rohit sharma
-
ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్.. అంతా రోహిత్ వల్లే?
రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై జట్టుకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఊహించని షాక్ ఇచ్చింది. శరద్ పవార్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కాశ్మీర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.జమ్మూ బ్యాటర్లలో ఓపెనర్ శుభమ్ ఖజురియా(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వివ్రంత్ శర్మ(38), అబిద్ ముస్తాక్(32 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్లో జమ్మూకు ఇది నాలుగో విజయం కావడం గమనార్హం.కాగా అంతకుముందు 274/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో శార్ధూల్ ఠాకూర్(119) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తనీష్ కొటియన్(62) రాణిండు. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు. కాగా జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్ కాగా.. ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది.నిరాశపరిచిన రోహిత్ శర్మ..ఇక పదేళ్ల తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అతడితో పాటు యశస్వి జైశ్వాల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ సైతం తమ మార్క్‌ను చూపించలేకపోయారు. కాగా రోహిత్ వల్లే ముంబై ఓటమి పాలైందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. రోహిత్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయూష్ మాత్రేను పక్కన పెట్టి ముంబై సెలక్టర్లు తప్పు చేశారని మాజీలు అభిప్రాయపడుతున్నారు.17 అయూష్ మాత్రం ప్రస్తుత సీజన్లో దుమ్ములేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. అటువంటి ఆటగాడిని ఎలా పక్కన పెడతారని ముంబై జట్టు మెనెజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.చదవండి: Punjab Vs Karnataka: శతకంతో చెలరేగిన శుబ్‌మన్ గిల్.. కానీ.. -
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్‌గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.ఇక హిట్‌మ్యాన్‌తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.ఇక మిడిలార్డర్లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ రిటైర్మెంట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్‌రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.నో కోహ్లిఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్‌తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్‌లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్‌లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్‌లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్‌లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్‌లు ఆడి 573 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యాది కీలక పాత్రటీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్‌గా గతేడాది అతడు 17 మ్యాచ్‌లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్‌లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్‌కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్వికెట్ టేకర్గానిలిచాడు.ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్‌దీప్ సింగ్(ఇండియా). -
‘అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇది విన్నింగ్ టీమ్’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టును సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) సమర్థించాడు. ఐసీసీ టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్న టీమ్ అని కొనియాడాడు. అతడిని తప్పించి మంచి పనిచేశారుఅదే విధంగా.. ఈ జట్టు నుంచి పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను తప్పించడం కూడా సరైన నిర్ణయమేనని డివిలియర్స్ పేర్కొన్నాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో పోటీపడుతుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలోఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి వారం క్రితమే(జనవరి 18) బీసీసీఐ తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కలేదు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మరో సీనియర్ మహ్మద్ షమీ, యువ తరంగం అర్ష్‌దీప్ సింగ్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయంపై స్పందించిన ఏబీ డివిలియర్స్.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ లేకపోయినా టీమిండియాపై పెద్దగా ప్రభావం పడబోదని పేర్కొన్నాడు. గత కొంతకాలంగా అతడు కాస్త ఆందోళనగా కనిపిస్తున్నాడన్న ఏబీడీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం ఇందుకు కారణం కావొచ్చన్నాడు.కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలిఆసీస్ టూర్లో తన శక్తి మొత్తాన్ని ఖర్చు చేసిన సిరాజ్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక కంగారూ గడ్డపై అతడి ప్రదర్శన అంతగొప్పగా కూడా లేదని.. ఇప్పట్లో అతడు బరిలోకి దిగకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అయితే, అద్భుతమైన నైపుణ్యాలున్న సిరాజ్.. త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.ఇదొక విన్నింగ్ టీమ్ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్టు గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘టోర్నమెంట్ విన్నింగ్ టీమ్ ఇది. భారత జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడబోతోంది. కాబట్టి బ్యాటర్లు ప్రధామైన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.ఐసీసీ టోర్నమెంట్లలో గెలవాలంటే పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టు ఉండాలి. వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆస్ట్రేలియా అనుసరించే వ్యూహాలను మనం చూస్తూనే ఉంటాం. వారి బ్యాటింగ్ ఆర్డర్ డీప్‌గా ఉంటుంది. వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గనిస్తాన్‌పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి.. మ్యాచ్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్రదర్శన ఇందుకు నిదర్శనం.ఇక ఈ జట్టులో హార్దిక్ పాండ్యాతో పాటు ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్లో ఈ ముగ్గురు నెగ్గుకురాగలరు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని డివిలియర్స్ రోహిత్ సేనకు మద్దతు ప్రకటించాడు.ఎనిమిది జట్లుకాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. ఇక టీమిండియా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.చదవండి: జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి? చీఫ్ సెలక్టర్‌గా ఉంటే.. -
రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనా ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే ఫార్మాట్లో(ODI Format) సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరు మరోసారి పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు.రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయంకాగా భారత సారథి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. అయితే, రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయం. పెర్త్టెస్టులో కనీసం శతకం బాదాడు.దేశవాళీ క్రికెట్ బాటకానీ ఆ తర్వాత మరోసారి చేతులెత్తేశాడు. అయితే, అన్నింటికంటే కూడా ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు షాట్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడితేనే పునర్వైభవం పొందే అవకాశం ఉంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీ రెండో దశ బరిలో దిగగా.. కోహ్లి మాత్రం మెడ నొప్పి కారణంగా ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక రోహిత్ రంజీల్లోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులకే అవుటైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇక ‘విరాహిత్’ ద్వయం తదుపరి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా.. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత వీరు యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగనున్నారు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగమవుతారు. అయితే, వీరిద్దరి తాజా వరుస వైఫల్యాల నేపథ్యంలో మెగా టోర్నీలో ఏమేరకు రాణిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడతారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే రోహిత్- కోహ్లి వైట్‌బాల్ క్రికెట్లో పరుగులు తీయడం మొదలుపెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్ భిన్నమైంది.అవుట్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతులను ఆడాలనే ప్రయత్నంలో విరాట్ సఫలం కాలేకపోయాడు. మరోవైపు.. రోహిత్ కూడా మునుపటి లయను అందుకోలేకపోయాడు. అయితే, వీరిద్దరికి వన్డే ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి కచ్చితంగా తిరిగి పుంజుకుంటారు’’ అని పేర్కొన్నాడు.మొక్కుబడిగా వద్దు!ఇక టీమిండియా ప్రధాన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడటం గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడేసి వెళ్లిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీలు దొరికినప్పుడల్లా.. తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటేనే ఫామ్‌లో ఉంటారు.యువ ఆటగాళ్లకు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలతో పోటీ అంటే మంచి మజా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో మరింత ఎక్కువగా కష్టపడతారు. అంతిమంగా ఇది భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన స్టార్లు జమ్మూ అండ్ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.శ్రేయస్ మరోసారి..!ఈ మ్యాచ్‌లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోష్‌ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ డకౌటైన శివమ్ దూబేఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్‌లో ఉన్నారు.ముంబై పరువు కాపాడిన శార్దూల్ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది. -
రోహిత్ బాటలోనే జైస్వాల్.. ఊరించి ఊసూరుమనిపించారు..!
చాలాకాలం తర్వాత రంజీల్లో ఆడుగుపెట్టిన టీమిండియా బ్యాటింగ్ స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా పూర్తిగా తేలిపోయారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) ఖాతా కూడా తెరవలేదు.టీమిండియా స్టార్ బ్యాటర్ల ప్రదర్శన సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా మారుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలు ఆదిలోనే అడియాశలయ్యాయి. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన వీరు సెకెండ్ ఇన్నింగ్స్‌లో గుడి కంటే మెల్ల మేలన్నట్టుగా రెండంకెల స్కోర్లు చేశారు.రోహిత్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. జైస్వాల్ 51 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ క్రీజ్‌లో ఉండింది కొద్ది సేపే అయినా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇదొక్కటే టీమిండియా అభిమానులకు ఊరట కలిగించే విషయం.మ్యాచ్ విషయానికొస్తే.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైన ముంబై, సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు తొలి సెషన్లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ముంబై టాప్ త్రీ బ్యాటర్లు రోహిత్ (28), యశస్వి (26), హార్దిక్ తామోర్ (1) ఔట్ కాగా.. అజింక్య రహానే (1), శ్రేయస్ అయ్యర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 25 పరుగులు వెనుకపడి ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది. శుభమ్ ఖజూరియా (53), అబిద్ ముస్తాక్ (44) ఓ మోస్తరుగా రాణించారు. -
Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమైన ఈ ముంబై రాజా.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో పోరు(Mumbai Vs Jammu Kashmir)లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.ఫలితంగా అతడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇకనైనా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఫెయిల్‌కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ విఫలమయ్యాడు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి సొంతగడ్డపై భారత్ 3-0తో ప్రత్యర్థి చేతుల్లో వైట్‌వాష్‌కు గురైంది.అనంతరం.. ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా రోహిత్ చేతులెత్తేశాడు. ఫలితంగా 3-1తో ఓడిన భారత్.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఇక గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9.రంజీల్లోనైనా రాణిస్తాడనిఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అంశం తెరమీదకు రాగా.. తాను ఇప్పట్లో తప్పుకొనే ప్రసక్తి లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీల బరిలో దిగాడు.ఇందులో భాగంగా గురువారం జమ్మూ కశ్మీర్‌తో మొదలైన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తాడనుకుంటే.. శుక్రవారం కూడా రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేసి.. మరోసారి విఫలమైఆరంభంలో దూకుడుగా ఆడుతూ సిక్స్‌లు, బౌండరీలు బాదిన రోహిత్ శర్మ.. వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. అయితే, అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.VINTAGE ROHIT SHARMA IS BACK....🔥#RohitSharma#RanjiTrophy#Ranjitropy #RohitSharmapic.twitter.com/NQ3T9m52cu— HitMan (@HitMan_4545) January 24, 2025 జైసూ, గిల్, పంత్ కూడా అంతేఇక తొలి ఇన్నింగ్స్‌లో ఉమర్ నజీర్ బౌలింగ్‌లో పోరస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్.. తాజాగా యుధ్వీర్ సింఘ్ బౌలింగ్‌లో అబిద్ ముస్తాక్ చేతికి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ శతకం(161- పెర్త్) యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్.. రెండో ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం కారణంగా ముంబై జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కూడా రంజీ పునరాగమనంలో వైఫల్యం చెందారు. కర్ణాటకతో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్ సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం. చదవండి: Ind vs Engఅతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ What a Lofted drive - rohit sharma #INDvENG #INDvsENG #ChampionsTrophy #RanjiTrophy#RohitSharma pic.twitter.com/igEGrpYc1n— kuldeep singh (@kuldeep0745) January 24, 2025 -
రోహిత్, జైస్వాల్, గిల్, పంత్ మాత్రమే కాదు.. రహానే, పుజారా కూడా..!
రంజీ ట్రోఫీలో ఇవాళ (జనవరి 23) టీమిండియా స్టార్ బ్యాటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ మొదలుకుని.. వెటరన్లు రహానే, పుజారా, హనుమ విహారి వరకు అంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ కాగా.. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) కూడా ఇవాళ బ్యాడ్ డేనే.టీమిండియా ఆటగాళ్లలో ఇవాళ ఎవరైనా సత్తా చాటారా అంటే అది రవీంద్ర జడేజా మాత్రమే. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (51) మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టు (ముంబై) పరువు నిలబెట్టాడు.ఇవాల్టి నుంచి ప్రారంభంరంజీ ట్రోఫీ 2024-25లో ఇవాల్టి నుంచి (జనవరి 23) సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా తేలిపోయారు. రవీంద్ర జడేజా మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.రంజీ ట్రోఫీలో ఇవాల్టి హైలైట్స్- ఢిల్లీపై రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) ఐదు వికెట్ల ప్రదర్శన- ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్- మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఒడిషా బౌలర్ తపస్ దాస్ 6 వికెట్ల ప్రదర్శన- ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన బీహార్ ఆటగాడు ఆయుష్ లోహారుకా (101)- జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న చత్తీస్ఘడ్ ఆటగాడు అనుజ్ తివారి- ఇదే మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన జార్ఖండ్ బౌలర్ ఉత్కర్ష్ సింగ్- హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్- చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్ (106)- ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన చండీఘడ్ బౌలర్ విషు కశ్యప్ - మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కేరళ బౌలర్ నిధీశ్- హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం బాదిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137)- పుదుచ్ఛేరిపై సెంచరీ చేసిన ఆంధ్ర ఓపెనర్ షేక్ రషీద్ (105)- విదర్భపై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రాజస్థాన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ -
రోహిత్ శర్మనే బోల్తా కొట్టించాడు.. ఎవరీ ఉమర్ నజీర్?
టీమిండియా స్టార్ల రాకతో రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి కొత్త కళ వస్తుందనుకుంటే... దాదాపుగా అందరూ ఉసూరుమనిపించారు. భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), యశస్వి జైస్వాల్ గురువారం మొదలైన రంజీ రెండో దశ బరిలో దిగిన విషయం తెలిసిందే.తొలిరోజు జడ్డూ ఒక్కడే హిట్ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ(3)- జైస్వాల్(4) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో ఢిల్లీ స్టార్ రిషభ్ పంత్(1), పంజాబ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) కూడా నిరాశపరిచారు. అయితే, సౌరాష్ట్ర స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు.ఆరడుగుల బుల్లెట్.. ఎవరీ ఉమర్ నజీర్?అయితే, ఈ అందరు స్టార్ల నడుమ ఈనాటి మ్యాచ్‌లో ఓ ఆరడుగుల బౌలర్ హైలైట్‌గా నిలిచాడు. అతడి పేరు ఉమర్ నజీర్ మీర్. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పీడ్‌స్టర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు.ముంబైలోని శరద్ పవార్ క్రికెట అకాడమీ బీకేసీ మైదానంలో ముంబై- జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి కశ్మీర్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఊహించని రీతిలో పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్లు వెనుదిరిగారు.రోహిత్‌నే బోల్తా కొట్టించాడుజైస్వాల్ను ఆకిబ్ నబీ అవుట్ చేస్తే.. రోహిత్ శర్మ ఉమర్ నజీర్ బౌలింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన నజీర్.. హార్దిక్ తామోర్(40 బంతుల్లో 7), ముంబై సారథి అజింక్య రహానే(12), ఆల్‌రౌండర్ శివం దూబే(0) రూపంలో మరో మూడు కీలక వికెట్లు కూల్చాడు.అలా మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని నజీర్ శాసించాడు. దీంతో అతడి వివరాలపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా సమీపంలో ఉన్న మాలిక్పొరాలో నజీర్ జన్మించాడు. అతడి ఎత్తు ఆరడుగుల నాలుగు అంగుళాలకు పైమాటే. అదే అతడికి సానుకూలాంశం అయింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భేష్‌ఈ పొడగరి స్పీడ్‌స్టర్ తనదైన బౌలింగ్ శైలితో దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది బ్యాటర్లకు పీడకలలు మిగిల్చాడు. 31 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు.. టీమిండియాకు ఆడాలనేది చిరకాల కోరిక. అయితే, ఇంత వరకు నజీర్‌కు ఆ అవకాశం రాలేదు.అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం నజీర్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తంగా 57 మ్యాచ్‌లలో అతడు 138 వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ ట్రోఫీ సందర్భంగా సర్వీసెస్ జట్టుపై అత్యుత్తమంగా 6/53తో రాణించాడు. తాజా రంజీ ఎడిషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నజీర్... గత మూడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు 2.64గా నమోదు కావడం గమనార్హం.కుప్పకూలిన ముంబై టాప్, మిడిల్ ఆర్డర్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), హార్దిక్ తామోర్(7), అజింక్య రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివం దూబే(0), షామ్స్ ములానీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో కూరుకుపోయింది.బ్యాట్ ఝులిపించిన శార్దూల్అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 57 బంతుల్లో శార్దూల్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా తనూష్ కొటియాన్(26) రాణించాడు. వీరిద్దరి కారణంగా ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్వీర్ సింగ్ నాలుగేసి వికెట్లు కూల్చగా... ఆకిబ్ నబీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ 42 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ముంబై కంటే 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
ఘోరంగా విఫలమైన రోహిత్, యశస్వి, గిల్, పంత్.. ఐదు వికెట్లతో సత్తా చాటిన జడేజా
రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ఇవాల్టి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. ఖాళీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా రంజీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో హేమాహేమీలంతా బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్.. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్.. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తేలిపోయిన పంత్.. ఐదేసిన జడేజాఎలైట్ గ్రూప్ డిలో భాగంగా ఇవాళ ఢిల్లీ, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. పంత్ 10 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆయుశ్ బదోని (60), యశ్ ధుల్ (44), మయాంక్ గుసెయిన్ (38 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కకావికలం చేశాడు. జడ్డూ 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. జడేజాకు మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) తోడయ్యాడు. ఈ జడేజా 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, యువరాజ్ సింగ్ దోడియా తలో వికెట్ దక్కించుకున్నారు. ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు సెకెండ్ ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీసే అవకాశం ఉంటుంది. 36 ఏళ్ల జడ్డూకు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 35వ ఐదు వికెట్ల ఘనత.పేలవ ఫామ్‌ను కొనసాగించిన రోహిత్.. నిరాశపరిచిన జైస్వాల్, శ్రేయస్, దూబేఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా రోహిత్ శర్మ, జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై.. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన రంజీల్లోనూ కొనసాగింది. హిట్‌మ్యాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మరో టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (0) నిరాశపరిచారు. ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు అజింక్య రహానే (12) కూడా తేలిపోయాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైను మరో టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (51) గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. శార్దూల్ హాఫ్ సెంచరీ పుణ్యమా అని ముంబై 100 పరుగుల మార్కును దాటగలిగింది. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26) కాసేపు సహకరించాడు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లు యుద్వీర్ సింగ్ చరక్ (8.2-2-31-4), ఉమర్ నజీర్ మిర్ (11-2-41-4), ఆకిబ్ నబీ దార్ (13-3-36-2) స్టార్లతో నిండిన ముంబై బ్యాటింగ్ లైనప్‌కు బెంబేలెత్తించారు.తీరు మార్చుకోని గిల్గిల్ వైఫల్యాల పరంపర రంజీల్లోనూ కొనసాగుతుంది. బీజీటీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్.. కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. వి కౌశిక్ 4, అభిలాశ్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ 2, యశోవర్దన్ పరంతాప్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధిగా వ్యవహరిస్తున్న గిల్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్‌సింగ్ (16), మార్కండే (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! 3 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై కేవలం 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్‌తో పాటు కెప్టెన్ అజింక్య రహానే,హార్దిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్‌కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.తీరు మారని రోహిత్..కాగా రోహిత్ శర్మ రెడ్‌బాల్ ఫార్మాట్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ అదే తీరును కనబరిచాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు రంజీల్లో ఆడాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా హిట్‌మ్యాన్ తన బ్యాట్‌కు పనిచెబుతాడో లేదో చూడాలి.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా Rohit Sharma out for 3 in 19 😶Embarrass!ng #RohitSharmapic.twitter.com/UIoY5tCj6Z— Veena Jain (@DrJain21) January 23, 2025 -
Shubman Gill: అక్కడే కాదు.. ఇక్కడా ఫెయిల్!.. సింగిల్ డిజిట్ స్కోర్
దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.తారలు దిగి వచ్చారుఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడుపంజాబ్ ఓపెనర్‌గా గిల్ విఫలంఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా గిల్ వెనుదిరిగాడు.కర్ణాటక పేసర్ల జోరుమొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.వన్‌డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షోకాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్‌లోకి రావాలని ఆశించిన గిల్‌కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. చదవండి: NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా.. -
దేశవాళీ టోర్నీకి దిగ్గజాల కళ
ముంబై: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో చాలా కాలం తర్వాత భారత స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే... అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ బాట పట్టారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా... భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనని ముందే వెల్లడించగా... ఢిల్లీ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌లో అతడు కూడా పాల్గొననున్నాడు. రోహిత్ శర్మ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఇప్పటికే స్టార్లతో నిండి ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో మరింత పటిష్టంగా మారింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జమ్మూ కశీ్మర్‌తో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తలపడుతుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై జట్టు తాజా సీజన్లో 5 మ్యాచ్‌లాడి 3 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో మూడో స్థానంలో ఉంది. బరోడా (27 పాయింట్లు), జమ్మూ కశ్మీర్ (23 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబై జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తోంది. రోహిత్ రాకతో జట్టు మరింత బలోపేతమైందని ముంబై కెపె్టన్ రహానే పేర్కొన్నాడు. ‘రోహిత్ అంటే రోహితే. అతడికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అతడితో కలిసి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ను మరోసారి పంచుకోనుండటం ఆనందంగా ఉంది. రోహిత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో అది ఎన్నోసార్లు చూశాం. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఒక్కసారి లయ అందుకుంటే అతడిని ఆపడం కష్టం. ప్రతి ఆటగాడికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అధిగమించి పరుగుల కోసం తపించడం ముఖ్యం. యశస్వి జైస్వాల్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా ముంబై తరఫున కూడా అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న వారి సాన్నిహిత్యంలో ముంబై ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటారు’ అని రహానే అన్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో పేలవ ఫామ్‌తో నిరాశ పరిచిన రోహిత్ శర్మ... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు రంజీ ట్రోఫీ ద్వారా తిరిగి లయ అందుకుంటాడా చూడాలి. పంత్ X జడేజా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో ఢిల్లీ టీమ్ ఆడుతుంది. సౌరాష్ట్ర తరఫున టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగుతుండగా... రిషభ్ పంత్ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చతేశ్వర్ పుజారా, జైదేవ్ ఉనాద్కట్‌లతో సౌరాష్ట్ర జట్టు బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ జట్టులో ఆయుశ్ బదోనీ, యశ్ ధుల్ వంటి యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. క్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడనుండగా... కర్ణాటక జట్టుకు దేవదత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదిన విదర్భ ప్లేయర్ కరుణ్ నాయర్‌పై అందరి దృష్టి నిలవనుంది. హిమాచల్‌తో హైదరాబాద్ పోరు ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో హైదరాబాద్ రంజీ జట్టు తలపడనుంది. మరోవైపు పుదుచ్చేరితో ఆంధ్ర జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ జాతీయ విధుల్లో ఉండగా... స్టార్ పేసర్ సిరాజ్ పనిభారం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఒక విజయం, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉండగా... ఆంధ్ర జట్టు ఐదు మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 4 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
టాప్‌లో బుమ్రా, జడేజా.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలోనే తన టెస్టు రేటింగ్ పాయింట్స్‌ను బుమ్రా మెరుగుపరుచుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాత స్ధానాల్లో వరుసగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ(837) కొనసాగుతున్నారు.మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravindra jadeja) తన అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు.ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. జడేజా తర్వాత స్ధానాల్లో ప్రోటీస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (294), బంగ్లా ప్లేయర్ మెహిదీ హసన్ (294) నిలిచారు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ర్యాంక్ మరింత దిగజారింది.రోహిత్ ఒక స్ధానం దిగజారి 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బీజీటీ సిరీస్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కాగా బీజీటీ సిరీస్‌లో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నాడు.చదవండి: Ind vs Eng: అతడికి ఇదే చివరి అవకాశం.. ఊపిరి కూడా ఆడనివ్వడు! -
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోని భారత జట్టు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 బుధవారం(జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ఇంగ్లండ్, భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇక తొలి టీ20కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ సెంచరీ సాధిస్తే.. ఇంగ్లండ్‌పై టీ20ల్లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఇంగ్లండ్‌పై సూర్య ఇప్పటికే ఓ టీ20 సెంచరీని నమోదు చేశాడు.సూర్యతో పాటు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం సైతం ఇంగ్లండ్‌పై తలా ఓ టీ20 సెంచరీని బాదాడు. ఇప్పుడు కోల్‌కతా టీ20లో మిస్టర్ 360 సెంచరీతో మెరిస్తే ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్లను అధిగమిస్తాడు. ఒకవేళ తొలి టీ20లో వీలు కాకపోయినా, సిరీస్ మధ్యలోనైనా ఈ రికార్డు బద్దులు అయ్యే అవకాశముంది.అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, రోహిత్ శర్మ రికార్డును సమం చేస్తాడు. మాక్సీ, రోహిత్ ఇద్దరూ ఇప్పటివరకు 5 టీ20 సెంచరీలు నమోదు చేశారు. సూర్యకుమార్ ఖాతాలో ప్రస్తుతం 4 అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.కాగా గత కొన్నేళ్ల నుంచి సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఇప్పటివరరకు 78 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్.. 40.8 సగటుతో 2570 పరుగులు చేశాడు.అతడి కెరీర్లో ఇప్పటివరకు 4 టీ20 సెంచరీలు ఉన్నాయి. అయితే గతేడాది ఆఖరిలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మాత్రం సూర్యకుమార్ నిరాశపరిచాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం 8.67 సగటుతో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌తో తన రిథమ్‌ను తిరిగి పొందాలని సూర్య భావిస్తున్నాడు.కాగా భారత్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. నలుగురు పేస్ బౌలర్లతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. అదేవిధంగా ఈ జట్టులో యువ సంచలనం జాకబ్ బెథెల్‌కు చోటు దక్కింది.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ఇంగ్లండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ -
ముంబై జట్టు ప్రకటన.. రోహిత్ శర్మకు చోటు! కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) రంజీ ట్రోఫీ 2024-25లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీ సెకెండ్ రౌండ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరగనున్న మ్యాచ్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. 2015లో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్‌మ్యాన్.. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ప్రాతిష్టత్మక టోర్నీలో ఆడనున్నాడు.రెడ్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో హిట్‌మ్యాన్ దారుణంగా నిరాశపరిచాడు. అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్రమంలో రోహిత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో రోహిత్ తన పూర్వ వైభావాన్ని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే.. సీనియర్ ఆటగాళ్లు సైతం దేశీవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే రోహిత్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక జట్టులో విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను కూడా ముంబై సెలక్టర్లు చేర్చారు. ఈ జట్టుకు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ జనవరి 23 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.పదేళ్ల తర్వాత..రోహిత్ శర్మ చివరగా 2015లో ముంబై తరపున రంజీల్లో ఆడాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(114) సెంచరీతో మెరిశాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.ఇప్పటివరకు 128 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైకర్ 9287 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సన్నద్దం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్‌కు ముంబై జట్టు ఇదే..అజింక్య రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మ్హత్రే, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ ఠాకూర్ , సిల్వెస్టర్ డిసౌజా, రొయిస్టన్ ద్యాస్, కర్ష్ కొఠారిచదవండి: IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన.. -
చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే నిర్ణయం: అగార్కర్
విరాట్ కోహ్లి(Virat Kohli).. రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గత కొంతకాలంగా టెస్టుల్లో తేలిపోతున్నారు. తొలుత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో విఫలమైన ‘విరాహిత్’ ద్వయం.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచారు. గత ఎనిమిది టెస్టు మ్యాచ్‌లలో కలిపి రోహిత్ చేసిన పరుగులు 164. తీవ్ర స్థాయిలో విమర్శలు ఇక కోహ్లి విషయానికొస్తే.. గత పది మ్యాచ్‌లలో అతడు 382 పరుగులు చేయగలిగాడు. కివీస్ చేతిలో 3-0తో టెస్టుల్లో వైట్‌వాష్.. ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి.. ఫలితంగా రోహిత్- కోహ్లి ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, తాను ఇప్పట్లో రిటైర్ కానని 37 ఏళ్ల రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు సందర్భంగా కుండబద్దలు కొట్టగా.. 36 ఏళ్ల కోహ్లి అసలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లుగా మిన్నకుండిపోయాడు. కానీ ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లపై విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి భవితవ్యం ఏమిటన్న అంశం, జట్టులో మార్పులపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతేఇందుకు బదులిస్తూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) మొదలుకావడానికి నెల రోజులకు పైగా సమయం ఉంది. ఈ ఇద్దరు వన్డే క్రికెట్లో అత్యద్భుతమైన ప్రదర్శన కలిగి ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే మేము దీనిపై దృష్టి సారిస్తాం. మెగా టోర్నీ పూర్తయిన తర్వాత.. ఆటగాళ్ల ప్రదర్శన, భవితవ్యంపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది.ఒకరిద్దరు అని కాదు.. ప్రతి ఆటగాడిపై మా దృష్టి ఉంటుంది. ఆ తర్వాతే జట్టులో ఎలాంటి మార్పులు చేయాలో ఆలోచిస్తాం. అయితే, ఇప్పుడు మాత్రం మా ఫోకస్ మొత్తం వన్డే క్రికెట్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించిన సందర్భంగా శనివారం ఈ వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ వేదికగాకాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.ఇక ఈ ఐసీసీ టోర్నీలో గనుక కోహ్లి- రోహిత్ విఫలమైతే.. వారికి కష్టాలు తప్పకపోవచ్చు. అదే జరిగితే.. తదుపరి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ జట్టులో ఈ దిగ్గజ ద్వయానికి చోటు దక్కడం కష్టమే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్అయితే, చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే కోహ్లి- రోహిత్ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గనుక సత్తా చాటితే.. అభిమానులను ఖుషీ చేయడంతో పాటు.. ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలుకానుంది. అనంతరం ఇరుజట్లు ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పోటీపడతాయి. చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Pak: టికెట్లు కావాలంటే.. ముందుగా చేయాల్సింది ఇదే! ధరల సంగతి?
క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే!.. దాయాదులు పరస్పరం నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే.. ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా మ్యాచ్‌కే అతుక్కుపోతారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కేవలం ఆసియా కప్, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీపడుతున్నాయి. భారత్- పాకిస్తాన్ చివరగా గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్‌లో ముఖాముఖి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన బాబర్ ఆజం బృందాన్ని ఓడించడమే కాకుండా.. లీగ్ దశ ఆసాంతం దుమ్ములేపడంతో పాటు చాంపియన్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సందర్భంగా మరోసారి దాయాదుల సమరం జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 19న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.అనంతరం.. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్ సేల్ ద్వారా టికెట్లు అందుబాటులో లేవు. ఇందుకోసం ముందుగా ఐసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అప్పుడే టికెట్లు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తాయన్న విషయం ఐసీసీ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.ఆ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..తొలుత ఐసీసీ అధికారిక రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్లి.. ఈ కింది వివరాలు పూర్తి చేయాలి.👉పూర్తి పేరు:👉ఈ-మెయిల్ అడ్రస్:👉ఫోన్ నంబర్:👉పుట్టిన తేది:👉ఏ దేశంలో నివాసం ఉంటున్నారు:👉ఏ జట్టుకు మీ మొదటి ప్రాధాన్యం:👉షరతులకు అంగీకరిస్తున్నారా?!:👉అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే.. సబ్మిట్ చేయండి.ధరల సంగతేంటి?ఇక జనవరి 16, 2025 నాటికి ఎక్స్ఛేంజ్టికెట్స్(xchangetickets) వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. భారత్- పాక్ మ్యాచ్‌ల టికెట్ల రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి.👉జనరల్ స్టాండ్- 2386.00 AED(అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్- భారత కరెన్సీలో దాదాపు రూ. 56,170)👉ప్రీమియమ్ టికెట్ల ధర- 5032 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 1,18, 461)👉గ్రాండ్ లాంజ్- 12240 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,88,150)👉ప్లాటినమ్ టికెట్ల ధర- 17680 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,24, 116).పాక్‌లో టికెట్ల ధరలు ఇలాకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 లీగ్ దశ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక కరాచీ, లాహోర్, రావల్పిండిలో జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ల ధర 1000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో కేవలం రూ. 310). ఇక పాకిస్తాన్లో అత్యధిక ప్రీమియమ్ సీటింగ్ టికెట్ల ధర(లాహోర్ సెమీ ఫైనల్ మ్యాచ్)- 25,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 7764). మరోవైపు.. వీవీఐపీ టికెట్ల ధర 12,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 3726). అయితే, రావల్పిండిలో పాకిస్తాన్- బంగ్లాదేశ్ జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ రేట్లను మాత్రం 2500 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో రూ. 776)కు పెంచినట్లు సమాచారం.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
CT 2025: టీమిండియా మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ మేనేజర్‌గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్‌గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశం హెచ్‌సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్‌రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ఫ్రాన్స్‌లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాల కోలాహలం (ఫోటోలు)
-
చాంపియన్స్ ట్రోఫీతో వాంఖడేలో మరోసారి సంబరాలు
ముంబై: ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానానికి భారత క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం వాంఖడే మైదానంలో జరిగిన వేడుకలను తానెప్పటికీ మరవలేనని... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మరోసారి అలాంటి సంబరాలు చేసుకోవాలనుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. వాంఖడే స్టేడియం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆదివారం ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... ‘2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న రోజు వచ్చిన స్పందన అనూహ్యం. సాగరతీరం మొత్తం అభిమానులతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయా. మనవాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. అది ఎలా ఉంటుందో ఒకటికి రెండుసార్లు చూశాను. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా వాంఖడే స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అప్పుడు కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. త్వరలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆడే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మా మీద ఉంటాయని తెలుసు. మరో ఐసీసీ ట్రోఫీని తీసుకువచ్చి ఇక్కడ సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... వాంఖడేకు వస్తే ఇంటికి వచ్చినట్లే ఉంటుందని అన్నాడు. వాంఖడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘2013లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో చివరి టెస్టు వాంఖడేలో ఆడాలని ఉందని చెప్పా. నా అభ్యర్థనను అంగీకరించిన బోర్డు అందుకు అనుమతిచ్చింది. అప్పటి వరకు నేను మైదానంలో ఆడుతున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇక్కడ కెరీర్ చివరి మ్యాచ్ ఆడా. ఆరోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఇక నా జీవితంలో అత్యంత మధుర క్షణాలకు కూడా వాంఖడే వేదికగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంతో సంతోషించా. ఆ స్ఫూర్తితోనే ఆటపై మరింత దృష్టి పెట్టా. అయితే ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా వరల్డ్‌కప్ చేతికి చిక్కలేదు. ఎట్టకేలకు 2011లో నా కల వాంఖడే మైదానంలోనే నెరవేరింది’ అని అన్నాడు. తాను ఇదే మైదానంలో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. వాంఖడే 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. -
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్‌తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్‌ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్‌కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్. -
సిరాజ్‌లో పదును తగ్గిందా!
ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు. -
కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్ నాయర్(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్ నాయర్ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(sachin Tendulkar) కూడా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాటు... చాంపియన్స్ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్ నాయర్‌కు మాత్రం చోటు దక్కలేదు.కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?ఈ విషయం గురించి అగార్కర్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్‌లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కాగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.ఇక రాజస్తాన్‌లో జన్మించిన కరుణ్ నాయర్.. దేశవాళీ క్రికెట్లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్‌గా ఆకట్టుకుంటూ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్‌కు చేరేలా చేశాడు. అందుకే వాళ్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశంఇంగ్లండ్తో టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్, వన్డే సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్ లేదంటే వైస్ కెప్టెన్ ఆప్షన్ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే