అలా నీట్ యూజీ పరీక్షలో 676 స్కోరు తెచ్చుకుని డాక్టర్ కోర్సు అభ్యసించింది. 2026లో డాక్టర్‌గా బయటకు అడగుపెట్టనుంది. కార్పొరేట్ లీడర్ నుంచి వైద్య విద్యార్థిగా సాగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా. ఏ నిర్ణయం తీసుకున్నా..దానిపై స్ట్రాంగ్‌గా నిలబడాలి, నిలదొక్కుకునేలా విజయ ఢంకా మోగించాలని ఆకృతి స్టోరీ చెబుతోంది కదూ..!.(చదవండి: పర్యావరణ స్ఫూర్తి: క్లీన్ ఎనర్జీ స్టార్స్..!) -
ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!
జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా మహిళా క్రికెట్‌పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.తొమ్మిదేళ్ల వయసులోఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా అవార్డు అందుకుంది.వరల్డ్‌కప్ చాంపియన్గాభారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. అయితే, క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.సగటు భారతీయ తండ్రిఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్‌పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.అన్న నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్‌గా మారిపోయా.అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్‌గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.ఉన్నత శిఖరాలకుఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్‌తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.ఊహించని విధంగా.. ఇప్పుడిలాఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత? -
క్రికెటర్ టు ఐఏఎస్ జర్నీ..! బస్సు డ్రైవర్ కొడుకు విజయగాథ..
ఒక్కోసారి మనం కోరుకున్న కలకి, అందనంత దూరంలో మన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. దాంతో మన డ్రీమ్‌ని చంపేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ బస్సు డ్రైవర్ కొడుకు. పోనీ నచ్చిన యూనివర్సిటీలో చదువుదామన్న చేతిలో చిల్లిగవ్వ లేదు. అలాంటి నేపథ్యంలో ఐఏఎస్ చదవాలనుకోవడమే సాహసం అనుకుంటే..సివిల్స్ ఎగ్జామ్‌లో విజయ సాధించడమే కాదు తాను కోరుకున్నట్లుగా ఐఏఎస్ అయ్యాడు. విధి నీ వల్ల కాదని వెక్కిరిస్తూ ఉన్నా..వెనకడుగు వేయకుండా తలరాతనే మార్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు.అతడే ఉత్తరప్రదేశ్‌కి చెందిన బస్సు డ్రైవర్ కొడుకు మొయిన్ అహ్మద్. చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావలన్నిది అతడి కల. అతని తండ్రి వలీ హసన్ ఏకైక సంపాదనపైనే కుటుంబం అంతా ఆధారపడి ఉంది. అదీగాక తండ్రి తన క్రికెట్‌కు అవసరమైన కిట్కొనడమే కష్టంగా ఉండేది. దాంతో ఇది ధనవంతు పిల్లలు ఆడే ఆట అని మనసుకు నచ్చజెప్పుకుని..చదువుపై దృష్టి సారించాడు. అలా ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులు తెచ్చుకుని చాలామంది విద్యార్థుల డ్రీమ్ అయిన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. కానీ అక్కడి కాలేజీ చదువుల ఖర్చులు తట్టుకునే సామర్థ్యం లేక ఆ కలను కూడా చంపేసుకున్నాడు. ఎందుకంటే అతడికి విద్యా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రాలేదు. చివరికి తను ఉండే గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కాలేజ్‌లో జాయిన్ అయిపోయాడు. అలాగే తన భవిష్యత్తు కోసం అలాగే కుటుంబ అవసరాల నిమిత్తం సైబర్‌కేఫ్‌లో పనిచేస్తూ.. చదువు పూర్తిచేశాడు. ఆ తర్వాత నెలకు రూ. 40 వేలు వచ్చే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు. అప్పుడే అతనికి ఐఏఎస్ అవ్వాలనే కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ప్రతి డ్రీమ్‌పై నీళ్లు జల్లేసిన తన ఆర్థిక పరిస్థితి మారేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే దీన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకైన సివిల్స్ఎగ్జామ్ వైపుకి వెళ్లడం అంటే కెరీర్‌ని నాశనం చేసుకోవడంతో సమానమని హితవు పలికారు. అతడి అమ్మ తస్లీమ్ జహాన్ మాత్రమే ఇందుకు మద్దతిచ్చింది. దాంతో మోయిన్ ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగాడు. అలా 2019లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు. తన ప్రిపరేషన్‌కు నిధులు సమకూర్చుకోవడానికి రూ. 2.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఢిల్లీలో అతడి జర్నీ చాలా భయనకంగా ఉండేది. ఓ పక్కన తెచ్చుకున్న డబ్బులన్నీ నీళ్లలా ఖర్చు అయిపోతుండేవి, మరోవైపు ఒత్తిడి పెరిగపోతుండేది. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో తెలియని టైంలో తన గురువు IRS అధికారి ఆసిఫ్ యూసుఫ్ అతియా ఫౌండేషన్ సాహిల్ ఖాన్ మార్గనిర్దశంలో ముందుగకు సాగాడు. ఖర్చుల నిమిత్తం అతడికి సాయం చేసేందుకు సాహిల్ ముందుకొచ్చేవాడు. ఈ చర్య ఇతరులు తనకు సహాయం చేయగలరన్న నమ్మకం అతడిని కార్యోన్ముఖుడిని చేసింది. అలా తన మొదటి మూడు ప్రయాత్నాలలో సివిల్స్‌లో ఓటమిని ఎదుర్కొన్నా..నాల్గో ప్రయత్నంలో ఆలిండియా 296వ ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అధికారి అయ్యాడు. తను ఉన్న స్థితికి మించిన లక్ష్యం పెట్టుకోవడం తప్పుకాదని..తగిలే ఎదురుదెబ్బలే ఆయుధాలు అవుతాయి అనేందుకు మొయిన్ అహ్మద్‌నే ఉదాహరణ. తలచుకుంటే ఎంత కఠినమైన సవాళ్లును కష్టాలై పరారైపోయేలా తలరాతను మార్చుకోవచ్చని అహ్మద్ కథ వింటే స్పష్టమవుతుంది కదూ..!. (చదవండి: తక్కువ వ్యర్థాలతో హెల్దీ లైఫ్ ..! మాజీ ఇస్రో శాస్త్రవేత్త జీరో వేస్ట్ పాఠాలు) -
లక్షల్లో వేతనం.. రోబోటిక్ లైఫ్ వద్దనుకున్నాడు..! కట్‌చేస్తే..
బిందాస్ లైఫ్.. మంచి కంపెనీలో లక్షల్లో జీతం, గుర్తింపు ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెలితి..తన చుట్టూ ఉన్న వాళ్లు 30 ఏళ్లకే వైస్‌ప్రెసిడెంట్ హోదాను అనుభవిస్తుంటే..తాను 26 ఏళ్లు వచ్చినా..ఇదే 9 టు 5 జాబ్..రొటీన్ లైఫ్. రోబోటిక్‌గా పనిచేస్తూ..ప్రమోషన్లు,గుర్తిపుతోనే బతికేయాలా అనే ఆలోచన నిద్రపట్టనివ్వలేదు. అలాగని ఈ ఉద్యోగం వదులుకునే సాహసం కూడా లేద అతనికి. చివరికి ఏదోలా ఉద్యోగం వదిలేస్తే..ఊహించని విధంగా ఆ జాబ్ కాస్త ఊడిపోయింది. తలకిందులైన తన పరిస్థితికి కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓటమికి అవకాశం ఇవ్వనంటూ పడిలేచిన కెరటంలా సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి గొప్ప సక్సెస్ అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. అతడే ముంబైకి సెమ్లానీ. కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తాత్కలిక వర్క్ వీసాపై యూఎస్ వెళ్లాడు. అలా 2015లో జేపీ మోర్గాన్ యూఎస్ వీసాపై ఇంటర్న్‌గా పనిచేశాడు. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి..అదే కంపెనీకి సంబంధించి.. ఆస్తినిర్వహణ విభాగంలో అసోసియేట్‌గా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆనందం లేదనే ఫీలింగ్ వెంటాడేది సెమ్లానికి. తన చుట్టూ ఉన్నవాళ్లు చకచక వైస్ ప్రెసిడెంట్ హోదా పొందేస్తుంటే..నేను మాత్రం ఇలా మెకానికల్‌గా 9 టు 5 జాబ్ చేస్తున్నాననే బాధ వెంటాడేది. ఈ ఉద్యోగంలో లక్షల్లో వేతనం, మంచి గుర్తింపు ఉన్నాజజ ఏదో అసలైన సక్సెస్‌ని అందుకోలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉండేది. పోనీ జాబ్‌ని వదిలేద్దామంటే..అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం రావడం లేదు.ఎందుకంటే అద్దె కూడా చెల్లించని విధంగా మంచి సౌకర్యాలు, ప్రతి ఏడాది మంచి వేతనంతో కూడిన ప్రమోషన్లు, చక్కటి గుర్తింపు ఉన్నాయి. ఇవన్నీ వదులుకుని వెళ్లడం అంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు వెంటాడింది. ఏం చేయాలో తెలియక ధ్యానం, డిజటల్డిటాక్స్ వంటి మానసిక థెరపీలు తీసుకుని..తనకేం కావలి అనేదానిపై స్పష్టత తెచుకున్నాడు. అలా ఈ జాబ్ వద్దనే నిశ్చయానికి రావడమేగాక మంచి జాబ్‌లో తక్కువ వేతనానికి చేరిపోయాడు. తాను కోరుకున్న మానసికి ఆనందం దొరికింది చాలు..ఇక ఖర్చులు విషయమైతే..తన జీవినశైలిని సర్దుబాటు చేసుకుంటే సరి అనుకున్నాడు. అలా సాగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి లాక్డౌన్ రావడం..సంపాదించిన ఆ ఉద్యోగం కాస్తా పోవడం అన్ని చకచక జరిగిపోయాయి.తీవ్ర నిరాశ, నిస్పృహ..తప్పు చేసిన ఫీలింగ్..అనవసరంగా జేపీ మోర్గాన్‌లో ఉద్యోగాన్ని వదులుకున్నానా..తప్పు నిర్ణయం తీసుకున్నానా అంటూ..నిద్రలేని రాత్రుల గడిపేవాడు. తన మీద తనకే జాలేసిది. అలా..పూర్తిగా డిప్రెషన్లోకి కూరుకుపోయాడు. కానీ తను చేసే మెడిటేషన్, మానసిక థెరపీల సాయంతో మళ్లీ రీచార్జ్ అయ్యి..స్టార్టప్ దిశగా అడుగులు కదిపాడు. ఆ విధంగా రూ. 53 కోట్లు టర్నోవర్ చేసే టార్టన్ స్టార్టప్‌ని నెలకొల్పి గొప్ప సక్సెస్‌ని అందుకున్నాడు. తాను కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా..పరిస్థితులు తలికిందులైనప్పుడూ ఎలా సంయమనంగా ఉండాలో నేర్చుకున్నాడు. అంతేగాదు విజయం అంటే పెద్దమొత్తంలో జీతం కాదు..అంతకుమించిన ఆనందం., సంతృప్తి అని చెబుతున్నాడు సెమ్లానీ.(చదవండి: Inspiring Story: సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..) -
సక్సెస్ అంటే కోట్లు గడించడం కాదు..! కష్టానికి తలవంచకపోవడమే..
కంటతడి పెట్టించే కష్టాల కొలిమి..సాధించాలన్న ఆశయాన్ని కన్నీళ్లు చుట్టుముట్టేస్తున్నా..వెనకడగు వేయలేదు. మనసును మెలిపెట్టే బాధనంతటిని లక్యాన్ని మరింత చేరువ చేసే సాధనంగా మార్చాడు. జీవిత పోరాటంలో ఎలా గెలుపుని ఒడిసి పట్టుకోవాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. అతడు అడగడుగునా ఎదురయ్యే సవాళ్లను, కంటతడి పెట్టిస్తున్న ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ఉన్నతస్థాయికి చేరుకోవడమే గాక, తన బాధ్యతల విషయంలోనూ రాజీకి తావివ్వకుండా ఎలా సమర్థవంతంగా నిర్వర్తించింది రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు.ఆ పోస్ట్‌లో తాను ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించానని పేర్కొన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అతడి తండ్రి తన పిల్లలకు మంచి మెరుగైన జీవితాన్ని అందించాలనే తపనతో ఢిల్లీ వెళ్లాడు. కానీ విధి మరోలా తలిచింది. అనూహ్యంగా 2013లో తండ్రి ఆకస్మిక మరణం తన జీవితాన్ని పూర్తిగా విషాదకరమైన జీవితంలోకి నెట్టేసింది. అయితే అతడు ఎంతటి కఠినమైన సమస్యలు వచ్చినా..చదువును వదలకూడదన్న సంకల్పంతో ముందుకు సాగాడు. అలా 2015లో రూ. 3.15 లక్షల ప్యాకేజ్‌తో బహుళ సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ సక్సెస్‌ని అక్కడితో ఆపకుండా 2018 నాటికి వేరే కంపెనీకి మారి రూ. 7.5 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. ఢిల్లీ అద్దె ఇంట్లో ఉంటూ అప్పులన్నీ తీర్చేశాడు. కానీ నవంబర్ 2020లో మళ్లీ విషాదం చుట్టుమట్టింది. ఆ ఏడాది తన తల్లిని కోల్పోయాడు. దాంతో అతడిపై తమ్ముడు, చెల్లి బాధ్యతలు మీద పడ్డాయి. తనలా తన తోబుట్టువులను కూడా మంచి స్థాయిలో తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వారి చదువుల విషయంలో రాజీపడకుండా చదివించాడు. దాని ఫలితం సోదరికి రూ. 11 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో ఉద్యోగం రాగా, తమ్ముడికి బీటెక్ సెకండియర్‌లో ఉండగానే జాబ్ కొట్టేశాడు. అలాగే తన స్వగ్రామంలోని ఇంటిని 2021లో పునర్నిర్మించే పనులు ప్రారంభించాడు. ఆ ఇల్లు అక్టోబర్ 2022 నాటికి పూర్తవ్వగా, నవంబర్ 2022లో, తాను వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. అలాగే తన వివాహం ఇంటి నిర్మాణాన్ని కవర్ చేయడానికి సుమారు రూ. 20 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నానని, దాని ఈ ఏడాది ఆగస్టు 2025 నాటికి క్లియర్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తన దగ్గర ఎలాంటి పొదుపులు లేవు గానీ అతిపెద్ద సక్సెస్‌ని సాధించగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. ఇదేంటి అనుకోకండి. ఎందుకంటే జీవితం నన్ను బాధించే కష్టాల కడలిలో ముంచినా..వెనక్కిచూడలేదు, ఆగిపోలే..!. స్థైర్యంతో ముందుకు సాగిపోయాను..మంచి స్థాయికి చేరుకున్నా. అలాగే నా తోబుట్టువులను సెటిల్ చేయగలిగా. ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నా. గుర్తించుకోండి సక్సెస్ అటే ఎన్ని కోట్లు కూడబెట్టాం అన్నది కాదు. జీవితం మనల్ని ఎంత కష్టబెట్టినా..తడబడకుండా ముందుకు సాగడం అని సగర్వంగా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షించడమే కాదు..ఇది గొప్ప స్ఫూర్తిగాకమైన స్టోరీ బ్రదర్ అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
లోగో గుర్తుపట్టలేదని ఉద్యోగమివ్వలేదు, కట్ చేస్తే రూ. 400 కోట్ల కంపెనీ
RodBez Founder Dilkhush Success Story: నడి గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని అంటాడో సినీ కవి. ఈ సరిగ్గా ఈ మాటలకు అతికినట్టు సరిపోయే సక్సెస్ స్టోరీ బిహార్‌కు చెందిన ఆటో డ్రైవర్ ది. ఎక్కడో ఒక మారు మూల గ్రామంలో పుట్టాడు. చదివింది 12వ తరగతే. సెక్యూరిటీ గార్డు ఉద్యోగానివెళితే.. కాదు పొమ్మన్నారు. కట్ చేస్తే 400 కోట్ల కంపెనీ సీఈవో. ఆసక్తిగా ఉంది కదూ.. పదండి ఈ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.ఇది బిహార్‌కు చెందిన దిల్ఖుష్ కుమార్ (Dilkhush Kumar) కథ. ఇతని సక్సెస్ స్టోరీ IIT గ్రాడ్యుయేట్లను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పట్టుదలగా పనిచేస్తే, దిల్ ఉంటే.. ఆటో డ్రైవర్ కూడా ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోగా సత్తా చాటవచ్చని నిరూపించిన కథ. 12వ తరగతి చదివిన ఒక సాదారణ యువకుడు ఆటో డ్రైవర్‌గా నానా కష్టాలు పడ్డాడు. కానీ వాటినే తలుచుకుంటూ అక్కడే ఆగిపోలేదు దిల్ఖుష్. ఈ రోజు రూ.400 కోట్ల వ్యాపార ప్రపంచాన్ని సృష్టించాడు.తన చదువుకు తగ్గట్టుగా అనుకొని ఒక రోజు సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు దరఖాస్తు చేశాడుదిల్ఖుష్ కానీ విద్యార్హతలు సరిపోవంటూ తిరస్కరించారు. దీంతోపాటు అనేక ఇంటర్వ్యూలకు వెళ్లాడు. యాపిల్ లోగోను గుర్తించలేకపోవడంతో ఈ ఉద్యోగం పొందలేకపోయాడు. ఈ తిరస్కరణలు అతన్ని వెనక్కి నెట్టలేదు, మరింత కసి పెంచాయి. ముందుకు నడిపించాయి. తానూ పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని నిర్ణయించు కున్నాడు. ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాడు. అదే ఎన్నో జీవిత పాఠాల్ని నేర్పించింది. ఎన్నో సమస్యల్ని కళ్లారా చూశాడు. వాటిల్లోంచే ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లాలనుకుంటే సురక్షితమైన మార్గం లేదనీ, సుదూర ప్రాంతాలకు, టాక్సీలు ఖరీదైనవి , నమ్మదగినవి లేవని గమనించాడు. చాలామంది అతని కస్టమర్లు కూడా ఇదే ఫిర్యాదు చేశారు. తానే ఏదో చేయాలని నిర్ణంచుకున్నాడు. పెద్దగా పెట్టుబడిలేదు. ధైర్యమే అతని పెట్టుబడి. 2016లో "రోడ్బెజ్"(Roadbez) అనే యాప్ సేవను ప్రారంభించాడు. ఇదిరైడ్-హైలింగ్ యాప్ కాదు, సొంత టాక్సీలూ ఉండవు. విశ్వసనీయ నెట్వర్క్. కానీ ప్రజలు, సర్టిఫైడ్ , నమ్మకమైన స్థానిక డ్రైవర్లను కలిపే నమ్మకమైన ప్లాట్‌ఫారమ్. "రోడ్‌వేస్" అనే ఆలోచన సరళమైనది కానీ శక్తివంతమైనది. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి వాహనాలను అందిస్తుంది.రోడ్బెజ్ వన్-వే టాక్సీలను అందించింది, కాబట్టి మీరు రౌండ్ ట్రిప్ కోసం చెల్లించాల్సిన అవసరం లేదు. వారు 50 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి కార్‌పూలింగ్, రైడ్-షేరింగ్‌ను ప్రోత్సహించారు. దీని వలన సామాన్యులకు కూడా సుదూర ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. అలా మొత్తం రాష్ట్ర ప్రయాణ అనుభవాన్ని నెమ్మదిగా మార్చాడు. తరువాత 2021లో,బిహార్‌లోని ప్రతి నగరాన్ని అనుసంధానించడానికి అతను ఒక యాప్‌ను ప్రారంభించాడు. అతనిని , అతని ఆలోచనను, పెట్టుబడిదారులు నమ్మారు. రూ. 40 లక్షల ప్రారంభ నిధులు వచ్చాయి. అతను అందించిన గ్యారెంటీ గేమ్-ఛేంజింగ్. రోడ్బెజ్ డ్రైవర్ పొరబాటు కారణంగా ఒక వేళ విమానాన్ని మిస్ అయితే, కంపెనీ కొత్త టికెట్ బుక్ చేస్తుంది. అంతకు ముందు ఇలాంటి ఆఫర్ మరి ఏ సంస్థ ఇవ్వలేదు. భారీ ఆదరణ లభించింది. కేవలం 7 నెలల్లోనే దిల్ఖుష్, అతడి టీమ్ ఏకంగా రూ.4కోట్ల నిధులను సమీకరించింది.షార్క్ ట్యాంక్ ఇండియా సెట్లోకి అడుగుపెట్టినప్పుడు అతని ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యంత తెలివైన వ్యాపారవేత్తల ముందు, IIT ,IIM గ్రాడ్యుయేట్ల ముందు నమ్మకంగా నిలబడి, తన కంపెనీలో 5 శాతం కోసం రూ. 50 లక్షలు అడగడంతో వారంతా షార్క్స్ ముగ్ధులయ్యారు. మార్కెట్‌పై అతని లోతైన అవగాహన, అద్భుతమైన ప్రయాణాన్ని చూసి ఫిదా అయిపోయారు. చివరికి, OYOకి చెందిన రితేష్ అగర్వాల్ , ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన నమితా థాపర్ రూ. 50 లక్షలు పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా చాలా తక్కువ సమయంలోనే వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టించింది కంపెనీ. రూ. 4 వందల కోట్ల వ్యాపారంగా మారింది. ఇప్పుడు తన స్టార్టప్‌లో ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. సక్సెస్ ఫుల్ థాట్స్ కేవలం కార్పొరేట్ బోర్డ్ రూంల నుంచే కాదు.. మామూలు ఆటోడ్రైవర్ ఆలోచనలోంచి కూడా పుడతాయని నిరూపించాడు దిల్ఖుష్ -
ఒకప్పుడు అంట్లు తోముతూ.. ఇప్పుడు వేలమందికి ఉద్యోగం
సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్‌లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.మొదటి జీతందిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణీకులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందాడు. ఇదే అతని మొదటి జీతం.ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించాడు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. నేను చేసిన పనికి యజమాని నా జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచాడు.రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయంకున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నాడు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.ఇదీ చదవండి: జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం..1700 మందికి ఉపాధి1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు. -
ఐఏఎస్ అవ్వాలని ఎంతలా ప్రయత్నించాడంటే..! ఏకంగా 12 సార్లు..
పరాజయం అనగానే..ఫెయిల్యూర్స్ అని కాదు..పోరాడుతూ..ఉండేవాళ్లని. గెలుపు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గొప్ప యోధులు కూడా. ఎప్పుడు విజేతల విజయాలనే సెలబ్రేట్ చేసుకోవడం క, స్ఫూర్తిగా తీసుకోవడమే కాదు. ఓటమిని ఓర్చుకుంటూ సాగుతున్న పరాజితులు కూడా అంతకుమించిన మహామహులే. గెలుపు.. పొగరుని, అహంకారాన్ని అందిస్తే..ఓటమి ఓర్పు విలును నేర్పిస్తుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఏంటో తెలియజేస్తుంది. నిద్దురలో సైతం భయపెట్టించే ఓటమని ఒడిసిపట్టి గెలుపు శిఖరాన్ని అందుకోవడం కోసం తపించే పట్టువదలని విక్రమార్కులు. వాళ్ల అనుభవం విజేతలకు మించిన గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడూ సక్సెస్‌ని అందుకున్నవాళ్లని కాదు..విజయంకోసం ఆరాటపడుతూ..వెన్ను చూపకుండా చివ్వరి వరకు పోరాటం చేసే పరాజితులను కూడా అభినందిద్దాం, ప్రేరణగా తీసుకుందాం.! వాట్ ఇదేంటి అని అనుకోకండి..చక చక స్టోరీలోకి వెళ్లిపోదాం..ఇంతవరకు సివిల్ సర్వీసెస్‌లలో గెలుపొందిన ఐఏఎస్ అధికారుల విజయ ప్రస్థానాన్ని అభినందించాం, స్ఫూర్తిగా తీసుకున్నాం. ఈ సారి ఐఏఎస్ కోసం చివ్వరి వరకు పోరాడి..లెక్కలేనన్ని ఓటములు చవి చూసినా..తన కథ కూడా మరొకరికి స్ఫూర్తిగా మారుతుందని చిరునవ్వుతో చెబుతున్న కునాల్ విరుల్కర్ ఫెయిల్యూర్ స్టోరీ ఏంటో చూద్దామా..!.మొత్తం 12 ఏళ్లు యూపీఎస్సీకి తన లైఫ్‌ని అంకితం చేశాడు. ఒకటి, రెండు కాదు 12 సార్లు విఫలం. అయినా తనకు దొరికిన ప్రతి ఛాన్స్‌ని మిస్ చేయలేదు. గెలుపు తీరం అందుకునేదాక పోరాడేందుకు సంకల్పించిన అతడి తీరు ప్రశంసనీయం. సరిగ్గా 2012లో తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీ పరీక్షలో తడబడ్డాడు. పోనీలే అని 2013లో మరోసారి ట్రై చేశాడు. ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసినా, మెయిన్స్‌లో ఓటమి తప్పలేదు. ఇదే పరిస్థితి 2014లో కూడా పునరావృతమైంది. 2015లో ఎట్టకేలకు మెయిన్స్ కూడా క్లియర్ చేశాడు. రెండింటిని దాటుకుని వచ్చినా ఇంటర్వ్యూలో ఓటమి పలకరించింది. పరాజయానికి కారణాన్ని విశ్లేషిస్తుండగా..52 మార్కుల తేడాతో ఇంటర్వ్యూని కోల్పోయానని తెలుసుకుని మరింత గట్టిగా ప్రయత్నించాడు. కానీ అప్పటికే నైరాశ్యం మనసుని కమ్మేయడంతో 2016, 2017 ప్రిలిమ్స్ చేధించలేక..మళ్లీ యథావిధిగా జీరో పొజిషన్‌కి చేరిపోయాడు. ఇక లాభం లేదనుకుని మరింత కసితో 2018లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్, రెండింటిని క్లియర్ చేసి.. నూతనోత్సాహంతో ఇంటర్వ్యూ దశకి చేరాడు. అయితే ఈసారి చవిచూసిన ఓటమి కంటిమీద కునుకప్టటనీయకుండా చేసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో గెలుపు కనుచూప మేరలో కూడా లేదు, ఈసారి సక్సెస్‌కి ఒక్కడుగు దూరంలో సివిల్ సర్వీస్ అధికారిని అవ్వలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అయినా అంత బాధను ఓర్చుకుంటూ..ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అలా 2023 వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండటం విశేషం. ఇంతలా ఓటమి తనను మట్టికరిపించినా..ఏ మాత్రం నైరాశ్యానికి తావివ్వలేదు..జీవితం అంటేనే పోరాటం అంటూ అజేయమైన సంకల్పంతో ముందుకుపోతున్నాడు. అంతేగాదు..తాను సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సోషల్ మీడియా వేదికగా తన పరాజయాల పరంపరను పంచుకున్నాడు. అది కూడా ఏడుస్తూ కాదు..సగర్వంగా కాన్ఫిడెంట్‌గా తాను చేసిన పోరాటాన్ని చెబుతుంటే..ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, మనసు మెలిపెట్టేలా భావోద్వేగం చెదేలా చేసింది. ఇంతలా ఓటమి నీడలా వెంటాడుతున్నా..అంతలా స్థైర్యంగా చిరునవ్వుతూ ఉండటం అందరికీ సాధ్యం అయ్యే పనికాదు అంటూ నెటిజన్లు అభినందించారు. అంతేగాదు ఓటమిని అధిగమించి..లైఫ్‌ని ధైర్యంగా లీడ్ చేయడం ఎలా అనే విషయంలో గొప్ప మార్గదర్శకులు మీరే అని కునాల్‌ని అభినందించారు. ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయినా కునాల్ టీచర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ..ఔత్సాహిక సివిల్ సర్వీస్ అభ్యర్థులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. కునాల్ స్టోరీలో..ఓటమి పదే పదే పలకరించినా..పట్టువదలని విక్రమార్కుడిలా చేసినా అతడి ప్రయత్నాన్నికి కచ్చితంగా సెల్యూట్ చెప్పాల్సిందే కదూ..!. 12 attempt 7 main5 interview NO SELECTION.शायद जिंदगी का दूसरा नाम ही संघर्ष हैं ।#UPSC #यूपीएससी pic.twitter.com/FEil9NGJ5l— Kunal R. Virulkar (@kunalrv) April 16, 2024(చదవండి: Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!) -
చచ్చిపోదామనుకుంది...ఇపుడు వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతి
ముంబై నడిబొడ్డున ఎన్నో కలలు కంటున్న ఒక చిన్నారి కలలు ఒక్కసారిగా ఊహించని మలుపు తీసు కున్నాయి. పుస్తకాలతో దోస్తీ చేయాల్సిన 12 ఏళ్ల వయసులోనే పెళ్లి. కట్ చేస్తే.. గృహ హింస, తీరని అణిచివేత అంతకుమించిన పేదరికం. జీవితం పీడకలగా మారిపోయింది. కానీ అక్కడినుంచే తననుంచి దూరంగా వెళ్లి పోయిన జీవితాన్ని వెదుక్కుంది. వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారింది.దళిత కుటుంబంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ.1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కల్పనా సరోజ్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్‌కు పెళ్లి జరిగిపోయింది. భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో నివసించేది. కానీ పెళ్లి తరువాత అత్తింటి వేధింపులు భరించలేక, బయటపడటానికి మార్గం లేదని భావించి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె తండ్రి ఆమెను రక్షించి,ఇంటికి తిరిగి తీసుకు వచ్చాడు. అలా16 సంవత్సరాల వయసులో, మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. ముంబైలోని ఒక ప్రభుత్వ వస్త్ర మిల్లులో ఉద్యోగం మొదలు పెట్టింది జీతం నెలకు రూ. 2 మాత్రమే. కానీ అదే కల్పన భవిష్యత్తుకు తొలి అడుగు. సాధికారతకు స్వావలంబంనకు బీజం.ఇదీ చదవండి: రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీఈ కష్టాలమధ్యే బట్టలు కుట్టడం నేర్చుకుంది. అలా కల్పన ఆదాయాన్ని రూ. నెలకు 50 రూపాయలు. ఆ అనుభవంతో ఆమె పెద్ద రిస్కే చేసింది. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో రూ. 50 వేల రుణం తీసుకొని సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క్లాత్ బొటిక్ ప్రారంభించింది. అనుకోకుండా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది . అక్కడితో ఆగిపోలేదు. బలమైన నెట్‌వర్క్‌తో రియల్ ఎస్టేట్‌లోకి విస్తరించింది. ఎలా అంటే..1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొని మోసపోయింది. కానీ అప్పటి కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చిన కల్పనా సరోజ్,ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగింది. KS ఫిల్మ్ ప్రొడక్షన్ఆ తర్వాత తన సొంత సంస్థ KS ఫిల్మ్ ప్రొడక్షన్‌ను స్థాపించింది. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం ఎదుర్కొన్న దారుణాల గురించి 'ఖైర్లాంజిచ్య మాత్యవర్' అనే వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది. ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా చూస్తారనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ కథనాన్ని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకురావాలనది ఆమె అభిమతం. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో డబ్ చేశారు. నేరస్థులను ఆపకపోతే, అవగాహన పెంచకపోతే, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన నమ్ముతారు.కమానీ ట్యూబ్స్‌కు ప్రాణం పోసిందిదృఢసంకల్పం, తెలివైన వ్యాపారవేత్తగా ఆమె ఖ్యాతి పెరిగింది. కమానీ ట్యూబ్స్ కంపెనీప్పుల్లో మునిగి, పతనం అంచున ఉంది. దాదాపు మూడేళ్లుగా దాని 3,500 మంది ఉద్యోగులకు చెల్లించలేకపోయింది. అలా వారు 2001లో, కల్పనను సలహా కోసం సంప్రదించారు. ఇదే ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైన చాలెంజ్ విసిరింది. దాన్ని బాధ్యతగా తీసుకుంది కల్పన. ఏకంగా కంపెనీని కొనుగోలు చేసి, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. అచంచలమైన సంకల్పంతో ముందుకు నడిపించింది. అప్పులను తీర్చేసి,కార్మికులకు జీతాలు చెల్లించడమే కాదు, కంపెనీ లాభాల బాట పట్టింది. ఇపుడు కమానీ ట్యూబ్స్ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.చదవండి: చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్ఏడో తరగతిలోనే పెళ్లి, కష్టాలు అనుభవించి, రూ. 2 సంపాదించిన బాల్య వధువు కల్పన సరోజ్, రూ. 1000 కోట్ల నికర విలువను కలిగి ఉంది. కమానీ ట్యూబ్స్ చైర్‌పర్సన్‌గా 2013లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. IIM బెంగళూరులో గవర్నర్ల బోర్డు సభ్యురాలు కూడా. దీంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందామె.కల్పన సరోజ్ జీవితం అద్భుతమైన విజయగాథ మాత్రమే కాదు. కృషి, పట్టుదల ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి ఇదొక బ్లూప్రింట్. కష్టాల కొలిమినుంచే అందమైన జీవితానికి బాటలు వేసుకున్న ధీర కల్పన సరోజ్ ఎంతోమందికి ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ
చిన్నప్పటినుంచీ తండ్రి వ్యాపారాన్ని చూస్తూ పెరిగింది. ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, కుటుంబ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు అనుకోకుండా కుల్ఫీ మేకింగ్‌లో ప్రయోగం చేసింది. అంతే అక్కడినుంచి ఆమె జీవితం, ఆలోచన మారి పోయింది. కట్ చేస్తే కోటి రూపాయలు ఆర్జించే బిజినెస్‌కు యజమానిగా మారిపోయింది. ఎవరామె? ఏమా సక్సెస్ జర్నీ. తెలుసుకుందామా ఢిల్లీకి చెందిన సమత బోత్రా(Samta Bothra) సగటు అమ్మాయి మాదిరిగా పెళ్లి చేసుకుని భర్త, పిల్లా పాపాలతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తోంది. అలాదాదాపు మూడు దశాబ్దాలు గడచిపోయాయి. 2018లో హోలీ పండుగ సందర్బంగా సరదాగా కుల్ఫీ తయారు చేసింది. అందరికి తెగ నచ్చేసింది. ఇంటికొచ్చిన బంధువులకు కూడా రుచి చూపించింది. అంతే అలాంటి కుల్పీ కావాలని బంధువులు మళ్లీ మళ్లీ అడగడం మొదలు పెట్టారు. దీంతో దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదనే ఆలోచన 51 ఏళ్ల సమత మదిలోవచ్చింది. View this post on Instagram A post shared by Foodler (@realfoodler)తన కొడుకు సహాయంతో, సమతా కేవలం మూడు రుచులతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది సమత. ఇంట్లో నుండే రబ్రీ, గులాబీ , కేసర్ కుల్ఫీ ఆర్డర్స్ మీద తయారు చేసింది. కేవలం రూ.5 వేలతో మమ్మీస్ కుల్ఫీ మొదలైంది. అలా ప్రారంభ రోజుల్లో ఆర్డర్ల సంఖ్య చాలా తక్కువగా అంటే రెండు రోజులకు ఒక ఆర్డర్ వచ్చేవి. స్నేహితులు ,బంధువుల తదితరుల ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. అలా ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆరేడు నెలల తర్వాత రెగ్యులర్‌గా కుల్ఫీల కోసం ఆర్డర్ట్ మొదలైనాయి. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీంతో డిమాండ్ మరింత పుంజుకుంది. ప్రతి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డర్లు వచ్చేవి.కార్పొరేట్ కంపెనీలు సైతం మమ్మీస్ కుల్ఫీలకు ఆర్డర్లు ఇచ్చేవారు. జొమాటోతో భాగస్వామ్యం కార్పొరేట్ల కోసం ఒకేసారి 2000 - 3000 కుల్ఫీ బల్క్ ఆర్డర్లు వచ్చేవి. మెట్ లైఫ్ , భారతి ఎయిర్‌టెల్‌తో సహా అనేక ఇతర కంపెనీలలో కుల్ఫీ స్టాల్లను కూడా ఏర్పాటు చేసింది. రూ. 5వేల నుంచి కోటి టర్నోవర్ దాకాడిమాండ్ బాగా పెరగడంతో రిటైల్ బిజినెస్‌లోకి కూడా ప్రవేశించింది సమత. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా నగర్లో మమ్మీ కుల్ఫీ షాప్‌ను తెరించింది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. మమ్మీ కుల్ఫీ రుచికి, నాణ్యతకు వినియోగదార్లు ఫిదా అయిపోయారు. దీంతో తరువాత ఏడాదికే మరో షాపును ఓపెన్ చేసే స్థాయికి చేరింది. ఇపుడు ఏడాదికి కోట రూపాయల టర్నోవర్‌ను సాధించింది. అన్నీ సహజ, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తామని చెబుతున్నారు సమత. ఒక్క ఐడియాతో తన జీవితాన్ని మార్చేసుకుని తన లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సమత. సక్సెస్‌కు వయసుతో సంబంధం లేదని ఓర్పు, సహనం, మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలని చాటి చెప్పింది. -
20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
కరియర్ పీక్‌లో ఉండగా, దాన్ని వదిలేసి, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని కోట్లకు పడగలెత్తిన ఒక నటి సక్సెస్ స్టోరీ గురించి తెలుసా? ఒకటీ రెండూ కాదు, ఏకంగా 1200 కోట్ల విలువైన కంపెనీకి సారధిగా సత్తా చాటుకుంటున్న ప్రముఖ టీవీ నటి ఆష్కా గొరాడియా విజయ గాథను తెలుసుకుందాం పదండినటులు కేవలం నటనలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలోనూ రాణించగలరు అని నిరూపించిన నటి ఆష్కా. టీవీ నటిగా మరపురాని పాత్రలు పోషించడమే కాదు స్టార్ట్ప్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. రోజువారీ సబ్బుల నుండి గ్లోబల్ బ్యూటీ ప్రొడక్ట్స్ దాకా నైపుణ్యం విస్తరించింది.2002లో 'అచానక్ 37 సాల్ బాద్' షోతో టీవీలో అడుగుపెట్టింది. తర్వాత 'భాభి', 'తుమ్ బిన్ జౌన్ కహాన్' వంటి షోలలో పనిచేసింది. అయితే 2003లో, ఏక్తా కపూర్ షో 'కుసుమ్'తో ఆమె కరీయర్ మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆమె 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థి', 'సిందూర్ తేరే నామ్ కా', 'నాగిన్' పాపులర్ టీవీ సీరియల్స్‌తో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. అష్కా కేవలం కల్పనలో మాత్రమే కాకుండా రియాలిటీ షోలలో కూడా పాల్గొంది. 2019 లో 'దాయన్' ,రియాలిటీ షో 'కిచెన్ ఛాంపియన్ 5' లో కనిపించింది. 2021 లో, ఆమె తన వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించడానికి నటనను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది.రెండు దశాబ్దాల స్టార్డమ్కు బైబై చెప్పేసింది. కళాశాల స్నేహితులు ప్రియాంక్ షా , అశుతోష్ వలాని తో కలిసి, ఈ ముగ్గురూ 2020 లో ‘రెనీ కాస్మెటిక్స్’ ను ప్రారంభించారు. మిత్రుల వ్యాపార అనుభవానికి ఆష్కార్ తెగువ, ధైర్యం మరింత కలిసి వచ్చాయి. వలం రూ.50 లక్షలతో ప్రారంభమైన డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ రూ. 1,200–1,400 కోట్లకు చేరింది. తరువాతి క్రమంలో ఈ బ్రాండ్ ఆఫ్‌లైన్‌లో కూడా విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాలలో, రెనీ కాస్మెటిక్స్ బ్రాండ్ నుండి పూర్తి స్థాయి సామ్రాజ్యంగా మారింది. లిప్‌స్టిక్‌లు, ఐలైనర్లు, హైలైటర్లు ఇలా 200 కంటే ఎక్కువ బ్యూటీ ఉత్పత్తులతో, బ్రాండ్ ఇప్పుడు భారతదేశం అంతటా 650 స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా, మింత్రాలో అమ్మకాలు సాగుతున్నాయి. రెనీ సునామీమెరుపు వేగంతో వచ్చిన పెట్టుబడులు కంపెనీనీ రూ. 100 కోట్లను సేకరించింది. 2024 సంవత్సరంలో, రెనీ కాస్మెటిక్స్ కంపెనీ ఎవాల్వెన్స్ ఇండియా మరియు ఎడెల్వీస్ గ్రూప్ నేతృత్వంలో వచ్చిన నిధులతో కంపెనీ రూ. 820 కోట్ల నుండి కూల్ రూ. 1,200 కోట్లకు ఎగిసింది. కాగా భారతదేశంలో అందం మరియు సౌందర్య సాధనాల పరిశ్రమ 2030 నాటికి రూ. 2 లక్షల కోట్లను మించుతుందని అంచనా.రెనీ అంటే అర్థం ఇదీ! “రెనీ” అనే పేరుకు ఫ్రెంచ్‌లో “పునర్జన్మ” అని అర్థం. అలా రెనీ ద్వారా ఆష్క తన కరియర్ పునర్ని ర్మించుకుంది. తాను 16 ఏళ్ల వయసులో గుజరాత్ నుండి ముంబైకి వచ్చిన అష్కా ప్రారంభంలో, పేయింగ్ గెస్ట్‌గా అద్దె ఇంట్లో నివసించింది. కానీ 23 ఏళ్ల వయసులో ముంబైలో నా సొంత ఇల్లు కొనుక్కోవడం తన జీవితంలో పెద్ద సక్సెస్ అయి ఒక సందర్బంలో స్వయంగా చెప్పుకుంది ఆష్కా. ఇంతటి అద్భుతమైన విజయంతో నటననుంచి వ్యాపారవేత్తలుగా మారిన అతి కొద్ది మంది వారిలో ఆష్క ముందు వరుసలో ఉంటారు. ప్రేమ, పెళ్లి ప్రతి సూపర్ ఉమెన్ వెనుక, ఒక సూపర్ సపోర్టివ్ పార్టనర్ తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో ఆషా భర్త కూడా ఒకరు. 2016లోపరిచయమైన అమెరికన్ వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్తో ప్రేమలో పడింది. 2017లో వీరిద్దరూ క్రైస్తవ , హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. -
గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు!
అవమానాలు జరిగిన చోటే సత్తా ఏంటో చూపించాలని పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా సుధీర్ జాటియా జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు తాను నడిపిన సంస్థ నుంచి కొన్ని కారణాల చేత తనను బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. దాంతో అదే రంగంలో అంతకుమించిన శక్తిగా ఎదిగాలనుకున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆ రంగంలో లాభాలులేక కొట్టుమిట్టాడుతున్న ఓ కంపెనీని కొనుగోలు చేసి తనను బయటకు పంపిన కంపెనీకి అతిపెద్ద పోటీదారుగా మారారు. ఓటమిని గెలుపు మెట్టుగా మార్చుకున్న సుధీర్ జాటియా వ్యాపారం ప్రయాణం తెలుసుకుందాం.దాదాపు రెండు దశాబ్దాల పాటు సుధీర్ జాటియా ఒకే పరిశ్రమలో, అందులోనూ వీఐపీ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలో కీలక పాత్ర పోషించారు. అయితే, 2010లో ఆ సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు సుధీర్ జాటియా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అంతటితో నిరాశ చెందకుండా ఒక కొత్త లక్ష్యానికి పునాది వేశారు. ఆయన కొనుగోలు చేసిన సఫారీ ఇండస్ట్రీస్ నేడు రూ.12,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగి భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.ముంబై నగరంలో జన్మించిన సుధీర్ జాటియా ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన జీవితంలో తొలి వ్యాపార అనుభవం తండ్రి నిర్వహించిన టెక్స్టైల్ వ్యాపారంతో మొదలైంది. 1988లో ఆయన తండ్రి, దిలీప్ పిరమల్ (వీఐపీ) సంయుక్తంగా అరిస్టోక్రాట్ (Aristocrat) అనే లగేజ్ కంపెనీని కొనుగోలు చేశారు. దాంతో 21 ఏళ్ల వయసులో జాటియా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అరిస్టోక్రాట్, VIP వంటి పెద్ద సంస్థల మధ్య పనిచేస్తూ ఆయన కేవలం రెండేళ్లలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు.ఊహించని మలుపుతన కుటుంబ ప్రయోజనాలను కాపాడుకుంటూ వ్యాపారంలో నైపుణ్యం సంపాదించిన సుధీర్ జాటియా 2003లో వీఐపీ, అరిస్టోక్రాట్ రెండింటికీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆ సంస్థను భారతదేశంలోనే అతిపెద్ద లగేజ్ సామ్రాజ్యంగా నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, 2010లో VIP వ్యవస్థాపకుల్లో కొందరు తమ కుటుంబ సభ్యులను(తరువాతి తరం) సంస్థ నాయకత్వంలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో జాటియాను ఆ కంపెనీ నుంచి పంపించాలని నిర్ణయించిట్లు ఆరోపణలున్నాయి(వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు). జీవితంలో కష్టపడి పనిచేసిన సంస్థ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మనసులో బలమైన సంకల్పం ఏర్పడింది.సఫారీవీఐపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సుధీర్ జాటియాకు తన వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనే కసి పెరిగింది. ఆయన దృష్టి అప్పటికే మార్కెట్లో బలహీనంగా ఉన్న సఫారీ ఇండస్ట్రీస్ (Safari Industries)పై పడింది. 2011లో జాటియా కేవలం రూ.29 కోట్లతో సఫారీ ఇండస్ట్రీస్‌లో 56% వాటాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సఫారీ కంపెనీ మొత్తం విలువ రూ.55 కోట్లు మాత్రమే. సఫారీ అమ్మకాలు అప్పటివరకు ఎక్కువగా సైనిక క్యాంటీన్లపై ఆధారపడి ఉండేవి. ఆయన మొదటగా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. నాణ్యత లేనిదే మార్కెటింగ్ పనికిరాదని గట్టిగా నమ్మారు.ఆన్లైన్ మార్కెటింగ్‌కు సంబంధించి VIP వంటి పాత కంపెనీలు సంకోచిస్తున్న సమయంలో సుధీర్ జాటియా ముందడుగు వేసి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. ఆన్లైన్ ప్రకటనలపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఇది సఫారీకి మార్కెట్లో విపరీతమైన వృద్ధిని అందించింది.రూ.12,000 కోట్ల సామ్రాజ్యంతన అనుభవం, మార్కెట్‌పై ఉన్న పట్టు, ముక్కుసూటి నిర్ణయాలతో సుధీర్ జాటియా సఫారీని అనూహ్యంగా వృద్ధి చేశారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత సఫారీ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. 2018-19 ప్రాంతంలో సుమారు రూ.1,500 - రూ.1,800 కోట్లుగా ఉన్న సఫారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆయన వ్యూహాత్మక నాయకత్వంలో ప్రస్తుతం సుమారు రూ.12,000 కోట్లకు పైగా చేరుకుంది. ఈ వృద్ధి, ఆయన పూర్వ సంస్థ వీఐపీ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.ఇదీ చదవండి: బీమా రంగానికి ఏఐ ధీమా -
అలా చేస్తేనే విజయం తథ్యం..! ఐఏఎస్ పారి బిష్ణోయ్ సక్సెస్ స్టోరీ
యూపీఎస్సీ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలు, ఎదురుదెబ్బలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిశ్శబ్ద పోరాటంతో ఐఏఎస్ సాధించింది పారి బిష్ణోయ్(Pari Bishnoi ). ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తాను ఎదుర్కొన్న ఒత్తిడి, తన ప్రయాణంలో అత్యంత కష్టమైన దశ గురించి వివరించింది. యూపీఎస్సీలో మొదటి ప్రయత్నంలో విఫలం అయినప్పుడు రాజస్థాన్‌లోని తన స్వస్థలానికి వెళ్లింది పారి. ప్రపంచం నుండి తనను తాను దూరం చేసుకొని ఒంటరి ప్రపంచంలోకి వెళ్లిపోయింది. తట్టుకోలేని ఒత్తిడిలో బాగా తినేది. దీంతో 30 కిలోలకు పైగా బరువు పెరిగింది! మానసిక భారంతో పాటు శారీరక భారం కూడా తనను భయపెట్టింది. దీంతో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పొద్దుటే లేచి వ్యాయామాలు చేసి బరువు తగ్గింది. మనసు తేలిక పడింది. తేలిక పడిన మనసు తిరిగి లక్ష్యం వైపు దృష్టి సారించింది.‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అని తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పరీక్ష ప్రిపరేషన్‌కు సంబంధించిన వ్యూహాన్ని మెరుగుపరుచుకుంది. దృఢనిశ్చయంతో అనుకున్నది సాధించింది.పారి బిష్ణోయ్ షేర్ చేసిన వీడియో ఇప్పటికే పది లక్షల లైక్‌లను దాటింది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!) -
పనస కాయ చిప్స్‌తో ఏడాదికి రూ. 12 లక్షలు
పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకనప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఆయా పంటలను రోడ్డుమీద కుప్పలు కుప్పలుగా పారబోయడం, తగల బెట్టడం లాంటి బాధాకరమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాంటపుడు ‘అయ్యో.. రేటు వచ్చేదాకా వీటిని భద్రపరిస్తే ఎంత బాగుండు’ అని అనుకుంటాం. అలా పుట్టిన ఆలోచనే ఆధునిక పద్దతులకు బాటలు వేస్తుంది. అదే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. పదండి వారి విజయ గాథ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని గగన్బావ్డా తహసీల్‌లో, తేజస్-రాజేష్ పొవార్ అనే ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ ఇది. అది జాక్‌ఫ్రూట్ (పనస) చిప్స్ బిజినెస్‌తో. సాధారణంగా పనసకాయలు ఒకసారి కాతకొచ్చాయంటే విపరీతమైన దిగుబడి వస్తుంది. కొల్హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని దాదాపు ప్రతి రైతు తమ పూర్వీకుల నుండి పనస చెట్లు వారసత్వంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే వాటి ద్వారా మంచి జీవనోపాధిని కూడా పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఉత్తిత్తి కూడా చాలా అధికంగా ఉండేది. దీంతో రైతులు వాటిని కోయలేక, మార్కెట్ చేసుకోలేక, మండీకి రవాణా ఖర్చులు కూడా భరించలేక వాటిని అలాగే పారవేసేవారు.తేజస్, రాజేష్ తల్లిదండ్రులకు జాక్‌ఫ్రూట్ చెట్లు బాగానే ఉండేవి. ఒక ఏడాది పనసకాయలుబాగా రావడంతో కొల్హాపూర్‌లో నివసించే బంధువులైన సంగీత, విలాస్ పొవార్ ఇంటికి తీసుకెళ్లారు.మా దగ్గర చాలా కాయలున్నాయి. వృధాగా పార వేస్తున్నామనే విషయాన్ని వారితో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా వాటిని పారవేయడానికి బదులు చిప్స్‌గా తయారు చేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉందని వారు సూచించారట. అంతే అక్కడినుంచి వారి జీవితం మరో మలుపు తిరిగింది.15 కిలోల చిప్స్‌తో మొదలుదీంతో కుమారులతో కలిసి వారు రంగంలోకి దిగారు. తొలి ప్రయత్నంలో దాదాపు 15 కిలోల చిప్స్‌ను తయారు చేసి కొల్హాపూర్‌లో ఇంటింటికీ వెళ్లి విక్రయించారు. డిమాండ్ పెరిగినప్పటికీ, ఇంటింటికీ డెలివరీ అందించడం సాధ్యం కాలేదు. దీంతో ఐటీఐ చదువు అయిన వెంటనే తేజస్ పనస చిప్స్ తయారీపై మరింత దృష్టి సారించాడు. ప్యాకేజింగ్ చేయడానికి కొన్ని ప్రాథమిక యంత్రాలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేరుగా హోల్‌సేల్ వ్యాపారులు రిటైలర్లకు విక్రయించే పద్దతులను ప్రారంభించారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు మరో పది పన్నెండు మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాక్‌ఫ్రూట్ కోత జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభమైజూలై-ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఏటా 4,000 కిలోల జాక్‌ఫ్రూట్‌ను ప్రాసెస్ చేసి 1,000 కిలోల వేఫర్లను ఉత్పత్తి చేస్తారు.మార్కెట్ డిమాండ్ బట్టి కేజీ చిప్స్‌ను రూ. 900 నుంచి రూ. 10 వేల వరకు విక్రయిస్తారు. ఇక జాక్‌ఫ్రూట్ పోలీలు కేజీకి రూ. 700 చొప్పున అమ్ముడవుతాయి. అలా ఏడాది కాలంలో రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. అంతేకాదు తమ పని పనసపంట వృధాను అడ్డుకోవడంతోపాటు, రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఉద్యోగ అవకాశాలను సృష్టించింది అంటూరు తేజస్ సంతోషంగా.పనస చెట్లు 30 అడుగుల నుండి 70 అడుగుల వరకు పెరుగుతాయి. పెద్ద పెద్దకాయలతో దిగుబడి కూడా భారీగా వస్తుంది. దీనికి తోడు భారీ బరువు, కాయలనుంచి వచ్చే జిగట రబ్బరు పాలు కారణంగా వాటిని కోయడం చాలా ఛాలెంజ్ అంటారు తేజస్. అందుకే రైతు లనుంచి కిలోకు రూ. 30 నుంచి రూ. 70 వరకు చెల్లించి కొనుగోలు చేస్తారట. అలాగే పనసకాయలను ప్రత్యేక పద్ధతిలో కోసేలా నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు. అనంతరం వాటిని చిప్స్, ఇంకా పండిన పండ్లను ఫనాస్ పో (భక్ష్యాలు) జాక్‌ఫ్రూట్ గుజ్జు, బెల్లం, గోధుమ పిండితో కలిపి తీపి ఫ్లాట్‌బ్రెడ్ తయారు చేస్తారు. చదవండి: మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ : తల్లి మీరా నాయర్ తొలి స్పందన పనసకాయలో పోషక విలువలు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు ఇపుడు ఏ పెళ్లిళ్లు, పంక్షన్లలో చూసినా పనస కాయ బిర్యానీ చాలా ఫ్యామస్. జాక్‌ఫ్రూట్ కబాబ్‌లు, బిర్యానీలు, ఇతర రెడీ-టు-కుక్ ఉత్పత్తులకు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉంది.భారతదేశ జాక్‌ఫ్రూట్ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 1252 కోట్లు. రానున్న ఐదేళ్లలో దాదాపు రూ. 1580 కోట్లకు పెరుగుతుందని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (CCSNIAM) నివేదిక పేర్కొంది. -
ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిల్..! కానీ ఇవాళ..
అందరు లక్షల్లో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అందుకోసం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదివి మరి అనుకున్న డ్రీమ్‌ని నెరవేర్చుకుంటుంటారు. అలానే ఈ వ్యక్తి కూడా 17 ఏళ్ల వయసులో ఐఐటీలో చేరడమే లక్ష్యంగా చదివాడు. కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో ఆ కల చేజారిపోయింది. పోనీలే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు. అది కూడా విఫలమే. ఇన్ని ఫెయ్యిల్యూర్స్ ఎదురైనా..నా వల్ల కాదని చేతులెత్తేయలేదు. చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడే డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. పాపం చిన్నప్పటి నుంచి తను కన్న ప్రతి కల నీరుగారిపోయేది. అడుగడుగునా వైఫల్యాలే. చిన్నప్పటి నుంచి ఐఐటీలో చేరడమే హర్షిల్ లక్ష్యం . కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా 75 వేల ర్యాంకు తెచ్చకున్నాడు. దీంతో ఆ ఐఐటీ డ్రీమ్ కలగానే మిగిలిపోయింది. చివరికీ మాములు కాలేజ్‌లో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పోనీలే 20 ఏళ్లకే అందరికంటే మంచి పొజిషన్లో ఉండేలా లక్షల వేతనంతో కూడిన జాబ్ కొట్టేయాలనుకున్నాడు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. చివరికి నెలకు రూ. 30 వేలు సంపాదించే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని అతికష్టం మీద తెచ్చుకున్నాడు. ప్రతి రోజు తనను తాను అసహ్యించుకుంటూ..ఇదేం ఉద్యోగం అని బాధపడిపోతుండేవాడు. అయినా సరే తన డ్రీమ్‌ని వదిలిపెట్టకుండా..అలా చాలా ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటూనే ఉండేవాడు. అలా చేస్తుండగా ఏ కంపెనీ నుంచి రిప్లై వచ్చేది కాదు. అలా ఆరు నెలలుగా కేవలం చదువుకోవడం, వ్యాయామాలు చేయడం, ఉద్యోగం కోసం వేట. ఇంతలా చేసినా..ఎలాంటి ఫలితం లేదు. అయితే ఒకరోజు నుంచి ఆకస్మికంగా ఇటర్వ్యూ కాల్స్ రావడం ప్రారంభించాయి. అలా 2024 నాటికి ఓ చిన్న ఆన్లైన్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇంటర్న్షిప్నే పూర్తి సమయం ఉద్యోగంగా మార్చుకున్నాడు. తొందరలో ఆ ఉద్యోగానికి స్వస్తి పలకక తప్పలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. అలా పెద్దపెద్ద సంస్థలతో స్పాన్సర్ షిప్‌లు చేసే స్థాయికి చేరుకుని.. సొంతంగా కంపెనీకి పెట్టుకునే రేంజ్‌కి ఎదిగాడు. ఇవాళ ఏకంగా రూ. 54 లక్షలు అధిక వేతనానన్ని అందుకుంటూ తన కలను నెరవేర్చుకున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో తన సక్సెస్ జర్నీ గురించి వివరించాడు డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. బ్రో మీది చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ, ఎదురుదెబ్బలను ఎలా ఇంధనంగా మార్చుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. దృఢ సంకల్పంతో ఉండేవాడికి అదృష్టమే ఒళ్లోకొచ్చి వాలుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచారు అంటూ హర్షిల్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: డ్రీమ్లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్) -
దోసె బిజినెస్‌తో నెలకు రూ. కోటి సంపాదిస్తున్న జంట
ఒక్కోసారి మనకు తగిలిన దెబ్బలే విజయపథంవైపు అడుగులు వేయిస్తాయి. మన అభిరుచులు, కోరికలే మన జీవితంలోఊహించని సక్సెస్‌కు బాటలు వస్తాయి.ముంబైకు చెందిన జంట సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే.బెంగళూరుకు చెందిన అఖిల్, శ్రీయ దంపతులు ముంబైలో మొదట్లో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర జీతాలతో నెట్టుకొచ్చేవారు. దీంతో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన ఇద్దరిలోనూ బాగా ఉండేది. అఖిల్ అయ్యర్, శ్రియ నారాయణకు కర్ణాటకలోని దావణగిరె దోసెలంటే పిచ్చి ప్రేమ. దాన్ని తమ స్నేహితులకు రుచి చూపించారు. మంచి స్పందన లభించింది. అంతే వ్యాపార ఆలోచనకు పదును పెట్టారు. ఆ అభిరుచి, పట్టుదలకు కృషి తోడైంది. అలా ఎంబీఏలు, ఐఐటీలు లేకుండానే నెలకు కోటి రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) ఎలాంటి పెట్టుబడి దారులు, ఫుడ్ ఇండస్ట్రీలో అనుభవం లేకుండానే బాంద్రాలో ఒక చిన్న కేఫ్‌ను ప్రారంభించారు. కేవలం 12 సీట్లతో కెఫే మొదలైంది. మెల్లిగా మంచి పేరు తెచ్చుకుంది. తాజా దోసెకు తోడు రుచికరమైన చట్నీ ఇంత కంటే ఏం కావాలి. స్పందన అఖండంగా మారిపోయింది. త్వరలోనే, నగరం నలుమూలల నుండి ప్రజలు బెన్నే దోసెల రుచి చూడటానికి అవుట్లెట్ వెలుపల బారులు తీరారు. నేడు ప్రతీ రోజుకి 800కు పైగా దోసెలమ్మే స్థాయికి వారి బిజినెస్ వృద్ధి చెందింది. ఒక్కో దోసె ధర రూ. 250 నుండి రూ. 300 వరకు ఉంటుంది. ఫలితంగా నెలకు రూ. 1 కోటి సంపాదన ఆర్జించే వ్యాపారంగా మారింది. దోసె టేస్టే పెద్ద సక్సెస్ ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లేదా సెలబ్రిటీ ఎండార్స్మెంట్లేవీ లేవు. ఒక చిన్న ప్రాంతాన్ని అద్దెకు తీసుకుని దానిని క్లౌడ్ కిచెన్‌లా మార్చారు. తమ కలల కేఫ్ అయిన బెన్నేగా పేరుపెట్టుకున్నారు. శుభ్రత, నిజమైన రుచి, తాజా వంటలు ఆహార ప్రియులకు తెగ నచ్చేశాయి. ఆ నోటా ఈ నోటా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి గిరాకీ వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల ద్వారా ఈ రెస్టారెంట్ ఖ్యాతి పెరిగింది. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ , అనుష్క జంట 2024లో బెన్నే కేఫ్‌ను సందర్శించి ఆహా అని అరగించారు. ఇంకా రోహిత్‌శర్మ లాంటి ప్రముఖుల మనసు దోచుకుందీ బెన్నే దోసె ఇంకా దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ , దియా మీర్జా వంటి ప్రముఖులు విరాట్ జంటతో కలిసి కన్నడ బెన్నే దోసెలమీద మనసు పారేసుకున్నవారే. అంతేకాదు సోషల్‌మీడియా ద్వారా బాగా ప్రచారం చేసుకున్నారు. రీల్స్ ద్వారా మంచి ఆదరణను పెంచుకున్నారు. ఇక్కడ అన్ని రకాల దోసెలతో పాటు, ఇడ్లీ, ఇతర సౌత్ ఇండియన్ టిఫిన్లు, కాఫీ కూడా ప్రత్యేకమే. కాగా శ్రియ నారాయణ్ , అఖిల్ అయ్యర్ దంపతులు ముంబైలో ‘బెన్నే, బెంగళూరు హెరిటేజ్’ గోవాలో ‘బెన్నే బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. అన్నట్టు అఖిల్ ఒకప్పుడు సినిమా నిర్మాత. కాగా ఆమె మనస్తత్వవేత్త. View this post on Instagram A post shared by Benne (@benne.bombay) -
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్‌కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్‌గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్‌గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్‌లతో సొంత డిస్పాచ్ సెటప్‌తో డ్రైవర్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్‌ఫామ్ సొల్యూషన్స్‌గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్‌ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్‌ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్‌కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్‌ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్‌లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్‌ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా. -
ప్లేస్మెంట్లో ప్రతిసారి 'నో'..కట్‌చేస్తే..!
ఎన్నో స్ఫూర్తిని కలిగించే సక్సెస్ స్టోరీలను చూసుంటారు. అయితే వాటిలో..ఎన్నో వైఫల్యాల తర్వాత విజయాన్ని చవిచూసిన వారు కొందరైతే..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నవారు మరికొందరు. అలా కాకుండా మన స్నేహితులంతా సెటిల్ అవుతూ హ్యాపీగా ఉంటే..మనం మాత్రం ఓటమితో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే..మళ్లీ ప్రయత్నించాలన్నా బాధకంటే..మనమే ఎందుకు ఓడిపోతున్నాం అనే బాధ ఎక్కువుగా ఉంటుంది. కానీ ఇతడు వాళ్లతో నార్మల్‌గా వ్యవహరిస్తూ..యథావిధిగా తన ప్రయత్నం సాగించి..వారికంటే స్పెషల్ అనిపించుకునేలా అందనంత స్థాయిలో సెటిల్ అయ్యాడు. వైఫల్యాలను హ్యాండిల్ చేయడం అంటే ఇది బ్రో అని చెబుతున్నాడు అతడు. నెట్టింట తెగ వైరల్‌గా మారింది అతడి సక్సెస్ స్టోరీ.అతడే ఫ్లట్టర్ యువర్ వే వ్యవస్థాపకుడు కార్తీకే సింగ్. తన స్టోరీని సోషల్ మీడియాలో ఎక్స్‌లో షేర్ చేసుకున్నాడు. వింటే కచ్చితంగా వాటే సక్సెస్ స్టోరీ అంటారు. 16 ఏళ్ల వయసులో ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్నాడు. అది మిస్. సర్తే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు..అది కూడా ఫెయిల్. స్నేహితులంతా క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలక్ట్ అయిపోతుంటే..కార్తీక్‌కి మాత్రం రిజెక్ట్లే ఎదురయ్యేవి. మెక్రోసాఫ్ట్ నుంచి ఆటోడెస్క్ వరకు అన్ని నో చెప్పాయి. హాస్టల్ రూమ్‌లో స్నేహితులంతా జాబ్ కొట్టేశామన్న ఆనందంతో పార్టీలు చేసుకుంటే..తాను మాత్రం బెడ్‌పై పడుకుని..వందోసారి జాబ్ పోర్టల్స్ రిఫ్రెష్ చేస్తున్నా అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు కార్తీక్. అనుకోకుండా ఒక రాత్రి ఇన్స్టాగ్రామ్లోఒక ఫ్రీలాన్సర్‌ని చూశాడు. ఆన్లైన్లో పనిచేస్తూ..స్థిరమైన ఆదాయం అందుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని చూసి..అతడితో సంభాషించాడు. అదే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. కార్తీక్ అతడిలా ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన, లైక్‌లు, సందేశాలు రాలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత నాకు సహాయం చేయగలరా అనే మెసేజ్ వచ్చింది. ఇది అతని తొలి ప్రాజెక్ట్. అందుకు అతనికి రూ. 3000 వేతనం పొందాడు. ఆ ప్రారంభ ప్రాజెక్ట్ క్రమంగా పెరిగింది. అలా క్లయింట్లురావడం ప్రారంభించారు, ప్రాజెక్టులు రేట్లు పెరిగాయి. చివిరకి ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన ఏజెన్సీని నడుపుతూ నెలకు దాదాపు రూ. 6 లక్షల మేర ఆదాయం అందుకుంటున్నాడు. ఇన్ని వైఫల్యాలు చూసిన తానే ఇంతలా సక్సెస్‌ని అందుకుంటే..మీరు కూడా కచ్చితంగా సాధించగలుగుతారు అని పోస్ట్‌ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసులను తాకడమే కాదు..కార్తీక్ చేసిన ప్రయత్నాలకు ప్రశంసిస్తూ..ఏమి చేయలేని పరిస్థితిలో కూడా సానూకూల దృక్పథం, ఆశను వదులకోకూడదని చెబుతున్న మీ స్టోరీ చాలా స్ఫూర్తిని రగిలిస్తోందని అని పోస్టులు పెట్టారు.At 16, all I wanted was IIT.Didn't happen.At 20, all I wanted was a job offer.That didn't happen either.Microsoft said no.Autodesk said no.Everyone said no.Lying on my hostel bed, watching my friends celebrate placements while I refreshed job portals for the 100th time.…— kartikey singh (@askwhykartik) October 26, 2025 (చదవండి: ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్‌లోనే అత్యంత ధనిక దేశం..) -
ఆ పరీక్ష మిస్ అవ్వడం వల్లే.. సక్సెస్ అయ్యా!: నందన్ నీలేకని
జరిగేదంతా మన మంచికే అనే మాట.. చాలామంది తమ నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో వినే ఉంటారు. కానీ జరిగిపోయింది కూడా మంచికే అంటున్నారు.. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నందన్ నీలేకని' (Nandan Nilekani). ఇంతకీ ఎందుకిలా అంటున్నారు?, దాని వెనుక ఉన్న కారణం ఏమిటనేది.. ఇక్కడ చూసేద్దాం.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీలేకని.. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారు. కానీ అదే సమయంలో తనకు ఆరోగ్యం సరిగ్గాలేకపోవడంతో.. పరీక్ష రాయలేకపోయారు. అంతే కాకుండా.. SAT లేదా GMATకు అప్లై చేసుకోవడానికి తాను బద్దకించినట్లు ఆయన పేర్కొన్నారు.ఆ తరువాత ముంబైలో ఉన్న ఒక చిన్న టెక్ సంస్థ పట్ని కంప్యూటర్ సిస్టమ్స్ కంపెనీ గురించి తెలుసుకుని నందన్ నీలేకని అక్కడ చేరారు. ఆ సమయంలోనే ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy)ని కలిశారు. అప్పుడే తన జీవితం ఒక మలుపు తిరిగింది. సొంతంగా కంపెనీ స్థాపించాలని నారాయణమూర్తి ఆలోచన నచ్చింది. దీంతో నా అడుగులు.. ఆయన వెంట సాగాయని నీలేకని వెల్లడించారు. మా ప్రయాణంలో.. మాలాంటి ఆలోచన కలిగిన మరో ముగ్గురుని కలిశాము. ఆ తరువాత ఇన్ఫోసిస్ స్థాపించామని వివరించారు.ఇన్ఫోసిస్ ప్రారంభించినప్పుడు.. చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు. కానీ పట్టుదలతో శ్రమించడం వల్లనే.. ఆ కంపెనీ దిగ్గజ ఐటీ కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచింది. 2002 మార్చి నుంచి 2007 ఏప్రిల్ వరకు ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేశారు. ఆ సమయంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది.నిజానికి ఆ రోజు పరీక్ష రాయకపోవడమే మంచిదైందని నీలేకని చెబుతారు. ఒకవేళ పరీక్ష రాసుంటే.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ పరీక్ష రాయకపోవడం వల్ల.. నారాయణమూర్తిని కలిసి కంపెనీ స్థాపించారు. ఇదంతా చూస్తుంటే.. ఆ రోజు జరిగిన పని నందన్ నీలేకని జీవితాన్నే మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. ఎక్కడంటే..!?
ఆ ఊర్లో ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ లాంటి లగ్జరీ కార్లు కనిపిస్తాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 11 బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఊరి జనమంతా కలిసి 1000 కోట్ల రూపాయలకు పైగా దాచుకున్నారు. జనానికి కావాల్సిన సదుపాలయాన్నీ ఆ ఊరిలో ఉన్నాయి. అయితే ఇదేదో సిటీ అనుకుంటున్నారా? కానేకాదు పక్కా పల్లెటూరు. విలేజ్‌లో ఇంటికో విలాసవంతమైన కారు ఎలా అబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదే ఆ గ్రామం ప్రత్యేకత.మనం చెప్పుకోబోయే గ్రామం పేరు ధర్మజ్. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉంది. మన దేశంలో అత్యంత ధనిక గ్రామంగా, ఎన్నారై విలేజ్‌గా ఆఫ్ ఇండియాగానూ (NRI Village of India) ప్రసిద్ధికెక్కింది. సగటు పల్లెలకు భిన్నంగా ధర్మజ్ సక్సెస్ సాధించడం వెనుక చాలా పెద్ద ప్రయాణమే ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సొంతూరిని మరిచిపోకపోకుండా ఉండడమే ఈ ఊరి విజయ రహస్యం. ఇక్కడి నుంచి పలు దేశాలకు వలసవెళ్లిన వారు పంపించిన సొమ్ములతో ధర్మజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.అలా మొదలైంది..ధర్మజ్ గ్రామ విజయయాత్ర 1895లో మొదలైంది. ఈ గ్రామం మొదటి తరానికి జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ ఉగాండా దేశానికి వలసవెళ్లి మార్గదర్శకులుగా నిలిచారు. తర్వాత నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లడం క్రమంగా పెరిగింది. జోతారామ్, చతుర్భాయ్ తర్వాత ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్‌కు వెళ్లి స్థిరపడ్డారు. గోవింద్ భాయ్ పటేల్ ఒక అడుగు ముందుకేసి యెమెన్‌లోని పోర్ట్‌సిటీ ఆడెన్‌లో పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ధర్మజ్ నుంచి విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఎంతగా అంటే అక్కడి కుటుంబాల్లో సగానికిపైగా విదేశాల్లోనే ఉండేంతగా. తాజా గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో 1700, అమెరికాలో 800, కెనడాలో 300, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్‌లో 150 కుటుంబాలు నివసిస్తున్నట్టు అంచనా. ఆఫ్రికాతో పాటు మిగతా దేశల్లోనూ చాలా కుటుంబాలు ఉన్నాయి.ప్రపంచ దేశాలకు వలస వెళ్లిన వాళ్లంతా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాభివృద్ధి బాటలు వేయడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసులను 2007లో ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో ధర్మజ్ (Dharmaj) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఊరంతా విశాలమైన సిమెంట్ రోడ్లతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి గ్రామస్థుడు పాటించేలా చేస్తున్నారు. యువత, పెద్దల కోసం సువిశాలమైన పార్క్ ఉంది. ఇందులో తక్కువ ధరకే ఈత కొలను, బోటింగ్ చేయొచ్చు. గ్రామంలో పశువుల మేత కోసం ప్రత్యేకంగా 50 బిఘాల భూమిని కేటాయించారు.11 బ్యాంకులు.. వెయ్యి కోట్లు11,333 మంది జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ధర్మిజ్ గ్రామం ఆర్థిక విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరిలోని 11 బ్యాంకుల్లో రూ. 1000 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. 1959, డిసెంబర్ 18న దేనా బ్యాంక్ మొదటి శాఖను ఇక్కడ ప్రారంభమైంది. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ధర్మజ్ గ్రామ వాసి హెచ్ఎం పటేల్ (HM Patel) వ్యవస్థాపక అధ్యక్షతన 1969, జనవరి 16న గ్రామ సహకార బ్యాంకు ఏర్పాటైంది. విదేశాల్లో స్థిరపడిన ధర్మజ్ వాసులు సొంతూరికి డబ్బులు పంపిస్తుండటంతో ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పుంజుకుంది. అలాగే ఊరి ప్రజల జీవనశైలి కూడా మెరుగుపడింది. ధర్మజ్ రోడ్లపై ఇప్పుడు మెర్సిడెస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు చక్కర్లు కొట్టడం సర్వసాధారణ విషయం. అక్కడ ఇళ్లు కూడా వివిధ దేశాల శైలిని ప్రతిబింబిస్తుంటాయి.గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మ గాంధీ. ఆర్థిక పరిపుష్టి, పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయడానికి ధర్మజ్ ప్రత్యక్ష నిదర్శనం. డబ్బులు పంపి చేతులు దులుపుకోవడమమే కాదు ప్రతిఏడాది జన్మభూమికి వస్తుంటారు విదేశాల్లోని ధర్మజ్ వాసులు. ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహించే ధర్మజ్ దివస్‌కు (Dharmaj Diwas) పెద్దసంఖ్యలో హాజరవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. అనుభూతులను పంచుకుంటారు. అభివృద్ధి గురించి చర్చిస్తారు.ధర్మజ్ అంటే కేవలం డబ్బు ఉన్న గ్రామం మాత్రమే కాదు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ కలిసి ఎంతటి విజయం సాధించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ.చదవండి: అమెరికాలో ఐదేళ్లలో 100 మంది భారతీయుల మరణం -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్‌లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్‌లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది. అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్‌లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్‌తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్ఎస్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. కుటుంబ నేపథ్యం..ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్‌లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్‌లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి. (చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..) -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్‌ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్‌పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్‌స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్‌కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..
ఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా కంప్యూటర్లను క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్ డిజైనర్‌గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరి ప్రస్థానం అయినా ఏమి తెలియని సున్నా స్థాయి నుంచి మొదలవ్వుతుంది..ఆ శూన్యం విలువని పెంచడం అనేది మన చేతిలోనే ఉంది అనేది తన చేతలతో చెప్పకనే చెప్పాడు ఈ వ్యక్తి. అతడెవరు? అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా చూద్దామా..!.ఎక్కడో కరువు బాధిత గ్రామం నుంచి వచ్చి..జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat ). ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన కీ బాత్‌లో అతడి గురించి ప్రస్తావించడమే కాదు మేక్ ఇన్ భారత్‌కు సరైన అర్థం ఇచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భగత్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవాడు. అతడి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అతడి కుటుంబం తన విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అయినా భగత్ ఐటీఐ వరకు ఏదోలా చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం పూణేకు వెళ్లి నెలకు 4 వేలు జీతం ఇచ్చే పనిక కుదిరాడు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆఫీస్ బాయ్(Infosys office boy) ఉద్యోగాలు గురించి తెలుసుకుని అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ రోజువారి పనులు చేస్తూ..అందులో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతుండేవాడు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు అక్కడి ఉద్యోగులు. పోనీ కంప్యూర్ జాబ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ వంటి యానిమేషన్ కోర్సులు ద్వారా ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అని సూచించారు భగత్‌కి. వాటికి క్రియేటివిటీ ముఖ్యం అని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. అలా రాత్రిళ్లు ఆఫీస్ బాయ్‌గా డ్యూటీ చేస్తూ.పగలు యానిమేషన్ కోర్సునేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం చేయడం కంటే తనకంటూ సొంత మార్గంలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఆ నేపథ్యంలోనే తొలుత డిజైనర్‌గా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించాడు..ఆ తర్వాత సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే అతడి కలలపై నీళ్లు జల్లినట్లుగా కోవిడ్మహమ్మారి విజృంభించి తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయేలా చేసింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు భగత్. గ్రామంలో బతకడం ఈజీ..కానీ తన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే తరుచుగా విద్యుత్ కోతలు..సరైన ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి దీన్ని పరిష్కరించేలా తన బృదం సాయంతో మార్గాన్ని అన్వేషించాడు. తమ ఊరిలో కొండపై ఉండే గోశాల వద్ద మొబైల్ సిగ్నల్ బేషుగ్గా ఉంది. కాబట్టి అక్కడ తన డిజైన్ టెంప్లేట్ ఆఫీస్‌ను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్నగా మొదలైంది అతడి కార్యాలయం. స్థానిక యువకులకు గ్రాఫిక్ డిజైన్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వారికి డిజిటల్ నైపుణ్యాల అందివ్వడంలో సహాయం చేశాడు. అతడి వినూత్న స్ఫూర్తి మీడియా కంటపడి..మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆయన మన్ననలను అందుకోవడమే కాదు షార్క్ ట్యాంక్ ఇండియాకు చేరుకుంది అతడి విజయగాథ. దాంతో చిన్నగా మొదలైన డిజైన్ టెంప్లేట్ కాస్తా అంచలంచెలుగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక షార్క్ ట్యాంక్ షోలో బోట్ వ్యవస్థాపకుడు సీఎంఓ అమన్ గుప్పా ఏకంగా అతడి కంపెనీలో పదిశాతం ఈక్విటీని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఆ షోలో తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో తడబడ్డానని, అప్పుడు రాధికా గుప్తా మంచినీళ్లు ఇచ్చి ఏదో ఆఫీస్ ప్రెజెంటేషన్‌లా కాదు..నీ ప్రస్థానాన్ని తోటి స్నేహితులకు వివరించినట్లుగా చెప్పుచాలు అని ధైర్యం ఇచ్చారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు భగత్. అయితే ఈ డిజైన్ టెంప్లేట్ భారతీయ వినియోగదారుల కోసం భగత్ రూపొందించిన క్రియేటివిటీ సాధనం. ఇప్పుడు ఇది అంతర్జాతీయ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ కాన్వాతో పోటీపడే రేంజ్‌కి చేరుకుంది. ఆఫీస్ బాయ్ కాస్తా ప్రోఫెషనల్ డిజైనర్ స్థాయికు చేరుకుని తానే ఉద్యోగాల ఇచ్చే రేంజ్‌కి చేరడం అంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్ జర్నీ కాదు కదూ..! కాగా, భగత్ స్థానిక క్రియేటర్లకు సాధికరత కల్పించి..డిజిటల్ డిజైన్‌లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నాడు భగత్. View this post on Instagram A post shared by Dadasaheb Bhagat (@dadasaheb_bhagat) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. కష్టాలు కన్నీళ్లు ఎన్ని వచ్చినా ఓపిగ్గా ఉంటూ కృషిని నమ్ముకోవాలి. వీటన్నింటికి తోడు మట్టిని ప్రేమించాలి. అపుడు మాత్రమే ఊహించని ఫలితాలు సాధ్యం. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నాడు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.కర్ణాటకకు చెందిన ఉమేశ్ రావు మునగ సాగుతో భారీ లాభాలు సాధించిన తనలాంటి ఔత్సాహిక రైతులకు ప్రేరణగా నిలిచాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది ఎకరాలకు పైగా చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించాడు. కానీఆశించిన ఫలితాలు పెద్దగా లభించ లేదు. ఇంతలో మొరింగ సాగు గురించి తెలుసుకున్నాడు.2010లో మొరింగ ఒలిఫెరా మొక్క విత్తనాలను నాటాడు ఉమేష్. దాదాపు 900 మొక్కలతో తన జర్నీని మొదలు పెట్టాడు. మొదట్లో మునక్కాయలను క్రమంగా మునగాకు పౌడర్‌ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ కనుగుణంగా ఇతర పంటలను నిలిపివేసి సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఇది ఇలా ఉండగా భూవిషయంలో కుటుంబ వివాదం నేపథ్యంలో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు మోరింగ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇట్లా చిన్నమొత్తంలో కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్‌ను స్టడీ చేసి మెరుగైన (ఓడీసీ-3 వెరైటీ) చెందిన మొక్కలను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. ఎక్స్‌ట్రాక్టర్లు, ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు ,ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీని ఫలితంగా ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు. ఇదీ చదవండి: 45 కిలోలకు పైగా వెయిట్‌లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!ఏడాదికి రూ. 40 లక్షలుఅలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్‌కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు. -
చదివింది ఎనిమిదో తరగతి..కానీ ఇవాళ ఏకంగా బుర్జ్ ఖలీఫాలో నివసించే రేంజ్‌కి..
చాలామంది ఉపాధి కోసం దుబాయ్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు పయనమవుతుంటారు. అక్కడకు వెళ్లి బ్రోకర్ల చేతిలో మోసపోయిన వాళ్లు కొందరైతే..మరికొందరు సవ్యంగా ఆయా దేశాలకు వెళ్లి..మంచి స్థాయిలో స్థిరపడి..తమకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే సతీష్ సన్పాల్. అతడి సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ..స్వయంకృషితో పైకి రావడం ఎలా అనేది నేర్పిస్తుంది అతడి కథ. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన సతీష్ సన్పాల్ ఎనిమిదో తరగతితోనే చదువుకి స్వస్తి పలికాడు. తన తల్లి ఇచ్చిన రూ. 50 వేల రూపాయలతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడు. జస్ట్ 15 ఏళ ప్రాయానికి భారత్‌లో చిన్న దుకాణం ప్రారంభించాడు. ఆ వ్యాపారం పెట్టిన రెండేళ్లకే మూతపడ్డప్పటికీ..అదే అతడికి ఎన్నో అమూల్యమైన పాఠాలను నేర్పించింది. అయితే సతీష్‌లో ఆ పరాజయం మరింత కసి, పట్టుదలను పెంచేశాయి. ఏదో సాధించాలనే దృఢ సంకల్పంతో అవకాశాల కోసం అన్వేషిస్తూ..అలా దుబాయ్‌కి పయనమయ్యాడు. కనీసం డిగ్రీ చదువు కూడా లేకపోయినప్పటికీ..తన స్వీయ తెలివితేటలు, అభిరుచిలనే పెట్టుబడిగా పెట్టి..తనకంటూ ఒక సొంత మార్గాన్ని స్వయంగా నిర్మించుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు. అక్కడ తనకంటూ ఎలాంటి వ్యాపార సెటప్ లేకపోయినా..చిన్నగా క్లయింట్లు స్టాక్ మార్కెట్ బ్రోకర్లతో కనెక్ట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యే అంశంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. అది అతనికి మంచి అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలా నెమ్మదిగా వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తూ..2018లో ఏఎన్‌ఏఎక్స్ హోల్డింగ్ నిర్మించడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ బృదంలో మూడు ప్రధాన వ్యాపార దిగ్గజాలు ఉన్నాయి. ఒకటి ఏఎన్‌ఏఎక్స్ డెవలప్మెంట్స్, ఏఎన్‌ఏఎక్స్ హాస్పిటాలిటీ, ఏఎన్‌ఏఎక్స్ క్యాపిటల్ తదితరాలు..సంక్షోభాన్ని..లాభంగా మార్చేయడం..కోవిడ్ సంక్షోభంలో చాలా తెలివిగా తక్కువ విలువ కలిగిన దుబాయ్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టి..కోట్లకు పడగలెత్తాడు. వాటి విలువ ఇవాళ పది రెట్లు పెరిగాయి. ఆయన పొదుపు, ఖర్చులని చాలా తెలివిగా బ్యాలెన్స్ చేస్తాడట. సతీష్ ఎక్కువగా రియల్ ఎస్టేట్, లగ్జరీ గడియారాలు, బంగారం, కార్లపై పెట్టుబడులు పెడతాడట. ఆయన సాహసోపేతమైన నిర్ణయాలకు నిదర్శనమే వెయ్యి కోట్ల హిల్స్భవనం. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నాడు. సతీష్‌కు లగ్జరీ కార్ల గ్యారేజ్ ఉంది. అవి ఆయన హోదాకు నిదర్శనంగా కాకుండా తన ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా చూస్తాడట. అంతేగాదు సతీష్ 2034 నాటికి ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నాడు. ఇక ఈ ఏడాది అతని కంపెనీ దుబాయ్, యూకేల వెంచర్లతో సహా డీహెచ్3 వంటి బిలియన్లకు పైగా నాలుగు కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించడం విశేషం. చివరగా యువతకు ఆయన ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటంటే.. "క్రమశిక్షణతో నేర్చుకుంటూ ఉండండి, ఎప్పుడూ ఆశను వదలుకోవద్దు, ఓడిపోయానని చేతులెత్తేయొద్దు" అని సూచిస్తున్నారు. మనం తినే ఎదురుదెబ్బలే విజయానికి దారితీస్తాయనే విషయం గుర్తురెగాలని చెబుతున్నాడు సతీస్ సన్పాల్.(చదవండి: Success Story: ఐఏఎస్‌గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్‌గా..) -
నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోమహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్‌గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్‌గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.గూగుల్‌లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025ఎవరీ రాగిణి దాస్?గురుగ్రామ్‌లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్‌లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్‌తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో 2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్‌తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్‌లైన్ క్లబ్‌ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్‌లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్‌గా ఎంపికకావడం విశేషం. -
డీఎస్పీగా గృహిణి..! ఆమె కలను వివాహం ఆపలేదు..
వివాహం ఏ అమ్మాయికైనా తన కలలను కనడమే మరిచిపోయేలా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సపోర్టు ఉంటే తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఎదుగుతుంది. లేదంటే వంటిటికే పరిమితమవ్వాల్సిందే. కానీ అలాంటి మూసపద్ధతులన్నింటిని బద్దలుకొట్టుకుంటూ దూసుకొచ్చింది ఈ మహిళ. ఓ పక్క పేదరికం, మరోవైపు ఇంటి బాధ్యతలు అయినా.. తన కలలు కల్లలుగా మారనివ్వ లేదు. తాను అనుకున్నది సాధించడం కోసం గుక్కపెట్టి ఏడిపించేలా చేస్తున్న కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని..గృహిణులు కూడా ఉన్నతాధికారుల కాగలరని చాటి చెప్పిందిఆ ధీర వనితే అంజు యాదవ్(Anju Yadav). 1988లో హర్యానాలోని నార్నాల్ జిల్లాలోని చోటే అనే గ్రామంలో జన్మించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తండ్రి లాల్రామ్ వ్యవసాయం, పార్చున్ దుకాణం సాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి సుశీలా దేవి గృహిణి. ఆమెకు ముగ్గురు సోదరీమణులు. బీఏ వరకు తన గ్రామంలోనే చదువుకున్న అంజు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 22 ఏళ్లకే తల్లి అయ్యి ముకుల్దీప్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా సరే తన డ్రీమ్ ఆగిపోకూడదనుకుంది. తల్లిగా, భార్యగా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ సతమతమైంది. తన లక్ష్యానికి నెరవేర్చుకునేందుకు అత్తమామలు ముందుకు రాకపోవడంతో తల్లి సాయం తీసుకుంది. ఆమెకు తన కొడుకు బాధ్యతను అప్పగించి తన కెరీర్‌పై దృష్టిసారించింది. అలా ఎలాంటి కోచింగ్ లేకుండా బీఈడీ సీటు సంపాదించి ఏకంగా మూడుసార్లు పలు చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక ఆ సమయంలో తల్లి ఆమెకు మద్దతిచ్చి..కొడుకు ముకుల్‌దేవ్ బాధ్యతను తీసుకుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆరాటంతో సాగిపోతున్న అంజుకి భర్త అనారోగ్యం ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) రిక్రూట్మెంట్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకుని మరీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఆ డీఎస్పీ ఎగ్జామ్‌కి సన్నద్ధమవుతుండగా భర్త నిత్యానంద్రావు అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి తల్లిగా నానా ఇబ్బందులు పడింది. ఆ కష్ట సమయంలో తల్లిదండ్రులు మద్దతివ్వడంతో..ఆహర్నిశలు కష్టపడి ప్రిపేరయ్యింది. అలా 2023లో 1725 ర్యాంకు సాధించి డీఎస్సీ అయ్యింది. చివరికి సెప్టెంబర్ 2025కి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాజస్తాన్ పోలీస్ సర్వీస్‌లో డీఎస్పీ(Deputy Superintendent of Police )గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ మారుమూల గ్రామంలో వివాహితురాలిగా మారిన తర్వాత కూడా అంజు కలలు కనడం ఆపలేదు. ఎన్ని రకాలుగా తనను అణిచివేసేలా ఇబ్బందులు వచ్చి పడినా అధైర్యపడలేదు. ఏదో ఒక నాటికి తను అనుకున్న గుర్తింపు సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందుకు సాగింది. చివరకు సుదీర్ఘ పోరాటం అనతరం తన కలను నెరవేర్చుకుంది .కష్టపడేతత్వం ఉంటే కల ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచి.. 'దటీజ్ అంజు యాదవ్' అని అనిపంచుకుంది . View this post on Instagram A post shared by Anju Yadav (@anjuyadav_dsp) (చదవండి: అందాలపోటీలకు అంతరాయం కలిగించిన భూకంపం..! వీడియో వైరల్) -
చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సమయానికి తగ్గట్టు ఆలోచించడంలో వారికి వారే సాటి. కృషి, పట్టుదలే వారికి పెట్టుబడి. అలా గత దాదాపు రెండు దశాబ్దాలుగా మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన వందన ప్రభాకర్ పాటిల్ (Vandana Prabhakar Patil) మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) పనిచేస్తూ తనదైన వ్యాపారానికి నాంది పలికారు. తన ఆలోచనకు పదునుపెట్టి నెలకు మూడు లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు.వందన పాటిల్ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఉంది. ఆమె చదివింది. 12వ తరగతి మాత్రమే ఉంది. ఆమె వ్యవసాయంలో కూరగాయల నుండి ఆదాయం పొందేది, కానీ కూరగాయల ఉత్పత్తి వచ్చినప్పుడు, మార్కెట్లో కూరగాయల ధరలు ఆశించిన లాభాలు రాకపోవడంతో ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. దీంతో 2021లో ఆమె జల్గావ్లోని మామురాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని (KVK) సందర్శించి, కూరగాయలు, పండ్లను పొడి లేదా ఒరుగులుగా మార్చే ప్రక్రియ డీహైడ్రేషన్ (Dried Vegetables and Fruits) గురించి తెలుసుకుంది. అంతే ఆమె మెదడులో ఆలోచన రూపుదిద్దుకుంది. అందరికలా కాకుండా తాను భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. తనలాంటి అనేక మంది రైతుల సమస్యలను కూరగాయలను సౌరశక్తితో ఎండబెట్టడం ద్వారా పరిష్కరించవచ్చని, కూరగాయల డీహైడ్రేషన్ పరిష్కరిస్తుందని గ్రహించింది.వందన తన పాలస్ఖేడ గ్రామంలో కూరగాయలను డీహైడ్రేట్ చేసి వాటి నుండి పొడిని తయారు చేయడానికి ఒక కంపెనీని స్థాపించింది. ఆమె తన గ్రామంలోని కొంతమంది మహిళల సహకారంతో గాయత్రి ఫుడ్స్ పేరుతో ఈ పరిశ్రమను ప్రారంభించింది. దీనికి సౌరశక్తితో ఎండబెట్టిన ఆహార పదార్థాలకు పెరుగుతున్న డిమాండ్ కలిసి వచ్చింది. తన యూనిట్‌ను ప్రారంభించడానికి,2021లో కూరగాయల డీహైడ్రేషన్‌లో శిక్షణ తీసుకుంది. వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకుంది, కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించారు అధికారులు. ఆ తర్వాత ఆమె రూ. 10 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) పథకం కింద, సూక్ష్మ సంస్థలు అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఖర్చులో 35 శాతం సబ్సిడీని పొందే అవకాశాన్ని వినియోగించుకుంది. తన వ్యాపారంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 నుండి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. .సోలార్ డ్రైయింగ్ యూనిట్న్నెల్ ఆకారంలో పాలికార్బోనేట్తో సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ ఏర్పాటు, పల్వరైజర్, కటింగ్ మెషిన్ కొనుగోలు మరియు ప్యాకేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇది సౌర వికిరణాన్ని బంధించి లోపల గాలిని వేడి చేస్తుంది, గ్రీన్హౌస్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. కూరగాయలను సోలార్ ఎండబెట్టడానికి ముందు కడిగి, శుభ్రం చేసి, ముక్కలుగా కోస్తారు. వేడిచేసిన గాలి సొరంగం ద్వారా లోనికి వెళ్లి, తేమను తొలగించడం ద్వారా ట్రేలు లేదా రాక్లపై ఉంచిన ఉత్పత్తులను ఎండేలా చేస్తుంది. చివరల్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తేమ గాలిని బయటకు వెళ్లేలా చేస్తాయి.ప్రధానంగా ఉల్లిపాయ, టమోటా, దుంప, సెవ్గా, మెంతులు, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం లాంటివి కూరగాయలు ఉన్నాయి.కూరగాయల పొడిని తయారు చేయడానికి ఒక పద్ధతి ఉంది. కూరగాయలను కడిగి శుభ్రం చేస్తారు. తరువాత వాటిని కటింగ్ మెషిన్ ద్వారా ఎండబెట్టి, ఆపై వాటి పొడిని తయారు చేస్తారు. సౌరశక్తి ద్వారా సహజంగా ఎండబెట్టడం వల్ల, వాటి రంగు , నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుందని వందన పాటిల్ చెప్పారు. అవి పూర్తిగా సహజమైనవి కాబట్టి, కూరగాయల పొడి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, ఆమ్లత్వం, మధుమేహం, చర్మం, జుట్టు మొదలైన అనేక వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా ఉంటుంది. .వందన పాటిల్ వ్యాపారం తక్కువ సమయంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించింది. కంపెనీలో ఇప్పుడు కొత్త ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని వందన పాటిల్ చెప్పారు. తమ డీహైడ్రేటెడ్ కూరగాయలు పునఃవిక్రేతలు, టోకు వ్యాపారుల ద్వారా US, మాల్దీవులు మరియు కెనడాకు కూడా చేరుతాయని వందన చెప్పారు.యూనిట్‌ను విస్తరించాలని మరియు ఎగుమతి ఆర్డర్లను అందించే సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు.వందన కుటుంబం తన గ్రామంలో ఐదు ఎకరాలకు పైగా నిమ్మకాయతో మునగ పంటను అంతర పంటగా పండిస్తుంది. రెండింటినీ డీహైడ్రేట్ చేస్తూ, స్థానిక రైతుల నుండి ఇతర కూరగాయలను కొనుగోలు చేస్తుంది. ఏదైనా కూరగాయల కొరత ఉంటే, వ్యవసాయ-ఎండబెట్టడం కోసం ఆమె వాటిని హోల్‌సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తుంది. 22 కిలోల తాజా టమోటాలు 1 కిలోల డీహైడ్రేట్ టమోటాలు వస్తాయి. కనుక ఒక కిలో డీహైడ్రేట్ టమోటా ధర దాదాపు రూ.700. అలాగే బీట్రూట్ ధర 100 గ్రాములకు రూ. 100 ,హోల్‌సేల్‌లో కిలోకు రూ. 700గా ఉంటుంది. ఉల్లిపాయలు కిలోకు రూ. 500 నుండి రూ. 600 వరకు ఉంటుంది. తాజా ఉత్పత్తుల మార్కెట్ ధరలను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. తద్వారా వీరి సగటు నెలవారీ టర్నోవర్ రూ. 3 లక్షలు. ఒక్కోసారి రెండు,మూడు రోజుల్లోనే రూ. 8-10 లక్షల టర్నోవర్ వస్తుంది అంటారు ఆ యూనిట్లో పనిచేసే ఇతర మహిళలు. వందనా సందేశంఈ ప్రాజెక్ట్ రైతులకు సహాయం చేయడంతోపాటు, గ్రామంలోని మహిళలకు తాను ఉపాధి కల్పించడం గర్వంగా ఉంటుందనీ, ఏ స్త్రీ కూడా తనను తాను తక్కువ అంచనా వేసుకోకూడదని, పట్టుదలతో ఉంటే, మహిళలు తమ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించగలరని వందనా పాటిల్ మహిళలకు సందేశం ఇస్తుంది.మార్కెట్: భారతదేశపు డీహైడ్రేషన్ పండ్లు, కూరగాయల మార్కెట్ 2023లో రూ. 17,200 కోట్లుగా ఉండగా 2035 నాటికి రెట్టింపు రూ. 37,200 కోట్లుగా ఉంటుందని అంచనా. డీహైడ్రేటెడ్ కూరగాయలు మరియు పండ్లకు డిమాండ్ పెరుగుతున్న సౌకర్యవంతమైన ఆహారాలకు ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే అవి అవసరమైన పోషకాలను నిలుపుకుంటూ నిల్వ చేయడం , తయారు చేయడం సులభం. సౌర ఎండబెట్టడం వాటి షెల్ఫ్ జీవితాన్ని పెంచుతుంది మరియు పోషక విలువను ప్రభావితం చేయకుండా బరువును తగ్గిస్తుంది. -
బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తే
ప్రకృతి దగ్గరగా జీవించాలని, ఆర్గానిక్ ఆహారాన్ని మాత్రమే తినాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆచరణ ఎలాగో అర్థంకాదు. అలా నిస్తేజంగా, నిర్జీవంగా జీవితం గడపకుండా, పచ్చని ప్రకృతి,స్వచ్ఛమైన గాలి, కల్తీ లేని భోజనమే జీవితం అనుకుంది స్నేహా రాజ్‌గురు. ఇది తన ఒక్కదానికే పరిమితం కాకుండా తన తండ్రితో కలిసి ‘బాప్ బేటీ ఫామ్స్’’ పేరుతో సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతోంది. ఎవరీ స్నేహ, తెలుసుకుందాం పదండి.స్నేహ రాజ్‌గురు పుణెలో పుట్టి పెరిగింది. ఇద్దరు అన్నయ్యలు. తండ్రి అనిల్ రాజ్‌గురు. స్నేహ రాజ్‌గురు సినిమాల్లో పనిచేస్తానంటే సంపూర్ణ మద్దతిచ్చారు. స్నేహ బాలీవుడ్లో స్క్రిప్ట్ సూపర్వైజర్గా, ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసింది, 'బుల్బుల్', 'లుకా చుప్పి' వంటి సినిమాలకు పనిచేసింది. వృత్తిలో భాగంగా భారతదేశం అంతటా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించింది. ఈ క్రమంలోనే ఆమె జీవితం మలుపుతిరిగింది. ‘లూకా చుప్పి’ సినిమా లొకేషన్ల కోసం మదురై వెళ్లింది. అక్కడి ప్రకృతి, మట్టితో కట్టిన ఇళ్లు చూసి పరవశించి పోయింది. అపుడే నిర్ణయించుకుంది..ప్రకృతిలో మమేకమవుతూ, సేంద్రియ ఆహారాన్ని సేవిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని. మట్టిలో మెరుపుపశ్చిమ బెంగాల్ అడవులలోని పెర్మాకల్చర్ ఫామ్‌లో 52 రోజుల బస చేయడం తన ఆలోచనలకు మరింత బలం వచ్చింది. అలంకరణలు లేవు, ఫిల్టర్లు లేవు, కేవలం ఒక టెంట్, అడవి. స్నేహ ఇక్కడే పెర్మాకల్చర్ సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ప్రకృతిని వినడం, వర్షంలో లయను, కలుపు మొక్కలలోని జ్ఞానాన్ని చూడటం నేర్చుకుంది. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన వృత్తిని వదిలిపెట్టి, తన తండ్రి అనిల్ రాజ్‌గురుతో కలిసి పూణే సమీపంలో 'బాప్ బేటీ ఫామ్స్'ను ఏర్పాటు చేసింది. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm)బాప్ బేటీ ఫామ్స్ (BaapBeti Farms) "నేను కథలు చెప్పడం మాత్రమే కాదు.. ఆ కథల్లో ఈ ప్రకృతిలో జీవించాలనుకున్నాను. అదే నన్ను భూమికి అనుసంధానించినది. భూమినుంచే తీసే తాజాగా తినే ఆహారం, పాలిష్ చేయని, ప్రాసెస్ చేయని , స్వచ్ఛమై ఆహారంతో నా సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసింది”అంటారు స్నేహ. ముంబైలో తన జీవితాన్ని సర్దుకుని పూణేకు తిరిగి వచ్చింది. బ్యాకప్ ప్లాన్ ఏమీ లేదు. ఉన్నదల్లా నమ్మకం. ఓర్పు, అభిరుచే పెట్టుబడి. దీనికి కూతురి కలలకు అండగా నిలిచిన తండ్రి తోడ్పాటు, పెర్మాకల్చర్లో కోర్సులు, భూమి భాషను అధ్యయనం తోడైంది. టాటా మోటార్స్ పనిచేస్తున్న పదవీ విరమణకు దగ్గరగా ఉన్న స్నేహ తండ్రి అనిల్ రాజ్ గురు తొలుత ఆమె నిర్ణయానికి విస్మయం చెందాడు. అయితే “స్నేహ ఎప్పుడూ ఆరుబయట ఉండటం ఇష్టపడేది. చిన్నప్పుడు కూడా, ఆమె నేల వైపు ఆకర్షితురాలైంది," అని గుర్తు చేసుకుంటారుపూణే దగ్గర ఉందీ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ సేంద్రీయ కూరగాయలు, పళ్లు పండిస్తారు. అందుకే ఆమె వ్యవసాయం గురించి ప్రస్తావించగానే మారు మాట్లాడకుండా ఆమెతో చేయి చేయి కలిపారు.పూణే బయట బంజరుగా ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కనుగొన్నారు. విత్తనాలు నాటారు. భూమిని పెర్మాకల్చర్ జోన్లుగా విభజించారు, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా, అందంగా అమర్చుకున్న పర్యావరణ వ్యవస్థ. పక్షులు, తేనెటీగలు, కూరగాయలు, కోళ్లు, కంపోస్ట్ కుప్పలు - ప్రతిదీ ఈ పచ్చని సోయగంలో తన పాత్రను పోషించింది. (ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్) ప్రతీ ఆకులో ఒక వారసత్వాన్ని వెతుక్కున్న వారి కృషి ఫలించింది. స్ట్రాబెర్రీల నుండి లెట్యూస్, క్యాప్సికమ్ వరకు స్థానిక ఉత్పత్తులలో ప్రయోగాలు వరకు, బాప్బేటి ఫామ్స్ పూర్తిగా సేంద్రీయం మారిపోయింది. వ్యక్తిగత ప్రయాణంగా ప్రారంభమై, ఉద్యమంగా మారింది. స్నేహ ఈ పొలాన్ని Airbnbలో జాబితా చేసింది, అతిథులను స్థిరమైన జీవనశైలిని అనుభవించమని ఆహ్వానించింది. నగరవాసులు క్యూ కట్టారు. ఈ తండ్రీ కూతుళ్లు ఎంతోమంది రైతులకు మార్గ నిర్దేశకులయ్యారు. ఆమె తండ్రి అనధికారిక టూర్ గైడ్ అయ్యాడు. అంతేకాదు నచ్చిన పనిచేస్తూనే ప్రతి ఉదయం ప్రకృతిలో నడక. దీంతో సుగర్ నియంత్రణలోకి వచ్చింది. 18 కిలోగ్రాముల బరువ తగ్గాను అంటూ సంతోషంగా చెబుతారు అనిల్. అన్నింటికంటే ముఖ్యం నా బిడ్డ కల సాకారంలో నేను ముఖ్య భూమికనయ్యాను అంటారు. చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీసంపాదన కాదు ముఖ్యంబాప్ బేటి ఫామ్స్ నెలకు రూ.80 వేలకు పైగా సంపాదిస్తుంది. కానీ తనకు డబ్బు కాదు ముఖ్యం. ప్రకృతిలో జీవించడం, వ్యవసాయ క్షేత్రం స్వయం సమృద్ధిగా, నిరంతరం అభివృద్ధి చెందడం. అలాగే ఏ హాలీవుడ్ చిత్రం రాయలేని ట్విస్ట్‌లు, విలువల కంటే మేటి జ్ఞానం.అదే నిజమైన బహుమతి అంటారు స్నేహ. -
టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. నాల్గోసారి పాసైనా..
పదోతరగతి కూడా పాసవ్వలేదు.. ఇంకేం చదువుతాడు అని అనేస్తారు. కానీ కొందరూ పది ఫెయిలైనప్పటికీ..తర్వాత నెమ్మదిగా సక్సెస్‌ని అందుకోవడం ప్రారంభిస్తుంటారు. అలానే సాగింది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ ప్రస్థానం. పదోతరగతి ఫెయిలై..సాదాసీదాగా చదివే ఈ అబ్బాయి ఈ రేంజ్లో అందుకోవడం చూసి అంత విస్తుపోయారు. అతడికి ఈ సివిల్స్ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నిసార్లు ఓటమి పలకరించిందో తెలిస్తే చెమటు పడతాయి. పోని విజయ దక్కింది అనుకుంటే అనుకున్న డ్రీమ్ జాబ్ దక్కక నిరుత్సాహం నిలువెల్ల వెంటాడుతున్న తగ్గేది లే అంటూ పోరాడి దక్కించుకున్న గెలుపు కథ ఇది. ప్రతిష్టాత్మకమైన ఈ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వుతున్న వాళ్లకు ఈ ఐపీఎస్ స్టోరీ ఓ ప్రేరణ. అతడే ఈశ్వర్ గుర్జార్. రాజస్థాన్‌లోని భిల్వారాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సువాలాల్ ఒక కిరాణ దుకాణం నడిపేవాడు. తల్లి సుఖి దేవి గృహిణి. చదువులో యావరేజ్ స్టూడెంట్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిలై తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యాడు. కానీ అతడి తండ్రి అందరి నాన్నల్లా కోప్పడకుండా.. ఏం కాదు మరోసారి ప్రయత్నించు పర్లేదని వెన్నుతట్టాడు. అదే అతడికి మనోబలాన్నిచ్చి పదోతగరతి పాసైయ్యేందుకు దారితీసింది. అలా 2012లో 54% మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక పన్నెండో తరగతి బోర్డు పరీక్షలలో 68% మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 2019లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అయితే అతడు తన సక్సెస్‌ని అక్కడితో ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ (UPSC Civil Services Exam)ని ఎంచుకున్నాడు.వైఫల్యాలు అధిగమించి గెలుపొందిన తీరు..2019 తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. 2020లో ఇంటర్వ్యూ దాక చేరుకున్నా..నిష్క్రమించాల్సి వచ్చింది. చివరికి 2021లో మరోసారి ఓటమిని చవిచూడక తప్పలేదు. ఎట్టకేలకు 2022 నాల్గో ప్రయత్నంలో సివిల్స్‌ని క్లియర్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 644ని సాధించి ఐఆర్ఎస్ కేడర్‌కి ఎంపికయ్యారు. కానీ ఆయన చిరకాల వాంఛ ఐపీఎస్ అందుకోసం మరోసారి ప్రయత్నించారు. అలా 2023లో, అతను ఆల్ ఇండియా ర్యాంక్ 555తో IPS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు. కానీ తన ర్యాంకు మరింత మెరుగుపడేలా చేసి పూర్తి స్థాయిలో ఐపీఎస్ హోదాని అందుకోవాలని 2024లో మరోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఈసారి ఏకంగా 483 ర్యాంకుతో మరింతగా మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ గుర్జార్ సెప్టెంబర్ 2025 వరకు, IPS సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్నాడు. కృషి, ఓర్పు పట్టుదలతో ఎంతటి కఠినమైన సవాలునైనా ఢీకొట్టి సక్సెస్‌ని అందుకోవచ్చని ప్రూవ్ చేశారు. ఓటమి ఎదురైనప్పుడల్లా గెలుపుకి దార్లు వెతికే ప్రయత్నంలో ఉన్నాం అనుకుంటూ ఓర్పుతో ముందుకు సాగాలనే గొప్ప సందేశం అందిస్తోంది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ సక్సెస్ స్టోరీ.చదవండి: ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..! -
ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్‌లే!
అదో చిన్న ఊరు. అక్కడ 75 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు చిన్నదే కానీ దాని ప్రత్యేకత మాత్రం చాలా ఘనం. ఆ ఊరి నుంచి 50 మంది పైగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, పీసీఎస్ జాబ్స్ సాధించిన వారు ఉన్నారు. దీంతో ఆఫీసర్స్ విలేజ్, యూపీఎస్సీ ఫ్యాక్టరీగా ఆ ఊరిని పిలుస్తుంటారు. ఇంత చిన్న ఊరి నుంచి అంత మంది ఉన్నత ఉద్యోగాలు సాధించారంటేఅక్కడేదో పెద్ద కోచింగ్ సెంటర్ ఉండే ఉంటుందని ఊహిస్తున్నారా? అలాంటిదేమి లేదక్కడ. ఇంతకీ ఆ ఊరు పేరేంటి, ఎక్కడ ఉంది..?ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఊరి పేరు మాధోపట్టి. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఊరి విజయగాథ (success story) గురించి తెలుసుకోవాలంటే వందేళ్లు వెనక్కి వెళ్లాలి. స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, ఆయన భార్య శ్యామరతి సింగ్‌తో ఈ విలేజ్ సక్సెస్ స్టోరీ ప్రారంభమైంది. శ్యామరతి సింగ్ 1917లో అమ్మాయిలకు చదువు చెప్పడం ప్రారంభించారు. తర్వాత అబ్బాయిలు కూడా ఆమె దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఆ ఊళ్లో విద్యార్జనకు బీజం పడింది.మాధోపట్టి మహిమస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ ఊరి నుంచి ఒకరు తొలిసారిగా ఓ యువకుడు ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాడు. తర్వాత వినయ్ కుమార్ సింగ్ అనే మరో యువకుడు ఐఏఎస్ సాధించాడు. ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో మాధోపట్టి గ్రామం పేరు మార్మోగిపోయింది. యూపీఎస్ జాబ్స్ సాధించడం మాధోపట్టి (Madhopatti) వాసులకు అలవాటుగా మారిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన యువతులు కూడా ఈ విజయంలో భాగస్వాములయ్యారు. మెట్టింటిలో అడుగు పెట్టగానే పుస్తకాలతో కుస్తీ పట్టి సర్కారీ కొలువులు సాధించారు. మాధోపట్టి మహిమ అది!విజయ రహస్యంఇంత మందికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు రావడానికి అక్కడేమి పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు. గ్రామమే కోచింగ్ సెంటలా పనిచేస్తుంది. ఇప్పుడు అధికారులుగా ఉన్న సీనియర్లు కొత్త విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఒకరు గెలిచినప్పుడు మొత్తం గ్రామం సంబరాలు జరుపుకుంటుంది. ఎవరైనా విఫలమైనప్పుడు మళ్లీ ప్రయత్నించడానికి మద్దతు ఇస్తుంది. ఇదే మాధోపట్టి విజయ రహస్యం.చదవండి: ఐఏఎస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. ఆ రాష్ట్రం!మాధోపట్టి అనేది కేవలం మ్యాప్‌లో ఉన్న ప్రదేశం మాత్రమే కాదు. సంకల్పానికి చేయూత తోడైతే ఎలాంటి విజయాన్నైనా సాధింవచ్చనే భరోసాయిచ్చే స్ఫూర్తిదాయక ప్రాంతం. కష్టపడి పనిచేసే వారికి అండగా నిలబడేవారు ఉంటే అపజయం అన్నమాటే ఉండదనడానికి మాధోపట్టి గ్రామ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. -
ఆరాటం ముందు ఆటంకం ఎంత!
చిన్నచిన్న సమస్యలకే గాబరా పడిపోతుంటాం. అపజయాలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతుంటాం. అయితే కొంతమంది మాత్రం ఓటములనే తమ విజయానికి మెట్లుగా మలుచుకుంటారు. అవరోధాలను అధిగమించడానికి అనుభవాలుగా అపజయాలను అనుకుంటారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయరు. కష్టాలు ఎదురొచ్చినా తాము అనుకున్నది సాధించే వరకు పట్టువదలరు. దీపేష్ కుమారి కూడా ఈ కోవలోకే వస్తారు.ఎవరీ దీపేష్ కుమారి?రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు దీపేష్ కుమారిది చాలా పేద కుటుంబం. ఆమె తండ్రి గోవింద్ కుమార్ తన భార్య, ఐదుగురు పిల్లలను పోషించడానికి పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఏడుగురు సభ్యుల కుటుంబం పరిమిత వనరులతో ఒక చిన్న గదిలో నివసించింది. చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబం నెట్టుకొచ్చేది. అయితే ఇంత కష్టంలోనూ పిల్లల చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యతోనే తమ కష్టాలు తీరతాయని గోవింద్ భావించాడు. ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లలను చదివించాలని గట్టిగా అనుకున్నాడు. అతడి పెద్ద కుమార్తె దీపేష్ కుమారి. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని తొలగించాలంటే చదువుతోనే సాధ్యమని ఆమె గట్టిగా విశ్వసించింది. అందుకే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. భరత్‌పూర్‌లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్‌లో చదివి.. 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% స్కోర్ సాధించి సత్తా చాటింది. జోధ్‌పూర్‌లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ ( B.Tech), ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పట్టా సాధించింది.ప్రైవేట్ జాబ్ వదిలేసి..చదువు ముగిసిన తర్వాత ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసింది. సివిల్ సర్వెంట్ కావాలన్న తన కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి UPSC పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించింది. 2020లో మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ ఆమె పట్టు వదలేదు. తాను దాచుకున్న డబ్బుతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకుంది. దీక్షగా చదవడంతో మరుసటి ఏడాదే ఆమె కల సాకారమయింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్, EWS విభాగంలో 4వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. శిక్షణ పూర్తైన తర్వాత జార్ఖండ్ కేడర్‌కు నియమించబడింది.తోబుట్టువులకు స్ఫూర్తిదీపేష్ కుమారి విజయం ఆమె తోబుట్టువులకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆమె చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా, ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నాడు. మరొక సోదరుడు లాతూర్‌లో చదువు కొనసాగిస్తున్నాడు.చదవండి: 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు నాన్నే ప్రేరణదీపేష్ కుమారి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ (Inspiration) అని చెప్పారు. "నేను అలసిపోయినప్పుడల్లా, ఆయన పోరాటం నాకు బలాన్నిచ్చింది" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పరిమిత మార్గాలు ఉన్నప్పటికీ గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించే యువతకు దీపేష్ కుమారి ఇన్స్పిరేషన్గా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
ఐటీ ఉద్యోగాలొదిలేసి కేవలం నాలుగు ఆవులతో, కోట్లు: చార్మి జంట
వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం వెనకాల ఒక విషాదగాథ కూడా ఉంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, అతని భార్య చార్మి మాల్డే తమ లాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఐటీలో బీఈ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిప శ్రీకాంత్ దశాబ్ద కాలం ఐటీ కెరీర్‌ను వదిలేశారు.అలాగే కెమికల్ ఇంజనీర్ అయిన చార్మికూడా భర్తనే అనుసరించి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకుంది. అర్థవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనే ఉద్దేశంతోపాటు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో డైరీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 2014లో ముఖ్యంగా శ్రీకాంత్ తండ్రి క్యాన్సర్‌తో మరణించడం వారిని ఆలోచింప చేసింది. View this post on Instagram A post shared by GauNeeti (@gauneeti)"> సేంద్రీయ వ్యవసాయంపై వారి పరిశోధన ఆవుల కీలక పాత్రను గుర్తించేలా చేసింది. కేవలం పాల కోసం మాత్రమే కాకుండా, ఆవు పేడ , మూత్రం వంటి సహజ ఎరువుల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా అని గ్రహించారు.దీంతో 2017లో, కేవలం నాలుగు గిర్ ఆవులతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గౌనీతి ఆర్గానిక్స్ ప్రారంభించారు. పాడి పరిశ్రమలో ముందస్తు అనుభవం లేకపోయినా, సానుకూల స్పందన వారికి ఊతమిచ్చింది. మొదటి 5-6 సంవత్సరాలు కొన్ని చాలెంజెస్ విసిరినీ,వాటిని అధిగమించారు. ఎన్ని కష్టాలొచ్చినా కానీ స్వచ్ఛమైన, కల్తీ లేని పాలను అందించాలనే పట్టుదలతో కొనసాగాగారు. ఆహార కల్తీ, అనారోగ్యకరమైన ఆహారంపై ఆందోళన, సహజమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న జనం వీరికి బ్రహ్మరథం పట్టారు. అలా కేవలం నాలుగు ఆవులతో ప్రారంభమై 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 కోట్లకుపైగా టర్నోవర్‌ను చేరుకున్నారు.తమ పాల వ్యాపారం కోసం గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన స్థానిక భారతీయ జాతి గిర్ ఆవులను ఎంచుకున్నారు. గిర్ ఆవులు బీటా-కేసిన్ ప్రోటీన్‌ను కలిగి ఉన్న పాలను ఉత్పత్తి చేస్తాయి. స్థానిక జాతులను ఎంచుకోవడం వల్ల స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సాంప్రదాయ పాల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుందని వీరి విశ్వాసం .“మా దృష్టి పాల ఉత్పత్తిపైనే కాదు, నైతిక, క్రూరత్వం లేని పద్ధతులపై ఉంది. దూడ జన్మించిన తర్వాత, ఏదైనా పాలు పితికే ముందు తగినంత ఆహారం ఇవ్వడానికి అనుమతిస్తారు. ఇది ఆవులు ఆక్సిటోసిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, దీనిని తరచుగా 'హ్యాపీ హార్మోన్' అని పిలుస్తారు, ఇది సహజంగా పాల నాణ్యతను ,జంతువు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటారు శ్రీకాంత్. నాణ్యతను అందించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. జెర్సీ ఆవు రోజుకు 25 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదు, కానీ గిర్ ఆవు 8 నుండి 10 లీటర్లు మాత్రమే దిగుబడి ఇస్తుంది. ఇది కాల క్రమేణా తగ్గిపోతుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఎటువంటి హార్మోన్లు ఇవ్వమనీ, సేంద్రీయ పచ్చి మేతతో నాణ్యతను కాపాడుకోవడానికి చాలా అవసరమనిచెప్పారు. చదవండి: 37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీఆవులకు సేంద్రీయ మేత ఆవులకు పురుగుమందులు లేకుండా పండించిన సేంద్రీయ మేతను తినిపిస్తారు. పోషకాహారాన్ని పెంచడానికి కాలానుగుణ సర్దుబాట్లు చేస్తారు. టిబి, జాన్స్ వ్యాధి , బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధులకు ప్రతి 4 నుండి 6 నెలలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. చదవండి: భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్ప్రస్తుతం 100 ఆవులతో, ఆర్గానిక్ పాలు, వెన్న, నెయ్యి, అగరుబత్తులను కూడా విక్రయిస్తున్నారు. అంతేకాదు స్థానిక మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తుంది. అభిరుచి, పట్టుదలతో పాటు, తాము అందించే ఉత్పత్తుల్లో స్థిరత్వాన్ని, నాణ్యతను అందిస్తే విజయం వంగి సలాం చేస్తుందనటానికి ఈ దంపతులు నిదర్శనంగా నిలిచారుఇదీ చదవండి: అర్రే... క్షణంలో రూ. 25 లక్షలు మిస్.. కానీ అదే తెలివైన పని! -
కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్‌కి..
చిన్నప్పటి నుంచి కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగింది. అవే ఆమెను కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని సాధించే దిశగా నడిపించాయి. పోని అక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏదో చేయాలి..తన కుటుంబం తనను చూసి గర్వించేలా అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆరాటపడేది. ఆ క్రమంలోనే యూపీఎస్సీకి సన్నద్ధమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆమెను అపజయం పలకరిస్తూనే ఉంది. అది కూడా ప్రిలిమినరీ స్టేజ్‌లోనే విఫలమవ్వడం అంటే..అస్సలు సివిల్స్ విజయం దరిదాపుల్లోకి వెళ్లకుండానే ఆమెను ఫెయిల్యూర్ భూతం భయపెట్టేస్తూ ఉండేది. మరేవరైనా అయితే మూడేళ్లు వృధా అయ్యిందని డిప్రెషన్‌కి గురై ఆ ప్రయత్నమే మానుకుంటారు కానీ.. ఈమె మొండి పట్టుదలతో తాడోపేడో అన్నట్లుగా ముందుకు సాగి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఐఏఎస్ సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.ఆ అమ్మాయే కేరళ నిర్మాణ కార్మికుడి కుమార్తె అశ్వతి. తండ్రి నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. చిన్నతనం నుంచి ఆమెకు స్ఫష్టమైన జీవిత లక్ష్యం ఉంది. ఐఏఎస్ (IAS) కావాలనేది ఆమె ధ్యేయం. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో చేరి కుటుంబానికి ఆసరాగా మారింది. అయితే అక్కడితో తన సక్సెస్‌కి బ్రేక్ వేయలేదామె. తన చిన్ననాటి కల ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా ఐఏఎస్ కావాలనే కోరిక ఆమె మనసులో చాలా బలంగా ఉండేది. అందుకోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలనై నిర్ణయాన్ని అత్యంత ధైర్యంగా తీసుకుని మరీ యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సన్నద్ధమైంది. అయితే 2017, 2018, 2019లలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేక తిప్పలు పడింది. ఇక లాభం లేదని, చేస్తున్న తప్పిదాలను సమీక్షిస్తూ.. మెరుగ్గా రాసేలా ప్రాక్టీస్ చేసింది. ఆమె దృఢ సంకల్పంతో మరోసారి సివిల్స్ ప్రయత్నించగా.. ఈసారి అపజయం తోకముడవడమే కాదు, సక్సెస్ సంతోషంగా ఒడిలోకి వచ్చి చేరింది. అలా ఆమె 2020 నాల్గో ప్రయత్నంలో 481వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారామె. ఈ సక్సెస్ స్టోరీ (Success Story).. ధైర్యంగా రిస్క్ తీసుకునేందుకు సన్నద్ధం కావడమే గాక, దాంట్లో ఎదురై ఫెయిల్యూర్లను ఓర్చుకునే ఓపిక కూడా అవసరమని చెప్పకనే చెబుతోంది. అప్పుడే విజయ ఢంకాను సగర్వంగా మోగించగడం సాధ్యమని నొక్కి చెబుతోంది కదూ..!.చదవండి: పనిమనిషికి రూ. 8 లక్షల జరిమానా..! ఎందుకో తెలుసా..? -
4 ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 లక్షల ప్యాకేజీతో మరో జాబ్!
కాసిపేట: సర్కారు కొలువు సాధించడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించాడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఏఈ (ఆపరేషన్)గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటులో రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం పాతబస్తీ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చల్ల రమేశ్, రమాదేవి దంపతులు మంచిర్యాల వినూత్న కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు చల్ల ఆదర్శ్ 2018లో సింగరేణి (Singareni) సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఓవర్‌మెన్‌గా ఎంపికయ్యాడు.ఉన్నతోద్యోగం సాధించాలనే లక్ష్యంతో అందులో చేరలేదు. ఆ తర్వాత రైల్వేశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. 2021లో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీపీడబ్ల్యూడీ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం (Junior Engineer Job) సాధించాడు. 2022లో రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి సిర్పూర్ ఏఈగా విధుల్లో చేరాడు. గ్రూప్స్ సాధించడమే లక్ష్యంగా సాగుతున్న క్రమంలో ఏఎండీ ప్రాసెసర్ ప్రైవేటు కంపెనీలో రూ.50 లక్షల ప్యాకేజీతో నియామకం అయ్యాడు. ఈ ఉద్యోగంలో చేరుతున్నానని, ఎప్పటికైనా గ్రూప్స్ సాధించడమే తన లక్ష్యమని ఆదర్శ్ తెలిపారు.చదవండి: అమెరికా నుంచి వచ్చి ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేసిన ఎన్నారై -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్‌తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్‌లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్‌లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్‌లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్‌ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్‌లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్‌ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్‌ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్‌కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్‌తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్‌లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
ఐదెంకల వేతనమిచ్చే ఐటీ ఉద్యోగం. సౌకర్యవంతమైన జీవితం. అయినా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనే ఆ జంట కోరిక, చేసిన సాహసం వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మలిచింది. ఎవరా జంట? ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టారు? వారు సాధించిన విజయంఏంటి? తెలుసుకుందాం రండి.మహారాష్ట్ర(Maharashtra) లోని కొంకణ్ఖు కు చెందిన గౌరి, దిలీప్ పరబ్ దంపతులు. వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగలలైన వీరు ముంబైలోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేసేవారు.. జీతం, జీవితం సంతోషంగానే సాగిపోతున్నాయి. ఎలాగైనా మహారాష్ట్రలోని కొంకణ్‌కు తిరిగి వచ్చి, ఏదైనా సొంతంగా అదీ వ్యవసాయాన్ని ప్రారంభించాలనే కోరిక రోజు రోజుకు పెరగసాగింది. దీంతో ఇద్దరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కొంకణ్ తిరిగొచ్చారు.కొంకణ్‌లోని కల్చర్, అందమైన తీరప్రాంతం, బీచ్‌లు, వ్యవసాయ ప్రకృతి దృశ్యం ఇవన్నీ తమను ఎల్లప్పుడూ మమ్మల్ని ఇంటికి రారమ్మని పిలుస్తూ ఉండేవని అందుకే తిరిగి సొంతూరికి వచ్చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది గౌరి. 2021లో సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా అటు వ్యాపారాన్ని, ఇటు స్థానిక ఉపాధిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మార్కెట్‌ను స్టడీ చేసి తరువాత ఆ భూమిలో నిమ్మ గడ్డిని సాగు( lemongrass Farming ) చేయాలని భావించారు. నిమ్మగడ్డి పెంపకం లాభదాయమనీ, దీన్ని సౌందర్య సాధనాలు, ఔషధాలు, ఆహారం మరియు పానీయాలతో సహా వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు, దీని వలన డిమాండ్ బాగా పెరుగుతోంది. డిమాండ్‌తో పాటు కొంకణ్ ఏరియాలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా నిమ్మగడ్డి సాగుకు అనుకూమని గ్రహించామని అందుకే దీన్ని ప్రారంభించామని దిలీప్ వెల్లడించాడు. పైగా నిమ్మగడ్డిని సంవత్సరానికి మూడు -నాలుగు సార్లు పండించవచ్చు, దిగుబడిని పెంచుతుంది . ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలను సృష్టిస్తుందని దిలీప్ వివరించాడు. View this post on Instagram A post shared by Diilip Parab (@houseofsugandhaofficial)సేంద్రీయ వ్యవసాయం నుండి ప్రాసెసింగ్ వరకుఒక ఎకరంలో నిమ్మగడ్డి సాగు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఓ నర్సరీలో కొనుగోలు చేసినట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎకరా పొలంలో 25 వేల వరకు మొక్కలు నాటారు. ప్రతి వరుసకు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మధ్యలో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో సేంద్రీయ నిమ్మకాయ గడ్డిని పండిస్తున్నారు. అందులో ఆరు ఎకరాలు వారి సొంతం, మిగిలినది లీజుకు తీసుకున్న భూమి.వర్మీకంపోస్ట్, ఆవు పేడ ,నిమ్మకాయ గడ్డి బయో వ్యర్థాలను వేస్తాము. పంట కోసేటప్పుడు మీరు వేర్లను కత్తిరించాల్సిన అవసరం లేదు కాబట్టి నిమ్మకాయ గడ్డి పెరుగుతూనే ఉంటుంది. మొదటి పంట నాలుగు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. ప్రతి 80 నుండి 90 రోజులకు ఒకసారి లెమన్ గ్రాస్‌ను కోయవచ్చు. మొదట ఎకరా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎకరాలకు చేరుకుంది. ఇందులో ఆరు ఎకరాలు సొంతం కాగా, మరో రెండు ఎకరాలను లీజుకు తీసుకున్నట్లు గౌరి తెలిపింది. లెమన్‌గ్రాస్ ఆయిల్ (Lemongrass Oil)ఒక ఎకరంలో దాదాపు 18 టన్నుల నిమ్మగడ్డి దిగుబడి వస్తుంది. ఒక టన్ను లెమన్‌గ్రాస్ నుండి 7 నుండి 8 లీటర్ల సుగంధ నూనెను పొందవచ్చు. వేసవిలో 1 టన్ను లెమన్‌గ్రాస్ నుండి నూనె ఉత్పత్తి 10 లీటర్లకు చేరుకోగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇది కేవలం 2.5 లీటర్లు శీతాకాలంలో 5 నుండి 6 లీటర్లకు తగ్గుతుంది, సగటున 7 లీటర్లు వస్తుందనీ, ఎకరా పొలంలో నిమ్మగడ్డితో 126 లీటర్ల ఆయిల్‌ను తయారు చేయొచ్చు.లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను రిటైల్ , బల్క్‌లో ఫార్మాస్యూటికల్ , కాస్మెటిక్ కంపెనీలకు విక్రయిస్తారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరలు లీటరుకు రూ.850 నుండి రూ.1500 వరకు ఉంటుంది. సగటు లీటరుకు రూ.1200, అనిఇలా ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్నట్లు దీలీప్ గౌరి జంట వెల్లడించారు.కాగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మొక్కలలో నిమ్మగడ్డి ఒకటి. CSIR-CIMAP (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) ప్రకారం, 2020లో ప్రపంచ నిమ్మగడ్డి మార్కెట్ 38.02 మిలియన్ డాలర్లు . 2028 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 81.43 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లెమన్ గ్రాస్ నూనె మార్కెట్లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది, దీనిని 80 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ , ఆసియా పసిఫిక్ ఖండాలు ఇందులో ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు. -
లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్
స్వంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆచరణలో పెట్టి విజేతగా నిలిచాడు. కోటి రూపాయల సంపాదనతో నేటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. యువరైతుగా ఎదిగి ఎవరూ చేయని విధంగా వినూత్నంగా నిలిచాడు. లండన్‌లోని ఒక లేబుల్ ద్వారా ప్రేరణ పొంది, ఇజ్రాయెల్‌లో శిక్షణ పొందిన హర్షిత్ గోధా ఇప్పుడు భారతీయ రైతులకు స్వదేశంలో ప్రపంచ స్థాయి అవకాడోలను పెంచడంలో సహాయం చేస్తున్నాడు. 2023 నాటికి, అతని వెంచర్ ‘ఇండో ఇజ్రాయెల్ అవకాడో’ రూ. 1 కోటి ఆదాయాన్ని ఆర్జించింది.హర్షిత్ రైతు కుటుంబం నుండి రాలేదు. కానీ ఆ ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంది - ఇజ్రాయెల్ దాని పొడి వాతావరణంతో అవకాడోలను విస్తృతంగా పండించగలిగినపుడు భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది? అనే ప్రశ్నతో తన స్వస్థలమైన భోపాల్‌కు తిరిగి వచ్చాడు. వెంటనే, టూరిస్ట్ వీసాపై ఇజ్రాయెల్‌కు విమానం ఎక్కాడు. అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నాడు. భోపాల్ శివార్లలో కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల బంజరు భూమిని తీసుకొని దానిని మార్చడం ప్రారంభించాడు. నేల అభివృద్ధి, నీటి-సమర్థవంతమైన బిందు వ్యవస్థలు, గ్రీన్‌హౌస్‌లు , నర్సరీ ఏర్పాటు కోసం అతను రూ. 50 లక్షలు ఖర్చు చేశాడు. తొలి ఏడాదిలో మంచి లాభాలను సాధించాడు. కానీ మద్య కోవిడ్ మహమ్మారి ఛాలెంజ్ విసిరింది. అయినా నిరాశ పడలేదు. హర్షిత్ ఈ సమయాన్ని విద్య కోసం ఉపయోగించుకున్నాడు. ఒక బ్లాగును ప్రారంభించి అవకాడో వ్యవసాయంపై ఉచిత ఇ-పుస్తకం రాశాడు YouTube, LinkedInలో తన జ్ఞానాన్ని పంచుకోవడం ప్రారంభించాడు. వందలాది మంది ఆశావహులైన రైతులు అతనికి లేఖలు రాయడం ప్రారంభించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదలమీద ఆధారణపడకుండా మల్చింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతాడు. రసాయన ఎరువులను వాడడు. అతను నేల ఆరోగ్యం, నీటి నిలుపుదలని పెంచడానికి కంపోస్ట్, సూక్ష్మ పోషకాలు ఉపయోగిస్తాడు.ప్రస్తుతం 20,000 కంటే ఎక్కువ అవకాడో మొక్కలను నిర్వహిస్తున్నాడు. రైతులకు శిక్షణ ఇస్తున్నాడు ,స్థానికంగా పండించిన, అధిక నాణ్యత గల పండ్ల కోసం వెతుకుతున్న లగ్జరీ హోటళ్ళు, బోటిక్ దుకాణాలు, చెఫ్‌లతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు వర్క్‌షాప్‌లు, శిక్షణా సెషన్లు ,మెంటర్షిప్ ద్వారా, హర్షిత్ ఇతరులు కూడా తమ అవకాడో తోటలను ప్రారంభించడంలో సహాయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.2023 నాటికి, ఇండో ఇజ్రాయెల్ అవకాడో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. కానీ హర్షిత్ కోసం, ఇది కేవలం సంపాదన ఆర్జన మాత్రమే కాదు. ,నా లక్ష్యం అవకాడోలను పండించడం మాత్రమే కాదు,” “ప్రతి లేబుల్‌పై ‘సోర్స్డ్ ఇన్ ఇండియా’ని అనే తన కలను నిజం చేయడమే.” అంటారు. యాంటీఆక్సిడెంట్లు మరియు మోనోశాచురేటెడ్ కొవ్వుల యొక్క గొప్ప మూలం అయిన అవకాడో గుజ్జులో ప్రోటీన్లు (4 శాతం వరకు) , కొవ్వు (30 శాతం వరకు) ఎక్కువగా ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. దీని వలన ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులు, హోటళ్ళు, రెస్టారెంట్లు , జిమ్‌ల నుండి అధిక డిమాండ్ ఉంటుందని గ్రహించాడు. పైగా కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం, జీవనశైలిమీద అవగాహన పెరిగింది. ఇదీ చదవండి: భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడుప్రపంచ బ్యాంకు వాణిజ్య డేటా ప్రకారం, భారతదేశం 2023లో 39 లక్షల కిలోల అవకాడోలను దిగుమతి చేసుకుంది, ఎక్కువగా టాంజానియా, న్యూజిలాండ్, పెరూ, చిలీ,ఆస్ట్రేలియా ఉన్నాయి. అవకాడోకు ఇండియాలో ఉన్న డిమాండ్‌ను దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. -
బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి
1970లలో యువ అమితాబ్ బచ్చన్ పాత్రలో ఇంటింటా గుర్తుండిపోయే పేరు బాలీవుడ్ ఐకానిక్ చిత్రాలైన ‘దీవార్’, ‘సీతా ఔర్ గీత’ ‘మజ్బూర్’లలో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు. అతను మరెవ్వరో కాదు 100కి పైగా హిందీ చిత్రాల్లో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. మాస్టర్ అలంకార్‌గా అందరి దృష్టినీ ఆకర్షించిన అలంకార్ జోష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలుసా?100కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాల నటుడు అలంకార్ జోషి. దీవార్ (1975), మజ్బూర్ (1974), సీతా ఔర్ గీత (1972) వంటి క్లాసిక్ చిత్రాల్లో నటించి బాల నటుడుగా ఆకట్టుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం బాల్య నటుడుగా అంతటి గుర్తింపు తెచ్చుకున్న అలంకార్ మరాఠీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు. నాలుగు హిందీ సినిమాలు, రెండు టీవీ సీరియల్స్ , మినీ సీరియల్స్ చేశాడు.కానీ వచ్చవన్నీ చిన్న పాత్రలే కావడంతో తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాకు మకాం మార్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చదివాడు. తరువాత 1996లో తన సొంత టెక్ సంస్థను స్థాపించాడు. పలు నివేదికల ప్రకారం రూ. 200 కోట్ల సంస్థకు అధిపతి కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రముఖ నటి పల్లవి జోషి అలంకార్ జోషి సోదరి. ప్రస్తుతం కుమార్తె అనుజా జోషి ఇప్పుడు హాలీవుడ్లో కెరీర్‌ను కొనసాగిస్తోంది. ‘హలో మినీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. కుమారుడు ఆశయ్ సంగీతాన్ని అభ్యసిస్తున్నాడు, మరో కుమార్తె కూడా యాక్టింగ్‌లో ప్రవేశించేందుకు సిద్ధపడుతోంది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్‌జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
అనుకున్నది సాధించాలంటే సాహసం చేయక తప్పదు. పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది. విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్ సాధించారు. పదండి వారి సక్సెస్ గురించి తెలుసుకుందాం.సందీప్ జోగిపర్తి (Saandeep Jogiparti), కవిత గోపు (kavitha gopu) దంపతులు ఐదేళ్లపాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం కానీ వారికి అది సంతృప్తినివ్వలేదు. స్వంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్వేషణ మొదలైంది. సందీప్ ఆరు నుండి ఎనిమిది నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆ సమయంలో ఆహారం, ఫిట్నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్‌కు స్వీట్లంటే చాలా ఇష్టం. పైగా భోజనం తర్వాత ఏదైనా తీపి తినడం ఇంకా (చాలామందికి) అలవాటు. మార్కెట్ నిండా ఎనర్జీ బార్లు,స్నాక్స్ , స్వీట్లు, కృత్రిమ స్వీట్లతో నిండి తీపిపదార్థాలతో నిండి పోయాయి. అందుకే దీనికి భిన్నంగా ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లను తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లడ్డుబాక్స్. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్-లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా ఖాక్రాస్, చిక్కీలు, నట్స్ అండ్ స్వీట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా విక్రయిస్తారు.చక్కెర, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం.చదవండి: Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలుకేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన లడ్డూ బాక్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించింది. కేవలం 4 రకాల లడ్డూల నుండి, ఇప్పుడు 15 రకాలను అందిస్తుంది. 2020 మేలో COVID-19 సమయం వారికి అనుకూలంగా పనిచేసింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో లడ్డూబాక్స్కు అద్భుత మైన స్పందన వచ్చింది.భారతదేశం అంతటా డెలివరీ చేస్తారు. పెద్ద B2B ఆర్డర్స్ తీసుకుంటారు. హైదరాబాద్‌లో వారి స్వంత స్టోర్ ఉంది. 2025 చివరికి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ NCR అంతటా 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం -
మర్రిపాలెం బుల్లోడు : షార్ట్‌ఫిల్మ్స్ టు ఆస్కార్స్ గోల్డ్ఫెలోషిప్
బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ప్రకృతి, మూగజీవులపై పలు డాక్యుమెంటరీలను చిత్రీకరించాడు శ్రీహరి వర్మ(Sagi Sree Hari Varma). మూగజీవులు స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించాలో వివరిస్తూ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాడు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’ సంస్థలో వాలంటీర్‌గా చేరి మూగ జీవులపై డాక్యుమెంటరీ రూపొందించాడు. మూగ జీవులపై చిత్రీకరించిన షార్ట్ ఫిలిమ్స్‌ను రష్యాలోని విజీఐకె ఫిల్మ్ స్కూల్‌కు పంపిచాడు. రష్యా ప్రశంసలురష్యా ప్రభుత్వం తమ దేశ ప్రగతి, సంస్కృతి, అభివృద్ధిని చాటిచెప్పే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు యువ దర్శకులను ఎంపిక చేయగా మన దేశం నుంచి శ్రీహరి వర్మకు మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కళ్ళకు కట్టినట్టుగా ‘గో మారడోవియా’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించి రష్యా ప్రతినిధుల నుండి ప్రశంసలు పొందాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ‘స్కూల్ ఆఫ్ సినిమా టెక్ ఆర్ట్స్’లో చేరి దర్శకత్వ నైపుణ్యాలపై సంవత్సరం పాటు శిక్షణ పొందాడు. హాలీవుడ్ సినిమా చిత్రీకరణపై అవగాహన పెంచుకున్నాడు. శిక్షణా సమయంలోనే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలు (పీస్‌కీపింగ్ ఫోర్సెస్) పై డాక్యుమెంటరీ రూపొందించాడు. (Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలు)ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్ఫస్ట్ ఇండియన్షార్ట్ ఫిలిమ్స్‌తో మొదలైన శ్రీహరివర్మ ప్రస్థానం ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ వరకు వెళ్ళింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్ అందజేస్తుంది. దీని కోసం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేస్తుంది. ఈ ఫెలోషిప్‌కు 2019లో ఎంపికైన తొలి భారతీయుడుగా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు శ్రీహరివర్మ. ఫెలోషిప్‌లో భాగంగా యువ దర్శకులు, ప్రముఖ హాలీవుడ్ దర్శకులతో కలసి పనిచేసే అవకాశం పొందాడు. గేమ్ ఆఫ్లైఫ్, హెడ్ అండ్ ఫిగర్స్, అమెరికన్ డ్రీమర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు టెడ్ మెల్ఫీ దగ్గర శిక్షణ పొందాడు.చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం సినీ–మదమారెలో అవకాశంఇటలీలో జరిగిన ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ (సినీ మదమారె)లో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీహరివర్మకు అవకాశం లభించింది. ప్రతి ఏటా వివిధ దేశాల నుండి యువ దర్శకుల ప్రతిభను గుర్తించడానికి ఇటాలియన్ ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. సిని మదమారెలో శ్రీహరి వర్మ 4 విభిన్న షార్ట్ ఫిలిమ్స్‌ను చిత్రీకరించాడు.విశాఖ నగరం, మర్రిపాలెంకు చెందిన సాగి శ్రీహరివర్మ షార్ట్ ఫిలిమ్స్‌తో ప్రారంభించి ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ గోల్డ్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో స్థానం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల ఇటలీలో జరిగిన వేసవి చలన చిత్ర నిర్మాణ కార్యక్రమం (సినీ మదమారె)లో పాల్గొని తన సత్తా చాటాడు... -
తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం
తెనాలి: నాన్న కల నిజం చేయాలని కుమారుడు పట్టుదలతో కృషి చేశారు. తొలి ప్రయత్నంలోనే 22 ఏళ్ల వయసులో ఐఆర్ఎస్ సాధించారు. తండ్రి కల అయిన ఐఏఎస్ కోసం మళ్లీ ప్రయత్నించారు. ఈసారి ఐపీఎస్ సాధించారు. మరోమారు ఐఏఎస్‌కు ప్రయత్నం చేస్తానని చెప్పారు. తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు 2024 సివిల్స్ పరీక్షల్లో 681వ ర్యాంక్ సాధించారు. తుది ఫలితాల్లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2021లో ఐఆర్ఎస్కు ఎంపికై ప్రస్తుతం ఆదాయ పన్నుశాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్)గా విజయవాడలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాలుగో ప్రయత్నంలో ఇప్పుడు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. విజయ్‌బాబు తండ్రి మధుబాబు, తల్లి రాజ్యలక్ష్మి. తల్లి గ్రాడ్యుయేట్ కాగా, తండ్రి ఎనిమిది పీజీలు చేశారు. జిల్లా కలెక్టర్‌గా చేయాలని ఆయన ఆశపడ్డారు. దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అవకాశం రాలేదు. జీఎస్టీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సమయంలో కన్ఫర్మ్డ్ ఐఆర్ఎస్ హోదా లభించింది. ఆ హోదాలోనే ఆయన రిటైరయ్యారు. తన కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబులు ఐఏఎస్ సాధిస్తే చూడాలనేది మధుబాబు కల. చిన్ననాటి నుంచే మంచి విద్యాసంస్థల్లో చదివించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!చిన్ననాటి నుంచే... 2007లో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషించిన తాతయ్య ప్రభాకరరావు ఆశీర్వదిస్తూ ‘భవిష్యత్‌లో కలెక్టరు కావాలి నాన్నా’ అంటూ ఉత్తరం రాశారు. అప్పుడే విజయ్‌బాబు మనసులో ఆ పదం నాటుకుపోయింది. ఎదుగుతున్న క్రమంలో తండ్రి ఆశయం తెలిసింది. ఇక లక్ష్యం ఐఏఎస్‌గా ఫిక్సయ్యారు. టెన్త్‌లో 10 జీపీఏ సాధించారు. ఇంటర్లో స్నేహితులకు భిన్నంగా ఎంఈసీలో చేరారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలనే రూలేం లేదు... ఆర్ట్స్‌తోనూ సాధించొచ్చు’ అని తండ్రి ఇచ్చిన సలహాను ఆచరణలో పెట్టారు. ఇంటర్లో 975 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. ఇదీ చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలుఇంటి వద్దే సిద్ధమై... డిగ్రీ కోసం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం పోటీ పడిన 30 వేల మంది నుంచి ఆయన ఎంపికయ్యారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది జులైలో తెనాలికి వచ్చారు. అప్పటి నుంచి సివిల్స్‌పై గురిపెట్టారు. అవిశ్రాంత కృషితో 2021 సివిల్స్ పరీక్షలలో 682వ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. అప్పటికి విజయ్‌బాబు వయసు 22 ఏళ్లు మాత్రమే. 2022 రెండోసారి రాసినా మళ్లీ ఐఆర్ఎస్ వచ్చింది. మూడో ప్రయత్నంలో తగిన ర్యాంకు రాలేదు. నిరుత్సాహం పడకుండా నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌ను దక్కించుకున్నారు. నాన్న కలను నెరవేర్చాలని మరోమారు పరీక్షలకు హాజరుకానున్నారు. -
నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..
ఒక వ్యక్తికి జీవితంలో కష్టాలు సర్వసాధారణమే. పోరాడి గెలుస్తుండగా..లాగిపెట్టి అమాంతం కిందపడేసే కష్టాలు హఠాత్తుగా ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంటే..గెలుపు అన్న మాట భయంగా మారిపోతుంది. మళ్లీ తిరిగి లేచి నిలబడటానికి ధైర్యం చాలదు కూడా. కానీ ఈ మహిళ గుక్కపెట్టి ఏడిపించిన కష్టానికి తన దైన శైలిలో సమాధానం ఇచ్చి నిలబడటమే గాక..ఆ కష్టమే తోకముడిచి పారిపోయేలా అచంచలంగా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ మహిళే నీతు మేడమ్‌గా పేరుగాంచిన నీతుసింగ్. జార్ఖండ్‌లోని గిరిదిహ్లో జన్మించిన నీతు మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి కిషోర్ దేవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో తన అన్నయ్య, ఆరుగురు సోదరిమణులతో కలసి పెరిగింది. చిన్ననాటి నుంచే కష్టం విలువ తెలిసిన ఆమె చదువులో బాగా రాణించేది. కార్మెల్ కాన్వెంట్, సెయింట్ జాన్స్ స్కూల్ (వారణాసి)లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. వినోబా భావే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్లో ఎల్ఎల్బీ పూర్తి చేసింది. అప్పుడే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించింది. ఆ సెంటర్‌ని ప్రారంభించిన ఒక ఏడాదికి రాజీవ్ సౌమిత్రను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారామౌంట్ కోచింగ్ సెంటర్‌ని విజయవంతంగా నడిపారు. దాదాపు రూ. 200 కోట్ల టర్నోవర్ సంస్థగా మలిచారు. పోటీ పరీక్షల కోసం నీతు ఇంగ్లీష్ వాల్యూమ్1 అనే పుస్తకాన్ని రచించింది. ఇది అత్యధికంగా అమ్ముడైన కాంపిటీషన్ బుక్‌గా నిలిచింది కూడా. ఇంతలో ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. అది రాను రాను మరింతగా క్షీణించే స్థాయికి వచ్చేసింది. ఆమె కూడా ఆ కోచింగ్ సెంటర్లో దాదాపు 50% వాటాదారు అయినా..ఆమెభర్త ఆగస్టు 5,2015న బౌన్సర్ల చేత బలవంతంగా బయటకు గెంటేశాడు. దాంతో మళ్లీ రోడ్డు మీదకు వచ్చేసింది నీతు జీవతం. వివాహం విచ్ఛిన్నమవ్వడమే గాక లాభాల బాట పట్టించిన వ్యాపారం కూడా పోయింది. తగ్గేదేలే అంటూ లేచి నిలబడింది..మళ్లీ పరిస్థితి చలికిలబడినట్లు అయినా..అచంచలమైన ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడి ఆ దిశగా సాగింది. ఈసారి తన తండ్రి దివంగత కిషోర్ దేవ్ పేరుతో కేడీ కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించింది. చూస్తుండగానే అచిరకాలంలోనే ఆ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఎస్ఎస్సీ ఎగ్జామ్‌లో ర్యాంకర్లుగా మార్చే సంస్థగా కేడీ సంస్థ పేరుతెచ్చుకుంది. ఇలా మంచి లాభాలతో దూసుకుపోతున్న కోచింగ్ సెంటర్‌కి మళ్లీ మహమ్మారి రూపంలో బ్రేక్ పడింది. అయినా సరే టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా అడుగులేసి ఆన్‌లైన కోచింగ్‌లు ఇవ్వడం ప్రారంభించింది. అలా ఆమె యూట్యూబ్ ఛానెల్‌కి సుమారు రెండు మిలయన్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉండటమే గాక, వేలాదిమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులకు తీర్చిదిద్దింది. అంతేగాదు తన కోచింగ్ సెంటర్‌తో పేద కుటుంబాలు, అనాథలు, వృద్ధులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది నీతు. బాల్యంలో తండ్రిని కోల్పోవడం దగ్గర నంచి మొదలైన ఎదురుదెబ్బలు వెవాహిక జీవితం కోల్పోవటం, నమ్మక ద్రోహం వరకు భరింపరాని కష్టాలను కడగండ్లను ఎందుర్కొంది. అయినా ఎక్కడ నా వల్ల కాదు అని గివ్ అప్(చేతులెత్తేయ లేదు) ఇవ్వలేదు. జీరో నుంచి మళ్లీ మెదలు పెట్టినా.. చివరికి గెలుపు మాత్రం నాదే అని ప్రూవ్ చేసింది నీతు మేడమ్. చిన్న చిన్న కష్టాలకే భయపడే నేటి యువతరానికి నీతు సింగ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.(చదవండి: ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్) -
విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?
చాలా మంది భారతీయులు విదేశాల్లో విజయవంతమైన కెరీర్ సొంతం చేసుకోవడమే కాకుండా.. అతిపెద్ద పారిశ్రామికవేత్తల లీగ్‌లో కూడా నిలిచారు. వ్యాపార, పరిశ్రమల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో ఒకరు 'ప్రకాష్ లోహియా'. ఇంతకీ ఈయన ఎవరు?, నెట్‌వర్త్ ఎంత? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కోల్‌కతాకు చెందిన ప్రకాష్ లోహియా.. 1952 ఆగస్టు 11న మోహన్ లాల్ లోహియా & కాంచన్ దేవి లోహియా దంపతులకు జన్మించారు. 1973లో తన తండ్రితో కలిసి ఇండోనేషియాకు మకాం మార్చారు. అక్కడ వారు 1976లో స్పన్ నూలు ఉత్పత్తిదారు ఇండోరమా కార్పొరేషన్‌ను స్థాపించారు. ఈ కంపెనీ ఎరువులు, పాలియోలిఫిన్లు వంటి ఉత్పత్తులను తయారు చేసేది.ప్రకాష్‌కు ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. కాబట్టి వీరి తండ్రి మోహన్ లాల్ లోహియా తమ వ్యాపారం వృద్ధి చెందడానికి, కుటుంబ వివాదాలను నివారించడానికి వారి 1980లలో ఆస్తిని ముగ్గురు కుమారులకు విభజించారు. ఆ తరువాత ప్రకాష్ లోహియా అన్నయ్య ఓం ప్రకాష్ భారతదేశానికి తిరిగి వచ్చి ఇండోరామా సింథటిక్స్ను స్థాపించారు. తమ్ముడు అలోక్ థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్ని నూలును తయారు చేసే ఇండోరామా హోల్డింగ్స్‌ను స్థాపించారు.అన్న, తమ్ముడు సొంత వ్యాపారాలను ప్రారభించుకున్న తరువాత.. ప్రకాష్ లోహియా 2006లో నైజీరియాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఓలేఫిన్ ప్లాంట్‌ను కొనుగోలు చేశాడు. ఇది అప్పట్లోనే పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద పెట్రోకెమికల్ సంస్థ, ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద ఓలేఫిన్ల ఉత్పత్తిదారు.ప్రకాష్ లోహియా.. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ & సీఈఓ, భారతదేశ బిలియనీర్లలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ సోదరి సీమా లోహియా భర్త. 2025 నాటికి ప్రపంచ బిలియనీర్లలో ఆయన 353వ స్థానంలో.. 2024 నాటికి ఇండోనేషియాలోని 50 మంది అత్యంత ధనవంతులలో ఆరవ స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..ప్రకాష్ లోహియా నెట్వర్త్లోహియా నికర విలువ 8.3 బిలియన్ డాలర్ల (రూ. 72,000 కోట్లు) కంటే ఎక్కువ అని ఫోర్బ్స్ వెల్లడిస్తూ.. ఈయనను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా & ఇండోనేషియాలోని టాప్ పది బిలియనీర్లలో ఒకరిగా పేర్కొంది. ఈయన SP లోహియా ఫౌండేషన్‌ను కూడా స్థాపించి.. దీని ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు కళా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. -
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్‌యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్‌డీకి గైడ్‌గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్‌కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్‌ను వెదుక్కున్నాడు.కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్‌కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్‌కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంఅదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు. -
కష్టాల్లోంచి పుట్టిన స్టార్టప్
నల్గొండ: పట్టుదల, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూలీ కుటుంబంలో జన్మించిన యువకుడు. పేద కుటుంబంలో పుట్టినా దాతల సహకారంతో ఐఐటీలో చదివి.. స్టార్టప్ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి అనిల్‌కుమార్. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగిన అనిల్‌కుమార్ అడుగడుగునా ఎదురైన ఆటంకాలను అధిగమించి జీవితంలో సక్సెస్ అయ్యాడు.ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు సునీల్‌కుమార్, అనిల్‌కుమార్ సంతానం. ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. కవిత దినసరి కూలీ. వారికి పెద్దగా ఆస్తులు లేవు. అనిల్‌కుమార్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద హుజూర్‌నగర్‌లోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్‌లో ప్రవేశ పరీక్ష రాసి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(ఐఐటీ అకాడవీు)లో ప్రవేశ పరీక్ష రాసి ఇంటర్‌తో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకునేందుకు సీటు సాధించాడు. ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ స్థాయి కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన నాటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో అనిల్‌కుమార్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సంపాదించాడు. అయితే ఏడాదికి దాదాపు లక్షన్నర రూపాయల ఫీజు చెల్లించాల్సి రావడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పైగా అనిల్‌కుమార్ అన్న సునీల్‌కుమార్ కూడా అదే సమయంలో బీటెక్ చదువుకుంటుండడంతో ఇద్దరికి ఫీజు చెల్లించడం వారి తల్లిదండ్రులకు భారంగా మారింది. దాతల సాయంతో ఐఐటీకి..ఈ నేపథ్యంలో సాక్షి దినపత్రికలో 2021 డిసెంబర్ 12న అనిల్‌కుమార్ పరిస్థితిపై ‘అట్టడుగు నుంచి ఐఐటీకి’ అనే కథనం ప్రచురించడంతో దాతలు ముందుకు రావడంతో పాటు అప్పటి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్, ఇతరుల నుంచి ఆర్థిక సాయం లభించింది. అంతేకాకుండా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం రూ.2.50లక్షలు చెక్కు అనిల్‌కుమార్‌కు అందించడంతో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు దోహదం పడింది. తనకు అందివచి్చన అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్న అనిల్‌కుమార్ కష్టపడి చదివి ఈ నెల 15వ తేదీన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన 71వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు.కేటీఆర్ మాటలే ప్రేరణగా...‘మనం ఒకరి కింద ఎందుకు పనిచేయాలి..? మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేం..? మనం కంపెనీలను ఎందుకు ప్రారంభించకూడదు..?’ అని మాజీ మంత్రి కేటీఆర్ మాటలతో ప్రేరణ పొందిన అనిల్‌కుమార్ ఐఐటీలో చదువుతుండగానే తన మిత్రులతో కలిసి లూప్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను స్థాపించాడు. ఈ స్టార్టప్ ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. అనిల్‌కుమార్ స్టార్టప్ కంపెనీని నెలకొల్పడంతో మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు స్టార్టప్ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని విజయాలు సాధించాలి. ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారండి’ అని కేటీఆర్ అనిల్‌కుమార్ విజయ ప్రస్థానంపై ఎక్స్(ట్విటర్)లో అభినందనలు తెలిపారు. -
ఒకప్పటి ఎస్టీడీ బూత్బాయ్.. నేటి యువ పారిశ్రామికవేత్త
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్‌గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్బాయ్గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్‌స్టోరీ.పల్లె నుంచి పట్నానికి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్‌లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్‌నగర్‌లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, హైటెక్‌సిటీ, కొత్తపేట్, కర్మాన్‌ఘాట్‌లలో బ్రాంచ్‌లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు. రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్‌ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్‌గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి సంప్రదాయాలకు పెద్దపీట నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్‌పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. – దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని -
చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా
MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్ చేస్తే సూపర్ స్టార్ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్..పోతాయ్.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని నిరూపించిన నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla) (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి ఇంట్లో పుట్టాడు. కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు. దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్ చేస్తేప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి పార్లమెంటు, లోక్‌సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్‌పురి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2003లో వచ్చిన సయ్యా హమార్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్‌గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్‌పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు. అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్.1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్‌కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి లగ్జరీ కార్లున్నాయి. -
తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..
‘నా జీవన ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలకు గురయ్యాను.. అయినా వెనక్కి తగ్గలేదు.. వాటినే విజయవానికి మెట్లుగా మలచుకున్నా’ అని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సినీ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. యువ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం వైఎఫ్‌ఎల్‌ఓ (యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ‘గోల్డెన్ లెన్స్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో ఎదురైన అనుభవాలను వారితో పంచుకుని స్ఫూర్తిని నింపారు. ‘20 సంవత్సరాలు ఒక అద్దె ఇంట్లో జీవించాను. నా తల్లిదండ్రులకు ఇల్లు కొనాలని అనుకున్నా. నెలకు రూ.5,000 అద్దె చెల్లిస్తూ జీవితాన్ని గడిపా. నా ప్రయాణం అంత సులభం కాదు. జీవితంలో అనేక ఛీత్కారాలను స్వాతగించా’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడాదికి 1500లకు పైగా సినిమాలు నిర్మితమవుతున్నా అందులో 10 శాతం కూడా మహిళా దర్శకులు లేకపోవడం బాధాకరమని, ఈ పరిస్థితి మారాలని, అందుకే ఉమెన్ ఇన్ ఫిలిం–ఇండియా చాప్టర్‌ని ప్రారంభించామని అన్నారు. ఇది మహిళలకు మద్దతు ఇచ్చే ప్లాట్‌ఫాం అని, వాళ్ల గొంతు వినబడాలని అన్నారు. హైదరాబాద్ అన్నా, బిర్యానీ అన్నా ఇష్టం.. తనకు హైదరాబాద్ అన్నా, ఇక్కడి బిర్యానీ అన్నా ఎంతో ఇష్టమని, అవకాశం లభిస్తే టాలీవుడ్ కళాకారులతో కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. ఆమె నిర్మించిన ప్రసిద్ధ చిత్రాలు ‘ది లంచ్ బాక్స్, మసాన్, పగ్గలైత్, ఆస్కార్ గెలుచుకున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్పరర్ వంటి చిత్ర అనుభవాలను పంచుకున్నారు. వైఎఫ్‌ఎల్‌ఓ చైర్పర్సన్ పల్లవిజైన్ మాట్లాడుతూ గునీత్ అనేక మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ, వైఎఫ్‌ఎల్‌ఓ సభ్యులు పాల్గొన్నారు. (చదవండి: హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్..!) -
పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్ ఫెయిల్ నుంచి ఏకంగా ఐఐటీలో..
చుట్టూ దారుణమైన ఆర్థిక పరిస్థితి..అయినా బాగా చదవాలన్న గట్టి లక్ష్యం. పోనీ ఇంత కష్టపడుతుంటే..వచ్చిపడే కష్టాల కెరటాలు వెరసీ విరుచకుపడ్డ అనారోగ్యం ఇవేమి ఆ వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సాధించాలేవ్ అంటూ పదేపదే అతడి గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న సమస్యలకు తన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాడు. ల్యాప్‌టాప్ వంటి సకల సౌకర్యాలు గానీ, ఆర్థికంగా భరోసా వంటివి ఏమి లేకపోయినా..అజేయంగా విజయతీరాలకు చేరుకోవచ్చు అని చూపించి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే 19 ఏళ్ల హర్ష గుప్తా. మహారాష్ట్రలోని థానే జిల్లాకి నివాసి. అతడి తల్లిదండ్రుల జీవనాధారం పానీపూరీ బండి ఒక్కటే. వారే సంతోష్, రీతా దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురిలో పెద్దవాడే ఈ హర్ష్ గుప్లా. హర్ష తండ్రి పదికూడా పాసవ్వలేదు. అందువల్లే ఆయన తన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాడు. అయితే వారికి వచ్చే ఆదాయానికి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుకి పొంతన లేకపోవడంతో విపరీతమైన ఆర్థిక కష్టాలు మధ్య బతుకు సాగించేవారు. అయితే హర్ష చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. పదిలో 90.8 శాతం మార్కలతో పాసయ్యాడు. అయితే ఇంటర్‌కి వచ్చేటప్పటికీ రెక్టల్ ప్రోలాప్స్ అనే అరుదైన అనారోగ్య సమస్య బారినపడ్డాడు. దాంతో తరగతులకు సరిగా హాజరుకాలేకపోయాడు. ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాడు. పైగా చుట్టూ ఉన్న స్నేహితులు నీలాంటి వ్యక్తులు ఐఐటీ వంటి చదువులు అందుకోవడం కష్టం అని ముఖంపైనే చెప్పేసేవారు. అయినా సరే ఎందుకో హర్షకి తనకిది సాధ్యమే అని గెలిచి చూపించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అది ఎలా అనేది అగమ్యగోచరంగా ఉండేది. ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పూర్తిచేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌కి సన్నద్ధమయ్యాడు. అందుకోసం నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్, కోట ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బులకు కొందరు దాతలు సాయం చేయడంతో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఎక్కడ ఉండాలన్నది మరో సమస్య. పోనీ పీజీ హాస్టల్ జాయిన్ అవుదామన్నా.. సరిపడా డబ్బులేదు. చివరికి హర్ష ఆ హాస్టల్ యజమానిని బతిమాలుకుని తక్కుడ డబ్బు చెల్లించేలా వసతి ఏర్పరుచుకున్నాడు. ఇన్ని కష్టాలు దాటుకుని జేఈఈకి సిద్ధమవుతుండగా..మరోవైపు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో హాస్టల్ ఖాళీ చేసి తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. దాంతో చాలా క్లాస్‌లు మిస్సవ్వడం, మాక్‌టెస్ట్‌ల్లో వెనకబడటం జరిగింది. ఇక లక్ష్యం తనకు చాలా దూరమైపోతోందని, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్‌తో తన సమస్య వివరించగా..తన అనారోగ్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేయడం గురించి సూచనలిచ్చారు. అలా తొలి ప్రయత్నంలో జేఈఈ మెయిన్స్‌లో 98.59 శాతం సాధించాడు. అయితే అతడి అనారోగ్య దృష్ట్యా తగినంత విశ్రాంతి తప్పని పరిస్థితి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్‌కి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యపడలేదు. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించలేకపోయాడు. అయితే హర్షకి ఎన్ఐటీ వంటి వాటిల్లో ఆఫర్ వచ్చినా కాదనుకుని ఐఐటీ జాయిన్ అవ్వడమే తన ధ్యేయమని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిపోయాడు. అందువల్లే ఓటమి నైరాస్యం కుంగదీస్తున్నా.. తగ్గేదే లే అంటూ.. మళ్లీ మరోసారి జేఈఈకి ప్రిపరయ్యేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తల్లిదండ్రలు మద్దతు అందించారు. ఈసారి తన ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా కోచింగ్ ఫీజ కవర్ అయ్యేలా స్కాలర్షిప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి మరి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. బాగా ప్రిపేరయ్యేలా మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈసారి ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మానస వికాసం పొందేలా పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తూ ప్రిపరేషన్ సాగించాడు. అలా JEE మెయిన్స్ 2025లో 98.94 శాతం సాధించి టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు.నేర్చుకున్న జీవిత పాఠాలు..చదువుకి అవసరమయ్యే నిధుల కోసం దాతలు ముందుకు వచ్చినప్పుడు కలిగిన సంతోషం తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగేలా ప్రేరేపించిందని అంటున్నాడు హర్ష్ గుప్తాఅనారోగ్యంతో హాస్టల్ వదిలి ఇంటికి బాధగా వస్తుండగా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. దాంతో స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఓ వృద్ధ దంపుతులు తన కోసం క్యాబ్ బుక్‌చేసి డ్రాప్ చేసిన ఘటన మరువలేనని చెబుతున్నాడు. నిజానికి ఆ దపంతులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ సాటి మనిషి పట్ల దయ చూపడం అంటే ఏంటో అప్పుడే తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే నేనే ఎదుర్కొన్న ఓటములు, అడ్డంకులు..సమస్యలను ప్రతిబంధకంగా చూడకుండా పరిష్కారం అన్వేషించాలి. ఒకవేళ పరిష్కారం తెలియకపోతే ఒత్తిడికి గురికాకుడదు మార్గదర్శకులను అన్వేషించాలి. అంతే తప్ప ఇంతే అని ఆగిపోకూడదు అని తాను తెలుసుకున్న జీవిత సత్యం అని చెబుతున్నాడు. అలాగే చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహతులు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు, విమర్శించొచ్చు..కానీ అవేమి తీసుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపోవడం తెలిస్తే గెలుపుని అందుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నాడు హర్ష్ గుప్తా. (చదవండి: 'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!) -
కుబేర : ఆర్కిటెక్చర్ టు అసిసెంట్ ఆర్ట్ డైరెక్టర్
ఇంద్రాణి పూర్తి పేరు అక్కరాజు వెంకట నాగ ఇంద్రాణి. పుట్టింది గుంటూరు సిటీ మధ్యతరగతి కుటుంబం. నాన్న శ్రీనివాస్ అమ్మా పద్మావతి. తండ్రి హిందీ టీచర్‌గా పనిచేస్తుండేవారు. కన్హా కాన్సెప్ట్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశారు. తల్లికి కర్ణాటక సంగీతం, కూచిపూడి పట్ల ఆసక్తి ఉన్నా.. కలగా మిగిలిపోయింది. ఆ కలను కూతురుగా తను నేర్చుకుని పాఠశాల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకూ ప్రదర్శనలిచ్చారు. అన్న ప్రసాద్‌తోపాటు బొమ్మలు గీయటం అలవర్చుకుంది. చిన్ననాటి అభిరుచి సినిమాలవైపు నడిపించింది.. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ నుంచి ఆర్ట్ ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎదిగి వెండి తెరపై తన పేరును లిఖించుకుంటోంది.. ఓ వైపు తోట తరణి.. మరోవైపు శేఖర్ కమ్ముల దిశానిర్దేశంలో తన భవితకు బాటలు వేసుకున్నారు ఇంద్రాణి. ప్రస్తుతం ఫిలింనగర్లో ఉంటూ అనేక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమవుతున్నారు. – బంజారాహిల్స్ నగరానికి ప్రయాణం.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోసం జెఎన్ఎఫ్యులో చేరడం.. సినిమా సెట్స్ డిజైనింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వాటిని స్టడీ చేయడం.. నెమ్మదిగా స్క్రిప్ట్ రైటింగ్ పట్ల వీకెండ్ కోర్స్ చేయడం.. చకచకా జరిగిపోయాయి. మొదల్లో సినిమాల్లోకి కుటుంబ సభ్యులు నిరాకరించినా తర్వాత ఒప్పించారు. ‘కుబేర’లో లాస్ట్ ఆర్ట్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. బిల్స్, రిఫరెన్సులు, ఫొటోషాప్ డిజైనింగ్‌లు చేశారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అరవింద్ ఏవి, ఈ.పి నాగేశ్వరరావు వల్ల తోట తరణి, శేఖర్ కమ్ముల మరల చేర్చుకున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో లైవ్ లొకేషన్స్‌లో పని నేర్చుకుంటూ పోయారు. సినిమాల పట్ల ఆసక్తి.. ఇంట్లో మామయ్య నాటకాలకు దర్శకత్వం వహించడం, మరోవైపు నటిస్తుండడంతో ఎప్పుడూ సందడిగా వుండేది. తండ్రి సాయంతో హిందీ నేర్చుకుంటూ బాలీవుడ్ కథల పట్ల, సంగీతం పట్ల మక్కువ పెరిగింది. షూటింగ్ సమయాల్లో కెమెరా వెనుక జరిగే విషయాల పట్ల ఆసక్తి పెరిగేలా చేశాయి. అనంతరం మసూద సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేరడం.. ఆర్ట్ డైరెక్టర్ ప్రియం క్రాంతి ప్రోత్సాహంతో డైరెక్షన్ పట్ల ఇష్టంతో కన్యాశుల్కం వెబ్ సిరీస్‌లో, హరిహర వీర మల్లు సినిమాలో డైరెక్షన్ టీంలో ఆర్ట్ పనులను సమన్వయం చేసే బాధ్యతను నిర్వహించింది. డైరెక్టర్ క్రిష్ కుటుంబ సభ్యులు సుహాసిని, రాజు మద్దతుతో, ఆర్ట్ అసిస్టెంట్ అక్బర్ సహకారంతో మెంబర్‌గా అయ్యారు. ఈ క్రమంలో స్నేహితురాలు భార్గవి, ప్రమీల, కష్ణ శశాంక్ అండగా నిలిచారు. (300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు)లెజండరీ మనుషులతో.. చిన్నప్పుడు విడుదలైన అంజలి నుంచి పొన్నియన్ సెల్వన్ వరకూ పద్మశ్రీ తోట తరణి వర్క్ ఎంతగానో ఇష్టపడడం, ఆయన నీడలో నిలబడటం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయమే. ఆయన స్కెచ్ వేస్తుంటే ప్రతిసారీ విస్మయానికి గురవ్వడం.. ఆర్డినరీ వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుండడం నేర్చుకున్నా.. ఆనంద్, గోదావరి సినిమాలు చూస్తూ పెరిగా. కట్‌చేస్తే శేఖర్ కమ్ముల సెట్లో ప్రతిరోజు పేరు పెట్టి పలకరించడం ఆనందం అనిపించింది. కుబేర గొప్ప అవకాశం కల్పించింది. – ఇంద్రాణి, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ -
300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు
మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు శ్రమ ఉంటుంది. అలాగే ఎంతో ఆనందంగా ఆస్వాదించే ప్రతీ చాక్లెట్, చాక్లెట్ బార్ వెనుక ఒక రైతు కథ ఉంటుంది. చాక్లెట్లలో చెప్పుకోదగ్గది మన దేశానికి చెందిన, వెరీ వెరీ స్పెషల్ ఏంటి అంటే చెప్పుకోవాల్సింది ‘మనం’ చాక్లెట్ గురించే. హైదరాబాద్‌లో ఉన్న భారతదేశపు చాక్లెట్ బ్రాండ్. వరల్డ్ చాక్లెట్ డే సందర్భంగా ఆ విజయ గాధ ఏంటో తెలుసుకుందాం పదండి. ‘మనం’ కథ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని కోకో పొలాలలోమొదలువుతుంది. ఈ ఆంధ్రా-ఆధారిత చాక్లెట్ బ్రాండ్ 300+ మంది రైతులకు సాధికారత కల్పించి తొలి ఏడాదిలో సంవత్సరంలో రూ. 8.7 కోట్లు సంపాదిండం విశేషం. అంతేకాద గత ఏడాది ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందంటూ ‘మనం చాక్లెట్’ను కొనియాడింది. భారత్‌లో పండించే కోకోతో చాక్లెట్ల తయారు చేసి ‘మనం చాక్లెట్’ పాపులర్ అయింది. ఈ చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పాల చైతన్య స్థాపించారు. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. < View this post on Instagram A post shared by Manam Chocolate® (@manamchocolate) హైదరాబాద్‌లో పుట్టినా, చైతన్య బాల్యంలో ఎక్కువ భాగం పూణేలో గడించింది. అక్కడ సహ్యాద్రి స్కూల్ KFI (జిడ్డు కృష్ణమూర్తి బోర్డింగ్ స్కూల్)లో పెరిగాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని సౌడర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ నుండి స్టాన్ఫోర్డ్ సీడ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత తండ్రి అనారోగ్యం కారణంగా ఇండియా తిరిగి వచ్చారు. తండ్రి నిర్వహించే ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం బాధ్యతలు చేపట్టారు. ఒకే ఒక్క దుకాణంతో ఉన్న చిన్న వ్యాపారంలోని లోపాలను పరిష్కరించుకుంటూ, తనదైన శైలిలో అభివృద్ది చేశారు. గత 10 సంవత్సరాలలో దానిని చాలా పెద్ద వ్యాపారంగా విస్తరించారు. దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీ మొదటి సంవత్సరంలోనే రూ. 8.79 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని సాధించడం విశేషం.బీన్స్ పట్ల ఆయనకున్న మక్కువే తన సొంత బ్రాండ్‌ను రూపొందించేలా చేసింది. చాక్లెట్ వస్తువులు అందుబాటులో లేకపోవడం, ఆ సమయంలో చాక్లెట్ గురించి మాకు ఏమీ తెలియదు ఎందుకంటే చాక్లెట్ ఎల్లప్పుడూ సరఫరాదారు నుండి కొనుగోలు చేసేవాళ్లమని, అదే చాక్లెట్ మార్కెట్లోకి ప్రవేశించాలనే ఆలోచన అతని ఆసక్తిని రేకెత్తించింది అంటారు. మనం చాక్లెట్‌ను ప్రవేశపెట్టిన సంస్థ డిస్టింక్ట్ ఆరిజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DOPL) CEO చైతన్య ముప్పాల. తాము సంవత్సరానికి 150శాతం వృద్ధి చెందుతున్నామని, ఇది తమ విజయవంతమైన మార్కెట్ వ్యూహానికి నిదర్శనమన్నారు. కోకో బీన్స్ పొలం నుంచి చాక్లెట్ టాబ్లెట్‌గా రూపాంతరం చెందే ప్రయాణంలో రైతుల అమూల్యమైన మద్దతు లేకుండా తమ సాధ్యం కాదు అని తెలిపారు.ఎన్నో వెరైటీలుడార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి. -
వెదికితేనే కదా... దారి : ఇషితా బన్సల్ సక్సెస్ స్టోరీ
‘స్క్రాప్ టు స్ట్రక్చర్’ నినాదంతో వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టార్‌లోకి అడుగుపెట్టిన ప్లానెక్స్ రీసైకిలింగ్’ (plannex recycling) కంపెనీ వినూత్న ఆవిష్కరణలకు పెద్ద పీట వేసింది. ‘వెదికితేనే కదా... దారి తెలిసేది’ అంటున్న ప్లానెక్స్ కో–ఫౌండర్ ఇషిత బన్సాల్ ( Ishita Bansal) ఎప్పటికప్పుడు సరికొత్త లక్ష్యాలతో ముందుకు వెళుతోంది.వ్యాపార కుటుంబంలో పుట్టిన ఇషితకు వాణిజ్య విషయాలు కొట్టిన పిండి. పాఠశాల విద్య పూర్తయిన తరువాత దుబాయ్‌లోని ‘అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ దుబాయ్’లో చేరి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత తమ కుటుంబ ఆధ్వర్యంలోని ‘ఇన్‌టెక్స్ టెక్నాలజీస్’లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే ఇ–వేస్ట్ గురించి ఆలోచించింది. ఈ సమస్య గురించి లోతుగా అధ్యయనం చేసింది. ఆ తరువాత యశ్‌రాజ్ భరద్వాజ్, యువరాజ్, హర్షి గిలర్లతో కలిసి దిల్లీ కేంద్రంగా ప్లానెక్స్ రీసైకిలింగ్’ మొదలుపెట్టింది. చదవండి: ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!మైక్రో–రీసైకిలింగ్ యూనిట్లను వికేంద్రీకరించడం ద్వారా కంపెనీ కొత్త అడుగు వేసింది. చెత్త సేకరించే కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధిని అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టింది. వారి కోసం నైపుణ్య అభివృద్ధి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది ప్లానెక్స్ ఈ సంవత్సరం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: Antidepressants మహిళలు సేఫే, బట్ పురుషులకే! -
ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!
సోషల్‌మీడియాలో తరచుగా ఆసక్తికర కథనాలు, విశేషాలను పంచుకునే పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ఒక ఆసక్తికర కథనాన్ని షేర్ చేశారు. యువపారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తినిచ్చేలా మైగేట్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ స్ఫూర్తిదాయకమైన కథను ఆయన పంచుకున్నారుసెక్యూరిటీ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ మైగేట్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సక్సెస్ స్టోరీని హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా సక్సెస్ ఎవరికీ అంతఈజీగా రాదు.. దానికి వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఒకపుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి ఇపుడు , కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ ఫౌండర్‌గా సీఈవోగా ఎదిగిన తీరును ఆయన వివరించారు.In 2016, IIT grad & ex-Goldman exec Abhishek Kumar became a security guard working 14-hour shifts.That experience of understanding pain points led to his creating MyGate: now in 25,000+ communities, 100M+ check-ins/month.Moral: To build for others, first walk in their shoes. pic.twitter.com/7UZSScpRaD— Harsh Goenka (@hvgoenka) July 3, 2025 r> IIT గ్రాడ్యుయేట్ , మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన కుమార్ ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా 14 గంటల షిఫ్టులు పనిచేశారని గోయెంకా వెల్లడించారు. ఆ కష్టాలు,కన్నీళ్లు, ఆఅనుభవమే తరువాత ‘మైగేట్’ పునాదిగా మారిందని హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ఏదైనా ఒక పనిచేపట్టాలంటే ముందు దానిలోని లోతుపాతులను అర్థం చేసుకోవాలన్నారు. ఎవరీ అభిషేక్ కుమార్ :సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన తర్వాత ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యారు. అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి మరియు శ్రేయాన్స్ దాగా కలిసి 2016లో మైగేట్ను ప్రారంభించారు. 2022లో, అర్బన్ కంపెనీ - అకో సంయుక్తంగా నిర్వహించిన నిధుల రౌండ్లో మైగేట్ రూ. 100 కోట్లు సేకరించింది.2024 ఏప్రిల్‌లో మైగేట్ CEOగా నియమితులయ్యారు, విజయ్ అరిసెట్టి బోర్డు ఛైర్మన్‌గా మారారు. మైగేట్ అనేది గేటెడ్ కమ్యూనిటీలకు సెక్యూరిటీ కమ్యూనికేషన్, హౌస్ కీపింగ్, ఇతర రోజువారీ సేవలను అందిస్తుంది. భారతదేశంలోని 25 వేల హౌసింగ్ సొసైటీలలో ఇప్పుడు 40 లక్షలకు పైగా జనం మైగేట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా చెక్-ఇన్లను సులభతరం చేస్తుంది.డిజిటల్ హోమ్ సెక్యూరిటీని అందించే స్మార్ట్ డోర్ లాక్‌ల శ్రేణి మైగేట్ లాక్స్ ద్వారా మైగేట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఆదాయం అంతుకుముందు ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.77 కోట్ల నుండి రూ.109 కోట్లకు పెరిగింది. 2025 ఏడాది గాను రూ. 165 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పంచుకుంది. \2016లో అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి , శ్రేయాన్స్ డాగా స్థాపించిన మైగేట్, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులకు ఏకీకృత యాప్ ద్వారా సందర్శకుల యాక్సెస్, భద్రత, నిర్వహణ,నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు బీమాసర్వీసులను అందించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి లైసెన్స్‌ను కూడా పొందింది.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా -
స్వరాల తోటలో...ఎవరీ గిని
ఇండియన్ పాప్‌లో తనదైన స్టైల్ సృష్టించుకొని దూసుకు పోతోంది పందొమ్మిది సంవత్సరాల గిని. ‘ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్’గా కూడా ప్రశంసలు అందు కుంటోంది.... తండ్రి ఉద్యోగ రీత్యా, గిని కుటుంబం ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండేది కాదు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆమెతో స్థిరంగా ఉన్నది మాత్రం సంగీతమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నప్పుడు కుటుంబం మొత్తం కారులో వెళ్లేది. కారులో నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ప్లే అయ్యేది. భూపెన్ హజారిక నుంచి హరిహరన్ వరకు ఎంతో అద్భుతమైన గొంతులను వినే అవకాశం వచ్చేది. View this post on Instagram A post shared by Molfa Music (@molfamusic) కారు బ్యాక్ సీట్లో కూర్చున్న గిని పాట ప్లే అవుతున్నప్పుడు వారితో గొంతు కలిపేది. అలాపాటలతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత గానం ప్రాణమై పోయింది. మొదట్లో ప్రముఖ గాయకులను అనుకరించినా, ఆ తరువాత మాత్రం గానంలో తనదైన శైలిని సృష్టించుకుంది. కాలిగ్రఫీ, ఒరిగామి, గుర్రపు స్వారీ, కోడింగ్... ఏదైనా సరే, నేర్చుకోవాలనే ఆలోచన వస్తే పట్టుదలగా నేర్చుకునేది. యూట్యూట్ వీడియోలు చూస్తూ గిటారు ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాయడంలో, కంపోజ్ చేయడంలో తన టాలెంట్ నిరూపించుకుంది. -
ఐకానిక్ అవార్డ్ : సినిమాటోగ్రాఫర్‌కు విజన్ చాలా ముఖ్యం
డైరెక్టర్ విజన్ ఒకటైతే.. సినిమాటోగ్రాఫర్ విజన్ మరోలా ఉంటుంది. సినిమాకు కళను తెచ్చే సినిమాటోగ్రఫీ చేయడం కష్టతరమైన పని.. కానీ నచ్చిన మెచ్చిన పనిలో తన కష్టాన్ని చూపిన కిషోర్ బొయిదాపు(Kishore Boyidapu) ఇంటర్నేషనల్ ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాడు. ఇటీవలే నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ‘105 మినిట్స్’ చిత్రానికి అవార్డు లభించింది. తన కుంటుంబ సినిమా నేపథ్యాన్ని, సినిమాటోగ్రఫీ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. – బంజారాహిల్స్ బోరబండలోని గాయత్రినగర్‌కు చెందిన కిషోర్ స్వస్థలం విజయవాడ. ఆయన కుటుంబానిది సినిమా నేపథ్యం. తన ఇద్దరు బాబాయిర్లు ఒకరు ప్రముఖ పీఆర్ఓ దివంగత బీఏ రాజు, మరో బాబాయి కెమెరామెన్ రామ్‌కుమార్, తన అన్నల్లో ఒకరు కెమెరామెన్ రవి, మరో అన్న అనిల్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం సినిమా నేపథ్యం అవడంతో సినిమాలపై మక్కువతో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. రవిప్రసాద్ యూనిట్లో మొదట కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించాడు. మెచ్చిన, నచ్చిన పనిలో కష్టాన్ని నమ్మిన కిషోర్ త్వరగానే స్లమ్‌డాగ్ మిలీనియర్, మిషన్ ఇంపాజిబుల్–4, లెటర్స్, సూటబుల్ బాయ్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్టులకు సెకండ్ యూనిట్ కెమెరామెన్‌గా ప్రతిభను కనబరిచాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మోహతా ప్రియ శిష్యుడిగా సీక్రెట్ సూపర్‌స్టార్, ఏ దిల్‌హై ముష్కిల్, బియాండ్ ది క్లౌడ్స్, హిందీ జెర్సీ వంటి అగ్రచిత్రాలతో పాటు అగ్రహీరోల యాడ్ ఫిల్మ్స్‌కి సినిమాటో గ్రాఫర్‌గా సత్తాచాటాడు. కెమెరామెన్‌గా.. బోయ్ మీట్స్ గరల్స్ చిత్రంతో కెమెరామెన్‌గా మారిన్ కిషోర్ ‘కిరాక్, వశం, కర్త–కర్మ–క్రియ, 105 మినిట్స్, మైనేమ్ ఈజ్ శృతి’తో పాటు పలు నూతన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 105 మినిట్స్ చిత్రానికి ఐకానిక్ అవార్డు అందుకున్నాడు. ముంబై నుండి నగరానికి షిఫ్ట్ అయిన కిషోర్ తన ఫోకస్ అంతా తెలుగు చిత్రాలపైనే అని పేర్కొన్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా రాణించడమే లక్ష్యమని తెలిపాడు. -
పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు
పేదరికంలో పుట్టిన ఓ బాలుడు ముక్కపచ్చలారని వయసులో ఉదయాన్నే లేచి పాలు పోసి గడియారం తొమ్మిది కొట్టిందటే ఠంచనుగా బ్యాగ్ భుజాన వేసుకొని స్కూల్ వెళ్లి చదుకునేవాడు. తాను ఉంటున్న ప్రాంతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా దాదాపు రోజూ 7-8 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. పండగల తోటి స్నేహితులు సరదాగా గుడుపుతుంటే తాను మాత్రం బాణసంచా విక్రయిస్తూ కుటుంబ పోషణలో భాగమయ్యేవాడు. విధి తన కష్టాలను గుర్తించింది. ఓ అవకాశం కల్పించింది. దాంతో ప్రస్తుతం తాను దాదాపు రూ.10,790 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.రిజ్వాన్ సాజన్ ముంబయిలోని ఘట్కోపర్లో పేద కుటుంబంలో జన్మించారు. ఓ స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తన తండ్రి నెలకు రూ.7,000 సంపాదించేవాడు. రిజ్వాన్ తండ్రికి నలుగురు సంతానం. కుటుంబ పోషణకు ఆయన సంపాదన ఏమాత్రమూ సరిపోయేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. ఉన్నట్టుండి కుటుంబ పెద్ద, రిజ్వాన్ తండ్రి అకాల మరణం చెందారు. ఆ సమయంలో రిజ్వాన్‌కు ఏమి పాలుపోలేదు. కుంటుంబ భారం అంతా తనపై పడింది. ఏదోఒక పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలో పాలు పోయడం ప్రారంభించాడు. నిత్యం 7 నుంచి 8 కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించేవాడు. స్కూల్ ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మానేశాడు. పండగ రోజుల్లో వీధుల్లో బాణసంచా విక్రయించేవాడు.మేనమామ సాయం1981లో తన మేనమామ సాయంతో రిజ్వాన్ పని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఒక సాధారణ భవన నిర్మాణ సామగ్రి దుకాణంలో ట్రయినీ సేల్స్ మ్యాన్‌గా చేరారు. నెలకు అప్పటి లెక్కల ప్రకారం..రూ.18,000 వచ్చేవి. క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతూ ఒక దశాబ్దంలో సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా కువైట్ నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురైంది.దుబాయ్‌లో..కువైట్ నుంచి దుబాయ్ వచ్చిన రిజ్వాన్ ఒక బ్రోకరేజ్ సంస్థలో చేరారు. నిర్మాణ సామగ్రిలో నిరుపయోగం అవుతున్న కొన్ని వస్తువులకు సంబంధించిన అంశాలను గుర్తించారు. 1993లో కొంత పెట్టుబడితో సొంతంగా డాన్యూబ్ పేరుగో రియిల్ఎస్టేట్ వెంచర్‌ను స్థాపించారు. క్రమంగా ఎదిగి దాన్ని 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,790 కోట్లు) వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ కింది రంగాల్లో సేవలందిస్తోంది.బిల్డింగ్ మెటీరియల్స్రియల్ ఎస్టేట్, లగ్జరీ టవర్స్హోమ్ అలంకరణమిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుఇదీ చదవండి: వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్దాతృత్వ కార్యక్రమాలురిజ్వాన్ సాజన్ దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. డాన్యూబ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, మెంటల్ కౌన్సెలింగ్, ఆర్థిక అక్షరాస్యత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. భారత్, యూఏఈల్లోని నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. పాఠశాలల మౌలికసదుపాయాలకు నిధులు సమకూరుస్తున్నారు. అల్పాదాయ కుటుంబాలకు ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ ఉన్న పిల్లలకు వైద్య చికిత్సలకు సాయం చేస్తున్నారు. -
నాడు పేదరికంతో గాజులమ్మాడు, వైకల్యం వెక్కిరించినా.. నేడు ఐఏఎస్‌గా
పుట్టింది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించడానికి అతను తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మాడు. మరోవైపు పోలియోతో వైకల్యం. అయితేనేం కఠిన శ్రమ , దృఢ సంకల్పంతో అనుకున్నది సాధించాడు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించవచ్చు అని నిరూపించాడు రమేష్ ఘోలాప్. ఇంతకీ ఆయన ఏం సాధించారు. పదండి రమేష్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనే దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్ని అక్షరాలా నిరూపించారు వికలాంగుడైన రమేష్ ఘోలప్. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్‌గా సేవలందిస్తున్నాడు. కన్న తల్లికీ, పుట్టిన గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సైకిల్ మరమ్మతు దుకాణం నడిపే నిరుపేద గోరఖ్ ఘోలాప్‌కు జన్మించాడు రమేష్. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. మద్యం కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో, చిన్న వయసులోనే నలుగురు సభ్యుల కుటుంబ బాధ్యతను తీసుకోవలసి వచ్చింది. కుటుంబ పోషణ కోసం తన తల్లితో కలిసి వీధుల్లో గాజులు అమ్మడం మొదలుపెట్టాడు. కానీ చదువులో రమేష్ ఎప్పుడూ క్లాస్ ఫస్టే. 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తండ్రి అంత్యక్రియలకు బస్సు ఛార్జీలు చెల్లించడానికి కూడా డబ్బులులేని పరిస్థితి. ఈ తన దయనీయ స్థితి బైట పడాలంటే చదువే మార్గం అని గ్రహించాడు. అతను కష్టపడి పనిచేస్తూనే పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను D.Ed (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) అత్యంత చౌకైన కోర్సు కాబట్టి దానిని అభ్యసించాడు. తరువాత దూరవిద్య ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీ చదివాడు. తరువాత 2009లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.తన కల నిజం చేసుకోవాలని ఆలోచన తొలిచేస్తూ ఉండేది.. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. 2010లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఉద్యోగం సంపాదించాడు. చివరికి తన ఉద్యోగం నుండి 6 నెలల విరామం తీసుకుని IAS కావాలనే కల సాకారం కోసం నడుం బిగించాడు. చివరికి తన కృషికి ఫలితం దక్కింది, 2012లో అతను 287 ర్యాంకుతో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. అదే సంవత్సరం, అతను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై 1వ ర్యాంకు సాధించాడు. 2012, మే 4న ఐఏఎస్ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టడంతో గ్రామస్తులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. -
రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!
వరల్డ్ చిన్నతనంలోనే అంజనశ్రీ (Anjana Sri) ప్రమాదవశాత్తు కాలు కోల్పోయింది. కూచిపూడి నాట్యం అంటే ఈ చిన్నారికి ఎంతో ఇష్టం.ఇక నాట్యానికి దూరం కావాల్సిందేనా? ‘లేదు’ అన్నది ఆ చిన్నారిలోని ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కూచిపూడి నాట్యంలో అంజనశ్రీ రాణిస్తోంది.జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది.... జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన బొమ్మకంటి నాగరాజు, గౌతమి దంపతుల కుమార్తె అంజనశ్రీ నాలుగు సంవత్సరాల వయస్సులో రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పూర్తిగా కోల్పోయింది. నాట్యప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని సుధాచంద్రన్ నిరూపించింది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, వాటిని అధిగమించిన తీరును అంజనశ్రీకి కథలుగా చెప్పేవాళ్లు తల్లిదండ్రులు. అంతేకాదు, కూచిపూడి నాట్యకారుడు మచ్చ దేవదాసు వద్ద శిక్షణ ఇప్పించారు. దురదృష్టవశాత్తు రెండోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. కుడికాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. అయినప్పటికీ కృంగిపోకుండా కూచిపూడిలో శిక్షణను కొనసాగించింది.ఇప్పటి వరకు జాతీయస్థాయిలో యాభైకి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది అంజనశ్రీది పేద కుటుంబం. నాన్న బొమ్మకంటి నాగరాజు చిన్నపాటి పాల వ్యాపారం చేస్తున్నాడు. తల్లి గౌతమి గృహిణి. ‘మా అమ్మాయి కూచిపూడి నాట్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు అంజనశ్రీ తల్లిదండ్రులు.చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగిఆ మాటే ధైర్యం చెప్పిందినాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. యాక్సిడెంట్లో కాలుపోవడంతో ఇక ఎప్పుడూ డ్యాన్స్ చేయలేను అని బాధపడేదాన్ని. నా తల్లిదండ్రులు మాత్రం ‘నువ్వు ఎప్పటిలాగే మళ్లీ డ్యాన్స్ చేస్తావు’ అని ధైర్యం చెప్పారు. వారి ఆశీర్వాదబలంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ‘పట్టుదల ఉంటే కానిది లేదు’ అనే మాటను స్కూలు పాఠాల్లో విన్నాను. ఆ మాట నాకు ధైర్యం చెప్పినట్లు అనిపించేది. – అంజనశ్రీ– కందుకూరి శశిధర్, సాక్షి, జగిత్యాలచదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
అవార్డులే అవార్డులు : శశిధర్..ట్రెండ్ సెట్టర్
నగరంలోని ఓల్డ్ డెయిరీ ఫారానికి చెందిన శశిధర్ పైడిరాజు పాండ్రాడ చిన్నతనం నుంచే ఫ్యాషన్, సంప్రదాయ నృత్య ప్రదర్శనల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. పాఠశాలలో సంప్రదాయ నృత్యానికి ప్రోత్సాహం లభించగా, ఇంట్లో అతని సోదరుడు ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచాడు. అన్నయ్య తెచ్చిన విభిన్న రకాల దుస్తులను శశిధర్ ధరించి అందరినీ ఆకర్షించేవాడు. అలాగే పాఠశాల కార్యక్రమాల్లో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవాడు. తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. అవార్డులే అవార్డులు ఇటీవల దుబాయ్‌లోని పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఎస్కేఎస్ అకాడమీ నుంచి ఎనిమిది మంది నృత్య కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో శశిధర్ ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యానికి ‘యువ ప్రతిభ పురస్కారం’లభించింది. అలాగే శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ నుంచి ‘జాతీయ మహా స్వర్ణ నంది అవార్డు’ను అందుకున్నాడు. 2024లో ‘యాక్టివ్ ఉగాది పురస్కారం’ కూడా శశిధర్‌కు లభించింది. ఒకవైపు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ర్యాంప్‌పై హొయలొలికిస్తూ, మరోవైపు శాస్త్రీయ నృత్య వేదికపై అభినయంతో అబ్బురపరుస్తూ.. ఇలా రెండు విభిన్న రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు నగరానికి చెందిన 26 ఏళ్ల శశిధర్. చిన్ననాటి అభిరుచులను వదలకుండా వాటినే తన కెరీర్‌గా మలచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ‘యువ ప్రతిభ పురస్కారం’ అందుకోవడమే ఇందుకు నిదర్శనం.ఫ్యాషన్ రంగంలోకి అడుగులుడిగ్రీ చదువుతున్న సమయంలో శశిధర్ కొన్ని కారణాలతో సంప్రదాయ నృత్యాన్ని కొంతకాలం పక్కన పెట్టాడు. ఆ సమయంలో తన దృష్టిని పూర్తిగా ఫ్యాషన్‌పై కేంద్రీకరించాడు. డిగ్రీ స్థాయిలో జరిగిన ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు జరిగిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2018 లో ‘ఉత్తమ ఆకర్షణీయమైన కళ్లు’అవార్డును గెలుచుకున్నాడు.మిస్టర్ కొచ్చి 2021 విజేత చదువు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫ్యాషన్ రంగంపై శశిధర్ దృష్టి సారించాడు.2021లో కొచ్చిలో జరిగిన ఫ్యాషన్ పోటీల్లో ‘మిస్టర్ కొచ్చి 2021’విజేతగా నిలిచాడు. ఆ తర్వాత, ఆంధ్ర ఫ్యాషన్ వీక్ సీజన్ 1 లో ‘ఉత్తమ యువ డిజైనర్ అవార్డు 2024’, విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో ‘ఉత్తమ స్మైల్ అవార్డు 2024’ను సొంతం చేసుకున్నాడు.నాట్యకళకు తిరిగి ప్రాణం పోసిన వేళ..చదువుపై దృష్టి సారించే క్రమంలో చిన్నప్పుడు నేర్చుకున్న శాస్త్రీయ నృత్యానికి దూరమైనా.. దానిపై మమకారం చావలేదు. 2024లో ఓ అవార్డు కార్యక్రమంలో శశిధర్ మాట్లాడుతూ భరతనాట్యం, కూచిపూడి అంటే తనకెంత ఇష్టమో చెప్పిన మాటలు తన జీవితాన్ని కీలక మలుపు తిప్పాయి. ఆ మాటలు విన్న ఎస్కేఎస్ అకాడమీకి చెందిన పక్కి అరుణ్ కుమార్ సాయి.. శశిధర్‌ను కలిసి తన నృత్య ప్రతిభను ప్రదర్శించమని కోరారు. అతనిలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలా ఏళ్ల క్రితం ఆగిపోయిన నాట్య ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది. గురువు అరుణ్ శిక్షణలో రాటుదేలిన శశిధర్.. అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటాడు. యువతకు మార్గదర్శిగా ‘జేఆర్డీ ఫ్యాషన్స్’ తాను ఎదిగిన ఫ్యాషన్ రంగంలో తనలాంటి మరెందరికో దారి చూపించాలనే లక్ష్యంతో శశిధర్ 2022లో జేఆర్డీ ఫ్యాషన్స్ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 మందికి ఫ్యాషన్, నటనలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నాడు. భవిష్యత్తులో మరింత మంది యువతను ఉన్నత శిఖరాలకు చేర్చడమే తన ఆశయమని శశిధర్ తెలిపాడు. అమ్మ ప్రోత్సాహంతోనే.. మోడల్‌గా, నృత్య కళాకారుడిగా రాణించడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. పాఠశాల రోజుల్లో వివిధ రకాల ప్రదర్శనల్లో నన్ను పాల్గొనేలా ప్రోత్సహించింది. ఫ్యాషన్ రంగంలోకి వెళ్తానంటే సపోర్ట్ చేసింది. నృత్యం ఇక నా జీవితంలో ఉండదు అనుకునే సమయంలో మా గురువు పక్కి అరుణ్ కుమార్ సాయి ప్రోత్సాహం మరువలేనిది. ఈ రెండు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని నిరంతరం పట్టుదలతో శ్రమిస్తున్నా.. – శశిధర్ పైడిరాజు పాండ్రాడ -
టాలెంట్ ఉండాలే గానీ.. అమెరికన్ కంపెనీలో రూ.1.45కోట్ల వేతనం
బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కారు బంగ్లా కొనుక్కోవాలి. ఇలాంటి కలలు చాలా మంది విద్యార్థులు కంటారు. కానీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అదృష్టాన్ని దక్కించుకుంటారు. పట్టుదల, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. దీనికి నిడుమోలు లక్ష్మీ నారాయణరావు దానికి ఒక ఉదాహరణ. అమెరికన్ క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ రుబ్రిక్‌లో రూ. 1.45 కోట్ల వార్షిక వేతనంలో అద్భుతమైన ప్లేస్మెంట్ ఆఫర్‌ను అందుకున్నాడు. తద్వారా కన్న తల్లిదండ్రులకు, కన్న ఊరికి గర్వకారణంగా నిలిచాడు. చదువుకున్న సంస్థకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు.రూ. 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవాడు నిడుమోలు లక్ష్మీ నారాయణ రావు. తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT)లో 2021-2025 బ్యాచ్‌కు చెందినకంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. అద్భుతమైన ప్రతిభతో ప్రొఫెసర్లు, కంపెనీలను ఆకట్టుకున్నాడు. తాజాగా ప్రతిష్టాత్మక కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సంపాదించాడు.ఇదీ చదవండి: రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీమలుపు తిప్పిన ఇంటర్న్షిప్తన చదువులో భాగంగా లక్ష్మీ నారాయణ రావు అమెరికన్ కంపెనీ రుబ్రిక్‌లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కోసం చేరారు. అదే అతని జీవితంలో మైలు రాయిగా నిలిచింది. రావు అసాధారణ పనితీరు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రూ 1.45 కోట్ల వార్షిక ప్యాకేజీ వెదుక్కుంటూ వచ్చింది. దీంతో మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాడు.. త్వరలోనే బెంగళూరులో తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. రావుకు చిన్నప్పటి నుంచీ ఐటీ, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ (AIML)కి సంబంధించిన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు. చదవండి: అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ ఇన్స్‌స్టిట్యూట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిBIT మెస్రా యాజమాన్యం నిడుమోలు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.తమ సంస్థకు చెందిన విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీని అందుకోవడం ఇదే తొలిసారంటూ రావును అభినందించింది. గతంలో, గరిష్ట ప్యాకేజీ సంవత్సరానికి రూ. 52 లక్షలుగా నమోదైందని BIT మెస్రా ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు. -
రూ. 20 వేలతో ష్యాషన్ బ్రాండ్..కోట్ల టర్నోవర్ : దోస్తుల సక్సెస్ స్టోరీ
కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక, వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని అందలాలను అధిరోహించాలనే పట్టుదల ఇద్దరు స్నేహితరాళ్లను వ్యాపారవేత్తలుగా మార్చింది. ఇది వారి కలలను సాకారం చేసుకోవడం వరకే పరిమితం కాలేదు. నేత వస్త్రాలను ప్రాచుర్యం, చేతివృత్తులవారికి ఆర్థిక స్వావలంబన, మహిళాలకు సాధికారతను తెచ్చి పెట్టింది. అలా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా అనే ఇద్దరు స్నేహితులు అద్భుతాలు చేశారు. ఇంతకీ వీరేం సాధించారు తెలుసుకుందామా...!నిజానికి నిరుపమ సింగ్( Nirupama Sharma) అంజనా భమ్రా Anjana Bhamra) సక్సెస జర్నీ సుమారు పదేళ్ల క్రితం సాయంత్రం కాఫీ ఒక స్నేహితుడు అడిగిన సాయం వారిలో వ్యాపార ఆలోచనకు పునాది వేసింది. ఫ్యాషన్, ఫాబ్రిక్ పట్ల వారి జ్ఞానం ఆసక్తి సొంత ఫ్యాషన్ లేబుల్ కలిగి ఉండాలనే ఆలోచన వారి మనస్సులలో మొలకెత్తింది. అలా ‘ది సాఫ్రాన్ సాగా ’ పుట్టింది. భారతీయ కళా నైపుణ్యం, మహిళా సాధికారత, ఫ్యాషన్, పర్యావరణ అనుకూల డిజైనర్ దుస్తుల బ్రాండ్ ఇది. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో దేశీయ హస్తకళను ప్రోత్సహిస్తుంది.చీరలు, సూట్లు, దుస్తులు, బ్లౌజులు , ట్రెండీ లాంజ్‌వేర్ వంటి ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు అంతేకాదు తమ బ్రాండ్‌ను జీరో-వేస్ట్‌గా మార్చడానికి ,మిగిలిపోయిన బట్టలను రీసైక్లింగ్ కూడా చేస్తారు. ఇదీ చదవండి : అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ పురాతన హస్తనైపుణ్యానికి, ఆధునిక ట్రెండ్‌ను, సౌందర్యాన్ని జోడించి, పలురకాల ప్రింట్లు , రంగులతో అనేక ప్రయోగాలు చేస్తున్నాం అంటారు సాఫ్రాన్ సాగా వ్యవస్థాపకులు నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, సితార, లినెన్, బాటిక్, బాగ్ బహార్, ఇంద్రధనుష్ వంటి గాలి ఆడేలా, లేత రంగు ఫాబ్రిక్ను ఎంచుకుంటామన్నారు. సీజన్‌కు తగినట్టు దుస్తులను తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకున్నారు.2015లో పదేళ్ల క్రితం కేవలం 20వేల రూపాయల పెట్టుబడితో 'ది సాఫ్రాన్ సాగా' అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. అదీ 40 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రపంచంలోకి అడగుపెట్టారు. అంజనా ఒక హోటల్, సెలూన్, బోటిక్ నడిపేది. ఆమె స్నేహితురాలు నిరుపమ మార్కెటింగ్, కమ్యూనికేషన్లలో నిపుణురాలు. ఇలా వీళ్లిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న ఈ బిజినెస్ టర్నోవర్ రూ. 1.5 కోట్లను దాటేసింది. అయితే వీరి సక్సెస్ జర్నీ అనుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఒక సవాల్ అయితే, తమ బ్రాండ్‌ను జనాల్లోకి తీసుకెళ్లడం మరో సవాల్. ఒక దశలో ఈఎంఐలు కట్టడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సవాళ్లను ఇద్దరూ కలిసి మొక్కవోని దీక్షతో అధిగమించారు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు కరిగి పోయాయి. మొదట్లో ఆశించినంత లాభాలు రాక, ఆదాయం రాకపోయినా నిరాశపడలేదు. ధైర్యంతో తమ బ్రాండ్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఏదైనా సాధించాలనే పట్టుదల, కృషితో ముందుకు సాగి, సక్సెస్‌కు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. -
కృషి ఉంటే కావ్య అవుతారు!
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా నెలనెలా బంగారు గుడ్డు పెట్టే బాతులానే చూస్తారు. పైగా కావ్యా ధొబాలే–దత్ఖిలే జీతం నెలకు 76 వేలు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సయాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు తను! చిన్న వయసులోనే అంత పెద్ద ఆసుపత్రి, అంత పెద్ద జీతం అంటే మున్ముందు సర్వీసుతో పాటు పెరిగే జీతం లక్షల్లోనే కదా ఉంటుంది! అయితే కావ్య ఈ లెక్కలేమీ వేసుకోలేదు. ఆసుపత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయ క్షేత్రం వైపు మళ్లారు!కావ్య లక్ష్యం ఏమిటి? ఏం లేదు, మనుషుల ఆరోగ్యం కాపాడటం మాత్రమే. సయాన్ ఆసుపత్రిలో ఆ పనే కదా ఆమె చేస్తున్నారు! కానీ అంతకుమించి, అసలు మనుషులకు ఆసుపత్రి అవసరమే కలుగకుండా చేసే పనిని ఆమె ఎంచుకున్నారు. ఎలాగంటే – వర్మి కంపోస్ట్‌తో పండించే పంటల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలుసుకున్న కావ్య ఏకంగా వర్మి కంపోస్ట్ ఉత్పత్తినే ప్రారంభించారు! అంతేకాదు, రసాయన రహిత పంటల గురించి అవగాహన కల్పించటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది ఔత్సాహిక వర్మి కంపోస్ట్ వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చారు. అంటే – కావ్య తన లాంటి కావ్యల్ని వందలాదిగా తయారు చేశారు. కారణం లేదు.. ప్రేరణ ఉంది ఎవరైనా ఉద్యోగం మానటానికి, ఉద్యోగం మారటానికి ఒక కారణం ఉంటుంది. కానీ కావ్య ఉద్యోగం వదలి వ్యవసాయంలోకి రావటం వెనుక ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ వెనుక.. ఇతరులకు సహాయం చేయాలని చిన్నప్పట్నుంచీ ఆమెతో పాటు ఎదుగుతూ వస్తున్న తపన ఉంది. ఆ తపనే ఆమెను మొదట నర్సింగ్ కోర్సు వైపు మళ్లించింది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో డిప్లొమా చేశాక, ముంబైలోని ‘లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్’లో (ఇదే సయాన్ హాస్పిటల్) నర్సుగా చేరారు కావ్య. తర్వాత టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండేళ్లు పని చేశారు. 2017లో నర్సింగ్‌లో బీఎస్సీ పూర్తి చేశాక ఏడాది పాటు ఒక ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి సయాన్ ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరి స్టాఫ్ నర్స్ అయ్యారు. అలా చేరటమే ఆమె కెరీర్‌ను వ్యవసాయం వైపు మలుపు తిప్పింది. అన్ని మరణాలను చూశాక..!2019 నుంచి 2022 వరకు సయాన్ లో నర్సుగా ఉన్నారు కావ్య. అది కరోనా వ్యాపించిన పాడు కాలం. నర్సుగా ఆమె కొన్ని నెలల పాటు అనేక మంది తన కళ్ల ముందే కరోనాతో మరణించటాన్ని దగ్గరగా చూశారు. దాంతో ఆమె జీవిత దృక్పథమే మారిపోయింది. ‘‘నేను కూడా అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాను. దాదాపుగా మరణశయ్యపై ఉన్నాను. కానీ నా రోగ నిరోధక శక్తి నన్ను రక్షించింది. మనం పండిస్తున్న, మనం తింటున్న రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మన శరీరాలు బలహీనమౌతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. రసాయనాల జాడలు లేని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు కావ్య. ఉద్యోగం వదలి వర్మి కంపోస్ట్లోకిఅయితే అందుకోసం ఉద్యోగం మానేయాలన్న కావ్య నిర్ణయాన్ని ఆసుపత్రిలో, ఇంట్లో, బంధువుల్లో ఎవరూ హర్షించలేదు. ఆమె భర్త రాజేశ్ దత్ఖిలే ఒక్కరే ఆమె వైపు నిలబడ్డారు. అలా 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై నుంచి భర్త స్వగ్రామమైన పుణె దగ్గరి జున్నార్‌కు మారిపోయారు కావ్య. అక్కడే ఆమె వర్మి కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. దాని కన్నా ముందు వర్మి కంపోస్ట్‌ను ఎలా తయారు చేయాలో కొన్ని నెలల పాటు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అలా ఆసుపత్రి బెడ్ల మధ్య నుంచి వర్మి కంపోస్ట్ ‘బెడ్’ల మధ్యకు వచ్చారామె.కిలో వానపాములే పెట్టుబడి‘‘నా ప్రారంభ పెట్టుబడి సున్నా. 2022 ఆగస్టులో ఒక రైతు నుంచి కిలో వాన పాములను తీసుకుని చిన్న ‘బెడ్’తో (ఎత్తు మడి) పనిలోకి దిగాను. ఆవు పేడలో వాన పాములను జోడించాను. వాటికి ఆహారంగా ఇతర పశువుల పేడ, రాలిన చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాను. 2022 అక్టోబర్ నాటికి తొలి విడత వర్మి కంపోస్ట్ సిద్ధమైపోయింది’’ అని ఎంతో ఎగ్జయింట్‌గా చెబుతారు కావ్య. తర్వాత ‘బెడ్’ల సంఖ్య పెరిగింది, వర్మి కంపోస్ట్ ఉత్పత్తీ పెరిగింది. చివరికి అదొక వ్యాపారంగానూ మారింది.ఈ ఆర్థిక సంవత్సరానికి కావ్య టర్నోవర్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు! టర్కీ, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు ‘కృషి కావ్య బ్రాండ్’ పేరుతో కావ్య వర్మి కంపోస్ట్ ఎగుమతి అవుతోంది. కావ్య దగ్గర శిక్షణ తీసుకున్న రెండు వందల మందీ మహారాష్ట్ర వ్యాప్తంగా వర్మి కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన ప్రకృతి వ్యవసాయానికి తోడ్పతున్నారు. తామూ ఉపాధి పొందుతున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
చిన్న వయసులోనే పెళ్లి, బాధ్యతలు: పట్టుదలతో IAS అధికారిగా
మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అధిగమించి ఉన్నత స్థాయి నైపుణ్యాలతో రాణిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంవత్సరాలుగా, పౌర సేవలలో మహిళా అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారిలో ఒకరు మిన్ను జోషి. ఒక బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి పోయిన ఆమె నేడు ఆమె కేవలం శ్రద్ధగల అధికారి మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబం గర్వించదగిన వ్యక్తిగా ఎదిగింది. సంకల్పం ఉంటే ఒక స్త్రీ తన ఇంటి బాధ్యతలను పోషిస్తూనే తన కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నిరూపించింది.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు తమ దృఢ సంకల్పం, ఆకాంక్ష శ్రద్ధతో ఉన్నత శిఖరాల అధిరోహిస్తున్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ. కుటుంబం ఇచ్చిన మద్దతుతో, ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది.భారతదేశంలోని అత్యంత కఠినమైన సివిల్స్‌లో సత్తా చాటినమిన్ను జోషి సక్సెస్ జర్నీని పరిశీలిద్దాం. చదవండి: ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ , యూట్యూబ్ సీఈవోకి గూగుల్ భారీ ఆఫర్కేరళలోని పతనంతిట్ట అనే చిన్న గ్రామంలో మిన్ను జోషి పుట్టింది. మిన్ను తండ్రి పోలీసు. మిన్నుకి 21 ఏళ్ల వయస్సులోనే వివాహం అయింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యగా, కోడలిగా, తల్లిగా కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయినా తన కలను సాకారం కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంది. దివంగత తండ్రి కలను సాకారం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్పోలీసుగా గౌరవ స్థానంలో ఉన్న తండ్రిని చూసి తాను కూడా మరింత ఉన్నతంగా ఎదగాలని కలకనింది. అయితే, ఎంతో ప్రేమించిన తండ్రి అకాల మరణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 2012లో 'డై-ఇన్-హార్నెస్' పథకం ద్వారా ఆమె కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో క్లరికల్ పదవిని పొందింది. అయినా ‘ఐఏఎస్’ డ్రీమ్‌ను విడిచిపెట్టలేదు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన 26 సంవత్సరాల వయస్సులో, ఆమె ఐఎఎస్ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది. ఇది కేవలం తన కలకోసం మాత్రం కాదని, మరణించిన తండ్రి సేవకు కొనసాగింపు అని భావించింది. 2015లో శంకర్ ఐఏఎస్ అకాడమీలో చేరిం కష్టపడింది. రెండేళ్ల తరువాత మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే, ఆమె ఇంటర్వ్యూలలో విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరుత్సాహపడలేదు. చివరికి తొలి ఆరు ప్రయత్నాలు, సుదీర్ఘమైన అధ్యయన సెషన్ల తర్వాత, సివిల్ సర్వీసెస్ పరీక్షలో 150 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించి తానేంటో నిరూపించుకుంది.చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్‌పై ఫ్యాన్ కామెంట్ వైరల్ -
సీఈవోగా గృహిణి..! ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో..
మధ్యతరగతిలో పెరిగిన ఆమె పార్ట్ టైం జాబ్‌లు చేసి మరీ అమెరికా చదువుని పూర్తి చేసింది. చిన్నా.. చితక స్టోర్ల నుంచి ఆభరణాల స్టోర్ వరకు ప్రతిదాంట్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ..తన కాబోయే భర్తను కలుసుకుంది. అతడు కూడా ఆమెలానే రెస్టారెంట్ అంతస్తులు శుభ్రం చేసే హౌస్ కీపింగ్ స్థాయి నుంచి ఓ కంపెనీని స్థాపించే రేంజ్‌కి ఎదిగిన వ్యక్తి. ఇద్దరి కష్టపడేతత్వం, అభిరుచులు ఒక్కటై..స్నేహితులుగా, ఆ తర్వాత జంటగా మారారు. అలా ఇరువురు మంచి వ్యాపారవేత్తలుగా మారినా..గృహిణిగా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడక తన కాళ్లపై తాను నిలబడేందుకే మక్కువ చూపించింది. అలా ఆమె అనతికాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుని..అత్యంత లగ్జరీయస్ భవంతిలో నివాసం ఉండే స్థాయికి చేరుకున్నారామె. ఇప్పటికీ తనకు భర్త సంపాదనపై ఆధారపడి బతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదని చెబుతోంది. మరీ అంతలా సక్సెస్‌ని అందుకున్న ఆ గృహిణి ఎవరంటే..విలాసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆ గృహిణే దుబాయ్‌కి చెందిన అనితా సురానీ. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె, అమెరికాలో చదువుకు కొనసాగించడానికి ఎన్నో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేది. ఒక కన్వీనియన్స్ స్టోర్ నుంచి జ్యువెలరీ స్టోర్ వరకు..ఇలా ప్రతి చిన్న పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకోకుండా ఆహర్నిశలు కష్టపడి అమెరికా చదువుని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలో అనిత తన ఇంటీరియర్ డిజైన్‌కి సంబంధించిన వ్యాపారం చేసే యత్నంలో ఉండగా..తన కాబోయే భర్త వ్యాపార భాగస్వామి మోయిజ్ ఖోజాను కలిసింది. మోయిజ్ కూడా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అతడు కూడా ఒకప్పుడు రెస్టారెంట్ అంతస్తులను శుభ్రం చేసి, విజయవంతమైన టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. అతనితో కలిసి అనిత టెక్ స్టోర్ సామ్రాజ్యాన్ని నిర్మించింది. వ్యాపారభాగస్వాములుగా ఉన్న ఇద్దరు జీవిత భాగస్వాములయ్యారు. తమ వ్యవస్థాపక ప్రయాణం ఒక అమెరికన్ మాల్లోని ఒక చిన్న సెల్ ఫోన్ కియోస్క్‌తో ప్రారంభమైందని చెబుతోంది అనిత. అలా అలా విస్తరించి ఇవాళ దాదాపు 100కు పైగా దుకాణాలతో రిటైల్ సామ్రాజ్యంగా విస్తరించిందని తెలిపింది. ఇక మోయిజ్ ఈ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తుండగా..అనిత తన ఇంటీరియర్ డిజైన్ పట్ల ఉన్న ఆసక్తితో అటువైపుగా తన వ్యాపారాన్ని నిర్మించాలనుకుంది. అందుకోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక అనుభవజ్ఞుడైన సహోద్యోగితో భాగస్వామ్యం కుదుర్చుకుని..దుబాయ్‌లో జేనా ఇంటీరియర్స్‌ను ప్రారంభించింది. చూస్తుండగానే అతి కొద్దికాలంలో అనిత డిజైన్ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. జస్ట్ ఇద్దరు వ్యక్తుల నుంచి ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఇంటీరియర్ డిజైనర్లతో సహా 40 మందికి పైగా ఉద్యోగులకు విస్తరించింది. అయితే తన సక్సెస్‌కి ప్రేరణ తన కుమార్తె జెనా అని అంటోంది. జీవితాన్ని సమతుల్యం చేసుకునేలా ఎలా మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలో తన కూతురు చూపించాలనేదే తన ధ్యేయమని, అందుకోసమే ఓటమిని దరిదాపుల్లోకి రాకుండా కష్టపడతానని చెబుతోంది. అందుకోసమే తన కంపెనీకి కూడా తన కూతుర జెనా పేరుని పెట్టానని చెబుతున్నారామె. అనితా జెనా బోటిక్ కంపనీని కూడా నిర్వహిస్తోంది. ఇందులో అంతా మహిళా ఉద్యోగులే పనిచేస్తారని చెబుతోంది. లగ్జరీ భవంతి..ఆమె దుబాయ్ ఇల్లు అత్యంత లగ్జరీయస్‌గా..రెండు కళ్లు సరిపోవేమో..! అన్నంత అందంగా ఉంటుందట. ఆమె ఇంటి సీలింగ్ 24-క్యారెట్ల బంగారంతో చేసి ఉంటుందట. ఆమె ఆఫీస్ కూడా అంతే అందంగా లగ్జరీయస్ ఉంటుందట. అయితే అనిత తన వ్యాపారానికి నిధులు సమకూర్చుకోవడానికి కుటుంబ సంపదపై అస్సలు ఆధారపడదట. ఎందుకంటే తన భర్త స్పష్టమైన ఆర్థిక సరిహద్దులను నిర్దేశించారట, అందుకనుగుణంగానే నడుచుకుంటానంటోంది. తన ఆఫీస్ పెట్టుబడిని తిరిగి చెల్లించడమే గాక ఉద్యోగుల జీతాలను కూడా తానే భరిస్తానంటోంది. ఆ ఒత్తిడే ఆమెను మరింత కష్టపడి పనిచేసేలా చేసి, కంపెనీ అభివృద్ధి దోహదపడుతుందని చెబుతోంది. అంతేకాదండోయ్ అనిత డబ్బుని ఆర్చించేలా కష్టపడి పరిచేస్తా..అలాగే సంపాదించినదంతా ఖర్చు పెట్లేందుకు వెనకడుగు వేయను అని తేల్చి చెబుతోంది. పైగా అందులో ఉన్న సంతృప్తే 'వేరేలెవెల్' అని చెబుతోంది అనిత.(చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!) -
ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్‌గా టెక్ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్‌గా బెంగళూరులోని ట్రాఫిక్ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు. తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్‌తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్జీ కార్పొరేట్స్ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్‌ను అందించింది.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్జీ గ్రూప్ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు. ఇదీ చదవండి : కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తోఅంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం. -
రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
ఆయుర్వేదం అనగానే ముందుగా గుర్తొచ్చేది భారతదేశం. ఆయుర్వేదం అనగానే గుర్తొచ్చే బిజినెస్ దిగ్గజం మీరా కులకర్ణి. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన అనేక మంది పురుష గాథల మధ్య ఆమె విజయం నిజంగా చాలా స్పూర్తిదాయకం. కేవలం రూ. 2 లక్షల పెట్టుబడితో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘనత, దార్శనికత ఆమె సొంతం. ఆమె మరెవ్వరో కాదు ప్రపంచ బ్యూటీ ఇండస్ట్రీలో రారాణిలా వెలుగుగొందుతున్న భారతీయ మహిళ మీరా కులకర్ణి. పదండి మీరా కులకర్ణి విజయగాథ గురించి తెలుసుకుందాం.ఉత్తరాంచల్‌లోని తెహ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన మీరాకు చాలా చిన్నతనంలోనే ఆయుర్వేద జీవన విదానంపై ఆసక్తి పెరిగింది. అచంచలమైన అంకితభావం ఆయుర్వేదంపై ఉన్న మక్కువతో ఉత్తరాఖండ్‌కు చెందిన ఆమె సంప్రదాయ మార్గాలను ధిక్కరించి మరీ బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సక్సెస్‌కు సరిహద్దులు లేవని నిరూపించారు.ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ 69 ఏళ్ల మీరా కులకర్ణి ఇపుడు గ్లోబల్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. స్వచ్ఛమైన ఆయుర్వేద చర్మ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. డిజిటల్ మార్కెట్లోకూడా ఉనికిని చాటుకుంటూ, అంతర్జాతీయ మార్కెట్లనుమరింతగా ఆకర్షించాలని భావిస్తున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఎదగడం, ప్రపంచంలోని ఏదైనా ఉత్తమ బ్రాండ్‌తో భారతీయ బ్రాండ్‌ను పోల్చదగినదిగా చేయడమే తదుపరి లక్ష్యం.” అని ఆమె చెప్పారు. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ఒక విలాసవంతమైన ఆయుర్వేద ఉత్పత్తులను తీసుకురావడం అనేది ఒక విప్లవాత్మక ఆలోచన అంటారామె. వ్యాపారంలో ఎలాంటి అనుభవం, విజ్ఞానం లేకపోయినా 40 ఏళ్ల వయసులో, సింగల్ పేరెంట్‌గా కష్టాలుపడుతున్న క్రమంలో 2000 సంవత్సరంలో కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో ఒక చిన్న గ్యారేజ్‌లో ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌ను వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎలాంటి రుణం తీసుకోకుండా, వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడులు పెడుతూ నెమ్మదిగా వృద్ధి చెందారు. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఆయుర్వేదంపై ఉన్న ప్రేమ, కష్టపడి పనిచేయడం, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడమే ఆమెకున్న బలాలు. దీంతోపాటు మార్కెట్లో లభించే ఆయుర్వేద ఉత్పత్తులు చాలావరకు నాణ్యత లేనివి , ఎక్కువగా ఔషధపరమైనవనే విషయాన్నే త్వరగా ఆకళింపు చేసుకున్నారు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీమలుపు తిప్పిన అనుకోని మీటింగ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ క్రమంగా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. సాంప్రదాయ, విలాసవంతమైన ఆయుర్వేద చర్మ సంరక్షణ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన బ్రాండగా ఎదిగింది. భారతదేశంలోని చాలా లగ్జరీ హోటల్ చైన్లు ,స్పాలకు ప్రముఖ సరఫరాదారుగా కూడా అవతరించింది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పాపులర్ అయింది. రాజీలేని నాణ్యతకు మరోపేరుగా నిలిచింది.2007లో జోధ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో ఎలిజబెత్ హర్లీ , భారతీయ వ్యాపార దిగ్గజం అరుణ్ నాయర్ వివాహానికి భారతదేశానికి వచ్చిన సమయంలో అనూహ్యంగా ఎస్టీ లాడర్ చైర్మన్ లియోనార్డ్ లాడర్‌తో జరిగిన సమావేశం కులకర్ణి వ్యవస్థాపక ప్రయాణంలో ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఈ మీటింగ్‌లో చర్చల రెండు నెలల తర్వాత మీరా బ్రాండ్‌లో ఎస్టీ లాడర్ ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్లో భారీ పెట్టుబడులు పెట్టింది. అంతే అక్కడినుంచి వెనుదిరిగి చూసింది లేదు. రాజీలేని నాణ్యతతో ప్రచార ఆర్భాటాలు, డిస్కైంట్ల జిమ్మిక్కులు ఇలాంటి వాటి జోలికి పోకుండా దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పతులతో గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా దాదాపు రూ.8, 500 కోట్ల ప్రపంచ అందాల సామ్రాజ్యానికి అధిపతి వరకు సాగిన ఆమె వ్యాపార ప్రస్థానం ఎందరో మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిస్తోంది.మీరా కులకర్ణి విద్యార్హతలుమీరా కులకర్ణి చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలు. భారతదేశ ఆయుర్వేద కేంద్రంగా పిలువబడే ఉత్తరాంచల్‌లోని తెహ్రీ గర్హ్వాల్ ప్రాంతానికి చెందిన మీరా, ఆయుర్వేద జీవన విధానంతోపాటు, అంతేకాకుండా, పెయింటింగ్, జర్నలిజం, వాటర్ కలర్స్, ఆర్గానిక్ మొక్కలు, మూలికలు, వైద్య ఫలితాలపై ఆమెకున్న విభిన్న ఆసక్తే ఆమెను విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా మామర్చిం దనడంలో ఎలాంటి సందేహం లేదు. -
సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్!
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందారు. ఒక హోటల్లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్‌లోని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీ, సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ (ఎస్ఐసీఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్ కలినరీ ఫెడరేషన్ (ఏసీఎఫ్) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్వేర్’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ -
‘వేద’ మా అమ్మ పేరు.. ‘వేదాంత’ నా కంపెనీ పేరు..
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన తల్లి స్ఫూర్తితో సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీహార్‌లోని పాట్నాలో జన్మించిన అగర్వాల్, కెరీర్ ఆరంభంలో విఫలమైనప్పుడు నిరాశకు గురయ్యారు. అప్పుడు అమ్మే అండగా నిలిచింది. గుండెల్లో ధైర్యం నింపింది. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ తల్లీకొడుకుల అనుబంధం గురించి తెలిపేదే ఈ కథనం..విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభ రోజులు పరీక్షగానే ఉంటాయి. ఎవరు అవమానించినా, హేళన చేసినా ఈ పరీక్షలో వారికి తోడుగా నిలిచేది తల్లి మాత్రమే. అలాగే అనిల్ అగర్వాల్‌కూ అమ్మ అండగా నిలిచింది. విజయం వైపు నడిపించింది. “అనిల్.. ముందుకు సాగు.. తలుపులు తెరుచుకుంటాయి” అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటారాయన.ఈ మాటలు ఆయనలో సంకల్పాన్ని నింపాయి. వేదాంతను స్థాపించి భారత జీడీపీలో 1.4% వాటా సాధించే సంస్థగా నిలిపారు.ప్రస్తుతం వేదాంత ఒక పెద్ద మార్పును చేస్తోంది. 83% ఆమోదంతో డీమెర్జర్‌కి క్రెడిటర్స్ ఆమోదం లభించింది. దీనివల్ల సంస్థ ఐదు స్వతంత్ర విభాగాలుగా విడిపోతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ఎన్సీఎల్టీ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అగర్వాల్ ఆశిస్తున్నారు. ఈ డీమెర్జర్ షేర్‌హోల్డర్ల విలువను పెంచి, రుణ భారాన్ని తగ్గిస్తుంది. గత ఐదేళ్లలో వేదాంతలో పెట్టుబడులు 4.7 రెట్ల రాబడిని ఇచ్చాయి.వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతపై కూడా అగర్వాల్ దృష్టి ఉంది. అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నడిచే నంద్ఘర్ కార్యక్రమం బాల్య విద్యను ప్రోత్సహిస్తుంది. మదర్స్ డే సందర్భంగా, తల్లుల పాత్రను గౌరవిస్తూ తన తల్లి స్ఫూర్తిని తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు అనిల్ అగర్వాల్. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.‘మొదటిసారి, ‘మదర్స్ డే’ రోజున అమ్మ లేదు!అమ్మ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు… ఆమె మీ ఉనికే. ఆమె శరీర రూపంలో మనతో లేకపోయినా, ఆమె ఆత్మ శ్వాస మనతోనే ఉంటుంది.కాలం, దేవుడి కృపగా మారి కన్నీళ్లను ఆరబెడుతుంది. అంతులేని బాధను సానుకూల శక్తిగా మార్చి మనకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది.విచారం, కాలంతో పాటు శక్తిగా మారుతుంది, ఎందుకంటే మీ ప్రేమ నిజమైనది.ఉదయం లేచినప్పుడు ఏదో భక్తి గీతం, ఆలోచించకుండానే నోటిలోకి వచ్చినట్లు, అలాగే అమ్మ జ్ఞాపకం మనసులో వెలుగును నింపుతూ ఉంటుంది.ఖాదీ బట్టల వాసన లేదా అగరబత్తి సుగంధంలో తరచూ అమ్మ ఉనికిని అనుభవిస్తాను.మా అమ్మకు ఇంగ్లీష్ రాదు, కానీ లండన్‌లో ఉంటూ ఆమె ఇంగ్లీష్ వాళ్లతో చక్కగా సంభాషించేది. భావనల భాషకు పదాల అవసరం ఎప్పుడూ ఉండదు.పెద్ద నిర్ణయం తీసుకునే ప్రతిసారీ ఒక క్షణం ఆగిపోతాను. అమ్మ ఆశీర్వాదం కావాలన్నట్లు అనిపిస్తుంది.‘వేద’ నా అమ్మ పేరు.“వేదాంత” అక్కడి నుండే పుట్టింది.నా విజయం నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రసాదమే.అమ్మ జ్ఞాపకానికి ఒక నిర్దిష్టమైన రోజు అవసరం లేకపోయినా, ఇలాంటి ఒక రోజును నిర్ణయించడం నాకు చాలా సానుకూల ఆలోచనగా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక మాటగా కలిసి ఈ రోజును అమ్మకు అంకితం చేస్తోంది. ఇది చాలా మంచి విషయం.‘మదర్స్ డే’ సందర్భంగా ప్రతి అమ్మకు నా నమస్కారం!’ -
వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ
ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్లో వెయిటర్‌గా మొదలైన భాస్కర్ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్ భాస్కర్ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్ బిజినెస్‌కు ఉంటుంది. కేఆర్ భాస్కర్ తయారు చేసే బొబ్బట్ల (పూరన్ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.ఇదీ చదవండి: 30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్‌లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్‌కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్లెట్లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్‌గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్! -
సివిల్స్‌లో ఇల్లాలి అపూర్వ విజయం..! వైకల్యాన్ని జయించి..
ఇరవైలలో సివిల్స్‌కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా మాత్రం 35వ యేట ప్రిపరేషన్ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్‌లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్‌కు సిద్ధం అవుతున్నప్పుడు... ‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్‌లో సక్సెస్ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్ ప్రిపరేషన్లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్‌కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైమ్ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్‌కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్‌లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా. (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..) -
Success Story: జస్ట్ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!
చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేయాలనే తపన, న్యాయవాది కావాలన్న తన తండ్రి ఆశయాన్ని గమనించారు.. లా పూర్తి చేసినా న్యాయవాదిగా స్థిరపడాలన్న తండ్రి లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తండ్రి కలను పట్టుదలతో తాను సాధించారు.. న్యాయవాది కాదు.. ఏకంగా న్యాయమూర్తిగానే ఎంపికయ్యారు.. మొదటి ప్రయత్నంలోనే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన శ్రీవల్లి శైలజ 2024లో నిర్వహించిన జ్యుడీషియరీ పరీక్షలో జనరల్ కేటగిరిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 24 ఏళ్ల వయసులో చదువు పూర్తయిన అనతి కాలంలోనే న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన తాను చిన్ననాటి నుంచే సామాజిక సేవ చేయాలన్న తండ్రి ఆశయంతో పెరిగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయినా న్యాయమూర్తి కాలేకపోయారు. దీంతో తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకుని లక్ష్యం చేరుకున్నారు శ్రీవల్లి. ఇంటర్ అవగానే ఎంసెట్, లా ప్రవేశపరీక్షలు రెండూ రాశారు. రెంటిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో జ్యుడీషియరీ మెయిన్స్ వైపు అడుగులువేశారు. ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి.. అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వాధికారులు. నాన్న రమేష్ నరసింహం హైదరాబాద్‌లో సీజీఎస్టీ సూపరింటెండెంట్. తల్లి లక్ష్మీసురేఖ దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో అసిస్టెంట్ ఆఫీసర్. ఓయూలో ఎల్ఎల్బీ, నల్సార్ యూనివర్శిటీలో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. అనంతరం జ్యుడీషియరీ మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జి వరకూ ఎదిగారు. శ్రీవల్లి సోదరి సహితం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఐపీఎం (మూడో సంవత్సరం) చదువుతున్నారు. నాన్న కల నెరవేరింది.. జ్యుడీషియరీ మెయిన్స్ తరువాత ఏప్రిల్ నెల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జి వంటి ఉన్నత ఉద్యోగం లభించడం సంతోషించదగ్గ విషయం. నాన్న కల నెరవేరింది. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. సామాజిక న్యాయం కోసం కృషి చేయగలనన్న నమ్మకం కలిగింది. జ్యుడీషియరీలో అత్యున్నత స్థానం వరకూ వెళ్లేందుకు సాధన చేస్తా. – శ్రీవల్లి శైలజ, జూనియర్ సివిల్ జడ్జి (చదవండి: 'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..) -
కుబేర వారసులు
ఒకప్పుడు తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దిన వారంతా, ఇప్పుడు వ్యాపార చదరంగంలో ఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు. వ్యాపారరంగంలో ఇప్పటికే ఆరితేరిన తండ్రులు తమ వ్యాపార అనుభవాలను పాఠాలుగా చెబుతుంటే, వాటన్నింటినీ శ్రద్ధగా వింటూ కొత్త తరం కోటీశ్వరులుగా ఎదుగుతున్నారు. తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూనే, తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. పాతతరం ఢక్కామొక్కీలు తిని కోటీశ్వరులుగా మారితే, ఇప్పుడు వారి పిల్లలు కేవలం వారసత్వం అనే ఏకైక అర్హతతోనే వ్యాపార సామ్రాజ్యాలకు నవనాయకులుగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. అంబానీ మొదలుకొని దేశంలోని చాలామంది వ్యాపార దిగ్గజాలు ఇప్పుడు తమ వారసులకే పట్టం కడుతున్నారు. అందుకే, ప్రస్తుతం ఉన్న యువ కోటీశ్వరుల్లో ఎక్కువమంది వ్యాపార కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. అయితే, వీరిలో కూడా కొంతమంది ఒట్టి వారసులుగానే మిగిలిపోకుండా, తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వేలాదికోట్ల ఆస్తిపాస్తులను, వ్యాపారాలను నిలబెట్టుకుంటూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. వారిలో కొందరే.. వీరు..రి‘లయన్స్’ఆసియాలోనే అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలు కూడా వారి కుటుంబ వ్యాపారాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈశా అంబానీ పిరామల్ముకేష్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పిరామల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆమె రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈశా గత ఏడాది ‘మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్–2024’ అవార్డు పొందింది. టైమ్ మ్యాగజైన్ ‘టైమ్ 100 నెక్ట్స్ రైజింగ్ స్టార్స్’ జాబితాలో పేరు సంపాదించింది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ. 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్ రూ.800 కోట్లని అంచనా.ఆకాశ్ అంబానీముకేశ్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఆకాశ్ అంబానీ తన చదువు పూర్తి చేసిన వెంటనే, 2014లో రిలయన్స్ జియోలో చేరాడు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఓనర్స్‌లో ఒకరిగా కూడా ఉన్నాడు. అలాగే, రిలయన్స్ లిమిటెడ్ ఉత్పత్తులు, డిజిటల్ సేవల అప్లికేష¯Œ ల అభివృద్ధి, విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆకాశ్ వార్షిక వేతనం రూ. 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,32,815 కోట్లు) నెట్‌వర్త్.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ. 2022లో రిలయన్స్ బోర్డులో చేరాడు. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. జంతుప్రేమికుడిగా ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం ‘వంతారా’అనే సంస్థను స్థాపించాడు. ఈ మధ్యనే ఈ సంస్థకు ప్రతిష్ఠాత్మక ‘ప్రాణిమిత్ర’ జాతీయ అవార్డు లభించింది. అనంత్ వార్షిక వేతనం రూ. 4.2 కోట్లు. నెట్‌వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,32,482 కోట్లు).నోయల్ టాటా ఉప్పు నుంచి విమానయానం వరకు దాదాపు అన్ని రంగాల్లోనూ టాటా గ్రూప్ వ్యాపార స్రామాజ్యం విస్తరించి ఉంది. అయితే, ఆ సామ్రాజ్యం దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణానంతరం కూడా సజావుగా కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన సవతి తల్లి కొడుకు నోయల్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులవడం. ఆయన టాటా సన్స్ బోర్డులో కూడా అడుగుపెట్టారు. ఈయనకు ముగ్గురు పిల్లలు. వీరు కూటా టాటా ట్రస్ట్‌లో వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.లేహ్ టాటానోయల్ పెద్ద కుమార్తె లేహ్ టాటా ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. తాజ్ హోటల్స్ రిసార్ట్స్– ప్యాలెస్‌లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె– నేడు ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను నిర్వహిస్తోంది. వీటితో పాటు, గేట్‌వే హోటల్స్ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జేఆర్డీ అండ్ థెల్మా జే టాటా ట్రస్ట్ బోర్డులలో కూడా ఉన్నారు.మాయా టాటామాయా టాటా.. టాటా క్యాపిటల్‌లోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, టాటా ఆపర్చునిటీస్ ఫండ్లలో మొదలై, నేడు టాటా డిజిటల్ రంగంలో ముఖ్యమైన పదవిలో ఉన్నారు. టాటా న్యూ యాప్ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, జెఆర్‌డీ, టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో కూడా పనిచేస్తోంది.నెవిల్లే టాటానెవిల్లే టాటా గత సంవత్సరం నుంచి టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారాల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రెంట్ హైపర్ మార్కెట్ యూనిట్.. ‘స్టార్ బజార్’, ‘జూడియో’ సంస్థలకు అధిపతి. వీటితో పాటు టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, జేఆర్డీ, టాటా ట్రస్ట్ అండ్ ఆర్డీ, టాటా ట్రస్ట్ బోర్డులలో ఉన్నారు.గోద్రేజ్ప్రఖ్యాత కుటుంబ వ్యాపారాల్లో గోద్రేజ్ ఒకటి. సబ్బులు, గృహాపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ సంస్థ గోద్రేజ్. దీనిని 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అర్దేశిర్ గోద్రేజ్ ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపును గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్‌గా రెండు విభాలుగా విభజించారు. వీటిల్లో గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌ను వారి మూడోతరం ఆది, నాదిర్ చూసుకుంటుంటే, మరోదాన్ని జంషీద్, స్మితా గోద్రేజ్ కృష్ణా నిర్వహిస్తున్నారు. వీరితో పాటు, వారి నాలుగోతరం వారసులైన తన్యా దుబాష్.. గోద్రేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైర్టెర్గానూ, నిసబా గోద్రేజ్.. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇలా గోద్రేజ్ కుటుంబంలో చీలిక ఏర్పడినప్పటికీ వారి వ్యాపారాన్ని వారసులు విజయవంతంగా కొన సాగిస్తున్నారు. బజాజ్ బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ తర్వాత, బజాజ్ సంస్థను ఆయన కుమారులు రాజీవ్, సంజీవ్, అతని బంధువులు శేఖర్, నీరజ్, నీరవ్‌తో కూడిన కుటుంబ కౌన్సిల్ ద్వారా ఏకాభిప్రాయంతో పనిచేస్తోంది. ఇటీవలే మరణించిన మధుర్ బజాజ్ కూడా ఈ ఆరుగురు సభ్యుల కౌన్సిల్లో ఉండేవారు. బజాజ్ ఆటో సంస్థను రాజీవ్ బజాజ్ కుమారుడు రిషభ్నయన్ బజాజ్ చూసుకుంటున్నాడు. గత ఏడాదే, బజాజ్ గ్రూప్ ఆరోగ్య రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. నీరవ్ బజాజ్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాడు. వీరి వారసులు కూడా కంపెనీలో వివిధ పదవుల్లో కొనసాగుతూ విజయం సాధిస్తున్నారు.అనన్యా బిర్లా.. దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకటైన ఆదిత్యా బిర్లా పెద్ద కుమార్తె అనన్యా బిర్లా వ్యాపార ప్రపపంచంలో విజయవంతమైన మహిళగా రాణిస్తోంది. ఈమె తన çపదిహేడవ ఏటనే సొంత మైక్రోఫిన్ సంస్థను స్థాపించింది. ఇది దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న మైక్రోఫైనాస్స్ సంస్థల్లో ఇదీ ఒకటి. అలాగే, ఆదిత్యా బిర్లా అనుబంధ హిందాల్కో ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతోంది. ప్రణవ్ అదానీభారతీయ కుబేరుల్లో ఒకరైన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తర్వాతి తరం కూడా వేర్వేరు వ్యాపారాల్లో కొనసాగుతూ, ఆయన పేరును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ కుమారుడు ప్రణవ్ అదానీ బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తయిన వెంటనే, అదానీ కమ్యూనికేషన్స్‌లో ఎంటరై, తన చురుకుతనం చూపించాడు. తర్వాత అదానీ విల్మార్, అదానీ రియాలిటీలకు అధిపతిగా ఉన్నాడు. అలాగే, ఆసియాలో అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌కు ఇతడే నాయకత్వం వహిస్తున్నాడు. కరణ్ అదానీ.. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ అంచెలంచెలుగా ఎదిగి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. ఆయన హయాంలో, కంపెనీ నాలుగు నుంచి ప్రస్తుతం పన్నెండు పోర్టులకు విస్తరించింది. అంతేకాదు, దాని కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాడు. అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారాన్ని పెంచడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.జీత్ అదానీ...గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్స్ వంటి విభాగాల బాధ్యతలు చూసుకోవడంతో తన కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నాడు.సాగర్ అదానీ..అదానీ సోదరుడి కుమారుడు సాగర్ అదానీ. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందిన తర్వాత 2015లో అదానీ గ్రూప్‌లో చేరాడు. ప్రస్తుతం అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. విదేశాల నుంచి సౌర విద్యుత్ ప్రాజెక్టులు తెప్పించడంలో సాగర్ కీలక పాత్ర పోషించాడు.ఆర్యమాన్ విక్రమ్ బిర్లాబిర్లా తనయుడు ఆర్యమాన్ బిర్లా వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్. అయినప్పటికే, తండ్రి పేరును నిలబెట్టే ప్రయత్నంతో చిన్న వయసులోనే బిర్లా రియల్ ఎస్టేట్, పెయింట్స్, ఫ్యాషన్ అండ్ రిటైల్ వ్యాపారాల్లో తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. 2023లో గ్రూప్‌లోని ఫ్లాగ్షిప్ కంపెనీలైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డులో చేరారు. వీటితోపాటు, బిర్లా హాస్పిటాలిటీ, బిర్లా వెంచర్స్‌ను చూసు కుంటున్నాడు.దేశంలో కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో అంబానీ కుటుంబ వ్యాపారం మొత్తం విలువ రూ.25.75 లక్షల కోట్లు. ఇది భారత జీడీపీలో 10 శాతంతో సమానమని ‘బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా–2024’ నివేదిక పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్, బిర్లా కుటుంబాలు ఉన్నాయి. అయితే, వారసత్వ వ్యాపారం ఇలాగే కొనసాగితే, రాజకీయాల్లోను, సినిమాల్లోను మాదిరిగానే వ్యాపారరంగంలోనూ వారసత్వాలు పెరిగి, కొత్త వ్యాపారులకు చోటు లేకుండా పోతుందనేది నిపుణుల మాట. ఇలా కాకుండా, ఎక్కడైనా సరే, వారసత్వ అర్హతతో పనిలేకుండా, ప్రతిభతో అవకాశాలు దక్కడం, దక్కించుకోవడమే అందరికీ మేలు.వ్యాపార కుటుంబాల్లో భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో ఇప్పటికే చాలా మార్పు జరుగుతోంది. కొత్త తరానికి నియంత్రణ అప్పగిస్తూ, వారసులను వ్యాపార బరిలోకి దింపుతున్నారు. వీరి రాకతో వారి కుటుంబాల వ్యాపారాల విలువలు కూడా పెరుగుతున్నట్లు తాజాగా బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా 2024 ఇచ్చిన నివేదిక వెల్లడించింది. వీటితో పాటు, అత్యధిక విలువ కలిగిన కుటుంబ వ్యాపారాల నివేదికను రూపొందించింది. అదే ఇది..నివేదిక ప్రకారం.. కుటుంబాల వ్యాపారాల విలువలు దీపిక కొండి -
దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
ఫుడ్ బిజినెస్‌కు ఎపుడూ మంచి డిమాండ్ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్ బిజినెస్‌లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్ సక్సెస్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్ విశాఖపట్నంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్ స్టాల్‌ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..! -
'మైండ్‌బ్లోయింగ్ టాలెంట్'..! అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్..
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్‌అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?మన హైదరాబాద్‌కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్‌శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్‌ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్‌ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్‌లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్‌లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్‌పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లను పారిస్‌లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్‌లు, టెక్నికల్ టీమ్‌లలో పాల్గొనడం, ఈవెంట్ల నిర్వహించడం వల్ల కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్‌గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్‌లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్‌కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్‌కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్‌కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్‌లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్‌ను క్రికెటర్‌గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్‌లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్‌కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన నాయకుడు.. అతడే ఒక సైన్యం..
-
ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
బిజినెస్ అంటే.. కేవలం పురుషులకు మాత్రమే సాధ్యమవుతుందన్న రోజులు పోయాయి. వ్యాపార ప్రపంచంలో మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. 'సాక్షి ఛబ్రా మిట్టల్' (Sakshi Chhabra Mittal). ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సాధించిన సక్సెస్ ఏమిటి?, అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సాక్షి ఛబ్రా మిట్టల్.. లండన్‌కు చెందిన 'ఫుడ్‌హాక్' వ్యవస్థాపకురాలు, సీఈఓ. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో బీఎస్సీ, ది వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన సాక్షి.. ఫైజర్‌లో తన కెరీర్ ప్రారంభించింది. అక్కడే ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల వంటి వాటిలో మంచి పట్టును సాధించింది. సైన్స్ అండ్ బిజినెస్ వంటి వాటిపై అమితాసక్తి కలిగిన ఈమె.. ఆనతి కాలంలోనే బాబిలోన్, డెలివరూ, డార్క్ట్రేస్ వంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టింది.ఆరోగ్య సంరక్షణ వైపు..ఆ తరువాత సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌లో చేరి, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ యొక్క పెట్టుబడి బృందంలో కీలక సభ్యురాలిగా మారింది. ఆ సమయంలో రోయివెంట్ సైన్సెస్‌తో ఒక బిలియన్ ఈక్విటీ ఒప్పందంతో సహా ప్రధాన పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే.. ఈమె దృష్టి ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లింది.కాలేయ వ్యాధి..2017లో సాక్షి ఛబ్రా మిట్టల్ మొదటి గర్భధారణ సమయంలో.. అనారోగ్యం వచ్చింది, దాని ఫలితంగా కాలేయ వ్యాధి వచ్చింది. అప్పుడు ఆయుర్వేద ఆహారాన్ని స్వీకరించి పూర్తిగా నయం చేసుకుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆహారమే ఔషధం అని భావించి.. ఫిబ్రవరి 2021లో ఫుడ్‌హాక్ సంస్థను ప్రారభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందగలిగింది. ఇది (ఫుడ్‌హాక్) ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సైన్స్, టెక్నాలజీ, ఆయుర్వేద సూత్రాలను మిళితం చేసి భోజనం అందించే డెలివరీ సంస్థ.సాక్షి ఛబ్రా.. భారతి గ్లోబల్‌కు నాయకత్వం వహిస్తున్న 'శ్రావిన్ మిట్టల్'ను వివాహం చేసుకుంది. ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో క్లాస్మేట్స్గా ఉన్న ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. ఈయన భారతీయ బిలియనీర్ సునీల్ మిట్టల్ కుమారుడు. సునీల్ మిట్టల్ భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ మరియు నికర విలువ రూ. 2,63,099 కోట్లు.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో.. -
25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీ
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. పుట్టాక పుట్టుకతోనే అంధురాలైన ఈ బిడ్డ మా కొద్దు అంటూ చెత్త కుప్పలో పడేశారు తల్లిదండ్రులు . కట్ చేస్తే 26 ఏళ్ల వయసులొ నాగ్‌పూర్ కలెక్టరేట్లో రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్తబుట్టలో పడేశారు కన్నవాళ్లు. ఆ చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. ఆ ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుని సత్తా చాటుకుంది. గత ఏడాది మేలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) క్లర్క్-కమ్-టైపిస్ట్ పరీక్ష (గ్రూప్ సి)లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాలా పాపల్కర్ వార్తల్లో నిలిచింది. తాజాగా అంత్యంత పోటీతత్వ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. త్వరలోనే నాగ్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టనుంది.చదవండి: మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలుమాలా పాపాల్కర్ ఎలా ఎదిగింది.అనాథాశ్రమంలో చేరిన మాలానుపద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ శ్రద్ధగా గమనించేవారు. ఆమె పట్టుదల, నైపుణ్యానికి ముచ్చటపడ్డారు. ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టారు. ఆమె ఉన్నత చదువులు చదివేందుకు తన వంతు కృషి చేశారు. అలా మాలా పట్టుదలగా చదివింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. తాజా మరో మెట్టు అధిగమించింది.‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికి ఆ దేవుడే దేవదూతలను పంపించాడంటూ తన విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్, ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారు.చదవండి: వేధింపులకు భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్! -
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
ఈ రోజు కష్టాలున్నాయని కుంగిపోకూడదు. చీకటి వెనుకే వెలుగు ఉంటుంది. ఈ ఆశావహదృక్పథమే మనిషిని నడిస్తుంది. భవిష్యత్‌పై ఆశను పెంచుతుంది. ఆత్మవిశ్వానికి మనో ధైర్యాన్ని జోడించి ముందుకు అడుగేయాలి. అప్పుడే మన పట్టుదలకు, కష్టానికి విజయం దాసోహమంటుంది. రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ సక్సెస్ గురించి తెలుసుకుంటే.. ఈ మాటలు అక్షర సత్యాల నిపించక మానవు. 9వ తరగతిలో న చదువు మానేసి, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోగా రాణిస్తూ, ప్రధానిమోదీ చేతులు మీదుగా సత్కారాన్ని అందుకున్న మహిళ గురించి తెలుసుకుందా రండి!రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాకి చెందిన రుక్మిణి కటారా 13 ఏళ్ల వయసులో వివాహం చేశారు పెద్దలు. అప్పటికి మద్వా ఖపర్దా అనే చిన్న గ్రామంలో ఆమె తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. పెళ్లి తరువాత చదువుకు బ్రేక్ పడింది. కుటుంబం గడవడం కోసం దినసరి కూలీగా పనిచేసింది. NREGA ద్వారా వచ్చే జీతమే వారికి ఆధారం. కానీ రాజస్థాన్ గ్రామీణ ఆజీవిక వికాస్ పరిషత్ (రాజీవిక) పథకం ఆమె జీవితంలో మార్పునకు నాంది పలికింది. ఈ పథకం కింద స్వయం సహాయక బృందంలో చేరి, ఆమె సౌర దీపాలు , ప్లేట్లను(Solar lamps and Plates) ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంది. శ్రద్ధ పెట్టి, ఈ పనిలో నైపుణ్యం సాధించింది. ఆ తరువాత దుర్గా ఎనర్జీ (దుంగార్పూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్)కంపెనీని స్థాపించింది. ఒక గిరిజన మహిళగా తాను సాధికారత సాధించడమే కాదు, తనలాంటి ఎందరో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించింది. కంపెనీ ఐదేళ్ల కాలంలో రూ. 3.5 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. కంపెనీ సీఈవోగా రుక్మిణి మరో 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కృషికి గాను ఆమెకు జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2016లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రుక్మిణిని సత్కరించారు.ఇదీ చదవండి: ఫ్యాషన్‌లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్‌తో మెరిసిన బ్యూటీతక్కువ చదువుకుంటే ఏంటి? "మహిళలు పెద్దగా చదువుకోలేదని, విద్య తక్కువ అని ఎప్పుడూ తమను తాము తక్కువగా అనుకోకూడదు. తక్కువ విద్యతో కూడా ఎదగవచ్చు. నేను తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. కానీ నేడు నేను ఒక కంపెనీ యజమానిని. నాలాగే ఇతర మహిళలు ఇలా ఎందుకు చేయకూడదు?” అంటుందామె సగర్వంగా. ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఆమె ఆత్మవిశ్వాసం, సంకల్పం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఇపుడు భర్త కమలేష్‌తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు: రాకేష్, ఆశా, ప్రవీణ్ ,యువరాజ్. అందర్నీ ఉన్నత చదువులను చదివిస్తోంది.చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
కొంతమంది అనుకోకుండా యాక్టర్లు అవుతారు. మరికొంతమంది డాక్టర్ కాబోయి యాక్టర్లు అవుతారు. ఇంకొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత స్టార్ హీరోహీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటారు. కానీ సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును, పేరును తెచ్చుకున్నట్టప్పటికీ, వేరేరంగంలో పేరు రాణించడం చాలా అరుదు. పలు సినిమాలలో నటించి క్రేజ్, ఫామ్‌ను వదిలిపెట్టి, ఇపుడు ఐఏఎస్ ఆఫీసర్‌గా రాణిస్తున్న హెచ్‌సీ కీర్తన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.భారతీయ సినిమా మనకు అనేక మంది ప్రఖ్యాత కళాకారులు అందించింది. తమకంటూ ఒక పేరును చెక్కుకుని, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వారి అద్భుతమైన నటనకు దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో ఒకరు. హెచ్‌సి కీర్తన. ఆమె బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి, అనేక మంది ప్రముఖ తారలతో కలిసి నటించింది. 32 కి పైగా చిత్రాలలో నటించింది. 48 టీవీ షోలలో కనిపించింది. కర్పూరద గొంబే, గంగా-యమునా, ముద్దిన అలియా, ఉపేంద్ర, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమీషనర్, హబ్బా, డోరే, సింహాద్రి, పుత్రీ, జననీ, జననీ ఉన్నాయి. అనేక సినీపాత్రలతో అపారమైన ప్రజాదరణ పొందింది. చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!అద్భుతమైన ఫామ్ కొనసాగుతున్న సమయంలోనే తన చదువుపై దృష్టి పెట్టడానికి పరిశ్రమను విడిచి పెట్టాలని నిర్ణయించుకుంది. దేశానికి సేవ చేయడానికి 15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. IAS ఆఫీసర్ కావాలనే తన తండ్రి కల, తన కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించింది. నటనా జీవితానికి బై బై చెప్పేసి యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యింది. అయితే తన కల అంత ఈజీగా సాకారం కాలేదు. ఐదుసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన, చివరికి ఆరో ప్రయత్నంలో విజయం సొంతం చేసుకుంది. UPSC పరీక్షలో ఆలిండియా లెవెల్ లో ఆరో ప్రయత్నంలో 167వ ర్యాంక్ ను ఆమె సాధించారు. ప్రస్తుతం కీర్తన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తోంది.గతంలో కీర్తన కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా కూడా సేవలు అందించి ప్రశంసలు అందుకోవడం విశేషం.ఇదీ చదవండి: మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..! -
ఈయన సక్సెస్ నెవర్ ఎండ్
అనంతపురం కల్చరల్: భారతదేశ సంప్రదాయ పానీయం గోలీసోడా. సుయ్‌మంటూ శబ్దం చేస్తూ గోలీని కిందికి దించి సోడా తాగుతుంటే దాని రుచి అద్భుతం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఓ వెలుగు వెలిగిన సోడా దాహార్తి తీర్చే పానీయంగానే కాదు.. భోజనం అరగకపోయినా గోలీసోడా తాగి ఉపశమనం పొందేవారు. అయితే మారిన కాలానికి అనుగుణంగా పలు రకాల కూల్‌డ్రింక్స్ మార్కెట్లోకి రావడంతో 140 ఏళ్ల చరిత్ర కల్గిన గోలీసోడా ప్రాభవం తగ్గింది. అలాంటి గోలీసోడాకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఉదయ్‌కిరణ్‌రెడ్డి పూర్వవైభవం తీసుకొచ్చారు. ‘నెవర్ ఎండ్’ పేరుతో స్టార్టప్ కంపెనీగా మొదలై ‘గోలీసోడా’ను కొత్త పుంతలు తొక్కించారు. వివిధ రకాల ఫ్లేవర్లు, అద్భుతమైన రుచితో గోలీసోడాను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.గోలీ సోడా ప్రస్థానమిలా..బ్రిటీష్ వలస పాలకులు రాజ్యమేలుతున్న రోజుల్లో హిరమ్ కాడ్ అనే విదేశీయుడు భారతదేశంలో గోలీసోడా ప్రవేశపెట్టాడు. అనతికాలంలోనే ఈ సంప్రదాయ పానీయం గురించి దేశమంతటా పాకిపోయింది. ఆ తర్వాత గోలీసోడా లేని రోజులను ఊహించుకోలేకపోయారు. బ్రాండెడ్ కూల్‌డ్రింక్స్ ఎన్నొచ్చినా గోలీ సోడా అంటే ఇష్టపడే వారు దాన్ని ఎక్కడ అమ్ముతున్నా వెళ్లి తాగొచ్చేవారు.స్టార్టప్‌తో ఆకట్టుకుని..శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కొత్తూరుకు చెందిన పల్లి రమణారెడ్డి, అనూరాధ దంపతుల కుమారుడు ఉదయ్‌కిరణ్‌రెడ్డి.. ఆయన తన సోదరుడు జయదీప్రెడ్డితో కలిసి స్టార్టప్ కంపెనీగా ‘నెవర్ ఎండ్’ పేరుతో గోలీసోడా ఉత్పత్తులను ప్రారంభించారు. ‘కూల్ డ్రింక్‌లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పాత సోడా అంటే ఏం క్లిక్ అవుతుంది’ అని పెదవి విరిచిన వాళ్లే గోలీసోడా రుచికి ఫిదా అయిపోయారు. అనంతపురం నుంచి దేశ నలుమూలలే కాదు మలేషియా, అమెరికా (టెక్సాస్, డల్లాస్), దుబాయ్ వంటి విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. మొత్తం 150 ఫ్యాక్టరీలు.. 99 రకాల ఫ్లేవర్లు.. నిత్యం లక్షలాది మంది గోలీసోడా తాగే కస్టమర్లు.. ఇదేమీ చిన్న విషయం కాదు. ఈ ప్రస్థానం వెనుక అంతులేని శ్రమ ఉంది.రసాయనాలు లేకుండా..మాది సాధారణ కుటుంబం. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాం. ఉన్నత చదువులు అభ్యసించిన తర్వాత స్టార్టప్ కంపెనీ పెట్టాలని భావించి.. సమగ్ర అధ్యయనం చేశాం. ఇందులో గోలీసోడా కాన్సెఫ్ట్ బాగా నచ్చింది. అనుకున్నదే తడవుగా పరిశ్రమను ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాం. విదేశాల్లోనూ మా ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. మేము ఒక్కో బాటిల్‌ను 14 సార్లు శుభ్రపరిచి రీఫిల్ చేస్తాం. సోడా తయారీలో ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధమైన పండ్ల రసాల రుచులనందిస్తున్నాం.– ఉదయ్‌కిరణ్‌రెడ్డి, ‘నెవర్ ఎండ్’ గోలీసోడా యజమాని -
కరాటే కింగ్ బొంతూరి రమేష్ సక్సెస్ స్టోరీ
వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపురం ఇప్పాయిగూడేనికి చెందిన బొంతూరి రమేష్ కుటుంబసభ్యులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రమేష్ గోల్కొండలో 9వ తరగతి చదువుతున్నప్పుడే కరాటేపై ఆసక్తి పెంచుకున్నాడు. పదో తరగతి పాసైనా ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు ఆపేశాడు. బ్రూస్లీ సినిమాలు చూసి 12వ యేట నుంచే కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు, గ్రాండ్ మాస్టర్ ఆర్కే కృష్ణ ప్రోత్సాహంతో కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. అనంతరం కిక్‌బాక్సింగ్ నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం మాస్టర్ రమేష్ జవహర్గర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, కానిస్టేబుళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాడు. ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో రన్వీర్ తైక్వాండో అకాడమీ ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా కరాటే విద్యనందించి బీపీ, షుగర్, మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యోగా శిక్షణ అందిస్తున్నాడు. ఇప్పటికే పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేస్తున్నాడు. వేసవికాలంలో మరింత మంది విద్యార్థులకు కరాటే విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. 2011 బెంగళూరులో నేషనల్ గోల్డ్ మెడల్ 2016లో అక్షయ్‌కుమార్ ఇంటర్నేషనల్ గోల్డ్‌మెడల్ వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 220 గోల్డ్, సిల్వర్ మెడల్స్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ -
అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!
రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా స్పష్టం చేశారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్ ఆర్ట్స్ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్‌ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్‌గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
వ్యాపారాల్లో కోట్ల రూపాయలు సంపాదించిన తండ్రులు తమ కుమారుల చదువు అయిపోయిన వెంటనే ఆస్తులు పంచి, వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇచ్చి, దర్జాగా తమ పక్క సీట్లో కుర్చోబెట్టుకుంటున్న రోజులివి. ప్రముఖ రియల్ఎస్టేజ్ వ్యాపారి, బిలియనీర్ జార్జ్ పెరెజ్ మాత్రం అందుకు భిన్నంగా తన కుమారులకు సొంత కంపెనీలో ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. తన కంపెనీలో ఉన్నత స్థానం కావాలంటే సొంతంగా ఎదగాలని సూచించి కఠిన నిబంధనలు పెట్టారు.జార్జ్ పెరెజ్ కుమారుడు జాన్ పాల్ పెరెజ్ కాలేజీ చదువు పూర్తి చేసుకొని తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ రిలేటెడ్ గ్రూప్‌లో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ అందుకు తన తండ్రి నిరాకరించారు. తండ్రి-కొడుకుల బంధం ఉన్నంత మాత్రాన తన 60 బిలియన్ డాలర్ల(సుమారు రూ.5 లక్షల కోట్లు) ఆస్తిని, కంపెనీ ప్రతిష్టను కుమారుడి సామర్థ్యం తెలియకుండా పణంగా పెట్టదలుచుకోలేదని జార్జ్ తెలిపారు. అందుకు బదులుగా కుమారుడి సామర్థ్యాలను నిరూపించడానికి జాన్ పాల్‌ను జార్జ్ సన్నిహిత స్నేహితుడి వద్దకు పని చేయడానికి పంపారు. దాంతో జాన్ పాల్ పెరెజ్ మియామి విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత కెరియర్లో ఎదిగేందుకు న్యూయార్క్ వెళ్లాడు.కనీసం ఐదేళ్లు అనుభవంతనతో కలిసి పని చేయాలంటే జార్జ్ తన పిల్లలందరికీ కఠినమైన నిబంధనలు విధించారు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కనీసం ఐదు సంవత్సరాలు అనుభవం సంపాదించాలని చెప్పారు. ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందాలని తెలిపారు. పిల్లలు సులువుగా తన కెరీర్ మార్గాన్ని అనుసరించకుండా ఈ విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.నచ్చని పనిచేస్తే విజయం సాధించలేరు..‘నేను రియల్ ఎస్టేట్‌లో విజయం సాధించినంత మాత్రాన తమకు అభిరుచి లేనిదాన్ని ఎంచుకోవద్దని పిల్లలకు చెప్పాను. ఎందుకంటే జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ప్రతిరోజూ డబ్బు సంపాదన కోసం నచ్చని పని చేస్తే విజయం సాధించలేరు. నాకు సమాజంలో ఉన్న ప్రతిష్టతోనే పిల్లలను మార్కెట్లోకి తీసుకొచ్చారని మిగతా కంపెనీ సభ్యులు భావించడం నాకు ఇష్టం లేదు’ అని జార్జ్ పెరెజ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలాచివరకు సీఈఓగా..తన తండ్రి స్నేహితుడు, జార్జ్ కంపెనీలో మైనారిటీ వాటాదారుగా ఉన్న స్టీఫెన్ రాస్ యాజమాన్యంలోని సంస్థలో జాన్ పాల్ విశ్లేషకుడిగా కెరియర్ ప్రారంభించాడు. తరువాత ఉన్నత విద్యను అభ్యసించి నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ సంపాదించాడు. 2012 నాటికి తండ్రికి చెందిన రిలేటెడ్ గ్రూప్‌లో చేరడానికి తగినంత అనుభవం సంపాదించినట్లు భావించాడు. కానీ, అతని తండ్రి తనకు ఉన్నత పదవి మాత్రం ఇవ్వలేదు. దాంతో జాన్ పాల్ కంపెనీలో జూనియర్ స్థాయి ఉద్యోగిగా చేరారు. తండ్రి మార్గంలోనే పనిచేశాడు. జాన్ పాల్ ప్రస్తుతం తన సోదరుడు నిక్‌తో కలిసి రిలేటెడ్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. తండ్రి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. దశాబ్దానికి పైగా కంపెనీలో విభిన్న బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన వీరిద్దరూ ఉన్నత పదవులు అందుకున్నట్లు జార్జ్ పెరెజ్ సౌత్ ఫ్లోరిడా బిజినెస్ జర్నల్‌కు తెలిపారు. -
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
కృషి, పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. తాను ఏ స్థితిలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరగలడు. అందుకు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మల్ మిండా(66) జీవితమే ఉదాహరణ. తన తండ్రికి చెందిన చిన్న మెకానిక్ షాపులో వాహనాలకు ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేసే నిర్మల్ మిండా క్రమంగా వ్యాపారంలో ఎదిగి ఏకంగా రూ.66,904 కోట్ల విలువైన యునో మిండా కంపెనీకి సారథిగా నిలిచారు. తాను ఇంత స్థాయికి ఎలా ఎదిగారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇంజినీరింగ్‌లోనే కారు ఉత్పత్తి అంశాలపై దృష్టినిర్మల్ మిండా హరియాణాలో జన్మించారు. తనకు చిన్నతనం నుంచి ఇంజినీరింగ్ పట్ల అభిరుచి ఉండేది. తన తండ్రి షాదీలాల్ మిండాకు ఢిల్లీలోని కమలానగర్లో మోటారు సైకిళ్లకు అవసరమైన ఎలక్ట్రికల్ విడిభాగాలను తయారు చేసే ఓ చిన్న షాపు ఉంది. ఇక్కడే ఆయన విజయానికి పునాది పడింది. నిత్యం తండ్రి చేస్తున్న పనిని గమనిస్తూ ఈ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆటోమోటివ్ ప్రొడక్షన్లో కెరీర్ ప్రారంభించాలని భావించి మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే తాను కారు ఉత్పత్తికి అవసరమైన అన్ని అంశాలను నేర్చుకున్నారు. 1977లో తన 20వ ఏట తన తండ్రి కంపెనీలో చేరారు. అప్పటికే తన ఆలోచనలతో చిన్న షాపుగా ఉన్న వారి కుటుంబ వ్యాపారం కాస్తా చిన్నపాటి కంపెనీగా రూపాంతరం చెందేందుకు కృషి చేశారు. ఆయన మొదట్లో సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసి కొత్త ఆలోచనలు, ఆశయాలను పంచుకున్నారు.వ్యూహాత్మక దూరదృష్టి1990ల్లో నిర్మల్ తన సోదరుడితో విడిపోయి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. గతంలో మిండా ఇండస్ట్రీస్ అని పిలువబడే యునో మిండాకు పునాది వేశారు. అతని వ్యూహాత్మక దూరదృష్టితో కేవలం మోటారుసైకిల్ భాగాల్లో మాత్రమే కాకుండా ఇతర విడిభాగాలను తయారు చేయడం ప్రారంభించారు. సెన్సార్లు, లైట్లు, అల్లాయ్ వీల్స్‌తో సహా విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇవి ద్విచక్ర వాహనాలు, కార్లు రెండింటి అవసరాలను తీర్చాయి. దాంతో కొద్ది కాలంలోనే కంపెనీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం యునో మిండా హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి ప్రధాన ఒరిజినల్ పరికరాలతోపాటు అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరాదారుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 73 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది.అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా..ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగంలోకి ప్రవేశించడం యునో మిండా వృద్ధికి కీలకంగా మారింది. 2020 నుంచి కంపెనీ సెన్సార్లు, లైటింగ్ వంటి విభాగాల్లో అధునాతన విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం చైనాకు చెందిన సుజౌ ఇనోవాన్స్ ఆటోమోటివ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందని కంపెనీ నమ్ముతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,268 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది.బిలియనీర్‌గా..నిర్మల్ మిండా వ్యక్తిగత సంపద అతని వ్యాపార విజయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు అతని సంపద నికర విలువ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది సుమారు రూ.30,000 కోట్లకు సమానం. దాంతో గురుగ్రామ్‌లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దాంతోపాటు భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. గురుగ్రామ్‌లోని రెండో అత్యంత ధనవంతుడైన దీపిందర్ గోయల్ సంపద కంటే మిండా సంపద మూడు రెట్లు ఎక్కువ. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం మిండా సంపద 2018లో ఒక బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరింది.ఇదీ చదవండి: జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..దాతృత్వ కార్యక్రమాలతో సేవనిర్మల్ మిండా కేవలం బిజినెస్ టైకూన్ మాత్రమే కాదు. ఆయన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు. సామాజిక అభ్యున్నతికి సుమన్ నిర్మల్ మిండా ఫౌండేషన్ (ఎస్ఎన్ఎమ్ఎఫ్) స్థాపించి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమన్ మిండాను వివాహం చేసుకున్న అతను నిత్యం వందల సంఖ్యలో పిల్లలకు ఆహారం, ఆశ్రయంతోపాటు విద్యను అందించేలా మిండా బాల్ గ్రామ్ అనే అనాథాశ్రమాన్ని స్థాపించారు. నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల మిండా విద్యా నికేతన్‌ను ఏర్పాటు చేశారు. అతని కృషికి ‘హరియాణా రత్న’ అవార్డు, ఇండియా యమహా మోటార్స్ నుంచి ‘గోల్డ్ అవార్డు ఫర్ క్వాలిటీ’ వంటి ప్రశంసలు లభించాయి. నిర్మల్, సుమన్ దంపతులకు పరిధి, పల్లక్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
జస్ట్ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్మెంట్లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్ పేరే బ్రాండ్ నేమ్‌గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్ని రూపొందించాడంటే..పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్‌వెజ్ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అతడి ప్రస్థానం మొదలైందిలా..1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్‌గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్ మిరపకాయలతో సాస్ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు. అయితే ఇంతలో సైగాన్లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు. సాస్ వ్యాపారం ఆవిర్భావం..బోస్టన్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్‌సాస్ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్‌లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్ క్యాపిటల నిధులు లేవు, మార్కెటింగ్ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు. తన ప్రొడక్ట్‌కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్క్యాప్ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్‌మార్క్‌గా క్రియేట్ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్మెంట్ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్ అత్యంత హాట్‌గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు. అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్‌లోని చైనాటౌన్, రోజ్మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్ అని పేరు పెట్టాడు.అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్‌చిల్లీ బాటిల్‌పై లేబుల్ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్‌ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్. ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్ ట్రాన్. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా.. గ్రూప్–1లో విజయం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ‘పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎంచుకున్న లక్ష్యం నెరవేరే వరకు శోధన చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. ఐఏఎస్ లక్ష్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. సొంతంగా ప్రిపేర్ అయ్యాను. అయి నా మూడు సార్లు సివిల్స్ రాసి తృటితో విఫలమయ్యాను. అధైర్య పడకుండా తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1లో విజయం సాధించా. ఇందుకోసం కోచింగ్ లేకుండా సొంతంగా మూడు నెలలనే ప్రిపేరయ్యా. గ్రూప్–1 సెమీ ఫైనల్స్ మాత్రమే. నా లక్ష్యం సివిల్స్. ఐఏఎస్ సాధించి సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగుతా’ అంటోంది గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంక్, ఎస్సీ కమ్యూనిటీలో రాష్ట్రస్థా యి మొదటి ర్యాంకు సాధించిన కరీంనగర్‌కు చెందిన కన్నం హరిణి. ఆదివారం గ్రూప్–1 ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ‘సాక్షి’తో తన విజయ రహస్యాలను పంచుకుంది.అమ్మానాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులుమా సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి. 15ఏళ్ల క్రితం కరీంనగర్‌లోని విద్యానగర్‌లో స్థిరపడ్డాం. అమ్మానాన్న రమేశ్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయులు. అక్క అఖిల ఎంబీబీఎస్ పూర్తి చేసింది. చెల్లెలు వర్షిణి ఎంబీబీ ఎస్ ద్వితీయ సంవత్సరం, తమ్ముడు బాలాజీ మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నేను ఎస్సెస్సీలో 9.8 జీపీఏ, ఇంటర్ ఎంపీసీలో 978 మార్కులు సాధించాను. వరంగల్‌లోని నీట్లో ఈఈఈ పూర్తిచేశాను.సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసిబీటెక్ అనంతరం హైదరాబాద్‌లో బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో రెండేళ్లు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేశాను. తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. మూడుసార్లు ప్రిలిమినరీలో 0.18శాతంతో మిస్సయ్యాను. మళ్లీ ప్రిపేర్ అవుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. కేవలం 3 నెలల పాటు శ్రమించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాను. స్టేట్ 55ర్యాంక్, ఎస్సీ కేటరిటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను.కుటుంబ ప్రోత్సాహం నా విజయంలో కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. సివిల్స్‌లో ఫెయిల్ అయిన ప్రతీసారి వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. 2021 కరోనా కాలంలో ఎక్కడా కోచింగ్ సెంటర్లు లేవు. అప్పటి నుంచి ఆన్లైన్ వేదికగా సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. అదే ప్రిపరేషన్ గ్రూప్–1 విజయంలో కీలకంగా మారింది. ఐఏఎస్ నా కల. గ్రూప్–1 ఉద్యోగం చేసూ్తనే సివిల్స్‌కు ప్రి పేర్ అవుతా. సమాజ సేవ చేయాలన్నదే నా ఆశయం. ఐఏఎస్‌లు ధాత్రిరెడ్డి, దురిశెట్టి అనుదీప్ నా రోల్ మోడల్. -
కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి.. 6,00,000 మంది ఉద్యోగులు.. దాదాపు 46 దేశాల్లో కార్యకలాపాలు.. సృజనాత్మక పనితనానికి పెట్టింది పేరు.. ఐటీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురించి తెలియనివారుండరు. టాటా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రతన్ టాటా, జేఆర్డీ టాటాలు. టీసీఎస్‌ను స్థాపించడం కూడా వారిలో ఒకరి ఆలోచనే అని చాలామంది అనుకుంటారు. కానీ భారతదేశాన్ని ఐటీ రంగంలో ప్రపంచంలో ముందుంచేలా చేసిన టీసీఎస్ స్థాపన ఆలోచన ఒక పాకిస్థానీదని తక్కువ మందికే తెలిసుంటుంది. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం.భారత ఐటీ పితామహుడుమార్చి 2025 నాటికి రూ.12.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ప్రపంచ ఐటీ పరిశ్రమలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుట్టుకకు ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ‘భారత ఐటీ పితామహుడు’గా పిలువబడే ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి. ఆయన చేసిన కృషి టీసీఎస్‌ను ఇండియాలో ఐటీ పవర్ హౌజ్‌గా మార్చేందుకు కారణమైంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా మారేందుకు తోడ్పడింది.అప్పటి భారత్.. ఇప్పటి పాకిస్థాన్‌లో పుట్టి..భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు 1924లో (అప్పుడు పాకిస్థాన్ భారత్‌లోనే ఉండేది) ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఫకీర్ చంద్ కోహ్లీ జన్మించారు. అతని విద్యాభ్యాసం లాహోర్‌లో జరిగింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి సిస్టమ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.టీసీఎస్ పుట్టిందిలా..కోహ్లీ 1951లో భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. తాను కంప్యూటర్ ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను ఆధునీకరించడంలో నిష్ణాతుడు. దాంతో త్వరగా సంస్థలో ఎదిగారు. అతడి వినూత్న విధానాలు అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా దృష్టిని ఆకర్షించాయి. ఆయన కొత్త వెంచర్‌కు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోహ్లీలో చూశారు. ఒకరోజు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనను జేఆర్డీతో పంచుకుంటూ.. అందుకుగల కారణాలను కోహ్లీ విశ్లేషించారు. దాంతో 1968లో టీసీఎస్ ఆవిర్భవించింది. కోహ్లీ దాని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కంపెనీకి తొలి సీఈఓగా నియామకం అయ్యారు.కొత్త శిఖరాలకు టీసీఎస్భారత సాంకేతిక మౌలిక సదుపాయాలు అంతగా లేని సమయంలో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో దేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని కోహ్లీ ఊహించారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్ ఒక మోస్తరు కార్యకలాపాల నుంచి దేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ ఎగుమతులకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై దేశాన్ని విశ్వసనీయ సంస్థగా నిలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ సంస్థలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కోహ్లీ వ్యూహాత్మక దూరదృష్టి ఎంతో తోడ్పడింది. ఇది టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు చేర్చింది. 2003 నాటికి కంపెనీ బిలియన్ డాలర్ల(రూ.8,300 కోట్లు) ఆదాయాన్ని సాధించడంలో సహాయపడింది.నాస్కామ్కు అధ్యక్షుడు, ఛైర్మన్‌గా..భారతదేశం అభివృద్ధి చెందాలంటే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశపు ప్రముఖ ఐటీ అడ్వకసీ సంస్థ(న్యాయ కార్యకలాపాలు నిర్వహణ) నాస్కామ్కు 1995-1996 కాలంలో అధ్యక్షుడిగా, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఐటీ విధానాలను రూపొందించడంలో, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఆర్థిక తారతమ్యాల భారతం!పద్మభూషణ్‌తో సత్కారంకోహ్లీ ప్రభావం కార్పొరేట్ విజయాలకే పరిమితం కాలేదు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా భావి నాయకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 1999లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా వయోజన అక్షరాస్యత, ప్రాంతీయ ల్యాంగ్వేజీ కంప్యూటింగ్ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైలైట్ చేశారు. 2002లో భారతదేశపు మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, న్యాయవాది స్వర్ణ్ కోహ్లీని వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు సంతానం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చిన ఆయన 2020 నవంబర్ 26న తన 96వ ఏట కన్నుమూశారు. -
క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. -
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
ఆశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. వ్యాపారాలను సృష్టిస్తోంది.. ఆయా సామ్రాజ్యాలను కుప్పకూలుస్తుంది. కడు పేదరికంలో ఉన్నవారిని కోటీశ్వరులను చేస్తుంది.. తేడా వస్తే అథపాతాళానికి తొక్కేస్తుంది. డబ్బు మీద ఉన్న అత్యాశే ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి తన రూ.1.24 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో.. అందుకుగల కారణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్‌లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో మొదటి సంస్థగా..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్‌తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాలు ఇవే..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్‌ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.ఆరోపణలు.. ఆర్థిక పతనం2019లో ఎన్‌ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.1,24,000 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరందివాలా.. న్యాయ పోరాటాలుబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి. -
Success Story రూ.90 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల ఆదాయం
జీవితంలోపైకి రావాలని, మంచి లాభాలను సాధించాలని సాధారణంగా చాలామంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ తన చుట్టూ ఉండేవారి బాధలు, అనారోగ్యాలను చూసి చలించిపోయి వ్యాపారం ప్రారంభించే వారు చాలా తక్కువ. అదీ అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి మరీ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ (Mohit Nijhawan) అలాంటి వారిలో ఒకరు. ఇంతకీ ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం అంత ఈజీకాదు. ఇందుకు పూర్తి విశ్వాసం, కృషి పట్టుదల ఉండాలి. చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ బయో కెమిస్ట్రీలో పీజీ చేశాడు. ముంబైలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. రూ.90 లక్షల వేతనం. అయితే తన బంధువుల్లో చాలా కేన్సర్ బారిన పడటం, వారిలో చాలా మందికి వైద్య ఖర్చులుగా భారీగా ఉండటం, ఖరీదైన మందులు తీసుకున్న తర్వాత కూడా నయం కాకపోవడం గమనించాడు. ముఖ్యంగా తన సోదరుడు సహా తన దగ్గరి బంధువులు చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతుండటం ఆయనను బాధించింది. అందులోనూ ఒక పిల్లవాడు తన కళ్ల ముందే చనిపోవడం తట్టుకోలేకపోయాడు. ఈ కేన్సర్ కేసులు అంటువ్యాధులు కావని, జీవనశైలి , డైటరీఆహార పదార్థాల వల్ల వస్తున్నాయని గుర్తించాడు. అంతే సంచలన నిర్ణయంతీసుకున్నాడు. 2020లో ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రోగ్రీన్స్ (microgreens) పెంచాలని నిర్ణయించుకున్నాడు.తన స్నేహితుడితో కలిసి 21వ శతాబ్దపు వెజ్జీ స్టార్టప్‌గా చెప్పుకునే మైక్రోగ్రీన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ స్నేహితుడు మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూశాడు. మరోవైపు కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని కూడాఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే చక్కటి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడం మోహిత్ తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు. కానీ మోహిత్ పట్టువీడలేదు. View this post on Instagram A post shared by GREENU: LIVE MicroGreens - A product by Embryonic Greens (@greenu_microgreens) మోహిత్ 2022 సంవత్సరంలో రూ. 30 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. 500 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆవాలు, మెంతులు, ముల్లంగి మొదలైన 21 రకాల విత్తనాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. చండీగఢ్‌కు చెందిన ఒక ఆంకాలజిస్ట్‌కు విక్రయించాడు. అక్కడ మైక్రోగ్రీన్స్ తినిడం వల్ల కొంతమంది రోగుల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తన ఆశయం నెరవేరిందన్న ఉత్సాహం వచ్చింది మోహిత్‌కు. ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు. గ్రీను బ్రాండ్ పేరుతో మైక్రోగ్రీన్లను విక్రయిస్తోంది. బీట్రూట్, ముల్లంగి, తులసి, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు, బ్రోకలీ, ముల్లంగి, బఠానీలు వంటి అనేక రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా, రెస్టారెంట్లు, జిమ్‌లు, కేఫ్‌లు ఈ కంపెనీ కస్టమర్లలో భాగం.చదవండి: చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలుఔత్సాహికులకు శిక్షణమోహిత్ మైక్రోగ్రీన్లను అమ్మడమే కాకుండా, వాటిని పెంచడంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాడు. మైక్రోగ్రీన్స్ అమ్మకాల ద్వారా నెలకు రూ.12 లక్షల వ్యాపారం చేస్తున్నాడు, అంటే ఏటా దాదాపు రూ.1.44 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ.5 లక్షలు. అలాగే ప్రతీ ఏటా రూ.60 లక్షలు లాభం సంపాదిస్తున్నాడు.ఇదీ చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి?విత్తనాలను మట్టి లేకుండా, కేవలం నీటి సహాయంతో ట్రేలలో పెంచుతారు. ఇవి మొలకెత్తిన కొన్ని రోజుల తర్వాత (7 -10 రోజులలోపు), చిన్న చిన్న మొలకలుగా ఉన్నపుడే సలాడ్లు, శాండ్విచ్లు లేదా ఏదైనా ఇతర ఆహారంలో ఉడికించకుండానే ఉపయోగిస్తారు. వీటిల్లో సాధారణ ఆకుకూరల కంటే 40 శాతం ఎక్కువ పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, కేన్సర్ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. వీటికి పెంచడానికి, పొలం లేదా భూమి అవసరం లేదు. నీటి సహాయంతో కేవలం ట్రేలలోనే పెంచుతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి. -
చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలు
సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ కొండమీది కోతినైనాకిందికి దింపవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని, ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడుకావచ్చు. ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ కథే ఇందుకు చక్కటి ఉదాహరణ. 16 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం దిగ్విజయమైంది. తనకంటూ ఒక సొంత బ్రాండ్‌ను ప్రారంభించడానికి దారితీసింది. స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా లాక్డౌన్ అయింది. చాలా మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు, కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు. ఆ హాబీనే తరువాత బిజినెస్‌గా మార్చుకున్నాడు. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో ‘సారామ్’ అనే బ్రాండ్‌ను మొదలు పెట్టాడు. కట్ చేస్తే దిగ్విజయ్ బిజినెస్ కోటి రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా చాక్లెట్లను విక్రయిస్తోంది. సారామ్లో కుల్ఫీలు, కుకీలు కూడా చేరాయి. ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాడు.ఉదయ్‌పూర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూవిభిన్నంగా ఆలోచించేవాడు. ఇందులో భాగంగా కోవిడ్‌లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్ విజయానికి బాటలు వేసింది. తనకెంతో ఇష్టమైన చాక్లెట్‌ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన ఆలోచనను తన సోదరుడు మహవీర్ సింగ్‌తో పంచుకున్నాడు. సోదరుడు కూడా సై అన్నాడు గానీ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలియదు. అందుకే యూట్యూబ్‌ను ఆశ్రయించాడు. పలు సార్లు విఫలమైన తర్వాత పట్టుసాధించాడు. అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు. ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కారు కొన్నారు. ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. ఇక్కడే మనోడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షోరూమ్ ఓనర్లు తమ కస్టమర్లకు ప్రతి కార్ సేల్‌లో ఒకే చాక్లెట్ బాక్స్‌ను అందజేస్తారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్లను విక్రయించడానికి హోటల్ యజమానులు, కార్ షోరూమ్‌లను సంప్రదించాడు.తొలి ఆర్డర్అలా 2021లో దిగ్విజయ్ ఒక కార్ షోరూమ్ నుంచి వెయ్యి రూపాయల చాక్లెట్ల మొదటి ఆర్డర్‌ను అందుకున్నాడు. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. సారామ్ ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్‌గా మారిపోయింది. 2023 నాటికి, సారామ్ రెండు టన్నులకు పైగా చాక్లెట్‌ను విక్రయించింది. ఢిల్లీ, బెంగళూరు, ఉదయపూర్, జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నారు. కేరళ ,తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుమ్, బేర్, జామున్ ఐస్ ఆపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత. స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు."నాకు చాక్లెట్టు అంటే చాలా ఇష్టం అని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడు. క్లాసెస్ ఆన్లైన్లో ఉండటంతో చాలా సమయం దొరికింది. వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే YouTube ట్యుటోరియల్ ద్వారానే ఇది సాధించాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నానని తెలిపాడు. -
ప్రధాని మోదీ మెచ్చిన ‘మిల్లెట్ కేక్’.. దెబ్బకు వ్యాపారం కోట్లకు పడగలెత్తింది
సేల్స్‌మ్యాన్‌గా, ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ కెరియర్లో అంచలంచెలుగా ఎదిగాడు. అయితే పనిలో భాగంగా బేకరి పనులను అర్థం చేసుకోవడానికి బ్రిటానియా, అమూల్ వంటి కంపెనీలను సందర్శించడంతో బేకరీ ఫుడ్స్ తయారీపై ఆసక్తి ఏర్పరుచుకున్నాడు. అలా సొంతంగా వ్యాపారం చేద్దామన్నా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశాలకు వెళ్లి మరీ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. చివరిక బేకరీ పెట్టాడు..అలా మిల్లెట్స్ కేక్ తయారీతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించి..కోట్లకు పడగలెత్తాడు. ఎందరికో యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయ ప్రస్థానం ఎలా జరిగిందంటే..రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పుట్టి పెరిగిన అమిత్ సోనీ ఆభరణాల కళాకారుల కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు. అమిత్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, అనంతరం ఎలక్ట్రానిక్స్ రంగంలో సేల్స్‌మ్యాన్ నుంచి ఈవెంట్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. అలా వివిధ ఉద్యోగాలు చేశాడు. అయితే తన ఉద్యోగంలో భాగంగా బేకరీ పనులను అర్థం చేసుకోవడానికి తరుచుగా బ్రిటానియా, అముల్ వంటి కంపెనీలను సందర్శిస్తుండేవాడు. ఆ నేపథ్యంలో బేకరీ పెట్టాలనే ఆలోచన వచ్చింది అమిత్‌కి. అయితే బేకరీ ఉత్పత్తులను ఎలా తయారుచేస్తారనేది తెలియదు, కానీ బిజినెస్ గురించి మాత్రం బాగా తెలుసు అమిత్‌కి. ఉద్యోగంలో బాగానే రాణిస్తున్నా..వ్యాపారం చేయాలనే కోరికతో 2017లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ముందుగా బేకరీలోని ఆహార పదార్థాల తయారీలో శిక్షణ తీసుకునేందుకు (ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్)కి వెళ్లాడు. తర్వాత థాయిలాండ్ వంటి విదేశాలకు వెళ్లి ఆ రంగంలో మరింత మెరుగులు దిద్దుకున్నాడు. అయితే అమిత్‌కి విదేశాల్లో మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి కానీ తల్లిదండ్రులు ఇక్కడే ఉండాలని పట్టుబట్టడంతో..అలా 2019లో జోథ్‌పూర్‌లో తన సొంత బేకరీ RDz 1983ని ప్రారంభించాడు. మొదట్లో ఇది బ్రెడ్, కేక్‌లను అందించేది. అయితే అనూహ్యంగా ఐసీఏఆర్ రాజస్థాన్ నుంచి బజ్రా చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేయాలనే ఆర్డర్‌తో మిల్లెట్ల వైపుకి ఆకర్షితుడయ్యాడు అమిత్. అయితే మిల్లెట్లో గ్లూటెన్ లేకపోవడంతో కేక్ తయరీ చాలా సవాలుగా మారింది. దాదాపు 96 సార్లు విఫలమయ్యాక చివరికి మిల్లెట్ కేక్‌ని తయారు చేశాడు. 80 కిలో గ్రాముల కేక్‌ని ఓ పది కిలోగ్రాముల ముక్కలుగా విభజించాడు. వాటిని కొంతమంది CAZRI (సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) అధికారులు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)కి తీసుకువెళ్లారు. రెండు రోజుల తర్వాత వీడియోతో కూడిన సందేశం పంపించారు వారు. అమిత్ దాన్ని ఓపెన్ చేసి చూశాకగానీ తెలియలేదు..ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ఆ మిల్లెట్ కేక్‌ను కట్ చేస్తున్నారని. ఆ సమయంలో నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ చౌదరి, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖులు అతని పక్కనే ఉన్నారు. ఆయనలా అమిత్ తయారు చేసిన మిల్లెట్ కేక్ కట్ చేసి ప్రారంభించారో లేదో ఒక్కసారిగా ఆర్డర్లు వెల్లువలా రావడం జరిగింది. ఇక అమిత్ ఎక్కువ కాలం నిల్వ ఉండే కుకీలు, బ్రౌనీలపై దృష్టిసారించాడు. అలా పెర్ల్ మిల్లెట్ కుకీలను అందించే స్థాయికి చేరుకున్నాడు. దీంతో అమిత్ UN సమావేశాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉదయపూర్‌లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశం వంటి ఉన్నత స్థాయి కార్యక్రమాలకు మిల్లెట్ కుకీలను అందించే పెద్ద పెద్ద ఆర్డర్లు అందుకున్నాడు. అంతేగాదు దేశీయంగా దాదాపు వందకి పైగా హోటళ్లలో ఈ మిల్లెట్ కుక్కీలు అమ్ముడయ్యాయి. బహ్రెయిన్, దుబాయ్ వంటి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం అతడి బేకరీ ప్రతిరోజూ 150 కిలోల కుకీలను తయారు చేస్తోంది, అలాగే నెలకు 15 వేలకుపైగా కస్టమర్లకు సర్వ్ చేస్తోంది. ఈ వ్యాపార రంగంలోకి అమిత సోదరుడు ఫిజియోథెరపిస్ట్ అయిన డాక్టర్ సుమిత్ సోనీకూడా చేరారు. ఇలా అమిత్ కుటుంబ బేకరీ బిజినెస్ ఏడాదికి రూ. 1.5 కోట్లను ఆర్జిస్తోంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్ సీఆర్పీఎఫ్ జవాన్లకు మిల్లెట్ కుకీలను అందించే ఆర్డర్ తయారీకి రెడీ అవుతున్నాడు. నిజంగా ఇది మహర్షి మూవీలో హీరో మహేష్ చెప్పినట్లు "సక్సస్ ఈజ్ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ (విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు)" అంటే ఇదే కదా..!. View this post on Instagram A post shared by RD'Z 1983 BAKERY (@rdz_1983) (చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..) -
ఇంటర్ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్కె–4 పసుపు!
చేసే పని మీద శ్రద్ధాసక్తులు మెండుగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించే విజయగాథ రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్ది. పన్నెండో తరగతి ఫెయిల్ అయ్యి వ్యవసాయం చేపట్టిన సచిన్ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడినిచ్చే ఒక చక్కని పసుపు వంగడాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘ఎస్కె–4’. ఈ వంగడం సచిన్‌కు ఉత్తమ ప్లాంట్ బ్రీడర్‌గా, గొప్ప ఆవిష్కర్తగా కీర్తితోపాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎస్కె–4 పసుపు రకాన్ని ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సాగు చేస్తుండటం విశేషం. తాను పండిస్తున్న పసుపు పంటలో మెరుగైన ఫలితాలనిస్తున్న మొక్కల్ని వేరే చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా కొనసాగించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కొత్త వంగడాన్ని ఆయన రూపొందించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ స్థాయి ద్వితీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నారు. ఔషధ విలువలకు పెట్టింది పేరైన పసుపు పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా 30 వంగడాలు సాగులో ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు 70% విస్తీర్ణంలో రాజపురి సేలం వెరైటీని సాగు చేస్తుంటారు. ఇది 20 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా సాగవుతోంది. 2022–23లో మన దేశంలో 11.61 లక్షల టన్నుల పసుపు పండింది. పసుపునకు సంబంధించి ప్రపంచంలోనే భారత్ అత్యధిక ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా!సచిన్ కమలాకర్ కరేకర్ (48) స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్లోలి అనే గ్రామం. చిప్లన్కు 55 కి.మీ. దూరంలో ఈ ఊరు ఉంది. సచిన్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 22 ఏళ్ల వయసు నుంచి గత 26 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 500 వక్క చెట్లు, 50 కొబ్బరి చెట్ల మధ్య పసుపును అంతరపంటగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలన్న ఆకాంక్ష మొదటి నుంచే ఆయనకు ఉంది. నచ్చిన గుణగణాలున్న మొక్కల్ని ఏటేటా వేరుగా సాగు చేస్తూ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. దీన్నే క్లోనల్ సెలక్షన్ మెథడ్ అంటారు.1998 నుంచి కొత్త వంగడంపై కృషిసచిన్ తన సేద్య ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘1998లో నేను ఒక స్థానిక పసుపు రకాన్ని సాగు చేయటం ప్రాంభించాను. పొలంలో కొన్ని మొక్కల పంట కాలం మిగతా వాటికన్నా ముందుగానే ముగుస్తున్నట్లు గుర్తించాను. ఆ మొక్కలు చాలా ఏపుగానూ పెరిగాయి. అట్లా మెరుగ్గా కనిపించిన మొక్కల దుంపలను వెలికితీసి, విడిగా ఉంచాను. ఆ పసుపు దుంపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముదురు రంగులో ఆకర్షణీయంగానూ, చీడపీడలను దీటుగా తట్టుకొని బాగా పెరిగాయి. అధిక దిగుబడి కూడా వచ్చింది. అదే విధంగా ఆ మొక్కల్ని ప్రతి ఏటా సాగు చేస్తూ, మెరుగ్గా ఉన్న మొక్కల పసుపు కొమ్ముల్ని నాటి, మళ్లీ వాటిలో నుంచి మంచి వాటిని ఏరి తర్వాత ఏడాది సాగు చేయటం 2007 వరకు కొనసాగించాను. 2008 నాటికి నాకు నచ్చిన (త్వరగా కోతకు రావటం, ఏపుగా చీడపీడలను తట్టుకొని పెరగటం, అధిక దిగుబడి, దుంప రంగు బాగుండటం.. వంటి) మంచి గుణగణాలున్న మెరుగైన కొత్త వంగడం సిద్ధమైంది. దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, దానికి ఎస్కె–4 అని పేరు పెట్టాను.’కుక్కుమిన్ 4%పచ్చి పసుపు హెక్టారుకు 55–56 టన్నుల దిగుబడినిచ్చే వంగడం ఇది. చాలా ఆకర్షణీయంగా ముదురు ఎరుపు–పసుపు రంగు. దీని పంటకాలం 160–170 రోజులు. అధిక వర్షపాతం గల ప్రాంతానికి అనువైనది. దుంపకుళ్లు తెగులును, ఆకు మచ్చ తెగులును తట్టుకునే గుణం దీనికి ఉంది. నేషనల్ ఇన్నేవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఈ వంగడాన్ని గుర్తించి 2020 ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా దపోలిలోని డాక్టర్ బాలసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ (డిబిఎస్కెకెవి) ఆవరణలో సాగు చేయించింది. హెక్టారుకు పచ్చి పసుపు 56 టన్నుల అధిక దిగుబడి వచ్చింది. 28 రకాల కన్నా ఎస్కె–4 రకం అధిక దిగుబడినిచ్చింది. ఈ పసుపులో కుర్కుమిన్ 4% ఉంది. దీంతో ఈ రకం పసుపు విత్తనాన్ని పరిసర జిల్లాల్లోని రైతులకు సచిన్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ విధంగా ఈ రకం పసుపు సాగు 2021 నాటికే ఎస్కె–4 రకం మహారాష్ట్రలో లక్ష ఎకరాలకు విస్తరించింది. దీంతో పొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ –2001 కింద ఈ సరికొత్త వంగడానికి సంబంధించి సచిన్‌కు ప్రత్యేక జన్యు హక్కులు ఇవ్వమని కోరుతూ ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసింది.ఎస్కె–4 పేరు ఎందుకొచ్చింది?తన ఆవిష్కరణకు మూలమైన స్థానిక వంగడం సంగ్లి కడప వెరైటీ స్పెషల్ కొంకణ్‌ను ఇచ్చింది షెండ్గే కాక అనే రైతు. అందుకని కొత్త వంగడానికి మొదటి అక్షరం ఆయనది, రెండో అక్షరం తనది కలిపి ఎస్కె–4 అని పేరు పెట్టారు. డిబిఎస్కెకెవికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రఫుల్ల మలి మాట్లాడుతూ.. మేం ఈ రకాన్ని రెండేళ్లు వరుసగా సాగు చేసి చూశాం. రాజేంద్ర సోనా అనే రకం మాదిరిగా ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకమని రుజువైంది.రాజేంద్ర సోనా హెక్టారుకు 64 టన్నుల దిగుబడినిచ్చేదైనప్పటికీ దాని విత్తనం అందుబాటులో లేదు. అందువల్ల ఎస్కె–4 రకం ప్రత్యామ్నాయంగా అధిక వర్షపాతం నమోదయ్యే కొంకణ్ ్ర΄ాంతానికి ఇది అనువైనదిగా గుర్తించాం. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని పనితీరు ఎలా ఉంటుందో ఇంకా పరీక్షించాల్సి ఉంది అన్నారు. సింద్‌దుర్గ్, రాయ్‌గడ్, రత్నగిరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. గుహగర్ తాలూకా వేలాంబ్ గ్రామానికి చెందిన విశ్రాం మలి (58) అనే రైతు గత ఏడాది ఈ పంటను సాగు చేయగా ఒక మొక్క కుదురులోని పసుపు 8.15 కిలోల బరువు తూగింది!నర్సరీ పెంచి నాట్లు వేయటం మేలుడాక్టర్ ప్రఫుల్ల మలి ఇంకా ఇలా చెప్పారు.. ఏప్రిల్‌లో నర్సరీ బ్యాగుల్లో పసుపు విత్తనం పెడతాం. జూన్‌లో ఆ మొక్కల్ని పొలంలో నాటుతాం. నాట్లకు ముందు సేంద్రియ ఎరువు వేసి పొలాన్ని దుక్కి చేస్తాం. ఆగస్టులో రెండో దఫా ద్రవ ఎరువును అందిస్తాం. జనవరి ఆఖరు వరకు నీరు ఇస్తుంటాం. ఫిబ్రవరిలో పంట కోత జరుగుతుంది. ప్రతి మొక్కకు సగటున 3.2 కిలోల దుంపలు వస్తాయి. సచిన్ ఈ వంగడాన్ని పదేళ్లుగా రైతులకు ఇస్తున్నారు. దీనితోపాటు దీని యాజమాన్య మెళకువలపై రైతులకు ఆయన తరచూ శిక్షణ ఇస్తున్నారు. పసుపు విత్తనాన్ని నేరుగా పొలంలో నాటే కంటే నర్సరీలో పెంచి నాట్లు వేయటం వల్ల అధిక దిగుబడి వస్తోందని ఇటీవల వరకు గుహాగర్లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన గజేంద్ర పానికర్ అంటున్నారు. విత్తనం 500 మందిరైతులకు ఇచ్చానేను కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్కె–4 రకం పసుపు విత్తనాన్ని రత్నగిరి, సింధుదుర్గ్, రాయగడ్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది రైతులకు ఇచ్చాను. కొత్తగా వేసే రైతులు అతిగా ఆశపడి ఈ రకాన్ని మొదటే ఎక్కువ విస్తీర్ణంలో వేయొద్దు. మొదట ఒక గుంట (వెయ్యి చదరపు అడుగులు) లో వేసి చూడండి. తర్వాత పది గుంటలకు పెంచండి. నేనూ అలాగే చేశా. ఇప్పుడు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఈ ప్రత్యేక పొలాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.- సచిన్ కమలాకర్ కారేకర్, ఎస్కె–4 పసుపు రకం ఆవిష్కర్త, అబ్లోలి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ ద్వితీయ పురస్కార గ్రహీత, ఆవిష్కర్తకు ఆరేళ్లపాటు ప్రత్యేక హక్కులు2023లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) నిర్వహించిన ద్వైవార్షిక గ్రామస్థాయి ఆవిష్కరణలు మరియు అసాధారణ సంప్రదాయ విజ్ఞాన పురస్కారాల 11 వ మహాసభలో రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్కు జాతీయ ద్వితీయ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఎన్ఐఎఫ్ గతంలో దరఖాస్తు ఆధారంగా.. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) 2024 డిసెంబర్లో సచిన్ అభివృద్ధి చేసిన ఎస్కె–4 వంగడానికి ప్రత్యేక వంగడంగా గుర్తింపునిచ్చింది. సచిన్ కమలాకర్ కరేకర్ను ప్లాంట్ బ్రీడర్’గా గుర్తించి ప్రత్యేక హక్కులను ప్రదానం చేసింది. దీని ప్రకారం ఆరేళ్ల పాటు ఈ వంగడాన్ని పండించి, విత్తనాన్ని అమ్ముకునే ప్రత్యేక హక్కు ఆవిష్కర్త అయిన సచిన్‌కు దఖలుపడింది. నిర్వహణ: పంతంగి రాంబాబు ,సాగుబడి డెస్క్ -
పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..!
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!) -
పాపాహోం నుంచి శాటిలైట్ సెంటర్‌కు..
సీతమ్మధార: తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆ బాలిక భవిష్యత్ అంధకారంలో పడిపోతుందనుకున్నారు. అమ్మమ్మ అన్నీ అయి చదివించారు. సీతమ్మధార పాపాహోంలో(Seethammadhara) ఉంటూ చదువుకున్న ఆమె ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేయడం విశేషం. దీంతో త్వరలోనే పాపాహోం ఆవరణలో ఆమెకి ఘనంగా సత్కారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యువతి విజయగాథ మనమూ తెలుసుకుందాం. గూడూరుకు చెందిన భట్టిపాటి ప్రియాంక (21)(Bhattipati Priyanka) విశాఖ జిల్లా తగరపువలసలో మేనమామ వద్ద ఉంటూ చదువుకునేది. 9వ తరగతి చదివే సమయంలో 2017లో పాపాహోంలో చేరింది. సీతమ్మధారలోని డాల్ఫిన్ స్కూల్లో 9, పది చదివింది. ఈమెకి తల్లి లేరు. తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. ప్రియాంక డిప్లమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీ) పూర్తి చేసింది. తర్వాత నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ కళాశాలలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బ్రాంచ్‌లో (సీఏ)లో చేరింది. భీమునిపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో పాపాహోం ఆర్థిక సాయంతోనే డిప్లమో చదివింది. ఈ కళాశాల నుంచి విద్యార్థుల వివరాలు పంపడంతో శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణకు ఎంపికై శిక్షణ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ శిక్షణ పూర్తి అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో అకౌంట్స్‌లో సీహెచ్ఎస్ఎస్ పోస్టులో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమెకి రూ.22 వేల వేతనం అందుతోంది. రాకెట్ లాంచింగ్ ఉద్యోగమే లక్ష్యం.. నేను 2003లో గూడూరులో పుట్టాను. 2008లో నా తల్లిదండ్రులు విడిపోయారు. గూడూరులోని అమ్మమ్మ వద్దే పెరిగాను. విశాఖలోని పాపాహోంలో ఉంటూ డాల్ఫిన్ స్కూల్లో 9వ తరగతిలో చేరాను. అక్కడే పదో తరగతి పూర్తి చేశాను. భీమిలిలో డిప్లమో చేశాను. 2018లో తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రాకెట్ లాంచింగ్ సెంటర్లో ఉద్యోగమే ధ్యేయంగా పని చేస్తున్నాను. గూడురులో అమ్మమ్మ బాగోగులు నేనే చూస్తున్నాను. – ప్రియాంక, బెంగళూరు. -
‘శ్రీ విశ్వశాంతి’ : చేతిలో చిల్లిగవ్వ లేకుండానే కల సాకారం!
‘నీ దగ్గర ఏముంది?’ అనే ప్రశ్నకు తిరుగులేని జవాబు... ‘నా దగ్గర కల ఉంది!’ఆ కలే చేతిలో చిల్లిగవ్వ లేని ఎంతోమందిని విశ్వ విజేతలను చేసింది.‘శ్రీ విశ్వశాంతి’ కల కూడా అలాంటిదే. కొన్ని దశాబ్దాల క్రితం... పేదింటి బిడ్డ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు కన్న కల... శ్రీ విశ్వశాంతి. రవీంద్రుడి ‘విశ్వభారతి’లాంటి విలువైన కల అది. ‘ప్రపంచమంతా ఒకే గూడులో’ అనే నినాదం పునాదిపై ఏర్పాటైన ‘విశ్వభారతి’ తనకు స్ఫూర్తి. ఆరుగురు విద్యార్థులతో మొదలైన విశ్వశాంతి గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగింది. 16 రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విజయ ప్రస్థానం మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటల్లోనే...కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నా దగ్గర కరెన్సీ నోట్లు లేవు. కల మాత్రమే ఉంది. అయినా సరే, చిన్న గుడిసెలో ‘శ్రీ విశ్వశాంతి పాఠశాల ప్రారంభించాను. ఆరుగురు విద్యార్థులతో మొదలైన ఆ పాఠశాల ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లుగా ఎదిగిపోయింది. బలమైన విద్యా వ్యవస్థగా నిర్మాణం అయిన ‘శ్రీ విశ్వశాంతి గ్రామీణ విశ్వ విద్యాలయం’ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది.ఆరోజుల్లో...నేను, మా ఆవిడ ప్రమీలారాణి టీచర్లుగా పనిచేసేవాళ్లం. మా నెల జీతం నూట ఇరవై రూపాయలు. ‘మేము కొత్త స్కూలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’ అని చెప్పినప్పుడు విన్నవారు ‘ఎందుకొచ్చిన రిస్కు...వచ్చిన జీతంతో సర్దుకు పోకుండా’ అని సలహా ఇస్తారేమో?...ఇలాంటి సందేహాలు ఎన్నో వచ్చాయి.‘చాలా విజయాలు భద్ర జీవితాల్లోనే ఆగిపోతాయట!’ అనే మాట గుర్తుకు వచ్చింది. ‘నాకు ఇక్కడ సుఖంగానే ఉంది కదా... రిస్కు తీసుకోవడం ఎందుకు’ అనుకునే చాలామందిలో నేను ఉండపోదల్చుకో లేదు. నాకు ఇష్టమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రు. ఆ మహనీయుడు చెప్పిన విలువైన మాట – ‘అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పుకు భయపడుతుంది’ అయితే నేను మార్పుకు భయపడే రకం కాదు. అందుకే ధైర్యంగా నా కలకు శ్రీకారం చుట్టాను. 1975 ఫిబ్రవరి 22న ఉయ్యూరు పట్ట ణంలో ఒక తాటాకు ΄ పాకలో ‘శ్రీ విశ్వశాంతి’ పాఠశాలను ప్రారంభించాం.‘ఎంతో ఊహిస్తే ఆరుగురు విద్యార్థులేనా!’ అని మేము నిరాశపడిపోలేదు. ‘ఈరోజు ఆరుగురు...రేపు నూరు మంది’ అనుకున్నాము. అది వృథా పోలేదు. మరుసటి ఏడాది నుంచే హాస్టల్‌ను కూడ ప్రారంభించాము. అక్కడ మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ఉయ్యూరు (గండిగుంట) పరిధిలో సువిశాలమైన 80 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన భవన సముదాయంతో విస్తరించింది. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంది. ఎల్కేజీ నుంచి ప్లస్ 2 వరకూ విద్యాబోధన అందిస్తున్నాం. ‘మాదల ప్రమీలారాణి మెమోరియల్ జూనియర్ కళాశాల’ ఏర్పాటు చేశాం. దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 6500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మా గ్రామీణ యూనివర్శిటీపై ప్రత్యక్షంగా 768 మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆరుగురితో మొదలైన విద్యాసంస్థ అందనంత ఎత్తు ఎదగడానికి కారణం ఏమిటి? ‘మన ఆదర్శాలు, అంకితభావాన్ని మరచిపోయినప్పుడు మాత్రమే అపజయం ఎదురవుతుంది’ అంటారు నెహ్రు. పేద విద్యార్థులకు అండగా ఉండాలి అనే ఆదర్శాన్ని, సంస్థ కోసం క్షణక్షణం కష్టపడాలి అనే అంకితభావానికి నేను ఎప్పుడూ దూరం కాలేదు. అదే శ్రీ విశ్వశాంతి విజయ రహస్యం. ‘శ్రీ విశ్వశాంతి ‘గుడ్‌విల్’కు గుడ్ ఎగ్జాంపుల్‌గా నిలిచినా ‘పక్కా కమర్షియల్’ దారిలోకి ఎప్పుడూ వెళ్లలేదు. ఏ ప్రాంతంలో ప్రాంరంభమైందో ఆ ప్రాంతంలోనే పెరిగి, పెద్దై వటవృక్షమై ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులకు నీడను ఇస్తోంది. విద్యాసంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి సింగిల్ బ్రాంచ్గానే నడుపుతున్నాం. సేవాపథంలో...గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి చేయూతఅందించాలనేది మాదల ప్రమీలారాణి కోరిక. ఆమె కోరిక మేరకు ఏటా 300 మందికి పైగా విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీ విశ్వశాంతి నిర్వహిస్తోంది. ‘50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అంతర్జాతీయ ప్రమాణాలు, అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనతో విద్య అందించటం కోసం పాటుపడుతున్నాం. కుమారులు, కోడళ్లు అంతా పాఠశాలలోనే ఉంటూ విద్యా ప్రగతిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చక్కగా చదివితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా దేశ ప్రగతి సాధ్యమవుతుంది’ అంటున్నారు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఫేస్ ప్రోగ్రాంఅధునాతన సౌకర్యాలు, వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ల్యాబ్‌లు, లైబ్రరీలు గ్రామీణ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయి. ‘ఫేస్ప్రోగ్రాం’ పేరుతో విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఐఐటీ, జెఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఎన్డీఏ, నీట్, ఒలంపియాడ్లకు కోచింగ్‌లను అందిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విశ్వశాంతిలో శిక్షణ పొదిన ఎంతోమంది విద్యార్థులు నేవీ, ఆర్మీలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎన్సీసీలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విధానం ఎన్నో ప్రశంసలు అందుకునేలా చేసింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, జెఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది శ్రీవిశ్వశాంతి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ విద్యారత్న’ పురస్కారాన్ని ‘శ్రీవిశ్వశాంతి’ ఫౌండర్ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు అందుకున్నారు. సొంతంగా పాల డైరీచదువుపై మాత్రమే కాదు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా శ్రీ విశ్వశాంతి గ్రామీణ యూనివర్శిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. విద్యార్థులు ఆహ్లాదభరిత వాతావరణంలో గడిపేలా ప్రాంగణం అంతా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. యూనివర్శిటీ సొంతంగా పాల డైరీ నిర్వహిస్తోంది. సమర్థంగా డెయిరీ నిర్వహణకు ‘బెస్ట్ డెయిరీ ఫామ్ ఆఫ్ ఏపీ అవారుర్డును అందుకున్నారు. ఈ యూనివర్శిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.ఇష్టంగా కష్టపడాలిప్రతి విద్యార్థికీ లక్ష్యశుద్ధి ఉండాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది. సమయాన్ని సక్రమంగా వినియోగించు కుంటూ ఇష్టమైన పాఠ్యాంశాలను కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలి. సమయ పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. తమకు అనువైన, ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో నైపుణ్యం సాధించి స్థిరపడాలి. అందుకు సూక్ష్మమైన, సున్నితమైన మార్గాలను అన్వేషించి సాధించుకోవటం అలవర్చుకోవాలి. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని ఇష్టంతో సాధించేందుకు ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. విజయం సాధించటం సులువు అవుతుంది. ఎవరూ పుట్టుకతోనే ఉన్నతులు కారు. జీవితంలో చూపిన అచంచలమైన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నతులను చేస్తుంది. విద్య నేర్పే గురువులు కూడా గుర్తించాల్సింది ఏమిటంటే... గురువు అంటే నిరంతర విద్యార్థి అని అర్థం. గురువు అనే అర్థం చాలా విస్తృతమైనది. ఇది అర్థం కావాలంటే మన పూర్వ అపూర్వ శాస్త్రాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ నేను లైబ్రరీల్లో అనేక పుస్తకాలను చదవటం వల్ల తెలుసుకున్నదే. యుద్ధ అశాంతి నుంచి శ్రీ విశ్వశాంతి చదువుకునే రోజుల్లో లైబ్రరీకి ఎక్కువగా వెళ్లేవాడిని. జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలు చదవటం అంటే ఇష్టం. ఆయన జీవితం స్పూర్తిదాయకంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా మా సోదరుడు కృష్ణమూర్తి 18వ ఏట ఆర్మీలో చేరాడు. అప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉండేవి. ఎందరో సైనికులు చనిపోయారంటూ వార్తలు విని చాలా కలత చెందేవాణ్ణి. యుద్ధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోదనకు, వేదనకు గురవుతున్నాయి. అసలు యుద్ధం ఎందుకు? ఇరు వర్గాల నేతలు కూర్చుని సంప్రదించుకుంటే విశ్వశాంతి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఆ ఆకాంక్ష నుంచే పుట్టిందే శ్రీ విశ్వశాంతి. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలనే తలంపుతో విద్యాసంస్థను నడుపుతున్నాను.– మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా -
డైరెక్టరవుదామనుకుని : మహిళా సినిమాటోగ్రాఫర్ సక్సెస్ స్టోరీ
మేము సైతం అంటూ అనేక రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా పురుషులకే పరిమితం అని భావించే రంగాల్లో ప్రవేశించి ప్రతిభకు జెండర్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కెమెరా మహిళగా వెండి తెరపై అడుగు పెట్టి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఒడిశాకి చెందిన ఫల్గు సత్పతి గురించి తెలుసుకుందాం. దశాబ్దానికి పైగా ఈ వృత్తిలో కొనసాగుతూ తన క్రియేటివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఫల్గుకి ఒడిస్సీ నృత్యం అంటే చిన్నప్పటినుంచీ ఇష్టం ఏర్పడింది. అయిదేళ్ల వయస్సులోనే తల్లి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకుంది. గురువు పల్లవి దాస్ వద్ద శిక్షణ పొందింది. అనేక ప్రదర్శనలిచ్చింది. నృత్యాకారిణిగా రాణించింది. దీంతో పాటు, బాల్యంనుంచే నాటకాల పట్ల ఆకర్షితురాలైంది. బాలనటిగా, బిజయ్ మొహంతి, తాండ్రా రే వంటి అనుభవజ్ఞులతో కలిసి దూరదర్శన్‌లో నటించింది. కనిపించాను. ఈ సందర్భంలోనే వెండితెర వెలుగుల వెనుక ఇంకా చాలామంది ఉంటారని గమనించింది. సినిమాలంటే ఇష్టంగా మారింది. అమ్మమ్మ ఒడియా సినిమాలు చూడటానికి థియేటర్స్‌కి వెళ్లేది. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా , ప్రతీ అంశాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించేది ఫల్గు. ఒకసారి అనుకోకుండా 'కరణ్ అర్జున్' చూసి దర్శకత్వంపై మోజు పెంచుకుంది.ఈ క్రమంలో ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ BPFTIO (బిజు పట్టనాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిశా)గురించి అక్కడ దీనికి సంబంధించిన కోర్సులో చేరాలని ప్రయత్నించింది. కానీ సెలెక్ట్ కాకపోవడంతో సినిమాటోగ్రఫీలో చేరేలా చేసింది. ఎందుకంటే దర్శకుడు తర్వాత కెమెరామన్ పనితీరు అత్యద్భుతమని ఆమె నమ్మకం. అయితే, ఇక్కడ చదువుకుంటున్న క్రమంలో , సినిమా తీయడం వెనుక చాలా మంది నిపుణులు, కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారని ఫల్గు గుర్తించింది. ఇక్కడ చదువు పూర్తైన తరువాత, కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోకి పనిచేసింది. తర్వాత సుశాంత్ మణి, శుభ్రాంశు దాస్‌లాంటి పేరెన్నికగన్న ఛాయాగ్రాహకులతో కలిసి వర్క్ చేసింది.తొలి ప్రాజెక్ట్‌తోనే ప్రశంసలుఫల్గు తొలి స్వతంత్ర ప్రాజెక్ట్ , ఒడియా చిత్రం 'పుష్కర. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇంకా శిక్షా మండల్, ఫౌజీ కాలింగ్ (హిందీ ఫీచర్ ఫిల్మ్) , దివానా దివానీ, హలో ఇన్ లవ్, సపనార పాథే పాథే', 'లవ్ యు జెస్సికా', 'ము తారా కియే' వంటి ఒడియా చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. అనేక రియాలిటీ షోలకు వెబ్ సిరీస్‌లకు కూడా సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది.'బెటర్ హాఫ్' అనే మరాఠీ చిత్రానికి వర్క్ చేసింది. ఫల్గు కెమెరా పనితనానికి నిదర్శనంగా ‘పడే ఆకాశ’ ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది. దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచే అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డా. శ్రుతి మహాపాత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. అంతేకాదు ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కర మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఘనత కూడా ఫల్గుదే కావడం విశేషం. ఇన్స్టిట్యూట్లో పరిచయమైన నటుడు హరా రాత్ని 2013 లో వివాహం చేసుకుంది.ఆకాశమే హద్దు..‘‘మహిళ సినిమాటోగ్రఫీ అనే ఈ వృత్తిని ఎంచుకోవడం అంత సులభం కాదు. శారీరకంగా , మానసికంగా చాలా కష్టపడాలి. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, పోరాడాలసిందే. ఈ విషయంల అత్తమామలు నా కుటుంబం మద్దతు చాలా ఉందని తెలిపింది. ఫల్గు. సమాజంలోని కట్టుబాట్ల నుంచి అమ్మాయిలను విముక్తి పొందనివ్వాలి. గొప్పగా ఆలోచించి, విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించాలి. ఈ ప్రపంచంలో ఏదీ తమ జీవితాల్లో విజయం సాధించకుండా ఆపదని అమ్మాయిలు గ్రహించాలి. ఆకాశమే హద్దు అనే దృఢ సంకల్పంతో ఎదగాలి’’ అంటుంది ఫల్గు. కెరీర్‌కు సంబంధించి మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నదీ అంతే ముఖ్యం అంటుంది. -
అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు
పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్‌లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు -
పెళ్లి, మంచి ఉద్యోగం, 4 సార్లు ఓటమి : ఐఏఎస్ కాజల్ సక్సెస్ స్టోరీ
గొప్ప గొప్ప కలలు అందరూ కంటారు. కానీ సాధించాలన్న ఆశయం ఉన్నవారు, లక్ష్యంతో పని చేసిన వాళ్లు మాత్రమే తమ కలల్ని సాకారం చేసుకుంటారు. క్రమశిక్షణ, కఠోరశ్రమ సవాళ్లను స్వీకరించే లక్షణం, ఫోకస్, డెడికేషన్ ఉన్నవారే లక్ష్య సాధనలో సఫలీ కృతులౌతారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కాజల్ జావ్లా (Kajal Jawla). పెళ్లి, ఉద్యోగ బాధ్యతలను మోస్తూనే సివిల్స్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచారు. స్ఫూర్తిదాకమకమైన కాజల్ జావ్లా సక్సెస్ గురించి తెలుసుకుందామా!కాజల్ జావ్లా ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 2010లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE) పట్టా అందుకుంది. ఆ తరువాత ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో ఉద్యోగం. రూ.23 లక్షల వార్షిక ప్యాకేజీ. ప్రేమించే భర్త. అందమైన కుటుంబం. కానీ ఐఏఎస్ కావాలన్న కల మాత్రం అలాగే ఉండిపోయింది. అందుకే భర్తతో మాట్లాడి, ఆయన మద్దతుతో ఐఏఎస్ కావాలనే తన సంకల్ప సాధనకు నడుం బిగించింది. ఫుల్‌టైమ్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయింది. కార్పొరేట్ ఉద్యోగం నుండి బయటపడి తన సహోద్యోగులు అంతా చిల్ అవుతోంటే కాజల్ మాత్రం రాత్రి ఎనిమిది గంటలకు క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేది. అలా తొమ్మిదేళ్ల పాటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగింది.దేశంలోని అత్యంత గౌరవనీయమైన సివిల్ సర్వెంట్ల ర్యాంకులకు ఎదగాలనే అచంచలమైన సంకల్పంతో పగలూ రాత్రి కష్టపడింది. కానీ అనుకున్నది సాధించేందుకు నాలుగు సార్లు నిరాశను, ఓటమిని భరించాల్సి వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయింది. అయినా పట్టుదల వదలకుండా ఓర్పు, దృఢ సంకల్పంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు సిద్ధమైంది. ఐదోసారి UPSC 2018 పరీక్షలో 28వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడంతో ఆమె కలలు నిజమయ్యాయి.భర్త మద్దతు2012లో 24 సంవత్సరాల వయసులో ఆమె UPSC సన్నాహాలు మొదలు పెట్టింది. ఆమె మొదటి ప్రయత్నం సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు, 2014 ,2016లోనూ అదే రిజల్ట్. ఈ కాలంలో, కాజల్ ఉద్యోగాలు మారడం వివాహం జరిగింది. భర్త ఆశిష్మాలిక్తో తన దీర్ఘకాలిక ఆశయాన్ని వెల్లడించింది. ఆయనిచ్చి సపోర్ట్‌తో గత వైఫల్యాల గురించి ఆలోచించ కుండా, చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది.ఈ ప్రయాణంలో కాజల్ జావ్లాకు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో పనిచేసే భర్త ఆశిష్ మాలిక్ సంపూర్ద మద్దతునిచ్చాడు. ఇంటిపనుల ఉంచి మినహాయింపు నిచ్చి, భర్త తన ప్రిపరేషన్‌కు తగిన సమయం కల్పించారని స్వయంగా కాజల్ ఒక సందర్భంగా తెలిపింది. అంతేకాదు ‘ఢిల్లీలో ఒక చిన్న ఇంట్లో ఉండవాళ్లం కాబట్టి. ఇంటి పనులు తక్కువగా ఉండేవి. ఎక్కువ వంట హడావిడి లేకుండా, ఫ్యాన్సీ భోజనాలకు సాధారణ కిచిడీ లేదా సలాడ్లతో పరిపెట్టు కునే వాళ్లం. తద్వారా ఎక్కువ టైమ్ ప్రిపరేషన్‌కు దొరికేది. ఇంటిని అద్దంలా ఉంచుకోవడం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. పెళ్ళయ్యాక కూడా బ్యాచిలర్స్‌గా బతికాం’ అని చెప్పింది. ఎక్కువ సెలవులు కూడాతీసుకోకుండా, వార్షిక సెలవులను వాడుకుంది. ప్రిలిమ్స్‌కు ఒక వారం ముందు సెలవు 'మెయిన్స్' కోసం 45 రోజుల, పెర్సనల్ టెస్ట్‌కి వారం రోజులు మాత్రమే సెలవు తీసుకుంది. ప్రారంభంలో తన వైఫల్యాలకు కారణం సమయం లేకపోవడమేనని కాజల్ చెప్పింది. ‘సమయం చాలా కీలకం. ప్రిపరేషన్‌కు సరిపడా సమయం లేకపోవడం సవాల్ లాంటిది. నా తొలి వైఫల్యానికి కారణం టైమ్ లేక పోవడమే.’ అంటూ తన అనుభవం గురించి చెప్పింది. ఓటమికి తలవంచకుండా, వైఫల్యానికి గల కారణాలను సమీక్షించుంటూ అచంలచమైన పట్టుదలతో తాను అనుకున్నది సాధించిన కాజల్ తనలాంటి వారెందరికో ప్రేరణగా నిలిచింది. -
రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఢిల్లీలో జీవితం ప్రారంభం..1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.అమెరికాకు తరలివెళ్లి..సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్లో కెరియర్ ప్రారంభించారు.కెరియర్లో ఒడిదొడుకులు1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్-సోవియట్ యూనియర్ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులుఇన్నోవా సొల్యూషన్స్ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. -
12 మందితో మొదలైన పార్లే-జీ.. ప్యాకెట్‌పై ఉన్న పాప ఎవరో తెలుసా?
బిస్కెట్ అంటే గుర్తొచ్చే కంపెనీ.. దశాబ్దాల చరిత్ర కలిగిన కలిగిన సంస్థ, కేవలం 12మందితో ప్రారంభమై.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన బ్రాండ్.. ఇంతకీ ఆ కంపెనీ ఎదనుకుంటున్నారా? అదేనండీ.. అందరికీ సుపరిచయమైన 'పార్లే-జీ'. ఇంతకీ ఈ కంపెనీ ఎలా మొదలైంది. ఈ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.మన దేశంలో చాలామందికి తెలిసిన బిస్కెట్ కంపెనీ 'పార్లే-జీ' (Parle-G). ఈ బిస్కెట్లను తినని వారు బహుశా ఉండరు. ప్రస్తుతం మార్కెట్లో.. లెక్కకు మించిన బిస్కెట్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, ఈ బిస్కెట్లకు (పార్లే-జీ) ఉన్న ఆదరణ మాత్రం ప్రత్యేకం. ప్రతి ఏటా కంపెనీ రూ. 8,000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తూ.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.పార్లే-జీ ప్రస్థానం1929లో స్వదేశీ ఉద్యమం మధ్యలో.. చౌహన్ కుటుంబానికి చెందిన 'మోహన్ లాల్ దయాల్' ముంబైలోని విలే పార్లేలో తొలి పార్లే ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ సమయంలో 12 మందితో.. జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేశారు. అప్పట్లో ఆ యంత్రాల కోసం రూ. 60వేలు ఖర్చు చేశారు. ఆ కంపనీ నేడు.. అనేక ఇతర దేశాలకు విస్తరించింది.'పార్లే-జీ'ని మొదట్లో “పార్లే గ్లూకో” గా పరిచయం చేశారు. కానీ చివరికి బిస్కెట్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని కొనసాగించడానికి దాని పేరును 'పార్లే-జీ'గా మార్చారు. పార్లే-జి లోని G అనే పదం మొదట్లో 'గ్లూకోజ్' ని సూచిస్తుంది, తరువాత అది కంపెనీ బ్రాండ్ నినాదానికి అనుగుణంగా 'జీనియస్'గా మారింది. దాని పేరు అనేక మార్పులకు గురైనప్పటికీ, దాని రుచి, ప్యాకేజింగ్ మాత్రం అలాగే ఉన్నాయి.పార్లే-జీ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరంటే?పార్లే-జీ బిస్కెట్స్ గురించి తెలిసిన చాలామందికి తెలియాల్సిన ప్రశ్న.. ఆ బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న చిన్నారి ఎవరు? అని. కొందరు ఆ పాప ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి అనే భావించారు. మరికొందరు నీరూ దేశ్‌పాండే అని.. ఇంకొందరు గుంజన్ దుండానియా అని అనుకున్నారు.నిజానికి పార్లే బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న పాప కేవలం.. ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ 'మగన్ లాల్ దహియా' ఊహాజనితమే అనే తెలిసింది. మొత్తానికి చాలామందికి దశాబ్దాలుగా తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు జవాబు తెలిసిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్.. జాబితాలో 24 మంది -
పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!
‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’ ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా తీసుకున్నాడో యువకుడు. కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం. అలాగని సాధించిన ఉద్యోగంతో తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్‌గా పనిచేశాడు. ఆరేళ్లలో (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్‌గా నిలిచాడు. ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి ఇందుకు సమాధానం. పదండి అతని స్ఫూర్తిదాయకమైన కెరీర్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని రసిసార్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రేమ్‌సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్‌గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు. ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ సహకారం మరింత బలాన్నిచ్చింది.గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల. ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్ జైలర్‌గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే స్వల్పమార్కులతో పోలీస్ ఉద్యోగం చేజారినా ఐపీఎస్ అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు. మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. యూపీఎస్సీలో (UPSC) AIR 170 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.‘ఉద్యోగం చేసుకుంటూ యూపీఎసీసీకి సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు. ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్ అంటే. అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
కెరీర్లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!
బాలీవుడ్ హీరో గోవింద -సునీత దంపతుల విడాకుల పుకార్లు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టారన్నవార్తల్లో వాస్తవం లేదంటూ నటుడు ఈ ఊహగానాలను కొట్టిపడేశారు. అయితే, గోవిందతోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా మంది గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని మీకు తెలుసా? స్టాండ్-అప్ కమెడియన్ కృష్ణ అభిషేక్ , టీవీ టెలివిజన్ నటి రాగిణి ఖన్నా చాలామంది నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా టెలివిజన్‌లో తన తొలి సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటి సౌమ్య సేథ్ గోవిందాకు మేనకోడలు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నప్పటికీ, ఏ అభిమాని ఆమెను మరచిపోలేరు. వైవాహిక జీవితంలోకి అడుగపెట్టాక అంతులేని కష్టాలు మొదలయ్యాయి. భరించలేని గృహహింస, విడాకులు ఇన్ని కష్టాల మధ్య తనను తాను నిలబెట్టుకుని రాణిస్తోంది? అయితే ఎందుకు గ్లామర్ ప్రపంచానికి దూరమైంది? సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.సౌమ్య సేథ్ 1989 అక్టోబర్ 17న బనారస్‌లో జన్మించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందింది. గోవింద మేనకోడలిగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి. భాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలో ఆమె ఒక అతిధి పాత్రలో నటించింది. ఆ తరువాత 2011లో ‘నవ్య… నయే ధడ్కన్ నయే సవాల్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, నవ్య పేరుతో పాపులర్ అయింది. మహిళా విభాగంలో ఆమె బిగ్ టెలివిజన్ అవార్డులను అందుకుంది. ఆమె తరువాత దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే షోలో టైటిల్ రోల్లో నటించింది. 2013లో MTV వెబ్‌బెడ్‌ను కూడా నిర్వహించింది, తరువాత చక్రవర్తి అశోక సామ్రాట్ అనే షోలో 'కరువాకి' పాత్రను పోషించింది. ఇలా కెరీర్లో పీక్‌లో ఉండగానే2017లో అమెరికాకు చెందిన నటుడు అరుణ్ కపూర్‌ను వెస్టిన్ ఫోర్ట్ లాడర్డేల్ బీచ్ రిసార్ట్‌లో వివాహం చేసుకుంది తరువాత అమెరికాలో స్థిరపడింది. వీరికి ఒక కొడుకు ఐడెన్ పుట్టాడు.ఇదీ చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్ మామూలుగా లేదుగా! ఎక్కడ?“నేను అద్దం ముందు నిలబడినపుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. ఒళ్లంతా గాయాలు.క డుపుతో ఉన్నా కూడా చాలా రోజులు తినలేదు. అసలు కొన్ని రోజులు అద్దం వైపు చూసే ధైర్యం చేయలేకపోయాను. ఒక దశలో చచ్చిపోదామనుకున్నా. కానీ నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తల్లి లేకుండా ఎలా బతుకుతుంది? నేను నన్ను నేను చంపుకోగలను కానీ.. బిడ్డ ఎలా? ఈ ఆలోచనే నాకొడుకు ఐడెన్, నా ప్రాణాన్ని కాపాడింది." అని తెలిపింది. చివరికి పెళ్లైన రెండేళ్లకు 2019లో విడాకులు తీసుకుని ఆ కష్టాల నుంచి బైటపడింది. మరోవైపు ఈ కష్టకాలంలో సౌమ్య సేథ్‌కు తల్లిదండ్రులు వర్జీనియాకు వెళ్లి అండగా నిలిచారు. అలా 2023లో, సౌమ్య ప్రేమకు మరో అవకాశం ఇచ్చి ఆర్కిటెక్ట్ , డిజైనర్ శుభం చుహాడియాను వివాహం చేసుకుంది. తరువాత 33 ఏళ్ల వయసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. వర్జీనియాలో లైసెన్స్ పొందిన రియల్టర్‌గా రాణిస్తోంది. తన తండ్రి, తాత వ్యాపార దక్షతను చూసి తాను కూడా వ్యాపారవేత్త కావాలనే కలలు కనేదాన్నని, చివరికి తన కల నెరవేరిందని ఒక సోషల్‌మీడియా పోస్ట్ ద్వారా చెప్పింది సౌమ్య.సౌమ్య సేథ్ జీవితం, కెరీర్ ఆమె ధైర్యానికి, దృఢత్వానికి చక్కటి నిదర్శనం. కెరీర్ కోల్పోయినా, జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన తలొగ్గక, తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకుంది.తద్వారా లక్షలాది మందికి ప్రేరణగానిలిచింది. -
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్‌లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం! View this post on Instagram A post shared by Deepak G Ponoth (@themillenialcomrade) అప్నియా కో ఫంగాన్లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్‌లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్‌గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్‌ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది. -
‘ఫెవికాల్’ పుట్టిందిలా..
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్‌తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్‌గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రారంభ జీవితం పోరాటాలే..గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.వ్యాపార సామ్రాజ్యానికి పునాదిమోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్‌ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.ఫెవికోల్ ప్రారంభమైందిలా.. 1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణంఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. -
గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని, మూలలను మరచిపోకూడదు. డబ్బు సంపాదించగానే లగ్జరీకి అలవాటుపడే మనుషులున్న ఈ రోజుల్లో కూడా.. వేలకోట్ల రూపాయల కంపెనీ అతని సారథ్యంలో ఉన్నప్పటికీ, నిరాడంబరంగా.. పంచె కట్టుకుని జీవితం గడిపేస్తున్నారు. ఇంతకీ అయన ఎవరు? ఆయన స్థాపించిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులో జన్మించిన 'శ్రీధర్ వెంబు'.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని.. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించారు. కానీ కొన్ని రోజులకు మంచి ఉద్యోగాన్ని వదిలి, ఇండియాకు వచ్చేసారు.ఉద్యోగం వదిలి, భారత్ వచ్చిన తరువాత.. సొంత సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నేడు అందరికి సుపరిచయమైన.. 'జోహో కార్పొరేషన్'. చాలా మంది ప్రజలు మంచి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాలకు, ఆపై విదేశాలకు తరలిపోతున్న సమయంలో వెంబు ఈ ధోరణిని తిప్పికొట్టారు.అమెరికాను విడిచిపెట్టి తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి తిరిగి వచ్చి, అక్కడ నుంచే ఇప్పుడు తన బిలియన్ డాలర్ల కంపెనీని నడుపుతున్నారు. జోహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, కానీ వెంబు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెన్కాసికి సమీపంలోని మారుమూల గ్రామమైన మథలంపారైలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం.. కంపెనీని అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. దీంతో భారత ప్రభుత్వం.. 72వ గణతంత్ర దినోత్సవం నాడు వెంబుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందించింది.గ్రామీణ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలనే.. వెంబు ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్రామాలను వదిలి నగరాలకు ప్రజలు తరచుగా వెళ్లే వలస ధోరణిని తిప్పికొట్టాలనే గ్రామంలో ఆఫీస్ స్టార్ట్ చేసినట్లు శ్రీధర్ వెంబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.వెంబు తెన్కాసిలో ఒక చిన్న కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. ఆ తరువాత మథలంపారైలో ఒక పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, దానిని టెక్ క్యాంపస్‌గా మార్చారు. వెంబు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు. ఆయన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల, డిప్లొమా విద్యార్థులు వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే!శ్రీధర్ వెంబు ప్రారంభించిన.. జోహో కార్పొరేషన్ విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ. కాగా ఈయన ఆస్తి రూ. 28వేలకోట్ల కంటే ఎక్కువని సమాచారం. వేలకోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వెంబు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. రోజువారీ ప్రయాణానికి ఆయన సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సూట్ కాకుండా.. పంచె కట్టుకుంటుటారు. ఇటీవలే 'శ్రీధర్ వెంబు' తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేయనున్నట్లు సమాచారం. -
నీట్లో 720/720.. ధోనీతో లింక్.. ‘మానవ్’ సక్సెస్ స్టోరీ
నీట్ సక్సెస్ స్టోరీస్ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మానవ్ ప్రియదర్శి నీట్లో సాధించిన విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. జార్ఖండ్‌కు చెందిన మానవ్ ప్రియదర్శి(Manav Priyadarshi) కుటుంబాన్ని డాక్టర్ల ఫ్యామిలీ అని అంటారు. ఇప్పటికే ముగ్గురు డాక్టర్లున్న ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మానవ్ ప్రియదర్శి తన ఎంబీబీఎస్ పూర్తిచేశాక నాల్గవ డాక్టర్ కానున్నాడు.చిన్నప్పటి చదువులో ఎంతో చురుకైన మానవ్ ప్రియదర్శి నీట్(NEET) యూజీలో మొదటి ప్రయత్నంలోనే 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకోవడం విశేషం. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న మానవ్ 2024లో జరిగిన నీట్ యూజీ పరీక్షలో జార్ఖండ్‌లో టాపర్‌గా నిలిచాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 57 తెచ్చుకుని, టాప్ 100 నీట్ టాపర్స్‌లో ఒకనిగా నిలిచాడు. నాడు మీడియాతో మానవ్ ప్రియదర్శి మాట్లాడుతూ తనకు టాపర్‌గా నిలుస్తాననే నమ్మకం ఉందని, కానీ స్టేట్ నంబర్ వన్‌గా నిలుస్తానని అనుకోలేదన్నారు.మానవ్ ప్రియదర్శికి ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి(Dhoni) మధ్య ఒక సంబంధం ఉంది. రాంచీలో జేవీఎం శ్యామలీ స్కూలుకు మంచి పేరు ఉంది. ఇదే స్కూలులో ఎంఎస్ ధోనీ చదువుకున్నాడు. ఇప్పుడు ఇదే స్కూలు నుంచి మానవ్ 12వ తరగతి పూర్తి చేశాడు. తాను సాధించిన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని మానవ్ చెప్పుకొచ్చాడు. మానవ్ ప్రియదర్శి నీట్ యూజీ పరీక్షలో 99.9946856 పర్సంటేజీ తెచ్చుకున్నాడు.మానవ్ ప్రియదర్శి తండ్రి సుధీర్ కుమార్ రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్(Physics professor). మానవ్ పెద్దక్క డాక్టర్ నిమిషా ప్రియ భాగల్పూర్ మెడికల్ కాలేజీలో డాక్టర్. మానవ్ చిన్నాన్న డాక్టర్ ప్రిన్స్ చంద్రశేఖర్ సహరసాలో మెడికల్ ఆఫీసర్. మానస్ మామ డాక్టర్ రాజీవ్ రంజన్ రాంచీ ప్రభుత ఆస్పత్రి వైద్యులు. మానవ్ మీడియాతో మాట్లాడుతూ విజయానికి దగ్గరి దారులుండవని, లక్ష్యాన్ని నిర్థారించుకుని, పట్టుదలతో చదివితే ఓటమి ఎదురు కాదన్నాడు. ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
ఒకప్పుడు సుజుకీ సంస్థ నమ్మని మొదటి బిలియనీర్!
దృఢ సంకల్పం, మనం కనే కలలపై అచంచల విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త బినోద్ చౌదరి నిరూపించారు. ఆయన పూర్వీకులు రాజస్థాన్ నుంచి నేపాల్‌లోని ఖాట్మండుకు వలస వెళ్లడంతో అక్కడే స్థిరపడి టెక్స్టైల్ వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నేపాల్‌లో తొలి బిలియనీర్‌గా మారారు. బిజినెస్ గురించి ఆయన అవలంబిస్తున్న విధానాలు, చేస్తున్న వ్యాపారాలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.బినోద్ చౌదరి నేపాల్‌లోని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ఇండియాలోని రాజస్థాన్ నుంచి చాలా ఏళ్ల కిందటే వలస వెళ్లారు. 1934లో నేపాల్-బిహార్ భూకంపం తరువాత బినోద్ తాత బురమల్దాస్ చౌదరి తన 20వ ఏటా టెక్స్టైల్ వ్యాపారం ప్రారంభించారు. నేపాల్‌లో అధికారికంగా నమోదు చేయబడిన దుస్తుల కంపెనీని ప్రారంభించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. బినోద్ తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి తాత స్థాపించిన వస్త్ర వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ వర్తక సంస్థలను ప్రారంభించారు. 1968లో లుంకరణ్ దాస్ చౌదరి అరుణ్ ఎంపోరియం అనే రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఇది అత్యంత విజయవంతమైన సంస్థగా నిలిచింది.పద్దెనిమిదో ఏటా బాధ్యతలుపద్దెనిమిదేళ్ల వయసులో బినోద్ చౌదరి చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి ఇండియా రావాలని నిర్ణయించుకున్నారు. కాని అతని తండ్రి గుండె జబ్బుతో బాధపడుతుండడంతో కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించలేరని డాక్టర్ చెప్పారు. దాంతో కుటుంబ బాధ్యతతోపాటు వ్యాపారాలు చూసుకోవాల్సి వచ్చింది. తాత స్థాపించి, తండ్రి అభివృద్ధి చేసిన వ్యాపారం పగ్గాలు బినోద్ అందుకున్నారు. ఈ సంఘటనపై బినోద్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..‘రాత్రికి రాత్రే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు వేరే ఆప్షన్ లేదు. కానీ అది నన్ను మరింత కఠినమైన వ్యక్తిగా మార్చింది’ అని అన్నారు.తొలుత నేపాల్‌కు జపాన్ సుజుకీ కార్లను దిగుమతి చేసుకొని ఆ సంస్థ కార్లకు డీలర్షిప్ దక్కించుకొని ఆటోమొబైల్ విభాగంలోకి అడుగుపెట్టాలని బినోద్ భావించారు. కానీ తాను వస్త్ర వ్యాపారి కాబట్టి సుజుకీ సంస్థ తనను నమ్మలేదు. అయినా వారిని ఒప్పించి నేపాల్‌లో సుజుకీ ఉత్పత్తులు విక్రయించడానికి ట్రయల్ డీలర్ షిప్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో ఎక్కువ కార్లు అమ్మితే పూర్తి డీలర్షిప్ లభిస్తుంది. దాంతో అనుకున్న విధంగానే అత్యధిక కార్లు సేల్ చేసి డీలర్షిప్ పొందారు. తర్వాత కాపర్ ఫ్లోర్ అని పిలువబడే డిస్కోటెక్ కంపెనీను స్థాపించారు. ఈ క్లబ్‌ను సందర్శించిన అనేక మంది సంపన్నుల కారణంగా కంపెనీ భారీ విజయం సాధించింది. 1979లో జపనీస్ ఎలక్ట్రానిక్ సంస్థ నేషనల్ పానాసోనిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.వై వై నూడుల్స్ తయారీబినోద్ చౌదరి తన 23వ ఏటా ఒకసారి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ చాలామంది నూడుల్స్ తినడం, వాటిని కొనుగోలు చేయడం గమనించాడు. వెంటనే నూడుల్స్ అమ్మాలనే ఆలోచన చౌదరికి వచ్చింది. నేపాల్లోనూ థాయ్ నూడుల్స్‌పై మక్కువ ఉందని గ్రహించారు. థాయ్‌లాండ్‌లోని నూడుల్స్‌ను ఉత్పత్తి చేసే థాయ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఫ్యాక్టరీ కంపెనీ లిమిటెడ్‌ను సందర్శించారు. ఆ కంపెనీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని నేపాల్‌లో ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ వై వైను ప్రారంభించారు. ఈ కంపెనీ చాలా తక్కువ సమయంలోనే భారీగా విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. క్లబ్‌ను నిర్వహించడం, తన తండ్రి స్థాపించిన అరుణ్ ఎంపోరియం నడపడం తనకు ఎన్నో వ్యాపార విషయాలు నేర్పించాయని బినోద్ తెలిపారు.పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక1979లో అతని నూడుల్స్ కంపెనీకి నేపాల్ ప్రభుత్వం నుంచి లైసెన్స్ అవసరం అయింది. ఆ సమయంలో సూర్య బహదూర్ థాపా అధికారంలో ఉన్నారు. అతను చౌదరిని తన పరిపాలనకు, ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరగా వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌదరి దేశానికి గణనీయమైన కృషి చేశారని పార్టీ పేర్కొంది. డిసెంబర్ 2022లో పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఇతర వ్యాపారాలు1995లో నబిల్ బ్యాంకులో దుబాయ్ ప్రభుత్వ నియంత్రణ వాటాను చౌదరి కొనుగోలు చేశారు. 1990లో సింగపూర్‌లో సినోవేషన్ గ్రూప్‌ను ప్రారంభించారు. హోటళ్లు, రిసార్టులు, వన్యప్రాణులు, పర్యాటకం, ఎఫ్ఎంసీజీ (ఫుడ్ అండ్ బేవరేజెస్), రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఈ కంపెనీ సర్వీసు అందిస్తోంది. తాజ్ హోటల్స్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్స్ కోసం చౌదరి చర్చలు జరిపారు. బినోద్ చౌదరి నాయకత్వంలో చౌదరి గ్రూప్ టూరిజం, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, విద్యతో సహా వివిధ విభాగాల్లో సర్వీసులు అందిస్తోంది. దాదాపు 30కి పైగా దేశాల్లో విస్తరించింది. నేపాల్‌లో ఇతర పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు సురక్షితమైన ప్రదేశంగా భావించేలా చేస్తుండడంతో బినోద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులకు అనుకూలంగా ఉండాలని, సంపద సృష్టి, ఆంత్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించాలని తెలిపారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలుటాటా, బచ్చన్‌లే ఆదర్శంబాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దివంగత పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా ఇద్దరు ప్రముఖులను బినోద్ ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ తీవ్ర సంక్షోభంలో కూడా తననుతాను ఎలా మోటివేట్ చేసుకున్నారో నిత్యం గుర్తు చేసుకుంటానని తెలిపారు. మరోవైపు భారత్ ఎన్నో వ్యాపారాలు ప్రారంభించిన జేఆర్డీ టాటా దార్శనిక నాయకత్వం, నైతిక వ్యాపార విధానాలను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నారు. -
భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించాలనే సంకల్పం ఉంటే సరిపోదు.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఓపికతో కృషి చేయాలి. అలా ఆత్మవిశ్వసంతో విజయ తీరాలకు చేరుకున్న స్ఫూర్తిదాతలెందరో ఉన్నారు. అలా తన జీవితంలో ఒక బిగ్ డ్రీమ్ కోసం ఎవరూ ఊహించని విధంగా సాహసోపేతంగా ప్రతిభను చాటుకున్న ఒక ధీర గురించి తెలుసు కుందాం రండి..!ఆమె పేరే పూజా యాదవ్. హర్యానాకు చెందిన పూజా పట్టుదలగా ఎదిగి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. 1998లో హర్యానాలోని సోనిపట్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె సోనిపట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బయోటెక్నాలజీలో బీటెక్, జీ, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. అందివచ్చిన అవకాశాలతో కెనడా, జర్మనీలో మంచి వేతనంతో ఉద్యోగాలు చేశారు. కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉద్యోగం చేయాల్చి వచ్చినా, ఐపీఎస్(IPS) అవ్వాలనే ఆశయం మాత్రం నిరంతరం పూజా మదిలో మెదులుతూనే ఉంది. దీనికితోడు దేశాభివృద్ధికి తోడ్పడాలనే బలమైన కోరిక ఉంది. మొదటి నుంచీ, ఆమె తన దేశానికి సేవచేయాలని కోరిక సివిల్ సర్వీసెస్ పరీక్షకు (UPSC వైపు నడిపించింది. అంతే వన్ ఫైన్‌మార్నింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఉద్యోగం వదిలేసి భారత దేశానికి తిరిగి వచ్చింది. సివిల్స్ ప్రిపరేషన్ (మొదలు పెట్టింది. కానీ ఇది ఆమె అనుకున్నంత సులువుగా సాగలేదు. ఒకవైపు పూజా కుటుంబం ఆర్థిక పరిస్థితి, మరోవైపు చదువుకి అయ్యే ఖర్చులు ఇలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఐపీఎస్ కావాలనే నిర్ణయానికి కుటుంబంలో అందరూ తోడుగా నిలిచారు.ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్రిసెప్షనిస్టుగా పనిచేస్తూనే,ఒకవైపు సిపిల్స్కు ప్రిపేర్ అవుతూనే,తన ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు ట్యూషన్లు చెప్పింది. దీంతోపాటు రిసెప్షనిస్టుగా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయింది. తొలి ప్రయత్నం విఫలమైంది. అయినా పట్టువీడలేదు. నిరాశపడకుంగా, ఏకాగ్రతతో తపస్సులా చేసింది. చివరికి ఆమె కష్టం వృధా పోలేదు.సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరడం ద్వారా పౌరుల జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2018 కేడర్‌లో IPSగా నియమితురాలు కావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సంతోషంగా చెప్పింది పూజా. 2021లో స్నేహితుడు వికల్ప్ భరద్వాజ్‌ను ముస్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో సాగిన పరిచయం పెళ్లికి దారి తీసింది. ప్రస్తుతం గుజరాత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. వృత్తిబాధ్యలతోపాటు, పూజ యాదవ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో 3.28 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియాను మించినది లేదు అని నమ్మేవారిలో పూజా యాదవ్ ఒకరు. చదవండి: Maha Kumbh Mela అద్భుతమైన అనుభవం: నీనా గుప్తా ప్రశంసలు -
నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..
ఉద్యోగం కన్నా ఉపాధి మార్గం ఉత్తమం అని కొందరు అంటుంటారు. ఈ దిశగా పయనిస్తూ చాలామంది విజయం సాధించారు. ఇదే తరహాలో ముందడుగు వేసిన ఒక యువకుడు అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. అందరికి స్ఫూర్తిని అందిస్తున్నాడు. మరి ఆ యువకుడు ఎవరో ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఇటీవలి కాలంలో పర్యాటకరంగ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలామందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని చెబుతుంటారు. పర్యాటకరంగం అభివృద్ధి కారణంగా గుజరాత్‌లోని యువత నూతన స్టార్టప్(New startup)లతో జీవనోపాధి పొందుతున్నారు. అలాంటివాటిలో ఒకటే టాక్సీ సర్వీస్ నిర్వహణ.కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారు టాక్సీ ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తుంటారు. టాక్సీ బుక్ చేసుకుని పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తుంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక గ్యారేజీలో పనిచేసే సందీప్ ప్రజాపతి ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించాడు. అతనుంటున్న ప్రాంతానికి సమీపంలోని ద్వారకతో పాటు శివరాజ్‌పూర్ బీచ్, సుదర్శన్ సేతు, హర్షద్ అండ్ భన్వాడ్ తదితర పర్యాటక ప్రదేశాలకు(tourist places) ట్యాక్సీని నడపడం ప్రారంభించాడు. దీనికి అనతి కాలంలోనే పరిమితమైన ఆదరణ దక్కింది.సందీప్ ప్రజాపతి గుజరాత్(Gujarat)లో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాల గురించి అధ్యయనం చేశాడు. ‘ఖుషి క్యాబ్’ పేరుతో టాక్సీ సర్వీస్ మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని వ్యాపారం(Business) అభివృద్ధి చెందింది. ప్రస్తుతం నాలుగు ట్యాక్సీలు, ఎనిమిది మంది డ్రైవర్లతో సందీప్ ప్రజాపతి వ్యాపారం అందరూ మెచ్చుకునేలా నడుస్తోంది. తన కార్లకోసం గ్యారేజీని ఏర్పాటు చేసిన సందీప్ ఇద్దరు వర్కర్లను కూడా నియమించుకున్నాడు. కిలోమీటరుకు రూ. 10 నుండి రూ. 15 వరకూ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నాడు. గతంలో మెకానిక్‌గా పనిచేస్తూ నెలకు రూ. 10 వేలు సంపాదించే సందీప్ నేడు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నాడు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం -
ఫ్యాషన్‌తో కల సాకారం చేసుకున్న తాన్యా
అప్పటి వరకు అమ్మనాన్న, కుటుంబ సంరక్షణలో సాఫీగా సాగిపోయే జీవితం ఒక్కసారిగా తలకిందులైతే..! 16 ఏళ్ళ వయసులో తాన్యా జీవితం అలాగే అయ్యింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, తండ్రి వదిలేసి వెళ్లటంతో తల్లి దేవేశ్వరి నాయల్ తాన్యాను, ఆమె తమ్ముడిని పెంచటానికి అనేక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొంది. ఆ సమయంలో కూలిపోతున్న కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి తాన్యా తల్లికి చేదోడుగా ఉండి, తను కూడా సొంతకాళ్లపై నిలబడింది. ఫ్యాషన్ డిజైనర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది.జీవితంలోని ఏదో ఒక దశలో చీకటి క్షణాలు కమ్ముకుంటాయి. ఇలాంటప్పుడు కూడగట్టుకున్న ధైర్యం నిలిచిన విధానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. తనను తాను నిలదొక్కుకోవడమే కాకుండా తల్లికి చేదోడుగా ఉంటూ ఎదిగిన తాన్యా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఓ పాఠం.ముంచెత్తే సవాళ్లుపదహారేళ్ల వయసు అంటే ఎన్నో కలలతో కూడుకున్నది. కుటుంబం నుంచి భద్రతను కోరుకునే కాలం. అలాంటి సమయంలో ఇల్లు అభద్రతలో కూరుకు΄ోయింది. వయసులో ఉండటం కారణంగా చుట్టూ నిండా ముంచెత్తే సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, అచంచలమైన స్ఫూర్తితో, ఆమె తన పరిస్థితుల సంక్లిష్టతలను బ్యాలెన్స్ చేసుకోగలిగింది. సరైన చదువు లేకపోవడంతో తగిన ఉపాధి దొరకక దేవేశ్వరినాయల్ చాలా కష్టపడేది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి ఆమె తట్టుకోలేకపోయేది. ఈ క్లిష్ట సమయంలో తాన్య ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అభ్యసిస్తూనే చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యతను తీసుకుంది. ఇంతలో, కొత్త అవకాశాల కోసం తమ ఇంటిని వదిలిపెట్టారు. తాన్య నాటి రోజులను గుర్తుచేసుకుంటూ–‘పరిచయస్తుల ద్వారా మా అమ్మతో కలిసి రాష్ట్ర దూరదర్శన్ కేంద్రానికి చేరుకున్నాను. అక్కడ, గిరిజనుల దుస్తులను డిజైన్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి సెంటర్ డైరెక్టర్ అనుపమ్ జైన్, ఆమె తల్లి మధ్య జరిగిన సంభాషణలో నాకో మార్గం కనిపించింది. దూరదర్శన్ సిబ్బందికి ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జైన్ మాతో చెప్పింది. ఇది మా జీవితాలకు ఒక మలుపుగా మారింది’ అంటుంది తాన్యా.అంకిత భావందేవేశ్వరి గర్వాలీ, హిందీ భాష రెండింటిలోనూ నిష్ణాతులు. ఆమె భాషా ప్రావీణ్యం దూరదర్శన్ లోని ఒక అధికారి దృష్టిని ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది స్థానిక కళాకారులు హిందీ రాకపోవడంతో ఇబ్బంది పడుతుండేవారు. వారి ఆలోచనలను హిందీలోకి అనువదించడం ద్వారా దేవేశ్వరి భాషా అంతరాన్ని తగ్గించేవారు. అలా దేవేశ్వరి, తాన్య స్థిరమైన ఆదాయం పొందడం అక్కడ నుంచే మొదలైంది. తాన్య అంకితభావం, నైపుణ్యం దూరదర్శన్ కేంద్రంలో కళాకారుల కోసం దుస్తులను రూపొందించే అవకాశాన్ని కూడా సంపాదించిపెట్టింది. కుటుంబం ప్రధాన జీవనోపాధిగా ఆమె పాత్రను మరింత పటిష్టం చేసింది. ఎంతోమందికి ఇబ్బంది అనిపించే బాధ్యతను తాన్యా అతి చిన్న వయసులోనే అలా తీసుకుంది. (కీర్తి సురేష్ మెహిందీ లెహెంగా విశేషాలు, ఫోటోలు వైరల్)సామాజికంగా ఉన్నతంగా!చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నప్పుడు, దేవేశ్వరి గుండెలో ఆమె మాజీ భర్త పట్ల ద్వేషం ఉండేది. ఆమె తన గౌరవాన్ని తిరిగి పొందాలని చదువుతో తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలనుకుంది. నిశ్శబ్ద ప్రతీకారంతోనే సామాజికంగా ఉన్నతంగా నిలబడాలని ఆశించింది. వివిధ మార్గాల్లో ఆదాయ వనరులతో ఆమె తాన్య, తరుణ్‌ను మర్చంట్ నేవీలోకి పంపగలిగింది. పోరాటం నుండి విజయం వరకు తాన్య ప్రయాణం అనేక మైలురాళ్లతో సాగింది. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె పేరు పొందుపరచడం. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్!)నేడు, తాన్య తన స్వంత సంస్థ అయిన ‘తంతి’ వ్యవస్థాపకురాలు. ఈ పదం సంస్కృతం నుండి తీసుకున్నది. ఒక చిన్న వెంచర్‌గా ప్రారంభమైన ‘తంతి’ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. డిజైనర్లు, టైలర్లు, మహిళలతో సహా 53 మందికి వ్యాపారం ద్వారా ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాఖండ్‌లో తాన్యా నాయల్ పేరు ఇప్పుడు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆ పేరు ఒక్కటి చాలు, ఆమె స్థాయి ఏంటో ఇట్టే చెప్పేస్తారు. -
యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు
కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్గా డాక్టర్ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్‌గా గుర్తింపు సాధించారు. – రాయదుర్గంపేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. పేటెంట్ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. – డాక్టర్ ముప్పిడి రాంబాబు, ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం మంజూరైన పేటెంట్స్.. 2025లో టేబుల్‌టాప్ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్ 2024లో లెదర్, వుడ్బర్డ్ టాయ్, ఫిల్లింగ్, వుడ్ పెన్‌స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్ వాల్ హ్యాంగింగ్, న్యూస్‌పేపర్ బాస్కెట్, డెకరేటివ్ యాక్సెసరీస్ ఫర్ టేబుల్‌టాప్ టాయ్స్, ట్రెక్కింగ్ బ్యాక్‌ప్యాక్, జ్యువెలరీ బాక్స్కేస్. పీహెచ్డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అకడమిక్ కన్సల్టెంట్, జూట్బోర్డు ప్యానెల్ డిజైనర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్ బోర్డులో జైనర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. అవార్డులు, పురస్కారాలు.. 2024లో పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 2023లో పికాక్ అవార్డు (తిరుపతి ఆర్ట్ సొసైటీ, ఎక్స్‌లెన్స్ ఇన్ రివ్యూ అవార్డు) 2018 జాతీయ సంజీవ్‌దేవ్ అవార్డు2017లో ప్రమోద్ కుమార్ చటర్జీ జాతీయ అవార్డు 2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు -
హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈసక్సెస్ అంత ఈజీగారాలేదు. సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరి నుంచి 20వేల రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అపుడు 15 ఏళ్ల వయస్సులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్‌గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్‌కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో కోల్‌కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ. అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత గ్లోబల్ బ్రాండ్ ప్రస్తానానికి పునాది పడింది. ఇక అప్పటినుంచి అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో తన తొలి కలెక్షన్‌ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్‌లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్‌లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.డిప్రెషన్, ఆత్మహత్యాయత్నంతాను యుక్తవయసులో డిప్రెషన్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లుసబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్‌స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డుఅసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్డోర్ఫ్తో ఇంటర్న్‌షిప్ కోసం లండన్. 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్‌లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్‌షాప్‌కు దారితీసింది.2004లో మయామి ఫ్యాషన్ వీక్‌లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుప్రపంచవ్యాప్త గుర్తింపు2005లో ది నాయర్ సిస్టర్స్‌ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్‌లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్‌ను రూపొందించారు, ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్తో భాగస్వామిగా పనిచేశాడు.బ్రైడల్ కలెక్షన్‌తో పాపులర్2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్‌ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు.హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు. బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్ లాంటి వర్క్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్ సినిమాలకుసబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,లాగ చునారి మే దాగ్,రావణ్, గుజారిష్, పా,నో వన్ కిల్డ్ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ అందించారు.ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక అంబానీ సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. -
ఒడిశా నుంచి దుబాయ్: సక్సెస్ కోసం 17 ఏళ్ళు
కష్టాల సుడిగుండాలు దాటి.. సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 'సౌమేంద్ర జెన' (Soumendra Jena). ఓ చిన్న ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఇప్పుడు దుబాయ్‌లో విలాసవంతమైన భవనం, పోర్స్చే టైకాన్, జీ వ్యాగన్ బ్రబస్ 800 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల తన స్ఫూర్తిదాయకమైన విజయగాథను పంచుకోవడానికి ఫోటోలను షేర్ చేశారు.సౌమేంద్ర జెన తన ఎక్స్ ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫొటోలో చిన్న ఇల్లు, మరో ఫోటోలో విలాసవంతమైన ఇల్లు, దాని ముందర ఖరీదైన కార్లు ఉన్నాయి. అప్పట్లో ఇది నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. 12వ తరగతి వరకు (1988 నుంచి 2006 వరకు) ఇక్కడే చదువుకున్నాను. నా జ్ఞాపకాల కోసం మళ్ళీ 2021లో ఇక్కడికి వచ్చాను.ఇప్పుడు దుబాయ్‌లో నాకు విలాసవంతమైన ఇల్లు ఉంది. కార్లు ఉన్నాయి. ఇదంతా.. నా 17 సంవత్సరాల శ్రమ, నిద్రలేని రాత్రులు వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. విజయం సాధించడనికి సమయం పడుతుంది. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు అని అన్నారు.సోషల్ మీడియాలో సౌమేంద్ర జెనా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 17 ఏళ్లలో మీరు ఏమి చేశారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు నేను నా కోసం ఇల్లు నిర్మించుకోలేకపోతున్నానని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు, విజయానికి సమయం, కృషి, అదృష్టం, సహాయం అన్నీ అవసరం. నువ్వు దుబాయ్‌లో ఉన్నావు. అదే ఒడిశాలో ఉండి ఉంటే ఇలా సక్సెస్ సాధించడం కష్టమయ్యేదని అన్నారు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపుసౌమేంద్ర జెన ఫైనాన్స్ సెక్టార్లో ఒక ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 4,87,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఆర్ధికపరమైన విషయాలను, పెట్టుబడికి సంబంధించిన సలహాలను ఇస్తూ ఉంటాడు.This was my home back then—a small town in Odisha, Rourkela, where I was born, grew up, and studied till class 12 (1988-2006). Revisited in 2021 for the memories!Today, my home in Dubai tells the story of 17 years of relentless hard work, sleepless nights, and no shortcuts.… pic.twitter.com/nw5tCdtwKE— Soumendra Jena (@soamjena) January 24, 2025 -
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్‌ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్‌కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్‌ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో డివిజనల్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్‌లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా
చదివింది 10వ తరగతి మాత్రమే. పదహారేళ్లకే పెళ్లి.. ముగ్గురు పిల్లలకు తల్లి. వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ కూడా కాదు.కానీ ఏదో సాధించాలనే కోరిక, తపన ఆమెను ఉన్నత స్థితిలో నిలబెట్టింది. ఆమె మరెవ్వరో కాదు అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన సరస్వతి. 'ప్యాడ్ ఉమెన్' గా పేరు తెచ్చుకుంది. 'లఖ్పతి దీదీ'లలో ఒకరిగా గుర్తింపు పొందారు. చేయూత నిస్తే అట్టడుగు స్థాయి సాధికారత సాధించగలరు అనడానికి నిదర్శనంగా మారింది. తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్ల తయారీ యంత్రాన్ని కనుగొన్న తమిళనాడుకు చెందిన సామాజిక వ్యవస్థాపకుడు అరుణాచలం మురుగనాథంలా అవతరించి నలుగురికి స్ఫూర్తినిస్తోంది.16 ఏళ్ల వయసులోనే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలోని బాద్పురా గ్రామంలోకి ఒక పేద కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది సరస్వతి భాటి. ఇది చాలా వెనుబడిన గ్రామం. భర్త మోను భాటి ఎలక్ట్రీషియన్. ముగ్గురు పిల్లల పెంపకంలో మునిగిపోతూనే, చుట్టుపక్కల గ్రామాల్లోని చాలా విషయాలను గమనించేది ముఖ్యంగామహిళలు శానిటరీ న్యాప్కిన్లు దొరకడం చాలా కష్టం. అస్సలు ఋతుస్రావం గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడటమే ఉండదు. ఈ పరిస్థితే ఆమెను ఆలోచించజేసింది.చిన్నప్పటినుంచి చదువుకోవడం అంటే సరస్వతికి చాలా ఇష్టం. హర్యానాలోని గ్రామాల్లో మాదిరిగానే, ఆమెపుట్టిన గ్రామంలో కూడా బాలికల విద్యకు పెద్దగా ప్రాముఖ్యతలేదు. ఈ నేపథ్యంలోనే చిన్నవయసులోనే పెళ్లీ, పిల్లలు. సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఏదైనా సాధించాలని ఆశ పడింది. 2019లో స్వయం సహాయక బృందంలో చేరాలనుకుంటే దీనికి భర్త ఒప్పుకోలేదు. ‘నేను సంపాదిస్తున్నాగా..నీకెందుకు ఇవన్నీ’ అన్నాడు. కానీ ఏదైనా చేయాలనుకుంటే.. ధైర్యంగా ముందుకు పోవాలి అన్న అమ్మమ్మ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. మొత్తానికి 2020లో, ఆమె గ్రామంలోని సూర్యోదయ స్వయం సహాయక సంఘంలో చేరింది. ఈ అడుగే ఆమె జీవితం మలుపు తిప్పింది. .మహిళలు, బ్యాంకింగ్, ఆర్థిక స్థిరత్వం, పెట్టబడులు, వ్యాపార మెళకువలు గురించి తెలుసుకుంది.ఇంతలో లాక్డౌన్ వచ్చింది. దూకాణాలు బంద్. ఎక్కడా కూరగాయలు దొరకలేదు. ఆసమయంలో ఊరగాయలు తయారు చేసి విక్రయిస్తే బావుంటుంది కదా ఆలోచించింది. మరో పదిమంది మహిళలతో కలిసి, వెల్లుల్లి, అల్లం, మామిడి లాంటి పచ్చళ్ల తయారీని మొదలు పెట్టింది. మహిళలతో సమీపంలోని గ్రామాల్లో ప్రచారం చేసుకుంది. తొందర్లనే ఆర్డర్లు రావడం మొదలైనాయి. ఇక్కడితో ఆగిపోలేదు.ఇది ఇలా సాగుతుండగానే 2021లో సరస్వతి గ్రామంలో ఒక సౌందర్య సాధనాల దుకాణాన్ని ప్రారంభించింది. బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లను చాలా తక్కువ మంది మహిళలు కొనుగోలు చేస్తున్నారని గమనించింది. ఇవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది మహిళలు ఇంట్లో వస్త్రాన్ని వాడతారని, శుభత్ర పాటించకపోవండం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, వీటి వల్ల ఇబ్బందులకు కూడా తెలుసుకుంది. దీంతో సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్లను తానే ఎందుకు తయారు చేయకూడదని ఆలోచించింది. ఈ ఆలోచనను వాస్తవంగా మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో, ఈ దుకాణాన్ని మూసివేసి, తన కొత్త వెంచర్ పై దృష్టి పెట్టింది. ఈ ఆలోచనకు భర్త పూర్తి మద్దతు ఇవ్వడం విశేషం.మొదట్లోవాటిని కొనుగోలు చేయడానికి మహిళలు ముందుకు వచ్చేవారు. సవాలక్ష సందేహాల కారణంగా, వీరికి ఆదరణ లభించలేదు. అయితే సరస్వతి స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేది. ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఫలించింది. పైగాఇవి ధర తక్కువ, సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉండటం, రాషెస్ సమస్యకూడా ఉండకపోవడంతో గిరాకీ పెరిగింది. బయటి మార్కెట్లో చిన్న ప్యాకెట్ ధర 45 రూపాయలు ఉండగా.. సరస్వతి ఆధ్వర్యంలో తయారుచేస్తున్న ప్యాకెట్ ధర 28 రూపాయలు మాత్రమే ఉండడం విశేషం. గత రెండేళ్లుగా శానిటరీ న్యాప్కిన్ల అమ్మకం నెలకు రూ. 30 వేలకి చేరుకుంది."ప్రతి ప్యాడ్ మాకు రూ. 2 ఖర్చవుతుంది, ప్యాకేజింగ్ తర్వాత, ధర రూ. 2.5. మేము ఏడు ప్యాడ్ల ప్రతి ప్యాక్‌ను రూ. 40కి అమ్ముతాము, అయితే జెల్ ఆధారిత ప్యాడ్లు రూ. 60కి అమ్ముతాము. మా ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో సహాయపడిన, మాకు మరిన్ని ఆర్డర్లను తీసుకువచ్చిన NGOలతో కూడా కనెక్ట్ అయ్యాము. రాష్ట్రంలోని ఏడు నగరాలు, పంజాబ్‌లోని రెండు నగరాల నుండి కూడా ఆర్డర్లు వస్తాయి‘’ అని ఆమె గర్వంగా చెబుతుంది సరస్వతి.ఇక పచ్చళ్ల బిజినెస్ దగ్గరికి వస్తే ప్రతి నెలా, మేము కనీసం 300- 500 కిలోల ఊరగాయల ఆర్డర్లు వస్తాయి. ఇలా ఊరగాయలు ,ప్యాడ్ల అమ్మకం ద్వారా ఆమె వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. 7 లక్షలు దాటింది. తన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మాలనే లక్ష్యంతో ఉంది. దీనికోసం జీఎస్టీ నెంబరు, ప్యాకేజీని మరింత మెరుగుపర్చుకోని, మరిన్ని నగరాలకు తన ప్యాడ్స్ చేరేలా ముందుకు సాగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఆమెలోని ప్రతిభకు పట్టుదలకు గుర్తింపు లభిచింది. "గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైంది. దీంతో లక్నోలో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఆమెను సత్కరించారు. సరస్వతి తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా, తన సమాజంలోని అనేక మందికి స్ఫూర్తినిస్తోందని జిల్లా అభివృద్ధి అధికారి శివ్ ప్రతాప్ రమేష్ ప్రశంసించారు. -
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
అవమానాల నుండి అంతర్జాతీయ వేదికపై..
చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. కనీసం పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకోని పరిస్థితిని దాటుకుని మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఐదో స్థానంలో నిలిచానని హర్షిని మేకల అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓ కార్యక్రమానికి మంగళవారం వచ్చిన హర్షిని మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో 24 దేశాల నుండి మోడల్స్ పాల్గొనగా మిస్ యూనివర్స్ ట్రాన్స్‌లో ఐదో స్థానం, మిస్ ట్రాన్స్ ఆసియా 2024, అలైట్ క్వీన్ యూనివర్స్‌తో మొత్తం మూడు టైటిల్స్ గెలుచుకున్నానని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి అంతర్జాతీయ వేదికపై ఇండియా తరపున తాను పోటీలో ఉండడం, వేదికపై హర్షిని మేకల అని అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల నుండి కేరింతలు రావడం, ఆ కేరింతల మధ్య తనకు మిస్ యూనివర్స్ ఆసియా కిరీటం పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనని హర్షిని అన్నారు. మిస్ ట్రాన్స్ ఆసియా గెలుపొందిన తరువాత ఇప్పటివరకూ కృష్ణలంక, బైరాజులపల్లి, బాలామణి అనే మూడు సినిమాల్లో నటించానని, ఓ వెబ్‌సిరీస్, రెండు సీరియల్స్‌లోనూ నటిస్తున్నట్లు తెలిపారు. మార్చిలో మిస్ ట్రాన్స్ తెలంగాణ తెలంగాణలో మొదటిసారిగా సంచారీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఐకానిక్ స్టార్స్ మిస్ ట్రాన్స్ తెలంగాణ ఫ్యాషన్ షో 2025 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ పోస్టర్‌ను మిస్ ట్రాన్స్ ఆసియా హర్షిని, మొదటి ట్రాన్స్ డాక్టర్ ప్రాచీ రాథోడ్, హైదరాబాద్ మోడల్ సీఈవో వంశీ పల్లె, నిర్వాహకుడు శ్రీనాథ్, నటుడు కామేష్ గౌడ్, నిర్మాత నవీన్ గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. విజేతలకు సర్టిఫికెట్, కిరీటం, నగదు బహుమతి, యాడ్, యూట్యూబ్‌లో సాంగ్ అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9010691111లో సంప్రదించొచ్చు. ఇవీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లఅమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ
పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అమ్మానాన్న ప్రోద్బలంతోనే బాగా చదువుకుంటే, మంచి జీవితం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే, ఎలాంటి కలల్ని అయినా సాకారం చేసుకోవచ్చనే గుణం అలవడుతుంది. అలా బాగా చదువుకుని తన కుటుంబానికి పేరు తేవడమే కాదు యూపీఎస్సీ సివిల్స్(UPSC Civils) మంచి ర్యాంకు సాధించాడు. అతని పేరే మర్రిపాటి నాగభరత్(Marripati Naga Bharath). పదండి నాగ భరత్ సక్సెస్గురించి తెలుసుకుందాం.వైఎస్సార్ కడప జిల్లాకు నాగభరత్ చిన్నప్పటినుంచి చదువులో బాగా రాణించాడు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాడు. చక్కటి జీవితం. సంతృప్తికరమైన జీతం. కానీ కలెక్టర్ అవ్వాలన్న అమ్మ కోరిక నెరవేరలేదనే వెలితి అతడిని వెంటాడింది. అందుకే 15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టాడు. 2023 యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో విద్యార్థి ఉన్నత ర్యాంక్ సాధించాడు.నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అయితే సివిల్స్ కొట్టాలనే ప్రయత్నాల్లో 2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా సరే పట్టువీడలేదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. నిపుణుల శిక్షణలో మరింత రాటు దేలాడు. చివరికి 580వ ర్యాంక్ సాధించాడు.తల్లి కోరిక (ఈమె 2013లో చనిపోయింది.) మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ భవిష్యత్తుపై చాలా ధీమా వ్యక్తం చేశాడు. ఐఏఎస్‌గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని వెల్లడించాడు. రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు తన చిన్నతనంలో తండ్రి కలెక్టర్ అంటే ఏంటి? ఈ పదవి ద్వారా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టవచ్చు అనేది చెప్పేవారట. పేదలకు ఎలా సాయం చేయవచ్చో కూడా వివరించేవారట. తన తల్లి కోరిక,కల కూడా అదేనని, అమ్మనాన్నలే తన విజయానికి స్ఫూర్తి అని చెప్పాడు గర్వంగా. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణలో ఉన్నాడు. (ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!) View this post on Instagram A post shared by Marripati Naga Bharath (@bharath_avow) -
మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్!
కాలక్షేపం కోసం, అందరూ కలిసి ఒకచోట టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి లక్నోలోని ఐఏఎస్ అధికారుల భార్యలు ఒకచోట చేరేవారు. ఆ తరువాత ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ (ఐఏఎస్ ఓడబ్ల్యూ) ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ సంస్థ సామాజిక సేవ వైపు తన పరిధిని విస్తరించింది. స్వయం–సహాయక సంఘం ‘ఆకాంక్ష’తో ఎంతోమంది సామాన్య మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.తాజా విషయానికి వస్తే... ‘ఆకాంక్ష’లోని మహిళా సభ్యులు కుంభమేళాలో 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు.. ‘ఆకాంక్ష’ అనేది ‘ఐఏఎస్వోడబ్ల్యూ’కు స్వయం సహాయక సంఘం. కుంభమేళాలో భక్తుల సందడే కాదు లక్నోలోని ‘ఆకాంక్ష’లో భాగమైన ‘మసాల మాత్రి కేంద్ర’ మహిళల సందడి, సంతోషాలు కూడా కనిపిస్తాయి. నిన్న మొన్నటి వరకు వారు సాధారణ గృహిణులు. ఎప్పుడో తప్ప కొత్త ఊరికి వెళ్లని వారు. ‘ఆకాంక్ష’ పుణ్యమా అని వ్యాపారవేత్తలుగా మారారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలకు వెళుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ (ఐఏఎస్ వోడబ్ల్యూ)కు కేవలం ఐఏఎస్ అధికారుల భార్యలు మాత్రమే నేతృత్వం వహించడం లేదు. గత సంవత్సరం జూలైలో ఐఏఎస్ ఆఫీసర్ రష్మీసింగ్ అధ్యక్షురాలు అయింది. ‘ఐఏఎస్ వోడబ్ల్యూ’కు ప్రెసిడెంట్ అయిన తొలి ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచింది. జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అయిన రష్మీ యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్‌సింగ్ భార్య.మసాల, మాత్రి (ఉప్పగా ఉండే స్నాక్స్) తయారీకి ప్రసిద్ధి చెందిన ‘మసాల మాత్రి కేంద్ర’లో గతంతో పోల్చితే ఇప్పుడు ప్రొఫెషనలిజం పెరిగింది. లడ్డూలు, చిక్కీలు, బ్యాగుల తయారీ, హస్తకళలలో విస్తరించింది. లక్నోకు చెందిన ఈ సంస్థ కార్యకలాపాలను నోయిడాకు విస్తరించ నున్నారు. కొన్ని నెలల క్రితం తమ ఉత్పత్తులతో భారీఎత్తున ఎగ్జిబిషన్ నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘ఈ ఎగ్జిబిషన్ ఆకాంక్ష సభ్యులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రిని తొలిసారి చూసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఎగ్జిబిషన్ అనేది వారికి కేవలం డబ్బు సం΄ాదన మాత్రమే కాదు. కొత్త ప్రాంతానికి రావడం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం... ఇలా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు’ అంటుంది రష్మీసింగ్.‘మొదటిరోజు స్వయం సహాయక బృందానికి చెందిన మహిళ ఒకరు రెండు వేలే సంపాదించానని అసంతృప్తిగా మాట్లాడింది. అయితే ఈవెంట్ ముగిసే సమయానికి రూ.30,000 సంపాదించింది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంది’ అంటుంది ఐఏఎస్వోడబ్ల్యూ – ఉత్తర్‌ప్రదేశ్ కార్యదర్శి ప్రతిభ.యాభై నాలుగు సంవత్సరాల హలీమా గత దశాబ్దకాలంగా ‘ఆకాంక్ష’తో కలిసి పనిచేస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఆమెకు కశ్మీర్ నుంచి వచ్చిన మహిళలతో మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యాపారం నుంచి తమ ప్రాంత ప్రత్యేకతల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడుకున్నారు. వీరు మరోసారి కుంభమేళాలో కలవనున్నారు. ‘ఆకాంక్ష అనేది మా అందరి ప్రాజెక్ట్. మొదట్లో స్వయం సహాయక బృందం సభ్యుల మైండ్‌సెట్‌లో మార్పు తీసుకురావడానికి కృషి చేశాం. వారిన పాత పద్ధతుల నుంచి కొత్తదారిలోకి తీసుకువచ్చాం’ అంటుంది రష్మీసింగ్.‘మా సంస్థ ఒకప్పుడు ఐఏఎస్ అధికారుల భార్యలు టీ తాగడానికి, ముచ్చటించడానికి, యోగా కార్యక్రమాలను నిర్వహించ డానికి వేదికగా ఉండేది. ఇప్పుడు దాని పరిధి ఎంతో విస్తరించింది. సామాజిక సేవదారిలో ప్రయాణిస్తుంది’ అంటుంది శైలజ చంద్ర.‘ నాకు మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ తప్పకుండా ఉండాల్సిందే’ అంటున్నాడు ఒక కస్టమర్. ‘ఆకాంక్ష’ సాధించిన అద్భుత విజయానికి ఈ ఒక్క మాట చాలు కదా! -
Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా..
బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్ తండ్రి దుకాణం మూసివేశాడు.దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్‌లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్‌తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్‌లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్‌తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్‌తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్‌ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ
పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని అంటారు. దీనిని కొందరు నిజమని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు శ్వేతా భారతి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమైన శ్వేత తాను అనుకున్నది సాధించి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష(UPSC Civil Service Exam) ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటని చెబుతుంటారు. పలువురు అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ తీసుకుంటారు. అయితే ఏమాత్రం కోచింగ్ అవసరం లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు కూడా ఉన్నారు. ఇటీవలే బీహార్ కేడర్‌లో పోస్టింగ్ అందుకున్న ఐఏఎస్ శ్వేతా భారతి దీనికి ఉదాహరణగా నిలిచారు.బీహార్ యువతి శ్వేతా భారతి(Shweta Bharti) యూపీఎస్సీ పరీక్షకు ముందు బీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే ఐఏఎస్ అధికారి కావడమే ఆమె కల. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నప్పటికీ, యూపీఎస్సీకి ప్రపరేషన్ కొనసాగించారు. శ్వేతా భారతి ఉదయం పూట 9 గంటల పాటు పనిచేస్తూనే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.శ్వేతా భారతి బీహార్‌లోని నలంద జిల్లాలో జన్మించారు. ఆమెది సాధారణ కుటుంబ నేపధ్యం. శ్వేతా భారతి చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. పట్నాలోని ఇషాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఆమె భాగల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్,టెలికమ్యూనికేషన్‌లో బీటెక్ డిగ్రీని అందుకున్నారు. తరువాత ఆమె విప్రోలో ఉద్యోగం సంపాదించారు.లక్షల్లో జీతం అందుకుంటున్నప్పటికీ ఆమె ఐఏఎస్ అధికారి(IAS officer) కావాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతూ వచ్చారు. పగటిపూట ఉద్యోగం చేస్తూనే, రాత్రపూట చదువుకోసాగారు. 2020లో జరిగిన బీపీఎస్సీ పరీక్షలో శ్వేతా భారతి 65 వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ప్రోగ్రామ్ ఆఫీసర్ (డీపీఓ)గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఆమె తన లక్ష్యం నెరవేర్చుకునే దిశగానే ముందుకు సాగారు. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. 2021లో యూపీఎస్సీ పరీక్షలో 356వ ర్యాంక్ సాధించారు. శ్వేతా భారతి యూపీఎస్సీ2021 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ మహిళా అధికారి. ప్రస్తుతం బీహార్‌లోని భాగల్పూర్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ISRO SpaDeX Mission: స్పేడెక్స్ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: ఇస్రో -
రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్, ఐఎమ్‌టీ ఘజియాబాద్‌లో ఎంబీఏ చదివి నగరంలోని ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ.25 లక్షలకు పైగా జీతమిచ్చే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలను వదిలేసి..‘ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యాన్నిస్తాయి.. కల్తీ ఆహార ఉత్పత్తులతో రోగాల పాలు కావొద్దు’ అని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ విశేషాలు నగరవాసి యోగితా జాహ్నవి మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తినాలని ప్రతి ఒక్కరూ చెబుతారు కానీ పోషకాలు అందించే ఆహారం దొరకాలి కదా.. ఇప్పుడు ఎటు చూసినా కల్తీ.. ఈ పరిస్థితుల్లో కడుపులోని బిడ్డకు స్వచ్ఛమైన ఆహారం అందించడం ఎలా?’ అంటూ చాలా ఆందోళన చెందాను’ అంటూ తాను గర్భిణిగా ఉన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ వీ రిచ్ నిర్వాహకురాలు యోగితా జాహ్నవి. అంతా కల్తీ.. తినేదెలా? అదీ ఇదీ లేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే కలదు అడల్ట్రేషన్.. మనం తింటున్న ఆహారం మనకు పోషకాలు ఇస్తోందా? రోగాలు తెస్తోందా? ఈ ఆందోళన గర్భిణిగా ఉన్నప్పుడు మరింత పెరిగింది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా స్వచ్ఛమైన పాలు, తేనె, కుంకుమ పువ్వు తీసుకోవాలనే ఆరాటంతో నా అన్వేషణ మొదలైంది. ఎంత కష్టమైనా సరే స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను అందించాలనే తపన పెరిగింది. అదే ఏళ్ల తరబడి శ్రమించి అందుకున్న డిగ్రీ పట్టా, అది అందించిన లక్షల జీతమిచ్చే ఉద్యోగం.. వదిలేసి మా పల్లెటూరి వైపు నా చూపును మళ్లించింది. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం పాడితో కూడి.. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యాక డైరీ ఫార్మ్ పెడదామని నాన్న కల. ఉద్యోగం వదిలేశాక మా నాన్న కల సాకారంతో పాటు నా ఆశయాలకు ఆకారం కూడా ఇవ్వాలని మా సొంత ఊరు కందుకూరులో ఒక డైరీ ఫార్మ్‌ను ఏర్పాటు చేశా. ఆవులు, గేదెలకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వకుండా వాటి మేత కూడా సహజమైన ఆహారమే అందిస్తున్నాం.. తద్వారా ఏ దశలోనూ కల్తీ కాని, రసాయనాలు కలవని స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి చేస్తున్నాం. పరిశోధించి.. పరిశీలించి.. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఒకే సీజన్లో తేనె లభిస్తుంది. ప్రభుత్వం, ఎన్జీవోలు కలిపి ప్రతి ఇంటికీ తేనె సేకరించేలా ఏర్పాట్లు చేస్తారు. విభిన్న రకాల పూల నుంచి సేకరించిన ఈ తేనెలో ఔషధ విలువలు పుష్కలం. ఇది తెలిసి అక్కడకు వెళ్లి వారితో ఒప్పందం కుదర్చుకున్నా. అదేవిధంగా బెల్లం పొడి కూడా అక్కడిదే. మెటల్ సీడ్ నుంచే పుట్టే ఈ బెల్లం ఆరోగ్యకరం. ఇక్కడ లభించే బెల్లం పొడిలా దీన్ని కలిపితే పాలు విరగవు. ఇందులో ఐరన్ కంటెంట్ బాలింతలకు ఆరోగ్యకరం. అలాగే అత్యుత్తమ రైస్ రకం గురించి అన్వేషిస్తే బ్లాక్ రైస్ గురించి తెలిసింది. వియత్నాం, రష్యాలో ఈ రైస్‌కి బాగా డిమాండ్ ఉంది. మన దేశంలో మణిపూర్‌లో బాగా పండిస్తారు. అక్కడి నుంచి బ్లాక్ రైస్ తెస్తున్నా. అలాగే కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ఇలా దాదాపు డజనుకుపైగా అన్వేషించినవి, అత్యుత్తమమైనవి అందిస్తున్నా. దీన్నేదో కేవలం వ్యాపారంగా చూడటం లేదు. అత్యధిక శాతం మహిళా సిబ్బందితో నడిచే మా సంస్థ.. ఇంటింటికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేరవేయాలని, ముఖ్యంగా బాలింతలు, బలహీనంగా ఉండే మహిళలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఆశయంతో నిర్వహిస్తున్నాం. -
డెలివరీ బాయ్.. జడ్జిగా మారితే.. యాసిన్ షా సక్సెస్ స్టోరీ
విజయసాధనకు అకుంఠిత దీక్ష అవసరమని అంటారు. పట్టుదలతో లక్ష్యం దిశగా పయినించినవారు తప్పక విజయం సాధిస్తారని కూడా చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తారు యాసిన్ షా మహ్మద్. ఈయన జీవితం ఒక సినిమాను తలపిస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్న యాసిన్ చివరకు విజయబావుటా ఎగురవేశాడు.జీవితంలో ఎత్తుపల్లాలు, మలుపులుఇటీవల జరిగిన కేరళ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాసిన్ షా మహ్మద్ రెండో స్థానం సాధించాడు. దీంతో సివిల్ జడ్జి అయ్యే అర్హత సాధించాడు. డెలివరీ బాయ్ నుండి మేజిస్ట్రేట్ అయ్యే దిశగా సాగిన యాసిన్ జీవన ప్రయాణంలో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. యాసిన్‌కు మూడేళ్ల వయసున్నప్పడే అతని తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టివెళ్లిపోయాడు. నాడు 19 ఏళ్లు ఉన్న అతని తల్లి.. పిల్లలను పెంచిపోషించింది. శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటూ, వారు కాలం వెళ్లదీశారు. రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద వారికి ఒక చిన్న ఇంటి సౌకర్యం లభించినప్పటికీ, వారికి అది ఏమాత్రం అనువుగా ఉండేది కాదు.న్యూస్ పేపర్ పంపిణీ చేస్తూ..యాసిన్ తన బాల్యంలో ఉదయం 4 గంటలకు నిద్రలేచి వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. తరువాత 7 గంటల నుండి పాల ప్యాకెట్లు పంపిణీ చేసేవాడు. ఇది పూర్తయ్యాక స్కూలుకు వెళ్లేవాడు. యాసిన్ తల్లి రెండు పాడి ఆవును కొనుగోలు చేసి, వాటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని సాకేది. యాసిన్ తన ఆరేళ్ల వయసు నుంచే ఆదాయం వచ్చే పనులు చేసేవాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పంపిణీ చేసేవాడు.స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం..సమయం చిక్కినప్పుడు యాసిన్ పెయింటర్‌గా, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గానూ పనిచేశాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి విని, దానికి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు.29 ఏళ్ల పోరాటంయాసిన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది షాహుల్ హమీద్ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బాయ్‌గా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇది కూడా చదవండి: ‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది? -
పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం
నెలకు లక్షల్లో సంపాదిస్తేనే ఔరా అనుకుంటాం కదా. కానీ బ్రిటీష్ బిలియనీర్, మహిళా వ్యాపారవేత్త, అత్యధిక వేతనం పొందే మహిళగా నిలిచింది. 2024లో జీతం , డివిడెండ్లలో 150 మిలియన్ పౌండ్లను ( రూ.1,500 కోట్లకు పైగా) వేతనం అందుకుంది. అంటే రోజురు నాలుగు కోట్ల వేతనం అన్నమాట. అదీ 45 శాతం వేతన కోత తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎవరీ డెనిస్.. ఆమె కంపెనీ ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో.57 ఏళ్ల డెనిస్ కోట్స్(denise Coates)కన్న కల చాలా పెద్దది. అందుకే ఆమె స్థాపించిన ఒక చిన్న కంపెనీ ఇపుడు ప్రపంచాన్ని ఏలుతోంది. 2000లో ఒక మామూలు కారు పార్కింగ్ స్థలంలో "బెట్365" (Bet365)అనే ఆన్లైన్ బెట్టింగ్ సంస్థను ప్రారంభించింది. బహుశా అపుడు ఆమె ఊహించి ఉండదు..వేల కోట్ల టర్నోవర్‌తో, 8,500 మంది ఉద్యోగులతో దిగ్గజంగా ఎదిగుతుందని. కట్ చేస్తే...ఆమె విజయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డెనిస్ కోట్స్ బ్రిటన్‌లోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా అవతరించారు. సంస్థలో ఆమె మెజారిటీ వాటా50 శాతానికి పైమాటే.ది గార్డియన్ నివేదిక ప్రకారం "బెట్365" కంపెనీ అంతకుముందు సంవత్సరంలో 3.4 బిలియన్ పౌండ్ల నుండి 3.7 బిలియన్ పౌండ్లకు ఆదాయ వృద్ధిని సాధించింది. ఈక్విటీ మార్కెట్ పరిస్థితుల మెరుగుదల మధ్య ఖర్చులను తగ్గింపు, పెట్టుబడి మదింపుల నుండి లాభాన్ని ఆర్జించింది. గత ఏడేళ్లలో ఆమె సంపద ఏకంగా రూ. 20 వేల కోట్లను దాటిపోగా, గత పదేళ్లలో ఆమె ఆర్జించిన మొత్తం దాదాపు రూ.24 వేల కోట్లు. మార్చి 2024తో ముగిసిన ఏడాది లో సంస్థ పన్నుకు ముందు 626 మిలియన్ పౌండ్ల లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాదితోపోలిస్తే 60 మిలియన్ పౌండ్ల ప్రీ-టాక్స్ నష్టం నుండి గణనీయమైన పెరుగుదల.ఆన్లైన్ బెట్టింగ్స్ ఊపందుకున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2020) ఆమె ఆదాయం అత్యధికంగా రూ.4,690 కోట్లుగా నమోదైంది. కాగా ప్రపంచంలోని ప్రముఖ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కంపెనీల్లో ఒకటి నిలిచిన Bet365 వ్యవస్థాపకురాలైన కోటస్ 1967, సెప్టెంబరు 26న ఇంగ్లాండ్‌లోని స్టోక్-ఆన్-ట్రెంట్‌లో జన్మించింది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామెట్రిక్స్ అభ్యసించింది. బెట్టింగ్ షాపులను నిర్వహించు కుటుంబ నేపథ్యంతో ఆమె ఈ కంపెనీని స్థాపించింది. ఆమె సోదరుడు జాన్ కోట్స్ సంస్థకు సంయుక్త సీఈఓగా(CEO), ప్రధాన వాటాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు స్టోక్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్టేడియానికి బెట్365 పేరు పెట్టారంటేనే Bet365కంపెనీ ప్రాముఖ్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విమర్శలు, వివాదాలు అయితే ఇంత ప్రాపులర్ అయిన సంస్థకు సంబంధించి మరో కోణం కూడా ఉంది. పేదప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్న కంపెనీ అంటూ సంస్థపై అనేక విమర్శలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న లక్షలాది మంది కష్టార్జితాన్ని ఈ సంస్థ కొల్లగొడుతోందని విమర్శకులు మండిపడుతున్నారు.మరోవైపు 2020లో డెనిస్ తండ్రి పీటర్ కోట్స్(Peter Coates) బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీకి రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది . అలాగే 2023లో కస్టమర్ల భద్రతా వైఫల్యం, మనీలాండరింగ్ లాంటి ఆరోపణలతో ఈ సంస్థ రూ.5.82 కోట్ల జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. -
రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?
అనుకున్న పని సాధించాలంటే.. కృషి, పట్టుదల చాలా అవసరం. సంకల్పం బలంగా ఉండి.. లక్ష్యం వైపుగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ నీ సొంతం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే 'టట్యానా బకల్చుక్' (Tatyana Bakalchuk). బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళలలో ఒకరు. ఈమె గురించి, ఈమె సాధించిన సక్సెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.వైల్డ్బెర్రీస్బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రష్యాలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగిన 'వైల్డ్‌బెర్రీస్' (Wildberries) నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం వ్యాపారవేత్త టట్యానా బకల్చుక్. ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళ. ఈమె నికర విలువ 7.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6,34,65,84,10,000.60వేల బ్రాండ్లుఅమెజాన్ కంపెనీలో పోలిస్తే.. వైల్డ్‌బెర్రీస్ రష్యాలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి సుమారు 60వేల బ్రాండ్లను విక్రయిస్తున్నారు.రష్యాలోని అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజాన్ని స్థాపించిన టట్యానా బకల్చుక్ 2004లో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఓ ఇంగ్లీష్ టీచర్. ఈమె తన ప్రసూతి సెలవుల సమయంలో కుటుంబానికి మద్దతుగా నిలబడటానికి కేవలం రూ. 32వేలతో చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె భర్త వ్లాడిస్లావ్ బకల్చుక్, అతని స్నేహితుడి సహకారం కూడా తీసుకుంది.అపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్మొదట వీరి వ్యాపారం చిన్న అపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌గా వృద్ధి చెందింది. ఆ సమయంలో ఆమె జర్మన్ రిటైలర్ ఒట్టో సహకారం పొందింది. ఆన్లైన్లో దుస్తులను ఫోటో తీయడం, జాబితా చేయడం, స్వయంగా లాజిస్టిక్స్ చేయడం, పంపడానికి ప్రజా రవాణాను ఉపయోగించడం వంటి వాటితో ఈమె బిజినెస్ ఎదిగింది.ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. పట్టు వదలకుండా, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా ఈమె తన వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు.2020లో మహమ్మారి సమయంలో సకాలంలో ఇంటి డెలివరీలను నిర్ధారించడానికి ఆమె 12,000 మంది అదనపు కార్మికులను నియమించింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా గణనీయమైన వృద్ధి సాధించింది.99 శాతం వాటాకంపెనీలో టాట్యానా 99 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 1 శాతం వాటా ఆమె భర్తకు చెందినది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు రష్యాలో మాత్రమే కాకుండా.. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రదేశాలలో కూడా సేవలు అందిస్తోంది. వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ.. టాట్యానా అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?టట్యానా బకల్చుక్ వ్యాపార ఆవాహన.. రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' (Vladimir Putin)ను ఆకర్షించింది. దీంతో ఆయన అంతర్జాతీయ స్విఫ్ట్ చెల్లింపు నెట్‌వర్క్‌కు దేశీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే పనిని ఆమెకు అప్పగించారు. ఓ టీచర్‌గా జీవితం ప్రారంభించి, కుటుంబానికండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తల సరసన నిలిచిన టట్యానా బకల్చుక్ ప్రశంసనీయం, ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్‌కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’
నేటి కాలంలో యువత ఉద్యోగం చేసేకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ కోవలో అమోఘమైన విజయాలు సాధించినవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే అరూప్ కుమార్ ఘోష్. హైదరాబాద్‌లోని గుడిమాల్కాపూర్ను చూసిన ఆయన తన జీవితాన్నే పూలబాటగా మలచుకున్నారు.కలలు సాకారమయ్యేందుకు..పశ్చిమ బెంగాల్‌లోని కోలాఘాట్(Kolaghat)కు చెందిన అరూప్ కుమార్ ఘోష్ (33) కాలేజీ డ్రాపౌట్. అయితే ఆయన తన వ్యాపారంలో చూపిన అంకితభావం, కృషి అతనిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. చాలామంది యువకులు కలలను కనడంవరకే పరిమితమైతే అరూప్ మాత్రం ఆ కలలను సాకారం చేసుకున్నాడు. ఒకప్పుడు రూ.3500 జీతానికి పనిచేసిన అరూప్ ఇప్పుడు భారీ స్థాయిలో పూల వ్యాపారం చేస్తున్నాడు. బంతి పూలు, వాటి విత్తనాలను విక్రయిస్తూ, తన వ్యాపార వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లను దాటించాడు. అయితే ఈ దిశగా సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు.పూల దుకాణంలో పనికి కుదిరి..అరూప్కి చిన్నప్పటి నుంచి పూలంటే ఎంతో ఆసక్తి ఉంది. అరూప్ కుటుంబం తొలుత వరి సాగు చేసేది. అయితే దాని నుండి వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. ఇదే సమయంలో పూల వ్యాపారంలో అరూప్‌కు మంచి అవకాశాలు కనిపించాయి. దీంతో అరూప్ కళాశాల చదువును వదిలివేసి, పూల వ్యాపారం(Flower business)లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన 17 ఏళ్ల వయస్సులోనే పూల అమ్మకందారులతో కలసి పనిచేయడం మొదలుపెట్టాడు. పూల వ్యాపారం గురించి మరింత తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను సందర్శించాడు. తరువాత నెలకు రూ.3,500 జీతం వచ్చేలా ఒక పూల దుకాణంలో పనికి కుదిరాడు. జీతం చాలా తక్కువే అయినప్పటికీ, పూల వ్యాపారం నేర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని అరూప్ భావించాడు. ఉద్యోగం చేస్తూ పూల వ్యాపారంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు.ఆరంభంలో భారీ నష్టాలుకొంతకాలం తరువాత అరూప్ కోలాఘాట్లోని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. దేశంలోని వివిధ నగరాల్లోని పూల దుకాణాలకు బంతి పూలను విక్రయించడం మొదలుపెట్టాడు. మొదట్లో రూ.2000 నుంచి రూ.3000 వరకు లాభం వచ్చింది. దీంతో 2011లో కొంత భూమిని కౌలుకు తీసుకుని అరూప్ బంతిపూల సాగును ప్రారంభించాడు. ఆరంభంలో అరూప్ భారీ నష్టాలను చవిచూశాడు. తొలుత కోల్‌కతా రకం బంతి పూలు(Kolkata type marigolds) సాగుచేశాడు. ఆ పూలు చిన్నవిగా ఉండటంతో అమ్ముడుపోయేవికాదు. దీంతో అరూప్‌కు వ్యాపారంలో నష్టం వచ్చింది. అయినా అరూప్ నిరాశపడలేదు. 2011లో థాయ్ లాండ్ వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండి, పూల సాగులో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్ మేరిగోల్డ్ పూలు, వాటి విత్తనాలను ఉత్పత్తి చేసే సాంకేతికతను తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఒక్కో బంతిపూల రకానికి చెందిన విత్తనాలు తీసుకుని కోలాఘాట్కు చేరుకున్నాడు.ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయంథాయ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అరూప్ మరింత భూమిని లీజుకు తీసుకుని, అక్కడ టెన్నిస్ బాల్ రకం బంతి పూలను సాగుచేశాడు. కోలాఘాట్ మార్కెట్లో కిలో 100 రూపాయల చొప్పున బంతిపూలను విక్రయించాడు. డిమాండ్ పెరగడంతో బంతి పూల సాగును మరింతగా పెంచాడు. బంతిపూల విత్తనాలను కూడా అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అరూప్ బంతిపూలు, మొక్కలు, విత్తనాలను విక్రయించడం ద్వారా ఏటా రూ.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ఇది కూడా చదవండి: Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి.. -
రైతుబిడ్డ సక్సెస్ స్టోరీ, యంగెస్ట్ ఐఐటీయన్, 24 ఏళ్లకే యాపిల్ ఉద్యోగం
అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ విజయం వంగి సలాం చేయాల్సిందే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ పడిన శ్రమ, చేసిన కృషి గురించి తెలుసుకుంటే ఈ మాటలు అక్షర సత్యాలు అంటారు. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 24 ఏళ్లకే యాపిల్ కంపెనీలో చేరిన సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!బిహార్(Bihar)కు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు సత్యం కుమార్ (Satyam Kumar). చిన్నప్పటి నుంచీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకున్నాడు. అయితే పేదరికం కారణంగా చదువు చాలా కష్టంగామారింది. మేనమామ, స్కూలు టీచర్ సాయంతోదీక్షగా చదువుకున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2012లో, అతను ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే, అతను మళ్లీ మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను మళ్ళీ పరీక్ష మరియు పరీక్షలో ఎక్కువ ర్యాంక్ సాధించాడు.2013లో 13 ఏళ్ల వయసులో కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు పొందిన సత్యం, 679 ర్యాంక్ సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు (మునుపటి రికార్డు సహల్ కౌశిక్ పేరిట ఉంది అతను 14 సంవత్సరాల వయస్సులో ఈ ఘనతను సాధించాడు). 2013లో ఐఐటీలో 679 ర్యాంక్ తో ఐఐటీ కాన్పూర్( IIT Kanpur) నుంచి 2018 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుకునే సమయంలోనే మూడు ప్రాజెక్ట్ లపై సత్యం కుమార్ వర్క్ చేసిన ప్రశంలందుకోవడం విశేషం.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సంయుక్త BTech-MTech కోర్సు, అమెరికాలోని ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం PhDని పూర్తిచేశాడు. ఆ తరువాత కేవలం 24 సంవత్సరాల వయస్సులో Appleలో ఉద్యోగం చేసాడు. అక్కడ, అతను ఆగస్టు 2023 వరకు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పనిచేశాడు.అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేజెస్ స్పెషలైజేషన్‌తో పనిచేశాడు.రాజస్థాన్‌లోని కోటలోని మోడరన్ స్కూల్లో చదువుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పశుపతి సింగ్, సత్యం ప్రతిభను గుర్తించారు. అందుకే IIT ప్రవేశ పరీక్ష,కోచింగ్ ఖర్చులను వర్మ స్వయంగా భరించారని సత్యం మేనమామ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చదువు నేర్పించాలని భావిస్తున్నాడు సత్యం. సత్యం సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
20 ఏళ్లకే గ్రేడ్ వన్ అధికారిగా.. ఉత్కర్ష్ శుక్లా సక్సెస్ స్టోరీ
జీవితంపై కోటి ఆశలతో కలలుగనేవారు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. అలాంటివారే విజయాలను అందుకుంటారు. దీనిని పలువురు రుజువు చేశారు. ఆ కోవలోకే వస్తాడు యూపీలోని అమేథీకి చెందిన ఉత్కర్ష్ శుక్లా. ఒకనాడు తనకు చదువుకునే పరిస్థితి లేకపోయినా పట్టుదలతో అనుకున్నది సాధించి చూపాడు.యూపీలోని అమేథీలో గల రాజీవ్ గాంధీ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌లో ఉత్కర్ష్ శుక్లా బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకు ఉత్కర్ష్ శుక్లా డిగ్రీతోపాటు రాష్ట్రపతి బంగారు పతకం కూడా అందుకున్నాడు. చిన్నప్పటి నుండి ఉత్కర్ష్‌కు చదువులో ఘన విజయం సాధించాలనే తపనతో ఉండేవాడు. ఉత్కర్ష్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి.బీటెక్ పూర్తి చేసిన ఉత్కర్ష్ ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్‌లో గ్రేడ్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 20 ఏళ్ల వయసులో ఉత్కర్ష్ ఇంతటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఉత్కర్ష్ మీడియాతో మాట్లాడుతూ తాను సాధించిన విజయం తనకు ఎంతో ఆనందమిస్తున్నదని చెబుతూ, తాను గతంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిపాడు. కరోనా సమయంలో పుస్తకాలు దొరక్క చదువుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, పోటీ పరీక్షల ప్రపరేషన్కు అనేక ఆటంకాలు ఎదురయ్యాయని తెలిపాడు. అయితే పట్టువదలక పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించానని అన్నాడు. ఇది కూడా చదవండి: ఎంఏ చాయ్‌వాలా.. ఏటా లక్షల సంపాదన -
వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!
అవార్డ్ విజేత, చిత్రకారుడు దీనా సో ఓతేహ్ నీడ– కాంతిలో విలక్షణతను చూపడంలో మాస్టర్. యునైటెడ్ స్టేట్స్లో ఉండే ఈ కళాకారుడి చిత్రాలు మిగతా వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంటాయి. చీకటి నుండి వెలువడే ప్రకాశవంతమైన చిత్రాలను మన కళ్లకు కడతాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటాన్ని ‘చిత్రం’గా చూపుతాడు. గురువెవ్వరూ లేకుండానే తన ఊహల్లో నుండి పుట్టుకువచ్చిన కళ గురించి వివరిస్తుంటే వినేవారు చాలా అబ్బురంగా చూస్తారు. ‘‘మా అమ్మ చిన్నప్పటి నుండి నాలో కళాత్మక అభిరుచిని గుర్తించింది. దానిని పెంపొందించడానికి ప్రాధాన్యతను ఇచ్చింది. నేను మంచి కళాకారుడిగా మారుతానని ముందే అనుకున్నాను. కళను వృత్తిగా కొనసాగించాలనే ఆలోచన చాలా ఆలస్యంగా వచ్చింది. నాకు 12 ఏళ్ల వయసులో నా కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. నాటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. మా అమ్మనాన్నలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాకు సంబంధించిన న్యాయపరమైన పత్రాలన్నీ నాన్న తనతో తీసుకెళ్లిపోయారు. సరైన పత్రాలు లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో చదవుకు స్కాలర్షిప్కు అర్హత కోల్పోయాను. దీంతో ఎనిమిదేళ్లు వెయిటర్‌గా పనిచేశాను. అప్పుడు నా కెరీర్ వెయిటర్ అనే అనుకున్నాను. అనిశ్చితి నుంచి నైపుణ్యాలుమొదట నేను ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్‌ను కాదు. సరైన పత్రాలు లేక΄ోవడం వల్ల వలసదారునిగా ఎనిమిదేళ్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాను. ఇష్టపడే పని చేస్తున్నప్పుడే స్థిరత్వం లభించడం ప్రారంభమైంది. నాకు నేను స్వయంగా ఇలస్ట్రేషన్స్ వేసేవాణ్ణి. ఈ సాధన ద్వారా ఇలస్ట్రేషన్ నా నైపుణ్యాలు పెరిగాయి. అది ఎంతగా అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్‌లో డిగ్రీ సాధించాను. మాస్టర్స్ ప్రోగ్రామ్ద్వారా స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మరింత అధ్యయనం సాధ్యమైంది. అప్పుడే ఇలస్ట్రేషన్ నాకు సరిగ్గా సరి΄ోతుందనిపించింది. కథలు చెప్పడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, సృష్టించడం... ఇలా ప్రతీది నా మనో వికాసానికి, వృద్ధికి ఇలస్ట్రేషన్ ఆర్ట్ కొత్త తలుపులు తెరిచింది. చివరకు నాది అయిన మార్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇదంతా సాధ్యమైంది మా అమ్మ ద్వారా. ఆమే నన్ను నేను గర్వపడేలా చేసింది.నిశ్శబ్దం నుంచి...పరధ్యానాన్ని నివారించడానికి సాధారణంగా స్కెచ్ వేయడం ప్రారంభిస్తాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 4–5 గంటల సమయాన్ని ఎంచుకుంటాను. ఆ నిశ్శబ్ద సమయం, ప్రపంచం మేల్కొనే ముందు నేను చాలా సృజనాత్మకంగా ఉంటాను. పరధ్యానాల నుండి విముక్తి పొందుతాను. ఏదైనా ‘రంగు’లోనే ఆలోచిస్తాను. ఎందుకంటే అది ఏదో ఒక చిన్న సృష్టికి కారణం అవుతుంది. అక్కడ నుంచి నా స్కెచ్లకు విస్తృతంగా పని దొరుకుతుంది. ఆరిస్ట్ మార్షల్ అరిస్కాన్ ఎప్పుడూ ఒక మాట చెబుతాడు ‘మీకు తెలిసిన వాటిని గీయండి’ అని. ఆ పదాన్ని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. కానీ, కాలక్రమేణా అది స్పష్టమైంది. కాంతి–చీకటి మధ్య అంతర్గత పోరాటం నాకు తెలిసింది. నేను నా జీవితంలో చాలా చీకటి కాలాలను ఎదుర్కొన్నాను. పోరాటాలకు మించిన అందం వాటిలోనే ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంశంపై తగినంత అవగాహన లేకుండా పని మొదలుపెడితే ఆందోళన కలుగుతుంది. అయితే, ఆ క్షణంలో నేను నా అహం, ఊహాత్మక తీర్పులను, ఫెయిల్ అవుతానేమో అనే భయాలను వదిలేస్తూ ఆర్ట్‌లోకి ప్రయాణిస్తాను’’ అని వివరిస్తాడు ఈ చిత్రకారుడు View this post on Instagram A post shared by Nautilus Magazine (@nautilusmag) -
50 పైసలకు టీ అమ్ముకునే మహిళ..రూ. 100 కోట్లకు అధిపతిగా!
స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్‌లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!తమిళనాడులోని నాగర్‌కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్‌ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది. అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్‌లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్‌లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్‌కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది. కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. 2010లో 'FICCI ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా . ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ! -
కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!
రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్‌కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.మణిపూర్‌లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది. ‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్‌కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్‌కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.‘సింగిల్ మదర్‌గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.‘అస్సాం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?
భారతదేశంలో జరిగే వివాహాల్లో దాదాపు అందరూ.. చాలా వరకు సాంప్రదాయ వస్త్రాలనే ధరిస్తారు. సంప్రదాయ వస్త్రాలు అంటే.. ముందుగా గుర్తొచ్చే బ్రాండ్లలో ఒకటి 'మన్యవర్'. ఈ బ్రాండ్ కేవలం 10వేల రూపాయలతో మొదలైందని.. బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో మన్యవర్ గురించి, దీని అభివృద్ధికి కారణమైన వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం.మన్యవర్ బ్రాండ్ నేడు ప్రపంచ స్థాయికి ఎదగటానికి కారణమైన వ్యక్తి 'రవి మోదీ' (Ravi Modi). ఈయన తండ్రికి కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ఉండేది. చిన్నప్పటి నుంచే రవి.. తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. సుమారు తొమ్మిది సంవత్సరాలు బట్టల దుకాణంలోని పనిచేస్తూ.. ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకున్నాడు.రూ.10000 అప్పుతోఅప్పట్లోనే రవి మోదీ కోల్‌కతాలోని సెయింట్ జేవియన్స్ కాలేజీలో బీ.కామ్ పూర్తి చేశాడు. అయితే చాలా రోజులుగా తండ్రి దుకాణంలోని పనిచేస్తూ ఉన్నాడు, ఇంతలోనే తండ్రితో చిన్న విభేదాలు రావడంతో.. తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తల్లి దగ్గర నుంచి రూ.10,000 తీసుకుని తన కొడుకు పేరు మీదుగా 'వేదాంత్ ఫ్యాషన్స్' అనే పేరుతో బట్టల వ్యాపారమే ప్రారంభించాడు.రవి మోదీ ప్రారంభించిన వేదాంత్ ఫ్యాషన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో రెడీమేడ్ వస్త్రాలను.. రవి విక్రయించడం ప్రారంభించాడు. ప్రజలు కూడా ఇతడు విక్రయించే దుస్తులను బాగా ఇష్టపడ్డారు. వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ కింద 'మన్యవర్' కూడా చేరింది.భారతదేశంలోని 248 నగరాల్లోమన్యవర్ నేడు భారతీయ వివాహ మార్కెట్లో ప్రసిద్ధ బ్రాండ్. మనదేశంలో పాపులర్ బ్రాండ్‌గా నిలిచిన మన్యవర్ తొలి అంతర్జాతీయ స్టోర్ 2011లో దుబాయ్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థ భారతదేశంలోని సుమారు 248 నగరాల్లో విస్తరించి ఉంది. దేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో 662 స్టోర్లు ఈ మన్యవర్ కింద ఉన్నాయి.రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువరవి మోదీ భార్య 'శిల్పి' కంపెనీ బోర్డులో ఉండగా, ఆయన కుమారుడు 'వేదాంత్' కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. కేవలం 10 వేల రూపాయలతో ప్రారంభమైన కంపెనీ విలువ నేడు రూ. 32వేల కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: సంపదలో సరికొత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా మస్క్మన్యవర్ విజయం.. రవి మోదీని భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 2023 నాటికి, అతని నికర విలువ 3 బిలియన్లకు (సుమారు రూ. 26,000 కోట్లు) పెరిగింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. రవి మోదీ భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 64వ స్థానాన్ని.. ప్రపంచవ్యాప్తంగా 1,238వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. -
నాడు నమ్మి లోన్ ఇవ్వలేదు.. నేడు రూ.40 వేల కోట్ల కంపెనీ
వ్యాపార రంగంలో రాణించడం అంత సులువు కాదు.. అందునా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా దశాబ్దాల క్రితం దేశంలో ఓ మహిళ వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సాహసమే. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.కిరణ్ మజుందార్ షా కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.విద్య, నేపథ్యంకర్ణాటకలోని బెంగళూరులో 1953 మార్చి 23న జన్మించిన కిరణ్ బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో తన బీఎస్సీ పూర్తి చేశారు. సైన్స్‌పై ఆకాంక్షతో, ఆమె ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మాల్టింగ్ అండ్ బ్రూయింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె భారత్‌కు తిరిగి రావడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు కార్ల్టన్ & యునైటెడ్ బ్రూవరీస్లో ట్రైనీ బ్రూవర్‌గా పనిచేశారు.జాబ్ ఇవ్వని కంపెనీలుభారత్కు తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకోవాలని కిరణ్ భావించారు. అయితే ఆ సమయంలో భారతీయ పరిశ్రమ పురుషులకు ప్రత్యేకమైన వృత్తిగా బ్రూయింగ్ను చూసేది. దీంతో విద్యార్హతలు ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగళూరులోని కంపెనీలు ఆమెకు జాబ్ ఇవ్వకుండా తిరస్కరించాయి.ఇలా ఉండగా ఐరిష్ వ్యాపారవేత్త లెస్ ఆచిన్‌క్లోస్‌ను కలుసుకోవడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించమని కిరణ్ మజుందార్ షాను ఆయన ప్రోత్సహించారు. ప్రారంభంలో సంశయించిన ఆమె ఐర్లాండ్‌లోని బయోకాన్ బయోకెమికల్స్‌లో ఆరు నెలల శిక్షణ కోసం ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఒక వేళ ఆమెకు వ్యాపారం సరిపడకపోతే ఉద్యోగం కల్పించడంలో సహాయం చేస్తానని కూడా ఆచిన్‌క్లోస్ హామీ ఇచ్చారు.రూ.10,000తో బయోకాన్ ప్రారంభం1978లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కిరణ్ బయోకాన్ బయోకెమికల్స్తో భాగస్వామిగా ఉంటూ కేవలం రూ.10,000 పెట్టుబడితో బయోకాన్ ఇండియాను స్థాపించారు. చిన్న గ్యారేజీలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె బొప్పాయి సారం నుండి ఎంజైమ్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్పత్తులు యూఎస్, యూరప్‌లో మార్కెట్‌ను పొందాయి. బయోకాన్‌కు మొదటి విజయం దక్కింది.తరువాత బీర్ వడపోతలో ఉపయోగించే ఐసింగ్లాస్ను తయారు చేయడం ప్రారంభించారు. బయోకాన్ దేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని విలువ రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ.లోన్ ఇవ్వని బ్యాంకులుకిరణ్ తొలిరోజులలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో బయోటెక్నాలజీ భారత్‌లో ఒక నూతన రంగం. ఒక మహిళా వ్యాపారవేత్తగా ఆమె రాణించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పరిశ్రమలో విజయం సాధించగల ఆమె సామర్థ్యాన్ని అనుమానిస్తూ బ్యాంకులు ఆమెకు రుణాలు మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ, ఆమె సంకల్పం, వినూత్న విధానం సందేహాల వ్యక్తం చేసినవారి కళ్లు తెరిపించాయి.


