కడపలో ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి | Reels Madness Kills Kadapa Teenager Viral | Sakshi
Sakshi News home page

కడపలో ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి

Feb 5 2026 11:22 AM | Updated on Feb 5 2026 11:34 AM

Reels Madness Kills Kadapa Teenager Viral

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సోషల్‌ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్‌ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

ముబారక్‌(20) తన స్నేహితుడితో కలిసి బైక్‌ స్టంట్‌ చేస్తూ రీల్స్‌ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్‌ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్‌ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్‌ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. 

బైక్‌పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్‌ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement