రూ. 20 వేలతో ష్యాషన్‌ బ్రాండ్‌..కోట్ల టర్నోవర్‌ : దోస్తుల సక్సెస్‌ స్టోరీ | Meet Nirupama Singh Sharma and Anjana Bhamra The Saffron Saga success journey | Sakshi
Sakshi News home page

రూ. 20 వేలతో ష్యాషన్‌ బ్రాండ్‌..కోట్ల టర్నోవర్‌ : దోస్తుల సక్సెస్‌ స్టోరీ

Jun 3 2025 4:05 PM | Updated on Jun 3 2025 5:48 PM

Meet Nirupama Singh Sharma and Anjana Bhamra The Saffron Saga success journey

కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక, వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని  అందలాలను అధిరోహించాలనే పట్టుదల  ఇద్దరు స్నేహితరాళ్లను  వ్యాపారవేత్తలుగా మార్చింది. ఇది వారి కలలను సాకారం చేసుకోవడం వరకే పరిమితం కాలేదు. నేత వస్త్రాలను ప్రాచుర్యం, చేతివృత్తులవారికి ఆర్థిక స్వావలంబన, మహిళాలకు సాధికారతను తెచ్చి పెట్టింది. అలా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన నిరుపమ సింగ్‌ శర్మ, అంజనా భమ్రా అనే ఇద్దరు స్నేహితులు అద్భుతాలు చేశారు. ఇంతకీ వీరేం సాధించారు తెలుసుకుందామా...!

నిజానికి నిరుపమ సింగ్‌( Nirupama Sharma) అంజనా భమ్రా Anjana Bhamra) సక్సెస జర్నీ  సుమారు పదేళ్ల క్రితం సాయంత్రం కాఫీ ఒక స్నేహితుడు అడిగిన  సాయం వారిలో వ్యాపార ఆలోచనకు పునాది వేసింది.  ఫ్యాషన్, ఫాబ్రిక్ పట్ల వారి జ్ఞానం  ఆసక్తి సొంత  ఫ్యాషన్ లేబుల్ కలిగి ఉండాలనే ఆలోచన వారి మనస్సులలో మొలకెత్తింది. అలా ‘ది సాఫ్రాన్ సాగా ’ పుట్టింది. భారతీయ కళా నైపుణ్యం, మహిళా సాధికారత, ఫ్యాషన్, పర్యావరణ అనుకూల డిజైనర్‌ దుస్తుల బ్రాండ్ ఇది. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో దేశీయ హస్తకళను ప్రోత్సహిస్తుంది.చీరలు, సూట్లు, దుస్తులు, బ్లౌజులు , ట్రెండీ లాంజ్‌వేర్ వంటి ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తున్నారు అంతేకాదు తమ బ్రాండ్‌ను జీరో-వేస్ట్‌గా మార్చడానికి ,మిగిలిపోయిన బట్టలను రీసైక్లింగ్‌  కూడా చేస్తారు. 

ఇదీ చదవండి : అమ్మలపై హింస-పిల్లలకు చెప్పలేనంత నరకం : న్యూ స్టడీ

 

పురాతన  హస్తనైపుణ్యానికి, ఆధునిక ట్రెండ్‌ను, సౌందర్యాన్ని జోడించి,  పలురకాల  ప్రింట్లు , రంగులతో  అనేక ప్రయోగాలు చేస్తున్నాం అంటారు సాఫ్రాన్ సాగా వ్యవస్థాపకులు నిరుపమ సింగ్ శర్మ, అంజనా భమ్రా.  వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, సితార, లినెన్, బాటిక్, బాగ్ బహార్, ఇంద్రధనుష్ వంటి గాలి ఆడేలా, లేత రంగు ఫాబ్రిక్‌ను ఎంచుకుంటామన్నారు. సీజన్‌కు తగినట్టు దుస్తులను తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణను సొంతం చేసుకున్నారు.

2015లో పదేళ్ల క్రితం కేవలం 20వేల రూపాయల పెట్టుబడితో 'ది సాఫ్రాన్ సాగా' అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. అదీ 40 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రపంచంలోకి అడగుపెట్టారు.  అంజనా ఒక హోటల్, సెలూన్, బోటిక్ నడిపేది. ఆమె స్నేహితురాలు నిరుపమ మార్కెటింగ్, కమ్యూనికేషన్లలో నిపుణురాలు.  ఇలా వీళ్లిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న ఈ బిజినెస్ టర్నోవర్  రూ. 1.5 కోట్లను దాటేసింది.  అయితే వీరి సక్సెస్‌ జర్నీ అనుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు.   బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఒక సవాల్‌ అయితే, తమ బ్రాండ్‌ను జనాల్లోకి   తీసుకెళ్లడం మరో సవాల్‌.  ఒక దశలో ఈఎంఐలు కట్టడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది.  ఈ సవాళ్లను  ఇద్దరూ కలిసి మొక్కవోని దీక్షతో అధిగమించారు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు కరిగి పోయాయి.  మొదట్లో ఆశించినంత లాభాలు రాక, ఆదాయం రాకపోయినా నిరాశపడలేదు. ధైర్యంతో తమ బ్రాండ్‌ను విజయ తీరాలకు చేర్చారు.  ఏదైనా  సాధించాలనే  పట్టుదల, కృషితో ముందుకు సాగి,  సక్సెస్‌కు వయస్సు అడ్డంకి  కాదని నిరూపించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement