చూడడానికి అందంగా ఉంటే చాలదు..! | Bidar Incident | Sakshi
Sakshi News home page

చూడడానికి అందంగా ఉంటే చాలదు..!

Feb 9 2026 10:50 AM | Updated on Feb 9 2026 11:36 AM

Bidar Incident

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కోడలిని అత్తమామలు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్‌ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలోని ఓం కాలనీలో జరిగింది. అంజనాబాయి (22)కి నాలుగేళ్ల కిందట బసవ కళ్యాణలోని శేఖర్‌ పాటిల్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 11 నెలల పాప ఉంది. శేఖర్‌  పానీపూరి వ్యాపారం చేస్తుండగా ఉదయం వెళ్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు.  ఇంట్లో కోడలిని అత్త మామలు సూటిపోటి మాటలతో వేధించేవారు.

చూడడానికి అందంగా ఉంటే చాలదు, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, ఎలాగైనా డబ్బు     సంపాదించి తేవాలని పీడించేవారు. దీంతో అంజనాబాయి పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అరెస్టు చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement