ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్‌ ఆత్మహత్య | Bengaluru BodyBuilder Kiran Ends His Life After Girlfriend Marries Someone Else, Know More Details | Sakshi
Sakshi News home page

ప్రియురాలి మోసం.. బాడీబిల్డర్‌ ఆత్మహత్య

Feb 9 2026 9:46 AM | Updated on Feb 9 2026 12:04 PM

 BodyBuilder Kiran Love Traged

బెంగళూరు: ప్రేమించి పెళ్లికి సిద్ధమైన సమయంలో ప్రియురాలు మోసం చేసిందని బాడీ బిల్డర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. కిరణ్‌ (26) జిమ్‌ట్రైనర్‌గా పనిచేయడంతో పాటు బాడీ బిల్డర్‌గా రాష్ట్రస్థాయిలో పేరుగాంచాడు. మూడేళ్ల నుంచి ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు, ఆమె కిరణ్‌ ఇంటికి వచ్చి తమకు పెళ్లి చేయాలని కోరగా కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. తన అన్న వివాహమైన వెంటనే మన పెళ్లి అని కిరణ్‌ మాట ఇచ్చాడు. కానీ 15 రోజుల క్రితం యువతి ఓ యువకునితో   పెళ్లి నిశ్చయమైందని కిరణ్‌కు పెళ్లిపత్రిక ఇవ్వడంతో ఆవేదన చెందాడు.  శనివారం సాయంత్రం కిరణ్‌ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  

ఆమే కారణమని డెత్‌నోటు  
తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లి కారణమని డెత్‌నోట్‌ పేరురాసి పెట్టాడని పోలీసులు తెలిపారు. కిరణ్‌ మృతితో తల్లిదండ్రులు ఆక్రందనలు మిన్నంటాయి.  కిరణ్‌ తన ప్రేయసికి రూ.40 లక్షల వరకూ ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. కాగా, కిరణ్‌ది పేద కుటుంబం, తండ్రి మార్కెట్‌లో మూటలు మోసే పనిచేసేవాడు, ప్రమాదంలో ఓ చేతి తెగిపోయి దివ్యాంగునిగా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement