న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఈ క్లిప్ భారతీయ నెటిజన్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ రెండవమారు అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతోంది.
అయితే ఈ వైరల్ వీడియో ప్రచారంలో వాస్తవం లేదని ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా స్పష్టమైంది. ఈ వీడియో 2025 అక్టోబర్‌లో వైట్ హౌస్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించినదని తేలింది. ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూ, ఆ ‘ప్రేమ’ అనే పదాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
🚨 Breaking News
Donald Trump's statement is making headlines.
“I could end Narendra Modi’s political career, but I don’t want to.”
One Statement, Many Questions.
Is this just a Political statement, or is there a Deeper Meaning Behind It?
In Global Politics, Words Carry… pic.twitter.com/my42g7J6r2— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) February 8, 2026
కొందరు సోషల్ మీడియా యూజర్స్ ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. ‘నేను మోదీ కెరీర్‌ను అంతం చేయగలను.. కానీ నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బెదిరించినట్లుగా క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారు. కాగా అధికారిక వైట్ హౌస్ నివేదికలు గానీ, అంతర్జాతీయ మీడియా సంస్థలు గానీ ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు తెలియజేయలేదు. అసలు క్లిప్‌లో ట్రంప్ ఎంతో స్నేహపూర్వకంగా మోదీని ‘గ్రేట్ మ్యాన్’ అని కొనియాడారు.
కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకుని, అప్పటి సందర్భాన్ని తొలగించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమయ్యింది. నాడు ట్రంప్ భారతదేశంపై, మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ పదే పదే నాయకత్వ మార్పులను చూసేదని, కానీ మోదీ వచ్చాక రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు.
ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల


