
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్‌లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్‌లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్‌లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్‌కి వెళ్లింది. ఆ హోటల్‌లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్‌లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది.
ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు.
నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్‌ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్‌లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం.
మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.
एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।
और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?
क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025
(చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..)