జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్-2026 భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా విహాన్ మల్హోత్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
అయితే అండర్-19 ఆసియా కప్ 2025 జట్టులో భాగమైన యువరాజ్ హోగిల్, నమన్ పుష్పక్‌లపై సెలక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్ధానంలో మహ్మద్ ఎనాన్, ఆర్.ఎస్. అంబ్రిష్‌లకు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది.
కెప్టెన్‌గా వైభవ్..
ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, వైస్ కెప్టెన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో మాత్రే స్ధానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు. మాత్రే, మల్హోత్రా నేరుగా ప్రపంచకప్ జట్టులో చేరనున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.
అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు:
ఆయుష్ మాత్రే (కెప్టెన్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.
సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు
వైభవ్ సూర్యవంశీ(కెప్టెన్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వేదాంత్ త్రివేది.


