బళ్లారి రూరల్: బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో చోరీలు ఎక్కువయ్యాయి. పట్టపగలు, సాయంత్రం వేళల్లో ఇళ్ల వద్ద నిలబడినా చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం ఇంటి ముందు నిలబడి ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైకిస్టు చోరీ చేసి పరారైన ఘటన బుధవారం విద్యానగర్‌లో జరిగింది. బాధితుల వివరాల మేరకు సాయంత్రం విద్యానగర్ 5వ క్రాస్ గంగమ్మగుడి పక్కన ఉన్న ఓ ఇంటి ముందు లక్ష్మీ అనే మహిళ నిలబడి ఉంది. అదే సమయంలో అటు వైపుగా బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు దగ్గరగా వస్తున్నారు. ఇంటి ముందు ఆడుకొంటున్న మనవరాలిని ఎత్తుకొని పోతారనే అనుమానంతో మహిళ పాపను దగ్గరకు తీసుకొంది. అదే అదునుగా యువులు మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌల్‌బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యానగర్‌లోని ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
నాలుగు తులాల చైన్ విలువ రూ.6 లక్షలు
ద్విచక్రవాహనంపై వచ్చిన
ఇద్దరు దుండగులు
విద్యానగర్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు


