అవును ఒజెంపిక్‌ తీసుకున్నా.. తప్పేంటి? నటుడు రామ్‌కపూర్‌ ఆగ్రహం | Ram Kapoor weightloss journey Issues New Statement On Using OZEMPIC | Sakshi
Sakshi News home page

అవును ఒజెంపిక్‌ తీసుకున్నా.. తప్పేంటి? నటుడు రామ్‌కపూర్‌ ఆగ్రహం

Jul 8 2025 12:53 PM | Updated on Jul 8 2025 1:47 PM

Ram Kapoor weightloss journey Issues New Statement On Using OZEMPIC

 ఒజెంపిక్‌ వాడితే తప్పేంటి? దయచేసి ఎవరైనా సమాధానం చెప్పండి- రామ్‌ కపూర్‌

బరువు తగ్గిన వాళ్లని జడ్జ్‌ చేయకండి

ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫేమ్‌ రామ్‌ కపూర్‌ (Ram Kapoor)  అనూహ్యంగా బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ఏకంగా 55 కిలోల బరువు తగ్గి నెట్టింట తెగ హల్‌చల్‌ చేశాడు. దీంతో  ఓజెంపిక్ , మౌంజారో ( Ozempic and Mounjaro)వంటి మందులు వాడి ఉంటాడనే చర్చ మొదలైంది. తాజాగా దీనిపై రామ్‌ సంచలన ప్రకటన చేశాడు.  బరువు తగ్గడానికి ఓజెంపిక్ వాడితే తప్పేంటి  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  బరువు తగ్గిన తీరును బట్టి, వారిని జడ్జ్‌ చేయొద్దని కోరాడు.

అంతేకాదు  ఎవరైనా డ్రగ్స్ వాడితే  జనానికేంటి  బాధ అని వ్యాఖ్యానించాడు. ‘‘అవును ఓజెంపిక్ ,మౌంజారో డ్రగ్స్‌ తీసుకున్నాను. అయితే తప్పేంటి? దయచేసి ఎ వరైనా సమాధానం చెప్పండి? దీనికెవరు సమాధానం చెప్పరే..ఎవరైనా ఒజెంపిక్‌ తీసుకుంటే అందులో తప్పేంటి? ఆ మనిషి చేసిన నేరం ఏంటి? దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే, అసలు సమాధానమే లేదు.’’ అంటూ  ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.

బరువు తగ్గడానికి తాను చాలా కష్టపడ్డానని, తన వైద్యుడు మౌంజారో వాడమని  ఎందుకుచెప్పాడో రామ్ కపూర్ వెల్లడించాడు. బరువు తగ్గడానికి శారీరక శిక్షణపై దృష్టి పెట్టినట్టు  తెలిపాడు.  అప్పట్లో ఆయన 140 కిలోల భారీ బరువతో  అత్యంత అనారోగ్యకరమైన స్థితితోపాటు చక్కెర అదుపులో ఉండేది కాదు,  దీంతో రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నాడు. 

ఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

మరోపక్క పని ఒత్తిడి, రెస్ట్‌ లేదు దీంతో  ఇంత వర్క్‌ చేస్తూ, అనారోగ్యంగా ఉంటే  డయాబెటిక్ స్ట్రోక్ రావచ్చు, తక్షణమే   బరువు తగ్గించుకోవాలని డాక్టర్‌ సూచించారు అయితే  ఇంకా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ఉన్ననేపథ్యంలో మరో ఆరు-ఎనిమిది నెలల తర్వాత చూద్దామని చెప్పాను.కానీ డాక్టర్‌ ససేమిరా అన్నారు.  కచ్చితంగా ఇపుడే ఏదైనా మొదలు  పెట్టాలని హెచ్చరించారు.  మూడు నుండి నాలుగు నెలలు తీసుకోమని కూడా చెప్పారు. కానీ మొదట్లో తన డాక్టర్ మాట వినాలని అనుకున్నా, కానీ తర్వాత భుజం ప్రమాదం, శస్త్రచికిత్స కారణంగా, వెయిట్‌ లాస్‌ ఎక్స్‌ర్‌సైజులు,  బాడీబిల్డింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. అయితే ఓజెంపిక్‌ తీసుకోవద్దని, కావాలంటే మోంజరో తీసుకోవచ్చని సూచించాడు.

కాగా ఓజెంపిక్ అనేది వాస్తవానికి మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఔషధం.  కానీ ఇపుడు దీర్ఘకాలికంగా ఊబకాయంతో తీవ్రంగా బాధపడే వారికి కూడా  ఉపయోగపడుతోంది.  అనేక మంద్రి సెలబ్రిటీలతోపాటు  దీనిని ఆశ్రయిస్తున్నారనే అంచనాలు భారీగానే ఉన్నాయి. సెమాగ్లుటైడ్  (ఒజెంపిక్  ప్రాథమిక భాగం) దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఉపయోగపడుతుందంటున్నారు వైద్య నిపుణులు.ఓజెంపిక్ (GLP-1 డ్రగ్స్) ఆకలిని తగ్గించి, క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.సెమాగ్లుటైడ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది.ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం నుండి గ్లూకోజ్ (లేదా రక్తంలో చక్కెర)ను మన కణాలలోకి రవాణా చేయడానికి  బాడీకి ఇన్సులిన్ అవసరం.దీనిని శక్తిగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.అయితే  జాగ్రత్త  వైద్యుల పర్యవేక్షణ అవసరమని, ఓజెంపిక్ వంటి  డ్రగ్స్‌కారణంగా, వికారం, వాంతులు, విరేచనాలు , తదితర  సమస్యలతో సహా దుష్ప్రభావాలను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement