ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. ఇప్పుడు స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. రోహిత్ ప్రస్తుతం ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 2027 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న హిట్‌మ్యాన్.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉవ్విళ్లురుతున్నాడు.
ఈ క్రమంలో రోహిత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కూడా రోహిత్ ఆడనున్నాడంట.
ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి రోహిత్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా 50 ఓవర్ల ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో రోహిత్, విరాట్ కోహ్లిల ఎంపికపై బీసీసీఐ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
కానీ వన్డే జట్టుకు వారిద్దరూ ఎంపిక కావాలంటే తప్పనిసరిగా దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విజయ్ హాజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు.
అయితే విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం విజయ్ హాజారే ట్రోఫీ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. కోహ్లి ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. ఈ నెలఖారున సౌతాఫ్రికాతో సిరీస్ కోసం స్వదేశానికి రానున్నాడు.
ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్-కోహ్లిలు ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ లెజెండరీ క్రికెటర్లు ఇద్దరూ వరుసగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు.
ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ వరకు భారత్‌కు వన్డే సిరీస్‌లు లేవు. దీంతో రో-కో తమ ఫిట్‌నెస్‌ను కోల్పోకుండా ఉండడానికి దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ సూచించింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 50 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నీలో ముంబై తరపున రెండు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ 50 పరుగులు చేశాడు. కోహ్లి అయితే ఆఖరిగా 2010లో ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఢిల్లీ తరపున ఆడాడు.
చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే


