
PC: Starsports/BCCI
‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి కోపమొచ్చింది. తన ప్రియ శిష్యుడు మతీశ పతిరణ (Matheesha Pathirana) తీరు ‘తలా’కు విసుగుతెప్పించింది. దీంతో ధోని సీరియస్ లుక్ ఇవ్వగానే.. పతిరణ అలెర్ట్ అయిపోయాడు. కెప్టెన్ వ్యూహానికి అనుగుణంగా వ్యవహరించి.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలమయ్యాడు. తద్వారా ‘తలా’ను ప్రసన్నం చేసుకోగలిగాడు.
230 పరుగులు
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41) మరోసారి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (13) విఫలమయ్యాడు. జోస్ బట్లర్ (5), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (0) కూడా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో సాయి సుదర్శన్‌తో కలిసి షారుఖ్ ఖాన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో శివం దూబే పదో ఓవర్ వేయగా.. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు రాబట్టిన సాయి సుదర్శన్.. మూడో బంతికి సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతికి షారుఖ్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షారుఖ్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి సుదర్శన్ రెండు పరుగులు తీశాడు. దీంతో దూబే ఓవర్లో మొత్తంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.
చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!
అయితే, ఈ ఓవర్లో ధోని ఫీల్డింగ్ సెట్ చేస్తున్న వేళ పతిరణ కాస్త నిర్లక్ష్యంగా కనిపించాడు. దీంతో తన ఆదేశాలను పట్టించుకోకుండా ఉన్న బౌలర్, ఫీల్డర్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక మరుసటి ఓవర్లో రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే షారుఖ్‌ను అవుట్ చేశాడు.
ఫుల్ వైట్ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా చేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన షారుఖ్ ఖాన్ బంతిని గాల్లోకి లేపగా షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా పయనించింది. ఈ క్రమంలో.. పతిరణ క్యాచ్ అందుకునే క్రమంలో తడబడ్డా.. ఎట్టకేలకు విజయవంతంగా పనిపూర్తి చేశాడు. దీంతో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షారుఖ్ ఖాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఆ తర్వాత వచ్చిన వాళ్లలో రాహుల్ తెవాటియా 14, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశారు. ఈ క్రమంలో 18.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. సీఎస్‌కే 83 పరుగుల తేడాతో గెలిచి.. సీజన్‌లో నాలుగో విజయం సాధించి గెలుపుతో ముగించింది. ఈ మ్యాచ్‌లో ధోని సహనం కోల్పోయిన తీరును కామెంటేటర్లు విశ్లేషించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది.
కాగా ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు రాలేదు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన ధోని 196 పరుగులు చేశాడు. ఇక సీఎస్‌కే పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే.
చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది
When #CaptainCool lost his cool! 🥵
A tactical masterclass & an uncanny #MSDhoni's moment - #CSK's last match this season had it all! 💛
Watch the LIVE action ➡ https://t.co/XfCrZHriFf #IPLonJioStar 👉 #SRHvKKR | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/wxPM71McJI— Star Sports (@StarSportsIndia) May 25, 2025