breaking news
Madhya Pradesh
-
వృద్ధుడి వీపుపైకి ఎక్కి కాలువ దాటిన ప్రభుత్వ ఉద్యోగి ..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి అహంకార పూరిత చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఒక రెవెన్యూ అధికారి (పట్వారీ) వృద్ధుడి వీపుపై కూర్చుని పిల్ల కాలువ దాటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సిద్ధి జిల్లాలోని మాతా గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే లాల్వా కేవత్ (65) అనే వృద్ధుడి ఇల్లు, పంట పొలాలను పరిశీలించేందుకు నీలేష్ నామ్‌దేవ్ అనే పట్వారీ అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడ కాలువను దాటే సమయంలో తన బూట్లు తడవకుండా ఉండేందుకు ఆ పట్వారీ వికృత ఆలోచనకు తెరతీశాడు. తనను వీపుపై ఎక్కించుకుంటేనే ఇంటి సర్వే చేస్తానని ఆ వృద్ధుడిని బెదిరించినట్లు తెలుస్తోంది.దీంతో చేసేది లేక ఆ వృద్ధుడు ఆ అధికారిని తన వీపుపై ఎక్కించుకుని నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేర్చాడు. ఈ అమానుష ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ప్రభుత్వ అధికారై ఉండి ఒక వృద్ధుడి పట్ల ఇలా ప్రవర్తించడంపై స్థానికులు నెటిజన్లు, స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. సిద్ధి కలెక్టర్,సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, బాధ్యుడైన పట్వారీ నీలేష్ నామ్‌దేవ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలేకాని, ఇలా వృద్ధులతో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.यह सीधी जिले के पटवारी साहब ।जूते गंदे नहीं हो जाएं इसलिए एक बुजुर्ग के पीठ पर चढ़कर पानी से भरा गड्ढा पार किया pic.twitter.com/R2zDg0u6Z4— SanjayGupta_Journalist (@sanjaygupta1304) September 9, 2026 -
‘టచ్ చెయ్ చూద్దాం’.. ఇంజినీర్లకు హనుమంతుని సవాల్!
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్ ఆలయాన్ని తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆలయంలోని సుమారు 8 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆలయ నిర్మాణంలో కొంత భాగాన్ని తొలగించినప్పటికీ.. విగ్రహాన్ని మాత్రం కదిలించలేకపోయారు. భారీ యంత్రాలను వినియోగించినా విగ్రహం ఏమాత్రం కదలకపోవడం చర్చనీయాంశంగా మారింది.2028లో ఉజ్జయినిలో సింహస్థ మహాకుంభమేళా జరగనుంది. మార్చి 27 నుంచి మే 27 వరకు జరిగే ఈ వేడుకను ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఖడే హనుమాన్ ఆలయాన్ని కూడా తరలించాలని నిర్ణయించారు. విగ్రహాన్ని తొలగించేందుకు మూడు బృందాలు 48 గంటలపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. పనులు ప్రారంభమై నాలుగు రోజులు దాటినా పరిష్కారం లభించలేదు. భారీ యంత్రాలతో ప్రయత్నాలు చేసినా విగ్రహం కదలకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. విగ్రహాన్ని తరలించే సమయంలో సుమారు 50 కోతులు అక్కడికి చేరుకున్నాయని కొందరు పేర్కొన్నారు.భక్తులు దీనిని హనుమంతుడి మహిమగా భావిస్తున్నారు. అయితే ఇంటర్నెట్లోని కొన్ని నివేదికల ప్రకారం.. విగ్రహం పురాతన భూగర్భ పునాదిలో లోతుగా అమర్చి ఉండొచ్చని తెలుస్తోంది. పాత రాళ్ల నిర్మాణాలతో అది అనుసంధానమై ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అధిక బలాన్ని ప్రయోగిస్తే పురాతన రాళ్లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో భారీ తవ్వకం యంత్రాల వినియోగాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆధునిక భూగర్భ స్కానింగ్ సాంకేతికతతో విగ్రహం పునాదిని పరిశీలిస్తున్నారు. ఆలయ పూజారి మహేశ్ బైరాగి స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఇది దేవుడి సంకేతంగా భక్తులు భావిస్తున్నారని చెప్పారు. విగ్రహాన్ని తరలించడం తప్పనిసరైతే, ప్రస్తుతం ఉన్న విధంగానే సురక్షితంగా పునఃప్రతిష్ఠించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఆలయం, విగ్రహం 170 ఏళ్లకంటే పురాతనమైనవని స్థానికులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఐదేళ్లలో 32,596 మంది బలి.. నగరాల్లో కానరాని భద్రత! -
విక్రమార్కుడు సినిమాలో రవితేజలా పదే పదే బదిలీ
భోపాల్: విక్రమార్కుడు సినిమాలో రవితేజ (విక్రమ్ రాథోడ్) నాలుగు సంవత్సరాల సర్వీసులో 10 ట్రాన్స్ఫర్లు పొందుతాడు. అతడు ఎక్కడా కాంప్రమైజ్ కాడని ప్రకాశ్ రాజ్ ఆ సినిమాలో అంటాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి కూడా ఒకే ఒక్క ఏడాదిలో 4వ సారి బదిలీ అయ్యారు. దీంతో తాను తన కింద పనిచేసే అధికారులకు కూడా ఈజీ టార్గెట్‌గా మారానంటూ భారత పరిపాలనా సేవల సంఘానికి లేఖ రాశారు. కేవలం 2 నుంచి 3 నెలల పదవీకాలంతో తాను ఎలా పనిచేయగలనని ఆమె ప్రశ్నించారు. ఆ అధికారిణి పేరు నేహా మార్వ్యా. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. తనను బాధ్యతలు అర్థం చేసుకునేలోపే నన్ను తొలగిస్తున్నారని అన్నారు.గిరిజన ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 2 నెలలు పూర్తికాకముందే ఆమెను మరోసారి బదిలీ చేశారు. తన కింది ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడం, ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వంటి అంశాలపై ఆమె వివరణ కోరుతూ వారికి నోటీసులు జారీ చేశారు.అయితే, ఆ నోటీసులు ఇచ్చిన వెంటనే ఉద్యోగులు ఆమెకు వ్యతిరేకంగా.. పని చేయకుండా నిరసన చేపట్టారు. ఆ నిరసన జరిగిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఆమెను మరోసారి బదిలీ చేసింది. ఆమెను మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ పదవి అదనపు కార్యదర్శి హోదాతో సమానం.నిరుత్సాహానికి గురయ్యాను మార్వ్యా తన లేఖను సంఘం వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. బాధ్యతలు చేపట్టిన 50 రోజులకే తనను బదిలీ చేశారని ఆమె తెలిపారు. ‘‘నేను ఎప్పుడూ ఆదేశాలను గౌరవంగా స్వీకరించాను. కానీ ఈసారి తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యాను’’ అని ఆమె పేర్కొన్నారు. తన కింద పనిచేసే అధికారులు తన బల్లను కొడుతూ, తనను బదిలీ చేయిస్తామని బెదిరించారని ఆమె తెలిపారు. విధేయత లేకుండా వ్యవహరించడం, ఫైళ్లను పేరుకుపోయేలా చేయడంపై తాను ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా తననే బదిలీ చేశారని చెప్పారు.కిందిస్థాయి అధికారులు పోస్టింగ్‌లను నిర్ణయించేంత బలహీనంగా ఐఏఎస్ అధికారి మారగలరా? అని మార్వ్యా ప్రశ్నించారు. తనను బదిలీ చేసేంతగా నెల రోజుల్లో తాను ఏం చేశానని అడిగారు. ‘‘ఒక అధికారి నెల రోజుల్లోనే పని పూర్తిగా అర్థం చేసుకోలేడు. అయినా ఈ బదిలీతో నన్ను అవమానించారు’’ అని ఆమె అన్నారు.తరచూ తక్కువ కాలానికే బదిలీలు కావడంతో తాను తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యానని మార్వ్యా తెలిపారు. ‘‘ఏదో ఒకరోజు పరిస్థితులు మారుతాయని ఆశిస్తూ ఎన్నేళ్లుగా సహనం పాటించాను. కానీ ఇప్పుడు కిందిస్థాయి అధికారులు నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. కుట్రలు చేసేవాళ్లే ఎప్పుడూ గెలుస్తున్నారు. నేను ఓడిపోతున్నాను. ఈ రోజు నేను లక్ష్యంగా మారాను. రేపు మరో ఐఏఎస్ అధికారి లక్ష్యం కావచ్చు’’ అని ఆమె సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆమె లేఖపై సంఘం ఇప్పటివరకు స్పందించలేదు.2025 జనవరిలో డిండోరి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 8 నెలల తర్వాత మార్వ్యాను ఆ పదవి నుంచి తొలగించారు. 2017లో శివపురి జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన సమయంలో వాహనాల చెల్లింపుల విషయంలో అప్పటి కలెక్టర్ ఓపీ శ్రీవాస్తవతో ఆమెకు వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారం అప్పట్లో వార్తల్లో నిలిచింది. 2022లో రెవెన్యూ శాఖలో తనకు కేటాయించిన పదవిలో బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లినప్పుడు ప్రధాన కార్యదర్శి మనీష్ రస్తోగి తనను లోపలికి రానివ్వలేదని ఆమె ఆరోపించారు. -
కల్తీ మద్యం కాటుకు 10 మంది బలి
సాగర్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బండా తహసీల్‌లో విషపూరిత మద్యం తాగి 10 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం–ఆదివారం మధ్య రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది.సాగర్ జిల్లా కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ నుంచి మద్యం అక్రమంగా తరలించినట్లు తేలింది. ఇప్పటివరకు అనుమానితులుగా గుర్తించిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. మరో అధికారిని జిల్లా నుంచి బదిలీ, చేసి గ్వాలియర్ ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా నియమించారు. బండా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తో పాటు గూగ్రా ఔట్‌పోస్ట్ ఇన్చార్జిని కూడా సస్పెండ్ చేశారు.కాగా, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మద్యం మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ పట్వారీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ అక్రమ మద్యం వ్యాపారం ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నించారు. ఈ విషపూరిత వ్యాపారం ఎవరి అండతో కొనసాగుతోందో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి -
తీవ్ర విషాదం.. కల్తీ మద్యం సేవించి 10 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాగర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పదిమంది మృతిచెందారు. మృతులంతా అక్కడి ఘూఘర్, నౌరాజ్, బరాజ్ తదితర గ్రామాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.అయితే నిన్న శనివారం మద్యం సేవించిన అనంతరం బాధితుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు మృతిచెందిట్లు వైద్యులు ప్రకటించారు. మరి కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ మరణాలకు కల్తీ మద్యమే కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదికలు వచ్చే వరకు అధికారికంగా కారణాన్ని నిర్ధారించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.యూపీ నుంచి కల్తీ మద్యం సరఫరా?ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సాగర్‌కు సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ కేంద్రంగా ఓ అక్రమ మద్యం సరఫరా నెట్వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితులు లలిత్‌పూర్‌లో నకిలీ మద్యాన్ని తయారు చేసి, సాగర్ సరిహద్దు గ్రామాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.నకిలీ మద్యాన్ని అసలైన బ్రాండ్ల మాదిరిగా కనిపించేలా నకిలీ లేబుళ్లు, క్యాప్‌లు, క్యూఆర్ కోడ్లు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కార్లు, మోటార్‌సైకిళ్ల ద్వారా ఈ మద్యాన్ని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు అనుమానిస్తున్నారు.బాంద్రీ, బరోడియా, ఘూఘారా ఖుర్ద్, నౌరాజ్, బరాజ్ తదితర గ్రామాలకు ఈ నకిలీ మద్యం చేరినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరు సరఫరా చేశారు? స్థానికంగా ఎవరైనా ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఘటనపై సీఎం సీరియస్సాగర్లో జరిగిన మరణాలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఘటనాస్థలికి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!
-
Bittu Tabahi : ‘బిట్టు’కు బంపరాఫర్
భోపాల్: డబ్బు లేకపోవచ్చు, పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు.. కానీ గుండెల్లో కసి, చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు. ఎదిగేందుకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు! డిజిటల్ రీల్స్, ఫాలోవర్ల కోసం పాకులాడే ఈరోజుల్లో.. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, కనీసం ఈత రాకపోయినా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో ప్లాస్టిక్ చెత్తను తొలగించాడు ఆ యువకుడు. అతని అంకితభావాన్ని గుర్తించిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ స్వయంగా మాతో కలిసి పనిచేయండి అంటూ ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఇంతకీ ఎవరీ నయా సోషల్ మీడియా సెన్సేషన్?సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ ‘బిట్టు తబాహి’(ఉర్దూలో ‘తబాహి’ అంటే విధ్వంసం). మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాలో నివసించే 21 ఏళ్ల యువ పర్యావరణ వాలంటీర్. పర్యావరణ ప్రేమికుడైన బిట్టు, ఒక రోజు తన ఇంటి సమీపంలో ప్రవహిస్తున్న అజ్నార్ నది పూర్తిగా కాలుష్యంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడాన్ని గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒంటిచేత్తో నదిని శుభ్రం చేసేందుకు పూనుకున్నాడు.సాయం కోసం ఎదురు చూడలేదు. డబ్బులు ఉన్నాయా? లేదా? అని ఆలోచించలేదు. ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డేని పురస్కరించుకొని నదిలో చెత్తను తొలగించే యజ్ఞాన్ని ప్రారంభించాడు. మొదట్లో బిట్టుకు అతని స్నేహితులు, స్థానికులు సాయం చేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనొక్కడే సైన్యంలా మారాడు. కేవలం ప్రాథమిక పనిముట్లతో, సరైన భద్రతా పరికరాలు లేకుండా, ఈత కూడా రాకపోయినా, అతను చేతితో నది నుండి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు.👉ఇదీ చదవండి: సీఏని వదిలేయ్.. దోసెలేసుకో!ఈ క్రమంలో బిట్టు తబాహి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది. రకరకాల ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు ఇబ్బంది పెట్టాయి. కొన్ని సార్లు పాముల బెడద ఎక్కువైంది. అయినా, వెనక్కి తగ్గకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాడు. దీంతో బిట్టు లోకల్ హీరో అయ్యాడు. అతని పనితీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దృష్టిని ఆకర్షించడంతో, ఆయన బిట్టును తన ఇంటికి ఆహ్వానించారు. సీఎం అతని చొరవను ప్రశంసించడమే కాకుండా, ప్రభుత్వ మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.అతని ప్రయత్నాలకు ప్రశంసలు మాత్రమే కాకుండా, డచ్ స్వచ్ఛంద సంస్థ జాబ్ ఆఫర్ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాలుషితమైన నదిని నెలల తరబడి స్వతంత్రంగా శుభ్రం చేసిన యువకుడిగా అతన్ని ప్రశంసిస్తూ, నది ప్రక్షాళనకు ముందు, తర్వాత తీసిన చిత్రాలను డచ్ కంపెనీ ఫౌండర్, సీఈఓ ట్వీట్ చేశారు. అతని అంకితభావాన్ని చూసి ముగ్ధుడైన స్లాట్ వచ్చి మా దగ్గర పని చేయండి అంటూ బహిరంగంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A 20 year old Indian man, Surendra Singh Choudhry, known as “Bittu Tabahi,” has been cleaning the heavily polluted Ajnar River himself for months pic.twitter.com/U7N4BkItkf— non aesthetic things (@PicturesFoIder) September 4, 2026Come work for us @Surendr75950620— Boyan Slat (@BoyanSlat) September 4, 2026 -
నిన్నగాక మొన్న ప్రేమ పెళ్లి.. వాటర్ ట్యాంక్‌లో శవంగా నవవధువు
ఇండోర్‌లోని నెహ్రూ నగర్లో వివాహమైన 25 రోజులకే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటి బయట ఉన్న నీటి ట్యాంక్‌లో ఆమె శవమై తేలింది. పొరుగు వారి సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మృతురాలు వందనా కుష్వాహా ఈ ఏడాది ఆగస్టు 11న ఉపేంద్ర పటేల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు గానీ వివాహం జరిగి నెల కూడా తిరగ్గకుండానే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది.అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వందన గట్టిగా అరిచిన శబ్దం విన్నారు పొరుగువారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భర్త ఉపేంద్ర పటేల్ షర్టుపై రక్తం మరకలతో బయటకు రావడం, ఇంట్లో ఏ చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. నీటి ట్యాంక్‌లో మృతదేహంపొరుగువారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధించగా, ఇంటి బయట ఉన్న వాటర్ ట్యాంక్‌లో వందన మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త ఉపేంద్ర పటేల్‌కు తీవ్రమైన వ్యసనాలున్నాయని, ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. గతంలో వందన కుటుంబ సభ్యులు చందన్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ, వందన మేజర్ కావడంతో ఉపేంద్రతోనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చింది.ఇదీ చదవండి: లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకంప్రాథమికంగా ఇది హత్యగా అనుమానిస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నిధి సక్సేనా తెలిపారు. భర్త ఉపేంద్ర పటేల్, అతని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి పూర్తి కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి : వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
రసోడా గ్యాంగ్ కి'లేడీ'ల కార్ఖానా
సాక్షి, హైదరాబాద్ : రసోడా గ్యాంగ్..ఇదే గనుక టార్గెట్ చేస్తే క్షణాల్లో దొంగతనం జరగాల్సిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాకు ఓ ప్రత్యేకత ఉంది. దీనిలో ఉండే మహిళలు పురుషులకంటే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. చాలా టెక్నిక్‌గా చోరీ చేస్తారు. మరో విశేషమేంటంటే పిల్లలకు దొంగతనం ఎలా చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అనే విషయమై శిక్షణ ఇస్తారు. వృద్ధులను లక్ష్యం చేసుకోవడం ఒక ఎత్తయితే పెళ్లిళ్లకు అతిథులుగా వెళ్లి అందరిలో కలిసిపోయి చిన్నారులతో దొంగతనాలు చేయించడం ఈ మహిళా గ్యాంగ్ ప్రత్యేకత. అయితే సాధారణ సమయాల్లో కేవలం మహిళలే బృందాలుగా వెళ్తారు. అనువైన లాడ్జీల్లో బస చేస్తారు. ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ వృద్ధులను టార్గెట్ చేస్తారు.అదును చూసుకుని వారి దృష్టి మళ్లించి నగదు తస్కరిస్తారు. ఇక ముహూర్తాల సీజన్లో అయితే స్త్రీ పురుషులు ‘సుశిక్షితులైన’ చిన్న పిల్లలను తీసుకుని వస్తారు. కాస్త ఖరీదైన హోటళ్లలో బస చేస్తారు.పెళ్లి మండలాలకు అతిథులుగా వెళ్తారు. వధూవరుల గదుల్లోకి పిల్లల్ని పంపి బంగారం చోరీ చేయిస్తారు. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో పంజా విసిరే మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా నర్సింగ్ గఢ్ తహసీల్ పరిధిలోని పిప్లా్య రసోడా, గుల్ఖేడీ, కడియా గ్రామాలకు చెందిన రసోడా గ్యాంగ్ వ్యవహారమిది. హైదరాబాద్, మల్కాజ్‌గిరితో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఈ ముఠా గుట్టును మంగళ్‌హాట్ పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. ఇద్దరు మహిళల్ని అరెస్టు చేయగా...మరో నలుగురు తృటిలో తప్పించుకున్నారు. మహిళల పంథా మరోరకంగా... మెట్రో నగరాల్లోని ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసుకునే మహిళలు గ్రూపులుగా ఆ ప్రాంతానికి చేరుకుని లాడ్జీల్లో బస చేస్తారు. ప్రతి రోజూ ఉదయం కొందరు బయటకు రాగా... మరికొందరు గదిలోనే ఉంటారు. వీరు అనువైన ప్రాంతం, టార్గెట్‌ను గుర్తించడానికి సమయం పడుతుంది. ఈలోపు అలసిపోయిన వాళ్లు తమ షిఫ్ట్ ముగించుకుని లాడ్జీకి వెళ్లగా.. అక్కడ రెస్ట్‌లో ఉన్న వాళ్లు స్పాట్‌కు చేరుకుంటారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ చేరి, అలజడి సృష్టిస్తూ దృష్టి మళ్లించి వారి బ్యాగ్‌లు కట్ చేయడం ద్వారా నగదు తస్కరిస్తారు. ఆ వెంటనే అక్కడ నుంచి లాడ్జీకి వచ్చేస్తారు. ఒక నేరం చేసిన తర్వాత కొన్నాళ్లు ఆ ప్రాంతానికి మళ్లీ రారు. ఇలా గడిచిన రెండు నెలల్లో ఫిల్మ్‌నగర్, సరూర్‌నగర్, మంగళ్హాట్ల్లో మూడు నేరాలు చేశారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర చాకచక్యంగా నిఘా ఉంచారు. శనివారం మరోసారి వచ్చిన గ్యాంగ్ లాడ్జీలో బస చేయగా... తన బృందంతో దాడి చేశారు. అనిత బాయ్, మల్కా శిసోడియా చిక్కగా... పూజ, లలిత శిసోడియా, బాబ్లీ శిసోడియా, రామ్సాఖీ తృటిలో తప్పించుకున్నారు.చిన్నారులకు చోరీల్లో శిక్షణ ఇచ్చి...ఈ రసోడా గ్యాంగ్‌కు పిప్లా్య రసోడా గ్యాంగ్ అనే పేరు కూడా ఉంది. ఈ ముఠాల్లో పురుషుల కంటే మహిళలే యాక్టివ్‌గా ఉంటారు. పెళ్లి మండపాలను టార్గెట్‌గా చేసుకునే వీళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారుల్ని వినియోగిస్తారు. తొలుత తమ గ్రామాల్లోని పిల్లల్లో చలాకీగా ఉన్న వారిని ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించేలా వారి తల్లిదండ్రులతో ఒప్పందాలు చేసుకుంటారు. చోరీలు ఎలా చేయాలనే అంశంపై ఆ చిన్నారులకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ వ్యవహారం మొత్తం మహిళల నేతృత్వంలోనే సాగుతుంది. చిక్కితే డిస్ట్రాక్షన్ టెక్నిక్ వాడి...ఆ తర్వాత కొందరు పురుషులతో కలిసి మెట్రో నగరాలకు వస్తారు. అక్కడ జరిగే వివాహాలకు అతిథులుగా వెళ్తారు. వందలాది మంది అతిథుల్లో కలిసిపోయి వధువు, వరుడితోపాటు ఇతరు కీలక అతిథులకు కేటాయించిన గదుల్ని గుర్తిస్తారు. ఆపై అదును చూసుకుని చిన్నారుల్ని వాటిల్లోకి పంపి బంగారం, వెండి నగలతో పాటు నగదు తీసుకువచ్చేలా చేస్తారు. ఇవి చేతికి చిక్కిన వెంటనే ఆ ప్రాంతం నుంచి ఉడాయిస్తారు. ఈ చిన్నారులు అనుమానాస్పదంగా యజమానులకు పట్టుండితే ‘డిస్ట్రాక్షన్ టెక్నిక్’వాడతారు. ‘చాక్లెట్ల కోసం లోపలికి ఎందుకు వెళ్లావు?, అది మన గది కాదు’అంటూ పిల్లవాడిని మందలిస్తున్నట్లుగా నటించి ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ స్థానిక నిర్వహణ, పిల్లలను సమకూర్చడం, శిక్షణ ఇవ్వడం, టార్గెట్లను గుర్తించడం, చిన్నారుల్ని నగరాలకు తీసుకెళ్లడం, దొంగతనం సమయంలో పర్యవేక్షించడం, దొంగిలించిన వస్తువులను తరలించడం, విక్రయించడానికి వేర్వేరు సభ్యుల్ని వాడుతూ వ్యవస్థీకృతంగా పని చేస్తుంది. -
చావు అంచుల వరకు వెళ్లిన యువకుడు.. కాపాడిన ‘చున్నీ’
భోపాల్: ఒక్కసారిగా విరుచుకుపడిన భయంకరమైన వరద.. కళ్లముందే బైక్‌తో సహా కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి.. ‘కాపాడండి.. కాపాడండి’ అని ప్రాణభయంతో కేకలు వేస్తూ అర్థిస్తున్నాడు. అప్పుడే దేవుడిలా ముందుకొచ్చింది ఓ నవవధువు! క్షణం ఆలస్యం చేయకుండా తన మెడలోని చున్నీనే తాడులా విసిరింది! ఆ అభాగ్యుడు దాన్ని పట్టుకోగానే.. తన బంధువు, మరో స్థానికుడి సాయంతో శక్తులన్నీ ఒడ్డి అతడిని ఒడ్డుకు లాగి, మృత్యువు నుంచి కాపాడింది.ఘటాష్నిలోని మామ్లా గ్రామానికి చెందిన ఆ వ్యక్తి సోమవారం సాయంత్రం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఉప్పొంగిన వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోవడం ప్రారంభించాడు. అదే సమయంలో రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నవవధువు, ఆమె బంధువైన మరో మహిళ ఈ భయానక దృశ్యాన్ని గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా ఆ నవవధువు తన మెడలోని చున్నీని తొలగించి, నీటి ప్రవాహంలో పోరాడుతున్న బైకర్ వైపు తాడులా విసిరింది.ఆ వ్యక్తి చాకచక్యంగా చున్నీని పట్టుకోగా, నవవధువు,ఆమెతో ఉన్న మహిళ దాన్ని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు లాగడం ప్రారంభించారు. వారి ధైర్యసాహసాలను చూసిన మరో స్థానికుడు కూడా వెంటనే పరుగెత్తుకొచ్చి వారితో చేయి కలిపాడు. ముగ్గురూ కలిసి శక్తులన్నీ ఒడ్డి ఆ బైకర్‌ను ప్రాణాపాయం నుంచి సురక్షితంగా రక్షించారు.ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు చంబా జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితిలోనూ సొంత ప్రాణాలను పణంగా పెట్టి బైకర్‌ను కాపాడిన ఆ నవవధువు, ఆమె బంధువుల సాహసాన్ని స్థానికులతో పాటు ప్రభుత్వ అధికారులు విశేషంగా కొనియాడుతున్నారు. A biker caught in a sudden flash flood in Himachal Pradesh's Chamba was pulled to safety by a family who risked the strong current to help him. The incident took place on the Kakiara-Tunuhatti road in the Bharmala area of Bhatiyat after heavy rain late in the evening caused water… pic.twitter.com/pdvEimLaER— NDTV (@ndtv) September 1, 2026 -
‘డాక్టర్లు నన్ను చంపేస్తారు’ అని చెప్పిన కొద్దిసేపటికే మహిళ మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రేవాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 25 ఏళ్ల మహిళ, ఆమె నవజాత శిశువు మృతి చెందారు. ప్రసవానికి కొన్ని గంటల ముందు ఆమె చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కల్పనా మిశ్రా అనే ఆ మహిళ తనను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను వేడుకున్నారు ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తే తనకు ప్రాణహాని జరుగుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు.“నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. నేను బతకను.. వాళ్లు నన్ను చంపేస్తారు” అని కల్పనా మిశ్రా అన్నారు. కల్పనను మంగళవారం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. దీనిని గాంధీ మెమోరియల్ ఆసుపత్రి అని కూడా పిలుస్తారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మరుసటి రోజు ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమెతో పాటు ఆమె నవజాత శిశువు మృతి చెందారు.కల్పన తన ఆరోగ్య పరిస్థితి గురించి పదేపదే ఫిర్యాదు చేసినా, ఆమెకు సకాలంలో చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని కూడా వారు ఆరోపించారు. ఈ వీడియోలో కల్పనా తీవ్ర ఆందోళనలో కనిపిస్తూ, తనను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తూ, వైద్యులు చికిత్స చేస్తున్నారని, ఆమెకు ఏమీ కాదని చెప్పడం కనిపించింది.ఈ మరణాలపై ఆసుపత్రిలో నిరసనలు మొదలయ్యాయి. మృతురాలి కుటుంబ సభ్యులు ప్రధాన ద్వారం బయట బైఠాయించి, బాధ్యులుగా భావించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను ఆసుపత్రి అధికారులు ఖండించారు. ఆందోళన తీవ్రం కావడంతో డీన్ సునీల్ అగర్వాల్, సూపరింటెండెంట్ రాహుల్ మిశ్రా అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిష్పక్షపాత విచారణ జరుపుతామని వారికి హామీ ఇచ్చారు.ప్రాథమిక చర్యగా విధుల్లో ఉన్న ఇద్దరు నర్సింగ్ అధికారులను సస్పెండ్ చేశారు. మరణాలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనుంది. పోస్టుమార్టం, విచారణ నివేదికలు వచ్చిన తర్వాతే తల్లి, నవజాత శిశువు మృతికి కచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని అధికారులు తెలిపారు.పరిస్థితిని తెలుసుకునేందుకు మంగావన్ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర ప్రజాపతి కూడా ఆసుపత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, ఎవరైనా బాధ్యులుగా తేలితే చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. Heartbreaking: A 25 year old woman Kalpana Mishra died with her newborn during her first delivery at Gandhi Memorial Hospital in Rewa home district of MP Deputy CM and Health Minister Rajendra Shukla. शब्द: "ऐ बाबू हमको बचा लो ये हमको मार डालेंगे "🙏A video shows her crying… pic.twitter.com/Hq8oPNXiWh— Ramesh Speaks (@rameshofficial0) August 27, 2026 -
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్‌స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..అమ్మ సంకోచం.. నాన్న సరే...సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను. వ్యతిరేకతను ఎదుర్కొన్నా...గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది. ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్‌తో పాటు భారత్‌లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.కెరీర్‌గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్‌తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్‌ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది. అమ్మాయిలూ... అలా చేయండిఅమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.– సత్యబాబు, సాక్షి -
బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికారికంగా ప్రజా సేవల కోసం ఉపయోగించాల్సిన వనరుల వినియోగంపై ఈ ఘటనతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఈ వ్యవహారంపై చర్చకు కారణమైంది. ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వనరులను ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అవసరాలకు ఎలా వాడుకుంటారో ఈ ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది.మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో అధికారిక నివాసం బయట బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా వ్యక్తిగత కారును అగ్నిమాపక వాహనంతో కడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అగ్నిమాపక వాహనానికి ఉన్న పైపులతో ముగ్గురు సిబ్బంది ఎమ్మెల్యే ఇన్నోవాపై నీటిని చల్లడం కనిపించింది. బిలోంజీలోని షా అధికారిక నివాసం బయట రోడ్డుపై ఆ వాహనం నిలిపి ఉంది.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు..ఇదిలా ఉండగా, వీడియోను తాను చూసినట్లు షా తెలిపారు. నీటిని నింపేందుకు ఆ వాహనం మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని, అక్కడ అనుకోకుండా నిలిపి ఉంచారని చెప్పారు. “మేము కూడా వీడియో చూశాం. ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ తన సొంత కారును కడుక్కోడు. అగ్నిమాపక వాహనం నీటి ట్యాంకును నింపేందుకు మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. అక్కడ అనుకోకుండా వాహనాన్ని నిలిపి ఉంచారు. అందుకే దానిపై కొద్దిగా నీటిని చల్లాడు. ఇలాంటివి చేయకూడదని డ్రైవర్‌కు చెప్పాను” అని రామ్ నివాస్ షా తెలిపారు. ప్రైవేటు అవసరాల కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?सिंगरौली में बीजेपी के माननीय विधायक जी की कार वाशिंग फ़ायर ब्रिगेड की गाड़ी से हो रही है pic.twitter.com/CM0YBheLMz— Brajesh Rajput (@drbrajeshrajput) August 25, 2026 -
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా.. -
కారుపై 3,400 ముద్దులు పెట్టిన ప్రేమికురాలు
-
3400 ముద్దులు పెట్టింది.. కారుపై లిప్‌స్టిక్‌తో రచ్చ!
భోపాల్: కారుపై ఎక్కడైనా డెంట్ (గీత) పడితేనే యజమానులు తల్లడిల్లిపోతారు. అలాంటిది ఆ కారు అద్దాలు, బానెట్, డోర్లు అని తేడా లేకుండా ఏకంగా 3,400 లిప్‌స్టిక్ ముద్దులతో నింపితే పరిస్థితి ఎలా ఉంటుంది?. మధ్యప్రదేశ్ గ్వాలియర్ వీధుల్లో ఇలాంటి వింత ఘటనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పిచ్చి పని చేసిన యజమానికి పోలీసులు షాకిచ్చారు.మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసిన ఓ విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. విదేశీ సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుకరించిన ఓ యువతి చేసిన పని,ఆమె ప్రియుడిని చిక్కుల్లో పడేసింది.గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్ అనే వ్యక్తికి చెందిన కారుపై, అతని ప్రియురాలు విదేశీ ట్రెండ్ నుంచి ప్రేరణ పొంది వినూత్నంగా ప్రయోగిద్దామనుకుంది. ఇందులో భాగంగా కారు అద్దాలు, బోనెట్, డోర్లు, బంపర్లు అని తేడా లేకుండా బాహ్య భాగం అంతా తన పెదవులకు లిప్‌స్టిక్ రాసుకుంటూ ఏకంగా 3,400 సార్లు ముద్దుల ముద్రలు వేసింది. ఈ విధంగా వేలకొద్దీ లిప్‌స్టిక్ మార్కులు వేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది.పోలీసుల ఎంట్రీ..భారీ జరిమానా!ఈ విధంగా వింతగా తయారైన కారు గ్వాలియర్ వీధుల్లో తిరుగుతూ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందించగా, ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఫొటోల్లో కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు, ఆదిత్య సికర్వార్ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహన రూపం మార్చడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం కింద అతనికి రూ. 5,500 జరిమానా విధించారు.పోలీసుల చర్యతో తన తప్పును అంగీకరించిన ఆదిత్య సికర్వార్, ఆ తర్వాత స్వయంగా రంగంలోకి దిగాడు. కారుపై ఉన్న ఆ లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులన్నింటినీ పూర్తిగా తొలగించి, వాహనాన్ని శుభ్రం చేసి యథాస్థితికి తీసుకువచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశతో చేసే ఇలాంటి విపరీత చేష్టలు చివరికి ఎలా ఇబ్బందుల్లోకి నెడతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది.👉ఇదీ చదవండి: దేశ ప్రధాని.. ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టి పరువు తీసింది -
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్‌స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్‌తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
బీజేపీ ఎంపీకి బిగ్ షాక్.. బారికేడ్లు బద్దలుకొట్టి దూసుకొచ్చిన విద్యార్థులు!
నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన నర్సింగ్ కోర్సు.. ఆరేళ్లు దాటినా ముగియలేదు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు.. డిగ్రీ చేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు. దీంతో సహనం కోల్పోయిన వందలాది మంది నర్సింగ్ విద్యార్థులు రోడ్డెక్కారు. పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ ఏకంగా ఎంపీ కార్యాలయంలోకి దూసుకెళ్లి బైఠాయించారు. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో నర్సింగ్ విద్యార్థుల ఆగ్రహం ఒక్కసారిగా భగ్గుమంది. పరీక్షలు ఆలస్యం కావడం, డిగ్రీలు అందకపోవడంపై ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. శుక్రవారం తమ నిరసనను మరింత తీవ్రం చేశారు. వందలాది మంది విద్యార్థులు బిస్తాన్ రోడ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు ర్యాలీగా బయలుదేరి ఎంపీ కార్యాలయం వైపు వెళ్లారు. చేతుల్లో బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులను దాటి ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడే బైఠాయించారు.Anger erupted among hundreds of nursing students in Khargone, Madhya Pradesh, on Friday as they broke through police barricades and entered the premises of the SDM office while protesting delayed examinations and degrees.Carrying banners and placards, the students marched… pic.twitter.com/1JfQPcJ1rf— IndiaToday (@IndiaToday) August 22, 2026విద్యార్థుల ప్రధాన ఆవేదన నర్సింగ్ కోర్సు పరీక్షలు, డిగ్రీల జారీలో జరుగుతున్న జాప్యంపైనే. సాధారణంగా నాలుగేళ్లలో పూర్తవ్వాల్సిన నర్సింగ్ డిగ్రీ తమకు ఆరేళ్లుగా మారిపోయిందని వారు ఆరోపించారు. ఇంకా పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో తమ విద్యా భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు రెండూ అనిశ్చితంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోర్సు పూర్తి చేయాల్సిన వయసులోనే ఏళ్ల తరబడి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నాం. డిగ్రీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు’ అంటూ విద్యార్థులు తమ సమస్యను వెల్లడించారు.ఇది కూడా చదవండి: బీజేపీకి కొత్త టెన్షన్.. అసలు సవాలు ఇప్పుడే.. ఈ సమస్యపై విద్యార్థులు వరుసగా ఆరు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం తమ ఆగ్రహం మరింత పెరిగిందని వారు చెప్పారు. ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ ఖార్గోన్లోనే ఉన్నప్పటికీ.. తమను కలవడానికి రాలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించే స్థాయికి చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. బారికేడ్లను దాటుకుని కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి దాదాపు గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి విద్యార్థులు ఎంపీకి ఉద్దేశించిన వినతిపత్రాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడికి అందజేశారు. అనంతరం ఆందోళనను విరమించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
బేత్వా నదిని దాటి బడికి.. ప్రాణాలను పణంగా పెడుతున్న చిన్నారులు, వైరల్‌గా మారిన వీడియో
-
బాలికల వాటర్ బాటిళ్లలో మూత్రం కలిపి ఆకతాయిలు, చాక్లెట్ తినమన్న ప్రిన్సిపాల్
మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఉదంతం వెలుగు చూసింది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులపట్ల అమానుషంగా ప్రవర్తించారు. దీనిపై సదరు అమ్మాయిలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుగా చేయగా, బాధ్యతా రాహ్యితంగా అతను వ్యవహరించిన తీరు మరి దిగ్భ్రాంతి రేపింది. ఈ సంఘటన నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది.తరగతి గది బయట రంగోలి వేస్తున్న 5వ తరగతికి చెందిన 10 మంది విద్యార్థినుల మంచినీటి బాటిళ్లలో కొందరు విద్యార్థులు మూత్రం కలిపారు. అయితే ఈ విషయం తెలియక ఆ నీటిని తాగిన బాలికలు, తరువాత విషయం గ్రహించి ఏడుస్తూ ప్రిన్సిపాల్ మూల్‌చంద్ కౌశిక్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా స్పందిస్తూ, నోరు పాడైతే, రూ.10 చాక్లెట్ తిని సరిపెట్టుకోమనడంతో వివాదం మరింత తీవ్రమైంది.ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్దీంతో ఆవేదన చెందిన బాలికలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు తాలు వేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బాధ్యులైన విద్యార్థులపై, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అరాన్ SDM మంజుషా ఖాత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ కృష్ణకాంత్ చౌబే, BEO సంతోష్ ధాకడ్ పోలీసు బలగాలతో పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు బాధితులు, నిందితులు మరియు కుటుంబ సభ్యుల నుండి స్టేట్మెంట్లు సేకరించారు. BEOకి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని SDM ఆదేశించారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి -
డాగ్ స్టెరిలైజేషన్‌లో అవినీతిపై పబ్లిక్ హియరింగ్ : ‘కుక్క’ను చూసి అధికారులు షాక్
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల కార్యక్రమంలో ఈ విచిత్ర నిరసన వైరల్‌గా మారింది.ఖాండ్వా మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్‌నేత దీపక్ "ముల్లు" రాథోడ్, నగరంలో వీధికుక్కల సమస్యను మరియు స్టెరిలైజేషన్ (కుక్కల సంతానోత్పత్తి నిరోధక ప్రక్రియ) పథకంలో జరిగిన అవినీతిని నిరసిస్తూ ఒక వ్యక్తికి కుక్క మాస్క్ తొడిగించి ప్రజా విచారణ (Public Hearing) సభకు తీసుకువచ్చారు.రాథోడ్ మొదట మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు, కానీ వారు దీనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. నగరంలో వీధి కుక్కల సమస్యను ఎత్తిచూపేందుకు ఆయన ఈ వినూత్న నిరసన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ 'కుక్క'కు వంధ్యీకరణ శస్త్రచికిత్స జరిగిందని, అయినప్పటికీ అది ఆరు కుక్కపిల్లలకు తండ్రి అయిందని చెబుతూ, అసలు వంధ్యీకరణ కార్యక్రమం జరిగిందా లేదా అని ఆయన ప్రశ్నించారు.ఈ విషయంపై విచారణ జరగాలని ఆయన కోరారు. ఒకవేళ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకపోతే, తన పేరుతో అవినీతికి పాల్పడినందుకు మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆ 'కుక్క' పరువు నష్టం దావా వేస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మొదట ఆశ్యర్యపోయినా, తరువాత 'కుక్క' వేషంలో మనిషి వచ్చాడని తెలుసుకుని నవ్వుకున్నారు.ఇదీ చదవండి : 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం📺WATCH | Man dressed as dog appeared at a public hearing in Madhya Pradesh's Khandwa to protest the growing stray dog population and the problems caused by them pic.twitter.com/aLxizQDwa5— The Tatva (@thetatvaindia) August 19, 2026కుక్క ముసుగులో ఉన్న వ్యక్తితో కలిసి బహిరంగ విచారణకు వచ్చినపుడు. ప్రవేశద్వారం వద్ద ఉన్న పోలీసు అధికారి మొదట వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, హాలులో ఉన్న అధికారులు వారిని లోపలికి అనుమతించాల్సిందిగా పోలీసులకు సూచించారు. గత 4 ఏళ్లలో వీధి కుక్కల స్టెరిలైజేషన్ (కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్) కోసం మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు రూ.40 లక్షల బడ్జెట్ ఖర్చు చేసింది. అయినా జిల్లాలో కుక్కల సంఖ్య తగ్గకపోగా, కుక్క కాటు కేసులు 13,225 కి పైగా పెరిగాయని ఆరోపించారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ కాశీరామ్ బడోలే దీపక్ రాథోడ్‌కు హామీ హామీ వచ్చారు. విచారణ సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి కుర్చీలోనే కూర్చుని ఉండటం విశేషం.ఇదీ చదవండి: ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్ -
కుక్క మాస్కుతో అధికారులకు షాక్ ఇదో రకం నిరసన
-
త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తీవ్రమైన మానసిక వేధింపుల కారణంగా ఉసురుతీసుకున్న మాజీ మిస్ పుణే, నటి త్విషా శర్మ (34) కేసుకు సంబంధించిన అనేక షాకింగ్ వివరాలను సీబీఐ తన దర్యాప్తులో వెల్లడించింది. ఆగస్టు 14న దాఖలు చేసిన దాఖలు చేసిన 600 పేజీల ఛార్జ్షీట్లు పలు కీలక అంశాలను పొందుపర్చింది. ముఖ్యంగా త్విషా శర్మ జీవితంలో చివరి 90 నిమిషాల్లో ఏం జరిగిందనేదానిపై అసాధారణమైన మినిట్ టూ మినిట్ రిపోర్ట్‌ను సమర్పించింది.త్విషా ఆత్మహత్య కేసులో తీవ్రమైన మానసిక వేధింపుల (Sustained mental cruelty) ద్వారా ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (Abetment to suicide) భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జిల్లా జడ్జి)పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 85, 108, 3(5) కింద కేసు నమోదు చేసింది సీబీఐ.సమర్థ్ సింగ్, గిరిబాల సింగ్ మానసికంగా ఎంతగా హింసించారంటే, త్విషాకు "ఇక చావు తప్ప మరో మార్గం లేకుండా పోయింది" అని ఏజెన్సీ చివరికి నిర్ధారించింది. అయితే, ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, సీబీఐ దర్యాప్తు ఇంకా ముగియలేదు.ఈ కేసులో వాట్సప్ మెసేజ్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌లతోపాటు, ఫోన్ కాల్స్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, వైద్యులు, కౌన్సెలింగ్ సెషన్లతో పాటు పలువుర్ని సీబీఐ విచారించింది. దీని ప్రకారం చనిపోయే రోజు రాత్రి 9:36 గంటలకు ట్విషా తన ఆడపడుచుకు "రేపు ఉదయం వచ్చి తన భార్య అవశేషాలను తీసుకెళ్లమని మీ తమ్ముడికి చెప్పింది. నన్నుఇప్పుడు ప్రశాంతంగా చావనివ్వండి" అని వాట్సాప్‌లో పంపిన మెసేజ్ కీలకంగా మారింది. ఆ తరువాత ఆమె ఒంటరిగా టెర్రస్ వైపు వెళ్తుండగా సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రి 10:23 గంటలకు ఆమె భర్త సమర్థ్, అత్త గిరిబాల సింగ్ టెర్రస్ వైపు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను AIIMS భోపాల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.అంతేకాదు చనిపోవడానికి ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తన భర్త సమర్థ్ సింగ్ ఏమాత్రం మారలేదనీ, మరింత హింసాత్మకంగా మారిపోయాడని, వెంటనే రావాలని ఏడుస్తూ చెప్పింది. తనను ఈ నరకం నుంచి తప్పించలని కూడా వేడుకుంది.నెలల తరబడి వేధింపులుగత ఏడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి త్విషా పాత సంబంధాల ఆధారంగా శారీరక, మానసిక క్షోభకు గురిచేశారు. మాటలతో పొడుచుకుతిన్నారు. విపరీతంగా అనుమానించేవాడని CBI పేర్కొంది. కొడుకుకి సర్ది చెప్పాల్సిన అత్త గిరిబాల కూడా రెచ్చగొడుతూ అతడికే వత్తాసు పలికేది. అలా మానసికంగా వేధించి వేధించి పెళ్లయిన ఐదు నెలల్లోనే ఆమెకు నరకం చూపించారు.డబ్బుల కోసం, గర్భస్రావం వివాదాలుగుండెపోటు తర్వాత చికిత్స పొందుతున్న తండ్రి దగ్గర త్విషా షా ఉంటున్నప్పుడు, భోపాల్‌కు తిరిగి రావాలని నిందితులిద్దరూ ఆమెపై ఒత్తిడి చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆమె మార్చి 24న తిరిగి వచ్చింది. ఆ తరువాత త్విషా పేరిట ఉన్న రూ. 20 లక్షల డీమ్యాట్ పెట్టుబడులను జాయింట్ అకౌంట్‌కు మార్చాలని భర్త, అత్త ఒత్తిడి తెచ్చారు. ఆమె అందుకు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరింది. ఈవిషయాన్ని కూడా తల్లితో చెప్పుకొని బాధపడింది.ఇంతలో ఆమె (ఏప్రిల్‌లో)గర్భం దాల్చింది. కానీ అత్తమామలు గర్భస్రావం చేసుకోమని ఒత్తిడి తెచ్చారు. మే 6, 8 తేదీల్లో గర్భస్రావం (MTP) మందులు తీసుకున్నారు. ఆతరువాత మాటమార్చిన అత్త హంతకి అని నిందించడం, భర్త అది తన బిడ్డేనా అని అనుమానించడం ఆమెను మరింత కృంగిపోయింది. కానీ ఎలాగైనా ఈనరకం నుంచి బయటపడాలని శతవిధాలా ప్రయత్నించింది. మళ్లీ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకొని, ప్రయత్నాలను ముమ్మరం చేసింది.ఊరికి వెళ్లిపోయినా బతికేదేమో..!మే 12 ఉదయం త్విషా తన పుట్టింటికి వెళ్లేందుకు రూ. 3,000 పెట్టి రైలు టికెట్ బుక్ చేసుకుంది. కానీ కౌన్సెలింగ్‌కు భర్త అంగీకరించడంతో ఆగిపోయింది. కౌన్సెలింగ్ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది.AIIMS ఢిల్లీ నిర్వహించిన రెండవ పోస్టుమార్టం నివేదికలోఇది ఉరివేసుకోవడం వల్ల సంభవించిన ఆత్మహత్య అని, ఎలాంటి దాడి గాయాలు లేవని తేలింది. త్విషా ఐఫోన్ రికవరీ, CCTV డేటా, వాయిస్ శాంపిల్స్ పరిశీలన ,కట్నం వేధింపుల కోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న ఆడియో రికార్డింగ్‌లతో పోల్చడానికి సమర్థ్ , గిరిబాల వాయిస్ నమూనాలను పరిశీలిస్తున్నారు. -
శరీర భాగాలను విక్రయించి సంపాదించవచ్చని.. బాలుడిని చంపి..
భోపాల్: డబ్బు కోసం ఏదైనా చేసే స్థాయికి కొందరు దిగజారుతున్నారు. అత్యాశ, తప్పుడు ఆలోచనలు ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి. భోపాల్‌లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. హత్య వెనుక బయటపడిన కారణం మరింత షాకింగ్‌గా మారింది.భోపాల్‌లో ఓ మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురు మైనర్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు భయంకర నిజాలు తెలిశాయి. ఆగస్టు 10న ఛోటా తాలాబ్ సమీపంలో బాలుడి మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తు్నారు. పోస్టుమార్టంలో.. కత్తితో పొడిచిన గాయాలు బయటపడ్డాయి.దర్యాప్తులో, నిందితుల్లో ఒకరైన జోహెబ్ ఖాన్ (20) మానవ శరీర భాగాలను విక్రయిస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చని ఇతరులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఒక మైనర్‌కు వీడియో చూపించి ఈ విషయాన్ని మరింత నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ముగ్గురు మైనర్లు, మరో వ్యక్తి కలిసి బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం జోహెబ్ సూచనలతో బాలుడి మర్మాంగాలను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకున్నా, విక్రయించేందుకు మార్గం దొరకక చివరకు పడేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా, వారిలో ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మొత్తం కుట్రకు జోహెబ్ ఖాన్ ప్రధానంగా పథకం వేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. -
ఆటోడ్రైవర్ ఇంట్లో నోట్ల కట్టలు.. 4 బ్యాగుల్లో రూ.3 కోట్లు
భోపాల్: ఒక చిన్న ఇల్లు అది.. పోలీసులు తలుపులు తెరిచారు అంతే.. బయటికి కనిపించని ఓ భారీ రహస్యం ఒక్కసారిగా బయటపడింది. సాధారణంగా కనిపించే ఆ ఇంట్లో దాచిన డబ్బును చూసి అక్కడికి వెళ్లిన వారే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో పోలీసులకు రూ.3 కోట్లకు పైగా నగదు దొరికింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్లింది డబ్బు కోసం కాదు.. సోషల్ మీడియాలో ఆ డ్రైవర్ చేతిలో కనిపించిన పిస్టల్ ఫొటోపై విచారణ కోసం.గోపాల్‌గంజ్ పోలీస్‌లు ఆటో డ్రైవర్ సౌరభ్ అహిర్వార్ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో ఓ లాక్ చేసిన అల్మారా కనిపించింది. దాని తాళం కుటుంబ సభ్యుల వద్ద లేకపోవడంతో పోలీసులు నిబంధనల ప్రకారం దాన్ని తెరిచారు. అందులో 4 బ్యాగుల్లో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి.ఒక్క బ్యాగులోనే సుమారు రూ.1.33 కోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు బ్యాగుల్లో కలిపి మొత్తం రూ.3 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు తేలింది. డబ్బును లెక్కించేందుకు కరెన్సీ కౌంటింగ్ మెషీన్ ఉపయోగించారు. సోదాలు, నగదు లెక్కింపు ప్రక్రియను వీడియోలో రికార్డు చేశారు.ఈ డబ్బు తమది కాదని కుటుంబ సభ్యులు చెప్పారు. రమేశ్ అహిర్వార్ అనే బంధువు డబ్బును 8-9 నెలల క్రితం అక్కడ ఉంచి వెళ్లారని వారు తెలిపారు. రమేశ్ అహిర్వార్ భోపాల్‌లోని చునాభట్టి ప్రాంతంలో ఉంటారని, పీడబ్ల్యూడీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని కుటుంబం చెబుతోంది.అయితే రూ.3 కోట్ల నగదును ఎందుకు ఇంట్లో ఉంచారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదాయపు పన్ను, రెవెన్యూ తదితర సంబంధిత విభాగాలకు కూడా సమాచారం ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ఆ డబ్బు పీడబ్ల్యూడీ ఇంజినీర్‌దేనని పోలీసులు నిర్ధారించలేదు. అది రమేశ్ అహిర్వార్దేనని కుటుంబ సభ్యులు చేసిన వాదన మాత్రమే. పోలీసులు నగదు మూలాన్ని విచారిస్తున్నారు. -
ఏదో మెరుస్తున్నట్లు అనిపించింది.. అది రూ.50 లక్షల వజ్రం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో సర్కోహా గ్రామానికి చెందిన గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలు 17.96 క్యారెట్ల వజ్రాన్ని గుర్తించారు. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఈ రత్నం విలువ రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా. అయితే, కచ్చితమైన విలువ ప్రభుత్వ వేలం తర్వాతే తేలనుంది. ఈ కార్మికులు రోజువారీ కూలి పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ వజ్రం దొరకడంతో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం లభించే అవకాశం వచ్చింది.వర్షం సమయంలో వజ్రం మెరుపులుఈ వజ్రం సర్కోహా గ్రామంలోని గనిలో దొరికింది. వర్షం పడుతున్న సమయంలో ఏడుగురు కార్మికులు గనిని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో లీజుదారు అఖిలేశ్ పాల్ మట్టిలో ఏదో మెరుస్తున్న వస్తువును గమనించారు. దగ్గరగా పరిశీలించగా అది వజ్రమని గుర్తించారు. ఈ విషయం గ్రామంలో, సమీప ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో కార్మికులు, స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది.వేలం ద్వారా విలువ నిర్ణయంనిపుణులు, వజ్ర కార్యాలయం అంచనా ప్రకారం 17.96 క్యారెట్ల వజ్రం విలువ రూ.50 లక్షలకు పైగా ఉండొచ్చు. అమల్లో ఉన్న విధానం ప్రకారం, వేలం ద్వారా వచ్చే మొత్తంలో నుంచి ప్రభుత్వ రాయల్టీ మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని గనిలో పనిచేస్తున్న ఏడుగురు కూలీలకు సమానంగా పంచుతారు.ముగ్గురు కార్మికులకు పెళ్లి ఆశసంతోష్, శర్మన్, అరుణ్ కుటుంబాలకు ఈ వజ్రం బాగా ఉపశమనం ఇచ్చేలా దొరికింది. 30 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్న వీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు వివాహం చేసుకోలేకపోయారు. వజ్రం అమ్మకం ద్వారా తమకు వచ్చే వాటాతో కుటుంబ జీవితం ప్రారంభించే ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లగలమని వారు భావిస్తున్నారు. ఈ వజ్రం తమ ఉమ్మడి కృషి, కష్టానికి ఫలితమని ఏడుగురు కూలీలు తెలిపారు. గనిలో అందరూ కలిసి పనిచేయడంతో, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగిలే మొత్తాన్ని సమానంగా పంచుకుంటారు.ఇళ్లు కట్టుకోవాలని..తమకు వచ్చే ఆదాయాన్ని ఎలా వినియోగించాలనే అంశంపై కార్మికులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇళ్ల స్థానంలో శాశ్వత గృహాలు నిర్మించుకోవడం, పిల్లలకు మెరుగైన విద్య అందించడం వారి ప్రధాన లక్ష్యాలు. 17.96 క్యారెట్ల వజ్రాన్ని పన్నాలోని ప్రభుత్వ వజ్ర కార్యాలయంలో భద్రత నడుమ జమ చేశారు. అవసరమైన చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు పూర్తైన తర్వాత దానిని వేలం వేస్తారు. -
జవాన్లు మీరు తోప్ అంతే
-
ఇదీ మన మధ్యతరగతి పిల్లల పరిస్థితి
చదువు కోసం చాలామంది చిన్నారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఓ ప్రాంతంలో కొందరు ఎన్నో కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రాంతంలో ఇంకొందరు కొండలు, అడవులు దాటి పాఠశాలకు చేరుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో పాఠశాల విద్యార్థులు అంతకంటే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ పాఠశాల చిన్నారులు ప్రతిరోజు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బేత్వా నదిని కాలినడకన దాటి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు చిన్నారులు నది మధ్యలో ఉన్న ఇరుకైన స్టాప్ డ్యామ్‌పై సమతుల్యం పాటిస్తూ నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్ధృ తంగా ప్రవహిస్తున్న నీరు, మరోవైపు పాఠశాలకు చేరాల్సిన అవసరం. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు?జిల్లా పాలనాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వీడియో విదిశా జిల్లాలోని పాలోహ్ గ్రామానికి చెందింది. వీడియోలో కనిపిస్తున్న చిన్నారులు కరువా గ్రామ నివాసులు. వారు పాలోహ్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వీరు రహదారి మార్గంలో పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ అదనంగా 8 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకే స్టాప్ డ్యామ్ దాటి పాఠశాలకు చేరుకుంటున్నారు.గత 4-5 ఏళ్లుగా ఇదే దారితాము గత 4- 5 ఏళ్లుగా ఇదే దారిలో పాఠశాలకు వెళ్తున్నామని చిన్నారులు చెప్పారు. ఇదే అతి దగ్గర దారి అని, మరో మార్గంలో వెళ్తే చాలా దూరం ఉండటంతో ప్రతిరోజు ఆ దారిలో వెళ్లడం కష్టమని వివరించారు. వీడియో వైరల్ అయిన తర్వాత పాలనాధికారులు స్పందించారు. విదిశా ఉప విభాగ పాలనాధికారి క్షితిజ్ శర్మ మాట్లాడుతూ.. చిన్నారులు సురక్షిత మార్గంలో పాఠశాలకు వెళ్లి రావడానికి సైకిళ్లు ఇస్తామని చెప్పారు. నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణానికి ప్రతిపాదన పంపినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావిత గ్రామాల దగ్గర కొత్త పాఠశాల ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, చిన్నారులు ప్రాణాలకు ముప్పు తెచ్చుకుని నది దాటాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షంవీడియో బయటకు వచ్చిన తర్వాత పాలనాధికారులు, విద్యాశాఖపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. చిన్నారులు ఇన్నేళ్లుగా ఇలాగే పాఠశాలకు వెళ్తుంటే ముందే చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు ప్రశ్నించారు. వీడియో వైరల్ అయ్యేవరకు పాలనాధికారులు ఎందుకు వేచి చూశారని, ఇంతకు ముందే ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పెళ్లికాకుండానే బిడ్డకు జన్మ.. పరువు పోతుందని పసికందును పేడ కుప్పలో..
-
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు
-
బీజేపీకి బిగ్ టెస్ట్.. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు!
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు హోరెత్తిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బీజేపీ పాలిత మూడు రాష్ట్రాలు.. బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. యువతలో పెరిగిన అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందా? లేదంటే బీజేపీ తన పట్టును కొనసాగిస్తుందా? అన్నది ఈ ఫలితాలతో తేలనుంది.బంకీపూర్, దాతియా, మంజల్పూర్ ఉప ఎన్నికల స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. బంకీపూర్‌లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ ముందంజంలో కొనసాగుతున్నారు. ఇక దాతియా, మంజల్పూర్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాటియాలో కాంగ్రెస్ అభ్యర్థి కాసేపు ఆధిక్యంలో కొనసాగినా.. కాసేపటికే మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు.ఈ ఉప ఎన్నికలు సంఖ్యాపరంగా చిన్నవే అయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కీలకంగా మారాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.బంకీపూర్.. బీజేపీ కంచుకోటలో ఆసక్తికర పోరుబిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన స్థానం. ఇప్పటివరకు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఖాళీ ఏర్పడింది. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ కుమార్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చివరి నిమిషంలో యువ మోర్చా నేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది.ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై ఒత్తిడి పెరిగిందనే సంకేతంగా ప్రచారం చేశాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ నియోజకవర్గంపై ఆసక్తిని పెంచింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. కుల, మతాలకు అతీతంగా తమ అభ్యర్థికి మద్దతు లభించిందని చెబుతూ అనూహ్య ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు.దాతియా.. బీజేపీ అంతర్గత అసంతృప్తికి పరీక్షమధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గం కూడా బీజేపీకి కీలకంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశుతోష్ తివారీ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్ సింగ్ పోటీ చేశారు.అయితే ఈ ఎన్నికలో అసలు చర్చ బీజేపీ అంతర్గత రాజకీయాలపైనే సాగింది. మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆయన వరుసగా మూడు సార్లు దాతియా నుంచి గెలిచారు. ఈసారి అభ్యర్థి మార్పుపై నరోత్తమ్ మిశ్రా వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆయన అనుచరులు నిరసనలు కూడా చేపట్టారు. ఈ అంతర్గత విభేదాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.మంజల్పూర్.. గుజరాత్లో బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గం బీజేపీకి మరో కీలక పరీక్షగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత యోగేష్‌భాయ్ నరేంద్రభాయ్ పటేల్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరఫున మాజీ వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి భిఖాభాయ్ రబారీ బరిలో నిలిచారు. గుజరాత్లో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికలో కీలకంగా మారాయి.యువ ఓటర్ల తీర్పు ఏంటి?ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా అందరి దృష్టి యువ ఓటర్ల తీర్పుపైనే ఉంది. పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఆగ్రహం ఓటింగ్‌లో ప్రతిబింబిస్తుందా? లేక సాధారణ రాజకీయ అంశాలే ఆధిపత్యం చెలాయిస్తాయా? అన్నది ఫలితాల తర్వాత స్పష్టమవుతుంది.అయితే మూడు స్థానాల ఫలితాలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో లేకపోయినా.. ప్రజల మూడ్, ముఖ్యంగా యువత ఆలోచనా విధానంపై ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వనున్నాయి. బీజేపీ కంచుకోటలను కాపాడుకుంటుందా? లేదంటే విద్యార్థి నిరసనల ప్రభావం ప్రతిపక్షాలకు ఊరటనిస్తుందా? మరికాసేపట్లో వెలువడే ఉప ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి. -
పేడ కుప్పలో పసికందు సజీవ సమాధి
బాలాఘాట్: పరువు పోతుందన్న అవమానభావంతో ఒక కుటుంబం అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పెళ్లికాకుండానే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన విషయం బయటకు పొక్కకుండా ఆ పసికందును అమ్మాయి కుటుంబం ఏకంగా పేడ కుప్పలో కప్పిపెట్టి ప్రాణంతీశారు. పేడ కుప్పలో సజీవంగా పూడ్చేసిన విషయం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. అందరికీ విషయం తెల్సిపోవడంతో పరువుపోయిందన్న భావంతో ఆ అమ్మాయి తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాఘాట్ జిల్లాలో వారాశివానీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జూలై 31వ తేదీన ఒక యువతి పెళ్లికాకుండానే గర్భందాల్చి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డ ఏడుపు ఇరుగుపొరుగు వాళ్లకు గట్టిగా విన్పించింది. పరువుపోతుందన్న భయంతో వెంటనే అమ్మాయి కుటుంబం ఆ పసిబిడ్డ నోరు, మెడ చుట్టూ ఒక వస్త్రాన్ని గట్టిగా చుట్టి అలాగే పేడకుప్పలోకి పూడ్చేశారు. దీంతో పసిబిడ్డ చనిపోయింది. ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెల్సి గ్రామ సర్పంచ్ అందర్నీ సమావేశపరిచాడు. అవివాహిత ప్రసవించిన విషయం ఆశా వర్కర్ ఇచ్చిన సమాచారంతో ధ్రువీకరించుకున్నారు. ఆగస్ట్ ఒకటో తేదీన పోలీసులు, తహíసీల్దార్, వైద్య బృందం ఆ పేడకుప్ప నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చాక తదనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని వారాశివానీ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. -
52 ఏళ్ల తర్వాత ఆడ సంతానం.. అగర్వాల్ ఇంట్లో సందడి!
ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత ఓ కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. ఏకంగా 52 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో పసిపాప కేరింతలు వినిపించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండోర్ కు చెందిన ముస్కాన్ అగర్వాల్ దంపతులకు ఇటీవల పసిపాప జన్మించింది. అయితే, ఈ జననం సాధారణమైనది కాదు.ఆ కుటుంబంలో గత 52 సంవత్సరాలుగా కేవలం మగ సంతానం మాత్రమే పుడుతూ వస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా ఆ కుటుంబంలో ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సాగిన ఈ సుదీర్ఘ నిరీక్షణకు తాజాగా తెరపడింది. తమ ఇంట్లో నూతన అతిథిగా మహాలక్ష్మి ప్రవేశించడంతో ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ ఈ భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి పసిపాపను బయటకు తీసుకొచ్చిన క్షణంలో కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందభాష్పాలు రాలినట్లు ఆమె తెలిపారు.‘కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి తరాలే పడతాయి" అంటూ ఆమె ఈ సంఘటనపై హృదయాలను హత్తుకునే వ్యాఖ్యలు రాశారు. 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కుటుంబంలో తొలిసారిగా ఆడపిల్ల పుట్టడంతో ఇండోర్ లోని ఆ ఆస్పత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవజాత శిశువు తల్లి ముస్కాన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ కుటుంబ సభ్యులకు అభినందనలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి! -
భోజ్‌శాల పొరుగున ప్రార్థనలకు సుప్రీంకోర్టు అనుమతి!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్ పక్కన ఉన్న దర్గాలో ప్రార్థనలు జరుపుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం ముస్లింలకు అనుమతిచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల మధ్యలో ముస్లింలు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇరు పక్షాల సమ్మతితో ఇంకోచోట ప్రార్థనలు జరుపుకునేందుకు ఉన్న అవకాశానికి తమ ఆదేశాలు అడ్డుకావని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 14న సుప్రీంకోర్టు భోజ్‌శాల కాంప్లెక్స్ పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో ముస్లింలు శుక్రవారపు నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ వర్తించే ఈ ఆదేశం అమలు కాలేదని ఆరోపిస్తూ ముస్లింల తరఫున హాజీ మునీర్ అహ్మద్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారులు భోజ్‌శాల కాంప్లెక్స్‌కు 1.3 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపారని ఇది తమకు సమ్మతం కాదని పిటిషన్ ద్వారా వాదించారు. భోజ్‌శాల మసీదును చూడగలిగే అవకాశం ఉండాలని కోరారు. ముస్లింల తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ, ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్‌లు తమ వాదనలు వినిపించగా జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ గురువారం తానిచ్చిన మునుపటి తీర్పును సవరించింది. ‘‘గత తీర్పులో దర్గా భూమిగా చెబుతున్న ఖస్రా నెం 596లోని ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి మూడు గంటల మధ్యలో ప్రార్థనలు మస్లిం సముదాయానికి అనుమతిచ్చాం. మాకందిన ప్లాన్ కాపీ ప్రకారం ఈ చోటికి వేరే రహదారి కూడా ఉంది. కాబట్టి ఈ స్థలం వారికి అనువుగా ఉంటుంది.’’అని స్పష్టం చేసింది. -
సీఎం ఇంటి సమీపంలో ఉద్రిక్తత.. కదులుతున్న బస్సుకు ఎదురెళ్లిన లేడీ సింగం
భోపాల్ : నీట్ లీకేజీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన చేపట్టింది. ఈ నిరసనల్లో విద్యార్థులను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసు వాహనం ముందు అరచేతిని చాచి నిలిచిన ఓ యువతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి దృశ్యాలను గుర్తు చేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళనకారులు వాహనాలతో ముఖ్యమంత్రి నివాసానికి బయల్దేరారు. అప్పుడే ఓ లేడీ సింగం ఆందోళనకారుల వాహనం ముందుకు కదలకుండా ఎదురెళ్లి అడ్డుగా నిలబడ్డారు. ప్రస్తుతం ఆ లేడీ సింగం ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.మధ్యప్రదేశ్‌లో పెసర పంటను 100 శాతం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ఎరువుల ఈ-టోకెన్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు రాజధాని భోపాల్‌లో భారీ ఆందోళన చేపట్టారు. నర్మదాపురం, హర్దా, సీహోర్ జిల్లాల నుంచి ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో సీఎం నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించి ప్రైవేట్ స్కూల్ బస్సులో ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. అప్పుడే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) మౌనిక శుక్లా రైతులతో ముందుకు కదులుతున్న బస్సుకు ఎదురెళ్లి నిలువరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ఘటనపై ఏసీపీ మౌనిక శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ఆపడమే మా విధి. బస్సు ముందుకు కదలకుండా నేను చేయాల్సిన పనిని చేశాను. రైతుల మార్చ్‌ను అడ్డుకోవడానికి పోలీసులు అదనపు బారికేడింగ్గా రోడ్డుపై స్కూల్ బస్సులను అడ్డుగా పెట్టారు. రైతులు బస్సులను నెట్టి బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. బస్సు ముందుకు కదులుతుండటాన్ని చూసిన వెంటనే, నిరసనకారులను ఆపడం నా బాధ్యత కావడంతో సహజంగానే దాని ముందు నిలబడ్డాను. నేను బస్సు ముందు నిలబడటాన్ని చూసిన రైతులు బస్సు నుంచి దిగిపోయారు. తన చర్య అసాధారణమైనది కాదని పేర్కొంటూ, శాంతిభద్రతల నిర్వహణలో తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని చెప్పారు. నిరసనకారులు బస్సును కదపకుండా ఆపడానికి అక్కడికక్కడే బస్సు ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాను. నాకు భయం అనిపించలేదు. చేయాల్సిన పని చేశాను నిరసనకారులు నేరస్థులు కాదని పేర్కొంటూ, ఎలాంటి నిరసననైనా ఎదుర్కొనేటప్పుడు పోలీసులు సంయమనం పాటించాలి. మనం సంయమనంతో వ్యవహరించాలి. నిరసనకారులు నేరస్థులు కాదు. వారు కూడా తమ డిమాండ్లను లేవనెత్తుతున్న పౌరులే. అయితే, అల్లర్లు సృష్టించడానికి కొందరు సంఘవిద్రోహ శక్తులు నిరసనకారుల్లోకి చొరబడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆ సమయంలో రైతు నిరసనకారులకు నాయకత్వం వహించే వ్యక్తి ఎవరూ లేరని, పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్ర రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటమే నా బాధ్యత. శాంతిభద్రతలను కాపాడటమే తన ఏకైక లక్ష్యమని పునరుద్ఘాటించారు.ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనల గురించి ప్రస్తావిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే అది చట్ట పరిధిలో, సామాన్య ప్రజల జీవితాలకు అంతరాయం కలగకుండా శాంతియుతంగా జరగాలి’ అని ఆమె పేర్కొన్నారు. -
ప్రభుత్వంపై రైతులు ఉగ్రరూపం
-
మోనాలీసాను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు
కొచ్చి: 'కుంభమేళా వైరల్ గర్ల్'గా గుర్తింపు పొందిన మోనాలీసా భోస్లే భద్రతపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను కొచ్చి నగరం నుంచి బలవంతంగా లేదా హైకోర్టు అనుమతి లేకుండా బయటకు తరలించరాదని స్పష్టం చేసింది. జస్టిస్ బేచు కురియన్ థామస్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్సీఎస్టీ) ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిబంధనల ప్రకారం మధ్యప్రదేశ్ పోలీసులకు ఆమెను అప్పగించాలన్న ప్రతిపాదనను కోర్టు ఈ సందర్భంగా పరిశీలించింది. అయితే ఆమె మతాంతర వివాహం కారణంగా ప్రాణాపాయం ఉందని, మధ్యప్రదేశ్‌కు వెళ్తే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మోనాలీసా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.మోనాలిసా భద్రతను దృష్టిలో ఉంచుకుని, తదుపరి విచారణ జరిగే వరకు ఆమెను కొచ్చి సరిహద్దులు దాటించవద్దని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే, ఆమెకు తగిన పోలీసు రక్షణను కొనసాగించాలని స్పష్టం చేసింది. వివాహం జరిగే సమయానికి ఆమెకు 18 ఏళ్ల మూడు నెలల వయసు ఉందని, ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని, దీనిపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ దాఖలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.ఇది కూడా చదవండి: జైలు నుంచి వస్తూనే తమ్ముడి దగ్గరికి తేజ్! -
మొక్కు తీరిందని.. వెండి వర్షం కురిపించిన భక్తుడు
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు బుధవారం రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ‘‘శ్రీ సాంవలియాజీ’’ ఆలయంలో 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలు సమర్పించాడు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ సుమారు రూ.25.65 లక్షలు.ఆ భక్తుడు తన పేరు వెల్లడించలేదు. తన కొడుకుకు సంబంధించిన ఓ కోరిక నెరవేరాలని ఈ ఆలయంలో ప్రార్థించానని ఆలయ నిర్వాహకులకు చెప్పాడు. కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా వెండి కడ్డీలు సమర్పించేందుకు మళ్లీ వచ్చానని తెలిపాడు.దేవాస్ జిల్లాలోని సోహంగంజ్ ప్రాంతానికి చెందిన ఆ భక్తుడు బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్నాడు. పూజలు ముగిసిన తర్వాత 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలను ఆలయ కార్యాలయంలో నిర్వాహకులకు అప్పగించాడు.తన పేరు బయట పెట్టొద్దని కోరాడు. ఆలయ నిర్వాహకులు అతని కోరికను గౌరవించారు. అధికారులతో మాట్లాడిన సమయంలో, గతంలో తన కొడుకుకు సంబంధించిన ఓ కోరికతో సాంవలియా సేఠ్ ఆలయానికి వచ్చినట్టు చెప్పాడు.ఆ కోరిక నెరవేరిన తర్వాత తన విశ్వాసానికి, కృతజ్ఞతకు గుర్తుగా వెండి కడ్డీలు సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. అవసరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత వెండిని ఆలయ ఖజానాలో భద్రపరిచారు.రాజస్థాన్ బులియన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్ పిచోలియా మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 11.4 కిలోల వెండి విలువ సుమారు రూ.25.65 లక్షలు అని చెప్పారు. భారీ నగదు విరాళాలతో పాటు భక్తులు శ్రీ సాంవలియాజీ ఆలయానికి బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కూడా తరచూ సమర్పిస్తారని తెలిపారు.శ్రీ సాంవలియాజీ ఆలయం దేశంలో ప్రముఖ శ్రీకృష్ణ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించేందుకు ఇక్కడికి వస్తుంటారు. కోరికలు నెరవేరిన తర్వాత తమ స్తోమతకు తగ్గట్టు నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు సమర్పిస్తుంటారు. -
రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికి
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. లక్షల రూపాయలు విలువ చేసే వెండి బిందెను పొరపాటున చెత్తకుప్పలో పారేసిందో మహిళ. బంగారాన్ని మించి వెండి ధర దూసుకుపోతున్న వేళ 2 కిలోల వెండి పాత్రను అలా చెత్తలో వేసేయడం హాట్ టాపిక్‌గా మారింది. జూలై 18న రాజేంద్ర నగర్‌కు చెందిన ఒక వృద్ధురాలు ఇళ్లల్లో పూజకు ఉపయోగించే తమ తరతరాల నాటి వెండి పాత్రను పొరపాటున చెత్తతో పాటు పారేశారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెంటనే గుర్తించి, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆశ్రయించారు. చివరికి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు రెండు రోజుల పాటు చాలా కష్టపడి, ఎట్టకేలకు దాదాపు రూ.5 లక్షల విలువైన, 2 కిలోల బరువున్న వెండి లోటాను (పాత్రను)సురక్షితంగా వెలికితీశారు.కుటుంబ సభ్యులు తాము పోగొట్టుకున్న వెండి లోటా ఫోటోను పారిశుధ్య సిబ్బందికి అందించారు. కానీ అప్పటికే అది చెత్త ప్రాసెసింగ్ యూనిట్‌కు చేరిపోవడంతో, అక్కడ కార్మికులు ప్లాస్టిక్, లోహాలు, ఇతర వ్యర్థాలను వేరుచేసే విభాగంలో వెతకడం ప్రారంభించారు. లోటా వెండిది అని తెలియక, అప్పటికే అది పునర్వినియోగం (Recyclable) కోసం వేరు చేసిన భారీ ఇనుము/లోహపు చెత్త కుప్పలో కలిసిపోయింది. కార్మికులు రెండు రోజుల పాటు టన్నుల కొద్దీ వ్యర్థాలను చేతులతో వెతికారు. ఫోటోలో ఉన్న పోలికలతో ఒక పాత్రను గుర్తించిన సిబ్బంది, దానిపై కుటుంబ సభ్యుల పేరు చెక్కి ఉండటంతో అది ఆ కుటుంబానిదేనని నిర్ధారించుకున్నారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలికుటుంబ సభ్యులు వెంటనే ఫిర్యాదు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. కొంచెం ఆలస్యమైతే, వ్యర్థాలను కుదించే యంత్రాల ద్వారా ఆ లోటా రూపురేఖలు మారిపోయి దొరికేది కాదని చీఫ్ శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు తీర్థయాత్రకు వెళ్లడంతో, ఆ వెండి లోటాను స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ బడ్వే వద్ద భద్రపరిచారు. ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు -
ప్రకృతిపై మనిషి విజయం: 12 కిలోమీటర్ల అద్భుతం!
భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే అతిపెద్ద నది నర్మదా నది. ఈ నదిని మధ్య భారతంలోని సోన్ నది వైపు మళ్లించాలన్న దశాబ్దాల కల సాకారమైంది. వింధ్య పర్వత శ్రేణులను ఛేదిస్తూ మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో నిర్మించిన 12 కిలోమీటర్ల పొడవైన భూగర్భ జల సొరంగం నిర్మాణం పూర్తయింది. ప్రకృతి సహజమైన అడ్డంకులను అధిగమిస్తూ, ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అందరి అభినందనలను అందుకుంటోంది.15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంఈ భారీ ప్రాజెక్టుకు 2011లో పునాది పడింది. మధ్యప్రదేశ్ లోని స్లీమనాబాద్‌లో నర్మదా నది జలాలను సోన్ బేసిన్ వరకు చేర్చడమే లక్ష్యంగా ఈ పనులు మొదలయ్యాయి. అనేక భౌగోళిక సవాళ్లు, సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 15 ఏళ్లు పట్టిన ఈ నిర్మాణం, తాజాగా జూలై 14న పూర్తయింది. టన్నెల్ బోరింగ్ మెషిన్ నిర్ణీత స్థలానికి చేరుకోవడంతో నర్మదా జలాల ప్రవాహానికి మార్గం సుగమమైంది.పురాణగాథకు ఆధునిక ముగింపునర్మదా, సోన్‌భద్ర నదుల కలయిక వెనుక ఒక ఆసక్తికరమైన జానపద కథ ఉంది. ఒకరికొకరు దూరమైన ఈ నదులు వింధ్య పర్వతాల మధ్య వేర్వేరు దిశల్లో ప్రవహిస్తున్నాయి. శతాబ్దాల నాటి ఈ పురాణ గాథకు, ఆధునిక మానవుడు పర్వతాలను చీల్చి సొరంగం నిర్మించడం ద్వారా ముగింపు పలికాడు. ఇప్పుడు కృత్రిమ మార్గం ద్వారా రూపొందిన నర్మదను, సోన్‌భద్రతో కలిపే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.ఇంజనీరింగ్ సవాళ్లను అధిగమించి..ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఇంజనీర్లకు ఏమాత్రం సులభం కాదు. నిర్మాణ సమయంలో సింక్‌హోల్స్, గట్టి రాతి పొరలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, తరచుగా విరిగిపడే శిథిలాలు వంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. భూగర్భ జలాలు పదేపదే సొరంగంలోకి చేరడంతో నిరంతరం పంపులను నడపాల్సి వచ్చింది. అమెరికా, జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో దెబ్బతిన్నాయి.అంచనాలకు మించిన వ్యయం2011లో రూ. 799 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే, పర్వతాల గుండా మార్గం సుగమం చేయడం, సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడం వంటి పనుల వల్ల ప్రాజెక్టు వ్యయం క్రమంగా పెరుగుతూ రూ. 1500 కోట్లకు చేరుకుంది. వ్యయం పెరిగినా, దేశంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగంగా ఇది గుర్తింపు పొందింది.గురుత్వాకర్షణ శక్తితో ప్రవాహంఈ సొరంగం పొడవు 11.952 కిలోమీటర్లు, వ్యాసం 10.14 మీటర్లు. దీని ప్రత్యేకత ఏమిటంటే, దీని ద్వారా ప్రవహించే నీటికి ఎటువంటి పంపుల అవసరం లేదు. కేవలం ప్రకృతి సిద్ధమైన గురుత్వాకర్షణ శక్తి ఆధారంగానే నర్మదా నది నీరు సునాయాసంగా సోన్ బేసిన్‌కు చేరుకుంటుంది. ఇది భవిష్యత్తులో విద్యుత్ ఆదాతో పాటు నీటి పారుదల రంగానికి పెద్దపీట వేయనుంది.ముగింపు దశలో ప్రక్రియప్రస్తుతం సొరంగం చివరి పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 100 అడుగుల లోతులో నిర్మించిన సిమెంట్ కుంట నుండి టిబిఎం యంత్రాలను బయటకు తీసేందుకు సుమారు 45 రోజుల సమయం పట్టనుంది. ఆ తర్వాత పట్టాలను తొలగించి, నీటిని విడుదల చేస్తారు. దీనివల్ల కట్నీ పరిసర ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. -
గార్ధబాలకు గులాబ్ జామ్‌లు
భోపాల్: విత్తులు నాటాక కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆకాశం వంక మేఘాల కోసం చూడటం రైతన్నలకు నేటి యుగంలో సర్వసాధారణమైపోయింది. అయితే మధ్యప్రదేశ్‌లోని కొన్ని మారుమూలప్రాంతాల్లో మాత్రం కొందరు స్థానికులు మూగజీవాలను ప్రసన్నంచేసుకుంటే వరుణుడు వర్షిస్తాడనే బలమైన విశ్వాసం నెలకొని ఉంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలోని కోలార్ రోడ్లో గాడిదలకు కొందరు గులాబ్‌జామ్‌లు ప్లేట్లలో పెట్టి తినిపించారు. తమ పూర్వీకులు సైతం వర్షాలు సరిగా పడని సందర్భాల్లో అచ్చం ఇలాగే గాడిదలకు తీపిపదార్థాలు ఆహారంగాపెట్టేవాళ్లని స్థానికులు చెప్పారు. వరుణదేవుడైన ఇంద్రుడిని మెప్పించేందుకు గార్ధబాలకు గులాబ్‌జాములు పెట్టడం సరైన పద్ధతి అని మరికొందరు చెప్పారు. ఈ సందర్భంగా జానపద గేయాలను సైతం ఆలపించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లుకొడుతున్నాయి. ఈ వింత ఆచారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్న ఇదే ఇండోర్ నగరంలో ఈ సీజన్లో సాధారణసగటు కంటే 44 శాతం అధిక వర్షపాతం నమోదైందని భోపాల్ వాతావరణవిభాగ సీనియర్ అధికారి ఎన్ఎస్ సాహూ శనివారం ప్రకటించడం విశేషం.అయితే మధ్యప్రదేశ్‌లోని 35 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. చింధ్వారా, దామోహ్, దిందోరీ, జబల్పూర్, కత్నీ, మేహర్, మాండ్లా, మౌగంజ్, నర్సింగ్‌పూర్,పంధూర్నా, పన్నా, రేవా, సాగర్, సత్నా, శివానీ, షాహ్‌దోల్, సిద్ధీ, సింగ్రౌలీ, తికాంగఢ్, ఉమారియా, అలీరాజ్‌పూర్, బర్వానీ, బేతుల్, దటియా, ధార్, ఝాన్బువా, మొరెనా, నర్మదాపురం, రైనెన్, శివ్పూర్, శివపురి, అనుప్పూర్, బాలాఘాట్, ఛాతర్పూర్, విదిష జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. -
వృద్ధుడి గుండెలో భారీ కణితి తొలగింపు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో 75 ఏళ్ల వృద్ధుడికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వృద్ధుడి గుండె కుడి కర్ణికలో పెరుగుతున్న 180 గ్రాముల కణితిని తొలగించారు. ఈ కణితి(ట్యూమర్) సుమారు 9.5 సెంటీమీటర్ల పొడవు, 5.5 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. దేశంలో శస్త్రచికిత్స ద్వారా గుండె నుంచి తొలగించిన అతిపెద్ద మిక్సోమా ఇదే కావొచ్చని భావిస్తున్నారు. ఇండోర్ మేదాంత ఆసుపత్రిలోని కార్డియాక్ సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వినీత్ పాండే మంగళవారం మీడియాతో మాట్లాడారు.వృద్ధుడు కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఛాతీ నొప్పి, తల తిరగడం, కాళ్లు, పొట్ట భాగంలో వాపు వంటి సమస్యలతో బాధపడుతున్నా. అంతేకాకుండా అతడి కాలేయ పనితీరు మందగించినట్లు తెలిపారు. గుండె కుడి కర్ణికలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న కణితిని తొలగించిన సందర్భాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని వినీత్ పాండే చెప్పారు. మానవ గుండె కుడి కర్ణికలో కణితులు ఏర్పడే అవకాశాలు చాలా అత్యల్పమని డాక్టర్ పాండే వివరించారు. వృద్దుడి శరీరంలో ఈ కణితి 35 నుంచి 40 ఏళ్ల క్రితమే ఏర్పడటం మొదలై, క్రమంగా ఈ పరిమాణానికి పెరిగి ఉండవచ్చని వైద్యులు అంచనావేశారు. -
"హలో..నేను దివ్య మాట్లాడుతున్నాను": కట్ చేస్తే..రూ. 21 కోట్ల స్కాం
"హలో... నేను దివ్య మాట్లాడుతున్నాను" అనే మెసేజ్‌తో మొదలైన ఒక సాధారణ వాట్సాప్ సందేశం, భారతదేశంలోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ పెట్టుబడి మోసానికి తెర తీసింది. ఈ స్కాం కారణంగా గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ రూ. 21 కోట్లకు పైగా నష్టపోయారు. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ,మధ్యప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అశోక్ విజయవర్గీయకు భారీ టోకరా ఇచ్చిన వైనం కలకలం రేపింది. ఈ నకిలీ క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో చిక్కుకుని ఏకంగా రూ. 21.06 కోట్లు కోల్పోయారు. మోసం ఎలా జరిగింది?ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మొదలైన ఈ మోసం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ ద్వారా సాగింది. 2025 డిసెంబర్లో విజయవర్గీయకు ఒక ఇండియన్ నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి తన పేరు "దివ్య" అని, తాను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌నని పరిచయం చేసుకుంది.క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు వస్తాయని ఆమె నమ్మబికింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ మొత్తం అమెరికా కంట్రీ కోడ్ (+1) ఉన్న ఒక వర్చువల్ నంబర్‌కు మారింది. బాధితుడితో ఒక నకిలీ ట్రేడింగ్ పోర్టల్‌లో అకౌంట్ తెరిపించారు. మొదట ఆయన సరదాగా పెట్టిన చిన్న పెట్టుబడులపై లాభాలు వస్తున్నట్లు స్క్రీన్‌పై చూపించారు. నమ్మకం కలిగించడానికి జనవరి 7న రూ. 1.88 లక్షల లాభాన్ని నేరుగా ఆయన HDFC బ్యాంక్ ఖాతాకు జమ చేశారు. అంతే ఈ డబ్బు చేతికి అందడంతో విజయవర్గీయ ఆ ప్లాట్‌ఫారమ్ నిజమైనదేనని నమ్మారు. ఆ తర్వాత ఆయన విడతల వారీగా కోట్లాది రూపాయలు బదిలీ చేశారు. అంతేకాదు విజయవర్గీయను నమ్మి ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాములు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఆ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్పోర్టల్లో ఆయనకు రూ. 33.25 కోట్ల లాభం వచ్చినట్లు చూపించారు.తీరా బాధితుడు ఆ లాభాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారి అసలు రంగు బయటపడింది. నిందితులు ఆ లావాదేవీని బ్లాక్ చేశారు. పైగా ఆ డబ్బు రావాలంటే రూ.10.84 కోట్లు ఇన్కమ్ టాక్స్ కట్టాలని, ఆ తర్వాత "రిస్క్ మార్జిన్" కింద మరో రూ. 1 కోటి కట్టాలని చెప్పి మరికొంత డబ్బు లాగారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ , '1930' హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న దాదాపు రూ.2 కోట్లను సకాలంలో ఫ్రీజ్ చేయగలిగారు.అశోక్ విజయవర్గీయఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్దీనిపై గ్వాలియర్ సైబర్ సెల్ విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితులు పోలీసులు లేదా బ్యాంకులు డబ్బును ఫ్రీజ్ చేయకుండా ఉండేందుకు అత్యంత సంక్లిష్టమైన, నాలుగు అంచెల బదిలీ వ్యవస్థను ఉపయోగించారు. మొత్తంగా 20,049 లావాదేవీల ద్వారా డబ్బు దేశవ్యాప్తంగా పంపిణీ అయింది.Layer 1లో బాధితుడి నుండి నేరుగా డబ్బులు స్వీకరించిన 77 బ్యాంక్ ఖాతాలను పోలీసులు గుర్తించారు.Layer 2లో ఆ 77 ఖాతాల నుండి నిధులు 493 ఖాతాలకు బదిలీ అయ్యాయి.Layer 3లో : అక్కడి నుండి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 12,700 ఖాతాలకు డబ్బును చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి పంపారు.Layer 4లో చివరిగా దాదాపు 7,500 లావాదేవీల ద్వారా ఆ డబ్బును ఏటీఎంల (ATMs) ద్వారా విత్‌డ్రా చేయడం, షాపింగ్ వోచర్లు, క్యాష్ వోచర్లుగా మార్చడం లేదా తిరిగి USDT వంటి క్రిప్టోకరెన్సీల్లోకి మార్చడం చేశారు. ఇదీ చదవండి: ‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగంఈ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఖాతాలలో చాలా వరకు "మనీ మ్యూల్స్" (కమిషన్ ఆశతో తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు వాడుకోవడానికి ఇచ్చే ఇంటర్మీడియరీలు) ఖాతాలు అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.ఇది దేశంలోనే జరిగిన అతిపెద్ద మోసాలలో ఒకటి సైబర్ సెల్ డిఎస్పీ సంజీవ్ నయన్ శర్మ ప్రకటించారు. USDT ట్రేడింగ్ పేరుతో సీనియర్ CAను మోసం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది ఖాతాల ద్వారా ఈ నిధులను మళ్లించారని తెలిపారు. గుర్తుతెలియని నిందితులపై సమాచార సాంకేతిక చట్టం (IT Act) సెక్షన్ 66D, సహా పలు సెక్షన్ల కింద కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం సైబర్ టీమ్స్ నిందితులు ఉపయోగించిన నకిలీ యుఆర్ఎల్లు (URLs), ఐపీ అడ్రస్‌లు మరియు వాట్సాప్ నంబర్లను ట్రాక్ చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.ఇదీ చదవండి: ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు? -
నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్ లేఖ రాసుకుని..
భోపాల్: ఒక మహిళ ఎన్నో ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధను ఇక భరించలేకపోయింది. అత్తింట్లో ఎదుర్కొంటున్న వేధింపులు ఆమె మనసుని చంపేశాయి. ఎవరూ తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, తాను చనిపోతే తన గొంతు మూగబోతుందని, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆవేదనతో కాగితంపై కాకుండా... తన చేతులు, కాళ్లపైనే మెహందీతో చివరి సందేశం రాసింది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.ఛింద్వారాకు చెందిన ఓ మహిళ అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె తన చేతులు, కాళ్లపై మెహందీతో సూసైడ్ నోట్ రాసింది. అందులో అత్తింట్లో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి రాసిన విషయాలు గుండెను కలిచివేస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలి చేతులు, కాళ్లపై రాసిన సూసైడ్ నోట్‌కు వీడియోగ్రఫీ కూడా చేశారు.చేతులు, కాళ్లపై సూసైడ్ నోట్ ఎందుకు?చౌరై పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ పేరు ప్రీతి వర్మ (32). ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ప్రీతికి సుమారు 13 ఏళ్ల క్రితం లఖన్ వర్మతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త లఖన్, అతని కుటుంబ సభ్యులు ప్రీతిని వేధించేవారు.మృతురాలు ప్రీతి సోదరుడు హరియోమ్ జాంగేలా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రీతి చనిపోయిన తర్వాత కాగితంపై రాసిన సూసైడ్ నోట్‌ను అత్తింటి వారు నాశనం చేసే అవకాశం ఉందని ఆమె భయపడి ఉండొచ్చని చెప్పారు. అందుకే తన శరీరంపైనే మెహందీతో సూసైడ్ నోట్ రాసిందని, అలా చేస్తే దాన్ని చెరపలేరని తెలిపారు. భర్త లఖన్ వర్మ, అత్తింటి వారు చాలాకాలంగా ప్రీతిని వేధించారని చెప్పారు. ఆమెపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరిగేవని తెలిపారు. ప్రీతి 2-3 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిసారీ భర్త లఖన్ వర్మ ఆమెను నమ్మించి, బాగా చూసుకుంటానని తిరిగి తీసుకెళ్లేవాడని చెప్పారు.వాంగ్మూలం ఇచ్చేలోపే ప్రీతి మృతిపోలీసుల సమాచారం ప్రకారం.. ప్రీతి వర్మ విషం తాగిన తర్వాత కుటుంబ సభ్యులు ముందుగా జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేసేలోపే శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ ప్రీతి చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. -
మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కాం!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరువకముందే మరో కుంభకోణం వెలుగుచూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ పేరిట రూ.1,200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరో పించారు. ఈ మేరకు తన సామాఇజక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు, ఇథనాల్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో ప్రజల హక్కుగా దక్కాల్సిన పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చుట్టూ ఉజ్జయిని భూస్కామ్తాజా బియ్యం కుంభకోణం కంటే ముందు ఉజ్జయినిలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసిందని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైవే కారిడార్ రానున్నాయని ప్రతిపాదించిన ప్రాంతాల్లోనే ముందస్తు సమాచారంతో అక్రమంగా భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ దోపిడీ సాగుతోందని, బీజేపీ నేతలు తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.అవినీతికి మోడల్‌గా మధ్యప్రదేశ్గతంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం నుంచి మొదలుకొని, లెక్కలేనన్ని పేపర్ లీకేజీలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా రాష్ట్రంలో దోపిడీ ఆగలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్‌ను పూర్తిగా ‘అవినీతి మోడల్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ అధికార అహంకారంతో ప్రజా జీవితంలో ఉండాల్సిన జవాబుదారీతనం అనే భావనను కాలరాశారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
క్యాన్సర్‌తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు
కోడళ్లను వేధించే అత్తమామల గురించి విన్నాం. కానీ కోడల్ని కన్న కూతురి కంటే మిన్నగా భావించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అత్తామామల గురించి తెలుసా? క్యాన్సర్ మహమ్మారి కొడుకును బలితీసుకుంటే, వారు కోడలికి అండగా నిలిచారు. అంతేకాదు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. కన్నీళ్లు తెప్పించే ఈ సంఘటన సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.కొన్ని సంబంధాలు కేవలం రక్త సంబంధాలు కాదు. అవి ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించినవ అని ఈ ఘటన నిరూపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. మరో ఇంటికి కోడలిగా తమ కోడలిని అత్తారింటికి సాగనంపిన క్షణాన, అక్కడున్నవారంతా ఆనంద భాష్పాలు రాల్చారు.మధ్యప్రదేశ్‌కు చెందిన దినేష్ బైరాగి కుమారుడు కపిల్‌కు, ప్రియాంకతో 2018లో వివాహం జరిగింది. ప్రియాంక తన ఉన్నత చదువులను పూర్తి చేసి ఆ తరువాత 2023లో అత్తగారింట్లో అడుగుపెట్టింది. వచ్చిన కొద్ది రోజులకే ఆమె తన ప్రేమపూర్వక ప్రవర్తనతో కుటుంబ సభ్యుల మనసు గెలుచుకుంది. అంతా హ్యాపీగాగడిచిపోతుందనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తూ, ఆమె వచ్చిన కొన్ని నెలలకే భర్త కపిల్ క్యాన్సర్ బారిన పడ్డాడు. కానీ ప్రియాంక భయపడిపోలేదు. ఆ కష్టకాలంలో క తన భర్తకు కొండంత అండగా నిలిచింది. కానీ, 2024లో కపిల్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు. ఆ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) కోడలు కాదు.. కూతురు మామగారి గొప్ప నిర్ణయంచిన్న వయసులోనే భర్తను కోల్పోయి సమాజంలో కష్టాల పాలౌతున్న వారిలా తమ ప్రియాంక జీవితం ముగిసిపోకూడదని ఆమె మామ దినేష్ బైరాగి భావించారు. కొడుకు చనిపోయినంత మాత్రాన కోడలి పట్ల తమ బాధ్యత తీరిపోలేదంటూ భార్యను కూడా ఒప్పించారు. ప్రియాంకకు మారు మనువు చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి వద్ద ప్రస్తావించగా, ఆ కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాధారణంగా భర్త చనిపోతే అత్తగారింటితో బంధాలు తెగిపోయే ఈ రోజుల్లో, కోడలి భవిష్యత్తు కోసం అత్తమామలే ఇంతటి నిర్ణయం తీసుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది. ప్రియాంక కోడలు కాదు, తమ కూతురు అని దినేష్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్తండ్రిగా కన్యాదానందినేష్ బైరాగి విదిషా జిల్లాలోని అరారి ఖేజ్దా గ్రామానికి చెందిన గోవింద్ బైరాగీతో వివాహం నిశ్చయించారు. వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. వ్యక్తిని ప్రియాంక కోసం సంబంధం చూశారు. ఈ పెళ్లికి సంబంధించిన ప్రణాళికలు, నిర్వహణ మరియు ఖర్చులన్నీ దినేష్ స్వయంగా భరించారు. పెళ్లి వేడుకలో అత్యంత భావోద్వేగ క్షణం ఏంటంటే, స్వయంగా మామగారే తండ్రి స్థానంలో కూర్చుని ప్రియాంకకు 'కన్యాదానం' చేశారు. పెళ్లికొడుకు చేతిలో ప్రియాంక చేయి పెట్టి, ఆమె కొత్త జీవితం సంతోషంగా సాగాలని ఆశీర్వదించారు.తండ్రి భావోద్వేగంఈ సందర్భంగా ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ బిడ్డ పునర్వివాహ బాధ్యతను ఆమె అత్తమామలు పూర్తిగా తీసుకుని సమాజానికి ఇంత గొప్ప ఆదర్శాన్ని అందిస్తారని తాను కలలో కూడా ఊహించలేదంటే కంటతడిపెట్టుకున్నారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
సమోసాల కోసం రైలు ఆపిన లోకోపైలట్
ఇండోర్: రైలు సమయపాలన అస్సలు పాటించదని ఎంతో మంది ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయడం చూసే ఉంటారు. అయితే అనివార్యమైన కారణాలతో రైలు ఆలస్యమైతే నిట్టూర్చడం మినహా మనం చేసేదేమీ ఉండదు. కానీ మధ్యప్రదేశ్‌లో ఒక రైలు మార్గమధ్యంలో హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా ఆగడంతో అదే మార్గంలో తర్వాత రైళ్లలో వచ్చే ప్రయాణికుల్లో అసహనం పెరిగింది. తీరా ఆ ఆలస్యానికి కారణం కొన్ని సమోసాలు అని తెలిశాక ప్రయాణికుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆన్లైన్ వేదికగా ఆ లోకోపైలట్ చర్యను తప్పుబడుతూ, అతనిపై శాఖాపర చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగింది?: మధ్యప్రదేశ్‌లోని రావూ రైల్వేస్టేషన్ సమీపంలో మార్గమధ్యంలో ఒక గూడ్స్ రైలు హఠాత్తుగా ఆగింది. దీంతో పట్టాలపై ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని డజను మంది స్థానికులు పరుగున వెళ్లి పరిశీలించారు. తీరాచూస్తే అక్కడేం లేదు. ఈలోపు ఇంజిన్ రూమ్ నుంచి ఒక అసిస్టెంట్ లోకో పైలట్ కిందకు దిగి సమీప తినుబండారాల దుకాణానికి చకచకా వెళ్లి కొన్ని సమోసాలు, ఖచోరీలను కొనేసి ప్యాకెట్ వెంటబెట్టుకుని వెళ్లాడు. ఇదంతా సమీపంలోని ఒక వ్యక్తి వీడియోతీశాడు. అసిస్టెంట్ లోకో పైలట్ రైలు ఎక్కగానే అది వెంటనే ముందుకు కదిలింది. దీంతో రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం సమోసాలు కొనేందుకు దానిని ఆపారని అక్కడివాళ్లకు అర్థమైంది. దీంతో వెనకాల వచ్చే రైళ్ల సంగతి పట్టించుకోకుండా ఇష్టారీతిగా పట్టాలపై రైలును ఆపేసిన లోకో పైలట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు విన్పించాయి. దీనిపై వెస్టర్న్ రైల్వే బుధవారం తనదైన రీతిలో వివరణ ఇచ్చింది. ‘‘ సోషల్‌మీడియాలో ఆరోపించినట్లుగా అది ప్యాసింజర్ రైలు కాదు. గూడ్స్ రైలు. రావూ యార్డ్‌కు వెళ్తుండగా ముందున్న పట్టాల వద్ద ఇంజనీరింగ్ పనులు జరుగుతుండటంతో అధికారికంగా ఆదేశించిన మేరకే రైలు ఆ చోటన లోకోపైలట్ ఆపాడు. ఎలాగూ ఆగిందని సహాయక పైలట్ సమోసాలు కొనేందుకు వెళ్లివచ్చాడు’’ అని రత్లాం రైల్వే డివిజన్ అధికారి వివరణ ఇచ్చారు. -
ఆ ఒక్క మాటే తీర్పును తిరగరాసింది!
భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భార్య నోరు జారింది. భర్త తట్టుకోలేకపోయాడు. గర్భంతో ఉందని కూడా చూడకుండా రాయి తీసుకుని దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. క్షణికావేశంలో చేసిన నేరానికి వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ, సమాజం ఊరుకోలేదు!. కోర్టు జీవితఖైదు విధించి తన పని తాను చేసింది. అయితే ఒక్క మాటతో ఆ తీర్పును ఇప్పుడు తిరగరాయాల్సి వచ్చింది.ఐదేళ్ల కిందట.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన గర్భిణీ హత్య కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. మాటామాటా పెరిగి కిరణ్ అనే మహిళను ఆమె భర్త శివ రాళ్లతో దాడి చేసి చంపాడు. ఆపై విషయాన్ని ఇరు వైపులా కుటుంబాలకు తెలియజేశాడు. అయితే.. ఆమె కడుపుతో ఉండడం, రక్తపు మడుగులో ఆమె మృతదేహం కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి జీవిత ఖైదు విధించింది. అయితే..ఈ శిక్ష పునఃపరిశీలన కోసం తాజాగా ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుకు రాగా.. సంచలన తీర్పు వెలువడింది. నిందితుడి జీవితఖైదును ఏడేళ్ల శిక్షగా మార్చేసింది. కేసు విచారణలో కీలకంగా మారిన అంశం.. గొడవ సమయంలో భార్య చేసిన ఒక వ్యాఖ్య. కిరణ్ తన భర్తను ఉద్దేశించి “నువ్వు కాకపోతే.. నీలాంటి వందల మంది నాకు మొగుళ్లుగా దొరుకుతారు” అని అన్నదట. ఈ మాట తనలో తీవ్ర ఆవేశాన్ని రేపిందని, అదే ఆవేశంలో రాయితో ఆమెపై దాడి చేయాల్సి వచ్చిందని శివ కోర్టుకు తెలిపాడు. ఆధారాలను, వాదనలను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ అవినీంద్ర కుమార్ సింగ్.. Grave and sudden provocationను పరిగణనలోకి తీసుకున్నారు.ఇది క్షణికావేశంలో జరిగిన నేరంగా భావించిన ధర్మాసనం.. దాడి జరిగిన వెంటనే నిందితుడు స్వయంగా పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. “అది ప్రణాళికాబద్ధ(ప్లాన్ప్రకారం చేసిన) హత్య కాదు. కోపంలో జరిగింది అని కోర్టు వ్యాఖ్యానిస్తూ.. భారత శిక్షాస్మృతి సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 1 వర్తిస్తుందని పేర్కొంది. అందువల్ల హత్యగా కాకుండా ‘కల్పబుల్ హోమిసైడ్’ (Section 304 Part II) కింద కేసును పరిగణించింది. జీవితఖైదును కాస్త.. ఏడేళ్ల శిక్షగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.Grave and sudden provocation (IPC సెక్షన్ 300 Exception 1).. దీని ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన అవమానం లేదంటే తీవ్ర ఆవేశాన్ని రేపే మాట/పరిస్థితిని అకస్మాత్తుగా ఎదుర్కొన్నప్పుడు.. నియంత్రణ కోల్పోయి నేరం చేయడం.. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు తర్వాత సమాజంలో మాటల ప్రభావం, గృహహింస కేసుల్లో భావోద్వేగ ప్రేరణ పాత్ర వంటి అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకవైపు న్యాయపరమైన సడలింపు సరైన దేనా? అనే ప్రశ్నలు వస్తుండగా, మరోవైపు భావోద్వేగ ఆవేశంలో జరిగే నేరాలపై చట్టం ఎలా స్పందించాలన్నదానిపై కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. -
‘ఇదేందిది?’: బీజేపీ సీఎంతో తెలంగాణ సీఎస్!
