కెరీర్‌లో రాణించడానికి నేర్చుకోవాల్సిన ఐదు నైపుణ్యాలు ఇవే..! | Career Tips: 5 Skill Development Strategies to Consider for Career Growth | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో రాణించడానికి నేర్చుకోవాల్సిన ఐదు నైపుణ్యాలు ఇవే..!: లింక్డ్‌ఇన్

Feb 25 2026 1:08 PM | Updated on Feb 25 2026 1:46 PM

Career Tips: 5 Skill Development Strategies to Consider for Career Growth

నేటి యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు... "తర్వాత ఏం నేర్చుకోవాలి?" అని నిర్ణయించుకోవడమే. లింక్డ్‌ఇన్ తాజా డేటా ప్రకారం, వేగంగా మారుతున్న సాంకేతికతకు మరియు నేటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలకు తాము సిద్ధంగా లేమని 38% మంది భారతీయ ఉద్యోగార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఉద్యోగార్థులకు సహాయపడటానికి మరియు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి... లింక్డ్‌ఇన్ తన 'స్కిల్స్ ఆన్ ది రైజ్ 2026' నివేదికను విడుదల చేసింది. సంస్థలు, పరిశ్రమల అంతటా వేగంగా వృద్ధి చెందుతున్న ఐదు నైపుణ్యాల సమూహాలను ఇది హైలైట్ చేసింది. అవి: ఏఐ అండ్‌ ఆటోమేషన్, డేటా అండ్‌ అనలిటిక్స్, ఐటీ అండ్‌ సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ అండ్‌ గ్రోత్, పీపుల్ అండ్‌ లీడర్‌షిప్.

లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిక్రూటర్లలో 46% మంది ఇప్పుడు సరైన అభ్యర్థులను ఎంచుకోవడానికి నైపుణ్యాల డేటా పైనే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ, అర్హత కలిగిన నైపుణ్యం గల వారిని కనుగొనడం మునుపటి కంటే ఇప్పుడు మరింత కష్టంగా మారిందని భారతదేశంలోని 74% రిక్రూటర్లు చెబుతున్నారు. ఏఐ (AI) సాధనాలతో పనిచేయగల, డేటాను విశ్లేషించి అన్వయించగల, డిజిటల్ సిస్టమ్‌లను అర్థం చేసుకుని కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచగల నిపుణులకు అన్ని పరిశ్రమలలో డిమాండ్ పెరుగుతోంది.

అయితే, కేవలం సాంకేతిక సామర్థ్యం ఒక్కటే సరిపోదు. జట్లు మరింత 'క్రాస్-ఫంక్షనల్'గా 'ఏఐ-ఎనేబుల్డ్'గా మారుతున్న కొద్దీ... సాంకేతిక పరిజ్ఞానాన్ని కొలవగల ప్రభావంగా మార్చడానికి... సహకారం, వాటాదారుల నిర్వహణ, ప్రాజెక్ట్ నాయకత్వం వంటి వ్యక్తిగత నైపుణ్యాలు కూడా అత్యంత అవసరం.

ఈ మేరకు లింక్డ్‌ఇన్ కెరీర్ ఎక్స్‌పర్ట్ అండ్‌ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ, "కొన్నేళ్లుగా యువ నిపుణులకు ఏదైనా ఒక రంగంలో ప్రత్యేకత సాధించమని చెబుతూ వచ్చారు. కానీ 2026లో ఆ నియమం మారుతోంది. నేడు సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్న అభ్యర్థులు కేవలం ఒకే రంగంలో నిపుణులు కాదు... వారు విభిన్న నైపుణ్యాలను కలబోసిన వారు అయి ఉండాలంటోంది. ఏఐ (AI)తో ఎలా పనిచేయాలో, డేటాను ఎలా విశ్లేషించాలో, పనితీరును ఎలా మెరుగుపరచాలో వారికి తెలుసుండాలి. 

వీటన్నింటికీ మించి, వివిధ బృందాలతో కలిసి ఎలా పనిచేయాలో కూడా వారికి తెలుసుండా. ఈ నైపుణ్యాలు అందిపుచ్చుక్ను వారికే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో ఉద్యోగంతో పాటు ప్రమోషన్‌ను కూడా తెచ్చిపెడుతుంది. ఈ మార్కెట్‌లో మీ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే, విడివిడిగా ఉండే నైపుణ్యాల వెంట పడటం మానేసి... మీకంటూ ప్రత్యేకమైన 'స్కిల్స్ స్టాక్'ను నిర్మించుకోండి. దానినే మీ ప్రధాన పోటీతత్వంగా మార్చుకోండి," అని అన్నారు.

భారతదేశంలోని ఉద్యోగార్థులు తమ కెరీర్‌ను మార్చుకోవడానికి నేర్చుకోవాల్సిన ఐదు నైపుణ్యాలు ఏంటంటే..

1. ఏఐ అండ్‌ ఆటోమేషన్ - ఉత్పాదకతే కొత్త ప్రాతిపదిక: ఏఐ (AI) ని తమ రోజువారీ పనుల్లో భాగం చేసుకోగల నిపుణులు.. పనులను వేగంగా, విస్తృతంగా చేయగలుగుతారు. ఇంజనీరింగ్, ఐటీ రంగాల్లో వర్క్‌ఫ్లో ఆటోమేషన్, LLMOps, AutoML అండ్‌ ఏపీఐ ఇంటిగ్రేషన్ (API integration) వంటి నైపుణ్యాలకు మంచి గిరాకీ ఉంది. 

2. డేటా అండ్‌ అనలిటిక్స్ - విశ్లేషణ ఆచరణలోకి మారాలి: కేవలం డేటాను విశ్లేషించడమే కాకుండా.. ఆ డేటాలోని అంతరార్థాన్ని గ్రహించి, దానిని స్పష్టంగా వివరించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించగల నిపుణులకు యాజమాన్యాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. 

3. ఐటీ అండ్‌ సైబర్ సెక్యూరిటీ -: డిజిటల్ కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో... టెక్నాలజీ వాతావరణాన్ని సురక్షితంగా ఉంచి, బలోపేతం చేయగల నిపుణులు స్థిరమైన వృద్ధికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇంజనీరింగ్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకం కాగా... సంస్థల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు మద్దతు ఇచ్చే కన్సల్టింగ్ విభాగాల్లో 'క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' నైపుణ్యాలకు గిరాకీ పెరుగుతోంది. 

4. బిజినెస్ అండ్‌ గ్రోత్: పనితీరును మెరుగుపరుస్తూనే సంస్థ వృద్ధికి తోడ్పడే నిపుణులకు యాజమాన్యాలు తగిన గుర్తింపును ఇస్తున్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్‌ సేల్స్‌లో 'రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్'కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఆదాయ సంబంధిత విభాగాల్లో 'నెగోషియేషన్' అనేది ప్రధాన సామర్థ్యంగా కొనసాగుతోంది. 

5. పీపుల్ అండ్‌ లీడర్‌షిప్: బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, ఇంజనీరింగ్, విద్య, ఆర్ట్స్ అండ్ డిజైన్, ఐటీ, కన్సల్టింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్ అండ్‌ మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో ‘కొల్లాబరేషన్' అనేది నిలకడగా కనిపిస్తోంది. వేర్వేరు జట్లు ఎలా పనిచేస్తున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. పనులు మరింతగా ఏఐ (AI) ఆధారితంగా, క్రాస్-ఫంక్షనల్‌గా మారుతున్న కొద్దీ... వ్యక్తులను సమన్వయం చేయడం, సంక్లిష్టతలను నిర్వహించడం, సమిష్టిగా ఫలితాలను రాబట్టడం అనేవి ఉద్యోగావకాశాలను నిర్ణయించే ప్రధాన నైపుణ్యాలుగా మారుతున్నాయి.

చివరగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడేలా... లింక్డ్‌ఇన్ కొన్ని ఎంపిక చేసిన 'లింక్డ్‌ఇన్ లెర్నింగ్' కోర్సులను మార్చి 31, 2026 వరకు ఉచితంగా అందిస్తోంది. వీటిలో 'ఏఐ ఏజెంట్స్ ఫర్ ఎవ్రీడే ప్రొఫెషనల్స్', 'లెర్నింగ్ డేటా అనలిటిక్స్', 'స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ ఫర్ లీడర్స్ అండ్ మేనేజర్స్' వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

(చదవండి: 

Advertisement
 
Advertisement
Advertisement