Easter పునరుత్థానుడైన క్రీస్తు | The history of Easter interesting facts | Sakshi
Sakshi News home page

Easter పునరుత్థానుడైన క్రీస్తు

Apr 2 2026 2:58 PM | Updated on Apr 2 2026 3:41 PM

The history of Easter interesting facts

వృక్షము నరకబడిప్పుడు అది తిరిగి చిగురిస్తుంది. అయితే నరుడు మరణమై కదలలేక పడి ఉంటాడని యోబు అనే భక్తుడు యోబు గ్రంథం 14:7లో స్పష్టీకరించాడు. ఆ గ్రంథంలో దేవుడు నరావతారిగా తన కుమారుడైన యేసుక్రీస్తుగా జన్మించి శ్రమకు ఓర్పు ముఖ్య లక్షణమని, కష్టాలు, శ్రమలు భరించి, కాలం సంపూర్ణమైనప్పుడు ప్రతి ఒక్కరు కాలము చేయుదురని, కాని నిస్సహాయతలో దేవునివైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతమని నిరూపించి సంధించిన పునరుత్థానం లేక మరణానంతరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే‘ఈస్టర్‌’ పండుగ.

యేసుక్రీస్తు యూదామతంలో జన్మించారు. ఆయన మీ ΄ాపములు క్షమించానని అనడం, కుష్ఠ రోగులను ముట్టుకోవడం, స్వస్థపరిచాడన్న విషయం కంటే వారిని ముట్టడమే నేరమని, నలుబది సంవత్సరాలు శ్రమపడి కట్టిన దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులలో లేపుతానంటూ చేసిన ప్రసంగాలు యూదులు సహించక, ఆ చర్యలను దేవదూషణ, దేశద్రోహంగా చిత్రీకరించి ఆయనను రోమా సామ్రాజ్యపు అధికారులకు అప్పగించారు. యూదులలో ఛాందసుల కోరిక ప్రకారం రోమీయులకు యేసుక్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేసి, రాతి సమాధిలో ఉంచి, సమాధి ద్వారానికి పెద్ద రాయి  పొర్లించి ద్వారమునకు ముద్రను వేయించి కావలి వారిని కాపలాగా ఉంచారు.

కానీ ఆదివారం తెల్లవారుతున్నప్పుడు ప్రభువు దూత రాయిని ΄÷ర్లించగా మహా భూకంపం కలిగింది. కావలివారు వణికిపోయారు. ఆయనను చూడటానికి వచ్చిన స్త్రీలు ఈ విషయం శిష్యులకు చె΄్పారు. ఆయన వారికి ప్రత్యక్షమై మీకు శుభమని చెప్పగా వారు ఆయన శరీరంతో సజీవుడై ఉండుట చూచి ఆయన ΄ాదములను పట్టుకొని మొక్కారు. అనంతరం యేసు ప్రభువు వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు.  అటువలె యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారు ఆయన ఏ రీతిగా చని΄ోయి బతికెనో, ఆ విధంగా ఆయన యందు విశ్వాసముంచువారు చని΄ోయినను ఆయనవలే తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేపబడుతారు (యోహాను 14:6).
– బి.బి.చంద్రపాల్‌ కోట
 

మార్గం, సత్యం జీవం, 
రెండువేల యేళ్ళనాటి ఈస్టర్‌ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆ రోజున సూర్యుడుదయించాడు. ఉదయం చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలీనా మరియకు  యేసుప్రభువు ఆనాడు తనను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్‌ నవశకం  ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశా నిర్దేశం చేసి 40 వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాల దాకే నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). 

అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తి తోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధ మయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మ శక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీ లోంచి గదిలోకొస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. 

ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు  పోవడానికి మాత్రం పునరుత్తాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ పునరుత్థాన శక్తే!!! హ్యాపీ ఈస్టర్‌. 
– సందేశ్‌ అలెగ్జాండర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement