breaking news
piggy bank
-
డబ్బులు దాచుకునే పిగ్గీ బ్యాంక్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?
పిల్లలూ... మీరంతా డబ్బులను భద్రంగా దాచుకునేందుకు పిగ్గీ బ్యాంక్‌ను ఉపయోగిస్తుంటారు కదూ. పెద్దలు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుల్ని ఇందులో దాచుకొని, అది నిండాక పగలగొట్టి వాడుకుంటారు కదూ. వరాహం ఆకారంలో ఉండే ఈ పిగ్గీ బ్యాంక్ వాడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగానూ పెట్టుకుంటారు.ఇలా డబ్బు దాచుకునే సాధనాలను వాడే అలవాటు క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదలైందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు ఆ కాలంలో వారు డబ్బులు దాచే పెట్టెలు, హుండీలు బయటపడ్డాయి. వాటిని వివిధ రకాల లోహాలతో తయారు చేశారు. అయితే వరాహ ఆకారంలో ఇలాంటివి తయారు చేయడం మాత్రం క్రీ,శ, 12వ శతాబ్దంలో మొదలైందని అంటారు.వరాహ ఆకారంలో ఉన్న ఈ హుండీలు జావా ద్వీపంలో మొట్టమొదటిసారి దొరికినట్లు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో పెద్ద సంఖ్యలో వరాహ ఆకారపు పిగ్గీ బ్యాంకులు కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆకారంలోని పిగ్గీ బ్యాంకులు 13వ శతాబ్దంలో జర్మనీలో తయారయ్యాయని అంటున్నారు. అక్కడ పందులను అదృష్టానికి చిహ్నాలుగా గౌరవించేవారని, అందుకే పంది ఆకారంలో వాటిని తయారు చేసేవారని భావిస్తున్నారు.ఈ పిగ్గీ బ్యాంక్‌లు సిరామిక్ లేదా పింగాణీతో తయారు చేస్తారు. వివిధ సైజులు, ఆకారాలతో ఇవి లభ్యమవుతాయి. విదేశాల్లో పిల్లలకు పుట్టినరోజు బహుమతులుగా వీటిని ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. పిల్లల్లో పొదుపు ఆలోచన పెంచేందుకు కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పిగ్గీ బ్యాంకులను వారికి ఉచితంగా అందిస్తుంటాయి. -
పిల్లలంతా కలిసి కోట్లు కూడబెట్టారు!
ఇంజనీరింగ్‌లో చేరిన 17 ఏళ్ల కపిశ్ ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి వాళ్ల నాన్నను డబ్బులు అడిగాడు. కాలేజీ ఫీజుకే అప్పుచేసిన అతడి తండ్రి ల్యాప్‌టాప్ కొనడానికి మళ్లీ అప్పు చేయడానికి రెడీ అయ్యాడు. చదువులు అన్నాక అవసరమైనవి కొనక తప్పదు. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఫీజులతో పాటు పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల కోసం అదనంగా బడ్జెట్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్నాయి. అయితే తమకు అలాంటి బాధ లేదంటున్నారు గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా ఇదార్ తహసీల్‌లోని గ్రామాలకు చెందిన ప్రజలు. ఎందుకంటే వారికి అండగా బాలగోపాల్ బ్యాంక్ ఉంది. నిజానికిది బ్యాంక్ కాదు, కోపరేటివ్ సొసైటీ!పల్కిన్ రావల్ అనే 12వ తరగతి విద్యార్థిని తాను కూడబెట్టిన డబ్బులతో ఇటీవల ల్యాప్‌టాప్ (Laptop) కొనుక్కుంది. పదో తరగతి ట్యూషన్ ఫీజు కూడా తన సేవింగ్స్ నుంచే కట్టింది. అంతేకాదు కొత్త సైకిల్ కూడా కొనుక్కుంది. బాలగోపాల్ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బుతో ఇవన్ని చేసింది. ఇంత చేసి ఆమెది ధనవంతులు కుటుంబమేమీ కాదు. ఇదార్ పట్టణంలో వాళ్ల నాన్న టీ స్టాల్ నడుపుతాడు. బాలగోపాల్ బ్యాంక్‌లో క్రమంగా తప్పకుండా చేస్తున్న చిన్న మొత్తాల పొదుపే వారి అవసరాలు తీరుస్తోంది. పల్కిన్ రావల్ తోబుట్టువులు కూడా ఇదే బ్యాంక్‌లో పొదుపు చేస్తున్నారు. దాదాపు 30 వేల మందిపైగా పిల్లలు ఈ బ్యాంక్‌లో తమ డబ్బులు దాచుకుంటున్నారు. ఇలా పిల్లలు పొదుపు చేసిన మొత్తం రూ. 30 కోట్లు పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకీ బాలగోపాల్ బ్యాంక్ (Bal Gopal Bank) ఇదంతా ఎలా చేయగలిగింది?ఎవరు స్థాపించారు?ఇదార్ పట్టణవాసి అశ్విన్ పటేల్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ బాలగోపాల్ బ్యాంక్. 16 ఏళ్ల క్రితం ఆయన ఈ బ్యాంక్‌ను ప్రారంభించారు. రైతులకు, మహిళలకు సహకార సంఘాలు ఉన్నట్టుగా పిల్లలకు ఎందుకు లేవన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా 2009, మే 30న సబర్కాంత జిల్లాలోని జవాన్పురా గ్రామంలో 'బాలగోపాల్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ' స్థాపించారు. 100 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 335 గ్రామాల నుంచి 30 వేలమందిపైగా పిల్లలు సభ్యులుగా ఉన్నారు. దేశంలో పిల్లల కోసం నడుస్తున్న ఏకైక సహకార సంస్థ తమదేనని 58 ఏళ్ల అశ్విన్ పటేల్ వెల్లడించారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని బాలగోపాల్ బ్యాంక్‌గా పిలుస్తున్నారు. ఎలా పని చేస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు రూ. 110 చెల్లించి బాలగోపాల్ బ్యాంక్‌లో ఖాతా తెరవాలి. వారికి సంస్థ ప్రతినిధులు ఒక పిగ్గీ బ్యాంక్ (డిబ్బి) ఇస్తారు. ఇందులో పొదుపు చేసిన డబ్బును ప్రతినెలా ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లేదా పెద్దవారి సమక్షంలో లెక్కిస్తారు. తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పిల్లల ఖాతాల్లో వేస్తారు. పొదుపు చేసిన డబ్బుకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లిస్తారు. పిల్లలు తమకు అవసరమైనప్పడు లోన్లు కూడా తీసుకోవచ్చు. వెయ్యి మందిపైగా రుణాలు తీసుకున్నారని బ్యాంక్ తెలిపింది. బాలగోపాల్ బ్యాంక్ పనితీరు ప్రశంసనీయంగా ఉండడంతో ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. 'మొదట్లో పిల్లలతో పొదుపు ప్రారభింపజేయడానికి స్థానిక పాఠశాలల్లో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడైతే తల్లిదండ్రులే తమ పిల్లలతో కలిసి వచ్చి బ్యాంక్‌లో ఖాతాలు తెరుస్తున్నార'ని అశ్విన్ పటేల్ తెలిపారు. 10 నుంచి 12 పిల్లలు తమ దగ్గర పొదుపు చేసిన డబ్బుతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజులు చెల్లించారని ఆయన వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్లలోపు ఎవరైనా తమ సంస్థలో డబ్బులు దాచుకోవచ్చని చెప్పారు. దీంతో స్థానికంగా అందరూ దీన్ని 'పిల్లల బ్యాంక్'గా పిలుస్తున్నారు.పేరెంట్స్ ప్రశంసలుబాలగోపాల్ బ్యాంక్ సేవలను పేరెంట్స్ ప్రశంసిస్తున్నారు. తమ పిల్లలు చిన్నతనం నుంచే ఆర్థిక అక్షరాస్యత, పొదుపు పాఠాలను ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నారని వారు అంటున్నారు. డబ్బు పొదుపు ప్రాముఖ్యతతో పాటు, సేవ్ చేసిన సొమ్ములను సరైన వాటికి ఖర్చుచేయడం వారికి అలవాటు అవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొదుపు చేసిన డబ్బుతో పిల్లల చదువులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.చదవండి: పిల్లలూ బ్యాంక్ తలుపు తట్టండి!పైలట్ ప్రాజెక్ట్‌గా.. బాలగోపాల్ బ్యాంక్ విజయవంతంగా నడుస్తుండడంతో దీన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 25 పాఠశాలల్లో 'బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజన’ పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. 5 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల కోసం దీన్ని ప్రవేశపెట్టింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సొంత నియోజకవర్గం ఘట్లోడియాలోని గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో బాల్ గోపాల్ బచత్ బ్యాంక్ యోజనను తాత్కాలికంగా అమలు చేస్తున్నారు. బాలగోపాల్ బ్యాంక్ గురించి తెలిసిన వారు తమ ప్రాంతంలోనూ ఇలాంటి పిల్లల బ్యాంకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. -
పిగ్గీ బ్యాంక్ కహానీ..
కిడ్స్ బ్యాంక్ అనగానే చిన్న పంది పిల్ల ఆకారంలో, డబ్బులు దాచుకునే డిబ్బీ లాంటిది కళ్ల ముందు కదలాడుతుంది. పిల్లలకు చిన్నప్పట్నుంచి పొదుపును అలవాటు చేసేందుకు కిడ్స్ బ్యాంక్‌ని.. పిగ్గీస్ బ్యాంక్ అంటూ పంది పిల్ల ఆకారంలో తయారు చేయడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. సుమారు పదిహేనో శతాబ్దంలో వంట పాత్రలు మొదలైన వాటి తయారీకి ఉపయోగించే లోహాల ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. దీంతో, కాస్త చౌకగా ఉండే పిగ్ (పీఐజీజీ) అనే రకం బంక మట్టితో వీటిని తయారు చేసి విక్రయించేవారు. అడపాదడపా గృహిణులు పావలా, అర్ధణా (అంటే అచ్చంగా ఇవే కావు.. ఏ దేశం కరెన్సీని ఆ దేశం వారు) లాంటివి ఈ పిగ్ బంకతో తయారు చేసిన పాత్రల్లో దాచుకునేవారు. వీటినే పిగ్గీ బ్యాంక్ అంటూ పిలుచుకోవడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఈ పిగ్గీ బ్యాంకులు రూపాంతరం చెందాయి. పంథొమ్మిదో శతాబ్దం ప్రాంతంలో పెద్ద ఎత్తున పిగ్గీ బ్యాంకులకు ఆర్డర్లు రావడంతో సార్థక నామధేయంగా పిగ్ (పంది) ఆకారంలో వీటిని తయారు చేయడం మొదలుపెట్టారు. చూడముచ్చటగా తీర్చిదిద్దడంతో ఇవి పెద్దలతో పాటు పిల్లలను కూడా ఆకట్టుకున్నాయి. అలా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి.