అతిపెద్ద పిగ్గీబ్యాంకు | Giant piggy bank in Colombia accepts change for animal shelters | Sakshi
Sakshi News home page

అతిపెద్ద పిగ్గీబ్యాంకు

Aug 2 2026 1:30 AM | Updated on Aug 2 2026 1:30 AM

Giant piggy bank in Colombia accepts change for animal shelters

పిగ్గీబ్యాంకులు సాధారణంగా పిల్లలు తేలికగా పట్టుకొనేలా ఉంటాయి. పిగ్గీబ్యాంకులతో ఆడుకుంటూ, వాటిలో చిల్లర డబ్బులు దాచుకుంటూ, పిల్లలు తొలి పొదుపు పాఠాలు నేర్చుకుంటారు. కొలంబియాలోని ఒక థీమ్‌ పార్కులో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పిగ్గీబ్యాంకు బొమ్మను ఏర్పాటు చేశారు. రకీరా నగరంలోని ‘ప్యూబ్లిటో డి బారో’ అనే థీమ్‌ పార్కులో 29.6 అడుగుల ఎత్తు, 33.11 అడుగుల పొడవు ఉన్న పిగ్గీ బ్యాంకు బొమ్మను ప్రత్యేక ఆకర్షణగా ఇటీవలే నెలకొల్పారు.

దీని బరువు దాదాపు ముప్పయి టన్నులు. మామూలు పిగ్గీ బ్యాంకుల మాదిరిగానే దీనికి కూడా కాయిన్‌ స్లాట్‌ ఉంది. సందర్శకులు ఇందులో వేసే డబ్బులను కొలంబియా ప్రభుత్వం జంతు సంరక్షణ కేంద్రాల నిర్వహణ కోసం ఖర్చు చేయనుంది. మానో డెల్‌ ఆర్టిసానో అనే కొలంబియన్‌ శిల్పి దీనిని రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పిగ్గీబ్యాంకుగా దీనికి గిన్నిస్‌ రికార్డు కూడా దక్కడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement