
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్‌కు కింగ్స్‌కు ఆయుష్ మాత్రే రూపంలో ఒక అణిముత్యం దొరికింది. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో సీఎస్‌కే జట్టులోకి వచ్చిన ఆయూష్.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. ఈ యువ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సీఎస్‌కేకు అద్బతమైన ఆరంభాలను అందించాడు.
తాజాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న సీఎస్‌కే ఆఖరి మ్యాచ్‌లోనూ మాత్రే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆయూష్ కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. చెన్నై ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన గుజరాత్ పేసర్ ఆర్షద్ ఖాన్‌ను మాత్రే ఊతికారేశాడు.
ఓ ఓవర్‌లో మాత్రం మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన మాత్రే.. ఆ తర్వాత రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. ఆఖరి బంతిని కూడా స్టాండ్స్‌కు తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో సీఎస్‌కే బ్యాటర్‌గా మాత్రే నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్‌లో జడేజా.. హర్షల్ పటేల్ వేసిన ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. ఇక మాత్రే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు 240 పరుగులు చేశాడు.
చదవండి: PBKS VS DC: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతి జింటా
#CaptainCool would be proud of that onslaught! 🤩#AyushMhatre smashes 28 runs off the 2nd over of the game. 💪
Watch the LIVE action ➡ https://t.co/vroVQLpMts#Race2Top2 👉 #GTvCSK | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/jvoaHXixXD— Star Sports (@StarSportsIndia) May 25, 2025