కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్‌ భావోద్వేగం | SP Balasubrahmanyam 10 Foot Tall Statue Unveiled In Kerala, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

కేరళలో 10 అడుగుల ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ

Apr 2 2026 11:43 AM | Updated on Apr 2 2026 12:17 PM

SP Balasubrahmanyam 10 Foot tall Statue Unveiled in Kerala

సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి గొప్ప గౌరవం దక్కింది. కేరళలోని పాలక్కాడ్‌లో ఆయన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ బాలు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్‌ తయారు చేశారు. అలాగే ఎస్పీబీ స్మారక ఉద్యానవనాన్ని సింగర్‌ హరిహరన్‌, సింగర్‌ చిత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలు కుటుంబసభ్యులతో పాటు పలువురు మలయాళ సినీ ప్రముఖులు హాజరై బాలు విగ్రహానికి నివాళులర్పించారు.

ఎస్పీ చరణ్‌ భావోద్వేగం
ఈ కార్యక్రమం గురించి చెప్తూ ఎస్పీ బాలు కుమారుడు, సింగర్‌ ఎస్పీ చరణ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక లెజెండ్‌ కోసం మిగతా లెజెండ్స్‌ అందరూ కలిసి వచ్చారు. పాలక్కాడ్‌లో నాన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొన్ని స్వరాలు ఎప్పటికీ మూగబోవు.. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ విగ్రహావిష్కరణ అనేది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు మా కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే ఓ అందమైన అనుభూతి అంటూ సోషల్‌ మీడియాలో పలు ఫోటోలను షేర్‌ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement