పొంచి ఉన్న పక్షి జ్వరం
శివాజీనగర: పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెన్షన్ మొదలైంది. పక్షి జ్వరం వ్యాపించి తమిళనాడులో 1,500లకు పైగా కాకులు చనిపోయినట్లు తెలిసింది. సరిహద్దు జిల్లాల్లో జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సూచించింది.
ఏమిటీ లక్షణాలు?
బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ పక్షుల్లో వచ్చే అంటువ్యాఽధి కాగా, ఆ పక్షులు వ్యర్థాల వల్ల ఇతర పక్షులకు, మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన 4 నుంచి 6 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, తల, ఒళ్లునొప్పులు, కళ్లు ఎర్రగా కావడం, న్యమోనియా వంటికి కనిపిస్తాయి. ఈ జబ్బు సోకిన పక్షులు హఠాత్తుగా చనిపోతాయి.
ఎవరికి ప్రమాదం?
బెంగళూరు కేసీ జనరల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ దీనిపై మాట్లాడుతూ కోళ్లఫారాలు, పశుపోషణ రంగాల్లో పని చేసేవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువని తెలిపారు. చికిత్స తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం 50 శాతం ఉంటుందన్నారు. ఆ జబ్బు సోకిన కోడి మాంసం ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశముందన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
తమిళనాడులో కాకుల హఠాన్మరణం
అప్రమత్తంగా ఉండాలని
సర్కారు ఆదేశాలు