భోపాల్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు శుభాకాంక్షలు చెబుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి ఉన్న ఒక ఫొటో ప్రచురితమయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఫొటోపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు జూన్ 26న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం భోపాల్‌లో ఉంటోంది. ఆయన సీఎస్‌గా అత్యున్నత పదవిని చేపట్టిన తరుణంలో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక పత్రికలో శుభాకాంక్షల ప్రకటనను ఇచ్చారు.ఇది సాధారణ ప్రకటనలా కనిపించినప్పటికీ, అందులో కనిపిస్తున్న ఫొటో చర్చకు దారితీసింది. ఆ ఫొటో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినదో ప్రకటనలో పేర్కొనలేదు. అలాగే ఈ ఫొటో ఎంపికలో సంజయ్ జాజు ప్రమేయం ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవిలో ఉన్న అధికారి రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా కనిపించాలని కొందరు అభిప్రాయపడుతుండగా, ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంతో కలిసి ఫొటో దిగడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని మరికొందరు అంటున్నారు. -
3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: బిహార్‌లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దటియ, గుజరాత్‌లోని మంజల్పూర్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని బంకీపూర్ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. అసెంబ్లీ ఉపఎన్నికలకు జులై 6 నుంచి జులై 13 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఆ తర్వాత జులై 14న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. జులై 16 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న కౌంటింగ్ ఉంటుంది. -
‘ఫొటోలు, వీడియోలు తీశాడు.. బతిమిలాడాడు’
తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ స్పందించాడు. వంటమనిషిగా చెప్పుకొంటున్న వ్యక్తి చెప్పినట్లుగా అతడిపై తాము దాడిచేయలేదని స్పష్టం చేశాడు. నిజానికి వంట పేరుతో ఇంట్లో చేరి అతడే తమను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించాడు.దాడికి పాల్పడ్డారు!కాగా శశాంక్ సింగ్, అతడి తండ్రి, విశ్రాంత స్పెషల్ డీజీపీ శైలేశ్ సింగ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వారి ఇంట్లో వంట మనిషిగా చేరిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా భోపాల్‌లో ఎఫ్ఐర్ నమోదైంది. తనను పదే పదే దూషిస్తూ ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. బంధించి కొట్టారని అతడు ఆరోపించాడు. పని మానేయాలని అనుకున్నానని.. అంతలోనే ఇలా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశాడు.ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడుఈ విషయం గురించి శశాంక్ సింగ్ తాజాగా ANIతో మాట్లాడాడు. ‘‘మేము అతడిని బంధించలేదు. నిజానికి అతడు వంట చేస్తానంటూ మా ఇంట్లో అడుగుపెట్టాడు. కానీ అతడికి వంట చేయడం రానేరాదు.మా ఇల్లంతా తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు. నా గదిలోకి కూడా వచ్చి అక్కడ రికార్డింగ్ చేశాడు. అతడి వ్యవహారశైలిపై మాకు అనుమానం వచ్చింది. ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడని అనిపించింది. అయితే, మా ఇంట్లో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాం.డిలీట్ చేయమని హెచ్చరించిందిఇప్పటి వరకు ఈ విషయం గురించి పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదు. అతడు మా ఇంట్లో ఫొటోలు, వీడియోలు తీయడం చూసి మా అమ్మ వాటిని డిలీట్ చేయమని అతడిని హెచ్చరించింది. నా సోదరి 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తానని అతడితో అన్నది. అయితే, అతడు మాత్రం ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ బతిమిలాడుకున్నాడు.కానీ తిరిగి మా మీదే ఆరోపణలు చేశాడు. నేను ఎవరినీ అసభ్యంగా కూడా దూషించను. అలాంటిది ఏకంగా దాడి చేశానని అంటే నా గురించి తెలిసిన వారు ఎవరూ నమ్మరు. అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు’’ అని శశాంక్ సింగ్ కొట్టిపారేశాడు.అదే నిజమైతే కఠిన చర్యలుఅయితే, వంట మనిషి ఫిర్యాదు ఆధారంగా తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జోన్ 1 అదనపు డీసీపీ రష్మీ అగర్వాల్ దూబే జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘‘శైలేశ్ సింగ్, అతడి కుమారుడు, క్రికెటర్ శశాంక్ సింగ్, వారి డ్రైవర్‌పై కేసు నమోదు చేశాము.ఫిర్యాదుదారును వైద్య పరీక్షల నిమిత్తం పంపించాము. ఒకవేళ అతడికి గాయాలయ్యాయని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అయితే, అతడిని చూసినపుడు.. అతడు ఆరోపించినట్లు తీవ్రమైన గాయాలు అయినట్లు మాకు కనిపించలేదు. అందుకే పరీక్షలకు పంపించాము’’ అని ఆమె పేర్కొన్నారు.చదవండి: హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం! -
ఒకే కుటుంబానికి రెండోసారి వజ్రం అదృష్టం
పన్నా(మధ్యప్రదేశ్): జీవితకాలంలో అత్యంత ఖరీదైన ఒక్క వజ్రం దొరకడమే ఎంతో అరుదైన విషయం. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాకు చెందిన ఒక గిరిజన రైతు కుటుంబాన్ని మాత్రం ఇలాంటి అదృష్టం ఏకంగా రెండుసార్లు వరించింది. రెండేళ్ల క్రితం 2024లో ఈ కుటుంబానికి 19.22 క్యారెట్ల వజ్రం దొరికింది. అప్పట్లో ప్రభుత్వ వేలంలో అది ఏకంగా రూ. 93 లక్షలు పలికింది. అదే కుటుంబం ఇప్పుడు మళ్లీ 11.19 క్యారెట్ల వజ్రాన్ని వెలికితీసింది. విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాకేశ్ ఆదివాసీ, అతడి ముగ్గురు సోదరులు, కొందరు బంధువులు కలిసి ఏప్రిల్ అహిర్‌గావ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో వజ్రాల వేట మొదలుపెట్టారు. రెండు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. సోమవారం వారికి అనుకోకుండా 11.19 క్యారెట్ల నాణ్యత కలిగిన వజ్రం లభించింది. వారు వెంటనే ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో దాన్ని డిపాజిట్ చేశారు. ఈ వజ్రం ఎంతో నాణ్యమైందని పన్నా జిల్లా డైమండ్ ఇన్స్పెక్టర్ నూతన్ జైన్ నిర్ధారించారు. Madhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in PannaMadhya Pradesh Tribal Family Finds Another Diamond Worth Lakhs in Panna -
‘రాబందు’ రాజసం!
రెక్కల నిండా స్వేచ్ఛను నింపుకొంది. దిక్చక్రాల సరిహద్దులు దాటింది. ఆకాశాన్నే సామ్రాజ్యంగా మార్చుకుందా రాజ విహంగం. పంజరాల గోడల మధ్య పుట్టి పెరిగినా, ప్రకృతి పిలుపు అందుకోగానే అడవి బాట పట్టింది. మహారాష్ట్ర కొండల్లో రెక్కలు విప్పిన ఓ రాబందు.. మధ్యప్రదేశ్ వనసీమలను దాటుకుంటూ, ఏకంగా మూడు వేల కిలోమీటర్ల అవతల ఉన్న రాజస్థాన్ రాజకోటను ముద్దాడింది. అంతరించిపోతున్న తన జాతి మనుగడకు సరికొత్త ఆశల రెక్కలు తొడుగుతూ.. వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక అద్భుతమైన ‘మహా యాత్ర’ను లిఖించింది..మూడు రాష్ట్రాల మీదుగా.. వన్యప్రాణి సంరక్షణలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని మేల్ఘాట్ అడవుల్లో శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా విడిచిపెట్టిన ‘ఎక్స్–67’ (ఎక్స్67) అనే ఐదేళ్ల ఆడ రాబందు.. కేవలం 27 రోజుల్లో మూడు రాష్ట్రాల మీదుగా ఏకంగా 3,334 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రాజస్థాన్‌లోని ప్రసిద్ధ రణథంబోర్ టైగర్ రిజర్వ్‌కు చేరుకుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ కిశోర్ రీథే బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. మానవ సంరక్షణలో పెరిగి, అడవిలోకి వెళ్లిన పక్షులు.. మనుషుల సాయం లేకుండా స్వయంగా ఆహారాన్ని వెతుక్కోగలవని, ప్రకృతి శైలికి అద్భుతంగా అలవాటుపడగలవని ఈ ఘనత నిరూపించింది. భారతదేశంలో వేగంగా అంతరించిపోతున్న రాబందుల జనాభాను తిరిగి పెంచేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇది పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.అడవుల నెట్‌వర్క్‌లోనే బసఈ ఏడాది జనవరి 2న మేల్ఘాట్ నుంచి సోలార్ ట్రాకింగ్ ట్యాగ్లు అమర్చి వదిలిన 15 రాబందులలో ఈ ‘ఎక్స్–67’ ఒకటి. మొదట నాలుగు నెలల పాటు స్థానిక అడవుల్లోనే తిరుగుతూ ప్రకృతికి అలవాటుపడిన ఈ పక్షి.. మే 28న తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్, భోపాల్ ప్రాంతం, చిరుతలను పునరుద్ధరించిన కునో నేషనల్ పార్క్‌లలో తాత్కాలికంగా బస చేస్తూ.. మంగళవారం నాటికి రాజస్థాన్ రణథంబోర్ చేరుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!
కట్టుకున్న భర్త వేధింపులకు గురిచేసి, అత్యంత దారుణంగా హింసించిన కేసు ఒకటి కలకలం రేపుతోంది. ఎర్రగా కాలిన ఇనుప రాడ్‌తో వాతలు పెట్టి హింసించాడు. మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతనైతే పోలీసుల దగ్గరకు వెళ్లమని సవాలు విసిరాడు. కట్ చేస్తే...క్రైమ్ థిల్లర్‌లా సాగిన ఈ కథలో చివరికి ఆమె పోలీసుల వద్దకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం...జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత తిట్టడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకించడంతో ఆమెపై క్రూరంగా దాడి చేశాడు.కర్రతో బాదాడు, చెంపదెబ్బలు కొట్టాడు, బెదిరించాడు. ఆ హింసను భరించలేక, మాంగీబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చింది.మొదటిసారి దొరికిపోయిందిగంటల తరబడి నడుచుకుంటూ ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు వెడుతుండగానే, ఒక గుడి సమీపంలో ఆమె భర్త ఆమెను అడ్డుకుని, మళ్లీ దాడి చేసి, బలవంతంగా గ్రామానికి తీసుకువెళ్లాడు. మరింత క్రూరంగా మారిపోయాడు. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసులేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి,తాళం వేసేశాడు. ఇప్పుడు చూస్తాను నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎలా ఫిర్యాదు చేస్తావో, ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో అంటూ బెదిరిస్తూ పదేపదే కొట్టాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్‌ను వేడి చేసి, ఆమె శరీరంపై కాల్చాడు. ఆమె నడుము, నడుము కింది భాగం, కుడి తొడపై ఈ వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా, ఎవరూ సాయం చేసేవారే లేకపోయారు. 24 గంటలు బయటకు వెళ్ల నివ్వలేదు, ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టాలని తాళం వేసి బయటకు వెళ్లాడు. అతగాడి క్రూరత్వం, జరగబోయే హింసను ఊహించి భయంతో, రాజీకి అంగీకరించినట్లు నటించింది. కానీ మనసులో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూసింది.దారి చూపిన రాయిపంచాయతీ కోసం భర్త బయటికి వెళ్లగానే చుట్టూ సాయంకోసం వెదికింది. మాంగీబాయి కళ్ళు అక్కడ ఉన్న ఒక రాయిపై పడ్డాయి. అంతే దాన్నితీసుకుని తాళంపై ఒకటి, రెండుసార్లు పదే పదే తాళం పగిలే దాకా కొడుతూనే ఉంది. చివరకు తాళం విరిగింది. గొలుసు తెగిపోయింది, బందీఖానానుంచి విముక్తి లభించింది. క్షణం కూడా వృధా చేయకుండా, ఆమె ఇంటి నుండి పరుగులు తీసి ఖిల్చిపూర్ వైపు నడవడం ప్రారంభించింది.తీవ్ర అలసట,, ఒళ్లంతా గాయాలు,, ముళ్ళు గుచ్చుకుని తెగి రక్తమోడుతున్న పాదాలు, అయినా సరే తనను బంధించడానికి వాడిన ఇనుప గొలుసు ఇంకా మెడలోనే వేలాడుతుండగానే తన విముక్తి కోసం పయనం మొదలు పెట్టింది. చివరికి పోలీసు స్టేషన్ గడప తొక్కింది. ఆమె సాహసోపేత ప్రయత్నం, తెగింపు కారణంగా చివరకు ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ దుర్మార్గానికి తెర పడేలా చేసింది. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్ చీకట్లో ఆరు కిలోమీటర్ల ప్రయాణంచుట్టూ చీకటి.. మెడలోఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా.. మాంగీబాయి నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాలు, గరుకు మార్గాల గుండా నడక మొదలు పెట్టింది. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నారు. కానీ ఎవరూ కనీసం ఆగి ప్రశ్నించలేదు. అయితే, ఒక బాటసారి ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఏదైనా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్‌కు చేదు అనుభవంషాక్కు గురైన పోలీసులురాత్రి 10 గంటల ప్రాంతంలో మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే అక్కడున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. మెడలో తాళం వేసిన గొలుసు, శరీరంపై వాతలు , తీవ్ర భయాందోళలో గజ గజ వణికిపోతూ స్టేషన్‌కు చేరుకున్న ఆమె కన్నీరుమున్నీరై, జరిగినదంతా వివరించింది. పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె శరీరంపై గాయాలు, వాతలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఒక పోలీసు బృందం గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు. -
రైలు ఢీకొని నలుగురు దుర్మరణం ఎక్కడంటే..!
-
రైలుకి మంటలు అంటుకున్నాయంటూ వదంతులు.. నలుగురి మృతి
మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మొరేనా స్టేషన్ దగ్గర రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇందుకు రైలులో వ్యాపించిన వదంతులే కారణం. ఉదయ్‌పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అగ్నిప్రమాదం జరిగిందన్న వదంతులతో ఓ ప్రయాణికుడు చైన్ లాగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కొందరు ప్రయాణికులు రైలు నుంచి దూకారు. పట్టాలపై ఎదురుగా వస్తున్న పాతాళ్కోట్ రైలు వారిలో పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటన హేతంపూర్ సమీపంలో జరిగింది. Madhya Pradesh: A train accident occurred in Morena after passengers travelling on the Udaipur Intercity Express jumped off the train following rumours of a fire. Several passengers were hit by the approaching Patalkot on the main track. The incident took place near Hetampur… pic.twitter.com/LfSX6R4XE8— IANS (@ians_india) June 14, 2026 -
సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్‌ను, పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్‌ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్‌ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.మధ్యప్రదేశ్ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్‌లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. తరుణ్‌చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్ తిరస్కరణతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. బీజేపీ తరఫున తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికలు అవసరం లేకుండా పోయాయి. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉండటంతో రిటర్నింగ్ ఆఫీసర్ వారిని ఏకగ్రీవంగా ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను బీజేపీ అభ్యంతరాల ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఒక కేసును అఫిడవిట్లో వెల్లడించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే నటరాజన్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టి పారేశారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ కోర్టులో ఆ కేసుపై పిటిషన్ వేసి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు.కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణను.. తప్పు, పక్షపాతపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. చట్ట విరుద్ధం’అని సుప్రీం కోర్టులో వాదించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు రిటర్నింగ్ ఆఫీసర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైన నిర్ణయం, చట్టబద్ధమైనదే అని కోర్టులో వాదించారు. అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పిటిషన్‌ను అంగీకరించకూడదని కోర్టులో ప్రతిపాదించారు. పిటిషన్లో ఎన్నికల ఫలితాలపై స్టే కోరినా.. జూన్ 12న కోర్టులో విచారణ జరగనుందని, అప్పటివరకు స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపే సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ, అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ శివాంగ్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో బుందేల్‌ఖండ్ బుల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శివాంగ్.. బుధవారం మాల్వా స్టాలియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మాల్వా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అన్ష్ యాదవ్ (44 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు సక్షమ్ పురోహిత్(40), అఖిల్(33) రాణించారు. బుందేల్‌ఖండ్ బౌలర్లలో అనంత్ దూబే, శివాంగ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.శివాలెత్తిన శివాంగ్అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో శివాంగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివాంగ్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడితో పాటు విక్రాంత్(43), అమన్ జైన్(17) రాణించారు.ఫలితంగా బుందేల్‌ఖండ్ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. మాల్వా బౌలర్లలో పార్థ్ సహాని, ప్రశాంత్, పవన్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున శివాంగ్ 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. -
ఆర్ఓ నిర్ణయాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటరి్నంగ్ అధికారి(ఆర్ఓ) తిరస్కరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్ఓ నిర్ణయం చట్టవిరుద్ధం అప్రజాస్వామికమని తేల్చిచెప్పింది. నామినేషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కేసీ వేణుగోపాల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తంఖా, రణదీప్ సూర్జేవాలా, దీపాదాస్ మున్షీ, భూపేశ్ బఘేల్‌ల బృందం ఈసీని కలిసి తమ వాదనను విన్పించింది. అనంతరం అభిషేక్ సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ‘‘మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు ఆర్ఓ చూపిన కారణాలకు చట్టపరమైన ఆధారాలు లేవు. ఏదైనా క్రిమినల్ కేసులో నేరాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అది కేసుగా మారుతుందన్న ప్రాథమిక న్యాయ సూత్రాన్ని రిటర్నింగ్ అధికారి విస్మరించారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసును ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ కోర్టు కేవలం నోటీసు మాత్రమే ఇచ్చింది. మేజిస్ట్రేట్ దీనిపై నిర్ణయం తీసుకోనంత వరకు అది క్రిమినల్ కేసుగా లెక్కలోకి రాదు’’ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద కేంద్ర ఎన్నికల సంఘానికి విశేషాధికారాలు ఉన్నాయని కాంగ్రెస్ బృందం వెల్లడించింది. అభ్యర్థికి న్యాయం చేసేందుకు ఆర్ఓ నిర్ణయాన్ని రివర్స్ చేసే అధికారం ఈసీకి ఉందని గుర్తుచేసింది. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్‌లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్‌లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్‌కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్‌కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
బంగారం చూపెట్టి రీల్స్ చేసింది! తెల్లారేసరికి బంగారం మాయం
-
మీనాక్షికి అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. మూడో సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, మూడో సీటుపై కన్నేసింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటూ మాదే. ఇంకెక్కడికి వెళ్తుంది?’ అంటూ ఆదివారం చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మత్స్యకార నేత మహేష్ కేవత్‌ను ఆదివారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో 228 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపునకు 58 ఓట్లు కాగా బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన రెండు సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. మూడో సీటు కూడా దక్కాలంటే మరో పది ఓట్లుంటే సరిపోతుంది. కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో 63కు ఆ సంఖ్య తగ్గొచ్చు. ఇది గెలుపు కోటా కంటే 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్, అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే ఆలోచనలో ఉంది. మీనాక్షీ నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు సమావేశమై కాంగ్రెస్‌లోని అసంతృప్తి వర్గాలను ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. గెలుపు అవకాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమని అంటున్నారు. -
వీడియో చూసి దోచేశారు
భోపాల్: సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను, సంపదతోపాటు ఇతర అంశాలను అతిగా ప్రదర్శించుకోవడం వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో హెచ్చరించే తాజా ఉదాహరణ ఇది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ తన ఛానెల్లో హోమ్ టూర్ పేరుతో తమ ఇంట్లో నగదు, బంగారు నగలను చూపుతూ ఓ వీడియో అప్లోడ్ చేశారు. అది జరిగిన కొద్ది రోజులకే ఆమె ఇంట్లో రూ.10 లక్షల విలువైన సొత్తును దొంగలు దోచుకున్నారు. మోహని గ్రామానికి చెందిన గృహిణికి యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రచన ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లలో తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. ఒక వీడియోలో ఇంటి గేట్ నుంచి ఇంట్లో ఉన్న రూముల వరకు చూపించారు. టేబుల్‌పై నగలు, భారీగా నగదు పెట్టి మరో వీడియో చేశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా కర్ర సాయంతో ఇంట్లోని సీసీటీవీ కెమెరాల దిశ మార్చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియ పెట్టారు. ఇల్లంతా వెతికి దాదాపు రూ.10 లక్షల బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు స్థానికులు లేదా చుట్టుపక్కల ప్రాంతానికి చెందినవారై ఉండవచ్చని శివపురి అడిషనల్ ఎస్పీ సంజీవ్ అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన వీడియో చూసి దొంగలు ప్లాన్ చేసి దోచేశారని పోలీసులు భావిస్తున్నారు. -
మీనాక్షికి క్రాస్‌ఓటింగ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు దక్కే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇప్పుడు చర్చ అంతా మూడో స్థానం చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటు వస్తుంది.. లేదంటే ఎక్కడికి వెళ్తుంది?’ అంటూ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వ్యూహాలపై కొత్త చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్ పోటీ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు. మూడో స్థానం గెలిచేందుకు బీజేపీకి కేవలం 9 ఓట్లే అవసరం. దాంతో కాంగ్రెస్‌ను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ పోటీకి దిగారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్ బరిలో నిలిచారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ తేల్చిచెప్పారు. దీంతో క్రాస్ ఓటింగ్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. మీనాక్షీ నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత నరేష్ జ్ఞానచందానీ బహిరంగంగా ప్రశ్నించారు. ‘క్రాస్ ఓటింగ్ ప్రమాదం పొంచి ఉంది’ అని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్‌లో ఆందోళనను మరింత పెంచింది. -
పోషకాహార ప్యాకెట్లో పాము
భోపాల్: అంగన్వాడీ కేంద్రంలో ఓ గర్భిణీకి పోషకాహార లడ్డూలంటూ అందజేసిన ప్యాకెట్లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని పంధుర్నా జిల్లా కార్ఘాట్ కమ్టీ గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. వత్సలా బాయి ధుర్వే అనే గర్భవతి పోషకాలతో కూడిన ఆహారమంటూ లడ్డూల ప్యాకెట్‌ను అంగన్వాడీ సిబ్బంది అందజేశారు. ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులు ఆ ప్యాకెట్‌ను తెరిచి చూసి షాకయ్యారు. అందులో చనిపోయిన పాము పిల్ల ఉంది. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయమై వారు వెంటనే అంగన్వాడీ సిబ్బందికి, స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ పీడీ ఉషా పండ్రేతోపాటు మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకుని, వివరాలను వాకబు చేశారు. ఘటనపై విచారణకు తాత్కాలిక కలెక్టర్ అగ్రిమ్ కుమార్ ఐదుగురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాము పిల్ల ప్రత్యక్షమైన ఆహార ప్యాకెట్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తాత్కాలిక కలెక్టర్ తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేశారు. -
పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు
పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్‌లో టైలర్‌గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.జూన్ 8న రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్‌తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్ కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు , అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి మరికొరు ఇలా ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు. -
భార్య బడిత పూజకు భర్త బలి
ఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు నీలం కుష్వాహ తన భర్తను కర్రతో కొట్టి చంపింది. ఆపై ఎనిమిది గంటల పాటు మృతదేహం వద్దే కూర్చుంది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. నీలం గత నాలుగేళ్లుగా తన భర్త దీన్‌దయాల్ కుష్వాహకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది.జూన్ 1న దీన్‌దయాల్ మద్యం మత్తులో భార్య తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీన్‌దయాల్ బలవంతంగా తలుపులు తెరిచి.. తమ కొడుకును తలకిందులుగా వేలాడదీశాడని నీలం ఆరోపించింది. తన భర్త బిడ్డకు హాని తలపెడతాడేమోనని ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ఆమె కర్రతో దీన్‌దయాల్‌పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన దీన్‌దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నీలం దాదాపు ఎనిమిది గంటల పాటు భర్త మృతదేహం పక్కనే కూర్చుంది.ఆ తర్వాత స్థానిక గుడికి వెళ్లి.. దేవుడి ముందు 10 నిమిషాల పాటు కూర్చుని క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమె.. తానే తన భర్తను చంపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోని మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేధింపులు, దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కల్లలైన కుటుంబం కల
ఉజ్జయిని: పశ్చిమాసియా యుద్ధం మధ్యప్రదేశ్‌లోని ఒక భారతీ యుని ఇంట్లో విషాదం నింపింది. గత 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ టైలర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల మన్జూర్ అహ్మద్ ఈనెల 8వ తేదీన మేనల్లుడి పెళ్లి చూడ్డానికి భారత్‌కు బయల్దేరుతుండగా కువైట్ విమానాశ్రయంలపై జరిగిన దాడిలో ప్రా ణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కువైట్ నుంచి ముంబై బయల్దేరాల్సిన విమానం ఎక్కాల్సిన మన్జూర్ అదే ఎయిర్‌పోర్ట్‌లో చనిపోయారన్న వార్త విని ఉజ్జయిని జిల్లాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘‘మేనల్లుడి పెళ్లి అనగానే మా నాన్న ఎంతో సంబరపడ్డారు. వెంటనే బయల్దేరాలని ఆశ పడ్డారు. బహుమతులతో బ్యాగు సర్దుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ముంబైదాకా విమానంలో వచ్చి అక్కడి నుంచి రైళ్లో మధ్యప్రదేశ్‌కు వస్తానని నాతో అన్నారు. నాన్నతో అర్ధరాత్రి 2.30 గంటలకు కూడా మాట్లాడా. ఇంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది’’అని మన్జూర్ కుమారుడు, 18 ఏళ్ల అనాస్ అహ్మద్ విలపించారు. ‘‘కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి అంటే ఎవరో చనిపోయారని భావించాం. హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మన్జూర్ చనిపోయారని చెప్పగానే మా కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఆయనకు ఉజ్జయినిలో రైల్వేస్టేషన్లో ఘనంగా స్వాగతం పలకాలని పూలమాలలు కూడా కొనేశాం. ఇప్పుడు వాటినే ఆయన మృతదేహంపై కప్పేందుకు, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గుజరాత్ వెళ్తున్నాం’’అని అతని బావ మొహమ్మద్ ఇస్మాయిల్ ఏడుస్తూ చెప్పారు. సన్నిహిత బంధువుల వివాహం తర్వాత దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి కలిసిరావాలని మన్జూర్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మన్జూర్కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబ పోషణభారం మొత్తం ఒక్కడే మోస్తున్నాడు’’అని ఆప్తులు తెలిపారు. నేడు భారత్‌కు మన్జూర్ పార్థివదేహం విమానంలో కువైట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మన్జూర్ పారి్థవదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకల్లా భారతప్రభుత్వం తరలించనుంది. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి రోడ్డు మార్గంలో తీసుకురానున్నారు. బాధితుని స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని చంబా నదీతీరంలోని నాగ్డా పట్టణం. ‘‘ఎయిర్పోర్ట్ టరి్మనల్1పై ఇరాన్ డ్రోన్లు దాడిచేయడంతో మన్జూర్ చనిపోయారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. మన్జూర్ పారి్థవదేహం తరలింపు విషయంలో ఆయన కుటుంబంతో నిరంతరం మంతనాలు జరుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’అని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆసీం ఆర్ మహాజన్ తెలిపారు. -
మోనాలిసా దంపతులకు ఊరట
కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్ చేయొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మోనాలిసా మైనర్ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం! -
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. -
త్విషా శర్మ మృతి కేసు రిటైర్డ్ జడ్జి గిరిబాల అరెస్ట్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నటి, మాజీ మోడల్ త్విషా శర్మ(33)కేసు మరో మలుపు తిరిగింది. ఆమె అత్త, రిటైర్డ్ జిల్లా జడ్జి అయిన గిరిబాలా సింగ్‌ను ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ గురువారం అరెస్ట్ చేసింది. అంతకుముందు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో దిగువ కోర్టు ఆమెకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. ముగ్గురు అధికారులతో కూడిన సీబీఐ బృందం దర్యాప్తులో భాగంగా ఉదయం 10.30 గంటల సమయంలో గిరిబాలా సింగ్‌ను ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ బృందం ఈ సందర్భంగా ఆమె ఇంటి డిజిటల్ మ్యాపింగ్ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తునకు భోపాల్‌లో ప్రత్యేక కార్యాలయానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్‌ను కోరినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం త్విషా శర్మ మృతి కేసులో వివిధ ఘటనల క్రమం, గిరిబాలా సింగ్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. కట్నం వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న గిరిబాలా సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లకు ఈ నెల 15వ తేదీన భోపాల్‌లోని సెషన్స్ కోర్టు బెయిలిచ్చింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సీబీఐ తరఫున కోర్టులో పిటిషన్ వేశారు. త్విషా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు విషయంలో దిగువ కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం అర్థమవుతోందంటూ పేర్కొన్నారు. అత్తింటి వారు త్విషాను సంతోషంగా ఉండేందుకు, కనీసం బాధపడేందుకు సైతం అవకాశమివ్వలేదన్నారు. ముందస్తు బెయిల్ పొందిన గిరి బాలాసింగ్ 18వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్విషా శర్మపై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించారని తెలిపారు. గిరిబాలా సింగ్ తన పలుకుబడిని ఉపయోగించుకుని ఘటనా స్థలంలో ఆధారాలను తారుమారు చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో సాక్ష్యాధారాలను సరిగ్గా పరిశీలించాల్సిన బాధ్యత ట్రయల్ కోర్టుపై ఉన్నందున, ఆమెకు ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. -
3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు
మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్‌లపై సీబీఐ కొత్తగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది. సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్‌కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్ఇప్పటికే వరకట్నం డిమాండ్ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్‌ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్ చేయించారని ట్విషా వాట్సాప్ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడుబైపోలార్ డిజార్డర్దీంతోపాటు మరో షాకింగ్ ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) 'అడ్జస్ట్మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్లైన్ జాబ్స్ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె మామూలుగానే ఉందనీ, ఇద్దరమూ జిమ్‌కు వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్‌కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్‌గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు, దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్లు, వైద్య రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
నటి ట్విషా శర్మ కేసులో మరో ట్విస్ట్
-
ట్విషా శర్మ కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్ : మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ప్రకారం ఆమెది హత్య కాదు, ఆత్మహత్యేనని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఇదే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మే 12న ట్విషా తన అత్తగారింటి టెర్రస్‌లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరితే రెండో పోస్టుమార్టం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.అయితే ట్విషా తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదుర్కొన్నందువల్లే ఆమె ప్రాణం కోల్పోయిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ట్విషా శర్మ భర్త సమ్రత్ సింగ్ లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అత్తగారు న్యాయవాద నేపథ్యం ఉన్నవారు కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ట్విషా తండ్రి ఆరోపించారు.కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేసు స్వతంత్రంగా, వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ను కేవలం రెండు రోజుల్లోనే నమోదు చేశామని, నిందితుడు సమ్రత్‌ను పట్టుకోవడానికి బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టులో ఆలస్యం జరిగినా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు.ట్విషా శర్మ, సమ్రత్ సింగ్‌ల వివాహం 2024 డిసెంబర్లో జరిగింది. ఇద్దరి పరిచయం ఒక డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు ఈ విషాదానికి కారణమయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. ట్విషా శర్మ మరణించిన సమయంలో ఆమె భర్త సమ్రత్ సింగ్,పొరిగింటి వ్యక్తి, ఇంట్లో సహాయకుడు అనుమానస్పదంగా కనిపించారు. వీరు ముగ్గురూ ఆమెను మెట్లపై నుంచి కిందికి తీసుకువస్తూ,సీపీఆర్ చేసే ప్రయత్నాలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ట్విషా శర్మ మే 12న ఉదయం 7:20కి ఒంటరిగా మెట్లపైకి ఎక్కి టెర్రస్‌కి వెళ్లినట్ సీసీటీవీలో కనిపించింది.దాదాపు గంట తర్వాత ఆ ముగ్గురు పైకి ట్విషా ఉన్న రూమ్‌లోకి వచ్చారు. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జ్) ఓ గదిలోకి వెళ్లి, కొద్దిసేపటికి బయటకు వచ్చి కిందికి వెళ్లినట్లు కూడా ఫుటేజ్‌లో కనిపించింది.ట్విషా భర్త ప్రస్తుతం పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. ట్విషా తల్లిదండ్రులు ఈ ముగ్గురి చర్యలు అనుమానాస్పదమని, వరకట్న వేధింపుల కారణంగా హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా అదే నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ట్విషా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు సిఫారసు చేశారు. -
సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యం
ఇండోర్: వివాదాస్పద భోజ్‌శాల కేసులో విజయం సాధించిన హిందూ పిటిషనర్లు మధ్యప్రదేశ్ హైకోర్టులో మరోసారి పిటిషన్ వేశారు. ఆలయంలో ఉండాల్సిన సరస్వతీ మాత ప్రతిమ లండన్ మ్యూజియంలో ఉందని, కోహినూర్ వజ్రం కంటే ముందు అత్యంత ముఖ్యమైన ఆ విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చేలా ఆదేశాలివ్వాలని అందులో వారు కోరారు. భోజ్‌శాల–కమాల్ మౌలా మసీదు సముదాయం ఒకప్పుడు సరస్వతీ దేవి ఆలయప్రాంతమని శుక్రవారం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. దీంతోపాటు, ఆ ప్రదేశంలో హిందువుల పూజలు, ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఏఎస్ఐ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రద్దు చేయడం తెల్సిందే. దీంతో, శనివారం నుంచి అక్కడ సరస్వతీ మాత ప్రతిరూపాన్ని ప్రతిష్టించుకుని హిందువులు పూజలు చేస్తున్నారు. అయితే, అక్కడుండాల్సిన అసలైన విగ్రహం వలస పాలన కాలంలో బ్రిటిషర్లు తీసుకెళ్లి లండన్ మ్యూజియంలో ఉంచారని పిటిషనర్లు తెలిపారు. దానిని తిరిగి తీసుకువచ్చి భోజ్‌శాలలో ప్రతిష్టించాలని కోరారు. ఇందుకుగాను బ్రిటిష్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరపవచ్చని కూడా హైకోర్టు 15వ తేదీనాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బసరస్వతీ మాత విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు పిటిషనర్లలో ఒకరైన కుల్దీప్ తివారీ చెప్పారు. బ్రిటిష్ రాజవంశీకుల దగ్గరున్న కోహినూర్ మాదిరిగానే వాగ్దేవి విగ్రహాన్ని కూడా తీసుకురావాలన్నారు. కానీ, కోహినూర్ కంటే ఇప్పుడు సరస్వతీ మాత విగ్రహమే ముఖ్యమని, ఇది తమ మతవిశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విషయమని తివారీ పేర్కొన్నారు. రాజకీయ సంకల్పముంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి లండన్ నుంచి విగ్రహాన్ని తీసుకురావడం ఏమంత కష్టమైన విషయం కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. 1034లో భోజ్‌శాలలో పర్మార్ రాజు భోజుడు సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించారని, 1305లో మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆలయాన్ని ధ్వంసం చేశాడని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ -
భోజ్‌శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి
ధార్: మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖితమయ్యింది. ధార్ జిల్లాలోని చరిత్రాత్మక భోజ్‌శాల సముదాయం సరస్వతీ దేవి ఆలయమేనని హైకోర్టు కీలక తీర్పునిచ్చిన నేపథ్యంలో హిందువుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపధ్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న పూజలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గత 23 ఏళ్లుగా సాగుతున్న నిరంతర పోరాటానికి దక్కిన విజయంగా భావిస్తూ, భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇక్కడ పూజల్లో మునిగితేలుతున్నారు.700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతిహైకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో భోజ్‌శాల సముదాయంలో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. రాజా భోజ్ నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 700 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ‘అఖండ జ్యోతి’ని వెలిగించారు. అంతేకాకుండా, 2003 తర్వాత మొదటిసారిగా గర్భగుడిలో వాగ్దేవి (సరస్వతీ దేవి) ప్రతీకాత్మక విగ్రహాన్ని ప్రతిష్టించారు. భోజ్‌శాల ఉద్యమంతో ముడిపడి ఉన్న ముగ్గురు అమరవీరుల చిత్రపటాలను సైతం తొలిసారిగా ఆలయంలో ఉంచి ఘన నివాళులర్పించారు.ఏడాది పొడవునా పూజలు2003 నుండి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. హిందువులు కేవలం మంగళవారం మాత్రమే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకోవడానికి, ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే హైకోర్టు తాజా తీర్పుతో ఆ పాత నిబంధనల బోర్డుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) రంగు వేసి, పూర్తిగా చెరిపివేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడు హిందువులకు మంగళవారమే కాకుండా, ఏడాది పొడవునా ప్రతిరోజూ పూజలు చేసుకునే హక్కు లభించింది. ప్రస్తుత నిబంధనలను మారుస్తూ సరికొత్త మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమైంది.‘మహా సత్యాగ్రహం’ లక్ష్యం ఇదే భోజ్‌శాల ఉత్సవ కమిటీ జనరల్ మేనేజర్ హేమంత్ దౌరాయా మాట్లాడుతూ, ఈ చారిత్రాత్మక సరస్వతీ ఆలయాన్ని దక్కించుకునేందుకు 2003 నుండి ప్రతి మంగళవారం హిందూ సమాజం శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తోందని గుర్తుచేశారు. కోర్టు తీర్పుతో 23 ఏళ్ల పోరాటం ఫలించిందని, భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమేనని నిరూపితమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ‘మహా సత్యాగ్రహం’ ఇక్కడితో ఆగదని, ఆలయ సముదాయానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న మసీదు, సమాధులను పూర్తిగా తొలగించడమే తమ తదుపరి ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఆనవాళ్లపై సువేందు ఉక్కుపాదం.. ముందుగా.. -
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్‌మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 'మరణపూర్వ గాయాలు' అంటే ..ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవికోతలు లేదా రాపిడి గాయాలువాపుఎముకలు విరగడంఅంతర్గత రక్తస్రావంబలహీనమైన దెబ్బలుఆత్మరక్షణ గాయాలు తదితరాలు.వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.ఎలా గుర్తిస్తారంటే?మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరణానంతర గాయాలు అంటే..మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..మరణానికి ముందు గాయాలుమరణానికి ముందు సంభవిస్తాయిరక్తస్రావం, వాపును చూపుతాయిగాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయిమరణానంతర గాయాలుమరణం తర్వాత సంభవిస్తాయిసాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదుమృతదేహాన్ని తరలించే సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు) -
మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్ మెసేజెస్
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు నెలల గర్భిణి అయిన ట్విషా (31) భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోవడానికి ముందు తన స్నేహితులకు పంపిన చివరి సందేశాలు వాట్సాప్ చాట్ కలకలం రేపుతోంది. తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ ఆమె తన స్నేహితులకు పంపిన సందేశాలు ఆమె తీవ్రమైన మానసిక ఆందోళన, ఒంటరితనం, పెళ్లి తర్వాత వేదనలో ఉన్నట్లు ఆ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఆమె ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్టు చెబుతున్న బెల్టును పోస్ట్‌మార్టంకు ఎయిమ్స్ భోపాల్‌కు పంపకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ కేసును పక్క దారి పట్టిస్తున్నారంటూ భోపాల్ పోలీసులపై ఆరోపణలు కుదిపేస్తున్నాయి. దర్యాప్తు సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అసలు ఏం జరిగింది?నోయిడాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన ట్విషా శర్మ, ఢిల్లీలో ఉద్యోగం చేసేది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అయిదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన భర్త ఇంట్లో ట్విషా శవం వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని తేలినప్పటికీ, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాల గుర్తులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా చాట్స్ కీలకంగా మారాయి.మే 7న ఒక స్నేహితురాలితో వాట్సాప్ చాట్‌లో.. "నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. నా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నాను. పెళ్లి కుటుంబాన్ని ఇస్తుంది, కానీ ఎక్కడున్నా మన కోసం మనం పని చేయడం ఆపకూడదు" అని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించి ముందడుగు వేయండి" అని స్నేహితురాలిని హెచ్చరించింది. అలాగే తనకు ఇల్లు, స్నేహితులు బాగా గుర్తొస్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో స్నేహితుడితో మాట్లాడుతూ.. "నేను చిక్కుకుపోయాను బ్రో (I am trapped bro). నువ్వు మాత్రం ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, సమయం వచ్చినప్పుడు కాల్ చేస్తాను" అని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబంట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ (రిటైర్డ్ జడ్జి)లపై కుటుంబ సభ్యులు హత్య, కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. భర్త, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపించారు. నిందితులు ప్రభావవంతమైన వ్యక్తులు కావడం వల్ల వారికి ముందస్తు బెయిల్ లభించిందని, దీనివల్ల స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంపై న్యాయం చేయాలని, ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్విషా కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నివాసం వెలుపల నిరసన చేపట్టారు. భోపాల్ వచ్చినప్పటి నుండి తాము ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం కోసం మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ట్విషా తండ్రి నవనిధి శర్మ, సోదరుడు ఆశిష్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు .స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు, వారికి సమీప బంధువైన వ్యక్తి లోకాయుక్తగా ఉండటంతో కేసును ప్రభావితం చేస్తున్నారని తండ్రి నవనిధి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కుటుంబ సభ్యుల ప్రకారం పెళ్లయిన దగ్గర్నుంచీ ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో తిరిగి వచ్చేయాలని ఆమె భావించింది. ఇంతలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్‌ను సవాలు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది 68 మంది ప్రయాణికులతో ఉన్న కోచ్‌ను 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రైల్వే అధికారుల ప్రకారం, తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న 12431 నంబరు గల రైలులోని బి-1 కోచ్‌లో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని విక్రమ్‌గఢ్ ఆలోట్,లునిరిచా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని రత్లాం డివిజన్ పీఆర్ఓ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఉదయం 3.45 గంటల ప్రాంతంలో రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది.ఈ ఘటన ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది, కనీసం ఐదు నుంచి ఆరు రైళ్ల షెడ్యూళ్లకు అంతరాయం కలిగింది. ఈ ఘటన తర్వాత పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారని అధికారులు తెలిపారు. ప్రమాదం, రైళ్ల రాకపోకల అంతరాయంపై ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చారు. -
రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు
-
కోర్టులూ ఆస్పత్రుల్లా 24/7!
జబల్పూర్: వైద్యాలయాల మాదిరిగా న్యాయస్థానాలూ 24 గంటలూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ వాళ్ల బాధలు, ఆకాంక్షలను నెరవర్చే రాజ్యాంగబద్ధ కేంద్రాలుగా పరిఢవిల్లాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిలషించారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర హైకోర్టు పరిధిలో కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధిచేసిన సందర్భంగా ‘సమీకృత ఐక్య డిజిటల్ వేదికగా న్యాయసాధికారత’పేరిట జరిగిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. ‘‘ఆస్పత్రుల్లా కోర్టులూ వారంలో ప్రతిరోజూ ప్రతిగంటా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడు ప్రజల బాధలు, ఆకాంక్షలను న్యాయవ్యవస్థ సత్వరం తీర్చగలదు. సాంకేతికతో మాత్రమే కోర్టుల సమయం వృథాకాకుండా నివారించగలం. న్యాయవ్యవస్థలో సమర్థవంతమైన టెక్నాలజీ, కృత్రిమమేథ ఆధారిత మౌలికవసతుల కల్పన తర్వాత వేగవంతమైన న్యాయవితరణ సాధ్యమవుతుంది. తక్షణం ఉపశమనం కల్పించేలా ప్రజలకు న్యాయం అందించాలి. అందుకోసమే న్యాయవ్యవస్థ అనేది 24/7 పనిచేయాల్సిందే’’అని అన్నారు. యువతపై అలాంటి భాష వాడలేదు.. సరైన వృత్తి ఎంచుకునే సామర్థ్యంలేక యువత పరాన్నజీవుల్లా మీడియా, సోషల్‌మీడియా, లాయర్, సామాజిక కార్యకర్తల్లా మారి దేశవ్యవస్థను నాశనంచేస్తున్నారంటూ సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంకావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను మీడియాలో ఒక వర్గం దురుద్దేశంతో నా మాటలను తప్పుగా వక్రీకరించింది. తప్పుడు, బోగస్ డిగ్రీ పట్టాలు సంపాదించి కొందరు లాయర్ వృత్తిలోకి వస్తున్నారనే ఉద్దేశంతో నిన్న అలా మాట్లాడా. యువతను అస్సలు కించపరచలేదు. భారతీయ యువత నాకెంత గౌరవం ఇస్తారో నవభారత మూలస్తంభాలుగా వాళ్లనూ అంతకంటే ఎక్కువగా నేను గౌరవిస్తా’’అని సీజేఐ అన్నారు. -
భోజ్‌శాలకు భక్తజనం.. మార్మోగిన హనుమాన్ చాలీసా!
ధార్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ధార్‌లోని భోజ్‌శాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో హిందూ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తీర్పు వెలువడిన మరుసటి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.మార్మోగిన మంత్రోచ్ఛారణలుశనివారం ఉదయం భోజ్‌శాల ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ, దేవికి హారతి సమర్పించారు. తమ న్యాయపోరాటం ఫలించడంతో భక్తులు ఆనందభాష్పాలతో నృత్యాలు చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజూ పూజలు చేసుకునే అవకాశం దక్కిందని వారు హర్షం వ్యక్తం చేశారు. లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని ఉత్సవ సమితి సభ్యులు ప్రకటించారు.రద్దయిన 2003 ఏఎస్ఐ (ASI) ఉత్తర్వులుఈ చారిత్రక తీర్పులో హైకోర్టు కీలక విషయాలను స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంలో పూజా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, చారిత్రక ఆధారాల ప్రకారం అది పరమార వంశానికి చెందిన రాజభోజుడు నిర్మించిన సంస్కృత విద్యాకేంద్రం (భోజ్‌శాల) అని ధృవీకరించింది. దీనితో పాటు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు అనుమతిస్తూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) 2003లో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. ఆ ప్రాంగణంపై పూర్తి ఆరాధనా హక్కులు హిందువులకే ఉన్నాయని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ముస్లిం పక్షంహైకోర్టు తీర్పు నేపథ్యంలో, ముస్లిం కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్, తాము కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసి తమ వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం తమకు లభించిన ప్రాథమిక ఆరాధనా హక్కులను వినియోగించుకుంటూ, ప్రతిరోజూ భోజ్‌శాలలో పూజలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. -
భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు బోజ్‌శాల వివాదంపై కీలక తీర్పు ఇచ్చింది. ధార్‌లోని బోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని దేవీ సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు బోజ్‌శాలను ప్రాచీన సరస్వతి ఆలయంగా గుర్తించింది. చారిత్రక ఆధారాలు, పురావస్తు పరిశోధనలు బోజ్‌శాలను సంస్కృత విద్యా కేంద్రంగా నిర్ధారించాయి. -
మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు.. పలువురి మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. దేవాస్ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి షెడ్డు కుప్పకూలిపోగా.. అందులో పనిచేసే కార్మికులు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు.స్థానిక మీడియా చానెల్స్ ఇస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇప్పటిదాకా నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్‌కు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.Madhya Pradesh | Explosion in a firecracker manufacturing unit in Dewas. More details awaited.— ANI (@ANI) May 14, 2026देवास में मक्सी रोड स्थित पटाखा फैक्ट्री में गुरुवार को विस्फोट हुआ। चार की मौत हो गई। ब्लास्ट इतना जबरदस्त था कि करीब 20-25 फीट तक शव के टुकड़े उड़े। #Dewas #Updates #DewasBlast pic.twitter.com/9uThPQZQIv— kalluram news (@kalluramnews) May 14, 2026 -
ఆ ఏరియాలో ల్యాండ్ కొన్నారు.. బ్యూరోక్రాట్స్‌కి లక్కు లక్కలా అతుక్కుంది
భోపాల్: సుమారు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లక్కు లక్కలా అతుక్కుంది. కొన్నేళ్ల క్రితం యాభై మంది బ్యూరోక్రాట్లు ఒకే ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ పెట్టిన పెట్టుబడితో పోలిస్తే 11 రెట్లు పెరిగింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి సమీపంలో గురాడి ఘాట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2022 ఏప్రిల్‌లో ఒకే రోజు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిని భవిష్యత్తులో ప్లాట్లుగా మార్చాలని నిర్ణయించారు.భూమి కొనుగోలు చేసిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా కేడర్‌కు చెందిన అధికారులు ఉన్నారు. కొనుగోలు చేసిన 16 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్లతో వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలో ఆ భూమి వ్యవసాయ భూమి. కానీ బైపాస్ ఆమోదం వచ్చిన 10 నెలల్లోపే ఆ భూమి నివాస ప్రాంతంగా మార్చారు. ఫలితంగా వ్యవసాయ భూమి ధరతో పోలిస్తే నివాస ప్రాంతం ధర అనేక రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ భూమి విలువ దాదాపు 11 రెట్లు పెరిగింది.భూమి నివాస ప్రయోజనాల కోసం విభజించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి హౌసింగ్ సొసైటీ అభివృద్ధి కాలేదు. సాధారణ ప్రక్రియ ప్రకారం, మొదట ప్లాట్లు కేటాయించాలి లేదా భూమిని రిజిస్టర్డ్ సొసైటీకి బదిలీ చేయాలి. కానీ ఇలాంటివి చేయకుండా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చారు. 2022 ఏప్రిల్ 4న ఒకే రిజిస్ట్రేషన్ పత్రం ద్వారా 2.023 హెక్టార్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలో 50 మంది షేర్హోల్డర్లు కలసి ఆస్తిని సొంతం చేసుకున్నారు. భూమి రూ. 5.5 కోట్లకు రిజిస్టర్ చేయబడింది. అయితే ఆ సమయంలో దాని మార్కెట్ విలువ రూ. 7.78 కోట్లుగా ఉందని దైనిక్ భాస్కర్ నివేదించింది.ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత, కుటుంబ సభ్యుల లేదా బినామీ పేర్లలో ఉన్న స్థిర ఆస్తుల (భూమి, ఇల్లు) వివరాలను ప్రతి సంవత్సరం జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియలో (IPR) ఐదు ఎకరాల భూమిని 50 మంది బ్యూరోక్రాట్లు కొనుగోలు చేసినట్లు చూపించినా, ఆ భూమి మొత్తం 41 మంది పేర్లలోనే ఉందని రికార్డులు వెల్లడించాయి. పదహారు నెలల తర్వాత, 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్ల వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రతిపాదిత మార్గం ఆ భూమి నుండి 500 మీటర్ల దూరంలోనే వెళ్లనుందని సమాచారం.2022లో ఈ ఐదు ఎకరాల భూమి చదరపు అడుగుకు దాదాపు రూ. 81.75 రేటుకు కొనుగోలు చేశారు. 2024 జూన్‌లో భూమి వినియోగం మారిన తర్వాత రేటు చదరపు అడుగుకు రూ. 557కు పెరిగింది. 2026 నాటికి ప్రస్తుత మార్కెట్ రేటు చదరపు అడుగుకు రూ. 2,500 నుండి రూ. 3,000 మధ్య ఉంది. అందువల్ల ఆ భూమి మార్కెట్ విలువ రూ. 55 కోట్ల నుండి రూ. 65 కోట్ల మధ్యగా ఉందని అంచనా. -
దళిత కుటుంబంపై కర్రలు, రాడ్లు, ఇటుకలతో..
ఛతర్పూర్: ఒక దళిత కుటుంబాన్ని కర్రలతో చితగ్గొట్టారు గ్రామంలోని ఐదుగురు వ్యక్తులు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామ దేవాలయానికి విరాళంగా పెద్దలు అడిగిన విధంగా ఆ దళిత కుటుంబం గోధుమలు ఇవ్వలేదని ఈ దాడి జరిగింది.ఛతర్‌పూర్‌లోని మహారాజ్‌గంజ్ గ్రామంలో స్థానికులు ఐదుగురు ఓ దళిత కుటుంబం ఇంటికి వెళ్లి దేవాలయ విరాళం పేరుతో గోధుమలు కోరారు. అయితే, ఆ కుటుంబం గోధుమలు భారీ మొత్తంలో ఇవ్వలేమని అన్నారు. దీంతో పెద్దలు ఆ దళిత కుటుంబంపై దూషణలు చేసి, ఇంటి నుంచి బయటకు లాగి, కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. మహిళలు, పిల్లలను కొట్టారు. కుటుంబంలోని పలువురు రక్తస్రావం అయ్యి గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఆ కుటుంబం నుంచి డిమాండ్ చేసిన విరాళం వారి సామర్థ్యానికి మించి ఉంది. తాము చేతనైనంత ఇచ్చామని కుటుంబం తెలిపింది. "నేను గోధుమలు విరాళంగా ఇస్తే, ఏడాది మిగతా కాలం నా పిల్లలకు ఏమి తినిపిస్తాను?" అని బాధితుడు వచ్చి గోధుమలు అడిగిన వారికి చెప్పినట్లు సమాచారం.దీంతో జరిగిన ఈ దాడిలో కుటుంబంలోని ఐదుగురు గాయపడ్డారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. దాడికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో కుటుంబంపై నిందితులు దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.శ్యామ్ పటేల్, హర్దయాల్ పటేల్, కృపాల్ పటేల్, రాజా భయ్యా పటేల్, రామ్‌స్వరూప్ పటేల్, భగవత్దయాల్ పటేల్ తదితరులు ఈ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. మిగిలిన గోధుమలను బలవంతంగా తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించారని కూడా చెప్పారు. అయితే గోధుమలను తీసుకెళ్లడానికి ఉపయోగించిన వాహనాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వారు అంటున్నారు.పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకున్నామని తెలిపారు. సివిల్ లైన్స్ ఇన్స్పెక్టర్ అశుతోష్ శ్రోటి ఈ వివాదం దేవాలయ విరాళంగా గోధుమలు సేకరణ సమయంలో మొదలై, తర్వాత హింసకు దారితీసిందని చెప్పారు."ఈ ఘటన దేవాలయానికి గోధుమలను విరాళం కోరడం నుంచి ప్రారంభమై, తర్వాత ఘర్షణగా మారింది. నిందితులను అరెస్ట్ చేశాం. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని శ్రోటి చెప్పారు. పోలీసులు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఐదుగురు నిందితులపై చర్యలు ప్రారంభించారు. నలుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. -
విషాదంగా ముగిసిన విహార యాత్ర
న్యూఢిల్లీ/జబల్పూర్: బంధువుల గృహ ప్రవేశం వేడుకలో కుటుంబంతో కలిసి ఆనందం గడిపిన ఒక ఇల్లాలి జీవితం అనూహ్యంగా ఒక చిన్నపాటి విహారయాత్రతో తలకిందులైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలోని నర్మదానదిపై బర్గీ జలాశయంలో జరిగిన క్రూయిజ్ పడవ ప్రమాదఘటనలో ఢిల్లీకి చెందిన మెరీనా, ఆమె నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్, తల్లి మాధుర్ మసే జలసమాధి అయ్యారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘోర ప్రమాదం తాలూకు వివరాలను మెరీనా సోదరుడు కుల్దీప్ మోహన్ కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. 39 ఏళ్ల మెరీనా కుటుంబం ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో నివసిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో బంధువుల గృహప్రవేశం వేడుక తర్వాత వెంటనే ఢిల్లీకి తిరుగుప్రయాణంకావాల్సి ఉంది. కానీ బర్గీ జలాశయంలో బోటుషికారు బాగుంటుందని చెప్పడంతో షెడ్యూల్ మార్చుకుని అమ్మ మాధుర్, బావ ప్రదీప్, సోదరి మెరీనా, మేనల్లుడు త్రిషార్, మేనకోడలు సియా, నాన్న జూలియస్ అందరూ క్రూయిజ్ పడవ ఎక్కారు. క్రూయిజ్ మొదటి అంతస్తులోకి మా కుటుంబం ఎక్కింది. నాకు సోదరి వీడియోకాల్‌చేసి జలాశయం, ప్రకృతిఅందాలను వీడియోకాల్‌లో చూపిస్తోంది. హఠాత్తుగా బోటు అటూ ఇటూ ఊగడం మొదలైంది. దీంతో సోదరి ‘కాపాడండి కాపాడండి’ అని గట్టిగా ఏడ్వడం మొదలెట్టింది. వెంటనే వీడియోకాల్ కట్‌అయింది. ఆ తర్వాత వాళ్లను చూడనేలేదు’’ అని కుల్దీప్ కంటతడిపెట్టుకున్నారు. ‘‘అలల తాకిడి ఒక్కసారిగా ఎక్కువవడంతో భయంతో మొదటి అంతస్తులోని వారంతా కిందకు దిగారు. పడవలోకి నీళ్లు వేగంగా రావడం మొదలైంది. ఇది చూసిన మా బావ ప్రదీప్ వెంటనే పడవలో లైఫ్‌జాకెట్లు ఎక్కడున్నాయా అని వెతకడం మొదలెట్టారు. అవి కట్టకట్టి ఉండటంతో వెంటనే విప్పేసి అందరికీ పంచేశారు. కొందరు లైఫ్‌జాకెట్లు వేసుకునేలోపే పడవలోకి మరింతగా నీరుచేరింది. దీంతో పడవతోపాటే మునిగిపోతామనే భయంతో కొందరు బయటకు దూకేశారు. దూకిన వాళ్లను సమీపం నుంచి చూస్తున్న గ్రామస్థులు తాళ్లతో లాగి ఎలాగోలా కాపాడారు. మా నాన్నను కూడా కాపాడారు. కాస్తంత ఈత వచ్చిన మా బావ మాత్రం మేనకోడలిని ఎలాగోలా కాపాడాడు. మేనల్లుడు, అమ్మ, సోదరిని కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే పడవ బోల్తాపడటంతో వాళ్లంతా దాని కింద చిక్కుకుపోయి మునిగిపోయారు’’ అని కుల్దీప్ ఏడుస్తూ చెప్పారు. యెల్లో అలర్ట్ ఉన్నా పట్టించుకోలేదు ‘‘జలాశయంలో అలల ఉధృతి భారీగా ఉండొచ్చని అంతకుముందే యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఆ విషయం అక్కడ ఉన్న పర్యాటకులు ఎవరికీ తెలీదు. పడవ నిర్వాహకులకు తెలిసినా మాకు చెప్పలేదు. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో పడవలోకి జనాన్ని ఎందుకు ఎక్కించారు? ప్రమాదమని తెలిసి ఎవరైనా ఎక్కుతారా?’’ అని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘పర్యాటక ప్రదేశంలో శాశ్వత ఎమర్జెన్సీ రెస్క్యూ బృందం ఉండాలి. కానీ గర్గీ జలాశయం వద్ద అలాంటి ఏర్పాట్లే లేవు. ఘటనాప్రాంతం తీరం నుంచి 150–200 మీటర్ల దూరంలో ఉంది. నీటిలోకి దూకిన వాళ్లను బలమైన అలలు వెనక్కి లాగేశాయి. కనీసం ఎమర్జెన్సీ బృందం ఉంటే కాపాడగలిగేవాళ్లు’’ అని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదాయం ఒక్కటే ధ్యాస ‘‘జనాల దగ్గర భారీగా టికెట్ ఫీజు వసూలు చేస్తూ ఆదాయం మీద మాత్రమే దృష్టిపెట్టారు. పర్యాటకుల భద్రత గాలికి వదిలేశారు. పడవలోకి నీళ్లు వస్తున్నప్పుడు క్రూయిజ్‌ను నడిపే డ్రైవర్‌కు సమీప గ్రామస్థులు గట్టిగా అరుస్తూ సూచనలు చేస్తూనే ఉన్నారు. ఫలానా దిశలోకి పడవను పోనిస్తే క్షేమంగా బయటపడతారని చెబుతున్నా డ్రైవర్ విన్పించుకోలేదు. వేరే దిశలోకి పడవను పోనిచ్చి అంతా జలసమాధి కావడానికి కారకుడయ్యాడు’’ అని మృతుల బంధువు సంగీతా కోరీ ఆవేదన వ్యక్తంచేశారు. అది నకిలీ ఫొటోనాలుగేళ్ల త్రిషాన్‌ను తల్లి మెరీనా పొదిమిపట్టుకుని అలాగే జలసమాధి అయిన విషాదఘటనలో రెండ్రోజులుగా సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో నకిలీదని స్పష్టమైంది. అది కృత్రిమమేథ సాయంతో సృష్టించిన ఏఐ ఫొటో అని తేలింది. వాస్తవానికి పడవకింద చిక్కుకుపోయి నీటిలో ప్రాణాలుకోల్పోయిన తల్లి, కుమారుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చినప్పటికే బాగా ఉబ్బిపోయాయని రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. ‘‘ఏఐ జనరేటెడ్ ఫొటోలో చూపినట్లుగా కుమారుడిని తల్లి గట్టిగా పొదిమిపట్టుకోలేదు. నిజానికి వాళ్ల శరీరాలు బాగా ఉబ్బిపోయాయి. కానీ ఇద్దరూ లైఫ్‌జాకెట్లు ధరించి ఒకేజతగా పడవ అడుగున నీటిలో ప్రాణంపోయి కన్పించారు’’ అని వీళ్ల మృతదేహాలను బయటకు లాగిన రెస్క్యూటీమ్ సభ్యుడు వెల్లడించారు. 11కు పెరిగిన మరణాల సంఖ్య పడవ ప్రమాదంలో శనివారం సాయంత్రం మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను జలాశయం నుంచి బయటకు తీశారు. దీంతో మరణాల సంఖ్య 11కు పెరిగింది. ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని సబ్ డివిజనల్ ఆఫీసర్ అంజుల్ అయాంక్ మిశ్రా తెలిపారు. ఆరేళ్ల విరాజ్ సోనీ, ఐదేళ్ల తమిళ్ మృతదేహాలను శనివారం వెలికితీశారు. తమిళ్ తండ్రి కామరాజ్, కామరాజ్ మేనల్లుడు మయూరమ్(5)ల జాడ తెలియాల్సి ఉంది. కామరాజ్ ఖమారియాలోని ఆర్డినన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఘటన జరిగినప్పుడు 41 మంది ప్రయాణికులు ఉన్నారని వారిలో 28 మందికి కాపాడామని అధికారులు తెలిపారు. ఆగ్రా నుంచి వచ్చిన 20 మంది సైనిక గజ ఈతగాళ్లు సహా 200 మంది అన్వేషణ, సహాయక సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు. -
జబల్పూర్ ఘోర విషాదం.. వెలుగులోకి మరో కొత్త వీడియో
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ ప్రమాద ఘటనకు సంబంధించి చివరి క్షణాలను చూపే కొత్త వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాథమిక భద్రతా వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో కళ్లకు కట్టిస్తోంది. ఆ వీడియోలో, పర్యాటకులు క్రూయిజ్ లోపల కూర్చుని ఉండగా.. అకస్మాత్తుగా నీరు లోపలికి రావడం వీడియోలో కనిపిస్తోంది. క్షణాల్లోనే పర్యాటకుల ఆనందం.. భయంగా మారింది.. తుపాను గాలుల తాకిడికి పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో నీరు లోపలికి దూసుకొచ్చింది.పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే.. సిబ్బంది కట్టలు కట్టి ఉన్న లైఫ్ జాకెట్లను విప్పడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ప్రాణ భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. చాలా మందికి లైఫ్ జాకెట్లు అందలేదు. సీలు చేసిన స్టోరేజ్ బాక్సుల నుంచి వాటిని తీసుకోవడానికి వారు తీవ్రంగా శ్రమించారు. నిబంధనలు పాటించలేదని.. తుపాను సమయంలో ప్రయాణికులను గాలికి వదిలేశారని బాధితులు చేసిన ఆరోపణలకు ఈ వీడియో ఇప్పుడు సాక్ష్యంగా నిలుస్తోంది.నిబంధనలు ప్రకారం.. ప్రయాణం ప్రారంభించే ముందే ప్రతి ప్రయాణికుడికి లైఫ్ జాకెట్ అందించాలి. పర్యాటకులు కచ్చితంగా ధరించాలి. కానీ.. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేవలం 29 మందికి మాత్రమే టిక్కెట్లు జారీ చేసినప్పటికీ.. క్రూయిజ్‌లో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించినప్పటికీ కూడా.. ఈ రద్దీగా ఉన్న పడవను బర్గి డ్యామ్ నీటిలోకి అనుమతించడం గమనార్హం. 🚨 Jabalpur Cruise Last Video: People fighting for lifeThe video was captured just 15 minutes before the cruise sank in the river. You can see the sheer panic people desperately fighting for their lives as the water began to rise and engulf the boat.This shocking footage has… pic.twitter.com/z2pNogMNC9— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 1, 2026 ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు చిన్నారులతో సహా నలుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ఉదయం 5 గంటలకు తిరిగి ప్రారంభించారు. 72 ఏళ్ల రియాజ్ హుస్సేన్.. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగు గంటల పాటు నీటిలోనే ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. బాధిత ప్రయాణికుడు ప్రదీప్ మాస్సే మాట్లాడుతూ.. క్రూయిజ్ నిర్వాహకులు మమ్మల్ని కదలకుండా కూర్చోమని చెప్పారు.. మాకు కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదు. నా భార్య మరీనా మాస్సే, నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్ మృతదేహాలు దొరికాయి. నేను ఒక ట్యూబ్ పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను, స్థానికులు తాడు వేసి నన్ను ఒడ్డుకు చేర్చారు" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సాయంత్రం 6:15 గంటలకు సమాచారం అందినప్పటికీ.. మొదటి రెస్క్యూ టీమ్ 6:40 గంటలకు బయలుదేరింది. ఆ వాహనం స్టార్ట్ కాకపోవడంతో సమయం వృధా అయ్యింది. ఆ తర్వాత మరో వాహనంలో పరికరాలను తరలించి, రెండో బృందం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. ఈ జాప్యం ప్రాణ నష్టానికి కారణమై ఉండవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక జాలర్లు, రైతులు ప్రాణాలకు తెగించి 15 మందికి పైగా కాపాడారు. ఆ తర్వాతే ఎన్డీఆర్ఎఫ్ వంటి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులెవరో ఈ కమిటీ తేల్చనుంది. -
బోట్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు : సంచలన వీడియో
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు కొన్ని క్షణాల ముందుసంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజేష్ సాహూ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘జబల్పూర్లో క్రూయిజ్ బోల్తా పడటానికి ముందు తీసిన వీడియో ఇది. వాతావరణం అకస్మాత్తుగా మారి, బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. ఆ సమయంలో ప్రజలు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎవరూ లైఫ్ సపోర్ట్ జాకెట్ ధరించలేదు. అయితే, తరువాత ప్రజలు వాటిని ధరించారు. దీనివల్ల సుమారు 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.जबलपुर में क्रूज के पलटने से पहले का वीडियो है। अचानक मौसम खराब हुआ और तेज हवाएं चलने लगी। लोग इस वक्त को इंज्वॉय कर रहे थे। किसी ने लाइफ सपोर्ट जैकेट नहीं पहना था। हालांकि बाद में लोगों ने पहना। इस वजह से करीब 25 लोगों की जान बच पाई। अभी तक 9 लाशें मिली हैं। कुछ लोग लापता हैं। pic.twitter.com/jQFOWfsRTH— Rajesh Sahu (@askrajeshsahu) May 1, 2026 పడవ బోల్తా పడటానికి ముందు చివరి క్షణాలను చూపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వెలుగులోకి వచ్చింది. బలమైన గాలులను ఎదుర్కొంటూ, కల్లోలభరితమైన నీరు దానిని తీవ్రంగా కుదిపేస్తుండగా, ఆ పడవ తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో ఉన్నాయి. క్షణాల్లోనే అది అదుపు తప్పి బోల్తా పడటంతో, ప్రయాణికులు నీటిలో పడిపోయిన దృశ్యాలు కలకలంరేపాయి. A cruise boat capsized in the Narmada River near Jabalpur, India with around 30 people on board. Four bodies recovered so far. Several still missing. pic.twitter.com/Psfw3BYo18— Open Source Intel (@Osint613) April 30, 2026 మరోవైపు సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. -
బోల్తా పడ్డ పడవ.. మృతదేహాల వద్ద మంత్రి కన్నీళ్లు
-
కన్నా.. మరణంలోనూ నిన్ను వీడనురా!
విహార యాత్ర కాస్త పెను విషాదాన్ని నింపింది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ నదిలో బోల్తా పడింది. మధ్యప్రదేశ్ జబల్పూర్లో గురువారం జరిగిన ప్రమాదంలో ఇప్పటిదాకా తొమ్మిది మృతదేహాల్ని వెలికి తీశారు. అయితే ఈ ఉదయం సహాయక చర్యలు తిరిగి ప్రారంభం కాగా.. ఆ సమయంలో కనిపించిన ఓ దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. మృతదేహాలు వెలికి తీసే క్రమంలో ఓ మూటను సహాయక బృందాలు బయటకు లాగాయి. అందులో.. విగతజీవిగా మారిన తల్లీకొడుకులు కనిపించారు. ఆ తల్లి తన నాలుగేళ్ల కొడుకుని గట్టిగా తన కౌగిలిలో ఒడిసి పట్టుకుంది. వాళ్ల చుట్టూ చిరిగిపోయిన ఓ లైఫ్ జాకెట్ కట్టేసి ఉంది. ఆ దృశ్యం చూడగానే కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రి రాకేష్ సింగ్ కూడా ఆ దృశ్యం చూసి కన్నీళ్లను దిగమింగుకున్నారు. బహుశా ఆ తల్లి తన కొడుకును కాపాడుకునేందుకు అలా కట్టేసుకుని ఉంటుందని సహాయక బృందంలోని ఓ అధికారి చెప్పారు. జబల్పూర్ బర్గి డ్యామ్‌లో సుమారు 40 మందికిపైగా పర్యాటకులతో వెళ్తున్న పడవ గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు 15 మందిని రక్షించగలిగాయి. గల్లంతైన వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కనిపించకుండా పోయిన వాళ్లలో అత్యధికంగా పిల్లలే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నో లైఫ్ జాకెట్స్, పట్టించుకోలేదు : బోట్ విషాదంలో సంచలన ఆరోపణలుఈ ఘటనలో పడవ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరిమితికి మించిన ప్రయాణికులను తీసుకెళ్లడం.. ఆ సమయంలో బలమైన గాలులు వీయడంతో పడవ మునిగిపోయినట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా ప్రమాణాలను సైతం పాటించలేదని.. పడవలో సరిపడా లైఫ్ జాకెట్లు లేవని తెలుస్తోంది. ఉన్న కొద్దిపాటి లైఫ్ జాకెట్లు కూడా డ్యామేజ్ స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు బోల్తా
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని బర్గి డ్యామ్‌లో నర్మదా నది అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకుల విహారయాత్ర ఘోర విషాదంగా మారింది. 29 మంది పర్యాటకులతో వెళ్తున్న పర్యాటక బోటు ఒక్కసారిగా మునిగిపోవడంతో నలుగురు మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు. ఖమారియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.అధికారుల సమాచారం ప్రకారం, 15 మంది పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పులు, ఈదురుగాలుల వల్ల బోటు అదుపు తప్పి మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, రాత్రంతా సెర్చ్ లైట్ల సహాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.జబల్పూర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. కాగా, లైఫ్ జాకెట్ ధరించిన బోటు కెప్టెన్ మహేష్ పటేల్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాకేష్ సింగ్ మాట్లాడుతూ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 10 మందిని రక్షించాయని తెలిపారు. -
ఘోర ప్రమాదం.. 14 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొని 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భోజ్ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ ఛత్రపాల్ సింగ్ చౌహాన్ దీనిపై మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో ఓ పికప్ వాహనం బోల్తా పడిందని, అందులో సుమారు 35 మంది ఉన్నారని తెలిపారు. కొందరు మరణించగా దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో పికప్ వాహనంలో ఉన్న వారంతా కార్మికులని అధికారులు తెలిపారు. ఆ వాహనం అదుపుతప్పి ఎస్‌యూవీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో జరిగింది.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ప్రమాదంపై స్పందించారు. ‘ధార్ జిల్లాలో ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చికాలియా ఫాటా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకం. మృతిచెందిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను. మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను. ధార్‌కు వెళ్లి చికిత్స ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఇండోర్ డివిజనల్ కమిషనర్, ఐజీకి సూచనలు ఇచ్చాం. గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స అందుతుంది. దేవుడు మృతుల ఆత్మలకు శాంతి కలిగించాలి. బాధలో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. -
ఊరు మెచ్చిన దీదీ
పెద్ద చదువు చదువుకోలేకపోయినా, ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. ఇల్లు దాటి బయటికి వస్తే సమాజం అనే విశ్వ విద్యాలయంలో ఎన్నో చదువుకోవచ్చు...ఈ ఎరుకతో ఇల్లు దాటి బయటికి వచ్చిన సామాన్య గృహిణి, పెద్దగా చదువుకోని చందా బాబర్(మధ్యప్రదేశ్) ఇప్పుడు ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. మధ్యప్రదేశ్ ఝుబువా జిల్లాలోని గుణవాడ్ గ్రామంలో మధ్యాహ్నం వేళ కొద్దిమంది మహిళలు వేపచెట్టు కింద కూర్చొని తమ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చల్లో కీలక మహిళ... చందా బాబర్. తమకు ఏ సమస్యలు వచ్చినా గ్రామస్థులు మొదట చెప్పుకునేది ఆమెకే. ‘ప్రజలు ఎలాంటి సమస్యలతో వచ్చినా నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది చందా. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన చందాకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. చాలా సంవత్సరాలు ఇల్లే ప్రపంచంగా మారింది. ఇల్లు దాటి ఏదైనా చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది.ఆ ప్రశ్నతో తొలి అడుగుఇప్పుడు చందా బాబర్ ట్రాన్స్ఫామ్ రూరల్ ఇండియా (టీఆర్ఐ) ద్వారా శిక్షణ పొందిన ‘పంచాయత్ బద్లాన్ దీదీ’గా పిలిచే క్షేత్రస్థాయి గ్రామీణ కార్యకర్త. గ్రామీణ మహిళలు స్థానిక పరిపాలన వ్యవస్థలతో మమేకమవడానికి, వారిలో తగిన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడే టీఆర్ఐ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చందా... ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు చేరడం లేదు?’ అని ప్రశ్నించింది. ఆమెకు ఏ సమాధానం అందిందో తెలియదుగానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో ఆనాటి నుంచి ఎన్నో వర్క్‌షాపులకు హాజరైంది. ఎన్నో విషయాలపై ఎంతో అవగాహన పెంచుకుంది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎవరికైనా వైద్య అవసరాలు ఉంటే వారికి అన్ని రకాలుగా సహాయంగా నిలుస్తోంది. ‘ఈ ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి’ అని ప్రచారం చేస్తోంది.‘మా గ్రామంలో చందా మార్పు తీసుకురావాలనుకుంటోంది. మా దగ్గర గతంలో లేనిది మాకు ఇచ్చింది.. అది ప్రశ్నలు అడిగే ధైర్యం’ అని చందాను ప్రశంసిస్తున్నారు గ్రామస్థులు.ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు... ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడం నుంచి ప్రజాచైతన్యం వరకు ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎన్నో మంచి పనులు చేస్తోంది. -
అంబులెన్స్‌లో రోగి వాంతి : భార్యతో కడిగించిన వైనం, వీడియోవైరల్
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.గాయపడిన రోగిని తరలించేందుకు అతని భార్యతో అంబులెన్స్‌ను శుభ్రం చేయించిన అమానుష ఘటనపై అంబులెన్స్ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శుక్రవారం సాయంత్రం ఉమరియా-బర్హి రోడ్డులోని ఖితౌలి సమీపంలో ఉన్న కరేలా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాహుల్ బర్మన్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాహుల్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. డయల్ 112 సహాయంతో అతడిని మొదట బర్హి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కానీ రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని కట్నీ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. బర్హి నుంచి కట్నీకి తీసుకువస్తుండగా, నొప్పి, గాయం కారణంగా రోగి రాహుల్ అంబులెన్స్ కిటికీలోంచి వాంతి చేసుకున్నాడు.దీంతో ఉద్యోగి మోహిత్ నాయక్ రోగి భార్యపై అంబులెన్స్‌ను శుభ్రం చేయమని ఒత్తిడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రోగి భార్య నీళ్లు పోస్తూ అంబులెన్స్‌ను శుభ్రం చేస్తూ కనిపిస్తుంది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం,ఈ సమయంలో అంబులెన్స్ సిబ్బంది సున్నితత్వం లేకుండా ప్రవర్తించారు. ఆ మహిళకు ఏమాత్రం సహాయం చేయలేదు.ఆ తర్వాత జబల్పూర్కు తరలించారు: కట్నీ జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, రాహుల్ పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. View this post on Instagram A post shared by The Trending India 🇮🇳 (@thetrendingindian) ఈ మొత్తం విషయంపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ రాజ్ సింగ్ ఠాకూర్ చేసిన ప్రాథమిక ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అంబులెన్స్‌లో రక్తస్రావం జరిగి ఉండవచ్చని, దానిని ఆ మహిళ శుభ్రం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. అంబులెన్స్ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత సమగ్ర విచారణ జరిపి తెలిపారు. -
రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని, భోపాల్ దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆడబిడ్డ ఇంటికి లక్ష్మిలాంటిది అని భావిస్తారు. కానీ తమ కుటుంబానికి, వ్యాపారానికి రెండున్నరేళ్ల పాపను ఇంటికి పట్టిన శనిగా భావించారు. ఎలాగైనా వదిలించుకోవాలని భావించారు. ఏప్రిల్ 18న నేషనల్ హైవేపై వదిలేశారు. కట్ చేస్తే..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. షియోపూర్ జిల్లాలోని ఒక హైవేపై తమ రెండున్నరేళ్ల కుమార్తెను వదిలేశారు ఒక వ్యాపారవేత్త కుటుంబం. పోలీసులు ఆమెను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అయితే వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగు చేశాయి. ఏప్రిల్ 18న షియోపూర్‌లోని సోయిన్కలాన్లో జాతీయ రహదారి-552పై ఆ పాప ఒంటరిగా కనిపించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక బాలల సంక్షేమ కమిటీ (CWC)కి సమాచారం అందించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ కమిటీ బాలికను తమ సంరక్షణలోకి తీసుకుంది.అయితే ఈకేసు విచారణలో అనుమానిత బాలల అక్రమ రవాణా ముఠా వ్యవహారం తెలిసింది. ఆ పాపను వారు దత్తత తీసుకోలేదు, రూ.లక్షకు ఇండోర్‌లోని ఒక అక్రమ నెట్వర్క్ ద్వారా కొనుగోలుచేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బలహీన వర్గాల నుంచి పిల్లలను సేకరించి, దత్తత ముసుగులో కొనుగోలు దారులకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. इस छोटी सी बच्ची को उसके मां-बाप ने श्योपुर के पास एक ढाबे में छोड़ दिया, बच्ची को उन्होंने गोद लिया था फिर कहा कारोबार में नुकसान हुआ तो बच्ची को मनहूस समझने लगे ... अब पता लगा है कि ये सब मानव तस्करी से जुड़े थे इस शख्स ने बच्ची की सूचना पुलिस को दी pic.twitter.com/2cX0TRW6zg— Anurag Dwary (@Anurag_Dwary) April 27, 2026సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు, చిన్నారిని పడేయడానికి ఉపయోగించిన వాహనాన్ని భోపాల్‌లో గుర్తించారు. తద్వారా గుణకు చెందిన ఒక వ్యాపారవేత్త దంపతులను అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నామని వాదింయినప్పటికీ పోలీసుల సుదీర్ఘ విచారణలో అసలు విషయం ఒప్పుకుని, ఆ బాలికను ఇండోర్‌కు చెందిన ఒక బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు, ఆమె సహచరుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.అయితే ఆ పాప ఇంట్లోకి వచ్చినప్పటి నుండి తమకు అరిష్టం జరుగుతోందని, అందుకే ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశామని వారు ఒప్పుకున్నారు.మరోవైపు ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, భోపాల్‌కు చెందిన ఒక మహిళ, తాను ఆ చిన్నారి మాజీ సంరక్షకురాలినని చెప్పుకుంటూ, ఆ బాలిక శారీరక వేధింపులకు గురైందని పోలీసులకు తెలిపింది. బిడ్డను చూసుకోవడానికి తనను నెలకు రూ. 20,000 జీతానికి నియమించుకున్నారని, అయితే జీతం అందకపోవడంతో తాను పని మానేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఈ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఉన్న ఇండోర్‌కు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సహా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారి కన్న తల్లిదండ్రులను గుర్తించి, ఈ దందా పూర్తి స్థాయిని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు -
అంబులెన్స్ ను ఓయో గా మార్చిన కిలాడీలు.. ఇదిగో వీడియో
-
అంబులెన్స్ ను OYO రూమ్ చేసిండ్రు..
-
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్‌పై స్పీడ్‌గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్‌లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్‌పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
20 నిమిషాలు.. 10 కేజీల గోల్డ్.. రూ.35 లక్షలు
సింగ్రౌలీ: మధ్యప్రదేశ్‌లోని బ్యాంకు దోపిడీ కలకలం రేపింది. తుపాకులతో లోపలికి చొరబడిన దుండగులు.. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని రూ. 15 కోట్ల విలువైన బంగారం(10 కేజీలు), రూ.35 లక్షల నగదుతో పరారయ్యారు. సింగ్రౌలీలో శుక్రవారం మధ్యాహ్నం(ఏప్రిల్ 17) సమయంలో ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ బ్యాంకులో ప్రవేశించారు. కేవలం 20 నిమిషాల్లో బంగారం, వెండి, రూ.35 లక్షల నగదుతో ఉడాయించారు.మొదట ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులు తీసి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వెంటనే మరో ముగ్గురు సహచరులు కూడా లోపలికి రావడంతో బ్యాంకు మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. దోపిడీ దొంగలు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. లాకర్లు, నగదు నిల్వలకు సంబంధించిన తాళాలు ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్‌ను బెదిరించారు. మేనేజర్ నిరాకరించడంతో అతని తలపై తుపాకీతో బలంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత బలవంతంగా తాళాలు తీసుకున్నారు.ఆ సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం దొంగలకు కలిసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని ఎవరూ అడ్డుకోలేకపోయారని.. క్షణాల్లో అంతా జరిగిపోయిందని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. నగరం వెలుపలికి వెళ్లే అన్ని దారులన్నీ మూసివేశారు. నిందితులను గుర్తించడానికి బ్యాంకు, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. -
ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్‌గా..!
వైవాహిక జీవితంలో ముసిరిన చీకట్లు ఊపిరి సలపనివ్వలేదు. పోనీ పిల్లలు పుట్టాకన్నా.. తన స్థితి మారుతుందనుకుంటే మరింత నరకప్రాయమైంది. చేతిలో ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండాలా? బయటకు వచ్చేయాలా? అన్న మీమాంస..ఇక తప్పని స్థితిలో ఇంటి నుంచి ఒంటరిగా ఇద్దరి పిల్లలతో బయటపడింది. అలా అనాడు నిస్సహాయ స్థితిలో అందరి జాలి చూపులతో కనిపించిన ఆ అభాగ్యురాలు.. ఇవాళ అందరు చేతులెత్తి సలాం కొట్టే పొజిషన్‌కి చేరుకుంది. ఓ జిల్లాకే అధికారిగా పాలన చేస్తూ..స్ఫూర్తిగా నిలిచారామె. పరిస్థితులు మన జీవితాన్ని తలకిందులు చేస్తాయేమో..కానీ మన మనః స్థితిని కాదు అని అంటారామె.ఆ అసామన్య ధీరురాలే సవితా ప్రధాన్. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లా మడై గ్రామంలో ఓ ఆదివాసి కుటుంబంలో పెరిగారు. తండ్రి వరి కోయడం, బీడి ఆకులు ఏరడం, మహువా పువ్వులు సేకరించడం వంటి పనులు చేస్తుంటాడు. ఓ పల్లెటూరి అమ్మాయిలా పెరిగినా సవితా ఇంటర్ పూర్తి చేసిన కొద్ది రోజులకే 16వ ఏటనే పెళ్లి చేశారు. అది కూడా తన కంటే పదకొండేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేశారు. అయితే అత్తగారింట్లో ఆమె జీవితం నరకప్రాయంగా ఉండేది. భర్త, అత్తమామలు, ఆడపడచు వేధింపులకు తాళ్లలేకపోయింది. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందని నచ్చచెప్పేవారు తల్లిదండ్రులు. ఇద్దరు కుమారులు అథర్వ, యూజుస్లు పుట్టాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా, మరింత దిగజారింది. ఇక తన వల్ల కాదంటూ ఇద్దరు పిల్లలతో బయటకొచ్చేసింది. చాలా తక్కువ వస్తువులతో బయటకొచ్చిన ఆమె ఒక బంధువు ఇంట్లో చేరి స్థానిక బ్యూటీపార్లర్‌లో పనిచేసింది. అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న సవితకు ఎలాంటి భరోసా లేదు. కనీసం ఆర్థిక సాయం కూడా లేదు. పైగా ముందుకు సాగడానికి స్పష్టమైన మార్గం కూడా లేదు. తనకు తన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనే అచంచలమైన సంకల్పం మాత్రమే ఉంది. అదే ఆమెను ధైర్యంగా నడిపించేది. ఇంటర్‌తో ఆపిన చదువుని మళ్లీ కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఎక్కువ గంటలు పనిచేస్తూ..మరోవైపు తన కుమారులను ఒంటరిగా పెంచుతూ చదువు కొనసాగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయినా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. అయితే ఎలాంటి కోచింగ్‌లు లేవు, కనీసం విద్యాపరమైన మద్దతు కూడా లేదు. తీరిక సమయంలోనే చదువుకోవడం ఒక్కటే తప్ప ఇంకే వెసులుబాటు లేదు. అయినప్పటికీ 2005 ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారామె. అప్పుడామెకు పోలీస్ సర్వీస్ స్థానంలో పోస్ట్ వచ్చింది. అయితే సవితకు పరిపాలన సేవ చేయడమే ఇష్టం అందుకని మరోసారి 2006లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తను కోరుకున్న పోస్ట్‌ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 83వ ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్ పరిపాలన సర్వీస్ అధికారిణిగా స్థానం పొందారు. ఆమె తన వృత్తి జీవితాన్ని నరసింగ్‌పూర్ జిల్లాలోని గోటేగావ్ మున్సిపల్ కౌన్సిల్లో ప్రారంభించారు. ఆ తర్వాత గ్వాలియర్‌లోని పట్టణ పరిపాలన అభివృద్ధి శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఐఏఎస్ కాదు..అయితే సవితా కథను పలు మీడియాల్లో ఐఏఎస్‌గా అభివర్ణించాయి. ఆ విషయాన్ని స్పష్టంగా చేసేందుకు మళ్లీ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. తాను మధ్యప్రదేశ్ పరిపాలనా సేవా అధికారిణి అయిన PCS అధికారిణిని మాత్రమేనని, భారత పరిపాలనా సేవ (IAS) సభ్యురాలిని కాదని స్పష్టం చేశారు. PCS అంటే ప్రధానంగా ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (Provincial Civil Service) అని అర్థం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక సవితా భవిష్యత్తులో ఐఏఎస్‌గా పదోన్నతి పొందే అవకాశం ఉన్నప్పటికీ..ప్రస్తుతానికి తాను ఏ హోదాలో ఉన్నానో దానికే గర్విస్తున్నానని క్లియర్‌గా చెప్పారు. అయితే పలు మీడియా కథనాల్లో తనను ఐఏఎస్ అధికారిగా చెబుతూ ఏవేవో రాసేశారని, అదంతా కరెక్ట్ కాదంటూ తన స్టోరీని చెప్పుకొచ్చారామె. ఇక సవితా ప్రధాన్ కథ అసంతృప్తికరమైన వైవాహిక బంధం, చేతిలో ఇద్దరి పిల్లల బాధ్యత అయినా జీవితంపై ఆశ వదులుకునేందుకు ఇష్టపడ లేదు. తనకెదురైన కష్టాలకు ఎదురెళ్లి మరీ..శివంగిలా పోరాడింది. పోనీ పుట్టింట వాళ్లు సైతం ఆదుకోలోని పరిస్థితే అయినా..తన తలరాతను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు. ఎలాగైన తన జీవితాన్ని కన్నీళ్లమయంగా కాదు కాంతిమయం మార్చుకోవాలి, ఆనందకరంగా జీవించాలి అని అనుకుంది. కోరుకున్నట్లుగానే సాధించింది, "దటీజ్ సవితా" అని అనిపించుకున్నారామె.(చదవండి: తొలి అంధ బధిర న్యాయవాది..! చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
షాకింగ్ : కోతిని తరమబోయి.. సజీవ దహనం!
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్లో విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్‌తో అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్‌తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్‌ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్ చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్‌లో చేరాడు.బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్An employee of the Pradeep Raikwar Hotel in Bamitha village, Chhatarpur district, Madhya Pradesh, India, lost his life instantly after being electrocuted by a 33 kV power line while attempting to drive a monkey away from the hotel grounds with an iron pipe. pic.twitter.com/W1J5IqOdfj— T_CAS videos (@tecas2000) April 15, 2026 రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్‌కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు. -
సర్జరీ అని చెప్పి కిడ్నీలు తీసేసారు : తీవ్ర ఉద్రిక్తత
మధ్యప్రదేశ్‌లోని సత్నాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లకు సర్జరీ చేయాల్సిన వైద్యుడు తప్పిదంగా కారణంగా ఏకంగా రెండు కిడ్నీలను తొలగించారు. చివరికి పరిస్థితి విషమించడంతో యువకుడు చనిపోయిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతతను రాజేసింది.పన్నా జిల్లాలోని దేవేంద్రనగర్కు చెందిన రవి రాజక్‌కు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. అతని కుటుంబ సభ్యులు చికిత్స కోసం సత్నాలోని ముఖ్తియర్గంజ్లో ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం, వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఏప్రిల్ 4న పాఠక్ నర్సింగ్ హోమ్‌లో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి విషమించడంతో, అతడిని రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు రెండవ మూత్రపిండాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత రోగి పరిస్థితి నిరంతరం విషమించి, చివరికి మరణించాడు .మరోవైపు పొరపాటున కిడ్నీలను తొలగించామని డాక్టర్ కూడా ఒప్పుకున్నారు.ऑपरेशन के नाम पर दोनों किडनी निकाल ली..🚨मध्य प्रदेश के सतना में एक अस्पताल में एक बच्चे का पथरी का ऑपरेशन करने के नाम पर डॉक्टर साहब ने उस बच्चे की दोनों किडनी निकाल ली...डॉक्टर साहब अब कह रहे है कि गलती हो गई गलती से किडनी निकाल दी...अब उस बच्चे का क्या होगा इसकी… pic.twitter.com/Y8KMjGiT9Y— ᴋᴀᴛʏᴀʏᴀɴɪ (@ItsKtyni) April 14, 2026 > రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అక్షయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ రోగిని యూరాలజీ విభాగంలో చేర్పించే సమయానికే అతని కిడ్నీ పనిచేసే స్థితిలో లేదని తెలిపారు. చికిత్స ఎక్కువ సత్నాలోనే జరిగిందని, రేవాలో కేవలం డయాలసిస్ మాత్రమే నిర్వహించినట్టు తెలిపారు.మరోవైపు వైద్యులు నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి గిర్ధారిలాల్ రజక్ ఆరోపిస్తూ, తన కుమారుడికి కేవలం మూత్రపిండంలో రాయి సమస్య మాత్రమే ఉందని, కానీ చికిత్సలోనిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. డాక్టర్ పుష్పేంద్ర సింగ్, డాక్టర్ రాజీవ్ పాఠక్ ,డాక్టర్ రాజీవ్ సింగ్ అనే ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రూ.20 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేశారు.మృతదేహాన్ని కోల్గావాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచి హైవేను దిగ్బంధించారు. ఆ తర్వాత పాఠక్ ఆసుపత్రి బయట మరో నిరసన చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులను మోహరించారు. సుమారు 4 గంటల పాటు సాగిన నిరసన అనంతరం వైద్యులు , మృతుడి కుటుంబ సభ్యుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరగా, 5 లక్షల రూపాయల చెక్కు , 50 వేల రూపాయల తక్షణ నగదు సహాయం అందించే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. దీనితో నిరసన ముగిసింది.రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి నుండి పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు -
భోపాల్‌లో 'బ్లడ్ కిక్' కలకలం
భోపాల్: భోపాల్‌లో 'బ్లడ్ కిక్' కలకలం రేపుతోంది. నగరంలో ఒక భయంకరమైన కొత్త వ్యసనానికి అలవాటు పడుతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధం లేదు.. కానీ అంతే వేగంగా ప్రాణాలను తీసే కొత్త వ్యసనం వెలుగులోకి వచ్చింది. దీనిని "బ్లడ్ కిక్" అని పిలుస్తున్నారు. యువకులు తమ సొంత రక్తాన్ని తీసి, తిరిగి తమ శరీరంలోకే ఎక్కించుకునే (ఇంజెక్ట్) ఈ వింత ధోరణి ఆందోళన కలిగిస్తోంది.విదేశాల్లో మొదలైన ఈ వికృత ధోరణి ఇప్పుడు నిశ్శబ్దంగా మధ్యప్రదేశ్ రాజధానిలోకి ప్రవేశించింది. ఇది వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఏడాది(2026) జనవరి నుంచి గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులందరూ 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. తల్లిదండ్రులు వారి ప్రవర్తనలో మార్పును గమనించి.. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తీవ్ర ఆగ్రహంతో గొడవలకు దిగుతున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు వారిని సైకియాట్రీ విభాగానికి తీసుకువస్తున్నారు.మాదక ద్రవ్యాలు తీసుకోరు. వీరిలో మద్యం వాసన కానీ.. డ్రగ్స్ ఆనవాళ్లు గానీ కనిపించవు. బదులుగా, శరీరంపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉంటాయి. ఇలాంటి వింత పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని హమీడియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తమ రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల తక్షణ శక్తి, ప్రశాంతత, నియంత్రణ లభిస్తుందని వ్యసనానికి అలవాటుపడిన యువకులు నమ్ముతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. -
నల్లగా ఉన్నాడని భర్తని ప్రియుడితో చంపించిన భార్య
-
నల్లగా ఉన్నాడని లవర్‌తో మొగుణ్ణే లేపించేసింది
-
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్‌లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్‌తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్‌తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా? -
బోరుబావిలో పడ్డ బాలుడు.. 75 అడుగుల లోతులో..
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జులారియాలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9(గురువారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబం తమ మందలతో కలిసి ఇక్కడికి వచ్చింది. వారి రెండేళ్ల కుమారుడు భగీరథ్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.ఎస్పీ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బోరుబావిపై రక్షణగా ఒక రాయిని ఉంచారు. అయితే.. ఒక గొర్రె ఆ రాయిని పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత బాలుడు.. ఆ మూతను తెరిచి లోపలికి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తూ లోపలికి జారి పడిపోయాడు. బద్నావర్ ఎస్హెచ్ఓ అశోక్ పాటిదార్ నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఉజ్జయిని కలెక్టర్ రోషన్ సింగ్, ఎస్పీ ప్రదీప్ శర్మ స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఉజ్జయినిలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉజ్జయినిలో తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. గునా బైపాస్ రోడ్డు వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టి 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక చిన్నారితో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. ఉజ్జయినిలోని ధాబా రోడ్డులో ఉన్న గేబీ హనుమాన్ ఆలయం సమీపంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ ఠాగూర్ ధృవీకరించారు. -
మూడేళ్ల జైలు శిక్ష పడినందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
భోపాల్: చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హతకు గురయ్యారు. 1998–2011 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరించిన రాజేంద్ర భారతి ఫిక్స్డ్ డిపాజిట్ల పేరిట బ్యాంక్ రికార్డులను ఫోర్జరీ చేసి వడ్డీ రూపంలో రూ.18.5 లక్షలు కాజేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో గురువారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం తెల్సిందే. ఈ నేరంలో పాలుపంచుకున్న బ్యాంకు క్యాషియర్ రఘువీర్‌కు కూడా రూ.లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి రాష్ట్ర విధాన సభ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్, దాటియా ఎమ్మెల్యే భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. తమ ఎమ్మెల్యే రాజేంద్ర భారతిని అనర్హుడిగా ప్రకటిస్తూ గురువారం అర్ధరాత్రి హడావుడిగా అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై రాజేంద్ర భారతి విజయం సాధించడం గమనార్హం. -
పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఒక వివాహ వేడుక రసాభాసగా మారిపోయింది. స్వల్ప వివాదానికే అతిథులు రెచ్చిపోయారు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో నిందితులు ఇంట్లోని వస్తువులను, నగదును కూడా ఎత్తుకుపోవడం కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాయ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక నివాసి మహేష్ జాతవ్ వివాహం జరుగుతుండగా, వేడుకలో తమకు మద్యం సరఫరా చేయాలని అతిథులు గొడవకు దిగారు. దీంతో వివాదం చెలరేగింది. మందు పోస్తావా, డబ్బులు ఇస్తావా అంటూ నానా యాగీ చేశారు. దీనికి వరుడు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. మద్యం ఇవ్వలేదని ఆగ్రహించిన అతిథుల బృందం, వధూవరులతో పాటు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి నట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. ఈ ఘర్షణలో వరుడి కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు గాయపడ్డారు. ఈ సమయంలో కొన్ని విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.STORY | Guests attack bride, groom after not being served liquor at wedding in MP villageUpset at not being served liquor, a group of guests at a wedding in Madhya Pradesh's Gwalior district allegedly assaulted the bride, groom and their family members, police said.READ |… pic.twitter.com/PnRKy5cfnm— Press Trust of India (@PTI_News) April 2, 2026ఇదీ చదవండి : ఇపుడా పని..క్యాబ్ బుక్ చేసినంత ఈజీ : ఆనంద్ మహీంద్ర ట్వీట్ వరుడి తల్లి ఆరోపణలుపెళ్లింటికి తమ వధువు చేరుకున్న తర్వాత కొన్ని ఆచారాలు జరుగుతుండగా, కొందరు పొరుగువారు అక్కడికి వచ్చి మద్యం కోసం తన కుమారుడిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారని వరుడి తల్లి షీలా విలేకరులకు తెలిపారు. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ పొరుగువారు వరుడితో సహా తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తాము జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, తనపై, తన భర్తపై , వధువుపై కూడా దాడి చేశారని జాతవ్ తల్లి ఆరోపించారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి ! -
నదిని శుభ్రం చేసిన ఒకే ఒక్కడు..! ఆనంద్ మహీంద్రా సైతం..
పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటిలా ఈసారి సోషల్ మీడియా వేదికగా సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్టోరీతో మనముందుకొచ్చారు. ఈసారి షేర్చేసిన కథ..మనిషి తలుచుకుంటే ఏదైన సాధించగలడు..మందితో పనిలేదని చెప్పే సందేశాత్మక స్టోరీ.మధ్యప్రదేశ్‌లోని బియోరాకు చెందిన 20 ఏళ్ల బిట్టు తబాహి తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేసి రాత్రికి రాత్రికే స్టార్‌గా మారాడు. అతని అద్భుతమైన ప్రయత్నానికి అబ్బురపడటమే గాక అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ సోమవారం ఒంటరి యోధుడు బిట్టునే మనకు ప్రేరణ అంటూ అతడి కథను పంచుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో ఆ కుర్రాడి గురించి ఇలా రాసుకొచ్చారు. బిట్టు నదిలో కొన్ని భాగాలను శుభ్రం చేశానని చెప్పుకున్నందుకు విమర్శలపాలయ్యాడని అన్నారు. కేవలం వ్యూస్‌కే ఇదంతా అని ట్రోల్ చేసినట్లు తెలిపారు. సోషల్‌మీడియా కూడా నిజమైన కృషి కంటే అల్పమైన వాటికే ప్రాధాన్యత ఇస్తుంటుందని విమర్శించారు. పోనీ వాళ్లన్నట్లు బిట్టు లైక్‌లు, వ్యూస్ కోసం చేసినా..అది ప్రపంచాన్ని మార్చే మంచి పనైతే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కదా, విమర్శలు దేనికని ప్రశ్నించారు. ఇక బిట్టు బిట్టు జనవరి 26న కొందరు స్నేహితులతో కలిసి నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడని చెప్పారు. అయితే కొన్ని రోజులకే ఒంటరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాథమిక పనిముట్ల సాయంతో కలుషితమైన నీటిలోకి దిగి, పట్టుదలతో ప్లాస్టిక్ వ్యర్థాలను, నాచు, చెత్త తదితరాలను బయటకు తీశాడు. విమర్శలు వచ్చినా బిట్టు తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. పైగా నది సహజ సౌందర్యాన్ని సంతరించుకునేలా పట్టుదలతో పనిచేశాడు. అతడి కృషి ఫలితంగా ఇప్పుడు స్వచ్ఛమైన నీరు పారుతూ అందంగా మారింది ఆ నది అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బిట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడని అన్నారు. డిజిటల్ స్టార్డమ్ కోసం చేసినా..అది సమాజ హితానికి ఉపయోగపడేదే అయితే మెచ్చుకుందా, ప్రోత్సహిద్దాం అని అన్నారు మహీంద్రా. నెటిజన్లు సైతం ఒంటిరి యోధుడు, రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఒక వ్యక్తి నదిని శుభ్రం చేయగలిగితే.. మొత్తం దేశం పరిశుభ్రతను సీరియస్‌గా తీసుకుంటే..కచ్చితంగా స్వచ్ఛ భారత్ కాగలదేమో అని పోస్టులు పెట్టారు.This young man from Biaora, M.P, was criticised for claiming to have cleaned parts of a river just in order to gain social media views.Well, we usually complain that social media rewards the trivial rather than the meaningful So If a desire for ‘likes’ can become a force for… pic.twitter.com/ARgEhphuQN— anand mahindra (@anandmahindra) March 30, 2026 (చదవండి: ఆ బాబా ఇంగ్లీష్ ఫ్లుయెన్స్‌కి మతిపోవాల్సిందే..!) -
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛింద్వారా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమైన పలువురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బస్సు, పికప్ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో బస్సులోని ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు చనిపోయారు. బస్సు డ్రైవర్, పికప్ ట్రక్కు డ్రైవర్, క్లీనర్ సైతం చనిపోయారు. ఛింద్వారా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని సిమారియా పట్టణ సమీపంలో నాగ్‌పూర్ జాతీయరహదారిపై గురువారం రాత్రి 7.15 గంటలకు ఈ ఘటనలో 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించారు. మితిమీరిన వేగంతో వెళ్తూ ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు...ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ప్రమాదం వార్త తెల్సి సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రూ.506 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఛింద్వారా నగరంలోని పోలీస్మైదానంలో ఏర్పాటుచేయగా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఆరు గంటలకు దాదాపు 47 మందితో ఈ ప్రైవేట్ బస్సు తిరుగుపయనమై చివరకు ప్రమాదంలో చిక్కుకుంది. -
వీడియో వైరల్: భోజనంలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు?!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఐటీ–ఆర్జీపీవీ) హాస్టల్ మెస్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్లో బల్లి కళేబరం (లిజార్డ్) కనిపించింది.దీంతో ఆ విద్యార్థి మెస్ సిబ్బందిని నిలదీశాడు. ‘అన్నా, ఇది ఏమిటో చూడండి. నాకు అనుమానం వస్తోంది’ అని ప్రశ్నించాడు. సిబ్బంది మాత్రం ‘ఇది బల్లి కాదు, సిమ్లా మిర్చి (క్యాప్సికమ్)’ అని సమాధానం ఇచ్చారు. విద్యార్థి మాత్రం ‘ఇది బల్లే.. గుడ్లు తేలేసింది’ అని వాదించాడు. ఈ మాటలతో అసహనానికి గురైన ఓ సిబ్బంది, ప్లేట్లో ఉన్న ఆ ముక్కను తీసుకుని తిన్నాడు. ‘ఇది బల్లి కాదు.. క్యాప్సికమే’ అని నిరూపించడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో మెస్ పరిశుభ్రతపై విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. నెటిజన్లు సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్లేట్లో నిజంగా బల్లి కళేబరమేనా? లేక క్యాప్సికమ్ ముక్కనా? అన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. UIT RGPV Bhopal: A student allegedly claimed a lizard in his mess food.When he complained, the staff denied it and said it was capsicum, and later ate the lizard to prove their pointhttps://t.co/Wa6uBFIf5Y— Ghar Ke Kalesh (@gharkekalesh) March 22, 2026 -
అమ్మాయిలను అమ్మేశారు!
కౌటాల: అతివలను అంగడి సరుకుగా మార్చేశారు. గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా తరలిస్తూ అమ్మేస్తున్నారు. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు గిరిజన అమ్మాయిలకు ఓ ముఠా మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలించినట్లు తెలిసింది. పెళ్లి పేరుతో ఒక్కొక్కరిని రూ.2.50 లక్షల చొప్పున ఓ ముఠాకు విక్రయించినట్లు సమాచారం. బాధిత అమ్మాయిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. ముఠాలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళతోపాటు ఇద్దరు పురుషులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి బాధిత అమ్మాయిలను అక్రమార్కుల చెరనుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడ బాధితులు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మానవ అక్రమ రవాణాలో సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. నేడో రేపో పోలీసులు ముఠా అరెస్టు చూపే అవకాశం ఉంది. కాగా, గతేడాది సైతం ఆసి ఫాబాద్‌కు చెందిన ఓ ముఠా మహబూబాబాద్ జిల్లా రేకులతండాకు చెందిన ఓ మహిళతోపాటు ఆసిఫాబాద్ మండల పరిధిలోని ఓ యువతిని మధ్యప్రదేశ్‌లో విక్రయించారు. -
8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికను స్వయంగా తల్లే రైలు కిందకి తోసేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. సీసీటీవీలో రికార్డైన ఈ భయంకరమైన దృశ్యాలు వైరల్‌గా మారాయి.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం నర్మదాపురంలోని మలఖేడి ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగి బాధిత మహిళ. భర్త మరణం తర్వాత ఆమెకు కాంపెన్సేటరీ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి అప్పటి నుంచి వారిద్దరూ ఒంటరిగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, రైల్వే స్టేషన్‌కు వెళ్లి, ఉన్నట్టుండి రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెను ఎదురుగా వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి తోసివేసింది. దీంతో బాలిక తల, నడుము, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఆమెను కాపాడిన రైల్వే సిబ్బంది ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచిన చికిత్స అందించినా ఆమె పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!ఆందోళన కలిగించిన విషయం ఏమిటంటే..ఈ ఘటన జరగడానికి దాదాపు మూడు గంటల ముందు నుంచి తల్లీకూతుళ్లు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉన్నారని నర్మదాపురం ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్చార్జి సంజీవ్ చౌక్సే వెల్లడించారు. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ నెం. 1 వైపు వస్తుండగా, ఆ మహిళ అకస్మాత్తుగా చిన్నారిని పట్టాలపైకి తోసేసింది. లోకోమోటివ్ ఢీకొనడంతో ఆ బాలిక ప్లాట్‌ఫారమ్ అంచుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలుతో నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో చుట్టుప క్కల వారు, రైల్వే సిబ్బంది ఆ చిన్నారి సహాయానికి పరుగెత్తుకొచ్చారు. ఆమెను బయటకు లాగిఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి పరుగులు తీస్తున్నసందర్భంలో రైలుకిందకి బిడ్డను తోసేసిన ఆ మహిళ, బిడ్డను రక్షించవద్దని పదే పదే వేడుకుందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో నిందిత మహిళ మానసిక ఆరోగ్య కోణం కూడా ఉండవచ్చని సూచిస్తోంది. ఆ మహిళ చికిత్స చరిత్రను ధృవీకరించే ప్రక్రియలో ఉన్నామని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యమరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్‌గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్‌లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్పీ సునీతా రావత్ తెలిపారు.గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు. -
1917 నాటి అప్పు తిరిగి ఇవ్వాల్సిందే
సీహోర్(ఎంపీ): వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తులు, భవనాలు, వజ్రాభరణాలపై వారసులు న్యాయస్థానాల మెట్లెక్కడం మనం చూస్తూనే ఉంటాం. సబార్డినేట్ కోర్టుల మొదలు సుప్రీంకోర్టు దాకా ఇలాంటి కేసులు కోకొల్లలు. అవన్నీ వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ తగాదాలు. వీటికి పూర్తి భిన్నంగా ఏకంగా ఆనాటి బ్రిటిష్ పాలకులపై మధ్యప్రదేశ్ వ్యాపారి ఒకరు 35,000 రూపాయల పాత బాకీ కట్టాలని ఇప్పుడు న్యాయపోరాటానికి సంసిద్ధమవుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారత్‌లోని సంపన్నుల నుంచి నాటి బ్రిటన్ ప్రభుత్వం కొంత మేర నగదు మొత్తాలను రుణాలరూపంలో సమీకరించింది. వాటిని తిరిగి చెల్లించేలోపే మనకు స్వాతంత్య్రంఇచ్చేసి వెళ్లిపోయింది. దీంతో తన తాతకు రావాల్సిన రూ.35వేలు అలాగే ఉండిపోయాయని, బ్రిటన్ ఇప్పటికైనా బాకీ తీర్చాల్సిందేనని సేఠ్ జుమ్మా లాల్ రూథియా మనవడు వివేక్ డిమాండ్చేస్తున్నారు. అసలేం జరిగింది? 1914లో మొదలైన మొదటి ప్రపంచయుద్ధకాలంలో నిధుల కటకట నుంచి గట్టెక్కేందుకు బ్రిటన్ ప్రభుత్వం నాటి మధ్యప్రదేశ్ ప్రాంతంలోని సంపన్నుల నుంచీ రుణాలను తీసుకుంది. అప్పట్లో సీహోర్, భోపాల్ సంస్థానాల్లో సంపన్నులుగా ఖ్యాతి పొందిన రూథియాలు సైతం బ్రిటన్ పాలకులకు రుణాలు ఇచ్చారు. సేఠ్ జుమాలాల్ నుంచి భోపాల్ రాజకీయ ప్రతినిధిగా డబ్ల్యూ ఎస్ డేవిస్ రూ.35 వేలు పుచ్చుకున్నారు. ఆ మేరకు రసీదు రాసి సంతకంచేసి ఇచ్చారు. 1917 జూన్ నాలుగోతేదీన ఈ అప్పు ఇచ్చినట్లు రసీదులో ఉంది. అప్పు ఇచ్చాక రెండు దశాబ్దాల తర్వాత 109 ఏళ్ల వయసులో 1937లో సేఠ్ చనిపోయారు. అప్పు పత్రం మాత్రం భద్రంగా ఉంది. ఇటీవలికాలంలో తమ ఇంట్లో పాత వస్తువులను దులుపుతుండగా ఈ అరుదైన పత్రం ఆయన మనవడు, ప్రస్తుతం భోపాల్‌లో పెద్ద వ్యాపారి వివేక్(65) కంటబడింది. దీంతో ఎలాగైనా తన తాత ఇచ్చిన రుణాన్ని యూకే సర్కార్ నుంచి ముక్కుపిండి వసూలుచేస్తానని ఆయన శపథంచేశారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని అనుబంధ డాక్యుమెంట్లనూ ఆయన మీడియా ముందుపెట్టారు. ‘‘ఇండియా వార్ లోన్ కోసం సేఠ్ నుంచి రూ.35వేలు ముట్టాయి. రుణమిచ్చి ఆయన ప్రభుత్వం, రాజ్యం పట్ల తన విధేయతను ప్రకటించుకున్నారు’’అని అప్పుపత్రంలో రాసి ఉంది. ‘‘వలసరాజ్యపాలనాకాలంలో నాటి పాలకులు తీసుకున్న రుణాలను ఏ విధంగా రాబట్టాలో మా లాయర్లతో చర్చిస్తున్నా. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వానికి నోటీస్‌లు పంపిస్తా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా సార్వ¿ౌమదేశానికి పాత రుణాలను తీర్చే బాధ్యత ఉంటుంది. ఆ లెక్కన మా తాత డబ్బు మాకు తిరిగి ఇవ్వాల్సిందే. అప్పు ఇచ్చి వందేళ్లు దాటింది. అసలుకు చక్రవడ్డీ లేదా కనీసం సాధారణ వడ్డీగా ఐదు శాతం లెక్కేసుకున్నా ఇప్పడా రుణం కోట్ల రూపాయల్లో ఉంటుంది. నాటి బంగారం రేట్లతో పోల్చుకున్నా సరే ఇప్పుడా మొత్తం 3,000 రెట్లు పెరిగి రూ.10 కోట్లుదాకా రావాల్సిందే’’అని వివేక్ అన్నారు. అయితే వివేక్ వాదన అంతర్జాతీయ చట్టాల్లో ఏ మేరకు చెల్లుబాటు అవుతుందనే సందేహాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చారు. ‘‘నాటి రాజరికం ఇప్పుడు లేదు. పాలకులూ మారిపోయారు. వలసరాజ్యంగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం బ్రిటన్ సర్కార్ చెల్లిస్తుంది? స్వాతంత్య్రం ఇచ్చాక పోతూపోతూ పాత ఒడంబడికలు, ఒప్పందాలు, హామీలతో మాకు సంబంధం లేదు అని బ్రిటిషర్లు చేతులు దులుపుకునే ఉండి ఉంటారు. ఈ లెక్కన నాటి అప్పు నేడు రాబట్టడం కష్టం’’అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అప్పు రాకపోయినా శతాబ్దకాలంనాటి పురాతన పత్రంగాఅయినాఇది ఘన చరిత్రను చాటుతూ శాశ్వతంగా నిలిచి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పత్రం చరిత్రగా ఉండిపోతుందా లేదంటే అప్పు రాబట్టి కొత్త చరిత్ర లిఖిస్తుందా అనేది వివేక్ కొనసాగించే తదుపరి పోరుపై ఆధారపడి ఉంటుంది. -
సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక స్నూకర్ క్లబ్లో మైనర్ల మధ్య వివాదం, ప్రతీకార దాడి తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అక్కడితో వారి ప్రకోపం చల్లారలేదు. నిందితులే స్వయంగా సీసీటీవీ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.పోలీసుల సమాచారం ప్రకారం టీనేజర్ల మధ్య వివాదం పెరిగి ప్రాణాంతక దాడికి దారితీసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నబాధిత 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థి స్నూకర్ క్లబ్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవాడు. నిందితులు, బాధితుడు ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లోనే చదువుకుంటున్నారు. సినిమా ఫక్కీలో దాడి, 30 సెకన్లలో 27 సార్లుఇద్దరు మైనర్లు క్లబ్‌లోకి ప్రవేశించి సినిమా ఫక్కీలో దాడిచేశారు. 30 సెకన్లలో 27సార్లు కత్తితో పొడిచారు. అనంతరం అంతే వేగంగా అక్కడి నుండి పారిపోయారు. 10 కంటే ఎక్కువ లోతైనగాయాలయ్యాయి. రెండు వేళ్లు తెగి పోయాయి. భుజం, వీపుపై కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి తరువాత ఏదో విధంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం చికిత్స పొందు తున్నాడు. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిదర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ దాడికి కారణం ప్రతీకారమే కారణం. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, పూల్ గేమ్ సందర్భంగా ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. ఈ సమయంలో బాధితుడు ఇద్దరు నిందితులను చెంపదెబ్బ కొట్టాడట. దీంతో కక్ష పెంచుకున్న విద్యార్థులు ఫిబ్రవరి 15 రాత్రి పథకం ప్రకారం దాడి చేశారు. ఈ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసు కున్నారు. నోటీసుల అనంతరం విడుదల చేశారు. వైద్య నివేదిక ఆధారంగా మరిన్ని అభియోగాలు నమోదు చేస్తామని సబ్-ఇన్స్పెక్టర్ మణిపాల్ సింగ్ భడోరియా తెలిపారు.ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం -
మధ్యప్రదేశ్‌లో 34 లక్షల ఓట్లు తొలగింపు
మధ్యప్రదేశ్‌లో 5.39 కోట్ల ఓటర్లతో తుది జాబితాను ఈసీ శనివారం విడుదలచేసింది. పాత జాబితా నుంచి మరణాలు, వలసలు, డూప్లికేట్ల వంటి కారణాలతో 34,25,078 ఓట్లను ఈసీ తొలగించింది. దీంతో గతంలో 5,74,06,143గా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 5,39,81,065కు దిగొచ్చింది. వీరిలో 2,79,04,975 మంది పురుషులుకాగా 2,60,75,186 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు అండమాన్ నికోబార్‌లో ముసాయిదా జాబితా నుంచీ 5,269 ఓట్లను ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 5,269 ఓట్లు తొలగించి 2,58,040 ఓట్లతో తుది జాబితాను ఈసీ శనివారం పబ్లిష్ చేసింది. వాస్తవానికి 2025 అక్టోబర్ 27 నాటికి ఇక్కడ 3,10,404 ఓటర్లు ఉండేవారు. ఎస్ఐఆర్ మొదలయ్యాక మసాయిదా జాబితా తయారీ దశలోనే 64,014 ఓట్లు తొలగించారు. తాజాగా మరో 5,269 ఓట్లు తొలగించారు. తర్వాత మార్పులు చేర్పులతో చివరకు 2,58,040 ఓట్లతో తుది జాబితాను శనివారం ముద్రించింది. -
ఆపరేషన్ మ్యాట్రిక్స్: భారీ సెక్స్టార్షన్ ముఠా గుట్టురట్టు
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ సెక్స్టార్షన్, 'డిజిటల్ అరెస్ట్' రాకెట్‌ను పోలీసులు ఛేదించిన వైనం కలకలం రేపింది. 'ఆపరేషన్ మ్యాట్రిక్స్' పేరుతో చేపట్టిన ఈ దాడిలో 20 మంది అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 1.07 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్ ఈ అరెస్టులను ధృవీకరించారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో గ్వాలియర్ జోన్ ఐజీ అరవింద్ కుమార్ సక్సేనా, డీఐజీ అమిత్ సంఘీ ఆదేశాల మేరకు తొమ్మిది ప్రత్యేక బృందాలు శివపురి జిల్లాలోని కరేరా, భోంతి, పిచ్చోర్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయని ఆయన తెలిపారు.అసలేంటీ రాకెట్పకడ్బందీ పథకం ప్రకారం ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడేవారు. మొదట వాట్సాప్‌లో మహిళల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించేవారు. డేటింగ్ ,టింగ్ యాప్‌ల ద్వారా బాధితులను ఆకర్షించి, వారితో అసభ్యకరమైన చాట్లు,వీడియో రికార్డింగ్‌లు చేసేవారు. ఆతరువాత బాధితుల వ్యక్తిగత వీడియోలు సేకరించిన తర్వాత, తమ నిజప్వరూపాన్ని బయటపెట్టేవారు. తాము పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుని, బాధితులపై అత్యాచారం, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు నమోదయ్యాయని భయపెట్టి, బెదిరింపులకు పాల్పడేవారు. ఈ కేసుల నుండి తప్పించుకోవాలంటే భారీగా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడం వీరి మోడస్ ఒపరాండీ.గత వారంలో నమోదైన నాలుగు ఎఫ్ఐఆర్లలో మొత్తం 32 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా, మరో 12 మంది పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో అంగద్ లోధి, విశాల్ లోధి, సుఖ్‌దేవ్, అర్జున్, దీపక్ ప్రజాపతి తదితరులు ఉన్నారు. వీరిలో మెజారిటీ నిందితులు శివపురి మరియు ఝాన్సీ ప్రాంతాలకు చెందినవారే.రూ. 1.20 లక్షల నగదు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కులతోపాటు 7 నాలుగు చక్రాల వాహనాలు, 29 స్మార్ట్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 1.07 కోట్లు అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: సుందర్ పిచాయ్‌తో సరదాగా, సర్ప్రైజింగా : వైరల్ వీడియోలుపోలీసుల హెచ్చరిక అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాథోడ్ ప్రజలను ఈ సందర్బంగా కోరారు. తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్‌లను ఎత్తవద్దనీ, ఒకవేళ ఎవరైనా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బెదిరింపులకు పాల్పడితే, వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం -
ఆయనొక ఐఏఎస్.. మూడో భార్య కూడా ఐఏఎస్..!
ఐఏఎస్ ఆఫీసర్.. మరో ఐఏఎస్‌ను పెళ్లాడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న వ్యక్తికి.. మూడో పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా ఐఏఎస్ అధికారిణే భార్యగా వస్తే అది అరుదైన విషయంగానే భావించాలి. చట్టపరంగానే ఇద్దరి భార్యలకు బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు మూడో వివాహం చేసుకున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయితే అంతకుముందు వివాహం చేసుకున్న ఇద్దరూ భార్యలు ఐఏఎస్ అధికారిణులే గాక, ఇప్పుడు తాజాగా చేసుకున్న ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ మూడోసారి వివాహం చేసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్. ఇప్పటివరకు వివాహం చేసుకున్న ముగ్గురు భార్యలూ IAS అధికారులే కావడం విశేషం. తాజా వివాహం ఫిబ్రవరి 11న కూనో నేషనల్ పార్క్‌లో జరిగింది. ఈసారి ఆయన 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకిత ధాక్రేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన ఐఏఎస్ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్‌కి చెందిన అవి ప్రసాద్.. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌లో చేరారు. ఆపై ఏడాదికి అఖిల భారత సర్వీస్‌లో 13వ ర్యాంకు సాధించి ఐఏఎస్ హోదా పొందారు. -
ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకున్న దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియాకు, భోపాల్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న సమీర్‌తో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్‌పై ఉన్న నమ్మకంతో మూడు నెలల క్రితం సియా తన ఇంటిని విడిచిపెట్టి, భోపాల్‌లోని కమలా నగర్లో ఉన్న అతని ఇంటికి వచ్చేసింది.సమీర్ ఇంట్లోనే సియా నివాసం ఉంటుండటంతో, అతని భార్యకు, సియాకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సమీర్ భార్య.. జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇసే సమయంలో సియా.. తనను వివాహం చేసుకోవాలని లేదా తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సమీర్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.ఈ నేరంలో అతడి తల్లి, సోదరులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సియాను హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు సమీర్ తన కుటుంబ సభ్యుల సహాయంతో సియా మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కాడు. తరువాత ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిషాత్పురా ప్రాంతంలోని ఒక సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. అయితే గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు అక్కడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు, లోపల ఏదో ఇనుప పెట్టె తేలుతున్నట్లు గమనించారు.వెంటనేవారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ నుండి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు -
మధ్యప్రదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్
రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్‌ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్ తొలి సారి టోర్నీ సెమీస్ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కశ్మీర్ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్ మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఐదేసిన ఆఖిబ్ నబీఇండోర్ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్ జైన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్ ముస్తాక్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సెంచరీతో గెలిపించిన రాహుల్... భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఎనిమిది సార్లు చాంపియన్ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. కరుణ్ నాయర్ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్ స్మరణ్ (123 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్లోనే 147 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. లంచ్ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. అయితే స్మరణ్, విద్యాధర్ పాటిల్ (30 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో కర్నాటక తలపడుతుంది. -
శుభ లేఖలు పంచుతూ.. పెళ్లివారింట తీరని శోకం
రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పెళ్లివారింట తీవ్ర విషాదం నెలకొంది. ఫిబ్రవరి 24న జరగబోయే పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు శుభలేఖలు తీసుకుని బైక్‌పై వెళ్లిన తండ్రి, కొడుకుతో పాటు మరో బంధువు మృత్యువాత పడ్డారు. రేవా-ప్రయాగ్‌రాజ్ హైవేపై కోస్టా గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బాధితులు తమ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో, ప్రయాగ్‌రాజ్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు వీరి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జునుజ్జవ్వగా, బైక్‌పై ప్రయాణిస్తున్న భగవత్ విశ్వకర్మ (55), ఆయన కుమారుడు శివం విశ్వకర్మ, బంధువు శీతల్ విశ్వకర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ కారు డివైడర్‌ను బలంగా ఢీకొని ఆగిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో భగవత్, శివం చాచాయ్ గ్రామానికి చెందిన వారు కాగా, శీతల్.. రథారా నివాసిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతులను చూసి వారు చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. పెళ్లి పత్రికలతో వెళ్లిన వారు శవాలై తిరిగిరావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి.. -
ఏం కొడుకువిరా నువ్వు..
''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వన దేవతలు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు. తన వేదనను వంద రూపాయల నోటుపై రాసి హుండీలో వేశాడు. మరికొంత మంది భక్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వచ్చాయి. ముదిమి వయసులో ముసలి తల్లిదండ్రులను వేదనకు గురిచేస్తున్న విదారక ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. కడుపున పుట్టిన పిల్లలను పెంచి, ప్రయోజకులను చేసిన అమ్మనాన్నలకు చివరి రోజుల్లో చీదరింపులే ఎదురవుతున్నాయి. జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన పిల్లలు వదిలించుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ పట్టణంలోని బస్టాండ్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. దీంతో ప్రయాణికుడొకరు ఏమైందని ఆరా తీశాడు. తనను కొడుకు, కోడలు వదిలేసి వెళ్లిపోయారని పెద్దావిడ వాపోయింది. తన కుమారుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, అతడి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. తనను కొడుకు- కోడలు సరిగ్గా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది. అమ్మను వదిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజనులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.నెటిజన్ల స్పందనపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోస్తారని, అలాంటి వారిని చివరి రోజుల్లో చూసుకోవడం వారసుల బాధ్యత మాత్రమే కాదు.. గౌరవం కూడా అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్లమ్మ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వసూలు చేయడానికి కేసు పెట్టాలని మరొకరు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొకరు ఆవేదన చెందారు. మన సమాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎక్కువ కాలం బతకం కూడా శాపంగా కింద భావించాల్సి వస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.చదవండి: 100 రూపాయల నోటుపై రాసి.. కాపాడాలని వేడుకోలువీడియోలోని వృద్ధురాలికి ఎవరైనా సహాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందనే వివరాలు తెలియరాలేదు. తల్లిని వదిలేసి వెళ్లిన కొడుకును కచ్చితంగా శిక్షించాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోందని ఆలోచనాపరులు నిట్టూరుస్తున్నారు. Elderly Mother aged 80 Abandoned at Bus Stand in Mandsaur by son after pressure from his wifeThe idea of family losing its meaning?Are aging parents become inconvenient liabilities in their own homes?This incident is not an isolated case. It reflects a growing moral crisis… pic.twitter.com/Cjsemah4AE— Woke Eminent (@WokePandemic) February 4, 2026 -
ఐఏఎస్ ఆఫీసర్... అంగన్ వాడి స్కూల్
‘ఐఏఎస్ ఆఫీసర్లు తమ పిల్లలను ఎలాంటి స్కూల్స్‌లో చదివిస్తారు?’ అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. అయితే ఐఏఎస్ ఆఫీసర్, చిత్రకూట్ కలెక్టర్ పుల్కిత్ గార్గ్ ‘అందరు ఆఫీసర్లు ఒకేలా ఆలోచించరు’ అని నిరూపించారుమధ్యప్రదేశ్లోని చిత్రకూట్‌లో తన మూడేళ్ల కుమార్తె సియాను ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు చాలా మెరుగు పడింది. ఒక ఐఏఎస్ అధికారి తన బిడ్డను ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివించగలిగినప్పుడు సామాన్యులెవరూ సంకోచించకూడదు. అంగన్వాడీ కేంద్రాలపై ఉన్న అభిప్రాయాలు మారాయని విశ్వసిస్తున్నాను’ అన్నారు గార్గ్. ఈ సందర్భంగా బాల్యదశ అభివృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఆరోగ్యం, పోషకాహారం... మొదలైనవి బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఎలా తీర్చిదిద్దుతాయో వివరించారు. ‘ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న అపనమ్మకాన్ని వీడండి’ అని తల్లిదండ్రులను కోరారు. పుల్కిత్ గార్గ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాల మాట ఎలా ఉన్నా అత్యధికులు ఆయనను సమర్థించి ప్రశంసించారు. -
దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి
బెతుల్: మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు హర్ష్.. ‘కోల్డ్రిఫ్’ (Coldrif) దగ్గు మందు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ సిరప్ తాగిన తర్వాత హర్ష్ కోమాలోకి వెళ్లగా, అప్పటి నుండి నాగ్‌పూర్ ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచినట్లు వైద్యలు తెలిపారు. సోమవారం నాగ్‌పూర్‌లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు బెతుల్ జిల్లా వైద్యాధికారి మనోజ్ హుర్మాడే వెల్లడించారు.చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ కోల్డ్రిఫ్ సిరప్‌పై జరిగిన విచారణలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. చెన్నైలోని ప్రభుత్వ ఔషధ పరీక్షల ప్రయోగశాలలో నిర్వహించిన విశ్లేషణలో ఈ మందులో ‘డైథైలిన్ గ్లైకాల్’ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ నివేదిక ప్రకారం, కాంచీపురానికి చెందిన ‘స్రేసన్ ఫార్మాస్యూటికల్స్’ తయారు చేసిన ఈ సిరప్‌లో ఏకంగా 48.8 శాతం మేర ఈ కల్తీ రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన పదార్థం.మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, బెతుల్ జిల్లాల్లో ఈ కల్తీ దగ్గు మందు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సిరప్ తాగిన చిన్నారుల్లో వాంతులు, జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. హర్ష్ మరణంతో కలిపి ఈ తరహా ఘటనల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 24కు చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. పలువురు చిన్నారులు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సమగ్ర విచారణ చేపట్టింది. ఈ ప్రాణాంతక సిరప్‌ను సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ వైద్యునితో పాటు, తయారీ సంస్థ యజమానిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సిరప్ విక్రయాలపై నిషేధం విధించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ సంస్థలపై ప్రభుత్వం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది.ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణం: 10 చోట్ల ఈడీ మెరుపు దాడులు -
ఘోరం: మంచంపైన అవ్వ, బాక్స్‌లో బాలుడి..!
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పదమూడేళ్ల బాలుడి హత్య కలకలం రేపింది. నిందితుడు ఆ బాలుడిని నైలాన్ తాడుతో ఎనిమిది సార్లు ఉరి బిగించి.. ముఖంపై ఇటుకతో దాడి చేసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం బాక్స్‌లో దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను అదే మంచంపై పడుకోబెట్టాడు.పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆ బాలుడు ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆధారాలు దొరకకుండా.. మృతదేహాన్ని నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌కు తరలించి అక్కడ ఒక మంచం(బెడ్ బాక్స్)లో దాచాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడు అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం సోదాలు నిర్వహించగా.. సమీపంలోని భవనంపై బాలుడి జాకెట్, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించగా.. బాలుడు ఆ భవనంలోకి వెళ్లడం రికార్డయ్యింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రెహాన్ పోలీసులనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. గాలింపు సమయంలో నిందితుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. పోలీసుల వెంటే తిరిగాడు. అయితే, అతని చేతులు, మెడపై ఉన్న గీతలను చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పోలీసులు ప్రశ్నించగా.. పని చేసే చోట గాయాలయ్యాలంటూ బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు గత నాలుగు నెలలుగా పనికి వెళ్లడం లేదని తేలింది. చివరికి రెహాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. బెడ్ బాక్స్‌లో బామ్మ పడుకున్న మంచం కిందే మృతదేహం ఉందని చెప్పాడు. పోలీసులు ఆ వృద్ధురాలిని పక్కకు జరిపి మంచం తెరవగా, దుప్పటిలో చుట్టిన బాలుడి మృతదేహాం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
ప్రశాంతంగా పూజలు.. నమాజ్
ధార్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల–కమాల్ మౌలా మసీదు సముదాయంలో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంగణంలోని ఒక ప్రాంతంలో హిందువులు వసంత పంచమిని పురస్కరించుకుని పూజలు నిర్వహించగా, ముస్లిం మరోచోట నమాజ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి హిందువులు పూజలు మొదలుపెట్టారు. సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేశారు. నగర వ్యాప్తంగా 8 వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. భోజ్ ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించి, అఖండ పూజను ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని, ప్రశాంత వాతావరణానికి భంగం కలగలేదని జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక్ మిశ్రా తెలిపారు. నగరంలోని ప్రతి వీధిలోనూ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ మయాంక్ అవస్థి చెప్పారు. సామాజిక మాధ్యమ వేదికలపైనా ఓ కన్నేసి ఉంచామన్నారు. 11వ శతాబ్దం నాటి ఈ కట్టడాన్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) పరిరక్షిస్తోంది. 2003లో ఏఎస్ఐ ఇచి్చన ఆదేశాల ప్రకారం భోజ్‌శాలలో ప్రతి మంగళవారం హిందువులు పూజలు, ముస్లిం ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, వసంత పంచమి శుక్రవారం రోజే రావడంతో గురువారం ఇరువర్గాలకు అనుకూలంగా ఉండేలా పూజలు, నమాజ్ చేసుకునేందుకు ఏర్పా ట్లు చేయాలని ఆదేశించడం తెల్సిందే. భవ్య సరస్వతీ ఆలయం నిర్మిస్తాం: వీహెచ్‌పీ వివాదాస్పద భోజ్‌శాల సముదాయంలో బ్రహా్మండమైన సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. చట్ట పరమైన ప్రక్రియను పూర్తి చేసుకున్నాక 2034కల్లా ఆలయ నిర్మాణ కలను సాకారం చేస్తామని తెలిపింది. ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి మాత విగ్రహాన్ని తిరిగి తీసుకువచి్చ, ఆ ఆలయంలో ప్రతిíÙ్ఠస్తామని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన ఆలయం మాదిరిగానే ఇది కూడా ఉంటుందన్నారు. శుక్రవారం ఆయన భోజ్‌శాలలో జరిగిన సరస్వతీమాత పూజకు హాజరైన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ‘భోజ్‌శాలలో వాగ్దేవి ఆలయం 1034లో నిర్మితమైంది. ఆలయ ప్రతిష్ట జరిగి ఇప్పటికి 992 ఏళ్లు పూర్తయ్యాయి. 2034కల్లా వెయ్యేళ్లు అవుతాయి. అప్పటి కల్లా చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అయోధ్య రామాలయం మాదిరిగా భవ్య సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించుకోవాలి’అని అలోక్ కుమార్ పిలుపునిచ్చారు. లండన్ నుంచి వాగ్దేవి విగ్రహాన్ని భారత్‌కు తిరిగి తేవాలని ఈ సందర్భంగా పలువురు సాధుసంతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ మాదిరిగానే వాగ్దేవి కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. -
భోజ్‌శాలలో పూజలు, నమాజ్‌కు ఓకే
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల–కమల్ మౌలా సమీదు వద్ద పూజల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వసంత పంచమి రోజు(శుక్రవారం) హిందువులు అక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల దాకా నమాజ్ చేసుకోవచ్చని సూచించింది. ముస్లిం వర్గం నుంచి నమాజ్‌లో పాల్గొనేవారి పేర్ల జాబితాను జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయాలని ఆ వర్గాన్ని ఆదేశించింది. భోజ్‌శాల కాంప్లెక్స్ వద్ద పూజలు, ప్రార్థనలు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించుకుంటామని హిందువులు విజ్ఞప్తిచేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వినతిని మన్నించింది. పరస్పరం గౌరవించుకోవాలని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సూచించింది. ‘‘భోజ్‌శాల కాంపౌండ్‌లో వద్ద నమాజ్‌కు ఎంతమంది హాజరవుతారో తెలుసుకొని దాన్నిబట్టి ప్రత్యేక స్థలం కేటాయించాలి. నిర్దేశిత సమయంలో వారు అక్కడ నమాజ్ చేసుకోవచ్చు. అలాగే హిందువులు సంప్రదాయ పూజలు చేసుకోవడానికి అక్కడ ప్రత్యేక స్థలం కేటాయించాలి. హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పూజలు, ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నమాజ్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి వీల్లేదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పూజలు, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి. సందర్శకులకు ఉచితంగా పాసులు మంజూరు చేసే అంశం పరిశీలించాలి’’అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఏమిటీ భోజ్‌శాల? 11వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇది వాగ్దేవి(సరస్వతి) మందిరంగా కొలుస్తుంటారు. భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఈ కట్టడాన్ని పరిరక్షిస్తోంది. మరోవైపు ముస్లింలకు కూడా ఇది పవిత్రమైనదే. దశాబ్దాల క్రితమే కమల్ మౌలా మసీదుగా ప్రకటించారు. నిత్యం నమాజ్ చేస్తుంటారు. 2003 ఏప్రిల్ 7న ఏఎస్ఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. భోజ్‌శాలలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేసుకోవచ్చు. ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవాలి. ఈసారి వసంత పంచమి శుక్రవారం రావడంతో సందిగ్ధత నెలకొంది. పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లింలు యథాతథంగా నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలంటూ మసీ దు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు భోజ్‌శాల–కమల్ మౌలా మసీదు వద్ద ఒకేరోజు పూజలు, నమాజ్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ముస్లిం వర్గం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు కమల్ మౌలా నమాజ్ ఇంతెజామియా కమిటీ చీఫ్ జులీ్ఫకర్ పఠాన్ చెప్పారు. శుక్రవారం శాంతియుతంగా నమాజ్ చేసుకోవాలని ముస్లింలను కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగి్వజయ్ సింగ్ స్వాగతించారు. ఇది కూడా చదవండి: karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్ -
47 ఏళ్ల వ్యక్తికి గర్భసంచి...ట్విస్ట్ ఏంటంటే!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోఒక విచిత్రం చోటు చేసుకుంది. జీవ శాస్త్రంలో కనీవినీ ఎరుగని రీతిలో 47 ఏళ్ల పురుషుడికి గర్భసంచి ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తితోపాటు, వైద్యులూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంతకీ అసలు ఏమిటంటే...ఉంచెహరా నగర పంచాయతీ ఛైర్మన్ నిరంజన్ ప్రజాపతి, కడుపు నొప్పి , ఉబ్బరంతో బాధపడుతూ జనవరి 13న సోనోగ్రఫీ చేయించుకున్నారు. దీంతో అతనికి కుడివైపున గర్భసంచి ఉందనీ అదీ తలకిందులగా ఉందని ఒక డయాగ్నస్టిక్ రిపోర్ట్ వచ్చింది. అయితే, అతనికి ఆసుపత్రి ఫైల్‌కు బదులుగా, ఒక వైద్య వ్యంగ్య కథకు సరిపోయే రిపోర్ట్ అందింది. దీంతో నాకు యూట్రస్ ఏంటి అని విస్తుపోయిన ప్రజాపతి వైద్యులను సంప్రదించి అసలు విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరోగ్య శాఖ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.ఏం జరిగిందీ అంటే..డయాగ్నస్టిక్ సెంటర్లోని గుమస్తా పొరపాటు కారణంగా ఈగందరగోళం నెలకింది. అతను ఒక రిపోర్ట్ బదులుగా, మరొకరి రిపోర్ట్‌ను అందించాడు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగుల నిర్లక్ష్యానికి అజాగ్రత్తకు సంబంధించిన ఇదొక భయంకరమైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇదీ చదవండి: అరుదైన కానుక : రాహుల్ గాంధీ భావోద్వేగం, వైరల్ వీడియోఆ రిపోర్ట్ అస్సలు నాది కాదు అంటూ తన అనుభవాన్ని ప్రజాపతి పంచుకున్నారు. కొన్ని రోజులుగా కడుపులో నొప్పి వచ్చేది.. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. త రువాత మందులు తీసుకున్నా ఉపశమనం లభించలేదు. దీంతో మొదట ఉంచెహరాలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత సత్నాలో సోనోగ్రఫీ చేయించుకున్నాను. ఆ తరువాత జబల్పూర్కు వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఈ రిపోర్ట్ నాది కాదని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ విషయంపై సత్నాలోని ఆ కేంద్రానికి చెందిన డాక్టర్ అరవింద్ సరఫ్‌ను సంప్రదించగా, ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఆయన మౌనం తీవ్రమైన నిర్లక్ష్యం ,రోగనిర్ధారణ ప్రక్రియలలో లోపాలు జరిగాయనే అనుమానాకు బలాన్నిచ్చింది. దీనిపై సత్నా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ శుక్లా స్పందించారు. సంబంధిత రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మరోవైపు ఇలాంటి పొరపాట్లు కేవలం గుమస్తా తప్పులు మాత్రమే కావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. "తప్పుగా వచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ చికిత్సను తప్పుదోవ పట్టిస్తుందనీ, ఇది రోగిపై మానసికంగా ప్రభావం మాత్రమే కాదు, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటే ప్రాణాంతకం కూడా కావచ్చు అంటున్నారు సీనియర్ వైద్య నిపుణులు.ఇదీ చదవండి: మిస్ అయిన ఫోన్ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్! -
కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు!
ఇండోర్: మూడు ఇళ్లు, కార్లు, ఆటోలు, వడ్డీ వ్యాపారం. ఈ ఆస్తులు.. వడ్డీ వ్యాపారం ఇవన్నీ చూస్తుంటే ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఆస్తులేనని అనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే. మీరనుకుంటున్నట్లు ఈ ఆస్తులన్నీ కోటీశ్వరుడివి కావు. ఓ సాదాసీదా బెగ్గర్వి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్’లో వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం వీధుల్లో భిక్షాటన జీవితాలను మార్చడం. భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి వారికి పునరావాసం కల్పించడం. ఈక్యాంపెయిన్లో ఓ ప్రాంతంలో బిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే వ్యక్తి గురించి ఫిర్యాదులు రావడంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పునరావాసం కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో అధికారులు సైతం కళ్లు బైర్లు కమ్మేలా అతని ఆస్తులు కోట్లలో ఉన్నట్లు నిర్ధారించారు.బిక్షమెత్తుతూ కోట్లకు పడగనెత్తిన గీలాల్ ఘటన చర్చాంశనీయంగా మారింది. భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బుతో అతను కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టాడని అధికారులు వెల్లడించారు. తమ దర్యాప్తులో మంగీలాల్ వద్ద 600ఎస్ఫ్టీలలో భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ ప్రాంతాల్లో మూడు ఇళ్లు, మూడు ఆటోలు,స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి. స్విప్ట్ డిజైర్ కోసం ఓడ్రైవర్ను పెట్టుకున్నాడు. తాను బిక్షాటనకు ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా అదే కారులో వచ్చేవాడు. ఖాళీ సమయాల్లో అద్దెకు తిప్పేవాడు. అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు.రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంయుక్తంగా చేపట్టిన పథకం ద్వారా మంగీలాల్‌కు ఒక వన్ బీహెచ్‌కే ఇల్లు కూడా కేటాయించింది. అయినప్పటికీ, అతను భిక్షాటనను ఆపలేదు. చెక్కతో చేసిన కార్డు పట్టుకుని ఇండోర్ వీధుల్లో భిక్షాటన కొనసాగిస్తున్నాడు. భిక్షాటనతో పాటు సరాఫా బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ.. ప్రతిరోజూ రూ.400–500 వరకు వసూలు చేస్తున్నాడని సమాచారం.జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ, మంగీలాల్‌పై పలువురు ఫిర్యాదులు వచ్చినందున మహిళా శిశు అభివృద్ధి శాఖ అతని గురించి ఆరా తీసినట్లు తెలిపాడు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి రాజీష్ సిన్హా మాట్లాడుతూ..భిక్షాటనను ప్రోత్సహించే లేదా దానిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘అందుకే అఘాయిత్యాలు..’ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరైయా అత్యాచార ఘటనలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భాండేర్ నియోజకవర్గానికి చెందిన ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అత్యాచారాలను కులం, మతపరమైన నమ్మకాలతో ముడిపెట్టారు. ‘రోడ్డుపై వెళ్లేటప్పుడు అందమైన అమ్మాయి కనిపిస్తే, మగవారి మనసు చలిస్తుంది. అంటూనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన గ్రంథాల కారణంగానే ఇలా జరుగుతోందని అన్నారు. పసిపిల్లలపై జరిగే హేయమైన నేరాలను కూడా సమర్థిస్తున్నట్లు మాట్లాడారు.ఎమ్మెల్యే బరైయా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పార్టీకి వాటితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అత్యాచారం అనేది క్షమించరాని నేరం. దీనిని కులం లేదా మతంతో ముడిపెట్టడం సరికాదు. నేరస్తులను సమర్థించేలా ఎవరు మాట్లాడినా ఆమోదయోగ్యం కాదు’ అని పట్వారీ స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన బరైయాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళలను వక్ర దృష్టితో చూడటం, దళిత, గిరిజన మహిళలపై జరిగే దాడులను పవిత్ర కార్యాలుగా వర్ణించడం ఎమ్మెల్యే వికృత మనస్తత్వానికి నిదర్శనమని మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్-ఛార్జ్ ఆశిష్ అగర్వాల్ ధ్వజమెత్తారు. మహిళలను దేవతలా పూజించే దేశంలో.. వారిని ఆట వస్తువులుగా చూడటం కాంగ్రెస్ భావజాలమా?" అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ రక్షణ పేరుతో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని, లేదా బరైయాను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు.పూల్ సింగ్ బరైయా నోరు పారేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఆయన గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2026 జనవరిలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల పరిస్థితిని కుక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. అలాగే 2024 అక్టోబర్‌లో ఎన్నికల అధికారులను బెదిరించడం, 2020లో అగ్రవర్ణాలను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర అంశాలు ఆయన ట్రాక్ రికార్డులో ఉన్నాయి. తాజా వ్యాఖ్యలతో మరోసారి ఆయన విమర్శల పాలయ్యారు.ఇది కూడా చదవండి: ప్రముఖ సింగర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ డెత్ వార్నింగ్ -
50 ఏళ్లుగా అస్సలు నిద్రపోని వ్యక్తి.. వైద్యులకే షాక్!
మనిషి నిద్ర లేకుండా జీవించడం సాధ్యం కాదని అంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర చాలా ముఖ్యమైనది. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి గత 50 ఏళ్లుగా అస్సలు నిద్రపోలేదు. అయినా అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉండటం వైద్యులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.రేవాకు చెందిన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ మోహన్ లాల్ ద్వివేది వయస్సు 75 సంవత్సరాలు. ఎమర్జెన్సీ సమయంలో తాను చివరిసారిగా నిద్రపోయానని, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు అస్సలు నిద్రపోలేదనని మోహన్ లాల్ చెప్పారు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నిద్రపోకపోయినా మోహన్ లాల్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. అలసట లేదు, బలహీనత లేదు, కండరాల నొప్పి లేదు. ‘నాకు నిద్ర పట్టడం లేదు. నేను రాత్రిపూట పడుకుంటాను, కానీ నిద్రపోలేను. దీంతో పుస్తకాలు చదువుతాను. వాకింగ్‌కు వెళ్తాను. ఇప్పుడది రొటీన్ గా మారింది’ మోహన్ లాల్ ద్వివేది చెబుతున్నారు.మోహన్ లాల్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆయన పని చేసే శైలి కూడా చర్చనీయాంశంగా ఉండేది. మోహన్ లాల్ అనేక గంటలు నిరంతరాయంగా పనిచేసేవారు. దీంతో ఆయన సబార్డినేట్ సిబ్బంది మోహన్ లాల్‌తో కలిసి పనిచేయాలంటే వామ్మో అనేవారు. బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ సమయంలో ఆయన చాలా కిలోమీటర్లు నడిచేవారు. అయినా అలసటగా అనిపింపేది కాదట.తన నిద్రలేమి సమస్య గురించి ముంబై, ఢిల్లీలోని పెద్ద వైద్యులను కూడా మోహన్ లాల్ సంప్రదించారు. అయినా ఫలితం కనిపించలేదు. యోగా, ప్రాణాయామం నుంచి భూతవైద్యం వరకు ప్రతిదీ ప్రయత్నించానని, కానీ ఇప్పటికీ నిద్ర రావడం లేదని మోహన్ లాల్ పేర్కొన్నారు. ఈ సమస్యపై మొదట్లో ఆందోళన పడ్డా ఇప్పుడు అలవాటు అయిపోయిందని చెబుతున్నారు. -
భారత క్రికెటర్‌కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
భారత స్టార్ పేసర్ క్రాంతి గౌడ్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.గతేడాది భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.తొమ్మిది వికెట్లు కూల్చి.. అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్ తొలిసారిగా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్.. క్రాంతి తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్‌కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ క్రమంలోనే మున్నా సింగ్ తిరిగి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.మా నిర్ణయం వల్ల గౌడ్ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్ యూనిఫామ్‌లో రిటైర్ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసిన మున్నా సింగ్ 2012లో సర్వీస్ నుంచి తొలగించబడ్డారు.మున్నా సింగ్‌పై అందుకే వేటుఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్ క్రికెటర్ కావాలన్న తన కలను వదల్లేదు.ట్విస్టు ఏంటంటే?కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్‌కప్ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్డీటీవీ వివరాల ప్రకారం.. జూన్ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్‌కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్
మహిళల వస్త్రధారణ, మోరల్ పోలీసింగ్‌పై చర్చ నడుస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక సంఘటన భారతదేశంలో మహిళల భద్రత, సామాజిక సమస్యలపై పెద్ద చర్చకు దారి తీసింది. మహిళల యోగా భంగిమల్లో ఉన్న పబ్లిక్ వాల్ పెయింటింగ్‌లను అసభ్యంగా మార్చడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.గ్వాలియర్‌లో ‘‘స్మార్ట్ సిటీ" ప్రాజెక్ట్‌లో భాగంగా యోగా చేస్తున్న మహిళల చిత్రాలను అక్కడ కొన్ని గోడలపై చిత్రించారు. యోగా అవగాహనకోసం చిత్రాలతో ఉన్న ప్రభుత్వ కళాకృతులను కొందరు వ్యక్తులు అభ్యంతరకరంగా గీసి, అవమానించడం ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది, వివిధ యోగా భంగిమలతో మహిళల నల్లని సిల్హౌట్లుగా గోడలపై చిత్రీకరించారు. అయితే ఎవరో వాటిని ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకరంగా, అవమానపర్చేలా మార్చేశారు. స్త్రీశరీరంలోని కొన్ని నిర్దిష్ట భాగాలను హైలైట్ చేసేలా గీతలు గీశారు. దీన్ని గమనించిన ఒకరు తిరిగి ఈ చిత్రాలపై తిరిగి నల్లరంగు పూశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విస్త్రృతంగా షేర్ అవుతోంది. View this post on Instagram A post shared by LOKENDRA SINGH (@ketu_gwalior) “గ్రాఫిటీలో కూడా మహిళలకు భద్రతలు లేదు” అంటూ విజువల్స్‌తో పాటు ఒక యూజర్ ట్విటర్లో షేర్ చేశారు, దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర విమర్శలు చెలరేగాయి.ఇది మనుషుల్లో కొరవడుతున్న సివిక్ సెన్స్, మహిళల భద్రత,ప్రజా కళను విధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం చేయడం మాత్రమే కాదు, మహిళలను అగౌరవపరిచే తీవ్రమైన కేసు, దోషులపై చర్య తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇది చౌకబారు ఆలోచన అని కొందరు అభివర్ణించారు. ఆడవారి దుస్తులను కాదు ఈ పైత్యాన్ని ప్రశ్నిద్దాం మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ చర్య మహిళల పట్ల అగౌరవానికి, స్మార్ట్‌సిటీ హోదాకు భంగకరమనే ప్రజాగ్రహానికి దారితీసింది.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారంమరోవైపు ఈ విధ్వంసం ఎప్పుడు జరిగింది, ఎవరు బాధ్యులు, లేదా స్థానిక అధికారులతో ఏదైనా ఫిర్యాదు నమోదైనా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు. అలాగేదీనిపై గ్వాలియర్ మున్సిపల్ పరిపాలన లేదా పోలీసులు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. -
ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’
పదేళ్ల కలల పంట..ముద్దులొలికే కొడుకుని చూసుకొని దేవుడిచ్చిన వరం అనుకొని మురిసిపోయారు. కానీ వారికి ఆ ఆనందం ఎంతోకాలం నిలువ లేదు. మధ్యప్రదేశ్‌లో మృత్యుఘంటికలు మోగిస్తున్న నీటి కాలుష్యభూతం వారి ఐదు నెలల చిన్నారిని బలితీసుకుంది. దీంతో తీరని విషాదం. గుండె పగిలేంత బాధ. కన్నీళ్ల సునామీ తప్ప నోరు పెగలని నిశ్శబ్దం. దేశంలోని పలునగరాల్లో ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న గాలి, నీరు, వాయు కాలుష్య భూతానికి ఇండోర్ (Indore) మరో మచ్చుతునక. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరత్‌పురలో చోటు చేసుకున్న విషాదమిది. పాలల్లో కలిసిని కలుషిత మైన నీరు ఐదు నెలల చిన్నారి అవ్యాన్ సాహు ఉసురు తీసింది. బాధితుడి తండ్రి సునీల్ సాహు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి పదేళ్లక్రితం కింజల్ అనే పాపుట్టింది. చాలా ఏళ్ల ఎదురు చూపుల తరువాత గత ఏడాది జూలై 8న అవ్యాన్ జన్మించాడు. చక్కటి ఆరోగ్యంగా ముద్దుల మూటగడుతున్న చిన్నారిని చూసి అమ్మమ్మ ఎంతో మురిసిపోయింది. అయితే అవ్యాన్ పుట్టిన తరువాత కొన్ని జెనెటిక్ కారణాల రీత్యా తల్లికి పాలుపడలేదు. వైద్యుల సలహామేరకు పోతపాలు పట్టిస్తున్నారు. రోజూలాగానే బిడ్డకు పాలు కలిపి తాగించారు. కుళాయి నీరు వడకట్టి, పటికను జోడించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కాలుష్యం అవ్యాన్‌ను కాటేసింది. జ్వరం, విరేచనాల ( Diarrhoea) తో బాధపడుతున్న పిల్లాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. పరిస్థితి మరింత దిగజారి సోమవారం ఉదయం,ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనే అవ్యాన్ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారి తీరిని విషాదం అలుముకుంది. బిడ్డను కోల్పోయిన తల్లి కంటికి మింటికి ధారగా విలపిస్తోంది. తీరని దుఃఖంతో స్పృహ కోల్పోతూ, మెలకువ రాగానే మళ్లీ శోకంతో కుంగిపోతోంది. నీరు కలుషితమైంది తమకెవరూ చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత తండ్రి సునీల్‌ది. తాము నమ్మిన నీరే బిడ్డ ప్రాణం తీసిందని వాపోతున్నాడు.మేం పేదోళ్లం సార్.. మేం ఎవర్నీ నిందించలేం.ఇది మా తలరాత అంటూ రోదిస్తోంది అమ్మమ్మ. తమ కుటుంబనాకి పెద్ద నష్టమే కానీ ఏం జరిగిందో అర్థం కాక పదేళ్ల కింజల్ నిశ్శబ్దంగా దీనంగా చూస్తోంది.కాగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఏడేళ్లు గుర్తింపు పొందిన ఇండోర్‌లోని భాగీరథ్‌పురాలో, నర్మదా నది పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలిసి, తాగునీరు కలుషితమైంది. దీంతో చాలామంది చనిపోయారు. గత పది రోజులుగా పలువురు బాధితులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారు. మరోవైపు ఈవిషయంపై దర్యాప్తు నిమిత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. -
కాటేసిన కలుషిత నీరు
ఇండోర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ చెప్పారు.మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్ మేయర్ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్ జిల్లాలోని జలూద్ నుంచి పైప్‌లైన్ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు. -
సెమీ కండక్టర్ రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినా
గ్వాలియర్/రేవా: సెమీ కండక్టర్ రంగంలోకి మన దేశం కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బలోపేతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించి, ఎగుమతులను కూడా మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. గురువా రం గ్వాలియర్‌లో జరిగిన అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమిట్‌లో హోం మంత్రి మాట్లాడారు. కేవలం ఏడాది కాలంలోనే 4.57 లక్షల ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ)ల రిజిస్ట్రేషన్లను సాధించినందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. భౌగోళికంగా ఎంతో కీలకమైన, సారవంతమైన భూములున్న మధ్యప్రదేశ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారు సైతం కోట్లాది రూపాయలు సంపాదించగలరన్నారు. ఇండోర్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు అక్కడ వేర్‌హౌస్‌లు, హబ్‌లు ఏర్పాటు చేసుకునేలా ఆహ్వానిస్తామని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి అమిత్ షా రూ.2 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అటల్ జీ గొప్ప వక్త, సున్నిత భావాలున్న కవి, ప్రజాసంక్షేమానికే జీవితం అంకితం చేసిన నేత, రాజకీయాల్లో అజాతశత్రువు’అంటూ కొనియాడారు. సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయంమనకు వచ్చే ఎన్నో వ్యాధులకు రసాయన ఎరువులే మూల కారణమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే ప్రకృతి వ్యవసాయమే మేలన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులకు ఆదాయం కనీసం ఒకటిన్నర రెట్లు అధిక ఆదాయం వస్తుందని, నీరు ఆదా అవడంతోపాటు పరిశుద్ధమైన ఉత్పత్తులతో ప్రజారోగ్యానికి దోహదపడుతుందన్నారు. ఒకే ఒక్క దేశ వాళీ ఆవు మూత్రం, పేడను వినియోగించుకుంటూ 21 ఎకరాల్లో వ్యవసాయ చేయవచ్చన్నారు. రేవాలో జరిగిన రైతుల సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అపారమైన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని రైతుల వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి మరింత మెరుగ్గా చేరుకునేలా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని షా చెప్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని, ఇవి రైతులకు అవసరమైన భూసార, విత్తన పరీక్షలను చేస్తాయన్నారు. -
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.గిర్రాజ్ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్లో రోడ్డు సరిగ్గా లేక టైర్ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్రాజ్ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.ఆరోగ్యంగా ఉన్న గిర్రాజ్ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025 -
పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్
వెంకటేశ్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025 సీజన్లో అతడు మధ్యప్రదేశ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్‌క్లాస్ క్రికెట్లో 20, లిస్ట్-ఎ క్రికెట్లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్‌లు ఆడాడు.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను 2025 వేలానికి ముందు రిలీజ్ చేసిన కేకేఆర్.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతంఅయితే, తాజా ఎడిషన్‌లో వెంకటేశ్ బ్యాట్, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్‌గా నియమించింది.పాటిదార్ అవుట్.. కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథి, మధ్యప్రదేశ్‌కు గతేడాది విజయ్ హజారే ట్రోఫీ అందించిన రజత్ పాటిదార్ ఈ జట్టులో లేడు. కెప్టెన్‌గా అతడి స్థానాన్ని వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేశాడు. ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్‌తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్ ఆటగాడు మంగేశ్ యాదవ్ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్ హజారే ట్రోఫీ లీగ్ దశ నిర్వహించనున్నారు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్ జట్టువెంకటేశ్ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్ యాదవ్, మాధవ్ తివారి (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
స్మార్ట్‌వాచ్‌తో కిడ్నాపర్‌కు చుక్కలు.. యువకుని తెలివికి శభాష్!
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సినిమా లెవల్లో సాగిన కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. తీసుకున్న అప్పు కంటే అధిక వడ్డీ కట్టాలని వేధిస్తూ, సౌరభ్ శర్మ అనే యువ హోటల్ మేనేజర్‌ను వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేశారు. వారు అతనిని ఒక గదిలో బంధించి, చిత్రహింసలు పెడుతున్న సమయంలో అతను తన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ఆలోచన ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.తనను బంధించిన గదిలో కిడ్నాపర్ మర్చిపోయిన స్మార్ట్‌వాచ్ సౌరభ్ కంటపడింది. అదే అతనికి బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. నిందితులు గమనించకుండా అత్యంత చాకచక్యంగా ఆ వాచ్ ద్వారా తన ప్రియురాలికి ఎమర్జెన్సీ కాల్ చేసి, తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. ఆ ఒక్క కాల్‌తో కథ మొత్తం అడ్డం తిరిగింది.సౌరభ్ ప్రియురాలు వెంటనే అతడి తండ్రికి సమాచారం ఇవ్వడం, వారు పోలీసులను ఆశ్రయించడంతో సీన్ రివర్స్ అయింది. గ్వాలియర్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి, కిడ్నాపర్లలో ఒకడిని పట్టుకుని విచారించారు. దీంత భయపడిన రెండో నిందితుడు సౌరభ్‌ను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇద్దరు నిందితులు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.సాంకేతికతను సరైన సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో ఈ ఘటన నిరూపించింది. "రుణ వివాదంతో మొదలైన ఈ కిడ్నాప్ కేసులో, బాధితుడి సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే" అని గ్వాలియర్ పోలీసులు అన్నారు. ప్రస్తుతం ఈ 'స్మార్ట్' రెస్క్యూ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల సాహసం.. వీడియో వైరల్ -
అభాసుపాలైన దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్!
ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్ పోలీస్ స్టేషన్‌గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్ సిబ్బంది చేసిన నిర్వాకమే.పోలీస్ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.సోహన్ అనే ఇంటర్ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్‌గఢ్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో.. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్ 5వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్ లేదు. చేజింగ్ లేదు. ఎలాంటి సీజ్‌లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్‌ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్ఐఆర్లో అతని అరెస్ట్‌కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.డిసెంబర్ 9వ తేదీన మాందసౌర్ జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్‌ను బస్సులోనే సివిల్ డ్రెస్‌లో ఉన్న పీఎస్ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్ మొదలు ఏదీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్ వ్యవస్థలో హాట్ టాపిక్‌గా మారింది.నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో మానిఫులేషన్ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ये देश के सबसे अच्छे पुलिस स्टेशन में से एक की मल्हारगढ़ की पुलिस है, पिछले महीने गृहमंत्री अमित शाह ने ऐलान किया था, उसी थाने के कर्मचारी हैं एक छात्र को जबरन ड्रग्स तस्करी में फंसाने का आरोप है, हाईकोर्ट ने सवाल पूछे अब जाकर निलंबित हुए लेकिन छात्र को २ महीने जेल में रहना पड़ा! pic.twitter.com/tN3IT6fDpJ— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025 -
కూలిన ట్రైనీ విమానం : తప్పిన ఘోర ప్రమాదం
ఒక పక్క ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మధ్యప్రదేశ్ లోని సియోనీలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ అనే విమానయాన సంస్థకు చెందిన ట్రైనీ విమానం తన చివరి దశలో నియంత్రణ కోల్పోయి అకస్మాత్తుగా కూలిపోయింది. ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సోమవారం సాయంత్రం సుక్తారా గ్రామంలోని ఎయిర్‌స్ట్రిప్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లఖన్వాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమ్గావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండింగ్ సమయంలో, 33 KV హై-వోల్టేజ్ లైన్‌కు చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ అకస్మాత్తుగా వైఫ్యలం కారణంగా పైలట్ అమ్గావ్ సమీపంలోని ఒక పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద శబ్దంతో పొలంలో కూలిపోయింది. శబ్దం విన్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. విమానం కాక్‌పిట్ నుండి ఇద్దరు పైలట్లను రక్షించారు. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సుమారు 90 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు కష్టపడి విద్యుత్ సరఫరాను పనరుద్ధరించారు.ఇద్దరు పైలట్లు ప్రైవేట్ ఆసుపత్రిలోఈ ప్రమాదంలో, పైలట్ అజిత్ , ట్రైనీ అశోక్ చావా తల మరియు ముక్కుకు గాయాలయ్యాయి. ఇద్దరినీ బారాపత్తర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. రెడ్ బర్డ్ ఏవియేషన్ కంపెనీ నాగ్‌పూర్ రోడ్డులో ఉన్న సుక్తారా గ్రామంలో ఒక ఎయిర్‌స్ట్రిప్‌ను లీజుకు తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ పైలట్ శిక్షణ అందిస్తుంది.గతంలోనూ ప్రమాదంవిమానయాన కేంద్రం వద్ద భద్రతా ప్రమాణాలను చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో శిక్షణా విమానాలు రన్‌వేపై రెండుసార్లు బోల్తా పడ్డాయనీ కానీ కంపెనీ, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆరోపించారు. -
ఇల్లెక్కిన లారీ
-
మధ్యప్రదేశ్‌లో చీతా కూన మృతి
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చీతా కూన ఒకటి ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రా–ముంబై జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలను గ్వాలియర్ జోన్ ఐజీ అరవింద్ సక్సేనా ఆదివారం వెల్లడించారు. దాదాపు 20 నెలల వయస్సున్న మగ చీతా కూన కునో జాతీయవనం(కేఎన్పీ) నుంచి బయటకు వచ్చింది. ఇది ఆగ్రా–ముంబై జాతీయరహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చీతా ప్రాణాలు తీసిన ఒక కారుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు అధికారి వెల్లడించారు. ఆదివారం చనిపోయిన చీతా కూనతో పాటు మరో కూన సైతం తల్లి నుంచి విడిపోయి, దారి తప్పి తిరుగుతోందని అటవీశాఖ అధికారులు చెప్పారు. -
బిజీ బ్యాంకులోకి అనుకోని అతిథి!
అదొక బిజీ బ్యాంకు. నిత్యం కస్టమర్ల వెయింటింగ్తో.. సిబ్బంది పిచ్చాపాటి కబుర్లతో నడుస్తూ ఉంటుంది. అలాంటి బ్యాంకుకు అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడ్డారు. ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు టేబుల్స్, బీరువాలు.. కనిపించినదానిపైకల్లా పైకి ఎక్కి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు.. అతిజాగ్రత్తగా ఆ అతిథిని బయటకు పంపించేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలో దాటియా థారెట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓ పాము చొరబడింది. కానీ, ఎప్పుడు జరిగిందనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Snake in Punjab National Bank (PNB) Branch in Tharet, Datia near Gwalior, Madhya Pradesh. Work disrupted, staff in Panic!! @pnbindia pic.twitter.com/8wpiC1yHRQ— Hellobanker (@Hellobanker_in) November 29, 2025 -
జడ్జి‘మెంటల్స్’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట
సోషల్ మీడియా వచ్చిన తరువాత మనుషుల్లోని అపరిచితుడు అనేక రూపాల్లో బయటపడుతున్నాడు. ప్రతీ వాడూ జడ్జి‘మెంటల్’ అయిపోతాడు. పెచ్చుమీరుతున్న ఆన్లైన్ ట్రోల్స్ గురించి తలుచుకున్నపుడు ఇలాంటి ఆలోచనే వస్తుంది ఎవరికైనా. పెళ్లి చేసుకున్నా,విడాకులు తీసుకున్నా, తమ అభిప్రాయాల్ని ప్రకటించుకున్నా...వేధింపులే..నోటికొచ్చినట్టు కామెంట్స్ రాసేయడమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు, మనోభావాలు ఇవేవీ పట్టించుకోరు. వచ్చామా? కమెంట్ చేశామా..వికృతం అనందం పొందామా? అంతే.. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన జంట మాత్రం తమను అవమానించిన ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు.11 ఏళ్ల ప్రేమ తరువాత మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రేమ జంట రిషబ్, సోనాలి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి సంబంధించినఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి, ఆన్లైన్లో పిచ్చి పిచ్చి కామెంట్లతో వారిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని దూరం చేశారు. రిషబ్ షేర్వానీలో ప్రకాశవంతమైన గులాబీ రంగు శాలువా సఫాతో మెరిసిపోగా, మెజెంటా లెహంగాలో సోనాలీ చాలా అందంగా కనిపించారు. అయితే వరుడు నల్లగా ఉన్నాడంటూ నోరు పారేసుకున్నాడు."బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం," అని ఒకరు, డబ్బు కోసమే ఈ పెళ్లి అని మరొకరు వ్యాఖ్యానించారు. "దీదీ, ఇలా చేయడం అవసరమా అని ఒకరు, బహుశా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టుందని మరో యూజర్ ఎగతాళి చేశారు. ఈ ట్రోలింగ్ తీవ్ర కావడంతో, పోస్ట్ 30 లక్షలకు పైగా వీక్షణలను దాటేసింది. అయితే ఈ ట్రోలింగ్‌ను కలర్-షేమింగ్‌ను వ్యతిరేకిస్తూ, వారి నిజమైన ప్రేమకు, అనురాగానికి మంచి మద్దతు కూడా లభించడం ఊరటనిచ్చే అంశం.ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ట్రోలర్స్‌కు కొత్త జంట సమాధానంమామధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకు ముగిసింది. వాళ్లు ఏమన్నా మాకేమీ బాధలేదు. ఈ క్షణాన్నిమేము అస్వాదిస్తున్నామని సోనాలి ట్రోలర్స్‌ను తిప్పి కొట్టింది. రిషబ్ కూడా అదే విధంగా స్పందించారు. సోనాలిని పెళ్లాడే క్షణాలకోసం 2014 నుంచి ఎదురు చూస్తున్నానని, ఆమెను పెళ్లికూతురుగా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోవడం తన తరం కాలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉద్యోగం పుకార్లను ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కానీ నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. ఇపుడు నాకు మంచి ఆదాయమే ఉంది. కానీ నాకు ఏమీ లేనప్పుడే ఆమె నన్ను ప్రేమించింది, నా కాలేజీ రోజుల నుంచే నా శరీర రంగు, ఆకారం కంటే. ఆమె నన్ను నన్నుగానే ఇష్టపడింది. నాకు వెన్ను దన్నుగా నిలిచింది...వాళ్ల కమెంట్స్ అస్సలు పట్టించుకోను అని అన్నారు. అలాగే రిషబ్ తన చర్మం రంగు కారణంగా జీవితాంతం వివక్షను ఎదుర్కొన్నా అంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా.. నమ్మకమే పునాదిగా నిలబడిన ప్రేమను పరస్పర విశ్వాసం, అనురాగాలతో రిషబ్-సోనాలి కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగిపోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. -
సామూహిక వివాహాల్లోనే తాళి కట్టిన సీఎం కొడుకు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన చిన్న కొడుకు అభిమన్యు వివాహాన్ని నిరాడంబరంగా చేశారు. ఈ క్రమంలో అదే వేదికపై మరో 21 జంటలకు వివాహం జరిపించి.. యువతులకు పెళ్లి సారె సైతం అందించారాయన. మోహన్ యాదవ్ చిన్న కొడుకు అభిమన్యు డాక్టర్. వధువు ఇషితా పటేల్ కూడా వైద్యురాలే. ఈ ఇద్దరు ఆదివారం తన నియోజకవర్గం ఉజ్జయిని(సౌత్) క్షిప్రా నది తీరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల కార్యక్రమంలో ఒక్కటయ్యారు. పెళ్లి కొడుకులంతా గుర్రాలపై ఉరేగింపుగా రాగా.. పెళ్లి కూతుళ్లు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా మండపానికి వచ్చారు. ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, బాబాలు, అతికొద్ది మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి హాజరైన వీఐపీలకు అక్కడికి వచ్చిన జనాలతో కలిపే భోజనాలు వడ్డించారు. అభిమన్యు-ఇషితలకు బాబా రామ్‌దేవ్ ఆశీర్వాదం.. చిత్రంలో సీఎం మోహన్ యాదవ్ కూడా(కుడి చివర)మిగిలిన జంటలకు కన్యాదాన సామాగ్రి, ఇంటి కానుకలు, మొత్తం వివాహ ఖర్చుతో సహా మొత్తం బాధ్యతను యాదవ్ కుటుంబమే భరించింది. దీనికి తోడు.. ఖరైదీన గిప్ట్‌లు తీసుకురావొద్దంటూ ముందుగానే అందరికీ సమాచారం అందించారు. పాతిక వేల మంది దాకా వివాహానికి హాజరు కాగా.. దగ్గర్లోని ఆలయానికి వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చూసుకున్నారు. వివాహాల పేరిట అర్భాటాలకు పోయి ఖర్చులు చేసే బదులు ఇలా వివాహాలు జరిగితే మంచిదని.. ప్రధానమంత్రి చెప్పినట్లుగా పెళ్లిళ్లు సాధారణంగా జరగాలని, ఇలాంటి వివాహాలు సమానత్వానికి ప్రతీకని సీఎం మోహన్ యాదవ్ సందేశం ఇస్తున్నారు. ఇలాంటి వేదికలతో తన వివాహం జరగడం మరింత సంతోషాన్ని ఇస్తోందంటూ అభిమన్యు చెబుతున్నాడు. వివాహానికి హాజరైన జంటల్లో వివిధ వర్గాల(SC, ST) జంటలు ఉండడంతో సామాజిక సమానత్వం, సామరస్యానికి మోహన్ యాదవ్ నిదర్శనంగా నిలిచారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. सादगी हो तो मोहन यादव जैसी 🔥आज मध्यप्रदेश के मुख्यमंत्री मोहन यादव जी ने ऐसा काम कर दिया, जिसकी चर्चा पूरे देश में होगी।👉 मोहन यादव जी अपने बेटे अभिमन्यु यादव—जो खुद डॉक्टर हैं—की शादी सामूहिक विवाह सम्मेलन में करा रहे हैं।👉 एक तरफ पिता पूरे सूबे के मुख्यमंत्री, दूसरी… pic.twitter.com/AaCeA2b3eO— Aniket Yadav (@teamaniketyadav) December 1, 2025 He is a CM! He could've easily afforded spending crores on his son's wedding to make it a grand political show. But CM .@DrMohanYadav51 chose to get his son married in सामुहिक विवाह ceremony in presence of sadhus & saints to bless every couple.A powerful message to society.👏 pic.twitter.com/CccDmFg0Sq— BhikuMhatre (@MumbaichaDon) December 1, 2025


