Ayush Mhatre
-
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్-2025లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే దుమ్ములేపుతున్నారు. 14 ఏళ్ల సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరపున సంచలనాలు సృష్టిస్తుండగా.. ఆయుష్ మాత్రే సీఎస్కే తరపున అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ రికార్డు సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో జట్టులోకి వచ్చిన మాత్రే తన మెరుపు ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు యువ క్రికెటర్లు తిరిగి భారత అండర్-19 జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్‌కు సూర్యవంశీ, మాత్రే వెళ్లనున్నారు. సూర్యవంశీ గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. గతేడాది అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత యువ జట్టుకు తొలి టూర్ కావడం గమనార్హం. అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. కాగా ఇదే జూన్‌లో భారత సీనియర్ జట్టు కూడా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. -
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆయుశ్ మాత్రే సీఎస్కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్‌పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది. మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్‌కు కూడా పిలిపించుకుంది.మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్‌లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్‌గా ముద్ర వేసుకున్నాడు. -
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో బలహీనంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్ రుతురాజ్, ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమే రాణించారు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి అవకాశం వచ్చిన మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. గత సీజన్లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో స్థాయికి తగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మూడో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న విజయ్ శంకర్ కూడా ఫెయిలయ్యాడు. జడేజా, ధోని పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా సీఎస్కే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ బ్యాటింగ్ విభాగాన్ని బలపరచుకునే యోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రేను ట్రయల్స్‌కు పిలిచింది. దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న మాత్రేను సీఎస్కే గత సీజన్లో కూడా ట్రయల్స్‌కు పిలిచింది. అతని పెర్ఫార్మెన్స్తో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఎందుకో అతన్ని ఎంపిక చేసుకోలేదు.మాత్రే గతేడాది జరిగిన U19 ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. 44 సగటున, 135.38 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేశాడు. కుడిచేతి వాటం స్టైలిష్ బ్యాటర్ అయిన మాత్రే.. గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. 65.43 సగటున, 135.50 స్ట్రైక్ రేట్‌తో 458 పరుగులు చేశాడు.మాత్రేను ట్రయల్స్‌కు పిలిచిన విషయాన్ని అంగీకరించిన సీఎస్కే యాజమాన్యం అవసరమైతేనే (ఎవరైనా గాయపడితే) అతన్ని జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికైతే కొత్తగా ఎవరినీ జట్టులో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి, ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్కే తమ నాలుగో మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం (3:30) ఆడుతుంది.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను తప్పిస్తే ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ఈ సీజన్లో సీఎస్కే ఎంపిక చేసుకున్న విదేశీ ఆటగాళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. బౌలర్లలో నూర్ అహ్మద్ ఒక్కడే రాణిస్తున్నాడు. పతిరణ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్ తేలిపోయారు. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర ఒక్కడే రాణిస్తున్నాడు. డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.