బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్‌లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్‌లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..
ట్యునీషియాలోని ట్యునీస్‌కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు.
దాంతో వెయిట్‌లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట.
పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్‌గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్‌సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యుత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది.
అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్‌ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది.
అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.
(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..)


