అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా.. | Good News for Buyers Gold Silver Prices Drop Today | Sakshi
Sakshi News home page

అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..

Apr 2 2026 8:30 PM | Updated on Apr 3 2026 10:21 AM

Good News for Buyers Gold Silver Prices Drop Today

నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.

చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.

వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.

ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement