సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచిలో భారత్ గెలవగా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌తో సిరీస్ ఫలితం తేలనుంది. వైజాగ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
270 పరుగులకు ఆలౌట్
కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లలో ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) రూపంలో ముగ్గురు డేంజరస్ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
పదే పదే అప్పీలు చేస్తూ..
అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్ అయ్యాడంటూ కుల్దీప్ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.
ముఖం మాడ్చుకున్న కుల్దీప్
ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్‌ను టీజ్ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్.. మరోవైపు విరాట్ కోహ్లి కూడా నవ్వులు చిందించారు.
అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్‌కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవం
These are the moments we pay our internet bills for! 😉😁😍#INDvSA 3rd ODI, LIVE NOW 👉 https://t.co/Es5XpUmR5v pic.twitter.com/hPZJFPlJ0G
— Star Sports (@StarSportsIndia) December 6, 2025


