భూమికి రెండో చందమామ! | Earth Has a Hidden Second Moon | Sakshi
Sakshi News home page

భూమికి రెండో చందమామ!

Aug 2 2026 2:45 AM | Updated on Aug 2 2026 2:45 AM

Earth Has a Hidden Second Moon

భూమికి ఉపగ్రహంగా చందమామ ఉన్న సంగతి మనకు తెలుసు. ఇప్పటి వరకు భూమి చుట్టూ తిరిగే చందమామ ఒక్కటే అని అనుకుంటున్నాం. కాని, శాస్త్రవేత్తలు ఇటీవల భూమి చుట్టూ తిరిగే మరో చిన్న చందమామను కూడా కనుగొన్నారు. తొలిసారిగా దీనిని హవాయిలోని ‘పాన్‌ స్టార్స్‌1’ ఆస్టిరాయిడ్‌ టెలిస్కోప్‌ ద్వారా దశాబ్దం కిందటే శాస్త్రవేత్తలు గమనించారు. 

తొలిసారిగా చైనా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఉపగ్రహం ఈ రెండో చందమామ ఫొటోలు తీసి, భూమ్మీదనున్న అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపింది. చైనా పంపిన ‘టియాన్‌వెన్‌–2’ ఉపగ్రహం వందకోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రెండో చందమామ ఫొటోను విజయవంతంగా తీయగలిగింది. అంతేకాదు, దీనిపైనున్న శిలలను కూడా సేకరించింది. ఇది పూర్తిస్థాయి ఉపగ్రహం కాదని, గ్రహశకలం మాత్రమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

భూ కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ‘2016 హెచ్‌ఓ3’ అనే ఈ రెండో చందమామను ‘భూ కక్ష్యలో పరిభ్రమించే సహ గ్రహవస్తువు’ మాత్రమేనని చైనా భౌతిక శాస్త్రవేత్త రోంగ్‌కియావో ఝాంగ్‌ అభిప్రాయపడుతున్నారు. అయితే, మరికొందరు శాస్త్రవేత్తలు దీనిని ‘మైక్రో మూన్‌’గా– అంటే, చిరుజాబిలిగా అభివర్ణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement