
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ నివాసంలోకి దొంగలు ప్రవేశించారు. ఐదుగురు వ్యక్తులు ముసుగు ధరించి వారు దొంగతనానికి ప్రయత్నించారని జితు పట్వారీ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘శుక్రవారం అర్థరాత్రి ఇండోర్‌లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు’ అని పోస్ట్ చేసింది.
Indore में Congress प्रदेश अध्यक्ष Jitu Patwari के घर डकैती की कोशिश
.
.
.#congress #mpnews #indorenews #latestnews #trendingnow #samaynow pic.twitter.com/dBYqzOHqty— Swatantra Samay (@SamaySwatantra) September 6, 2025
ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఐదుగురు వ్యక్తులు జితు పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Breaking
Attempted robbery at Madhya Pradesh #Congress President Jitu Patwari’s residence.
Five masked men caught on cam pic.twitter.com/rFVbtrs1Cl— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) September 6, 2025